Wednesday, September 30, 2020

శయన నియమాలు

పడుకోవాలంటే పాటించే పదహారు సూత్రాలు

1. నిర్మానుష్యంగా, నిర్జన  గృహంలో ఒంటరిగా పడుకోవద్దు. దేవాలయం మరియు స్మశాన వాటికలో కూడా పడుకోకూడదు.( మను స్మృతి)

2. పడుకోని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు.  ( విష్ణు స్మృతి)

3. విద్యార్థి, నౌకర మరియు ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచో  వీరిని మేల్కొలపవచ్చును.( చాణక్య నీతి)

4. ఆరోగ్యవంతులు  ఆయురక్ష కోసం బ్రహ్మా ముహూర్తం లో నిద్ర లేవాలి ( దేవీ భాగవతము), పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు.

( పద్మ పురాణము)

5. తడి పాదము లతో నిద్రించవద్దు... పొడి పాదాల తో నిద్రించడం వలన లక్ష్మి (ధనం) ప్రాప్తిస్తుంది.( అత్రి స్మృతి)

 విరిగిన పడకపై, ఎంగిలి మొహం తో పడుకోవడం నిషేధం. ( మహాభారతం)

6. నగ్నంగా, వివస్త్రలులై పడుకోకూడదు.( గౌతమ ధర్మ సూత్రం)

7. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన విద్య, పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన ప్రబల చింత, ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన హాని,మృత్యువు, ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించినచో ధనము, ఆయువు ప్రాప్తిస్తుంది. ( ఆచార మయూఖ్)

8. పగటిపూట ఎపుడు కూడా నిద్రించవద్దు. కానీ జ్యేష్ఠ మాసంలో  1 ముహూర్తం (48నిమిషాలు) నిద్రిస్తారు.(పగటిపూట నిద్ర రోగహేతువు మరియు ఆయుక్షీణత  కలుగచేస్తుంది)

9. పగటిపూట  సూర్యోదయము  మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు.

( బ్రహ్మా వైవర్తపురాణం)

10.సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు3 గంటల) తరువాత నే పడుకోవాలి

11. ఎడమవైపు పడుకోవడం వలన  స్వస్థత లభిస్తుంది.

12. దక్షిణ దిశలో పాదములు పెట్టి ఎపుడు నిద్రించకూడదు యముడు మరియు దుష్ట గ్రహము ల  నివాసము వుంటారు...

దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. మెదడుకు రక్త సరఫరా మందగిస్తుంది. మతిమరుపు మృత్యువు*  లేదా   అసంఖ్యాకమైన రోగాలు చుట్టుముడుతాయి.

13. గుండెపై చేయి వేసుకుని, చెత్తు యొక్క బీము కింద, కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు.

14. పడక మీద త్రాగడం- తినడం చేయకూడదు. అత్యంత దరిద్రం మరియు ఏది కలసిరాకపోవడం జరుగుతుంది 

15. పడుకొని పుస్తక పఠనం చేయడానికి వీల్లేదు. ( పడుకొని చదవడం వలన నేత్ర జ్యోతి మసకబారుతుంది.)

ఈ పదహారు నియమాలను అనుసరించేవారు యశస్వి,  నిరోగి మరియు దీర్ఘాయుష్మంతుడు అవుతారుశయన నియమాలు

శ్రీ నవగ్రహ పీడాహరణ స్తోత్రం

1) నమో భగవతే సూర్యాయ 

   ధర్మచక్రప్రవర్తితాయ 

   ఆయురారోగ్యఐశ్వర్యప్రదాయకాయ 

   రవిగ్రహపీడానివారకాయ   ||

2) నమో భగవతే సోమాయ 

   రోహిణీప్రియవల్లభాయ 

   శ్రీమహలక్ష్మ్యాగ్రజాయ 

   చంద్రగ్రహపీడానివారకాయ   ||

3) నమో భగవతే అంగారకాయ

   లోహితాంగాయ

   శ్రీభూమిప్రియాత్మజాయ

   అంగారకగ్రహపీడానివారకాయ ||

4) నమో భగవతే బుధాయ 

   సోమరోహిణ్యాత్మజాయ 

   ఇలాప్రియవల్లభాయ 

   బుధగ్రహపీడానివారకాయ ||

5) నమో భగవతే బృహస్పతయే 

   శ్రీఆంగీరసప్రియాత్మజాయ 

   శుభత్రేయిప్రియవల్లభాయ 

   గురుగ్రహపీడానివారకాయ ||

6) నమో భగవతే శుక్రాయ 

   శ్రీజయంతిప్రియవల్లభాయ 

   శ్రీభృగునందనాయ 

   శుక్రగ్రహపీడానివారకాయ ||

7) నమో భగవతే శనైశ్చరాయ 

   శ్రీసూర్యఛాయాత్మజాయ  

   మందనీలిమాప్రియవల్లభాయ 

   శనిగ్రహపీడానివారకాయ ||

8) నమో భగవతే రాహవే 

   విప్రచిత్తిసింహికాత్మజాయ 

   శ్రీకేతుప్రియాగ్రజాయ 

   రాహుగ్రహపీడానివారకాయ ||

9) నమో భగవతే కేతవే 

   అశ్వినిమఖమూలానక్షత్రాధిపత్యాయ 

   మోక్షసన్యాసజ్ఞానకారకాయ 

   కేతుగ్రహపీడానివారకాయ ||

     సర్వం శ్రీనవగ్రహదేవతాదివ్యచరణారవిందార్పణమస్తు

Monday, September 28, 2020

పక్షంలోని తిథులు

  1. పాడ్యమి (అధి దేవత - అగ్ని)
  2. విదియ (అధి దేవత - బ్రహ్మ
  3. తదియ (అధి దేవత - గౌరి)
  4. చవితి (అధి దేవత - వినాయకుడు)
  5. పంచమి (అధి దేవత - సర్పము) 
  6. షష్టి (అధి దేవత - కుమార స్వామి)
  7. సప్తమి (అది - సూర్యుడు)
  8. అష్టమి (అధి దేవత - శివుడు)
  9. నవమి (అధి దేవత - దుర్గా దేవి)
  10. దశమి (అధి దేవత - యముడు)
  11. ఏకాదశి (ఆధి దేవత - శివుడు)
  12. ద్వాదశి (అధి దేవత - విష్ణువు)
  13. త్రయోదశి (అధి దేవత - మన్మధుడు)
  14. చతుర్దశి (అధి దేవత - శివుడు)
  15. మిన్నమి/పూర్ణిమ/పౌర్ణమి (అధి దేవత - చంద్రుడు
  16. అమావాస్య (అధి దేవత పితృదేవతలు)

దేవాలయ స్తంభాల “విష్ణు కాంత” (అష్టభుజి)

 ఇది కేవలం ఆలయ స్తంభం అని మీరు అనుకుంటున్నారా?



 గుజరాత్ లోని సూర్య మందిర్, మోధేరా నుండి వచ్చిన హిందూ దేవాలయ స్తంభాల “విష్ణు కాంత” (అష్టభుజి) తరగతికి చెందిన ఈ “ద్వదాషా లక్ష్ణ స్థంభ” - 12 ఎలిమెంట్స్ స్తంభం.

 1) ఘాటా / అహ్వానా పట్టా - కలసా లేదా స్వాగత బ్యాండ్ వంటి బేస్ వాటర్ పాట్ సాధారణంగా శ్రీ గణేశ లేదా శ్రీ మహా లక్ష్మిని కలిగి ఉంటుంది.

 2) సింహాముఖ పట్టా - లయన్ బ్యాండ్ - శౌర్యం & ధైర్యాన్ని సూచిస్తుంది.

 3) ద్వారపాల పట్టా - గార్డియన్ బ్యాండ్ - ఆలయంలోని దేవత యొక్క సంరక్షకులు ఉన్నారు.

 4) వడక / వడకి పట్టా - సంగీతకారుల బృందం భగవంతుడిని గౌరవించి పాడటం.

 5) అవతార పట్టా - మానిఫెస్టేషన్ బ్యాండ్ - దేవతకు అధ్యక్షత వహించే వివిధ అవతారాలు.

 6) కలికా పట్టా - లోటస్ బడ్ బ్యాండ్ - ప్రతి ఒక్కరూ మోక్షాన్ని పొందగల సామర్థ్యాన్ని సూచిస్తుంది.

 7) ఖండికా / ఘంటా పట్టా - బెల్ బ్యాండ్ - ధ్వని ద్వారా ఈ విశ్వం యొక్క అశాశ్వతమైన, అస్థిరమైన సృష్టిని సూచిస్తుంది.

 8) దేవ గణ పట్టా - దైవిక లక్షణాల స్వరూపాలు - దైవత్వం యొక్క అన్ని మంచి పాత్రలను పోలి ఉంటాయి.

 9) గాంధర్వ పట్టా - రేఖాగణిత బృందం ప్రాథమికంగా వజ్రా లేదా పద్మ కులిక ఉన్నారు.  వజ్రా అవిశ్వసనీయతను సూచిస్తుంది.  పద్మ కులికా సూచిస్తుంది - మోక్షం యొక్క సంభావ్యత మానవులందరూ.

 10) కీర్తిముఖ పట్టా - కీర్తిముఖ తన యజమాని మహాదేవునికి అంకితభావం.

 11) కుంభిక / పూర్ణకుంభ - కలస - పైభాగంలో నీటి కుండ.

 12) సిర్సా - ఒక స్తంభం యొక్క తల / రాజధాని - హెడ్ మానవ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం వంటి బరువును మోయడంలో సిర్సా ఎంత ముఖ్యమో సూచిస్తుంది.

 బేస్ వద్ద ఘాటా నీరు, పైభాగంలో కుంభిక నీరు - జీవితం నీటిలో ఎలా ఉద్భవించి నీటిలో ముగుస్తుందో సూచిస్తుంది.

 "ఇన్క్రెడిబుల్ ఇండియా "

నరసింహ వేదత్రయప్రపూజ్యం


నరసింహ వేదత్రయప్రపూజ్యం 

 లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం

పక్షీంద్రశైలభవనం భవనాశమీశం |

గోక్షీరసార ఘనసారపటీరవర్ణం

వందే కృపానిధిమహోబలనారసింహం ||


ఆద్యంతశూన్యమజమవ్యయమప్రమేయం

ఆదిత్యచంద్రశిఖిలోచనమాదిదేవం |

అబ్జాముఖాబ్జమదలోలుపమత్తభృంగం

వందే కృపానిధిమహోబలనారసింహం ||


కోటీరకోటిఘటితోజ్జ్వలకాంతికాంతం

కేయూరహారమణికుండలమండితాంగం |

చూడాగ్రరంజితసుధాకరపూర్ణబింబం

వందే కృపానిధిమహోబలనారసింహం ||


వరాహవామననృసింహసుభాగ్యమీశం

క్రీడావిలోలహృదయం విబుధేంద్రవంద్యం |

హంసాత్మకం పరమహంసమనోవిహారం

వందే కృపానిధిమహోబలనారసింహం ||


మందాకినీజననహేతుపదారవిందం

బృందారకాలయవినోదనముజ్జ్వలాంగం |

మందారపుష్పతులసీరచితాంఘ్రిపద్మం

వందే కృపానిధిమహోబలనారసింహం ||


 ఓం వేదత్రయప్రపూజ్యాయ నమః 

Friday, September 25, 2020

శ్రీ గాయత్రీ అష్టకమ్




సుకల్యాణీం వాణీం సురమునివరైః పూజితపదాం శివ

మాద్యాం వంద్యాం త్రిభువన మయీం వేద జననీం పరాం

శక్తిం స్రష్టుం వివిధ విధిరూపగుణమయీమ్ భజేంబాం

గాయత్రీం పరమమృతమానంద జననీమ్ !!


విశుద్ధాం సత్వాస్థామఖిల దుఃఖ దోష నిర్హరణీమ్

నిరాకారం సారాం సువిమల తపోమూర్తిమతులాం

జగజ్వేష్ఠా శ్రేష్ఠా మసురసుర పూజ్యాం శ్రుతినుతాం

భజేంబాం గాయత్రీం పరమమృతమానంద జననీం !!


తపో నిష్ఠామభీష్టామంబ జనమత సంతాపశమనీమ్

దయామూర్తిం స్పూర్తిం యతియతి  ప్రసాదైక సులభామ్

వరేణ్యాం పుణ్యాం తాం నిఖిల భవబంధాపహరణీమ్

భజేంబాం గాయత్రీం పరమమృతమానంద జననీమ్ !!


సదారాధ్యాం సాధ్యాం సుమతిమతి విస్తార కరణీమ్

విశోకామాలోకాం హృదయగతమోహాంధ హరణీమ్

పరాం దివ్యాం భవ్యామగమ భవసింధ్వేక తరణీమ్

భజేంబాం గాయత్రీం పరమమృతమానంద జననీమ్ !!


అజాం ద్వైతా త్రైతాం త్రివిధగుణరూపాం సువిమలామ్

తమోహంత్రీం తంతుం శ్రుతిమధురనాదాం రసమయిమ్

మహా మాన్యాం ధన్యాం సతత కరుణశీల విభవామ్

భజేంబాం గాయత్రీం పరమమృతమానంద జననీమ్ !!


జగద్ధాత్రీ పాత్రీం సకల భావ సంసారకరణీమ్

సువీరాం ధీరాం తాం సువిమల తపోరాశి సరణీమ్

అనేకామేకాం వైత్రయ జగదదిష్ఠాన పదవీమ్

భజేంబాం గాయత్రీం పరమమృతమానంద జననీమ్ !!

 

ప్రబుద్ధాం బుద్ధాం తాం స్వజనయతి జాడ్యాపహరణీమ్

హిరణ్యాం గుణ్యాం తాం సుకవిజనగీతాం సునిపుణామ్

సువిద్యా నిరవద్యాం కథగుణగాథాం భగవతీమ్

భజేంబాం గాయత్రీం పరమమృతమానంద జననీమ్ !!


అనంతాం శాంతాం యాం భజిత బుధవృంద శృతిమయీమ్

సుగేయాం ధ్యేయాం యాం స్మరతి హృదినిత్యం సురపతిః

సదా భక్త్యా శక్త్యా ప్రణతి యతిభిః ప్రీతివశగః

భజేంబాం గాయత్రీం పరమమృతమానంద జననీమ్ !!


శ్రీ గాయత్రీదేవి అష్టకమ్, ఫలం

శుద్ధ చిత్తః పఠేద్యస్తు గాయత్రి అష్టకం శుభం

అహో భాగ్యో భవేల్లోకే తస్యా మాతా ప్రసీదత౹౹

Thursday, September 24, 2020

భగవద్గీత పైన అందరికి ఉండవల్సిన అవగాహన

 1. భగవద్గీతను లిఖించినదెవరు?

=విఘ్నేశ్వరుడు.

2. భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వములోని భాగము?

= భీష్మ పర్వము.

3. గీతాజయంతి ఏ మాసములో ఎప్పుడు వచ్చును?

=మార్గశిర మాసము.

4. గీతాజయంతి ఏ ఋతువులో వచ్చును?

=హేమంత ఋతువు.

5. ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వసంత ఋతువు.

6. భగవద్గీత ఎవరు ఎవరికి బోధించెను?

=శ్రీకృష్ణుడు అర్జునునికి.

7. భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించెను?

=కురుక్షేత్ర సంగ్రామము.

8. భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామము ప్రారంభమయ్యెను?

=కౌరవ పాండవులకు.

9. పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారధిగా వుండెను?

=అర్జునుడు.

10. వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పెను?

=సామవేదము.

11. మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి?

=పాంచజన్యము.

12. భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు గలవు?

=పద్దెనిమిది (18)

13. “నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో, నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడినది” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోథుడెవరు?

= వినోబా భావే.

14. “సంశయములు నన్నావరించినపడు, సంకటములు సంప్రాప్తమైనపుడు, నిరాశా నిస్పృహలు జనించినపుడు నేను భగవద్గీత తెరచి చూచెదను. అందు ఏదో ఒక శ్లోకము నన్నూరడించును.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?

= మహాత్మా గాంధీ.

15. భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవరు?

= సంజయుడు.

16. సేనానాయకులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=కుమారస్వామి.

17. మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేమిటి?

=దేవదత్తము.

18. భగవద్గీత యందు వ్యాసునిచే ఎన్ని ఛందస్సులు వాడబడినవి?

= ఐదు. (అనుష్టుప్, ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, ఉపజాతి, విపరీతపూర్వ.)

19. భగవద్గీతను సాక్షాత్తుగా (లైవ్) వినినవారెవరు?

=నలుగురు. అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు.

20. ఆయుధమును ధరించిన వారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= శ్రీరామచంద్రుడు.

21. భగవద్గీత యందు శ్రీకృష్ణునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?

=అచ్యుత, అనంత, జనార్ధన.

22. భగవద్గీత యందు అర్జునునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?

=ధనుంజయ, పార్ధ, కిరీటి.

23. శ్రీకృష్ణపరమాత్మ తన అవతార సమయంలో రెండు గానములు చేసెను. ఒకటి మురళీగానం. మరి రెండవది ఏమిటి?

=గీతా గానం.

24. “ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్” అనే పేరుతో భగవద్గీతను ఆంగ్లభాషలో పద్యరూపమున వ్రాసిన ఆంగ్లకవి ఎవరు?

=ఎడ్విన్ ఆర్నాల్డ్.

25. మహాభారత సంగ్రామ ప్రారంభంలో భీముడు ఊదిన శంఖం పేరేమిటి?

=పౌండ్రము.

26. ఏకాదశ రుద్రులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=శంకరుడు.

27. “నా తల్లి చాలా కాలం క్రిందటే మరణించెను. కానీ అప్పటినుండి భగవద్గీత యను తల్లి ఆ స్ధానమును ఆక్రమించి, నా పక్కనే వుండి నన్ను కాపాడుచున్నది.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?

=మహాత్మాగాంధీ.

28. భగవద్గీత ఏ వేదములోనిది?

=పంచమ వేదం-మహాభారతం.

29. భగవద్గీత యందు ఎన్నవ అధ్యాయంలో భగవంతుని విశ్వరూప సందర్శన ప్రత్యక్షముగా వర్ణింపబడినది?

=11వ అధ్యాయము

30. ద్వాదశాదిత్యులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=విష్ణువు

31. భగవద్గీత మొదటి అధ్యాయం పేరేమిటి?

=అర్జున విషాద యోగము.

32. భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పబడిన మహారథుడు అనగా ఎంతమంది యోధులతో ఒక్కడే యుధ్ధము చేయగలడు?

=పదివేలమంది.

33. మహాభారత సంగ్రామ ప్రారంభంలో ధర్మరాజు ఊదిన శంఖం పేరేమిటి?

=అనంతవిజయము.

34. భగవద్గీత మొదటి శ్లోకం ఏ పదం (శబ్దము)తో ప్రారంభమవుతుంది?

= “ధర్మ” - శబ్దముతో గీత ప్రారంభమయినది.

35. ధృతరాష్ట్రునికి మహాభారత యుద్ధంలో జరుగుతున్న ప్రతీ విషయమును గీత సంవాదముతో సహా ఎప్పటికపుడు ప్రత్యక్షంగా (లైవ్) వివరించినదెవరు?

=సంజయుడు.

36. భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటిరోజున పాండవుల తరపున వ్యూహ రచన చేసినది ఎవరు?

=దృష్టద్యుమ్నుడు.

37. ఆయుధములలో తాను ఏ ఆయుధమని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వజ్రాయుధము.

38. మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల యుద్ధవ్యూహము పేరేమిటి?

=వజ్ర వ్యూహం.

39. గీతా సంవాదము జరిగిన మహాభారత సంగ్రామ మొదటి రోజున కౌరవుల సేనాపతి ఎవరు?

=భీష్ముడు.

40. సర్పములలో తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వాసుకి.

41. అనేక తలలు గల నాగులలో తాను ఏ నాగునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= అనంతుడు.

42. మహాభారత సంగ్రామ ప్రారంభంలో నకులుడు ఊదిన శంఖం పేరేమిటి?

=సుఘోషము.

43. అర్జునుని ధనస్సు పేరేమిటి?

=గాండీవము.

44. జీవునకు ఈ శరీరమునందు ఎన్ని అవస్థలు కలుగునని శ్రీకృష్ణుడు చెప్పెను?

=నాలుగు. (బాల్యము, యౌవనము, వార్థక్యము, దేహాంతర ప్రాప్తి)

45. నదులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= గంగానది.

46. ఆత్మ యెట్టిది?

=నాశరహితమైనది.

47. కొంత ఆచరించి మధ్యలో వదిలివేసిననూ నిష్ఫలము కాని కర్మను ఏమందురు?

=నిష్కామ కర్మ.

48. మనుజునకు దేనియందు అధికారము కలదు?

=కర్మలు చేయుటయందు మాత్రమే. (ఫలమునాశించుట యందులేదు.)

49. అర్జునుడు ఎవరి లక్షణములు-భాష, నివాసము, నడవడిక తెలుపమని శ్రీకృష్ణుని అడిగెను?

=స్థితప్రజ్ఞుడు (జీవన్ముక్తుని లక్షణములు.)

50. వృక్షములలో తాను ఏ వృక్షమని శ్రీ కృష్ణుడు చెప్పెను?

= రావిచెట్టు.


విస్సాప్రగడ సత్యహరి

హిందూత్వం - వ్యక్తిత్వం 

http://www.youtube.com/c/SatyahariVissapragada9948256662


51. పంచభూతములచే నాశనము పొందనిది ఏది?

=ఆత్మ.

52. మహాభారత సంగ్రామ ప్రారంభంలో సహదేవుడు ఊదిన శంఖం పేరేమిటి?

=మణిపుష్పకము.

53. ప్రపంచమున పూర్ణానందమెచట లభించును?

=ఆత్మయందు.

54. మహాభారత సంగ్రామంలో అర్జునుని రధము యొక్క జెండాపై గల వానరుడెవరు?

=హనుమంతుడు.

55. పక్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= గరుత్మంతుడు.

56. ఏ జంతువు వలె యోగి అయినవాడు తన ఇంద్రియములను వెనుకకు మరల్చును?

=తాబేలు.

57. కర్మచేయుట మేలా, చేయకుండుట మేలా?

=చేయుటయే మేలు.

58. బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించునపుడు వారితో సహా మఱి వేనిని సృష్టించిరి?

=యజ్ఞములు (సత్కార్యములు, దైవకార్యములు)

59. వివేకవంతుడు కర్మలను ఎందుకు చేయవలెను?

=లోక క్షేమం కొరకు.

60. ఆవులలో తాను ఏ ఆవునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= కామధేనువు.

61. స్వధర్మ, పరధర్మములలో ఏది శ్రేష్ఠమైనది?

=స్వధర్మము.

62. పొగచేత అగ్నియు, మురికిచేత అద్దము, మావిచేత గర్భమందలి శిశువు కప్పబడి వున్నట్లు ఆత్మజ్ఞానము దేనిచే కప్పబడియుండును?

=కామము చేత.

63. దేని ప్రేరణచే జీవుడు తాను వద్దనుకొన్ననూ పాపమును చేయుచున్నాడు?

= కామము యొక్క ప్రేరణచే.

64. భగవంతుడెపుడు అవతరించును?

=ధర్మము క్షీణించి, అధర్మము వృద్ధిపొందునపుడు.

65. అసురులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ప్రహ్లాదుడు.

66. గంధర్వులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= చిత్రరథుడు.

67. హృదయ శుద్ధి తద్వారా మోక్షము దేనివలన కలుగగలదు?

=జ్ఞానతపస్సు.

68. జ్ఞానప్రాప్తి వలన కలుగు ఫలితమేమిటి?

=పరమశాంతి.

69. ఆత్మధ్యానమును అభ్యసించుచున్న యోగి యొక్క మనస్సు దేనితో పోల్చవచ్చు?

=గాలిలేనిచోట గల దీపంతో.

70. ఏ సాధనములచేత మనస్సు నిగ్రహింపబడగలదు?

=అభ్యాసము, వైరాగ్యము.

71. భయంకరమైన మాయను దాటుట ఎట్లు?

=భగవంతుని శరణుపొందుట వలన.

72. భగవంతుని సేవించువారిని ఎన్నిరకములుగా శ్రీకృష్ణుడు వర్గీకరించెను?

=నాలుగు రకాలు (ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని.)

73. భగవత్స్వరూపమును ఎవరు తెలిసికొనలేరు?

=అజ్ఞానులు.

74. విద్యలలోకెల్లా శ్రేష్ఠమైనది, అతిరహస్యమైనది ఏది?

=బ్రహ్మవిద్య.

75. మహర్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= భృగు మహర్షి.

76. బ్రహ్మవిద్యకు అర్హత యేమి?

=హృదయ శుద్ధి, అసూయాది దుర్గుణరాహిత్యము.

77. ఆకాశమునందు వాయువు వలె, సమస్త ప్రాణికోటి ఎక్కడ స్థితిగలిగి యున్నది?

=పరమాత్మయందు.

78. గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడెట్లు కాగలడు?

=పరమాత్మయందు అనన్యభక్తిచే.

79. ఎప్పటికీ దుర్గతి పొందనది ఎవరు?

=భగవంతుని భక్తుడు.

80. సమస్త ప్రాణికోటి యొక్క హృదయాంతరాళములందు నివసించు ప్రత్యగాత్మ ఎవరు?

=సాక్షాత్తు పరమాత్మయే.

81. ఇంద్రియములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=మనస్సు.

82. పర్వతములలో తాను ఏ పర్వతమని శ్రీకృష్ణుడు చెప్పెను?

=మేరువు.

83. పురోహితులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=బృహస్పతి.

84. వాక్కులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=ఓం కారము.

85. యజ్ఞములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు నుడివెను?

=జప యజ్ఞము.

86. ఏనుగులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ఐరావతము.

87. గుర్రములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ఉచ్ఛైశ్శ్రవసము.

88. శ్రీకృష్ణ భగవానునిచే ఆహారము ఎన్ని రకమలుగా పేర్కొనబడెను?

= మూడు (సాత్విక, రాజస, తామసాహారము)

89. దేవఋషులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= నారదుడు.

90. సిద్ధులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=కపిల మునీంద్రుడు.

91. భగవద్గీత చివరి అధ్యాయము పేరేమిటి?

= మోక్షసన్యాస యోగము.

92. లెక్కపెట్టువారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= కాలము.

93. జలచరాలలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= మొసలి.

94. ఆత్మను దేహమునందు ఉంచుటకు కారణమైన మూడు గుణములేవి?

= సత్త్వ, రజ, తమో గుణములు.

95. వేగముగా సంచరిస్తూ పవిత్రమొనర్చు వారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వాయువు.

96. భక్తియోగమైన పన్నెండవ అధ్యాయంలో భక్తుని లక్షణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?

= 35.

97. విద్యలోల తాను ఏ విద్యనని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ఆధ్యాత్మ విద్య.

98. రాగద్వేష రహితముగా, తత్త్వ నిశ్చయము కొరకు వాదించువారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వాదము.

99. అక్షరములలో తాను ఏ అక్షరమని శ్రీకృష్ణుడు చెప్పెను?

= "అ"-కారము.

100. భగవంతుని విశ్వరూప సందర్శనమును ఎవరు మాత్రమే చూసెను?

= అర్జునుడు. (వ్యాసుడు, వ్యాసుని వరం వలన సంజయుడు, రథ ధ్వజంపై అదృశ్యరూపంలో వున్న హనుమంతుడు కూడా)

101. మాసములలో తాను ఏ మాసమునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= మార్గశిరము.

102. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగమైన 13వ అధ్యాయములో జ్ఞానగుణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?

= 20 (ఇరువది).

103. శ్రీకృష్ణ భగవానునిచే దైవగుణములు ఎన్ని పేర్కొనబడెను?

= 26 (ఇరువదియాఱు).

104. శ్రీకృష్ణ భగవానునిచే అసుర గుణములు ఎన్ని పేర్కొనబడెను?

= 6 (ఆఱు).

105. తపస్సులెన్ని రకములు?

= మూడు (శారీరక, వాచిక, మానసిక)

106. పరబ్రహ్మమునకు ఎన్నిపేర్లు కలవు?

= మూడు (ఓమ్, తత్, సత్).

107. మోక్షమును పొందుటకు కర్మలను వదలవలెనా?

= లేదు. కర్మలు చేయునపుడు భగవంతుని యందు మనస్సు లగ్నమై వుండవలెను.

108. సంజయుడు ఎవరి అనుగ్రహముచే ఈ గీతాసంవాదమును నేరుగా (లైవ్) వినగలిగెను?

వేదవ్యాసుడు.


Wednesday, September 23, 2020

చతుఃషష్టి ఉపచారాలు

ఒకసారి శ్రీశంకరాచార్యులవారికి లలిత అమ్మవారు 64 కళలతో, 64 యోగినీ దేవతలు చతుఃషష్టి ఉపచారాలు చేస్తూ ఉన్న రూపంతో, దర్శనమిచ్చినపుడు ఆ ఆనందపారవశ్యములో ఆశువుగా రచించిన స్తోత్రంలో అమ్మవారికే అధికారం ఉన్న చతుఃషష్టి ఉపచారాలను ఈ విధంగా వివరించారు. అవి...

1. అర్ఘ్యం,పాద్యం,ఆచమనీయం – 

అమ్మవారి కాళ్ళు, చేతులు జలముతో కడిగి, 

త్రాగుటకు జలము సమర్పించడం


2. అభరణ అవరోపణం – 

ముందురోజు వేసియున్న ఆభరాణాలు తీయడం


3. సుగంధ తైలాభ్యంజనం – 

వంటికి నూనె పట్టించడం


4. మజ్జనశాలా ప్రవేశము – 

స్నానాల గదికి తీసుకొని వెళ్ళడం


5. మణిపీఠోపవేశనం – 

మణులతో అలంకరించిన పీఠముపై కూర్చోపెట్టడం


6. దివ్యస్నానీయ ఉద్వర్తనం – 

నలుగు పెట్టుట


7. ఉష్ణోదక స్నానము – 

వేడి నీటితో స్నానము చేయించుట


8. కనక కలశచ్యుత సకల తీర్థాభిషేచనం – బంగారుకలశలలో పవిత్రనదులనుండి తీసుకువచ్చిన సకల పవిత్ర తీర్థములతో అభిషేకము


9. ధౌతవస్త్ర పరిమార్జనం – 

పొడిగుడ్డతో శుభ్రంగా తుడవడం


10. అరుణ దుకూల పరిధానం – 

ఎర్రని వస్త్రము ధరింపజేయడం


11. అరుణకుచోత్తరీయం – 

ఎర్రని ఉత్తరీయమును (జాకెట్టు) ధరింపజేయడం


12. ఆలేపన మంటప ప్రవేశనం – 

అత్తరు మొదలైన అలేపనలు పూసే గృహానికి 

అమ్మవారిని తీసుకొని వెళ్ళడం అక్కడ మళ్ళీ మణిపీఠముపై కూర్చోపెట్టడం


13. చందన అగరు కుంకుమ సంకు మృగమద కర్పూర కస్తూరీ గోరోజనాది దివ్య గంధ సర్వాంగీణ ఆలేపనం – వివిధ దివ్య గంధములను అమ్మవారికి అలదింపజేయడం


14. కేశాభరస్య కలాదుల అగరు ధూపం – 

కేశములు విస్తారపరచి సుగంధధూపం వేయడం


15. జడవేసి, మల్లికా మాలతీ చంపక అశోక శతపత్ర పూగ క్రముక మంజరీ పున్నాగ కల్హార ముఖ్య సర్వ ఋతు కుసుమమాల సంప్రయం - 

వివిధఋతువులలో పూచిన సుగంధ పుష్పములతో అల్లిన మాలతో అమ్మవారిని అలంకరించడం


16. భూషణమండప ప్రవేశము – 

అలంకార గది ప్రవేశము


17. మణిపీఠోపవేశనము - 

అక్కడమళ్ళీ మణిపీఠం పై కూర్చోపెట్టడము


18. నవమణిమకుట ధారణ – 

తొమ్మిది రకాల మణులతో కూర్చిన కిరీటం పెట్టడం


19. దానిపైన చంద్ర శకలం పెట్టడం


20. సీమంతంలో సింధూరాన్ని దిద్దడం


21. తిలక ధారణము – 

నుదుటిపై తిలకంతో బొట్టు పెట్టడం


22. కాలాంజనం దిద్దడం – 

అమ్మవారి కళ్ళకు కాటుక పెట్టడం


23. పాళీయగళం – 

అమ్మవారికి చెంప స్వరాలు (మావటీలు) అలంకారం చేయడం


24. మణికుండళయుగళం - 

మణికుండలములు రెండు చెవులకు అలంకరించడం


25. నాసాభరణం – 

ముక్కుకి నాసాభరణం అలంకరించడం


26. అధరయావక లేపనం – 

పెదవులకు పూసే లత్తుక పూయడం


27. ఆర్య భూషణం - 

ప్రధాన భూషణం అలంకరించడము


28. మాంగల్య సూత్రము – 

మాంగల్య సూత్రమును అలంకరించుట


29. హేమచింతాకం – 

బంగారుతో కూడిన చింతామణులమాల వేయడం


30. పతకం – బంగారు పతకం


31. మహాపతకం – పెద్దదిగా ఉన్న బంగారు పతకం


32. ముక్తావళి – మూడు వరుసల ముత్యాలహారం


33. ఏకావళి – 

27 ముత్యాలతో కూడిన ఒక వరుస ముత్యాలహారం


34. చన్నభీరము – 

యజ్ఞోపవితం లాగ భుజములమీదనుండి వేసే 

ఒక ఆభరణము


35. కేయూర యుగళ భూషణ చతుష్టయము – 

నాలుగు చేతులకు నాలుగు కేయీరములు 

( దండ కడియాలు)


36. వలయావళి – నాలుగు చేతులకు కంకణములు


37. ఊర్మికావళి – నాలుగు చేతులకు ఉంగరములు


38. కాంచీధామము – 

వడ్డాణము అని పెలువబడే నడుము చుట్టూ అలంకరించే ఆభరణము


39. కటిసూత్రము – 

వడ్డాణానికి చుట్టూ మువ్వలతో ఉండే సూత్రము


40. సౌభాగ్యాభరణం – 

అశోకచెట్టు ఆకులాగ ఉండే ఒక ఆభరణం (కుత్తిగంటు) 


41. పాదకటకం – కాలి అందెలు


42. రత్ననూపురములు – 

దానిచుట్టూ మువ్వల రత్ననూపురములు


43. పాదంగుళీయములు - మట్టెలు


44. పాశం – పైన ఉన్న కుడి చేతిలో తాడు


45. అంకుశం – పైన ఉన్న ఎడమ చేతిలో అంకుశం


46. పుండ్రేక్షు చాపము – 

క్రింద ఉన్నకుడి చేతిలో చెరుకువిల్లు 


47. పుష్పబాణములు – 

కింద ఉన్న ఎడమ చేతిలో పుష్పములతో చేసిన బాణములు


48. శ్రీ మణి మాణిక్య పాదుక – 

ఎర్రని మణులతో ప్రకాశించే పాదుకలు


49. స్వ సామన వేషభి ఆవరణ దేవతాభి సహ మహాచక్రాథిరోహణము – 

సర్వాలంకాణలతో ఉన్న ఆవరణదేవతలతో కూడిన మహాసింహాసనముపై అమ్మవారిని అధిష్టింపజేయడం


50. కామేశ్వరాంగ పర్యాంక ఉపవేశము – 

అమ్మవారిని కామేశ్వరుని పర్యంకముపై కూర్చొండబెట్టుట


51. అమృతచషకము – 

అమ్మవారికి త్రాగుటకు పాత్రతో మధువును అందించుట


52. ఆచమనీయము – జలమునందించుట


53. కర్పూరవీటిక – కర్పూర తాంబూలము నందించుట 


54. ఆనందోల్లాస విలాస హాసము – 

అమ్మవారు తాంబూలం సేవిస్తూ ఆమె సంతసము, అనుగ్రహము తో కూడిన చేసే మందహాసము


55. మంగళార్తికం – 

దీపముల గుత్తి ని అమ్మవారి చుట్టూ తిప్పడం


56. ఛత్రము – అమ్మవారికి గొడుగు పట్టుట


57. చామరము – అమ్మవారికి చామరము వీచుట


58. దర్పణమ్ – అమ్మవారికి దర్పణం చూపించుట


59. తాళావృతం – అమ్మవారికి విసనకర్రతో విసురుట


60. చందనం – గంధం పమర్పించుట


61. పుష్పం – పుష్పాలను సమర్పించుట


62. ధూపము – సువాసనభరితమైన ధూపమును వేయుట


63. దీపము – దీప దర్శనము చేయించుట


64. నైవేద్య,తాంబూల,నీరాజన నమస్కారములు – నవరసభరితమైన నైవేద్యమును సమర్పించుట, తరువాత తాంబూల నీరాజనాది సత్కారములతో నమస్కరించుట

ఏకాంతము..!!

దశావతార నృసింహ మంత్రము

ఓం క్ష్రౌం నమోభగవతే నరసింహాయ |

ఓం క్ష్రౌం మత్స్యరూపాయ నమః |

ఓం క్ష్రౌం కూర్మరూపాయ నమః |

ఓం క్ష్రౌం వరాహరూపాయ నమః |

ఓం క్ష్రౌం నృసింహరూపాయ నమః |

ఓం క్ష్రౌం వామనరూపాయ నమః |

ఓం క్ష్రౌం పరశురామాయ నమః |

ఓం క్ష్రౌం రామాయ నమః |

ఓం క్ష్రౌం బలరామాయ నమః |

ఓం క్ష్రౌం కృష్ణాయ నమః |

ఓం క్ష్రౌం కల్కినే నమః జయజయజయ సాలగ్రామ నివాసినే నమః |

దివ్యసింహాయ నమః |

స్వయంభువే పురుషాయ నమః |

ఓం క్ష్రౌం ||


ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి

వ్యక్తి నిరంతరం తాను ‘ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి’కి చేరడమే అభ్యున్నతి. అదే జీవన సాఫల్యం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే..

🔸 అతినిద్ర

🔸 బద్ధకం

🔸 భయం

🔸 క్రోధం

🔸 అలసత్వం

🔸 ఎడతెగని ఆలోచన

...అనే ఈ ఆరుదోషాలను జయించినప్పుడే లక్ష్యాన్ని చేరగలుగుతాడని భారతం చెబుతోంది. భారతంలోని ఉద్యోగ పర్వంలో విదురుడు చెప్పిన మాటలివి. 

నిజానికి జీవితం మన భావోద్వేగాలకు అనుకూలంగా నిర్మించబడిలేదు. మన భావోద్వేగాలూ జీవితాన్నీ మార్చలేవు. ప్రతి ప్రయాణం గమ్యాన్ని చేరుస్తుందని చెప్పలేం. కానీ, ప్రయాణించిన దూరం గమ్యాన్ని దగ్గరగా చేస్తుంది. అనుకున్నది జరగడం, జరగకపోవడం సంభవమే. విజయంలో పొంగిపోతే అహంకారం పలకరిస్తుంది. అపజయంలో క్రుంగిపోతే ఆత్మన్యూనత వరిస్తుంది. మన ఉన్నతికి విఘాతం కలిగించే దోషాలను వదిలివేయడం, లోపాలను సవరించుకుంటూ, ముందుకు సాగడం వల్ల పరిణతి ఉన్నతి లభిస్తాయి. 

💫ఈ క్రమంలో పైన చెప్పిన ఆరు దోషాలను విశ్లేషించుకుంటే..

✨నిద్రలో శరీరం విశ్రాంతమౌతుంది. ప్రాకృతిక శక్తి మనలోకి ప్రవేశించి శక్తిమంతులను చేస్తుంది. కానీ.. అతినిద్ర లేదా నిద్ర లేమి వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యమే మహాబాగ్యం. అది చెడిపోతే అన్నీ పోయినట్లే. 

