Thursday, June 7, 2018

మహాభైరవ పూజితా

భైరవుడనగా శివుడు. మహా భైరవునిచే పూజింపబడునది శ్రీదేవి అని అర్థము. మహాశివుడు మహాదేవిని పూజించునట. అట్లే మహాదేవి మహాశివుని పూజించునట. శివశక్తుల సమభావము ఇందు దర్శన మీయబడినది. శివుడు లేని శక్తి లేదు; శక్తి లేని శివుడు లేడు. పరమున కూడ వారిట్లే యుందురు. పరతత్త్వమున శివతత్త్వ మెంతున్నదో, శక్తి తత్త్వము కూడ నంతయే యుండును. అందువలన శివుడు పరుడు. శ్రీమాత పరదేవత. ఈ రెంటినీ సరిసమానముగ దర్శించుట సమదర్శనము. ఎక్కువ తక్కువలు జీవుల మనస్సు యందున్నవి తప్ప, వారిరువురిలో లేవు.

శ్రీమాత శ్రీదేవుని ఆరాధించిన సందర్భము లున్నవి. శ్రీదేవుడు శ్రీమాతని ఆరాధించిన సందర్భములు కూడ నున్నవి.

భైరవ శబ్దమునందలి మూడక్షరములు సృష్టి రక్షణ, లయము ఇమిడి యున్నవి. 'భ అనగా సృష్టి, "ర" అనగా రక్షణ, రమణ, 'వ' అనగా వమనము లేక వినాశము. సృష్టి స్థితి, లయములకు కారణము లైన దైవమే భైరవుడు. అతడు కాలము ననుసరించి మూడు విధములుగ వర్తించుటచే కాలభైరవుడని కూడ పిలువబడుచున్నాడు. అట్టి భైరవుడు మహాదేవుడు. అతనిచే పూజింపబడునది శ్రీదేవి.

ఆది దంపతులు ఒకరినొకరు మన్నించుట, గౌరవించుట
సరిసమానముగ భావించుట తెలియవలసిన విషయము. అట్లే స్త్రీ పురుషులలో ఒకరిపై నొకరు ఆధిపత్యము చూపక సమవర్తనము చూపుట ఉత్తమోత్తమ సంస్కారము. స్త్రీలపై ఆధిక్యము చూపు పురుషులు శ్రీదేవి అనుగ్రహమును పొందలేరు. అట్లే పురుషులపై ఆధిక్యము కోరు స్త్రీలు మహాదేవుని అనుగ్రహమును పొందలేరు. శివశక్తులలో ఒకరు అనుగ్రహింపనిచో మరియొకరు అనుగ్రహింపరు. కావున సమదర్శనము, సమభావనమే అనుగ్రహమునకు ప్రధానము.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...