Saturday, October 31, 2020

పంచ్_ప్రయాగ్

సంస్కృతంలో "నదుల సంగమం యొక్క ప్రదేశం"అని అంటారు.దీనినే - "ప్రయాగ్ పెంటాడ్" అని కూడా పిలుస్తారు, అవి సంభవించిన అవరోహణ ప్రవాహ క్రమంలో 

#విష్ణుప్రయాగ్, 

#నందప్రయాగ్, 

#కర్ణప్రయాగ్, 

#రుద్రప్రయాగ్ మరియు 

#దేవప్రయాగ.

 బద్రీనాథ్ రహదారిపై ఉన్న పంచాయ ప్రార్థగ్

 భూమి యొక్క ప్రదక్షిణను పూర్తి చేసిన తరువాత మోక్షం పొందటానికి పాండవులు అనుసరించిన స్వర్గరోహన (స్వర్గానికి అధిరోహించే) మార్గాన్ని సూచిస్తుంది.

 #విష్ణుప్రయాగ్:

 విష్ణుప్రయగ్ జోషిమత్ మరియు బద్రీనాథ్ సమీపంలోని ఉత్తరాఖండ్ లోని #అలకనంద మరియు #ధౌలిగంగా నదుల పవిత్ర సంగమం.  ఈ సంగమం వద్ద విష్ణువుకు నారదుడు చేసిన ఆరాధనను వర్ణిస్తుంది ఈ పురాణ కథనం.

 #నందప్రయాగ్:

 నందప్రయాగ్ అనేది #అలకనంద నది మరియు #నందకిని నది యొక్క పవిత్ర సంగమం. నందప్రయాగ్ ఒకప్పుడు యదు రాజ్యానికి రాజధాని.

 ఒక కథ ప్రకారం, ఒక గొప్ప రాజు నందా యజ్ఞం (అగ్ని-త్యాగం) చేసి దేవుని ఆశీర్వాదం కోరిన స్థలం.

#కర్ణప్రయాగ:

 కర్ణప్రయాగ్ #అలకనంద మరియు #పిందర్ నది సంగమం వద్ద ఉంది.#కర్ణుడు ఇక్కడ తపస్సు చేసి, తన తండ్రి సూర్య దేవుడి నుండి కవచ (కవచం) మరియు కుండల (చెవి వలయాలు) యొక్క రక్షణ సామగ్రిని సంపాదించాడని పురాణం వివరిస్తుంది, ఇది అతనికి నాశనం చేయలేని శక్తులను ఇచ్చింది.

#రుద్రప్రయాగ్:

రుద్రప్రయాగ్ #అలకనంద మరియు #మందకిని నదుల సంగమం.

         విస్తృతంగా వివరించబడిన పురాణం ప్రకారం, శివుడు ఇక్కడ తాండవనృత్యంను ప్రదర్శించాడు అని,తాండవ అనేది ఒక శక్తివంతమైన నృత్యం,

ఇది సృష్టి, సంరక్షణ మరియు ప్రళయం యొక్క చక్రానికి మూలం.శివుడు తన సంగీత వాయిద్యమైన #రుద్ర_వీణను కూడా ఇక్కడ వాయించాడు.

వీణను ఆడుకోవడం ద్వారా, విష్ణువును తన సన్నిధికి ప్రలోభపెట్టాడు అని కథనం.

#దేవప్రయాగ్:

 దేవ్‌ప్రయగ్ అంటే సంస్కృతంలో "#దైవిక_సంగమం".దేవ్‌ప్రయగ్ అనేది కనిపించే రెండు స్వర్గపు నదులైన #అలకానంద మరియు #భాగీరథులను విలీనం చేసి పవిత్ర #గంగను ఏర్పరుస్తుంది.

 ఈ సంగమానికి #దేవ_శర్మ అనే పేద బ్రాహ్మణుడి నుండి '#దేవ్' అనే పేరు వచ్చింది, అతను ఇక్కడ "తపస్సు చేయడం వలన"రాముడిచే ఆశీర్వదించబడ్డాడు అని స్థలపురాణం చెప్తుంది.

Friday, October 30, 2020

శ్రీ నరసింహ షోడశరత్న మాలికా స్తోత్రం

1) నమస్తే నారసింహభగవన్ జ్వాలామాలాస్వరూపిణే  

   ప్రహ్లాదాహ్లాదవరదాయ నారదవందితాంఘ్రియుగళే ||

2) నమస్తే నారసింహభగవన్ శంఖచక్రధారిణే 

   యోగానందస్వరూపాయ యోగమార్గప్రదర్శినే ||

3) నమస్తే నారసింహభగవన్ నిఠలాక్షస్వరూపిణే

   అరిషడ్వర్గహంతాయ మహాబలస్వరూపిణే ||

4) నమస్తే నారసింహభగవన్ అహోబలనివాసినే 

   కుంకుమచందనాంకితాయ వేదవేదాంగరూపిణే ||

5) నమస్తే నారసింహభగవన్ ఘటికాచలనివాసినే 

   దంష్ట్రాయుధాయ భద్రాయ పంచాననస్వరూపిణే || 

6) నమస్తే నారసింహభగవన్ వేదాచలనివాసినే 

   వనమాలాధరాయ శాంతాయ మంత్రరాజైకరూపిణే ||

7) నమస్తే నారసింహభగవన్ సర్వయంత్రవిదారిణే  

   సర్వతంత్రస్వరూపాయ భక్తానందకారిణే ||

8) నమస్తే నారసింహభగవన్ చండవిక్రమరూపిణే 

   గరుడారూఢాయ దేవాయ పరమహంసస్వరూపిణే || 

9) నమస్తే నారసింహభగవన్ కమలకోమలచరణే 

   ప్రణతజనవత్సలాయ  లక్ష్మీమానసవిహారిణే ||

10) నమస్తే నారసింహభగవన్ బంధమోచనకారిణే 

    వాంచితార్ధప్రదాతాయ పాపసంఘవిదారిణే ||

11) నమస్తే నారసింహభగవన్ దారుణరోగనివారిణే 

    వారిజభవపూజితాయ విశ్వస్థితికారిణే ||

12) నమస్తే నారసింహభగవన్ మకరకుండలధారిణే 

    నక్షత్రగ్రహాధీశాయ స్తంభావిర్భావరూపిణే ||

13) నమస్తే నారసింహభగవన్ షోడశకళాస్వరూపిణే  

   ధ్యానమగ్నాయ సతతం ఆగళాద్రుద్రరూపిణే ||

14) నమస్తే నారసింహభగవన్ సర్వోపద్రవవారిణే 

   జ్ఞానాంజనస్వరూపాయ నాదబ్రహ్మస్వరూపిణే ||

15) నమస్తే నారసింహభగవన్ గుణాతీతస్వరూపిణే

   త్రిభువనైకపాలకాయ శంకరఃప్రాణరక్షిణే ||

16) నమస్తే నారసింహభగవన్ జటాజూటధారిణే 

    భార్గవపవనాత్మజసన్నుతాయ శింశుమారస్వరూపిణే ||

       సర్వం శ్రీనారసింహదివ్యచరణారవిందార్పణమస్తు

Wednesday, October 28, 2020

సప్త సంతానం అంటే .....!

కూపస్తటాక ముద్యానం!

మండపం చ ప్రపా తథా!

జలదానమన్నదానం! 

అశ్వత్థారోపణం తథా!

పుత్రశ్చేతి చ సంతానం!

సప్త వేదవిదో విదు!

స్కాంద పురాణంలోని పైన చెప్పిన శ్లోకంలో సప్తసంతానం అంటే ఏమిటో వివరంగా ఉంది. 

1. కూపం. ప్రతి ఊరికీ ఊరుమ్మడి బావి ఉండాలి. అవి తాగునీటి అవసరాన్ని తీరుస్తాయి. ఆ బావిలో నీటిని వాడుకునే హక్కు అందరికీ సమానంగా ఉండాలి. కాబట్టి బావి మొదటి సంతానం

2. తటాకం: ప్రతి ఊళ్ళోనూ చెరువు ఉండాలి. అవి కేవలం పశుపక్ష్యాదుల అవసరాలకోసం, అలాగే సాగు కోసం ఉపయోగపడేవిగా ఉండాలి. చెరువుని రెండో సంతానం అన్నారందుకే! 

3. ఉద్యానం: ప్రతి ఊళ్ళొనూ కనీసం ఒకటైనా పార్కిఉ ఉండాలి. వాహ్యాళి కోసం మాత్రమే కాదు, పచ్చదనం కోసం కూడా ఉద్యానం కావాలి. దానిని మూడో సంతానంగా చెప్పారు. 

4. మండపం: ప్రతి ఊరికీ ఒక మండపం ఉండాలి. అంటే టౌన్ హాలు లాంటిదన్నమాట. పెళ్ళిళ్లనుండి తద్దినాలవరకూ ఊళ్ళో మండపం అవసరం ఉంది. ఊరుమ్మడి అంశాల చర్చలక్కూడా ఒక సభామండపం కావాలి కద! అందుకని మండపాన్ని నాలుగో సంతానంగా చెప్పారు.

5.  జలదాన మన్నదానం: చలివేంద్రాల్లో దాహార్తితో పాటు మజ్జిగ కలిసిన రాగి జావ గానీ, అంబకళం అంటే మజ్జిగ కలిసిన జొన్న జావ గానీ కుండలో పోసి ఉంచాలి. అన్నార్తిని కూడా అవి తీర్చేవిగా ఉండాలి. అలాంటి చలివేంద్రాన్ని ఐదో సంతానం అన్నారు. 

6. అశ్వత్థారోపణం: అంటే రావి చెట్టును మొలకెత్తించటం, ప్రతి ఊళ్ళొనూ ఒకటైనా రావి, తెల్లమద్ది, మర్రి, వేప, చింత లాంటి మహా వృక్షం ఊళ్ళో ఉండాలి. చెట్టుని ఆరవ పుత్రుడు అంటుందీ శ్లోకం.  

7. పుత్రుడు: ఏడవ సంతానంగా పుత్రుణ్ణి పేర్కొందీ శ్లోకం. నిజమైన పుత్రుడు ఆఖర్న వచ్చాడు. నుయ్యి, చెరువు మొక్క వగైరా నిజపుత్రుడికన్నా ఎక్కువ పుత్రసమానం అని దీని బావం

ఏడుగురు కొడుకులూ సమృద్ధిగా ఊళ్ళో ఉంటే ఏ వూరైనా రాజధానికన్నా గొప్పదే! 

చెరువులు పూడ్చి, మొక్కలు నరికి, పార్కులు ఆక్రమించి, చలివేంద్రాలను బూటకం చేసి, ఊరుమ్మడి సభామందిరాలను కూలగొట్టి, ఖరీదైన భవనాలు కట్టే విధంగా ఎవరు పాలించినా ఏడుగురు బిడ్డల తండ్రి కాలేడని దీని భావం. 

రాజు సంతాన వంతుడు కావాలి, ఎంత సంతాన వంతుడైతే అంత గొప్పగా పాలించినట్టు... అని అర్ధం చేసుకోవాలి. 

ఈ ఏడుగురు కొడుకుల్లో ఏ బిడ్డ ఏడ్చినా లోపం తండ్రిదే!

ధర్మసందేహాలు - సమాధానాలు

వాస్తు పురుషుడు ఎప్పుడు జన్మించాడు ? 

 భాద్రపద బహుళ తదియ, మంగళవారము, కృత్తిక నక్షత్రము, వ్యతిపాత యోగము, భద్రనాకరణము గుళికతో కూడిన కాలములో వాస్తు పురుషుడు జన్మించాడు.

ఏడుగురు అప్సరసల పేర్లు ఏవి ?

1.రంభ. 2. ఉర్వశి. 3.మేనక  4.తిలోత్తమ. 5.సుకేశి. 6. ఘ్రుతాచి 7. మంజుగోష .

 సప్త సంతానములు అంటే ఏమిటి ?

1. తటాక నిర్మాణం. 2. ధన నిక్షేపం. 3. అగ్రహార ప్రతిష్ట . 4. దేవాలయ ప్రతిష్ట . 5. ప్రభంధ రచన. 

6. స్వసంతానం ( పుత్రుడు ).

తొమ్మిది రకాల ఆత్మలు  ఏవి ?

 1. జీవాత్మ. 2. అంతరాత్మ. 3. పరమాత్మ. 4. నిర్మలాత్మ. 5. శుద్దాత్మ. 6. జ్ఞానత్మ  7. మహాధాత్మ . 8. భూతాత్మ . 9. సకలాత్మ.

 పదిరకాల పాలు ఏవి ?

 1. చనుబాలు. 2. ఆవుపాలు . 3. బర్రెపాలు  4. గొర్రె పాలు. 5. మేక పాలు. 6. గుర్రం పాలు 7. గాడిద పాలు. 8. ఒంటె పాలు. 9. ఏనుగు పాలు  10. లేడి పాలు.

 యజ్ఞోపవీతం లొ ఎన్నిపోగులు ఉంటాయి?

 యజ్ఞోపవీతం లొ 9 పోగులు ఉంటాయి. ఆ తొమ్మిది పోగుల్లో 9 మంది దేవతలు నివసిస్తారు. వారు  

 1. బ్రహ్మ . 2. అగ్ని. 3. అనంతుడు. 4. చంద్రుడు . 5. పితృ దేవతలు . 6. ప్రజాపతి. 7. వాయువు  8. సూర్యుడు . 9. సూర్య దేవతలు .

 అష్టాదశ ఆయుర్వేద సంహితలు ఏవి ?

 1. చరక సంహిత. 2. శూశ్రుత సంహిత. 3. పరాశర సంహిత. 4. హరిత సంహిత. 5. అగ్నివేశ సంహిత. 6. చ్యవన సంహిత. 7. ఆత్రేయ సంహిత. 8. భోజ సంహిత. 9. బృగు సంహిత. 10. బెడ సంహిత. 

11. అగస్త్య సంహిత. 12. వరాహ సంహిత. 

13. అత్రి సంహిత. 14. నారయణ సంహిత. 

15. చంద్ర సంహిత. 16. నారసింహ సంహిత. 

 17. శివ సంహిత. 18. సూర్య సంహిత.

 గృహ నిర్మాణం ఏ విధంగా చేపడితే సర్వ సుఖాలు పొందుతారు?

 1 . ఈశాన్యం లొ పూజలు , పవిత్ర కార్యాలును నిర్వర్తించే విధంగా పూజగది ఉండాలి.

 2 . ఆగ్నేయం లొ అగ్నికి సంబందించిన వంటావార్పు చేసుకొనే విధంగా వంటగది ఉండాలి.

 3 . నైరుతిలో ఆయుధ సామగ్రి మొదలయిన వాటిని పెట్టుకోవడానికి ఒక గది ఉండాలి.

 4 . వాయువ్యం లొ స్వతంత్రబిలాష చిహ్నములు .

 5 . తూర్పు దిక్కున సూర్యునికి ప్రీతికరమైన పనులు.

 6 . యమస్థానం అయిన దక్షిణం వైపు తలపెట్టి నిద్రించుట.

 7. కుభేర స్థానం అయిన ఉత్తరం వైపు చూస్తూ నిద్రలేచుట.

 8. వరుణ స్థానం అయిన పశ్చిమాన పాడిపశువులు పెంచుటకు తగిన స్థలం ఉండవలెను.

 ఈ విధంగా చేయుటవలన ఆయా దిక్కులలోని ఉన్న దేవతలు సంతృప్తి చెంది ఆ గృహములో నివసించేవారికి సర్వసుఖాలు, సర్వ సంపదలు ఇస్తారు.

 వివిద ఫలాల నైవేద్యం  -  ఫలితాలు

 కొబ్బరి కాయ ( పూర్ణ ఫలం ) - భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యం గా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి.

 అరటి పండు - భగవంతుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యం గా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్లు నైవేద్యం గా సమర్పిస్తే మద్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి.

 నేరెడు పండు. - శనీశ్వరునికి నేరెడు పండు నైవేద్యం గా పెట్టి  ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరొగ్య వంతులు అవుతారు.

 ద్రాక్ష పండు. - భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది.

 మామిడి పండు. -  మామిడి పండుని నైవేద్యం గా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యం గా పెట్టిన మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యం గా పెట్టి అందరికి పంచి తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు.

 అంజూర  పండు. - భగవంతుడికి నైవేద్యం పెట్టిన అన్జురాపండు ను అందరికి పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరొగ్య వంతులు అవుతారు.

 సపోట పండు. - సపోట పండు నైవేద్యం గా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంభంద విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి.

 యాపిల్ పండు - భగవంతుడికి యపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు.

 కమలా పండు. -  భగవంతుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచిపోయన పనులు సజావుగా పూర్తి అవుతాయి.

 పనసపండు -  పనసపండు ని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనము, రోగావిముక్తి కలిగి సుఖంగా ఉంటారు.

 పంచవిధ సూతకములు అంటే ఏమిటి ?

 1.జన్మ సూతకము. 2. మృత సుతకము. 3. రజః సూతకం . 4. అంటు (రొగ ) సూతకం . 5. శవదర్శన సూతకం . 

 దేవాలయాల వద్ద గృహ నిర్మాణం చేయడం దోషమా ?

 శివాలయానికి నూరు బారుల దూరం లొపల, విష్ణువాలయముకు వెనక ఇరవై బారుల దూరం లొపల, శక్తి ఆలయముకు సమీపం లొను గృహనిర్మాణం చేయకూడదు . దీనికి వ్యతిరేఖంగా గృహ నిర్మాణం జరిగితే సఖల సంపదలు నశించి కష్టాలపాలు అవుతారు. గుడి దగ్గర ఉన్న ఇళ్ళకు ఏ వైపునైనా , ఏ మాత్రమైనా గుడి నీడ పడిందంటే దరిద్రం, ప్రాణనష్టం వంటి అనేక కష్టనష్టాలు ఎదుర్కోక తప్పదు.

