Monday, January 30, 2023

శివ పంచాక్షరీ విశిష్టత

శివపంచాక్షరీ మంత్రంలోని ఐదు బీజాక్షరాలు 'న-మ-శి-వా-య' లో నుండి పంచభూతాలు, వాటి నుండి సమస్త జగత్తు పుట్టిందని పురాణాలలో తెలియజేయడమైంది.

దిశ పేరు మండలం బీజాక్షరం నిర్వహణ....

శివుని ఊర్ధ్వముఖం ఈశానం ఆకాశమండలం య మోక్షం

శివుని పూర్వముఖం తత్పురుష వాయుమండలం న విరక్తి

శివుని దక్షిణముఖం అఘోర అగ్నిమండలం మ సంహారం

శివుని ఉత్తరముఖం వామదేవ ఉడక మండలం వా పాలన

శివుని పశ్చిమ ముఖం సద్యోజాత భూమండలం శి సృష్టి

ఓంకారవదనే దేవీ 'వ, 'య' కార భుజద్వయీ 'శి' కార దేహమధ్యాచ 'న', 'య' కార పదద్వయీ పంచాక్షరీ మంత్రానికి ముఖం వంటిది. 'వ'కార, 'య' కారాలు బాహువులు, 'శి' కారం నడుము అయితే 'న', 'మ' కారాలు పాదయుగ్మములు.

 

నమశ్శంభవే చ మయోభవేచ నమశ్శంకరాయ చ 

 మయస్కరాయ చ నమశ్శివాయ చ శివ తరాయచ 

 అంటూ నమకంలో శంభు - శంకర - శివ అంటూ మూడు దివ్యనామాలాతో, ఆ పరాత్పరుని కీర్తించాయి.

 శివ శబ్దానికి అనేక నిర్వచనాలు ఉన్నాయి. 'శుభం, క్షేమం, శ్రేయం, మంగళం' అని కొన్ని అర్థాలు మరియు 'జాగ్రత్, స్వప్న, సుషుప్తి' అవస్థలకు అతీతమైన ధ్యానావస్థలో గోచరించే తురీయతట్ట్వమే శివుడు. అదే శివతత్త్వం.

అన్నింటినీ ప్రకాశవంతం చేసే మూల చైతన్యమే శివుడు. వశి - శివ సమస్తాన్నీ తన వశంలో ఉంచుకున్న వాడే సర్వేశ్వరుడు, 

అతడే ఇచ్చా -జ్ఞాన-క్రియా శక్తులతో కూడిన పరమేశ్వరుడు, సర్వజగత్కారుడు, 

ఆ తత్త్వమే ఆయన పంచముఖాలలో గోచరిస్తూ ఉంటుంది.


Friday, January 27, 2023

శ్రీవిష్ణుసహస్రనామస్తోత్ర పారాయణము శ్రేయస్కరము

అభీష్టసిద్ధికి ఈ క్రింద సూచించిన శ్లోకములను 108 మార్లు జపించవలెను. పిల్లల క్షేమార్ఠము తల్లిదండ్రులు జపము చేయవచ్చును:


1. విద్యాభివృద్ధికి:

(14)

సర్వగ సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్దనః |వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ||


2. ఉదర రోగ నివృత్తికి:

(16)

భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః |

అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ||


3. ఉత్సాహమునకు:

(18)

వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధుః |

అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ||


4. మేధాసంపత్తికి:

(19)

మహాబుధ్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః |

అనిర్దేశ్య వపుః శ్రీమా నమేయాత్మా మహాద్రిధృక్ ||


5. కంటి చూపునకు:

(24)

అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణః |

సహస్రమూర్థా విశ్వాత్మ సహస్రాక్ష స్సహస్రపాత్

 ||


 6. కోరికలిరేడుటకు:

(27)

అసంఖ్యేయో2ప్రమేయాత్మ విశిష్ట శ్శిష్ట క్రుచ్ఛిచిః |

సిద్ధార్థ స్సిధ్ధసంకల్పః సిద్ధిద స్సిధ్ధిసాధనః ||


7. వివాహ ప్రాప్తికి:

