Saturday, December 28, 2019

ఆధ్యాత్మికత

ఆధ్యాత్మికత
= పార్వతి + సరస్వతి + లక్ష్మీ
= ధ్యానం + జ్ఞానం + సేవ
= Starting + Middle + Ending stage.

మూలాధార చక్రం - Body consciousness
స్వాధిష్టాన చక్రం - Family consciousness
మణిపూరక చక్రం - Society consciousness
అనాహత చక్రం - Empty consciousness
విశుద్ధ చక్రం - Purity consciousness
ఆజ్ఞా చక్రం - Third eye consciousness
సహస్రార స్థితి - Sharing knowledge to universe consciousness.

Every consciousness is need for our Life.

Thursday, December 26, 2019

గ్రహణం పట్టని ఏకైక దేవాలయం… శ్రీకాళహస్తి ప్రత్యేక ఇదే.

సూర్య గ్రహణం, చంద్రగహణం ఇలా ఏ గ్రహణం పట్టినా.. ఆ రోజు గుడులన్నీ మూసేయాల్సిందే. గ్రహణం వీడిన తర్వాతే దేవాలయాలను శుద్ధి చేసి తెరిచి మళ్లీ భక్తులను అనుమతిస్తారు. ఇది ఏనాటి నుంచో వస్తున్న ఆచారం. కాని.. ఒక గుడి మాత్రం ఏ గ్రహణం పట్టినా మూతపడదు. అమావాస్య, పౌర్ణమి, గ్రహణాలు, ఇతర ఏ కారణాల చేతనైనా ఆ గుడిని మాత్రం మూసేయరు.

గ్రహణం వచ్చినా కూడా మూయని ఒకే ఒక గుడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న శ్రీకాళహస్తి దేవస్థానం.సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం, ఏ గ్రహణమైన ప్రపంచంలోని అన్ని దేవాలయాలు దాదాపు మూసివేస్తారు. కానీ, దక్షిణ కైలాసంగా, వాయులింగేశ్వర క్షేత్రంగా ప్రఖ్యాతిగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయం మాత్రం గ్రహణం పట్టని ఆలయంగా చరిత్రలో నిలిచపోయింది.

ఎందుకంటే ఈ ఆలయం ఒక్కటే ఏ గ్రహణం వచ్చినా మూసివేయబడదు.ఏ గ్రహణం ఏ సమయంలో వచ్చినా ఆ సమయంలో ఇక్కడి ఆలయాన్ని తెరిచి ఆలయంలో కొలువైన శ్రీజ్ఞాన ప్రసునాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరునికి గ్రహణ కాల అభిషేకాలు నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతోంది.

ఈ పుణ్యే క్షేత్రంలో శ్రీకాళహస్తీశ్వరస్వామి స్వయంభుగా వెలిశారు. అంతేగాక, ధృవమూర్తిగా వెలసిన శివలింగాకృతిపై.. శ్రీ(సాలీడు), కాళము(పాము), హస్తి(ఏనుగు)లతో భక్తకన్నప్ప గుర్తులతో స్వయంభు లింగంగా ఆవిర్భవించింది. ఇక్కడ వెలిసిన వాయులింగేశ్వరున్ని సూర్యచంద్రాగ్ని లోచనుడిగా పిలుస్తారు.సూర్యచంద్రాదులతోపాటు అగ్నిభట్టారకునితోపాటు తొమ్మిది గ్రహాలు, 27 నక్షత్రాలను నిక్షిప్తం చేసుకున్న కవచంతో భక్తులకు దర్శనమిస్తున్నాడు. అందువల్ల ఇక్కడి క్షేత్రంలో రాహు, కేతువుల ఆటలు సాగవు.

అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉండే భక్తులందరూ ఇక్కడి క్షేత్రంలో రాహు, కేతు సర్పదోష నివారణ పూజలను చేయించుకుని వారి దోషాలను నివృత్తి చేసుకుంటున్నారు.సూర్య గ్రహణం అయితే గ్రహణం ప్రారంభమయ్యే సమయంలో, అదే చంద్ర గ్రహణం అయితే విడిచే సమయంలో శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీజ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి ధృవమూర్తులకు శాంతి అభిషేకాలు నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ సమయంలో దర్శనార్థం వచ్చే భక్తులకు ఆలయంలో అనుమతించడం జరుగుతుంది.

Wednesday, December 25, 2019

నవగ్రహాల గురించి మీకు తెలుసా ?

1.చంద్రుడు
అద్దం పుట్టడానికి చంద్రుడు కారణం.
అందుకే అద్దములో దిగంబరముగా చూచుకొనుట, వెక్కిరించుట చేయకూడదు.

2.గురువు
సర్వ శాస్త్రములు తెలిసిన గురువు బృహస్పతి, ఎవరైనా గురువుని కించపరచితే గురుదేవునికి అగ్రహము కలుగుతుంది. గురువులని పూజిస్తే బృహస్పతి అనుగ్రహం కలిగుతుంది.

3.బుధుడు
బుధుడికి చెవిలో వ్రేలు పెట్టి తిప్పుకుంటే కోపము. అందునా బుధవారం అస్సలు చేయకూడదు. వ్యాపారాన్ని అశ్రద్ధ చేసిన,
జ్ఞానం ఉంది అని విర్రవీగిన కోపము.

4.శని
శనికి పెద్దల్ని కించపరచిన,
మరుగుదొడ్లు శుచిగా లేకపోయినా కోపము. తల్లితండ్రిని చులకన చేసిన సహించడు.
సేవక వృత్తి చేసిన, సేవ చేసిన వారిని కాపాడతాడు.

5.సూర్యుడు
పితృ దేవతలని దూషిస్తే రవికి కోపము. నమస్కార ప్రియుడు. తర్పణ గ్రహీత.
సూర్య దేవునికి ఎదురుగా మల మూత్ర విసర్జన దంతావధానం చేయకూడదట.

6.శుక్రుడు
శుక్రుడికి భార్య/భర్త అగౌరవ పరచుకుంటే కోపము. ప్రేమకారకుడు. లక్ష్మీ దేవి కృప లేకపోతే శుక్ర కృప కష్టమే.
అమ్మకి శుచి శుభ్రత లేని ఇళ్లు మనుషులు నచ్చరు, గొడవలు లేని ఇల్లు ఇష్టము.

7.కుజుడు
అప్పు ఎగ్గొడితే కుజుడికి కోపము.
వ్యవసాయ పరంగా మోసం చేస్తే ఊరుకోడు.

8.కేతువు
జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనకడిన,
మోక్ష కారకుడు అయిన కేతువుకి పెద్దలకు మరణాంతరము చేయవలసిన కార్యములు చేయకపోతే కోపిస్తాడు.
ఈయన జాతకంలో బాగోలేకపోతే పిశాచపీడ కలుగుతుంది.

9.రాహువు
రాహు వైద్య వృత్తి పేరుతో మోసగించినా, సర్పములని ఏమైనా చేసిన ఆయనకి కోపము కలుగును. ఈయన భ్రమ మాయ కి కారణము..!!

నవ మాసాలు – నవ గ్రహాలు

పిండోత్పత్తి ప్రారంభమయిన దగ్గర నుండి శిశు జననం వరకు తల్లి గర్భములో పిండం ప్రతి మాసం మార్పులు చెందుతూ ఉంటుంది. ఆ మార్పుల ఆధారంగా ప్రతి మాసమునకు ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటారు.

1 వ మాసం   శుక్ర గ్రహం   ప్రాదాన్యత వహిస్తూ పిండంలో శుక శోణితాలు ద్రవ రూపంలో ఉంటాయి.

2 వ మాసం కుజ గ్రహం ప్రాదాన్యత వహిస్తూ పిండంలో శుక్ర శోణితాలు గట్టిపడుతుంటాయి.

3 వ మాసం గురుగ్రహం ప్రాదాన్యత వహిస్తూ పిండంలో జీవం ప్రారంభమవుతుంది. అవయవాలు ఏర్పడటం ప్రారంభమవుతుంది.

4 వ మాసం రవి గ్రహం ప్రాదాన్యత వహిస్తూ పిండంలో ఎముకలు ఏర్పడటం ప్రారంభమవుతుంది.

5 వ మాసం చంద్ర గ్రహం ప్రాదాన్యత వహిస్తూ పిండంలో ద్రవ పదార్ధాలు ఏర్పడతాయి. చర్మం ఏర్పడటం ఆరంభమవుతుంది.

6 వ మాసం శని గ్రహం ప్రాదాన్యత వహిస్తూ పిండంలో శిశువుకు కేసాలు ఏర్పడతాయి.

7 వ మాసంలో బుధ గ్రహం ప్రాదాన్యత వహిస్తూ పిండంలో శిశువుకు స్పర్శ జ్ఞానం ప్రారంభమవుతుంది.

8 వ మాసంలో తల్లి లగ్నాధిపతి ప్రాదాన్యత వహిస్తూ ఉంటుంది. .

9 వ మాసలో చంద్ర గ్రహం ప్రాదాన్యత వహిస్తూ పిండంలో శిశువుకు ఆహారం తీసుకోవటం తెలుస్తాయి.

10 వ మాసంలో రవి గ్రహం ప్రాదాన్యత వహిస్తూ ఉంటుంది.

పై గ్రహాలు అవి సూచించు మాసాలలో గర్భంలోని శిశువుపై ప్రభావాన్ని సూచిస్తాయి. గర్భవతిగా స్త్రీకి ఎన్నవ మాసం జరుగుతుందో ఆ మాసాధిపతి ఆ మాసములో గోచారంలో బలహీనపడరాదు. అదే విధంగా ఒక స్త్రీ జాతకంలో ఏదైనా గ్రహం  బలహీనంగా ఉంటే ఆ గ్రహం సూచించు మాసములో గర్భములోని శిశువుకు ఇబ్బందులు ఏర్పడటం లేదా గర్భస్రావం జరగటం లేదా గర్భవతికి గర్భ సంబంధమైన ఇబ్బందులు ఏర్పడటం జరుగుతాయి.

ఉదా:- గర్భవతి జాతకంలో రవి బలహీనపడిన నాల్గవ నెలలో ఇబ్బందులు కలగటం లేదా ప్రసవ సమయంలో కష్టాలు కలుగుతాయి. ఏ విధంగా స్త్రీ జాతకంలో ఏ గ్రహం బలహీనంగా ఉన్నదో మరియు గర్భవతిగా ఉన్నప్పుడూ ఏ మాసం జరుగుతుందో ఆ మాసాధిపతి ఆ మాసంలో గోచారంలో బలంగా ఉన్నాడో లేదో ముందుగానే పరిశీలించి ఆ గ్రహానికి శాంతి ప్రక్రియలు చేయించుకున్న గర్భ రక్షణ జరుగును.

శ్రీరాముని రాజధర్మాలు....

మంగళం:

రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం

కౌసలేశాయ మందహాసదాస పోషకాయ
వాసవాది వినుత సద్వరద మంగళం

చారు కుంకుమోపేత చందనాగరు చర్చితాయ
హార కటక శోభితాయ భూరి మంగళం

లలిత రత్న కుండలాయ తులసీవనమాలికాయ
జలజ సదృశదేహాయ చారు మంగళం

దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ
భావజాగురువరాయ భవ్యమంగళం

పుండరీకాక్షాయ పూర్ణ చంద్ర వదనాయ
అండజా వాహనాయ అతులమంగళం

విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ
సుముఖ చిత్త కామితాయ సుభద మంగళం

రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ
స్వామి భద్రగిరివరాయ సర్వ మంగళం

భద్రాద్రి క్షేత్రవాస, నారాయణ దాసపోష
నవ్య నీరద ఘనశ్యామ దివ్య మంగళం

మంగళం కోలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవతి తనూజాయ సార్వ భౌమాయ మంగళం.

రామరాజ్యంకు పేరు తెచ్చిన  రాజధర్మాలు :
నదులు పర్వతాలు ఉండే పర్యంతం రామాయణ కావ్యం ఉంటుందని, రామకథ నిలిచిపోతుందనేది బ్రహ్మ వాల్మీకి మహర్షికి ఇచ్చిన వరం. రామ, అయనం రామాయణం. అంటే రాముని ప్రయాణం. రాముని మార్గమంతా, ప్రయాణమంతా ధర్మమయం. రాముడు చేసినదంతా ధర్మహితం. ప్రజాహితం. జాతి హితం. ధర్మనిష్ఠని కార్యదీక్షని తను తన జీవితమంతా ఆచరించి చూపిన ధర్మమూర్తి, వేదమూర్తి. అందుకే రాజ్యం ‘రామరాజ్యం’ కావాలన్నాడు మహాత్మాగాంధీజీ. పైగా ఈనాడు అంతా ‘రామరాజ్యం’ కావాలి అంటుండడం మనం వింటుంటాం, కంటుంటాం. కలలు కంటుంటాం. అదీ రామాయణం విశిష్టత. అదీ రాముని పరిపాలనా ప్రత్యేకత. అదే.. ‘రామరాజ్యం’ పరమోత్కృష్టత.

పితృవాక్య పరిపాలనకోసం శ్రీరాముడు వనవాసానికి కొచ్చేడు. భరతుడు రాముడిని వెదుక్కుంటూ మందీ మార్బలంతో, పరివారంతో రాముడ్ని కలవడానికి వస్తాడు. భరతుడు రాముడు కలుసుకుంటారు. ఆ సందర్భంలో- భరతుడు రాజు కాబట్టి రాజనీతిజ్ఞతని, ఎన్నో రాజధర్మాలని శ్రీరాముడు భరతునికి చెప్తాడు.

రాముడు భరతునికి వివరించిన ఆ రాజ ధర్మాలను ఓసారి పరిశీలిద్దాం

1.  రాజ్యాన్ని పాలించే రాజు- దేవుడు లేడు, పరలోకం పర జన్మ లేదు. విశృంఖలత్వంతో ఇంద్రియములు ఏ రకంగా చెబితే ఆ రకంగా భ్రష్టుడేయ్య నాస్తికత్వాన్ని విడనాడాలి.

2. ఆడిన మాట తప్పకూడదు.

3. అసత్యాన్ని పలకరాదు.

4. క్రోధము విడనాడవలెను. క్రోధమువల్ల అనరాని మాటలు మాట్లాడ్డంవలన పాపము వచ్చును.

5. పెద్దలవలన పొరపాటు సంభవించినను తొందరపడి క్రోధము, కోపం తెచ్చుకోకూడదు. ఇంద్రియాలకు లొంగిపోకూడదు.

6. వ్యసనాలకు బానిసైపోకూడదు.

7. అలసత్వమును వదులుకోవాలి. అంటే సోమరితనాన్ని, మందబుద్ధిగా మత్తు మత్తుగా ఉండకూడదు.

8.  నేను, చక్రవర్తి అనే అహంకారం ఉండకూడదు. తత్ఫలితంగా నేనే అధికుడ్ని అనుకుని జ్ఞానుల్ని, సిద్ధుల్ని దర్శించకుండా ఉండకూడదు.

9. ఎప్పుడు చేయవలసిన పనిని అప్పుడే వెంటనే చేయాలి. తర్వాత్తర్వాత చేద్దామనే అశ్రద్ధ వదులుకోవాలి.

10. రాజు ఎప్పుడూ అతి జాగరూకుడై ఉండి అప్రమత్తతతో మెలగవలెను. అప్పుడే రాచకార్యాలు సవ్యంగా సాగును. కాబట్టి మరపున కొనితెచ్చే ‘ప్రమాదము’ను వదులుకోవాలి. ఇవీ రాజు ఆచరించవలసినవి.. రాజు వదులుకోవలసినవీ. ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజు, పైన చెప్పిన వాటిలోని అవలక్షణాలను వదులుకుని సుగుణాలతో తను పాలన సాగించాలి.

ఇక రాజ్యపాలనలో చేయాల్సి ఇతర అంశాలు పరిశీలిద్దాం

1. రాజు తీసుకునే నిర్ణయాలన్నీ ప్రజలు మంచిని దృష్టిలో పెట్టుకునే ఉండాలి. ప్రజలమీద ఎనలేని భారాన్ని మోపే అధికమైన పన్నులు వేసి, ప్రజలను పీడనకు గురిచేయకూడదు.

2. రాజు యజ్ఞయాగాదులు చేసి దేవ, పితృ, రుషి రుణాలను తీర్చుకోవాలి. గురువులను మహర్షులను ఆచార్యులను, పెద్దలను పూజించాలి. గౌరవించాలి.

3. రాజ్యములోనున్న దీనుల, హీనుల, అనాథల, అన్నార్తుల, వృద్ధుల యోగక్షేమములు చూస్తూ మెలగాలి. అలా మెలగటం రాజధర్మం.

4. తల్లిదండ్రుల్ని, ప్రజల్నీ ప్రేమతో చూసుకోవాలి. సదాచార సంపన్నత, సత్ప్రవర్తన లోకహితం గావించేవారిని పురోహితులుగా నియమించి యజ్ఞ హోమ ఆధ్యాత్మిక కర్మలు జరిగితే చూడాలి.

5. బుద్ధి కుశలతలోను ఆలోచన శక్తిలోను ఉన్నతంగా ఉండేవారిని, తనతో సమానమైన వారిని, పరాక్రమంలో, రాజుకి తగ్గ జోడి అయ్యేటటువంటి యోధులైనవారిని మంత్రులుగా నియమించాలి. విశ్వసనీయతగలవారిని మాత్రమే మంత్రాంగం చేసేందుకు నియమించుకోవాలి.

6. ప్రలోభాలకు, ఆశలకు, భౌతిక సుఖలాలసకు, వ్యసనాలకు దూరంగా ఉండేవారిని, ఈ దౌర్భల్యాలకు లొంగని దృఢ మనస్తత్వం గలవారిని మాత్రమే ఉద్యోగిగా తీసుకోవాలి. అక్రమాలకి, అవినీతికి, ఆశ్రీత పక్షపాతానికి పాల్పడేవారిని, ధనాశాపరులను దూరంగా ఉంచాలి. ఉంచగలగాలి.

7. అక్రమార్కుల్ని, నేరస్థుల్ని, చెడ్డవాళ్ళను, నేరం రుజువు అయిన తర్వాత మాత్రమే శిక్షించాలి. తప్పులు చేయని, దుర్మార్గులు కాని నిరపరాధులు ఒక్కరైనా శిక్షింపబడకూడదు. ఆ రకంగా నిరపరాధుల్ని శిక్షిస్తే దారిద్య్రం కలుగుతుంది.

8. ఉద్యోగులకు, మంత్రులకు వారు చేసే విధులన్నీ వారికి నిర్దేశించాలి. నిర్దేశించి వారు వారికి అప్పగించిన విధులు, బాధ్యతలు సరిగా సక్రమంగా చేస్తున్నారా లేదా అనేది పర్యవేక్షించాలి. రాజు ఎల్లప్పుడు ప్రజలకు అనువుగా అందుబాటులో ఉండాలి.

9. నిజాయితీ

వచ్ఛత ఉన్నవారినే, దేశ రక్షణకు బాగా పాటుపడే సేనాపతులుగా, సంబంధిత మంత్రులుగా నియమించి, దేశ రక్షణ పటిష్టంగా, భద్రంగా ఉండేలా చూసుకోవాలి.

10. శత్రువుల, శత్రురాజుల జాడల్ని, ఎత్తుగడల్ని పసికట్టేందుకు చారుల్ని, గూఢచారుల్ని ఏర్పాటుచేసుకోవాలి.

11. దేశభక్తిపరులను, జన్మభూమిమీద నిబద్ధత కలిగినవారినే రాయబారులుగా, ఇతర రాజ్యాలకు నియమించుకోవాలి.

12. అన్నివర్ణములవారు వారి వారి విధుల్ని, ధర్మాల్ని ఆచరించేలా నడిపించాలి. రాజు, మంత్రులు, సేనాపతులు, ఉద్యోగులందరూ ధర్మబద్ధులై ఉండేలా సత్యవర్తనులై ఉండాలి. అలా వారంతా రుజుమార్గంలో ఉంటూ ప్రజలను ధర్మపథంలో, సత్యమార్గంలో నడిచేలా చూడాలి. ప్రజలను నడిపించేలా చేయాలి.

13. ప్రజల అభిమానాన్ని, ఆదరణని తన పరిపాలనా విధులతో విధానాలతో రాజు పొందగలగాలి.

ఇవీ సంక్షిప్తంగా శ్రీరాముడు భరతునికి చెప్పిన రాజధర్మాలు. రాజనీతిజ్ఞతలు. ఈ విధులను, విధానాలను, ధర్మాలను, కర్తవ్యాలను, బాధ్యతల్ని రాజు అనేవాడు మనసా వాచా కర్మణా త్రికరణశుద్ధిగా నమ్మాలి. ఆచరించాలి. అమలుచేయాలి. అమలు అయ్యేలా చూడాలి. ఆచరణలో రాజు సఫలీకృతుడు కావాలి. రాజ్యం సుభిక్షం కావాలి. సౌఖ్యవంతం కావాలి. సమృద్ధివంతం కావాలి. ప్రజలు సుఖ సంతోషాలతో భోగభోగ్యాలతో సిరిసంపదలతో తులతూగాలి. రామరాజ్యం నేపథ్యంగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా పాలకులు సంకల్పం చెప్పుకోవాలి. అప్పుడే శ్రీరాముడు అందించిన అసలు సిసలైన రామరాజ్యం మళ్లీ ఆవిష్కృతమవుతుంది.

శ్రీ చక్రం మానవ దేహం - 2

ఈ జగత్తులో అంతర్గతంగా ఉన్న పరాశక్తిని కూడా దర్శించగలిగారు మన మహర్షులు. వివిధ శక్తులు, దేవతలు, ప్రాణులు అన్నీ ఆ పరాశక్తి నుండే ఉద్భవించాయి. అయినా వేటికి అవి ప్రత్యేక పని కొరకు ప్రత్యేక గుణములు కలిగి ఉంటాయి. అంటే ఒక గొలుసులోని వేరు వేరు లింకులు లాగా, మానవ శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క స్థానము, పని ఉంటుంది. అలాగే ఈ విశ్వంలో ఒక్కొక్క దేవతకు ఉండవలసిన స్థానములు, చేయవలసిన పనులు, ప్రత్యేకంగా నిర్దేశించి ఉన్నాయి. ఈ దేవతలకు యంత్రం రూపమయితే, మంత్రం నాదమవుతుంది. వేదవాక్కులచే అట్టి దేవతలు ప్రత్యక్షమవుతారని, అనుగ్రహిస్తారని, తెలుసుకొన్న మన మహర్షులు మనకు మంత్ర, యంత్ర శాస్త్రాలను అందించారు. వేదమునకు మూలము నాదము. దాని నుండి బీజాక్షరములు ఉద్భవించి, మంత్రములుగా శక్తిని సంతరించుకున్నాయి.