 తాంబూలం సేవించేప్పుడు తమలపాకు తొడిమ, చివర్లు ఎందుకు తుంచాలి ?

 తాంబులం వేసుకునే ముందు తమలపాకుల తొడిమలు, చివరలు తుంచివేయాలి. ఎందుకంటే తొడిమను తినడం వ్యాదికారకం అవుతుంది. చిగుర్లు పాపానికి ప్రతీకలు అని అంటారు. కనుక తమలపాకు తొడిమలు , చివరలు తుంచిన తర్వాతే తాంబులం వేసుకొవడం ఆరొగ్య ప్రధమం . అలాగే తమలపాకులో ఉండే ఈనెలు బుద్దిని మందగింప చేస్తాయి. అందుకే తమలపాకును నమిలి మొదటగా నోటిలో ఊరిన రసాన్ని ఉమ్మివేయాలి. తొడిమలు, చివరలు తున్చివేసినా ఇంకా అవి తమలపాకులో శేషించి ఉంటాయి కనుక 

 శ్రీ గోవింద రాజస్వామి వారి సన్నిధిలో కుంచం ఉంటుంది ఎందుకు ?

 తిరుపతి శ్రీ గొవింద రాజస్వామి వారి సన్నిదిలో కుంచం ఉండటం నిజమే . దీనికి కారణం ఈ విధంగా చెబుతారు. తిరుమల స్వామి శ్రీ వెంకటేశ్వరస్వామి  కుబేరుని వద్ద అప్పు చేసాడట . దానిని తీర్చుట కొరకు ద్రవ్యాన్ని కుంచం తో కొలిసి ఇచ్చేవారట స్వామివారు. స్వామివారి పక్షాన గొవింద రాజస్వామి ఈ కార్యమును సాగించారని ఒక కధ ప్రచారం లొ ఉంది. ఆ కుంచం తన తలక్రింద ఉంచుకున్నాడు అని ప్రతీతి.

 నవగ్రహాలకు సంభందించిన సమిధలు ఏవి ?

 1. సూర్యుడు - జిల్లెడు. 2. చంద్రుడు - మొదుగ .

 3. అంగారకుడు - చండ్ర. 4. బుదుడు - ఉత్తరేణి .

 5. బృహస్పతి - రావి . 6. శుక్రుడు - అత్తి .

 7. శని - జమ్మి . 8. రాహువు - దర్భ. 

 9. కేతువు - గరిక .

  ఎటువంటి స్థలం లొ గృహ నిర్మాణం చేయరాదు?

 1 . గోవుల మందలు ఉండే ప్రదేశాలలోనూ .

 2 . స్మశాన భూమికి సమీపం లొను .

 3 . మలమూత్రాలు విసర్జించు ప్రదేశాలలోను .

 4 . ఉప్పు నేలలోను, చవుడు నేలలయందు .

 5 . ఎల్లప్పుడు నీటి వుటలు గల ప్రదేశాలలోను .

 6 . రాతి భూముల యందు , మిక్కిలి రక్త వర్ణం గల భూమి యందు 

 7 . చెరువులను పూడ్చి గృహ నిర్మాణం చేయరాదు అలా చేయడం వలన అనేకములు అయిన పంది జన్మలు ఎత్తి రౌరవాది నరకములు అనుభవించి కష్టాల పాలవుతారు .

 పుజాంగాలు  ఎన్ని రకాలు ?

 పుజాంగాలు  5 రకాలు. 

 1 .అభిగమనము - దైవాన్ని స్మరిస్తూ దేవాలయానికి వెళ్ళుట.

 2 . ఉపాధానము - పూజా సామగ్రిని సంపాదించుట

 3 . ఇజ్య - దూప, దీప, నైవేద్యములతో పూజించుట.

 4 . స్వాద్యాయము - తనకు తానుగా మంత్రోచ్చారణ తో స్తుతించడం.

 5 . యోగము - తదేకమైన నిష్టతో ధ్యానించుట .

 ఏయే గృహాలకి ఎటువంటి శంఖువు ప్రతిష్ట చేయాలి ?

 రాతితో కట్టే గృహానికి ఆ రాతితోనే శంఖువు తయారు చేసి శంఖుస్థాపన చేయవలెను . ఇటుకలతో కట్టిన గృహమునకు ఇటుకలతోనే శంఖువు చేసి ప్రతిష్ట చేయవలెను .గోడలు పెట్టక కర్రలతో , నిట్రాట లతో వేయు పాకలకు కర్రతో శంఖువు తయారు చేసి ప్రతిష్ట చేయవలెను . శంఖువును నవరత్న, సువర్ణ, తామ్ర , రజిత నాణేలతో , నవధన్యములతో పూజించి , స్థాపించవలెను . అన్ని రకాల గృహములకు కర్ర శంఖువు ప్రతిష్టించరాదు . కాష్ట శంఖువు భుమిలొ ఎంతకాలం ఉండునో అంతకాలం ఆ గృహం శుబప్రధంగా ఉండును. ఆ తరువాత ఆ గృహములలో నివసించువారికి కష్టాలు కలుగును.కావున కర్రతో చేసిన శంఖువు కంటే రాతితో చేసిన శంఖువు ఉత్తమం అని తెలుస్తుంది.

 గృహ నిర్మాణం లొ ఇంటి కిటికీలు, ద్వారాలు ఏ విధంగా అమర్చాలి ?

 గృహంలో కిటికీలు, ద్వారములు సమసంఖ్యలో ఉండాలి. వేటికవే విడివిడిగా సమసంఖ్యలొ ఉండాలి. కిటికీలు సరిసంఖ్యలోను , ద్వారాలు సరిసంఖ్యలొను ఉండాలి. అలమారాల గురించి శాస్త్రం లొ ఏమీ చెప్పలేదు. వాటి ఉపయోగాన్ని అనుసరించి సరిసంఖ్యో, బేసి సంఖ్యలొ నో పెట్టుకొవాలి. వాటికి స్థల నిర్ణయం కూడా చెప్పలేదు కిటికీలు , ద్వారాలు సరిసంఖ్యలో ఉన్నా చివరన సున్నా లేకుండా ఉండాలి. అనగా 10,20,30 ఇలా చివరన సున్నా రాకూడదు. అలాగే మొత్తం గృహం లొ ఉన్న ద్వారాలు, కిటికీలు అన్ని లెక్కపెట్టాలి.

 వివిధ జన్మలు ఏవి ?

 1. దేవతలు . 2. మనుష్యులు. 3. మృగములు.

 4. పక్షులు . 5. పురుగులు. 6. జలచరములు.

 7. వృక్షములు .

 శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఏడుకొండల పేర్లు ?

 1. వ్రుషబాద్రి . 2. నీలాద్రి. 3. గరుడాద్రి. 

 4. అంజనాద్రి. 5. శేషాద్రి. 6. వెంకటాద్రి.

 7. నారాయణాద్రి.

 ఎవరెవరికి యే విధంగా నమస్కరించాలి?

 1. విష్ణుమూర్తి యెక్క సర్వ అవతారాల విగ్రహాలకు మరియు శివునికి 12 అంగుళాల ఎత్తులొ చేతులు జోడించి శిరస్సు వంచి భక్తి , శ్రద్దలతో వినయంగా నమస్కరించాలి.

 2. ఇతర దేవుళ్ళకు శిరస్సు పై రెండు చేతులు జోడించి నమస్కరించాలి.

 3. గురువుకి నోటితో " నమస్కారం " అని చెప్పకుండా రెండు చేతులు జోడించి వినయవిధేయలతో నమస్కరించాలి.

 4. మహానుభావులకు , యోగులకు రెండు చేతులు వక్షస్థలం పై  జోడించి నమస్కరించాలి.

 5. తండ్రికి , పరిపాలకుడికి రెండు చేతులు నోటి మీదగా జోడించి నమస్కరించాలి.

 6. తల్లికి ఉదరం పై రెండు చేతులు జోడించి నమస్కరించాలి.

  శ్రీ చక్రం నందు గల దేవతలు ఎవరు?

 1. వశిని . 2. కామేశ్వరి. 3. మోదిని . 4. విమల.

 5. అరుణి . 6. జయిని . 7. సర్వేశ్వరీ . 8. కాళిని .

 ధర్మం అంటే ?

  ధృతి, క్షమ , దమము, అస్తేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, ధీ , విద్య, సత్యము, అక్రోధము. ఈ పది లక్షణములు కలిగినదే "ధర్మము"

 సహంపక్తి బోజనాల సమయం లొ అందరూ ఒకేసారి లేవాలి అంటారు ఎందుకు ?

 సహంపక్తి బోజనానికి కూర్చున్న వారందరి జీవన ప్రమాణం ఒకేవిధంగా ఉండదు. సహంపక్తి బోజనాలలో రకరకాల వారు ఉంటారు. వారిలొ మంచివారు ఉంటారు. అలాగే చెడు అలవాట్లు ఉన్నవారు ఉంటారు. ఎవరి శరీరాల్లోని విద్యుత్ వారి వారి శరీరపు శక్తిని అనుసరించే పనిచేస్తూ ఉంటుంది . కాని సహపంక్తి లొ కూర్చున్నప్పుడు దాదాపు అందరి శరీరాల్లోని విద్యుత్ నియంత్రణ అందరిలో ఒకేలా ఉంటుంది. అటువంటప్పుడు తక్కువ శక్తితో ఉన్న వ్యక్తీ అందరికంటే ముందుగా లేచినచో మిగిలిన వారి శక్తి అతనికి ఎంతోకొంత వెళ్ళిపోతుంది.

          కనుకనే సహపంక్తి బోజనానినికి కుర్చున్నప్పుడు ఎవరు ముందు తిన్నా , ఎవరు వెనక తిన్నా , అందరూ ఒకేసారి లేవాలన్న నియమం పూర్వకాలం నుండి ఆచరణలో ఉంది.

 దేవతా లక్షణాలు ఏవి ?

 1. రెప్పపాటు లేకుండుట . 2. భూమి మీద పాదాలు ఆనించ కుండా ఉండుట.3. వ్యసనం లేకుండా ఉండుట.

 నవ వ్యాకరణాలు అనగా ఏవి ?

 1. పాణి నీయం . 2. కలాపం. 3. సుపద్మం. 

4. సారస్వతం. 5. ప్రాతిశాఖ్యం ( కుమార వ్యాకరణం ) 6. ఐంద్రం . 7. వ్యాఘ్ర బౌతికం. 

 8. శాఖటా టా యానం . 9.శాకల్యం .

 శ్రీ రాముని జన్మనక్షత్రం , మాసం ఎప్పుడు ?

 శ్రీ రాముడు చైత్ర మాసం , నవమి తిధిలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. ఆయన జన్మ నక్షత్రం పునర్వసు .

 పర్వ దినాలలో వడపప్పుని ఎందుకు పెడతారు 

 భగవంతుడికి ప్రతి పండగనాడు వడపప్పుని , చలిమిడిని తప్పకుండా చేసి పెడతారు. అలాగే తల స్నానం చేసి ఆయా దేవుళ్ళకి ఇష్టమైన పిండి వంటలు చేయడం వల్ల వేడి చేసి తిన్న పిండి వంటలు సరిగ్గా అరగవు . తద్వార అనారోగ్యం కలుగుతుంది.

          ఇటువంటి ఉపద్రవాలు తలెత్తకుండా ఉండటానికి కొన్ని ప్రాంతాలలో వడపప్పు, పానకం , చలిమిడి తప్పకుండా చేస్తారు . పెసరపప్పుతో చేసిన వడపప్పు తినడం వలన తిన్న పిండి వంటలు జీర్ణం అయ్యి వేడి చేయకుండా చలువ చేస్తుంది .

 శ్రీ వారి సుప్రభాతాన్ని ఎవరు ఎప్పుడు రచించారు.?

 శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రసిద్ధ సుప్రబాతాన్ని రచించిన వారు శ్రీ ప్రతివాది భయంకర అన్నన్ అనే ఆచార్యులు. వీరు అష్టదిగ్గజాలుగా ప్రసిద్ధులైన శ్రీ మనవాల మహామునుల శిష్యులలో ప్రముఖులు వీరు క్రీ .శ . 1361 లొ జన్మించి 1454 వరకు అంటే 93 సంవత్సరాలు జీవించి ఉన్నారని పరిశోధకుల అభిప్రాయం.వీరు తమ జీవిత కాలంలో అనేక కృతులు రచించారు. వీరి రచనలలో శ్రీ స్వామివారి సుప్రబాతం అనన్య సామాన్యమైన ప్రచారం పొందింది.

 పంచ కోశాలు అంటే ఏమిటి ?

 1. అన్నమయ కోశం. 2. ప్రాణమయ కోశం .

 3. మనోమయ కోశం . 4. విజ్ఞానమయ కోశం .

 5. ఆనందమయ కోశం .

 శౌచమంటే ఏమిటి ?

 శుచి అంటే శుభ్రము , శుద్ధము . ధర్మాది పరీక్షల చేత భాహ్య అంతరములలో పరిశుద్దిని పొందుటయే " శౌచం" అనబడును. శౌచం రెండు విధములు 

 1 . బాహ్య శౌచం.

 2. అంతః శౌచం .

 భాహ్య శౌచం - శరీరం పైన ఉండే మలినాలను పోగొట్టుకోవడానికి చేసే స్నానాదులు, శరీరం పరిశుద్ధం గా ఉండేందుకు పూసే సుగంద ద్రవ్యాలు వంటివి. వీటిని భాహ్య శౌచం అంటారు.

 అంతః శౌచం - మనస్సులో ఎటువంటి చెడు భావాలు లేకుండా అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద , వాత్సర్యాలు లేకుండా నిర్మలమైన అంతహకరణను కలిగి ఉండటమే అంతః శౌచం అనబడను. అంతః శౌచం మనస్సుకి సంభందించినది. కాబట్టి దీనికి శాస్త్రాలలో అదిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

 ఏయే ప్రదేశాల్లో జపం చేస్తే ఎంతెంత ఫలితం ?

 ఇంట్లో చేసే జపానికి సత్ఫలితమే ఉంటుంది . కాని ఇంట్లో జపం చేస్తే అంతే ఫలితం ఉంటుంది. అదే జపాన్ని నది పరీవాహక ప్రాంతాల్లో చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది . గోశాలలో చేసే జపం వల్ల వందరెట్ల ఫలితం ఉంటుంది . యాగశాలలో చేసే జపం వలన వందరెట్ల కంటే అధికమైన ఫలితం వస్తుంది. దేవాలయాలలో , పుణ్య ప్రదేశాలలో చేసే జపం వలన పదివేల రెట్లు ఫలితం కలుగుతుంది. శివాలయాలలో , శివ సాన్నిద్యం నందు చేసే జపం వలన అత్యున్నతమైన ఫలితం దక్కుతుంది.

 రావణుడు ప్రతిష్టించిన 6 శివ లింగాలు ఏవి ?

 1. వైద్యనాధ లింగం. 2. వక్రేశ్వర నాద లింగం.

 3. సిద్ధినాద లింగం. 4. తారకేశ్వర లింగం.

 5. ఘటేశ్వర లింగం. 6. కపిలేశ్వర లింగం.

 ధర్మ సందేహాలు  -  సమాధానాలు . PART - 4. 

 పదనాలుగు లోకాలలో ఎవరెవరు ఉంటారు ?

 పదనాలుగు లోకాలలోని మొదటి మూడు లోకాల్లోను అంటే భూలోకం , భువర్లోకం, స్వర్లోకాలను " కృతక లోకాలు " అంటారు. జీవులు తాము చేసుకొన్న కర్మఫలాన్ని బట్టి ఈ మూడు లొకాల్లొను ఉంటారు.

 నాల్గొవదైన మహర్లోకం కల్పాన్తములో కూడా నశించదు. ఈ లొకం లొ కల్పాంత జీవులు ఉంటారు.

 అయిదోవది అయిన జనలోకం లొ బ్రహ్మ దేవుని మానస పుత్రులైన సనక సనందన సనత్కుమారాదులు నివసిస్తారు.

 ఆరొవదైన తపోలోకంలో దోష వర్జితులు , దేహ రహితులు అయిన వైరాజులనే వారు ఉంటదము. 6. మాత్స్చార్యము .

 7. రాగము. 8. ద్వేషము. 9. ఈర్ష్య . 10. అసూయ

 11. దర్పము. 12. దంబము. 13. అహంకార దోషము.

 భగవంతుడికి నివేదించే సమయం లొ గుర్తు ఉంచుకోవలసినవి ?

 భగవంతుడికి నివేధించేప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయరాదు . తెలిసి చెసినా,తెలియక చేసినా తప్పు తప్పే అంటారు. కనుక నివేధించేప్పుడు ప్రతివారు తప్పక చేయవలసినవి .

 1 . దేవునికి నైవేద్యం గా పెట్టడానికి చేసిన వంటకాలలో నుంచి కొంత విడిగా తీయరాదు .పాత్ర మొత్తాన్ని దేవుని ఎదుట పెట్టాలి .

 2 . పదార్ధాలు వేడిగా ఉన్నప్పుడు నివేదిన్చరాదు . చల్లారాక పెట్టాలి .

 3 . నివేదనలో మంచినీటిని కుడా తప్పనిసరిగా పెట్టాలి.

 4 . నివేదించే వంటకాలలో పంచదారకు బదులు బెల్లం వాడాలి.

 ఊర్ధ్వ పుండ్ర ములు ఎందుకు ధరిస్తారు ?

 ఆర్య మతంలో ముఖధారణం (బొట్టు ) ఒక ఆర్ష సాంప్రదాయంగా ఏర్పడింది. అది త్రి పుండ్రము , ఊర్ధ్వ పుండ్రము. అని రెండు రకాలుగా విభజించబడింది. వైష్ణవులు ఊర్ధ్వ పుండ్రము లు  ధరిస్తారు . స్త్రీలు తిలకధారణ చేస్తారు . 