(32)

భూతభవ్య భవన్నాధః పవనః పావనో2నలః |

కామహా కామక్రుత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ||


8. అభివృద్ధికి:

(42)

వ్యవసాయో వ్యవస్థానః సంస్థాన స్స్థానదో ధ్రువః |

పరర్థిః పరమ స్పష్ట: స్తుష్ట: పుష్ట శ్శుభేక్షణః ||


9. మరణ భీతి తొలగుటకు:

(44)

వైకుంఠ: పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః ప్రుథుః |

హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః ||


10. కుటుంబ ధనాభివ్రుద్ధికి:

(46)

విస్తారః స్థావర స్స్టాణుః ప్రమాణం బీజ మవ్యయం |

అర్థో2నర్థో మహాకోశో మహాభోగో మహాధనః ||


 11. జ్ఞానాభివ్రుద్ధికి:

(48)

యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతు స్సత్రం సతాం గతిః |

సర్వదర్సీ నివృతాత్మ సర్వజ్ఞో జ్ఞాన ముత్తమం ||

12. క్షేమభివ్రుధ్ధికి:

(64)

అనివర్తీ నివృత్తాత్మ సంక్షేప్తా క్షేమక్రుచ్ఛివః |

శ్రీవత్సవక్షా శ్శ్రీవాస శ్శ్రీపతిః శ్శ్రీమతాం వరః ||


13. నిరంతర దైవ చింతనకు:

(65)

శ్రీద శ్శ్రీశ శ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః |

శ్రీధరః శ్రీకర శ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ||

14. దుఃఖ నివారణకు:

(67)

ఉదీర్ణ స్సర్వత శ్చక్షు రనీశ శ్శాశ్వత స్థిరః |

భూశయో భూషణో భూతి ర్విశోక శ్శోక నాశనః ||


15. జన్మ రాహిత్యమునకు:

(75)

సద్గతి స్సత్క్రుతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః |

శూరసేనో యదుశ్రేష్ఠ స్సన్నివాస స్సుయామునః ||


 16. శత్రువుల జయించుటకు:

(88)

సులభ స్సువ్రత సిద్ధ శ్శత్రుజి చ్ఛత్రు తాపనః !

న్యగ్రోధో దుంబరో2శ్వత్ఠ శ్చాణూరాంధ్ర నిషూధనః ||


17. భయ నాశనమునకు:

(89)

సహస్రార్చి స్సప్తజిహ్వ స్సప్తైధా స్సప్తవాహనః |

అమూర్తి రణఘో2చింత్యో భయక్రు ద్భయ నాశనః ||


18. మంగళ ప్రాప్తికి:

(96)

సనాత్సనాతన తమః కపిలః కపి రవ్యయః |

స్వస్తిద స్స్వస్తిక్రుత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ||


19. ఆపదలు తొలగుటకు, లోక కల్యాణమునకు:

(97 & 98)

అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః |

శబ్దాదిగ శ్శబ్దసహ శ్శిశిర శ్శర్వరీకరః ||

అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః |

విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ||


20. దుస్వప్న నాసనమునకు:

(99)

ఉత్తారణో దుష్క్రుతిహా పుణ్యోదుస్వప్న నాశనః |

వీరహా రక్షణ స్సంతో జీవనం పర్యవస్తితః ||


21. పాపక్షయమునకు:

(106)

ఆత్మయోని స్స్వయం జాతో వైఖాన స్సామగాయనః |

దేవకీ నందన స్స్రష్తా క్షితీశః పాపనాసనః ||


శ్రీరస్తు --- శుభమస్తు --- విజయోస్తు

దశ మహావిద్యలు - ఫలితాలు

 దశ మహావిద్యలు - ఫలితాలు


1వ మహా విద్య

కృష్ణ వర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ కాళికా దేవికి ప్రీతిపాత్రమైనది. శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్రేయసంప్రదాయం చెబుతోంది. తంత్రోక్త మార్గంలో శ్రీకాళీ మహా విద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రు నాశనం, దీర్షాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది.


