Saturday, April 28, 2018

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము శ్రేయస్కరము

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము శ్రేయస్కరము. అభీష్టసిద్ధికి ఈ క్రింద సూచించిన శ్లోకములను 108 మార్లు జపించవలెను. పిల్లల క్షేమార్ఠము తల్లిదండ్రులు జపము చేయవచ్చును:
 
1. విద్యాభివృద్ధికి:
(14)
సర్వగ సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్దనః |వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ||
 
2. ఉదర రోగ నివృత్తికి:
(16)
భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః |
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ||
 
3. ఉత్సాహమునకు:
(18)
వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధుః |
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ||
 
4. మేధాసంపత్తికి:
(19)
మహాబుధ్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః |
అనిర్దేశ్య వపుః శ్రీమా నమేయాత్మా మహాద్రిధృక్ ||
 
5. కంటి చూపునకు:
(24)
అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణః |
సహస్రమూర్థా విశ్వాత్మ సహస్రాక్ష స్సహస్రపాత్
||
 
6. కోరికలిరేడుటకు:
(27)
అసంఖ్యేయో2ప్రమేయాత్మ విశిష్ట శ్శిష్ట క్రుచ్ఛిచిః |
సిద్ధార్థ స్సిధ్ధసంకల్పః సిద్ధిద స్సిధ్ధిసాధనః ||
 
7. వివాహ ప్రాప్తికి:
(32)
భూతభవ్య భవన్నాధః పవనః పావనో2నలః |
కామహా కామక్రుత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ||
 
8. అభివృద్ధికి:
(42)
వ్యవసాయో వ్యవస్థానః సంస్థాన స్స్థానదో ధ్రువః |
పరర్థిః పరమ స్పష్ట: స్తుష్ట: పుష్ట శ్శుభేక్షణః ||
 
9. మరణ భీతి తొలగుటకు:
(44)
వైకుంఠ: పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః ప్రుథుః |
హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః ||
 
10. కుటుంబ ధనాభివ్రుద్ధికి:
(46)
విస్తారః స్థావర స్స్టాణుః ప్రమాణం బీజ మవ్యయం |
అర్థో2నర్థో మహాకోశో మహాభోగో మహాధనః ||
 
11. జ్ఞానాభివ్రుద్ధికి:
(48)
యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతు స్సత్రం సతాం గతిః |
సర్వదర్సీ నివృతాత్మ సర్వజ్ఞో జ్ఞాన ముత్తమం ||

12. క్షేమభివ్రుధ్ధికి:
(64)
అనివర్తీ నివృత్తాత్మ సంక్షేప్తా క్షేమక్రుచ్ఛివః |
శ్రీవత్సవక్షా శ్శ్రీవాస శ్శ్రీపతిః శ్శ్రీమతాం వరః ||
 
13. నిరంతర దైవ చింతనకు:
(65)
శ్రీద శ్శ్రీశ శ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః |
శ్రీధరః శ్రీకర శ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ||

14. దుఃఖ నివారణకు:
(67)
ఉదీర్ణ స్సర్వత శ్చక్షు రనీశ శ్శాశ్వత స్థిరః |
భూశయో భూషణో భూతి ర్విశోక శ్శోక నాశనః ||
 
15. జన్మ రాహిత్యమునకు:
(75)
సద్గతి స్సత్క్రుతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః |
శూరసేనో యదుశ్రేష్ఠ స్సన్నివాస స్సుయామునః ||
 
16. శత్రువుల జయించుటకు:
(88)
సులభ స్సువ్రత సిద్ధ శ్శత్రుజి చ్ఛత్రు తాపనః !
న్యగ్రోధో దుంబరో2శ్వత్ఠ శ్చాణూరాంధ్ర నిషూధనః ||
 
17. భయ నాశనమునకు:
(89)
సహస్రార్చి స్సప్తజిహ్వ స్సప్తైధా స్సప్తవాహనః |
అమూర్తి రణఘో2చింత్యో భయక్రు ద్భయ నాశనః ||
 
18. మంగళ ప్రాప్తికి:
(96)
సనాత్సనాతన తమః కపిలః కపి రవ్యయః |
స్వస్తిద స్స్వస్తిక్రుత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ||
 
19. ఆపదలు తొలగుటకు, లోక కల్యాణమునకు:
(97 & 98)
అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః |
శబ్దాదిగ శ్శబ్దసహ శ్శిశిర శ్శర్వరీకరః ||
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః |
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ||
 
20. దుస్వప్న నాసనమునకు:
(99)
ఉత్తారణో దుష్క్రుతిహా పుణ్యోదుస్వప్న నాశనః |
వీరహా రక్షణ స్సంతో జీవనం పర్యవస్తితః ||
 
21. పాపక్షయమునకు:
(106)
ఆత్మయోని స్స్వయం జాతో వైఖాన స్సామగాయనః |
దేవకీ నందన స్స్రష్తా క్షితీశః పాపనాసనః ||
 
శ్రీరస్తు --- శుభమస్తు --- విజయోస్తు
 
ఓం ...
అసతోమా సద్గమయ
తమసోమ జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమ్రుతంగమయా
 
ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతిః

Friday, April 27, 2018

మనస్సును కదిలించే ఆదిశంకరుల మాతృ పంచకం---------------

కాలడి లో ఆది శంకరుల తల్లి ఆర్యా౦బ మరణశయ్యపై వుంది. తనను తలుచుకున్న వెంటనే ఆమె దగ్గరకు వచ్చి ఆమెకు ఉత్తరక్రియలు చేశారు. ఆ సందర్భం లో శంకరులు చెప్పిన ఐదు శ్లోకాలు "మాతృపంచకం" గా ప్రసిద్ధమైనవి.

1 .ముక్తామణిస్త్వం నయనం మమేతి
    రాజేతి జీవేతి చిరం సుతత్వం
    ఇత్యుక్తవత్యా స్తవవాచి మాతః
    దదామ్యహం తండులమేవ శుష్కం.
తా:--అమ్మా! నీవు నా ముత్యానివిరా! నా రత్నానివిరా! నా కంటి వెలుగువురా నాన్నా! నువ్వు చిరంజీవిగా వుండాలి. అని నన్ను ప్రేమగా పిలిచిన నీ నోటిలో ఈనాడు కేవలం
యిన్ని శుష్కమైన బియ్యపు గింజలు వేస్తున్నాను. నన్ను క్షమించు.

2 .   అంబేతి తాతేతి శివేతి తస్మిన్
       ప్రసూతి కాలే యాదవోచ వుచ్యై :
       కృష్ణేతి గోవింద హరే  ముకుందే
       త్యహో జననై రచితోయమంజలి.

తా:--పంటిబిగువున నా ప్రసవకాలములో వచ్చే బాధను ఆపుకోలేని బాధను "అమ్మా!
అయ్యా! శివా! కృష్ణా! హరా! గోవిందా!" అనుకుంటూ భరించి నాకు జన్మనిచ్చిన తల్లికి నేను నమస్కరిస్తున్నాను.

3 .  అస్తాం తావదియం ప్రసూతి సమయే
      దుర్వార శూలవ్యథా నైరుచ్యం
      తను శోషణం మలమయీ శయ్యాచ
      సంవత్సరీ ఏకస్యాపినగర్భభార భరణ క్లేశస్య
     యస్యాక్షమః దాతుం నిష్కృతి
     మున్నతోసి తనయ:తస్యై జననై నమః

తా:-- అమ్మా! నన్ను కన్న సమయం లో నువ్వు ఎంతటి శూల వ్యథను అనుభవించావో కదా! శరీరం కళను కోల్పోయి శుష్కించి వుంటుంది. మలముతో శయ్య మలినమైనా
ఒక సంవత్సరకాలం ఆ కష్టాన్ని ఎలా సహించావో కదా!ఎవరూ అలాంటి బాధను భరించలేరు.ఎంత గొప్ప వాడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా?నీకు నమస్కారం చేస్తున్నాను

4 .  గురుకులముపసృ త్యస్సప్న కాలేతు దృష్ట్వా
     యతిసముచితవేషం ప్రారుదోత్వముచ్చె:
     గురుకుల మథ సర్వ౦ ప్రారుదత్తే సమక్షం
     సపది  చరణ యోస్తే మాతరస్తు ప్రణామః

తా:--కలలో నేను సన్యాసి వేషం లో కనబడేసరికి బాధపడి, మా గురుకులానికి వచ్చి ఏడ్చావు. ఆ సమయం లో నీ దుఃఖం అక్కడివారందరికీ బాధ కలిగించింది. అంత గొప్ప దానివైన నీ పాదాలకు నమస్కరిస్తుంన్నాను.

5 .    న దత్తం మాతస్తే మరణ సమయే
       తోయమపివా న్యథా నా నో దత్తా మరణ దివసే
      శ్రాద్ధ విధినా న జప్త్యా మాతస్తే మరణ సమయే
      తారకనామ మనురాకాలే సంప్రాప్తే మయి కురు దయాం
      మాతురు తులామ్

తా:--అమ్మా! సమయం మించిపోయాక వచ్చాను నీ మరణ సమయంలో కొంచెం నీళ్లు
కూడా నేను గొంతులో పొయ్యలేదు. శ్రాద్ధ విధిని అనుసరించి "స్వధా ను" యివ్వలేదు
 ప్రాణము పోయే సమయము లో నీ చెవిలో తారకమంత్రాన్ని చదవలేదు. నన్ను క్షమించి, నాయందు దేనితో సమానము కానీ దయ చూపించుము తల్లీ!

భగవద్గీత

వేదాంతగ్రంథములలో భగవద్గీత కున్నంత ప్రాముఖ్యము మరొక గ్రంథమున కుండదు. దేశభాషలలోనేకాక పాశ్చాత్యభాషలలో సహితము గీతకు అనువాదములు వ్యాఖ్యానములు ఎన్నియో కలవు. యుద్దభూమిలో అర్జునునికి కృష్ణభగవానుడిచ్చిన సందేశము నాడేకాక నేటికిని అనుగుణమై చదివినవారికి ఉత్తేజకరమై వెలయుచున్నది. గీతతో సమానోత్కష్టతగల మరికొన్ని గ్రంథములు గీతలని పేరుపెట్టుకొన్నను భగవద్గీతకే ఇంతటిపేరు. పార్థునికి బోధింపబడి, దివ్యజ్ఞాన సంపన్నమై సత్యామార్గదర్శినియై చిరతరోన్నత స్థాయిని వహించిన ఈ గ్రంథరాజము - ప్రాముఖ్యమునకు కారణము గీతాభూమికయందు కాననగును.

ఈ మధురనాటకమున అర్జునునిది ప్రధానపాత్ర. అర్జునుడు రథోపనిష్టుడై యుండును. రథమునకు సారథి కృష్ణుడు. ఒక్క క్షణము క్రితము అర్జునుడు కృష్ణుని 'సేవయో రుభయోర్మధ్యే రథం స్థాపయ మేఽచ్యుత' అని అడిగియుండెను. కాని ఇపుడొ? గురుచరణ సాన్నిధ్యమున వినతుడగు శిష్యునివలె అతడు శరణుజొచ్చి తన్ను అనుగ్రహించి మార్గము చూపుమని కృష్ణుని వేడుకొనెను.

'శిష్య స్తే హం శాధి మాం త్వాం ప్రపన్నం'

చెప్పుటకుకాని, చదువుకొనుటకుకాని ఎంతతగినచోటు ఆ రణభూమి! మరుసటి క్షణమున శిరసు ఉండునో లేక తెగిపడి రక్తసిక్తమై రణభూమిలో దొరలాడునో అర్జునునికి తెలియదు. ఒక వేదాంతసభ జరుగుచున్న దనుకొనుడు. చిన్న వానవచ్చిన చాలును. శ్రోతలు అటులనే కరగిపోవుదురు. వినుచున్న తత్త్వమెంత గొప్పదైనను శ్రోతలకు ఉపన్యాసము కంటే తమ వస్త్రరక్షణమే ముఖ్యము. కాని ఇచట తత్త్వమును వినగోరువాడు మృత్యుదంష్ట్రాగ్రస్తుడు. అతనికి తత్త్వ బోధచేయుటకు భగవానుడు సిద్ధుడైయే యుండును. భగవద్గీత తదితర గ్రంథములకంటె ప్రశస్తినొందుటకు ఈ భూమికయే కారణము. ఈసన్నివేశమునే మరొకదృష్టిని చూడవచ్చు. తాను జ్ఞానోపదేశము పొందుటకు అర్హుడని అర్జనుడు భగవానునికి నిరూపించుకొనెను. యుద్ధమపుడే జరుగబోనున్నది. యుద్ధము మొదలుపెట్టినయెడల ఇరుసేవలలో బ్రతికి బయటపడువారెవరో ఎవరికిని తెలియదు. యుద్ధము చేయనని చెప్పినను అర్జునుడు భీరువుకాడు. యుద్ధభూమినుండి పారిపోవలెనని కాదు అతడుకోరుకొన్నది. అతని యుద్దవైముఖ్యమున కొక్కటియే కారణము. యుద్ధమున పెద్దలను బంధువులను చంపవలసి వచ్చును. అది అతని కిష్టములేదు. తాను నిరస్త్రుడైనను శత్రువులు తన్ను చంపిననుసరే వెనుదీయనని అతడు కృష్ణునితో విన్నవించెను. నిజమున కాతడు అట్టిస్థితిని నిరీక్షించు చుండెను. తాను చచ్చిననుసరే యుద్ధములోని హింసాకాండ నివారణమగునని అతని ఆశ. అనగా అర్జునుడు తన కోరికలన్నిటిని అణచుకొని విరాగియాయెను. వైరాగ్య మెపుడాతనికి కల్గెనో సత్యజ్ఞాన గ్రహణమున కాతడు పాత్రుడాయెను. వైరాగ్య మొకనికి సిద్ధించినదా లేదా యని పరీక్షించుటకు యుద్ధభూమికి సమానమగు ఒరపిడిరాయి మరొకటి కానుపించదు. అర్జునుడు జ్ఞానమునకై ఆతురపడు చుండెను. పరీక్షలోనెగ్గి తన పాత్రను నిరూపించుకొన్నందున భగవానుడతనికి జ్ఞానబోధచేసెను. గీతాసందేశపు శాశ్వతౌన్నత్యమున కిదియే పునాది.

యుద్ద బహిష్కరణకై అర్జునుడు పరమాత్మతో ఎంతయో హేతువాదము చేసెను. ఏ సందర్భమైనను సరియే యుద్ధము అక్రమము. ప్రతిపక్షము మూంåతతో యుద్ధమును కోరుకొని యుద్ధోత్సుకతను ప్రదర్శించినను మనము యుద్ధముచేయ నిరాకరించవలెను. అట్టితరి హానితక్కువ - న్యాయస్థానమున న్యాయాధికారి విధించు శిక్షకును యుద్ధమునకును ఎట్టి పోలికయునులేదు. న్యాయాధికారి నిష్పక్షపాతి. అతడు విధించెడి శిక్ష ఇతరులను క్రూరకర్మలనుండి మరలించును. శిక్షితుడయినాడన్న దుర్యశము, చెరసాలలోని కష్టజీవనములు నేరముచేసిన వానికి ఒక గుణపాఠము నేర్పును. వాడు మరల అట్టి కార్యము చేయడు. కావున శిక్షయనునది నేరముల కొకవిధమైన నిరోధమే కాని యుధ్దవిషయ మటుకాదు. యుద్ధమున వృద్ధులు పెక్కుమంది మరణింతురు. అప్పడు స్త్రీ బాలురకు సదుపదేశము లీయజాలని అసహాయస్థితి యేర్పడును. అందుచే కుల నాశనమున కులధర్మచ్యుతియును సంభవించును. కుల స్త్రీలు చెడిపోవుదురు. వారి వినష్టతచే వర్ణసంకరమగును. వర్ణ సంకరమునకు కారణభూతులు నరకమునబడి అమితబాధలనొందుదురు. అందుచే యుద్దము మోక్షమునకుగాని నిత్యసుఖమునకుగాని దారిదీయుటకు బదులు నిత్యదుఃఖమునకు హేతువగును. ధర్మరక్షణార్థము మనము నాశనమైననుసరే, యుద్ధోన్ముఖులపై మరింత మానవక్షీణతకు మనము కారకులమగుట తప్పు. ఇట్లు తన ఉద్దేశమును అర్జనుడు భగవానునితో చెప్పి శోకసంనిగ్న మానసుడై కూర్చుండెను.

దీనికి భగవాను డేమి బదులిచ్చును? ఆయన ప్రత్యుత్తరమున మందలింపు గర్భితమై ఉండును. 'ఈ హృదయదౌర్బల్యము వదలిపెట్టు.' అర్జునా!లే! లెమ్ము.

'క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ'

నీవు యుద్ధమునుండి - వారు చచ్చెదరని. వీరు చచ్చెదరని దుఃఖమునకు భయపడి విరమించుకొనిన అదితప్పు. నీకు అహంకారము మమకారము ఇంకను వదలలేదని అర్ధము, నీవు క్షత్రియుడవు. యుద్దము చేయుట నీవిధి. ఇప్పటికి మనస్థ్సితిలో నీకు కర్మసన్యాసమునకు అధికారములేదు. నిస్సంగికి కర్మ అవసరము లేదు. కానీ నీకు కాదు. నీ పెద్దలయందును బంధువు అందును గురువులయందును సంగముంచి వారెక్కడ నశింతురోయని దుఃఖించుచున్నావు. అందుచే నీవు కార్యవిముఖుడవు కారాదు. ఆకర్తృత్వసిద్ధి నీకు ఇంకను లభించలేదు. అట్టి సిద్ధిని నీవు పొందవలెననిన, నీస్వధర్మము నీకు ఏకర్మను విధించియున్నదో దానిని నీవు చేయక తప్పదు అని భగవానుడు అర్జునుని మందలించును.

ఇందు భగవానుడు 'జీవకారుణ్యభూతమగు యుద్ధవిముఖతకు అధికారము కావలెనని ఒకడు ఇచ్చగించిన తన్ను తాను ముందు సంస్కరించుకొనవలె' నని అర్జునునకు బోధించును. మన లోపములు మనము సంస్కరించుకొనని పక్షమున లోక క్షేమముకొరకు యత్నించుటకు మనకు అధికారములేదు. దుఃఖమునకును క్రోధమునకును లొంగిన యొకడు ఇతరుల దుఃఖ క్రోధములనెట్లు తొలగించగలడు? భ్రాంతియుక్తుడైన మానవుడు ప్రపంచములోని యితరుల భ్రాంతినెట్లు పోగొట్టగలడు? అట్లుగాక మానసిక దౌర్బల్యమును అణచి దుఃఖాతీతుడై యొకడు ఆత్మోపలబ్థినందుచో అతని ఉనికి ప్రపంచసౌఖ్యమునకు కారణమగును. అతడు ప్రపంచసంస్కరణ కొరకు పాటుపడ నవసరములేదు. లోకక్షేమమునకై యత్నపడ నక్కరలేదు. అతనిని చూచి లోకము తన్ను, తనవర్తనము సంస్కరించుకొనుము. అట్టి పరివర్తనము కల్గినవాడు లోకక్షేమము తానుగ సిద్ధించును. దుఃఖాదులు తొలగవలెనన్న జ్ఞానమే సాధనము. అందు చేతనే భగవానుడు అర్జునునికి ఆత్మజ్ఞానమును బోధించుట, దానిని సాంతము విన్న అర్జునుడు 'నష్టో మోహః' అని ఆత్కంఠతతో పల్కుట.

అర్జునుని విషాదముతో గీత ప్రారంభమగును. విషాద గ్రస్తుడగు అర్జునుని ప్రథమమున భగవానుడు మందలించును. కడపట 'మాశుచః' యని ఊరడచేయును. తస్మాత్ 'యధ్యస్వ' యని ఆజ్ఞాపించుటచే ఇరుప్రక్కల, ఎంతమంది వీరులు హతులైనను క్షత్రియుడు తన స్వధర్మమును చేసితీరవలెనని తెలియుచున్నది. జ్ఞానప్రాప్తికి చిత్తశుద్ది అత్యావశ్యకము. అది సంగరాహిత్యముతో దైవమునందు భారమువైచి స్వధర్మము చేయుటచే కల్గును. అట్టి జ్ఞాని పవిత్రహృదయుడై తన యునికి చేతనే లోకసంగ్రహ మాపాదించును. తన్నుద్ధరించుకొన్న వాడే ఎదుటవారిని ఉద్ధరించగలడు.                     

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

--- “జగద్గురు బోధలు” నుండి
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

*హిందూ ఋషులు జాబితా*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
అక్షర క్రమంలో హిందూ ఋషుల పేర్లు*
అ - ఆ - ఇ - ఈ - ఉ - ఊ - ఋ - ఎ - ఏ - ఐ - ఒ - ఓ - ఔ - అం - క - ఖ - గ - ఘ - చ - ఛ - జ - ఝ - ట - ఠ - డ - ఢ - త - థ - ద - ధ - న - ప - ఫ - బ - భ - మ -య - ర - ల - వ - శ - ష - స - హ - ళ - క్ష

దేవర్షి : దేవలోకంలో ప్రతిష్ఠ కలవారు దేవర్షులు.
బ్రహ్మర్షి : ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అంటారు.
మహర్షి : సామాన్య ఋషి స్థాయిని దాటిన గొప్ప ఋషులను మహర్షి అంటారు.
రాజర్షి : రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందినవాడు రాజర్షి.


