Thursday, June 21, 2018

వేద సూక్తములు - విజ్ఞాన సర్వస్వములు - శ్రీ సూక్తము


"శ్రీ సూక్తము " :

1  ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజామ్ !
   చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ !!

భావం:- ఓ అగ్ని దేవా ! బంగారం వంటి కాంతి గలది, సర్వ
పాపములను పోగొట్టునది, బంగారు, వెండి ఆభరణములను
అలంకరించుకున్నది, చంద్రుని వలె ఆహ్లాదము కలుగించునది
సువర్ణమయ మహా లక్ష్మీ దేవిని నా కొరకు ఆహ్వాన చెయ్యి !!

2  తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీమ్ !
   యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్ !!

భావం:- ఓ అగ్ని దేవా ! ఎవరి కృపా కటాక్షము వలన నాకు
బంగారం, వెండి, రత్నములు, గోవులు, అశ్వములు, సంతతి
ప్రాప్తించునో ఆ మహాలక్ష్మీ దేవిని సత్వరమే నా వద్దకు ఆహ్వాన
చేయి ! ఆమె నన్ను వీడి పోకుండా చూడు !!

3  అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రభోధినీమ్ !
    శ్రియం దేవీ ముపవహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్ !!

భావం:- అశ్వములు పూన్చిన రథము మధ్యలో ఆసీనురాలై
తన రాకను ఏనుగుల యెుక్క ఘీంకార నాదముతో తెలియ
జేయు శ్రీ లక్ష్మీ దేవిని ప్రార్థనా పూర్వకంగా ఆహ్వానించు చున్నాను ! ఆ శ్రీ దేవి నాపై అనుగ్రహముతో నా వద్దనే వుండు గాక !!

4  కాం సోస్మితాం హిరణ్య ప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీమ్
   తృప్తాం తర్పయంతీమ్ !
   పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్ !!

భావం:- చిరు మందహాసముతో , బంగారు కోటలో నివసించే
కరుణామయి, తేజో రూపిణి, నిత్య తృప్త, భక్తులకు సదా తృప్తి
కలిగించేది, పద్మము వంటి రంగు గలిగి పద్మమునందు ఆసీను
రాలైన శ్రీ మహా లక్ష్మీ దేవి నాకు సాక్షాత్కరించు గాక !!

5  చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే
    దేవజుష్టా ముదారామ్ !
    తాం పద్మినీం ఈం  శరణమహం ప్రపద్యే2అలక్ష్మీర్మే
    నశ్యతాం త్వాం వృణే !!

భావం:- చంద్రుని వంటిది, తేజోవంతమైనది, తన కీర్తిచంద్రిక
లతో ప్రకాశించునది, దేవతలచే ఆరాధింప బడునది, కరుణా
సాగరి, పద్మములను చేతులలో ధరించునది, ' ఈం' మంత్ర
బీజమునకు భావమైనది, అయిన ఆ శ్రీ దేవిని నేను శరణు పొందుతున్నాను ! ఆ శ్రీ దేవి నా దారిద్ర్యం పోగొట్టి నన్ను అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను !!

( వేదములలో దేవీ దేవతలకు సంభందించిన అనేక సూక్తములు కలవు  అందులో దేవీ పరంగా శ్రీసూక్తము ప్రధానమైనది ! అమ్మవారికి ఈ మంత్రములతోనే అభిషేకం చేస్తారు )

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...