Saturday, June 23, 2018

సృష్టిరహస్యాన్నితెలిపే_శ్యామకాళి

కాళీదేవి రూపాలలో శ్యామకాళి రూపం అత్యంత కోమల సుకుమార సుందరమైనది. ‘శ్యామ’ అనే శబ్దం ఎంతో ప్రత్యేకమైనది. అమ్మవారు కాలస్వరూపం కనుక ‘కాళి’ అని అన్నారు. నల్లనివర్ణంతో ప్రకాశిస్తుంది కాబట్టి ‘కాళి’ అని మరికొందరు అన్నారు. ‘శ్యామ’ అనే శబ్దానికి నలుపు వర్ణం అనే అర్థం ఉంది. సుకుమారమైన, ఆకర్షణీయమైన నల్లని రంగును ‘శ్యామవర్ణం’ అంటారు. బృందావనంలో కృష్ణుడిని శ్యాముడుగా, రాధాదేవిని శ్యామగా పిలుస్తారు. కృష్ణ ప్రేమి మండలి సంప్రదాయంలో ‘శ్యామ్‌’ అనే శబ్దాన్ని ఆదినామంగా పరిగణిస్తారు. అనంతమైన ప్రేమ చైతన్య దివ్య సుందర స్వరూపమే శ్యామ శబ్దానికి అర్థంగా వారు భావిస్తారు. ఆ స్వరూపం పురుష రూపాన్ని ధరిస్తే శ్యాముడు (కృష్ణుడు)గా, స్త్రీ రూపాన్ని ధరిస్తే శ్యామ (రాధాదేవి)గా భావిస్తారు. అలాగే శ్యామకాళీ రూపాన్ని ప్రేమమయమైన కాళీరూపంగా భావించి ఉపాసించడం కూడా కనిపిస్తుంది. అలంకార శాస్త్రంలో శ్యామ అంటే యవ్వన మధ్యస్థ అని అర్థం అంటే.. 25-40 సంవత్సరాల మధ్య వయసుగా భావించవచ్చు. శ్యామకాళీదేవి ధ్యాన శ్లోకంలో అమ్మవారి రూపాన్ని వర్ణిస్తూ నల్లటి వర్ణంతో యవ్వన మధ్యస్థగా సృష్టిసంహారకారిణిగా వర్ణించారు. ఆమె నల్లని వర్ణం సృష్టి సంహార స్వరూపానికి ప్రతీకగా చెప్పారు. ఎందుకంటే సృష్టి ప్రారంభవేళ అనంతమైన నల్లని గాఢాంధకారం నుంచి అన్ని వర్ణాలూ ఉద్భవించాయి. అలాగే సృష్టి లయ వేళ అన్ని వర్ణాలూ నలుపులో మాయమవుతాయి. తానే సమస్తమైన సృష్టికి, లయకు కారణమైన స్వరూపంగా ఆ అమ్మవారు రామకృష్ణ పరమహంసకు దర్శనమిచ్చింది. ఆ కథేంటంటే.. ఒకరోజు లోకోత్తర సౌందర్యవతి అయిన స్త్రీ నదీజలాల నుంచి బయటకు వచ్చింది. పరిపూర్ణ గర్భవతి అయిన ఆమె రామకృష్ణ పరమహంస ముందు అందమైన బిడ్డను ప్రసవించి ఆ బిడ్డను లాలిస్తూ తన ్తన్యాన్నిచ్చింది. వెంటనే అతి క్రూర రూపాన్ని ధరించి ఆ పసిబిడ్డను నమిలి మింగి మళ్లీ నదీజలాల్లో ప్రవేశించి అదృశ్యమైంది. అలా సృష్టి రహస్యాన్ని శ్యామకాళీ మాత రామకృష్ణులవారికి బోధించిందంటారు. అలాగే, శ్యామలాదేవి (మాతంగి)ని కూడా కాళీదేవి యొక్క శ్యామకాళి రూపంగా భావించడం కనిపిస్తుంది. మహాకవి కాళిదాసు ఆమె రూపాన్ని వర్ణిస్తూ ‘మాతా మరకత శ్యామా.. మాతంగీ మధుశాలినీ’ అన్నాడు. అంటే.. శ్యామలాదేవి నల్లని వర్ణం కలిసిన మరకత (ఆకుపచ్చ) వర్ణంతో ప్రకాశిస్తుందిట. అందుకని మతంగ మహర్షి దర్శించిన శ్యామలా స్వరూపాన్ని కూడా శ్యామకాళిగా ఉపాసించడం కనిపిస్తుంది. శ్యామకాళిని ఉపాసిస్తే ఆ తల్లి ప్రేమ శక్తిని ప్రసాదిస్తుంది. సృష్టి రహస్యాన్ని, కాలస్వరూపాన్ని తెలిసేటట్లుగా చేస్తుంది...

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...