✨రెండో లక్షణం బద్ధకం. ఇష్టమయిన దాని కోసం అవసరమైన దానిని వదిలివేయడం బద్ధకం. దానివల్ల వాయిదా వేసే జబ్బు కలిగి, సమయానికి ఏ పనీ పూర్తిచేయలేం. 

✨అనుకోని పరిస్థితులు ఎదురైతే వాటిని అనుమోదించలేని సమయంలో కలిగేది భయం. భయం వల్ల ఏ పనిని సంకల్పించినా.. ‘‘ఇది నాకు సాధ్యపడుతుందా.. అపహాస్యం పాలవుతానేమో... అపజయం కలుగుతుందా’’ అనే అనుమానాలు వెన్నాడుతూ ఉంటాయి. అనుమానాల వల్ల ఉత్సాహం తగ్గుతుంది, ధైర్య సాహసాలు సన్నగిల్లుతాయి. బుద్ధి పనిచేయదు, శక్తి సామర్థ్యాలు మందగిస్తాయి. ప్రయత్నం మధ్యలోనే విడిచిపెడతాం. 

✨ఇక.. క్రోధం అన్ని అనర్థాలకూ మూలకారణం. పరిస్థితులు మనం అనుకున్నట్లుగా లేనప్పుడు కోపం వస్తుంది. కోపం మనలోని భావోద్వేగానికి సంకేతం. కోపం దీర్ఘమైతే క్రోధంగా మారుతుంది. క్రోధం వల్ల మోహం కలుగుతుంది. మోహం వల్ల స్మృతి తపుఁతుంది. దాని వల్ల బుద్ధి సరిగా పనిచేయదు.

✨అలసత్వం వల్ల విద్య దక్కదు. విద్య లేనివానికి ధనం లేదు, ధనం లేక మిత్రులు ఉండరు, మిత్రులు లేకపోతే సుఖమూ ఉండదు. 

అలాగే.. 

✨ఎడతెగని ఆలోచనల వల్ల కార్యరంగంలోకి దిగడం కుదరదు. ఈ ఆలోచనలు ప్రతిబంధకాల వైపు మాత్రమే నడిపిస్తాయి. ప్రణాళికలు రూపొందాలంటే ఆలోచనలు అవసరమే కానీ, అవి ఆచరింపబడితేనే విజయం. ఇలా ఈ ఆరు దోషపు అలవాట్లను వదిలితేనే అభ్యున్నతి.👏

ఓం శాంతి

Monday, September 21, 2020

శ్రీ గణేశ షోడశ రత్నమాలికా స్తోత్రం

 1) నమో భగవతే గణేశ్వరాయ ప్రమథగణాధిపసర్వేశ్వరాయ 

   వేదవేదాంగవేద్యశూర్పకర్ణాయ భక్తపరిపాలమూషికవాహనాయ ||

2) నమో భగవతే గణేశ్వరాయ ఉమాశంకరప్రియనందనాయ 

   గురుగుహప్రియాగ్రజాయ బీజాపూరగదేక్షుకార్ముకాయ ||

3) నమో భగవతే గణేశ్వరాయ ముద్గలాదిమునీంద్రపూజితపల్లవపదాయ

   లడ్డూకమోదకకపనసఫలప్రియాయ బ్రహ్మానందరససాగరాయ ||

4) నమో భగవతే గణేశ్వరాయ నాట్యవిద్యాప్రవీణాయ 

   గంభీరాలోచనామగ్నాయ గంధర్వగానప్రియాయ ||

5) నమో భగవతే గణేశ్వరాయ సమ్యక్పరిశీలనాశక్తిప్రదాయ  

  ధర్మానుష్ఠానతత్పరప్రియాయ మృదుమంజీరపదాబ్జాయ || 

6) నమో భగవతే గణేశ్వరాయ ఆదిపూజ్యపాత్రనిగ్రహవిగ్రహాయ 

   బ్రహ్మేంద్రాదిసురబృందసేవితాయ శశాంకమదగర్వభంజనాయ ||

7) నమో భగవతే గణేశ్వరాయ నాగయజ్ఞసూత్రధరాయ 

   భక్తమానససరోవరవిహారాయ గంధకుంకుమసింధూరచర్చితాంగాయ ||

8) నమో భగవతే గణేశ్వరాయ చతుర్దశభువనైకరక్షకాయ 

   మూలాధారస్థితశక్తిస్వరూపాయ స్వర్ణాకర్షణభవ్యస్వరూపాయ ||

9) నమో భగవతే గణేశ్వరాయ గద్యపద్యకావ్యనాటకప్రియాయ

   మానవజీవనమార్గనిర్దేశకాయ శుభఫలప్రదాయకవక్రతుండాయ ||

10) నమో భగవతే గణేశ్వరాయ సకలదుఃస్స్వప్నవినాశకాయ  

    విఘ్నయంత్రనిరంజనభంజనాయ కవిబృందవంద్యజ్యేష్థరాజాయ ||

11) నమో భగవతే గణేశ్వరాయ మకరకుండలధరతేజోమయాయ

    శశాంకచూడదివ్యగౌరవర్ణాయ  సకలాభరణభూషితలంబోదరాయ ||

12) నమో భగవతే గణేశ్వరాయ ప్రసిద్ధనదీజలాభిషేకాసక్తాయ

    రవిశశాంకపావకతేజోమయాయ మయూఖసింహవాహనారూఢాయ ||

13) నమో భగవతే గణేశ్వరాయ ఏకవింశతిపత్రపూజ్యప్రియాయ 

    భాద్రపదచతుర్థీఆవిర్భవాయ సృష్టిస్థిత్యంతకారణాయ ||

14) నమో భగవతే గణేశ్వరాయ కమలాలయతటనివాసాయ 

    భవజలధితారణకారణాయ గంబీజాత్మకదైవతాయ ||

15) నమో భగవతే గణేశ్వరాయ శ్రీకృష్ణబలరామార్చితాయ 

    సకలవాద్యవిద్యాజ్ఞానప్రదాయ దశదిశాంతవిస్తారవిభవవైభవాయ ||

16) నమో భగవతే గణేశ్వరాయ రాగద్వేషాదివివర్జితనిర్మలమానసాయ 

    రక్తవర్ణాంబరధరరక్తమాలాసుపూజితాయ సర్వభూతాంతరస్థవైశ్వానరాయ ||

      సర్వం శ్రీగణేశదివ్యచరణారవిందార్పణమస్తు

అధిక మాసం

మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఈ శార్వరి నామ సంవత్సరంలో అధిక మాసం వచ్చింది. అయితే ఈ అధిక మాసంలో ఏ విధమైన శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఈ అధిక మాసం 2020 సంవత్సరంలో సెప్టెంబర్ 18వ తేదీన వచ్చింది.

అయితే ఈ సమయంలో దేవుళ్ల పూజలకు సంబంధించిన కార్యక్రమాలను మాత్రం కచ్చితంగా చేయాలంట. ఎందుకంటే శుభకార్యాలు వేరు. దేవతల పూజలు వేరు. ఈ అధిక మాసంలో సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది.

ఈ అధిక మాసంలోని 30 రోజులలోని ఏడు రోజులలో ప్రత్యేకించి పౌర్ణమికి ముందుగా భాగవతాన్ని పారాయణం చేయాలి లేదా భాగవతం పారాయణం చేసే పండితులకు ఆ గ్రంధాన్ని అందజేయాలి. భాగవతంలోని దశమ స్కందంలోని క్రిష్ణునికి సంబంధించిన కథనాలను పారాయణం చేస్తే విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

ఇలాంటి అవకాశం ప్రతి సంవత్సరం రాదు. ఈ అధిక మాసం ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే గొప్ప అవకాశం. కాబట్టి ఇలాంటి సువర్ణాకాశాన్ని వినియోగించుకోవాలని చెబుతున్నారు. దక్షిణ భారతదేశంలోని మన తెలుగు రాష్ట్రాల ప్రజలు చాంద్రమానాన్ని పాటిస్తే.. తమిళనాట ఉండే ప్రజలు సౌరమానాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

అధికమాసం అంటే ?

చంద్రుని కదలికలను అనుగుణంగా ఉండే చాంద్రమానం కు, సూర్యుని కదలికలను అనుగుణంగా ఉండే సౌర మానంకు లెక్కల్లో కొన్ని తేడాలు వస్తుంటాయి. అందులో సౌరమానంలో సంవత్సరానికి కేవలం 360 రోజులు మాత్రమే వస్తాయి. అదే చాంద్రమానంలో 365 రోజులు వస్తాయి. ఇలాంటి తేడాలను సరిచేసి ఒకే లైనుపై తీసుకొచ్చే ప్రయత్నాన్ని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చేశారు. ఇలా రెండు మానాలను సర్దుబాటు చేసిన కాలాన్నే అధిక మాసం అంటారు.

ఎప్పుడైతే సంక్రమణం ఉండదో. ఈ మాసంలో పౌర్ణమి వచ్చినప్పటికీ, ఆ పౌర్ణమితో కూడుకున్నటువంటి విశేష గుణగణాలు కనిపించవని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో సంక్రమణం కూడా రాదు. అసంక్రాంతి, ద్విసంక్రాంతి వస్తుంది. ఏ మాసంలో అయితే సంక్రమణం ఉండదో ఆ మాసమే అధిక మాసం అని చెబుతున్నారు.

శుభకార్యాలు చేయకూడదు..

ఇలా సంక్రమణం లేని మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. వివాహ కార్యక్రమాలు, ఇంట్లోకి ప్రవేశించడం, ఉపనయనాల వంటివి చేయకూడదు.

దేవతలకు పూజలు..

అయితే ఈ మాసంలో సకల దేవతలకు పూజలు మాత్రం చేయొచ్చు. ఎందుకంటే ఇవి శుభకార్యాలు కాదు. ఈ అధిక మాసంలో పుణ్యకార్యాలైన సత్యనారాయణ వ్రతం, దేవుళ్లకు అభిషేకాలు, నవగ్రహ హోమాలు, నవగ్రహ జపాలు, శాంతి పూజలు ప్రత్యేకించి భాగవత పారాయణం, రామాయణ పారాయణం, ఆంజనేయస్వామికి సంబంధించి హనుమాన్ చాలీసా వంటివి కచ్చితంగా చేయాలి.

ఈ నెలలో పుణ్యకార్యాలు చేస్తే..

ఈ నెల మొత్తం ఒక నియమం పెట్టుకోవాలి. నిత్యం ఇష్టదైవాన్ని తలచుకుని ద్యానం చేయడం లేదా జపం చేయడం వంటివి చేస్తే ఎన్నో రెట్ల పుణ్యఫలం వస్తుంది. ఉదాహరణకు మిగిలిన మాసాల్లో ఒకసారి రామ అంటే, ఒక్కసారే ఫలితం వస్తుంది. అయితే ఈ అధిక మాసంలో అంటే మాత్రం కోటి రెట్ల ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.

పురుషోత్తమ మాసం..

ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసంగా కూడా పిలుస్తారు. ఉత్తమ పురుషగా అందరి జీవులలో ఉండేవాడు.. సర్వజీవులలో ఆత్మస్వరూపుడిగా ఉండే వాడు పరమాత్ముడు. ఆ విధంగా పరమాత్ముడిని దర్శించడానికి, అందుకు ప్రాతిపదికగా తనలో ఉన్న ఆత్మను దర్శించడానికి ఈ సమయం చాలా అనుకూలమైనది.

జపం, జపమాలలు - ఫలితాలు

జపతపాలతో భగవంతుడిని ఆరాధించడం వల్ల మానవుడు ఆయన మనసును తొందరగా గెలుచుకోవచ్చునని పురాణాలు చెబుతున్నాయి. అన్ని యజ్ఞాలకన్నా 'జపయజ్ఞం' గొప్పదని మనుస్మృతి చెబుతోంది. జపంలోని ‘జా – జన్మవిఛ్చేదనం చేసేది. ‘పా అంటె పాపాన్ని నశింపచేసేదని అర్థం. యోగానికి జపం ఒక ముఖ్యాంశం. అందువల్లే భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మడు.. అర్జునిడితో, ‘యజ్ఞానాం జప యజ్ఞోస్మీ అని చెబుతాడు. అంటే.. యజ్ఞాలన్నింటిలో తాను జపయజ్ఞాన్ని.. అని చెబుతాడు. జపం చేస్తున్నప్పుడు భగవన్నామాన్ని లేక కొన్ని మంత్రాలనుగానీ పఠించడం జరుగుతుంది. మనసు అనేక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు, జపం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

మనోభీష్టం నెరవేరేందుకు జపం చేసుకోవాల్సిందే. జపమాలలోను 108 పూసలు వుంటాయి. ఇది విశేషమైన సంఖ్యగా చెబుతుంటారు. ప్రతినిత్యం ఈ సంఖ్య ప్రకారం భగవంతుడి నామాన్ని స్మరించడం వలన అనంతమైన ఫలితాలు కలుగుతాయి. భగవంతుడి దివ్యమైన నామాన్ని 108 సార్లు జపించినట్టు తెలియడానికిగాను అందరూ జపమాలలు వాడుతుంటారు.

జపమాలలు 3 రకాలు

1. కరమాల

అనామిక మధ్య కణుపు నుంచి ప్రారంభించి కనిష్టాదిగా తర్జనీమూలం వరకు గల 10 కణుపులలో ప్రదిక్షిణంగా జపించితే కరమాలతో జపించినట్లవుతుంది.

2. అక్షమాల

‘ఆ నుంచి ‘క్షా వరకు గల 54 అక్షరాలతో జపించడమే అక్షమాల. ‘ఆ అనంతఫలితాన్ని కలిగిస్తుండగా  ’క్షా కల్మషాలను తొలగిస్తుంది.

3. మణిమాలలు

రుద్రాక్షలు, ముత్యాలు, స్పటికాలు, శంఖాలు, పగడాలు, సువర్ణమాలలు, రజితమాలలు తులసిపూసలు, కుశదర్భమాలలు, పద్మబీజాలు, పుత్రజీవాలు ఉపయోగించి చేయబడిన మాలలను మణిమాలలని అంటారు.

ఫలితములు

రేఖాజపం దశగుణాన్ని, శంఖమాలజపం శతగుణాన్ని, పగడాలమాల జపం సహస్రగుణాన్ని, స్ఫటికమాల జపం దశసహస్రగుణాన్ని, ముత్యపు మాల జపం లక్ష గుణాన్ని, తామరపూసల మాలాజపం దశ లక్షగుణాన్ని, బంగారుమాల జపం కోటి గుణాన్ని, తులసిమాల జపం అనంతకోటి గుణాన్ని, రుద్రాక్షమాల జపం అనంతఫలితాన్ని ఇస్తుంటాయి. పగడాల మాలలతో జపం చేయడం వలన ఐశ్వర్య వృద్ధి, ముత్యపు మాలతో జపం చేస్తే సర్వమంగళం, తులసి మాలతో చేస్తే సమస్తమైన ఫలాలు, రుద్రాక్షమాలతో జపం చేస్తే ఆత్మజ్ఞానం కలిగి మోక్షం కలుగుతుంది.

జపం 3 విధాలుగా ఉంటుంది

1. వాచింకం

మంత్రబీజాక్షరాలను తన చుట్టూ ఉన్నవారికి వినిపించేటట్లు పలుకుతూ జపం చేయడం వాచికం అనబడుతుంది.

2. ఉపాంశువు

తనకు అత్యంత సమీపంలో ఉన్నవారికి మాత్రమే వినిపించేటట్లు పెదవులను కదుపుతూ జపం చేయడం ఉపాంశువు అని పిలువబడుతుంది.

3. మానసికం

మనస్సులోనే మంత్రాన్ని జపించడం.

వాచిక జపం కంటే ఉపాంశు జపం 100 రేట్లు ఫలితాన్ని కలిగిస్తూ ఉండగా, ఉపాంశుజపం కంటే మానసిక జపం 1000 రేట్లు ఫలితాన్ని కలిగిస్తుంటుంది. అయితే, జపం చేసేటప్పుడు అక్షరం, అక్షరం విడివిడిగా వల్లించుకుంటూ జపం చేయకూడదు. అలాగని మరింత వేగంగా కూడా చేయకూడదు. మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించాలి. జపంలో ఉఛ్చారణ చేస్తున్నప్పుడు బీజాక్షరాలు లోపించకూడదు. జపానికి ముందుగానీ, తరువాత గానీ ఇష్ట దేవతా పూజ తప్పకుండా చేయాలి. పూజ చేయని జపం ఫలితాన్ని ఇవ్వదని శాస్త్రం చెబుతోంది. జపం చేసేందుకై కొంతమంది భక్తులు జపమాలలను ఉపయోగిస్తుంటారు.

ఎలా చేయాలి..?

తూర్పుముఖంగా కానీ, ఉత్తరముఖంగా కాని కూర్చుని జపం చేయాలి. జపం చేయడానికి కాలం గురించి పట్టింపులేదు. జపం చేసే ముందు జపమాలను నీటిలో శుభ్ర పరచి, అనంతరం పంచగవ్యాలతో శుభ్రపరచి, అనంతరం మంచి గంధంతో శుభ్రపరచాలి. ఏ మంత్రాన్ని జపించేందుకు ఆ మాలను ఉపయోగించదలచుకున్నారో, ఆ మంత్రంతోనే ఆ జపమాలను పూజించాలి. ఆ తరువాత జపమాలకు ఈ క్రింది ధ్యానాన్ని చేసి ధూపం వేయాలి.

త్వం మాలే సదేవతా నాం సర్వసిద్ధి ప్రదాయతా

తేన సత్యేన మేసిద్ధిం మాతర్దేహి నమోస్తుతే

అనంతరం పద్మాసనంలో కూర్చుని, జపమాలను కుడిచేతిలో ఉంచుకుని, మధ్య, అనామిక, కనిష్ఠ వేళ్ళపై ఉంచి, చేతి బోటని వేలితో, మధ్య వేలిపై నొక్కి జపమాలను తిప్పాలి. జపమాలను ఇతరులు చూడకూడదు. కాబట్టి ఒక గుడ్డ సంచిలో పెట్టి జపం చేయాలి. వెదురు కర్రల మీద జపం చేస్తే దారిద్ర్యం, రాతిమీద రోగం, నేలమీద దు:ఖం, గడ్దిపరకలమీద యశస్సు తగ్గడం, చిగుళ్ళు పరచిన ఆసనం మీద మనస్సు చంచలంగా ఉండడం, కృష్ణాజినం మీద జ్ఞానం కలుగుతుంది. కృష్ణాజినం వేదస్వరూపమేనని వేదంలో ఉంది. దేవతలు యజ్ఞం చేస్తూ ఉండగా ౠక్కు, సామవేదాలు లేడిరూపం ధరించి ప్రక్కకు తప్పుకొన్నాయని, మళ్లీ దేవతలు ప్రార్థించగా తిరిగి వచ్చాయని, ౠగ్వేదం యొక్క వర్ణం తెలుపని, సామవేదం రంగు నలుపని, అవే పగలు రాత్రులని, ఆ రెంటి రంగులను విడిచి పెట్టి ఆ వేదాలు తిరిగి వచ్చాయని కనుక కృష్ణాజినం ౠక్, సామవేదములకు ప్రతినిధియని వేదంలోని కథ.

దీనిమీద కూర్చొని చేస్తే కుష్ఠు, క్షయ మొదలైన రోగాలు పోతాయని వేద వేత్తలు అంటుంటారు. ఓషధులసారమే దర్భలని అలాంటి ఆసనం మంచిదని వేదం, ముందు దర్భాసనం వేసుకొని, దానిమీద కృష్ణాజినం వేసుకొని, దానిమీద బట్టపరచి చేయాలని భగవద్గీత చెబుతోంది. ఇది యోగుల విషయమని గీతా వ్యాఖ్యానమైన శంకరానందీయంలో ఉంది.