     తిరుమణిని నిలువునా మూడు రేఖలుగా ధరించడంనే ఊర్ధ్వ పుండ్ర దారణ అంటారు.ఈ మూడు రేఖలు అకార, ఉకార, మకార స్వరూపమైన ప్రనవాన్ని సూచిస్తాయి. అకారం - సత్వ స్వరుపడైన శ్రీ మహావిష్ణువును , ఉకారం - చిత్వ స్వరూపిణి అయిన మహాలక్ష్మిని , మకారం  భగవద్భాక్తులైన భాగవతులను తెలియజేస్తాయని చెబుతారు.  శైవులు భస్మాన్ని మూడు అడ్డరేకులుగా నుదుట ధరిస్తారు .

    తిరుమణి మట్టికి సంభందించినది . కావున అది మట్టి నుండి కలిగిన ఈ శరీరం చివరికి మట్టిలోనే కలిసిపోతుందని సుచిస్తుంది. ఇందువల్ల వైరాగ్యం కలుగుతుంది. ముక్తి కోరేవానికి వైరాగ్యం చాలా ముఖ్యం. విభూతి దారణ కూడా ఈ శరీరం చివరికి బూడిద అయ్యేది అనే తత్వాన్ని నిర్దేశిస్తుంది. ముఖదారణ లేకుండా చేసే సత్కర్మలు నిరర్ధకాలు అని ఆగమాలు పేర్కొన్నాయి.

  ద్వాదశ (12) ఊర్ధ్వ పుండ్రము లు ధరించడం కూడా కద్దు. నాడులు, హృదయం మొదలయిన శరీర భాగములను చల్లబరుచుటకు కూడా ఆయా స్థానములలో ఊర్ధ్వ పుండ్ర దారణ అవసరమయిన వైజ్ఞానికం గా విశ్లేషణ చేసి కొంతమంది వివరిస్తున్నారు . ఉర్ధ్వ పుండ్రం లొ ఉపయొగించే వస్తువులకు చల్లదనం కలిగించే లక్షణం ఉంది.

 నదులలోను, సముద్రాలలోను పవిత్ర స్నానాలు చేసేప్పుడు పాటించవలసిన నియమాలు ఏవి ?

 నదీ స్నానం , సముద్ర స్నానం వంటివి చేసే ముందు నదీ స్నానం అయితే నదీమ తల్లిని, సముద్ర స్నానం అయితే సముద్రున్ని, అనంతరం క్షేత్ర దేవతల్ని, మనస్సులొ స్మరించుకొని సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి .

 * రాత్రి పూట నిద్రించే టైములో ఒంటిపై ధరించిన వస్త్రాలతో నదిలో మునగరాదు. ఈ బట్టలను విడిచి శుభ్రమైన వస్త్రములను ధరించాలి.

 * పుణ్య నదులలో పాప పరిహారార్ధం చేసే పవిత్ర స్నానముల సమయం లొ ఖచ్చితమైన నియమాలు పాటించి తీరాలి.

 * స్నాన అనంతరం ఆ బట్టల్ని నదుల్లో పిండ రాదు అలాగే సబ్బులను ఉపయొగించి కూడా బట్టలను ఉతకరాదు . 

 * అభ్యంగ స్నానం అంటే కుంకుళ్ళు , షాంపు లు మొదలయిన వాటిని ఉపయొగించి తలంటు స్నానం చేయరాదు . 

 * పొరబాటున కూడా నదిలోగాని, నదీ తీరాల్లోగాని మలముత్రాలు విసర్జిన్చరాదు . ఈ నియమానికి వ్యతిరేకంగా  చేస్తే పాపం అంటుతుంది.

 * ఆఖరికి నీళ్లను పుక్కిలించి ఉమ్మి వేసినా కూడా మహా దొషం అవుతుంది.

 * పవిత్ర స్నానములు ఆచరించే సమయంలో అ మంగళ కరమైన మాటలు మాట్లడకుడదు. కసురుకోవడం, కోప్పడటం, వంటివి చేయకూడదు .

 * సముద్ర స్నానం కేవలం పర్వదినములలో  మాత్రమే చేయాలి .మాములు సమయాలలో సముద్రాన్ని తాకకూడదు .

 * స్నానం చెసే ముందు సంకల్పం చెప్పుకోవాలి..

Tuesday, October 27, 2020

ఏ రాశి వారు ఏ దేవునికి తాంబూలం స‌మ‌ర్పించాలి?

 ఈతిబాధలతో స‌త‌మ‌త‌మ‌య్యేవారు ఏం చేయాలి? ఏ దేవున్ని ప్రార్థించాలి? ఈతిబాధలు తొలిగిపోవాలంటే ఎలాంటి ప‌రిహారం చేసుకోవాల‌ ?

12 రాశుల్లో జన్మించిన జాతకులు ఏ దేవుళ్లకు తాంబూలం సమర్పించి ప్రార్థించాలో తెలుసుకోవాలి. 12 రాశుల్లో పుట్టిన జాతకులు రాశి ప్రకారం ఏ దేవునికి తాంబూలం సమర్పించి వేడుకుంటే.. ఈతిబాధలు తొలగిపోతాయనేది తెలుసుకుందాం..   

 * మేష రాశి వారు.. తాంబూలంలో మామిడి పండును ఉంచి మంగళవారంలో కుమారస్వామిని ప్రార్థిస్తే ఈతిబాధలు తొల‌గిపోతాయి. 

* వృషభ రాశి వారు తమలపాకులో మిరియాలు ఉంచి మంగళవారం పూట రాహువును స్తుతిస్తే.. కష్టాలుండవు. సుఖసంతోషాలు చేకూరుతాయి. 

 * మిథున రాశి వారు తమలపాకులో అరటిపండును ఉంచి బుధవారం ఇష్టదేవతా పూజ చేస్తే.. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.

 * కర్కాటక రాశి వారు.. తమలపాకులో దానిమ్మను ఉంచి శుక్రవారం పూట కాళిమాతను ప్రార్థిస్తే కష్టాలు తీరిపోతాయి. 

* సింహ రాశి వారు.. తమలపాకులో అరటిపండును ఉంచి గురువారం ఇష్టదేవతా పూజను చేయాలి. 

* కన్యారాశి రాశి వారు.. తమలపాకులో మిరియాలు ఉంచి గురువారం ఇష్టదేవతా పూజ చేస్తే.. దుఃఖం దూరమవుతుంది. 

* తులా రాశి రాశి వారు.. తమలపాకులో లవంగంను ఉంచి శుక్రవారం పూట ఇష్టదేవతను స్తుతిస్తే.. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. 

* వృశ్చిక రాశి వారు.. తమలపాకులో ఖర్జూర పండును ఉంచి మంగళవారం పూట ఇష్టదేవతను పూజిస్తే ఈతిబాధలు తొలగిపోతాయి. 

* ధనుస్సు  రాశి వారు.. తమలపాకులో కలకండను ఉంచి గురువారం పూట ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి.

* మకర రాశి వారు.. తమలపాకులో బెల్లంను ఉంచి శనివారాల్లో కాళిమాతను పూజిస్తే.. కష్టాలు తీరిపోతాయి. 

* కుంభ రాశి వారు.. తమలపాకులో నెయ్యిని ఉంచి శనివారం పూట కాళిమాతను పూజించినట్లైతే.. దుఃఖాలు తొలగిపోతాయి. 

 * మీన రాశి వారు.. తమలపాకులో పంచదారను ఉంచి ఆదివారం ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి.

Monday, October 26, 2020

శ్రీ రామ నామ మహిమ

శ్రీరామ జయరామ జయ జయరామ

జపమనగా

జకారో జన్మ విచ్ఛేదః పకారః పాపనాశకః

తస్మాజ్జప ఇతి ప్రోక్తో జన్మ పాపవినాశకః 

‘జ’ కారము జన్మ నాశనమును ( మోక్షము ను ), 

‘ప’ కారము పాపనాశనమును సూచించును. 

అనగా పాపములను నాశనము చేసి, 

మరల జనన మరణములు లేకుండా 

మోక్షమొసంగునట్టిది గనుకనే " జపం" అని చెప్పబడినది.

ప్రణవో థనుః శరోహ్యాత్మా బ్రహ్మత్వంల్లక్ష్య ముచ్యతే

అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయోభవేత్

భగవన్నామమైన ‘ఓం’ కారము ధనుస్సు. 

ఆత్మయైన సాధకుడే బాణము. 

బ్రహ్మమును చేరుటే అతని లక్ష్యము.  

సాధకుడు అటువంటి ఓం కారము అనెడి థనస్సును ఊతము చేసుకుని,  

నిశ్చలమైన మనస్సుతో బ్రహ్మమును గురిచూసి కొట్టిన యెడల ఆత్మ బ్రహ్మమునందు జేరి 

తానే బ్రహ్మ స్వరూపుడగుచున్నాడు.

జపానికి ఇంతటి శక్తి ఉంటే!, 

ఇక " శ్రీ రామ" నామ జపానికి ఎంతటి శక్తి ఉన్నదో చెప్పుట మానవమాత్రుల వలన సాధ్యమా!?

శ్రీ రామ నామ మహిమ 

గాణాపత్యేషు శైవేషు శాక్త సౌరేష్వభీష్టశః

వైష్ణవేష్వపి సర్వేషు రామ మంత్రః ఫలాదికః

 తా: గణేశ, శైవ, శక్తి, సూర్య, వైష్ణవ మంత్రములన్నింటికంటెనూ అధిక ఫలము 

ఈ రామ నామ జపము వలన కలుగుతుంది. 

రామ నామము జపించుచుండుట వలన గాని, 

ఈ రామ నామమునే మరణాసన్నులైన వారి 

కుడి చెవిలో ఉపదేశించుట వలన గానీ, ఎవరయినను మోక్షము బొందెదరని శ్రీరాముడు శివునకు ఉపదేశించెనట.

"ర" అగ్ని బీజం - దహింప జేయునది,

"ఆ" వాయు బీజం - సర్వగతము, ఆకర్షకము,

"మ" ఆకాశ బీజం - శతృ మోహన కరము

ఇటువంటి అగ్ని బీజ, 

వాయుబీజ, 

ఆకాశ బీజ సమ్మిళితమైన " శ్రీ రామ" నామ మహిమ ఇంతా అంతా అని చెప్పనలవి కాదు.

చిద్వాచకో ర కారస్స్యాత్ సద్వాచ్యో2కార ఉద్యతే

మకారానంద వాచస్స్యాత్ సచ్చిదానంద మవ్యయమ్

"ర" కారము చిత్తు, 

"ఆ" కారము సత్తు,  

"మ" కారము ఆనందము. 

వీటి సంయోగముచే నాశరహితమైన 

"సచ్చిదానంద రూపమే శ్రీరామ" నామము.

అలాగే "ర" కారము వైరాగ్యమునకు హేతువు, 

"ఆ" కారము ఙ్ఞాన కారణము, 

"మ" కారము భక్తికి కారణము కనుక 

నిత్యము రామనామమును జపించు వారలకు 

భక్తి, ఙ్ఞాన, వైరాగ్యములు కలుగును.

"తర్జనం యమ దూతానాం రామ నామేతి గర్జనం"

‘రామ రామ ’ అని క్షణ క్షణము జపించుచుండట వలన యమ దూతలు దరికి జేరుటకు కూడా భయపడి దూరముగా పారిపోవుదురు.

అఙ్ఞానాద ధవా ఙ్ఞానా దుత్తమ శ్లోక నామయత్

సంకీర్తిత మఘం పుంసోదహేత్యేవ యథానలః 

ప్రజ్వరిల్లెడి అగ్ని కట్టెలను కాల్చు చందమున, భగవన్నామ శక్తి తెలిసి కాని, 

తెలియక కాని ఏవిధంగా చేసినా 

మానవుల యొక్క పాపములను దహించి వేయును. 

కనుక అటువంటి ‘రామ’ నామజపాన్ని 

మనము చేయుట వలన 

జన్మజన్మాంతరములలో చేసిన పాపములన్నీ నాశనమొంది ఇహమున సమస్త సంపదలూ పొందటమే కాక, 

పరమున మోక్ష ప్రాప్తిని పొందుదురు. 

రామనామాన్ని గురించిన చక్కని కథ ఒకటి...

త్రేతాయుగంలోనే శ్రీ రాములవారు 

రాజ్యం చేస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవాడు. నిరంతర ‘శ్రీ రామ’ నామ జపం చేసేవాడు. 

ఎక్కడ రామనామం, 

రామకథ చెప్పబడుతుందో అక్కడే హనుమ ఉంటారు కదా! 

అలా ఒకరోజు ఆ భక్తుని వెనక అదృశ్యంగా అతనితోపాటే తిరుగుతూ అరమోడ్పు కన్నులతో రామనామ పారవశ్యంలో మునిగితేలుతున్నారు హనుమ. 

ఐతే కొంత సమయానికి ఆ భక్తునికి 

లఘుశంక తీర్చుకోవలసి వచ్చి ఆ సమయంలో కూడా రామనామ జపం సాగిస్తూనే ఉన్నాడు. 

అది చూసిన హనుమంతులవారికి పట్టరాని ఆగ్రహం వచ్చి తన తోకతో ఆ భక్తుని వీపుమీద 

ఒక్క దెబ్బ కొట్టారు. 

ఆ భక్తుడు ఆ నొప్పికి తాళలేక ‘రామా’ అని 

ఆర్తితో అరిచాడు. 

అలా అనగానే ఆశ్చర్యంగా ఆనొప్పి తగ్గిపోయింది. అదే సమయంలో ఇటువంటి వాడి చుట్టూనా 

నేను రామనామం కోసం తిరిగింది!? 

అని హనుమ అక్కణ్ణుంచి తిరిగి రాజ ప్రసాదానికి చేరుకున్నారు.

రాజ ప్రాసాదంలో అంతా ఒకటే కోలాహలంగా ఉంది. రాములవారికి ఆరోగ్యం బాలేదు, 

ఉన్నట్టుండి విరుచుకు పడిపోయారు. 

వారిని శయనాగారంలోకి తీసుకెళ్ళి పడుక్కోపెట్టారు. ఎవ్వరినీ లోపలకి పంపట్లేదు. 

కేవలం సీతమ్మ, లక్ష్మణ భరత శత్రుఘ్నులే ఉన్నారు. రాముల వారు హంసతూలికా తల్పం మీద వెల్లకిల్లా పడుకుని ఉన్నారు. 

వారి వీపుమీద ఒక పెద్ద వాత ఉన్నది. 

సీతమ్మ ఆ వాత వల్ల కలిగిన నొప్పి, 

మంట తగ్గడానికి రకరకాల ఔషధాలతో కలిపిన నవనీతం రాస్తూఉన్నది. 

హనుమ వచ్చారని తెలియగానే లక్ష్మణాదులు సీతమ్మ "లోపలికి ప్రవేశపెట్టండి 

ఆయనే మళ్ళీ ఏ హిమాలయాలకో వెళ్ళి 

ఏ మూలికో తీసుకొచ్చి రాములవారి నొప్పి తగ్గించగలరు" అని చెప్పగా 

హనుమను లోపలకి అనుమతించారు. 

లోనికి వచ్చి చూసిన హనుమ ఆగ్రహోదగ్రుడై అసలెవరు ఈ పని చేసింది 

ఎవరు కొట్టారు స్వామిని అంటూ 

నరసింహావతారం ఎత్తి 

రుద్రుడై తాండవం చేయసాగారు. 

అప్పుడు నొప్పితోఉన్న శ్రీరాములవారు 

నువ్వే కదా హనుమా..కొట్టింది..

నువ్వు ఆ భక్తుని నీ తోకతో కొట్టావు. 

అతడు ఆ నొప్పి భరించలేక రామా అని అరిచాడు.

ఆ దెబ్బ వచ్చి నన్ను చేరింది..

అప్పుడు హనుమ పరుగునబోయి  ఆ భక్తునికి జరిగింది సూక్ష్మంగా చెప్పి, 

ఆ భక్తుని నిరతిశయ భక్తికి మెచ్చి, 

అతనిని తీసుకుని వెంటనే స్వామి వద్దకు వచ్చి, అమ్మవారు వ్రాస్తున్న ఔషధపు నవనీతాన్ని 

తాను కొద్ది

గా తీసుకుని, 

ఆ భక్తునికి కొద్దిగా ఇచ్చి శ్రీరాములవారికీ సీతమ్మకూ నమస్కరించిన తరవాత  రామనామ గానం చేస్తూ.. ఇద్దరూ కలిసి ఆ వాతకు ఆ వెన్నపూస పూత పూయగా రాములవారి నొప్పి మంట 

వారి వీపు మీద వాత అన్నీ పోయాయి. 

ఇక హనుమ ఆ భక్తుని ఆనందంతో ఆలింగనం చేసుకుని "చూసావా నాయనా రామ నామ మహిమ! 

ఏ రామనామం భక్తుడు పలకడం వల్ల శ్రీరాముడు

ఆ భక్తుని కష్టం తీసుకుని తానే బాధ పడ్డాడో, అటువంటి రాముని బాధను కూడా పోగొట్టగలిగేది కూడా రామభక్తుల నోటియందుండే రామనామమే" అని చెప్పి అతనిని ఆశీర్వదించి పంపారు.

కనుక ఇటువంటి రామనామాన్ని మనం చేస్తూ నలుగురి చేతా చేయిస్తూ పునీతులమౌదాం!

ఆది గురువు దక్షిణామూర్తి

భారతీయ సంస్కృతి ప్రపంచదేశాలకు అనుసరణీయం. మార్గదర్శనం చేస్తోందంటే ఈ సంస్కృతి వికాసానికి మూలం గురువే అన్న సత్యం బోధిస్తుంది. వ్యక్తి షోడశ సంస్కారాలు పరిపూర్ణం కావడానికి దోహదపడే వాడు గురువు.

