Wednesday, June 20, 2018

ఈ ఎనిమిది మంది ఎనిమిది రకాల మంత్రాలకు అధి దేవతలు

వశిన్యాది వాక్ దేవతలు అమ్మవారి రూపములే. మనలో ఉన్న చైతన్యమే ఎనిమిది పద్ధతులుగా వస్తుంది. చైతన్యమే అమ్మ.

వశిని - వశినీ మంత్రములు ఏమైనా మనకు లొంగుబాటుకు రావాలంటే చేసే మంత్రములకు వశీకరణ మంత్రములని పేరు. వశీకరణ మంత్రములంటే క్షుద్రమైనఅర్ధములు తీయ రాదు. సృష్టిలో ఎదో ఒకటి మన వశం కాకపొతే మన పని జరగదు. ఇంట్లో ఒకళ్ళ మాట ఇంకొకళ్ళు వినక పొతే ఆ ఇంట్లో పని జరగదు. ఆవిడకు ఆయన వశీకరణ కావలి ఆయనకు ఆవిడ వశీకరణ కావాలి. ధర్మపదంగా ఒక మాట చెప్పినా అది వినాలంటే పది మంది వశీకరణ కావలి. వశీకరణ అంటే చెడు అర్థం తీయడానికి వీలు లేదు. ప్రక్రుతి కూడా మనకు అనుకూలం కావాలంటే అదీ వశీకరణమే. వశీకరణం అంటే అవతలి వారు మనకు అనుకూలం అవుట. ఈ మంత్రాలను వశీకరణ మంత్రములు అంటారు. ఈ మంత్రములకు అధి దేవత వశిని.

కామేశ్వరి - కామము అంటే కోరికలు. ఒక్కొక్క కోరిక తీరటానికి ఒక్కొక్క మంత్రం వున్నాయి. ఆ  మంత్రములన్నిటికి అధి దేవత కామేశ్వరి.

మోదిని - మోదిని అంటే అంగీకారము, ఆనందము అని అర్థం. సృష్టిలో ఏమి జరిగినా ఆనందం తృప్తి కావలి. ఆనందానికి, తృప్తికి సంభందించిన దేవత మోదిని.

విమల - నిర్మలమైన జ్ఞానమునకు, మంత్రములు విమల 

అరుణ - ఎర్రటి కాంతులతో ప్రకాశించేది అరుణ వర్ణం. ప్రేమకు, కరుణకు సంభందించిన వర్ణం. కనుక దేవతల కరుణని పొందడానికి పనికివచ్చే మంత్ర విశేషములు అరుణ అని చెప్పబడుతాయి.

జయని - జయము కలిగించే మంత్రములు

కౌలిని - ఇవి కుండలినీ యోగానికి సంభందించిన మంత్ర విశేషములు.

సర్వేశ్వరీ - అన్నిటియందు ఈశిత్వమ్. ఈశిత్వమ్ అంటే అధికారం. అధికారం ఇచ్చే మంత్రములు.

ఇలా మంత్రభాగములన్ని కలిపితే వాటి ప్రయోజనాలను బట్టి ఎనిమిది భాగములు అవుతాయి. ఈ ఎనిమిది భాగములు ఉన్న మంత్ర శక్తులకు అధి దేవతలు ఈ ఎనిమిది మంది వశిన్యాది వాక్ దేవతలు.

మనం ఏ మంత్రం చెప్పినా అవి వీటిలో దేనికో దానికి సంభందించిన మంత్రమే.

ఈ ఎనిమిది మంది మంత్ర శక్తులను తలచుకుంటే మనం ఏ మంత్రము చెప్పక పొయినా వారు అనుగ్రహించగలరు.

No comments:

Post a Comment

పరమ శివుని స్వరూపం - శ్రీ దక్షిణామూర్తి

విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషుల...