Monday, June 11, 2018

అందరూ తెలుసుకోవాల్సిన సదాచారాలు

⚡ సద్గురువులని ఆశ్రయించి మంత్రాన్ని పొందాలి. ఇది మన సంప్రదాయం.
⚡ఇష్టం వచ్చినట్లు పుస్తకాలు చూసి లేదా స్వతహాగా చదివి మంత్రాలని జపించరాదు.
⚡ గాయత్రీ మంత్రాల్లాంటి వాటిని తెలియ కుండా ఎవరు బడితే వారు జపించరాదు.  ఎంతో శక్తి నిక్షేపించ పడిన మంత్రాలని, బీజాక్షరాలని తెలియక అపస్వరం తో జపించడంవల్ల చెడు ఫలితాలని ఇస్తుంది.

 ఉదా౹౹ దేవీ భాగవతం లో వృత్తాసురుని  కథ
⚡ మంత్రాలని Ring Tone గా పెట్టరాదు.

⚡ గురు ఉపదేశం లేని వారు భాగవన్నామాన్ని నిత్యం జపించవచ్చు.  భాగవన్నామనికి ఎటువంటి నియమాలు లేవు.

⚡ఒట్టి "ఓం" కార జపం గృహస్తులు చేయరాదు. కేవలం సన్యాసులే చేసుకోవాలి.
⚡ఇంకా ఇటువంటివి ఎన్నో విషయాలు సద్గురువుని ఆశ్రయించి తెలుసుకోవాలి.

⚡ మైల ఉన్న కాలంలో  ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. దేవతా విగ్రహాల్ని తాకడం, దేవునికి దీపము పెట్టడం చేయరాదు.
⚡దేహాన్ని తీసుకెళ్తున్నప్పుడు రోడ్డు మీద పూలు చల్లకూడదు. పూలు తొక్కడం మహాపాపం
⚡తీర్థ యాత్రలు చేయడం ,నియమ బద్ధంగా భాగవత సప్తాహం చేయడం వల్ల ఉత్తమ గతులు వస్తాయి.

⚡ఇంటి పేరు వారు ఎవరైనా మరణిస్తే వారి సంబంధం 3 తరములు దాటితే మైల ఉండదు
⚡సముద్రము దాటి ఉన్న వారికి కట్టిన బట్టలతో స్నానము చేయడం వల్ల
 మైల పూర్తి అవుతుంది.
⚡దంతములు రాకుండానే పిల్లవాడు  మరణిస్తే స్నానము తో శుద్ధి. 3 సం౹౹ లోపు అయితే ఒక్క రోజు,
ఉపనయనం కాకుండా లేదా 8 సం౹౹ ముందు అయితే 3 రోజులు మైల ఉంటుంది. 8 సం౹౹ తర్వాత లేదా ఉపనయనం అయ్యాక 10 రోజులు ఉంటుంది

 - త్రిభాషా మహాసహస్రావధాని, ప్రణవపీఠం, శ్రీకరి పీఠం(కాశీ) వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనముల నుంచి

No comments:

Post a Comment

పరమ శివుని స్వరూపం - శ్రీ దక్షిణామూర్తి

విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషుల...