Thursday, January 31, 2019

శరీరాలు మూడు రకాలుగా ఉంటాయి

( తాళపత్ర  నిధి  నుండి)

మనం  పాపాలు  చేసామా.. ?

పుణ్యాల  చేసామా.. ?

మనలో  పాపం  ఎక్కువ  నిలువ  ఉందా ?
లేదా  పుణ్యం  ఎక్కువ  నిలువ  ఉందా ?
అన్న  విషయం  ఎలా  తెలుస్తుంది ?
అన్న  సందేహం  మనకురావచ్చు !

శరీరాలు  మూడు  రకాలుగా  ఉంటాయి...

1. స్థూల  శరీరం  ( సాధారణ  భౌతిక  శరీరం )

2. సూక్ష్మ  శరీరం  ( కేవలం  మనస్సు,  బుద్ధిలతో కూడినది )

3. కారణ  శరీరం  ( పాప  పుణ్యాల  శేష  ఫలితాలు బీజరూపకంగా  ఉన్న  శరీరం ) ఇలా  మనం  చేసిన పాపం  ఈ  మూడు  శరీరాల్లో  నిలువ  ఉంటుందని శాస్త్రం  చెబుతుంది...

మనలో  పాపం  ఎక్కువ  నిలువ  ఉందా ?

లేదా  పుణ్యం  ఎక్కువ  నిలువ  ఉందా ?

అన్న  విషయం  ఎలా  తెలుస్తుంది ?
అన్న  సందేహం  మనకు  రావచ్చు !

దుర్గంధాన్ని  బట్టి  చెడువస్తువులనూ,

సుగంధాన్ని  బట్టి  మంచి  వస్తువులను  అంచనా వేసినట్లు  ఈ  మూడు  శరీర  లక్షణాలను  బట్టి మనలో  నిలువ  ఉన్న  పాప  పుణ్యాలను  కూడా అంచనా  వేయవచ్చు !

1. స్థూల  శరీర  లక్షణాలు

సాధారణంగా  స్థూల  శరీరలక్షణాలు  ఎక్కువగా
ఈ  జన్మలో  చేసిన  పాప  పుణ్యాలమీద  ఆధారపడి ఉంటాయి....

అ)  స్థూల  శరీరం  పాపరహితంగా  పవిత్రంగా
ఉంటే  తెల్లవారు  జామునే  మేల్కొంటుంది...

( లేదా  తెల్లవారు  జామున
 మేలొన్నా  పవిత్రమౌతుంది )

పాపం  పెరిగిన  కొద్దీ  సరిగ్గా  బ్రాహ్మీ  ముహూర్తంలోనే గాఢ  నిద్ర  పట్టడం,

ఆలస్యంగా  నిద్రలేవడం  ఎక్కువౌతుంది...

ఉదా :  ఈ  ప్రపంచంలో  పాపం  అంటే  తెలియని స్థితిలో  ఉన్న  శిశువులు  కానీ,

పాప  రహితులైన  మహాత్ములుగాని  తెల్లవారు జామునే  మేల్కొటాంరు....

గమనించండీ !

ఆ )  స్థూల  శరీరం  పాప  రహితంగా  పవిత్రంగా ఉంటే

ఏ  మాత్రం  బద్ధకం,  సోమరితనం  లేకుండా ఉపయుక్తమైన  ఏ  పని  చేయడానికైనా  సన్నద్ధంగా, ఉత్సాహంగా  ఉంటుంది....

ఒకవేళ  పాపం  పెరుగుతూ  ఉంటే

సోమరితనం,  బద్ధకం  కూడా  పెరుగుతాయి... ఉపయుక్తమైన  పనులు  చేసే  విషయంలో  శరీరం

ఏ  మాత్రం  సన్నద్ధంగా  ఉత్సాహంగా  ఉండదు... నిరుపయోగకరమైన  మరియు  కాలాన్ని  వ్యర్థం
 చేసే  విషయాల్లో  ఉత్సాహం,  సన్నద్ధత పెరుగుతాయి....

ఈ  విషయంలో  కూడా  పాపం  అంటే  తెలియని శిశువులనూ,

పాపరహితులైన  మహాత్ములను  గమనించండీ ?

వారు  బద్ధకంగా  వ్యవహరించింది  ఎప్పుడూ కనిపించదు...

ఇ ) స్థూల  శరీరం  పవిత్రంగా  ఉంటే
నియతిబద్ధంగా,   క్రమశిక్షణతో   వ్యవహరించడం జరుగుతోంది...  పాపంతో   అపవిత్రమైనకొద్దీ క్రమశిక్షణ  లోపిస్తుంది....

ఈ )   స్థూల   శరీరంలో   పాపం   పెరిగి అపవిత్రమైనకొద్దీ   అనవసర   ఆహారం,
దోష   భూయిష్టమైన   ఆహారమే  తీసుకోవాలనిపిస్తుంది...

లేదా  అలా   తీసుకునే   పరిస్థితులు
ఏర్పడతాయి....  పవిత్రత   పెరిగిన  కొద్దీ మితాహారం,

ఆరోగ్యాన్ని   పవిత్రతను   ఇచ్చే   ఆహారం తీసుకోవడం   జరుగుతుంది...

ఉ )   స్థూలశరీరం   అపవిత్రమైనకొద్దీ

అవసరానికి   మించి   నిద్రించడం 
జరుగుతుంది....   పవిత్రమైనకొద్దీ   ఎంత
అవసరమో   అంతే  నిద్రించడం  ఉంటుంది...

ఊ )  స్థూల   శరీరం  పవిత్రంగా   ఉంటే
నిద్ర   లేచిన  క్షణంలో  వెంటనే  ( కాన్సియస్‌ ) స్పృహలోకి  వచ్చి  ఉత్సాహంగా  ఉంటారు...

లేదా  ఉత్సాహంగా  నిద్రలేస్తారు...

నిద్ర  లేచిన  తర్వాత  వారి  ముఖం  మబ్బు
లేకుండా  ఫ్రెష్‌గా  ఉంటుంది...

పాపంతో   అపవిత్రమౌతున్న  కొద్దీ  నిద్ర  లేచిన
10, 15  నిమిషాల   వరకు   ( కాన్సియస్‌ ) స్పృహలోకి   రాలేకపోతారు...

కారణమేమిటంటే   ఆత్మతో  శరీరానికి  బంధం ఎక్కువౌతుంది...

ఇలా  స్థూల  శరీర  లక్షణాలను  బట్టి
పాప  పుణ్యాల  నిలువను  గుర్తించవచ్చు...

దుర్గంథాన్ని  బట్టివాతావరణంలో  అపవిత్రతను కలుగజేస్తున్న  చచ్చిన  ఎలుకను  గుర్తించినట్లు

స్థూల  శరీర  లక్షణాలను  బట్టి  జీవితంలో వ్యాపించిన  అపవిత్రతనూ,  పాపాన్ని
గుర్తించాలి...  దీని  వల్లనే  శుభాలు  వాయిదా పడుతున్నాయని,  భవిష్యత్తులో  కష్టాలు
రావడం  వల్ల  పాపం  ప్రక్షాళన  కావలసి
వస్తుందని  అర్థం  చేసుకోవాలి...
 కాబట్టి  వెంటనే  జాగ్రత్తపడి  కఠినమైన
సాధన  వల్ల స్థూల  శరీరాన్ని  సరియైన
విధంగా  ఉంచుకోవాలి... !

Wednesday, January 23, 2019

1648లో జరిగిన అద్భుత సుబ్రహ్మణ్యుని లీల!

డచ్ వాళ్ళు దౌర్జన్యంగా తీసుకు వెళ్ళాలనుకున్న మన సుబ్రహ్మణ్యుని మూల విరాట్టు . ఎంతో మహిమాన్విత క్షేత్రం సునామీ కూడా సుబ్రహ్మణ్యుని ఆలయాన్ని ఏమి చేయలేకపోయింది.

ఆది దంపతులు పరమేశ్వరుడు, పార్వతీదేవిల రెండో తనయుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. దేవసేనానిగా వ్యవహరించి రాక్షసుడు శూరపద్ముడిని సంహరించాడు. ఈ సంహారం కోసం ఆయన పలు రణశిబిరాలను ఏర్పాటుచేశాడు. ఈ శిబిరాల్లో ముఖ్యమైనవి ఆరు. వాటిని ఆరు పడై వీడు అంటారు. ఈ ఆరు క్షేత్రాలు తమిళనాడులోనే వున్నాయి. అవి స్వామిమలై, పళని, పళముదిర్చోళై, తిరుప్పరన్‌ కుండ్రం, తిరుచెందూర్, తిరుత్తణి. ప్రస్తుతం మనం తిరుచెందూర్ గురించి తెలుసుకుందాము.


తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో మొదటిది. ఈ క్షేత్రములో స్వామి తారకాసురుడు, శూరపద్ముడు అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడిది చేసి, పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం. ఈ క్షేత్రం తమిళనాడు లో తిరునెల్వేలి నుండి అరవై కిలోమీటర్ల దూరములో సముద్ర తీరములో ఉన్న అద్భుతమైన ఆలయం. సముద్ర కెరటాలు తిన్నగా వచ్చి గుడిని తాకుతుంటాయి. సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ కొండ శిఖరములపై ఉంటాయి. కాని ఈ తిరుచెందూర్లో ఒక్కచోటే స్వామి సముద్ర తీరము నందు కొండ మీద కొలువై ఉన్నాడు.


స్థల పురాణము…

ఒకానొకప్పుడు, ఈ పవిత్ర స్థలంలో అసురుడైన శూరపద్ముడు తన సోదరులగు సింహముఖుడు మరియు తారకాసురుడితో ముల్లోకాలను ఏలుతుండేవాడు. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారు, తిరుచెందూరుకు అసుర సంహారమునకై వచ్చారు. తన శివారాధన నిమిత్తం, మయుడిని రప్పించి ఒక దేవాలయాన్ని నిర్మించమని ఆఙ్ఞాపించారు. ఆ తరువాత స్వామివారు అసురసంహారానికై పూనుకొని, వారితో ఆరు రోజులు ఎడతెఱిపి లేకుండా నేలపైన, సముద్రముపైన, ఆకాశములో యుద్ధం చేశారు. ఆ భీకర యుద్ధంలో శూరపద్ముడు మినహా అందరూ సంహరింపబడ్డారు. శూరపద్ముడు సముద్రానికి దగ్గిరలో ఒక మామిడి చెట్టు రూపంలో ఉద్భవించాడు. స్వామివారు ఇంద్రుడిని తన వాహనముగా చేసుకొని, తన శక్తి ఆయుధంతో రెండు ముక్కలుగా చీల్చి సంహరించారు. కానీ ఆ రెండు ముక్కలు కోడిపుంజు, మగ నెమలి స్వామివారిచే క్షమింపబడి, ఆయన విశ్వరూప దర్శన భాగ్యాన్ని పొందాడు. ఇంద్రుడి బదులు ఆ మగ నెమలిని తన వాహనంగా చేసుకొని, కోడిపుంజును తన పతాక చిహ్నముగా చేసుకున్నారు.


స్కాంద పురాణంలో…

ఈ ఆలయం గురించి స్కాంద పురాణములో చెప్పబడినది. ఈ క్షేత్రంలోనే ఒక గొప్ప విచిత్రం జరిగింది. ఒకసారి జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచెందూర్ వెళ్లారు. అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు, ఆలయం వెలుపల కూర్చుని ఉన్నారు. అప్పుడు ఆయనకి ధ్యానములో సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనము అయ్యింది. వెంటనే శంకరులు సుబ్రహ్మణ్య భుజంగం చేశారు. ఈ భుజంగ స్తోత్రము ద్వారా, మనల్ని, మన వంశాలనీ పట్టి పీడించేసే కొన్ని దోషాలు ఉంటాయి, అటువంటి వాటిలో నాగ దోషం లేదా కాల సర్ప దోషం ఒకటి . దీనికి కారణం మనం తప్పుచేయకపోవచ్చు, ఎక్కడో వంశంలో తప్పు జరుగుతుంది, దాని ఫలితము అనేక విధాలుగా అనుభవిస్తూ ఉండవచ్చు. ఉదాహరణకు, సంతానము కలుగక పోవడం, కుష్టు రోగం మొదలైనవి. అటువంటి దోషములను కూడా పోగొట్టే సుబ్రహ్మణ్య శక్తి ఎంత గొప్పదో, శంకరులు ఈ సుబ్రహ్మణ్య భుజంగము ద్వారా తెలియజేశారు. ఎంతో అద్భుతమైన స్తోత్రం ఇది.


ఈ సంసారము అనే మహా సముద్రము నుండి మనలను కడతేర్చడానికి నేనున్నాను మీకు అని అభయం ఇవ్వడానికే స్వామి ఇక్కడ నివాసము ఉంటున్నారు. అందుకే శంకర భగవత్పాదులు స్వామిని “మహాంబోధితీరే మహాపాపచోరే ….. అని కీర్తించారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రములో. అంతటి శక్తి ఈ తిరుచెందూర్ క్షేత్రమునకు ఉన్నది.


స్వామివారి రూపం…

తిరుచెందూర్ క్షేత్రములో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు. అంత అందంగా ఉంటారు. ఇక్కడ, స్వామి తన ముద్దులొలికే రూపంతో పాటు పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు. చాలా చాలా శక్తివంతమైన క్షేత్రము. ఎటువంటి వారికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, ఇక్కడ స్వామి విభూతి ప్రసాదంగా తీసుకుంటే అవి తొలగిపోతాయి. సముద్ర తీరంలో శక్తివంతమైన, సుందరమైన దివ్య క్షేత్రం యిది.ఇక్కడ స్వామి వారికి చేసే విభూతి అభిషేకం ఎంత అద్భుతంగా ఉంటుందో. అది చూసి తీరాలి. సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ప్రత్యేకంగా ఈ తిరుచెందూర్ క్షేత్రములో ప్రసాదంగా ఇవ్వబడే విభూతి ఎంతో మహిమాన్వితమైనది.


విభూది మహిమ…

ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసిన విభూతి తీసుకు వచ్చి ఇంట్లో పెట్టుకుంటే, ఎటువంటి గ్రహ, శత్రు, భూత, ప్రేత పిశాచ బాధలు ఉండవు. అంతే కాదు, ఈ విభూతిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మవ్యాధులు నయం అవుతాయి.


ఆలయశోభ…

సమీపిస్తున్న కొద్దీ, భవ్యమైన తొమ్మిదంతస్తుల రాజగోపురం, దాని పైని శూలం కొట్టొచ్చినట్లుగా కనబడుతాయి. దీనిని 300 ఏళ్ళ క్రితమే నిర్మించడం జరిగింది. తిరువాదుథురై మఠ మహాసన్నిధానానికి చెందిన దేశికమూర్తిస్వామివారికి కలలో ఈ నిర్మాణం చేపట్టవలసినదిగా ప్రచోదనమయ్యింది. అయితే అతడు పేదవాడు కావడంవల్ల, గోపుర నిర్మాణానికై వచ్చిన కూలీలకు కూలీ డబ్బులకు బదులుగా స్వామివారి విభూతిని ఇచ్చాడట. ఆ కూలీలు తుండుక్కై వినాయక ఆలయం వద్దనుండి వెళుతున్నపుడు, ఎవరి శ్రమకు తగినట్టుగా వారికి ఆ విభూతి బంగారంగా మారిపోయేదట. ఆరవ అంతస్థు పూర్తికాగానే, ఈ అద్భుతం ఆగిపోయిందట. మరలా సుబ్రహ్మణ్యస్వామివారు కలలో కనిపించి, కల్యాణ పట్టణానికి చెందిన సీతాపతి మరైక్కార్ అను పోషకుడి వద్దనుండి ఒక బుట్ట ఉప్పును పొందమని ఆదేశించారట. ఆ బుట్టతో తిరుచెందూర్ చేరుకోగానే, ఉప్పు కాస్తా బంగారు నాణాలుగా మారి మిగతా మూడంతస్థుల నిర్మాణం పూర్తిగావించడానికి తోడ్పడిందట. అనంతరంతర కాలంలో ఈ ఆలయం అనేక మార్పులకు, చేర్పులకూ గురవుతూ వచ్చింది. ప్రస్తుతమున్న ఈ ఆలయం వంద సంవత్సరాలకు పూర్వం నిర్మించబడినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది.


షణ్ముఖ విలాసం…

దేవాలయ ప్రధాన మంటపం 124 స్థంబాలతో శోభిస్తూ, దక్షిణాభిముఖంగా ఉంటుంది. దీనిని షణ్ముఖ విలాసం అని పిలుస్తారు. మొదటి ప్రాకారపు దక్షిణ ప్రవేశమార్గానికి పడమటివైపు దక్షిణామూర్తి (శివుడు) కనిపిస్తారు. ఇక్కడే మరో మండపం ఉంది. ఈ మండపంలో ఉత్సవ దేవతా విగ్రహాలు దర్శనమిస్తారు. ఫల్గుణీ మాసంలో ప్రతి ఏటా ఈ మంటపంలో వల్లీ అమ్మవారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. పడమటి ద్వారానికి ఉత్తరాన శూరపద్మునితో పోరాటానికి సిద్ధంగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామివారు, నెమలిపై కూర్చొన్న విగ్రహం కనిపిస్తుంది. అక్కడక్కడా శివలింగాలు కనిపిస్తాయి. ఆ తరువాత, అరుణగిరి నాథర్ ముని విగ్రహం ఉంటుంది. ఈయన స్వామివారిని స్తుతిస్తూ తిరుప్పుగయ్ అనే రచన చేశారు. దీనికి సమీపంలో గణపతిస్వామి మూర్తి ఉంది. ఈయనను ఇక్కడ ‘ముక్కురిణి పిళ్లయర్’అని పిల్వడం జరుగుతోంది. ఉత్తర ద్వారం వద్ద వేంకటేశ్వరస్వామివారి విగ్రహం కనిపిస్తుంది. ఆనుకొనున్న గుహలో గజలక్ష్మి, పరుండిన రంగనాథుడు, శ్రీదేవీ, భూదేవీ, నీలాదేవి దర్శనమిస్తారు.


ఇక్కడే రాతిలో చెక్కిన పన్నెండు ఆళ్వారుల (వైష్ణవ భక్తాగ్రేసరులు) మూర్తులు కూడా దర్శనమిస్తాయి. తూర్పువాకిలి మధ్య భాగాన, తూర్పుగోపురం హద్దుగా తామ్రంతో నిర్మితమైన ధ్వజస్తంభం ఉంది. రెండవ ప్రాకారంలో, కుమార పీటంకార, ఆయన భార్యలు, షణ్ముఖుని ఉత్సవ విగ్రహాలూ ఉంటాయి. దగ్గిరలో 63 నాయన్మార్లు (శైవ భక్తాగ్రేసరులు) వరుసగా దర్శనమిస్తారు. ఉత్తరపు వాకిలిలో, శివాలయాలలో ఉన్నట్టు చిటికెల చండీశ్వరమూర్తి కనిపిస్తారు. అలాగే, తూర్పున నటరాజస్వామి, శనీశ్వరుడు, భైరవ మూర్తులు దర్శనమిస్తాయి. తూర్పు వాకిలి మధ్య భాగంలో, బంగారు ధ్వజ స్థంభం ఉన్నది.


మూల విరాఠ్ – పవిత్ర పూజ్య పీఠం…
పూజ్య పీఠ ప్రవేశ ద్వారం వద్ద వీర బాహు, వీర మహేంద్రులనబడే ద్వార పాలకులు, స్వామివారి రక్షక భటులుగా నిలబడి కనిపిస్తారు. ఒకే ముఖముతో, చతుర్భుజుడై మూలవర్‌ (మూల విరాఠ్) బాల సుబ్రహ్మణ్య స్వామివారిగా దర్శనం ఇస్తారు. ఇది బ్రహ్మచారి స్వరూపం.


 ఈ క్షేత్ర ప్రాశస్త్యం, వైభవాలు ఎంతగా ప్రభావితం చేసినా, స్వామివారి దర్శనం చేసినపుడు మాత్రం ఒక వింత అనుభవం కలుగకమానదు. భయంకరమైన రక్కసులను సంహరించినా, స్వామివారి సుందర విగ్రహం, ఒక బాలకుడిలా ఎంతో ముద్దుగొలుపుతూ ఉంటుంది. రెండు చేతులు జోడించి దణ్ణం పెట్టాలనే వాంఛకన్నా, దగ్గిరకెళ్ళి బుగ్గగిల్లాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటారీ స్వామివారు.

ఉత్తరపు దిక్కున ఒక మూలలోగల శివలింగమే, శూరపద్ముని సంహారం తరువాత, సుబ్రహ్మణ్య స్వామివారు పూజించినదని చెబుతారు. స్వామివారి ప్రసాదం విభూతి. ప్రధాన పీఠానికి ఎడమవైపున ఉత్తరాన ఉత్సవ విగ్రహాలైన శెంథిల్ నాయకన్‌, తన భార్యలతో కూడి దర్శనమిస్తారు. ఈ ఉత్సవ మూర్తులకు ఎడమ వైపు బొక్కసం (ఆభరణాలు భద్రపరుచు స్థలం) ఉంటుంది.

మరొక ప్రత్యేక స్థానంలో, దక్షిణాభిముఖంగా షణ్ముఖస్వామి తన భార్యలగు వల్లి, దేవసేనలతో వేంచేసి ఉన్నారు. ఈ అందమైన రాగి విగ్రహం అద్భుతమైన ఆభరణాలతో సుశోభితంగా ఉంటుంది. స్వామివారు పన్నెండు చేతులతో అనేకమైనట్టి ఆయుధాలు చేతబూని ఉంటారు.

పురాణ విగ్రహం…

షణ్ముఖ విగ్రహానికి సంభందించిన చారిత్రక గాధ ఒకటి ఉన్నది. క్రీ.శ. 1648 లో డచ్ దేశస్తులు ఆలయంపై దాడి చేసి, మూలవిరాఠ్, నటరాజ విగ్రహాలను, సంపదనూ దొంగిలించి సముద్ర మార్గంగుండా పారిపోయారు. కానీ ఒక భయంకరమైన తుఫానులో చిక్కుకొని, భయానికిలోనయి ఆ విగ్రహాలను అక్కడే సముద్రంలో జారవిడిచి తోక ముడిచారు. దొంగతనం గురించి తెలుసుకున్న వడమలయప్ప పిల్లయన్, వెంటనే పంచలోహాలతో మునుపటి విగ్రహంలాంటిదే మరొకటి తయారు చేయించారట.

 ఈయన నాయకన్లచే నియమింపబడిన జమిందారు. కానీ, క్రీ.శ. 1653 లో ఈ నూతన పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్టించే సమయానికి, ఒకనాడు స్వామివారు ఆయనకు కలలో దర్శనమిచ్చి, సముద్రంలో జారవిడిచిన తన నిజ విగ్రహాన్ని వెతికి తెచ్చి, తిరిగి ప్రతిష్టించమని ఆఙ్ఞాపించారు. సముద్రంలో నిమ్మపండు తేలియాడుతున్నచోట, దానిపై గరుడపక్షి వలయాకారంలో తిరుగుతూ కనిపిస్తుందని ఆనవాళ్ళు తెలిపారు. నిర్దేశం ప్రకారం వెతికి, స్వామివారి నిజమూర్తిని కనుగొని, పునః ప్రతిష్ట గావించారు. కొత్తగా చేయించిన పంచలోహ విగ్రహాన్ని, మురుగన్ కురుచిలో తిరుప్పిరంటీశ్వరాలయంలో ప్రతిష్టించారు. ఇదేదో కట్టు కథ అనుకునేరు!


 M.Raffel అనే ఫ్రెంచ్ దేశస్తుడు, 1785లో తను ప్రచురించిన పుస్తకంలో, డచ్ సైనికుడు ఒకడు తెలిపిన వివరాలను పొందుపరిచాడు.


నాయిక్కనర్ వింత బావి…

షణ్ముఖ విలాస్ ఎదురుగా, ఒక దారి కనబడుతుంది. ఆ దారిగుండా వెళితే, చివరన ప్రవేశ రుసుము చెల్లించి బావిలోకి దిగే మార్గంగుండా వెళితే, ఈ నాయిక్కనర్ చేరుకుంటాము. సాధారణంగా భక్తులు మొదట సముద్రంలో స్నానం చేసిన తరువాత, ఈ బావిలో స్నానమాచరించి, పొడి బట్టలు ధరించి, స్వామివారి దర్శనానికి వెళుతుంటారు. ఈ కుండాన్ని, తన వేలాయుధంతో సుబ్రహ్మణ్యస్వామివారు స్వయంగా సృష్టించారని ప్రతీతి.


సముద్రాన్ని ఆనుకొని ఉన్నా, నీరు తాగడానికి అనువుగా ఉంటుంది. అంతే కాదు, ఈ బావిలో నీరు – రెండు రకాలుగా ఉంటుంది. మొత్తంగా వ్యాపించి ఉన్న నీరు గంధకం వాసనతో, కాస్తంత ఉప్పగా మురికిగా కనిపిస్తుంది. ఒక మూలకు ఉన్న మరో చిన్ని కుండం 7 అడుగుల లోతు, ఒక అడుగు వేడల్పు కొలతలతో ఉంటుంది. దీనినుండి ఊరే జలం ఉప్పగా ఉండదు. దీనినే నాయిక్కనర్ అంటారు. సరైన నామం స్కంద పుష్కరిణి. ఇందులో స్నానం ముఖ్యంగా పిల్లల స్నానం ఎంతో ప్రసిద్ధి. ఆ చిన్న కుండం నుండి నీరు తోడి భక్తుల స్నానానికి సహాయంగా, ఒక దేవస్థాన ఉద్యోగి ఉంటాడు.

ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ

ఓం శరవణభవ
ఓం శరవణభవ
ఓం శరవణభవ
ఓం శరవణభవ
 ఓం శరవణభవ
ఓం శరవణభవ
ఓం శరవణభవ
ఓం శరవణభవ
ఓం శరవణభవ
ఓం శరవణభవ
ఓం శరవణభవ
ఓం శరవణభవ
ఓం శరవణభవ
ఓం శరవణభవ
ఓం శరవణభవ
ఓం శరవణభవ
ఓం శరవణభవ

Tuesday, January 22, 2019

ఏ రాశి వారు ఏం పారాయణం చెయ్యాలి ?

అన్ని రాశుల వారూ నిత్య పూజలు చేస్తారు. అయితే వారి నక్షత్ర, రాశి ప్రభావాన్ని అనుసరించి ఆయా దేవతలకు ప్రీతి కలిగేలా అర్చిస్తే తక్షణ శుభ ఫలితాలు కలుగుతాయి.

ఇక్కడ ద్వాదశ రాశుల వారూ ఏ ఏ దేవతా స్తోత్రాలు పారాయణ చేస్తే మంచిది అనే విషయం తెలియపరుస్తున్నాము. సాధకులు ఆ విధంగా చేసి శుభ ఫలితాలు పొందెదరు గాక.

మేషం : ఆదిత్య హృదయం

వృషభం : విష్ణు సహస్ర నామ స్తోత్రం

మిధునం : లక్ష్మీ స్తోత్రం, కనకధారాస్తవం

కర్కాటకం : సుబ్రహ్మణ్య స్తోత్రం, స్కంద పురాణమ్, దుర్గా స్తోత్రం

సింహం : మేధో దక్షిణామూర్తి స్తోత్రం, దత్తాత్రేయస్తవం

కన్య : హనుమాన్ చాలీసా, శివ స్తోత్రం, కాల భైరవాష్టకం, గోవింద నామ స్మరణ

తుల : సుందరకాండ, గోవింద నామ స్మరణ, కాల భైరవాష్టకం, హనుమాన్ చాలీసా

వృశ్చికం : దత్తాత్రేయ స్తవం, వామన స్మృతి, మేధో దక్షిణా మూర్తి స్తోత్రం

ధనుస్సు : లక్ష్మీ నరసింహ స్తోత్రం, స్కంద పురాణం, సుబ్రహ్మణ్య స్తోత్రం

మకరం : సంకట విమోచన గణపతి స్తోత్రం, లక్ష్మీ స్తోత్రం, పరాశర స్మృతి

కుంభం : విష్ణు సహస్ర నామ స్తోత్రం, అష్టాక్షరీ మంత్రం జపం

మీనం : సౌందర్యలహరి, శివనామ స్మరణ

వేదములు వాటి ఆవిర్భావము

వేదమనగా – విద్ అను ధాతువు నుండి పుట్టినది. “వేద ఇతీతి వేదః” అనగా తెలియచేయునది వేదమని చెప్పబడును. “విదంతి యతో ధర్మాధర్మమితి వేదః” అనగా దేని సహాయము వలన ధర్మాధర్మములు తెలియబడుచున్నవో అదే వేదము.

శ్రుతి|| శౄయత ఇతి శ్రుతిః|| మరియు
శ్రుతిః|| ఆమ్నాయతే పరంపర ఏత్యామ్నాయః||

అనగా శ్రోత్రేంద్రియమునకు వినబడుటచే శ్రుతియనియూ, గురుశిష్య పరంపరగా తెలియబడునది అయినందున ఆమ్నాయమని చెప్పబడును. శ్రుతి గురువు నుంచి శిష్యుడు వినే దివ్యవాణి. ఆమ్నాయము ఆవృత్తి లేదా మననము ద్వారా నేర్చుకోబడే విద్య. వేదము మొదట్లో ఒక్కటిగానే వుండెను. కృష్ణ ద్వైపాయనుడు వేదమును నాలుగు భాగములుగా విభజించి మానవులకు సులభతరముగా అర్థమయ్యేటట్లు చేసిన మహాఋషి కావడముచేత వేదవ్యాసుడని పేరుగాంచెను. మహాఋషులైన మంత్ర ద్రష్టల శ్రోత్రేంద్రియములకు వినిపించిన వాక్కులే వేదములు. కనుకనే వాటిని అపౌరుషేయములని చెప్పబడినవి. వేదములకు కర్త అనేవాడు ఒకడు లేనందున అనగా పురుష నిర్మితము కానందున అవి అపౌరుషేయములనీ, అనాది అగుటచే ఒక కాలములో పుట్టెననుటకు వీలు కాదనియూ, నిత్యమగుటచే మార్పుచెందునవిగాని నశించునవిగాని కావనియూ, కనుక సర్వకాలములకు, సర్వులకు నిత్యమైన ప్రమాణ గ్రంథరాజములు వేదములు అని స్తుతింపబడుచున్నవి. పరమాత్మకు అన్యముగా వేదములు లేవు మరియు వేదములు పరమాత్మయందే నిక్షిప్తమై ప్రకటమగుచున్నందున ‘నిశ్వాసితం’ – ఈశ్వరుని యొక్క నిశ్వాసములే వేదములని బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పబడినది. వేదములను నిగమములని కూడా అంటారు.

వేదములు నాలుగు:

1) ఋగ్వేదము
2) యజుర్వేదము
3) సామ వేదము
4) అధర్వణ వేదము

వేదము బ్రాహ్మణములు, సంహితలు, అరణ్యకములు అని త్రివిధ భాగములుగా ఉండును.

బ్రాహ్మణములు కర్మ పద్ధతిని తెలియజేయునట్టివి. ఇది వివిధ ఆచారములు వాటిని పాటించే విధముల గురించి వివరించే భాగము.

సంహితలు అనగా భగవంతుని స్తుతించునట్టి స్తోత్రములు. ఇందులో ఇహలోక పరలోక లభ్ధికోసము వివిధ దేవతల గురించి ప్రార్థనలు ఉన్న భాగము. సంహితలలో భక్తి పద్ధతి బోధించబడినది.

అరణ్యకములు అనగా వేదాంతమును బోధించు ఉపనిషత్తులు. అరణ్యకములలోని ఉపనిషత్తులయందు జ్ఞాన పద్ధతి తెలియజేసి బ్రహ్మస్వరూపము ఉపదేశించబడినది. ఉపనిషత్తులనే వేదశిఖరములనియూ, వేదాంతములనియూ అంటారు. ఉపనిషత్తులు వేదములలోని సారాంశాన్ని వివరిస్తాయి.

మొత్తము వేద విజ్ఞానమును ఒక మహావృక్షంగా భావిస్తే బ్రాహ్మణములను ఆ చెట్టు పూలుగా, సంహితలను పచ్చి కాయలుగా, ఉపనిషత్తులను పండ్లుగా వర్ణించవచ్చును. కృష్ణ ద్వైపాయనుడు వేదములను విభజించి తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనే వారికి బోధించాడు. వారు తమ శిష్యులకు బోధించారు. అలా గురుశిష్య పరంపరగా ఈ నాలుగు వేదములు వేల సంవత్సరాలుగా తరతరాలకూ సంక్రమిస్తూ వచ్చాయి. వేదములను ఉచ్ఛరించడములో స్వరానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అన్ని వేదములు కలిపి 1,180 అధ్యాయాలు, లక్ష పైగా శ్లోకాలు ఉండాలని అంటారు. ఒక్కొక్క అధ్యాయమునకు ఒక్కటేసి చొప్పున 1,180 అధ్యాయాలకు 1,180 ఉపనిషత్తులు ఉండేవి. కాని ప్రస్తుతము మనకు లభించిన శ్లోకాలు 20,023 (ఈ సంఖ్య 20,379 అని కూడా అంటారు) కాగా, ఉపనిషత్తులు 108 మాత్రమే లభించినవి. మిగతావి కాలగర్భములో కలిసిపోయాయి.

1) ఋగ్వేదము

ఈ వేదము అన్ని వేదములలో ప్రాచీనమైనదిగా భావిస్తారు. ఈ వేదము మొట్టమొదటిసారిగా పైల మహర్షికి ప్రకటింపబడినది. అగ్ని దేవుడికి అంకితము చేయబడిన ఈ వేదమునకు అధిష్ఠాన దేవత గురువు. ఈ వేదము మొత్తము 10 మండలాలుగా విభజించబడి, 1028 సూక్తములతో 10,552 మంత్రాలతో అలరారుతూ ఉంది. ఈ వేదము మొదటిలో 21 శాఖలుగా విస్తరించి ఉండేది. కాని ఇప్పుడు 5 శాఖలు మాత్రమే దొరుకుతున్నాయి. దేవతా సూక్తములు, ఆత్మ సంబంధిత సూక్తములు, సామాన్య జీవన విధాన సూక్తములు ఇందులో పొందు పరచ బడినాయి.

2) యజుర్వేదము

వైశంపాయన మునికి మొదటి సారిగా ప్రకటించబడిన ఈ వేదము వాయు దేవునికి అంకితము చేయబడినది. అధిష్ఠాన దేవత శుక్రుడు. ఈ వేదము 40 స్కంధములుగా విభజించబడి, 1975 శ్లోకములతో అలరారుతుంది. ఈ వేదమును ‘శుక్ల’ యజుర్వేదము అని, ‘కృష్ణ’ యజుర్వేదము అని రెండు భాగములుగా విభజించారు. వీటిలో శుక్ల యజుర్వేదము ప్రాచీనమైనది. కృష్ణ యజుర్వేదము యాఙ్ఞవల్క్య మునికి ప్రకటించబడినది. యజుర్వేదము మొదట 102 శాఖలుగా ( 85 కృష్ణ, 17 శుక్ల) విస్తరించినప్పటికి, ప్రస్తుతానికి 4 కృష్ణ యజుర్వేద శాఖలు, రెండు శుక్ల యజుర్వేద శాఖలు మాత్రమే మనకు మిగిలాయి. ఈ వేదము ముఖ్యముగా సాంప్రదాయ పద్ధతులు, పూజా విధానములు, బలి మొదలైన వాటిని వివరిస్తుంది. కృష్ణ యజుర్వేదములో ‘తైతిరీయ’, ‘కఠ’ ఉపనిషత్తులు ఉండగా, శుక్ల యజుర్వేదములో ‘ఈశ’, ‘బృహదారణ్యక’ ఉపనిషత్తులున్నాయి.

3) సామ వేదము

ఈ వేదము మొట్టమొదటి సారిగా జైమిని మునికి ప్రకటించబడింది. ఈ వేదమునకు అధిష్ఠాన దేవత అంగారకుడు. ఈ వేదము ఆదిత్యునికి అంకితము చేయబడినది. ఈ వేదము రెండు భాగములుగా విభజించబడింది.

(1) పూర్వార్సిక: 4 స్కంధములలో 585 మంత్రములు కలిగి ఉంది.

(2) ఉత్తరార్సిక: 21 స్కంధములలో 964 మంత్రములను కలిగి ఉంది.

మొత్తం 1564 మంత్రములలో 75 మంత్రాలు ఋగ్వేదము నుంచి గ్రహించబడినాయి. మొదట్లో 1000 శాఖలుగా విస్తరించిననూ ప్రస్తుతానికి 3 శాఖలు మాత్రమే నిలిచి ఉన్నాయి. దైవ ప్రార్థనలు, సంగీతము, శాంతి ప్రార్థనలు ఈ వేదములో మనకు కనపడే విశేషములు.

4) అధర్వణ వేదము

ఈ వేదము మొదటి సారిగా సుమంతు మహామునికి ప్రకటించబడినది. ఆదిత్యునికి అంకితమైన ఈ వేదమునకు బుధుడు అధిష్ఠాన దేవత. ఈ వేదము రెండు భాగములుగా విభజించబడినది.

(1) పూర్వార్థ: అనేక విషయముల పై చర్చ.
(2) ఉత్తరార్థ: వివిధ ఆచారముల పై కూలంకష చర్చ.

అధర్వణ వేదము నాలుగు భాగములుగా విభజించబడి 20 స్కంధములతో 6,077 మంత్రములతో అలరారుతున్నది. మొదట తొమ్మిది శాఖలతో ఉన్న ఈ వేదములో ప్రస్తుతము 2 శాఖలు మాత్రమే లభ్యమవుతున్నాయి. ఈ వేదములో దైవ ప్రార్థనలతో పాటు సృష్టి పరిణామము గురించిన కథలు, భూత, పిశాచ, దుష్ట శక్తులను నివారించటానికి మంత్రములు, మంత్ర విద్య, తంత్ర విద్యలకు సంబంధించిన విషయములు కూడా పొందుపరిచారు. ఇందులో 93 ఉపనిషత్తులు పొందుపరుచబడి ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ‘ప్రశ్న’, ‘మాండూక’, మరియు “మాండుక్య” ఉపనిషత్తులు.

ఈ నాలుగు వేదములు త్రిగుణాత్మకమైనవి. అనగా సత్వరజస్తమోగుణములతో కూడుకొని కర్మ, భక్తి, జ్ఞాన సంబంధమైన పద్ధతులనే బోధించును, కాని వాటికి అతీతమైన పద్ధతిని తెలియచేసి జననమరణ భ్రాంతిరహితమును సూచించు మార్గమును తెలియ చేయలేవని భావము. కనుకనే శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతయందు ఈ క్రింది విధముగా వక్కాణించి వున్నారు.

“శ్లో || త్రైగుణ్య విషయా వేదా | నిస్త్రైగుణ్యో భవార్జున |
నిర్ద్వంద్వో నిత్య సత్త్వస్థో | నిర్యోగ క్షేమ ఆత్మవాన్ ||”

ఉపవేదములు:

ఉపవేదములు మహామునులచే లిఖించబడినవి. వేదములలో ఉన్న ప్రాథమిక జ్ఞాన సంబంధమైన విషయములను ఉపవేదములలో లౌకిక సంబంధమైన ఆచరణాత్మకమైన వ్యాఖ్యానముల ద్వార వివరించుటయే కాక సంపూర్ణమైన లౌకిక అభివృద్ధికి కావలసిన విధివిధానములు ఇందులో పొందుపరచ బడినాయి. వీటిని స్మృతులని కూడా అంటారు. వేదమునకు ఒక్కటేసి చొప్పున నాలుగు వేదములకు నాలుగు ఉపవేదములు కలవు. అవి ఏవి అనగా

(1)  ఆయుర్వేదము
(2)  ధనుర్వేదము
(3)  గంధర్వవేదము
(4)  అర్థవేదము

1) ఆయుర్వేదము (Health):

ఇది ఋగ్వేదమునకు ఉపవేదము. ఇది బ్రహ్మా, అశ్వినీ దేవతలు, ధన్వంతరిలచే రచించబడినది. ఇందులో ఆరోగ్యముగా జీవించుటకు మానవుడు అనుసరించవలసిన విధానములు తెలుపబడినాయి. అవి 4 పద్ధతులు. అవి

1. చరక సంహిత: మహాముని చరకునిచే రచించబడిన గ్రంథము.
2. శుశ్రుత సంహిత: మహాముని శుశ్రుతుని రచన.
3. వాగ్భట్ట సంహిత: మహాముని వాగ్భట్టుని రచన.
4. కామ సూత్రములు: మహాముని వాత్సాయనుని రచన.

2) ధనుర్వేదము (Military Science):

ఇది యజుర్వేదమునకు ఉపవేదము. బ్రహ్మా, శివులచే బోధించబడగా విశ్వామిత్రునిచే ఇది రచించబడినది. ఇది ముఖ్యముగా సైన్య శాస్త్రమునకు సంబంధించినది. మొత్తము నాలుగు భాగములలో ఈ శాస్త్రము యుద్ధములకు సంబంధించిన అన్ని విషయములను చర్చిస్తుంది. ఇందులో వివిధ మారణాయుధములు, మంత్ర యుద్ధ పద్ధతులు, యుద్ధ వ్యూహముల గురించి విపులముగా చర్చించబడినది.

3) గంధర్వ వేదము (Music and Arts):

ఇది సామ వేదమునకు సంబంధించిన ఉపవేదము. దీనిని భరత ముని రచించినాడు. ఈ ఉపవేదము ముఖ్యముగా కళలకు, సంగీతానికి సంబంధించిన శాస్త్రము.

4) అర్థ వేదము (Statecraft):

ఇది అధర్వణ వేదమునకు సంబంధించిన ఉపవేదము. ఇందులో రాజకీయ మరియు అర్థశాస్త్ర సంబంధమైన విషయములు విపులీకరించబడినాయి. అంతేగాక ఇందులో నీతిశాస్త్రము, శిల్పశాస్త్రము మొదలగు చతుష్షష్టి (అరవైనాలుగు) కళలు మరియు ఇంకా అనేక భౌతిక , ప్రాపంచిక విషయములను గూర్చి కూలంకుషముగా చర్చించినారు.

వేదాంగములు (Limbs of the Vedas):
వేదముల అర్ధాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఆరు అంగములను వేదాంగములు అంటారు. ఈ ఆరు అంగములను పూర్తిగా అర్థము చేసికొన్నవారే వేదములను పూర్ణముగా అర్థము చేసికొనగలరు. కనుక వేద సాంప్రదాయము ప్రకారము వేదాభ్యాసానికి ముందుగా ఈ వేదాంగములని నేర్చుకోవాలి. వేదాంగములు ఏవి అనగా?

శ్లో || శిక్షా వ్యాకరణం ఛందో | నిరుక్తం జ్యోతిషం తథా |
కల్పశ్చేతి షడంగాని | వేదస్యాహుర్మనీషిణః ||

శిక్ష
వ్యాకరణము
ఛందస్సు
నిరుక్తము
జ్యోతిషము
కల్పము
ఇవి ఆరు వేదాంగములు అని నిర్ణయము. వీటిని సంక్షిప్తముగా ఈ క్రింది విధముగా చెప్పవచ్చును.

1. శిక్ష: పాణిని శిక్షా శాస్త్రమును రచించెను. ఇది వేదమును ఉచ్ఛరింపవలసిన పద్ధతిని బోధిస్తుంది. వేదములలో స్వరము చాలా ముఖ్యము.

2. వ్యాకరణము: వ్యాకరణ శాస్త్రమును కూడ సూత్ర రూపమున పాణినియే రచించెను. ఇందులో 8 అధ్యాయములు ఉన్నాయి. దోషరహితమైన పదప్రయోగమునకు సంబంధించిన నియమములు అన్నీ ఇందులో చెప్పబడినవి.

3. ఛందస్సు: పింగళుడు “ఛందోవిచితి” అనే 8 అధ్యాయముల ఛందశ్శాస్త్రమును రచించెను. వేద మంత్రములకు సంబంధించిన ఛందస్సులే కాక, లౌకిక ఛందస్సులు కూడ ఇందులో చెప్పబడినవి.

4. నిరుక్తము: నిరుక్త శాస్త్రమునకు కర్త యాస్కుడు రచించెను.  వేద మంత్రములలోని పదముల వ్యుత్పత్తి ఇందులో చెప్పబడినది. పదములన్నీ ధాతువుల నుండి పుట్టినవని యాస్కుని అభిప్రాయము.

5. జ్యోతిషము: వేదములలో చెప్పిన యజ్ఞములు చేయడానికి కాల నిర్ణయము చాలా ముఖ్యము. ఆ కాల నియమములు జ్యోతిషములో ఉంటాయి. లగధుడు, గర్గుడు మున్నగువారు ఈ జ్యోతిష శాస్త్ర గ్రంథములను రచించారు.

6. కల్పము: కల్పశాస్త్రములో యజ్ఞయాగాదుల విధానము, వాటిలోని భేదములు చెప్పబడినవి. అశ్వలాయనుడు, సాలంఖ్యాయనుడు ఈ శాస్త్ర సూత్రములను రచించారు. ఇందులో మూడు భాగములు ఉన్నాయి.

శుశ్రుత కల్ప: భగవంతునికి ఇచ్చే బలి, నైవేద్య పద్దతులు.
శులభ కల్ప : కొలతలు మొదలైన విషయాలను తెలిపే కల్పము.
ధర్మ కల్ప    : నీతి, ధర్మ విషయములకు సంబంధించినది. ధర్మ కల్పములో మొత్తం 18 విభాగములు వున్నాయి. వాటిలో ప్రముఖమైనవి మూడు.
మను స్మృతి: ఈ ధర్మసూత్రములు త్రేతా యుగానికై నిర్దేశించబడినవి.
యాఙ్ఞవల్క్య స్మృతి: ఈ ధర్మసూత్రములు త్రేతా యుగానికై నిర్దేశించబడినవి.
పరాశర స్మృతి: ఈ ధర్మసూత్రములు కలి యుగానికై నిర్దేశించబడినవి.
వైదిక సాంప్రదాయకులు:
మంత్రద్రష్టలైన ఋషులు వేదములలో మానవ సౌభ్రాతృత్వము, అన్యోన్య సహకారము, వసుధయే ఏకైక కుటుంబమను భావములను లోక కళ్యాణము కొరకు బోధించి పురుషార్థములను సాధించు పద్ధతులను తెలియజేస్తే, వారి శృతులయందలి శబ్ద, శబ్దార్థ, లక్ష్య, లక్ష్యార్థములను ఉన్నదున్నట్లుగా గ్రహించలేని వారలు నానా విధముల మతములను తమ తమ బుద్ధి నిశ్చయానుసారముగా ఏర్పరచుకొన్నారు. వైదిక మత సాంప్రదాయకులు వైదిక కర్మలైన యజ్ఞయాగాదులను తు.చ. తప్పకుండా ఆచరిస్తే మోక్షము లభించుననీ, మంత్రాక్షరాలలో గర్భితముగా గొప్ప శక్తి ఉన్నదనీ, ఆ మంత్రోచ్ఛారణతో పుణ్యము చేకూరుననీ, ఆ ఫలితమును మరణానంతరము అనుభవించ వచ్చుననియూ ప్రగాఢంగా విశ్వసిస్తారు. కర్మకాండకు మూలమైన మంత్రములు సర్వశక్తి సంపన్నములని వీరి అభిప్రాయము. ఈ పద్ధతి దేవుని అస్తిత్వమును, విగ్రహారాధనను నిరాకరించినప్పటికినీ ఆనాటి రాజులు, చక్రవర్తులు వైదికులకు అమిత ప్రోత్సాహమును ఇచ్చేవారు. అశ్వమేధ రాజసూయ యాగాదులనే గాక, నరమేధ యాగములను కూడా ప్రోత్సహించేవారు. వేదములను కంఠస్తము చేయడములో, వైదిక మంత్రములను పఠించుటలో ప్రావీణ్యముగల పండితులను విశేషముగా గౌరవించి అగ్రహారములను ఇచ్చి సత్కరించుటయేగాక జీవితాంతము పోషించేవారు. స్వార్థపరులైన కొందరు వైదికులు కర్మకాండకు వక్రభాష్యములను చెప్పుచూ సమాజమును తమ ఆధీనములో ఉండేటట్టు చేయడముతో వేద సంప్రదాయము యొక్క లక్ష్యము నెరవేరకుండా పోయింది. గ్రుడ్డిగా వైదిక మత కర్మలను ఆచరించడమే పరమ లక్ష్యముగా పెట్టుకొన్న ఈ వైదిక పద్ధతులయందు విశ్వాసము లేకపోవుటచే పాశుపత, కాపాలిక, శాక్తేయ, గాణాపత్యాది సాంప్రదాయములు ఎన్నియో క్రమశః శైవ మతము పేరుతో విశేషవ్యాప్తిలోనికి వచ్చినవి. అంతియే గాక వేద ఋషుల భావములతో విభేదించిన వారు నాస్తిక, భౌతిక, శూన్యాది వాదములను వేదకాలము నాటికే లేవనెత్తిరి.

ప్రస్థానత్రయము:
ఉపనిషత్తులు.
భగవద్గీత.
బ్రహ్మ సూత్రములు
ఇవి మూడు ప్రస్థానత్రయము అని చెప్పబడును.

1. ఉపనిషత్తులు:

ఉపనిషత్తులు జ్ఞాన పద్ధతిని తెలియజేసి బ్రహ్మ స్వరూపమును ఉపదేశించు పవిత్ర గ్రంథములని నిర్ణయము. అవి 1180. అనేక ఋషి పుంగవుల తత్వవిచారణలు అనేక కోణములలో ఉపనిషత్తులందు చెప్పబడినవి. వారి ఆలోచనా విధానములు భిన్న భిన్నములుగా వుండుటచే అనేక మతములు ప్రవర్తిల్లినవి. ఆయామతముల వారు కొన్ని ఉపనిషత్తులనే ప్రామాణికముగా తీసుకొందురు. ఎందుకనగా? మిగతా వాటిలో వారి మత సిద్ధాంతమునకు వ్యతిరిక్తమగు శృతులు ఉండుటయే కారణము. ప్రస్తుతము 108 ఉపనిషత్తులే లభించుచున్నవి. మిగతా ఉపనిషత్తులు కాలగర్భములో కలిసిపోయినవి.