అగ్ని మహర్షి
అగస్త్య మహర్షి
అంగీరస మహర్షి
అంగిరో మహర్షి
అత్రి మహర్షి
అర్వరీవత మహర్షి
అభినామన మహర్షి
అగ్నివేశ మహర్షి
అరుణి మహర్షి
అష్టావక్ర మహర్షి
అష్టిక మహర్షి
అథర్వణ మహర్షి
ఆత్రేయ మహర్షి
అథర్వాకృతి‎
అమహీయుడు
అజామిళ్హుడు‎
అప్రతిరథుడు‎
అయాస్యుడు‎
అవస్యుడు
అంబరీషుడు

ఇరింబిఠి‎


ఉపమన్యు మహర్షి
ఉత్తమ మహర్షి
ఉన్మోచన
ఉపరిబభ్రవుడు
ఉద్దాలకుడు‎
ఉశనసుడు
ఉత్కీలుడు

ఊర్ఝ మహర్షి
ఊర్ద్వబాహు మహర్షి

ఋచీక మహర్షి
ఋషభ మహర్షి
ఋష్యశృంగ మహర్షి
ఋషి


ఔపమన్యవ మహర్షి
ఔరవ మహర్షి

కపిల మహర్షి
కశ్యప మహర్షి
క్రతు మహర్షి
కౌకుండి మహర్షి
కురుండి మహర్షి
కావ్య మహర్షి
కాంభోజ మహర్షి
కంబ స్వాయంభువ మహర్షి
కాండ్వ మహర్షి
కణ్వ మహర్షి
కాణ్వ మహర్షి
కిందమ మహర్షి
కుత్స మహర్షి
కౌరుపథి‎
కౌశికుడు‎
కురువు
కాణుడు‎
కలి
కాంకాయనుడు
కపింజలుడు‎
కుసీదుడు

గౌతమ మహర్షి
గర్గ మహర్షి
గృత్సమద మహర్షి
గృత్సదుడు‎
గోపథుడు‎
గోతముడు
గౌరీవీతి
గోపవనుడు
గయుడు

చ్యవన మహర్షి
చైత్ర మహర్షి
చాతనుడు‎

జమదగ్ని మహర్షి
జైమిని మహర్షి
జ్యోతిర్ధామ మహర్షి
జాహ్న మహర్షి
జగద్బీజ
జాటికాయనుడు‎

తండి మహర్షి
తిత్తిరి మహర్షి
త్రితుడు
తృణపాణి

దధీచి మహర్షి
దుర్వాస మహర్షి
దేవల మహర్షి
దత్తోలి మహర్షి
దాలయ మహర్షి
దీర్ఘతమ మహర్షి
ద్రవిణోదస్సు‎

నచికేత మహర్షి
నారద మహర్షి
నిశ్ఛర మహర్షి
సుమేధా మహర్షి
నోధా
నృమేధుడు

పరశురాముడు
పరాశర మహర్షి
పరిజన్య మహర్షి
పులస్త్య మహర్షి
ప్రాచేతస మహర్షి
పులహ మహర్షి
ప్రాణ మహర్షి
ప్రవహిత మహర్షి
పృథు మహర్షి
పివర మహర్షి
పిప్పలాద మహర్షి
ప్రత్య్సంగిరసుడు
పతివేదనుడు
ప్రమోచన‎
ప్రశోచనుడు‎
ప్రియమేథుడు
పార్వతుడు
పురుహన్మ‎
ప్రస్కణ్వుడు
ప్రాగాథుడు
ప్రాచీనబర్హి
ప్రయోగుడు
పూరుడు
పాయు

భరద్వాజ మహర్షి
భృగు మహర్షి
భృంగి మహర్షి
బ్రహ్మర్షి మహర్షి
బభ్రుపింగళుడు
భార్గవవైదర్భి‎
భాగలి
భృగ్వంగిరాబ్రహ్మ
బ్రహ్మస్కందుడు‎
భగుడు‎
బ్రహ్మర్షి
బృహత్కీర్తి‎
బృహజ్జ్యోతి‎
భర్గుడు

మరీచి మహర్షి
మార్కండేయ మహర్షి
మిత మహర్షి
మృకండు మహర్షి
మహాముని మహర్షి
మధు మహర్షి
మాండవ్య మహర్షి
మాయు
మృగారుడు‎
మాతృనామ‎
మయోభువు‎
మేధాతిథి
మధుచ్ఛందుడు
మనువు
మారీచుడు

యాజ్ఞవల్క మహర్షి
యయాతి‎

రురు మహర్షి
రాజర్షి మహర్షి
రేభుడు

వశిష్ట మహర్షి
వాలఖిల్యులు
వాల్మీకి మహర్షి
విశ్వామిత్ర మహర్షి
వ్యాస మహర్షి
విభాండక ఋషి
వాదుల మహర్షి
వాణక మహర్షి
వేదశ్రీ మహర్షి
వేదబాహు మహర్షి
విరాజా మహర్షి
వైశేషిక మహర్షి
వైశంపాయన మహర్షి
వర్తంతు మహర్షి
వృషాకపి
విరూపుడు‎
వత్సుడు‎
వేనుడు
వామదేవుడు‎
వత్సప్రి
విందుడు

శంఖ మహర్షి
శంకృతి మహర్షి
శతానంద మహర్షి
శుక మహర్షి
శుక్ర మహర్షి
శృంగి ఋషి
శశికర్ణుడు
శంభు‎
శౌనకుడు
శంయువు‎
శ్రుతకక్షుడు

సమ్మిత మహర్షి
సనత్కుమారులు
సప్తర్షులు
స్థంభ మహర్షి
సుధామ మహర్షి
సహిష్ణు మహర్షి
సాంఖ్య మహర్షి
సాందీపణి మహర్షి
సావిత్రీసూర్య
సుశబ్దుడు‎
సుతకక్షుడు‎
సుకక్షుడు‎
సౌభరి
సుకీర్తి‎
సవితామహర్షి సామావేదానికి మూలము.
సింధుద్వీపుడు
శునఃశేపుడు
సుదీతి

హవిష్మంత మహర్షి
హిరణ్యరోమ మహర్షి

ద్వాదశ జ్యోతిర్లింగాలు - 12 రాశులు

ద్వాదశ జ్యోతిర్లింగాలు తెలుసు.
12 రాశులు కూడా తెలుసు.
కానీ మన రాశికి సరిపడిన జ్యోతిర్లింగమేదో తెలుసా?

మేషం       -   రామేశ్వరం    -  తమిళనాడు
వృషభం    -   సోమనాథ్     -  గుజరాత్
మిధునం   -   నాగేశ్వరం     -  గుజరాత్
కర్కాటకం -   ఓంకారేశ్వరం -  మధ్యప్రదేశ్
సింహం     -   వైద్యనాథ్      -  jharkhand
కన్య         -   శ్రీశైలం           -  ఆంధ్ర ప్రదేశ్
తుల        -   మహాళేశ్వరం -  మధ్యప్రదేశ్
వృశ్చికం   -   ఘృష్ణేశ్వరం   -  మహారాష్ట్ర
ధనుస్సు   -  విశ్వేశ్వరం     -  కాశి
మకరం     -  భీమశంకరం   - మహారాష్ట్ర
కుంభం     -  కేదారేశ్వరం    - ఉత్తరాఖండ్
మీనం       - త్రయంబకేశ్వరం - మహారాష్ట్ర

Friday, April 20, 2018

శంకర జయంతి......ఆది శంకరాచార్య...



ఈ భారత ఖండంలో అనేకానేక కొత్త కొత్త సిద్ధాంతాలు, మతాలూ పుట్టుకొచ్చి, ప్రజలకి సనాతన ధర్మం పట్ల, భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే ఆది శంకరాచార్య.

జగద్గురు ఆది శంకరాచార్య క్రీ.పూ.509 (విభవ నామ సంవత్సరం, వైశాఖ శుద్ధ పంచమి నాడు కర్కాటక లగ్నమందు) కేరళ రాష్ట్రం, కాలడి లో శివగురు, ఆర్యాంబ దంపతులకు జన్మించారు.

ఆయన జనన కాలం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నప్పటికీ, కంచి మున్నగు పీఠాలు అంగీకరించినవి మరియు మన హిందూ గ్రంథాల ప్రకారం, ఆయన జీవన కాలం క్రీ.పూ.509 – క్రీ.పూ. 477 అని తెలియవస్తోంది.

ఆయన తన రెండవ ఏటనే రాయడం, చదవడం మొదలుపెట్టారు. మూడవ ఏటనే గ్రంథాలు చదివేవారు. ఆయన తండ్రి శంకరుల మూడవ ఏటనే చనిపోయారు. ఆయనకు ఐదవ ఏటనే కామ్యోపనయనం చేసారు. ఏడవసంవత్సరం వచ్చేసరికి వేదాలను అధ్యయనం చేసేసారు.

శంకరుల చిన్నతనంలో ఆయన అనన్యసామాన్యమైన భక్తిని చాటే అనేక సంఘటనలు జరిగాయి. ఒకసారి శంకరులు అమ్మవారికి పాలను నైవేద్యంగా పెట్టి వాటిని స్వీకరించడానికి అమ్మవారు రాలేదని తీవ్రంగా విలపిస్తుండగా ఆ తల్లి ఆయన ముందు ప్రత్యక్షమై ఆయనను తన ఒడిలోనికి తీసుకుని ఆ పాలను త్రావించి తన కరుణాకటాక్షాలను ఆ చిన్ని శంకరుల మీద ప్రసరింపచేసింది. ఇంకొకసారి ఆయన వేదాభ్యసన సమయంలో భిక్షకై ఒక పేద వృద్ధురాలి ఇంటికి వెళ్లి యాచించగా, ఆమె తన ఇంటిలో ఉన్న ఒకే ఒక ఉసిరి కాయను ఆయనకు ఇచ్చివేసింది. ఆమె పరిస్థితికి జాలిపడిన శంకరులు సంపదలకు అధినేత అయిన లక్ష్మీదేవిని స్తుతిస్తూ “కనకధారా స్తవం” ఆశువుగా పలికారు. దానికి ఆ తల్లి సంతోషించి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది.

శంకరుల తల్లి ఆర్యాంబ వృద్ధాప్యం కారణంగా పూర్ణానదికి రోజూ స్నానానికై వెళ్ళలేకపోవడం గమనించి తన తపశ్శక్తి తో ఆ నదినే తన ఇంటి సమీపంగా ప్రవహించగలిగేటట్లు చేసారు.

ఆయన సన్యాసాశ్రమ స్వీకరణ కూడా విచిత్రంగా జరిగింది. ఒకసారి శంకరులు నదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి వచ్చి ఆయనను పట్టుకుంది. ఆయన తల్లిని తనను సన్యసించడానికి అనుమతిస్తేనే మొసలి తనను వదిలివేస్తుందని, అనుమతినివ్వమనీ ప్రార్థించారు.తల్లి అనుమతించగానే ఆ మొసలి ఆయనను వదిలివేసింది. ఈ సంసారబంధాలు తనను మొసలిలాగా పట్టుకున్నయనీ, ఆ బంధాలనుండి తనను తప్పించమనీ ఆయన తల్లిని వేడుకున్నారు.