అజ్ఞానతిమిరాన్ని పోకార్చి జ్ఞాన జ్యోతులు వెలిగించే గురువును ప్రత్యక్ష దైవంగా మన భారతీయ సంస్కృతి సాహిత్యాలు అభివర్ణించాయి.

''ఆలయం కరుణాలయం'' అని ఆది గురువు దక్షిణామూర్తి శంకరులను కీర్తించింది మన సంస్కృతి. గురు సేవ మహాభాగ్యంగా భావించి తరించిన ఎందరో సత్పుర్షులు ఈ వేద భూమిని మరింత పవిత్రం చేశారు.

వ్యక్తి క్రమ శిక్షణాత్మక జీవితాన్ని జన్మ ఉన్నంత వరకు ఒక మంచి సంస్కారంగా తెలియజేసిన మన సంస్కృతిలో గురువుకు ఉన్నత స్థానం ఈయ బడింది. మానవ సమాజం ఉన్నంత ఉత్తమ సంస్కారాలతో ఆదర్శవంతమైన జీవితం గడిపిన పురుషార్థాలను సుసంపన్నం చేసే ప్రక్రియలో గురుస్థానం ప్రముఖమైనది. వ్యక్తి పుట్టుకతో సంస్కార వంతుడు కావడానికి తొలి గురువు తల్లి.

ఆమె శిక్షణలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వ్యక్తి విద్యాసంస్కారం అలవరచు కోవడానికి గురువును ఆశ్రయిస్తాడు. గురువు ద్వారా లభించిన జ్ఞానాన్ని పదు గురికి పంచుతూ ఒక నాటి శిష్యుడు గురు స్థానానికి చేరుకుంటాడు. ఈ సందర్భంలో గురువు ఇచ్చే జ్ఞానాన్ని విశ్లేషిస్తూ ఒకచైనా సామెతను మనం స్మరించుకోవాలి. ఆ సామెత ఇలా వుంది.

''జ్ఞానం లేని జీవితం పండని పొలం రెండూ వ్యర్థమే''.

పై భావం ఏ దేశానిదైనా, ఏ భాషదైనా అంత రార్థం ఒక్కటే. గురు ముఖత: నేర్చిన జ్ఞానమే మనిషి జీవితాన్ని ఆదర్శ వంతం చేస్తుంది. అందుకే హయగ్రీవుని స్తుతిలో జ్ఞాన ఆనందాలకు హేతువుగా తెలియజేయడం జరిగింది. మన భారతీయ సంస్కృతి ఆది గురువుగా దక్షిణా మూర్తిని అభివర్ణించింది. ఆ శ్లోకం ఇలా వుంది...

గురవే సర్వలోకానాం

భిషజే భవ రోణినాం

నిధయే సర్వ విద్యానాం

దక్షిణా మూర్తయేనమ:

అన్న దక్షిణామూర్తి శ్లోకం దక్షిణామూర్తిని మేధ దక్షిణా మూర్తి గానూ, ఆదిగురువు గాను తెలియ జేస్తోంది. గురువు విశ్వానికి, జ్ఞానానికి వుండే సంబంధాన్ని విశదపరుస్తాడు. గురువంటే గమించే జ్ఞానం. అంథకారాన్ని తొలగించే జ్ఞానం. అచేతనం నుండి చేతనానికి తీసుకపోయే మార్గదర్శి. గురువు జ్ఞానాన్ని నిష్కామకర్మ రూపంగా శిష్యులకు అందిస్తాడు.

''పూర్వ దత్తేషు యా విద్యా'' అన్న విధంగా పూర్వ జన్మలో చేసిన పుణ్యం వల్లనే గొప్ప విద్య శిష్యునికి అలవడటానికి పుణ్యమూర్తి గురువే ఆధారం అవుతాడు. అందుకే గురుస్తుతిలో...

గురుమూర్తించి దాకాశం సచ్చిదానంద విగ్రహం

నిర్వి కల్పం నిరాబాధం దత్తమానంద మాశ్రయే

గురుస్తుతితో ధన్యులమౌదాం.

ఓం శ్రీ త్రిమూర్తి స్వరూప గురవేనమ:

ఓం నమో దక్షిణామూర్తియే నమః

ఓం మౌనవ్యాఖ్యా 

ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం

వర్శిష్ఠాంతేవస దృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |

ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం

స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ||

వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం

సకలమునిజనానాం ఙ్ఞానదాతారమారాత్ |

త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం

జననమరణదుఃఖచ్ఛేద దక్షం నమామి ||

|| ఓం నమః శివాయ ||

ఆయుధ పూజ , ఆయుధ పూజకు ఎందుకంత ప్రాధాన్యత ?

దసరా పండుగకు ఒకరోజు ముందు వచ్చే పండుగే ఆయుధ పూజ. దేవీ నవరాత్రుల సమయంలో ఈ ఆయుధ పూజకు ఎంతో ప్రత్యేకత ఉంది. తరతరాలుగా వస్తోన్న ఈ ఆచారాన్ని హిందువులలో చాలా మంది ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు.

ఈ పవిత్రమైన పర్వదినాన హిందువులలో చాలా మంది తమ పనికి సంబంధించిన వస్తువులన్నింటినీ , ఇతర సామాగ్రిని దుర్గా మాత ముందు ఉంచి పూజలు చేస్తారు.

రైతులు అయితే కొడవలి , నాగలి , వాహనం ఉన్న వారు తమ వాహనాలకు , టైలర్లు తమ కుట్టు మిషన్లకు , చేనేత కార్మికులు మగ్గాలకు , ఫ్యాక్టరీలలో కార్మికులు తమ మిషన్లకు , ఇతర పనిముట్లకు పసుపు , కుంకుమతో అది వాటిని దేవతలతో సమానంగా ఆరాధిస్తారు.

ఇలా ప్రతి సంవత్సరం ఆయుధ పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఆయుధ పూజను ఎందుకు జరుపుకుంటారు.. ఎందుకని దీనికంత ప్రాముఖ్యత ఇస్తారనే విషయాలపై కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

పాండవుల ఆయుధాలు..

పురాణాల ప్రకారం పాండవులు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లడానికి ముందు జమ్మి చెట్టు మీద తమ ఆయుధాలను భద్రపరిచారు. అర్జునుడు గాండీవంతో పాటు భీమసేనుని గదాయుధానికి యుద్ధానికి వెళ్లడానికి ముందు ప్రత్యేకంగా పూజలు జరిపించారు.

శక్తి స్వరూపిణిని..

అలా వారు శక్తి స్వరూపిణిని ప్రసన్నం చేసుకుని , పాండవులు యుద్ధానికి సన్నద్ధం అయ్యారని చెబుతుంటారు. మరోవైపు దుర్గతులను నివారించే మహా స్వరూపిణి అమ్మవారైన దుర్గాదేవి దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించిన రోజు అని చెబుతారు.

శత్రుబాధలు తొలగుతాయని..

పంచప్రక్రుతి మహా స్వరూపాలలో దుర్గాదేవి మొదటిది. బవబంధాల్లో చిక్కుకున్న వ్యక్తులను అమ్మవారు అనుగ్రహించి మోక్షం ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మవారిని ఈరోజు స్మరించుకుంటే.. శత్రు బాధలు తొలగిపోతాయని చాలా మంది నమ్మకం.

ఈ మంత్రాన్ని పఠించాలి..

ఆయుధ పూజ రోజున *‘ఓం దుం దుర్గాయైనమః'* అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలొస్తాయి. అలాగే లలిత అష్టోత్తరాలు పఠించాలి. ఆ తర్వాత ఆయుధ పూజ లేదా అస్త్రపూజలు చేయాలి.

ప్రస్తుత పూజలు ఎలా ఉన్నాయంటే..

ప్రస్తుతం ఆయుధ పూజలంటే ఆట వస్తువుల నుండి వంట వస్తువుల దాకా పాకింది. కరోనా వంటి మహమ్మారి కాలంలో చాలా మంది తమ బ్యాట్లు , క్రికెట్ కిట్లు , గ్యాస్ స్టవ్ , ఫోన్లు , కంప్యూటర్ల వంటి వాటిని పూజిస్తున్నారు.

బొమ్మల కొలువు..

ఆయుధ పూజనే కొన్ని ప్రాంతాల్లో అస్త్ర పూజ అంటారు. కేరళ వంటి ప్రాంతాలలో ఆయుధ పూజ సందర్భంగా ప్రత్యేకంగా కొన్ని పోటీలను నిర్వహిస్తుంటారు. తమిళనాడులో ఆయుధ పూజ సందర్భంగా సరస్వతీ దేవి పూజను చేస్తారు. తమిళ సంప్రదాయంలో ఇదే పూజను *‘గోలు'* అంటారు. ఈరోజున ఆ ప్రాంతంలో బొమ్మల కొలువు నిర్వహిస్తారు.

శ్రీ దుర్గా పంచరత్నం

1) జయ జయ చాముండే

జయ జయ శైలపుత్రే

జయ జయ భక్తతనుత్రాణే

జయ జయ త్రాహిదుర్గే ||

2) నమస్తే చంద్రార్కభాసఃప్రదీపే

నమస్తే త్రైలోక్యమోహాపహారే

నమస్తే నైర్గుణ్యదివ్యప్రభావే

నమస్తే భవత్తారిణి త్రాహి దుర్గే ||

3) నమస్తే చిదానందభాసఃప్రదీపే

నమస్తే కారుణ్యసాంద్రప్రభావే

నమస్తే శరచ్చంద్రలావణ్యమూర్తే

నమస్తే నమస్తే భవత్త్రాహి దుర్గే ||

4) తపోజ్వాలజ్వలితజాజ్జ్వల్యరూపే

మహత్త్కోటిదివ్యప్రభాభాసమానే

క్వణత్కింకిణీనాదభావప్రపూర్ణే

నమస్తే నమస్తే జగత్త్రాహి దుర్గే ||

5) నమస్తే చందార్కవహ్నిప్రభాసే

నమస్తే సింహవాహానారూఢే

నమస్తే భక్తార్తిభంజనారూపే 

నమస్తే నమస్తే త్రాహి దుర్గే ||

సర్వం శ్రీ దుర్గా దివ్యచరణారవిందార్పణమస్తు

Friday, October 23, 2020

శ్రీ భవానీ భుజంగం

1) చలత్నీలవేణీం 

   మహాశూలపాణిం

   మహామోహమారీం 

   భజేహం భవానీం ||

2) ఇంద్రాదివంద్యాం

   అభయఃప్రద్రాత్రీం

   మృదుపావనాంఘ్రిం 

   భజేహం భవానీం ||

3) శరచ్చంద్రపూర్ణాం 

   ఋతుఃకాలరూపాం 

   శివఃధ్యానచిత్తాం 

   భజేహం భవానీం ||

4) త్రయీసారరూపాం 

   త్రిలోకాధిపత్యాం 

   వ్యాఘ్రాధిరూఢాం 

   భజేహం భవానీం ||

5) ఆద్యంతరహితాం 

    ఆమ్నాయముదితాం 

    అశేషఃప్రభావాం 

   భజేహం భవానీం ||

6) అణిమాదిదాత్రీం 

   చంద్రార్కభాసాం 

   మాలిన్యరహితాం

   భజేహం భవానీం ||

7) గణేశాదిజననీం 

   కరుణాంతరంగాం 

   సారంగనయనాం 

   భజేహం భవానీం ||

8) లావణ్యగాత్రీం 

   బహుకల్మషఘ్నీం 

   సంసారతారాం

   భజేహం భవానీం ||

9) విఘ్నార్తిహంత్రీం 

   విద్వత్ప్రద్రాత్రీం 

   విజ్ఞానధామాం 

   భజేహం భవానీం ||

10) గూఢాతిగూఢాం 

      గర్వాపహారాం 

      గర్గాదివినుతాం 

     భజేహం భవానీం ||

11) గాంభీర్యవదనాం 

      వార్తాళిసేవ్యాం 

      మహాసింహమధ్యాం 

      భజేహం భవానీం ||

12) మహోత్సాహదాత్రీం 

      మహానందరూపాం 

      రవిఃతేజదాత్రీం 

      భజేహం భవానీం ||

13) లాస్యఃప్రసన్నాం 

      లజ్జాస్వరూపాం 

      లాకిన్యరూపాం 

      భజేహం భవానీం ||

14) అజ్ఞానహంత్రీం 

      విజయఃప్రదాత్రీం 

      పర్వతఃపుత్రీం 

      భజేహం భవానీం ||

15) ఆజ్ఞాంతరస్థాం 

      భక్తానుకూలాం 

      బాంధవ్యరహితాం 

      భజేహం భవానీం ||

16) తాపసీరూపాం 

      దుష్టాతిదూరాం 

      దారిద్ర్యహంత్రీం 

      భజేహం భవానీం ||

    సర్వం శ్రీ భవానీ దివ్యచరణారవిందార్పణమస్తు

ధర్మసందేహాలు_సమాధానాలు

 వాస్తు పురుషుడు ఎప్పుడు జన్మించాడు ? 

భాద్రపద బహుళ తదియ, మంగళవారము, కృత్తిక నక్షత్రము, వ్యతిపాత యోగము, భద్రనాకరణము గుళికతో కూడిన కాలములో వాస్తు పురుషుడు జన్మించాడు.

 ఏడుగురు అప్సరసల పేర్లు ఏవి ?

1.రంభ. 2. ఉర్వశి. 3.మేనక  4.తిలోత్తమ. 5.సుకేశి. 6. ఘ్రుతాచి 7. మంజుగోష .

 సప్త సంతానములు అంటే ఏమిటి ?

1. తటాక నిర్మాణం. 2. ధన నిక్షేపం. 3. అగ్రహార ప్రతిష్ట . 4. దేవాలయ ప్రతిష్ట . 5. ప్రభంధ రచన. 

6. స్వసంతానం ( పుత్రుడు ).

తొమ్మిది రకాల ఆత్మలు  ఏవి ?

 1. జీవాత్మ. 2. అంతరాత్మ. 3. పరమాత్మ.

 4. నిర్మలాత్మ. 5. శుద్దాత్మ. 6. జ్ఞానత్మ  

7. మహాధాత్మ . 8. భూతాత్మ . 9. సకలాత్మ.

 పదిరకాల పాలు ఏవి ?

 1. చనుబాలు. 2. ఆవుపాలు . 3. బర్రెపాలు .

 4. గొర్రె పాలు. 5. మేక పాలు. 6. గుర్రం పాలు.

 7. గాడిద పాలు. 8. ఒంటె పాలు. 9. ఏనుగు పాలు.

 10. లేడి పాలు.

 యజ్ఞోపవీతం లొ ఎన్నిపోగులు ఉంటాయి?

 యజ్ఞోపవీతం లొ 9 పోగులు ఉంటాయి. ఆ తొమ్మిది పోగుల్లో 9 మంది దేవతలు నివసిస్తారు. వారు  

 1. బ్రహ్మ . 2. అగ్ని. 3. అనంతుడు. 4. చంద్రుడు . 5. పితృ దేవతలు . 6. ప్రజాపతి. 7. వాయువు .

 8. సూర్యుడు . 9. సూర్య దేవతలు .

 అష్టాదశ ఆయుర్వేద సంహితలు ఏవి ?

 1. చరక సంహిత. 2. శూశ్రుత సంహిత. 3. పరాశర సంహిత. 4. హరిత సంహిత. 5. అగ్నివేశ సంహిత. 6. చ్యవన సంహిత. 7. ఆత్రేయ సంహిత. 8. భోజ సంహిత. 9. బృగు సంహిత. 10. బెడ సంహిత. 

11. అగస్త్య సంహిత. 12. వరాహ సంహిత. 

13. అత్రి సంహిత. 14. నారయణ సంహిత. 

15. చంద్ర సంహిత. 16. నారసింహ సంహిత. 

 17. శివ సంహిత. 18. సూర్య సంహిత.

 గృహ నిర్మాణం ఏ విధంగా చేపడితే సర్వ సుఖాలు పొందుతారు?

 1 . ఈశాన్యం లొ పూజలు , పవిత్ర కార్యాలును నిర్వర్తించే విధంగా పూజగది ఉండాలి.

 2 . ఆగ్నేయం లొ అగ్నికి సంబందించిన వంటావార్పు చేసుకొనే విధంగా వంటగది ఉండాలి.

 3 . నైరుతిలో ఆయుధ సామగ్రి మొదలయిన వాటిని పెట్టుకోవడానికి ఒక గది ఉండాలి.

 4 . వాయువ్యం లొ స్వతంత్రబిలాష చిహ్నములు .

 5 . తూర్పు దిక్కున సూర్యునికి ప్రీతికరమైన పనులు.

 6 . యమస్థానం అయిన దక్షిణం వైపు తలపెట్టి నిద్రించుట.

 7. కుభేర స్థానం అయిన ఉత్తరం వైపు చూస్తూ నిద్రలేచుట.

 8. వరుణ స్థానం అయిన పశ్చిమాన పాడిపశువులు పెంచుటకు తగిన స్థలం ఉండవలెను.

 ఈ విధంగా చేయుటవలన ఆయా దిక్కులలోని ఉన్న దేవతలు సంతృప్తి చెంది ఆ గృహములో నివసించేవారికి సర్వసుఖాలు, సర్వ సంపదలు ఇస్తారు.

 వివిద ఫలాల నైవేద్యం  -  ఫలితాలు

 కొబ్బరి కాయ ( పూర్ణ ఫలం ) - భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యం గా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి.

 అరటి పండు - భగవంతుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యం గా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్లు నైవేద్యం గా సమర్పిస్తే మద్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి.

 నేరెడు పండు. - శనీశ్వరునికి నేరెడు పండు నైవేద్యం గా పెట్టి  ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరొగ్య వంతులు అవుతారు.

