Wednesday, March 28, 2018

మూల శ్లోకాలు

మనం తరుచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాలకి  మూల శ్లోకాలు తెలుసుకోవాలని అనిపించడం సహజం కదా!

అలాంటి వాటిని కొన్నింటిని మీకోసం సిద్ధం చేశారు. చూడండి:

ముందుగా మనం తరుచుగా వినే మూల వాక్యాలు ఇవీ:

👉 ధర్మో రక్షతి రక్షిత:

👉 సత్య మేవ జయతే

👉 అహింసా పరమో2ధర్మ:

👉 ధనం మూలమిదం జగత్

👉 జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసి

👉 కృషితో నాస్తి దుర్భిక్షమ్

👉 బ్రాహ్మణానా మనేకత్వం

👉 యథా రాజా తథా ప్రజా

👉 పుస్తకం వనితా విత్తం
 పర హస్తం గతం గత:

👉 శత శ్లోకేన పండిత:

👉 శతం విహాయ భోక్తవ్యం

👉 అతి సర్వత్ర వర్జయేత్

👉 బుద్ధి: కర్మానుసారిణీ

👉 వినాశ కాలే విపరీత బుద్ధి:

👉 భార్యా రూప వతీ శత్రు:

👉 స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:

👉 వృద్ధ నారీ పతి వ్రతా

👉 అతి వినయం ధూర్త లక్షణమ్

👉 ఆలస్యం అమృతం విషమ్

👉 దండం దశ గుణం భవేత్

👉 ఇవీ మన చెవిని పడుతూ ఉండే మూల వాక్యాలు. కదా?

ఇప్పుడు వీటి పూర్తి పాఠాలు చూదామా ?

ధర్మ ఏవో హతో హంతి
"ధర్మో రక్షతి రక్షిత:"
తస్మా ధర్మో న హంతవ్యో
మానో ధర్మో హ్రతోవ్రధీత్

🔥ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే , అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. అందు చేత ధర్మాన్ని నాశనం చేయ కూడదు. ఎవరికి వారే తమంత తాముగా నశించి పోవాలని కోరు కోరు కదా !🔥

సత్యమేవ జయతే నా2నృతం
సత్యేన పంథా వితతో దేవయాన:
యేనా క్రమం తృషయో హా్యప్త కామా
యత్ర త త్సత్యస్య పరమం నిధానమ్

🔥సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం వలన దేవతల మార్గం కనిపిస్తుంది. సత్యం వలన మహర్షులు కోరికలు లేని వారై పరమేశ్వరుని పొంద గలుగు తున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.🔥

అహింసా పరమో ధర్మ:
తథా2 హింసా పరం తప:
అహింసా పరమం ఙ్ఞానం
అహింసా పరమార్జనమ్

🔥అహింస గొప్ప ధర్మం. గొప్ప తపం. మంచి ఙ్ఞానం. గొప్ప సాధన🔥

ధనమార్జాయ కాకుత్స్థ !
ధన మూల మిదం జగత్
అంతరం నాభి జానామి
నిర్ధనస్య మృతస్య చ

🔥ఓ రామా ! ధనాన్ని సంపాదించాలి. ఎందు కంటే ధనంతో తోనే లోకమంతా ఉంది. ఈ విషయం లోని ఆంతర్యం గమనించాలి. ధనం లేని వాడు మృతునితో సమానం.🔥

అపి స్వర్ణ మయీ లంకా
న మే రోచతి లక్ష్మణ !
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసి.

🔥సోదరా, లక్ష్మణా ! ఈ లంక బంగరు మయ మయిన దైనప్పటికీ నాకు నచ్చదు. ఇక్కడ ఉండ లేను. ఎందుకంటే, తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటె గొప్పవి కదా !🔥

కృషితో నాస్తి దుర్భిక్షమ్
జపతో నాస్తి పాతకమ్
మౌనేన కలహం నాస్తి
నాస్తి జాగరతో భయం.

 🔥చక్కగా వ్యవసాయం చేస్తే కరవు అనేది ఉండదు. జపతపాలు చేస్తే పాపం పోతుంది. మౌనంగా ఉంటే ఎవరితోనూ విరోధమే ఉండదు. జాగురూకతతో ఉంటే దేనికీ భయపడే పని లేదు.🔥

గజానాం మంద బుధ్ధిశ్చ సర్పాణా మతి నిద్రతా
బ్రాహ్మణానా మనేకత్వం త్రిభిర్లోకోపకారకమ్

 🔥ఏనుగుల మంద బుద్ధి తనం, పాముల అతి నిద్రా గుణం, బ్రాహ్మణులలో ఉండే అనైక్యత ... వీటి వల్లన లోకోపకారం జరుగుతోంది కదా !🔥

రాఙ్ఞ ధర్మిణి ధర్మిష్ఠా, పాపే పాప పరా: సదా
రాజాను మను వర్తంతే, యథా రాజా తథా ప్రజా !