ఆయన గురువు గురించి అన్వేషిస్తూ నర్మదా నదీ తీరంలో ఉన్న శ్రీ శ్రీ గోవింద భగవత్పాదులు ని దర్శించి ఆయనే తన గురువు అని తెలిసికొని తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించారు. గోవింద భగవత్పాదులు ఆయనను అనేక పరీక్షలకు గురిచేసి, శంకరుల అద్వైత సిద్ధాంతంతో సంతృప్తి చెంది ఆయనను శిష్యునిగా చేర్చుకున్నారు.ఆ తరువాత కొంతకాలానికి గురువుగారి అనుమతితో విశ్వనాథుని దర్శనానికి మరియు వ్యాసమహర్షి దర్శనానికి కాశీ(వారణాసి) బయలుదేరారు.

ఆయనలో అంతర్గతంగా ఉన్న అహాన్ని తొలగించుటకై పరమశివుడు చండాలుని వేషంలో వెంట నాలుగు కుక్కలతో వచ్చి ఆయన దారికి అడ్డుగా నిలబడతాడు. అప్పుడు శంకరులు చండాలుని ప్రక్కకి తొలగమని చెప్తారు. అప్పుడు శివుడు ఎవరిని తొలగమంటున్నావు, ఈ శరీరాన్నా లేక ఈ శరీరంలో ఉండే ఆత్మనా అని ప్రశ్నిస్తాడు. దానితో శంకరులకి ఆ వచ్చినవాడు పరమశివుడే తప్ప వేరుకాదని గ్రహించి ఆయనను స్తుతిస్తూ మనీషా పంచకం చదివారు.

ఆయన బ్రహ్మసూత్రాలకి భాష్యాలే కాక అనేక దేవీదేవతల స్తుతులూ, అనేక, ఆధ్యాత్మ సిద్ధాంత గ్రంథాలూ రచించారు. వాటిలో బాగా ప్రాముఖ్యమైనవి సౌందర్యలహరి, శివానందలహరి, భజగోవిందం మొదలైనవి.
ఆయన సన్యాసాశ్రమ నియమాలని పక్కన పెట్టి మరీ తల్లికి ఆమె కోరిక మేరకు ఆమెకు అంత్యేష్టి కార్యక్రమాలను నిర్వర్తించారు. ఆ విధంగా తల్లి అత్యంత పూజనీయురాలనీ,ఆమెకు సేవ చేయడం బిడ్డల కర్తవ్యమనీ దానికి ఎలాంటి నియమాలు అడ్డురావనీ లోకానికి చాటిచెప్పారు.

ఆయన కాలినడకన దేశమంతా తిరిగి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ తన సిద్ధాంత వాదనలతో అనేక మంది పండితులని ఓడించారు. ఆ తరువాత వాళ్ళు ఆయనకి శిష్యులైనారు. వారిలో కుమారిలభట్టు, మండవమిశ్రుడు మొదలైన వారు కూడా ఉన్నారు. ఆయన ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతానికి ఆకర్షితులై ఆయన శిష్యులుగా మారిన వారిలో ముఖ్యులు త్రోటకుడు,పద్మపాదుడు, సురేశ్వరుడు, పృధ్వీవరుడు మొదలైన వారు.
ధర్మసంస్థాపన చేయడానికై ఆయన దేశం నలువైపులా నాలుగు పీఠాలను స్థాపించారు. తూర్పు వైపున ఒడిశా లోని పూరీ లో గోవర్ధన మఠం, దక్షిణం వైపున కర్ణాటక లోని శృంగేరి లో శారదా మఠం, పశ్చిమ దిక్కున గుజరాత్ లోని ద్వారకలో ద్వారకా మఠం, ఉత్తర దిక్కున ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ లో జ్యోతిర్మఠం స్థాపించారు. అవి ఈనాటికీ, ధర్మరక్షణకై పాటుపడుతున్నాయి.

ఆయన జన్మించినప్పుడు ఆయన ఆయుష్షు ఎనిమిది సంవత్సరాలు, తపస్సు వలన సాధించినది ఇంకొక ఎనిమిది సంవత్సరాలు , వ్యాసమహర్షి అనుగ్రహంవల్ల మరొక పదహారు సంవత్సరాలు జీవించి తన 32 వఏట ఉత్తరాఖండ్ కాశీలో దేహాన్ని త్యజించారు.

(Courtesy with: www.meepurohit.com › shankara-jayanthi)

Wednesday, April 18, 2018

వారణాసి కాశి వైభవం

కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం

కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ బుభాగం ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు. విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని ప్రపంచ సాంస్కృతిక నగరం
స్వయంగా శివుడు నివాసముండె నగరం

ప్రళయ కాలంలో మునుగని అతి  ప్రాచిన పట్టణం శివుడు ప్రళయ కాలంలో తన తన త్రిశూలంతో కాశీిని పైకెత్తి కాపాడతాడు.

కాశీ భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశీ పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది పద్నాలుగు భువన బాండాలలో విశేషమైన స్థలం.

కాశీలో గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యం....

ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని  కాశి లోనికి అనుమతించడు.
కాశీలో మరణించిన వారికీ యమ బాధ పునర్ జన్మ ఉండదు.

కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రాగుప్తుని నుండి మాయం అయి కాలభైరవుని వద్దకు చేరుతుంది....డిండి గణపతి కాల బైరవుడు పరిశీలించి యమ యాతన కంటే 32 రేట్లు అధిక శిక్షలు విధించి మరు జన్మ లేకుండా చేస్తాడు ...
కాబట్టే కాశీలో  కాల భైరవ దర్శనం తరవాత పూజారులు వీపు పై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్లి పోయినా పాపాలు అంటకుండా రక్ష నల్లని కాశి దారం కడతారు.

కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు తపస్సులు చేసిన పుణ్యం తో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి.

కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు.

అందుకే కాశ్యాన్తు మరణాన్ ముక్తి అని శాస్త్ర వచనం కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీపూరిలో గడుపుతారు.

మరణించిన వారి ఆస్తికలు కాశి గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా  విశ్వనాథునిచే ఉద్దరింప బడతారు.

గోముకం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశి పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశి ఘాట్లను వదిలి దూరం జరగలేదు.

శివుని కాశిలోని కొన్ని వింతలు...

కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.

కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తొవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ  జాడ దొరకకుండా ఉంటుంది.

కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు పూలచెట్లు మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు.

అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్య పోయ్యారు. అస్సలు ఇ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి 
అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు అంత పరిజ్ఞ్యానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.

కాశి విషవేశ్వరునికి శవ భస్మ లేపనం తో పూజ ప్రారంభిస్తారు .

కాశిలోని పరాన్న బుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లబిస్తుంది.

కాశి క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రేట్లు ఫలితం ఉంటుంది, పాపం చేసినా కోటి రేట్ల పాపం అంటుతుంది.

విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.

ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు
జగత్అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి.

ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశిలోనే వున్నది.

కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి..

 ఇందులో దేవతలు,ఋషులు,రాజులూ, తో పాటు ఎందరో తమ తపశక్తితో నిర్మించిన వి ఎన్నో వున్నాయి
అందులో కొన్ని
1) దశాశ్వమేధఘాట్ బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే రోజు సాయకాలం విశేషమైన గంగామా హారతి జరుగుతున్నది.

2) ప్రయాగ్ ఘాట్ ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి.

3) సోమేశ్వర్ ఘాట్ చంద్రుడు చేత నిర్మితమైనది.

4) మీర్ ఘాట్ సతి దేవీ కన్ను పడిన స్థలం విశాలాక్షి దేవి శక్తి పీఠం.
ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.

5) నేపాలీ ఘాట్ పశుపతి నాథ్ మందిరం బంగారు కళశంతో నేపాల్ రాజులూ కట్టినాడు.

6) మణి కర్ణికా ఘాట్ ఇది కాశీలో మొట్ట మొదటిది దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రం తో  తవ్వి నిర్మించాడు ఇక్కడ సకల దేవతలు స్నానమ్ చేస్తారు ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపలు తొలిగి పోతాయి జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట.

7) విష్వేవర్ ఘాట్ ఇప్పుడు సిందియా ఘాట్ అంటారు ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది ఇక్కడ స్నానం చేసే బిందు మాధావుణ్ణి దర్శిస్తారు.

8) పంచ గంగా ఘాట్ ఇక్కడే బుగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి.

9) గాయ్ ఘాట్ గోపూజ జరుగుతున్నది.

10) తులసి ఘాట్ తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం  పొందినది.

11) హనుమాన్  ఘాట్ ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నది ఇక్కడే శ్రీ వల్లబచార్యులు జన్మించారు.

12) అస్సి ఘాట్ పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది.

13) హరిశ్చంద్ర ఘాట్ సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహనం కూలీగా పని చేసి దైవ పరక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు
నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది...

14) మానస సరోవర్ ఘాట్ ఇక్కడ కైలాసపర్వతం నుండి బుగర్భ జలాధార కలుస్తున్నది ఇక్కడ స్నానం చేస్

Tuesday, April 17, 2018

అక్షయ తృతీయ ప్రాముఖ్యత

1. పరశురాముని జన్మదినం
2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం
3. త్రేతాయుగం మొదలైన దినం
4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం
5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో, వ్రాయడం మొదలుపెట్టిన దినం
6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం
7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం
8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం
9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం
10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.

Thursday, April 12, 2018

మానవ శరీరం గురించి అద్దిరిపోయే విషయాలు

* మన కడుపులో ఉండే ఆమ్లము (acid) రేజర్ బ్లేడ్ లను కూడా కరిగించగలదు.

* మనం రోజుకి సగటున 40 నుండి 100 వెంట్రుకలు కోల్పోతున్నాం.

* మన ఒక్కో వెంట్రుక 3 నుండి 7 సంవత్సరాల వరకు పెరుగుతూనే ఉంటాయి.

తర్వాత అవి రాలిపోయి వాటి స్థానంలో వేరేవి పెరుగుతాయి

* ఒక్క అంగుళం చర్మం మీద 3 కోట్లకు పైగా బాక్టీరియా ఉంటుంది.

* రోజుకి మన గుండె ఉత్పత్తి చేసే శక్తితో ఓ సాధారణ ట్రక్ ని 30 కిలో మీటర్ల వరకు నడిపించవచ్చు.

* లేవకుండా ఒక మనిషి నిద్రించిన రికార్డు 11 రోజులు.

* 90 శాతం కి పైగా జబ్బులు స్ట్రెస్ వల్లనే అని తేలింది.

* శరీరం నుండి తల వేరు చేసినా.. తల 15 సెకన్ల వరకు స్పృహ కోల్పోదు.

* మీరు పడుకునే గది ఎంత చల్లగా ఉంటె... మీకు పీడ కలలు వచ్చే అవకాశాలు అంత పెరుగుతాయి.