 ద్రాక్ష పండు. - భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది.

 మామిడి పండు. -  మామిడి పండుని నైవేద్యం గా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యం గా పెట్టిన మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యం గా పెట్టి అందరికి పంచి తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు.

 అంజూర  పండు. - భగవంతుడికి నైవేద్యం పెట్టిన అన్జురాపండు ను అందరికి పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరొగ్య వంతులు అవుతారు.

 సపోట పండు. - సపోట పండు నైవేద్యం గా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంభంద విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి.

 యాపిల్ పండు - భగవంతుడికి యపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు.

 కమలా పండు. -  భగవంతుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచిపోయన పనులు సజావుగా పూర్తి అవుతాయి.

 పనసపండు -  పనసపండు ని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనము, రోగావిముక్తి కలిగి సుఖంగా ఉంటారు.

 పంచవిధ సూతకములు అంటే ఏమిటి ?

 1.జన్మ సూతకము. 2. మృత సుతకము. 3. రజః సూతకం . 4. అంటు (రొగ ) సూతకం . 5. శవదర్శన సూతకం . 

 దేవాలయాల వద్ద గృహ నిర్మాణం చేయడం దోషమా ?

 శివాలయానికి నూరు బారుల దూరం లొపల, విష్ణువాలయముకు వెనక ఇరవై బారుల దూరం లొపల, శక్తి ఆలయముకు సమీపం లొను గృహనిర్మాణం చేయకూడదు . దీనికి వ్యతిరేఖంగా గృహ నిర్మాణం జరిగితే సఖల సంపదలు నశించి కష్టాలపాలు అవుతారు. గుడి దగ్గర ఉన్న ఇళ్ళకు ఏ వైపునైనా , ఏ మాత్రమైనా గుడి నీడ పడిందంటే దరిద్రం, ప్రాణనష్టం వంటి అనేక కష్టనష్టాలు ఎదుర్కోక తప్పదు.

 తాంబూలం సేవించేప్పుడు తమలపాకు తొడిమ, చివర్లు ఎందుకు తుంచాలి ?

 తాంబులం వేసుకునే ముందు తమలపాకుల తొడిమలు, చివరలు తుంచివేయాలి. ఎందుకంటే తొడిమను తినడం వ్యాదికారకం అవుతుంది. చిగుర్లు పాపానికి ప్రతీకలు అని అంటారు. కనుక తమలపాకు తొడిమలు , చివరలు తుంచిన తర్వాతే తాంబులం వేసుకొవడం ఆరొగ్య ప్రధమం . అలాగే తమలపాకులో ఉండే ఈనెలు బుద్దిని మందగింప చేస్తాయి. అందుకే తమలపాకును నమిలి మొదటగా నోటిలో ఊరిన రసాన్ని ఉమ్మివేయాలి. తొడిమలు, చివరలు తున్చివేసినా ఇంకా అవి తమలపాకులో శేషించి ఉంటాయి కనుక 

 శ్రీ గోవింద రాజస్వామి వారి సన్నిధిలో కుంచం ఉంటుంది ఎందుకు ?

 తిరుపతి శ్రీ గొవింద రాజస్వామి వారి సన్నిదిలో కుంచం ఉండటం నిజమే . దీనికి కారణం ఈ విధంగా చెబుతారు. తిరుమల స్వామి శ్రీ వెంకటేశ్వరస్వామి  కుబేరుని వద్ద అప్పు చేసాడట . దానిని తీర్చుట కొరకు ద్రవ్యాన్ని కుంచం తో కొలిసి ఇచ్చేవారట స్వామివారు. స్వామివారి పక్షాన గొవింద రాజస్వామి ఈ కార్యమును సాగించారని ఒక కధ ప్రచారం లొ ఉంది. ఆ కుంచం తన తలక్రింద ఉంచుకున్నాడు అని ప్రతీతి.

 నవగ్రహాలకు సంభందించిన సమిధలు ఏవి ?

 1. సూర్యుడు - జిల్లెడు. 2. చంద్రుడు - మొదుగ .

 3. అంగారకుడు - చండ్ర. 4. బుదుడు - ఉత్తరేణి .

 5. బృహస్పతి - రావి . 6. శుక్రుడు - అత్తి .

 7. శని - జమ్మి . 8. రాహువు - దర్భ. 

 9. కేతువు - గరిక .

  ఎటువంటి స్థలం లొ గృహ నిర్మాణం చేయరాదు?

 1 . గోవుల మందలు ఉండే ప్రదేశాలలోనూ .

 2 . స్మశాన భూమికి సమీపం లొను .

 3 . మలమూత్రాలు విసర్జించు ప్రదేశాలలోను .

 4 . ఉప్పు నేలలోను, చవుడు నేలలయందు .

 5 . ఎల్లప్పుడు నీటి వుటలు గల ప్రదేశాలలోను .

 6 . రాతి భూముల యందు , మిక్కిలి రక్త వర్ణం గల భూమి యందు 

 7 . చెరువులను పూడ్చి గృహ నిర్మాణం చేయరాదు అలా చేయడం వలన అనేకములు అయిన పంది జన్మలు ఎత్తి రౌరవాది నరకములు అనుభవించి కష్టాల పాలవుతారు .

 పుజాంగాలు  ఎన్ని రకాలు ?

 పుజాంగాలు  5 రకాలు. 

 1 .అభిగమనము - దైవాన్ని స్మరిస్తూ దేవాలయానికి వెళ్ళుట.

 2 . ఉపాధానము - పూజా సామగ్రిని సంపాదించుట

 3 . ఇజ్య - దూప, దీప, నైవేద్యములతో పూజించుట.

 4 . స్వాద్యాయము - తనకు తానుగా మంత్రోచ్చారణ తో స్తుతించడం.

 5 . యోగము - తదేకమైన నిష్టతో ధ్యానించుట .

 ఏయే గృహాలకి ఎటువంటి శంఖువు ప్రతిష్ట చేయాలి ?

 రాతితో కట్టే గృహానికి ఆ రాతితోనే శంఖువు తయారు చేసి శంఖుస్థాపన చేయవలెను . ఇటుకలతో కట్టిన గృహమునకు ఇటుకలతోనే శంఖువు చేసి ప్రతిష్ట చేయవలెను .గోడలు పెట్టక కర్రలతో , నిట్రాట లతో వేయు పాకలకు కర్రతో శంఖువు తయారు చేసి ప్రతిష్ట చేయవలెను . శంఖువును నవరత్న, సువర్ణ, తామ్ర , రజిత నాణేలతో , నవధన్యములతో పూజించి , స్థాపించవలెను . అన్ని రకాల గృహములకు కర్ర శంఖువు ప్రతిష్టించరాదు . కాష్ట శంఖువు భుమిలొ ఎంతకాలం ఉండునో అంతకాలం ఆ గృహం శుబప్రధంగా ఉండును. ఆ తరువాత ఆ గృహములలో నివసించువారికి కష్టాలు కలుగును.కావున కర్రతో చేసిన శంఖువు కంటే రాతితో చేసిన శంఖువు ఉత్తమం అని తెలుస్తుంది.

 గృహ నిర్మాణం లొ ఇంటి కిటికీలు, ద్వారాలు ఏ విధంగా అమర్చాలి ?

 గృహంలో కిటికీలు, ద్వారములు సమసంఖ్యలో ఉండాలి. వేటికవే విడివిడిగా సమసంఖ్యలొ ఉండాలి. కిటికీలు సరిసంఖ్యలోను , ద్వారాలు సరిసంఖ్యలొను ఉండాలి. అలమారాల గురించి శాస్త్రం లొ ఏమీ చెప్పలేదు. వాటి ఉపయోగాన్ని అనుసరించి సరిసంఖ్యో, బేసి సంఖ్యలొ నో పెట్టుకొవాలి. వాటికి స్థల నిర్ణయం కూడా చెప్పలేదు కిటికీలు , ద్వారాలు సరిసంఖ్యలో ఉన్నా చివరన సున్నా లేకుండా ఉండాలి. అనగా 10,20,30 ఇలా చివరన సున్నా రాకూడదు. అలాగే మొత్తం గృహం లొ ఉన్న ద్వారాలు, కిటికీలు అన్ని లెక్కపెట్టాలి.

 వివిధ జన్మలు ఏవి ?

 1. దేవతలు . 2. మనుష్యులు. 3. మృగములు.

 4. పక్షులు . 5. పురుగులు. 6. జలచరములు.

 7. వృక్షములు .

 శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఏడుకొండల పేర్లు ?

 1. వ్రుషబాద్రి . 2. నీలాద్రి. 3. గరుడాద్రి. 

 4. అంజనాద్రి. 5. శేషాద్రి. 6. వెంకటాద్రి.

 7. నారాయణాద్రి.

 ఎవరెవరికి యే విధంగా నమస్కరించాలి?

 1. విష్ణుమూర్తి యెక్క సర్వ అవతారాల విగ్రహాలకు మరియు శివునికి 12 అంగుళాల ఎత్తులొ చేతులు జోడించి శిరస్సు వంచి భక్తి , శ్రద్దలతో వినయంగా నమస్కరించాలి.

 2. ఇతర దేవుళ్ళకు శిరస్సు పై రెండు చేతులు జోడించి నమస్కరించాలి.

 3. గురువుకి నోటితో " నమస్కారం " అని చెప్పకుండా రెండు చేతులు జోడించి వినయవిధేయలతో నమస్కరించాలి.

 4. మహానుభావులకు , యోగులకు రెండు చేతులు వక్షస్థలం పై  జోడించి నమస్కరించాలి.

 5. తండ్రికి , పరిపాలకుడికి రెండు చేతులు నోటి మీదగా జోడించి నమస్కరించాలి.

 6. తల్లికి ఉదరం పై రెండు చేతులు జోడించి నమస్కరించాలి.

  శ్రీ చక్రం నందు గల దేవతలు ఎవరు?

 1. వశిని . 2. కామేశ్వరి. 3. మోదిని . 4. విమల.

 5. అరుణి . 6. జయిని . 7. సర్వేశ్వరీ . 8. కాళిని .

 ధర్మం అంటే ?

  ధృతి, క్షమ , దమము, అస్తేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, ధీ , విద్య, సత్యము, అక్రోధము. ఈ పది లక్షణములు కలిగినదే "ధర్మము"

 సహంపక్తి బోజనాల సమయం లొ అందరూ ఒకేసారి లేవాలి అంటారు ఎందుకు ?

 సహంపక్తి బోజనానికి కూర్చున్న వారందరి జీవన ప్రమాణం ఒకేవిధంగా ఉండదు. సహంపక్తి బోజనాలలో రకరకాల వారు ఉంటారు. వారిలొ మంచివారు ఉంటారు. అలాగే చెడు అలవాట్లు ఉన్నవారు ఉంటారు. ఎవరి శరీరాల్లోని విద్యుత్ వారి వారి శరీరపు శక్తిని అనుసరించే పనిచేస్తూ ఉంటుంది . కాని సహపంక్తి లొ కూర్చున్నప్పుడు దాదాపు అందరి శరీరాల్లోని విద్యుత్ నియంత్రణ అందరిలో ఒకేలా ఉంటుంది. అటువంటప్పుడు తక్కువ శక్తితో ఉన్న వ్యక్తీ అందరికంటే ముందుగా లేచినచో మిగిలిన వారి శక్తి అతనికి ఎంతోకొంత వెళ్ళిపోతుంది.

          కనుకనే సహపంక్తి బోజనానినికి కుర్చున్నప్పుడు ఎవరు ముందు తిన్నా , ఎవరు వెనక తిన్నా , అందరూ ఒకేసారి లేవాలన్న నియమం పూర్వకాలం నుండి ఆచరణలో ఉంది.

 దేవతా లక్షణాలు ఏవి ?

 1. రెప్పపాటు లేకుండుట . 2. భూమి మీద పాదాలు ఆనించ కుండా ఉండుట.3. వ్యసనం లేకుండా ఉండుట.

 నవ వ్యాకరణాలు అనగా ఏవి ?

 1. పాణి నీయం . 2. కలాపం. 3. సుపద్మం. 

4. సారస్వతం. 5. ప్రాతిశాఖ్యం ( కుమార వ్యాకరణం ) 6. ఐంద్రం . 7. వ్యాఘ్ర బౌతికం. 

 8. శాఖటా టా యానం . 9.శాకల్యం .

 శ్రీ రాముని జన్మనక్షత్రం , మాసం ఎప్పుడు ?

 శ్రీ రాముడు చైత్ర మాసం , నవమి తిధిలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. ఆయన జన్మ నక్షత్రం పునర్వసు .

 పర్వ దినాలలో వడపప్పుని ఎందుకు పెడతారు 

 భగవంతుడికి ప్రతి పండగనాడు వడపప్పుని , చలిమిడిని తప్పకుండా చేసి పెడతారు. అలాగే తల స్నానం చేసి ఆయా దేవుళ్ళకి ఇష్టమైన పిండి వంటలు చేయడం వల్ల వేడి చేసి తిన్న పిండి వంటలు సరిగ్గా అరగవు . తద్వార అనారోగ్యం కలుగుతుంది.

          ఇటువంటి ఉపద్రవాలు తలెత్తకుండా ఉండటానికి కొన్ని ప్రాంతాలలో వడపప్పు, పానకం , చలిమిడి తప్పకుండా చేస్తారు . పెసరపప్పుతో చేసిన వడపప్పు తినడం వలన తిన్న పిండి వంటలు జీర్ణం అయ్యి వేడి చేయకుండా చలువ చేస్తుంది .

 శ్రీ వారి సుప్రభాతాన్ని ఎవరు ఎప్పుడు రచించారు.?

 శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రసిద్ధ సుప్రబాతాన్ని రచించిన వారు శ్రీ ప్రతివాది భయంకర అన్నన్ అనే ఆచార్యులు. వీరు అష్టదిగ్గజాలుగా ప్రసిద్ధులైన శ్రీ మనవాల మహామునుల శిష్యులలో ప్రముఖులు వీరు క్రీ .శ . 1361 లొ జన్మించి 1454 వరకు అంటే 93 సంవత్సరాలు జీవించి ఉన్నారని పరిశోధకుల అభిప్రాయం.వీరు తమ జీవిత కాలంలో అనేక కృతులు రచించారు. వీరి రచనలలో శ్రీ స్వామివారి సుప్రబాతం అనన్య సామాన్యమైన ప్రచారం పొందింది.

 పంచ కోశాలు అంటే ఏమిటి ?

 1. అన్నమయ కోశం. 2. ప్రాణమయ కోశం .

 3. మనోమయ కోశం . 4. విజ్ఞానమయ కోశం .

 5. ఆనందమయ కోశం .

 శౌచమంటే ఏమిటి ?

 శుచి అంటే శుభ్రము , శుద్ధము . ధర్మాది పరీక్షల చేత భాహ్య అంతరములలో పరిశుద్దిని పొందుటయే " శౌచం" అనబడును. శౌచం రెండు విధములు 

 1 . బాహ్య శౌచం.

 2. అంతః శౌచం .

 భాహ్య శౌచం - శరీరం పైన ఉండే మలినాలను పోగొట్టుకోవడానికి చేసే స్నానాదులు, శరీరం పరిశుద్ధం గా ఉండేందుకు పూసే సుగంద ద్రవ్యాలు వంటివి. వీటిని భాహ్య శౌచం అంటారు.

 అంతః శౌచం - మనస్సులో ఎటువంటి చెడు భావాలు లేకుండా అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద , వాత్సర్యాలు లేకుండా నిర్మలమైన అంతహకరణను కలిగి ఉండటమే అంతః శౌచం అనబడను. అంతః శౌచం మనస్సుకి సంభందించినది. కాబట్టి దీనికి శాస్త్రాలలో అదిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

 ఏయే ప్రదేశాల్లో జపం చేస్తే ఎంతెంత ఫలితం ?

 ఇంట్లో చేసే జపానికి సత్ఫలితమే ఉంటుంది . కాని ఇంట్లో జపం చేస్తే అంతే ఫలితం ఉంటుంది. అదే జపాన్ని నది పరీవాహక ప్రాంతాల్లో చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది . గోశాలలో చేసే జపం వల్ల వందరెట్ల ఫలితం ఉంటుంది . యాగశాలలో చేసే జపం వలన వందరెట్ల కంటే అధికమైన ఫలితం వస్తుంది. దేవాలయాలలో , పుణ్య ప్రదేశాలలో చేసే జపం వలన పదివేల రెట్లు ఫలితం కలుగుతుంది. శివాలయాలలో , శివ సాన్నిద్యం నందు చేసే జపం వలన అత్యున్నతమైన ఫలితం దక్కుతుంది.

 రావణుడు ప్రతిష్టించిన 6 శివ లింగాలు ఏవి ?

 1. వైద్యనాధ లింగం. 2. వక్రేశ్వర నాద లింగం.

 3. సిద్ధినాద లింగం. 4. తారకేశ్వర లింగం.

 5. ఘటేశ్వర లింగం. 6. కపిలేశ్వర లింగం.

 ధర్మ సందేహాలు  -  సమాధానాలు . PART - 4. 

 పదనాలుగు లోకాలలో ఎవరెవరు ఉంటారు ?

 పదనాలుగు లోకాలలోని మొదటి మూడు లోకాల్లోను అంటే భూలోకం , భువర్లోకం, స్వర్లోకాలను " కృతక లోకాలు " అంటారు. జీవులు తాము చేసుకొన్న కర్మఫలాన్ని బట్టి ఈ మూడు లొకాల్లొను ఉంటారు.

 నాల్గొవదైన మహర్లోకం కల్పాన్తములో కూడా నశించదు. ఈ లొకం లొ కల్పాంత జీవులు ఉంటారు.