🔥రాజు ధర్మ పరుడయితే రాజ్యం ధర్మ పథంలో నడుస్తుంది. పాప వర్తనుడయితే రాజ్యం పాప పంకిల మవుతుంది. ఎప్పుడూ ధర్మా ధర్మాలు రాజుని అనుసరించి నడుస్తాయి. రాజు ఎలా ఉంటే, ప్రజలూ అలాగే నడచు కుంటారు.🔥

పుస్తకం వనితా విత్తం
పర హస్తం గతం గత:
అధవా పునరా యాతి
జీర్ణం భ్రష్ఠా చ ఖండశ:

🔥పుస్తకం, స్త్రీ , ధనం ఇవి మన వద్ద ఉన్నంత సేపే . ఇతరులు చేతిలో పడితే మరి వాటి పని అంతే. తిరిగి వస్తాయను కో వద్దు. ఒక వేళ వచ్చినా. సర్వ నాశన మయి పోయిన స్థితిలో మనకి తిరిగి దక్కుతాయి సుమీ. ( స్త్రీని జాగ్రత్తగా చూసుకోవాలి అనే భావం ఇక్కడ గ్రహించాలి)🔥

శత నిష్కో ధనాఢ్యశ్చ
శత గ్రామేణ భూపతి:
శతాశ్వ: క్షత్రియో రాజా
శత శ్లోకేన పండిత:

🔥వంద నిష్కలు ( ధన విశేషం) ఉన్న వాడే ధనవంతుడు అనిపించు కుంటాడు. వంద గ్రామాలకు అధిపతి అయిన వాడే భూపతి అవుతాడు. వంద గుఱ్ఱాలు కల వాడే రాజు అనిపించు కుంటాడు. వంద శ్లోకాలు వచ్చిన వాడే పండితుడు.🔥

విద్వత్త్వం చ నృపత్వం చ
నైవ తుల్యం కదాచన
స్వ దేశే పూజ్యతే రాజా
విద్వాన్ సర్వత్ర పూజ్యతే.

🔥పండితుడికీ, రాజుకీ పోలికే లేదు ! ఎందు కంటే, రాజు తన దేశంలో మాత్రమే పూజింప బడతాడు. కాని, పండితుడు లోకమంతా గౌరవించ బడుతాడు.🔥

శతం విహాయ భోక్తవ్యం
సహస్రం స్నాన మాచ రేత్
లక్షం విహాయ దాతవ్యం
కోటిం త్యక్త్వా హరిం భజేత్

🔥వంద మందిని విడిచి పెట్టి అయినా భుజించాలి. వేయి మందిని విడిచి పెట్టయినా స్నానం చేయాలి. లక్ష మంది నీ వెంట రాక పోయినా దానం చేయాలి. కోటి మందిని విడిచి పెట్టయినా శ్రీహరిని సేవించు కోవాలి.🔥

అతి దానాత్ హత: కర్ణ:
అతి లోభాత్ సుయోధన:
అతి కామాత్ దశగ్రీవో
అతి సర్వత్ర వర్జయేత్
( ఇది మరోవిధంగా కూడా ఉంది)

🔥విచ్చల విడిగా దానం చేయడం వలన కర్ణుడు చెడ్డాడు. మిక్కిలి స్వార్ధ గుణం చేత దుర్యోధనుడు చెడ్డాడు. అతి కామం చేత రావణుడు నాశన మయ్యాడు. కనుక అంతటా అతిని విడిచి పెట్టాలి. ఎప్పుడూ అతి పనికి రాదు. ఓవరాక్షను వికటిస్తుంది.🔥

సత్యాను సారిణీ లక్ష్మీ
కీర్తి: త్యాగాను సారిణీ
అభ్యాసాను సారిణీ విద్యా
బుద్ధి: కర్మాను సారిణీ.

🔥లక్ష్మీ దేవి ఎప్పుడూ సత్యాన్ని అనుస రించే ఉంటుంది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. అలగే, కీర్తి త్యాగాన్ని అనుసరించి ఉంటుంది. త్యాగ గుణం లేనిదే కీర్తి ప్రతిష్ఠలు రమ్మంటే రావు. అభ్యాసం లేనిదే విద్య అలవడదు. నిత్యం చదవనిదే చదువు ఎలా స్తుంది ? అభ్యాసం కూసు విద్య కదా. ఇక, బుద్ధి కర్మను అనుసరించి ఉంటుంది. చెడి పోయే రాత మనకి ఉంటే మన బుద్ధి చెడు త్రోవలోను, బాగు పడే రాత ఉంటే మన బుద్ధి మంచి దారిలోను ప్రవర్తిస్తుంది. బుద్ధి మన కర్మలను అనుసరించి ఉంటుంది సుమా !🔥

న నిర్మితో వై నచ దృష్ట పూర్వో
న శ్రూయతే హేమ మయం కురంగ:
తథా2పి తృష్ణా రఘు నందనస్య
వినాశ కాలే విపరీత బుద్ధి:

🔥బంగారు లేడి ఉన్నదని ఎన్నడయినా విన్నామా ? ఎప్పుడయినా ఎక్కడయినా చూసామా ? అయినప్పటికీ రాముడు తన చెలి కోరిందని ముందు వెనుకలు యోచించ కుండా బంగారు లేడిని తెస్తానని వెళ్ళాడు. వినాశ కాలం దాపురించిన నాడు ఇలాంటి విపరీత బుద్ధులే పుడుతూ ఉంటాయి. చెడ్డ కాలం వచ్చి నప్పుడు తర్కం పని చెయ్యదు. బుద్ధి మందగిస్తుంది.🔥

ఋణ కర్తా పితా శత్రు:
మాతా చ వ్యభిచారిణీ
భార్యా రూపవతీ శత్రు:
పుత్ర: శత్రురపండిత:

🔥. అప్పు చేసి, మనకి ఆస్తి కాకుండా అప్పు మిగిల్చే తండ్రి మనకి శత్రువుతో సమానం. వ్యభిచరించే తల్లి శత్రువు. రూపవతి అయిన భార్య శత్రువు. పండితుడు కాని కుమారుడు శత్రువు.🔥

ఆత్మ బుద్ధి: సుఖం చైవ
గురు బుద్ధిర్విశేషత:
పర బుద్ధి ర్వినాశాయ
స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:

🔥 మనకి తోచినది చేయడం అన్నిటి కన్నా మేలు. పెద్దల సలహా ప్రకారం నడచు కోవడం ఇంకా మంచిది. కాని పరుల (శత్రువుల అని కూడా అర్ధం చెప్పు కోవచ్చును) ఆలోచనల మేరకు నడచు కోవడం నాశనం కొని తెచ్చు కోవడమే. ఇక, ఆడువారి ఆలోచనల బట్టి నడుచు కుంటే ప్రళయమే సుమా !🔥

అసమర్ధస్య సాధూనాం
నిర్ధనస్య జితేంద్రియ:
వార్ధక్యో దేవతా భక్తి:
వృద్ధ నారీ పతివ్రతా.

🔥అసమర్ధుని మంచితనం, ధనం లేని పేద వాని ఇంద్రియ నిగ్రహం, ముసలి తనంలో దైవ భక్తి, వయసు ఉడిగిన ఆడుదాని పాతి వ్రత్యం ఒక్కలాంటివే.🔥

ముఖం పద్మ దళాకారం
వచ శ్చందన శీతలం
హృదయం కర్తరీ తుల్యం
అతి వినయం ధూర్త లక్షణమ్

🔥ముఖమేమో, పద్మం లాగా ఉంటుంది. మాటలేమో చందనం వలె చల్లగా ఉంటాయి. కాని, దుర్జనుని మనసు మాత్రం కత్తెర పిట్టలాంటిది. అతి వినయం చూపడం చెడ్డ వాడి లక్షణం సుమా. 🔥

సిద్ధ మన్నం ఫలం పక్వం
నారీ ప్రథమ యౌవ్వనం
కాలక్షేపం నకర్తవ్యం
ఆలస్యం అమృతం విషమ్

🔥వండిన అన్నాన్ని భుజించడానికీ, పండిన పండును కొరుక్కు తినడానికీ, యౌవ్వన వతి పొందును స్వీకరించడానికీ ఆలస్యం చేయ రాదు సుమా ! ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమై పోతుంది. అన్నం చల్లారి పోవడం, పండు కుళ్ళి పోవడం, యౌవ్వనం తరగి పోవడం జరుగుతాయి. ఆలస్యం చేయడం వల్ల అమృతం కూడా విషతుల్యమవుతుంది.🔥

విశ్వా మాత్రా హి పశుషు, కర్ద మేషు జలేషుచ
అంధే తమసి వార్ధక్యే, దండం దశ గుణం భవేత్.

🔥పక్షులు, కుక్కలు, శత్రువులు, పాములు, పశువులు వీటిని అదుపు చేయడానికి వరుసగా, బురదలో, నీటిలో, చీకటిలో, గ్రుడ్డితనంలో , ముసలి తనంలో సాయంగా ఉండేది చేతి కర్ర. అందు వల్ల దండానికి (కర్రకి) దశగుణాలు ఉన్నాయి సుమీ !🔥

ఇవీ మూల వాక్యాలకి పూర్తి పాఠాలు.
 పూర్వులు చెప్పిన దానిని మార్చరాదు కనుక , యథాతథంగా ఇచ్చారు. 

Saturday, March 24, 2018

శివాభిషేకాలు - వాటి ఫలితాలు

1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.

2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.

3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.

4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.

5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును

6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.

7 మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.

8 మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.

9 తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.

10 పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.

11 కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.

12 రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.

13 భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.

14 గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.

15 బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.

16 నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.

17 అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).

18 ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.

19 ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.

20 నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.

21 కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.

22 నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.

23 మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.

24 పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.

Tuesday, March 6, 2018

Few good words !!

పూజకు సిద్ధమై పోయారా? మరి పూజకు పూలు తెచ్చారా,తేలేదా? మరైతే పదండి మీ తోటకి వెళ్ళి తెద్దాం ...అన్నట్టు   భగవంతునికి ఇష్టమైన పూలేంటో తెలుసా!
 ఇవిగో.....🌠🌹

అహింస  ప్రథమం  పుష్పం!
           పుష్పం  ఇంద్రియ  నిగ్రహః !!

సర్వ భూత  దయా పుష్పం !
          క్షమా  పుష్పం  విశేషతః !!

జ్ఞాన  పుష్పం  తప: పుష్పం !
         శాంతి  పుష్పం  తథైవ  చ !!

సత్యం  అష్ట విధం  పుష్పో: !
          విష్ణో హో  ప్రీతి కరం  భవేత్ !!

1.అహింసా పుష్పం:
            🌹🌠.....ఏ ప్రాణికీ మానసికంగా బాధ కలిగించకుండా ఉండటమేదేవునికి సమర్పించే ప్రధమ పుష్పం....🌠🌹

 2.ఇంద్రియ నిగ్రహం:
           🌹🌠 .....చేతులు, కాళ్లు మొదలైన కర్మేంద్రియాలు లను అదుపులో ఉంచుకోవడమే దేవుని అందించాల్సిన రెండో పుష్పం....🌠🌹

 3.దయ:
        🌹🌠 ....కష్టాల్లో, బాధలో ఉన్న వారిబాధను తొలగించడానికి చేసేదే దయ.....ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం.....🌠🌹

 4.క్షమ:
        🌹🌠 ....ఎవరైనా మనకి అపకారం చేసినా,ఓర్పుతో సహించడమే క్షమ....ఇది దేవునికి సమర్పించే నాలుగవ పుష్పం.....🌹🌠🌹

 5.ధ్యానం:
         🌹🌠....ఇష్ట దైవాన్ని నిరంతరం మనసులో తలచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం....ఇది దేవుని అందించే ఐదో పుష్పం....🌠🌹

 6.తపస్సు:
       🌹🌠.......మానసిక ( మనస్సు),వాచిక (మాట),కాయక( శరీరం)లకు నియమాలు ఉండం తపస్సు.....ఇది దేవునికిచ్చే ఆరవ పుష్పం....🌠🌹

 7.జ్ఞానం:
          🌹🌠......పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం....ఇది దేవుని అర్చించాల్సిన ఏడవ పుష్పం.....🌠🌹

 8.సత్యం:
          🌹🌠....ఇతరుల కు బాధ కలుగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం.... ఇది దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం....🌠🌹
 
       🌹🌹🌹 ....అవి చాలా అరుదైన పుష్పాలు, అవి మా తోటలో అన్ని లేవే అంటున్నారా! మరేం ఫరవాలేదు ఇవాళే మొక్కలు నాటండి..... త్వరలోనే మిగతా పూలు పూయించండి....🌹🌹🌹

🌿🌠🌿🌠🌿🌠🌿🌠🌿🌠🌿🌠🌿

ఏవి చేయకూడదు? ఏవి చేయాలి?
    ...... 🌸⏩🌷🌸⏩🌷.......
1⏩గడప ఇవతల నుంచి భిక్షం వేయకూడదు.
2⏩ ఎంత అవసరమైన కర్పూరాన్ని ఎండాకాలంలో దానమివ్వకూడదు.
3⏩మీ శ్రీమతితో చెప్పకుండా ఇంటికి భోజనానికి ఎవర్ని పిలవకూడదు.
4⏩శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందుండాలి. అశుభానికి స్త్రీలు వెనక వుండాలి.
5 ⏩ఉదయం పూట చేసే దానకార్యాలు ఏవైనా సరే ఎక్కువ ఫలన్నిస్తాయి .
6 ⏩అమంగళాలు కోపంలోను , ఆవేశంలోను ఉచ్చారించకూడదు. తదాస్తు దేవతలు ఆ పరిసరాల్లో సంచరిస్తూ వుంటారు.
7 ⏩ పెరుగును చేతితో చితికి మజ్జిగ చేసే ప్రయత్నం ఎన్నడు చేయకూడదు.
8 ⏩పిల్లి ఎదురొస్తే కొన్ని నిముషాలు ఆగి బయలుదేరాలి.కుక్క ఎదురొస్తే నిరభ్యంతరంగా ముందుకు సాగాలి.
9 ⏩చూపుడు వేలితో బొట్టు పెట్టుకోరాదు.
10⏩పగలు ధనాన్ని సంపాదించాలి. రాత్రి సుఖాలను పొందేందుకు సిద్దపడాలి.

🌹🌠🌹🌠🌹🌠🌹🌠🌹🌠🌹🌠🌹

దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు
     ...... 🌿🌠🌿🌠🌿🌠......
💠. బియ్యాన్ని దానం చేస్తే – పాపాలు తొలుగుతాయి.
💠. వె౦డిని దానం చేస్తే – మనశ్మా౦తి కలుగుతుంది.
💠. బ౦గారం దానం చేస్తే – దోషలు తొలుగుతాయి.
💠. ప౦డ్లను దానం చేస్తే – బుద్ధి. సిద్ధి కలుగుతాయి.
💠. పెరుగు దానం చేస్తే – ఇ౦ద్రియ నిగ్రహ౦కలుగుతుంది.
💠. నెయ్యి దానం చేస్తే – రోగాలు పోతాయి. ఆరోగ్య౦గా ఉ౦టారు.
💠. పాలు దానం చేస్తే – నిద్ర లేమిఉండదు.
💠. తేనె దానం చేస్తే – స౦తానంకలుగుతుంది.
💠. ఊసిరి కాయలు దానం చేస్తే – మతిమరుపు పోయి, జ్ఞాపకశక్తీ పెరుగుతు౦ది.
💠. టె౦కాయ దానం చేస్తే – అనుకున్న కార్య౦సిద్ధిస్తు౦ది.
💠. దీపాలు దానం చేస్తే – క౦టి చూపు మెరుగు పడుతుంది.
💠. గోదానం చేస్తే – ఋణ విముక్తులౌతారు ఋషుల ఆశీస్సులు లభిస్తాయి.
💠. భూమిని దానం చేస్తే – బ్రహ్మలోకదర్శనం లభిస్తుంది
💠. వస్త్రదానం చేస్తే – ఆయుష్షు పెరుగుతు౦ది.
💠. అన్న దానం చేస్తే – పెదరికంపోయి, ధనవృద్ధి కలుగుతుంది.