యంత్రమంటే ఏమిటి

యంత్రమనగా ఆరాధించే దేవత యొక్క (శక్తి) స్వరూపమే. ఆ దేవతాశక్తి ఆ యంత్ర రూపంలో నిక్షిప్తమవుతుంది. మన పెద్దలు ఈ శక్తిని గుర్తించి, మూడు రకాలుగా భావించారు.

అవి 1) ఇచ్ఛాశక్తి, 2) జ్ఞానశక్తి 3) క్రియాశక్తి. ఏ పని చేయాలన్నా ఆ పని చేయాలనే ‘ఇచ్ఛ’ (కోరిక) కలగాలి. అదే ఇచ్ఛాశక్తి. తరువాత ఆ పని ఎట్లా చేయాలని ఆలోచన చేయడమే జ్ఞానశక్తి. ఇచ్ఛ, ఆలోచన జ్ఞానం రెండు కలిగిన తరువాత కార్యాచరణ జరుపటమే క్రియాశక్తి. సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్నా ఈ మూడు శక్తుల కలయిక తప్పదు. ఈ చరాచర సృష్టి మొత్తం ఈ మూడు శక్తుల కలయికే.

ఈ మూడు శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. శ్రీచక్రం లోని మూడు బిందువులలో ఉండే దేవతలు వీరే.

నేటి శాస్త్రజ్ఞులు కూడా, ఏ పదార్థమైనా శక్తి రూపాంతరమేనని చెబుతున్నారు. నేడు మనం చూస్తున్న విజ్ఞాన శాస్త్రం ద్వారా కనిపెట్టబడిన వస్తుజాలమంతా ఈ క్రియాశక్తి యొక్క రూపాంతరమే.

 విజ్ఞానవేత్తలైన మన మహర్షులు ఈ మూడు శక్తులు కలిసిన శక్తినే ‘ప్రకృతి’ అని, ‘పరాశక్తి’ అని, ‘అవ్యక్తం’, ‘శుద్ధమాయ’ అని అంటారు. అంటే యావత్తు ప్రపంచానికి (సృష్టికి) జన్మనిచ్చినది ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల కలయిక అయిన పరాశక్తే అని తెలుస్తున్నది. కాబట్టి ఆ పరాశక్తే ఈ జగత్తుకు మాత (తల్లి) అని శాస్త్రాలు నిర్ణయించాయి. త్రిమూర్తులకు, దేవతలకు వారి వారి విధి నిర్వహణకు కావలసిన శక్తు లన్నింటినీ ఆ జగన్మాత లేదా పరాశక్తి, వారికి అందిస్తోంది.

శ్రీ చక్ర ఆవిర్భావం

ఉండేది బ్రహ్మమొక్కటే. ఈ బ్రహ్మం సత్‌, చిత్‌, ఆనంద స్వరూపములు కలది. అది చలనము లేనిది, నిశ్చలమైనదైనప్పటికి, చేతనం అనే బీజం కలిగి ఉండుటం దానిలోని విశేషం.

కేవలం కాంతి (ప్రకాశ) రూపముగానున్న బ్రహ్మమునందు ఏర్పడిన మొదటి కదలికను ‘విమర్శ’ (ఆలోచన) అన్నారు. తాంత్రికులు కాంతిని పరమశివుడుగాను, విమర్శను పరాశక్తిగాను భావించారు. కాంతి (ప్రకాశ) స్వరూపమైన బ్రహ్మములో ఏర్పడిన మొదటి కదలికవల్ల నాదము ఏర్పడినది. ఈ ప్రథమ నాదము సూక్ష్మరూపమైన బిందువుగా ఏర్పడినది. ఈ బిందువునందే కేంద్రీకరించబడిన శివశక్తుల విజృంభణము కలదు.

దీనినే ”పరాబిందువు” అందురు. ఇందులో కామేశ్వర, కామేశ్వరీ స్వరూపములు కలవు. ఈ బిందువే మూల ప్రకృతి. దీనికే సర్వానందమయ చక్రమని పేరు. ఈ బిందువే శ్రీచక్రమునకు ఆధారము. ఈ పరాబిందువు నందే సృష్టికి కావలసిన శక్తి అంతా బీజప్రాయంగా ఉన్నది. సృష్టి జరుగుటకు ఈ పరాబిందువు కొంత క్రిందికి దిగివచ్చి శబ్ద బ్రహ్మముగా మారుతుంది. అనగా విత్తనము (గింజ) లో రెండు పప్పులు (బద్దలు) ఉన్ననూ చుట్టూ ఉన్న పొట్టు (పై పొర) వలన గింజ ఒకటిగా కనపడినట్లు ఈ పరాబిందువు నందు శివశక్తులొకటిగా ఉంటాయి.

శ్రీ చక్రం – పరాశక్తి వేర్వేరు కాదు

అలా ఒకటిగానున్న పరాబిందువు నుండి మూడు బిందువులేర్పడినవి.

 1) శివశక్తులొకటిగా నున్న ‘బిందువు’, 2) అచేతనంగా ఉన్న ‘శివుడు’, 3) ‘చేతనా స్వరూపమైన శక్తి’. ఈ మూడు బిందువులే త్రిగుణాత్మకము. త్రిపుటల సమ్మేళనము, త్రిపురముల మొదటి త్రికోణము. ఇది శివపార్వతుల ఏకరూపమైన అర్థనారీశ్వరతత్వాన్ని సూచిస్తోంది.

మనం పరాశక్తి శుద్ధ స్వరూపాన్ని దర్శించలేం, కనీసం ఊహించలేం. కనుక శక్తి మాత తన మొదటి రూపంగా శ్రీచక్రాన్ని నిర్మించింది. తదుపరి అనేక దేవీరూపాలను స్వీకరించి మనకు ఉపాసనా సౌలభ్యాన్ని కల్పించింది. శ్రీచక్రముతో ఈ సకల చరాచర జగత్తునకు నామరూపములకు, పదార్థము లకు సమన్వయం కలుగుచున్నది.

పరాశక్తికి శ్రీ చక్రానికి ఏ మాత్రం భేదం లేదు. శ్రీ దేవియే శ్రీచక్రము. శ్రీమాత, శ్రీ విద్య, శ్రీచక్రములు వేరు వేరు కాదని, ఈ మూడూ ఒకే పరబ్రహ్మ స్వరూపమని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము తెలియచేస్తోంది.

శ్రీ చక్రం నందు లలితాదేవి ఎల్లప్పుడూ నివసించి ఉంటుంది. ఇటువంటి శ్రీవిద్యను, శ్రీచక్రోపాసనను మనువు, చంద్రుడు, కుబేరుడు, అగస్త్యుడు, లోపాముద్ర, అగ్ని, మన్మథుడు, సూర్యుడు, ఇంద్రుడు, శివుడు, స్కంధుడు, దూర్వాసుడు అను పన్నెండుమంది, పన్నెండు శాస్త్ర విధానములుగా ప్రవేశపెట్టినట్లు జ్ఞానార్ణవ తంత్రము తెలుపుచున్నది.

🕉శ్రీ చక్ర నిర్మాణం🕉

శ్రీచక్రంలోని తొమ్మిది ఆవరాణాలలో ప్రతిదానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

1. త్రైలోక్యమోహన చక్రం: ఇక్కడ, లోకా అనే పదం మాతా, మేయా మరియు మనా అంటే, చూసేవాడు, చూసిన వస్తువు మరియు తనను తాను చూసే చర్యను సూచిస్తుంది లేదా ఇతర మాటలలో కర్త, కర్మ మరియు క్రియా. ఈ మూడింటి సమ్మేళనం త్రైలోక్య. ఈ గొప్ప చక్రం ఈ మూడింటిని మంత్రముగ్ధులను చేస్తుంది మరియు ఈ మూడింటిని ఒకే ద్వంద్వ రహిత అస్తిత్వంగా కరిగించి అద్వైతను పూర్తి చేయడానికి దారితీస్తుంది.

2. సర్వషాపరిపూరక చక్రం: ఇక్కడ, ఆశా అనే పదం మనస్సు యొక్క తృప్తిపరచలేని కోరికలను మరియు ద్వంద్వత్వం వైపు మమ్మల్ని మరింతగా నడిపించే ఇంద్రియాలను సూచిస్తుంది. ఈ గొప్ప చక్రం తన సాధనను ఎప్పటికి సంతృప్తికరంగా, నెరవేర్చిన, శాశ్వతమైన పరబ్రహ్మణ లేదా పరమశివుడితో ఏకం చేయడం ద్వారా అన్ని కోరికలను ఇస్తుంది. ఈ దశ వాస్తవానికి కామకోటి అన్ని కోరికలను నెరవేర్చగల స్థితి లేదా వాస్తవానికి అన్ని కోరికలను మించి అత్యంత కావాల్సిన పనిని సాధించడం ద్వారా, ఇది నిజంగా విముక్తి పొందిన బ్రహ్మ జ్ఞానం.

3. సర్వసంక్షోభన చక్రం: రద్దు సమయంలో, పృథ్వీ నుండి శివుడు వరకు ఉన్న అన్ని తత్వాలు ఒకదానిలో ఒకటి కరిగిపోతాయి. ఈ గొప్ప చక్రం అన్ని తత్వాలలో విధ్వంసక ఆందోళనను (క్షోభ) సృష్టిస్తుంది, తద్వారా ద్వంద్వత్వానికి కారణమవుతుంది, తద్వారా సాధనలో ఏదైనా ద్వంద్వత్వం కరిగిపోతుంది. ఇది సాధనలో ద్వంద్వత్వాన్ని ఆందోళన చేస్తుంది మరియు నాశనం చేస్తుంది.

4. సర్వసౌభాగ్యదాయక చక్రం: సౌభాగ్య అనేది ప్రతి ఒక్కరూ కోరుకునే విషయం. ఈ గొప్ప చక్రం సాధనకు అత్యంత కావలసిన వస్తువును ఇస్తుంది, ఇది గొప్ప పరమశివుడు లేదా మహాత్రిపురసుందరి తప్ప మరొకటి కాదు. తన ప్రియమైన తల్లి కాకుండా వేరొకరి కోసం సాధకుడు ఎంత గొప్ప అదృష్టం లేదా భాగ్యను కోరుకుంటాడు? ఈ విధంగా ఈ చక్రం నిజంగా చింతామణి - కల్పటారు - కామధేను, అన్నీ ఒకదానిలో ఒకటి.

5. సర్వార్థసాధక చక్రం: అన్ని వేద మరియు తాంత్రిక కర్మలు మరియు వేడుకల అంతిమ లక్ష్యం పరమశివుని సాధించడం. ఈ తుది బీటిట్యూడ్ సాధించడానికి వివిధ గ్రంథాలు అనేక పద్ధతులను వివరించాయి. అన్ని నదులు చివరకు గొప్ప మహాసముద్రంలో విలీనం అయినట్లే, ఈ చట్టబద్ధమైన మార్గాల్లో దేనినైనా సాధకులను ఒకే గమ్యస్థానానికి తీసుకువెళతాయి. ఈ గొప్ప చక్రం ఈ మార్గాలన్నింటికీ సిద్ధికి దారి తీస్తుంది లేదా అనగా ఇది అంతిమంగా పరబ్రహ్మ ప్రప్తి అయిన తుది సిద్ధిని ఇస్తుంది.

6. సర్వరాక్షకర చక్రం: ఈ గొప్ప చక్రం సాధకుడిని అన్ని రకాల మరియు ఆలోచనలు మరియు ద్వంద్వత్వం నుండి రక్షిస్తుంది,  దు,:ఖానికి మాత్రమే కారణాలు. 36 తత్వాలతో ఏర్పడిన కనిపించే ప్రపంచం అశాశ్వతమైనది మరియు ఈ తత్వాలు భేదారిష్టిని లేదా ఆత్మ మరియు పరమాత్మల మధ్య విభజన భావనను మంజూరు చేస్తున్నందున, ప్రపంచాన్ని అబద్ధమని తిరస్కరించాలి. సాధన ద్వారా శివోహం భావనను ( శివా అంటే అద్వైత భావన) నింపడం ద్వారా, ఈ చక్రం అతన్ని 36 తత్వాలతో కూడిన గోరమైన జనన మరణ కర్మలు, సంసారం నుండి రక్షిస్తుంది, ఇవన్నీ ద్వంద్వత్వానికి దారితీస్తాయి. సాధకుడు తనను మరియు మొత్తం ప్రపంచాన్ని పరమశివుడి నుండి వేరు చేయలేడని తెలుసుకున్నప్పుడు, అతను స్వయంచాలకంగా అవిద్య నుండి రక్షించబడతాడు. ఈ చక్రం ఏమిటంటే,  తాను ఎవరు అనే  స్వచ్ఛమైన అవగాహన ద్వారా, ఈ బేధ భావాన్ని' నాశనం చేయడం.

7. సర్వరోగహర చక్రం: ద్వంద్వత్వాన్ని ప్రేరేపించే సంసారం కంటే దారుణమైన వ్యాధి మరొకటి లేదు. ఒకదానికొకటి భిన్నమైన 36 తత్వాలు దాని భాగం కారణంగా. ఈ గొప్ప చక్రం మిగతా అన్ని రకాల వ్యాధులకు మూలకారణమైన ఈ సంసారం వ్యాధిని నాశనం చేస్తుంది. వామకేశ్వర తంత్రం మరియు రుద్రయామల యొక్క ముద్ర కందా ఖేచారిని అన్ని వ్యాధులను నాశనం చేస్తున్నట్లు మాట్లాడినప్పుడు, ఇది సూచించబడింది.

8. సర్వసిద్ధిప్రద చక్రం: ఈ చక్రం విశ్వాన్ని సృష్టించడానికి - నిర్వహించడానికి - నాశనం చేయగల సామర్థ్యాన్ని సూచిస్తుంది. విశ్వం యొక్క సిద్ధికి  దేవీ శక్తి  బాధ్యత వహిస్తుంది'. ఈ విధంగా, త్రికోణ లేదా త్రిభుజం చక్రం సృష్టి, విధ్వంసం మరియు సంరక్షణకు బాధ్యత వహిస్తుంది, మిగిలిన రెండు చర్యలు తిరోధన మరియు అనుగ్రహ ఈ మూడు ద్వారా మాత్రమే సూచించబడతాయి.

9. సర్వానందమయ చక్రంలో శివుడు మరియు శక్తి యొక్క పూర్తి సామరస్యం యొక్క స్థితి ఉంది. అందువల్ల ఈ చక్రం శాశ్వతమైన, అపరిమితమైన ఆనందం యొక్క వ్యక్తిత్వం. ఇది సాధనకు బ్రహ్మానందను ఇస్తుంది.

పై వచనాల నుండి, తొమ్మిది ఆవరణలు వాటి భిన్నమైన కోణాలు పేర్లు, దేవత, ముద్ర మొదలైన వాటి వల్ల భిన్నంగా అనిపించినప్పటికీ .. వీటన్నిటి యొక్క ఏకత్వం లేదా ద్వంద్వ రహిత అంశం ఇవన్నీ ప్రాతినిధ్యం వహిస్తున్నాయనే వాస్తవం ద్వారా రుజువు అవుతుంది. ద్వంద్వేతర పరమశివ తత్వం ఈ జగతిని పాలిస్తుంది అనేది సత్యం, అందువల్ల మొత్తం శ్రీచక్ర పరబ్రహ్మ స్వరూపం. శ్రీచక్రాన్ని ఆరాధించడం ద్వారా ప్రాపంచిక మైన అన్ని కొరికలే కాకుండా,పరబ్రహ్మ స్వరూపాన్ని తత్వాన్ని తెలుసుకుని ముక్తిని పొందగలరు.

శ్రీ చక్రం మానవ దేహం - 1


ఈ జగత్తులో అంతర్గతంగా ఉన్న పరాశక్తిని కూడా దర్శించగలిగారు మన మహర్షులు. వివిధ శక్తులు, దేవతలు, ప్రాణులు అన్నీ ఆ పరాశక్తి నుండే ఉద్భవించాయి. అయినా వేటికి అవి ప్రత్యేక పని కొరకు ప్రత్యేక గుణములు కలిగి ఉంటాయి. అంటే ఒక గొలుసులోని వేరు వేరు లింకులన్నమాట. మానవ శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క స్థానము, పని ఉంటుంది. అలాగే ఈ విశ్వంలో ఒక్కొక్క దేవతకు ఉండవలసిన స్థానములు, చేయవలసిన పనులు, ప్రత్యేకంగా నిర్దేశించి ఉన్నాయి. ఈ దేవతలకు యంత్రం రూపమయితే, మంత్రం నాదమవుతుంది. వేదవాక్కులచే అట్టి దేవతలు ప్రత్యక్షమవుతారని, అనుగ్రహిస్తారని, తెలుసుకొన్న మన మహర్షులు మనకు మంత్ర, యంత్ర శాస్త్రాలను అందించారు. వేదమునకు మూలము నాదము. దాని నుండి బీజాక్షరములు ఉద్భవించి, మంత్రములుగా శక్తిని సంతరించుకున్నాయి.
యంత్రమంటే ఏమిటి ?
యంత్రమనగా ఆరాధించే దేవత యొక్క (శక్తి) స్వరూపమే. ఆ దేవతాశక్తి ఆ యంత్ర రూపంలో నిక్షిప్తమవుతుంది. మన పెద్దలు ఈ శక్తిని గుర్తించి, మూడు రకాలుగా భావించారు. అవి 1) ఇచ్ఛాశక్తి, 2) జ్ఞానశక్తి 3) క్రియాశక్తి. ఏ పని చేయాలన్నా ఆ పని చేయాలనే ‘ఇచ్ఛ’ (కోరిక) కలగాలి. అదే ఇచ్ఛాశక్తి. తరువాత ఆ పని ఎట్లా చేయాలని ఆలోచన చేయడమే జ్ఞానశక్తి. ఇచ్ఛ, ఆలోచన జ్ఞానం రెండు కలిగిన తరువాత కార్యాచరణ జరుపటమే క్రియాశక్తి. సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్నా ఈ మూడు శక్తుల కలయిక తప్పదు. ఈ చరాచర సృష్టి మొత్తం ఈ మూడు శక్తుల కలయికే.
ఈ మూడు శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. శ్రీచక్రం లోని మూడు బిందువులలో ఉండే దేవతలు వీరే.
నేటి శాస్త్రజ్ఞులు కూడా, ఏ పదార్థమైనా శక్తి రూపాంతరమేనని చెబుతున్నారు. నేడు మనం చూస్తున్న విజ్ఞాన శాస్త్రం ద్వారా కనిపెట్టబడిన వస్తుజాలమంతా ఈ క్రియాశక్తి యొక్క రూపాంతరమే. విజ్ఞానవేత్తలైన మన మహర్షులు ఈ మూడు శక్తులు కలిసిన శక్తినే ‘ప్రకృతి’ అని, ‘పరాశక్తి’ అని, ‘అవ్యక్తం’, ‘శుద్ధమాయ’ అని అంటారు. అంటే యావత్తు ప్రపంచానికి (సృష్టికి) జన్మనిచ్చినది ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల కలయిక అయిన పరాశక్తే అని తెలుస్తున్నది. కాబట్టి ఆ పరాశక్తే ఈ జగత్తుకు మాత (తల్లి) అని శాస్త్రాలు నిర్ణయించాయి. త్రిమూర్తులకు, దేవతలకు వారి వారి విధి నిర్వహణకు కావలసిన శక్తు లన్నింటినీ ఆ జగన్మాత లేదా పరాశక్తి, వారికి అందిస్తోంది.
శ్రీ చక్ర ఆవిర్భావం
ఉండేది బ్రహ్మమొక్కటే. ఈ బ్రహ్మం సత్‌, చిత్‌, ఆనంద స్వరూపములు కలది. అది చలనము లేనిది, నిశ్చలమైనదైనప్పటికి, చేతనం అనే బీజం కలిగి ఉండుటం దానిలోని విశేషం.
కేవలం కాంతి (ప్రకాశ) రూపముగానున్న బ్రహ్మమునందు ఏర్పడిన మొదటి కదలికను ‘విమర్శ’ (ఆలోచన) అన్నారు. తాంత్రికులు కాంతిని పరమశివుడుగాను, విమర్శను పరాశక్తిగాను భావించారు. కాంతి (ప్రకాశ) స్వరూపమైన బ్రహ్మములో ఏర్పడిన మొదటి కదలికవల్ల నాదము ఏర్పడినది. ఈ ప్రథమ నాదము సూక్ష్మరూపమైన బిందువుగా ఏర్పడినది. ఈ బిందువునందే కేంద్రీకరించబడిన శివశక్తుల విజృంభణము కలదు. దీనినే ”పరాబిందువు” అందురు. ఇందులో కామేశ్వర, కామేశ్వరీ స్వరూపములు కలవు. ఈ బిందువే మూల ప్రకృతి. దీనికే సర్వానందమయ చక్రమని పేరు. ఈ బిందువే శ్రీచక్రమునకు ఆధారము. ఈ పరాబిందువు నందే సృష్టికి కావలసిన శక్తి అంతా బీజప్రాయంగా ఉన్నది. సృష్టి జరుగుటకు ఈ పరాబిందువు కొంత క్రిందికి దిగివచ్చి శబ్ద బ్రహ్మముగా మారుతుంది. అనగా విత్తనము (గింజ) లో రెండు పప్పులు (బద్దలు) ఉన్ననూ చుట్టూ ఉన్న పొట్టు (పై పొర) వలన గింజ ఒకటిగా కనపడినట్లు ఈ పరాబిందువు నందు శివశక్తులొకటిగా ఉంటాయి.
srichakra1శ్రీ చక్రం – పరాశక్తి వేర్వేరు కాదు
అలా ఒకటిగానున్న పరాబిందువు నుండి మూడు బిందువులేర్పడినవి. 1) శివశక్తులొకటిగా నున్న ‘బిందువు’, 2) అచేతనంగా ఉన్న ‘శివుడు’, 3) ‘చేతనా స్వరూపమైన శక్తి’. ఈ మూడు బిందువులే త్రిగుణాత్మకము. త్రిపుటల సమ్మేళనము, త్రిపురముల మొదటి త్రికోణము. ఇది శివపార్వతుల ఏకరూపమైన అర్థనారీశ్వరతత్వాన్ని సూచిస్తోంది.
మనం పరాశక్తి శుద్ధ స్వరూపాన్ని దర్శించలేం, కనీసం ఊహించలేం. కనుక శక్తి మాత తన మొదటి రూపంగా శ్రీచక్రాన్ని నిర్మించింది. తదుపరి అనేక దేవీరూపాలను స్వీకరించి మనకు ఉపాసనా సౌలభ్యాన్ని కల్పించింది. శ్రీచక్రముతో ఈ సకల చరాచర జగత్తునకు నామరూపములకు, పదార్థము లకు సమన్వయం కలుగుచున్నది. పరాశక్తికి శ్రీ చక్రానికి ఏ మాత్రం భేదం లేదు. శ్రీ దేవియే శ్రీచక్రము. శ్రీమాత, శ్రీ విద్య, శ్రీచక్రములు వేరు వేరు కాదని, ఈ మూడూ ఒకే పరబ్రహ్మ స్వరూపమని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము తెలియచేస్తోంది.
శ్రీ చక్రం నందు లలితాదేవి ఎల్లప్పుడూ నివసించి ఉంటుంది. ఇటువంటి శ్రీవిద్యను, శ్రీచక్రోపాసనను మనువు, చంద్రుడు, కుబేరుడు, అగస్త్యుడు, లోపాముద్ర, అగ్ని, మన్మథుడు, సూర్యుడు, ఇంద్రుడు, శివుడు, స్కంధుడు, దూర్వాసుడు అను పన్నెండుమంది, పన్నెండు శాస్త్ర విధానములుగా ప్రవేశపెట్టినట్లు జ్ఞానార్ణవ తంత్రము తెలుపుచున్నది.
శ్రీ చక్ర నిర్మాణం
బిందువు, త్రికోణము, అష్టకోణచక్రము, అంతర్దశారము-
 బహిర్దశారమను దశత్రికోణ చక్రము, చతుర్దశారము, అష్ట దళ పద్మము, షోడశ దళ పద్మము, భూపురము అను తొమ్మిది ఆవరణము లతో కూడినది శ్రీచక్రం.
శ్రీచక్రంలో ఉన్న మొత్తము త్రిభుజాల సంఖ్య 43. మొత్తము పద్మముల సంఖ్య 24. మొత్తము వృత్తముల సంఖ్య 7 (బిందువుతో కలిపి). ఈ శ్రీచక్రములోని తొమ్మిది చక్రములను (శివచక్ర, శక్తిచక్రములను) నవయోనులని వ్యవహరిస్తారు. త్రికోణ, అష్ట కోణ, దశ కోణద్వయము, చతుర్దశ కోణములు ఐదూ శక్తి కోణములు. బిందువు, అష్ట దళము, షోడశ దళము, చతురస్రము అను నాలుగూ శివచక్రాలు. ఈ చక్రంలోని బహిర్దశార, అంతర్ద శారములను కలిపితే శ్రీచక్రము అష్టాచక్రా అవుతుంది.
నవద్వారా అంటే తొమ్మిది త్రికోణములు. వాటిలో నాలుగు శివాత్మకం, ఐదు శక్త్యాత్మకం.
శ్రీచక్రంలోని నవావరణములు ఆరోహణ క్రమంలో ఇలా ఉన్నాయి.
1. భూపుర త్రయం – త్రైలోక్య మోహన చక్రం
2. షోడశ దళ పద్మం – సర్వాశా పరిపూర చక్రం
3. అష్ట దళ పద్మం – సర్వ సంక్షోభిణీ చక్రం
4. చతుర్దశారము – సర్వ సౌభాగ్య చక్రం
5. బహిర్దశారము – సర్వార్థ సాధక చక్రం
6. అంతర్దశారము – సర్వ రక్షాకర చక్రం
7. అష్ట కోణము – సర్వ రోగహర చక్రం
8. త్రి కోణము – సర్వ సిద్ధిప్రదా చక్రం
9. బిందువు – సర్వానందమయ చక్రం
ఒక్కొక్క ఆవరణలోని దేవతలను సాక్షాత్కరించు కొనుటకు కొన్ని ప్రత్యేక బీజ మంత్రములు కలవు. శ్రీదేవీ ఖడ్గమాల స్తోత్రమునందు, శ్రీదేవీ బీజాక్షర సంబోధనమ్‌, న్యాసాంగ దేవతలు, దివ్యౌఘ గురువులు, సిద్ధౌఘ గురువులు, మానవౌఘ గురువులు, తొమ్మిద ఆవరణములలోని వివిధ దేవతలు నమస్కార నవాక్షరి దేవతల పేర్లు, విడివిడిగా, విపులముగా ఇవ్వబడ్డాయి. ఉదాహరణకు మొదటి ఆవరణలో త్రైలోక్యమోహన చక్రం, అచ్చటి దేవతలు అణిమాది సిద్ధులు. ఇవి మనలోని వివిధ రకములైన మానసిక ప్రవృత్తులు.
adi-parashaktiశ్రీ చక్రం – మానవ శరీరం
గమనించవలసిన విషయమేమంటే, ఈ జగత్తులోని సకల తత్వాలు, సకల భువనాలు, పరమశివుడు, పరాశక్తి మానవునియందు కూడా కలవు. మానవ శరీరమును రెండు భాగములుగా చూస్తే – నాభి నుండి పైభాగము ఊర్థ్వలోకమని, క్రింది భాగం అధోలోకమని, ఈ రెండింటిని కలిపే వెన్నెముకను మేరుదండమని అంటారు. శ్రీ చక్రమును కూడా మేరువు అంటాము. మేరుపర్వతము కూడా భూమికి ఇరుసు వంటిది. ఏ రకంగా పరాశక్తి దివ్యస్వరూప కాంతులచేత జగత్తంతా ప్రకాశవంత మవుతుందో, మన మేరుదండములోని కుండలినీ శక్తిచేత శరీరమంతా చైతన్యమవుతుంది.
మనలో ఆత్మ ఉన్నదని అంగీకరించినట్లే మన శరీర నిర్మాణ ప్రాధాన్యం కూడా గుర్తించాలి. నవావరణాత్మకమైన శ్రీచక్రానికి, మానవ శరీరానికి తేడా లేదని శాస్త్రం చెబుతోంది. శ్రీచక్రాన్ని ఆరాధిస్తే అన్ని దేవతామూర్తులను ఆరాధించినట్లేనని తంత్రశాస్త్రం తెలుపుతోంది.
శ్రీ అంటే శుభకరమైనది. దీనిని నవచక్రమని, వియత్‌చక్రమని, నవయోనిచక్రమని అంటారు. చక్రము ఎప్పుడూ పరిభ్రమిస్తుంది. దీనికి ఆద్యంతము లుండవు. కేంద్ర బిందువు నుండి పరిధి వరకు ఎక్కడ కొలిచిననూ సమానంగా ఉంటుంది. చక్రారాధనము ప్రతిమారాధన కన్న శక్తివంతం. మంత్రం వలె యంత్రం కూడా మహిమ గలదే.
దేహో దేవాలయః ప్రోక్తో
జీవో దేవస్సనాతనః
త్యేజేదజ్ఞాన నిర్మాల్యం
సోహంభావేన పూజయేత్‌ !
శరీరమే దేవాలయము. జీవుడే అక్కడి దేవుడు, అజ్ఞానమనే మాలిన్యాన్ని త్యజించాలి. ఆ దేవుడే నేననే భావమే పూజ. ఆ భావనతోనే అర్పించాలి.
కాబట్టి సాధకుని ధ్యానము, పూజ, భావన బాహ్యము నుండి లోనికి చొచ్చుకొనిపోయి ఆత్మను చేరుకోవాలి. విశ్వంలోని శక్తులన్ని ఈ నవావరణముల ద్వారా ద్యోతకమై మానవుని పంచకోశములందు అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములందు ఇమిడి ఉన్నవి.
నిరంతర సాధన మార్గం
శ్రీచక్రాన్ని మన శరీరంతో పోల్చి పరిశీలిస్తే ఆ జగన్మాత శ్రీ లలితాదేవి దర్శనం ఎంత దుర్లభమో అనిపిస్తుంది. మనలోని కర్మ, జ్ఞానేంద్రియాల వెంటపడి పరిగెత్తే మనస్సు, బుద్ధి, అహంకార, మమకారాలు, కామోద్రేకాలు, శృంగారాది నవరసాలు, జాగ్రద, స్వప్న, సుషుప్తాది అవస్థలు వీటిని నడిపే సత్వరజస్తమోగుణాలు – వీటిన్నిటిని ఆ శ్రీదేవి విభూతులుగా గ్రహించి, వీటన్నింటినీ దాటి బిందుస్థానమునకు చేరుకోగానే అచట అద్వితీయమైన, సచ్చిదానంద రూపమైన, సస్వరూపానుభవము కలుగుతుంది. అదే శ్రీమాత దర్శనం. ఇది ఎన్ని జన్మలకు సాధ్యమో!
త్రైలోక్య మోహన చక్రం నుండి సర్వానందమయ చక్రం వరకు మనం ఎక్కవలసిన మెట్లు, తొలగించుకో వలసిన తెరలు, అనుభవించవలసిన సుఖదుఃఖాలు అన్ని శ్రీచక్రంలో వలె మనలోనూ ఉంటాయి. ఈ ప్రయాణంలో అడ్డంకులు పూర్తిగా తొలగవు. మనమే జాగ్రత్తగా, నెమ్మదిగా వాటిని దాటుకుపోవాలి. వాటిని లేకుండా చేయలేం. అందువల్లనే త్యాగరాజస్వామి కూడా తెరను తొలగించమని ప్రార్థించారు తప్ప, తెరలేకుండా చేయమనలేదు. మనలోని ప్రాపంచిక మైన ముప్పది ఆరు తత్వములు, త్రిపుటలు, నవా వరణములను నిర్లిప్తతతో, నిష్కామంగా, నిస్వార్థంగా అనుభవిస్తూ గమ్యాన్ని చేరుకోవడానికి నిరంతర సాధన చేయాలే తప్ప వేరొక మార్గం లేదు.

Monday, December 23, 2019

సూర్య గ్రహణం వివరణ

2019 సంవత్సరం - డిసెంబర్ సూర్య గ్రహణం: తేదీ 26-12-2019 ,ఉ: గం,, 8.08 ని,, నుండి ఉ,, గం,,11.10 ని,, వరకు

కేతుగ్రస్తమైన సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం. ఆధ్యాత్మిక పురోగతిలో గ్రహణాలు  అద్భుతమైన పర్వదినాలుగా పరిగణించబడుతాయి. అందులో కంకణాకార సంపూర్ణ సూర్య గ్రహణానికి ప్రాముఖ్యత ఎక్కువ .

ఈ గ్రహణం ధనుస్సు రాశి లో మూలా నక్షత్రం లో ఏర్పడును.

గ్రహణం సమయం సుమారు 3 గంటల 2 నిమిషాలు .

ధనుస్సు రాశి వారు ఈ గ్రహణం చూచుట మంచి కాదు .

ముఖ్యముగా మూలా నక్షత్రం వారు ఈ గ్రహణం చూచుట పనికి రాదు. అనారోగ్య హేతువు.

గ్రహణం ఏ రాశి లో సంభవిస్తుందో ఆ రాశి వారికి దోషం అని ధర్మ శాస్త్రం, అనారోగ్యము వస్తుంది అని జ్యోతిష శాస్త్రం చెప్తున్నాయి. కనుక శాంతిప్రదమైన పరిహారములు చేసుకొనుట ఉత్తమం..

పరిహారములు 3 విధములుగా చేయవచ్చును.
ఉత్తమం,మధ్యమం,అధమం.
ప్రధమం:(ఉత్తమం):-
1). రాగి పాత్ర గాని , కంచు పాత్ర గాని, తీసుకుని బంగారంతో చేయించిన సూర్య బింబాన్ని , వెండితో చేయించిన నాగ సర్పాన్ని ఆ పాత్రలో పెట్టి ఆ పాత్రలో నిండుగా ఆవు నెయ్యి పోసి తెల్లని పంచెల చాపును  1¼ కేజీ నల్లని నువ్వులు సమంత్రకంగా వేదవిదులైన బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి..
గమనిక:- ఈ దానం గ్రహణం విడిచిన తరువాతే చెయ్యాలి.. గ్రహణ సమయంలో చేయరాదు.

దాన సమయం లో చెప్ప వలసిన సంకల్పమ్:-

ధనుస్సు రాశి వారు :-మమ జన్మజాతక  ధనుః రాశ్యాత్ తత్రాపి మూలా నక్షత్రే స్వజన్మ నక్షత్రే కెేతు గ్రస్త సంపూర్ణ సూర్య గ్రహణ సమయే సంప్రాప్త సర్వారిష్ట శాంత్యర్ధం.
 వృషభ రాశివారు:-మమ జన్మజాతక వృషభ రాశ్యాత్ అష్టమ స్థానే ధనుః రాశ్యాం మూలా నక్షత్రే కెేతు గ్రస్త సంపూర్ణ సూర్య గ్రహణ సమయే సంప్రాప్త సర్వారిష్ట శాంత్యర్ధం.
కన్యా రాశి వారు:- మమ జన్మజాతక కన్యా రాశ్యాత్ అర్థాష్టమ స్థానే ధనుః రాశ్యాం మూలా నక్షత్రే కెేతు గ్రస్త సంపూర్ణ సూర్య గ్రహణ సమయే సంప్రాప్త సర్వారిష్ట శాంత్యర్ధం.
మకర రాశి వారు:- మమ జన్మజాతక మకర  రాశ్యాత్ ద్వాదశ స్థానే ధనుః రాశ్యాం మూలా నక్షత్రే కెేతు గ్రస్త సంపూర్ణ సూర్య గ్రహణ సమయే సంప్రాప్త సర్వారిష్ట శాంత్యర్ధం.
 ఆజ్య పూరిత కాంశ్య పాత్రే  రజత సర్ప యుత ప్రత్యక్ష సువర్న జ్యోతి సహిత సౌర బింబదానం కరిష్యే

పై పరిహారం అవకాశం లేని వారు 2 వ పద్దతి :
2)మహాన్యాస పూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకం చేయవలెను ..
మరియు 1¼ కేజీ ఉలవలు ,1¼ కేజీ గోధుమలు, తెల్లని పంచెల చాపు దానం చేయవలెను..
ఈ పరిహారం కూడా అవకాశం లేని వారు 3 వ పద్దతి:

3:- శివ కవచ స్తోత్రం ప్రతి రోజు పారాయణ 3 నెలల పాటు చేయవలెను ..

గ్రహణ గోచారం:-

ఉత్తమ ఫలితాలు : కర్కాటక , తుల,కుంభ, మీన రాశి వారికి శుభ ఫలితం ఉండును ...

మధ్యమ ఫలితాలు: మేషం, మిధునం, సింహం,వృశ్చికం రాశుల వారికి కొంచెం దోషం తో కూడిన మధ్యమ ఫలితం ఉండును ..
అధమ ఫలితం: వృషభ, కన్యా, ధనుస్సు, మకరం రాశి వారికి సంపూర్ణ దోష పూరిత అధమ ఫలితం సంభవించును .
ముఖ్యముగా ధనుస్సు రాశి వారికి దోషం అధికంగా ఉన్నది కావున పై పరిహారములు తప్పని సరిగా ఆచరించాలి...

సింహారాశి వారు కూడా పరిహారం చేయుట మంచిది ఎందుకంటే రాశ్యాధిపతి కి గ్రహణం పట్టింది కనుక ..

సూర్య గ్రహణం రోజున అందరూ పాటించ వలసిన నియమములు ..

గ్రహణం స్పర్శ కలిగిన వెంటనే పట్టు స్నానం( ప్రారంభసమయం లో స్నానం)

గ్రహణం మధ్య కాలంలో జపాలు చేయుట మంచిది..

గ్రహణం విడిచిన తరవాత స్నానమాచరించి హోములు దానాలు చేయడం మంచిది..

స్నానం చేయు విధానం: సచేల  స్నానం ( కట్టుకున్న బట్టలతో స్నానం ఆచరించడం )

స్నానం లో నీటి కి ఉన్న ప్రాధాన్యత:

గోరువెచ్చని నీరు చేయవచ్చును ,
దాని కంటే చల్లని నీరు ఉత్తమం .
దానికంటే బావి లో నీరు ద్విగుణీకృతం ..
దాని కంటే చెరువులో నీరు శత గుణితం ,
దాని కంటే పర్వతాల నుంచి జాలువారే సెలయేటి నీరు సహస్ర గుణితం ,
దానికంటే జీవనది నీరు అనంత గుణితం,
దాని కంటే సముద్ర స్నానం అక్షయం గుణితం ,

ఈ గ్రహణ సమయంలో ఏ వస్తువును స్పర్శ (ముట్టుకోరాదు)చేయరాదు .

ఎందుకంటే సర్వేషాం ఏకవర్ణానాం శూతకం గ్రహణదర్శనేకాబట్టి అందరికి మైల ఏర్పడును ..

గ్రహణం సమయం లో జపం చేయుట మంచిది. వైదిక వృత్తిలో ఉన్నవారు వారికి ఉపదేశించిన మంత్రమును అనుష్టానం చేయుట మంచిది.

సాధారణమైన వాళ్ళు విష్ణు , లలితా సహస్ర నామ పారాయణం , శ్రీరామ రక్షా స్త్రోత్రం , లేదా మీకు ఇష్టమైన దేవతా స్తోత్రం లేదా నామ జపం చేయవచ్చును..

మంత్రకారకో రాహు: తత్సిద్ది కారకో: కేతు: కనుక గ్రహణ సమయంలో మంత్రం బాగా చైతన్యమగును కనుక గ్రహణ సమయాలలో గోరంత జపం లేదా దానం కొండంత ఫలితం ఇచ్చును.

గ్రహణ సమయాల్లో దోష పరిహారార్ధం చేయు దానాలు క్షేత్రాల్లో చేయుట మంచిది.

క్షేత్రాలలో అన్ని క్షేత్రాలలో కంటే కురుక్షేత్రం దానం కు పెట్టింది పేరు. కనుక కురుక్షేత్రములో దానం చేసిన అక్షయం అగును.

గ్రహణ సమయాలలో గర్భిణి స్త్రీలు పాటించవలసిన నియమములు :

గ్రహణ సమయంలో గర్భస్థ శిశువుకు ఇబ్బంది అని ఆచారం లో ఉంది కాని ధర్మ శాస్త్రాలలో ఎక్కడ చెప్పలేదు ..
ప్రత్యక్షంగా (గ్రహణ మొర్రి ముఖ్యంగా కన్ను, ముక్కు, చెవి, నోరు, పెదవి భాగాలకు చూస్తున్నాం )ఆచారం కూడా ప్రధానమైనది..

ఆచార ప్రభవో ధర్మః , ధర్మస్యప్రభురచ్యుతః , కాబట్టి ఆచారమే ధర్మానికి మూలం కనుక ఉదయం 8 గంటల నుండి ఉదయం 11 గంటల 30 నిమిషాల వరకు విశ్రాంతి తీసుకునుట దైవ నామ స్మరణ చేయుట మంచిది ..
గ్రహణం మరుసటి రోజు కూడా గ్రహణ శూల కాబట్టి ఈ రెండు రోజులు విశ్రాంతి తీసుకొనుట దైవ నామస్మరణ చేయుట మంచిది..

గ్రహణ సమయంలో వండుకుని నిల్వ ఉంచిన పదార్ధములు ఏవీ పనికి రావు..

గ్రహణ సమయంలో ఉన్న నీరు కూడా పనికిరాదు.

26-12-2019 గ్రహణం కనుక 25-12-2019 రాత్రి భోజనం చేయరాదు. ఎందుకంటే గ్రహణ సమయాలలో మల మూత్ర విసర్జన కూడా దోషమే ..

గర్భవతులు, వయోవృద్ధులు, పసిపిల్లలు, అనారోగ్యంతో బాధ పడుతున్నవారు పళ్ళు, పాలు స్వీకరించవచ్చును..

ఇంట్లో నిలువ ఉన్న పదార్దాలమీద ధర్బను ఉంచవలెను ..

ఒక వేళ దర్భ లభించని పక్షంలో గరిక ను వాడవచ్చు కానీ దర్భయే ప్రధానం ..

గ్రహణ సమయంలో నాస్తికులు వంటను వండించుట గర్భిణి స్త్రీలతో తినిపించుట వగైరా పనులు చేస్తున్నారు. 
ఇది ధర్మ శాస్త్రము నకు పూర్తిగా విరుద్ధము. ఇలా చేసిన వారికి అక్షయ నరకం వస్తుందని ధర్మశాస్త్రం తెలియచెప్తోంది.. 

Saturday, December 21, 2019

మంత్రోచ్చారణ గొప్పదనం - సంపూర్ణ వివరణ 3 .

మంత్రసాధకుడు పాటించవలసిన నియమాలు  -

 *  సాధకుడు మంత్రజపమునకు ఏకాంత ప్రదేశమును ఎంచుకొనవలెను. అతడు మంత్రమును జపించుచున్నప్పుడు మిగతావారి రాకపోకలు ఉండరాదు. పూజామందిరమున జపించుట అత్యంత శ్రేష్టకరం.

 *  సాధకుడు ఏకాగ్రతతో మంత్రజపం చేయవలెను . వేకువజామునే జపం చేయుట మంచిది .

 *  జపం , ధ్యానం చేయు సమయములో కదలకూడదు.

 *  జపం ఆచరించు కాలములో ఖచ్చితముగా బ్రహ్మచర్యం పాటించవలెను. కోపం , ఆగ్రహం దరిదాపుల్లోకి కూడా రాకూడదు.

 *  అసత్యము పలుకరాదు . చేయగూడని పనులు చేయరాదు . మద్యం , మాంసం వంటి వాటిని సేవించరాదు. ధూమపానం నిషిద్దం. శరీరమును , మనస్సును అన్నివేళలా శుభ్రముగా ఉంచుకొనవలెను.

 *  మంత్రజపం మొదలుపెట్టిన తరువాత మధ్యలో ఆపరాదు. అలా ఆపినచో అప్పటివరకు చేసిన జపము అంతా వృధా అగును. ఫలితం ఉండదు.

 *  సాధకుడు మంత్రజపము , ధ్యానసాధన మొదలుపెట్టిన తరువాత ఎటువంటి అనారోగ్యములు అయినను అతని కుటుంబసభ్యులకు కనిపించుచున్నను ధైర్యముతో జపము ఆపకూడదు. రోజులు గడుస్తున్నకొలది సమస్యలు అన్నియు తీరిపోవును.

 *  జపము చేయు సమయములో ఎటువంటి విచారకరమైన వార్తలు వినినను , ఇతర సమస్యలు ఎదురైనను జపాన్ని ఆపరాదు . గురువుని సంప్రదించ వలెను.

 *  మంత్రానుష్టానం చేయు రోజుల యందు సాధకుడు ఎక్కువుగా పండ్లు , తేలికగా జీర్ణం అయ్యే ఆహారపదార్థాలు తీసికొనవలెను . ఇలా చేయుట వలన శరీరం బద్ధకం , అనారోగ్యం వంటి సమస్యల పాలబడకుండా అత్యంత చురుకుదనంతో ప్రవర్తించగలరు.

 * మంత్రానుష్టానం చేయు సమయంలో ఎదురయ్యే విచిత్ర సంఘటనలు కనిపించిన యెడల అధైర్యపడకూడదు.

 *  మంత్రజపం చేయు విషయము భార్య , ఇతర కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియపరచవలెను.