2. భగవద్గీత:

శ్రీ కృష్ణ పరమాత్మ వేదోపనిషత్తుల పూర్ణ సారమును అర్జునునికి భగవద్గీత రూపములో ప్రబోధించెను. ఇందులో శ్రీ కృష్ణ పరమాత్మ కర్మ, జ్ఞాన పద్ధతులను సమన్వయ పరచి దాని యొక్క ఏక రూపమే భక్తియని నిర్ణయించి ‘నిష్కామ కర్మ’ను ప్రతిపాదించెను. జ్ఞానమును విడిచి కర్మము, కర్మమును విడిచి జ్ఞానము లేదని, జ్ఞానమే కర్మమని మరియు కర్మమే జ్ఞానమని తెలిపి, జన్మ రహిత విధానమునకు కర్తృత్వరహిత కర్మాచరణ పద్ధతియే ముఖ్యమని తెలియపరచెను. పదునెనిమిది అధ్యాయములలోఈ పదునెనిమిది యోగముల ద్వారా అఖండరూప అధిష్ఠాన బ్రహ్మమునకు సంయోగము చేసి, జడచేతనములచే నరుకబడని అచల పరిపూర్ణ పరబాహ్యమును తెలిపి, కర్తృత్వరహిత కర్మాచరణయను అస్పర్శయోగమును బోధించి, అంత్యమునందు మోక్ష సన్యాసమును ప్రతిపాదించి, స్థితప్రజ్ఞత్వమును కలుగ చేసెను. “అహం పదార్థ రహిత”మే జననమరణ భ్రాంతి రహితమని సిద్ధాంతీకరించెను. త్రిగుణస్వామ్యమైన బ్రహ్మమునకు అతీతమైన అచల పరిపూర్ణ పరబ్రహ్మమే నిత్యమై సత్యమై ఉన్నదని, అట్టి పరమ రహస్యమును అచల పరిపూర్ణ గురువులచే గ్రహించినచో జన్మ రహితము కాగలదని నిర్ణయించినారు. ఇదే రాజఋషుల సాంప్రదాయము. ఇదే గుహ్యాతిగుహ్యమైన రాజయోగ సిద్ధాంతము.

3. బ్రహ్మసూత్రములు:

వివిధ ఉపనిషత్తులను బోధించిన ఋషి సాంప్రదాయముల బోధనా విధానములు వేరు వేరుగా వున్నందున వాటిని సమన్వయము చేయుట కొరకు వ్యాస మహర్షి ‘ఉత్తర మీమాంస’ అనబడు ‘బ్రహ్మసూత్రముల’ను రచించెను. వేదోపనిషత్తుల సారమును తనకు తెలిసిన బాణిలో “జన్మాద్యస్య యతః” అని చెప్పి సృష్టికి కారణము బ్రహ్మమేనని సూత్రీకరించెను. “ఆత్మకృతే పరిణామాత్” అనగా జగత్తు ఆత్మ యొక్క పరిణామమేననియూ “అదృశ్యత్వాది గుణకో ధర్మోక్తేః” అనగా అదృశ్వత్వాది గుణములుగల సకల సృష్టికి కారణము బ్రహ్మమేనని సూచించెను. కాని బ్రహ్మ సూత్రముల యందు అచల పరిపూర్ణ బ్రహ్మమును గూర్చి ఎందుకు చెప్పబడలేదనగా? వ్యాసుడు బ్రహ్మ ఋషి సాంప్రదాయ ప్రవర్తకుడు, కనుక వ్యాసుడు బ్రహ్మము వరకు తెలిసికొని ఉన్నాడుగాని అచల పరిపూర్ణ బ్రహ్మము గూర్చి తెలిసికొనలేదు. అచల పరిపూర్ణ బ్రహ్మమును గూర్చి బోధించు పూర్ణ బోధ రాజ ఋషుల వద్ద ఉన్నది. కనుకనే తన కొడుకైన శ్రీ శుకుడికి కలిగిన సందేహమును తీర్చుటకు అతడిని జనక రాజర్షి దగ్గరికి పంపించెను. జన్మతః విరాగియైన శ్రీ శుకుడు తన తండ్రి వ్యాసునిచే రచించిబడిన అన్ని గ్రంథములను చదివిననూ, తండ్రిగారి బోధలను విన్ననూ ఆత్మ స్వరూపము సంపూర్తిగా అవగతము కాకపోవుటచే జనక రాజర్షిని ఆశ్రయించి పూర్ణబోధను గ్రహించి చిత్త విశ్రాంతిని పొంది జననమరణ భ్రాంతి రహితము చేసికొనుటయేగాక, గురువాజ్ఞచే సృష్టికి విరుద్ధముగాని గృహస్థాశ్రమమును స్వీకరించి లోకమంతటికి ఆదర్శప్రాయమైన జీవితమును గడిపెనని దేవీ భాగవతము మొదటి కాండమునందు తెలుపబడివున్నది.

దర్శనములు:
వేదభాగములయందు న్యాయాన్యాయములు, సార్థకనర్థములు, మారణ మోహన స్థంబన ఉచ్చాటన క్రియలు మరియు యజ్ఞదానాది క్రియలు గలవు. వేదమునందలి విషయాదులను పునస్కరించుకొని

అక్షపాదమనే న్యాయ దర్శనము
వైశేషికమనే అణువాద దర్శనము
సాంఖ్యమనే తత్వ దర్శనము
యోగ యోగాంగముల నిర్మితమగు యోగ దర్శనము
సత్వరజస్తమో గుణముల ఆచరణ విధానముగల కర్మ సూత్ర దర్శనము
బ్రహ్మనిర్మాణమునకు బ్రహ్మ సూత్రములచే బ్రహ్మ తత్వ దర్శనము
నిర్ణయింపబడినవి. వీటికే షడ్దర్శనములని పేరు. వేదమునందలి ఆర్ష విద్యలకు దేశ, కాల, పద్ధతులననుసరించి మార్పులు చెందుచుండును. కనుకనే వేద నిర్మితములు ఇన్నియని లెక్కించి నిర్మించుటకు విధి లేక వేద ధర్మములు అనంతములని చెప్పబడును.

కుంభ మేళ అంటేఏమిటి

మహా కుంభమేళ 144 సంవత్సరములు ఒకసారి
పూర్ణ కుంభమేళా 12 సంవత్సరములకు ఒకసారి
అర్థ కుంభమేళా 6 సంవత్సరములకు ఒకసారి
కుంభమేళ 3 సంవత్సరం లో ఒకసారి
.
మహా కుంభ మేళ అంటే ఏంటి? అసలు దాని చరిత్ర ఏంటి? ప్రతి 12 యేళ్ళకు ఒకసారి నిర్వహించే ఈ ఆధ్యాత్మిక మహా మేళా విశేషాలను లోతుగా పరిశీలిస్తే.. కుంభం అనగా కుండ లేదా కలశం. భారతీయ ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశి (కుంభ రాశి). మేళా అంటే కలయిక లేదా జాతర. కుంభ రాశిలో నిర్వహించే ఉత్సవం కావడంతో దీన్ని కుంభమేళాగా పిలుస్తారని హిందూధర్మ శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

వేదకాలం నుంచి కుంభమేళాను నిర్వహిస్తున్నట్టు పురాణాలు చెపుతున్నాయి. పురాణాల్లో గమనిస్తే భాగవతంలోని క్షీర సాగర మథనంలో కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన వస్తుంది. క్షీర సాగర మథనంలో ఉద్భవించిన అమృతానికై దేవతలు, రాక్షసుల మధ్య దేవ - దానవ సంగ్రామం జరిగింది. ఆ సమయంలో మహావిష్ణువు ఈ అమృతాన్ని తీసుకొని వెళుతూ అలహాబాద్‌, హరిద్వార్‌, ఉజ్జయిని, నాసిక్‌లలో కొన్ని అమృతపు చుక్కలు జారి విడిచినట్టు పురాణాలు చెపుతున్నాయి.

అందుకే ఈ నాలుగు ప్రదేశాలలో ఒక చోట ప్రతి మూడేళ్లకు ఒకసారి కుంభమేళా వేడుకలను నిర్వహిస్తుంటారు. అంటే ప్రతి పన్నెండేళ్లకు ఒక సారి ఒక పట్టణంలో కుంభమేళా వేడుకలు నిర్వహిస్తారు. ఆరేళ్లకు ఒకసారి జరిగే దాన్ని అర్థ కుంభమేళా అని.. 12 యేళ్లకు ఒకసారి జరిగే వేడుకలను పూర్ణ కుంభ మేళా అని, 144 ఏళ్లకు ఒకసారి జరిగే వేడుకలను మహా కుంభ మేళా అని పిలుస్తారు.

సూర్యుడు, బృహస్పతి గతుల స్థానాల ఆధారంగా ఈ వేడుకను నిర్వహిస్తుంటారు. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్‌లోని త్రయంబకేశ్వర్‌లోనూ, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్‌లోనూ, బృహస్పతి వృషభ రాశిలోనూ ఇంకా సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు అలహాబాద్‌ ప్రయాగలోనూ, బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోనూ కుంభమేళా నిర్వహిస్తారు. చివరగా 2010 జనవరి - మార్చిలో హరిద్వార్‌లో పూర్ణకుంభమేళాను నిర్వహించారు.

ఎక్కడైతే ఈ మేళా నిర్వహిస్తారో అక్కడ నదీ జలాలతో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తుంటారు. వేల పంఖ్యలో సాధువులు, సన్యాసులు హాజరు కావడం ఈ మేళా ప్రత్యేకత. పురాతన సాంప్రదాయాలను ప్రతిబింభించేలా ఈ సాధువులు వొళ్లంతా విబూది రాసుకొని ఉంటారు. నాగ సన్యాసులనే సాధువులు దిగంబరులై కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణ. ఇప్పటివరకూ అత్యధికంగా నాసిక్‌ కుంభమేళాలో 7.5కోట్ల మంది పాల్గొన్నారు. ఈ దఫా ఈ సంఖ్య పది కోట్లకు పైగానే ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ కుంభమేళాలో కొన్ని రోజులను అత్యంత పవిత్రమెనవిగా భావిస్తారు. వీటిలో ఈ యేడాది జనవరి 14వ తేదీన వచ్చిన మకర సంక్రాంతి, 27వ తేదీన వచ్చే పౌర్ణమి, ఫిబ్రవరి 6న వచ్చే ఏకాదశి రోజు, 10న వచ్చే అమవాస్య, 15న కనిపించే వసంత పంచమి, 17న రథ సప్తమి రోజు, 18న భీష్మాష్టమి, 25వ తేదీ మాఘ పౌర్ణమి రోజుల్లో ఎక్కువ మంది భక్తులు పవిత్ర పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు.
.
కుంభమేళ
ఈ నాలుగు చోట్లే ప్రయాగ (అలహాబాద్), హరిద్వార్ (ఉత్తరప్రదేశ్), నాసిక్ (మహారాష్ట్ర), ఉజ్జయిని(మధ్యప్రదేశ్). అందుకే ఈ నాలుగుచోట్ల కుంభమేళాలు జరుగుతాయి.ప్రతీ 3 ఏళ్ల కొకసారి కుంభమేళ జరుగుతుంది. అంటే ఒక్కోచోట ప్రతి 12 ఏళ్ళకొకసారి కుంభమేళ జరుగుతుంది.

చరిత్ర,విశిష్టత

కుంభం అనగ కుండ అంటే కలశం అని అర్థం. ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశి. మేళ అంటే కలయిక లేదా జాతర అని అర్థం. కుంభరాశిలో నిర్వహించే ఉత్సవం కావడంతో దీనిని కుంభమేళ గా పిలుస్తారని హిందూధర్మ శాస్త్రాలు తెలుపుతున్నాయి.

ఎందుకంటే తానో బహిర్గతంగా జీవం వున్నవాడుగా. ఇప్పుడు మనం కుంభమేళా గురించి తెలుసుకుని,ఆనందించి జీవిత విధివిధానంలో మన పాత్రేమిటో తెలుసుకుందాం.
.
మహాక్రతువు

దేశం నలుమూలలనుంచే కాక,ప్రపంచం అంతట్నుంచీ తండోపతండాలుగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలాచరించే మహాక్రతువు కుంభమేళా. త్రివేణీ సంగమ క్షేత్రంలో జరిగే మహాక్రతువు కుంభమేళా.

ప్రయాగ
ప్రాణికోటి మనుగడకు నీరే ఆధారం. హిందూ సంస్కృతిలో నదులన్నిటినీ దేవతలుగా భావిస్తారు. మన దేశంలో వున్న 7 ముఖ్యమైన తీర్ధ క్షేత్రాలలో ఒకటి ప్రయాగ.

త్రివేణీ సంగమం
ప్రయాగ అంటే ప్రకృష్టమైన యాగం చేసే స్థలం అని అర్ధం.గంగ,యమునా,సరస్వతి నదులు ఈ క్షేత్రంలోనే సంగమించటం వల్ల దీనికి త్రివేణీ సంగమం అని పేరు వచ్చింది.

పుణ్య స్నానాలు
దేశం నలుమూలల నుంచే గాక ప్రపంచం అంతటినుంచీ తండోపతండాలుగా వచ్చి భక్తులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరించే మహాక్రతువు కుంభమేళా.

గంగానదీ
కనుక దీన్నిబట్టి నదినీటినీ,అందులోను గంగా నదినే మనం ప్రథమంగా స్మరిస్తాం. సమస్త దేవతలూ నివశించే స్థలం జలం. మన శరీరంలో నీటి శాతమే ఎక్కువ. పావనత్వం,కోమలత్వం,శీతలత్వం గంగానదీ నీటి యొక్క ప్రత్యేకత.

సరస్వతీ నది
విష్ణువు పాదాల నుంచి నేరుగా భూమి పైకొచ్చిందని దీనిలో స్నానం ఆచరిస్తే హిందువుల యొక్క పవిత్రమైన భావన. ప్రయాగలో గంగా యమునా నదులు ప్రవహిస్తూవుంటాయి. అంతర్వాహినిగా సరస్వతీ నది కూడా ప్రవహిస్తూవుంది

త్రివేణీ సంగమ తీరం
అందుకే ఈ తీరాన్ని త్రివేణీ సంగమ తీరంగా పిలుస్తూంటాం.పర్వదినాలలో ఈ నదిలో స్నానమాచరిస్తే పాపాలకు విముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.అంతేకాకుండా కుంభమేళాలో పుణ్యస్నానం చేస్తే మోక్షం లభిస్తుందని పునర్జన్మ వుండదని భక్తులు విశ్వశిస్తారు.

అమృతం
అయితే ఈ కుంభమేళా ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం. కుంభమేళా కు హిందూ పురాణాలలో ప్రత్యేక కధనం వుంది. అసురులచేతుల్లో సర్వం కోల్పోయిన ఇంద్రుడు తిరిగి పూర్వ వైభవం కోసం విష్ణువునాశ్రయిస్తాడు. అమృతం కోసం సాగర మధనం చేయాలని దానితో తిరుగుండదని విష్ణువు సలహా ఇస్తాడు

అమృత కలశం
దేవదానవులు సముద్రమథనం చేస్తుండగా అమృత కలశం ఒకటి బయటికొస్తుంది. అమృతం కోసం దేవదానవులు 12 రోజులు,12 రాత్రులు అంటే మనుష్యుల ప్రకారం 12సంవత్సరాలు.ఘోరయుద్దం చేశారు.

విష్ణువు
దీనిని రాక్షసులు గనక తాగితే అజేయులౌతారని భావించిన రాక్షసులు మహా విష్ణువును ప్రార్థించగా స్వామి మోహినీ అవతారం ఎత్తుతారు.విష్ణువు చేతిలోని కలశం నుండి నాలుగు అమృతపు చుక్కలు అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లలోని పుణ్యనదులలో పడ్డాయని భాగవతం, విష్ణు పురాణం, మహాభారతం, రామాయణం తదితరాల పురాణాల కధనం

సాగరమథనం
మరో కధ కూడా వుంది. సాగారమథనంలో ఉద్భవించిన అమృతకలశాన్ని మోహినీ అవతారంలో విష్ణువు తన వాహనమైన గరుడునికిచ్చి బద్రపరచమంటాడు.గరుడుడు తన కలశాన్ని తీస్కువెళ్తుండగా 4 చోట్ల ఈ చుక్కలు పడతాయట.

కుంభమేళ
ఈ నాలుగు చోట్లే ప్రయాగ (అలహాబాద్), హరిద్వార్ (ఉత్తరప్రదేశ్), నాసిక్ (మహారాష్ట్ర), ఉజ్జయిని(మధ్యప్రదేశ్). అందుకే ఈ నాలుగుచోట్ల కుంభమేళాలు జరుగుతాయి.ప్రతీ 3 ఏళ్ల కొకసారి కుంభమేళ జరుగుతుంది. అంటే ఒక్కోచోట ప్రతి 12 ఏళ్ళకొకసారి కుంభమేళ జరుగుతుంది.

చరిత్ర,విశిష్టత
కుంభం అనగ కుండ అంటే కలశం అని అర్థం. ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశి. మేళ అంటే కలయిక లేదా జాతర అని అర్థం. కుంభరాశిలో నిర్వహించే ఉత్సవం కావడంతో దీనిని కుంభమేళ గా పిలుస్తారని హిందూధర్మ శాస్త్రాలు తెలుపుతున్నాయి.

Sunday, January 20, 2019

సాలగ్రామం’ ఎన్ని రకాలో మీకు తెలుసా?


'సాలగ్రామం' సాక్షత్ విష్ణుస్వరూపం. దీనిని అభిషేకించిన పుణ్యజలాన్ని ప్రోక్షించుకుంటే సర్వపాపాలు నశిస్తాయి. సర్వరోగాలు నశించి, సకల సంపదలు లభిస్తాయి. సర్వశుభాలు కలిగి మోక్షప్రాప్తి  కలుగుతుందని ఋషివాక్కు. విష్ణుభగవానుడు ‘సాలగ్రామం’ అనే రాయి రుపాన్ని ధరించడం వెనుక అనేక కధలున్నాయి. అందులో ముఖ్యమైనది బృంద కథ. కాలనేమికి జన్మించిన బృంద జలంధరుడు అనే రాక్షసుడిని పెళ్ళాడుతుంది. ఆమె మహాపతివ్రత. కానీ, జలంధరుడు తన రాక్షస ప్రవృత్తిలో అందరిని పీడిస్తుంటాడు. అతను ఎంతవరకు వెళ్ళాడంటే, ఒకానొకప్పుడు శివుని రూపంలో వెళ్ళి పార్వతీదేవిని మోసగించబోతాడు. అందుకు కోపగించిన పార్వతీ దేవి విష్ణువును సమీపించి బృంద పాతివ్రత్యాన్ని భంగపరచమని కోరుతుంది. బృంద పాతివ్రత్య భంగం సకల లోకాలకు అవసరంకూడా. ఎందుకంటే ఆమెకి ఆ భంగం కలిగితేనే జలంధరుని అంతం జరుగుతుంది. సకల లోకాల క్షేమం కోరి విష్ణుభగవానుడు జలంధరుని రూపాన్ని ధరించి బృందని మోసగిస్తాడు. అనంతరం తన నిజరూపాన్ని ప్రకటిస్తాడు. జరిగిన మోసానికి నివ్వెరపోయిన బృంద విష్ణుమూర్తిని శిలగా మారతావని శపిస్తుంది. అలా శ్రీవిష్ణుభగవానుడు సాలగ్రామ రూపాన్ని ధరించాల్సి వచ్చిందని కథ.

సాలగ్రామ శిలలు గండకీనదిలో లభిస్తుంటాయి. ఇవి ఎంత చిన్నవిగా ఉంటే అంత మంచిదని అంటారు. సాలగ్రమంపై ఉన్న చక్రాలను బట్టి వాటిని వివిధ పేర్లతో పిలుస్తుంటారు.

ఒక చక్రం  ఉంటే సుదర్శనమని,

రెండు చక్రాలు ఉంటే లక్ష్మీనారాయణ అని,

మూడు చక్రాలు ఉంటే అచ్యుతుడనీ,

నాలుగు చక్రాలు ఉంటే జనార్ధుడు అనీ,

ఐదు చక్రాలు ఉంటే వాసుదేవుడనీ,

ఆరు చక్రాలు ఉంటే ప్రద్యుమ్నుడనీ,

ఏడు చక్రాలు ఉంటే సంకర్షణుడు అనీ,

ఎనిమిది చక్రాలు ఉంటే పురుషోత్తముడు అనీ

తొమ్మిది చక్రలు ఉంటే నవవ్యూహమని

పది చక్రాలు ఉంటే దశావతారమనీ,

పదకొండు చక్రాలు ఉంటే అనిరుద్ధుడు అని,

పన్నెండు చక్రాలు ఉంటే ద్వాదశాత్ముడు అనీ,

పన్నెండు కంటే ఎక్కువ చక్రాలు ఉంటే అనంతమూర్తి అని పిలుస్తుంటారు.

సాలగ్రామన్ని ఆవుపాలతోగానీ, పంచామృతంతోగానీ శుద్ధి చేసి, రుద్రాక్షధారణ చేసేటప్పుడు చేసే నియమాలతో సాలగ్రామాన్ని పూజించాలి. ఇంట్లో  పూజించే సాలగ్రామానికి నిత్యం నైవేద్యం సమర్పించాలి. కుటుంబసభ్యులు తప్ప, మిగతావాళ్ళకి సాలగ్రామన్ని చుపించకూడదు. సాలగ్రామన్ని స్త్రీలు తాకరాదన్న నియమం ఉంది. సాలగ్రామం ఉన్న ప్రదేశంలో స్నానం చేసినా, దానం చేసినా కాశీక్షేత్రంలో చెసిన స్నాన, దానాల కంటే నూరురెట్లు ఫలితం కలుగుతుందనేది ఋషివాక్కు. సాలగ్రామ శిలకు షోడశోపచార పూజ చెస్తే అన్ని కల్పాంతాల వరకు వైకుంఠంలో నివసించే భాగ్యం కలుగుతుంది. సాలగ్రామ పూజ చేస్తే శివకేశవులను పూజించిన ఫలితం కలుగుతుంది. మంత్రాలేమి తెలియక పోయినప్పటికీ భక్తి విశ్వాసాలతో సాలగ్రామం పూజను చెస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సర్వపాపహరం చేసేది, సర్వకష్టాలనుంచి రక్షించేది సాలగ్రామం.

Saturday, January 19, 2019

దశ_మహావిద్య


తొలి మహా విద్య శ్రీకాళీదేవి...

కృష్ణ వర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్రేయసంప్రదాయం చెబుతోంది. తంత్రోక్త మార్గంలో శ్రీకాళీ మహా విద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రు నాశనం, దీర్షాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది.

2వ మహావిద్య శ్రీ తారాదేవి

దశ మహావిద్యలలో రెండవ మహా విద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈ దేవిని నీలసరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధనవల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది.

3వ మహా విద్య శ్రీషోడశీదేవి

అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీషోడశీదేవి దశమహావిద్యలలో 3వ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది. పరమ శాంతి స్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిరమాస పూర్ణిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపురసుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆసాధకుడికి అన్నిరకాల కష్టనష్టాలనుంచి విముక్తి మానసికశాంతి, భోగం, మోక్షం కలుగుతాయి.

4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి

దశ మహావిద్యలలో 4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమీ తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యధికారాన్ని సమస్త సిద్దుల్ని సకల సుఖభోగాల్ని ఈదేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు.

5వ మహావిద్య శ్రీ త్రిపుర భైరవీ దేవి

దశమహావిద్యలలో 5వ మహా విద్య వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవీ దేవి. ఈ దివ్యశక్తి స్వరూపిణికి మాఘమాసం పూర్జిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఆర్తత్రాణ పారాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సకల సుఖభోగాలను పొందే శక్తి, సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్షప్రాప్తి సాధకుడికి కలుగుతుంది.

6వ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి

దశ మహావిద్యలలో 6వ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి. ఈ దేవినే వజ్ర వైరోచినీ, ప్రచండ చండీ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. శాక్తేయ సంప్రదాయంలో భిన్నమస్తాదేవికీ ఎంతో ప్రశస్తివుంది. ఈ దేవిని నిష్టతో ఉపాసిస్తే సరస్వతీసిద్ధి, శత్రువిజయం, రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాలనుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, ఎటువంటి కార్యాలనైనా ఆవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది.

7వ మహావిద్య శ్రీ ధూమవతీ దేవి

దశ మహావిద్యలలో 7వ మహావిద్య.. ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతి దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధనవల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది.

8వ మహావిద్య శ్రీ జగళాముఖీ దేవి

దశమహావిద్యలలో 8వ మహావిద్య.. పసుపు వర్ణంతో ప్రకాశించే
శ్రీ జగళాముఖీ దేవికి చెందింది. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ మహాదేవికి వైశాఖమాస శుక్లపక్ష అష్టమీతిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.

