Monday, November 28, 2016

Did You Know....?

1. Your shoes are the first thing people subconsciously notice about you. Wear nice shoes.

2. If you sit for more than 11 hours a day, there's a 50% chance you'll die within the next 3 years

3. There are at least 6 people in the world who look exactly like you. There's a 9% chance that you'll meet one of them in your lifetime.

4. Sleeping without a pillow reduces back pain and keeps your spine stronger.

5. A person's height is determined by their father, and their weight is determined by their mother.

6. If a part of your body "falls asleep", you can almost always "wake it up" by shaking your head.

7. There are three things the human brain cannot resist noticing - Food, attractive people and danger

8. Right-handed people tend to chew food on their right side

9. Putting dry tea bags in gym bags or smelly shoes will absorb the unpleasant odour.

10. According to Albert Einstein, if honey bees were to disappear from earth, humans would be dead within 4 years.

11. There are so many kind of apples, that if you ate a new one everyday, it would take over 20 years to try them all.

12. You can survive without eating for weeks, but you will only live 11 days without sleeping.

13. People who laugh a lot are healthier than those who don't.

14. Laziness and inactivity kills just as many people as smoking.

15. A human brain has a capacity to store 5 times as much information as Wikipedia

16. Our brain uses same amount power as 10-watt light bulb!!

17. Our body gives enough heat in 30 mins to boil 1.5 litres of water!!

18. Stomach acid (conc. HCl) is strong enough to dissolve razor blades!!

19. Take a 10-30 minute walk every day. & while you walk, SMILE. It is the ultimate antidepressant.

Thursday, November 24, 2016

అనుకున్న పనులన్నీ నెరవేరడం కోసం చక్కని పరిష్కారం

(from reviewsok.com)


ఏ పని మొదలు పెట్టినా మధ్యలోనే ఆగిపోవడం, రావలసిన డబ్బులు, ఉద్యోగాలు, లాభాలు చేతిదాకా వచ్చి చేయిదాటిపోవడం జరుగుతోందా? అయితే అనుకున్న పనులన్నీ నెరవేరడం కోసం చక్కని పరిష్కారం అంటే ఇప్పుడు చూద్దాము..
  • కొబ్బరి నూనెతో విఘ్నేశ్వరుడికి ఒక్కొక్క కుందె లో 3 ఒత్తులు వేసి దీపం పెట్టాలి. ఇలా కేవలం బుధవారమే కాకుండా రోజు ప్రతి రోజు దీపం పెట్టాలి. ఇలా పెట్టడం ద్వారా విఘ్నేశ్వరుడు మనకి వచ్చిన ఆటంకాలు మరియు విఘ్నాలు తొలగిస్తాడు.
  • గణపతికి ఎన్నో రూపాలు ఉన్నాయి అని మనం చెప్పుకున్నాము. అయితే దానిలో విఘ్నరాజాధీపతి అయిన వినాయక రూపం. అయితే మళ్ళి ఆ విఘ్నాలు కలిగించి తొలగించేది కూడా వినాయకుడే అందుకే మన పనిలో ఆటంకాలు పోవడానికి “ఓం శ్రీ వినాయకాయ నమో నమః” 
  • విఘ్నేశ్వరుడికి ఎర్రని పువ్వులు అంటే ఎంతో ప్రీతికరమైనవి. వినాయకుడికి చాలా ఇష్టమైన ఎర్రని పువ్వులతో పూజ, గరికతో గణపతి స్తోత్రం చదివి నైవేద్యంగా బెల్లం పెట్టాలి.
  

  • శివుడు నిరాడంబరుడు అందుకే అయన కోరేది నీరు. అవును మీరు చదివింది నిజమే కార్తిక మాసంలో నిత్యం దీపం, నీరు ఆయనకి సమర్పిస్తే శివుడికి అనుగ్రహం పొంది కోరిన కోరికలు తీరుస్తాడు.
  •  శివుని ఫోటో లేదా శివలింగం దగ్గర రాగి లేదా వెండి పాత్రలో శుభ్రమైన నీరు ఉంచాలి. అది రోజు పూజకు ముందు మార్చాలి. ఆ నిరుని మనం తీసుకోవచ్చు లేదా మొక్కలకు కూడా పోయచ్చు.