* నిద్రించే సమయంలో మన వాసనా పీల్చే భావం పనిచేయదు.

* మనవ శరీరం లో ఉన్న DNA మరియు అరటిపండులో ఉన్న DNA 50 శాతం కలుస్తాయి.

* మనం తిన్నది అరగడానికి మన శరీరంలో ఏవైతే సహాయ పడతాయో... చనిపోయిన 3 రోజులకి అవే మనల్ని తినడం మొదలపెడతాయి.

* గుండె పోటు వల్ల చనిపోయే వారిలో 20 శాతం మంది సోమవారం నాడే చనిపోతారు.

* 7 గంటల కన్నా తక్కువ నిద్రిస్తే.. త్వరగా చనిపోతారు.

* వెలి ముద్రలు ఉన్నట్టే.. నాలుక ముద్రలు కూడా ఒకరితో ఒకరికి పోలిక లేకుండా ఉంటాయి.

* ఒకవేళ మన కళ్ళు కెమెరా అయితే.. 576 మెగా పిక్సెల్స్ ఉన్న కెమెరాలా ఉండేది.

* మనిషి కన్నుని తయ్యారుచేయాలంటే కొన్ని లక్షల కోట్లు కర్చవుతుందట.

* మన నోరు 100 కోట్లకు పైగా రుచులను గుర్తించగలదు.

* మీకు 60 ఏళ్ళు వచ్చే సరికి నోటిలో ఉండే టేస్ట్ బడ్స్ సగానికి పైగా చనిపోతాయి.

* మీకు ఎంత ఎక్కువ IQ ఉంటె.. అన్ని కలలుగంటారు.

* మన కాళ్ళ గోర్లకన్నా చేతి గోర్లు 4 రెట్లు త్వరగా పెరుగుతాయి.

* చింపాంజీ శరీరం పై ఉన్నన్ని వెంట్రుకలే మన శరీరం పై కూడా ఉంటాయి. కాకపోతే మనవి చాలా సన్నగా ఉంటాయి.

* మన శరీరం 30 నిమిషాలలో ఉత్పత్తి చేసే వేడితో 114 లీటర్ల నీటిని వేడి చేయవచ్చు.

* మన చర్మం నిమిషానికి 50000 సెల్స్ ని వదిలేస్తుంది. అంటే జీవిత కాలంలో అది 18 కిలోలనమాట.

* మీ బెడ్ పై ఉండే దుమ్ములో సగానికి పైగా మీ చర్మందే.

* మన బ్రెయిన్ 25 వాట్స్ విద్యుత్త్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్ తో ఓ బుల్బ్ ని వెలిగించవచ్చు.

* మీకు 40 ఏళ్ళు వచ్చే వరకు మీరు ఎదుగుతూనే ఉంటారు.

* మన బ్రెయిన్ పగటి పూటకన్నా రాత్రి పూటనే చురుకుగా పనిచేస్తుంది.

* ఒక సంవత్సరంలో 15000 కలలుగంటారట.

* మీరు వింటున్న మ్యూజిక్ కి తగ్గట్టుగా మీ గుండె కొట్టుకోవడం ప్రారంభమవుతుంది.

మన శరీరం ఒక అధ్భుత సృష్ట అని నమ్మండి. దానిని హాని పరచడం మానుకోండి. 

*చతుఃషష్టి ఉపచారాలు*

ఒకసారి శ్రీ శంకరాచార్యులవారికి లలిత అమ్మవారు 64 కళలతో, 64 యోగినీ దేవతలు చతుఃషష్టి ఉపచారాలు చేస్తూ ఉన్న రూపంతో, దర్శనమిచ్చినపుడు ఆ ఆనందపారవశ్యములో ఆశువుగా రచించిన స్తోత్రంలో అమ్మవారికే అధికారం ఉన్న చతుఃషష్టి ఉపచారాలను ఈ విధంగా వివరించేరు. అవి.
1. అర్ఘ్యం,పాద్యం,ఆచమనీయం – అమ్మవారి కాళ్ళు, చేతులు జలముతో కడిగి, త్రాగుటకు జలము సమర్పించడం
2. అభరణ అవరోపణం – ముందురోజు వేసియున్న ఆభరాణాలు తీయడం
3. సుగంధ తైలాభ్యంజనం – వంటికి నూనె పట్టించడం
4. మజ్జనశాలా ప్రవేశము – స్నానాల గదికి తీసుకొని వెళ్ళడం
5. మణిపీఠోపవేశనం – మణులతో అలంకరించిన పీఠముపై కూర్చోపెట్టడం
6. దివ్యస్నానీయ ఉద్వర్తనం – నలుగు పెట్టుట
7. ఉష్ణోదక స్నానము – వేడి నీటితో స్నానము చేయించుట
8. కనక కలశచ్యుత సకల తీర్థాభిషేచనం – బంగారుకలశలలో పవిత్రనదులనుండి తీసుకువచ్చిన సకల పవిత్ర తీర్థములతో అభిషేకము
9. ధౌతవస్త్ర పరిమార్జనం – పొడిగుడ్డతో శుభ్రంగా తుడవడం
10. అరుణ దుకూల పరిధానం – ఎర్రని వస్త్రము ధరింపజేయడం
11. అరుణకుచోత్తరీయం – ఎర్రని ఉత్తరీయమును (జాకెట్టు) ధరింపజేయడం
12. ఆలేపన మంటప ప్రవేశనం – అత్తరు మొదలైన అలేపనలు పూసే గృహానికి అమ్మవారిని తీసుకొని వెళ్ళడం అక్కడ మళ్ళీ మణిపీఠముపై కూర్చోపెట్టడం
13. చందన అగరు కుంకుమ సంకు మృగమద కర్పూర కస్తూరీ గోరోజనాది దివ్య గంధ సర్వాంగీణ ఆలేపనం – వివిధ దివ్య గంధములను అమ్మవారికి అలదింపజేయడం
14. కేశాభరస్య కలాదుల అగరు ధూపం – కేశములు విస్తారపరచి సుగంధధూపం వేయడం
15. జడవేసి, మల్లికా మాలతీ చంపక అశోక శతపత్ర పూగ క్రముక మంజరీ పున్నాగ కల్హార ముఖ్య సర్వ ఋతు కుసుమమాల సంప్రయం - వివిధఋతువులలో పూచిన సుగంధ పుష్పములతో అల్లిన మాలతో అమ్మవారిని అలంకరించడం
16. భూషణమండప ప్రవేశము – అలంకార గది ప్రవేశము
17. మణిపీఠోపవేశనము - అక్కడమళ్ళీ మణిపీఠం పై కూర్చోపెట్టడము
18. నవమణిమకుట ధారణ – తొమ్మిది రకాల మణులతో కూర్చిన కిరీటం పెట్టడం
19. దానిపైన చంద్ర శకలం పెట్టడం
20. సీమంతంలో సిధూరాన్ని దిద్దడం
21. తిలక ధారణము – నుదుటిపై తిలకంతో బొట్టు పెట్టడం
22. కాలాంజనం దిద్దడం – అమ్మవారి కళ్ళకు కాటుక పెట్టడం
23. పాళీయగళం – అమ్మవారికి చెంప స్వరాలు (మావటీలు) అలంకారం చేయడం
24. మణికుండళయుగళం - మణికుండలములు రెండు చెవులకు అలంకరించడం
25. నాసాభరణం – ముక్కుకి నాసాభరణం అలంకరించడం
26. అధరయావక లేపనం – పెదవులకు పూసే లత్తుక పూయడం
27. ఆర్య భూషణం - ప్రధాన భూషణం అలంకరించడము
28. మాంగల్య సూత్రము – మాంగల్య సూత్రమును అలంకరించుట
29. హేమచింతాకం – బంగారుతో కూడిన చింతామణులమాల వేయడం
30. పతకం – బంగారు పతకం
31. మహాపతకం – పెద్దదిగా ఉన్న బంగారు పతకం
32. ముక్తావళి – మూడు వరుసల ముత్యాలహారం
33. ఏకావళి – 27 ముత్యాలతో కూడిన ఒక వరుస ముత్యాలహారం
34. చన్నభీరము – యజ్ఞోపవితం లాగ భుజములమీదనుండి వేసే ఒక ఆభరణము
35. కేయూర యుగళ భూషణ చతుష్టయము – నాలుగు చేతులకు నాలుగు కేయీరములు ( దండ కడియాలు)
36. వలయావళి – నాలుగు చేతులకు కంకణములు
37. ఊర్మికావళి – నాలుగు చేతులకు ఉంగరములు
38. కాంచీధామము – వడ్డాణము అని పెలువబడే నడుము చుట్టూ అలంకరించే ఆభరణము
39. కటిసూత్రము – వడ్డాణానికి చుట్టూ మువ్వలతో ఉండే సూత్రము
40. సౌభాగ్యాభరణం – అశోకచెట్టు ఆకులాగ ఉండే ఒక ఆభరణం (కుత్తిగంటు)
41. పాదకటకం – కాలి అందెలు
42. రత్ననూపురములు – దానిచుట్టూ మువ్వల రత్ననూపురములు
43. పాదంగుళీయములు - మట్టెలు
44. పాశం – పైన ఉన్న కుడి చేతిలో తాడు
45. అంకుశం – పైన ఉన్న ఎడమ చేతిలో అంకుశం
46. పుండ్రేక్షు చాపము – క్రింద ఉన్నకుడి చేతిలో చెరుకువిల్లు
47. పుష్పబాణములు – కింద ఉన్న ఎడమ చేతిలో పుష్పములతో చేసిన బాణములు
48. శ్రీ మణి మాణిక్య పాదుక – ఎర్రని మణులతో ప్రకాశించే పాదుకలు
49. స్వ సామన వేషభి ఆవరణ దేవతాభి సహ మహాచక్రాథిరోహణము – సర్వాలంకాణలతో ఉన్న ఆవరణదేవతలతో కూడిన మహాసింహాసనముపై అమ్మవారిని అధిష్టింపజేయడం
50. కామేశ్వరాంగ పర్యాంక ఉపవేశము – అమ్మవారిని కామేశ్వరుని పర్యంకముపై కూర్చొండబెట్టుట
51. అమృతచషకము – అమ్మవారికి త్రాగుటకు పాత్రతో మధువును అందించుట
52. ఆచమనీయము – జలమునందించుట
53. కర్పూరవీటిక – కర్పూర తాంబూలము నందించుట ( కర్పూరతాంబూలం అంటే ఎలాఉంటుందో, అందులో ఏ ఏ సుగధద్రవ్యాలు ఉంటాయో ఈ క్రింద వివరించడమనది)
54. ఆనందోల్లాస విలాస హాసము – అమ్మవారు తాంబూలం సేవిస్తూ ఆమె సంతసము, అనుగ్రహము తో కూడిన చేసే మందహాసము
55. మంగళార్తికం – దీపముల గుత్తి ని అమ్మవారి చుట్టూ తిప్పడం
56. ఛత్రము – అమ్మవారికి గొడుగు పట్టుట
57. చామరము – అమ్మవారికి చామరము వీచుట
58. దర్పణమ్ – అమ్మవారికి దర్పణం చూపించుట
59. తాళావృతం – అమ్మవారికి విసనకర్రతో విసురుట
60. చందనం – గంధం పమర్పించుట
61. పుష్పం – పుష్పాలను సమర్పించుట
62. ధూపము – సువాసనభరితమైన ధూపమును వేయుట
63. దీపము – దీప దర్శనము చేయించుట
64. నైవేద్య,తాంబూల,నీరాజన నమస్కారములు – నవరసభరితమైన నైవేద్యమును సమర్పించుట, తరువాత తాంబూల నీరాజనాది సత్కారములతో నమస్కరించుట
ఏకాంతము..