         .....పైవన్నీమన వేదాల్లో చెప్పినవే…
వీటి‌లో మీకు సాధ్యపడేది ఒక్కటైన చేయ్యమని అర్థం..... చేసే సహాయం చిన్నదైనా సరే మనస్ఫూర్తిగా, శ్రద్ధగా చేస్తే ఫలితం అధికంగా కలదు....

🌸⏩🌷🌸⏩🌷🌸⏩🌷🌸⏩🌷🌸

      🚩 సాష్టాంగ నమస్కారము🚩
    ..... 💠🌻🌹💠🌻🌹💠🌻.....

            🌷🌷🌷 ......సాష్టాంగ నమస్కారం పురుషులు మాత్రమే చెయ్యాలి.... స్త్రీలకు నిషిద్ధం.... సాష్టాంగ ప్రణామం పురుషులు చేయవచ్చు.... తమ ఎనిమిది అంగాలనూ, అంటే వక్షస్థలం, నుదురు, చేతులు, కాళ్లు, కళ్లు భూమిపై ఆన్చి నమస్కరించవచ్చు....🌷🌷🌷

          🌷🌷🌷  ....కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారం చెయ్యాలనుకున్నప్పుడు ఉదరం నేలకు తగులుతుంది..... ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది.... ఇలా చెయ్యటం వల్ల గర్భకోశానికి ఏదైనా కీడు జరిగే అవకాశం ఉంది.... అందుకే ఇతిహాసాల్లో, ధర్మశాస్త్రాల్లో స్త్రీలను మోకాళ్లపై ఉండి నమస్కరించాలని చెప్పారు.....🌷🌷🌷

      🌷🌷🌷 ....సాష్టాంగ నమస్కారము అంటే ఎనిమిది అంగాలతో చేయదగిన నమస్కారము అని పేరును బట్టి స్పష్టంగా అర్థం అవుతూనే ఉన్నది.... అయితే ఏమిటి ఆ ఎనిమిది అంగాలు తెలుసుకుందాం.....🌷🌷🌷

ఈ శ్లోకం హృదయస్థం చేస్తే ఆ అంగాలన్నీస్పష్టంగా గుర్తు ఉంటాయి.

 ఉరసా శిరసా దృష్ట్యా
             మనసా వచసా తథా !
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం
             ప్రణామోష్టాంగ ముచ్యతే !!

         🌷🌷🌷 .....  “అష్టాంగాలు” :- అంటే “ఉరసా” అంటే తొడలు, “శిరసా” అంటే తల, “దృష్ట్యా” అనగా కళ్ళు, “మనసా” అనగా హృదయం, “వచసా” అనగా నోరు, “పద్భ్యాం” అనగా పాదములు, “కరాభ్యాం” అనగా చేతులు, “కర్ణాభ్యాం” అంటే చెవులు.... ఇలా “8 అంగములతో నమస్కారం” చేయాలి....🌷🌷🌷.

       🌷🌷🌷 ..... ''మానవుడు" సహజంగా ఈ “8 అంగాలతో” తప్పులు చేస్తుంటారు.... అందుకే “దేవాలయంలో” బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ “దేవునికి” నమస్కరించి “ఆయా అంగములు” నెలకు తగిలించాలి....
ఇలా చేయడం వల్ల “మనం” చేసినటువంటి “పాపాలు” తొలగి “పుణ్యం” లభిస్తుంది...🌷🌷🌷.

ముఖ్యంగా :- “దేవాలయంలో” సాష్టాంగ నమస్కారం “దేవుడికి, ధ్వజస్తంభానికి” మధ్యలో కాకుండా “ధ్వజస్తంభం” వెనుక చేయాలి....🌷🌷🌷🌷

1) ⏩ఉరస్సుతో నమస్కారం - అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి....🌷🌷🌷

2) ⏩శిరస్సుతో నమస్కారం - అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి....🌷🌷🌷

3) ⏩దృష్టితో - అనగా నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ మూర్తికి నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి....🌷🌷🌷

4) ⏩మనస్సుతో నమస్కారం - అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మనసా నమ్మి చేయాలి.....🌠🌠🌠

5) ⏩వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం - నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్టదైవాన్ని మాటతో స్మరించాలి.
అంటే - ఓం నమశ్శివాయ అనో లేక ఓం నమో నారాయణాయ అనో
మాట పలుకుతూ నమస్కరించాలి....🌠🌠🌠

6) ⏩పద్భ్యాం నమస్కారం - అంటే - నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి....🌠🌠🌠

7) ⏩కరాభ్యాం నమస్కారం అంటే - నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి....🌠🌠🌠

8) ⏩కర్ణాభ్యాం నమస్కారం అంటే - నమస్కారం చేసేటపుడు రెండు చెవులను కూడా నేలకు తగులుతూ ఉండాలి....🌠🌠🌠
🌿🌠🌸🌿🌠🌸🌿🌠🌸🌿🌠🌸🌿
       !!!!ఓం నమః శివాయ!!!!