  • మంగళవారం పూట దుర్గమ్మ తల్లికి నేతితో దీపమెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. మంగళవారం రాహుకాలంలో దుర్గమ్మ తల్లికి దీపమెలిగించే మహిళలు నిష్ఠతో అమ్మవారిని దుర్గాష్టకంతో స్తుతిస్తే ఈతిబాధలు తొలగిపోయి, సుఖసంతోషాలు చేకూరుతాయి.  ఇంకా మంగళవారం ఉదయం సూర్యోదయానికి ముందే లేచి శుచిగా తలస్నానమాచరించి.. ఇంటిని, పూజామందిరమును శుభ్రం చేసుకుని పువ్వులు, ముగ్గులతో అలంకరించుకోవాలి. మధ్యాహ్నం 3.00 గంటల నుంచి 4.30 వరకు ఆలయాల్లో జరిగే రాహుకాల పూజను ముగించుకోవాలి. అనంతరం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో గృహంలో దీపమెలిగించి.. పాయసం నైవేద్యంగా సమర్పించుకోవాలి. దీపమెలిగించే సమయంలో దుర్గా స్తోత్రాన్ని 9 తొమ్మిదిసార్లు పఠిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు అంటున్నారు.
 
  • ఇంట్లో నుంచి బయటకు వెళ్లేప్పుడు మన శ్వాస ఏ నాసిక నుంచి వస్తుందో చూసుకొని ఆ పాదాన్ని ముందుగా బయటపెట్టి బయటు దేరితే కార్యజయం కలుగుతుంది.
  • ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు చాలా మందికి దుశ్శకునాల భయం ఉంటుంది. అలాంటి వారు దేవుడికి పూజ చేసిన పువ్వులను జేబులో లేదా బ్యాగులో దగ్గర ఉంచుకుని బయటకు వెళితే దుశ్శకునాలు బాధించవు.
  • దంపతుల మధ్య కలహాలు నివారణ కావాలంటే రాత్రి పడుకోబోయే ముందు భర్త తలదగ్గర కర్పూరం ఉంచి, భార్య తల దగ్గర సింధూరాన్ని చిన్న పోట్లంలో ఉంచుకోవాలి. నిద్రలేచాక కర్పూరాన్ని వెలిగించి, సింధూరాన్ని ఇంట్లో చల్లాలి. ఇలా చేయడం ద్వారా చిన్న.. చిన్న సమస్యలు పరిష్కారమవుతాయి.
 
  • మానవుడు తన జీవితంలో నిత్యం లక్ష్మిరాక కోసం పోరాడుతూనే ఉంటాడు. ఈ శ్లోకాన్ని భక్తి శ్రద్దలతో నిత్యం ఉదయం కాని సాయంత్రం గాని చదివితే అన్ని సమస్యలకి పరిష్కారం దొరికి… సుఖసంతోషాలతో జీవిస్తారు. దీనికి నియమాలు ఏమి పెద్దగా లేవు…శుచిగా శుబ్రంగా ఉంటె చాలు. ఈ శ్లోకం వీడియో ఈ క్రిందన ఇవ్వబడింది…   
         సహస్రదళ పద్మాస్తాం స్వస్తాంచ సుమనోహరం శాంతాంచ శ్రీహారే కాంతామ్ తాం 
         భాజేత్ జగతాం ప్రసుమ్
 
  •  పెద్ద బాల శిక్షప్రకారం:
    మండుచున్న నిప్పు, కన్య, సింహాసనం, గుర్రము, అక్షతులు, గంధము, పువ్వులు, ఛత్రము, పల్లకి, ఏనుగు, తేనె, నెయ్యి, పెరుగు, చేప, మాంసము, మద్యము, ఇస్త్రీ బట్టలు, శంఖానాదం, మంగళ వాయిద్యములు, వేదఘోష, ఏడ్పులేని శవము, పూర్ణకుంభము, వేశ్యలు, అద్దములు, మొదలైనవి ఎదురైన మంచి శకునములు.