2 వ మహావిద్య

దశ మహావిద్యలలో రెండవ మహా విద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ తార దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈ దేవిని నీలసరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధనవల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది.


3 వ మహావిద్య

అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీషోడశీదేవి దశమహావిద్యలలో 3వ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది. పరమ శాంతి స్వరూపిణి అయిన ఈ షోడశ దేవికి మార్గశిరమాస పూర్ణిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపురసుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆసాధకుడికి అన్నిరకాల కష్టనష్టాలనుంచి విముక్తి మానసికశాంతి, భోగం, మోక్షం కలుగుతాయి.


*4వ మహావిద్య

దశ మహావిద్యలలో 4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ భువనేశ్వరి దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమి తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యధికారాన్ని సమస్త సిద్దుల్ని సకల సుఖభోగాల్ని ఈదేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు.


5వ మహావిద్య

దశమహావిద్యలలో 5వ మహా విద్య వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవీ దేవి, ఈ దివ్యశక్తి స్వరూపిణికి మాఘమాసం పూర్ణిమ తిథి ప్రీతిపాత్రమైనది. ఆర్తత్రాణ పరాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సకల సుఖభోగాలను పొందే శక్తి, సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్షప్రాప్తి సాధకుడికి కలుగుతుంది.


6వ మహావిద్య

దశ మహావిద్యలలో 6వ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి. ఈ దేవినే వజ్ర వైరోచినీ, ప్రచండ చండీ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ వజ్రవైరోచని దేవికి ప్రీతిపాత్రమైంది. శాక్తేయ సంప్రదాయంలో భిన్నమస్తాదేవికీ ఎంతో ప్రశస్తివుంది. ఈ దేవిని నిష్టతో ఉపాసిస్తే సరస్వతీసిద్ధి, శత్రువిజయం, రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాలనుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, ఎటువంటి కార్యాలనైనా ఆవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది.


7వ మహావిద్య

దశ మహావిద్యలలో 7వ మహావిద్య.. ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతీ దేవికి  జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధనవల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది.


8వ మహా విద్య

దశమహావిద్యలలో 8వ మహావిద్య.. పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీ భగళాముఖీ దేవికి చెందింది. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ భగళాముఖీ దేవికి వైశాఖమాస శుక్లపక్ష అష్టమీతిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.


9వ మహావిద్య

దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య.. మరకతమ వర్ణంతో ప్రకాశించే శ్రీ మాతంగీదేవికి చెందింది. వశీకరణ దేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖమాసం శుక్లపక్ష తృతీయాతిథి ప్రీతిపాత్రమైనది. రాజమాతంగీ, లఘుశ్యామలా, ఉచ్చిష్టచండాలి, అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తుంటారు. ఈ దివ్య స్వరూపిణి ఉసాసనవల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణాశక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి.


10వ మహావిద్య

పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశ మహావిద్యలలో 10వ మహావిద్యగా ప్రశస్తిపొందింది. సకల ఐశ్వర్య ప్రదాయిని అయిన ఈ లక్ష్మి దేవికి మార్గశిరే అమావాస్యతిథి ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక అంటే లక్ష్మీస్వరూపిణి అని అర్థం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది....


ఈ దశమహావిద్యా సాధనలు చేయాలంటే గురుముఖ సాధన అవసరం.

శ్రీమాత్రే నమః

Wednesday, January 11, 2023

కాకి - కాలజ్ఞాని

 ®️'కాకి - కాలజ్ఞాని' అంటారు ఎందుకో కాస్త పరిశోధనాత్మకంగా మననం చేసుకుందాం


®️వేకువ జామునే '(బ్రహ్మ ముహూర్తంలో)' మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి.