 * మనస్సు నందు ఏదో ఒక కోరికతో మంత్రసాధన చేయుచున్నప్పుడు ఆ కోరిక నెరవేరుట కొంచం ఆలస్యం అయినను సాధకుడు నిరుత్సహ పడకుండా దైర్యముతో తన మంత్రసాధన కొనసాగించవలెను.

 *  మనస్సు నందు కోరిక లేకుండా ఏ మంత్రజపం అయినను చేస్తూ ఉన్నచో అన్ని కార్యముల యందు అడ్డంకులు తొలగి ప్రశాంతమైన జీవితం గడపగలరు.

 *  మంత్రజపం గాని , ధ్యానసాధన , స్తోత్రపఠనం వంటివి ఏవైనా గాని ఒక పర్యాయము దీక్షలో నెరవేరని ఎడల తాను నిర్వహించిన అనుష్టానములో ఏదో ఒక లోపం ఉందని గ్రహించి తిరిగి మరలా ఆ దీక్షనుబూని ఆ లోపం తెలుసుకొని మరలా ఆతప్పు జరగకుండా జాగ్రత్తపడవలెను. లేనిచో దీక్షని శక్త్యానుసారం నిర్వహించవలెను.

 *  పుస్తకములు చదివి లేదా వేరే వ్యక్తి ద్వారా మంత్రజపమును తెలుసుకుని గాని సాధకుడు దీక్షని మొదలుపెట్టక సరైన గురువు పర్యవేక్షణలోనే దీక్ష చేపట్టవలెను . సద్గురువు ఆశీర్వాదముతో దీక్ష మొదలుపెట్టిన ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్యసిద్ధి పొందగలరు.

 *  అన్నింటికన్నా ముఖ్యమైనది సాధకుడికి తాను చేయబోయే మంత్రాధిష్టాన దేవత యందు , మంత్రము యందు , స్తోత్రము యందు నమ్మకం , సంపూర్ణ విశ్వాసం , భక్తిశ్రద్ధలు కలిగి ఉండవలెను అప్పుడే ఆ మంత్రజపం సిద్ధిస్తుంది.


                              సంపూర్ణం 

  గమనిక  -

           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.

           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.

            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.

      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 50 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది? ఎలా ముగిసింది?

వేదాలను అనుసరించి యుగాలు మొత్తం నాలుగు. అవి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఇలా ఒక్కో యుగానికి ఒక్కో భగవంతుడు ఉండగా జ్యోతిష్య గ్రంథం ప్రకారం ఒక్కో యుగానికి ఒక్కో గ్రహం రాజు, మంత్రి  అని చెబుతున్నారు. మరి పురాణాలూ, శాస్రాలు యుగాల గురించి ఎం చెబుతున్నాయనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1. కృతయుగం:
నాలుగు యుగాలలో మొదటిది కృతయుగం. దీనినే సత్యయుగం అని కూడా అంటారు. ఈ యుగం నందు నారాయణుడు లక్ష్మి సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము పదిహేడు లక్షల ఇరవై ఏడూ వేల సంవత్సరములు. ఈ యుగం లో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది. ఈ యుగంలో ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ యుగంలో అకాలమరణాలుండవు. ఇక ఈ కృతయుగమునకు రాజుగా సూర్యుడు అంటే రవి మంత్రిగా గురువు అంటే బృహస్పతి నియమితులయ్యారు. బంగారమునకు అధిపతి గురువు కావున ఈ యుగంలో ఎక్కడ చూసినా బంగారుమయముగా ఉండేది. ప్రభువులకు ప్రజలకు ఎటువంటి భావ విభేదము విరోధము లేక చక్కగా కాలకు నడిచినది. సూర్య ప్రభావము చేత సుక్షత్రియులు, గురు ప్రభావము చేత సద్బ్రాహ్మనులు జనించి ధర్మ మయిన పాలన నడిచినది.
ఇక సకాలమునకు వర్షం మంచి పంటలు పాడి పశువులు అభివుద్ది చెంది ప్రజలు సుఖమయిన జీవనము గడుపుతూ ధర్మమయిన పాలన సాగుతుంది.  సూర్య, గురు వులు వారికి మిత్ర గ్రహములయైన కుజ, చంద్ర, కేతువుల సహాయముతో ధర్మమయిన పాలన చేస్తూ ఉన్నారు. శని, శుక్ర, బుధ, రాహు గ్రహములు కదలక మెదలక కొంత వరకు వాగ్వివాదము కల్పించ ప్రయత్నము చేసిరి.
శని, శుక్ర, బుధ, రాహు గ్రహ కారకముల వలన కొంత అన్యాయ ప్రవర్తన కలిగి వివాదమునకు దిగు వానిని చూసి శాపానుగ్రః శక్తి గలిగిన బ్రాహ్మణులు కోపమాపలేక వీడు రాక్షసుడై పుట్టేందుకే  ఇటువంటి  అన్యాయ ప్రవర్తన ఇటువంటి మాటలు మాట్లాడు తున్నాడు అని అనడము వలన ఆ తపోశక్తి శాప రూపమున  త్రేతాయుగములో రాక్షస వంశము అధికమయ్యెను. తపస్సుచే దైవబలమును సంపాదించారు కాని కోపము ఆపలేక పలికిన పలుకులు త్రేతాయుగములో క్రూరులు, రాక్షస స్వభావులు, రాక్షసులు, కలహము పెంచేవారు అధికమయ్యారు. ఈవిధముగా కృతయుగమున  సవ్యముగా నడిచి త్రేతాయుగము ఆరంభమయినది.

2. త్రేతాయుగము:
త్రేతాయుగము లో భగవంతుడు శ్రీరాముడిగా అవతరించాడు. ఈ యుగంలో భగవంతుడిగా అవతరించిన శ్రీరాముడు రాక్షసుడైన రావణుడిని సంహరించి ధర్మ సంస్థాపన చేసాడు. ఈ యుగం కాల పరిమాణము పన్నెండు లక్షల తొంభైఆరు వేల సంవత్సరములు. ఈ యుగంలో ధర్మము మూడు పాదములపై నడుస్తుంది.
ఇక త్రేతాయుగమునకు రాజుగా కుజుడు అంటే మంగళుడు. మంత్రిగా శుక్రుడు నియమితులైయ్యారు. కుజుడు పురుష కారకుడు యువకుడు , యుద్ధప్రియుడు, సుక్షత్రియుడు, బాహు బాల పరాక్రమ వంతుడు, సత్యము పలుకు వాడు రాజుగా ఆచారమునకు కట్టుబడి ఉండక తిరుగువాడు. రాక్షస గురువు అయిన శుక్రాచార్యుడు స్త్రీలకు కారకుడు మాయ మంత్ర తంత్రవాది కుజునకు పరమ శత్రువు అయిన శుక్రుడు మంత్రిగా కాలము పాలించవలసి వచ్చింది.
రాక్షస గురువు శుక్ర బలమున దుష్ట శక్తి, మాయా మంత్రం ప్రభావము  చేత రాక్షసులను పురిగోలిపి యజ్ఞ యాగాది క్రతువులకు, తపస్సంపన్నులకు , రూపవతులయిన స్త్రీలకూ, బ్రాహ్మణులకు విపత్తులు కల్పించి బాధించేవాడు.  రాజు మాట మంత్రికి మంత్రి మాట రాజుకు పడకపోవడం చేత మంత్రులు క్రూర స్వభావులై రాజ్య పాలనను బ్రష్టు పట్టించి స్త్రీ వ్యామోహము వలన కలహము పెంచి ప్రజలను పీడించి రూపవతులు అగు స్త్రీలచే, యువకులకు ప్రాణ హానిని కలిగించేవారు. నాలుగు హంగులలో ప్రథమ మయిన మంత్రము యజ్ఞ యాగాదులు మొదలగు దైవ కార్యములు వాటిని జరిపించు బ్రాహ్మన వంశాములను అంతరించేలా చేసేవారు. ఇలా రాక్షసుల వలన, దుర్మార్గుల వలన మంత్రి సామంతుల వలన త్రేతాయుగములో నాలుగింట ఒక భాగము దెబ్బతిన్నది. కుజ గ్రహ బలము  చేత ధనుర్ విద్యా పారంగతులు  అయిన రాజ యువకుల చేత రాక్షస సంహారము చేయించుచు, అధర్మపరులను శిక్షిస్తూ బ్రాహ్మణులను కాపాడుతూ స్త్రీలకూ రక్షణ కల్పిస్తూ ధర్మమును కొంత రక్షించెను. ఈవిధంగా త్రేతాయుగమున ధర్మము నాలిగింట ఒక పాదము తగ్గి ద్వాపరయుగం మొదలవుతుంది.

3. ద్వాపరయుగం:
ద్వాపరయుగంలో భగవంతుడు శ్రీకృష్ణుడు అవతరించాడు. ఈ యుగం కాల పరిమాణము ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరములు. ఈ యుగంలో  ధర్మము రెండు పాదముల పై నడుస్తుంది. ద్వాపర యుగమున రాజుగా చంద్రుడు , మంత్రిగా బుధుడు నియమితులయి పాలన చేస్తున్నారు. చంద్రుడు గురు గ్రహ వర్గమునకు చెందినా వాడు బుధుడు శని వర్గమునకు చెందిన వాడు. వీరు ఒకరికి ఒకరు పడనివారు. బుధుడు చెడు విద్యలను రాక్షసులకు, దుర్మార్గులకు, దుష్టులకు ఇచ్చి సాదువుల సజ్జనుల, రూపవతుల, పతివ్రతలకు, కన్యలకు అపకారము చేయు వారిని పురిగొల్పుతాడు.
బుధుడు మాంత్రికుడు, మోసములకు నెలవు, వ్యవహార్ములకు అధిపతి ద్వాపరమున అనేక బాధలు కల్పిస్తాడు. దేవతా కార్యములు అర్థ భాగము నశింప చేసి, రాజులకు బ్రాహ్మణులకు భావ విభేదము కల్పించి బ్రాహ్మణులను సేవకులుగా కొంత వరకు మారుస్తాడు. ఇక ఈ యుగంలో నాలుగు హంగుల ధర్మములో రెండు హంగులు మాత్రమె నిలిచింది.
బుధుడు మాంత్రికుడు, మోసములకు నెలవు, వ్యవహార్ములకు అధిపతి ద్వాపరమున అనేక బాధలు కల్పిస్తాడు. దేవతా కార్యములు అర్థ భాగము నశింప చేసి, రాజులకు బ్రాహ్మణులకు భావ విభేదము కల్పించి బ్రాహ్మణులను సేవకులుగా కొంత వరకు మారుస్తాడు. ఇక ఈ యుగంలో నాలుగు హంగుల ధర్మములో రెండు హంగులు మాత్రమె నిలిచింది.
చంద్రుడు సకల విద్యా పారంగతుడు బలవంతుడు మనో కారకుడు మాతృ కారకుడు కాన రాజుల విధ్యాపారంగుతులను చేసి ధనుర్ విద్య నేర్పించి దుష్టులను ప్రబలకుండా ఈ మాంత్రికులను, వామాచారులను, మాయావులను నాశనము చేయుటకు స్వయముగా భగవానుడే కృష్ణుడిగా అవతరించి దేవతా వర్గమున కొందరిని అంటే ఇంద్రుని అంశలు  ధర్మ రాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు తోడుచేసుకొని ద్వాపరయుగ అంతమున మంత్రయుగమును మటు మాయం చేస్తాడు. ఈ విధంగా ద్వాపర యుగమున ధర్మము రెండు భాగాలు నశించి కలియుగము ప్రారంభము అవుతుంది. అంటే మంత్రం యుగము అంతరించి యంత్రయుగము ప్రారంభము అవుతుంది.

4. కలియుగము:
మన ప్రస్తుతం ఉన్న యుగమే కలియుగం. కలియుగం అంతంలో భగవంతుడు కల్కిగా అవతరిస్తాడని చెబుతారు. కలియుగం కాల పరిమాణము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు.  సూర్య సిద్ధాంత ప్రకారము క్రీ.పూ 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభం అయింది. ఇదే సమయానికి శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాడని హిందువులు భావిస్తారు.

ఈ కలియుగమునకు రాజు శని మంత్రులు రాహు కేతువులు. రాహువు కేతువు ఇద్దరికీ ఒకరు అంటే ఒకరికి పడదు. రాహువు శనికి మిత్రుడు.

కొంత కాలము రాహువు మంత్రిగా కొంత కాలము కేతువు మంత్రిగా పాలన చేయుచున్నారు. నాలుగు ధర్మ శాస్త్రములు అదృశ్యం అవ్వగా అప్పుడు కలియుగము ముందుకు నడిచేను. ధర్మమును నిలబెట్టు శాస్త్రములు ఉన్న తన పని సాగదని కలియుగము నడవదని తలంచి కలియుగ ఆరంభములోనే శాస్త్రములను వారిని రక్షించు బ్రాహ్మణులను, అగ్రహారములను, రాజులను ఒక్కొక్కటిగా నశింపు చేస్తూ వచ్చాయి.

ఇక అప్పటినుండి కూరము, కుచ్చితము, అసత్యము, అప్రమాణము, అధర్మము, అన్యాయము తలెత్తాయి. ఈ యుగంలో వావి వరుసలు తప్పి, వర్ణ సంకరములు మొదలై, దొరలే దొంగలయ్యారు.  దైవభక్తి తగ్గి, గురుభక్తి, మాతృపితృ భక్తి అపురూపము అయింది. దైవమును నమ్మి పూజించు కాలము పోయి గురువును పూజించు కాలము వచ్చింది. ఇక హింసా సిద్ధాంతము ఎక్కువ అయి, పాపము వలన దుఖము అనుభవిస్తాము అన్న భయమే లేకుండా పోయింది. పుణ్య కార్యములు కరువయ్యాయి. ఎలాగైనా ధనాన్ని, స్త్రీని పొందినవాడే గొప్పవాడని అనుకునే వారు ఎక్కువయ్యారు. దొంగలకు దారి చూపే వారు ఎక్కువయ్యారు.  ఇంకా ప్రజలు స్వధర్మమును వీడి అన్య ధర్మములను ఆచరించు కాలమునాకు పోయారు. వర్ణ ద్వేషాలు, మత ద్వేషాలు పెరిగాయి. మంచివారు దుర్మార్గులచే పీడించబడుతున్నారు. అయితే  కేతువు మంత్రిగా ఉన్న ఈ కాలములో కొంత మంది ధర్మాత్ములు పుట్టి లోకమునకు మంచి మార్గమును చూపెట్టు పనులు చేస్తున్నారు.

ఈవిధంగా కలియుగం మంచి అనేదానికి చోటు లేకుండా అధర్మానికే మొగ్గు చూపుతూ నడుస్తుంది. కలియుగం అంతంలో భగవంతుడు కల్కి గా అవతరించి తిరిగి సత్యయుగం స్థాపనకు మార్గం సుగమము చేస్తాడని చెబుతారు.

కేశవ నామాలు


1. కేశవ:- క = బ్రహ్మ, అ= విష్ణువు, ఈశ= రుద్రుడు. సృష్టి, స్థితి, లయ కారకుడు.

2. నారాయణ:- పుట్టి పెరిగి సాగే జీవసమూహం = నారం, ఆయనం= ఆశ్రయ స్థానం. సర్వ జీవులకు ఆశ్రయమైన వాడు.

3. మాధవ:- మా అంటే లక్ష్మీ దేవి, ధవ= భర్త.

4. గోవింద:- గోవుల ద్వారా తెలియ పడేవాడు.గో = కిరణములు, వాక్కులు, వేణువు, భూమి, ఇంద్రియములు, ప్రాణాలు.

5. విష్ణు:- ధర్మ,యజ్ఞాదుల రూపంతో , సూర్యాగ్న్యాది తేజస్సుల రూపంలో, శబ్ద స్వరూపంలో అన్నిటా వ్యాపించినవాడు.

6. మధుసూదన:- మధు- రాక్షసుడిని హరించిన వాడు.

7. త్రివిక్రమ:- మూడు లోకాలు ఆక్రమించిన వాడు.

8. వామనాయ:- వమనం= వెలికి పంపుట. నదులు, జలమును వెలిగ్రక్కినట్లు, సర్వ వ్యాపకుడైన విష్ణువు నుండి సనాతనము గా వివిధ జ్ఞాన మయమైన జగత్కర్మలు ప్రకటింప బడుటచే వామనుడు.

9. శ్రీధర:- అమృతం మాధుర్యాన్ని, చంద్రుడు వెన్నెలను ధరించినట్లు స్వాభావికంగా లక్ష్మిని /శ్రీదేవిని ధరించినవాడు.

10. హృషీకేశ:- హృషీకము= ఇంద్రియములు, ఇంద్రియములకు ఈశుడు.

11. పద్మనాభ:- పద్మమునకు నాభి వంటివాడు. అనంత శక్తులతో, (రేకులు) భూతాలతో ఉన్న విశ్వం యొక్క కేంద్రస్థానం/ శక్తి. పద్మమునకు కర్ణికలా విశ్వానికి పద్మనాభుడు.

12. దామోదర:- దామము (లోకములు) ఉదరమునందు కలవాడు. యశోద చే తాడు కట్టబడిన ఉదరం కలవాడు.

13. సంకర్షణ:- విశ్వాన్ని పట్టి ఉంచు వాడు.

14. వాసుదేవ :-వసించి దీపించు వాడు. అంతటా ఆవరించే ధర్మం కలది.'వాసన' పూలలోని గంధంలా విశ్వమంతా వ్యాపించిన చైతన్యమే విశ్వమును ప్రచోదనం చేస్తుంది.

 15. ప్రద్యుమ్న:- విశేషంగా, ఎడతెగక ప్రకాశించే తేజ స్వరూపుడు.

16. అనిరుద్ధ:- అడ్డగించుటకు  సాధ్యం కాని వాడు .

17. పురుషోత్తమ :- హృదయ పురమున శయనించువాడు.(2) విశ్వమెవనిచేత పూర్ణమై (వ్యాప్తమై) ఉన్నదో అతడు పురుషుడు.

18. అధోక్షజ:- అధః = క్రిందకు, అక్షః = దివి. ఈ రెంటికీ నడుమ వ్యాపించిన విరాట్ పురుషుడు. క్రింద ఉన్న కిరణముల ద్వారా మూలమైన దానిని అక్షః - తెలుసుకోవడం.

19. నారసింహ:- శ్రేష్టమైన దివ్యాకారం. నారం( నర) జీవ సమూహం. నారభావం హింసించి పోగొట్టేవాడు. జీవుల (నర) హృదయ గుహలో ఉండే మహా చైతన్యమే సింహం.

20. అచ్యుత:- తానున్న స్థితి నుండి జారని వాడు.జారనివ్వనివాడు. మార్పు, వికారం లేనివాడు.

21. జనార్ధన:- జనులను (పాపఫలములుగా) హింసించు వాడు. జనులచే అభీష్ట సిద్ధులను అర్ధించబడువాడు.

22. ఉపేంద్ర:- ఇంద్రునికి సోదరునిగా ఉన్నవాడు. ఇంద్రునికి (ఉపరి)పైన ఇంద్రుడు.

23. హరి:- అన్నీ లయమయ్యాక, అన్నిటికి ఆధారమైన అధిష్ఠాన చైతన్యమే మిగులుతుంది.

24. శ్రీకృష్ణ:- భక్తుల దుఃఖములను పోగొట్టువాడు.(2) అన్నింటిని తనలోనికి లాగుకునేదే కృష్ణ .నామం, రూపం, గుణం, మహిమ, ఏది తలచినా భక్తుల మనసులు వెంటనే ఆయన లోనికి ఆకర్షితమవుతాయి.

25. శ్రీకృష్ణ పరబ్రహ్మం:- భగవంతుని నామాల ద్వారా లీలలు (తత్త్వం) వ్యక్తమవుతాయి.ఇన్ని నామాల ద్వారా తెలియజేసిన తత్త్వం శ్రీకృష్ణునిదిగా తెలుసుకుని, సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పడం. "సచ్చిదానంద స్వరూపుడు" నిర్గుణ, నిరాకార, నిష్క్రియ పరబ్రహ్మ.

Sunday, December 15, 2019

దానాలు ఎన్ని ?

ప్రతి మనిషి తన శక్తి మేరకు దానం చేయవలసినదే దానం అనేది ఉన్న్వాడికో లేక కావాల్సిన వాడికో ఇవ్వడం కాదు మన ఇచ్చే దానం తీసుకున్న వారికి ఉపయోగ పదేవిధముగాను అవస్యముగాను వుండేటట్టు చూసి ఇవ్వాలి వేర్వేరు వస్తువుల దానములు దాని ఫలితములు చూద్దాము (దాన చింతామణి గ్రంధము)

౧. వస్త్ర దానం – ఆయుస్సు వృద్ది
౨ భూమి దానం – బ్రమ్హలొక ప్రాప్తి
౩ తేన – పుత్ర భాగ్యము కాంస్య పాత్రములో ఇవ్వాలి
౪ గోదానము – ఋషి దేవా పితృ ప్రీతి
౫ ఉసిరిక దానం – జ్ఞాన ప్రాప్తి
౬ కోవెలలో దీప దానం – చక్రవర్తి పదవి అంటే జీవితంలో అత్యున్నత పదవి ప్ర్రాప్తం
౭ దీప దానం – పార్వ లోపం తీరును
౮ గింజల దానం – దీర్ఘ అయుస్సు శాంతి
౯ బియ్యం – అన్ని రకములైన పాప నివృత్తి
౧౦ తాంబూలం – స్వర్గ ప్రాప్తి
౧౧ కంబలి దానం – వాయురోగ నివృత్తి
౧౨ పత్తి – కుష్టం తీరును
౧౩ ఉపవీతం (దంధ్యం) – బ్రామ్హణ జన్మ లబించును
౧౪ పుష్పం, తోలసి – స్వర్గ ప్రాప్తి
15 నేయి దానం – రోగ నివృత్తి

మంత్రం-పరిహారము

ఏ మంత్రం ఐన గురువు దగ్గర పొంది సాధన చేస్తే ఫలితం వస్తుంది. గురువు లేని విద్య గుడ్డి  విద్య అన్నారు పెద్దలు.

గురువు లేకపోతె దక్షిణా మూర్తి దగ్గర మంత్రము రాసి పెట్టి అయన మీకు మంత్రం ఇస్తున్నట్టు భావించి తరువాత సాధన చేయండి.