    ఒంటి బ్రాహ్మణుడు, పిచ్చివాడు, చెవిటి, కుంటి, జడధారి, మాలికలు, ఎముకలు, చర్మం, నూనె, ప్రత్తి, కట్టెలు, ఉప్పు, బెల్లం, మజ్జిగ, పాము, కసు, దిగంబరుడు, క్షౌరం చేయించుకున్నవాడు, తల బిరబోసుకున్న వాడు, దీర్ఘరోగి మొదలైనవి ఎదురైన చెడు శకునములు.
 
  •   Few more coming ....

సరైన పద్థతిలో ఉపవాసం చేస్తే అనేక ప్రయోజనాలు దక్కుతాయి

(from reviewsok.com)
 
అటు శరీరాన్ని.. ఇటు ఆత్మనూ పరిశుద్ధం చేసే విశేష ప్రక్రియే ఉపవాసం. ఉపవాసం అంటే పరమాత్మధ్యాసలో ఉండడంతప్ప బలవంతాన అన్న పానీయాలకు దూరంగా గడపడం కాదు. అన్ని మతాల్లోనూ ఉపవాస సంప్రదాయం కనిపిస్తుంది. ఒక్కో తరహా ప్రాంతంలో ఒక్కో తరహా పద్థతులు కనిపిస్తాయి. పద్థతి ఏదైనా సరే మనసుపెట్టి ఏకాగ్రతతో చేయగలిగితే ఉపవాస ఫలితాలు అందుకోవచ్చు.

వివిధ రకాల ఉపవాసాలతో మహిళలు కాలం గడిపేస్తుంటారు. కొన్నిసార్లు ఉపవాసం మంచిదే. అయితే మంచినీళ్ళు కూడా తీసుకోకుండా కడుపుమాడ్చుకుని చేసే ఉపవాసం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఉపవాస సమయంలో కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అంటున్నారు వైద్యులు.
ఇలాంటివారు చెయ్యొదు
ఆరోగ్యం సహకరిస్తేతప్ప ఉపవాసం చేయకూడదు. అనారోగ్యంగా ఉన్నవారు ఉపవాసం చేయడం వల్ల లేనిపోని సమస్యలను కొనితెచ్చుకునే ప్రమాదం కూడా ఉంది. కొందరు అదేపనిగా వారంలో మూడునాలుగు రోజులు ఉపవాసాలు చేస్తారు. నెలకు ఒకసారి ఉపవాసం చేయడంవల్ల ప్రయోజనం పొందినా అదేపనిగా చేసే ఉపవాసాలవల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. డయాబెటిస్‌ పేషెంట్స్‌, గర్భవతులు, ఏవైనా మందులు వాడేవారు ఉపవాసాలు చేయకూడదు. ఉపవాసం సరిగ్గా చేయకపోతే శరీరంలోని కొవ్వు అంటే కండరాలు ఎక్కువగా కరిగిపోతాయి. అందుకే మహిళలు స్ర్టెస్‌పీరియడ్‌ గడిచిన వారం తర్వాత మాత్రమే ఉపవాసం చేయాలి. ఆ సమయంలో ఉపవాసాలు చేయడంవల్ల శక్తి క్షీణించి త్వరగా అలిసిపోయే ప్రమాదం ఉంది.
ప్రయోజనాలు
సరైన పద్థతిలో ఉపవాసం చేస్తే అనేక ప్రయోజనాలు దక్కుతాయి. ఉపవాసం వల్ల శరీరంలోని విషతుల్యాలు బైటకుపోతాయి. క్లెన్సింగ్‌ జరుగుతుంది. శరీరానికి శక్తి అందుతుంది. శరీర విధుల నిర్వహణలో సమతుల్యత వస్తుంది. రోగనిరోధక వ్యవస్థ మరింత శక్తిమంతం అవుతుంది. రక్తపీడనం త్వరగా తగ్గిపోతుంది. అయితే ఇది హైబీపీ ఉన్నవారికి మంచిదే అయినా లోబీపీ బాధితులకు మాత్రం సమస్యలు తేవచ్చు.
ఉపవాసంవల్ల జీర్ణవ్యవస్థకు తగిన విశ్రాంతి దొరికి దాని పనితీరు మెరుగుపడుతుంది. ఇంద్రియాలను, మనసును అదుపులో పెట్టుకోవచ్చు. అదనపు కేలరీల బెడద లేనందున ఊబకాయం వంటి సమస్యలు త్వరగా రావు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
సాధ్యమైనంత వరకూ ఉపవాస సమయంలో పనిభారం లేకుండా చూసుకోవడం మంచిది. చాలామంది మహిళలు తినాలనే ధ్యాసనుంచి దృష్టి మరల్చుకునేందుకు ఇంటి పనుల్లో నిమగ్నమవుతారు. అలా కాకుండా కొంచెం కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలి. మంద్రమైన సంగీతం వింటూ ఉండాలి. ధ్యానం చేయడం మంచిది.