'®️కావు కావు' అంటూ నీ బంధాలు సిరి సంపదలు ఏవీ నీవి కావు అని  అందరికీ గుర్తు చేస్తూ 'బోధిస్తూ'  అందరినీ తట్టి లేపేది కాకి.


®️ఎక్కడయినా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న 'అన్ని కాకులకు' సందేశం పంపి గుమిగూడి అన్ని కాకులు కలసి  ఆహారం ఆరగిస్తాయి అంత స్నేహపూర్వకంగా మసిలేది కాకి.


®️శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణలు చేసి 'సంఘటితంగా పోరాటం' చేపట్టేవి కాకులు.


®️ఆడ కాకి - మగ కాకి కలవడం కూడా 'పరుల కంట' పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి. అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం చెప్పదగ్గ విషయం.


®️ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోధనలు చేసి స్నానమాచరించి గూటికిచేరే మంచి ఆచరణ కాకులదే.


®️సూర్యాస్తమయం సమయానికి గూటికిచేరే సలక్షణమైన అలవాటు సమయపాలన కాకులదే.


®️అంతేకాదు సూర్యాస్తమయం తరువాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమా.


®️కాకులు లేని ప్రదేశం లేదు ఈ భువిపై. కాకి పళ్ళు తిని మరో చోట విసర్జన చేస్తే అక్కడ ఆ బీజం పడి మొలకెత్తి మొక్కలు పెరిగి వటవృక్షాలుగా పెరుగుతాయి. అలా పచ్చని ప్రకృతిని విస్తరించి పరిరక్షించుకోవడంలో కాకుల పాత్ర చాలా గణనీయమైనదే. అందుకే  'కాకులు దూరని కారడవి' అంటారు.


®️కాకులు అరుస్తోంటే  ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు అందుకే కాకి అరుస్తోంది అనేవారు పెద్దలు.


®️అంతేకాదు పకృతి వైపరీత్యాలు వచ్చే ముందు (భూమి కంపించే ముందు తుఫానులు వచ్చే ముందు) కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి.


®️సూర్య గ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక  స్నానమాచరించి బయట ఎగురుతాయి.  అందుకే కాకి కాలజ్ఞాని అంటారు.


®️దానధర్మాలు ఆచరించని వారిని ఎంగిలి చేత్తో కాకిని తోలని వారిగా ఉదహరిస్తారు.


®️భోజనం చేసే ముందు మొదటి ముద్ద బయట గోడపై పెట్టి కాకుల్ని పిలిచేవారు పెద్దలు.


®️మానవ జీవన పరిణామంలో కొన్ని తరాలను గుర్తు పెట్టుకునే సాక్షీభూతంగా ఉండే పక్షి కాకి.


®️ఎక్కువ కాలం జీవిస్తుంది కనుక కాకై కలకాలం జీవించడం శాస్త్రం లో కూడా విశదీకరించారు.!


®️కూజలో రాళ్ళు వేసి అట్టడుగున ఉన్న నీటిని పైకి తెచ్చి తరువాత దాహం తీర్చుకునే సాంకేతిక పరిజ్ఞానం కూడా సంతరించుకుంది కాకి....!!


®️సెల్ టవర్ రేడియేషన్ వల్ల అంతరించిపోతున్న ఈ కాకి గురించి భవిష్యత్తు తరాలకు తెలియజేస్తూ  కాకి బావ కధలు బిడ్డలకు చెప్పండి అని  తల్లి తండ్రులను పెద్దలను కోరుతూ...!!


®️భారతీయుల సనాతన ధర్మం - విశిష్టత , ఆవశ్యకత నేటి జనం ఆచరించాల్సినవే.  సంఘజీవనం.., సేవాతత్పరత.., మంచి స్నేహభావాలతో., ఈర్ష్య ద్వేషాలు లేకుండా., కలసి మెలసి అన్యోన్యంగా., అసమానతలకు అతీతమైన ప్రేమానురాగాలతో., నైతిక విలువలు కలిగి కాకిలా కలకాలం జీవిద్దాము.

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...