Monday, April 9, 2018

గుడికి ఎందుకు వెళ్ళాలి?

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
💐మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. ఆడ-మగ, పెద్ద-చిన్న అనే తేడా లేకుండా మనలో చాలామంది గుళ్ళు గోపురాలను దర్శించుకుంటారు. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా దిగుళ్ళు ఉంటే మర్చిపోవడం కోసం అనుకుంటే పొరపాటు.
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
💐గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. అసలు గుడి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడింది? దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి, ఈ విషయమై వేదాలు ఏం చెప్తున్నాయి మొదలైన అంశాలు తెలుసుకోవడం చాలా అవసరం.
⛳మనదేశంలో చిన్నా పెద్దా వేలాది దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దుష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు. అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థలమహత్యాన్ని సంతరించుకున్నాయి.
🏹భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే తనువూ, మనసూ ప్రశాంతత పొందుతాయి.
⛳దేవాలయ గర్భగృహంలో ఉత్క్రుష్టమైన ఆకర్షణా తరంగాలు కేంద్రీకృతమైన చోట మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని (రాగి రేకు) నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆవిధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది.
🌷అందువల్ల రోజూ గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళేవారిలో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలీదు. కానీ నిత్యం గుడికి వెళ్ళేవారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది.
ఇకపోతే గర్భగుడి మూడువైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే.
⛳ఆలయాల్లో గంటలు మోగిస్తారు. వేద మంత్రాలు పఠిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి.
⛳గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడంవల్ల శక్తి విడుదల అవుతుంది.
🙏మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడిగంటలు, మంత్ర ఘోష, పూల పరిమళాలు, కర్పూరం, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం, తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది.
🌷గుడిలో దేవుడికి కొబ్బరికాయ , అరటిపళ్ళు నైవేద్యం పెడతారు. ఈ కొబ్బరిని, అరటిపళ్ళని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి.
⛳తీర్థంలో పచ్చ కర్పూరం (Cinnamomum camphora) యాలుకలు (Cardamom) సాంబ్రాణి (సంబరేను చెట్టునుండి వచ్చే ధూపద్రవ్యం లేదా సాంబ్రాణి తైలము - benzoin), తులసి పత్రాలు (holy basil), లవంగాలు (Clove) మొదలైనవి కలుపుతారు. ఆయా పదార్థాలు అన్నీ ఔషధగుణాలు కలిగినవే. అలా గుడికి వెళ్ళినవారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆయురారోగ్యాలను ఇస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
💐ఇప్పుడు చాలామంది పాటించడంలేదు కానీ పూర్వం ఆలయానికి వెళ్ళేప్పుడు పురుషులు చొక్కా (షర్టు) లేకుండా వెళ్ళేవారు. దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలో ప్రవేశిస్తాయి. స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకుని అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడటం మన సంప్రదాయం కనుక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవారు.
🌄లోహానికి శక్తి తరంగాలను త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది. ఆవిధంగా స్త్రీపురుషులిద్దరికీ ప్రయోజనం కలుగుతుంది.
🎇భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది.
🙏 కర్పూరహారతి వెలిగిస్తారు. గంటలు మోగుతాయి.తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలూ సమీకృతమై భక్తులకు ఆనందం, ఆరోగ్యం లభిస్తాయి. మనలో దివ్య శక్తి ప్రవేశించి, తేజస్సు అనుభూతికొస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు, ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి.🙏🙏 🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Saturday, April 7, 2018

Philosophy of Life in Mahabharata

It is said in the texts that 80% of the fighting male population of the civilization was wiped out in the eighteen days Mahabharata war.

Sanjay, at the end of the war went to the spot where the greatest war took place; Kurukshetra.

He looked around and wondered if the war really happened, if the ground beneath him had soaked all that blood, if the great Pandavas and Krishna stood where he stood.

“You will never know the truth about that!” said an aging soft voice.

Sanjay turned around to find an Old man in saffron robes appearing out of a column of dust.

“I know you are here to find out about the Kurukshetra war, but you cannot know about that war till you know what the real war is about.” the Old man said enigmatically.

“What do you mean?”

The Mahabharata is an Epic, a ballad, perhaps a reality, but definitely a philosophy.

The Old man smiled luring Sanjay into more questions.

“Can you tell me what the philosophy is then?”
Sanjay requested.

Sure, began the Old man.

The Pandavas are nothing but your five senses,
sight,
smell,
taste,
touch
and sound...,

and do you know what the Kauravas are?
 he asked narrowing his eyes.

 The Kauravas are the hundred vices that attack your senses everyday but you can fight them... and do you know how?

Sanjay shook his head again.

“When Krishna rides your chariot!”

The Old man smiled brighter and Sanjay gasped at that gem of insight.

Krishna is your inner voice, your soul, your guiding light and if you let your life in his hands you have nothing to worry.

Sanjay was stupefied but came around quickly with another question.

“Then why are Dronacharya and Bhishma fighting for the Kauravas, if they are vices?”

The Old man nodded, sadder for the question.

It just means that as you grow up, your perception of your elders change. The elders who you thought were perfect in your growing up years are not all that perfect. They have faults. And one day you will have to decide if they are for your good or your bad.  Then you may also realize that you may have to fight them for the good. It is the hardest part of growing up and that is why the Geeta is important.

Sanjay slumped down on the ground, not because he was tired but because he could understand and was struck by  the enormity of it all.

 What about Karna? he whispered.

“Ah!” said the Old man. “You have saved the best for last. Karna is the brother to your senses, he is desire, he is a part of you but stands with the vices. He feels wronged and makes excuses for being with the vices as your desire does all the time.

 Does your desire not give you excuses to embrace vices?”

Sanjay nodded silently. He looked at the ground, consumed with a million thoughts, trying to put everything together and then when he looked up the Old man was gone....
disappeared in the column of dust.........leaving behind the great philosophy of Life!   

ఆచారాలు -వాటి వెనుక ఉన్న అంతరార్థం

ఆల‌యాల్లో గంట‌లు ఉండ‌డం…

ఆల‌యాల్లో ఉండే గంట‌ను ఏడు సార్లు కొడితే మ‌న శ‌రీరంలో ఉన్న ఏడు చ‌క్రాలు ఉత్తేజం అవుతాయ‌ట‌. అంతేకాదు మెద‌డు కుడి, ఎడ‌మ భాగాలు రెండూ కొంత సేపు ఏక‌మ‌వుతాయ‌ట‌. దీంతోమ‌న మ‌న‌స్సుకు ప్ర‌శాంత‌త క‌లుగుతుంద‌ట‌. ఏకాగ్ర‌త పెరుగుతుంద‌ట‌. గంట‌ను మోగించ‌డం వ‌ల్ల ఆ ప్రాంతంలోని గాలిలో ఉండే క్రిములు నాశ‌న‌మ‌వుతాయ‌ట‌.

 ఆడ‌వారు గాజులు ధరించ‌డం వెనుక‌…

ఆ గాజుల వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయ‌ట‌. గాజులు ఎల్ల‌ప్పుడూ చేతి న‌రాల‌కు తాకుతూ ఉండ‌డం వ‌ల్ల బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుంద‌ట‌.

 పిల్ల‌ల‌కు చెవులు కుట్టించ‌డం…

చిన్నారుల‌కు చెవులు కుట్టించ‌డం స‌హ‌జ‌మే. ప్ర‌ధానంగా ఆడ‌పిల్ల‌ల‌కు, ఆ మాట‌కొస్తే కొంత మంది మ‌గ పిల్ల‌ల‌కు కూడా చెవులు కుట్టిస్తారు. అయితే ఇలా కుట్టించ‌డం వ‌ల్ల ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి దాంతో వారికి వ‌చ్చే అనారోగ్యాలు పోతాయ‌ట‌. ప్ర‌ధానంగా ఆస్త‌మా వంటి వ్యాధులు రావ‌ట‌.

 రావి చెట్టును పూజించ‌డం…

హిందువుల్లో అధిక శాతం మంది రావి చెట్టుకు పూజ‌లు చేస్తారు. ఈ చెట్ల‌యితే ఎక్కువ‌గా దేవాల‌యాల్లోనే ఉంటాయి. అయితే సాధార‌ణంగా చెట్ల‌న్నీ ప‌గ‌టి పూట ఆక్సిజ‌న్‌ను విడుద‌ల చేస్తే ఈ చెట్టు మాత్రం రాత్రి పూట ఆక్సిజ‌న్‌ను విడుద‌ల చేస్తుంద‌ట‌. దీంతోనే రావి చెట్టును పూజిస్తారు.

 కాలి వేళ్ల‌కు మెట్టెలు ధ‌రించ‌డం…

హిందూ సాంప్ర‌దాయంలో పెళ్ల‌యిన మ‌హిళ‌లు కాలికి మెట్టెల‌ను ధ‌రిస్తారు. ఇలా ధ‌రించ‌డం వ‌ల్ల ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి వారి గుండె నుంచి గ‌ర్భాశ‌యానికి ర‌క్త ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రుగుతుంద‌ట‌. అయితే వెండి మెట్టెలు ధ‌రిస్తే ప్ర‌కృతిలో ఉన్న పాజిటివ్ ఎన‌ర్జీ వారి శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంద‌ట‌.

 నిద్రించేట‌ప్పుడు త‌ల‌ను ఉత్త‌రానికి పెట్ట‌క‌పోవ‌డం.

భూమికి అయ‌స్కాంత క్షేత్రం ఉన్న‌ట్టుగానే మ‌న శ‌రీరానికి కూడా అయ‌స్కాంత క్షేత్రం ఉంటుంద‌ట‌. ఒక వేళ మ‌నం ఉత్త‌రం దిశ‌గా త‌ల‌ను పెట్టి ప‌డుకుంటే మ‌న శ‌రీరంలో ఉన్న ఐర‌న్ మెద‌డుకు ప్ర‌వ‌హించి బీపీ, గుండె సంబంధ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. త‌ల‌నొప్పి, అల్జీమ‌ర్స్‌, పార్కిన్‌స‌న్స్ డిసీజ్ వంటి వ్యాధులు వ‌స్తాయ‌ట‌. కాబ‌ట్టి త‌ల‌ను ఉత్త‌రం దిశ‌కు పెట్టి నిద్రించ‌కూడ‌ద‌ట‌.