9వ మహావిద్య శ్రీ మాతంగీదేవి

దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య.. మరకతమ వర్ణంతో ప్రకాశించే
శ్రీ మాతంగీదేవి కి చెందింది. వశీకరణ దేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖమాసం శుక్లపక్ష తృతీయాతిథి ప్రీతిపాత్రమైనది. రాజమాతంగీ, లఘుశ్యామలా, ఉచ్చిష్టచండాలి, అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తుంటారు. ఈ దివ్య స్వరూపిణి ఉసాసనవల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణాశక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి.

10వ మహావిద్య శ్రీ కమలాత్మికాదేవి

పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశ మహావిద్యలలో 10వ మహావిద్యగా ప్రశస్తిపొందింది. సకల ఐశ్వర్య ప్రదాయిని అయిన ఈదేవికి మార్గశిరే అమావాస్యతిథి ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక లక్ష్మీస్వరూపిణి అని అర్థం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది.

Thursday, January 17, 2019

షోడశ_సంస్కారాలు



సంస్కారములు హిందూ సాంప్రదాయములో ఆగమ సంబంధమయిన క్రియలు. ఇవి ప్రతి హిందువు యొక్క జీవిత పర్యంతమూ వివిధ దశలలో జరుపబడతాయి. స్త్రీ, పురుష సమాగమము మొదలుకొని, జననము, మరణము మరియు తదనంతరము ఆత్మ పరలోక శాంతి నొందుట వరకు సంస్కారములు జరపబడును.

సంస్కారములు మొత్తము పదహారు. వీనినే షోడశ సంస్కారములు అని కూడా వ్యవహరించెదరు. ఈ పదహారు సంస్కారములను తిరిగి రెండు విభాగముల క్రింద విభజించారు. అవి జనన పూర్వ సంస్కారములు (పుట్టుకకు ముందు), మరియు జననానంతర సంస్కారములు (పుట్టిన తరువాత). మొదటి మూడు సంస్కారములు జనన పూర్వ సంస్కారములు, ఆపై పదమూడు సంస్కారములు జననానంతర సంస్కారములు.

వ్యక్తి జీవితంలోని వివిధ దశల్లో జరిపే సంస్కారాలు:

గర్భాదానము

స్త్రీ పురుష తొలి సమాగమ సందర్భములో మంచి పుత్రుని ఆశించి జరిపే కార్యక్రమము ఇది. ఈ సందర్భములో చదివే మంత్రాలు సత్సంతానాన్ని (పురుష) ఆ దేవుని కోరుకుంటున్నట్లుగా తెలియజేస్తాయి.

పుంసవనం

స్త్రీ గర్భం ధరించినట్లు రూఢి అయిన తర్వాత ఆమెకు కొడుకు పుట్టాలని చంద్రుడు పురుషరాశిలో ఉన్నప్పుడు జరిపే సంస్కారం. గర్భిణీ స్త్రీ ఆ రోజంతా ఉపవాసముంటుంది. ఆ రాత్రికి మొలకెత్తిన మర్రి విత్తనాలను నూరి ఆ రసాన్ని "హిరణ్యగర్భ:..." అని మంత్రాలు చదువుతూ ఆమె కుడి ముక్కులో వేస్తారు. చంద్రుడు పురుష రాశిలో ఉన్నప్పుడు ఇలా చేయడం ద్వారా దృఢకాయుడు, ఆరోగ్యవంతుడైన కొడుకు పుడతాడని నమ్మకం.

ఇది మరియు సీమంతోన్నయనం గర్భాన్ని రక్షించుకొనుటకు చేసే సంస్కారములు. కావున ఈ రెండు గర్భా కాలమునందే చేయవలెను. పుంసవనముగర్భము ధరించిన మూడవ మాసములో మొదటి పదిరోజులలో చేయవలెను. ఈ కార్యక్రమములో మఱ్ఱిపండ్లను మినుములతో, యవలతో కలిపి గర్భిణికి వాసన చూపించెడి వ్యవస్థ యున్నది. దీనివలన యోనియందున్న దోషములు తొలగి గర్భరక్షణ శక్తి కలుగునని సుశ్రుతము మొదలగు ఆయుర్వేద శాస్త్రములందు చెప్పబడియున్నది. మోక్షమునకు ఉపయోగపడే ఉత్తమ స్థూల శరీరమును పొందు లక్ష్యముతోనే ఈ పుంసవన సంస్కారము నిర్ణయించబడింది.

సీమంతం

తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షును కోరుతూ చేసేది. కడుపులోని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి శారీరక, మానసిక ఉల్లాసం ఎంతో అవసరం. అందుకోసం ఆమె, ఆమె భర్త పాటించవలసిన నియమాలు ఈ సంస్కారంలో భాగంగా ఉన్నాయి. వాటిలో ఒకటి దోహదం (అంటే గర్భిణీ స్త్రీ భర్త ఆమె కోరిక ఏమిటో తెలుసుకుని తీర్చడం). సీమంతం అంటే పాపిడి తీయడమని అర్థం. అంటే ఆ సమయంలో భర్త ఆమెను అంత అపురూపంగా చూసుకోవాలని అర్థం.

జాతకర్మ

బొడ్డుతాడు కోసే ముందు చేసే సంస్కారాలు. దీంట్లో భాగంగా జరిపే తంతులు చాలా ఉన్నాయి:

మేథాజనన: బలానికి, తెలివితేటలకు ప్రతీకలైన నెయ్యి, తేనెలనుఒక సన్నని బంగారుదారంతో శిశువు నోటికందిస్తారు. దీన్ని పిల్లల పట్ల తాము నెరవేర్చవలసిన మొట్టమొదటి బాధ్యతగా వారు భావిస్తారు. హిందువులు పిల్లల తెలివితేటలకు ఎంత ప్రాధాన్యతనిస్తారో దీని ద్వారా మనకు తెలుస్తుంది.ఆయుష్య: దీర్ఘాయుష్షును కలిగించే ఋషులు, పితృదేవతలు, అగ్ని, సోములను ఆవాహన చేసే మంత్రాలను శిశువుముందు చదువుతారు.శక్తి: తండ్రి బిడ్డ చెవిలో "త్వం...శతమానం భవతి:" అని ఆ శిశువుకు చెబుతాడు. అప్పుడు బొడ్డుతాడు కోసి, శిశువును శుభ్రం చేసి, చనుబాలు పట్టిస్తారు.

నామకరణం అనగా పేరు పెట్టడం. ఆడ, మగ పిల్లలకు పెట్టవలసిన పేర్లకు సంబంధించిన నియమాలను గృహ్యసూత్రాలు పేర్కొన్నాయి. పరాశర గృహ్యసూత్రాల ప్రకారం పేరు రెండు లేక నాలుగు అక్షరాల పొడవుండి హ్రస్వ అచ్చుతో కూడిన హల్లుతో మొదలై చివర్లో దీర్ఘం కానీ విసర్గం కానీ ఉండాలి. వేర్వేరు గృహ్యసూత్రాల్లో ఈ నియమాలు వేర్వేరుగా ఉన్నాయి. ఆడపిల్ల పేరు బేసి అక్షరాలుండి పేరు చివర అ ఉండాలి.

పేరు పెట్టడానికి నాలుగు పద్ధతులున్నాయి:

మొదటిది జన్మనక్షత్రాన్ని బట్టి;రెండవది పుట్టిన నెల/రాశ్యధిపతిని బట్టి;మూడవది ఇలవేలుపును బట్టి;నాలుగవది అందరూ పిలిచే పేరును బట్టి.

చివరి పద్ధతి కుటుంబ సంప్రదాయాన్ని బట్టి, విద్యాస్థాయిని బట్టి ఉంటుంది. ఐతే లేకలేక కలిగిన సంతానానికి, కుటుంబంలో చాలామంది పిల్లలు చనిపోయాక పుట్టినవారికి దుష్టశక్తుల్ని దూరంగా ఉంచడం కోసం విడ్డూరంగా ఉందే పేర్లను పెడతారు.

నిష్క్రమణ

బిడ్డను మొదటిసారిగా ఇంట్లోనుంచి బయటికి తీసుకురావడం. అప్పటివరకూ ఇంట్లోనే పెరిగిన బిడ్డ మొదటిసారిగా బయటి ప్రపంచంలో అడుగుపెడుతున్నప్పుడు ఆ బిడ్డను బలమైన ప్రకృతిశక్తులనుంచి, అతీత శక్తుల బారి నుంచి కాపాడడానికి చాలా జాగ్రత్తలు (అధిభౌతికమైనవి, ఆధ్యాత్మికమైనవి) తీసుకోవాలి. అందుకే ఈ సంస్కారం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు.

* అన్నప్రాసన*

మొదటిసారిగా ఘనాహారం తినిపించడం (సాధారణంగా ఆరో నెలలో) అన్నప్రాశన. పెరుగుతున్న బిడ్డ భౌతికావసరాలను తీర్చడానికి అవసరమైన అతి ముఖ్యమైన ప్రక్రియ. సుశ్రుతుడు కూడా ఆరవనెలలో బిడ్డ చేత తల్లిపాలు మానిపించి ఘనాహారం ఇవ్వాలని పేర్కొన్నాడు. ఇందుకవసరమైన ఆహారాన్ని కూడా వేదమంత్రోచ్చాటనల మధ్య పరిశుభ్రమైన పాత్రల్లో వండుతారు. ఒక్కో రకమైనగుణాన్ని పెంపొందించడానికి ఒక్కో రకమైన ఆహారాన్ని అందించడం జరుగుతుంది. ఈ సంస్కారం జరపడం వల్ల వయసుకు తగిన ఆహారం అందడమే గాక ఆహారం పట్ల పవిత్రభావన ఏర్పడుతుంది.

చూడాకరణ

పుట్టు వెండ్రుకలు తీయించడం

పుట్టువెండ్రుకలు తీయించడం. దీర్ఘాయుష్షును, అందాన్ని కోరుతూ చేసే సంస్కారం. సుశ్రుతుడు, చరకుడు కూడా గుండు వల్ల దీర్ఘాయుష్షు, అందం చేకూరుతాయని పేర్కొన్నారు. తలనీలాలు దేవునికి లేదా దేవతకు అర్పించడం గురించి గృహ్యసూత్రాల్లో గానీ, స్మృతుల్లో గానీ లేనేలేదు! పూర్వకాలంలో కూడా కొన్ని సార్లు దేవాలయాల్లో తలనీలాలు అర్పించడం ఉన్నప్పటికీ అది కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే జరిగేది (లేకలేక కలిగిన పిల్లలు లేదా ఒకరిద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత పుట్టిన పిల్లలకు). గృహ్యసూత్రాల ప్రకారం ఈ సంస్కారం మొదటి సంవత్సరం చివర్లో గానీ, మూడొ ఏటగానీ చెయ్యాలి. తర్వాతి కాలాలోని సూత్రకర్తలు ఈ వయసును ఏడేళ్ళవరకు పొడిగించారు.

కర్ణవేధ

చెవులు కుట్టించడం. ఐదేళ్ళలోపు చేయవలసిన సంస్కారం. కర్ణాభరణాలు ధరించడం మొదట్లో అందం కోసమే మొదలైనా తర్వాత ఆరోగ్యదృష్ట్యా దానికున్న ప్రాధాన్యతను బట్టి దానిని సంస్కారాల్లో చేర్చి ఉండవచ్చు. చెవులు కుట్టడానికి వాడే సూది:

క్షత్రియులకు బంగారంతో,బ్రాహ్మణ, వైశ్యులకు వెండితో,

దేవలుడనే స్మృతికర్త "చెవిరంధ్రాలగుండా సూర్యకిరణాలు ప్రసరించని బ్రాహ్మణుడిని చూడడం వల్ల అప్పటివరకు చేసుకున్న పుణ్యమంతా పోతుంది." అని పేర్కొన్నాడు.

అక్షరాభ్యాసం

బిడ్డ మనసు తగినంతగా పరిపక్వత చెంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మొదటగా చేయవలసినది అక్షరాలు నేర్చుకోవడం. ఈ సంస్కారాన్నే అక్షరారంభమనీ, అక్షరలేఖనమనీ, విద్యారంభమనీ అంటారు. సాధారణంగా ఈ సంస్కారాన్ని ఐదో ఏట చేస్తారు. విశ్వామిత్రుడు దీన్ని ఏడొ ఏటివరకు పొడిగించాడు. కానీ కొందరు స్మృతికర్తలు చూడాకరణ ఐన వెంటనే చేయాలని నిర్దేశించారు.

* ఉపనయనము*

అక్షరాభ్యాసం లాంఛనంగా అక్షరాలు దిద్దించడమైతే వాస్తవంగా పిల్లలను విద్యార్జన కోసం గురువు దగ్గరకు పంపే ముందు జరిపే సంస్కారం ఉపనయనం. సాంస్కృతికంగా ఇది అతి ముఖ్యమైన సంస్కారం. అక్షరాభ్యాసంతో ప్రాథమిక విద్య మొదలైతే ఉన్నతవిద్య ఉపనయనంతోనే మొదలవుతుందనుకోవచ్చు. ఉపనయనం జరగడాన్ని సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా రెండవ పుట్టుకగా భావిస్తారు. భౌతిక జననం రోత కలిగించేది. ఉదాత్తమైనది కాదు. క్రమశిక్షణ, విద్యార్జనల ద్వారా పొందే రెందవజన్మ పవిత్రమైనది, ఉదాత్తమైనది.

ఐతే ఉపనయన ఉద్దేశాలు, అర్థాలు కాలంతోబాటే మారుతూ వచ్చాయి. అథర్వణ వేదంలో ఉపనయనాన్ని గురువు విద్యార్థి యొక్క బాధ్యతలు తీసుకోవడం అనే అర్థంలో వాడితే తర్వాతికాలంలో గురువు పవిత్ర మంత్రోపదేశం చేయడమే ఉపనయనంగా భావించడం జరిగింది. హిందూ మతంలో అతిపవిత్రము, శక్తివంతమైన మంత్రంగా భావించబడే గాయత్రి మంత్రాన్ని ఉపనయనమప్పుడు ఉపదేశిస్తారు. అంతేగాక ఉపనయనం ఉన్నతవిద్యకు ఆరంభంగా గాక మతపరమైన తంతు ద్వారా పొందే రెండవ పుట్టుకగానే గుర్తింపు పొందింది. తగిన వయస్సు:

బ్రాహ్మణుడికి ఎనిమిది సంవత్సరాలు;క్షత్రియుడికి పదకొండు సంవత్సరాలు;వైశ్యుడికి పన్నెండు సంవత్సరాలు;

గరిష్ఠ వయోపరిమితి:

బ్రాహ్మణుడికి పదహారు సంవత్సరాలు;క్షత్రియుడికి ఇరవైరెండు సంవత్సరాలు;వైశ్యుడికి ఇరవైనాలుగు సంవత్సరాలు;

కాలం గడిచే కొద్దీ యజ్ఞోపవీతం ధరించడమే ఈ సంస్కారంలో అతిప్రధానభాగంగా మారింది. ఉపనయనం చేయించుకునేవారు సూర్యునివైపు చూస్తూ ఉండగా వారికి దీర్ఘాయుష్షు, పవిత్రత, బలం, తేజస్సు కలగాలని కోరుతూ గురువు ఈ సంస్కారాన్ని నిర్వహిస్తారు. ద్విజులు ఎల్లవేళలా ధరించే యజ్ఞోపవీతం వారికి తమ సామాజిక-ఆధ్యాత్మిక బాధ్యతలను సదా గుర్తుచేస్తూ వారి జీవితం నిరంతరం యజ్ఞజ్వాలలంత పవిత్రంగా సాగడానికి తోడ్పడుతుంది. ఒక యోగి వలె క్రమశిక్షణతో జీవితం గడపడానికి విద్యార్థికి అజినం (జింక చర్మం), దండం కూడా ఉపనయనమప్పుడు ఇస్తారు.

వేదారంభం

అతిపురాతన ధర్మశాస్త్రాల్లో వేదారంభం గానీ, దీని తర్వాతిదైన కేశాంతం గానీ కనిపించవు. మొదట్లో ఉపనయనంతోనే వేదవిద్యారంభం చేసేవారు. కానీ తర్వాతికాలంలో వేదవిద్యతో బాటే ఇతర సామాజిక, వైజ్ఞానిక శాస్త్రాలు అభివృద్ధి చెందాక వేదవిద్యారంభానికి విడిగా మరో సంస్కారం అవసరమైంది. ప్రతి విద్యార్థి తన వంశం వారు నైపుణ్యం సాధించిన వేదాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది. అందుకే ఈ సంస్కారం ఒక్కో వర్గానికి చెందిన విద్యార్థులకు ఒక్కో రకంగా ఉంటుంది:

రెండు వేదాలను అధ్యయనం చేసినవారు ద్వివేది,మూడు వేదాలను అధ్యయనం చేసినవారు త్రివేది,నాలుగు వేదాలను అధ్యయనం చేసినవారు చతుర్వేది.

కేశాంత

పదహారేళ్ళ వయసొచ్చాక మొట్టమొదటిసారి గడ్డం గీసుకోవడానికి (గీయించుకోవడానికి) సంబంధించినది ఈ సంస్కారం. యౌవనారంభదశలోని చాపల్యాలకు లొంగకుండా మరింత జాగరూకులై మెలగవలసిన అవసరాన్ని, బ్రహ్మచర్యం యొక్క ప్రాధాన్యతను ఈ సంస్కారం గుర్తుచేస్తుంది. ఈ సంస్కారానికి సంబంధించిన తంతు దాదాపు చూడాకరణను పోలి ఉంటుంది. ఈ సంస్కారం జరిపేటప్పుడు చివర్లో విద్యార్థి తన గురువుకు ఒక ఆవును దానంగా ఇస్తాడు. అందుకే కేశాంతాన్ని గోదానమని కూడా అంటారు.

సమావర్తనం

చదువు ముగించుకుని విద్యార్థి గురుకులాన్ని వదిలి వచ్చేటప్పుడు ఈ సంస్కారాన్ని నిర్వహిస్తారు. దీన్నే స్నాతకమని కూడా అంటారు. విద్యార్థి తాను అప్పటివరకు పాటించిన బ్రహ్మచర్యాశ్రమం యొక్క గొప్పదనాన్ని గుర్తిస్తూ, యజ్ఞయాగాదులను ముగించేటప్పుడు చేసే అవభృతస్నానం చేస్తాడు. క్రమశిక్షణతో మెలగి విద్యార్జనలో ఉత్తీర్ణుడైన విద్యార్థిని విద్యాసాగరాన్ని ఈదిన స్నాతకుడు లేక నిష్ణాతుడుగా గుర్తించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా విశ్వవిద్యాలయాలు ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టా ప్రదానం చేయడాన్ని స్నాతకోత్సవమనే అంటారు.

సమావర్తనతో చదువు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగిరావడం విద్యార్థి జీవితంలో అతి కీలకమైన ఘట్టం. స్నాతకుడు పెళ్ళి చేసుకుని గృహస్థ జీవితం గడపడానికైనా, తాను గడించిన వైదిక విజ్ఞానంతో భౌతిక మానసిక బంధాలకు దూరంగా జీవితం గడపడానికైనా సిద్ధంగా ఉంటాడు. మొదటిమార్గం పాటించేవాళ్ళను ఉపకుర్వనులని, రెండవ వర్గం వారిని నైష్ఠికులని అంటారు. ఏ మార్గం పాటించడానికైనా గురువు అనుమతి తప్పనిసరి. అప్పటివరకు విద్యార్థి దశలో గురువుతోనే ఉన్నా ఆయనకు రుసుమేమీ చెల్లించకుండానే ఆయన్ని సేవించుకుంటూ విద్యను పొందిన విద్యార్థి ఇంటికి తిరిగొచ్చేటప్పుడు మాత్రం తన స్తోమతుకు తగినట్లు గురుదక్షిణ సమర్పించుకుంటాడు. గురుదక్షిణగా ఏమీ ఇవ్వలేకపోయినా గురువు అనుమతి మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి.

వివాహం

హిందూ సంస్కారాల్లో కేంద్రస్థానం వివాహానిది. వధువుకు తగిన వరుణ్ణి, వరుడికి తగిన వధువును ఎంపిక చేయడం వివాహంలో అతి ముఖ్యమైన ఘట్టం. హిందూ సమాజంలో వధూవరులుగా ఒకే వర్ణానికి (సవర్ణ), భిన్న గోత్రాలకు, భిన్నపిండాలకు చెందినవారిని ఎంచుకోవడమనే ఆనవాయితీ కొనసాగుతోంది. సపిండకుల (రక్తసంబంధీకుల) మధ్య వివాహాలను అన్నికాలాల్లో నైతికంగానూ, శాస్త్రపరంగానూ పూర్తిగా నిషేధించడం జరిగింది.

వివాహాల్లోని రకాల గురించి తెలుసుకోవడానికి అష్టవిధవివాహాలు చూడండి.

వివాహంలో ముఖ్యమైన ఘట్టాలు:

వాగ్ధానం: పెళ్ళి ఖాయపరచుకోవడం (నిశ్చితార్థం)

వర-వరణం: వరుడిని లాంఛనప్రాయంగా అంగీకరించడం

కన్యాదానం: కన్య తండ్రి లేక తండ్రి స్థానంలో ఉండి ఆమె బాగోగులు చూసేవారు కన్యను వరుడికి అప్పజెప్పడం

వివాహ-హోమం: పెళ్ళిలో చేసే హోమం

పాణిగ్రహణం: వధూవరులు ఒకరి చేతినొకరు పట్టుకోవడం

హృదయస్పర్శ:-హృదయాన్ని తాకడం

సప్తపది: సౌభాగ్యానికి, దాంపత్య సాఫల్యానికి గుర్తుగా కలిసి నడిచే ఏడడుగులు

అశ్మారోహణ: సన్నికల్లు తొక్కడం

సూర్యావలోకనం: జరుగుతున్న పెళ్ళికి సాక్ష్యంగా నిలిచిన సూర్యుణ్ణి చూడడం

ధృవదర్శనం: స్థిరత్వానికి సూచిక ఐన ధ్రువనక్షత్రాన్ని చూడడం

త్రిరాత్ర-వ్రతం: మూడురాత్రులు విడిగా ఉండడం

చతుర్ధి-కర్మ: లాంఛనంగా వధూవరులు కలిసే నాలుగోనాటిరాత్రి జరిపే సంబరం

హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైన వ్యవస్థ. పెళ్ళయాక భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధానకర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్ళి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది.

అంత్యేష్టి

హిందువుల జీవితంలోని చివరి సంస్కారం అంత్యేష్టి. ఒక హిందువు తన జీవితాన్ని వివిధ దశల్లో వివిధ సంస్కారాల ద్వారా పవిత్రం చేసుకున్న తర్వాత మరణానంతరం అతడి వారసులు అతడి ఆత్మకు శాంతి, సద్గతులు కలగాలని కోరుతూ చేసేవి అంతిమ సంస్కారాలు లేక అంత్యేష్టి.

మరణానికి ముందు: మరణమాసన్నమైన వ్యక్తి తన కుటుంబసభ్యులను, బంధువులను, ఆత్మీయులను పిలిపించుకుని కన్నుమూసే ముందు అందరినీ ఒకసారి చివరిసారిగా చూసుకుని, వారికి, ప్రపంచానికి వీడ్కోలు పలుకుతారు. వారు తృప్తిగా కన్నుమూయడానికి, మరణానంతరం వారు సంతోషంగా ఉండడానికి వీలుగా వారిపేరుమీద, వీలైతే వారి చేతుల మీదుగానే దాన ధర్మాలు జరుగుతాయి.

అంతిమయాత్రకు ముందు: వారు జీవితపర్యంతం రగిలించిన పవిత్రాగ్నిలోకి ఆహుతులు సమర్పిస్తారు. దగ్గరివారు చనిపోతున్నవారి నోట్లో తులసితీర్థం, గంగాజలం వదులుతారు.

పాడె: శవాన్ని అంత్యక్రియలు జరిగేచోటికి తీసుకువెళ్ళడానికి ఏడుకట్లతో ప్రత్యేకంగా తయారుచేసిన పొడవాటి నిర్మాణం. శవాన్ని దానిమీదికి చేరుస్తారు.

అంతిమయాత్ర: మరణించినవారి బంధువులు, మిత్రులు, ఆత్మీయులందరూ అంతిమయాత్రలో పాల్గొంటారు. అందరూ కలసి శ్మశానస్థలిని చేరుకుంటారు.

అనుస్తరణి: జీవితసాగరాన్ని దాటి అవతలికి వెళ్ళేటప్పుడు సహాయకారిగా ఉంటుందనే నమ్మకంతో హిందువులు పవిత్రంగా భావించే గోవును మరణించినవ్యక్తి తరపున దానంగా ఇస్తారు.

దింపుడుకళ్ళెం: భగవదనుగ్రం వల్లో, చనిపోయినవారి ఆయుస్సు ఇంకా తీరలేదని యమధర్మరాజు వెనక్కి పంపెయ్యడం వల్లో చనిపోయినవారు తిరిగి బ్రతుకుతారనే నమ్మకంతో, బ్రతకాలనే ఆశతో అంతా సిద్ధమయ్యాక కూడా అంత్యక్రియలను కొన్ని నిమిషాలసేపు ఆలస్యం చేయడానికి పాడెను శ్మశానానికి తీసుకువెళ్ళే దారి మధ్యలో దించి శవం చెవిలో మూడసార్లు పేరుపెట్టి పిలుస్తారు. ఒక్కోసారి మరణించారని పొరబాటుగా భావించినవారు తర్వాత తిరిగి లేవడం వల్ల ఈ ఆచారం పుట్టి ఉంటుంది.