Thursday, March 1, 2018

హిందూ ధర్మం - 197 (వేదంలో గోసంరక్షణ - 2)

ఋగ్వేద సామవేదాలు ఆవుని అఘ్న్యా, అదితి అన్నాయి. అనగా వధింపకూడనిద, పూజించదగినది అని అర్థం. ఋగ్వేదంలో 9 సార్లకు పైగా (1.64.27, 5-83-8, 7-68-9, 1-164-40, 8-69-2, 9-1-9, 9-93-3, 10-6-11, 10-87-16) ఆవును అఘ్న్యా అంటూ వధించకూడదని తేల్చి చెప్పింది. గోవు వధించ రానిది, అగౌరవపరచ రానిదని, ఆవుపాలు మనసును శుద్ధి చేసి, పాపముల నుంచి దూరంగా ఉంచుతాయని చెప్పింది.

అఘ్న్యేయం సా వర్ధతాం మహతే సౌభగాయ - ఋగ్వేదం 1.164.27

#గోవు - వధింపకూడనిది. అది మాకు ఆరోగ్యాన్ని, భోగభాగ్యాలను తీసుకువస్తుంది.

సుప్రపానం భవత్వఘ్న్యాయః - ఋగ్వేదం 5.83.8

అఘ్న్యా అయిన గోవుకు చక్కని నీటి సదుపాయం ఉండాలి.

అనగో హత్యావై భీమక్రియతే
మా నో గామశ్వం పురుషూం వధీః - అధర్వణ వేదం 10.1.29

అమాయకులను చంపటం మహాపాపం. మన #ఆవు లను, గుర్రాలను, మనుష్యులను చంపకండి.

మా గామనాగా మదితిం వధిష్ట - ఋగ్వేదం 8.101.15

ఆవును చంపకండి. ఆవు అమాయకురాలు. అదితి - ముక్కలు చేయకూడనిది అంటూ గోవధకు దేశబహిష్కారం శిక్ష వేయమని చెప్పింది.

యః పౌరుషేయేణ క్రవిషా సమఙ్క్తే యో అశ్వ్యేన పశునా యాతుధానః
యో అఘ్న్యాయా భరతి క్షీరమగ్నే తేషాం శీర్షాణి హరసాపి వృశ్చ - ఋగ్వేదం 10.87.16

ఎవరైతే మనిషి, గుర్రం లేదా ఇతర జంతువుల మాంసం తింటారో, ఎవరైతే పాలతో జనులను పోషించే అఘ్న్యాలను - గోవులను (గోజాతిని) నశింప జేస్తారో వారిని కఠినంగా శిక్షించాలి (capital punishment).

అథర్వణవేదం 8-3-16 మంత్రమైతే గోహత్య మహాపాపం చేసినవారికి శిరశ్చేదనం (తల నరకమని) చేయమని చెప్పింది.

పై మంత్రాన్ని అనుసరించి గోవులను చంపేవారికి కఠినమైన శిక్ష విధించాలని వేదమే చెప్పింది. #వేదం అనగా భగవంతుని ఊపిరి, వేదం - భగవంతుడు, ఇద్దరూ వేరు కాదు. ఒక్క గోవులనే కాదు, ఏ జంతువును చంపినా శిక్ష విధించమంటోంది. మనదేశంలో కొన్ని రాష్ట్రాలు గోవును వధించినవారికి కఠిన శిక్ష ఉండాలని చట్టాలు చేస్తే, అది నేరమని, ఘోరమని కొందరు ధర్మద్వేషులు, అధర్మీయులు తెగ గొడవ చేస్తారు. ఈ దేశంలో ఆయా మతస్థులకు వారి వారి మతగ్రంధాలను అనుసరించి, వాటికి అనుగుణంగా చట్టాలున్నాయి. ఉదాహరణకు ముస్లిమకు ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకోవడం భారతదేశంలో నేరం కాదు. ఎందుకంటే బహువివాహాలను ఖురాన్ అంగీకరించింది. ఖురాన్‌కు అనుగుణంగానే వారికి షిరియా చట్టం ఏర్పడింది. అలాగే విడాకుల విషయంలో కూడా వారికి వేరే పద్ధతి ఉంది. భారతదేశంలో ఇస్లామేతర ఆడపిల్లల కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలు కాగా, వారికి కనీస వయసు 15 సంవత్సరాలు.

వారి మతగ్రంధాన్ని అనుసరించి చట్టం ఏర్పడినప్పుడు హిందువులు, తమ ధార్మిక గ్రంధాలకు అనుగుణమైన చట్టం కావాలని అడగడంలో తప్పేంటి? ధర్మం ప్రకారం గోవధ సహిచరాని నేరం. ఈనాడు కొన్ని రాష్ట్రాలు గోవధకు కఠిన శిక్షలు వేయడమంటే ధార్మిక గ్రంధాలకు అనుగుణంగా చట్టం ఏర్పడిందని అర్దం కదా. మరి ఈ ఒక్క విషయాన్నే వ్యతిరేకించడం ఎందుకు? ఇది ఆ కుహన మేధావులది ద్వంద్వనీతి కాదా అని హిందువులు ప్రశ్నించాల్సి ఉంటుంది.