గృహస్థులందు దర్భాసనం వేసుకొనిగాని, చిత్రాస

నం మీద గాని చేయవచ్చు. జపం చేయడానికి కాలనియమం లేదని, దీక్ష, హొమాలతో కూడా పనిలేదని బ్రహ్మోత్తర ఖండంలో ఉంది. అందరూ దీనికి అధికారులేనని అగస్త్యసంహితలో ఉంది. అలాగే జపమాలలో 108 లేక 54 లేక 27 పూసలు ఉంటుంటాయి. దీనివెనుక ఓ అర్థం ఉంది. మన శరీరంలో 72000 నాడులున్నాయి. వాటిలో హృదయానికి సంబంధించినవి 108. అందుకనే 108 జప సంఖ్యగా అమలులోకి వచ్చింది. మాలలో ఒక పెద్దపూసను మేరువు పూసగా ఉంచుకోవాలి. ఈ మేరువు పూస లెక్కలోకి రాదు. 

జపం చేసుకోవడానికిగాను తులసిమాల, స్పటికమాల, శంఖమాల, ముత్యాలమాల, రుద్రాక్షమాల, ఉపయోగిస్తూ వుంటారు. వీటిలో ఒక్కో జపమాల ఒక్కో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ నేపథ్యంలో 'పగడాల మాల' కూడా తనదైన ప్రత్యేకత ఏమిటంటే.. పగడాలు ధరించడం, పగడాల మాలతో జపం చేయడమనేది పూర్వకాలం నుంచీ ఉంది. పగడాల మాలతో జపం చేయడం వల్ల సంపదలు వృద్ధి చెందుతాయి.

జంబుద్వీపం అంటే ఏమిటి?

 జంబుద్వీపే భరతవర్షే భరతఖండే

సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు "జంబుద్వీపే భరతవర్షే భరతఖండే" అనేవి మనమందరం వినే ఉంటాము. మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం.

అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?

జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి:

1) కేతుముల వర్ష 

2) హరి వర్ష 

3) ఇలవ్రిత వర్ష 

4) కురు వర్ష 

5) హిరణ్యక వర్ష

6) రమ్యక వర్ష 

7) కింపురుష వర్ష 

8 ) భద్రస్వ వర్ష

పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) వైదిక సంస్కృతి/నాగరికత కు ఆత్మ వంటిది. పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదు.

ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు.

మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి.

దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం 5000 సంవత్సరాల క్రితమే పుట్టిందని, కురుక్షేత్రం కేవలం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేవారివి తప్పుడు ప్రచారాలు మరియు పచ్చి అబద్ధాలు. ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నపుడే వైదిక నాగరికత ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని !

మనల్ని దిగ్బ్రాంతికి గురిచేసే విషయం ఏమిటంటే మన ప్రభుత్వం ఇంకా మన పాఠ్య పుస్తకాలలో ఇటువంతి అబద్ధపు సిద్ధాంతాలను, భారత దేశానికి వ్యతిరేకంగా, భారత దేశాన్ని/భారతీయులను తక్కువచేసి చూపించే తప్పుడు చరిత్రను భోదిస్తుంది. మన ప్రభుత్వం దేశ యువతకు మన పూర్వికులు పామరులు/ఏమి తెలియని వాళ్ళు అని భోదిస్తుంది. దేశ భక్తులు కనుగొన్న నిజమైన చరిత్రను భోదించడం లేదు.

మన పాఠ్య పుస్తకాలలో మన ఋషుల గురించి పెట్టాలి అనే ప్రతిపాదన తెచ్చినపుడు విద్యావ్యవస్థను కాషాయమయం(Saffronisation) చేయొద్దని తిరస్కరించాయి. తమ సొంత దేశం యొక్క గొప్పతనాన్ని తిరస్కరించి మన పూర్వీకులను మనమే చిన్నచూపు చూసే దేశం ఎదైనా ఉంటుందా? ఏం మన ఋషులు భారతీయులు కాదా? వారి గురించి మన పాఠ్య పుస్తకాలలో ఎందుకు ఉండకూడదు?

ఇప్పటికైనా భారతీయులు మేలుకోవాలి. మనం ఎంత గొప్ప సంస్కృతికి వారసులమో గ్రహించి మన సంస్కృతిని కాపాడుటకు మనవంతు కృషి చేయాలి.

Thursday, September 17, 2020

తిధులు – వాటి ఫలితాలు

పాడ్యమి    –   మధ్యాహ్న సమయం తర్వాత జయమవుతాయి

విదియ     –   ఏ పని చేసిన సంతోషాన్ని ఇస్తుంది

తదియ     –   సౌక్యం, కార్యసిద్ధి

చవితి       –   మధ్యాహ్న సమయం తర్వాత జయమవుతాయి

పంచమి    –   ధన ప్రాప్తం, శుభయోగం

షష్టి          –   కలహం, రాత్రికి శుభం

సప్తమి      –    సౌఖ్యకరం

అష్టమి      -   కష్టం

నవమి      –    వ్యయ ప్రయాసలు

దశమి      –    విజయ ప్రాప్తి

ఏకదశి       –     సామాన్య ఫలితాలు

ద్వాదశి      –    భోజన సమయం అనంతరం జయం

త్రయోదశి    -     జయం

చతుర్దశి      -   రాత్రికి శుభం

పౌర్ణమి       –    సకల శుభకరం

అమావాస్య  -  సాయంత్రం నుంచి శుభకరం

షష్టి – శనివారం, సప్తమి – శుక్రవారం, అష్టమి – గురువారం, నవమి – బుధవారం,

దశమి – మంగళవారం, ఏకాదశి – సోమవారం, ద్వాదశి – ఆదివారం

ఇలా వచ్చిన ఏ విధమైన శుభకార్యాలు చేసుకోనరాదు. వీటిని దగ్ధయోగాలు అంటారు.

ఎన్ని రకముల తర్పణాలు ఉన్నాయో తెలుసుకుందామా ?

ఈరోజు చాలా విలువైన ఇటువంటి మెసేజ్ పెడుతున్నాను అందరమూ తెలుసుకుందాము ఎన్ని రకముల తర్పణాలు ఉన్నాయో తెలుసుకుందామా....

""తృప్తినిచ్చే అర్పణం తర్పణం "".....అంటారు.

1. తర్పణం అంటే ఏమిటి ?

పితృదేవతలకు తృప్తినిచ్చి, వారికి ఊర్ధ్వ లోకాలను ప్రాప్తించేలా చేయడమే తర్పణం. విధి విధానాలను బట్టి, సందర్భాన్ని బట్టి తర్పణం పలురకాలు.

2. తర్పణము ఎన్నిరకాలు ?

తర్పణము రెండు విధములుగా చేయ వచ్చును అవి సకామ లేక నిష్కామములు. సకామ తర్పణములో కొన్ని ప్రత్యేక ద్రవ్యముల ద్వారా తర్పణము చేస్తారు. నిష్కామ తర్పణము జలముతో చేయబడుతుంది. ఋగ్వేదులు, యజుర్వేదులు, సామ, అధర్వణ వేదాలను అనుసరించేవారు ఒక్కో రకమైన తర్పణ విధానాన్ని అవలంబిస్తారు.


ప్రధానంగా తర్పణాలు నాలుగు రకాలు.

1-గరుడ తర్పణం : -

ఎవరైనా పరమపదించిన రోజున చేసే తర్పణాన్ని గరుడ తర్పణం అంటారు.

2-బ్రహ్మ యజ్ఞ తర్పణం : -

నిత్యానుష్టానం లో భాగంగా విడిచే తర్పణాలు ఇవి.

3-పర్హెణి తర్పణం : -

యేటా చేసే పితృకర్మల తరువాతిరోజు ఇచ్చే తర్పణాలు.

4-సాధారణ తర్పణం : -

అమావాస్య రోజున, పుణ్యనదీ స్నానాలలో, పుష్కరాలలో, సంక్రమణ, గ్రహణ సమయాలలో విడిచే తర్పణాలు.

మన ఋషులు ఇటువంటి తర్పణాలను 96 పేర్కొన్నారు.


3. తర్పణాలు ఎందుకు వదులుతాము ?

తర్పణము చేయడము వలన దేవతలు శీఘ్రముగా సంతుష్టులౌతారు. లేదా వారిని సంతృప్తి పరచే విధిని తర్పణము అని అందురు. దేవతలను ప్రసన్నము చేసుకోనబడుటకు, వారిని ప్రీతీ చేయుట కొరకు ఈ తర్పణము వదల బడుతుంది.


4. ఏ తర్పణానికి ఎటువంటి ఫలితం ఉంటుంది ?

1. తేనె ద్వార తర్పణము చేయడము వలన అన్ని కోరికలు నెర వేరుతాయి, అన్ని పాతకములు నాశనము అవుతాయి.


2. కర్పూర జలముతో తర్పణము చేస్తే, రాజు వశ మౌతాడు .


3. పసుపు కలిపిన జలముతో తర్పణము చేస్తే, సామాన్య వ్యక్తి వశమౌతాడు.


4. ఆవు నేతితో తర్పణము చేస్తే, …….సుఖము


5. కొబ్బరి నీళ్ళతో తర్పణము చేస్తే, ……. సర్వ సిద్ధి


6. మిరియాలు కలిపిన జలముతో తర్పణము చేస్తే …….. శత్రు నాశనము


5. తర్పణం ఎలా వదలాలి ?

కల్పోక్త ప్రకారముగా సాధకుడు, స్నాన, పూజా, హోమ సమయము లందు ప్రతి రోజు దేవతల ప్రీతి కొరకు తర్పణము గావించవలయును. దేవతలకు వారి నామ మంత్రములు ఉచ్చరించుచు, దేవ తీర్ధము ద్వారా తర్పణము చేయ వలెను. వారి నామములకు “స్వాహా” చేర్చి తర్పణము లీయవలెను.


(అగ్ని పురాణము, బ్రహ్మ పురాణము, మంత్ర మహోదధి నుంచి సేకరించ బడినది)

మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?


మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.


 భాద్రపద బహుళపాడ్యమి నుంచి భాద్రపద అమవాస్య వరకు మధ్యనున్న పదిహేను రోజులు మహాలయ పక్షములు అంటారు. మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.


*పితృదేవతలకు.... ఆకలా...?*


అనే సందేహం కలుగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తోంది.


*అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః*


*యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞఃకర్మ సముద్భవః*


అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షం వలన అన్నం లభిస్తుంది. యజ్ఞం వలన వర్షం కురుస్తుంది. ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే... అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి. మేఘాలు వర్షించాలంటే... దేవతలు కరుణించాలి. దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని అడగొచ్చు.


మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వకర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద జీవాత్మగా అవతరించడానికి ... అన్నాన్ని ఆశ్రయించి , తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి , శుక్ల కణముగా రూపొంది , స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి , శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది.


మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే...


పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే మోక్షం అంటే. ఎవరికైనా ఇంతే..


*తద్దినాలు పెడుతున్నాం కదా... మహాలయ పక్షాలు పెట్టాలా?*


అనే సందేహం తిరిగి కలుగవచ్చు. మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతి ఏమి ? వారి గతి అధోగతేనా ? అంటే కాదు. అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్ళికాని సోదర , సోదరీలు మరణించి ఉండవచ్చు. లేదా పెళ్ళయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్న పిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ , శిక్షల ద్వారా కానీ , ఆత్మహత్యల ద్వారాకానీ , ప్రకృతి వైపరీత్యాల (భూకంపాలు , వరదలు)ద్వారా కాని గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటి వారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాల వారికి (తండ్రి , తాత , ముత్తాత) మాత్రమే తిలోదకాలతో పిండప్రదానం ఇవ్వబడుతుంది. కానీ ఈ మహాలయ పక్షాలు , పదిహేను రోజులు వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక , పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో , పిండప్రదానం ఇచ్చే అర్హత , అధికారం ఉంది. దీనినే *సర్వకారుణ్య తర్పణ విధి* అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి , తద్దినం , పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయం పెట్టడం వలన పోతుంది. పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ .... పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు.


*మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?*


సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు మహాలయం పెట్టడం ఉత్తమమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో మహాలయ అమావాస్యనాడు పెట్టడం ప్రశస్తం. దీనినే సర్వ పితృ అమావాస్య అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ... వారి వారి తిథులతో సంబంధం లేకుం 🕉️ శ్రీ గురుభ్యోనమః🙏డా మహాలయం పెట్టాలి.


క్రింది సంవత్సరం చనిపోయిన వారికి భరణి లేక భరణి పంచమి తిథులలో అనగా మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి.


భార్య మరణించిన వాడు అవిధవ నవమినాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి , పసుపు , కుంకుమ , గాజులు , పూవులు , చీర , పెట్టి సత్కరించి పంపాలి.


చిన్న పిల్లలు చనిపోతే... వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి. చిన్న పిల్లలు అంటే ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు. ఒకవేళ పది సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే... ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే మహాలయం పెట్టాలి.


ఇక ప్రమాదాలలో కానీ , ఉరిశిక్ష వల్ల కానీ , ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ఘట చతుర్థినాడు అనగా అమావాస్య ముందురోజున పెట్టాలి.


అవశ్యం తు యవానో2స్య ప్రమీయంతే నరా గృహే|

యుద్ధభాగీ భవేన్మర్త్యః కుర్వన్ శ్రాద్ధం చతుర్దశీమ్||


*చతుర్దశినాడు పెద్దలకు కామ్యశ్రాద్ధములు చేయరాదు. అంటే ఒకవ్యక్తి చతుర్దశినాడు చనిపోతే ప్రత్యాబ్దికము అనే ప్రతీ ఏడాదీ వచ్చే తద్దినమును మాత్రమే ఆరోజున చేయాలి. అది మినహా కామ్య, తీర్థ, వృద్ధి, మహాలయచతుర్దశి శ్రాద్ధములు చతుర్దశినాడు చేయరాదు. ఆవిధంగా చేస్తే కుమారనష్టం సంభవిస్తుందని వ్యాసభారతం చెబుతోంది.*


*కనుకనే ఎవరైనా చతుర్దశినాడు పోతే వారికి అపకర్షణ చేసి (అంటే ప్రీ పోన్మెంట్  చేసి) ముందుగా త్రయోదశినాడు, లేదా (పోస్ట్పోన్మెంట్ చేసి) అమావాస్య నాడు చేయాలని అంటారు. అంతేకాక చతుర్దశినాడు ప్రత్యాబ్దికేతరాన్ని చేస్తే స్వయంగా యుద్ధంలో పాల్గొంటారని కూడా  భారతంలో స్పష్టంగా భీష్ముడు చెప్పాడు.*



*చతుర్దశినాడు ఏం చేయాలి:*


*అది పరమేశ్వరునికే అంకితమైన తిథి. ఆ తిథి నాడు ప్రత్యాబ్దికం తప్ప మరే ఇతర అన్యదేవతలనూ అర్చించకూడదు. ఈ విధంగా కేవలం పరమేశ్వరుడికే ఒక తిథిని కేటాయించారు. మరెవ్వరికీ ఈ విధమైన ప్రాధాన్యత లేదు.  దేవాధిదేవుడు, వ్యక్తావ్యక్త పరమాత్మ అయిన ఆ ముక్కంటిని మాత్రమే చతుర్దశినాడు అర్చించాలి.*

 

*చతుర్దశినాడు ఎవరికీ చేయరాదా?:*


*ఎవరైతే అకాలమృత్యువు పొందారో, వారికి కూడా మృత్యుతిథినాడు పితృపక్షంలో  చేయరాదని ఒక ప్రమాణం.*


*అంటే ఆత్మహత్య కాకుండా కర్మాగారంలో, బస్సుల్లో, రైళ్ళలో  అగ్నిప్రమాదంలో చనిపోయినవారు, ప్రమాదంలో నీటిలో చనిపోయినవారు, ఎవరి చేతనైనా హత్యకు గురైనవారు, దొంగల చేతిలో చనిపోయినవారు, సామూహిక మారణహోమాల్లో చనిపోయినవారు, పాముకాటు, కొమ్ములపోటుతో, చిరుత వంటి క్రూరజంతువుల వలన చనిపోయినవారు, (వచ్చేఏడాది నుంచీ) కరోనా వల్ల చనిపోయినా  ..... ఇటువంటి ఆత్మహత్యేతర కారణాల వల్ల ఏ తిథినాడు  చనిపోయినా లేక హఠాత్తుగా చనిపోయిన వారికి కేవలం చతుర్దశీ తిథి నాడు మాత్రమే చేయాలి.*


*ఈ జాబితా చాలా పెద్దది. ఒకే సూత్రంవలన ఎవరు ఈ జాబితాలోకి వస్తారో తేలిగ్గా తెలుసుకోవచ్చు. ఎవరైతే వయసు పండిపోయి ముసలి వయసులో సహజ మరణం పొందుతారో వారు తప్ప మిగిలిన వారు అంతా ఈ జాబితా లోకి వస్తారు. అంటే ఎవరైతే తమ కులం, వంశం వారు జీవించే సగటు వయసు కన్నా చిన్న వయసులో అర్థాంతరంగా చనిపోతారో వారికి చతుర్దశి నాడు పెట్టాలి.* 


వారు చనిపోయిన తిథిలో చేయరాదు.


*ఆత్మహత్య చేసుకున్నవారికి కూడా అకస్మాత్తుగా చనిపోయినవారితో చేయవచ్చని కొన్ని  గరుడాది పురాణాలు చెబుతున్నాయి కనుక వారికి కూడా చతుర్దశి మంచిదే. పరమేశ్వరుని దయ కలుగాలని ప్రార్థించి వారికి కూడా చేయవచ్చు. నిజానికి ఆత్మహత్య చేసుకున్నవారికి పిండోదకార్హత లేదు.  అయితే వారికి మాని వేసినా ప్రమాదమే కనుక నోటితో లేదని చెప్పే బదులు చేతితో చేయడమే. ముట్టేది ముడుతుంది అనుకొని చేయవలసిందే.*


*అమావాస్య నాడు అందరికీ:*


*మహాలయ పక్షం ముందు పదిహేను రోజుల్లో వివిధ కారణాల వల్ల చేయలేకపోయిన వారు చివరాఖరి అవకాశంగా అమావాస్యనాడు చేయవచ్చు. సందేహములు కలవారు తమ ఇంటి బ్రాహ్మణుల సూచనల మేరకు చేయవచ్చు.*


*చనిపోయిన తిథి తెలియకపోతే అమావాస్య నాడు చేయాలి.*


*వీర మరణం పొందిన వారికి ద్వాదశినాడు లేదా అమావాస్యనాడు చేయాలి. నిజానికి  వీరమరణం ద్వారా ఎప్పుడో వీరు అతీతులు అయ్యారు. వారికి చేసినందువల్ల చేసినవారికి తల్లితండ్రులకు చేసినదాని కన్నా పుణ్యం లభిస్తుందని చేస్తారు. వారు వీరులు కనుక వారికి ఈ రెండురోజుల్లో మన కృతజ్ఞతగా చేయాలి. వీరులు అంటే సైనికులు, పోలీసులు, అగ్నిమాపక దళాలలో విధినిర్వహణలో చనిపోయినవారు, స్త్రీలు పిల్లలు వంటి వారి  ప్రాణాలు కాపాడబోతూ చనిపోయినవారు, ఆవులను, బ్రాహ్మణులను కాపాడబోతూ చనిపోయిన వారు. ఇటువంటి శాస్త్రసమ్మతమైన వీరత్వాలు ప్రదర్శించి అమరులైన వారు.*


*ఆత్మహత్యలు చేసుకున్నవారికి తప్ప పై జాబితాలో లేని వారికి అందరికీ అమావాస్య నాడు పిండప్రదాన తిలతర్పణాలు ఇవ్వాలి.*


*ఈ విధంగా త్రయోదశి, చతుర్దశి, అమావాస్య పితృపక్షాల్లో అతిముఖ్యమైన పర్వదినాలు.*


ఎవరు చేయాలి:


ఎవరైనా చేయవచ్చు.

కర్త చేయాలి. కర్త చేయలేకపోతే ఆ కులానికి చెందిన వారు ఎవరైనా కర్త బదులు చేయవచ్చు. చేసే వారు ఎవరూ లేకపోతే ఆడవారు కూడా చేయవచ్చు. పిల్లలు కూడా చేయవచ్చు. ముసలివారు చేయవచ్చు. అన్ని కూలాలవారూ చేయాలి. అన్ని మతాల వారూ చేయాలి. 


ఏం చేయాలి?:


తమ కులాచారాల ప్రకారం పెద్దలను అర్చించాలి. అందరూ ఒకేలా ఇలాగే చేయాలని లేదు. ఎవరి కులాచారాలప్రకారం వారు చేయాలి. ఆ విధంగా చేయలేని వారు బ్రాహ్మణులకు బియ్యం కూరలు దక్షిణా పెద్దల పేరు చెప్పి ఇవ్వవచ్చు. ఆవుకు మేత వేసి నమస్కరించుకోవచ్చు. లేదా కనీసం ఇంత పరమాన్నం చేసి పెద్దలకు నైవేద్యం పెట్టవచ్చు.


దీన్నే మహాభారతం ఇలా చెబుతోంది.

 

 గవ్యేన దత్తం శ్రాద్ధే తు సంవత్సరమిహోచ్యతే

యథా గవ్యం తథా యుక్తం పాయసం సర్పిషా సహ


ఆవుపాలలో ఆవునెయ్యివేసి పాయసాన్నం వండి పెద్దలకు నైవేద్యం పెట్టి ఇంటిలోని వారు అంతా పెద్దల ప్రసాదంగా స్వీకరించవచ్చు. లేదా బ్రాహ్మణులకు పాయసాన్ని దక్షిణతో దానం గా ఇవ్వవచ్చు. ఇవన్నీ పెద్దలకు మహానందాన్ని కలిగిస్తాయని పితృగీతల్లో ఉంది. భక్తి పూర్వకంగా బ్రాహ్మణులను అర్చించినా, ఆవుకు మేత వేసినా, పాయసం నైవేద్యం పెట్టినా సరిపోతుంది.


*వైదిక సంస్కారాలు,షోడశ కర్మలు అంటే ఏమిటి?*

🌻🌺🍀🌻🌺🍀🌻


సంస్కారములు హిందూ సాంప్రదాయములో ఆగమ సంబంధమయిన క్రియలు. ఇవి ప్రతి హిందువు యొక్క జీవిత పర్యంతమూ వివిధ దశలలో జరుపబడతాయి. స్త్రీ, పురుష సమాగమము మొదలుకొని, జననము, మరణము, తదనంతరము ఆత్మ పరలోక శాంతి నొందుట వరకు సంస్కారములు జరపబడును.


సంస్కారములు మొత్తము పదహారు. వీనినే షోడశ సంస్కారములు అని కూడా వ్యవహరించెదరు. ఈ పదహారు సంస్కారములను తిరిగి రెండు విభాగముల క్రింద విభజించారు. అవి జనన పూర్వ సంస్కారములు (పుట్టుకకు ముందు), జననానంతర సంస్కారములు (పుట్టిన తరువాత). మొదటి మూడు సంస్కారములు జనన పూర్వ సంస్కారములు, ఆపై పదమూడు సంస్కారములు జననానంతర సంస్కారములు.


వ్యక్తి జీవితంలోని వివిధ దశల్లో జరిపే సంస్కారాలు:


1.గర్భాదానము


స్త్రీ పురుష తొలి సమాగమ సందర్భములో మంచి పుత్రుని ఆశించి జరిపే కార్యక్రమము ఇది. ఈ సందర్భములో చదివే మంత్రాలు సత్సంతానాన్ని (పురుష) ఆ దేవుని కోరుకుంటున్నట్లుగా తెలియజేస్తాయి.


2.పుంసవనం 


స్త్రీ గర్భం ధరించినట్లు రూఢి అయిన తర్వాత ఆమెకు కొడుకు పుట్టాలని చంద్రుడు పురుషరాశిలో ఉన్నప్పుడు జరిపే సంస్కారం. గర్భిణీ స్త్రీ ఆ రోజంతా ఉపవాసముంటుంది. ఆ రాత్రికి మొలకెత్తిన మర్రి విత్తనాలను నూరి ఆ రసాన్ని "హిరణ్యగర్భ:..." అని మంత్రాలు చదువుతూ ఆమె కుడి ముక్కులో వేస్తారు. చంద్రుడు పురుష రాశిలో ఉన్నప్పుడు ఇలా చేయడం ద్వారా దృఢకాయుడు, ఆరోగ్యవంతుడైన కొడుకు పుడతాడని నమ్మకం.


ఇది, సీమంతోన్నయనం గర్భాన్ని రక్షించుకొనుటకు చేసే సంస్కారములు. కావున ఈ రెండు గర్భా కాలమునందే చేయవలెను. పుంసవనము గర్భము ధరించిన మూడవ మాసములో మొదటి పదిరోజులలో చేయవలెను. ఈ కార్యక్రమములో మఱ్ఱిపండ్లను మినుములతో, యవలతో కలిపి గర్భిణికి వాసన చూపించెడి వ్యవస్థ యున్నది. దీనివలన యోనియందున్న దోషములు తొలగి గర్భరక్షణ శక్తి కలుగునని సుశ్రుతము మొదలగు ఆయుర్వేద శాస్త్రములందు చెప్పబడియున్నది. మోక్షమునకు ఉపయోగపడే ఉత్తమ స్థూల శరీరమును పొందు లక్ష్యముతోనే ఈ పుంసవన సంస్కారము నిర్ణయించబడింది.


3.సీమంతం 


తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షును కోరుతూ చేసేది. కడుపులోని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి శారీరక, మానసిక ఉల్లాసం ఎంతో అవసరం. అందుకోసం ఆమె, ఆమె భర్త పాటించవలసిన నియమాలు ఈ సంస్కారంలో భాగంగా ఉన్నాయి. వాటిలో ఒకటి దోహదం (అంటే గర్భిణీ స్త్రీ భర్త ఆమె కోరిక ఏమిటో తెలుసుకుని తీర్చడం). సీమంతం అంటే పాపిడి తీయడమని అర్థం. అంటే ఆ సమయంలో భర్త ఆమెను అంత అపురూపంగా చూసుకోవాలని అర్థం.


4.జాతకర్మ


బొడ్డుతాడు కోసే ముందు చేసే సంస్కారాలు. దీంట్లో భాగంగా జరిపే తంతులు చాలా ఉన్నాయి:


మేథాజనన:

బలానికి, తెలివితేటలకు ప్రతీకలైన నెయ్యి, తేనెలనుఒక సన్నని బంగారుదారంతో శిశువు నోటికందిస్తారు. దీన్ని పిల్లల పట్ల తాము నెరవేర్చవలసిన మొట్టమొదటి బాధ్యతగా వారు భావిస్తారు. హిందువులు పిల్లల తెలివితేటలకు ఎంత ప్రాధాన్యతనిస్తారో దీని ద్వారా మనకు తెలుస్తుంది.


ఆయుష్య:

దీర్ఘాయుష్షును కలిగించే ఋషులు, పితృదేవతలు, అగ్ని, సోములను ఆవాహన చేసే మంత్రాలను శిశువుముందు చదువుతారు.


శక్తి:

తండ్రి బిడ్డ చెవిలో "త్వం...శతమానం భవతి:" అని ఆ శిశువుకు చెబుతాడు. అప్పుడు బొడ్డుతాడు కోసి, శిశువును శుభ్రం చేసి, చనుబాలు పట్టిస్తారు.


5.నామకరణం 


నామకరణం అనగా పేరు పెట్టడం. ఆడ, మగ పిల్లలకు పెట్టవలసిన పేర్లకు సంబంధించిన నియమాలను గృహ్యసూత్రాలు పేర్కొన్నాయి. పరాశర గృహ్యసూత్రాల ప్రకారం పేరు రెండు లేక నాలుగు అక్షరాల పొడవుండి హ్రస్వ అచ్చుతో కూడిన హల్లుతో మొదలై చివర్లో దీర్ఘం కానీ విసర్గం కానీ ఉండాలి. వేర్వేరు గృహ్యసూత్రాల్లో ఈ నియమాలు వేర్వేరుగా ఉన్నాయి. ఆడపిల్ల పేరు బేసి అక్షరాలుండి పేరు చివర అ ఉండాలి.


పేరు పెట్టడానికి నాలుగు పద్ధతులున్నాయి:


మొదటిది జన్మనక్షత్రాన్ని బట్టి;

రెండవది పుట్టిన నెల/రాశ్యధిపతిని బట్టి;

మూడవది ఇలవేలుపును బట్టి;

నాలుగవది అందరూ పిలిచే పేరును బట్టి.

చివరి పద్ధతి కుటుంబ సంప్రదాయాన్ని బట్టి, విద్యాస్థాయిని బట్టి ఉంటుంది. ఐతే లేకలేక కలిగిన సంతానానికి, కుటుంబంలో చాలామంది పిల్లలు చనిపోయాక పుట్టినవారికి దుష్టశక్తుల్ని దూరంగా ఉంచడం కోసం విడ్డూరంగా ఉందే పేర్లను పెడతారు.


6.నిష్క్రమణ


బిడ్డను మొదటిసారిగా ఇంట్లోనుంచి బయటికి తీసుకురావడం. అప్పటివరకూ ఇంట్లోనే పెరిగిన బిడ్డ మొదటిసారిగా బయటి ప్రపంచంలో అడుగుపెడుతున్నప్పుడు ఆ బిడ్డను బలమైన ప్రకృతిశక్తులనుంచి, అతీత శక్తుల బారి నుంచి కాపాడడానికి చాలా జాగ్రత్తలు (అధిభౌతికమైనవి, ఆధ్యాత్మికమైనవి) తీసుకోవాలి. అందుకే ఈ సంస్కారం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు.


7.అన్నప్రాశన 


మొదటిసారిగా ఘనాహారం తినిపించడం (సాధారణంగా ఆరో నెలలో) అన్నప్రాశన. పెరుగుతున్న బిడ్డ భౌతికావసరాలను తీర్చడానికి అవసరమైన అతి ముఖ్యమైన ప్రక్రియ. సుశ్రుతుడు కూడా ఆరవనెలలో బిడ్డ చేత తల్లిపాలు మానిపించి ఘనాహారం ఇవ్వాలని పేర్కొన్నాడు. ఇందుకవసరమైన ఆహారాన్ని కూడా వేదమంత్రోచ్చాటనల మధ్య పరిశుభ్రమైన పాత్రల్లో వండుతారు. ఒక్కో రకమైన గుణాన్ని పెంపొందించడానికి ఒక్కో రకమైన ఆహారాన్ని అందించడం జరుగుతుంది. ఈ సంస్కారం జరపడం వల్ల వయసుకు తగిన ఆహారం అందడమే గాక ఆహారం పట్ల పవిత్రభావన ఏర్పడుతుంది.


8.చూడాకరణ 


పుట్టు వెండ్రుకలు తీయించడం.

పుట్టువెండ్రుకలు తీయించడం. దీర్ఘాయుష్షును, అందాన్ని కోరుతూ చేసే సంస్కారం. సుశ్రుతుడు, చరకుడు కూడా గుండు వల్ల దీర్ఘాయుష్షు, అందం చేకూరుతాయని పేర్కొన్నారు. తలనీలాలు దేవునికి లేదా దేవతకు అర్పించడం గురించి గృహ్యసూత్రాల్లో గానీ, స్మృతుల్లో గానీ లేనేలేదు! పూర్వకాలంలో కూడా కొన్ని సార్లు దేవాలయాల్లో తలనీలాలు అర్పించడం ఉన్నప్పటికీ అది కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే జరిగేది (లేకలేక కలిగిన పిల్లలు లేదా ఒకరిద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత పుట్టిన పిల్లలకు). గృహ్యసూత్రాల ప్రకారం ఈ సంస్కారం మొదటి సంవత్సరం చివర్లో గానీ, మూడొ ఏటగానీ చెయ్యాలి. తర్వాతి కాలాలోని సూత్రకర్తలు ఈ వయసును ఏడేళ్ళవరకు పొడిగించారు.


9.కర్ణవేధ 


ఇదే చెవులు కుట్టించడం. ఐదేళ్ళలోపు చేయవలసిన సంస్కారం. కర్ణాభరణాలు ధరించడం మొదట్లో అందం కోసమే మొదలైనా తర్వాత ఆరోగ్యదృష్ట్యా దానికున్న ప్రాధాన్యతను బట్టి దానిని సంస్కారాల్లో చేర్చి ఉండవచ్చు. చెవులు కుట్టడానికి వాడే సూది:


క్షత్రియులకు బంగారంతో,

బ్రాహ్మణ, వైశ్యులకు వెండితో,

దేవలుడనే స్మృతికర్త "చెవిరంధ్రాలగుండా సూర్యకిరణాలు ప్రసరించని బ్రాహ్మణుడిని చూడడం వల్ల అప్పటివరకు చేసుకున్న పుణ్యమంతా పోతుంది." అని పేర్కొన్నాడు.


10.అక్షరాభ్యాసం


బిడ్డ మనసు తగినంతగా పరిపక్వత చెంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మొదటగా చేయవలసినది అక్షరాలు నేర్చుకోవడం. ఈ సంస్కారాన్నే అక్షరారంభమనీ, అక్షరలేఖనమనీ, విద్యారంభమనీ అంటారు. సాధారణంగా ఈ సంస్కారాన్ని ఐదో ఏట చేస్తారు. విశ్వామిత్రుడు దీన్ని ఏడొ ఏటివరకు పొడిగించాడు. కానీ కొందరు స్మృతికర్తలు చూడాకరణ ఐన వెంటనే చేయాలని నిర్దేశించారు.


11.ఉపనయనం 


అక్షరాభ్యాసం లాంఛనంగా అక్షరాలు దిద్దించడమైతే వాస్తవంగా పిల్లలను విద్యార్జన కోసం గురువు దగ్గరకు పంపే ముందు జరిపే సంస్కారం ఉపనయనం. సాంస్కృతికంగా ఇది అతి ముఖ్యమైన సంస్కారం. అక్షరాభ్యాసంతో ప్రాథమిక విద్య మొదలైతే ఉన్నతవిద్య ఉపనయనంతోనే మొదలవుతుందనుకోవచ్చు. ఉపనయనం జరగడాన్ని సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా రెండవ పుట్టుకగా భావిస్తారు. భౌతిక జననం రోత కలిగించేది. ఉదాత్తమైనది కాదు. క్రమశిక్షణ, విద్యార్జనల ద్వారా పొందే రెందవజన్మ పవిత్రమైనది, ఉదాత్తమైనది.


ఐతే ఉపనయన ఉద్దేశాలు, అర్థాలు కాలంతోబాటే మారుతూ వచ్చాయి. అథర్వణ వేదంలో ఉపనయనాన్ని గురువు విద్యార్థి యొక్క బాధ్యతలు తీసుకోవడం అనే అర్థంలో వాడితే తర్వాతికాలంలో గురువు పవిత్ర మంత్రోపదేశం చేయడమే ఉపనయనంగా భావించడం జరిగింది. హిందూ మతంలో అతిపవిత్రము, శక్తివంతమైన మంత్రంగా భావించబడే గాయత్రి మంత్రాన్ని ఉపనయనమప్పుడు ఉపదేశిస్తారు. అంతేగాక ఉపనయనం ఉన్నతవిద్యకు ఆరంభంగా గాక మతపరమైన తంతు ద్వారా పొందే రెండవ పుట్టుకగానే గుర్తింపు పొందింది.


తగిన వయస్సు:

బ్రాహ్మణుడికి ఎనిమిది సంవత్సరాలు;

క్షత్రియుడికి పదకొండు సంవత్సరాలు;

వైశ్యుడికి పన్నెండు సంవత్సరాలు;


గరిష్ఠ వయోపరిమితి:

బ్రాహ్మణుడికి పదహారు సంవత్సరాలు;

క్షత్రియుడికి ఇరవైరెండు సంవత్సరాలు;

వైశ్యుడికి ఇరవైనాలుగు సంవత్సరాలు;

కాలం గడిచే కొద్దీ యజ్ఞోపవీతం ధరించడమే ఈ సంస్కారంలో అతిప్రధానభాగంగా మారింది. ఉపనయనం చేయించుకునేవారు సూర్యునివైపు చూస్తూ ఉండగా వారికి దీర్ఘాయుష్షు, పవిత్రత, బలం, తేజస్సు కలగాలని కోరుతూ గురువు ఈ సంస్కారాన్ని నిర్వహిస్తారు. ద్విజులు ఎల్లవేళలా ధరించే యజ్ఞోపవీతం వారికి తమ సామాజిక-ఆధ్యాత్మిక బాధ్యతలను సదా గుర్తుచేస్తూ వారి జీవితం నిరంతరం యజ్ఞజ్వాలలంత పవిత్రంగా సాగడానికి తోడ్పడుతుంది. ఒక యోగి వలె క్రమశిక్షణతో జీవితం గడపడానికి విద్యార్థికి అజినం (జింక చర్మం), దండం కూడా ఉపనయనమప్పుడు ఇస్తారు.


12.వేదారంభం 


అతిపురాతన ధర్మశాస్త్రాల్లో వేదారంభం గానీ, దీని తర్వాతిదైన కేశాంతం గానీ కనిపించవు. మొదట్లో ఉపనయనంతోనే వేదవిద్యారంభం చేసేవారు. కానీ తర్వాతికాలంలో వేదవిద్యతో బాటే ఇతర సామాజిక, వైజ్ఞానిక శాస్త్రాలు అభివృద్ధి చెందాక వేదవిద్యారంభానికి విడిగా మరో సంస్కారం అవసరమైంది. ప్రతి విద్యార్థి తన వంశం వారు నైపుణ్యం సాధించిన వేదాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది. అందుకే ఈ సంస్కారం ఒక్కో వర్గానికి చెందిన విద్యార్థులకు ఒక్కో రకంగా ఉంటుంది


రెండు వేదాలను అధ్యయనం చేసినవారు ద్వివేది,

మూడు వేదాలను అధ్యయనం చేసినవారు త్రివేది,

నాలుగు వేదాలను అధ్యయనం చేసినవారు చతుర్వేది.


13.కేశాంత 


పదహారేళ్ళ వయసొచ్చాక మొట్టమొదటిసారి గడ్డం గీసుకోవడానికి (గీయించుకోవడానికి) సంబంధించినది ఈ సంస్కారం. యౌవనారంభదశలోని చాపల్యాలకు లొంగకుండా మరింత జాగరూకులై మెలగవలసిన అవసరాన్ని, బ్రహ్మచర్యం యొక్క ప్రాధాన్యతను ఈ సంస్కారం గుర్తుచేస్తుంది. ఈ సంస్కారానికి సంబంధించిన తంతు దాదాపు చూడాకరణను పోలి ఉంటుంది. ఈ సంస్కారం జరిపేటప్పుడు చివర్లో విద్యార్థి తన గురువుకు ఒక ఆవును దానంగా ఇస్తాడు. అందుకే కేశాంతాన్ని గోదానమని కూడా అంటారు.


14.సమావర్తన 


చదువు ముగించుకుని విద్యార్థి గురుకులాన్ని వదిలి వచ్చేటప్పుడు ఈ సంస్కారాన్ని నిర్వహిస్తారు. దీన్నే స్నాతకమని కూడా అంటారు. విద్యార్థి తాను అప్పటివరకు పాటించిన బ్రహ్మచర్యాశ్రమం యొక్క గొప్పదనాన్ని గుర్తిస్తూ, యజ్ఞయాగాదులను ముగించేటప్పుడు చేసే అవభృతస్నానం చేస్తాడు. క్రమశిక్షణతో మెలగి విద్యార్జనలో ఉత్తీర్ణుడైన విద్యార్థిని విద్యాసాగరాన్ని ఈదిన స్నాతకుడు లేక నిష్ణాతుడుగా గుర్తించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా విశ్వవిద్యాలయాలు ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టా ప్రదానం చేయడాన్ని స్నాతకోత్సవమనే అంటారు.


సమావర్తనతో చదువు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగిరావడం విద్యార్థి జీవితంలో అతి కీలకమైన ఘట్టం. స్నాతకుడు పెళ్ళి చేసుకుని గృహస్థ జీవితం గడపడానికైనా, తాను గడించిన వైదిక విజ్ఞానంతో భౌతిక మానసిక బంధాలకు దూరంగా జీవితం గడపడానికైనా సిద్ధంగా ఉంటాడు. మొదటిమార్గం పాటించేవాళ్ళను ఉపకుర్వనులని, రెండవ వర్గం వారిని నైష్ఠికులని అంటారు. ఏ మార్గం పాటించడానికైనా గురువు అనుమతి తప్పనిసరి. అప్పటివరకు విద్యార్థి దశలో గురువుతోనే ఉన్నా ఆయనకు రుసుమేమీ చెల్లించకుండానే ఆయన్ని సేవించుకుంటూ విద్యను పొందిన విద్యార్థి ఇంటికి తిరిగొచ్చేటప్పుడు మాత్రం తన స్తోమతుకు తగినట్లు గురుదక్షిణ సమర్పించుకుంటాడు. గురుదక్షిణగా ఏమీ ఇవ్వలేకపోయినా గురువు అనుమతి మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి.


15.వివాహం 


హిందూ సంస్కారాల్లో కేంద్రస్థానం వివాహానిది. వధువుకు తగిన వరుణ్ణి, వరుడికి తగిన వధువును ఎంపిక చేయడం వివాహంలో అతి ముఖ్యమైన ఘట్టం. హిందూ సమాజంలో వధూవరులుగా ఒకే వర్ణానికి (సవర్ణ), భిన్న గోత్రాలకు, భిన్నపిండాలకు చెందినవారిని ఎంచుకోవడమనే ఆనవాయితీ కొనసాగుతోంది. సపిండకుల (రక్తసంబంధీకుల) మధ్య వివాహాలను అన్నికాలాల్లో నైతికంగానూ, శాస్త్రపరంగానూ పూర్తిగా నిషేధించడం జరిగింది.


వివాహాల్లోని రకాల గురించి తెలుసుకోవడానికి అష్టవిధవివాహాలు చూడండి.


వివాహంలో ముఖ్యమైన ఘట్టాలు:


వాగ్ధానం: పెళ్ళి ఖాయపరచుకోవడం (నిశ్చితార్థం)


వర-వరణం: వరుడిని లాంఛనప్రాయంగా అంగీకరించడం


కన్యాదానం: కన్య తండ్రి లేక తండ్రి స్థానంలో ఉండి ఆమె బాగోగులు చూసేవారు కన్యను వరుడికి అప్పజెప్పడం


వివాహ-హోమం: పెళ్ళిలో చేసే హోమం


పాణిగ్రహణం: వధూవరులు ఒకరి చేతినొకరు పట్టుకోవడం


హృదయస్పర్శ:హృదయాన్ని తాకడం


సప్తపది: సౌభాగ్యానికి, దాంపత్య సాఫల్యానికి గుర్తుగా కలిసి నడిచే ఏడడుగులు


అశ్మారోహణ: సన్నికల్లు తొక్కడం


సూర్యావలోకనం: జరుగుతున్న పెళ్ళికి సాక్ష్యంగా నిలిచిన సూర్యుణ్ణి చూడడం


ధృవదర్శనం: స్థిరత్వానికి సూచిక ఐన ధ్రువనక్షత్రాన్ని చూడడం


త్రిరాత్ర-వ్రతం: మూడురాత్రులు విడిగా ఉండడం


చతుర్ధి-కర్మ: లాంఛనంగా వధూవరులు కలిసే నాలుగోనాటిరాత్రి జరిపే సంబరం


హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైన వ్యవస్థ. పెళ్ళయాక భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధానకర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్ళి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది.


16.అంత్యేష్టి 


హిందువుల జీవితంలోని చివరి సంస్కారం అంత్యేష్టి. ఒక హిందువు తన జీవితాన్ని వివిధ దశల్లో వివిధ సంస్కారాల ద్వారా పవిత్రం చేసుకున్న తర్వాత మరణానంతరం అతడి వారసులు అతడి ఆత్మకు శాంతి, సద్గతులు కలగాలని కోరుతూ చేసేవి అంతిమ సంస్కారాలు లేక అంత్యేష్టి.


మరణానికి ముందు: మరణమాసన్నమైన వ్యక్తి తన కుటుంబసభ్యులను, బంధువులను, ఆత్మీయులను పిలిపించుకుని కన్నుమూసే ముందు అందరినీ ఒకసారి చివరిసారిగా చూసుకుని, వారికి, ప్రపంచానికి వీడ్కోలు పలుకుతారు. వారు తృప్తిగా కన్నుమూయడానికి, మరణానంతరం వారు సంతోషంగా ఉండడానికి వీలుగా వారిపేరుమీద, వీలైతే వారి చేతుల మీదుగానే దాన ధర్మాలు జరుగుతాయి.


అంతిమయాత్రకు ముందు: వారు జీవితపర్యంతం రగిలించిన పవిత్రాగ్నిలోకి ఆహుతులు సమర్పిస్తారు. దగ్గరివారు చనిపోతున్నవారి నోట్లో తులసితీర్థం, గంగాజలం వదులుతారు.


పాడె: శవాన్ని అంత్యక్రియలు జరిగేచోటికి తీసుకువెళ్ళడానికి ఏడుకట్లతో ప్రత్యేకంగా తయారుచేసిన పొడవాటి నిర్మాణం. శవాన్ని దానిమీదికి చేరుస్తారు.


అంతిమయాత్ర: మరణించినవారి బంధువులు, మిత్రులు, ఆత్మీయులందరూ అంతిమయాత్రలో పాల్గొంటారు. అందరూ కలసి శ్మశానస్థలిని చేరుకుంటారు.


అనుస్తరణి: జీవితసాగరాన్ని దాటి అవతలికి వెళ్ళేటప్పుడు సహాయకారిగా ఉంటుందనే నమ్మకంతో హిందువులు పవిత్రంగా భావించే గోవును మరణించినవ్యక్తి తరపున దానంగా ఇస్తారు.


దింపుడుకళ్ళెం: భగవదనుగ్రం వల్లో, చనిపోయినవారి ఆయుస్సు ఇంకా తీరలేదని యమధర్మరాజు వెనక్కి పంపెయ్యడం వల్లో చనిపోయినవారు తిరిగి బ్రతుకుతారనే నమ్మకంతో, బ్రతకాలనే ఆశతో అంతా సిద్ధమయ్యాక కూడా అంత్యక్రియలను కొన్ని నిమిషాలసేపు ఆలస్యం చేయడానికి పాడెను శ్మశానానికి తీసుకువెళ్ళే దారి మధ్యలో దించి శవం చెవిలో మూడసార్లు పేరుపెట్టి పిలుస్తారు. ఒక్కోసారి మరణించారని పొరబాటుగా భావించినవారు తర్వాత తిరిగి లేవడం వల్ల ఈ ఆచారం పుట్టి ఉంటుంది.


దహనం: శరీరాన్ని దహనం చెయ్యడానికి చితిపై ఉంచేముందు శరీరానికి జలంతో అభిషేకం చేయించడంతోబాటు అంత్యక్రియల్లో భాగంగా వేసే కర్మ కొంత ఉంటుంది. అది పూర్తయాక శరీరాన్ని చితిపై ఉంచి వేదమంత్రాల మధ్య నిప్పంటిస్తారు.


ఉదకకర్మ: చితిపై మంటల మధ్య శరీరం కాలిపోగా ఆ వేడిని తగ్గించి మరణానంతర జీవుడిని చల్లబరచడానికి ఉదకం (నీళ్ళు) సమర్పిస్తారు.


ఓదార్పుఆత్మీయుడిని పోగొట్టుకుని దు:ఖంలో ఉన్నవారికి పెద్దలు జీవితమింతేనని తెలుపుతూ మతగ్రంథాల్లో నుంచి గాథలను, జీవితసత్యాలను బోధపరిచి దు:ఖభారాన్ని తగ్గిస్తారు.


అశౌచం: చావు సంభవించిన ఇంటిలో నివాసముండడం మంచిది కాదనే నమ్మకంతో సంవత్సరకాలం ఆ ఇంటిని ఖాళీగా ఉంచుతారు. దీన్ని సూతకమని అంటారు (సూతకం రెండురకాలు: జాతాశౌచం, మృతాశౌచం).


అస్థిసంచయనం: శరీరం కాలి బూడదైనా ఎముకలు పూర్తిగా కాలిపోవు. ఆ బూడిదలో మిగిలిపోయిన ఎముకలను ఏరి తీసుకోవడం అస్థిసంచయనం

శ్రీ లలితా పంచరత్నం

1) భవదారిద్ర్యనాశినీం 

   భావదారిద్ర్యభంజనీం 

   భవపాపౌఘవారిణీం 

   భవానీం లలితాంబికాం ||

2) భండాసురనిషూదినీం 

   భావనారూపసంచారిణీం 

   భార్గవరామసంసేవితాం 

   భవానీం లలితాంబికాం ||

3) భువనబ్రహ్మాండపాలినీం 

   బాలాత్రిపురసుందరీం 

   బాలారిష్టదోషవారిణీం 

   భవానీం లలితాంబికాం ||

4) భావోద్వేగరహితమానసాం 

  భానుమండలచారిణీం 

  భానుకోటిప్రకాశినీం 

  భవానీం లలితాంబికాం ||

5) బంధమోచనకారిణీం 

   బలోత్సాహప్రదాయినీం 

   బలభద్రవందితాఘ్రియుగాం 

   భవానీం లలితాంబికాం ||

   సర్వం శ్రీలలితాంబికాదివ్యచరణారవిందార్పణమస్తు

Wednesday, September 16, 2020

శ్రీ జనార్దనాష్టకం

1) నమో భగవతే జనార్దనాయ 

   జన్మమృత్యుజరావ్యాధిరహితస్థితిప్రదాయకాయ 

   భక్తమనోభీష్టసిద్ధిప్రదాయకకమలహస్తాయ 

   ఋగ్యజుస్సామాథర్వతత్త్వస్వరూపవిగ్రహాయ ||

2) నమో భగవతే జనార్దనాయ 

   అనంతభువనబ్రహ్మాండవ్యాప్తతేజోమయాయ 

   వ్యాసాంబరీషశుకశౌనకభక్తవరేణ్యపూజితాయ 

   నరకాసురాదిదానవసంహరభక్తజనరక్షకాయ ||

3) నమో భగవతే జనార్దనాయ 

   హయగ్రీవాసురసంహరశ్రీహయగ్రీవదేవాయ

   పరిపూర్ణజ్ఞానఫలప్రదవాగీశ్వరేశ్వరాయ 

   సరససంభాషణాచాతుర్యజనరంజకాయ ||

4) నమో భగవతే జనార్దనాయ 

   సుతామ్రకమలసనాదిదేవసంఘపూజితాయ 

   సమీచీనఆలోచనపరంపరాప్రదదైవతాయ 

   శిశుపాలదంతవక్త్రసంహరవీర్యవిక్రమాయ ||

5) నమో భగవతే జనార్దనాయ

   రమామేదినీహృదయాంబుజవాసనళినేక్షణాయ  

   సప్తద్వారజయవిజయపార్షగణాదిపరివేష్ఠితవైకుంఠవాసాయ   

   శతకృతుశచీదేవిపూజితపల్లవాంఘ్రియుగళాయ ||

6) నమో భగవతే జనార్దనాయ 

   ధర్మానుష్ఠానతత్పరధర్మమార్గనిర్దేశకాయ 

   ధర్మార్థకామమోక్షఫలప్రదాయకవేదపురుషాయ 

   భూరిసంభావనాదక్షిణస్వీకృతబ్రాహ్మణస్వరూపాయ ||

7) నమో భగవతే జనార్దనాయ 

   కుంభసంభవమతంగమహర్షిగణసంస్తుతాయ 

   అష్టదిక్పాలకనవగ్రహాధిపత్యబ్రహ్మాండనాయకాయ 

   ప్రదోషసమయమృదంగవాద్యవాదనావినోదాయ ||

8) నమో భగవతే జనార్దనాయ 

   అన్నమార్యరామదాసత్యాగరాజాదిభక్తాగ్రగణ్యసంస్తుతాయ 

   తాపత్రయహరసర్వరక్షాకరకుసుమకోమలకరాబ్జాయ 

   నిందాస్తుత్యాతీతబ్రహ్మానందసరోవరచరరాజహంసాయ ||

            సర్వం శ్రీజనార్దనదివ్యచరణారవిందార్పణమస్తు

Tuesday, September 15, 2020

శ్రీ అయ్యప్ప స్వామివారి అష్టోత్తర శతనామావళి

ఓం ధర్మ శాస్త్రే నమః

ఓం వేద శాస్త్రే నమః

ఓం విశ్వశాస్తే నమః

ఓం లోక శాస్త్రేనమః

ఓం కాలశాస్త్రే నమః

ఓం మహా శాస్త్రే నమః

ఓం మహా బలాయనమః

ఓం గదాంతకాయనమః

ఓం గణాగ్రణినే నమః

ఓం ఋగ్వేద రూపాయ నమః

ఓం గజాధిపాయ నమః

ఓం గణారూఢాయనమః

ఓం గణాధ్యక్షాయ నమః

ఓం వ్యాఘ్రరూఢాయనమః

ఓం మహాద్యుతాయనమః

ఓం గోప్త్రే నమః

ఓం గీర్వాణ సంసేవ్యాయ నమః

ఓం హాలాహల ధరాత్మజాయనమః

ఓం అర్జునేనమః

ఓం అగ్నినయనాయ నమః

ఓం నక్షత్రాయ నమః

ఓం చంద్రరూపాయ నమః

ఓం వలాహకాయ నమః

ఓం దూర్వాళ్యామాయ నమః

ఓం క్రూర దృష్టియే నమః

ఓం అనామయాయ నమః

ఓం త్రినేత్రాయ నమః

ఓం ఉత్పలతారాయ నమః

ఓం కాలహంత్రే నమః

ఓం నరాధిపాయ నమః

ఓం ఖండేందు వౌళితనయా నమః

ఓం కల్హారు కుసుమ ప్రియాయ నమః

ఓం మదనాయనమః

ఓం మాధవ సుతాయ నమః

ఓం మందార కుసుమార్చితాయ నమః

ఓం మహాబలాయ నమః

ఓం మహోత్సాహాయ నమః

ఓం మహా పాప వినాశయా నమః

ఓం మహారూపాయ నమః

ఓం మహాధీశాయ నమః

ఓం మహా సర్ప విభూషణాయనమః

ఓం అనంగ మదనాతురాయ నమః

ఓం దుష్ట గ్రహాధిపాయ నమః

ఓం శ్రీదాయ నమః

ఓం శిష్టరక్షణ దక్షితాయ నమః

ఓం కస్తూరి తిలకాయ నమః

ఓం రాజశేఖరాయ నమః

ఓం రాజసోత్తమాయ నమః

ఓం రాజరాజార్చితాయ నమః

ఓం విష్ణు పుత్రాయ నమః

ఓం వనజనాధిపాయ నమః

ఓం వర్చస్కరాయ నమః

ఓం వరరుచయే నమః

ఓం వరదాయ నమః

ఓం వాయువాహనాయ నమః

ఓం వజ్రకాయాయ నమః

ఓం ఖడ్గపాణి నమః

ఓం వజ్రహస్తాయ నమః

ఓం బలోద్ధతాయ నమః

ఓం త్రిలోక జ్ఞానాయ నమః

ఓం అతిబలాయ నమః

ఓం పుష్కలాయ నమః

ఓం వృత్తపావనాయ నమః

ఓం అసిహస్తాయ నమః

ఓం శరధరాయ నమః

ఓం పాశీ హస్తాయ నమః

ఓం భయాపహాయ నమః

ఓం షట్కార రూపాయ నమః

ఓం పాపఘ్నాయ నమః

ఓం శివసుతాయ నమః

ఓం పాషాండ రుధిరాసనాయ నమః

ఓం పంచ పాండవ సంత్రాతే నమః

ఓం శర పంచాక్షరాశ్రీతాయ నమః

ఓం పంచవక్త్ర సుతాయ నమః

ఓం పూజ్యాయ నమః

ఓం పండితాయ నమః

ఓం పరమేశ్వరాయ నమః

ఓం భవతాపప్రశీమీనాయ నమః

ఓం భక్త్భాష్ట ప్రదాయకాయ నమః

ఓం కవయే నమః

ఓం కవినామాధిపాయ నమః

ఓం కృపాళవే నమః

ఓం క్లేశనాశాయ నమః

ఓం సమయా అపురూపాయ నమః

ఓం సేనానినే నమః

ఓం భక్తి సంపత్ప్రదాయకాయ నమః

ఓం వ్యాఘ్ర చర్మధరాయ నమః

ఓం పూర్ణ ధవళాయ నమః

ఓం పుష్కలేశాయ నమః

ఓం శూలినే నమః

ఓం కపాలినే నమః

ఓం వేణునాదనాయ నమః

ఓం కళార్లవాయనమః

ఓం కంబుకంఠాయ నమః

ఓం కిరీటాది విభూషితాయ నమః

ఓం ధూర్జటినే నమః

ఓం వీర నిలయాయ నమః

ఓం వీరాయ నమః

ఓం వీరేంద్ర వందితాయ నమః

ఓం విశ్వరూపాయ నమః

ఓం వృషపతయే నమః

ఓం వివిధార్థ ఫలప్రదాయ నమః

ఓం దీర్ఘనాశాయ నమః

ఓం మహాబాహవే నమః

ఓం చతుర్బాహవే నమః

ఓం జటాధరాయ నమః

ఓం హరిహరాత్మజాయ నమః

ఓం దేవ గణ పూజితాయ నమః

ఓం పంబా బాలాయ నమః

ఓం శ్రీధర్మా శాస్తాయ నమః

ఓం శ్రీ భూతనాధాయ నమః

‘ఓం శ్రీ గురునాధాయ నమః

అష్టోత్తర శతనామావళి చదవటం పూర్తయింది.

అందరూ పుష్పాలు జల్లి కూర్చన్నారు ! ధూప , దీపాలు చూపిన తర్వాత సిద్ధమైన నైవేద్యాలు తెచ్చి పటం దగ్గర పెట్టారు. అప్పాలు , చక్కెర , పొంగలి , పానకం , పండ్లు నివేదన చేసి , తాంబూలం సమర్పించారు ! కర్పూర హారతి చూపించారు ! అందరూ భక్తిగా హారతి కళ్లకద్దుకుని ఆత్మప్రదక్షిణ నమస్కారాలు చేశారు ! నమస్కార శ్లోకాలు పైకి చదువుతూ దండప్రణామాలు ఆచరించారు పూజారి గారు !

అయ్యప్పస్వామి నమస్కార శ్లోకాలు (ఆదిశంకరాచార్య విరచిత)

భూతనాథ సదానంద సర్వభూత దయాపర

రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః

లోక వీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం

పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమాహ్యహం

విశ్వపూజ్యం విశ్వ వంద్యం విఘ శంభోప్రియసుతం

క్షిప్ర ప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం

మత్త మాతంగ గమనం కారుణ్యామృత పూరితం

సర్వ విఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహం !

తీర్థప్రసాదాల వితరణ

నమస్కార శ్లోకాలు పఠించి అందరికి శంఖంతో తీర్థాన్ని ఇచ్చారు పూజారిగారు !

మధుకైటభులు

శ్రీహరి యోగనిద్రా ముద్రితుడై ఉండగా, ఒకనాడు అతని రెండు చెవుల నుండి ఇద్దరు రాక్షసులు జన్మించారు. వారే మధుకైటభులు. వారిద్దరూ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి పరమేశ్వరిని ప్రసన్నం చేసుకున్నారు. తమకు మరణం లేని జీవితాన్ని వరంగా ఇమ్మని దేవిని ప్రార్థించారు. 'పుట్టినవానికి మరణం తప్పద'ని, 'కనుక ఆ వరం ఇవ్వడం అసాధ్యమ'ని జగన్మాత చెప్పింది. "అలా అయితే, మేము ఎపుడు మరణించాలని కోరుకుంటామో, అపుడే మాకు మరణం వచ్చేట్లుగా వరమిమ్మ'ని వారు 'అమ్మ'ను ప్రార్థించారు. అమ్మ 'తథాస్తు' అని దీవించి అంతర్థానం అయింది.