దహనం: శరీరాన్ని దహనం చెయ్యడానికి చితిపై ఉంచేముందు శరీరానికి జలంతో అభిషేకం చేయించడంతోబాటు అంత్యక్రియల్లో భాగంగా వేసే కర్మ కొంత ఉంటుంది. అది పూర్తయాక శరీరాన్ని చితిపై ఉంచి వేదమంత్రాల మధ్య నిప్పంటిస్తారు.

ఉదకకర్మ: చితిపై మంటల మధ్య శరీరం కాలిపోగా ఆ వేడిని తగ్గించి మరణానంతర జీవుడిని చల్లబరచడానికి ఉదకం (నీళ్ళు) సమర్పిస్తారు.

ఓదార్పుఆత్మీయుడిని పోగొట్టుకుని దు:ఖంలో ఉన్నవారికి పెద్దలు జీవితమింతేనని తెలుపుతూ మతగ్రంథాల్లో నుంచి గాథలను, జీవితసత్యాలను బోధపరిచి దు:ఖభారాన్ని తగ్గిస్తారు.

అశౌచం: చావు సంభవించిన ఇంటిలో నివాసముండడం మంచిది కాదనే నమ్మకంతో సంవత్సరకాలం ఆ ఇంటిని ఖాళీగా ఉంచుతారు. దీన్ని సూతకమని అంటారు (సూతకం రెండురకాలు: జాతాశౌచం, మృతాశౌచం).

అస్థిసంచయనం: శరీరం కాలి బూడదైనా ఎముకలు పూర్తిగా కాలిపోవు. ఆ బూడిదలో మిగిలిపోయిన ఎముకలను ఏరి తీసుకోవడం అస్థిసంచయనం.P🙏

నవగ్రహాలు- అంగారకుడు- ధ్యానం- గ్రహమైత్రి -శాంతి

ఓం శ్రీ గురుభ్యోనమః

✨ అంగారకుడు- భూమిపుత్రుడు- తేజోవంతుడు- అరుణుడు- అగ్నితత్త్వం కలిగినవాడు- ఋణవిమోచనుడు- శుభకార్యాలను ఇష్టపడనివాడు! ఎనర్జీ మాస్టర్!

✨ అగ్ని, అంగారకుడు, కుమారస్వామి, ఆంజనేయుడు, అర్జునుడు, షిర్డీబాబా... వీరంతా మంగళవారం జన్మించినవారు-అమిత తేజోవంతులు-మణిపూరక చక్రం వీరి స్థానం మరి పాలనాస్థానం. అంగారకుడి వాహనం.. మేక. మంగళవారానికి అధిపతి కనుక మంగళుడు అని, భూమి పుత్రుడు కనుక భౌమ్యుడు అని పిలువబడతాడు.

✨ చండ్రకర్ర వీరికి ప్రీతి. చాలా స్థిరమైన గ్రహరాజు అంగారకుడు. కఠినమైనవాడు. చండ్రకర్ర చాలా కఠినం. ఇనుము లాగా అత్యంత గట్టిది. అందుకే గృహ నిర్మాణాలు ప్రారంభించినప్పుడు శంఖుస్థాపనకు "చండ్రకర్ర" తో శంఖువు తయారు చేయించి,శంకుస్థాపన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఆ చండ్రకర్ర  ఎంతకాలం పాడుకాకుండా భద్రంగా ఉంటుందో అంత కాలం ఆ నిర్మాణం స్థిరంగా ఉంటుందని పెద్దలు అంటారు.

✨ఏదైనా శంఖువుస్థాపన చేసే ముందు ఖచ్చితంగా ఆ శంఖువును చండ్రకర్రతో చేయించి శంఖుస్థాపనకు నిర్ణయించుకున్న రోజుకు ముందు వచ్చే "మంగళవారం" ఆ నిర్మాణ స్థలంలో, మిట్టమధ్యాహ్నం సూర్యుని ఎదుట కూర్చుని ఆ 'శంఖువు' ను అరచేతులలో పట్టుకుని ఒక ఘడియ కాలం (48 నిమిషాలు) తగ్గకుండా ధ్యానం చేసి ఆ తర్వాత నిర్ణయించుకున్న రోజున స్థాపించుకోవడం వల్ల విశేష లబ్ధి కలుగుతుంది- నిర్మాణం నిరాటంకంగా, ఆర్థిక పరిపుష్టి తో చక్కగా సాగిపోతుంది.

✨ "అంగారకుడు" 'ఋణ విమోచకుడు'! ఆర్థిక ఋణాలతో అప్పుల భారంతో ఎన్నో కోట్ల మంది ఎంతో పీడించబడుతుంటారు. ఎవరైతే మంగళవారం రోజు (ఏడు వారాల పాటు) త్రిసంధ్యలలో ఒకొక్క గంట తక్కువ లేకుండా ధ్యానం... అంగారకుడికి సంకల్పం చేసి ధ్యానం చేస్తారో వారికి ఏడు మంగళవారాలు అలా చేసిన తర్వాత.. క్రమంగా ఆర్థిక ఋణాలు విమోచనమవుతూ వస్తాయి.

✨ అంగారకుడు భూమి పుత్రుడు కనుక ఏదైనా భూమికి సంబంధించిన లేదా నిర్మాణానికి సంబంధించిన వివాదం ఉన్నట్లు అయితే.. ఆ స్థలంలో మంగళవారంనాడు మిట్టమధ్యాహ్నం కూర్చొని ఒక గంట తక్కువ లేకుండా ఏడువారాలు ధ్యానం చేస్తే ఆ వివాదం తొలగి శాంతి కలుగుతుంది.

✨ మంగళవారం నాడు అంగారకుడు శుభకార్యాలను చేయటానికి ఇష్టపడడు.. అందుకే సాధారణంగా మంగళవారం నాడు శుభకార్యాలు చేయరు.

✨ అంగారకుడు ప్రీతి అయితే, నాగదోషాలు తొలగిపోతాయి!అంగారకుడు, అగ్ని, సుబ్రహ్మణ్యస్వామి- ఈ ముగ్గురి యొక్క శక్తి ఒకటే! అగ్నిప్రీతి కలిగితే.. ఐశ్వర్య వృద్ధి కలుగుతుందని అందుకే అంటారు. మంగళవారం త్రిసంధ్యలలో ధ్యానం చేయడం వల్ల అగ్నిదేవుడు, అంగారకుడు, సుబ్రమణ్యస్వామి-ఈ మువ్వురు దేవతల యొక్క మైత్రి కలుగుతుంది-తేజోవంతంగా ఉంటారు- ఎనర్జీతో తొణికిసలాడుతారు.

✨మంగళవారం నాడు కందులతో, కందిబ్యాళ్ళతో చేసిన పదార్థాలను- కందిగుగ్గిళ్ళను లేదా కంది కుడుములను లేదా కంది బ్యాళ్ళు- బెల్లం కలిపి చేసిన పరమాన్నాన్ని 750గ్రా||తక్కువ లేకుండా పంచితే, ముఖ్యంగా బాలలకు, వృద్ధులకు మరియు ఆకలిగొన్న వారికి మిట్టమధ్యాహ్నం పంచడం చేయలి. అలాగే మేకలకు మంగళవారం అవి తినే ఆహారం పొలంలో పెట్టాలి. ఇలా ఏడు వారాలు చెయ్యాలి! ఆరోజు త్రిసంధ్యలలో ఒక్కొక్కగంట తగ్గకుండా 'ధ్యానం' చేయాలి!

✨ ఇలా చేయడం వల్ల 'అంగారక గ్రహ శాంతి' కలుగుతుంది- అంగారకునితో మైత్రి కలుగుతుంది- ఋణవిమోచనం కలుగుతుంది! (ఏడు వారాలు తప్పక చేయాలి)
ఈ చేసిన పదార్థాన్ని కొంత భూమిపైన మరి చెట్ల వద్ద పెట్టడం వల్ల ఆ పదార్థాన్ని చీమలలాంటి జీవులు భుజించడం వల్ల భూమాత (అంగారకుడి తల్లి) సంతోషిస్తుంది.
పూజ కంటే, స్తోత్రం కంటే, మంత్రజపం కంటే, ధ్యానం కోట్ల రెట్లు గొప్పది కనుక సత్వరఫలితాలకై ధ్యానమే చేయాలి!

✨ ధ్యానమొక్కటే రాజమార్గం- ధ్యానం ఒక్కటే రాజయోగం! ధ్యానం చేసే వారే దేవతలు! గ్రహమైత్రి, గృహసౌఖ్యం కలగాలంటే 'ధ్యానం' చేయడమే అత్యంత శ్రేయోదాయకమైన సులభమార్గం" మంగళవారం ధ్యానం చేయడం వల్ల అంగారక ప్రీతి- మైత్రి కలుగు గాక!

Tuesday, January 15, 2019

స్వర్గానికి రోడ్డు మార్గం

#స్వర్గానికి రోడ్డు మార్గం*
(Road route to SWARGA):-
📈📉📊📈📉📊📈📉📊

పాండవులు ఈ మార్గం ద్వారానే స్వర్గానికి చేరుకున్నారని ప్రతీతి.
భూమి నుండి స్వర్గానికి చేరుకోవచ్చు అనడానికి ఏకైక మార్గం ఇదే.

#మన :- బద్రీనాథ్ క్షేత్రం నుండి 5km దూరం లో వుండే చిన్న గ్రామం.

.....🔚🔚🔚భారతదేశ ఆఖరి గ్రామం ఇదే. 🔙🔙🔙

ఇక్కడి నుండే ఒకవైపు టిబెట్ ప్రారంభం అవుతుంది.

ఈ గ్రామ చివరన సరస్వతి నది మనకు కన్పించే ప్రాంతం ఉంటుంది. ఇక్కడి నుండి కొంత దూరం ప్రవహించాక అలకనంద నది లో కలిసి అంతర్వాహిని గా ప్రవహిస్తుంది. ఇక్కడే సరస్వతి మాత ఆలయం కుడా ఉంటుంది.

ఈ సరస్వతి నది పక్కన  భీమపుల్ అనే ఒక పెద్ద రాతిబండ ఉంటుంది.

పాండవులు నదిని దాటడానికి భీముడు ఈ రాతిని ఒక వంతెన గా ఏర్పాటు చేసాడు అంటారు.
ఈ రాతిమీద భీముని వేలిముద్రలు వున్నట్లు గా పెద్ద పెద్ద అచ్చులు కుడా వుంటాయి.

ఈ వంతెన దాటాక స్వర్గారోహణ మార్గం ప్రారంభం అవుతుంది.

మన  నుండి చట్మోలి 8km:-

మార్గ మధ్యమం లో #భృగుమహర్షి ఆశ్రమం కన్పిస్తుంది.

తరవాత #మాతమూర్తి ఆలయం కన్పిస్తుంది. ఈవిడే నరనారాయణుల కన్నతల్లి గా కుడా చెప్తారు.
ఈ ప్రాంతం 14000 అడుగుల ఎత్తులో ఉంటుంది.

తర్వాత కుబేర్ మకుట్ అనే ప్రాంతం వస్తుంది. ఇక్కడే కుబేరుడి పుష్పక విమానాన్ని రావణాసురుడు బలవంతం గా తీసుకున్నట్లు చెప్తారు.

ఇక్కడినుండి 5km ప్రయాణం చేసాక వసుధార జలపాతం వస్తుంది.

ఇక్కడే అష్ట వసువులు ( భీష్ముడు ఆఖరివాడు) దాదాపు 1000 సం తపస్సు చేసినట్లు చెప్తారు.
ఈ జలపాతం దాదాపు 120మీ ఎత్తునుండి పడుతుంది.

ఇక్కడ గాలులు బలం గా వీస్తుండడం చేత ధార చాల పలుచగా నీటి తుంపర లవలె పడుతుంది.
అందుకే పాపులపై ఈ జలధార పడదు అని చెప్తారు.

చట్మోలి:-

తర్వాత చట్మోలి ( 12000 అ ఎత్తులో ) అనే అందమైన పచ్చని బయళ్ళు వుండే ప్రాంతానికి చేరుకుంటాం.

పర్వతారోహకులకు ఇది ఒక విడిది ప్రదేశం.

ఇక్కడే సతోపంత్ మరియు భగీరధ్ కర్క్ అనే రెండు నదులు   ( హిమానీనదాలు ) కలిసి #అలకనంద గా ఏర్పడతాయి.

అక్కడి నుండి ముందుకు వెళితే #ధనో హిమానీనదం కు చేరుకుంటాం.

చట్మోలి నుండి లక్ష్మి వన్ 1km ( 12600 అ ఎత్తు లో ):

తర్వాత లక్ష్మి వన్ ప్రాంతం కు చేరుకుంటారు. ఇది ఒక అందమైన రకరకాల పూలు వుండే ప్రాంతం. ఏంతో ఆహ్లాదం గా ఉంటుంది.

ఇక్కడే లక్ష్మి & విష్ణువు కొంతకాలం తపస్సు చేసినట్లు చెప్తారు.

ఇక్కడే ద్రౌపది దేవి తనువు చాలించింది అని  చెప్తారు. 

ఇక్కడి నుండి 2km ప్రయానించాక  బంధర్ అనే ప్రాంతం కు చేరుకుంటాం.

ఇక్కడే ధర్మరాజు దాహార్తి తీర్చడానికి అర్జునుడు బాణ ప్రయోగం చేసాడని చెప్తారు.

బంధర్ నుండి సహస్రధార 4km ( 14000 అఎత్తులో):

సహస్ర ధార నుండి చక్ర తీర్ధం 5km (15000 అ ఎత్తులో)

చక్రతీర్థం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని కింద పెట్టడం వలన ఏర్పడిన సరస్సు గా చెప్తారు.

ఇక్కడే అర్జునుడు తనువు చాలించాడని చెప్తారు.

చక్రతీర్ధం నుండి సతోపంత్ 5km:

ఈ సతోపంత్ అనేది త్రిభుజా కృతి లో వుండే సరస్సు.
ఇది 5 పర్వతాల మధ్య వుండే సుందరమైన స్వచ్చమైన నీరు ఉండే  సరస్సు.

ఇక్కడే ఏకాదశి రోజున త్రిమూర్తులు స్నానం చేస్తారని గంధర్వులు పక్షుల రూపం లో వారిని సేవిస్తారని చెప్తారు.

ఏకాదశి రోజున ఇక్కడ పక్షుల సమూహం ను చూడవచ్చట.
ఇక్కడే భీముడు తనువు చాలించాడని చెప్తారు.

సతోపంత్  నుండి స్వర్గారోహిణి 8 km:-

ఈ మార్గం బహు కష్టం గాను ప్రయాణానికి దుస్సాహసం గాను చెప్తారు.

మార్గం లో చంద్రకుండ్ & సూర్యకుండ్ అనే సరస్సులు ఉంటాయట.

ఇక్కడినుండే ధర్మరాజు మాత్రమే కుక్క తోడూ రాగా స్వర్గానికి ప్రయాణించాడు అంటారు.

నిజానికి స్వర్గారోహిణి అనేది  6 పర్వతాల సమూహం గా చెప్తారు. ఇందులో స్వర్గారోహిణి 1 అనేది ముఖ్యమైంది.
ఇది ఉత్తరాఖండ్ రాష్టం లోని ఉత్తరకాశి జిల్లా లో కల ఘర్వాల్ హిమాలయ ప్రాంతానికి  చెందినది.
దీనికి పడమర వైపు గంగోత్రి పర్వత సముదాయం ఉంటుంది.

ఈ స్వర్గారోహిణి పర్వతాగ్రం ( 20512 అ ఎత్తు లో , 6252 m ) మబ్బులలో ఉంటుందని అది 3 మెట్లు వలే ఉంటుంది అని అవి ఎక్కి పైకి వెళితే  మబ్బులలో మరో 4 మెట్లు ఉంటాయని అవి కూడా ఎక్కి  పైకివెళితే స్వర్గ ముఖ ద్వారానికి చేరుకుంటామని చెప్తారు.

సంక్రాంతి పండుగ - సూర్య భ్రమణం - సిరిధాన్యాల సందేహాలు

శుభోదయం మకరసంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో
👉తేదీ14-01-2019సోమవారం రోజున భోగి పండుగ
👉తేదీ15-01-2019మంగళవారం రోజున మకరసంక్రాంతి పండుగ
👉తేదీ16-01-2019బుధవారం రోజున కనుమపండుగ
ఇది ఖగోళంలో జరుగుతున్న సూర్య భ్రమణం యొక్క మార్పు😊😊😊
100సం౹౹క్రితం సంక్రాంతి పండుగ జనవరి9.10-తేదీలలో ను
60సం౹౹లక్రితం జనవరి11.12తేదీల్లో
గత30యేల్ల నుండిజనవరి13.14తేదీల్లోను
ప్రస్తుతంజనవరి14.15తేదీల్లోను
మరో20సంవత్సరాల వరకు సంక్రాంతి పండుగ జనవరి18వ తేదీన జరుపుకోనున్నాము!!!
ఇది ఖగోళంలో సూర్య భ్రమణంవలన జరుగుతున్న మార్పులు మాత్రమే
🐘🐘🐘🐘🐘
*భోగి, భోగభాగ్యాలతో సంక్రాంతి సిరి, సంపదలతో, కనుమ కనువిందుగా ‌జరుపుకోవాలని కోరుకుంటూ, మీకు,మీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు 🙏🙏🙏     

సిరిధాన్యాల వినియోగదారుల కు వచ్చే సాదరణ సందేహాలు... సమాధానాలు.... *సిరిధాన్యాలు అంటే ఏమిటి ?

వరి బియ్యం, గోధుమలు వలె ఇవికూడా ఆహారంగా స్వీకరించడానికి అనువైన ధాన్యం. పూర్వం అంటే సుమారు 100 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు మన నేలల్లో/ భూమిలో  పండించి సంపూర్ణ ఆహారంగా స్వీకరించిన ధాన్యాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సిరిధాన్యాలే...
కాల క్రమంలో నీటి డ్యాము ల నిర్మాణం,నీటి లభ్యత, వ్యవసాయ విప్లవం, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆధిపత్య ప్రభావంతో మన ప్రాచీన, సంప్రదాయ పంటలయిన కొర్రలు, సామలు, ఊదలు, అరికలు, అండుకొర్రలు అనే పంచ చిరు (సిరి) ధాన్యాల సాగు మన ప్రాంతాల్లో కనుమరుగై వాటి స్థానంలో నీటి ఆధారిత పంటలయిన వరి, గోధుమలు మన భూముల్లో పండించడం ప్రారంభించి , వరి బియ్యం, గోధుమలు మన ప్రధాన ఆహారంగా తీసుకోవడం ప్రారంభించాము, ఈ ఆహారం వల్ల గ్లూకోస్ ఏక మొత్తం లో ఓకే సారి రావడం వల్ల, గ్లూకోస్ మనకు కావాల్సిన డానికి కంటే ఎక్కువైనది ఫ్యాట్ గ మారి బరువు పెరగడం, తద్వారా మన శరీరం లోకి అన్ని దీర్ఘకాలిక రోగాలు , సాధారణ రోగాలు, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ అరుగుదల రావడం ప్రారంభించాయి.

సిరిధాన్యాలను ఎలా వండుకోవాలి ?
ఏ సిరిధాన్యము అయినా  8 గంటలు నానబెట్టి వండుకోవాలి. రాత్రి నానబెట్టి ఉదయం వండుకోవడం, ఉదయం నానబెట్టి రాత్రి వండుకోవడం ఉత్తమం.

ఎందుకు నాన బెట్టాలి.?
అన్ని సిరిధాన్యాల్లో ఫైబర్ శాతం మన శరీరానికి అవసరం అయినంత ఉంటుంది, ఫైబర్ నిష్పత్తి 65:8 నుండి 65:12.5 వరకు ఉంటుంది . అంటే పిండి పదార్థం 65 ఉంటే పీచు పదార్థం (ఫైబర్) కనీసం 8 శాతం ఉంటుంది...
వరి బియ్యంలో పిండి పదార్థం  నిష్పత్తి 395: 0.2 అంటే దాదాపు పీచు పదార్థం శూన్యం...
ఆవాల పరిమాణం కంటే కొద్దిగా పెద్ద పరిమాణం లో వుండే  సిరిధాన్యాల కేంద్రం నుండి పై వరకు పొరలు పొరలు గా ఫైబర్ ఉంటుంది . భగవంతుని అద్భుత సృష్టి తో సుమారు ఏడు పొరల్లో నిక్షిప్తమయిన ఈ ఫైబర్ పూర్తిగా నానడానికి 8 గంటలు పడుతుంది. అందుకే ఉదయం నానబెట్టి రాత్రి, రాత్రి నానబెట్టి ఉదయం వండుకోవాలి.

సిరిధాన్యాలతో ఏ ఆహారం చేసుకోవచ్చు.?
సిరిధాన్యాలతో అన్నం , ఇడ్లీ లు, దోశ, ఉతప్ప, పెరుగన్నం, సాంబారు అన్నం , సర్వపిండి, మురుకులు, దోసకాయరొట్టె,  గారెలు, ఇలా 30 రకాల పైన వెరైటీ లు వండుకోవచ్చు. వరి బియ్యం తో వండే ప్రతి వంటను సిరిధాన్యాలతో వండుకోవచ్చు.

ఎందుకు తినాలి ?
ఆహారపు అలవాట్ల ద్వారా సంక్రమిస్తున్న అన్ని వ్యాధులను దూరం చేసుకోవడానికి, పూర్తి ఆరోగ్యంగా ఏ వ్యాధి  రాకుండా ఉండడానికి, ఊబకాయము సమస్య పోవడానికి సిరిధాన్యాల ను సంపూర్ణ ఆహారంగా తీసుకోవాలి.

ఎన్నిరోజులు తినాలి?
మన ఊపిరి ఉన్నంత కాలం సిరిధాన్యాల నే సంపూర్ణ ఆహారంగా స్వీకరించాలి.

ఎలా తినాలి ?
ఆరోగ్యంగా ఉన్నవారు సిరిధాన్యాల రెండు, రెండు రోజులు మార్చి, మార్చి తినాలి, అంటే రెండు రోజులు కొర్రలు, రెండు రోజులు సామలు, రెండు రోజులు ఊదలు అలా...సైకిల్ లా తీసుకోవాలి.
అన్ని విడివిడిగా తినాలి,
ఒక దానితో ఒకటి కలుపవద్దు

5 రకాలు తప్పనిసరిగా తినాలా?
అన్ని తప్పనిసరిగా తినాలి, ఎవయినా అందుబాటులో లేనప్పుడు అందుబాటులో ఉన్న సిరిధాన్యాలను తినాలి.

పొట్టు తీయని unpolished వే తినాలా?
పొట్టు తీయని(unpolished) తినడం ఉత్తమం.
Unpolished లభించనప్పుడు పొట్టు తీసిన polished సిరిధాన్యాలు ఆహారంగా తీసుకొన్నా నష్టం లేదు.

సిరిధాన్యాల ధరలు ఎందుకు అధికంగా ఉన్నాయి?
సిరిధాన్యాలను పండించే వారు తక్కువగా వున్నారు, స్వీకరించే వారు అధికమయ్యారు, డిమాండ్ కు సరిపడా సప్లయి లేనందున, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా సప్లయి చేయాల్సివస్తుంది...ఇతర రాష్టలు సిరిధాన్యాల ను దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నందున వాటి ధరలు అధికంగా ఉన్నాయి.

ఏ నూనెల ను వాడాలి ?
ఎట్టి పరిస్థితుల్లో రెఫైన్డ్ నూనెలు వాడవద్దు. గానుగలో పట్టిన నూనెలను వాడడం ఉత్తమం.ఆరోగ్యానికి కొబ్బరినూనె,  కుసుమ నూనె లు చాలా మంచిది, కొబ్బరి,  కుసుమ, పల్లి, నువ్వుల నూనెలు మార్చి, మార్చి వాడాలి. కొబ్బరినూనె వాసన ఉన్నట్లు అనిపిస్తే కుసుమ నూనె వాడండి, పల్లి నూనెలగా ఉంటుంది, వాసన తో ఇబ్బంది ఉండదు.

సిరిధాన్యాల పంటలు ఎలా పండించాలి?
సిరిధాన్యాల పంటల సాగుకు చాలా తక్కువ నీరు అవసరం. ఎకరానికి 4 కిలోల విత్తనాలు సరిపోతాయి, ( నారు పోసి నాటే విధానం లో ఒక ఎకరానికి కిలో లోపు విత్తనాలు సరిపోతాయి). కలుపు తీయాల్సిన , పురుగుల మందులు, రసాయనాలు చల్లాల్సిన అవసరం లేదు.
ప్రకృతిని, భూమిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ భూగర్భ జలాలను కాపాడుతూ రైతులు అధిక లాభాలు సిరిధాన్యాల పంట సాగు ద్వారా పొందవచ్చు. తద్వారా స్థానికంగా అందుబాటులో ఉండి వినియోగదారుల కు సరిఅయిన ధరలో సిరిధాన్యాలు లభిస్తాయి.