 అయిదోవది అయిన జనలోకం లొ బ్రహ్మ దేవుని మానస పుత్రులైన సనక సనందన సనత్కుమారాదులు నివసిస్తారు.

 ఆరొవదైన తపోలోకంలో దోష వర్జితులు , దేహ రహితులు అయిన వైరాజులనే వారు ఉంటదము. 6. మాత్స్చార్యము .

 7. రాగము. 8. ద్వేషము. 9. ఈర్ష్య . 10. అసూయ

 11. దర్పము. 12. దంబము. 13. అహంకార దోషము.

 భగవంతుడికి నివేదించే సమయం లొ గుర్తు ఉంచుకోవలసినవి ?

 భగవంతుడికి నివేధించేప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయరాదు . తెలిసి చెసినా,తెలియక చేసినా తప్పు తప్పే అంటారు. కనుక నివేధించేప్పుడు ప్రతివారు తప్పక చేయవలసినవి .

 1 . దేవునికి నైవేద్యం గా పెట్టడానికి చేసిన వంటకాలలో నుంచి కొంత విడిగా తీయరాదు .పాత్ర మొత్తాన్ని దేవుని ఎదుట పెట్టాలి .

 2 . పదార్ధాలు వేడిగా ఉన్నప్పుడు నివేదిన్చరాదు . చల్లారాక పెట్టాలి .

 3 . నివేదనలో మంచినీటిని కుడా తప్పనిసరిగా పెట్టాలి.

 4 . నివేదించే వంటకాలలో పంచదారకు బదులు బెల్లం వాడాలి.

 ఊర్ధ్వ పుండ్ర ములు ఎందుకు ధరిస్తారు ?

 ఆర్య మతంలో ముఖధారణం (బొట్టు ) ఒక ఆర్ష సాంప్రదాయంగా ఏర్పడింది. అది త్రి పుండ్రము , ఊర్ధ్వ పుండ్రము. అని రెండు రకాలుగా విభజించబడింది. వైష్ణవులు ఊర్ధ్వ పుండ్రము లు  ధరిస్తారు . స్త్రీలు తిలకధారణ చేస్తారు . 

     తిరుమణిని నిలువునా మూడు రేఖలుగా ధరించడంనే ఊర్ధ్వ పుండ్ర దారణ అంటారు.ఈ మూడు రేఖలు అకార, ఉకార, మకార స్వరూపమైన ప్రనవాన్ని సూచిస్తాయి. అకారం - సత్వ స్వరుపడైన శ్రీ మహావిష్ణువును , ఉకారం - చిత్వ స్వరూపిణి అయిన మహాలక్ష్మిని , మకారం  భగవద్భాక్తులైన భాగవతులను తెలియజేస్తాయని చెబుతారు.  శైవులు భస్మాన్ని మూడు అడ్డరేకులుగా నుదుట ధరిస్తారు .

    తిరుమణి మట్టికి సంభందించినది . కావున అది మట్టి నుండి కలిగిన ఈ శరీరం చివరికి మట్టిలోనే కలిసిపోతుందని సుచిస్తుంది. ఇందువల్ల వైరాగ్యం కలుగుతుంది. ముక్తి కోరేవానికి వైరాగ్యం చాలా ముఖ్యం. విభూతి దారణ కూడా ఈ శరీరం చివరికి బూడిద అయ్యేది అనే తత్వాన్ని నిర్దేశిస్తుంది. ముఖదారణ లేకుండా చేసే సత్కర్మలు నిరర్ధకాలు అని ఆగమాలు పేర్కొన్నాయి.

  ద్వాదశ (12) ఊర్ధ్వ పుండ్రము లు ధరించడం కూడా కద్దు. నాడులు, హృదయం మొదలయిన శరీర భాగములను చల్లబరుచుటకు కూడా ఆయా స్థానములలో ఊర్ధ్వ పుండ్ర దారణ అవసరమయిన వైజ్ఞానికం గా విశ్లేషణ చేసి కొంతమంది వివరిస్తున్నారు . ఉర్ధ్వ పుండ్రం లొ ఉపయొగించే వస్తువులకు చల్లదనం కలిగించే లక్షణం ఉంది.

 నదులలోను, సముద్రాలలోను పవిత్ర స్నానాలు చేసేప్పుడు పాటించవలసిన నియమాలు ఏవి ?

 నదీ స్నానం , సముద్ర స్నానం వంటివి చేసే ముందు నదీ స్నానం అయితే నదీమ తల్లిని, సముద్ర స్నానం అయితే సముద్రున్ని, అనంతరం క్షేత్ర దేవతల్ని, మనస్సులొ స్మరించుకొని సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి .

 * రాత్రి పూట నిద్రించే టైములో ఒంటిపై ధరించిన వస్త్రాలతో నదిలో మునగరాదు. ఈ బట్టలను విడిచి శుభ్రమైన వస్త్రములను ధరించాలి.

 * పుణ్య నదులలో పాప పరిహారార్ధం చేసే పవిత్ర స్నానముల సమయం లొ ఖచ్చితమైన నియమాలు పాటించి తీరాలి.

 * స్నాన అనంతరం ఆ బట్టల్ని నదుల్లో పిండ రాదు అలాగే సబ్బులను ఉపయొగించి కూడా బట్టలను ఉతకరాదు . 

 * అభ్యంగ స్నానం అంటే కుంకుళ్ళు , షాంపు లు మొదలయిన వాటిని ఉపయొగించి తలంటు స్నానం చేయరాదు . 

 * పొరబాటున కూడా నదిలోగాని, నదీ తీరాల్లోగాని మలముత్రాలు విసర్జిన్చరాదు . ఈ నియమానికి వ్యతిరేకంగా  చేస్తే పాపం అంటుతుంది.

 * ఆఖరికి నీళ్లను పుక్కిలించి ఉమ్మి వేసినా కూడా మహా దొషం అవుతుంది.

 * పవిత్ర స్నానములు ఆచరించే సమయంలో అ మంగళ కరమైన మాటలు మాట్లడకుడదు. కసురుకోవడం, కోప్పడటం, వంటివి చేయకూడదు .

 * సముద్ర స్నానం కేవలం పర్వదినములలో  మాత్రమే చేయాలి .మాములు సమయాలలో సముద్రాన్ని తాకకూడదు .

 * స్నానం చెసే ముందు సంకల్పం చెప్పుకోవాలి..

Thursday, October 22, 2020

అష్టాదశ శక్తిపీఠాలు

అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్థనా శ్లోకం...

లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే

ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే

అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా

కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా

ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా

ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే

హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ

జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా

వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ

అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్

సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్

సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభం..

ఈ శ్లోకంలో ఉన్న వివిధ స్థలాలను గుర్తించడంలో కొన్ని భేదాభిప్రాయాలున్నాయి. ఒక వివరణ ప్రకారం ఈ స్థలాలు ఇలా ఉన్నాయి

1. శాంకరి - శ్రీలంక - ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం ఈ దేశం తూర్పుతీరంలో ట్రిన్‌కోమలీలో ఉండవచ్చును. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీ మందిరం ప్రసిద్ధమైనది.

2. కామాక్షి - కాంచీపురం, తమిళనాడు - మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.

3. శృంఖల - ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ - ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.

4. చాముండి - క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక - అమ్మవారు చాముండేశ్వరీ దేవి.

5. జోగులాంబ - ఆలంపూర్, తెలంగాణ - కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో తుంగభద్ర మరియు క్రుష్ణా నదులు కలిసే స్థలంలో ఉంది.

6. భ్రమరాంబిక - శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్ - కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లికార్జునస్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి.

7. మహాలక్ష్మి - కొల్హాపూర్, మహారాష్ట్ర - ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.

8. ఏక వీరిక - మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర - ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును

9. మహాకాళి - ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ - ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉంది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.

10. పురుహూతిక - పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ - కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు. కాకినాడ నుండి 15 కిలోమీటర్ల దూరంలో.

11. గిరిజ - ఓఢ్య, జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒడిషా - వైతరిణీ నది తీరాన ఉంది.

12. మాణిక్యాంబ - దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ - కాకినాడ నుండి 22 కిలోమీటర్ల దూరంలో.

13. కామరూప - హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.

14. మాధవేశ్వరి - ప్రయాగరాజ్ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో - ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు.

15. వైష్ణవి - జ్వాలాక్షేత్రం, కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ - ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.

16. మంగళ గౌరి - గయ, బీహారు - పాట్నా నుండి 74 కిలోమీటర్లు

17. విశాలాక్షి - వారాణసి, ఉత్తర ప్రదేశ్.

18. సరస్వతి - జమ్ము, కాష్మీరు - అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరులో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలో ఉందంటారు...

|| ఓం నమః శివాయ ||

శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి !

ప్రాతః స్మరామి లలితావదనారవిందం

బింబాధరం పృథులమౌక్తికశోభినాసమ్ |

ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం

మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్ ||

ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం

రక్తాంగుళీయలసదంగుళిపల్లవాఢ్యామ్ |

మాణిక్యహేమవలయాంగదశోభమానాం

పుండ్రేక్షుచాపకుసుమేషుసృణీర్దధానామ్ ||

ప్రాతర్నమామి లలితాచరణారవిందం

భక్తేష్టదాననిరతం భవసింధుపోతమ్ |

పద్మాసనాదిసురనాయకపూజనీయం

పద్మాంకుశధ్వజసుదర్శనలాంఛనాఢ్యమ్ ||

ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీం

త్రయ్యంతవేద్యవిభవాం కరుణానవద్యామ్ |

విశ్వస్య సృష్టవిలయస్థితిహేతుభూతాం

విద్యేశ్వరీం నిగమవాఙ్మమనసాతిదూరామ్ ||

ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ

కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి |

శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి

వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి ||

యః శ్లోకపంచకమిదం లలితాంబికాయాః

సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే |

తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా

విద్యాం శ్రియం విమలసౌఖ్యమనంతకీర్తిమ్ ||

ఓం భక్తరక్షణదాక్షిణ్యకటాక్షాయై నమః 

ఆశ్ఛర్య పరచే మన దేవాలయల విశేషాలు

సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయo

 హాసంబా దేవాలయం ,  హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.

నీటితో దీపం వెలిగించే దేవాలయం 

మధ్యప్రదేశ్. ఘడియ ఘాట్ మాతాజీ మందిర్,   అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇకనుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది, ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.

స్వామివారు స్వయంగా ప్రసాదం తినే దేవాలయం 

1.  కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.

2. బృందావనం రాధాకృష్ణ శయన మందిరం.

12 ఏళ్లకు ఒకసారి  *పిడుగుపడే తిరిగి అతుక్కునేదేవాలయం*

బిజిలి మహాదేవ్, హిమాచల్ ప్రదేశ్.

సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు: 

1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం. 

2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం. 

3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం. 

4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం. 

5. మొగిలీశ్వర్.

6. కోదండరామ దేవాలయం,  కడప జిల్లా.

నిరంతరం జలము ప్రవహించే  దేవాలయాలు: 

1. మహానంది

2. జంబుకేశ్వర్ 

3. బుగ్గరామలింగేశ్వర్

4. కర్ణాటక కమండల గణపతి.

5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.

6. బెంగళూర్ మల్లేశ్వర్ 

7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం

8. సిద్ధగంగా

నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు. 

1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి. 

2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్. 

3. మంజునాథ్.

శ్వాస తీసుకునే 

కాళహస్తీశ్వర్

సముద్రమే వెనక్కివెళ్లే

1. గుజరాత్ నిష్కళంక మహాదేవ్.

2. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.

స్త్రీవలె నెలసరి అయ్యే 

1. అస్సాం కామాఖ్యా అమ్మవారు,  

2. కేరళ దుర్గామాత.

రంగులు మారే ఆలయం. 

1. ఉత్తరాయణం,  దక్షిణాయనంలో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.

2. పౌర్ణమికి తెల్లగా,  అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం.

పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.

నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు 

1. కాణిపాకం,  

2. యాగంటి బసవన్న,  

3. కాశీ తిలభండేశ్వర్,  

4. బెంగుళూరు బసవేశ్వర్

5. బిక్కవోలు లక్ష్మీగణపతి

స్వయంభువుగా సంవత్సరానికి ఒకసారి వెలిసే 

అమర్నాధ్.

ఆరునెలలకు ఒకసారి తెరిచే 

1. బదరీనాథ్,  

2. కేదారనాథ్ ( ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది )

3. గుహ్యకాళీమందిరం. 

సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు 

హాసంబా దేవాలయం, హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.

ఒంటి స్తంభంతో యుగాంతానికి గుర్తుగా ఉండే 

పూణే కేధారేశ్వర్, ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.

రూపాలు మారే

ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.

మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు 

1. హేమాచల నరసింహ స్వామి.

2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి

మనిషి వలె గుటకలు  

వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.

అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే 

యమునేత్రి. 

ఛాయా విశేషం 

1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.

2. హంపి విరూపాక్షేశ్వర్,  గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.

3. బృహదీశ్వరాలయం

నీటిలో తేలే 

విష్ణువు (టన్నుల బరువుంటుంది ),  నేపాల్

ఇంకా... తిరుమల వెంకటేశ్వరస్వామి, అనంత పద్మనాభస్వామి, రామేశ్వర్, కంచి, చిలుకూరి బాలాజీ,  పండరినాథ్, భద్రాచలం,  అన్నవరం etc

పూరీ 

పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడపడని పూరి, దేవునికి సమర్పించగానే ఘుమఘుమలాడే  పూరి ప్రసాదం.

ఇవి కొన్ని మహిమాన్విత దేవాలయాలు మాత్రమే . ఇటువంటివి దేశం లో కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయి నమ్మండి దేవుడు నడయాడే నేల ఇది

🙏

Wednesday, October 21, 2020

ఉమాసహస్రమ్ - స్తబకంలోని ఈ 25శ్లోకములు పారాయణ చేస్తే ఈ మొత్తం దేవీ సప్తశతి అంశములన్నీ స్మరించినట్లే