'స్వచ్ఛంద మరణం' అనే వరం పొంది యుక్తితో విజయం సాధించామని, తమకు మరణం కావాలని తామే కోరుకోవడం అసంభవం కనుక, తాము మృత్యువును జయించినట్లే అని విఱ్ఱవీగి, మధుకైటభులు విజృంభించ సాగారు. అన్ని లోకాలపై దండయాత్రలు చేస్తూ, వీరవిహారం ప్రారంభించారు. సజ్జనులను బాధిస్తూ, లోకకంటకులై ప్రవర్తించారు.

ఒకనాడు మదుకైటభులు బ్రహ్మపై దండెత్తారు. ప్రళయకాలంలో అంతా జలమయం కాగా, మహావిష్ణువు నాభికమలం నుండి ఆవిర్భవించిన బ్రహ్మను సమీపించి, వరగర్వంతో మధుకైటభులు "బ్రహ్మదేవా! చేతనైతే మాతో యుద్ధం చేయ్యి, లేకపోతే, నీ ఓటమిని అంగీకరించి, మాకు లొంగిపో, ఈ పద్మాన్ని విడచి పారిపో" అని హెచ్చరించారు.

వారితో పోరాడలేని బ్రహ్మ, పద్మనాళంలో దూరి, ఐదువేల సంవత్సరాలు ప్రయాణం చేసి, విష్ణువును చేరుకున్నాడు. యోగనిద్రలో ఉన్న శ్రీమహవిష్ణువును చూచి. నిద్రాదేవిని పరిపరి విధాల ప్రార్థించాడు. విష్ణువునకు మెలకువ వచ్చింది. కన్నులు తెరచిన విష్ణువు సంగతి తెలుసుకునే లోగానే మధుకైటభులు బ్రహ్మను వెంబడిస్తూ అక్కడికి వచ్చారు.

"మీరిద్దరూ మాతో యుద్ధం చేయండి!" అని బ్రహ్మ, విష్ణువులను వత్తిడి చేయసాగారు.

విష్ణువు మధుకైటభులతో యుద్ధానికి తలపడ్డాడు. ఆ ఇద్దరూ ఒకరి తరువాత ఒకరు ఆలసట తీర్చుకుంటూ వంతులు వారీగా యుద్ధం చేయ సాగారు. ఎన్నాళ్ళు యుద్ధం జరిగినా, విష్ణువు ఆ రాక్షసులను జయించలేక పోయాడు. పైగా తానే అలసిపోవడం గమనించి, వారు సామాన్యులు కారని, తనతో ఇంతకాలం యుద్ధం చేసి చావకుండా బ్రతికినవారు వరప్రభాల గర్వితులని గ్రహించాడు. జగన్మాతను ప్రార్థించాడు. "తల్లీ! సృష్టిస్థితి లయకారిణీ !నీమహిమను గుర్తించలేక, ఈ రాక్షసులను నేనే సంహరింప గలనుకున్నాను. నీఅనుగ్రహం వల్లనే అది సాధ్యమని ఇపుడు తెలుసుకున్నాను. వారిని వధించే ఉపాయం చెప్పి, నన్ను అనుగ్రహించు" అని చేతులు జోడించాడు.

జగన్మాత ప్రత్యక్షమై, "మహావిష్ణువు!ఈ రాక్షసులు నా వల్ల స్వచ్చంద మరణాన్ని వరంగా పొందారు, తమంతట తాము మరణిచాలని వారు కోరుకుంటేగాని, వారికి మరణంరాదు. కనుక,నీవు వారిని యుధ్దానికి ఆహ్వానించు.

"మీ పరాక్రమానికి మెచ్చాను. మీ కొక వరం ఇస్తాను. కోరుకోండి" అని వారిని అడుగు. ఆ తరువాత కథ నేను నడిపిస్తాను" అని అభయ మిచ్చింది.

జగన్మాత ఆదేశాన్ని శిరసా వహించి, శ్రీమహావిష్ణువు మధుకైటభులను

పిలిచి, 'వరం కోరుకో" మన్నాడు. 'వరగర్వంతో ఆ రాక్షసులు విష్ణువును హేళన చేశారు. "మాచేతిలో ఓటమిని పొందిన నువ్వు మాకు వరమిచ్చే దేమిటి?మేమే నీకోరిక వరాన్ని అనుగ్రహిస్తాం. కోరుకో" అని ప్రగల్భంగా పలికారు. " అలా అయితే, నాచేతిలో మీరిద్దరూ మరణించేట్లుగా వరమివ్వండి "ని విష్ణువు అడిగాడు.

అప్పుడు మధుకైటభులు తమ తొందరపాటుకు చింతించినా, 'సరే' అనక

తప్పలేదు. "అలాగే నీ చేతిలో మరిణిస్తాం. వరమిస్తున్నాం కాని, ఈ సముద్ర జలంపై యుద్ధం ఎలా సాగుతుంది? ఎక్కడైనా భూమిని చూపించు. భూమిపై యుద్ధంచేసి మమ్ములను సంహరించు' ' అన్నారు. ఈ వంకతో తప్పించు కుందామని వాళ్ళ దురాలోచన.

అపుడు విష్ణువు తన తొడను పెంచి, సముద్రజలంపై విస్తరింప చేసి, తన ఊరువునే భూమిగా చూపి, మధుకైటభులతో యుద్ధం చేసి వారిని సంహరించాడు.

మధుకైటభుల శరీరాలలోని మేదస్సు ఆ ప్రదేశమంతా వ్యాపించడం వల్ల "మేదిని" అని, విష్ణువు ఊరుభాగం చేత పరివ్యాప్తమైనందువల్ల "ఉర్వి" అని భూమికి పేర్లు వచ్చాయి. రాక్షసుల రక్తమాంసాదులతో నిండినందువల్ల భూమికి ఆనాటి నుండి "అభక్ష్య" అనే పేరు కూడా వచ్చింది.

జగన్మాత అనుగ్రహంతో స్వచ్ఛంద మరణం వరంగా పొంది కూడా, సత్ర్పవర్తన లేక, వరబల గర్వితులై దురాగతాలు చేసి లోకకంటకులైన మధుకైటభులు అహంకారముతో విఱ్ఱవీగి, తమ మరణాన్ని తామే కోరితెచ్చుకున్న వారయ్యారు.

శ్రీమహావిష్ణువు కూడ మొదట- తానే ఆరాక్షసులను సంహరించ గలనని భావించి, విఫలుడై , తరువాత పరాశక్తి ప్రభావాన్ని గుర్తించి, ఆమె అనుగ్రహంతో కృతార్థుడు కాగలిగాడు.

సర్వజగద్రక్షుకుడైన విష్ణువునకు కూడా అలసట కలగడం, ఆ ఇద్దరు రాక్షసులనూ వధించ లేకపోవడం జగన్మాత మాయా విలాసం తప్ప వేఱు కాదని వివరిస్తూ, సూతుడుశౌనకాది మునులకు ఈ వృత్తాంతాన్ని వినిపించాడు.

మధుకైటభులను సంహరించినది మహావిష్ణువే అయినా సంహరింప చేసినది దేవియే కనుక, ఆ జగన్మాతకు "మధుకైటభమర్దని" అనే పేరు వచ్చింది.

శివలింగాలు

సాధారణంగా మనకు తెలిసినవి శిలా నిర్మితమైన లింగాలు మాత్రమే. అందులో కూడా నల్ల రాతి శివలింగాలే అధికం. కానీ మనకు తెలీని శివ లింగాలు ఇంకా అనేకం ఉన్నాయి. అందులో 30 రకాల శివలింగాలు మరీ ముఖ్యమైనవి, అపురూపమైనవి. ఆయా లింగాలు ఇచ్చే ఫలితాలు అనంతం. అందుకే వాటి గురించి తెలుసుకుందాం. రకరకాల పదార్ధాలతో రూపొందిన శివలింగాల గురించి పురాణాలు వివిధ సందర్భాల్లో వర్ణించాయి. 

ఏయే శివలింగాలను పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో చూడండి...

01. గంధలింగం: రెండు భాగాలు కస్తూరి. నాలుగు భాగాలు గంధం, మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని చేస్తారు. దీనిని పూజిస్తే శివ సాయిజ్యం లభిస్తుంది.

02. పుష్పలింగం: నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు. దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది.

03. నవనీతలింగం: వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి.

04. రజోమయలింగం: పుప్పొడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాధరత్వం సిద్ధిస్తుంది. శివ సాయుజ్యాన్ని పొందగలం.

05. ధాన్యలింగం: యవలు, గోధుమలు, వరిబియ్యపు పిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు. దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి, సంతానం కలుగుతుంది.

06. తిలిపిస్టోత్థలింగం: నూగుపిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది.

07. లవణలింగం: హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి.

08. కర్పూరాజ లింగం: ముక్తిప్రదమైనది.

09. భస్మమయలింగం: భస్మంతో తయారు చేస్తారు. సర్వ సిద్ధులను కలుగచేస్తుంది.

10. శర్కరామయలింగం: సుఖప్రదం.

11. సద్భోత్థలింగం: ప్రీతిని కలిగిస్తుంది.

12. పాలరాతి లింగం: ఆరోగ్యదాయకం

13. వంశాకురమయ లింగం: వంశవృద్ధిని కలిగిస్తుంది. దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు.

14. కేశాస్థిలింగం: వెంట్రుకలు, ఎముకలతో తయారు చేస్తారు. ఇది శత్రునాశనం చేస్తుంది.

15. పిష్టమయలింగం: ఇది పిండితో తయారు చేయబడుతుంది. ఇది విద్యలను ప్రసాదిస్తుంది.

16. దధిదుగ్థలింగం: కీర్తిప్రతిష్టలను కలిగిస్తుంది.

17. ఫలోత్థలింగం: ఫలప్రదమైనది.

18. ధాత్రిఫలజాతలింగం: ముక్తిప్రదం.

19. గోమయలింగం: కపిలగోవు పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు. దీనిని పూజిస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. భూమిపై పడి మట్టి కలసిన పేడ పనికిరాదు.

20. దూర్వాకాండజలింగం: గరికతో తయారుచేయబడిన ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది.

21. వైడూర్యలింగం: శత్రునాశనం, దృష్టిదోషహరం

22. ముక్తాలింగం: ముత్యంతో తయారుచేయబడిన ఈ లింగం ఇష్టసిద్ధిని కలిగిస్తుంది.

23. సువర్ణనిర్మితలింగం: బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది.

24. రజతలింగం: సంపదలను కలిగిస్తుంది.

25. ఇత్తడిలింగం – కంచులింగం: ముక్తిని ప్రసాదిస్తుంది.

26. ఇనుములింగం – సీసపులింగం: శత్రునాశనం చేస్తుంది.

27. అష్టథాతులింగం: చర్మరోగాలను నివారిస్తుంది. సర్వసిద్ధిప్రదం.

28. తుసషోత్థలింగం: మారణక్రియకు పూజిస్తారు.

29. స్పటికలింగం: సర్వసిద్ధికరం, అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది.

30. సీతాఖండలింగం: పటికబెల్లంతో తయారు చేసింది. ఆరోగ్యసిద్ధి కలుగుతుంది.

శివలింగంలో శివశక్తుల సమ్మేళనం జరగడం వలన ప్రచండమైన ఊర్థస్సు ఉద్భవిస్తుంది. దాని ప్రతికూల ఫలితాలు మనపై పడకుండా ఉండేందుకు శివలింగంపై జలధారను పోస్తుండాలి. 

ఆ దారనుంచి సూక్ష్మమైన ఓంకారం ఉద్భవిస్తుంది. ఇదే నిర్గుణబ్రహ్మ. ఇలా జీవుడు మంత్రపూర్వక ధారాభిషేకం ద్వారానిర్గుణ బ్రహ్మను తెలుసుకుంటాడు.


హనుమాన్ చాలీసా...

హిందూ మతంలో హనుమాన్ చాలీసాకి ప్రత్యేక స్థానం ఉంది. హనుమాన్ చాలీసా పఠనం వల్ల, హనుమంతుడ్ని మెప్పించి ఆయన దీవెనలు పొందవచ్చని అంటారు. హనుమాన్ చాలీసా చదవటం వల్ల శనిప్రభావం కూడా పోతుంది. 

హనుమాన్ చాలీసా చదవటానికి ఒక సమయం, పద్ధతి ఉన్నాయి. అందులోని ప్రతి శ్లోకానికి ప్రత్యేక అర్థం ఉన్నది. హనుమాన్ చాలీసా పఠనం వల్ల ఒక వ్యక్తిపై అద్భుత ప్రభావం ఉందని అంటారు. పొద్దున లేదా రాత్రి ఈ హనుమాన్ చాలీసా 

చదవటానికి మంచి సమయాలు. శనిప్రభావం ఉన్నవారు ప్రతిరాత్రి హనుమాన్ చాలీసాను 8సార్లు చదవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. హనుమాన్ చాలీసా ముందు పంక్తులు 8 సార్లు చదవటం వల్ల ఎవర్ని అయినా నిందించటం వల్ల చేసిన పాపాలు తొలగిపోతాయి. 

రాత్రి హనుమాన్ చాలీసా పఠనం వల్ల దుష్టశక్తుల నీడ మీ జీవితంపై నుంచి తొలగిపోతుంది. పిల్లలకి దెయ్యాలంటే భయం ఉన్నప్పుడు భయం పోగొట్టుకోడానికి రాత్రిపూట వారు ఇది చదవడం మంచిది. హనుమాన్ చాలీసా చదవటంవల్ల హనుమంతుడి కృపకి పాత్రులయి మీకష్టాలను తొలగించుకోగలుగుతారు.  ఏదైనా పెద్దపనిలో విజయం సాధించాలనుకుంటే, మంగళ, గురు, శని లేదా మూలా నక్షత్రం ఉన్నరోజు రాత్రులు 108 సార్లు ఇది చదివితే మంచిది. 

సరియైన శ్రద్ధ, విశ్వాసంతో హనుమంతుడి అనుగ్రహం కలిగి మీరు కోరుకున్నవన్నీ సాధించగలుగుతారు.

హనుమాన్ ..చాలీసా:

దోహా

శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి |

వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ||

బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార |

బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్ 


ధ్యానమ్

గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ |

రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజమ్ ||

యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ |

బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ||


చౌపాఈ

జయ హనుమాన ఙ్ఞాన గుణ సాగర |

జయ కపీశ తిహు లోక ఉజాగర || 1 ||

రామదూత అతులిత బలధామా |

అంజని పుత్ర పవనసుత నామా || 2 ||

మహావీర విక్రమ బజరంగీ |

కుమతి నివార సుమతి కే సంగీ ||3 ||

కంచన వరణ విరాజ సువేశా |

కానన కుండల కుంచిత కేశా || 4 ||

హాథవజ్ర ఔ ధ్వజా విరాజై |

కాంథే మూంజ జనేవూ సాజై || 5||

శంకర సువన కేసరీ నందన |

తేజ ప్రతాప మహాజగ వందన || 6 ||

విద్యావాన గుణీ అతి చాతుర |

రామ కాజ కరివే కో ఆతుర || 7 ||

ప్రభు చరిత్ర సునివే కో రసియా |

రామలఖన సీతా మన బసియా || 8||

సూక్ష్మ రూపధరి సియహి దిఖావా |

వికట రూపధరి లంక జరావా || 9 ||

భీమ రూపధరి అసుర సంహారే |

రామచంద్ర కే కాజ సంవారే || 10 || 

లాయ సంజీవన లఖన జియాయే |

శ్రీ రఘువీర హరషి ఉరలాయే || 11 ||

రఘుపతి కీన్హీ బహుత బడాయీ |

తుమ మమ ప్రియ భరతహి సమ భాయీ || 12 ||

సహస వదన తుమ్హరో యశగావై |

అస కహి శ్రీపతి కంఠ లగావై || 13 ||

సనకాదిక బ్రహ్మాది మునీశా |

నారద శారద సహిత అహీశా || 14 ||

యమ కుబేర దిగపాల జహాఁ తే |

కవి కోవిద కహి సకే కహాఁ తే || 15 ||

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా |

రామ మిలాయ రాజపద దీన్హా || 16 ||

తుమ్హరో మంత్ర విభీషణ మానా |

లంకేశ్వర భయే సబ జగ జానా || 17 ||

యుగ సహస్ర యోజన పర భానూ |

లీల్యో తాహి మధుర ఫల జానూ || 18 ||

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ |

జలధి లాంఘి గయే అచరజ నాహీ || 19 ||

దుర్గమ కాజ జగత కే జేతే |

సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే || 20 || 

రామ దుఆరే తుమ రఖవారే |

హోత న ఆఙ్ఞా బిను పైసారే || 21 ||

సబ సుఖ లహై తుమ్హారీ శరణా |

తుమ రక్షక కాహూ కో డర నా || 22 ||

ఆపన తేజ తుమ్హారో ఆపై |

తీనోఁ లోక హాంక తే కాంపై || 23 ||

భూత పిశాచ నికట నహి ఆవై | 

మహావీర జబ నామ సునావై || 24 ||

నాసై రోగ హరై సబ పీరా |

జపత నిరంతర హనుమత వీరా || 25 ||

సంకట సేఁ హనుమాన ఛుడావై |

మన క్రమ వచన ధ్యాన జో లావై || 26 ||

సబ పర రామ తపస్వీ రాజా |

తినకే కాజ సకల తుమ సాజా || 27 ||

ఔర మనోరధ జో కోయి లావై |

తాసు అమిత జీవన ఫల పావై || 28 ||

చారో యుగ పరితాప తుమ్హారా |

హై పరసిద్ధ జగత ఉజియారా || 29 ||

సాధు సంత కే తుమ రఖవారే |

అసుర నికందన రామ దులారే || 30 ||

అష్టసిద్ధి నవ నిధి కే దాతా |

అస వర దీన్హ జానకీ మాతా || 31 ||

రామ రసాయన తుమ్హారే పాసా |

సాద రహో రఘుపతి కే దాసా || 32 ||

తుమ్హరే భజన రామకో పావై |

జన్మ జన్మ కే దుఖ బిసరావై || 33 ||

అంత కాల రఘువర పురజాయీ |

జహాఁ జన్మ హరిభక్త కహాయీ || 34 ||

ఔర దేవతా చిత్త న ధరయీ |

హనుమత సేయి సర్వ సుఖ కరయీ || 35 ||

సంకట కటై మిటై సబ పీరా |

జో సుమిరై హనుమత బల వీరా || 36 ||

జై జై జై హనుమాన గోసాయీ |

కృపా కరో గురుదేవకీ నాయీ || 37 ||

జో శత వార పాఠ కర కోయీ |

ఛూటహి బంది మహా సుఖ హోయీ || 38 ||

జో యహ పడై హనుమాన చాలీసా |

హోయ సిద్ధి సాఖీ గౌరీశా || 39 ||

తులసీదాస సదా హరి చేరా |

కీజై నాథ హృదయ మహా డేరా || 40 ||

దోహా

పవన తనయ సంకట హరణ – మంగళ మూరతి రూప్ |

రామ లఖన సీతా సహిత .హృదయ బసహు సురభూప్ ||

సియావర రామచంద్రకీ జయ | 

పవనసుత హనుమానకీ జయ | 

బోలో భాయీ సబ సంతనకీ జయ | 

జై శ్రీరామ్..!!..

72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు

1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మ)

2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు)

3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం)

4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం)

5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)

6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు)

7. మానవునికి సహయపడునది ఏది? (ధైర్యం)

8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? (పెద్దలను సేవించుటవలన)

9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును? (అధ్యయనము వలన)

10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల అసాధుభావము సంభవించును.)