శత్రు భాధ తొలగి శుభం కలుగుటకు 

ఐం బీజ మాదిందు సమాన దీప్తిం
హ్రీం సూర్యతేజోద్యుతి మద్వితీయం
క్లీం  మూర్తి వైశ్వానర తుల్య రూపం
తౄతీయ ద్యూనంతు శుభామానం

జయాన్నిపొందడానికి 
అఘోర నృసింహ మంత్రం .
ఓం హ్రీం క్ష్రౌం  ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం. స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర  ఘోర ఘోరథన థనూరూప చ్చట చ్చట  ప్రచట ప్రచట కః కః  వామ వామ బంధయ బంధయ క్ఖాదయ క్ఖాదయ  నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుర్ నమామ్యహం స్వాహా

నవగ్రహ పీడా పరిహారము. జాతకంలోని గ్రహదోష నివృత్తికి, గోచార గ్రహదోష నివృత్తికి ఈ పాశుపత మంత్రము అత్యంత ఫలదాయి. 
ఓం క్లీం శ్రీం ఐం హ్రీం గ్లౌం రం హుం ఫట్‌

ఇష్టకన్యాప్రాప్తి, వివాహము కాని పురుషులకు తొందరగా వివాహం అవటం ఫలములుగా చెప్పబడ్డాయి. 
ఓం పావీ రవీ కన్యా చిత్రాయుస్సరస్వతీ వీరపత్నీధియంధాత్‌ ।
జ్ఞ్నాభిరచ్చిద్రగo శరణగo సజోషా దురాద్ష్రం గృణతే శర్మయగo సత్‌ ।।

ఇష్ట వర ప్రాప్తి, వివాహం కాని కన్యలకు శీఘ్రముగా వివాహం జరుగుటకు మంత్రము:-
ఓం క్లీం నమో భగవతే గంధర్వరాజ విశ్వావసో మమాభిలషితం వరక్షిప్రం ప్రయచ్ఛ స్వాహా।।

బుణ బాధనుంచి విముక్తి [అప్పుల భాద తగ్గుటకు]
ఆనృణా అస్మిన్ననృణాః పరస్మిగ్గ్‌ న్తృతీయే లోకే అనృణాస్యామా!
యే దేవయానా ఉత పితృయాణా సర్వాంపథో అన్నణా ఆక్షియేమ!!

సంతాన ప్రాప్తి
ఓం కాణ్డాత్కాణ్డాత్ప్రరోహంతీ పరుషః పరుషః పరీ!
ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేనచ

అపమృత్యు దోషమునకు 
ఓం హౌం ఓం జూం ఓం సః ఓం భూః ఓం భువః ఓం స్వః

ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ।
ఉర్వారుక మివ బంధనాన్మృత్యోర్ముక్షీయమామృతాత్‌ ।।

ఓం స్వః ఓం భువః ఓం భూః ఓం సః ఓం జూం ఓం హౌం ఓం స్వాహా।

ఈ మంత్రముతో 169 రుద్ర మంత్రములను సంపుటితము చేసిన యెడల అది అమృత పాశుపతమగును.

అభిషేక ద్రవ్యము: అభిషేకము కొరకు పంచామృతములు, పూజ కొరకు బిల్వ పత్రములు.

ఫలము: ఈ పాశుపతము అన్నింటిలోకి ముఖ్యమైనది. ఇది అపమృత్యు హరము. సకల ఐశ్వర్య ప్రదము.

గురుగ్రహ దోష నివారణకు హయగ్రీవస్తోత్రం

జాతకంలో గురుగ్రహ దోషం ఉన్నవారు ప్రతిరోజు హయగ్రీవ స్తోత్రం చదివితే గురుగ్రహ
అనుగ్రహం కలుగుతుంది. భక్తి బావనలు, ఉన్నత విద్య, విదేశీ విద్య కలగాలంటే గురుగ్రహ అనుగ్రహం ఉండాలి.

గురుగ్రహానికి అధిదేవత హయగ్రీవుడు. సకల విద్యాధి దేవతయైన శ్రీమన్నారాయణుడు ‘హయగ్రీవుని’గా అవతరించాడు.

సరస్వతీదేవి, వేదవ్యాసుడు హయగ్రీవుని నుండి విద్యాశక్తిని సముపార్జించారని ‘హయగ్రీవ స్తోత్రం’లో దేశికాచార్యులు పేర్కొన్నారు.హయగ్రీవోపాసన వాక్‌శక్తిని, విద్యాశక్తిని, జ్ఞానశక్తిని సిద్ధింపచేస్తుంది.

జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్.
ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే..!!

జ్ఞానం, ఆనందం, మూర్త్భీవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారము.

హయగ్రీవుని పూజించడంవల్ల విద్య, ఐశ్వర్యం, అధికారం, ఆయువు మొదలైనవన్నీ లభిస్తాయి. విద్యార్థులు హయగ్రీవుని పూజించడంవల్ల చదువు బాగా వస్తుంది. పిల్లలున్న ఇంట హయగ్రీవ పూజ పిల్లలకు విద్యాటంకాలు తొలగించి, ఉన్నత విద్యను అందిస్తుంది.

హయగ్రీవస్తోత్రం.
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం |
నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః||

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ |
తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్మా ప్రవాహవత్||

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోధ్వనిః |
వి శోభతే చ వైకుంఠ కవాటోద్ఘాటన ధ్వనిః||

ఫలశ్రుతి :
శ్లోకత్రయ మిదం దివ్యం హయగ్రీవ పదాంకితం |
వాదిరాజయత్రిప్రోక్తం
 పఠతాం సంపదాంప్రదం||

మణిద్వీప వర్ణన.

మణిద్వీప  వర్ణన - చాలా శక్తివంతమైన శ్లోకం.

1. మహాశక్తి  మణిద్వీప నివాసిని ముల్లోకాలకు  మూల  ప్రకాశిని
మణిద్వీపములో  మంత్రరూపిణి  మన మనస్సులలో కొలువైయింది

2.సుగంధ పుష్పాలెన్నో వేలు  అనంత సుందర  సువర్ణపూలు
అచంచలంబగు  మనో సుఖాలు మణిద్వీపానికి  మహానిధులు

3.లక్షల  లక్షల  లావణ్యాలు  అక్షరలక్షల  వాక్  సంపదలు
లక్షల లక్షల  లక్ష్మీపతులు  మణిద్వీపానికి  మహానిధులు

4. పారిజాత  వన  సౌగంధాలు  సురాధినాధుల సత్సంగాలౌ
గంధర్వాదుల  గానస్వరాలు   మణిద్వీపానికి  మహానిధులు
భువనేశ్వరీ  సంకల్పమే జనియించే  మణిద్వీపం
దేవదేవుల  నివాసము అదియే  కైవల్యం

5. పద్మరాగములు  సువర్ణమణులు  పది  ఆమడల  పొడవున  గలవు
మధురమధురమగు  చందనసుధలు  మణిద్వీపానికి  మహానిధులు

6. అరువదినాలుగు  కళామతల్లులు  వరాలనొసగే  పదారుశక్తులు
పరివారముతో  పంచబ్రహ్మలు  మణిద్వీపానికి  మహానిధులు

7. అష్టసిద్ధులు  నవనవ నిధులు  అష్టదిక్కులూ  దిక్పాలకులు
సృష్టికర్తలు  సురలోకాలౌ మణిద్వీపానికి  మహానిధులు

8. కోటి సూర్యులు ప్రపంచకాంతులు  కోటి చంద్రుల  చల్లని  వెలుగులు కోటితారకల వెలుగుజిలుగులు  మణిద్వీపానికి  మహానిధులు

9. కంచుగోడల  ప్రాకారాలు  రాగిగోడల  చతురస్రాలు ఏడామడల  రత్నరాసులు  మణిద్వీపానికి  మహానిధులు

10. పంచామృతమయ  సరోవరాలు  పంచలోహమయ  ప్రాకారాలు ప్రపంచమేలే  ప్రజాధిపతులు   మణిద్వీపానికి  మహానిధులు

11. ఇంద్రనీలమణి  ఆభరణాలు వజ్రపు  కోటలు  వైఢూర్యాలు పుష్యరాగ మణిప్రాకారాలు  మణిద్వీపానికి  మహానిధులు

12. సప్తకోటి  ఘనమంత్రవిద్యలు సర్వశుభప్రద  ఇచ్ఛాశక్తులు శ్రీ  గాయత్రీ  జ్ఞానశక్తులు  మణిద్వీపానికి మహానిధులు  ..భువ...

13. మిలమిలలాడే  రత్నపు రాసులు  తళతళలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు  మరకతమణులు  మణిద్వీపానికి  మహానిధులు

14. కుబేర  ఇంద్ర  వరుణదేవులు  శుభాలనొసగే   అగ్నివాయువులు భూమిగణపతి పరివారములు  మణిద్వీపానికి  మహానిధులు

15.  భక్తిజ్ఞానవైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు
సప్తఋషులు  నవగ్రహాలు మణిద్వీపానికి  మహానిధులు

16. కస్తూరి  మల్లిక  కుందవనాలు సూర్యకాంతి  శిలమహాగ్రహాలు ఆరు ఋతువులు  చతుర్వేదాలు  మణిద్వీపానికి  మహానిధులు

17. మంత్రిణి  దండిణి  శక్తిసేనలు  కాళి కరాళి సేనాపతులు ముప్పదిరెండు  మహాశక్తులు మణిద్వీపానికి  మహానిధులు

18.సువర్ణరజిత సుందరగిరులు  అనంతదేవి  పరిచారికలు గోమేధికమణి  నిర్మిత  గుహలు  మణిద్వీపానికి  మహానిధులు

19. సప్తసముద్రములనంత నిధులు   యక్షకిన్నెర కింపురుషాదులు నానాజగములు  నదీనదములు మణిద్వీపానికి  మహానిధులు

20.మానవ మాధవ దేవగణములు కామధేనువు  కల్పతరువులు సృష్టిస్థితిలయా కారణమూర్తులు మణిద్వీపానికి  మహానిధులు

21.కోటి ప్రకృతుల  సౌందర్యాలు  సకలవేదములు  ఉపనిషత్తులు పదారురేకల  పద్మశక్తులు  మణిద్వీపానికి  మహానిధులు

22. దివ్యఫలముల దివ్యాస్త్రములు దివ్యపురుషులు  ధీరమాతలు దివ్యజగములు  దివ్యశక్తులు మణిద్వీపానికి  మహానిధులు

23. శ్రీ  విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి  ఏకాంతభవనములు మణినిర్మితమగు  మండపాలు  మణిద్వీపానికి  మహానిధులు

24. పంచభూతములు  యాజమాన్యాలు  వ్యాళసాలం  అనేకశక్తులు సంతాన  వృక్షసముదాయాలు  మణిద్వీపానికి  మహానిధులు

25. చింతామణులు  నవరాత్రులు నూరామడల  వజ్రరాసులు వసంత  వనములు  గరుడపచ్చలు మణిద్వీపానికి  మహానిధులు

26. దుఃఖము  తెలియని  దేవీసేవలు  నటనాట్యాలు  సంగీతాలు ధనకనకాలు  పురుషార్ధాలు మణిద్వీపానికి  మహానిధులు

27. పదునాల్గు , లోకాలన్నిటిపైనా సర్వలోకమను  లోకము  గలదు సర్వలోకమే  ఈ  మణిద్వీపము సర్వేశ్వరికది  శాశ్వత స్థానం

28. చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల  మంచముపైన మహాదేవుడు  భువనేశ్వరితో  నివసిస్తాడు మణిద్వీపములో

29.మణిగణ ఖచిత  ఆభరణాలు చింతామణి  పరమేశ్వరి  దాల్చి సౌందర్యానికి  సౌందర్యముగా  అగుపడుతుంది  మణిద్వీపములో

30. పరదేవతను  నిత్యము  కొలిచి  మనసర్పించి  అర్చించినచో  అపారధనము  సంపదలిచ్చి  మణిద్వీపేశ్వరి  దీవిస్తుంది....2...

31. నూతనగృహములు  కట్టినవారు మణిద్వీపవర్ణన  తొమ్మిదిసార్లు
చదివిన  చాలు  అంతా  శుభమే అష్టసంపదల  తులతూగేరు .....

32.  శివ కవితేశ్వరి  శ్రీ చక్రేశ్వరి మణిద్వీపవర్ణన  చదివిన చోట
తిష్టవేసుకొని  కూర్చొనునంటా  కోటి శుభాలను  సమకూర్చుకొనుటకై
దేవదేవల  నివాసము అదియే  కైవల్యం......

108 శక్తి పీఠాలు

పరమేశ్వరుడు పరాశక్తితో వీటన్ని౦టా సన్నిధి చేసి ఉ౦టాడు. వీటిని స్మరి౦చినా, విన్నా భక్తులకు పాపాలు తొలగి ముక్తి లభిస్తు౦ది. అష్టోత్తర శతనామాలను జపి౦చినా, పుస్తకాన్ని ఇ౦ట్లో ఉ౦చుకున్నా దుష్టగ్రహ పీడలన్నీ తొలగిపోతాయి. శ్రాధ్ధ కాల౦లో వీటిని స్మరి౦చినయెడల పితృదేవతలు స౦తృప్తి చె౦దుతారు. ఇవి సాక్షాత్తు ముక్తి క్షేత్రాలు

1. వారణాసిలో విశాలాక్షి
2. ముఖనివాస౦లో గౌరి
౩. నైవిశ౦లో లి౦గధారిణి
4. ప్రయాగలో లలిత
5. గ౦ధమాదన౦ మీద కౌముకి
6. మానస క్షేత్ర౦లో కుముద
7. దక్షిణ క్షేత్ర౦లో విశ్వకామ
8. ఉత్తర క్షేత్ర౦లో విశ్వకామప్రరూపిణీ
9. గోమ౦త౦లో గోమతి
10. మ౦దర౦లో కామచారిణీ

11. చైత్రరథ౦లో మదోత్కట
12. హస్తినాపుర౦లో జయ౦తి
13. కన్యాకుబ్జ౦లో గౌరి
14. మలయాచల౦పై ర౦భ
15. ఏకామ్ర పీఠ౦లో కీర్తిమతి
16. విశ్వక్షేత్ర౦లో విశ్వేశ్వరి
17. పుష్కర క్షేత్ర౦లో పురుహూతిక
18. కేదార౦లో సన్మార్గదాయిని
19. హిమాలయ౦లో మ౦ద
20. గోకర్ణ౦లో భద్రకర్ణిక

21. స్థానేశ్వర౦లో భవాని
22. బిల్వక్షేత్ర౦లో బిల్వపత్రిక
23. శ్రీశైల౦లో మాధవి
24. భద్రేశ్వర౦ భద్ర
25. వరాహాశైల౦మీద జయ
26. కమలాయ౦లో కమల
27. రుద్రకోటిలో రుద్రాణీ
28. కాల౦జర క్షేత్ర౦లో కాళి
29. శాలగ్రమ౦లో మహాదేవి
౩౦. శివలి౦గక్షేత్ర౦లో జలప్రియ

౩1. మహాలి౦గ౦లో కపిల
౩2. మాకోట క్షేత్ర౦లో ముకుటేశ్వరి
౩౩. మాయాపురిలో కుమారి
౩4. స౦తానక్షేత్ర౦లో లలితా౦బిక
౩5. గయాక్షేత్ర౦లో మ౦గళాదేవి
౩6. పురుషోత్తమ పుర౦లో విమలాదేవి
౩7. సహస్రాక్ష౦లో ఉత్పలాక్షి (సిధ్ధ పీఠాలు)
౩8. హిరణ్యాక్ష౦లో మహోత్పల
౩9. విశాపా క్షేత్ర౦లో అమోఘాక్షి
4౦. పు౦డ్రావర్ధన౦లో పాడల

41. సుపార్శ్వ౦లో నారాయణి
42. త్రికూట౦లో రుద్రసు౦దరి
4౩. విపులక్షేత్ర౦లో విపులాదేవి
44. మలయాచల౦ మీద కళ్యాణి
45. సహ్యాద్రి మీర ఏకవీర
46. హరిశ్చ౦ద్ర క్షేత్ర౦లో చ౦ద్రిక
47. రామతీర్ఠ౦లో రమణ
48. యమునలో మృగావతి
49. కోటతీర్థ౦లో కోటవి
50. మాధవవన౦లో సుగ౦ధ

51. గోదావరిలో త్రిస౦ధ్య
52. గ౦గాతీర౦లో రతిప్రియ
53. శివకు౦డ౦లో శుభాన౦ద
54. దేవికాతట౦లో న౦దినీదేవి
55. ద్వారవతిలో రుక్మిణీ
56. బృ౦దావన౦లో రాధ
57. మధురలో దేవకి
58. పాతాళ౦లో పరమేశ్వరి
59. చిత్రకూట౦లో సీత
60. వి౦ధ్యపర్వత౦పై వి౦ధ్యావాసిని

61. కరవీరదేశ౦లో మహాలక్ష్మి
62. వినాయకక్షేత్ర౦లో ఉమాదేవి
63. వైద్యనాథ౦లో ఆరోగ్య
64. మహాకాళక్షేత్ర౦లో మహేశ్వరి
65. ఉష్ణతీర్థ౦లో అభయ
66. వి౦ధ్యపర్వత సానువుల్లో నిత౦బ
67. మా౦డవ్య౦లో మా౦డవి
68. మహేశ్వరపుర౦లో స్వాహాదేవి
69. ఛాగల౦డభూమిలో ప్రచ౦డ.   
70. అమరక౦టక౦లో చ౦డిక

71. సోమేశ్వర౦లో వరారోహ
72. ప్రభాసతీర్థ౦లో పుష్కరావతి
73. సరస్వతిలో దేవమాత
74. తట౦లో పారావారాదేవి
75. మహాలయ౦లో మహాభాగ
76. పయోష్ణిలో సి౦గలేశ్వరి
77. కృతశాచ౦లో సి౦హిక
78. కార్తీక౦లో అతిశ౦కరి
79. ఉత్పలావర్తక౦లో లోలాదేవి
80. శోణస౦గమక్షేత్ర౦లో సుభద్ర

81. సిధ్ధవన౦లో లక్ష్మీమాత
82. భరతాశ్రమ౦లో విశ్వముఖి
83. కిష్కి౦ధపర్వత౦పై తారాదేవి
84. దేవదారువన౦లో పుష్టి
85. కాశ్మీర౦లో మేధాదేవి
86. హిమాద్రిలో భీమాదేవి
87. హిమాద్రిలో తుష్టి, విశ్వేశ్వరి
88. కపాలమోచనక్షేత్ర౦లో శుధ్ధి
89. కాయావరోహణ౦లో మాత
90. శ౦ఖోధ్ధార౦లో ధరాదేవి

91. పి౦డాకార౦లో ధృతి
92. చ౦ద్రభాగాతీర్థ౦లో కళాదేవి
9౩. అచ్ఛోద౦లో శివధారిణీ
94. వేణాక్షేత్ర౦లో అమృతాదేవి
95. బదరీక్షేత్ర౦లో ఊర్వశి
96. ఉత్తరకురుక్షేత్ర౦లో ఔషధి
97. కుశద్వీప౦లో కుశోదక
98. హేమకూట౦లో మన్మధ
99. కుముదక్షేత్ర౦లో సత్యవాదిని
100. అశ్వత్థ౦లో వ౦దనీయ

101. వైశ్రవణ౦లో నిధి
102. వేదవదన౦లో గాయత్రి
10౩. శివసన్నిధిలో పార్వతి
104. దేవలోక౦లో ఇ౦ద్రాణి
105. బ్రహ్మవదన౦లో సరస్వతి
106. సూర్యబి౦బ౦లో ప్రభ
107. మాతలలో వైష్ణవీమాత
108. సతులలో అరు౦ధతి
109. స్త్రీలలో తిలోత్తమ
110. చిత్త౦లో బ్రహ్మకళ

111. శరీరధారులలో శక్తిరూపిణీ
 సతీదేవి అ౦గభూతాలు

నక్షత్రాలు - నివేదనలు

మనం ఇచ్చే నివేదనలు, ఇష్ట దైవానికి నివేదించి పదుగురికి పంచడం ద్వారా దోషాలు పోతాయి.
కుటుంబంలో శాంతి నెలకొంటుంది.వారి వారి కోరికలు సత్వరమే తీరుతాయి.

అశ్వినీ నక్షత్రం వారు హవిష్యాన్నమును

భరణీ నక్షత్రంవారు కూరగాయలతో కలిపిన అన్నము

కృత్తిక వారు బెల్లపు ఉండలను

రోహిణి వారు వెన్నతో చేసినవి

మృగశిర వారు ఘాటైన వంటలు

ఆర్ద్ర వారు బెల్లముతో చేసిన కుడుములను

పునర్వసు వారు దోసపళ్ళను

పుష్యమి వారు నేతి పాయసము

ఆశ్రేష నక్షత్రం వారు ఘాటయిన వంటలను

మఖా నక్షత్రం వారు పండ్లను

పుబ్బ నక్షత్రం వారు పాయసమును

ఉత్తర వారు ఆవుపాలను

హస్తా వారు యవాన్నము

చిత్తా వారు మృష్ఠాన్నము

స్వాతి వారు నువ్వుల వడలను

విశాఖ వారు పరమాన్నమును

అనూరాధ వారు బియ్యపు పేలాలు

జ్యేష్ఠ వారు నువ్వుల లడ్లు

పూర్వాషాఢ వారు వృక్షం పండ్లను

ఉత్తరాషాఢ వారు జలాన్ని

శ్రవణం వారు పెరుగన్నమును

ధనిష్ఠ వారు శాల్యన్నమును

శతభిషం వారు ఆరు ఎర్రని అన్నము అనగా గవాన్నము

పూర్వాభాద్ర వారు ఆయా నెలల్లో వచ్చే పండ్లనూ

ఉత్తరాభాద్ర వారు పెరుగుతో చేసిన వాటిని

రేవతి నక్షత్రంలో జన్మించిన వారు పెసర లడ్లనూ

తిలలతో తర్పణం..పితృదేవతల ఆరాధనం

మానవ జన్మ పొందిన ప్రతి జీవికి ఋణత్రయ బంధం ముడిపడి వుంటుంది. భగవంతుడు మనకు ప్రసాదించిన బుద్ధి జ్ఞానాల ద్వారా మనం ఋణ త్రయ విముక్తి పొందటానికి చేయవలసిన కర్మను పూర్వులు నిర్దేశించారు.

ఋణ త్రయాలు -1.ఋషి ఋణము, 2. దేవ ఋణము, 3. పితృ ఋణము.

1 ఋషి ఋణము: ఋషుల వల్ల లభించిన జ్ఞానం బ్రహ్మ చర్య పాలన ద్వారా వేదాధ్యయనం, సంధ్యావందనం కర్మలను నిష్ణగా ఆచరించడం ద్వారా మానవులు ఋషి ఋణాన్ని తీర్చుకోగలుగుతారు.

2. దేవ ఋణము: దేవతలకు ఆహారాన్ని అందించడం ద్వారా ఇది తీరుతుంది. యజ్ఞ యాగాది కర్మల నాచరిస్తూ అందు సమర్పించే హవిస్సుల ద్వారా దేవతలకు ఆహారం అందుతుంది. దేవ ఋణ విముక్తికి తోడ్పడుతుంది.