 నుదుట‌న కుంకుమ బొట్టు ధ‌రించ‌డం…

నుదుట‌న కుంకుమ బొట్టును ధ‌రిస్తే అక్క‌డి న‌రాలు ఉత్తేజిత‌మై పీయూష గ్రంథిని యాక్టివేట్ చేస్తాయ‌ట‌. దీంతో బీపీ, ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయ‌ట‌.

 ఎదుటి వారికి రెండు చేతులతో న‌మ‌స్క‌రించ‌డం...

ఎదురుగా ఉన్న వారికి రెండు చేతుల‌తో న‌మ‌స్క‌రిస్తే మ‌నం వారిని ఎప్ప‌టికీ గుర్తు పెట్టుకుంటామ‌ట‌. ఎలాగంటే రెండు చేతుల‌ను జోడించిన‌ప్పుడు చేతి వేళ్ల‌న్నీ క‌లిసిపోయి ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి మ‌న జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుతాయ‌ట‌. దీంతోపాటు మెద‌డు ప‌నితీరు కూడా మెరుగు ప‌డుతుంద‌ట‌.

 నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డం…

నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డం వ‌ల్ల ప‌ద్మాస‌నం భంగిమ వ‌స్తుంది. దీంతో జీర్ణ‌క్రియ స‌క్ర‌మంగా జ‌రిగి జీర్ణాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయ‌ట‌.

కార‌మైన ఆహారం ముందు, స్వీట్లు త‌రువాత తిన‌డం…

భోజ‌నం చేసిన‌ప్పుడు ముందుగా కారంగా ఉండే ఆహారం తిన‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలో జీర్ణ‌క్రియ‌కు అవ‌స‌ర‌మైన ఆమ్లాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయ‌ట‌. దీంతో జీర్ణ‌క్రియ స‌క్ర‌మంగా జ‌రుగుతుంద‌ట‌. అయితే భోజ‌నం మొదట్లోనే స్వీట్లు తింటే అది మ‌నం తిన్న ఆహారాన్ని స‌రిగ్గా జీర్ణంచేయ‌నీయ‌ద‌ట‌.

 న‌దుల్లో నాణేలు వేయ‌డం…

ఒక‌ప్పుడు మ‌న ద‌గ్గ‌ర రాగితో చేసిన నాణేలు చ‌లామ‌ణీలో ఉండేవి. ఈ కార‌ణంగా ఆ నాణేల‌ను న‌దుల్లో వేస్తే ఆ రాగి అంతా ఆ నీటిని శుద్ధి చేసేద‌ట‌. దీంతో ఆ నీటిని తాగేవారికి ఎన్నో అనారోగ్యాలు దూర‌మ‌య్యేవ‌ట‌.

 ఉప‌వాసం ఉండ‌డం…

హిందువుల్లో అధిక శాతం మంది వారంలో ఏదో ఒక రోజు దేవుడికి ఉప‌వాసం ఉంటారు క‌దా.ఆయుర్వేద ప్ర‌కారం అలా ఉప‌వాసం ఉండ‌డం చాలా మంచిది. ఎందుకంటే ఉప‌వాస స‌మ‌యంలో మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థకు పూర్తిగా విశ్రాంతి ల‌భించి శ‌రీరంలో ఉన్న ప‌లు విష ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్ల‌గొట్ట‌ బ‌డ‌తాయ‌ట‌. దీంతోపాటు దేహం త‌న‌కు తాను మ‌ర‌మ్మ‌త్తులు చేసుకుంటుంద‌ట‌. ఉప‌వాసం ఉండ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్‌, బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్లు రావ‌ట‌!!!

Sunday, April 1, 2018

కాకుల కు ఆహారం వేస్తే శని గ్రహా భాదలనుండి విముక్తి కలుగుతుందా ??

కాకుల కు ఆహారం వేస్తే శని గ్రహా భాదలనుండి విముక్తి కలుగుతుందా???
ఒక ఔత్సాహికుడు నన్ను అడిగిన ప్రశ్న ఇది


ప్రతి వ్యక్తీ తన జీవితకాలంలో శని ప్రభావానికి లోనవుతాడు.మందగమనం కలిగినవాడైనందున శనైశ్వరుడు అంటారు. ఈయన నవగ్రహాల్లో అతి శక్తిమంతుడు. ఈయనకు కాకి వాహనం మకరం, కుంభ రాశులకు అధిపతి శని. శనైశ్వరుని భార్య జ్యేష్టాదేవి.

గోచారరీత్యా శని మేషాది రాశుల్లో సంచరిస్తాడు. అంటే 12 రాశుల్లో సంచారం పూర్తిచేయడానికి మొత్తం 30 సంవత్సరాల సమయం పడుతుంది. 30 ఏళ్ళకు ఒకసారి ప్రతిఒక్కరిపై ఏల్నాటి శని ప్రభావం ఉంటుంది. ఏల్నాటి శని వల్ల కలిగే కష్టనష్టాలు ఇలా ఉంటాయి.

జాతకునికి గోచారరీత్యా తన జన్మరాశి (జన్మ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి) నుంచి 12,1,2 స్థానాల్లో శని సంచరించే కాలాన్ని ఏల్నాటి శని అంటారు. ఈ మూడు రాశుల్లో మొత్తం ఏడున్నర సంవత్సరాలు సంచరించడం వల్ల దీనిని దీనిని ఏలినాటి శని అని వ్యవహరించడం జరుగుతోంది.

12 వ రాశిలో సంచరించేటప్పుడు వ్యవహారాల్లో చిక్కులు, వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఊహించని మార్పులు, అనారోగ్యం, ఔషధ సేవనం, తరచూ ప్రయాణాలు
జన్మరాశిలో సంచరిస్తున్నప్పుడు ఆరోగ్యభంగం, అపనిందలు, భాగస్వాములతో వైరం, మనశ్శాంతి లోపం, ధనవ్యయం. రుణబాధలు,వృత్తి, వ్యాపారాల్లో చికాకులు. స్థానచలన సూచనలు.

రెండవ రాశిలో సంచరిస్తున్నప్పుడు ఆశలు కల్పించి నిరాశ కల్పిస్తాడు. రుణబాధలు, అనారోత్యం, మానసిక ఆందోళన వంటి ఫలితాలు ఉంటాయి.

జీవితంలో మొదటిసారి వచ్చే ఏల్నాటి శనిని మంగు శని అంటారు. రెండవ పర్యాయము (30 సంవత్సరాల అనంతరం) వచ్చే ఏల్నాటి శనిని పొంగుశని అని అంటారు. ఈ కాలంలో అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఆర్ధిక, ఆస్తిలాభాలు, గృహయోగాలు, ఉద్యోగయోగం వంటి ఫలితాలు కలుగుతాయి. మూడవ పర్యాయం వచ్చిన శనిని మృత్యుశని అంటారు. ఈ కాలంలో ఆరోగ్య సమసయలు, అపమృత్యుభయం వంటి చికాకులు ఎదుర్కొంటారు. అలాగే జన్మరాశికి 4,8,10 స్థానాల్లో శని సంచరిస్తున్నప్పుడు అర్ధాష్టమ, అష్టమ, దశమ శని సంచారం అంటారు. ఇవి కూడా దోషకారకమే.

🌹 అర్ధాష్టమ శని:- 🌹

జన్మరాశి నుంచి నాలుగువ రాశిలో శని సంచరిస్తే అర్ధాష్టమ శని అంటారు. రాజకీయ, వ్యాపారాల్లో చిక్కులు, కుటుంబసమస్యలు, అశాంతి, ఆకస్మిక బదిలీలు. వ్యాపార, ఉద్యోగాల్లో మార్పులు వంటి ఫలితాలు ఉంటాయి.స్ధాన చలనం,స్ధిరాస్తి సమస్యలు,వాహన ప్రమాదాలు,తల్లికి అనారోగ్యం కలుగుతాయి.

🌹 అష్టమ శని:- 🌹

 జన్మరాశి నుంచి 8వ స్థానంలో శని సంచరించడాన్ని అష్టమ శని అంటారు. ఈ కాలంలో ఉద్యోగాల్లో ఆటంకాలు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం, అశాంతి, అనారోగ్య సమస్యలు వంటి ఫలితాలు ఉంటాయి.శత్రు బాదలు,ఊహించని నష్టాలు వస్తాయి.

🌹 దశమ శని:- 🌹

జన్మరాశి నుంచి 10వ స్థానంలో శని సంచరిస్తున్నప్పుడు కంటక శని అంటారు. దీనివల్ల కోర్టు కేసులు, సాంఘిక, రాజకీయంగా అపవాదులు, అధికారులతో విభేదాలు, ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు వంటి ఫలితాలు ఉంటాయి.తండ్రితో గొడవలు.

అయితే జాతకచక్రంలో శని మంచి స్థితిలో ఉన్నప్పుడు , గోచారం లో గురు బలం ఉన్నప్పుడు ఏల్నాటి శని అంతగా బాధించడు. ఈ దోషాలు ఉన్న వారు శనికి తైలాభిషేకాలు, జపాదులు చేయించుకుంటే కొంత ఉపశమనం కలుగుతుంది.శని శ్రమ కారకుడు,వాయు కారకుడు కాబట్టి రోజు ఉదయాన్నే వాకింగ్ కానీ,మేడిటేషన్ (గాలి పీల్చటం వదలటం) చేస్తే శని తృప్తిపడతాడు,శ్రమ కారక జీవులైన  కాకుల కు ఆహరం వేయటం వల్ల కూడా శని భాదలనుండి విముక్తి లభిస్తుంది.
హిందూ జ్యోతీష్య శాస్త్రం ప్రకారం 'శనీశ్వరుడు' ,నవగ్రహాలలో ఒక గ్రహం. సూర్యుడు, చంద్రుడు, ఛాయాగ్రహాలైన రాహువు మరియు కేతువులతో కలిపి గ్రహాలు తొమ్మిది. గగనమండలంలో ఉన్నగ్రహాలకుభూమితో సంబంధం ఉంది. కాబట్టి తొమ్మిది గ్రహాల ప్రభావం భూమిమీద, భూమిపై ఉన్న ప్రతి చరాచర జీవుల పైన, నిర్జీవ, ఝడ, నిర్లిప్త వస్తువుల మీద వుంటుంది. నవగ్రహాలలో ఒకటైన శని గ్రహం ఇందుకు బిన్నం కాదు. శని, శనిగ్రహం, శనేశ్వరుడు, శనీశ్వరుడు, అని పలు నామములతో పిలువబడి, గ్రహరూపలో పూజింపబడే 'శని' ఒక గ్రహదేవుడు. వారంలో ఏడవవారం శనివారం. శనివవారానికి అధిపతి శనేశ్వరుడు. సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా 'ఏడు' శనికి ప్రీతికరమయిన సంఖ్య
సకల జీవులకు ప్రత్యక్షదైవం అయినట్టి సూర్యుడుభగవానుడికి, అతని రెండవ భార్య ఛాయదేవికి పుట్టిన సంతానం శని. ఆయనకు ఛాయాపుత్రుడు అనే పేరు కూడా ఉంది. జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఎలా చూపబోతున్నాడో అని నిరూపించడానికి, ఆయన జననం సూర్య గ్రహణములోజరిగింది.