11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? ( మౄత్యు భయమువలన)

12. జీవన్మౄతుడెవరు? (దేవతలకూ, అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు)

13. భూమికంటె భారమైనది ఏది? (జనని)

14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి)

15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు)

16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)

17. తౄణం కంటె దట్టమైనది ఏది? (చింత)

18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)

19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? ( అస్త్రవిద్యచే)

20. రాజ్యధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? ( యజ్ణ్జం చేయుటవలన)

21. జన్మించియు ప్రాణంలేనిది (గుడ్డు)

22. రూపం ఉన్నా హౄదయం లేనిదేది? (రాయి)

23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడం వలన)

24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (నది)

25. రైతుకు ఏది ముఖ్యం? (వాన)

26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? (సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)

27. ధర్మానికి ఆధారమేది? (దయ దాక్షిణ్యం)

28. కీర్తికి ఆశ్రయమేది? (దానం)

29. దేవలోకానికి దారి ఏది? (సత్యం)

30. సుఖానికి ఆధారం ఏది? (శీలం)

31. మనిషికి దైవిక బంధువులెవరు? (భార్య/భర్త)

32. మనిషికి ఆత్మ ఎవరు? ( కూమారుడు)

33. మానవునకు జీవనాధారమేది? (మేఘం)

34. మనిషికి దేనివల్ల సంతసించును? (దానం)

35. లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)

36. సుఖాల్లో గొప్పది ఏది? (సంతోషం)

37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? (అహింస)

38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? (మనస్సు)

39. ఎవరితో సంధి శిధిలమవదు? (సజ్జనులతో)

40. ఎల్లప్పుడూ తౄప్తిగా పడియుండునదేది? (యాగకర్మ)

41. లోకానికి దిక్కు ఎవరు? (సత్పురుషులు)

42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? (భూమి, ఆకాశములందు)

43. లోకాన్ని కప్పివున్నది ఏది? (అజ్ణ్జానం)

44. శ్రాద్ధవిధికి సమయమేది? (బ్రాహ్మణుడు వచ్చినప్పుడు)

45. మనిషి దేనిని విడచి స్ర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? ( వరుసగా గర్వం, క్రోధం, లోభం, తౄష్ణ వడచినచో)

46. తపస్సు అంటే ఏమిటి? ( తన వౄత్బికుల ధర్మం ఆచరించడం)

47. క్షమ అంటే ఏమిటి? ( ద్వంద్వాలు సహించడం)

48. సిగ్గు అంటే ఏమిటి? (చేయరాని పనులంటే జడవడం)

49. సర్వధనియనదగు వాడెవడౌ? ( ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు)

50. జ్ణ్జానం అంటే ఏమిటి? (మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం)

51. దయ అంటే ఏమిటి? ( ప్రాణులన్నింటి సుఖము కోరడం)

52. అర్జవం అంటే ఏమిటి? ( సదా సమభావం కలిగి వుండడం)

53. సోమరితనం అంటే ఏమిటి? (ధర్మకార్యములు చేయకుండుట)

54. దు:ఖం అంటే ఏమిటి? ( అజ్ణ్జానం కలిగి ఉండటం)

55. ధైర్యం అంటే ఏమిటి? ( ఇంద్రియ నిగ్రహం)

56. స్నానం అంటే ఏమిటి? (మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం)

57. దానం అంటే ఏమిటి? ( సమస్తప్రాణుల్ని రక్షించడం)

58. పండితుడెవరు? ( ధర్మం తెలిసినవాడు)

59. మూర్ఖుడెవడు? (ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు)

60. ఏది కాయం? ( సంసారానికి కారణమైంది)

61. అహంకారం అంటే ఏమిటి? ( అజ్ణ్జానం)

62. డంభం అంటే ఏమిటి? (తన గొప్పతానే చెప్పుకోవటం)

63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? (తన భార్యలో, తన భర్తలో)

64. నరకం అనుభవించే వారెవరు? (ఆశపెట్టి దానం ఇవ్వనివాడు; వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితౄదేవతల్నీ, ద్వేషించేవాడూ, దానం చెయ్యనివాడు)

65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? (ప్రవర్తన మాత్రమే)

66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? (మైత్రి)

67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? (అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు)

68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు? (సుఖపడతాడు)

69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తౄప్తి చెందేవాడు)

70. ఏది ఆశ్చర్యం? (ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం)

71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? (ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు)

72. స్ధితప్రజ్ణ్జుడని ఎవరిని ఆంటారు? (నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందు, కలిమి లేములందూ, సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతౄప్తుడై


దశావతార నృసింహ మంత్రము

ప్రతిరోజు చదివితే మనసులోని కోరికలు అన్నీ ఒక్కోక్కటిగా నేరవేరుతాయి:

ఓం క్ష్రౌం నమోభగవతే నరసింహాయ |

ఓం క్ష్రౌం మత్స్యరూపాయ నమః |

ఓం క్ష్రౌం కూర్మరూపాయ నమః |

ఓం క్ష్రౌం వరాహరూపాయ నమః |

ఓం క్ష్రౌం నృసింహరూపాయ నమః |

ఓం క్ష్రౌం వామనరూపాయ నమః |

ఓం క్ష్రౌం పరశురామాయ నమః |

ఓం క్ష్రౌం రామాయ నమః |

ఓం క్ష్రౌం బలరామాయ నమః |

ఓం క్ష్రౌం కృష్ణాయ నమః |

ఓం క్ష్రౌం కల్కినే నమః జయజయజయ సాలగ్రామ నివాసినే నమః |

దివ్యసింహాయ నమః |

స్వయంభువే పురుషాయ నమః |

ఓం క్ష్రౌం ||

ఇతరులకు చెప్పకూడదని మీరు మాత్రమే చదివి ఊరుకుంటే ఫలితం ఉండదు, మంచిని నలుగురికి పంచితేనే రెట్టింపు అవుతుంది, కావున కనీసం పదిమందికైనా వి చేసి వారి మంచికి దోహదపడండి, అప్పుడే మీ కోరికలు కూడా నెరవేరుతాయి.

రమణ మహర్షి బోధనలు

1) ఆత్మ శరీరంలో ఎదురు రొమ్ముకు కుడివైపున ఉంది.

2) ‘‘నేను’’ అనేది ఒక మహా మంత్రం. ఇది ఓంకారం కన్నా శక్తివంతమైనది. ఇది భగవంతుని మొదటి నామం.

3) హృదయమే శక్తి కేంద్రం. హృదయం నుండి సహస్రారానికి ‘‘అమ్రత నాడి ఉంది. ఇది అజ్ఞానిలో మూతపడి ఉంటుంది. జ్ఞానిలో తెరుచుకుని ఉంటుంది. ఇది తెరుచుకోవడమే జ్ఞానం. ఇది తెరుచుకోవడమే మోక్షం.

4) ధ్యానం అంటే ఏమిటి? మనల్ని నిరంతరం వెంటాడే శతకోటి అలోచనల దృష్టి మరల్చి ఒక్క ఆలోచనపైనే దృష్టి పెట్టడమే ధ్యానం. ఇలా అభ్యాసం చేయగా చేయగా మనస్సుకు శక్తి కలుగుతుంది. రమణ మహర్షి చెప్పే ధ్యానంలో ప్రత్యేకత ఏమంటే ధ్యానించే వాడినే ధ్యానించాలి. అంటే ధ్యానించేవాడు... ఎవరికి వారే ‘‘నేను’’ కనుక ఆ ‘‘నేను’’ను పట్టకోవాలి. ఆ నేను ఎక్కడుందో ఆమూలాన్ని పట్టుకోవాలి.

5) ఆత్మ విచారణకు సాంప్రదాయకంగా అనేక మార్గాలు ఉన్నాయి. ఈ విచారణలో ఆత్మను, అనాత్మను గురించి విచారించడం జరుగుతుంది. ఈ సాంప్రదాయమార్గాలకు మనసు ఒక పరికరం. అసలు దోషి అయిన ‘‘నేను’’ ఈ విచారణలో భధ్రంగా ఉండి ఎటు తేలదు... రమణులు చెప్పిన విచారణ అయిన ‘‘నేనెవరు’’ ఇందుకు పూర్తిగా విభిన్నమైనది ‘‘నేనెవరు’’ అని తనను తాను వేసుకునే సూటి ప్రశ్న సకల దోషాలకు మూలమైన ‘‘నేను’’ పైనే గురిపెడుతుంది. ఇక్కడ ఇక ‘‘నేను’’ తప్పించుకోవడానికి వీలులేదు.అంటే ‘‘నేనెవరు’’అనే సూటి ప్రశ్న

నేను పైనే నిలబడుతుంది. దాంతో ఇక్కడ అసలు దోషి ‘‘నేను’’దొరికిపోతాడు.

6) ‘‘నేనెవరు’’ అనే విచారణతో మనస్సు అణుగుతుంది. ఈ ‘‘నేను’’ అనే ఆలోచన మనసులో విచారించే ఇతర ఆలోచనల అన్నింటిని అణగదొక్కి చివరకు మనసే తన ఉనికిని కూడా కోల్పోయి అణిగిపోతుంది.‘‘నేను’’ అనే ఆలోచన అన్ని ఆలోచనలను నశింపచేసి, తాను నశించును.

7) ‘‘నిజమైన నేను’’ఆది అంతంలేని అనంతసాగరం లాంటిది. ఈ అనంత సాగరంలో ‘‘మాయా నేను’’ నీటి బుడగలా ఏర్పడుతుంది.ఈ నీటి బుడగనే జీవుడు(మొదటి ఆలోచన)లేదా వ్యక్తిగత ఆత్మ అంటారు. నిజానికి ఈ బుడగకూడ నీరే,నీరులో బాగమే. ఇది బద్దలైనపుడు పూర్ణసాగరంలో కలిసిపోతుంది. ఈ జీవుడు బుడగగా ఉన్నప్పుడు కూడ సాగరంలో ఒక భాగంగానే ఉన్నది. ఈ సరళ సత్యాన్ని విస్మరించి - ఎన్నో సిద్ధాంతాలు రూపుదిద్దుకున్నాయి.

8) ఆత్మజ్ఞాన అన్వేషికి ‘‘నేను’’ను విచారించుటే సూటి అయిన మార్గం.అన్నింటికి కారణమైన ‘‘నేను’’ను విచారించకుండా మనసు, బుద్ధి, ఇంద్రియాలు మొదలైన వాటి గురించి ఆలోచిస్తే లాభం లేదు. ‘‘నేను’’ పోయిందా ,‘‘నేను’’ను ఆధారం చేసుకుని బతుకుతున్న ఇవన్ని ఎగిరిపోతాయి.‘‘నేను’’ అనేది మహా మంత్రం. ‘‘నేను’’ అనేది దేవుడి మొదటి పేరు. ఇది ‘‘ఓం’’కారం కన్నా మహా శక్తి వంతమైనది.

9) ‘‘నేను’’ అనే ఆలోచన పుట్టిన తరువాతే, క్షణం, క్షణం మారే వేలకొద్ది ఆలోచనలు పుడుతున్నాయి. ఇన్ని ఆలోచనలకు మూలమైన, ఇన్ని ఆలోచనలను ఆలోచిస్తున్న ఈ ‘‘నేనెవరు’’ ను నిరంతరం ఆలోచిస్తే ఆ నిజమైన ‘‘నేను’’అనుభవమవుతుంది.

10) నిద్రపోయే ముందు, నిద్రనుండి మేల్కొన్నవెంటనే ‘‘నేనెవరు’’ను ప్రశ్నించుకోవాలి. ఈ రెండు సమాయాల్లో అఖండ విశుద్ధ ప్రజ్ఞ ఒక్క తృటి కాలం పాటు ఉంటుంది. ఇవి ధ్యానానికి ఉత్తమ సమాయాలు. మనస్సు అప్పుడు పరిశుద్ధంగా ఉంటుంది.

ఆహారదోషాలు

మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి:

1.  అర్ధ దోషం , 

2.  నిమిత్త దోషం.                  

3.  స్ధాన దోషం, 

4.  గుణ దోషం ,             

5.  సంస్కార దోషం.  

ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని పెద్దలు చెపుతారు. 

అర్ధ దోషం:

ఒక సాధువు  తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో  ఒక వ్యక్తి  వచ్చి ఆ శిష్యునికి  ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు.

భోజనం చేసి, సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు.ఆ గదిలోనే  శిష్యుడు దాచిన డబ్బు మూట వుంది. 

హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది , ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తన సంచీలో దాచేశాడు.

తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని, తిరిగి తన ఆశ్రమానికివెళ్ళి పోయాడు.మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు.  

తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దుననే  మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్థం చేసుకున్నాడు.

వెంటనే  తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆ డబ్బును  తిరిగి ఇచ్చేశాడు. శిష్యుడిని ఎలాంటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు. 

శిష్యుడు తలవంచుకొని, "నన్ను క్షమించండి, స్వామి!  యిది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు." అని తలవంచుకొన్నాడు.

ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో , తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం.  మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం. 

నిమిత్త దోషం

మనం తినే ఆహారాన్ని  వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమ కల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి.

వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాక కూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజాలు  వంటివి పడ కూడదు.

అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి దుష్ట గుణాలు అవతలివారికి కలుగుతాయి. 

భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుధ్ధంలో బాణాలతో  కొట్టబడి యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య మీద ప్రాణాలతోనే  వున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడు వున్నారు. వారికి భీష్ముడు మంచి మంచి  విషయాలను  బోధిస్తూ వచ్చాడు.

అప్పుడు ద్రౌపది కి ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయాడు?  అని అనుకొన్నది.

ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు

'అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను. 

నా స్వీయ బుధ్ధిని ఆ ఆహారం తుడిచి పెట్టింది. శరాఘాతములతో, ఛిద్రమైన దేహంతో, ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున, పాత రక్తం - బిందువులుగా బయటికి పోయి నేను 

ఇప్పుడు పవిత్రుడినైనాను.

నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్ముడు.

చెడ్డ గుణములు వున్న వారు ఇచ్చినది  తినినందు వలన మనిషిలోని మంచి గుణములు నశించి 'నిమిత్త దోషం ' ఏర్పడుతోంది.

 స్ధాన దోషం

ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి. వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాల వలన చేయబడిన వంటll కూడా పాడైపోతుంది.

యుధ్ధరంగానికి, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంతl మంచివి కావు.

దుర్యోధనుడు  ఒకసారి యాభైఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని  విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది.  తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి,  ఆనంద సంభ్రమాలతో తొందర పాటు పడి,అరటి పండు తొక్కవలిచి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే  తీసుకొని  ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, "విదురా! నేను ఆప్యాయతతో 

కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధా భక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏది యిచ్చినా సంతోషంగా తీసుకుంటాను. అని అన్నాడు. 

మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి 

గుణ దోషం

మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా వుండాలి. సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని  లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది.

రామాయణ ప్రాథమిక విజ్ఞానం


1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?

= వాల్మీకి.


2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?

= నారదుడు.


3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?

= తమసా నది.


4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?

=24,000.


5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?

=కుశలవులు.


6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?

=సరయూ నది.


7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?

=కోసల రాజ్యం.


8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?

=సుమంత్రుడు.


9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?

=కౌసల్య, సుమిత్ర, కైకేయి.


10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?

=పుత్రకామేష్ఠి.


11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?

= కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.


12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వానరుడెవరు?

=జాంబవంతుడు.


13. వాలి ఎవరి అంశతో జన్మించెను?

= దేవేంద్రుడు.


14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?

=హనుమంతుడు.


15. కౌసల్య కుమారుని పేరేమిటి?

=శ్రీరాముడు.


16. భరతుని తల్లి పేరేమిటి?

=కైకేయి.


17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి?

=లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.


18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?

=వసిష్ఠుడు.


19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?

=12 సంవత్సరములు.


20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?

=మారీచ, సుబాహులు.


21. రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?

=బల-అతిబల.


22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?

=సిద్ధాశ్రమం.


23. తాటక భర్త పేరేమిటి?

=సుందుడు.


24. తాటకను శపించిన మహర్షి ఎవరు?

=అగస్త్యుడు.


25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?

=భగీరథుడు.


26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?

=జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.


27. అహల్య భర్త ఎవరు?

=గౌతమ మహర్షి.


28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?

=శతానందుడు.


29. సీత ఎవరికి జన్మించెను?

=నాగటి చాలున జనకునికి దొరికెను.


30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?

=దేవరాతుడు.


31. శివధనుస్సును తయారు చేసినదెవరు?

=విశ్వకర్మ.


32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?

=మాండవి, శృతకీర్తి.


33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?

=జనకుడు.


34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?

=కుశధ్వజుడు.


35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?

=వైష్ణవ ధనుస్సు.


36. భరతుని మేనమామ పేరు ఏమిటి?

=యధాజిత్తు.


37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?

=మంధర.


38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?

=గిరివ్రజపురం, మేనమామ యింట.


39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?

=శృంగిబేరపురం.


40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను?

=గారచెట్టు.


41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?

=భారద్వాజ ముని.


42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?

=మాల్యవతీ.


43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?

=తైలద్రోణములో.


44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?

=జాబాలి.


45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?

=నందిగ్రామము.


46. అత్రిమహాముని భార్య ఎవరు?

=అనసూయ.


47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?

=విరాధుడు.


48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?

=అగస్త్యుడు.


49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?

=గోదావరి.


50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?

=శూర్ఫణఖ.


51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?

=జనస్థానము.


52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను?

=మారీచుడు.


53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?

=బంగారులేడి.


54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు?

=జటాయువు.


55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను?

=దక్షిణపు దిక్కు.


56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను?

=కబంధుని.


57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?

=మతంగ వనం, పంపానదీ.


58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను?

=ఋష్యమూక పర్వతం.


59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను?

=హనుమంతుడు.


60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?

=అగ్ని సాక్షిగా.


61. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?

=కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు.


62. సుగ్రీవుని భార్య పేరు?

=రుమ.


63. వాలి భార్యపేరు?

=తార.


64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?

=కిష్కింధ.


65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి?

=మాయావి.


66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?

=దుందుభి.


67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను?

=మతంగముని.


68. వాలి కుమారుని పేరేమిటి?

=అంగదుడు.


69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను?

=ఏడు.


70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను?

=ప్రసవణగిరి.


71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు తూర్పు దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?

=వినతుడు.


72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?

=అంగదుడు.


73. సుగ్రీవునికి, సీతాన్వేషణ కోసం పశ్చిమ దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి?

=మామగారు, తార తండ్రి.


74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు ఉత్తర దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?

=శతబలుడు.


75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను?

=మాసం (ఒక నెల).


76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను?

=దక్షిణ దిక్కు.


77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను?

=తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము.


78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?

=స్వయంప్రభ.


79. సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి?

=సంపాతి.


80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?

=పుంజికస్థల.


81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి?

=మహేంద్రపర్వతము.


82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?

=మైనాకుడు.


83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి?

=సురస.


84. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి?

=సింహిక.


85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?

=నూరు యోజనములు.


86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి?

=లంబ పర్వతం.


87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?

=అశోక వనం.


88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను?

=రెండు.


89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?

=త్రిజట.


90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను?

=రామ కథ.


91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి?

=చూడామణి.


92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?

=ఎనభై వేలమంది.


93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను?

=ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.


94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?

=విభీషణుడు.


95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి?

=మధువనం.


96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?

=మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు.


97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?

=ఆలింగన సౌభాగ్యం.


98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి?

=నీలుడు.


99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను?

=నికుంభిల.


100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు?

=అగస్త్యుడు.


101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?

=ఇంద్రుడు.


102. రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?

=మాతలి.


103. రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది?

=కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!


104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను?

=హనుమంతుడు.


105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి?

=శత్రుంజయం.


106. శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?

=స్వయంగా తన భవనమునే యిచ్చెను.


107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది?

=బ్రహ్మ.


108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏమిటి?

=తన మెడలోని ముత్యాలహారం.


శ్రీ రామ జయం!

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...