3. పితృ ఋణం: మన శరీరాల జన్మ కారణమైన పితృ దేవతల అనుగ్రహాన్ని కూడా మానవులు పొందాలి. సత్సంతాన రూపంలో కొన్ని దేహాలు సృష్టించబడి సృష్టి కార్యవృద్ధి పొంది పిండోదక దానాలు జరిగితే పితృ దేవతలు తృప్తిపొంది వారు సంతానాన్ని ఆశీర్వదిస్తారు. అప్పుడు పితృ ఋణ విముక్తి కలుగుతుంది.

పితరులు గతించిన అనంతరం వసు, రుద్ర, ఆదిత్య స్వరూపులుగా వారు ప్రకృతిలో లయించి ఉంటారు. కాబట్టి ఆయా రూపాలలో వున్న పితృ దేవతలకు శ్రాద్ధ కర్మలు, దర్శశ్రాద్ధ తిల తర్పణ రూపంలో తృప్తిపరిస్తే వారివారి కుటుంబాలకు పితృదేవతల ఆశీస్సులు లభించి వారి కుటుంబాలు సుఖ శాంతులతో వర్ధిల్లుతాయి. కావున ప్రతి ఒక్కరు పితృ ఋణ విముక్తుల ఎలా కావాలో చెపుతూ పెద్దలు నిర్దేశించిన కర్మకాండలను విధిగా మనం ఆచరించాలి. ప్రతి నెలా చేయాల్సిన తిల తర్పణం (దర్శ శ్రాద్ధం) సంవత్సర శ్రాద్ధ కర్మలు విధిగా చేయాలని పెద్దలు నిర్దేశించారు.

ప్రతిసంవత్సరం భాద్రపద మాసంలో కృష్ణపక్షం ఆరంభమైన వెంటనే పితృదేవతలందరు భూలోకంలోని తమ తమ సంతతివారు మహాలయ శ్రాద్ధము లేదా తిల తర్పణం చేయుదురని ఆయన్నము లేదా తిలోదకములను తృప్తిగా గ్రహించాలని, భుజించాలని మిక్కిలి ఆశతో వారు భూలోకానికి వచ్చి కార్తీక శుక్ల పక్షం వరకు ఇక్కడ వసిస్తారు.

ఇంతమంది మహానుభావులైన పితృ దేవతలందు భాద్రపద కృష్ణపక్షం ఆరంభంనుంచి ఆమావాస్య వరకు ఆతర్వత ఆశ్వీజ, కార్తీక కృష్ణ పక్షాలలోను ఈ భూలోకంలో వసించుట చేత ఈ భూలోకమే మహానుభావులైన పితృదేవతలకు ఆలయమై భాసించును. ‘యత్కాలానచ్ఛేదేన భూలోకస్య మహాలయత్వమ్ తదచ్ఛేదక కాలస్యాపి మ హాలయత్వం బోద్ధ్వమ్’ అని వాక్యం. మహతామ్+ ఆలయం=మహదాలయః. పితృదేవతలందరు భూలోకంలో వుండుటవలన ఈ భూలోకమే మహాల(ళ)య మగును. దీనివల్ల ఈ కాలానికి మహాల(ళ)య పక్షము అని పేరు. పక్షమనగా పదిహేను రోజులని అర్ధం. ఆ విధంగా ప్రధానంగా భాద్రపద కృష్ణ పాడ్యమి మొదలు అమావాస్య వరకుండే పదిహేను రోజుల కాలమే మహాలయపక్షము. ఈ అమావాస్యకు మహాలయ అమావాస్య అని పేరు.

ఈ మహాలయ పక్షాలకు పితృ పక్షమని, పెద్దల దినాలు అనే మాట కూడా వాడుకలో వుంది. ఈ పక్షం రోజుల్లో ప్రత్యేకించి ఓకరోజు సద్భ్రాహ్మణులు చెప్పిన రోజున సకుటుంబంగా బంధువులతో కలిసి పితృదేవతలనారాధించి వారిపేర బ్రాహ్మణులకు బియ్యం, తాంబూల దక్షిణలు సమర్పించి వారి ద్వారా పితృ దేవతల ఆశీస్సులు పొందడమనే సదాచారం నేటికీ అమల్లో వుంది. ఈ విధంగా మహాలయ పక్షంలో ఈ బియ్యమిచ్చే కార్యక్రమం ద్వారా పితృ ఋణాన్ని తీర్చుకునే సదవకాశం మనకు కలిసి వస్తున్నది. బియ్యమివ్వడమంటే అపక్వ (ఆమ) పదర్ధాలను బియ్యము, పెసరపప్పు, నిర్దేశించిన కూరగాయలు, తాంబూల దక్షిణ యుక్తంగా పెద్దల పేర భక్తితో బ్రాహ్మణులకు దానం చేయబడే ప్రక్రియ. దీనినిఆమ శ్రాద్ధమని అంటారు.

భాద్రపద కృష్ణ పక్షంలో పితరులనుద్దేశించి శ్రాద్ధ తర్పణాలు చెయ్యబడనిచో ఆశ్వీజ కృష్ణపక్షంలోనైనా చేస్తారేమో అని ఎదురు చూస్తూ చివరకు కార్తీక మాస కృష్ణ పక్షం వరకు నిరీక్షిస్తూ రెండు నెలలు భూలోకంలోనే వుండి పోతారు. అప్పటికి కూడా భూలోకంలోని తమ సంతతి తమకు శ్రాద్ధ, తర్పణాలు చెయ్యకపోతే నిరాశ చెందిన పితృదేవతలందరు తిరిగి పితృ లోకాలకు వెళ్లిపోతారు. వారు నిరాశ చెందితే మనకు వారి ఆశీస్సులెలా అందుతాయి?

కావున మహాలయ పక్షాలలో మన వంశంలో గతించిన పితరులను అందరినీ సామూహికంకగా ‘కారుణ్యపితరులు’గా భావించి ఈ సందర్భంగా స్మరించి ఆరాధించుకోవడం జరుగుతుంది. కావున పితరులను నిరాశపరచకుండా కార్తీకం వరకు సమయముంది కదా అని తాత్సారం చేయకుండా భాద్రపద మాసంలోనే మహాలయపక్షంలోనే మహాలయ శ్రాద్ధ తర్పణాలు అవశ్యం చేసి తీరాలనే పెద్దల ఆదేశాన్ని పాటించడం మన విధి.

1 తర్పణాలు ఎప్పుడాచరించాలి?: దర్శ శ్రాద్ధమనబడే తిల తర్పణాలను ప్రతి నెలా అమావాస్య, సూర్య సంక్రమణము ఆరంభం నాడు, సూర్య చంద్ర గ్రహణ పుణ్య కాలమునందును, మహాలయ పక్షంలోను, ప్రత్యాబ్ధికములు (శ్రాద్ధములు) చేసిన మరుసటి దినము (పరేహణి) తర్పణం చేయుట ధర్మమని పెద్దలు ఆదేశించి వున్నారు.

2. ఎవరు తర్పణం చేయాలి?: 1.తండ్రి గతించిన వారందరు తర్పణం చేయాలి. 2. తండ్రి జీవించివున్నవారు తర్పణములు చేయకూడదు. 3. తల్లి జీవించి తండ్రి గతించినవారు ఆపై మూడు తరముల పితరులను స్మరిస్తః తర్పణం చేయాలి.

3. తర్పణం ఎవరెవరికి చేయాలి?: 1. ఒక్క పరేహణి తర్పణం తప్ప మిగతా అన్ని కాలాలలోని తర్పణాలు పితృ మాతృవర్గ ద్వయ పితరులకు (వారి నాహ్వానించి) తర్పణం చేయాలి. 2. మాతృ/పితృ ప్రత్యాబ్దిక శ్రాద్ధము చేసిన మరుదినము ఉదయమే పితృ వర్గము వారిని మాత్రమే ఆహ్వానించి తర్పణము చేయవలయునని నిర్దేశించబడింది. 3. మాతా మహులు (తల్లియొక్క తండ్రి) జీవించి వున్నచో మాతృవర్గము వారికి తర్పణము చేయవలసిన అవసరం లేదు.
వర్గద్వయమనగా పితృవర్గము (తండ్రి వైపు) వారు. మరియు మాతృవర్గము (తల్లియొక్క తండ్రివైపు) వారు, పితృవర్గంలో (పురుషులు) పితృ(తండ్రి), పితామహ (తాత), ప్రపితామహ (ముత్తాత) తాతకు తండి ఇలా మూడు తరముల వారు. ఈ ముగ్గురిని వసు, రుద్ర, ఆదిత్య స్వరూపులుగా దర్భలపై ఆహ్వానించి తర్పణం చేయాలి.

పితృవర్గంలో (స్ర్తిలు): మాతృ (తల్లి), పితామహి (నానమ్మ), ప్రపితామహి (తండ్రికి నానమ్మ) ఇలా మూడు తరాల వారు పై వరుసలో జీవించి వున్న వారిని వదిలి ఆపై తరము వారిని ఆహ్వానించాలి.

మాతృవర్గంలో (పురుషులు): 1. మాతామహ (తల్లికి తండ్రి), 2. మాతుః పితామహ (తల్లి తండ్రికి తండ్రి), 3. మాతృ ప్రపితామహ (తల్లి తాతకు తండ్రి)-3 తరాలు. మూడు తరాల వారిని వసు, రుద్ర, ఆదిత్య స్వరూపులుగా ఆహ్వానించి తర్పణం చేయాలి.
మాతృవర్గంలోని స్ర్తిలు: 1. మాతా మహి (తల్లియొక్క తల్లి), 2.మాతుఃపితామహి (తల్లికి అవ్వ), 3. మాతుఃప్రపితామహి (తల్లి అవ్వకు తల్లి) 3 తరాలు.

మానవుడు నేడు ప్రతీ పనికీ ద్రవ్య రూపంలో లాభానే్న వెతుకుతున్నాడు. అలా ద్రవ్య-వస్తు రూపంలో పొందలేని అనేకం భక్తి శ్రద్ధలతో ఈ కర్మ చేయడంవలన మనం పొందవచ్చును.
ప్రతి శ్రాద్ధ కర్మ, తర్పణంరోజున, గతించిన పితరులు, వసు రుద్ర ఆదిత్య స్వరూపులై ప్రకృతిలో అంతర్లీనమైన వున్న పితృదేవులను ఆహ్వానించి, అర్చించి తిల తర్పణలర్పించి అనంతరం వారిని యధా స్థానానికి సాగనంపడం సదాచారం.

భారతీయ సంస్కృతి మనకు ప్రసాదించిన ఉత్కృష్టమైన ఈ కర్మకాండ ఎంతో అమూల్యమైనది. ఈ విధంగానైనా మనం మన పిల్లలు-తండ్రి, తాత, ముత్తాత ఆపై తరంవారు వారి భార్యల (సపత్నీకానాం) పేర్లు తెలుసుకుని గుర్తుంచుకునే అవకాశం కలుగుతుంది.
అట్లే తల్లివైపు మూడు తరాల స్ర్తి పురుషుల పేర్లు గోత్రం కూడా తెలుస్తుంది. ఈ సందర్భంగానైనా మన పూర్వులను స్మరించుకునే అవకాశం కలుగుతుంది. మనంవారికేం చేయగలుగుతాం? మననుండి వారాశించేదేమిటి? కేవలం భక్తితో వారిని స్మరిస్తూ ఆహ్వానించి తిల తర్పణం (నువ్వుల నీళ్లు దర్భలపై వదలడమే కదా! మనకీ జన్మకారుకులైన పితృదేవలతలకు కృతజ్ఞతలర్పించుకోవడం ( ఈ తర్పణాల ద్వారా) మన విద్యుక్త ధర్మం కదా! దీనిద్వారా మన కుటుంబంలో తండ్రి, తల్లివైపు మూడు తరాల వారిని తెలుసుకునే సదవకాశం కలుగుతుంది. ఇది ధర్మంలుప్తం కానంత కాలం నిరంతరం సాగే ప్రక్రియ.

తర్పణం చేయకుంటే ఏమవుతుంది?: తర్పణం అనేది పితృదేవతలకు మన కృతజ్ఞతలు తెలుపుకునే మానసిక యజ్ఞంలాంటిది. లౌకికంగా ఆలోచిస్తే మనకు క్షణ కాలం బస్సులో సీటుఇచ్చిన వాడికి చిన్న సహాయంచేసిన వాడికి ధాంక్సు అంటూ కరిగిపోతూ చెబుతామే! మరి మన శరీర సృష్టికే కారణమైన, మనకు జీవితాన్ని ప్రసాదించిన పితృదేవతలకు కృతజ్ఞతలు తెలుపకపోవడంలో ఎంత స్వార్ధం! ఎంత మూర్ఖం! కాబట్టి ప్రతి ఒక్కరు మన పూర్వులకై ఇలాంటి సత్కర్మలనాచరించి వారిని తృప్తిపరుస్తూ వారి ఋణాన్ని తీర్చుకుని వారి ఆశీస్సులు పొందడం సదా వాంఛనీయం, సర్వ శ్రేయస్కరం!

అన్ని అమావాస్య-సంక్రమణ తర్పణాలు తప్పక చేయాలా?: వీలైనంతవరకు అన్ని అమావాస్యలు (సంవత్సరంలో 12సార్లు) సౌరమానం ప్రకారం సంక్రమణ ఆరంభ దినాలు (సంవత్సరంలో 12 సంక్రమణాలు) మరియు గ్రహణాల, మహాలయ పక్షాల వంటి సందర్భాల్లో తర్పణాలు చేయాలని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. అలా వీలుకానిపక్షంలో అమావాస్య తర్పణలు తప్పక చేయాలి.సౌరమానులకు సంక్రమణాలు ప్రధానం. ఆమావాస్య తర్పణాలతో బాటు (ఉత్తరాయణ పుణ్యకాలం మకరం) సంవత్సరంలో మేషం, కర్కాటకం (దక్షిణాయన ఆరంభం కర్కాటకం) తుల, మకర సంక్రమణాలు ఈ నాలుగు నెలల్లోనైనా తప్పక తర్పణం చేయాలి. మహాలయ పక్షాలలో విధిగా తర్పణం చేసి తీరాల్సిందే. ఇదంతా ఎంతో కష్టమనుకుని బాధపడుతు చేయడం సరికాదు. మనసారా శ్రద్ధ, భక్తితో మన పితృదేవులకు కృతజ్ఞతలు తెలుపుకునే ఉత్తమ యజ్ఞంలా భావించి చేయాల్సిందే కానీ ఎదో వంతుకు, నలుగురేమైనా అనుకుంటారేమో అని చేయాల్సింది కాదు. అందుకే ‘శ్రద్ధ యా దీయతే ఇతి శ్రాద్ధం’ అన్నారు పెద్దలు.

కాశీ, గయలలో శ్రాద్ధ తర్పణాలు చేస్తే ఇక తర్వాత చేయనవసరం లేదా?: ‘దేవ పితృ కార్యాభ్యాం నప్మ మది తవ్యం’ అంటుంది శాస్త్రం. అంటే ఆయా సందర్భాల్లో ఆచరించాల్సిన దేవ, పితృ కార్యాలను తప్పనిసరిగా విధిగా ఆచరించాలని దీని అర్ధం. అంతేకానీ కాశీ, గయలలో శ్రాద్ధ తర్పణాలు చేస్తే ఇక తర్వాత చేయాల్సిన అవసరం లేదనేది ఎక్కడా చెప్పబడలేదు. ఈ వాదన సరైంది కాదు. ప్రతి అమావాస్య, సంక్రమణం ఇతర విశేష దినాలలో పితృదేవతలు మననుండి ఆశించేది కృతజ్ఞతలే కదా !ఈ శ్రాద్ధ తర్పణాల ద్వారా పితృదేవులకు కృతజ్ఞతలందచేసుకోవడంలో బద్ధకించడం ఘోరమైన అపచారమే కదా! ఈ సదాచారాన్ని మనంపాటించకపోతే మన పితృదేవతలను మనం మరిచిపోవడమే కదా! మనమే మన పూర్వులను మరిచిపోతే మన పిల్లలు, తర్వాతి వారు మన వంశం గురించి ఎలా తెలుసుకోగలుగుతారు? కాబట్టి తీర్ధ విధులు (తీర్థ క్షేత్రాలలో) కావించే శ్రాద్ద తర్పణాలు) వేరు, నిత్యాబ్ధీకాలు, తర్పణాలు వేరు. కావున ఈ కర్మలు ఆచరించడం భారమనుకోవడం భక్తి శ్రద్ధలు లేక విసుగుతో చేయడం క్షమించరాని అపచారమే తప్ప మానవ ధర్మమనిపించుకోదు.

తర్పణము చేయుటకు అశక్తులు-అనర్హులకు ఏమిటి పరిష్కారం?: ఒక వీధిలో ఒక చోట మంటపెట్టి అందులో గుప్పెడు మిరపకాయలు గనక వేస్తే దాని ఘాటు ఆ వీధిలోని వారందరికీ ఎలా చేరుతుందో అదే విధంగా ఆ వీధిలో ఏ కొందరో ధర్మకార్యాలు చేస్తుంటే దాని ప్రభావం-ఏమీ చెయ్యని వారికి కూడ అందుతుందనే వాస్తవం పై ఉదాహరణ వివరిస్తుంది. పూర్వం రాజుల కాలంలో ఋషులు యజ్ఞ యాగాదులు, జప తపాలు చేస్తూ వుంటే (వారిని రాజులు ప్రోత్సహించి, పోషించేవారు) ఆ రాజ్యంలో సుఖ శాంతులు విలసిల్లేవనేది ప్రత్యక్ష సత్యం.

గణనాయకాష్టకమ్



ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్ |
లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్ || ౧ ||

మౌంజీ క్రిష్ణాజినధారం నాగయజ్ఞోపవీతనమ్ |
బాలేందుశకలం మౌళౌ వందేహం గణనాయకమ్ || ౨ ||

చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలావిభూషితమ్ |
కామరూపధరం దేవం వందేహం గణనాయకమ్ || ౩ ||

గజవక్త్రం సురశ్రేష్ఠం కర్ణచామరభూషితమ్ |
పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకమ్ || ౪ ||

మూషకోత్తమమారుహ్యదేవాసురమహాహవే |
యోద్ధుకామం మహావీర్యం వందేహం గణనాయకమ్ ||౫||

యక్షకిన్నెరగంధర్వసిద్ధవిద్యాధరైస్సదా |
స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకమ్ || ౬ ||

అంబికాహృదయానందం మాతృభి:పరివేష్టితమ్ |
భక్తిప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకమ్ || ౭ ||

సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్నవివర్జితమ్ |
సర్వసిద్ధిప్రదాతారం వందేహం గణనాయకమ్ || ౮ ||

గణాష్టకమిదం పుణ్యం యః పఠేత్సతమ్ నరః!
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్ || ౯ ||

గణపతి ఆరాధన-గ్రహ దోష నివారణ

సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి.

చంద్ర దోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుడిని పూజించాలి.

కుజదోష నివారణకు రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఫలితం ఉంటుంది.

బుధ దోష నివారణకు మరకత గణపతిని అర్చించాలి.

గురు దోష నివారణకు పసుపు, చందనం లేక బంగారంతో చేసిన గణపతిని కొలవాలి.

శుక్ర దోష నివారణకు స్ఫటిక గణపతికి ఆరాధన చేయాలి.

శని దోష నివారణకు నల్లరాయిపై చెక్కిన గణపతిని పూజించాలి.

రాహు గ్రహ దోషానికి మట్టితో చేసిన గణపతిని పుజిస్తే ఫలితం ఉంటుంది.

కేతు గ్రహ దోష నివారణకు తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని పూజించాలి.

ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు ఉండవు.

పగడపు గణపతిని పూజించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి.

పాలరాయితో చేసిన గణపతిఅని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది.

ఎదురవుతున్న సమస్యలు తొలగిపోవాలంటే శ్వేతార్క గణపతిని పూజించాలి.

స్ఫటిక గణపతిని పూజిస్తే సుఖశాంతులను ప్రసాదిస్తాడు.
మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా తక్షణమే క్రింది ఫోను నంబరు ను సంప్రదించి తగిన పరిష్కారం పొందండి.

మానవశరీరం -చక్రాలు

మానవ శరీరంలో ఆరు చక్రాలు మరియు సహస్రారం (కుండలిని) తో కలుపుకొని ఏడు.
ఇలా ఆరు చక్రాలు ఒకదానిపై మరొకటి ఆధారపడి గుండ్రంగా చలిస్తూ ఉంటాయి.ఈ ఆరు చక్రాలలో ఒక్క చక్రం చలించటం నిలిచిపోయిన మానవ శరీరం నుండి జీవుడు వెళ్లిపోతాడని శాస్త్ర వివరణ.ఆ చక్రాలు ఈ క్రింది విధంగా మానవ శరీరమందు లీనమై ఉంటాయి.
1.మూలాధారం(Root chakra)
2.స్వాధిష్ఠానం(Spleen chakra)
3.మణిపూరక(Solar chakra)
4.అనాహత(Heart chakra)
5.విశుధ్ధ(Throat chakra)
6.ఆజ్ఞా(Brow chakra)
7.సహస్రారం(Crown chakra)
ఇక ఈ చక్రాల స్థానాలు మరియు వాటి స్థానాలలో గల దేవతలను గురించి చూద్దాం.

పంచ భూతాలు అనగా 1.భూమి 2.ఆకాశం 3.నీరు 4.నిప్పు 5.గాలి ఇలా పంచ భూతాలు మానవ శరిరంలో లీనం అయి ఉంటాయి.

1.మూలాధారం: ఇది మానవ శరీరానికి నడి భాగంలో ఉంటుంది.ఇది పృద్వి భూత స్ధానం (భూమి)
ఈ చక్రానికి అధిపతి గణపతి.

2.స్వాధిష్ఠానం:ఇది మూలాధారానికి దాదాపుగా రెండు అంగులాలపైన అనగా పొత్తి కడుపులో ఉంటుంది.ఇది జల భూత స్థానం (నీరు) ఈ చక్రానికి అధిపతి బ్రహ్మ.

3.మణిపూరక: ఇది మానవ శరీరానికి బోడ్డు స్థానంలో ఉంటుంది.ఇది అగ్ని భూత స్థానం (నిప్పు) దీనికి అధిపతి విష్ణువు.

4.అనాహత:ఇది మానవ హృధయ స్థానంలో ఉంటుంది.ఇది వాయు భూత స్థానం(గాలి).దీనికి అధిపతి రుద్రుడు

5.విశుద్ధ: ఇది మానవ శరీరంలో గొంతు స్థానంలో ఉంటుంది.ఇది దివి భూత స్థానం (ఆకాశం)దీనికీ అధిపతి జీవుడు.

6.ఆజ్ఞా: ఇది మానవ శరీరంలో నీదుటి స్థానంలో ఉంటుంది. ఇది జీవాత్మ స్థానం.దీనికీ అధిపతి జీవుడు.