'ఓం''... తో అలసట మాయం...శాస్త్రీయంగా నిరూపించిన బాలిక

👉    ఓం... శబ్దంతో....
శరీరంలో అలసట దూరమవుతుందని పద్నాలు గేళ్ల బాలిక ప్రయోగాత్మకంగా నిరూపించింది.
👉పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన సైన్ కాంగ్రెస్‌లో తన ప్రదర్శనతో ఆ బాలిక శాస్త్రవేత్త లను అకట్టుకుంది.
👉కోల్‌కతాలోని అడమ్స్ వరల్డ్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న అన్వేష రాయ్ ఓంకారంపై పరిశోధన చేసింది.
=========🌻🌻🌻
👉ఓం శబ్దాన్ని వినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, కార్బన్‌డైయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ నిల్వలు తగ్గతాయని, తద్వారా అలసట ఉండదని అన్వేష తన ప్రయోగం ద్వారా కలకత్తా, జాదవ్‌పూర్ యూనివర్సిటీలకు చెందిన ఫిజిక్స్, ఫిజియాలజీ ప్రొఫెసర్ల సమక్షంలో నిరూపించింది. అన్వేష ప్రాజెక్ట్ విన్నూత్నంగా ఉందని, అంతే కాకుండా ఆమోదయోగ్యం కూడా ఉందని కలకత్తా యూనివర్సిటీకి చెందిన ఫిజియాలజీ విభాగం హెడ్ ఫ్రొఫెసర్ దేవశీష్ బందోపాధ్యాయ అన్నారు.
==========🌻🌻🌻
అన్వేష అనే పేరులోనే అన్వేషణ ఉందని, బెంగాలీలో అన్వేషణ్ అంటె వెదకడమని ఆ బాలిక తెలిపింది. ఓంకారం నుంచి వెలువడే ప్రత్యేక పౌన:పున్యం కలిగి శబ్దాలు శరీరంలోని న్యూరోట్రాన్స్‌మిటర్స్‌తోపాటు హార్మోన్ల (సెరోటినిన్, డోపమైన్) స్థాయిని పెంచుతాయి...
👉ఈ ప్రక్రియకు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగడమే కారణమని అన్వేష రాయ్ తెలియ
జేసింది.
👉అలాగే తక్కువ పరిమాణంలో లాక్టిక్ యాసిడ్ విడుదల అవుతుందని దీంతో అలసట అనేది ఉండదని అన్వేష తెలిపింది.
===========🌻🌻🌻
👉గత దశాబ్దంలో సంగీతం సాధన ద్వారా శరీరానికి వ్యాయామం చేకూరి, మానసిక ప్రశాతంత కలుగుతుందని పరిశోధకులు నిరూపించినట్లు పశ్చిమ్ బెంగాల్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సెక్రెటరీ రిన వెంకట్రామన్ అన్నారు. కానీ ఓంకారం శరీరంపై నిర్దిష్ట ప్రభావం చూపుతుందని అన్వేష నిరూపించిందని ఆయన తెలిపారు.
===========🌻🌻🌻
👉ఇప్పటివరకు ఎవరూ ఓం శబ్దంపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టలేదని స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త దీపాంకర్ దాస్ తెలిపారు.
👉ఇటీవల రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్ నిర్వహించిన వర్క్‌షాప్‌నకు 165 విద్యార్థులను ఎంపిక చేశామని ఆయన అన్నారు. వర్క్‌షాప్‌లో భాగంగా అన్వేష ఉత్తరాఖండ్‌లో పర్యటించి నపుడు బగేశ్వర్ నుంచి 68 కిలోమీటర్లు దూరాన ఉన్న కేదారీనాథ్‌కు కాలినడకన రోజూ నీటిని తీసుకెళ్తున్న కొంతమంది పూజరుల్లో ఎలాంటి అలసట కనపడకపోవడంతో ఆశ్చర్యపడింది.
👉అలాగే వాళ్లు దోవపొడువునా ఓంకారాన్ని జపిస్తూ ముందుకు సాగడం గుర్తించింది.
👉దీంతో ఓంకారంపై తన ప్రయోగాన్ని నిర్వహించాలని భావించింది.
👉దీనిపై పరిశోధనకు అక్కడే శ్రీకారం చుట్టింది. 👉ఓం శబ్దం ద్వారా శరీరంలో 430 హెర్జ్‌ల పౌన:పున్యాలను వెలువడుతున్నట్లు గుర్తించి వివిధ ల్యాబొరేటరీల్లో ఐదు ప్రయోగాలను నిర్వహించింది.
============🌻🌻🌻
👉17 మంది యువతీ, యువకులకు ఓంకారాన్ని 30 నిమిషాల పాటు వినిపించి వారి శరీరంలోని ఆక్సిజన్, కార్బన్‌ డయాక్సైడ్ శాతాలను లెక్కించింది.
👉ఓం శబ్దంతో వారి శరీరంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి, కార్బన్ డయాక్సడ్ శాతం తగ్గినట్లు అన్వేష తెలిపింది.