ఇతర నామాలు: ఇతనికి మందగమనుడు అని కూడా పేరు. శనయే క్రమతి స: (शनये क्रमति सः) అనగా అతినెమ్మదిగా కదిలేవాడు అని అర్థం. ఒకసారి సూర్యుని చుట్టిరావడానికి శనికి 30 సంవత్సరాలు పడుతుంది. శానైస్కర్య, అసిత, సప్తర్చి, క్రూరదృష్ట, క్రూరలోచనుడు, పంగు పాదుడు, గృద్రవాహనుడు మొదలైన పేర్లుకూడా ఉన్నాయి.

🌺 శనీస్వరునికి అత్యంత ప్రీతికరమైన వస్తువులు: 🌺

నువ్వులు, నువ్వుల నూనె, నల్లటి వస్త్రం, నీలం, ఇనుము, అశుభ్రత, మందకొడిగా ఉండటం

సమస్త ప్రాణకోటి యొక్క పాపకర్మల ఫలాన్ని వెను వెంటనే కలిగించే దేవుడు శనేశ్వరుడు. జీవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి, శిక్షించి, ధర్మాన్ని నిలిపే శనిభగవానుడు యమధర్మరాజుకు మరియు యమునకు అగ్రజుడు. వీరి ముగ్గురి శరీర ఛాయ నలుపే. సూర్యుని కుమారులైన శని మరియి యముడు, ఇరువురూ న్యాయాధిపతులే. యముడు మరణానంతరం దండనలు విదిస్తే, శని, జీవులు బ్రతికి ఉండగానే హింసించి, యాతనలకు గురిచేసి శిక్షిస్తాడ

గుణపాఠం నేర్పించే విషయంలో శనీశ్వరునికి ఎవరూ సాటి లేరు. ద్రోహం, వెన్నుపోటు, హింస, పాపమార్గాలు మరియు అన్యాయ మార్గాలను అనుసరించేవారికి శనిదేవుడు మిక్కిలి అపాయకారి అని శాస్త్రాలు చెబుతున్నాయి.(మరి అదే నిజమయితే మన మధ్య నిత్యం జరుగుతున్న అరాచకాలు, అవినీతి, మోసాలు నిరాటకంగా ఎలా సాగి పోతున్నాయి? అని సందేహం కలగవచ్చు. శని దేవుడి ప్రణాళికలేమిటో సామాన్యులమైన మనకు తెలుస్తుందా!). తన దృష్టి పడ్డవారిని హింసించి, నానాయాతనలకు గురిచేసి, అత్యంత కౄరంగా అమిత బాధలకు గురిచేసే శనిదేవుడు, తను కరుణించిన వారిని అందలం ఎక్కించే శ్రేయోభిలాషి అని శాస్త్రాలు వర్ణించాయి.

నల్లని ఛాయ అతని మేని వర్ణం. నల్లని వస్త్రములు అతని ఉడుపులు. ఖడ్గము, బాణములు మరియు రెండు బాకులు అతని ఆయుధాలు. నల్లని కాకి అతని వాహనం.

శనిభగవానుడు సహజంగా నల్లటి ఛాయ కలవాడని, ఛాయా మార్తాండ సంభూతుడని, అందమైన ముఖం కలవాడుగాను, క్రూరుడిగాను, మందగమనుడిగాను, గానుగుల కులానికి చెందినవాడుగాను, కాల-భైరవుడికి మహాభక్తుడిగాను హిందూ పురాణాలు జ్యోతిష శాస్త్రాలలో వర్ణింపబడ్డాడు .
శనిభగవానుని జన్మ వృత్తాంతం విన్న విక్రమాదిత్యుడు ఆయనను పరిహాసమాడాడట ! ఆ పరిహాసాన్ని విన్న శని కోపగ్రస్తుడై విక్రమాదిత్యుని శపించాడట. శనిని కించపరిచే విధంగా మాటలాడి, అవమానించినందుకు ఫలితంగా విక్రమాదిత్యుడు అనేక కష్టాలు అనుభవించాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, చేయని దొంగతనపు నింద మోపబడి, పొరుగు రాజుచే కాళ్ళు, చేతులు నరికివేయబడ్డాడు. చివరికి, విసిగి వేసారిపోయి, బాధలు ఏమాత్రం భరించే ఓపికలేక, నిర్వీర్యుడై, భ్రష్టుడై, చేసేదిలేక, తనను కనికరింపమని శనిదేవుని అత్యంత శ్రద్ధతో, ఆర్తితో, భక్తితో ప్రార్థించగా, విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన శనీశ్వరుడు తిరిగి అతని పూర్వ వైభవం ప్రాప్తింప చేసాడు. శనిమహాత్మ్యంలో దేవతల గురువైనట్టి బృహస్పతి, శివుడు మరియు అనేక దేవతల, ఋషుల మీద శనిప్రభావం, వారి అనుభవాలు వర్ణింపబడ్డాయి. శనిమహాత్మ్యం, కష్టసమయాలలో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి, నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తి శ్రద్ధలతో జీవితం సాగించడం యొక్క విలువలను, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది .

బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం, పార్వతీ దేవి, నలుగు పిండి బొమ్మకు ప్రాణం పోసినప్పుడు వినాయకుడుజన్మించాడు. అప్పుడు సకల దేవతలు, నవగ్రహాలు ఆ బాల వినాయకుడిని చూడటానికివచ్చారు. ఆ ముగ్ద మోహన బాలుడిని అక్కడకు విచ్చేసిన దేవతలు మునులు కనులార చూసి దీవెనలు అందించి పార్వతీ దేవికి మోదం కలిగించారు. శనిభగవానుడు మాత్రం తల ఎత్తి ఆ బాలుని చూడాలేదు. అందుకు పార్వతీదేవి కినుక వహించి, తన బిడ్డను చూడమని శనిని ఆదేశించింది. అయినా శని తన దృష్టి ఆ బాలగణపతి పై సారించలేదు. తన దృష్టి పడితే ఎవరికైనా కష్టాలు తప్పవని ఎంత నచ్చచెప్పినా, మాతృ గర్వంతో శననీశ్వరుడి సదుద్దేశం తెలుసుకోలేక, పార్వతీ దేవి తనకుమారుని చూడమని పదే పదే శనిని ఆదేశించింది. శని తల ఎత్తి చూసిన కారణంగా బాల గణపతి మానవ రూపంలో ఉండే తలను కోల్పోయినాడని పురాణాలు తెలుపుతున్నాయి.
శని భగవానుడి జీవిత కథ శ్రీ శనిమహాత్మ్యం ॥श्री शनिमहात्म्यं॥ అనే అతి ప్రాచీన గ్రంథంలో తెలుపబడింది. ఈ గ్రంథంలో శని దేవుడిని ప్రార్తించి, మెప్పించి ఆయనకృపను, ఆశీస్సులు పొందుటకు ఎంత కష్టమో,ఎంతటి భక్తి శ్రద్ధలు అవసరమో వివరించబడింది. శ్రీ శని మహాత్మ్యం ఇతర గ్రహాల యొక్క ప్రాముఖ్యత, వాటి బలాబలాలను గూర్చి వివరిస్తూ ప్రారంభమవుతుంది. మొట్ట మొదటగా ఈ విషయాలను విశ్లేషించిన ఘనత ఉజ్జయినిని పరిపాలించిన విక్రమాదిత్యుని ఆస్థాన పండితులకు దక్కుతుంది.
హనుమంతుడు
హనుమంతుడుని పూజించుట వలన శని భగవానుడి యొక్క ఉనికిచే ఏర్పడే 'ప్రతికూల' ప్రభావాల నుండి ఉపశమనాన్ని పొందవచ్చని విశ్వసిస్తారు. రామాయణంలో, హనుమంతుడు రావణుడి బారి నుండి తనను రక్షించినందుకు కృతజ్ఞతగా, ఎవరైతే హనుమంతుని, ముఖ్యంగా శనివారాలలో, పూజ చేసి ప్రార్థిస్తారో, వారు శనిగ్రహం యొక్క "దుష్ప్రభావాల" నుండి విముక్తులగుదురు, లేదా కనీసం వాటి ప్రభావము తగ్గుతుందని శని హనుమంతునికి ప్రమాణం చేశాడు.

శని భగవానుడు మరియు హనుమంతునడి మధ్య జరిగిన ఇంకొక సంఘర్షణను గూర్చిన కథనం ప్రకారం శని ప్రభావము హనుమంతుడిపై మొదలవుతున్న సూచికగా, ఒకసారి శని హనుమంతుడి భుజాలపై ఎక్కాడు. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని భారీగా పెంచి, శనిని, తన భుజాలు, పైకప్పు మధ్య పెట్టి బంధించి, నొక్కడం మొదెలెట్టాడట. నొప్పిని భరించలేక శననీశ్వరుడు, తనను విడిచిపెట్టమని పతరి విధాల వేడుకుంటూ, హనుమంతుడిన ప్రార్థించాడట. తనను విడిచి పెట్టినట్టయితే, ఎవరు హనుమంతుడిని ప్రార్థిస్తారో, వారిపై తన (శని) యొక్క దుష్ప్రభావాలు లేకుండ చేసెదనని శనీశ్వరుడు, హనుమంతుడికి మాట ఇచ్చిన తరువాత శనిని విడిచిపెట్టాడట.
దశరథ మహారాజు
తన రాజ్యములో నెలకొన్న కరువు మరియు పేదరికానికి శని భగవానుడే కారణమని గుర్తించి ఆయనతో ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడ్డ ఏకైక వ్యక్తి దశరథ మహారాజు. దశరథ మహారాజు యొక్క సుగుణాలను మెచ్చుకుంటూ శనీశ్వరుడు "నేను నా బాధ్యతలనుండి తప్పించుకోలేను, కాని నీ ధైర్యానికి ముగ్ధుడనయ్యాను. ఈ విషయంలో నీకు ఋష్యశృంగ మహర్షి సాయం చేయగలడు. ఎక్కడైతే ఋష్యశృంగుడు నివసిస్తాడో ఆ దేశములో కరువుకాటకాలు ఉండవు" అని శని దీవీంచాడు వృషభ రాశీ    తుల  వృచ్చిక  ధనుస్సు  మకర రాసుల వారికి. ఈ శని ఈశ్వరుని ప్రభావం అధికంగా ఉంటుంది  ఈ 2018🙏

🕉🕉🕉🕉🕉🕉

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...