 వాణీసరోరుహదృశో హయరాజహంసో

వక్త్రారవిన్దనిలయాద్బహిరాగతాయాః ।

ఆలాపకాలదరహాస ఇహ స్థితానాం

క్షేమం కరోతు సుతరాం హరసున్దరీయః ॥ ౭.౧॥

నాదోఽసి వాగసి విభాఽసి చిదస్యఖణ్డా

ఖణ్డీభవన్త్యపి చిదస్యఖిలేన్ద్రకాన్తే ।

తత్తాదృశీం నిఖిలశక్తిసమష్టిమీశే

త్వామన్తరిక్షపరికౢప్తతనుం నమామి ॥ ౭.౨॥

విశ్వప్రసిద్ధవిభవాస్త్రిషు విష్టపేషు

యాః శక్తయః ప్రవిలసన్తి పరఃసహస్రాః ।

తాసాం సమష్టిరతిచిత్రనిధానదృష్టిః

సృష్టిస్థితిప్రలయకృద్ భువనేశ్వరి త్వమ్ ॥ ౭.౩॥

జానే న యత్తవ జగజ్జనయిత్రి రూపం

సఙ్కల్ప్యతే కిమపి తన్మనసో బలేన ।

సఙ్కల్పితస్య వపుషః శ్రితశోకహన్త్రి

విన్యస్యతే తవ వచోతిగధామ నామ ॥ ౭.౪॥

కామం వదన్తు వనితామితిహాసదక్షా-

స్త్వాం సర్వలోకజనయిత్రి సదేహబన్ధామ్ ।

సత్యం చ తద్భవతు సా తవ కాఽపి లీలా

దివ్యం రజస్తు తవ వాస్తవికం శరీరమ్ ॥ ౭.౫॥

భూజన్మపాంసుభిరగర్హితశుద్ధరూపా

యా కాఽపి పాంసుపటలీ విపులేఽన్తరిక్షే ।

సా తే తనుః సుమహతీ వరదే సుసూక్ష్మా

తామేవ దేవసరణిం కథయన్తి ధీరాః ॥ ౭.౬॥

యా దేవి దేవసరణిర్భవమగ్నదుర్గా

వైరోచనీతి కథితా తపసా జ్వలన్తీ ।

రాజీవబన్ధుమహసా విహితాఙ్గరాగా

సా తే తనుర్భవతి సర్వసుపర్వవర్ణ్యే ॥ ౭.౭॥

ప్రాణాస్తవాత్ర హృదయం చ విరాజతేఽత్ర

నేత్రాణి చాత్ర శతశః శ్రవణాని చాత్ర ।

ఘ్రాణాని చాత్ర రసనాని తథా త్వచశ్చ

వాచోఽత్ర దేవి చరణాని చ పాణయోఽత్ర ॥ ౭.౮॥

సర్వత్ర పశ్యసి శృణోషి చ సర్వతోఽమ్బ

సర్వత్ర ఖాదసి విజిఘ్రసి సర్వతోఽపి ।

సర్వత్ర చ స్పృశసి మాతరభిన్నకాలే

కః శక్నుయాన్నిగదితుం తవ దేవి భాగ్యమ్ ॥ ౭.౯॥

సర్వత్ర నన్దసి విముఞ్చసి సర్వతోఽమ్బ

సర్వత్ర సంసరసి గర్జసి సర్వతోఽపి ।

సర్వత్రదేవి కురుషే తవ కర్మజాల-

వైచిత్ర్యమీశ్వరి నిరూపయితుం క్షమః కః ॥ ౭.౧౦॥

విశ్వామ్బికే త్వయి రుచాం పతయః కియన్తో

నానావిధాబ్ధికలితా క్షితయః కియత్యః ।

బిమ్బాని శీతమహసాం లసతాం కియన్తి

నైతచ్చ వేద యది కో విబుధో బహుజ్ఞః ॥ ౭.౧౧॥

అవ్యక్తశబ్దకలయాఽఖిలమన్తరిక్షం

త్వం వ్యాప్య దేవి సకలాగమసమ్ప్రగీతే ।

నాదోఽస్యుపాధివశతోఽథ వచాంసి చాసి

బ్రాహ్మీం వదన్తి కవయోఽముకవైభవాం త్వామ్ ॥ ౭.౧౨॥

నానావిధైర్భువనజాలసవిత్రి రూపైర్-

వ్యాప్తైకనిష్కలగభీరమహస్తరఙ్గైః ।

వ్యక్తం విచిత్రయసి సర్వమఖర్వశక్తే

సా వైష్ణవీ తవ కలా కథితా మునీన్ద్రైః ॥ ౭.౧౩॥

వ్యక్తిత్వమమ్బ హృదయే హృదయే దధాసి

యేన ప్రభిన్న ఇవ బద్ధ ఇవాన్తరాత్మా ।

సేయం కలా భువననాటకసూత్రభర్త్రి

మాహేశ్వరీతి కథితా తవ చిద్విభూతిః ॥ ౭.౧౪॥

ఆహారశుద్ధివశతః పరిశుద్ధసత్త్వే

నిత్యస్థిరస్మృతిధరే వికసత్సరోజే ।

ప్రాదుర్భవస్యమలతత్త్వవిభాసికా యా

సా త్వం స్మృతా గురుగుహస్య సవిత్రి శక్తిః ॥ ౭.౧౫॥

హవ్యం యయా దివిషదో మధురం లభన్తే

కవ్యం యయా రుచికరం పితరో భజన్తే ।

అశ్నాతి చాన్నమఖిలోఽపి జనో యయైవ

సా తే వరాహవదనేతి కలాఽమ్బ గీతా ॥ ౭.౧౬॥

దుష్టాన్నిహంసి జగతామవనాయ సాక్షా-

దన్యైశ్చ ఘాతయసి తప్తబలైర్మహద్భిః ।

దమ్భోలిచేష్టితపరీక్ష్యబలా బలారేః

శక్తిర్న్యగాది తవ దేవి విభూతిరేషా ॥ ౭.౧౭॥

సఙ్కల్పరక్తకణపానవివృద్ధశక్త్యా

జాగ్రత్సమాధికలయేశ్వరి తే విభూత్యా ।

మూలాగ్నిచణ్డశశిముణ్డతనుత్రభేత్ర్యా

చాముణ్డయా తనుషు దేవి న కిం కృతం స్యాత్ ॥ ౭.౧౮॥

త్వం లోకరాజ్ఞి పరమాత్మని మూలమాయా

శక్రే సమస్తసురభర్తరి జాలమాయా ।

ఛాయేశ్వరాన్తరపుమాత్మని యోగమాయా

సంసారసక్తహృదయేష్వసి పాశమాయా ॥ ౭.౧౯॥

త్వం భూతభర్తరి భవస్యనుభూతినిద్రా

సోమస్యపాతరి బిడౌజసి మోదనిద్రా ।

సప్తాశ్వబిమ్బపురుషాత్మని యోగనిద్రా

సంసారమగ్నహృదయేష్వసి మోహనిద్రా ॥ ౭.౨౦॥

విష్ణుశ్చకార మధుకైటభనాశనం యన్-

ముక్తః సహస్రదలసమ్భవసంస్తుతా సా ।

కాలీ ఘనాఞ్జననిభప్రభదేహశాలి-

న్యుగ్రా తవామ్బ భువనేశ్వరి కోఽపి భాగః ॥ ౭.౨౧॥

విద్యుత్ప్రభామయమధృష్యతమం ద్విషద్భి-

శ్చణ్డప్రచణ్డమఖిలక్షయకార్యశక్తమ్ ।

యత్తే సవిత్రి మహిషస్య వధే స్వరూపం

తచ్చిన్తనాదిహ నరస్య న పాపభీతిః ॥ ౭.౨౨॥

శుమ్భం నిశుమ్భమపి యా జగదేకవీరౌ

శూలాగ్రశాన్తమహసౌ మహతీ చకార ।

సా కౌశికీ భవతి కాశయశాః కృశోద-

ర్యాత్మాఙ్గజా తవ మహేశ్వరి కశ్చిదంశః ॥ ౭.౨౩॥

మాయే శివే శ్రితవిపద్వినిహన్త్రి మాతః

పశ్య ప్రసాదభరశీతలయా దృశా మామ్ ।

ఏషోఽహమాత్మజకలత్రసుహృత్సమేతో

దేవి త్వదీయచరణం శరణం గతోఽస్మి ॥ ౭.౨౪॥

ధిన్వన్తు కోమలపదాః శివవల్లభాయా-

శ్చేతో వసన్తతిలకాః కవికుఞ్జరస్య ।

ఆనన్దయన్తు చ పదాశ్రితసాధుసఙ్ఘం

కష్టం విధూయ సకలం చ విధాయ చేష్టమ్ ॥ ౭.౨౫॥

శ్యామలా దండకం

మాణిక్య వీణా ముఫలాలయంతీం 

మదాలసాం మంజుల వాగ్విలాసామ్ 

మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం 

మాతంగకన్యాం మనసా స్మరామి 

చతుర్భుజే చంద్రకళావతంసే 

కుచోన్నతే కుంకుమ రాగశోణే 

పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే 

నమస్తే జగదేకమాతః 

మాతా మరకత శ్యామా 

మాతంగీ మధు శాలినీ 

కుర్యాత్కటాక్షం కళ్యాణీ 

కదంబ వనవాసినీ 

జయ మాతంగ తనయే 

జయ నీలోత్పల ద్యుతే 

జయ సంగీత రసికే 

జయ లీలా శుకప్రియే 

జయ జనని 

సుధాసముద్రాంత రుద్యన్మణీద్వీప 

సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమాకల్ప 

కాదంబ కాంతారవాసప్రియే కృత్తివాసప్రియే  

సాదరారబ్ధ సంగీత సంభావనా 

సంభ్రమాలోల నీపస్రగాబద్ధ 

చూలీసనాథత్రికే సానుమత్పుత్రికే 

శేఖరీ భూత శీతాంశురేఖా 

మయూఖావలీ బద్ధసుస్నిగ్ధ నీలాలకశ్రేణి 

శృంగారితే లోకసంభావితే 

కామలీలా ధనుస్సన్నిభభ్రూ 

లతాపుష్ప సందేహ కృచారు 

గోరోచనా పంకకేళీ లలామాభిరామే 

సురామే రమే 

సర్వ యంత్రాత్మికే 

సర్వ తంత్రాత్మికే

సర్వ మంత్రాత్మికే 

సర్వ ముద్రాత్మికే 

సర్వ శక్త్యాత్మికే 

సర్వ చక్రాత్మికే 

సర్వ వర్ణాత్మికే సర్వ రూపే, 

జగన్మాతృకే హే  జగన్మాతృకే

పాహి మాం పాహి మాం పాహి పాహి

- కాళీదాస కృతం

గానం - ఘంటసాల మాష్టారు

Monday, October 19, 2020

శ్రీ భవానీ అష్టకం - భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం

 గంగ, భవానీ, గాయత్రీ, కాళీ, లక్ష్మీ, సరస్వతీ, రాజరాజేశ్వరీ, బాలా, శ్యామల, లలిత దశ అను దేవీ దశ స్తోత్రం ఆధారంగా నేడు స్తుతించ వలసిన స్తోత్రాలు...

శ్రీ భవానీ అష్టకం 

న తాతో న మాతా న బంధుర్న దాతా

న పుత్రో న పుత్రీ న భృత్యో న భర్తా

న జాయా న విద్యా న వృత్తిర్మమైవ 

గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని

భవాబ్ధావ పారే మహాదుఃఖ భీరు

పపాత ప్రకామీ ప్రలోభీ ప్రమత్తః

కుసంసార పాశ ప్రబద్ధః సదాహం

గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని

న జానామి దానం న చ ధ్యానయోగం

న జానామి తంత్రం న చ స్తోత్రమంత్రమ్

న జానామి పూజాం న చ న్యాసయోగం

గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని

న జానామి పుణ్యం న జానామి తీర్థం

న జానామి ముక్తిం లయం వా కదాచిత్

న జానామి భక్తిం వ్రతం వాపి మాతా

గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని

కుకర్మీ కుసంగీ కుబుద్ధిః కుదాసః

కులాచారహీనః కదాచారలీనః

కుదృష్టిః కువాక్యప్రబంధః సదాహం

గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని

ప్రజేశం రమేశం మహేశం సురేశం

దినేశం నిశీథేశ్వరం వా కదాచిత్

న జానామి చాన్యత్ సదాహం శరణ్యే

గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని

వివాదే విషాదే ప్రమాదే ప్రవాసే

జలే చానలే పర్వతే శత్రుమధ్యే

అరణ్యే శరణ్యే సదా మాం ప్రపాహి

గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని

అనాథో దరిద్రో జరారోగయుక్తో

మహాక్షీణదీనః సదా జాడ్యవక్త్రః

విపత్తౌ ప్రవిష్టః ప్రనష్టః సదాహం

గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని

 భవానీభుజంగప్రయాతస్తోత్రం 

శ్రీ గణేశాయ నమః .

షడాధారపంకేరుహాంతర్విరాజత్

        సుషుమ్నాంతరాలేఽతితేజోల్లసంతీం .

సుధామండలం ద్రావయంతీం పిబంతీం

        సుధామూర్తిమీడేఽహమానందరూపాం .. 1..

జ్వలత్కోటిబాలార్కభాసారుణాంగీం

        సులావణ్యశృంగారశోభాభిరామాం .

మహాపద్మకింజల్కమధ్యే విరాజత్

        త్రికోణోల్లసంతీం భజే శ్రీభవానీం ..2..

కణత్కింకిణీనూపురోద్భాసిరత్న

        ప్రభాలీఢలాక్షార్ద్రపాదారవిందం .

అజేశాచ్యుతాద్యైః సురైః సేవ్యమానం

        మహాదేవి మన్మూర్ధ్ని తే భావయామి .. 3..

సుషోణాంబరాబద్ధనీవీవిరాజన్

        మహారత్నకాంచీకలాపం నితంబం .

స్ఫురద్దక్షిణావర్తనాభిం చ తిస్రో

        వలీ రమ్యతే రోమరాజిం భజేఽహం .. 4..

లసద్వృత్తముత్తుంగమాణిక్యకుంభో-

        పమశ్రీస్తనద్వంద్వమంబాంబుజాక్షీం .

భజే పూర్ణదుగ్ధాభిరామం తవేదం

        మహాహారదీప్తం సదా ప్రస్నుతాస్యం .. 5..

శిరీషప్రసూనోల్లసద్బాహుదండైర్-

        జ్వలద్బాణకోదండపాశాంకుశైశ్చ .

చలత్కంకణోదారకేయూరభూషా

        జ్వలద్భిః స్ఫురంతీం భజే శ్రీభవానీం .. 6..

శరత్పూర్ణచంద్రప్రభాపూర్ణబింబా

        ధరస్మేరవక్త్రారవిందశ్రియం తే .

సురత్నావలీహారతాటంకశోభా

        భజే సుప్రసన్నామహం శ్రీభవానీం .. 7..

సునాసాపుటం పద్మపత్రాయతాక్షం

        యజంతః శ్రియం దానదక్షం కటాక్షం .

లలాటోల్లసద్గంధకస్తూరిభూషో-

        జ్జ్వలద్భిః స్ఫురంతీం భజే శ్రీభవానీం .. 8..

చలత్కుండలాం తే భ్రమద్భృంగవృందాం

        ఘనస్నిగ్ధధమ్మిల్లభూషోజ్జ్వలంతీం .

స్ఫురన్మౌలిమాణిక్యమధ్యేందురేఖా

        విలాసోల్లసద్దివ్యమూర్ధానమీడే .. 9..

స్ఫురత్వంబ బింబస్య మే హృత్సరోజే

        సదా వాఙ్మయం సర్వతేజోమయం చ .

ఇతి శ్రీభవానీస్వరూపం తదేవం

        ప్రపంచాత్పరం చాతిసూక్ష్మం ప్రసన్నం .. 10..

గణేశాణిమాద్యాఖిలైః శక్తివృందైః

        స్ఫురచ్ఛ్రీమహాచక్రరాజోల్లసంతీం .

పరాం రాజరాజేశ్వరీం త్వా భవానీం (త్రైపురి త్వాం)

        శివాంకోపరిస్థాె॒​ం శివాె॒​ం భావయేఽహం .. 11..

త్వమర్కస్త్వమగ్నిస్త్వమిందుస్త్వమాప-

        స్త్వమాకాశభూర్వాయవస్త్వం చిదాత్మా .

త్వదన్యో న కశ్చిత్ప్రకాశోఽస్తి సర్వం

        సదానందసంవిత్స్వరూపం తవేదం .. 12..

గురుస్త్వం శివస్త్వం చ శక్తిస్త్వమేవ

        త్వమేవాసి మాతా పితాఽసి త్వమేవ .

త్వమేవాసి విద్యా త్వమేవాసి బుద్ధిర్-

        గతిర్మే మతిర్దేవి సర్వం త్వమేవ .. 13..

శ్రుతీనామగమ్యం సువేదాగమాద్యైర్-

        మహిమ్నో న జానాతి పారం తవేదం .

స్తుతిం కర్తుమిచ్ఛామి తే త్వం భవాని

        క్షమస్వేదమంబ ప్రముగ్ధః కిలాహం .. 14..

శరణ్యే వరేణ్యే సుకారుణ్యపూర్ణే

        హిరణ్యోదరాద్యైరగమ్యేఽతిపుణ్యే .

భవారణ్యభీతం చ మాం పాహి భద్రే

        నమస్తే నమస్తే నమస్తే భవాని .. 15..

ఇమామన్వహం శ్రీభవానీభుజంగ-

        స్తుతిర్యః పఠేచ్ఛ్రోతుమిచ్ఛేత తస్మై .

స్వకీయం పదం శాశ్వతం చైవ సారం

        శ్రియం చాష్టసిద్ధిం భవానీ దదాతి .. 16..

(భవానీ భవానీ భవానీ త్రివారం-

        ఉదారం ముదా సర్వదా యే జపంతి .

న శోకం న మోహం న పాపం న భీతిః

        కదాచిత్కథంచిత్కుతశ్చజ్జనానాం .. 17)

ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం

భవానీభుజంగప్రయాతస్తోత్రం సంపూర్ణం ..

The Law of Wasted Effort

Do you know that lions only succeed in a quarter of their hunting attempts — which means they fail in 75% of their attempts and succeed in only 25% of them.

Despite this small percentage shared by most predators, they don't despair in their pursuit and hunting attempts. 

The main reason for this is not because of hunger as some might think but it is the understanding of the “Law of Wasted Efforts” that have been instinctively built into animals, a law in which nature is governed. 

Half of the eggs of fishes are eaten... half of the baby bears die before puberty... most of the world's rains fall in oceans... and most of the seeds of trees are eaten by birds. 

Scientists have found that animals, trees, and other forces of nature are more receptive to the law of "wasted efforts". 

Only humans think that the lack of success in a few attempts is failure... but the truth is that: we only fail when we "stop trying"

Success is not to have a life free of pitfalls and falls... but success is to walk over your mistakes and go beyond every stage where your efforts were wasted looking forward to the next stage. 

If there is a word that summarizes this world, it will simply be: continue all over again.

