వందే శంభు ముమాపతి, సురగురుం వందే జగత్కారణమ్
వందే పన్నగభూషణం, మృగధరం, వందే పశూనాం పతిమ్ !
వందే సూర్య శశాంకవహ్ని నయనం, వందే ముకుంద ప్రియమ్
వందే భక్త జనాశ్రయం చ వరదం, వందే శివం శంకరమ్ !!
ప్రదోష కాలం ఎంతో పవిత్రమైన కాలంగా హైందవ పురాణంలో తెలుపబడింది. ప్రదోషకాలం నెలకి రెండుసార్లు వస్తుంది ఆ సమయంలో పరమేశ్వరుడిని పూజిస్తే శివానుగ్రహానికి పాత్రులు అవుతారని వేదపండితులు తెలియజేస్తున్నారు.
శుక్లపక్షం (అమావాస్య నుండి పౌర్ణమి వరకు 15రోజులు)లో వచ్చే త్రయోదశి రోజు మరియు కృష్ణపక్షంలో (పౌర్ణమి నుండి అమావాస్య వరకు 15రోజులు)లో వచ్చే త్రయోదశి రోజు. సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోషకాలం అని కొందరు, సూర్యాస్తమయం అయ్యాక మూడు గడియలు 'ప్రదోషోరజనీముఖమ్' రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం అని కొందరు. ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రదోషం అంటే పాపా నిర్మూలన అని అర్థం.
ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయంలో చంద్రుడి కదలికల వలన ఏర్పడేది ప్రదోషము అంటే చంద్రుడి గతి వలన ఏర్పడే తిథుల సందులలో సూర్యాస్తమయం అయితే, అప్పుడు ప్రదోషం అంటారు. అందుకే ప్రతోరోజూ సూర్యాస్తమయ సమయానికి తిథి మారితే, అప్పుడు ప్రదోషం కలిగే అవకాశం ఉంది. త్రయోదశి రోజున కలిగే ప్రదోషాన్ని 'మహా ప్రదోషం' అని అంటారు.
ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాలను ప్రదర్శిస్తూ ఉంటాడు. ఎడమ భాగంలో పార్వతి కుడి భాగాన పరమేశ్వర రూపంగా 'అర్థనారీశ్వరుడిగా' దర్శనం ఇచ్చే కాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడింది. పరమశివుడు సదా ప్రదోషకాలంలో నాట్యం చేస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు అర్థనారీశ్వరుడిగా దర్శనం ఇవ్వడం ద్వారా ఒకే శరీరంలో రెండు రూపాలను ప్రదర్శిస్తున్నాడు. ప్రదోషకాలంలో ఉమామహేశ్వర స్వరూపాన్ని ధ్యానించాలని మనకు గుర్తు చేసేదే ఈ శ్లోకం ...
శ్లో - సాధారణే స్మరజయే నిటలాక్షి సాధ్యే
భాగీ శివో భజతు నామ యశః సమగ్రమ్ !
వామాంచి మాత్ర కలితే జనని త్వదీయే
కావా ప్రసక్తిరిహ కాలజయే పురారే !!
* త్రయోదశి రోజున సాయంతం 4:30 నుండి 6:00 గంటలవరకు ప్రదోషకాలం ఉంటుంది. ఈ ప్రదోషకాలంలో పరమేశ్వరుడిని పూజించినట్లయితే ఎటువంటి పాపాలు అయినా దహించుకు పోతాయి.
* ప్రదోషకాలంలో శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేసినట్లయితే దీర్ఘాయుష్మంతులు అవుతారు.
* ప్రదోషకాలంలో శివలింగాన్ని ఆవునేయ్యితో అభిషేకం చేస్తే మోక్షం లభిస్తుంది.
* మంచి గంధంతో అభిషేకం చేసినట్లయితే శ్రీమహాలక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది.
త్రయోదశి ఆదివారం రోజు వస్తే రవి ప్రదోషం అనీ, త్రయోదశి సోమవారం వస్తే దాన్ని సోమ ప్రదోషం అనీ, త్రయోదశి మంగళవారం వస్తే భూమ ప్రదోషం అనీ, త్రయోదశి బుధవారం వస్తే బుధ ప్రదోషం అనీ, త్రయోదశి గురువారం వస్తే గురు ప్రదోషం అనీ, త్రయోదశి శుక్రవారం వస్తే శుక్ర ప్రదోషం అనీ, త్రయోదశి శనివారం వస్తే శని త్రయోదశి అనీ, శని ప్రదోషం అని పిలుస్తారు. అన్ని త్రయోదశులలో కూడా శివపూజ తప్పనిసరి. ప్రదోషకాలం రోజూ వస్తున్నా, త్రయోదశి రోజున వచ్చే ప్రదోష సమయం చాలా పవిత్రమైనది.

No comments:
Post a Comment