మనం తినకూడని ఆహారపదార్థాలు ఏవి?
వరి బియ్యం, గోధుమలు, గోధుమ పదార్థాలు, మైదా,పాలు, టీ,కాఫీలు,చక్కెర, అయోడైజ్డ్ ఉప్పు(సముద్రపు నీటిద్వారా తయారు చేసిన ఉప్పు  వాడడం మంచిది), మాంసం, గుడ్లు.

మనం విడువవలసిన చెడు అలవాట్లు ఏవి?
గుట్కా, మద్యం, ధూమపానం,మత్తు పదార్ధాలు

       ఎంత వివరణ ఇచ్చినా, ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినా ఇంకో కొత్త ప్రశ్న, సందేహం వస్తూనే ఉంటుంది, ఎందుకంటే మనిషి మెదడు ప్రశ్న/ సందేహాల ఉత్పత్తి కేంద్రం....
ఓకే గుడ్డి గుర్తు ...అయిదు సిరిధాన్యాల ను 6 వారాల నుండి ఆరు నెలలు మార్చి మార్చి తినాలి, వాడకూడని పాలు, చెక్కర, రెఫైన్డ్ నూనెలు, వరి బియ్యం, గోధుమలు, ayodized ఉప్పు, మాంసాహారం మానివేసి సిరిధాన్యాల ను సంపూర్ణ ఆహారంగా స్వీకరించడం వల్ల అన్ని అనారోగ్య సమస్యలనుండి  బయటపడవచ్చని, ఆరోగ్యవంతులు ఏ అనారోగ్య సమస్యలు దరి  చేరవని డాక్టర్ ఖాదర్ వలి గారు చెబుతారు.
ఇంకా అధిక సమాచారం కోసం సిరిధాన్యాల తో సంపూర్ణ ఆరోగ్యం, అమృతాహారం పుస్తకాలు చదవండి, యూట్యూబ్ లో డాక్టర్ ఖాదర్ వలి గారి వీడియోలు చూడండి.
సంకల్పం, కమిట్మెంట్ ఉండాలి, మనసు శరీరాన్ని నియంత్రించాలి, శరీరం మనసును శాసించకుండా చూసుకోవాలి....
అందరికీ మందులు లేని సంపూర్ణారోగ్యం లభించాలని, ప్రతి వంటింట్లో సిరిధాన్యాల ఘుమఘుమలు వ్యాపించాలని ఆశిస్తూ........
సిరిధాన్యాల తో సంపూర్ణ ఆరోగ్యం

ఉత్తరాయణ పుణ్యకాలం


‘సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం’ అంటే ‘చేరడం’ లేదా ‘మారడం’ అని అర్థం.సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి.

జయసింహ కల్పద్రుమం అనే గ్రంథం ‘సంక్రాంతి’ని ఇలా నిర్వచించింది.
‘‘తత్ర మేషాదిషు ద్వాదశ
రాశి క్రమణేషు సంచరితః
సూర్యస్య పూర్వన్మాద్రాశే
ఉత్తర రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః’’

మకర సంక్రమణానికెంతో ప్రాముఖ్యత ఉందని పురాణేతిహాసాల్లో కానవస్తోంది.
‘‘రవి సంక్రమణే ప్రాపే న
న్నా యాద్యన్తు మానవః
సప్త జన్మసు రోగీ స్యా
నిర్దేనశే్చన జాయతే’’

అని స్కాంద పురాణం చెబుతోంది. అంటే, రవి మకర రాశిలో ప్రవేశించినపుడు ఎవడైతే స్నానం చేయడో అలాటి వాడు ఏడు జన్మలు రోగిగా, దరిద్రునిగా ఉండిపోతాడని భావం.

పురాణాల ప్రకారం సూర్య భగవానుడు ఈ రోజునేతన కుమారుడైన శని ఇంటికి వెళతాడు.ఆయనం అనగా పయనించడం అని అర్థం. ఉత్తర ఆయనం అంటే ఉత్తరవైపు పయనించడం అని అర్థం. సూర్యుడు భూమికి కొంత కాలం దక్షిణం వైపు పయనించాక దక్షిణం వైపునుంచి ఉత్తరం వైపు పయనించనారంభిస్తాడు. సూర్యుడు పయనించే దిక్కునుబట్టి, దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం అనీ, ఉత్తరం వైపు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు.

ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయణం పాప కాలం అని అర్ధం చేసుకోకూడదు. దక్షిణాయణం కూడా పుణ్య కాలమే.. అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు…

ఉత్తరాయణం లో లయ కారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు.. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరం గా వుండడం వలన పుణ్య క్షేత్రాలు, తీర్ధ యాత్రలకు అనువుగా వుంటుంది.... మనం ఉత్తర దిక్కునూ, ఉత్తర భూములనూ పవిత్రం గా భావించడం వల్లనూ వేద జననం ఉత్తర భూముల్లో జరగడం వల్లనూ, హైందవ సంస్కృతి, జ్ఞాన విజ్ఞానం, భాష, నాగరికత ఉత్తరాది వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వల్లనూ, సమస్త భాషలకూ తల్లి అయిన సంస్కృతం ఉత్తరాది వైపున పుట్టడం వల్లనూ, సమస్త ఋషులకూ, దేవతలకూ, పండితులకూ ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావటం వల్లనూ, ముఖ్యం గా; ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు ఉత్తర పధ చలనం చేయడం వల్లనూ, ఉత్తరాయణ కాలం ను పుణ్య కాలం గా హిందువులు భావించారు.

సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒక వైపు అనగా దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒకవైపు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగాను, ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలం పగలు గాను అభివర్ణించారు. మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయనం నందు మేలుకొని ఉంటారని, వారు మేలుకొని ఉండగా అడిగిన కోర్కెలు వెంటనేతీరుస్తారని, ఆ విషయం అందరికీ తెలియజేయడం కోసం పెద్దలు ఈ పండుగలను జరపడం మొదలుపెట్టారు.

ఈ రోజునుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. ఎందుకంటే ఈ మకర సంక్రమణం దేవతలకు పగటి కాలం కావడమే ప్రధాన కారణం. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. ఐతే పదకొండు సంక్రమణాల్లో ఇవ్వకపోయినా, ఈ మకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు.

ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైందని ఆర్యోక్తి. ఉత్తరాయణ కాలంలో చేసే దానాలలో ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలైనవి ఉత్తమమైనవి. ఈ కాలంలో గోవును దానం చేస్తే స్వర్గ వాసం కలుగుతుందని ఆస్తిక లోక విశ్వాసం.

Friday, January 11, 2019

నక్షత్ర గాయత్రి

ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర గాయత్రి ని రోజుకు 9 సార్లు పఠించాలి

ఈ విధంగా చేయడం వల్ల శుభ ఫలితాలు చేకూరుతాయి


1. అశ్విని
ఓం శ్వేతవర్ణై విద్మహే సుధాకరాయై ధిమహి తన్నో అశ్వినేన ప్రచోదయాత్

2 .భరణి
ఓం కృష్ణవర్ణై విద్మహే దండధరాయై ధిమహి తన్నో భరణి:ప్రచోదయాత్

3. కృత్తికా
ఓం వణ్ణిదేహాయై విద్మహే మహాతపాయై ధీమహి తన్నో కృత్తికా ప్రచోదయాత్

4. రోహిణి
ప్రజావిరుధ్ధై చ విద్మహే విశ్వరూపాయై ధీమహి తన్నో రోహిణి ప్రచోదయాత్
 *
5. మృగశిరా*
ఓం శశిశేఖరాయ విద్మహే మహారాజాయ ధిమహి తన్నో మృగశిర:ప్రచోదయాత్

6. ఆర్ద్రా
ఓం మహాశ్రేష్ఠాయ విద్మహే పశుం తనాయ ధిమహి తన్నో ఆర్ద్రా:ప్రచోదయాత్

7. పునర్వసు
ఓం ప్రజా వరుధ్ధై చ విద్మహే అదితి పుత్రాయ ధిమహి తన్నో పునర్వసు ప్రచోదయాత్

8. పుష్య
ఓం బ్రహ్మవర్చసాయ విద్మహే మహాదిశాయాయ ధిమహి తన్నో పుష్య:ప్రచోదయాత్

9. ఆశ్లేష
ఓం సర్పరాజాయ విద్మహే మహారోచకాయ ధిమహి తన్నో ఆశ్లేష: ప్రచోదయాత్

10. మఖ
ఓం మహా అనగాయ విద్మహే పిత్రియాదేవాయ ధిమహి తన్నో మఖ: ప్రచోదయాత్

11. పుబ్బ
ఓం అరియంనాయ విద్మహే పశుదేహాయ ధిమహి తన్నో పూర్వఫల్గుణి ప్రచోదయాత్

12. ఉత్తరా
మహాబకాయై విద్మహే మహాశ్రేష్ఠాయై ధీమహి తన్నో ఉత్తర ఫల్గుణి ప్రచోదయాత్

13. హస్త
ఓం ప్రయచ్చతాయై విద్మహే ప్రకృప్రణీతాయై ధీమహి తన్నో హస్తా ప్రచోదయాత్

14. చిత్తా
ఓం మహాదృష్టాయై విద్మహే ప్రజారపాయై ధీమహి తన్నో చైత్రా:ప్రచోదయాత్

15. స్వాతి
ఓం కామసారాయై విద్మహే మహాని ష్ఠాయై ధీమహితన్నో స్వాతి ప్రచోదయాత్

16. విశాఖ
ఓం ఇంద్రాగ్నేస్యై విద్మహే మహాశ్రేష్ఠాయై చ ధీమహీ తన్నో విశాఖ ప్రచోదయాత్

17 అనూరాధ
ఓం మిత్రదేయాయై విద్మహే మహామిత్రాయ ధీమహి తన్నో అనూరాధా ప్రచోదయాత్

18. జ్యేష్ఠా
ఓం జ్యేష్ఠాయై విద్మహే మహాజ్యేష్ఠాయై ధీమహి తన్నో జ్యేష్ఠా ప్రచోదయాత్

19 .మూల
ఓం ప్రజాధిపాయై విద్మహే మహాప్రజాధిపాయై ధీమహి తన్నో మూలా ప్రచోదయాత్

20. పూర్వాషాఢ
ఓం సముద్ర కామాయై వి    ఓం ప్రజాధిపాయై విద్మహే మహాప్రజాధిపాయై ధీమహి తన్నో మూలా ప్రచోదయాత్

20. పూర్వాషాఢ
ఓం సముద్ర కామాయై విద్మహే మహాబీజితాయై ధిమహితన్నో పూర్వాషాఢా ప్రచోదయాత్

21. ఉత్తరాషాఢ
ఓం విశ్వేదేవాయ విద్మహే మహాషాఢాయ ధిమహి తన్నో ఉత్తరాషాఢా ప్రచోదయాత్

22. శ్రవణ
ఓం మహాశ్రేష్ఠాయై విద్మహే పుణ్యశ్లోకాయ ధీమహి తన్నో శ్రవణ ప్రచోదయాత్

23. ధనిష్ఠా
ఓం అగ్రనాథాయ విద్మహే వసూప్రితాయ ధీమహి తన్నో శర్విష్ఠా ప్రచోదయాత్

24. శతభిషం
ఓం భేషజాయ విద్మహే వరుణదేహాయ ధీమహి తన్నో శతభిషా ప్రచోదయాత్

25. పూర్వాభాద్ర
ఓం తేజస్కరాయ విద్మహే అజరక పాదాయ ధీమహి తన్నో పూర్వప్రోష్టపత ప్రచోదయాత్

26. ఉత్తరాభాద్ర
ఓం అహిరబుధ్నాయ విద్మహే ప్రతిష్ఠాపనాయ ధీమహి తన్నో ఉత్తరప్రోష్టపత ప్రచోదయాత్

27. రేవతి
ఓం విశ్వరూపాయ విద్మహే పూష్ణ దేహాయ ధీమహి తన్నో రేవతి ప్రచోదయాత్*

Friday, January 4, 2019

పద్ధతి ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే ఫలితం

నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి.. పద్ధతి ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. ఎలా చేయాలి ? ఎన్నిసార్లు చేయాలి ?

నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి. కానీ వాటిని పూజించడానికి ప్రజలు జంకుతుంటారు. కారణం ఎప్పుడు, ఎలా ప్రదక్షిణలు చేయాలో తెలియదు. ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలియదు. నవ గ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో తెలియదు. అయితే నవగ్రహ ప్రదక్షిణలకు ఒక పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలుంటాయి. మానవ జీవం, మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహాల స్థితిపై ఆధారపడి వుంటుందని జ్యోతిష్క శాస్త్రం చెబుతోంది.

గ్రహస్థితిలో మార్పులు వల్లనే ఎవరి జీవితంలో అయినా ఒడిదుడుకులు ఎదురవ్వడం గానీ, లాభాలు, సంతోషాలు కలిసిరావడం గానీ వస్తుంటాయి. నవగ్రహ ప్రదక్షిణ మనిషి కష్టనష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. నవగ్రహ ప్రదక్షిణలకు ఒక నిర్దిష్టమైన పద్ధతి వుంది. ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది.

కొంతమంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణ చేస్తుంటారు. సాధ్యమైనంత వరకూ ఇలా తాకకుండానే ప్రదక్షిణలు చేయాలి.

నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మంటపంలోకి వెళ్ళే ముందు, సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి ఎడమ వైపు నుండి (చంద్రుని వైపు నుంచి) కుడివైపునకు తొమ్మిది ప్రదక్షిణలు చేయడం ఉత్తమం.

ప్రదక్షిణలు పూర్తయ్యాక కుడివైపు నుంచి ఎడమవైపు (బుధుడి వైపు నుంచి) రాహువు, కేతువులను స్మరిస్తూ రెండు ప్రదక్షిణలు చేయవచ్చు.

చివరగా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఒక ప్రదక్షిణ చేసి, నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి. ఇలా చేయడం వల్ల కొంత ఫలితం ఉంటుంది.

ఎప్పుడుపడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి.

శివాలయాల్లో నవగ్రహాలుకు ప్రత్యేకమైన సన్నిధి వుంటుంది. మూలవిరాట్టును దర్శించుకుని బయటికి వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి.

“ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:” అంటూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణాలు చేస్తున్నంత సేపూ నవగ్రహ స్తోత్రాలు చదవాలి. 9 గ్రహాలకూ స్తుతిస్తూ శ్లోకాలు చదివి 9 ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహు, కేతువులకు మరో రెండు ప్రదక్షిణలు (అంటే మొత్తం 11) చేస్తే చాలా మంచిదంటారు. అసురులైన రాహుకేతువులను ఈ విధంగా సంతృప్తిపర్చడం వల్ల వారి కారణంగా ఆటంకాలు వుండవని నమ్మకం.

  • మొదటి ప్రదక్షిణలో జపాకుసుమాల వర్ణం గలవాడా, కాశ్యపగోత్రుడా, నవగ్రహమండలనాయకుడా, శ్రీసూర్యభగవానుడా, సదా శుభాన్ని అనుగ్రహింతువు గాక!
  • రెండో ప్రదక్షిణలో కటకరాశికి అధిపతి అయిన ఓ చంద్రుడా, పెరుగు, శంఖాల వంటి ధవళవర్ణం గలవాడా, ఆత్రేయగోత్రోద్భవుడా, శ్రీచంద్రభఘవానుడా, మమ్మల్ని కరుణించు!
  • మూడో ప్రదక్షిణలో బంగారు రంగుతో మెరిసిపోయేవాడా, వృశ్చిక మేషరాసులకు అధిపతి అయినవాడా, భరద్వాజగోత్రుడా, శ్రీ అంగారకుడా మాకు మంగళాలను ప్రసాదించు అని స్మరించుకోవాలి.
  • నాలుగో ప్రదక్షిణలో నల్లని వర్ణం గలవాడా, కన్యా మిథునరాసులకు అధిపతి అయినవాడా, ఉత్తరదిశలో బాణరూపమండలంలో వసించేవాడా, శ్రీబుధరాజా మాకు మేలు కలిగింతువు గాక!
  • ఐదో ప్రదక్షిణలో అంగీరసగోత్రుడా, ధనుస్సు, మీనరాసులకు అధిపుడా, దేవగురువైన బృహస్పతీ, శ్రీగురుభగవానుడా, మాపై కరుణను వర్షించు!
  • ఆరో ప్రదక్షిణలో భార్గవగోత్రం గలవాడా, దైత్యగురువైన శుక్రాచార్యుడా, స్త్రీభోగాలను ప్రసాదించేవాడా, మా పైన కరుణావృష్టిని కురిపించు అని స్మరించుకోవాలి.
  • ఏడో ప్రదక్షిణలో కాశ్యపగోత్రుడూ, కుంభ మృగశీర్షాలకు అధిపతి అయినవాడూ, దీర్ఘాయువును ప్రసాదించేవాడూ అయిన శ్రీశనైశ్చరుడా, మాకు మంగళాలు కలిగేలా చూడు!
  • ఎనిమిదో ప్రదక్షిణలో సింహికాగర్భసంభూతుడా, దక్షిణాన దక్షిణముఖంగా నక్షత్రమండలంలో వుండేవాడా, శ్రీరాహుభగవానుడా మాకు సదా మంగళాలు కలిగిచు!
  • తొమ్మిదో ప్రదక్షిణలో జైమినిగోత్రికుడా, గంగాయాత్రను సంప్రాప్తింపజేసేవాడా, రౌద్రస్వరూపంతో వుంటూ, రుద్రాత్మకుడుగా పేరు పడినవాడా, శ్రీకేతుభగవానుడా మాకు మేలు కలుగజేయి!అంటూ ప్రార్థించుకుంటూ ప్రదక్షిణలు చేయాలి

Thursday, January 3, 2019

పెళ్లిళ్లలో చేస్తున్న పొరపాట్లు

** ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం
దీనివలన వచ్చే నష్టం
అన్యోన్యత లేకపోవటం భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం

** జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో ఒకరు చూపులు నిలపకపోవటం ( వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం)
(పోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం‌ ఆచరించాకే మిగతావి)

దీనివలన కలిగే నష్టం
వారిమధ్య ప్రేమ లోపించటం

**ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం

దీనివలన కలిగే నష్టం
సంస్కారం లోపించటం

** తలబ్రాలకి బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం

దీనివలన
బంధు ద్వేశం ఆర్దిక ఇబ్బదులు

** బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి రావటం వధూవరులని ఆశీర్వదించటం

దీనివలన మంటపంలొ ఉండే దేవతలు వెళ్లిపొయి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనటం

** బఫే భోజనాలు
దీనివలన అన్నదాన ఫలితం పొందక పోవటం

** వేదమంత్రాలు మైకుల్లో వినకుండా వాటిస్థానంలో సినిమా పాటలు వినటం

దీనివలన దైవ కటాక్షం దూరమవ్వటం

ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని భగవంతుడి కృపకు పాత్రులై మంచి జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పదిమందికీ ఆదర్షంగా నిలవండి

" శాంతాకారం - శ్లోకంలోని అద్భుత భావన "








శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధా(కా)రం గగన సదృశం, మేఘవర్ణం శుభాంగం!
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైక నాథం!!







ఇందులో సృష్టిక్రమం..సృష్టిని పాలించే ఈశ్వర స్వరూపం..ఒక చక్కని క్రమపద్ధతిలో నిబద్ధించారు.

శాంతాకారం
సృష్టికి పూర్వం ఈ జగమంతా శాంత స్థితిలో ఉన్నది.
శాంతం, శమనం – అంటే అన్నీ లయించిన స్థితి.
అనేకంగా ఉన్న వృక్షం, బీజంలో లీనమయినట్లుగా, సర్వ జగతి, పరమాత్మయందే లీనమై ఉన్న స్థితి – శాంతి.

ఏ వికారమూ లేని పరిపూర్ణత్వాన్ని కూడా, ఈ శబ్దం తెలియజేస్తోంది.
శాంతమే తన స్వరూపంగా కలిగిన పరమాత్మ.

భుజగ శయనం
భుజగశయనుడు..అనంత కాలతత్త్వమే అనంతుడు – ఆదిశేషువు – భుజగము.
ఈ కాలానికి ఆవల కాలాన్ని అధిష్ఠించిన ఈశ్వరుడే భుజగశయనుడు.

కాలానికి లొంగి ఉన్నవి లోకాలు.
కాలాతీతుడు, కాలం ద్వారా జగతిని శాసించే భగవానుడు కాలభుజగశయనుడు.

పద్మనాభం
సృష్టికి తగిన కాలాన్ని అధిష్ఠించిన నారాయణుని సంకల్పం మేరకు, సృష్టి బీజాల సమాహార రూపమైన పద్మం, ఆయన నాభీ కమలం నుండి ఆవిర్భవించింది.

సృష్టిగా విచ్చుకుంటున్న బీజ స్వరూపమే పద్మం.
దానికి నాభి (కేంద్రం) విష్ణువే.
అందుకే ఆయన ‘పద్మనాభుడు’.

సురేశం
విశ్వపు తొలిరూపమైన ఆ పద్మమందు,
విష్ణు శక్తియే సృష్టికర్తగా, బ్రహ్మగా వ్యక్తమయింది.
నలువైపులా దృష్టిని ప్రసరించి తన నుండి జగన్నియామక శక్తులైన వివిధ దేవతలను వ్యక్తీకరించాడు బ్రహ్మ.

జగతికి మేలు(సు)కలిగించే వారే సురలు
(సు- అంటే మేలు, ‘రాతి’ అంటే కలిగించు వాడు. సుం-రాతి – మేలును కలిగించువారు సురలు).

ఈ దేవతా శక్తులతో విశ్వమంతా నిర్మితమయింది. నిజానికి దేవతా శక్తులు స్వతంత్రులు కాదు.
ఆ శక్తులన్నీ ఆదిమూలమైన వాసుదేవుని కిరణాలే.
అందుకే ఆ సురలందరికీ తానే నియామకుడై ‘సురేశు’డయ్యాడు.

విశ్వాధారం
కనిపిస్తున్న విశ్వాన్ని నియమించే సూక్ష్మ శక్తులు ‘సురలు’. వారితో పాటు విశ్వానికి సైతం ఆధారమై ఉన్న చైతన్యం ఆ వాసుదేవుడు.
సమస్తమునకు ఆధారమై ఉన్నందున అతడే ‘విశ్వాధారుడు’.
కనిపించే జగమంతా ఆయన చైతన్యంతో నిండి ఉన్నందున ఆతడే ‘విశ్వాకారుడు’ కూడా.

నదిలో అలలన్నిటికీ జలమే ‘ఆధారం’.
అలల ‘ఆకారం’  అంతా జలమే.
జలం అలలకు ఆధారమై, ఆకారమై ఉన్నట్లే..
విశ్వాధారుడై విశ్వాకారుడై పరమాత్మయే ఉన్నాడు.

గగన సదృశం
ఇది ఎలా సంభవం?
ఆకాశంలో వ్యక్తమయ్యే సమస్తము నందూ, ఆకాశమే ఉన్నది.
సమస్తమూ ఆకాశము నందే ఉన్నది.
అదేవిధంగా ఆకాశంతో సహా,
సమస్త విశ్వమూ ఎవరియందు,
ఎవరిచే వ్యాప్తమై ఉందో,
అతడే పరమాత్మ.
అందుకే ఆయన ‘గగనసదృశుడు’(గగనం వంటివాడు).

ఇదే భావాన్ని ‘ఆకాశాత్ సర్వగతః సుసూక్ష్మః’ అంటూ ఉపనిషత్తు ప్రకటిస్తోంది.
ఇది నిరాకారుడైన పరమేశ్వరుని తెలియజేస్తోంది.

మేఘవర్ణం
నిరాకారుడై సర్వవ్యాపకుడైన ఆ పరమాత్మయే..
తన లీలా శక్తితో భక్తులను అనుగ్రహించడానికై దివ్యమంగళ విగ్రహుడై సాకారుడయ్యాడు.
ఆ సాకారం ‘మేఘవర్ణం’ (మబ్బువన్నె)గా ఉన్నది.

శుభాంగం
మేఘం నీటితో నిండి తాపాన్నీ, దాహాన్నీ పోగొడుతుంది. అదేవిధంగా కరుణారసంతో నిండిన విష్ణు మేఘం, సంసార తాపత్రయాల్ని పోగొట్టి, జ్ఞానదాహాన్ని తీర్చుతున్నది.
అందుకే అది నీలమేఘశ్యామం.
ఆ శ్యామల వర్ణ దేహంలో ప్రత్యంగమూ శుభమే. ప్రాపంచిక దేహాలు ప్రకృతి దోషాలతో కూడి ఉంటాయి కనుక అవి అశుభ రూపాలే.
కానీ స్వామి దాల్చిన విగ్రహంలో అవయవాలు శుభ స్వరూపాలు.
తలచే వారికి శుభాలు కలిగించే స్వభావంతో దివ్యమంగళ స్వరూపంగా భాసిస్తున్నాడు భగవానుడు.
అందుకే ఆయన రూపం ‘శుభాంగం’.

లక్ష్మీ_కాంతం
ప్రపంచాన్ని పోషించే ఐశ్వర్యాలన్నీ ఆయనను ఆశ్రయించుకున్నాయి.
ఐశ్వర్యాల అధిదేవత లక్ష్మి ఆయననే చేరి,
ఆయన సంకల్పానుగుణంగా ప్రవర్తిస్తున్నది.
అందుకే ఆ శుభ స్వరూపం ‘లక్ష్మీకాంతం’.

కమల_నయనం
ఐశ్వర్య దేవతకు ప్రీతికరం.
కమలముల వలె విచ్చుకున్న సూర్యచంద్ర కాంతులతో జగతిని గమనిస్తున్న కరుణామయ దృష్టి కల భగవానుడు ‘కమలనయనుడు’.

యోగిహృద్యానగమ్యం
ఇటువంటి విష్ణుతత్త్వం, స్వరూపం అందరూ అందుకోలేరు.
యోగులు మాత్రమే ఏకాగ్రమైన దృష్టితో ధ్యానం ద్వారా తమ హృదయాలలో దర్శించగలుగుతున్నారు.
ఆ కారణం చేతనే అతడు ‘యోగిహృత్ ధ్యానగమ్యుడు’.

వందే విష్ణుం  భవ భయహరం
విశ్వమంతా వ్యాపించిన పరమేశ్వరుడు కనుక ‘విష్ణువు’.
ఈ తత్త్వాన్ని గ్రహించి, శుభాంగాన్ని ధ్యానించే వానికి ఈ సంసారంలో భయాలు తొలగి, అవిద్య నశిస్తున్నది. అందుకే ఆ స్వామి ‘భవభయహరుడు’.

సర్వలోకైకనాథమ్
సర్వలోకములకు ప్రధానమైన నాథుడు అతడే ‘సర్వలోకైకనాథమ్’.

14నామాలతో ‘విశ్వానికీ – విష్ణువునకు’ ఉన్న అభిన్న సంబంధాన్ని, ఈ శ్లోకం స్పష్టపరుస్తోంది.

ఒకే శ్లోకంలో, విశ్వానికి పూర్వ స్థితి నుండి సృష్టి స్థితులను కూడా నిర్వహిస్తున్న భగవత్తత్త్వాన్ని స్పష్టపరచడం, ఆర్ష దృష్టి వైభవం.

ఇంత స్పష్టంగా పరమేశ్వరుని గొప్పతనాన్ని,
ఆయనలోని సాకార నిరాకార తత్వాలను తెలియజేస్తూ యోగపూర్వక ధ్యానం ద్వారా,
మన హృదయాలలోనే ఆయనను దర్శించగలమనే, సాధనా రహస్యాన్ని కూడా, ఈ శ్లోకం అందిస్తోంది.

అర్థస్ఫూర్తితో దీనిని పఠిస్తే,
దీనిలో పరిపూర్ణ పరమేశ్వర తత్త్వాన్ని,
సులభంగా అందుకోగలం.

ఇలా విశ్లేషిస్తే – ధ్యానశ్లోకాలలో విశ్వ నిర్వాహక విశ్వేశ్వర విజ్ఞానాన్ని మరింతగా తెలుసుకోవచ్చు.

(పూజ్య గురువులు బ్రహ్మశ్రీ  సామవేదం షణ్ముఖ శర్మ గారి  వ్యాసం)

తంత్ర మార్గం - చక్ర విజ్ఞానం

విశ్వచైతన్య శక్తి మానవశరీరములోనికి ఏడుచక్రాలు ద్వారా ప్రవహిస్తుంది. ఈ ఏడు దేవతా శక్తుల ఆధీనంలో పనిచేస్తున్నాయి.  ఒక్కో శక్తిచక్రం ఒక్కోతత్త్వంతో సంబంధం కలిగియుంటుంది. ఈ చక్రాలు శారీరక వ్యవస్థలతోనూ, మానసిక స్థితులతోనూ సంబంధం కలిగియుంటాయి. అలానే ప్రతిచక్రానికీ శారీరక మానసిక లేక ఆధ్యాత్మిక విధులు ఉంటాయి. పూర్వజన్మలలోని పాపపుణ్యాలు(ప్రారబ్దాలు) బట్టి ఈ చక్ర, గ్రహ దేవతలు విశ్వచైతన్యశక్తిని ఆయాచక్రాల ద్వారా శరీరంలోనికి సరఫరా చేయడం జరుగుతుంది. పూర్వజన్మలోని పాపపుణ్యాలకు అనుగుణంగా  జరిగే ఈ శక్తి పంపకంలోని హెచ్చుతగ్గులు వ్యక్తీ మనస్సు పైనా, శరీరం పైనా పనిచేస్తూ జీవితగతిని నిర్దేశిస్తుంది.

ముందుగా మూలాధారచక్రం గురించి తెలుసుకుందాం -

మూలాధారచక్రం :-

ఐం హ్రీం శ్రీం సాం హంసః మూలాధిష్టాన దేవతాయై సాకినీసహిత గణనాధ స్వరూపిణ్యైనమః
మూలాధారంబుడా రూఢ పంచవక్త్రాస్థి సంస్థితా 
అంకుశాది ప్రహరణా వరదాది నిషేనితా 
ముద్గౌదనా సక్త చిత్తా సాకిన్యం బాస్వరూపిణీ 

ఈ కమలం 4 దళాలు కలది. పృధ్వీతత్త్వం కలది. రక్తవర్ణం కలది. అధిష్టానయోగిని దూమవర్ణం కలిగి పంచవక్రాలు త్రినేత్రాలు కలిగి సృణి,కమలం, పుస్తకం, జ్ఞానముద్ర ధరించి, ఆస్థిధాతువునాకు అధిపతియై యున్నది. ముద్గాన్నప్రీతి కలది. వ శ ష  స అను యోగినీ శక్తులచే సేవించబడే ఈమె సాకినీశక్తిగా ఆరాధించబడుచున్నది. నల్లని ఏనుగు ఈమె వాహనం.

వెన్నెముక చివరిభాగంలో అంటే మలరంద్రానికి సుమారు రెండు అంగుళాల పైభాగాన విలసిల్లే మూలాధారచక్రం మనలో 7,776నాడులతో సంధానింపబడి వుంటుంది. భౌతిక శరీరానికి శక్తికేంద్రం మూలాధారచక్రం. ఇదే మొదటిచక్రం. కుండలినీ శక్తి దాగి వున్నది ఇందులోనే. ఇతర శక్తులన్నింటికి మూలం ఇదే. మూలమైన ఆధారం ఇదే కనుక మూలాదారకేంద్రమన్నారు. మూలాధారచక్రంకు పంచకోశాలలో అన్నమయకోశంతో సంబంధం. శ్వాసకోశవ్యవస్థతో సంబంధం. జ్ఞానేంద్రియం 'ముక్కు'. జన్మకూ, పునర్జన్మకు ఇది మూలస్థానం. ఈ మూలాధారంలోని శక్తి రెండు విధములుగా (సృష్టి, ప్రతిసృష్టి) పనిచేస్తుంది. అంటే మనిషి జన్మించేది ఈ శక్తివల్లనే. జన్మరాహిత్యం కలిగేది ఈ శక్తివల్లనే. ఒకటి జన్మతః కలిగే శక్తి. రెండవది యోగంతో ఆర్జించుకున్న శక్తి. ఇది సరిగ్గా పనిచేయకపోతే పునసృష్టి జరగదు. ఈ చక్రప్రేరణ వలెనే ప్రతిజీవి సృష్టికార్యం చేస్తుంది. రెండవశక్తి జన్మరాహిత్యం కలిగించే శక్తి. ఇది బ్రహ్మచర్యం వలన సాధ్యమౌతుంది. బ్రహ్మచర్యం అంటే సంసారజీవితమును త్యజించడం కాదు, సంభోగేచ్ఛను అణుచుకోవడం కాదు. బ్రహ్మత్వసిద్ధికి అవసరమైన శక్తిని ధ్యానయోగం ద్వారా సాధించడం. ఇందుకు నీతి, నియతి, నిగ్రహం పాటించాలి. బ్రహ్మచర్యం గురించి మరింత వివరణకై  ఇక్కడ చూడండి.

ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే -

శారీరకంగా అర్ద్రైటిస్ వెన్నెముకకు సంబంధించిన సమస్యలు, ఎముకల బలహీనత, రక్తంలో మార్పుల వలన జనించే రుగ్మతలు, బోన్ కేన్సర్, లుకేమియా వంటి వ్యాధులు, ఎలర్జీ, రోగనిరోధకశక్తి లోపించడం, గాయాలు సరిగ్గా మానకుండా ఉండడం లాంటి రుగ్మతలకు కారణభూతమౌతుంది. 

ఈ చక్ర మానసిక స్వభావం -

మూసుకుపోవడం వలన భయం, ఆందోళన, అభద్రతాభావం, ఆక్రమణతత్త్వం, అస్థిరత్వం, ఆత్మహత్య ప్రలోభం, స్వార్ధం. తమోగుణం. ప్రాపంచిక సౌఖ్యాలవైపు మోజు కలిగియుండి పరధ్యానస్థితిలో వుంటుంది.

తెరుచుకుంటే ధైర్యం, స్థిర సంకల్ఫం, పవిత్రత, నిస్వార్ధం, జీవితం మీద మమకారం, పారమార్ధికజ్ఞానం కల్గుతాయి.

అలానే ఈ నాడీ కేంద్రం నేను నాది అనే అహంకారానికి వేదిక.

మరి ఈ చక్రంను ఎలా శుద్ధి చేసుకోవడం???

శాస్త్ర ప్రకారం పరిశీలిస్తే -

ఈ చక్రమునకు సాకిని దేవత. ఈ పరాశక్తి  ఎముకలపుష్టిని అనుగ్రహిస్తుంది. ఈ దేవత 'ముద్గౌదనా సత్తా చిత్తా' అని వర్ణింపబడింది. అనగా ఈ దేవతకు పులగం ఇష్టమని చెప్పుదురు. దీనికర్ధమేమనగా శరీరం నందు ఎముకల పెరుగుదల చక్కగా లేనివారు ఆహారమందు ఈ పులగంను ప్రధానాహారంగా స్వీకరించినచో సర్దుబాటగును. వ్యాదులనుబట్టి అవసరమైనచో కొన్ని ఔషదములను ఉపయోగిస్తూ,  బీజాక్షరం "లం" ధ్యానించువారికి ఈ బాధలు నివారణ కాగలవు.

శారీరక వ్యాధి కానివ్వండీ, మానసిక వ్యాధి కానివ్వండీ అవన్నీ పుట్టుకొచ్చేవి మన లోపల్నుంచే. మనకు బయటసంఘటనలకంటే మన అపవిత్రత వలెనే దుఃఖం వస్తుంది. మన బాధలన్నింటికీ సృష్టికర్తలం మనమే. బాధలు రెండు రకాలు. ఒకటి సముచితమైనవి. ఇవి ప్రారబ్ధవశాత్తు వచ్చేవి. రెండవది  అసంగతమైనవి. పరిస్థితికి ఎంతమాత్రం పొంతన లేని ఆలోచనలు. ఊహలు ఇవే అసంగతమైన బాధలు.

చాలావరకు మనబాధలకు కారణం - మనలో మనకే తెలియని, తెలుసుకోలేని నెగిటివ్ నెస్. అందుకే మన పూర్వీకులు అంటుంటారు - 'మంచిగా ఆలోచించు, ఆనందంగా వుండు'. 'మన ఆలోచనలే మన జీవితం'. 'శుభాన్ని కోరుకో, సుఖంగా జీవించు'. 'మన ఆలోచనలే మన అనుభవాలు'. 'మతి బట్టే గతి'... అని! అలానే చెడు, కీడుల గురించి మాట్లాడటాన్ని వారెప్పుడూ వారిస్తుంటారు. అలాగే మానవాళి శ్రేయస్సుకై పెద్దలు ఎన్నో సూక్ష్మ సరళ పద్ధతులను బోధించారు. మనిషిని శారీరకంగా, మానసికంగా, సుఖవంతంగా, ప్రశాంతంగా ఉంచడంకోసం ఎన్నో చిట్కాలను ప్రతిపాదించారు. వారు సూచించిన పద్ధతులు ఏమిటంటే -

మూలాధారచక్రంలో జాగృతి తీసుకురావాలంటే -

నేలపై కూర్చోవడం, భూమిని తాకడం, చెప్పులు లేకుండా నడవడం, మొక్కలు చెట్లును కౌగిలించుకోవడం, కన్నతల్లితో కలసి వుండడం, ధ్యానం చేయడం. 

మూలాధారచక్రంనకు అధిపతి గ్రహం శనిమహాత్ముడు. ఈ దేవతతో సరైన సంబంధం లేకుంటే బ్రతుకుకు ఆధారమే లేదు. కష్టించి పనిచేసే విధానానికి, శ్రమశక్తికి ప్రతినిధి శని. అలానే ముసలివాళ్ళకు రోగులకు ఆకలిగొన్నవాళ్ళకు ఈయనే ప్రతినిధి. బద్ధకస్తులను ముదుసలివారిపట్ల, రోగులపట్ల, ఆకలిగొన్నవారియందు అలక్షంగా వున్నవారిని తీవ్రంగా దండిస్తాడు. కాబట్టి  కష్టించి పనిచేసే తత్త్వం, సేవాతత్వం అలవర్చుకోవడం వలన శనిమహాత్ముని అనుగ్రహం పొందవచ్చు. ఈ చర్యలతో మూలాధారంను జాగృతి పరచవచ్చు.

ధ్యానం, సేవ అనేవి రెండు శక్తివంతమైన సాధనములు. ధ్యానం లేని సేవ, సేవ లేని ధ్యానం పూర్ణజ్ఞానసిద్ధిని కల్గించలేవు. సేవ, ధ్యానం రెండు కూడా మనోశుద్ధి ప్రక్రియలు, పాపనాశన సాధనములు. (పాప ప్రక్షాళన సాధనములు) సేవ స్థూలంగా మనస్సుని శుద్ధి చేస్తే, ధ్యానం సూక్ష్మంగా మనస్సును శుద్ధి చేస్తుంది. సేవ చేస్తేగాని ధ్యానం చేసే శక్తి కలగదు, ధ్యానం చేస్తేగాని సేవ పవిత్రంగా జరగదు. చక్కగా ధ్యానం చేస్తే, చేసే సేవ పవిత్రంగా వుంటుంది. చక్కగా సేవ చేస్తే చేసే ధ్యానం నిశ్చలంగా వుంటుంది. ప్రశాంతంగా వుంటుంది.

సేవ వలన చిత్తశుద్ధి చేకూరుతుంది. అహంకార నిర్మూలన జరుగుతుంది. అహంకారాన్ని జయించటమే ఈ చక్రాన్ని జయించటమౌతుంది.

స్వాధిష్టానచక్రం :-

ఐం హ్రీం శ్రీం కాం సోహం స్వాధిష్టానదేవతాయై కాకినీ సహిత బ్రహ్మస్వరూపిణ్యైనమః

ఈ కమలం ఆరు దళాలుగల అగ్నితత్త్వం కలది. అధిదేవత కాకిని. ఈమె బ, భ, మ, య, ర, ల అను యోగినులచే సేవించబడుతున్నది. వాహనం మొసలి. 'మేధోనిష్టా మధుప్రీతా బందిన్యాది సమన్వితా / దధ్యాన్నాసక్త హృదయా కాకినీ రూపధారిణీ // మేధోదాతువునకు అధిష్టానదేవతయైన ఈమెకు పెరుగన్నం ప్రీతి. 

స్వాధిష్టానం (స్వ + అధిష్టానం) తనను తానుగా సమాజంలో నిరూపించుకోవడానికి అవసరమైన శక్తిని ఇది సమకూరుస్తుంది. అనేకజన్మలనుండి వెంటతెచ్చుకునే పాపపుణ్యాలను అనుభవంనకు తీసుకొచ్చే చక్రమిది.

జననేంద్రియము వెనుకభాగమున వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 11,664 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది. ఇది స్త్రీలల్లో ఓవరీస్ కు, పురుషులలో టెస్టిస్ కు ప్రాణశక్తినిస్తుంది. గర్భస్థశిశువుకు ప్రాణశక్తినిచ్చే చక్రమిదే.  జీవునకు తల్లి గర్భమునందు స్థానమేర్పడుటకు మూలాధారచక్రం కారణం కాగా, అటు తర్వాత పిండం భౌతిక శరీరంగా ఏర్పడుటకు కావాల్సిన ప్రాణశక్తిని ఈ చక్రమే ఇచ్చుచున్నది.

ఈ ప్రాణశక్తి వలనే శరీరవ్యాపారాదులు నడుచుచున్నవి. శరీరంలోని ఉష్ణోగ్రత ఈ చక్రంనకు సంబంధించినదే. జీర్ణశక్తి అధికమవ్వడానికి తోడ్పడుతుంది. ప్రాణవాయువు ఊపిరితిత్తులనిండా వ్యాపించటానికి ఈ చక్రం సహాయకారి అవుతుంది. ఈ చక్రంకు పంచకోశాలలో ప్రాణమయకోశంతో సంబంధం. శారీరక వ్యవస్థలోని విసర్జక వ్యవస్థతో సంబంధం. జ్ఞానేంద్రియం కన్ను. రాజస తామస గుణాలతో వుంటుంది. పునరుత్పత్తి కు సహాయకారి.  దీనిలోశక్తి  చైతన్యరూపంలో మనిషిలో ప్రవహిస్తూ ప్రాణమయ కోశానికి శక్తినందిస్తుంది

ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే -

శారీరకంగా పాండురోగం, కంటిజబ్బులు, గర్భకోశ వ్యాదులు, జ్వరాలు లాంటి రుగ్మతలకు కారణమౌతుంది.

ఈ చక్ర మానసిక స్వభావం -

మూసుకుపోవడం వలన మితిమీరిన కామవాంఛ. విషయసుఖాలపై ఆసక్తి, అపరాధభావన, దురాశ, క్రోధం, అనుమానం, ఉద్రేకం జూదరితనం, వివాదాస్పదతత్త్వం, నిరాశనిస్పృహలు. 

స్వాధిష్టానం తెరుచుకుంటే సత్యం అవగాహన అవుతుంది.  జీవియందలి 'నేను' అను వ్యక్తిగత ప్రజ్ఞయే అహంకారం. అట్టి అహంకారంవలన జీవుడు తనను తానూ పరమాత్మ నుండి వేరుచేసుకొనుచున్నాడు. ఇది జీవియందు నేనున్నాను అను సంకల్పంగా పనిచేయుచున్నది. తానేమిటో మర్చిపోయిన మనిషి ఆ మరిచిపోయిన సత్యానికై బయట దొరుకుతుందని వెదుకులాడుతూ తపన చెందుతున్నాడు, బాహ్యంగా గోచరిస్తుందని భ్రమిస్తున్నాడు, బయట నుండి సంపాదించవచ్చని ఆరాటపడుతున్నాడు, బాహ్యంగా దర్శించవచ్చని తాపత్రయపడుతున్నాడు. ఓ చర్యలో, సంఘటనలో, సన్నివేశంలో, పరిచయంలో ఈ సత్యం లేదని, అది బయటనుండి రాదనీ, మనలోనుండే రావాలని, అంటే తనలో తానై ఈ సత్యం వుందన్న అవగాహనయ్యేది  ఈ చక్రశుద్ధి వలనే . 

ప్రాణశక్తి చక్కగా ఆవిర్భవిస్తుంది. ఈ చక్రాన్నిఅధిగమిస్తే ఇంద్రియాలన్నింటిపైన నియంత్రణ కల్గుతుంది.

అలానే ఈ నాడీకేంద్రం  అంతర్గత సంస్కారానికి వేదిక.

మరి ఈ చక్రంను ఎలా శుద్ధి చేసుకోవడం ???

శాస్త్ర ప్రకారం పరిశీలిస్తే -

ఈ చక్రంనకు కాకిని దేవత.  మేధోదాతువునకు అధిష్టానదేవతయైన ఈమెకు పెరుగన్నం ప్రీతి.  ఈ చక్రం బలహీనంగా ఉంటే పెరుగన్నంను బలం కలుగుటకు స్వీకరించాలి. కాచిన పాలలో అన్నం వేసి తోడుపెట్టి ఉదయముననే ఆ పెరుగన్నం తినవలెను.వ్యాదులనుబట్టి అవసరమైనచో కొన్ని ఔషదములను ఉపయోగిస్తూ,  బీజాక్షరం "వం" ధ్యానించువారికి ఈ నాడీకేంద్రం వలన వచ్చే బాధలు నివారణ కాగలవు.

ఈ  చక్రంలో జాగృతి తీసుకురావాలంటే -

కరుణ, వాత్సల్యం, ప్రేమ, అనురాగం, మైత్రిల్లాంటి సద్గుణాలను అలవర్చుకోవాలి. అలాగే అహింసా వ్రతం(ఏ ఒక్కర్నీ మాటలతోగానీ, చేతలతోగాని నొప్పించి,బాధించే ప్రవృత్తి లేకుండా వుండడమే అహింస) ఆచరించాలి.
అలాగే ఈ చక్రమునకు అధిపతి శుక్రుడు. ఉల్లాసానికీ, మర్మాంగాలకు, కామప్రకోపానికీ అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు విశేషించి స్త్రీల జబ్బులకు కారణభూతుడు. ఈ గ్రహం సానుకూలంగా వుండాలంటే -

హాయిగా నవ్వాలి. ఆనందంగా సంతోషంగా వుండాలి. సంగీతం, నాట్యం, రచన, హాస్యచతురత ఈ గ్రహపరిధిలోనివే. అందుచే యాంత్రికతకు భిన్నంగా మనస్సును రంజింపజేసే వినోదకార్యక్రమాలు, లలిత కళలలో పాల్గొంటూ, ఒకింత కళాపోషణ అలవర్చుకోవాలి. గాయత్రీ మంత్రాన్ని జపించడం, తాను నొవ్వక ఎదుటివార్ని నొప్పించక జీవించడం, మన భావాలు మరొకరికి భారం కాకుండా, బాధ కల్గించకుండా చూసుకోవడం లాంటివి ఆచరించగలిగితే శుక్రగ్రహం అనుగ్రహంతో స్వాధిష్టానం అనుకూలించి జాగృతి అవుతుంది.

మణిపూరకచక్రం :-

ఐం హ్రీం శ్రీం వాం హం సస్సోహం మణిపూరాధిష్టానదేవతాయై లాకినీ సహిత వైష్ణవ స్వరూపిణ్యాంబాయై నమః 

ఈ కమలం పది దళములు గల జలతత్త్వం కలది. అధిదేవత లాకిని. ఈమె డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ అను యోగినులచే ఆరాధింపబడుచున్నది. వాహనం పొట్టేలు.  'గుడాన్నప్రీతిమానసా /సమస్త భక్తసుఖదా లాకిన్యాంబ స్వరూపిణీ/ సర్వజనులకు సుఖాలు ఇచ్చే ఈ అధిదేవతకు బెల్లపు పొంగలి ప్రీతి.

బొడ్డునకు మూలంలో వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 4,536 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది.ఈ చక్రమందు ఉద్భవించే శక్తి మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసి సారాన్ని శరీరంనకు అందిస్తుంది. ఈ చక్రంనకు పంచకోశాలలో ప్రాణామయకోశంతో సంబంధం. శారీరకవ్యవస్థలోని జీర్ణవ్యవస్థతో సంబంధం. జ్ఞానేంద్రియం నాలుక. పుట్టుట, జీవించుట, మరణించుట అను మూడు బిందువులతో కూడిన త్రికోణమే జీవసృష్టి. అట్లే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం అను మూడు కేంద్రాలతో ఒక త్రికోణం ఏర్పడుచున్నది. ఈ త్రికోణమే భౌతికసృష్టికాధారం. ఈ మూడు చక్రాలు భౌతిక జీవితం సజావుగా సాగడానికి సహకరిస్తాయి.

ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే -

అవయవములయందు నీరు చేరుట, నోటికి సంబందినవ్యాదులుకు కారణమౌతుంది. నియమాలు లేని ఆహారపు అలవాట్లువలన జీర్ణశక్తి మందగించి అజీర్తి, గాస్ట్రిక్ సమస్యలు కల్గుతాయి. ఉదరకోశ వ్యాధులు, గుండె బలహీనత, నిద్రలేమి, తలబరువు, కాలేయవ్యాధులు, అతిమూత్రవ్యాధి, రక్తక్షీణత, నేత్రవ్యాధులు కల్గుతాయి.

ఈ చక్ర మానసిక స్వభావం -
మూసుకుపోవడం వలన కీర్తికండూతి, పెత్తనం చెలాయించాలనే అహం, అసూయ, అసహనం, దుడుకుతనం, క్రూరత్వం, కటుత్వం, స్వలాభపరులు, స్వార్ధపరులు.  తనను గురించి తాను తక్కువగా ఆలోచిస్తూ కుంగిపోవడం.

తెరుచుకుంటే లక్ష్యసాధన, ఆశయసిద్ధి, వ్యవహార దక్షత, ఉత్సాహం, ధనాపేక్ష, తన్ను తాను గౌరవించుకోవడం, ఆత్మవిశ్వాసం కల్గివుండడం, జీవితంలో అన్నింటా ముందడుగు.