        B E  I N S P I R E D

శ్రీ గాయత్రీ దేవి స్తోత్రం

నమస్తే దేవి గాయత్రీ సావిత్రీ త్రిపదేక్షరీ |

అజరే మరే మాతా 

త్రాహి మాం భవసాగరాత్ ||

నమస్తే సూర్యసంకాశే సూర్యసావిత్రికేమలే |

బ్రహ్మవిద్యే మహావిద్యే వేదమాతర్నమోస్తుతే || 

అనంతకోటిబ్రహ్మాండవ్యాపినీ బ్రహ్మచారిణీ |

నిత్యానందే మహామాయే పరేశానీ నమోస్తుతే ||

చంద్రకళాత్మికే నిత్యే కాలరాత్రి స్వధే స్వరే |

స్వాహాకారేగ్నివక్త్రే త్వాం నమామి జగదీశ్వరీ ||

నమో నమస్తే గాయత్రీ 

సావిత్రీ త్వం నమామ్యహమ్ |

సరస్వతీ నమస్తుభ్యం తురీయే బ్రహ్మరూపిణీ ||

          ఓం మంత్రరూపిణ్యై నమః 

Friday, October 16, 2020

శ్రీ వ్యాస భుజంగ స్తోత్రం

1) శిష్యకోటివంద్యమానభానుకోటిభాస్వరం 

   వేదవేదాంగభాజ్యబ్రహ్మనిష్ఠాపరం

   సంభ్రమాశ్చర్యజనకచారుధర్మవిగ్రహం  

   పరాశరప్రియపుత్ర కృష్ణద్వైపాయనం ||

2) యోగభాష్యబ్రహ్మసూత్రవిద్యాప్రదాయకం 

   బదరికాక్షేత్రవాసశ్రీబాదరాయణం 

   భాగవతభారతరచనానైపుణ్యం 

   పరాశరప్రియపుత్ర కృష్ణద్వైపాయనం ||

3) శుకశౌనకాదిపూజ్యమృదుపాదపంకజం 

   మన్వంతరాతీతసుఖచిరజీవినం

   అష్టాదశపురాణరచనావైదూష్యం 

   పరాశరప్రియపుత్ర కృష్ణద్వైపాయనం ||

4) ఉపాసనాకర్మజ్ఞానభక్తిమార్గబోధకం 

   సమయదక్షిణాచారదృఢదీక్షాపరం 

   మనోవేగశ్లోకనిర్మాణప్రావీణ్యం   

   పరాశరప్రియపుత్ర కృష్ణద్వైపాయనం ||

5) శివకేశవ స్వరూప పరబ్రహ్మతత్త్వం 

   భస్మత్రిపుండ్రభూషరుద్రాక్షధారిణం 

   అజ్ఞానతిమిరభేద్యప్రజ్ఞానభాస్కరం 

   పరాశరప్రియపుత్ర కృష్ణద్వైపాయనం   ||

      సర్వం శ్రీవ్యాసమునీంద్ర దివ్యచరణారవిందార్పణమస్తు

సేవాపరాధములలో కొన్ని ఇవి

1. చెప్పులతో గుడికి వెళ్ళడం, 

2. ఉత్సవదినాలలో దైవ దర్శనం చేసుకోకపోవడం, 

3. దేవ విగ్రహాలు చూసి నమస్కరించక పోవడం, 

4. అశుచిగా దేవ దర్శనం చేసుకోవడం, 

5. ఒక చేత్తో దేవతలకు, పూజ్యులకు నమస్కరిచడం, 

6. దేవ విగ్రహాలముందు కాళ్ళు చాపి కూర్చోవడం, 

7. దేవ విగ్రహాల ముందు పెడ కాళ్ళ మీద కూర్చోవడం (మఠం వేసుకొని కూర్చోవాలి), 

8. దేవ విగ్రహం ముందు నిద్రించడం, 

9. దేవ విగ్రహం ముందు శృంగారం నెరపడం, 

10. దేవ విగ్రహం ముందు భోజనం చెయ్యడం (ఆ ప్రాంతాన్ని ఎంగిలి మయం చెయ్యడం), 

11. దేవ విగ్రహం దగ్గర బొంకడం, 

12. బాతాఖానీ వెయ్యడం, 

13. కేకలు వెయ్యడం, 

14. గట్టిగా మాట్లాడడం, 

15. జగడమాడడం, 

16. పరులను బాధించడం, 

17. వ్యంగ్యంగా మాట్లాడడం, 

18. నిష్ఠూరాలాడడం, 

19. నిందించడం, 

20. పొగడడం, 

21. దేవ విగ్రహం ముందు ఇతరులకు పాదాభివందనం చెయ్యడం (పరమాత్ముడొక్కడే పూజనీయుడక్కడ), 

22. దేవ విగ్రహం ముందు బూతులు మాట్లాడడం (అసలు ఎక్కడా మాట్లాడకూడదు), 

23. దేవ విగ్రహం ముందు అధోవాయువు వదలడం, 

24. శక్తి ఉండి కూడా దేవుని పూజించక పోవడం, 

25. పూజా ద్రవ్యాలను కాలితో తాకడం, 

26. దేవునికి నైవేద్యం సమర్పించకుండా తినేయడం, 

27. ఏ ఋతువులో వచ్చిన పండును తొలుతగా దేవునికి సమర్పించకుండా తినేయడం, 

28. పండో, కాయో తొలిపంట దేవునికి అర్పించకుండా తినేయడం, 

29. దేవ విగ్రహం ముందు దేవునికి వీపు చూపిస్తూ కూర్చోవడం, 

30. గురుదేవుని పూజించకపోవడం, 

31. తనను తాను పొగుడుకోవడం, 

32. దైవ నింద 

- ఈ ముప్ఫై రెండూ సేవాపరాధాలే. (గీత గోవిందం నుండి సేకరింపబడింది - నేమాని సూర్యనారాయణ)

Wednesday, October 14, 2020

ఏ నక్షత్రానికి ఏ గణపతి స్వరూప ఆరాధన చెయ్యాలో వివరణ!

1. అశ్విని  -- ద్వి ముఖ గణపతి ‌

2. భరణి -- సిద్ద గణపతి.

3. కృత్తిక - ఉఛ్ఛిష్ఠ  గణపతి .

4. రోహిణి - విఘ్న గణపతి ‌

5. మృగశిర - క్షిప్ర గణపతి.

6. ఆరుద్ర - హేరంబ గణపతి .

7. పునర్వసు - లక్ష్మి గణపతి. 

8. పుష్యమి - మహ గణపతి. 

9. ఆశ్లేష - విజయ గణపతి. 

10. మఖ - నృత్య గణపతి. 

11. పుబ్బ - ఊర్ధ్వ గణపతి. 

12 ఉత్తర - ఏకాక్షర గణపతి. 

13. హస్త - వరద గణపతి .

14. చిత్త -  త్య్రక్షర గణపతి. 

15. స్వాతి - క్షిప్రసాద గణపతి. 

16. విశాఖ - హరిద్ర గణపతి. 

17.అనూరాధ - ఏకదంత గణపతి. 

18. జ్యేష్ఠ - సృష్టి గణపతి .

19 మూల ఉద్దాన గణపతి. 

20.పూర్వషాఢ- ఋణ విమోచన గణపతి. 

21.  ఉత్తరాషాఢ - ధుండి గణపతి. 

22. శ్రవణం - ద్వి ముఖ గణపతి. 

23. ధనిష్ట - త్రిముఖ గణపతి. 

24. శతభిషం - సింహ గణపతి. 

25. పూర్వాభాద్ర - యోగ గణపతి. 

26. ఉత్తరాభాద్ర - దుర్గా గణపతి. 

27. రేవతి - సంకట హర గణపతి.           

పై గణపతి ఆరాధన వలన మన పూర్వ జన్మ కర్మల నుండి బయట పడి భగవంతుని అనుగ్రహం పోందుతాము. 

అలాగే మన ఆత్మ ద్వాదశ జ్యోతిర్లింగాలు కు ముడి పడి వుంది.    పై గణపతులు మరియి నక్షత్రాలు యెక్క అనుబంధం అర్దం చేసుకో గలిగితే ద్వాదశ భావాలు యెక్క   రహస్యం అర్దం అవుతుంది.

శని దేవుడు

శని దేవుడు అంటే చాలా మంది బయపడతారు. 

వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు, అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు. 

శని భగవానుడు అంటే నీతి, న్యాయం, ధర్మబద్దత కు కట్టుబడి ఉంటాడు. 

గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తి తో కొలిచి ధర్మబద్దం గా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు.

శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిధి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు.

ఆ రోజు స్వామి వారిని నువ్వులతో, నూనేతో నల్లని వస్త్రం తో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు.

అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి. ఎలా చేయాలి. తెలుసు కుందామా.

శనీశ్వరుడికి నువ్వుల నూనె తో అభిషేకం చేయాలి.

కుటుంబ, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య ,కోర్టు కేసులు, శత్రువులు, రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సింది గా మొక్కుకుని నియమాలు పాటిస్తారు. 

శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికు వెళ్ళేప్పుడు అక్కడ ఉన్న బిక్షగా ళ్ళకు, పేదవారి కి శక్తి కొలది ఆహార రూపం లో కాని, వస్త్ర, ధన, వస్తు రూపం లో కాని దాన ధర్మాలు విశాల హృదయం తో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి.

పూజ కు వాడే నల్లటి వస్త్రం సుమారు రెండు మీటర్ల పోడవు అంటే ఒక లుంగి లాంటిది ఉండాలి. 

పూజ తర్వాత ఆ వస్రాన్ని దానం చెస్తే, దానం తీసుకున్న వారు ఉపయోగించుకునేలా ఉండాలి అని అర్ధం.

దానలు అనేవి ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు, కేవలం నిరుపేదలకు, పశు పక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది ఇది గమనించాలి.

త్రయోదశి వ్రతం

శనీశ్వరుడు సూర్య భగవానుని కి ఛాయా దేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి.

కాశ్యపస గోత్రం, సోదరుడు యమ ధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాల భైరవుడు. 

శనికి ఉన్న దశ నామాలు శన్యే ఛర, కోణ, పింగళ, భభ్రు, కృష్ణ, రౌద్ర, అంతక, యమ, సౌరి, మంధః.

నిజానికి శని భగవానుడి ని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కరుణా మూర్తి శనీశ్వరుడు. 

ఏ త్రయోదశి అయితే శనివారం తో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడు గా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారు.

ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం, దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శుభ ఫలితాలను అందించేవాడు.

ఉదయాన్నే నువ్వుల నూనే తో ఒళ్ళంతా మర్ధన చేసుకుని తలస్నానం చేయాలి.

ఈరోజు మద్య,మాంసాలు ముట్ట రాదు.

వీలైన వారు శివార్చన తామే స్వయం గా చేస్తే మంచిది.

శనిగ్రహ స్థాన దోషాల వలన బాధపడే వారు,

నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం

ఛాయా మార్తాండ సంభూతం

తం నమామి శనైశ్చరం

అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది.

వీలైనంత వరకు ఏ పని చేస్తున్నా మౌనం గా ఉంటూ దైవ చింతన తో ఉండాలి.

అందరి లోను ప్రతీ జీవి లోను దేవున్ని చూడ గలగాలి.

ఎవరి తోను వాదనలకు దిగరాదు.

ఆ రోజు ఆకలి తో ఉన్న వారికి, పశు పక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది.

ఉదయం సూర్యోదయం కాగానే శరీరానికి నువ్వుల నూనే రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి. 

ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొంద వచ్చని పురాణాలు చెబుతున్నాయి.

మూగ జీవులకు ఆహార గ్రాసలను, నీటిని ఏర్పాటు చేయాలి.

కాకులకు బెల్లం తో చేసిన రొట్టెలను నువ్వుల నూనే తో కాల్చి చిన్న చిన్న ముక్కలు గా చేసి కాకులకు వేయాలి.

అనాధలకు, అవిటి వారికి, పేద వితంతువులకు, పేద వృద్ధులకు ఏదో రూపం గా సహయపడాలి.

ప్రతి రోజు తలి దండ్రుల పాద నమస్కారం చేసుకోవాలి.

భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానం లో నిలబెడతాడు. అని పురాణ కథనం....

మంచి మాట

1. పూజ మధ్యలో మాట్లాడితే,  ఎవరితో మాట్లాడతామో వాళ్ళకి మన పూజ ఫలితం వెళ్తుంది అని శాస్త్ర వాక్కు. 

2. జపం చేసేటప్పుడు జపమాల మిస్టేక్ గా కూడా కింద పడకూడదు.. 

3. అగ్ని ఎక్కడ ఉన్న అది పవిత్రమైన భగవంతుడి శక్తి దాన్ని నోటితో ఊదడం, పవిత్రమైనవి అందులో వేయడం దోషం. 

4. మన శరీరం లో ఒక్కో అంగానికి ఒక్కో దేవత ఉంటారు. అవయవాల్ని తిట్టుకోవడం,  కొట్టుకోవడం దోషం. అలాగే పంచభూతాల్లో వేటిని కూడా తిట్టడం కానీ కోపంగా తన్నడం కానీ దాటడం కానీ చేయకూడదు. 

5. అరుణాచలం పుణ్యక్షేత్రం లో గిరి ప్రదక్షిణం రోడ్ కి ఎడమవైపు నుండే నడవాలి. కుడి వైపు ఎప్పుడూ దేవతలు ప్రదక్షిణ చేస్తారు. 

6. జున్ను పాలు తినరాదు. ఆవు ఈనిన 11 days లోపు ఆవు దగ్గరి పాలు తీసకోకూడదు. 

7. పడుకునేప్పుడు దైవ నామస్మరణ చేస్తూ  పడుకుని లేచేప్పుడు అదే నామం చెప్తిలో లేస్తే పడుకున్న సేపు కూడా దైవనామ స్మరణ ఫలితం వస్తుంది. 

8. వినాయకుడికి తులసి,  సూర్యనారాయణ స్వామి కి మారేడు వేయకూడదు. 

ఏకాదశి,  అమావాస్య, పౌర్ణమి, ద్వాదశి తులసి ని తుంచరాదు.  పూజకి,  దేవుడి పూజకి వేర్వేరుగా తులసి ని పెంచుకోవాలి. 

9. మన చుట్టూ ఎన్నో సూక్ష్మ శరీరాలుంటాయ్ అవి అన్నం లోని సారాన్ని తీసుకోవడానికి ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటాయి.  అందుకే దేవుడికి నైవేద్యం పెట్టకుండా తినడం ,  అన్నం ప్లేట్ లో పెట్టాక చాలా సేపటికి తినడం,  ప్లేట్ పెట్టి గట్టిగా అన్నం పెట్టాను రమ్మని పిలవడం,  మూతలు పెట్టకుండా ఉంచడం,  ఎండిపోయినవి తినడం నిషిద్ధం. అయితే ఏమౌతుంది అవి కూడా జీవులే కదా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు.  అయితే అవి అన్నం లోని సారమంతా తీసుకున్నాక మనము తింటే శక్తి రాదు,  మనసు పై ప్రభావం పడి పాపపు ఆలోచనలో లేక,  మానసిక ఒత్తిడి కో దారి తీయొచ్చు.  అందుకే ఎప్పుడూ అన్నం భగవత్ నైవేద్యం చేసి కాకి కి పెట్టి తినడం వల్ల వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి.  

10. తడి కాళ్లతో పడుకోకూడదు.  అన్నం తినే ముందు తిన్న తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవాలి.

పంచభూతముల సమ్మిళితమే మన శరీరం !

1.ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం శబ్దము.

2.వాయువుకు ఉన్న గుణాలు  రెండు… శబ్దము, స్పర్శ.

3.అగ్నికి ఉన్న గుణాలు మూడు శబ్దము, స్పర్శ, రూపము.

4.జలముకు ఉన్న గుణాలు నాలుగు… శబ్ద, స్పర్శ, రూప, రసము (రుచి). 

5.భూమికి ఉన్న గుణాలు ఐదు… శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము (వాసన)లు.

ఈ ఐదు గుణాలూ…పాంచభౌతిక తత్త్వాలు మన శరీరానికి ఉన్నాయి ! కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.

జలము… "గంధము" అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం కానీ బంధించలేము.

అగ్ని "రస, గంధము" లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమేగానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది.

వాయువు " రస, గంధ, రూపము"లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.

ఆకాశము " రస, గంధ, రూప, స్పర్శ" లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.

శబ్దం కేవలం ఒకే ఒక గుణమున్న  ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు… ఏ గుణము లేని ఆ 🙏 నిర్గుణ పరబ్రహ్మ  🙏 ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు ?

అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే.. పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా…ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు‘ నిర్గుణుడ ’వు అవుతావు. అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు. నిన్ను నీలోనే దర్శించుకుంటావు. అదే ‘ అహం బ్రహ్మాస్మి ’ అంటే. ‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ దైవాన్ని దర్శించడమంటే. అదే దైవ సాక్షాత్కారం అంటే.

  -[ఋషుల ఉవాచ ]-

Monday, October 12, 2020

పురాణ సంబంద 49 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో

గరుడ పురాణం www.freegurukul.org/z/Puranamulu-1

దేవీ భాగవతం www.freegurukul.org/z/Puranamulu-2

విష్ణు పురాణం www.freegurukul.org/z/Puranamulu-3

సంపూర్ణ శ్రీ శివ మహాపురాణం

www.freegurukul.org/z/Puranamulu-4

శివ పురాణము www.freegurukul.org/z/Puranamulu-5

భవిష్య మహా పురాణము

www.freegurukul.org/z/Puranamulu-6

దేవీ భాగవతం www.freegurukul.org/z/Puranamulu-7

సంపూర్ణ కార్తీక మహాపురాణం

www.freegurukul.org/z/Puranamulu-8

శివ పురాణం www.freegurukul.org/z/Puranamulu-9

పురాణ పరిచయము www.freegurukul.org/z/Puranamulu-10

బ్రహ్మ పురాణము-1,2,3

www.freegurukul.org/z/Puranamulu-11

మార్కండేయ పురాణం www.freegurukul.org/z/Puranamulu-12

శ్రీ దత్త పురాణం www.freegurukul.org/z/Puranamulu-13

హరి వంశ పురాణం www.freegurukul.org/z/Puranamulu-14

లక్ష్మీ నరసింహ పురాణం

www.freegurukul.org/z/Puranamulu-15

సంపూర్ణ దేవీ భాగవతము

www.freegurukul.org/z/Puranamulu-16

కల్కి పురాణము-1,2 www.freegurukul.org/z/Puranamulu-17

బసవ పురాణం www.freegurukul.org/z/Puranamulu-18

అష్టాదశ పురాణ కథా విజ్ఞాన సర్వస్వము

www.freegurukul.org/z/Puranamulu-19

శివ పురాణము – ధర్మ సంహిత

www.freegurukul.org/z/Puranamulu-20

కన్యకా పురాణం www.freegurukul.org/z/Puranamulu-21

శివ రహస్య ఖండము-1,2

www.freegurukul.org/z/Puranamulu-22

మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణ సార సంగ్రహము www.freegurukul.org/z/Puranamulu-23

భాగవత,వామన, మార్కండేయ మహాపురాణాలు

www.freegurukul.org/z/Puranamulu-24

మార్కండేయ పురాణము

www.freegurukul.org/z/Puranamulu-25

శ్రీ పరమేశ్వరి-దేవీ భాగవత వచనము

www.freegurukul.org/z/Puranamulu-26

సూత సంహిత -స్కాంద పురాణాంతర్గతము

www.freegurukul.org/z/Puranamulu-27

ఆంధ్ర స్కాందము-1 www.freegurukul.org/z/Puranamulu-28

మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణము-బ్రహ్మఖండము www.freegurukul.org/z/Puranamulu-29

స్కాందపురాణ సారామృతము

www.freegurukul.org/z/Puranamulu-30

దేవాంగ పురాణం www.freegurukul.org/z/Puranamulu-31

అగ్ని పురాణం www.freegurukul.org/z/Puranamulu-32

మత్స్య మహాపురాణము

www.freegurukul.org/z/Puranamulu-33

మదాంధ్ర బ్రహ్మావైవ

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...