ఉపవాసం చేసిన మర్నాడు ఆకలిగా ఉందని అతిగా తినేయకూడదు. ముందుగా ద్రవాహారం తీసుకోవాలి. ఆ తర్వాత ఘనాహారం తీసుకుంటే మంచిది. ఎక్కువ మసాలాలు కాకుండా తేలికపాటి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. అన్నం కూరలతో పాటు, సగ్గుబియ్యం జావ, పండ్లముక్కలు తినాలి.
కఠినంగా వద్దు
శరీరానికి ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు పోషకాలు అవసరమవుతాయి. ఇవన్నీ కొవ్వులో నిల్వ ఉండవు. వీటిని ఆహారంలో తీసుకోకపోతే శరీరానికి ఏవిధంగానూ అందవు. రక్తంలో ఎమినోయాసిడ్స్‌ లేకపోయినట్లయితే జీవక్రియ ప్రభావం కండరాలపై పడుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఉపవాసాలు చేస్తుంటే హార్మోన్లు ప్రభావితం అవుతాయి.


అసలు ఏమీ తీసుకోకుండా చేసే కఠిన ఉపవాసాలవల్ల తలనొప్పి, డీహైడ్రేషన వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. జుట్టు పల్చబడిపోతుంది. ఆహారాల లోపాలకు సంబంధించిన ఇతర సమస్యలు తలెత్తుతాయి. అందుకే కఠినంగా, చాదస్తంగా కాకుండా పోషకాహారం లభించే డ్రైఫ్రూట్స్‌, పండ్లు, తగినంత నీరు తీసుకుంటూ, పండ్లరసాలను తాగుతూ ఉపవాసం పాటించాలి.