ఇక్కడే మనిషికి ఆలోచన ఏర్పడుతుంది. అనుమానాల్ని నివృత్తి చేసుకుంటూ, చక్కగా ఆలోచిస్తూ, అన్నింటినీ అవగాహనతో విశ్లేషించుకుంటూ, విశ్వాస, వివేక జ్ఞానంలను అలవర్చుకుంటూ ముందుకు సాగాలి. మనలో విశ్వాసం, అవిశ్వాసం, నమ్మకం, అపనమ్మకం రెండూ ఏర్పడేది దీనివలనే.

లక్ష్యసాధనకు ఉపయోగపడే చక్రం. లక్ష్యసాధనలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ వుంటాయి. పరాజయాలు పలకరిస్తుంటాయి. ఇది సహజం. సాధిస్తాం, తప్పకుండా విజయం సాధిస్తాం అన్న ఆశావాదం పెంచుకొని, నిరాశావాదాన్ని మదినుండి తరిమివెయ్యాలి, చిన్న చిన్న అనారోగ్యాలని, అవరోధాల్ని, అవమానాల్ని కుంటిసాకులుగా చెప్పుకొని ఆగిపోక ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయాలి. ఓటమి అన్నది గుణపాఠమే గానీ, అంతిమతీర్పు కాదని గ్రహించాలి. 

మరి ఈ చక్రంను ఎలా శుద్ధి చేసుకోవడం???

శాస్త్రప్రకారం పరిశీలిస్తే -

ఈ చక్రమునకు లాకిని దేవత. సర్వజనులకు సుఖాలునిచ్చే ఈ దేవతకు బెల్లపు పులగం ప్రీతి. ఈ చక్రం బలహీనంగా వుంటే బెల్లపు పులగంను స్వీకరిస్తూ, వ్యాధులబట్టి అవసరమైనచో తగు ఔషదములను వినియోగిస్తూ, బీజాక్షరం "రం" ధ్యానించువారికి ఈ నాడీకేంద్రం వలన వచ్చే బాధలు నివారణ కాగలవు.

ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే -

అనుభూతులను (ఆనందంగానీ, విచారం గానీ, దుఃఖం గానీ, ఆవేశం గానీ... ) లోపల దాచుకోకుండా సహజంగా బయటకు వెళ్లనీయాలి. దీర్ఘంగా శ్వాసించడం చేయాలి.

అలాగే ఈ చక్రంకు అధిపతి గురుడు. ఆరోగ్యంగా వుండాలన్న, సంపదలు కలిగి వుండాలన్న, సుఖంగా వుండాలన్నా, ఈ చక్రం బలంగా వుండాలి. సప్తచక్రాలలో ఈ చక్రం ప్రత్యేకంగా ప్రతిపత్తి కలది. అదే మాదిరిగా నవగ్రహాలలో గురుగ్రహం ఓ ప్రత్యేకమైన శుభగ్రహం. బ్యాంక్ బాలెన్సు నుండి మెంటల్ బాలెన్సు వరకూ ఆధిపత్యం ఈ గురుగ్రహనిదే.

చెడు అలవాట్లు జోలికి పోకుండా, ముందొకటి వెనుకొకటి మాట్లాడక, నాస్తికత్వం వదిలి, చక్కటి వ్యక్తిత్త్వంను అలవర్చుకుంటే ఈ గ్రహం, చక్రం సక్రమంగా పనిచేస్తాయి.

తటిత్వం తం శక్త్యాతిమిర పరిపంథి స్పురణయా
స్పురన్నానారత్నాభరణ పరినద్ధేంద్రధనుషమ్
తమశ్యామం మేఘం కమపి మణిపూరైక శరణమ్
నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనమ్

మణిపూరకమందున్న మేఘం శ్యామవర్ణము కలది. అనిర్వాచ్యమైనది. అంధకారంను పోగొట్టు మెరుపుతో గూడినది. నానావిధ రత్నాభరణములచేత చేయబడిన ఇంద్రధనస్సు కలది. ప్రళయాగ్నిచే తప్తంలైన ముల్లోకములను చల్లపరుచును.

అనాహతచక్రం :-

ఐం హ్రీం శ్రీం శం హం సశ్శివస్శోహం అనాహతాదిష్టాన దేవతాయై రాకినీ సహిత సదాశివ స్వరూపిణ్యాంబాయైనమః

ఈ కమలం 12 దళాలు కలది. వాయుతత్త్వం. అధిదేవత రాకిని. ఈమె క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ  అను యోగినులచే సేవించబడుచున్నది. ఈమె 'స్నిగ్ధోదన ప్రియా' అంటే స్నిగ్ధాన్నమందు ప్రీతి గలది. జింక వాహనం.

హృదయం వెనుక వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 19,440 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది. అనాహతమంటే జీవశక్తిని నిరంతరం నిలిపి వుంచే స్థానం. ఆగని శబ్దబ్రహ్మం ఈ ప్రదేశంలో నినదిస్తూ వుంటుంది. ఈ శబ్దం రెండు వస్తువుల వల్ల ఉత్పన్నమైనది కాదు. అది అనాది శబ్దం. ఓంకార శబ్దం. ఈ చక్రాన్ని జయిస్తే సకలజీవరాసుల యెడల నిస్వార్ధమైన ప్రేమ ఉదయిస్తుంది. ప్రేమ ఓ దివ్యమైనశక్తిగా, విశ్వశక్తిగా నిరూపితమౌతుంది. ప్రేమ, దయ, కృతజ్ఞత, క్షమ అనేవి ఈ చక్రానికి సంబంధించిన అంశాలు. దిగువనున్న మూలాధారాది మూడుచక్రాలకు, ఎగువనున్న విశుద్ధాది మూడుచక్రాలకు ఈ అనాహతచక్రం ఇరుసుగా ఉండి రెండింటిని అనుసంధానిస్తూ పరిపూర్ణత్త్వంను కల్గించడానికి సూత్రదారిలా దోహదం చేస్తుంది. ఈ చక్రంనకు పంచకోశాలలో మనోమయకోశంతో సంబంధం. శారీరకవ్యవస్థలోని శ్వాసకోశవ్యవస్థతో సంబంధం. జ్ఞానేంద్రియం చర్మం.

ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే -

చర్మవ్యాధులు, రక్తంనకు సంబంధిన వ్యాధులు, శ్వాసకోశవ్యాధులు, రక్తహీనత, గుండెజబ్బులు, న్యూమోనియా మొదలగు రుగ్మతలు కల్గుతాయి. వ్యాధినిరోధకశక్తి తగ్గుతుంది.

ఈ చక్ర మానసిక స్వభావం :-

మూసుకుపోవడం వలన ప్రేమరాహిత్యం, కఠినత్వం, ఒంటరితనం, వ్యర్ధ ప్రలాపనలు, మానసిక ఒత్తిళ్ళు.

తెరుచుకుంటే ప్రేమ, దయ, కృతజ్ఞత, సకల జీవరాసుల యెడ నిస్వార్ధప్రేమ, ఇంద్రియవిజయం, నిర్మాణాత్మక ఆలోచనలు , విశ్వజనీనత వికసించటం.

మనోమయకోశంతో సంబంధం ఉన్న ఈ చక్రమందే ఆశయాలు, భావాలు, లక్ష్యాలు, స్వప్నాలు ఏర్పడుతుంటాయి. ఆలోచనలు సమగ్రముగా, సక్రమముగా వుంటే ఇచ్చాశక్తి (విల్ ఫవర్) పెరుగుతుంది. సంకల్పబలం చేకూరుతుంది. వాక్శుద్ధి కలుగుతుంది.

మరి ఈ చక్రమును ఎలా శుద్ధి చేసుకోవడం???

శాస్త్రప్రకారం పరిశీలిస్తే -

ఈ చక్రంనకు రాకినిఅధిష్టానదేవత. ఈమెకు స్నిగ్ధాన్నం నందు ప్రీతి. స్నిగ్ధాన్నం అనగా నేతితో కలిపిన అన్నం. ఈ చక్రం బలహీనంగా వున్నప్పుడు ఈ స్నిగ్ధాన్నం స్వీకరిస్తూ, వ్యాధులబట్టి అవసరమైనచో తగు  ఔషదములను వినియోగిస్తూ, బీజాక్షరం "యం" ధ్యానించువారికి ఈ నాడీమండలం వలన వచ్చేబాధలు నివారణ కాగలవు.

ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే -

ఇతరులకు హాని చేయకుండా వుండటం మాత్రమే కాదు, ఇతరులకు క్షేమం కల్గించటం అంటే ఇతరులకు మంచి చేయడం, అలాగే ఇతరులపట్ల ప్రేమానురాగాలు, ఆత్మీయత చూపాలి. అతిగా స్పందించడం ఈ చక్ర లక్షణం కాబట్టి సంపూర్ణ ఎరుకతో ధ్యానం చేయాలి. హాయి గొలిపే సంగీతం వినాలి. సేవాతత్పరత, క్షమాగుణం అలవర్చుకోవాలి.

ఇక  ఈ చక్రంనకు అధిపతి బుధుడు. ప్రతి ఆలోచననకు, ప్రతీ సంఘటనకు, ప్రతీ మాటకు అతిగా చలించడం, రకరకాల ప్రకంపనాలకు గురికావడంనకు కారణం ఈ బుధుడే. అతిగా చలించే స్వభావం బుధునిది. తీవ్ర ప్రతిస్పందన ఈ గ్రహ లక్షణమే. అందుచే అతి ఆలోచనలును, అతి తెలివిని తగ్గించుకొని, క్రమం తప్పని ధ్యానాబ్యాసం చేస్తూ, స్థిరంగా ఉండగలిగితే ఈ గ్రహం మనకు సానుకూలంగా పనిచేస్తుంది. తద్వారా ఈ చక్రం సక్రమముగా పనిచేస్తుంది.

విశుద్ధిచక్రం : - 

ఐం హ్రీం శ్రీం రాం సోహం హంసశ్శివం: విశుధ్యధిష్టానదేవతాయై డాకినీ సహిత జీవేశ్వర స్వరూపిణ్యాంబాయై నమః 

ఈ కమలం 16 దళాలుతో ఉంటుంది. ఆకాశతత్త్వం. అధిదేవత డాకిని. ఈమె అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఌ, ౡ, ఎ, ఏ , ఓ, ఔ , అం ,అః   అను యోగినులచే సేవించబడుచున్నది. ఈమెకు పాయసాన్నమందు ప్రీతి. తెల్లని ఏనుగు (ఐరావతం) వాహనం. 

కంఠప్రదేశం వెనుక వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 25,344 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది. విశుద్ధి అంటే పవిత్రం (శుద్ధి) చేసేది అని అర్ధం. ఈ చక్రాన్ని సాధిస్తే పరమ పవిత్రులై, ఆత్మదర్శనానికి వున్న అడ్డంకులు తొలగించుకున్నవారై, తాము తెలుసుకున్నదానిని ఇతరులకు చక్కగా బోధించగలరు. ఈ చక్రంనకు పంచకోశాలలో విజ్ఞానమయకోశంతో సంబంధం.  జ్ఞానేంద్రియం చెవి.

ప్రతీ మనిషికి వాక్కు చాలా ముఖ్యమైనది. తనని తాను వ్యక్తపరుచుకోవటానికి వాక్కు చాలా అవసరం. మన సంస్కారమును తెలిపేది వాక్కే. అందుకే పెద్దలంటారు - 'బుర్ర(తల) విలువ నోరు చెప్తుంది' అని! ఊరికే మాట్లాడడం కాదు, చక్కగా మాట్లాడగలగాలి. మృదుభాషణం చక్కటి సంబంధ భాంధవ్యాలను నెలకొల్పుతుంది. పరుషవాక్కులు, వక్రభాషణం ఎన్నో అనర్ధాలను అంటగడుతుంది. మంచి స్నేహాలను, మంచి బంధాలను, సామరస్యవాతవరణం నుంచి దూరం చేస్తుంది. అలానే మాట్లాడకూడని సమయంలో మాట్లాడినా, మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోయినా పొందవలసిన జీవితం చేజారిపోయినట్లే. ఇంత ముఖ్యమైన వాక్కుకు కారణం కంఠభాగంలో ఉన్న ఈ విశుద్ధచక్రమే.

ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే -

ముక్కు, నోరు, గొంతు, చెవులు మున్నగు భాగములకు సంబంధించిన వ్యాధులన్నియూ ఈ చక్రం పరిధిలోనికే వచ్చును. థైరాయిడ్ సమస్యలు వచ్చును. మాటలు సరిగ్గా రాకపోవడం, ఎలర్జీ, ఆస్తమ, టాన్సిల్స్ మొదలైన వ్యాధులు కలుగుతాయి. సంతానలేమికి కూడా ఈ చక్రం కొంత కారణం.

ఈ చక్ర మానసిక స్వభావం:-

మూసుకుపోవడం వలన భావవ్యక్తీకరణలో లోపం. వాక్కులో అనేక అపసవ్యాలు. ఊహాశక్తి లోపిస్తుంది.

తెరుచుకుంటే వాక్సుద్ధి. కవితాశక్తి, స్వర విజ్ఞానం, శాంతచిత్తం, శోకం లేకపోవడం, దీర్ఘాయువు.

 విజ్ఞానమయకోశంతో సంబంధం ఉన్న ఈ విశుద్ధచక్రం ద్వంద్వాతీత చక్రం. చైతన్యపూరిత చక్రం. ఇక్కడకు చేరిన సాధకుడు ఆనందస్థితిని పొందుతాడు. ఈ ఆనందపారవశ్యంలో తదుపరి గమ్యాన్ని మరిచిపోకుండా ముందుకు సాగాలి. ఇక్కడే ఆత్మజ్ఞానం కల్గుతుంది. అహం నశిస్తుంది. నేను అనే తత్త్వం పూర్తిగా నశించి, నేను 'ఆత్మ'పరమై నా ఆత్మ అన్న భావం నుండి విశ్వాత్మ భావన లోనికి మారి, సాధకుడు కవి, వాగ్మి, బ్రహ్మజ్ఞాని అవుతాడు. భూత, భవిష్యత్తు, వర్తమానములను దర్శింపగలుగుతారు. జీవించుట తనకోసంకాక సృష్టి యందలి సకల జీవుల రూపంలలో నున్న పరమాత్మకొరకని తెలుసుకొని తదనుగుణంగా జీవిస్తాడు. విశ్వశ్రేయస్సును సాధించువాడగుటచే శోకం గానీ, రోగంగాని లేక చిరంజీవియై యుందురు. ఈ చక్రం శుభమును కోరువారికి, ఇంద్రియనిగ్రహం గలవారికి మోక్షద్వారం.

ఈ చక్రమందు పదహారు దళాల యందు అ నుండి అః వరకు గల పదహారు అక్షరములు పదహారు కళలు. అమావాస్య నుండి పౌర్ణమి వరకు గల చంద్రుని పదహారు కళలే ఈ పదహారు రూపములు. చంద్రుడు మాతృత్వమునకు, గర్భధారణకు అధిపతి. అమావాస్య సృష్టి లయమై యున్న స్థితిని, పౌర్ణమి సృష్టి పూర్తిగా వ్యక్తమైయున్న స్థితిని తెలియజేయును.

మరి ఈ చక్రమును ఎలా శుద్ధిచేసుకోవడం???

శాస్త్రప్రకారం పరిశీలిస్తే -

ఈ చక్రంనకు డాకిని అధిష్టానదేవత. ఈమెకు పాయసాన్నం నందు ప్రీతి. ఈ చక్రం బలహీనంగా వుంటే పాయసాన్నం స్వీకరించుచూ, వ్యాధులను బట్టి అవసరమైనచో కొన్ని ఔషదములను ఉపయోగిస్తూ, 'హం' అను బీజాక్షరంను ధ్యానించువారికి ఈ వ్యాధులు నివారణ కాగలవు.

ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే -

నిర్మలమైన నీలాకాశాన్ని చూడాలి. ఈ చక్రంపై మనస్సును నిలిపి ధ్యానం చేస్తూ ఉంటే మనస్సు ఆకాశంవలె పరిశుద్ధం అవుతుంది. నిర్మలమౌతుంది.

ఈ చక్రంనకు అధిపతి కుజుడు. ధైర్య సాహసాలకు సంబంధించిన గ్రహమిది. కుజుడు బాగా వేగం వున్నవాడు. పటుత్వం వున్నవాడు. అగ్నికి, ఆయుధాలకు సంబంధించినవాడు. ఎక్కడ స్థిరత్వముందో, ఎక్కడ కాళ్ళ క్రింద భూమి కృంగిపోతున్నా చలించని ఆత్మవిశ్వాసముందో, ఎక్కడ సూటిదనముందో, ఎక్కడ సమానత్వముందో అక్కడ కుజుని శక్తి అపారంగా వున్నట్లు అర్ధం. మనలో ఈ లక్షణములను అభివృద్ధి పరుచుకుంటే ఈ చక్రం సానుకూలంగా పనిచేస్తుంది. తద్వారా విశుద్ధి చక్రం సానుకూలం.

ఆజ్ఞాచక్రం :-

ఈ కమలం రెండు దళాలుతో వుంటుంది. మనోతత్త్వం. అధిదేవత హాకీని. ఈమె హ, క్ష అను యోగినులచే సేవించబడుచున్నది. ఈమెకు పులిహార ప్రీతి. ఈమె మజ్జాధాతువునకు అధిపతి.

భ్రూమధ్యమందు విలసిల్లే ఈ చక్రం మనలో 3,240 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది. ఈ స్థానం మనస్సుకు మనకు సంధానం చేస్తుంది. ఇది ఈ శరీర మనే ఆలయానికి గర్భగుడి ద్వారం లాంటిది.

ధ్యానమను స్థితిచేత ప్రకాశించు ఈ చక్ర కమలమందు రెండు దళాలు కలవని తెలుసుకున్నాం. ధ్యానమనగా ధ్యానింపబడు విషయం, ధ్యానించువాడు అను రెండు మాత్రమే కలిగిన స్థితి. 'హ'కారం, 'క్ష'కారం అను రెండు దళాలతో కూడిన ఈ పద్మం అదే స్థితిని సూచిస్తుంది. ద్యానింపబడు పరమాత్మ, ధ్యానించే జీవాత్మ మాత్రమే వుండే స్థితి. ఈ ధ్యానంను సాధన చేస్తే జ్ఞాననేత్రం తెరుచుకొని ఆత్మదర్శనం అవుతుంది. ఇది సంపూర్ణత్వాన్ని సిద్ధింపజేసే చక్రం. తద్వారా పొందే స్థితి బ్రహ్మత్వపు స్థితి. బ్రహ్మమే తానని తెలుసుకునే స్థితి. ఇక్కడ అన్నింటిని పరిత్యజించి జీవుడు బ్రహ్మభూతుడవుతాడు . సాధకుడు బ్రహ్మజ్ఞాని అవుతాడు.

 'శ్వాస' ప్రక్రియకూ, ఆధ్యాత్మిక శక్తికీ చాలా సంబంధముంది. స్థూలశరీరానికి సంబంధించి లంగ్స్, తద్వారా హార్ట్, బ్లడ్ లో ఆక్సిజన్ సరిపడినంతగా సరఫరా చేయటానికి ఈ శ్వాస ప్రక్రియే ఆధారం. అందులోని  వొడిదుడుకులు సరిచెయ్యటానికి, దాని శక్తి యింకా పెంచటానికి ప్రాణాయామం ఎంతో తోడ్పడుతుంది. ఈ శ్వాస వలన వచ్చేశక్తి స్థూలశరీరానికి ఎంత అవసరమో, సూక్ష్మశరీరానికి కూడా అంతే అవసరం. మనం లోపలకు తీసుకునే గాలి మూలాధారం వరకు వెళ్ళి, తిరిగి పైకి వస్తూ స్వాధిష్టాన చక్రంలో చైతన్యం పొంది ప్రాణశక్తిగా, జీవశక్తిగా మారుతుంది. తద్వారా ఇడా పింగళ సుషుమ్నా నాడుల ద్వారా ఆజ్ఞాచక్రంకు చేరుతుంది. ఈ చక్రమే శ్వాస చంచలగతిని అదుపుచేసి క్రమక్రమంగా నిశ్శలం చేసి కైవల్యానికీ, మోక్షానికీ, జీవన్ముక్తికీ కారణమౌతుంది. ఈ చక్రాన్నే దివ్యనేత్రమనీ, జ్ఞానచక్షువనీ అంటారు. అలానే ఈ స్థానాన్నే త్రివేణీసంగమం అంటారు. 'త్రివేణిసంగమం' గురించి మరికొంత వివరణకై  ఇక్కడ చూడండి. 

ఈ చక్రంనకు పంచకోశాలలో విజ్ఞానమయకోశంతో సంబంధం. శారీరక వ్యవస్థలోని రక్తప్రసరణవ్యవస్థతో సంబంధం.

ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే -

రక్తక్షీణత, రక్తస్రావం అను వ్యాధులు సంభవించును. వినాళ గ్రంధులవ్యాధులు, అధిక రక్తపోటు, ప్రేగులలో పుండ్లు లాంటి వ్యాధులు కలుగును. 

ఈ చక్ర మానసిక స్వభావం

మూసుకుపోవడం వలన మానసిక స్థిరత్వం లేకపోవటం, కనులలో లోపాలు,క్షమాగుణం లేకపోవటం, నిరాశ నిస్పృహలతో కూడిన అలసట, అన్ని విషయాలయందు సందేహస్పదులు. 

తెరుచుకుంటే మనసులో, దృష్టిలో స్థిరత్వం, ఏకాగ్రత వుంటుంది. సూక్ష్మ బుద్ధి అలవడుతుంది. వివేకానికి మూలమై సత్యాన్ని గ్రహించమని నిర్దేశిస్తుంది. ఆధ్యాత్మికమైన శక్తి, ఆలోచన, అంతరదృష్టిలను  పెంపొందిస్తుంది. నీటియందు మంచుగడ్డ కరిగిపోయినట్లు 'నేన'ను అహం అంతర్యామి యందు కరిగిపోవును.

ఈ చక్రమును శుద్ధిచేసుకోవడం ఎలా???

శాస్త్రప్రకారం పరిశీలిస్తే -

ఈ చక్రంనకు హాకీని అధిష్టానదేవత. ఈమెకు పులిహార మందు ప్రీతి. ఈ చక్రం బలహీనంగా వుంటే పులిహారను స్వీకరించుచూ, వ్యాధులను బట్టి అవసరమైనచో తగు ఔషదములను ఉపయోగిస్తూ 'ఓం' అను బీజాక్షరమును ధ్యానించువారికి ఈ వ్యాధులు నివారణ కాగలవు. ఓంకారం వేదమునకు మొట్టమొదటి బీజం.

ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే -

నియంత్రణతో కూడిన భావనలు చేయడం అవసరం. ధారణ, ధ్యానం ఇందుకు ఉపకరిస్తుంది.

ఈ చక్రమునకు అధిపతి గ్రహం చంద్రుడు. మనిషి మానసిక స్థితికి, ధన సంపాదనకు చంద్రుడు కారకుడు. చంద్రుడు ఎప్పుడూ ఒకేలా వుండడు. వృద్ధి క్షయాలు కలిగినవాడు. అందుకే జాతకంనందు చంద్రుడు సరిగ్గా లేకుంటే చంచల స్వభావం కలిగి వుంటారు. చంద్రుడు నీటికి కారకుడు. అందువల్ల మంచినీరు ఎక్కువగా త్రాగాలి. అలాగే చంద్రుడు తెలుపువర్ణమునకు సంకేతం కావున సాధ్యమైనంతవరకు తెలుపురంగు వస్త్రాలు ధరించడం, ఎప్పుడూ ముఖం మీద చిరునవ్వు వుండేలా అభ్యాసం చేయడం, మృదువుగా మసులుకోవడం చేస్తే చంద్రానుగ్రహం సాధించినట్లే. తత్ఫలితంగా ఆజ్ఞాచక్రం సానుకూలంగా పనిచేస్తుంది.

చక్ర విజ్ఞానము - విశ్లేషణ :ఆజ్ఞా విశుద్ధి చక్రములు సత్వగుణమునూ, అనాహతం మణిపూరక చక్రములు రజోగుణమునూ, స్వాధిష్టానం, మూలాధార చక్రములు తమోగుణమును వ్యక్తం చేయును.

తమోగుణం దేహధాతువుల నిర్మాణమునకు, వానియందలి రసాయనిక మార్పులకు ఆధిపత్యం వహించడమే కాకుండా భౌతికదేహ నిర్మాణం కూడా దీని ప్రవృత్తియే.

రజస్సు వలన శరీరం నందలి వివిధ అవయములు పనిచేయుచున్నవి. ఇక సత్వం వలన గ్రహణశక్తి, వివేకం, విచక్షణ, విమర్శన మున్నగు లక్షణములు మేల్కొనును. ఈ మూడును మూడు లోకములుగా అంటే,  భూలోకం (తమస్సు), భువర్లోకం (రజస్సు), సువర్లోకం (సత్వం)లుగా  మనదేహంనందునూ, సౌరమండలం నందునూ ఏర్పడుచున్నవి.

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...