7.సహస్రారం:ఇది తల పై భాగాన (నడి నెత్తిన) ఉంటుంది.ఇది చక్రం కాదు రంద్రం దీనినే బ్రహ్మ రంద్రం అని కూడా చెపుతారు.దీనికి అధిపతి ఈశ్వరుడు.

మరియు మన హైందవ సాంప్రదాయ పెళ్ళిల్లలో సైతం తలపై జీలకర్ర మరియు బెల్లం మిశ్రమాన్ని తలపై పెట్టిన తరువాత వధూ వరులను ఒకరికొకరిని చూసుకొమని చెబుతారు.కారణం అలా జీల కర్రా మరియు బెల్లం మిశ్రమాన్ని తలపై పెట్టగానే బ్రహ్మ రంద్రం తెరుచుకుంటుంది.అలా తెరుచుకున్న తరువాత మొదటగా చూసిన వారే జీవిత భాగ స్వామిగా బ్రహ్మ స్థలిలో నిర్ణీతం అవుతుంది.

ఇలా అనేక అంగాల కలయికే చక్రం అని పిలవబడుతుంది. ఇలా ఒక్కో చక్రం శరీరంలో ఒక్కో స్థానంలొ లినమై ఉంటుంది.
అనాపానసతి వలన కుండలినీ జాగృతమై,షట్ చక్రాలలో శుద్ది జరుగుతుంది.
కుండలినీ ఎప్పుడైతే సహస్రాణంతో స్తితమవుతుందో అపుడు మనిషి నిర్వాణ స్తితిని పొందుతాడు.

కుండలిని అంటే ఏమిటి ?

కుండలినికి సంబంధించిన కధలు ఎన్నో విని ఉంటారు మీరు. ఇది అర్థం చేసుకోవాలంటే మీ జీవితంలో జరిగే సంఘటనలనే ఉదాహరణగా తీసుకోవడం సమంజసనం. ఉదాహరణకి మీ ఇంటి గోడకి ఒక ప్లగ్ -పాయింట్ ఉంటుంది కానీ విద్యుత్పత్తి అందులోనుండి జరగదు కదా? ఈ విద్యుత్పత్తి ఎక్కడో ఉన్న విద్యత్త్తు కేంద్రంలో జరుగుతుంది. అలాగని మనకి విద్యుత్తు ఈ కేంద్రం నుండి నేరుగా వచ్చేస్తుందా? రాదు కదా? మన ఇంటిగోడకి ఉన్న ప్లగ్ -పాయింట్ ద్వారా ఈ విద్యుత్తుని అందుకుంటాము. మనం ఏదైనా ఉపకరణాన్ని వాడేటప్పుడు ఈ ప్లగ్ -పాయింట్ని వాడుతాము , అయినా ఈ విద్యత్త్తు కేంద్రం గురించి పెద్దగా ఆలోచించము..అసలు దాని మీదకి దృష్టే వెళ్ళదు. అంత పెద్ద విద్యత్త్తు కేంద్రం ఒకటుందని, అందులోనుండి మనకి రోజూ విద్యుత్ సరఫరా జరుగుతోందని తలచుకోము. అయితే ఈ ఉపకరణాన్ని వాడాలంటే మాత్రం ప్లగ్ -పాయింట్ ఉపయోగించాలని తెలుసు. అలా చేస్తే కానీ అది పని చేయదు మరి.

మూల-ఆధార అంటే, అన్నింటికీ మూలం అని అర్థం. ఇక మిగిలిన ఆరు చక్రాలలో ఐదు చక్రాలు ప్లగ్ అన్నమాట.
అలాగే కుండలిని ఒక ప్లగ్ -పాయింట్ లాంటిది కానీ అది విద్యత్త్తు కేంద్రం మాత్రం కాదు. అందులోనూ ఇది 3 – పిన్ పాయింట్ కాదు , ఇది 5 – పిన్ పాయింట్. మనశరీరంలో ఏడు చక్రాలు ఉన్నాయని మీరు వినే ఉంటారు. ఈ చక్రాలలో మూలాధార చక్రం ఒక ప్లగ్ -పాయింట్ లాంటిది. అందుకే దానికి ఆ పేరు. మూల-ఆధార అంటే, అన్నింటికీ మూలం అని అర్థం. ఇక మిగిలిన ఆరు చక్రాలలో ఐదు చక్రాలు ప్లగ్ అన్నమాట. అయితే ఏడవది ఏంటి? అది ఒక కాంతి బల్బ్ అన్నమాట. దీన్ని గనక ప్లగ్ -పాయింట్లో పెడితే మీలోని ప్రతీ అంశం దేదీప్యమానంగా వెలుగుతుంది. మీరు సరిగ్గా గనక ప్లగ్ చేసినట్లైతే మీకు 24 గంటలూ విద్యుత్సరఫరా ఉంటుంది, ఆ వెలుతురూ అలాగే ఉంటుంది, బాటరీ అయిపోతుందన్న బెంగలేదు అలాగే వదిలేయవచ్చు . ఇలా నిర్లక్ష్యంగా రోజంతా ఉంచేసినా/ వదిలేసినా కరెంటు అయిపోతుందన్న బాధ లేదు, ఎందుకంటే మీరు నేరుగా ఆ విద్యత్త్తు కేంద్రంతోనే కనెక్ట్ అయ్యి ఉన్నారు కదా?
ప్రస్తుతం మీలో కూడా ఆ శక్తి ప్రవహిస్తోంది , నేను చెప్పే మాటలు మీరు వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారు, కానీ మీలోని ఈ జీవశక్తులు కొంత మటుకు మాత్రమే పనిచేస్తున్నాయి. మీరే గనక ఈ శక్తులని సరిగ్గా ప్లగ్ చేసినట్లయితే ఆ శక్తి అంతా మీ సొంతమౌతుంది. ఇక మీ క్రియా శక్తి అపారం, దీనితో మీరుచేయలేని పని ఉండదు, ఎందుకంటే శక్తివంతమైన ఈ కరెంటు ఇప్పుడు మీలో ప్రవహిస్తోంది కదా? మీ ఇంట్లో కూడా చూసే ఉంటారు, ఒక్క ప్లగ్ పాయింట్ తో ఎన్నో ఉపకరణాలు పని చేస్తాయి కానీ, అన్నిటికీ అదే విద్యుత్తు . ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే , మీరు ఇంక ప్లగ్ అయ్యి లేరు.

ఈ సృష్టికి మూలమే శక్తి. ఈ విషయం గ్రహిస్తే జీవన మూలం గ్రహించినట్లే. ఈ శక్తి గమ్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే , ఈ సృష్టి యంత్రరచన తెలుసుకున్నట్లే!
సరే, మీ శక్తిని మీరే ఉత్పత్తిచేయాలి అని అనుకున్నారు, రోజుకి ఐదు సార్లు ఆహారం తీసుకుంటారు, అయినా రోజంతా అలసటగానే ఉంటుంది. ఇలా అయితే బ్రతుకు జట్కా బండి ముందుకి వెళ్ళడానికి చాలా కష్టపడుతుంది. శక్తి అంటే.. అది కేవలం బాహ్య ప్రపంచానికి, మన పనులు చేసుకోవడానికి కావలసిన శక్తి కాదు. ఇది జీవితానికీ, జీవనానికీ సంబంధించినది. ఈ సృష్టి అంతా శక్తే కదా? ఈ సృష్టికి మూలమే శక్తి. ఈ విషయం గ్రహిస్తే జీవన మూలం గ్రహించినట్లే. ఈ శక్తి గమ్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే , ఈ సృష్టి యంత్రరచన తెలుసుకున్నట్లే! అందుకే చెపుతున్నాను కుండలిని అంటే, ఆ అపారమైన విద్యుత్త్ కేంద్రానికి కనెక్ట్ అయి ఉండడం అని. ఆ కుండలినికి మీరు నేరుగా కనెక్ట్ అయిఉంటే ఆ విద్యుత్తు ఎలా ఉత్పత్తి అవుతుంది అన్న అవగహన మీకు ఉండక పోవచ్చు, కానీ అది ఎంత శక్తివంతమైనదో, ఎం చేయగలదో మీకు అనుభూతిలోకి వస్తుంది, కచ్చితంగా అర్థం అవుతుంది. అనంతమైన ఈ విద్యుత్త్ కేంద్రమే కుండలిని.
ఒక ఉపకరణాన్ని మీరు వాడాలనుకున్నప్పుడు దాన్ని ప్లగ్ పాయింటులో పెట్టడానికి ప్రయత్నిస్తారు, కానీ మీ చేతులు వణుకుతూ ఉంటే, గోడంతా గీతలు పెడతారు , విఫలమౌతారు. అలాగే ఈ 5 పాయింట్లున్న పిన్నుని ప్లగ్ చేయడానికి చాలామంది ఎంతో శ్రమ పడతారు, ఎందుకంటే వారి శరీరంలో , భావోద్వేగాలలో, జీవశక్తులలో, మనసులో స్థిరత్వం లేదు కాబట్టి. మనం చేసే ఈ యోగా అంతా కూడా ఆ స్థిరత్వం కోసమే. ఆ కుండలినికి మనం సరిగ్గా ప్లగ్ అయిఉంటే అనంతమైన శక్తిని నేరుగా అందుకున్నట్లే. ఇలా జరగడానికి ఆ విద్యుత్త్ కేంద్రం గురించి మీరు తెలుసుకుని అర్ధంచేసుకునే అవసరంలేదు. ఆ కుండలినికి కనెక్ట్ అయి ఉంటే చాలు. యోగ శాస్త్రం అంతా కూడా ఈ కుండలినితో మీరు ఎలా కనెక్ట్ అవ్వాలో నేర్పుతుంది. ఎడతెగని ఈ శక్తి మీలో నిర్విరామంగా ప్రవహిస్తూ ఉంటే సహజంగానే మీరు జీవితంలో ముందుకి సాగిపోతారు. జీవితగమ్యం వైపే సూటిగా పయనిస్తారు. అనవసరమైన భ్రమల్లో, ఆలోచనలలో, భావోద్వేగాలలో , బాహ్యప్రపంచపు చిక్కుల్లో పడరు.

శ్లోకం #38

పద్మనాభోరవిందాక్ష: పద్మగర్భ: శరీరభృత్ |
మహర్దిదృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజ: ||

తాత్పర్యం :

పద్మము నాభియందు కలవాడు (పద్మనాభ), కమలరేకులవంటి కన్నులు కలవాడు (అరవిందాక్ష), పద్మమునందు నివసించువాడు (పద్మగర్భ), ప్రాణుల శరీరములను పోషించువాడు (శరీరభృత్), అంతులేని ధనము కలవాడు (మహర్ధి), ఎల్లప్పుడూ వృద్ధి చెందువాడు (ఋద్ధ), పూర్తిగా పరిణితి చెందినవాడు (వృద్ధాత్మా), ఒక వాహనమునకు బలవంతమైన ఇరుసువంటివాడు (మహాక్ష), తన పతాకమునందు గరుడ చిహ్నము కలవాడూ (గరుడధ్వజ)

వివరణ :

ఇంతకుమునుపు శ్లోకంలో పద్మం మానసిక పరిపక్వతకు చిహ్నం అని చెప్పుకున్నాం. సనాతన ధర్మంలో పద్మానికి నాభికి (నడిబొడ్డు) చాలా సంబంధం ఉంది. యోగశాస్త్రం ప్రకారం, జీవిలోని చైతన్యాన్ని అనేక శక్తులుగా విభజిస్తే, ఆ శక్తులను మొత్తం ఏడు చక్రాలుగా వర్గీకరించవచ్చు.

మూలాధార చక్రం (నాభికి పూర్తిగా క్రిందుగా)- ఆకలి, దప్పిక, భయం, పోట్లాడు-లేదా-పారిపో గుణం (ఇంగ్లీషులో ఫైట్ ఆర్ ఫ్లైట్)

స్వాధిష్టాన చక్రం (పొత్తికడుపులో) - పునరోత్పత్తికి చెందిన శక్తులు, వాటికి సంబంధించిన అవయవాలు

మణిపుర చక్రం (సౌర వలయం) - జీవ క్రియకు సంబంధించిన శక్తులు, ఉదాహరణకు, ఆహారాన్ని జీర్ణించి శక్తిగా మార్చే అవయవాలు వాటికి సంబంధించిన జ్ఞానం

అనాహత చక్రం (హృదయం) - భౌతికేతర భావనలు, ఉదాహరణకు, ప్రేమ, క్రోధం, దయా, దు:ఖం, ఈ చక్రం మన రోగనిరోధక శక్తిని నియంత్రిస్తుంది

విశుద్ధ చక్రం (గొంతు/వాక్కు) - ఈ చక్రం వాక్కుని నియంత్రిస్తుంది

ఆజ్ఞా చక్రం (కనుబొమల మధ్య ప్రదేశం, నుదురు) - జ్ఞానం, జాగృత్/స్వప్న/సుషుప్త స్థితులు

సహస్రారా చక్రం (నడి నెత్తి) - బ్రహ్మం లేదా అంతిమ జ్ఞాన స్థితి

ఈ చక్రాలను మనం జాగ్రత్తగా గమనిస్తే, బొడ్డు క్రిందుగా ఉన్న చక్రాలు కేవలం భౌతిక శక్తులను మాత్రమే నియంత్రిస్తాయి. బుద్ధి లేదా మానసిక పరిపక్వత అన్నది బొడ్డు పైనున్న చక్రాలకు సంబంధించింది. వికసించిన పద్మాన్ని మానసిక పరిపక్వతతో పోలిస్తే, ఆ పద్మ యొక్క ఆవిర్భావం నాభి నుంచే మొదలవాలి (చిహ్నాపూర్వకంగా).

పద్మం ఒక్కసారి విచ్చుకున్న తరువాత మళ్లీ ముడుచుకోదు. ఆలాగే జ్ఞానం ఒక్కసారి సంపాయించిన తరువాత మనం తిరిగి అధమ స్థితులకు జారిపోకూడదు. పద్మముల వంటి కన్నులు కలవాడు (ఆరవిందాక్ష) మరియు పద్మములో నివసించువాడు (పద్మ గర్భ) అన్న గుణాల్లోని సూక్ష్మం.

ఋద్ధ మరియు వృద్ధాత్మ అన్నవి పరస్పర భిన్న గుణాలు. ఎల్లప్పుడూ వృద్ధి చెందువాడు అన్న గుణంపూర్తిగా వృద్ధి చెందిన వాడూ అన్న గుణంతో ఎలా సరిపోతుంది? వృద్ధాత్మ అన్న గుణం గమ్యం అయితే ఋద్ధ అన్న గుణం గమనం. మానవుడిగా పూర్తి పరిణితి చెందడం అన్నది మన గమ్యం అయితే దానిని చేరడానికి మనం చేసే ప్రయత్నమే ఋద్ధ అన్న గుణం.

కుండలినీ శక్తి మరియు చక్రాల కోణంలో చెప్పలంటే, వెన్నెముక క్రిందుగా నిద్రపోతున్న కుండలినీ శక్తి నిద్రలేచి మూలాధారం నుండి సహస్రారం వరకు చేసే ప్రయాణమే ఋద్ధ అన్న గుణానికి నిర్వచనం. సహస్రారం చేరితే అప్పుడు ఆ వ్యక్తి వృద్ధాత్మ అవుతాడు.

ప్రాక్టికల్ గా చెప్పాలంటే, మనకు ఆసక్తి కలిగించే ఒక విషయాన్ని పట్టుకుని దానిగురించి పరిశోధన చేసి ఆ విషయంపై సంపూర్ణ జ్ఞానం సంపాయించాలి. ఉదాహరణకు, మీకు ఫోటోలు తీయడంలో ఆసక్తి ఉందనుకోండి, ఆ విషయంపై మీరు వీలైనంతగా పరిశొధనచేసి ఫోటోగ్రఫిలోని సూక్ష్మాలను అధ్యయనం చేసి వాటిని అమలుచేయండి. అలాగే, వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, మీరు చేసే ప్రతీ పనిలో, సంపూర్ణ జ్ఞానం సంపాయించడానికి ప్రయత్నం చేయండి. ఇదే ఈ శ్లోకంలోని సూక్ష్మం.

యోగశాస్త్రం ప్రకారం, గరుడుడు మనలోని ఐదు వాయువులకు ప్రతిరూపం (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన). ఈ ఐదు వాయువులను ప్రాణాయామం ద్వారా నియంత్రిస్తే మనలోని కుండలినీ శక్తి నిద్రలేస్తుంది. నిద్రలేచిన కుండలినీ శక్తి సహాయంతో జ్ఞాన సముపార్జన చేసి మానవ జన్మలో అత్యున్నత స్థానం చేరవచ్చు.

జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ శ్లోకంలో మతానికి సంబంధించిన విషయం ఏమైనా మీకు కనిపిస్తుందా? ఈ శ్లోకం మొత్తం మనకు మనలో నిష్క్రియాత్మకంగా నిద్రిస్తున్న చైతన్యాన్ని ఎలా జాగృతం చేయాలి అని చెబుతుంది, అది కూడా, చాలా ప్రాక్తికల్ గా.

కుండలినీ, చక్రాలు మరియు జీవ నాడుల గురించి తెలుసుకోవాలంటే లలితా సహస్రనామాలకు మించిన మూలం మనకు ఇంకొకటి ఉండదు.

Sunday, December 8, 2019

కల్పాలు ఎన్ని?

కల్పాలు పద్దెనిమిది ఉన్నాయని భవిష్య పురాణం చెబుతోంది. ఈ కల్పాలు కాల విభజనలో సుదీర్ఘమైన కాలావధులు. ఒక్కో కల్పంలో నాలుగు పాదాలు ఉంటాయి. అవన్నీ సమానమైన కాలావధి లో ఉంటాయి. ప్రస్తుతం నడుస్తున్నది శ్వేత వరాహ కల్పం లోని వైవస్వత మన్వంతరం. అందుకే సంకల్పం చెప్పుకునే టప్పుడు తిధి చెబుతూ శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే అంటూ చెప్పుకుంటాం. ఇక ఈ కల్పాల పేర్లు విషయానికి వస్తే అవి

కూర్మ కల్పం
మత్స్య కల్పం
శ్వేతవరాహ కల్పం
నృసింహ కల్పం
వామన కల్పం
స్కంద కల్పం
రామ కల్పం
భాగవత కల్పం
మార్కండేయ కల్పం
భవిష్య కల్పం
లింగ కల్పం
బ్రహ్మాండ కల్పం
అగ్ని కల్పం
వాయు కల్పం
పద్మ కల్పం
శివ కల్పం
విష్ణు కల్పం
బ్రహ్మి కల్పం

ఇవి ఇంచు మించు పురాణాల పేర్లతో నే ఉంటాయి. ప్రస్తుతం నడుస్తున్నది శ్వేతవరాహ కల్పం. అంటే భవిష్య పురాణం ప్రకారం వరుసలో మూడో కల్పం దీని తరువాత 15 కల్పాలు ఉన్నాయి అందులోని ప్రతి దానిలో మన్వంతరాలు ఉన్నాయి. ప్రతి మన్వంతరం లోనూ నాలుగు యుగాలు ఉంటాయి. ఈ చక్రం అంతా పూర్తయిన తర్వాతనే సంపూర్తి లయం. ఈలోగా ప్రతి కలియుగాంతంలో జల ప్రళయం వచ్చి లో దుష్ట ప్రకృతి కి చెందిన వారినందరిని అంతం చేస్తుంది. మిగిలిన కొద్ది మంది మంచివాళ్ళతో మరో మన్వంతరంలోని సత్య యుగం ఆరంభం అవుతుంది.

ఇప్పుడు మనం సమయ విభజన చూద్దాం:

తృటి =సెకండ్ లో 1000 వంతు
100 తృటులు =1 వేద
3 వేదలు=1 లవం
3 లవాలు=1 నిమేశం.రెప్ప పాటుకాలం
3 నిమేశాలు=1 క్షణం,
5 క్షణాలు=1 కష్ట
15 కష్టాలు=1 లఘువు
15 లఘువులు=1 దండం
2దండాలు=1 ముహూర్తం
2 ముహూర్తాలు=1 నాలిక
7 నాలికలు=1 యామము,ప్రహారం
4 ప్రహరాలు=ఒక పూట
2 పూటలు=1 రోజు
15 రోజులు=ఒక పక్షం
2 పక్షాలు=ఒక నెల.
2 నెలలు=ఒక ఋతువు
6 ఋతువులు=ఒక సంవత్సరం.
10 సంవత్సరలు=ఒక దశాబ్దం
10 దశాబ్దాలు=ఒక శతాబ్దం.
10 శతాబ్దాల=ఒక సహస్రాబ్ది
100 సహస్రాబ్ది=ఒక ఖర్వ..లక్ష సంవత్సరాలు

4లక్షల 32 వెల సంవత్సరాలు = కలియుగం
8లక్షల 64 వేల సంవత్సరాలు = ద్వాపర యుగం
12లక్షల 96 వేల సంవత్సరాలు = త్రేతాయుగం
17లక్షల28 వేల సంవత్సరాలు = కృత యుగం
పై 4 యుగాలు కలిపి=చక్రభ్రమణం.(చతుర్ యుగం)
71 చక్రభ్రమాణాలు=ఒక మన్వంతరం
14 మన్వంతరాలు=ఒక కల్పం
200 కల్పాలు ఐతే=బ్రహ్మరోజు
365 బ్రహ్మరోజులు =బ్రహ్మ సంవత్సర
100 బ్రహ్మ సంవత్సరాలు=బ్రహ్మసమాప్తి
ఒక బ్రహ్మసమాప్తి=విష్ణు  కి ఒక పూట
మరో బ్రహ్మఉద్బవం=విష్ణువు కు మరో పూట

భాగవతాదారితం 

అష్ట కాలభైరవులు

కాల భైరవుని ఎనిమిది రూపాలు ఇవి 

1.అసితాంగ భైరవుడు
2. రురు భైరవుడు
3.చండ భైరవుడు
4.క్రోధ భైరవుడు
5.ఉన్మత్త భైరవుడు
6.కపాల భైరవుడు
7.భీషణ భైరవుడు
8.సంహార భైరవుడు

అనే ఎనిమిది నామాలతో వివిధ ముద్రలతో భైరవుడు దర్శనమిస్తూ ఉంటాడు.