గోమతి చక్రాన్ని పూజా మందిరంలో ఉంచుకోవాలి

(from reviewsok.com) 
  • లక్ష్మి దేవి అనుగ్రహం, చక్కటి ఆరోగ్యం కోసం శుక్రవారం నాడు గోమతి చక్రాన్ని పూజా మందిరంలో ఉంచుకోవాలి. ఈ గోమతి చక్రం చూడటానికి శ్రీ మహా విష్ణువు యొక్క ఆయుధమైన శుదర్సన చక్రం ఆకారంలో ఉంటుంది కాబట్టి, లక్ష్మి దేవి యొక్క జన్మ స్థానం అయినటువంటి నీటిలో లభిస్తుంది కాబట్టి… లక్ష్మి దేవికి గోమతి చక్రం అంటే ఎంతో ప్రీతీ దాయకమైనదని శాస్త్రాలు వర్ణించడం జరిగింది.
  • ఎవరైనా తీవ్రమైన అనారోగ్యంతో బాధ పడుతుంటే.. వాళ్ళందరూ తప్పనిసరిగా గోమతి చక్రాన్ని ఉపయోగిస్తే మంచిది. ఒక గ్లాసులో నీళ్ళు తీసుకుని అందులో గోమతి చక్రాన్ని వేసి, ‘ఓం వం ఆర్యోనికరీ రోగానశేషా నమః’ ఈ మంత్రాన్ని 21 సార్లు జపించిన తరువాత గ్లాసులో నుంచి గోమాతిచాక్రాన్ని తీసివేసి ఆ నీటిని తీసుకుంటే అనారోగ్యం నుండి బయటపడి ఆరోగ్యవంతులం కావడానికి ఎంతో ఆశ్కారం ఉంది.
  • రాహు, కేతు, సర్ప దోషాలు ఉన్న వారు శుక్రవారం నాడు పూజ మందిరం లో గోమతి చక్రాలను ఉంచి దానికి పసుపు కుంకుమలను అలంకరిస్తే… ఈ దోషాల నుంచి బయట పడవచ్చు.
  • చిన్న పిల్లలు దృష్టి దోషంతో బాధ పడతున్నట్టు అయితే… గోమతి చక్రాన్ని ఒక వెండి తాయిత్తులో ఉంచి, పిల్లల మేడలో వేస్తే దృష్టి దోషం నుంచి బయట పడవచ్చు.
  • వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా సంభవించి బాధలు పడే వారు వ్యాపారంలో సింహ ద్వారం ముందు, రెండు గోమతి చక్రాలను ఒక ఎరుపు రంగు వస్త్రంలో అలా వేలాడదియ్యటం ద్వారా, వాటి కిందనుంచి నడవటం వలన వ్యాపారంలో లాభాలు పొందటానికి ఆశ్కారం ఉంది.
  • స్త్రీలకు తరచు అబార్షన్లు లాంటివి అవుతుంటే… అటువంటి వారు రెండు గోమతి చక్రాలను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ధరించడం ద్వారా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
  • కోర్టు పనులు అలాగే ఏ ఇతర ముఖ్యమైన పనులు మీద బయటకు వెళ్ళినా గోమతి చక్రాని దగ్గర ఉంచుకుంటే మంచి ఫలితం వస్తుంది.
  • గృహ నిర్మాణంలో పునాదులలో నాలుగు వైపులా 11 గోమతి చక్రాలను పెడితే ఎలాంటి వాస్తు దోషం ఉండదు.

Tuesday, November 1, 2016

లింగాష్టకం యొక్క అర్థం


బ్రహ్మమురారిసురార్చిత లింగం 

బ్రహ్మ ,విష్ణు , దేవతల చేత పూజింపబడ్డ లింగం..!!

నిర్మల భాషిత శోభిత లింగం

నిర్మలమైన మాటల చేత అలంకరింపబడ్డ లింగం..!!

జన్మజ దుఃఖ వినాశక లింగం

జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగం..!!

తత్ ప్రణమామి సదాశివ లింగం

ఓ సదా శివ లింగం నీకు నమస్కారం..!!

దేవముని ప్రవరార్చిత లింగం

దేవమునులు
మహా ఋషులు పూజింప లింగం..!!

కామదహన కరుణాకర లింగం

మన్మధుడిని దహనం చేసిన , అపారమైన కరుణను చూపే చేతులు గల శివలింగం..!!

రావణ దర్ప వినాశక లింగం

రావణుడి గర్వాన్ని నాశనం చేసినట్టి శివ లింగం..!!

తత్ ప్రణమామి సదా శివ లింగం

నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!