మతం యొక్క గురు పరమపరా యొక్క కాలక్రమానుసారం

మతం యొక్క గురు పరమపరా యొక్క కాలక్రమానుసారం ఈ కింది విధంగా ఉంటుంది:

ఆది శంకర భగవత్పాడ (482 BC-477 BC)

సురేశ్వరచార్య (477 BC-407 BC) (సిరి మఠం యొక్క మొదటి గురువుగా ఉన్న నలుగురు శిష్యులలో ఒకరు కంది మఠం ఆది శంకరచే స్థాపించబడిన నాలుగు మర్మములలో ఒకటి కాదు)

సర్వాజ్నాట్మాన్ (407 BC-367 BC)

సత్యబోధేంద్ర సరస్వతి (367 BC-268 BC)

జ్ఞానంద్రేంద్ర సరస్వతి (268 BC-205 BC)

సుధనంద్రేంద్ర సరస్వతి (205 BC-124 BC)

ఆనందఘేంద్ర సరస్వతి (124 BC-55 BC)

కైవియానందయోగేంద్ర సరస్వతి (55 BC-28 AD)

కృపా శంకరంద్ర సరస్వతి (28 AD-69 AD)

సురేశ్వర సరస్వతి (69 AD-127 AD)

శివానంద చిదంగోంద్ర సరస్వతి (127 AD-172 AD)

చంద్రశేఖరేంద్ర సరస్వతి (172-235)

శశిధ్వెంంద్ర సరస్వతి (235-272)

విద్యాఘేంద్ర సరస్వతి (272-317)

గంగాధరేంద్ర సరస్వతి (317-329)

ఉజ్జాల శంకరంద్ర సరస్వతి (329-367)

సదాసివేంద్ర సరస్వతి (367-375)

శంకరనంద సరస్వతి (375-385)

మార్తంది విద్యగెంంద్ర సరస్వతి (385-398)

ముకా శంకరంద్ర సరస్వతి (398-437)

చంద్రశేఖరేంద్ర సరస్వతి II (437-447)

బోధేంద్ర సరస్వతి (447-481)

శచిశూహేంద్ర సరస్వతి (481-512)

చిత్సుహేంద్ర సరస్వతి (512-527)

సక్షిదానందగనేంద్ర సరస్వతి (527-548)

ప్రజ్నాఘేంద్ర సరస్వతి (548-565)

చిద్విలసేంద్ర సరస్వతి (565-577)

మహాదేవేంద్ర సరస్వతి I (577-601)

పూర్ణభోధేంద్ర సరస్వతి (601-618)

భోధేంద్ర సరస్వతి II (618-655)

బ్రహ్మానందఘేంద్ర సరస్వతి (655-668)

చిదానందగనేంద్ర సరస్వతి (668-672)

శశిదానంద సరస్వతి (672-692)

చంద్రశేఖరేంద్ర సరస్వతి III (692-710)

చిత్సుహేంద్ర సరస్వతి (710-737)

చిత్సునందంద్ర సరస్వతి (737-758)

విద్యాగోంద్ర సరస్వతి III (758-788)

అభినవ శంకరంద్ర సరస్వతి (788-840)

సాక్షిద్విలాశేంద్ర సరస్వతి (840-873)

మహాదేవేంద్ర సరస్వతి II (873-915)

గంగాధరేంద్ర సరస్వతి II (915-950)

బ్రహ్మానందఘేంద్ర సరస్వతి (950-978)

ఆనందఘేంద్ర సరస్వతి (978-1014)

పూర్ణభోధేంద్ర సరస్వతి II (1014-1040)

పరమాశివేంద్ర సరస్వతి I (1040-1061)

సంద్రానందభోధేంద్ర సరస్వతి (1061-1098)

చంద్రశేఖరేంద్ర సరస్వతి IV (1098-1166)

అద్వైతమండోధేంద్ర సరస్వతి (1166-1200)

మహాదేవేంద్ర సరస్వతి III (1200-1247)

చంద్రచుదేంద్ర సరస్వతి I (1247-1297)

విద్యావేంద్రేంద్ర సరస్వతి (1297-1385)

సంకరనందేరా సరస్వతి (1385-1417)

పూర్ణనంద సదాసివేంద్ర సరస్వతి (1417-1498)

వ్యాసచల మహాదేవేంద్ర సరస్వతి (1498-1507)

చంద్రుదేహేంద్ర సరస్వతి II (1507-1524)

సర్వవజ్నా సదాశివ భొదేేంద్ర సరస్వతి (1524-1539)

పరమాశివేంద్ర సరస్వతి II (1539-1586)

ఆత్మ బుద్ధేంద్ర సరస్వతి (1586-1638)

బోధేంద్ర సరస్వతి (1638-1692)

అద్వైతత్మా ప్రకాశేంద్ర సరస్వతి (1692-1704)

మహాదేవేంద్ర సరస్వతి IV (1704-1746)

చంద్రశేఖరేంద్ర సార్సువతి V (1746-1783)

మహాదేవేంద్ర సరస్వతి V (1783-1813)

చంద్రశేఖరేంద్ర సరస్వతి VI (1813-1851)

సుదర్శన మహాదేవేంద్ర సరస్వతి (1851-1891)

చంద్రశేఖరేంద్ర సరస్వతి VII (1891 - 7 ఫిబ్రవరి 1907)

మహాదేవేంద్ర సరస్వతి V (7 ఫిబ్రవరి 1907 - 13 ఫిబ్రవరి 1907)

చంద్రశేఖరేంద్ర సరస్వతి (13 ఫిబ్రవరి 1907 - 3 జనవరి 1994)

జయేంద్ర సరస్వతి (3 జనవరి 1994 - 28 ఫిబ్రవరి 2018)

శంకర విజయేంద్ర సరస్వతి (28 ఫిబ్రవరి 2018 - ప్రస్తుతం)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...