శ్రీ కాల భైరవాష్టకమ్

దేవ రాజ సేవ్య మాన పావనాంఘ్రి పంకజం l
వ్యాళ యజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరమ్ ll
నారదాది యోగిబృంద వందితం దిగంబరం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll

భాను కోటి భాస్వరం భవాబ్ది తారకం పరం l
నీల కంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనమ్ ll
కాల కాల మంబుజాక్ష మక్ష శూల మక్షరం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll

శూలటంక పాశదండ పాణిమాది కారణంl
శ్యామ కాయ మాది దేవ మక్షరం నిరామయమ్ ll
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవప్రియం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll

భుక్తి ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం l
భక్తవత్సలం స్థితం సమస్త లోక విగ్రహమ్ ll
నిక్వణన్మనోజ్ఞ హేమ కింకిణీలసత్కటిం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll

ధర్మ సేతు పాలకం త్వధర్మమార్గ నాశకం l
కర్మ పాశ మోచకం సుశర్మదాయకం విభుమ్ ll
స్వర్ణవర్ణ కేశపాశశోభితాంగ మండలం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll

రత్నపాదుకాప్రభాభిరామ పాదయుగ్మకం l
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ ll
మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రభూషణం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll

అట్టహాసభిన్న పద్మజాండకోశసంతతిం l
దృష్టిపాతనష్ట పాపజాలముగ్రశాశనమ్ ll
అష్టశిద్ధిదాయకం కపాలమాలికాధరం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll

భూతసంఘనాయకం విశాలకీర్తి దాయకం l
కాశివాసిలోకపుణ్య పాపశోధకం విభుమ్ ll
నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం l
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ ll
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం l
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ll

కాశికాపురాధి నాథ కాల భైరవం భజే l
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ll
కాల భైరవం భజే l
కాల భైరవం భజే ll

~ ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ ~

జననకాల నక్షత్రదోషాలు పరిహారాలు

పిల్లలు పుట్టినప్పుడు నక్షత్రము మంచిదేనా ? దోషములేమైనా ఉన్నాయా ? శాంతి అవసరమా ? అను సందేహము ప్రతి తల్లిదండ్రులకు కలుగుతుంది . ఏ నక్షత్రములలో జన్మించినపుడు ఏ దోషములు కలుగు తాయి దోష పరిహారములు ఏమిటి ? దోష నక్షత్రములలో జన్మించిన పిల్లలకు నక్షత్ర జపము, నవ గ్రహ శాంతి, హోమము, నూనెలో నీడలు చూచుట, రుద్రాభిషెకము, మొదలగు శాంతిని తప్పని సరిగా జరిపించాలి. కొన్ని విశేష శాంతి కలిగిన నక్షత్రములకు శాస్త్రోక్తముగా విశేష శాంతి చేయాలి.

1. అశ్విని 1 వ పాదములో జన్మంచిన పిల్లల వలన తండ్రికి దోషం. ఈ దోషము ౩ నెలలు ఉండును. ఇక్కడ గమనించ వలసిన విషయము రేవతి, అశ్విని నక్షత్రముల మధ్య సుమారు 48 నిమిషములు సంధి కాలము ఉంటుంది. ఈ సంధి సమయములో జన్మించిన శిశువుకు ఆయుర్దాయము తక్కువగా ఉంటుంది. అశ్విని 2 3 4 పాదములలో జన్మించిన వారికి దోషములేదు.

2. భరణీ 1 2 4 పాదములలో జన్మంచిన వారికి దోషములేదు. 3 వ పాదములో ఆడపిల్ల పుడితే తల్లికి, మగపిల్ల పుడితే తండ్రికి దోషం కలుగును. ఈ దోషము 23 దినముల వరకు ఉంటుంది.

3. కృత్తిక నక్షత్రములో 3 వ పాదము లో జన్మంచిన స్త్రీ తల్లికి పురుషుడు తండ్రికి సామాన్య దోషం కలుగ చేయును. 1 2 4 పాదములలో జన్మంచిన వారు స్వల్ప దోషమును కలుగ చేయుదురు.

4. రోహిణి నక్షత్రము 1 వ పాదములో జన్మించిన మేనమామకు, 2 వ పాదము తండ్రికి, ౩వ పాదము తల్లికి దోషమని 4 వ పాదము దోషము లేదని కొందరి అభిప్రాయము. సామాన్యముగా ఈ నక్షత్రములో పుట్టిన వలన మేనమామకు గండము. తప్పక శాంతి అవసరము . శ్రీ కృష్ణ పరమాత్ముడు ఈ నక్షత్రము నందే జన్మించాడు. మేనమామ గండములో పుట్టాడు . అందు వలెనే కంసుడు నాశనమయ్యాడనీ పురాణ వచనము.

5. మృగశిర 1 2 3 4 పాదములలో జన్మించిన వారికి ఏ విధమైన దోషములు ఉండవు.

6. ఆరుద్ర నక్షత్రము 1 2 3 పాదములలో జన్మంచిన వారికి దోషము లేదు 4 వ పాదమున జననము జరిగిన సామాన్య శాంతి అవసరము.

7. పునర్వసు నక్షత్రము 1 2 3 4 పాదములు అన్నీ మంచివే. ఏ విధమైన శాంతి అవసరము లేదు.

8. పుష్యమి నక్షత్రము కర్కాటక లగ్నములో పగటి సమయమున పురుషుడు పుట్టిన తండ్రికి గండము కలుగును. రాత్రి సమయాన స్త్రీ జన్మించినచో తల్లికి గండము కలుగును.   పుష్యమి నక్షత్రము లో జన్మించిన వారివలన 1 వ పాదము మేనమామలకు 2  పాదములలో తల్లి తండ్రులకు దోషము కలిగింతురు . మూడు, నాలగవ పాదమున పుట్టిన వారికి సామాన్య దోషము కలుగును . వీరికి శాస్త్రోక్తముగా శాంతిని చేయించాలి . గంధపు చెక్కను దానము ఇచ్చుట వలన దోషము నశించును.

9. ఆశ్లేష నక్షత్రములో 1 వ పాదమున  పుట్టినవారికి  దోషము లేదు.  2 వ పాదము శిశువునకు 3 వ పాదము తల్లికి 4 వ పాదము తండ్రికి దోషము . నాలుగవ పాదము న జన్మించిన వారికి విశేష శాంతి చేయించుట అవసరము. ఈ నక్షత్రము యొక్క చివరన 24 నిమిషములు సంధి ఉండును.

10. మఖ నక్షత్ర 1 వ పాదములో జనన మైతే 5 నెలల వరకు తండ్రికి దోషము.  మఖ నక్షత్ర ప్ర్రారంభ సమయములో మొదటి 24 నిమిషములు అత్యంత దోషము . ౩ వ పాదము న పుట్టిన వారి వలన తల్లి తండ్రి ఇద్దరకి దోషము . అశ్వము దానమిచ్చుట వలన దోషము తొలగును .  2, 4 పాదములలో జన్మించిన దోషము లేదు.

11. పుబ్బ నక్షత్రములో 1 2 3 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు.

12. ఉత్తర నక్షత్ర 1, 4 వ పాదములలో జననము జరిగిన యెడల తల్లి, తండ్రి, అన్నలకు దోషము కలుగును. నూనె పాత్రను దానము చెయ్యాలి. మిగతా 2 3 పాదములలో పుట్టిన వారికి దోషము లేదు.

13. హస్తా నక్షత్ర 3 వ పాదమున పుట్టిన పురుషుని వలన తండ్రికి, స్త్రీ వలన తల్లికి దోషము కలుగును. మిగతా 1 2 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు.

14. చిత్త నక్షత్రములో 1 వ పాదము తండ్రికి, 2 వ పాదము తల్లికి 3 వ పాదము తోడ పుట్టిన వారికి దోషము కలిగిస్తుంది. నాల్గవ పాదములో జన్మించిన వారికి సామాన్య దోషము కలుగును.

15 స్వాతి నక్షత్రమున 1 2 3 4 పాదములలో ఏ పాదమున జన్మించిననూ దోషము లేదు.

16 విశాఖనక్షత్రము జన్మించిన వారికి మరుదులు మరియు బావలకు దోషము కలుగును . 1 2 3 4 ఏ పాదములో పుట్టిననూ బంధువులకు గండము. విశేష శాంతి అవసరము.

17. అనూరాధ నక్షత్రములో  1 2 3 4 పాదముల లో జన్మించుట వలన దోషము లేదు.

18 . జ్యేష్ట నక్షత్రము ఈ నక్షత్రము విశేష శాంతి కలిగిన నక్షత్రము. దీనిలో 1 2 3 4  ఏ పాదములో జన్మించినా దోషమే. జాతకుల పుట్టిన రోజున ఉన్న జ్యేష్ట నక్షత్రము మొత్తము సమయాన్ని 10 భాగములు చేయాలి . అందు ఏ భాగములో పుడితే ఆ భాగ సంభందము కలవారికి తప్పక దోషం  కలుగును. 1 వ భాగములో  తాతయ్యకు 2 అమ్మమ్మ కు ౩ తల్లి తోడ బుట్టిన వారికి , మేనమామలకు 4 అన్నలకు, అక్కలకు 5 శిశువునకు 6 ఎవ్వరికి దోషము ఉండదు 7 వివాహ సమయములో అత్త వారి బంధు వర్గమునకు 8 జాతకునకు  9 తల్లికి 10 తండ్రికి దోషము కలుగ చేయును. మరియు నాల్గవ పాదమున జనన మైతే తండ్రికి దోషము . ఇది సమారు 9 నెలలు ఉండును . గోవు ను దానము ఇచ్చుట వలన శాంతి కలుగును. విశేష శాంతి చేయించాలి .   

19. మూల నక్షత్రము ఈ నక్షత్రము ప్రారంభమున 24 నిమిషములు సంధి ఉండను. ఈ నక్షత్రములో 1 వ పాదమున జనన మయిన వారి తండ్రికి, 2 వ పాదము తల్లికి, ౩ వ పాదము ధనమునకు నాశనము కల్గించును 4 వ పాదమున జననము జరిగిన దోషము లేదు . మూలా నక్షత్ర సమయమును మొత్తం 12 భాగాలుగా విభజించి దోషమును తెలుసు కోవాలి. పన్నెండు భాగాలలో 1 వ భాగము తండ్రికి దోషము 2 తల్లికి ౩ అన్నలకు 4 భాగస్వాములకు 5 పిల్లనిచ్చిన మామగారికి 6 చిన్నాన్న, పెద్ద నాన్నలకు 7 పిన్నమ్మ , పెద్దమ్మ లకు మరియు మేనమామలకు 8 ధనమునకు 9 జీవన నాశనము 10 దరిద్రమును కల్గిస్తుంది 11 భ్రుత్యులు 12 జాతకునికి నాశనము కలుగ చేయును.

జ్యేష్ట ,మూలా నక్షత్రములలో జన్మించిన వారి దోషము వివాహ కాలము వరకు ఉండును . దోష నివారణ కొరకు నవ గ్రహ శాంతి, జప, తప, దానములు ఇచ్చుట వలన దోషములు తొలగును.

20 పూర్వాషాడ నక్షత్రము పగటి వేళలో కుమారుడు జన్మించినపుడు తండ్రికి ఆపదలు కలుగును. 2  3 వ పాదములలో  స్త్రీ గానీ పురుషుడు గానీ ఎవరు పుట్టిననూ తల్లి తండ్రి ఇద్దరికీ గండము . 4 వ పాదమున జననము దోషము లేదు .

21 ఉత్తరాషాడ నక్షత్రము 1  2  3 4 పాదములలో జననము దోషము లేదు .
22 శ్రవణం నక్షత్రము 1  2  3  4 పాదములలో జననము దోషము లేదు .
23 ధనిష్ట నక్షత్రము 1  2  3  4 పాదములలో జననము దోషము లేదు .
24 శతభిషం నక్షత్రము 1  2  3  4 పాదములలో జననము దోషము లేదు .
25 పూర్వాబాద్ర నక్షత్రము 1  2  3  పాదములలో జననము దోషము లేదు . నాల్గవ పాదము సామాన్య దోషము .

26 ఉత్తరాభాద్ర నక్షత్రము 1  2  3  4 పాదములలో జననము దోషము లేదు.

27 రేవతి నక్షత్రము 1  2  3  పాదములలో జననము దోషము లేదు .  4 వ పాదమున దోషము. ఈ రేవతి నక్షత్రము చివరి ఘడియలలో జన్మించిన మృత్యుంజయ జపములు రుద్రాభిషేకము తప్పని సరిగా చేయించాలి.

ఈ నక్షత్రములనే కాక దుష్ట తిధి దోషము, వర్జ్యము, దుర్ముహూర్త కాలముల యందునూ, గ్రహణ సమయములలోనూ జన్మించిన వారికి శాంతి చేయించుట ముఖ్యము.

పూజా విధానంలోని, క్రియలలో అంతరార్థమం


1. గంటలు :
దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు. దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది. ఒకటి-బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం, రెండవది-మనస్సును దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది.(సహస్త్రరం చేరుకున్న కుండలిని కి గంటా నాదం వినపడుతుంది.. అది పరాశక్తి యొక్క చింతామణి గృహం అక్కడ చేరగానే గంటా నాదం వినడం అంటే జీవాత్మ పరమాత్మ లో ఐక్యం కావడం దానికి నిదర్శనగా గంటా నాదం గుడిలో పెడతారు, అక్కడ ఉన్న దేవుడు మన సహస్త్రరం లోనే ఉన్నాడు అని సంకేతం అందుకే దేవుడి ఎదురుగా ఉన్నపుడు కళ్ళు3 మూసుకుని ఆత్మ దర్శనము చేసుకుంటాము)

2.దీప హారతి:
దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం. దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం. దైవమే కాంతి. ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది. " స్వామీ! నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభవమైన జ్యోతివి. సూర్యుడు, చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు. కాంతివి నీవే. నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి, మా బుద్ధిని ప్రభావితం చేయి" అని.(జీవాత్మ జోతి రూపం లోనే ఉంటుంది , దీపం రూపంలో దైవం ప్రత్యక్షంగా కొలువై ఉంటుంది.. మనలోని కాంతి దీపం రూపంలోనే ప్రకాశిస్తుంది అన్నదానికి నిదర్శనమ్)

3. ధూపం
భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరువత్తులను వెలిగిస్తాము. వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి. వీటి ధూపం క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది. భగవంతుడు సర్వవ్యాపి. విశ్వమంతా నిండియున్నాడు అన్న భావన అందరిలో కలుగుతుంది. ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికీ జ్ఞప్తి చేసినట్లవుతుంది.(ధ్యానంలో అధిక సమయం ఉండిపోయిన వారికి సమాధి స్థితిలో ఉన్నవారికి ఇహలోక సృహ తెప్పించ డానికి సాంబ్రాణి ధూపం వేస్తారు అది పీల్చగానే బాహ్య సృహ లోకి వస్తారు అలా కాకుండా బలవంతంగా ఎవరిని ధ్యానం నుండి మేలుకొలుప కూడదు, భగవంతుడు నిత్యం ధ్యాన లోనే ఉంటారు, పూజ సమయంలో ధూపం వేసి భగవంతుడు ని ధ్యానం నుండి మేలుకొని పూజని స్వీకరించమని కోరుకోవడం).

4. కర్పూర హారతి
వ్యక్తిగతమైన అహంకారము కర్పూరమువలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం. ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని భక్తులు కోరుకుంటారు. (సృష్టి మొత్తం అనంత వాయువులు కిలిసిపోయేదే, కర్తవ్యనిర్వాహణ తర్వాత కర్మ ఫలితం దైవానికి విడిచి పెట్టాలి కర్పూరం కరిగి నట్టు కర్మను కరిగించ మని దైవాన్ని ఆశ్రయించడం)

5. గంధపు సేవ
ఈ సేవలో చాలా అర్థం ఉంది. భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు. అంత శ్రమకు లోనయినప్పటికీ గంధం ఓర్పుతో సహించి, మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లదం కలిగిస్తుంది. ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనయినప్పటికీ భక్తుడు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు. ఇదే ఈ గంధసేవలోని అంతరార్థం. (జీవిత పరిమళం ఆధ్యాత్మికత తోనే పరుమళిస్తుంది, ఎన్ని సమస్యలు ఉన్నా ఆధ్యాత్మిక చింతన పాచి గుంటలో తామర లాగా ప్రకాశిస్తుంది.. అటువంటి దైవసేవ చేస్తున్నాను నా జీవితాన్ని పరిమలింప చేయమని కోరుకోవడం)

6. పూజ
దేవునికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు. కాని భగవంతునికి వీటితో పనిలేదు. నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు. కాని ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది. ( ఒక నిత్యా జీవితంలో భాగం కావడం రోజూ చేసే కర్మలతో నిత్యా పూజ తో కొద్దిసేపు దేవుని సన్నిధిలో గడపటం అంటే మీ సమయాన్ని దైవముతో గడపటం ఆలోచనలు ఆశలు అలవాట్లు పక్కన పెట్టి హృదయాన్ని నివేదన చేయడం పూజ)

7. పత్రం(శరీరము)
ఇది త్రిగుణాలతో కూడుకున్నది. పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తాడు. (జీవాత్మ పరమాత్మ లో ఐక్యం కావడానికి దేహమే ఒక ఆధారంగా ఉపయోగ పడుతుంది, జీవము అనే ఈ చిలుక దేహము అనే గూటికి ఆధారంగా చేసుకుని సాధన చేస్తుంది ఇదే పత్రం , దైవాన్ని చేర్చే సారధి )

8. పుష్పం (హృదయము)
ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పూవు అని అర్థం కాదు. సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం అని అర్థం. ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి. (ఈ పుష్పమ్ రూపంలో హృదయాన్ని భగవంతుడు పాదాల దగ్గర సదా ఉంచాలి అంటే ఎక్కడ ఉన్నా ఏ పనిలో ఉన్నా దైవ నామ స్మరణ విడువ కూడదు దీన్నే హృదయ కమలాన్ని దైవానికి అర్పించడం అంటారు).

9. ఫలం (మనస్సు)
మనస్సు ఫలాలను అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పితం చేయాలి.దాన్నే త్యాగం అంటారు. (దేవుడు ఇచ్చిన ఈ మానవ జన్మ గొప్ప ఫలం మళ్ళి తిరిగి జన్మ లేని ఫలం లభించాలి అంటే దైవాన్ని శరణు వేడుకోవాలి)

10. తోయం(నీరు)
భగవంతుని అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ, ఆనందం మొదలైన దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద భాష్పాలు దైవానికే అర్పితం కావాలి. (ఇది తర్పణము నిత్యా తర్పణము హృదయంతో చేయడం సర్వస్య శరణాగతి అంటే ఏది చేసినా దైవకార్యం అనుకోవడం అది భగవంతుడు కి సమర్పించడం.. దానివల్ల నీకు కర్మ బంధం నిండి విముక్తి పొందుతూ నీరు వదలడం).

11. కొబ్బరికాయలు
హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది. దానిలో ఉండే నీరు సంస్కారము. కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుంచి వేరుజేసి, తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి. అదే నిజమైన నివేదన. లోపల సంస్కారము అనేవి వున్నంతకాలం, హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకొని ఉంటుంది. హృదయము అనే కొబ్బరికాయను పీచు అనే కోరిక వాసన వదలదు. మనంచేసే పనులను విత్తనాలతో పోలుస్తారు.మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా మొలుస్తుందో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. (భగవంతుడు పెట్టె పరీక్షలు కొబ్బరి చిప్ప లాగా కఠినంగానే ఉన్నా దాన్ని దాటుకుని వెళ్తే తీయటి కొబ్బరి నీరు ఉంటుంది, స్వచ్ఛమైన బొబ్బరి కొబ్బరి నీరు లాగా కఠినమైన పరీక్షలు వెనక శాశ్వతమైన ఆనందం ఉంటుంది). అటుఅటువంటి పరీక్షలను దాటించి చల్లని అనుగ్రహం తీర్థంగా ప్రసాదించ మని కోరుకోవడం.

12. నమస్కారము
చేతులు జోడించగానే పదివేళ్లు కలసివుంటాయి. ఈ పదివేళ్లు పది ఇంద్రియములకు గుర్తు. ఇందులో కర్మేంద్రియ,జ్ఞానేంద్రియములను హృదయములోని పరమాత్మకు కైంకర్యము చేయుచున్నాను అని చేతులు జోడించుటయే నమస్కారములోని అంతరార్థము. (నమస్కారం చేయడం అంటే వినయంతో దైవానికి మనస్ఫూర్తిగా శరణు వేసుకోవడం, నమస్కారం చేసే సమయంలో బొటన వ్రేలు బృకుటిని తకాలి ఆ భంగిమలో చేతి వ్రేలు నుండి ప్రకంపనలు బృకుటిని తగిలి విద్యత్కాంతి శక్తి మెదడుకి ప్రవహిస్తుంది అప్పుడు మెదడులోని నరాలు బలపడుతుంది  జ్ఞాపక శక్తి పెరుగుతుంది.. అందుకే ఉదయం లేవగానే దేవుడికి , పూజ సమయంలో , బడిలో గురువుకి ఇలా నమస్కారం చేయమంటారు.)

13. ప్రదక్షిణము
ముల్లోకములన్నియు భగవంతుని స్వరూపముతో నిండివున్నాయి. ఆ భగవంతుని సగుణాకరమైన విగ్రహమునకు గాని, లింగమునకు గాని, ప్రదక్షిణము చేసినట్లయిన ముల్లోకములు చుట్టి సర్వదేవతలకు నమస్కారములు చేసిన ఫలితము వుంటుంది.. అందుకే ప్రదక్షిణము పూజాంగములలో ఒకటిగా చేర్చారు.( గుడిలో చేసే ప్రదర్శన వల్ల రాత్రంతా గుడిలో విగ్రహం కింద ఉన్న యంత్రం విశ్వప్రాణ శక్తిని ఆకర్షిస్తుంది ప్రదర్శన సమయంలో అది మన శరీరాలను తాకడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే గృహంలో ఆత్మ ప్రదర్శన నమస్కారం చేయాలి అంటే ఈ విశ్వం  ఆ పరమాత్మ అంతా తనలోనే ఉన్నదని ఆత్మ రూపంలో పరమాత్మను గుర్తిస్తున్నాము అని నమస్కరించి ప్రదర్శన చేయడం.)గుడిలో ఎప్పుడూ తమ చుట్టూ తాము తిరగకూడదు గుడిలో గుడి చుట్టూ మటుకే తిరగాలి ఇంట్లో పూజ సమయంలోనే తమ చుట్టూ తాము తిరగాలి.

14. అష్టాoగ నమస్కారం ఇది పురుషులు మటుకే పూర్తిగా బోర్ల పొడుకుని నమస్కారం చేయాలి మనసా వాచ కర్మణా సదా నీకు దాసుడనై భక్తుడునై నిన్నే ఆశ్రయించి ఉంటాను అని భావము.
ఈ పూజలు కట్టుబాట్లు దీక్షలు, ఆచారాలు మానవ జీవితాన్ని క్రమశిక్షణ తో గడపటానికే, ప్రతి ఆచారంలోను సాంకేతిక మైన లాభాలతో పూర్వీకులు నియమించారు, పెట్టే ప్రసాదాల నుండి ఆచరించే పద్ధతుల వరకు అన్నిటా  ప్రయోజనమైన ఉపయోగలే ఉన్నాయి.

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...