సర్వ సుగంధ సులేపిత లింగం

అన్ని మంచి గంధాలు , మంచి గా పూసిన శివ లింగం..!!

బుద్ధి వివర్ధన కారణ లింగం

మనుషుల బుద్ధి వికాసానికి కారణ మైన శివ లింగం ..!!

సిద్ధ సురాసుర వందిత లింగం

సిద్ధులు , దేవతలు , రాక్షసుల చేత కీర్తింపబడ్డ శివ లింగం..!!

తత్ ప్రణమామి సదా శివ లింగం

నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!

కనక మహామణి భూషిత లింగం

బంగారు , మహా మణుల చేత అలంకరింప బడ్డ శివ లింగం..!!

ఫణిపతి వేష్టిత శోభిత లింగం

నాగరాజు నివాసం చేత అలంకరింపబడ్డ శివ లింగం..!!

దక్ష సుయజ్ఞ వినాశక లింగం

దక్షుడు చేసిన మంచి యజ్ఞాన్ని నాశనం చేసిన శివ లింగం..!!

తత్ ప్రణమామి సదా శివ లింగం

నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!

కుంకుమ చందన లేపిత లింగం

కుంకుమ , గంధము పూయబడ్డ శివ లింగం..!!

పంకజ హార సుశోభిత లింగం

కలువల దండ చేత చక్కగా అలంకరింప బడ్డ శివ లింగం..!!

సంచిత పాప వినాశక లింగం

సంక్రమించిన పాపాలని నాశనం చేసే శివ లింగం..!!

తత్ ప్రణమామి సదా శివ లింగం

నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!

దేవగణార్చిత సేవిత లింగం

దేవ గణాల చేత పూజింప బడ్డ , సేవించ బడ్డ శివ లింగం..!!

భావై ర్భక్తీ భిరేవచ లింగం

చక్కటి భావం తో కూడిన భక్తీ చేత పూజింప బడ్డ శివ లింగం..!!

దినకర కోటి ప్రభాకర లింగం

కోటి సూర్యుల కాంతితో వెలిగే మరో సూర్య బింబం లాంటి శివ లింగం..!!

తత్ ప్రణమామి సదా శివ లింగం

నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివ లింగమా ..!!

అష్ట దలోపరి వేష్టిత లింగం

ఎనిమిది రకాల ఆకుల మీద నివాసముండే శివ లింగం..!!

సర్వ సముద్భవ కారణ లింగం

అన్నీ సమానంగా జన్మించడానికి కారణమైన శివ లింగం..!!

అష్ట దరిద్ర వినాశక లింగం

ఎనిమిది రకాల దరిద్రాలను (అష్ట దరిద్రాలు) నాశనం చేసే శివ లింగం..!!

తత్ ప్రణమామి సదా శివ లింగం

నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివ లింగమా ..!!

సురగురు సురవర పూజిత లింగం

దేవ గురువు (బృహస్పతి), దేవతల చేత పూజింప బడ్డ శివ లింగం..!!

సురవన పుష్ప సదార్చిత లింగం

దేవతల తోటల్లో పూచే పువ్వులు (పారిజాతాలు) చేత ఎప్పుడూ పూజింప బడే శివ లింగం..!!

పరమపదం పరమాత్మక లింగం

ఓ శివ లింగమా, నీ సన్నిధి ఏ ఒక స్వర్గము

తత్ ప్రణమామి సదా శివ లింగం

నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!

లింగాష్టక మిదం పుణ్యం యః పట్టేత్ శివ సన్నిధౌ

ఎప్పుడైతే శివుడి సన్నిధిలో చదవబడుతుందో , వారికి చాలా పుణ్యం వస్తుంది..!!

శివ లోక మవాప్నోతి శివేన సహమోదతే

శివ లోకం లభిస్తుంది ..!!
శివుడి లో ఐక్యమయ్యే మార్గం దొరుకుతుంది....

💐🙏💐

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...