Wednesday, January 31, 2018

Why Eating Food During Lunar Eclipse is Harmful

Eclipses can have a powerful effect on the human body. In this article, Sadhguru explains why eating food during a lunar or solar eclipse can have a harmful effect on the human body.

Sadhguru: During lunar eclipses, what would happen in 28 days over a full lunar cycle is happening in a subtle way over the course of two to three hours of the eclipse. In terms of energy, the earth’s energy is mistaking this eclipse as a full cycle of the moon. Certain things happen in the planet where anything that has moved away from its natural condition will deteriorate very fast. This is why while there is no change in raw fruits and vegetables, there is a distinct change in the way cooked food is before and after the eclipse. What was nourishing food turns into poison.

Eclipse Effect: Food Once Eaten, Turns To Poison!

Poison is something that takes away your awareness. If it takes away to a certain minor level, that means you are dull. If it takes away your awareness to a certain depth, that means you are asleep. If something takes away your awareness completely, that means you are dead. Dullness, sleep, death – this is just a progression. So, cooked food will go through the phases of its deterioration much more rapidly in a subtle way than it does on a normal day.

Eclipse Effect: Can We Eat Raw Food?

There is a distinct change in the way cooked food is before and after the eclipse. What was nourishing food turns into poison.

If there is food in your body, in two hours’ time your energies will age by approximately twenty-eight days. Does that mean you can eat a raw food diet on such a day? No, because the moment food goes into your body, the juices in your stomach attack and kill it. It becomes like semi-cooked food and will still have the same impact.

This is not just about food. This is about the way you are itself. If you have moved away from the natural dimension of who you are in anyway, you become more susceptible to these forces. If you are in your natural state, you are least available to these forces.

Eclipse Effect: The Moon & The Human Body

The cycles of the moon have an impact upon the human system, physically, psychologically and energy-wise. This is evident in the way our mothers went through their cycles. I am talking about our mothers because we are here only because our mothers were in tune with the moon. If our mothers’ bodies were not in tune with the moon we wouldn’t be here today. When the moon is going through a whole cycle in two to three hours’ time, there is a little bit of confusion in all our mothers’ bodies. This is also happening in a man’s body, because your mothers are present in a certain way – not physiologically but in other ways.

Eclipse Effect: When The Body is Confused…

When the body is in a confused state, the best thing is to keep it as empty as possible, and as conscious as possible. One of the simplest ways to be conscious is to not eat. Then you will constantly be conscious of at least one thing. And the moment your stomach is empty, your ability to be conscious becomes so much better. Your body becomes more transparent and you are able to notice what is happening with your system much better...


🌝 చంద్ర గ్రహణం - వివరాలు 🌝

॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰

⭕👉 చంద్ర గ్రహణం ఎప్పుడు కలదు ?

  మాఘ శుధ్ధ పౌర్ణమి అనగా తేది : 31 - 01 - 2018 ( as of writing ) , బుధవారము రోజు.

⭕👉 చంద్ర గ్రహణం మనకు వర్తిస్తుందా ?

మాఘ శుద్ధ పౌర్ణమి అనగా జనవరి 31 , బుధవారమున గల చంద్ర గ్రహణము...గ్రస్తోదితము,ఖగ్రాస చంద్ర గ్రహణము.అనగా సంపూర్ణ చంద్ర గ్రహణం కలదు.ఈ గ్రహణము మన దేశములో కనిపిస్తుంది.కావున ఇట్టి చంద్ర గ్రహణం మనకు వర్తిస్తుంది.గ్రహణ నియమాలను తప్పక ఆచరించాలి.

⭕👉 గ్రహణ సమయ వివరాలు :-

గ్రహణ స్పర్శ కాలము   — సాయంత్రం 05 : 18 ని॥లకు
గ్రహణ మధ్య కాలము — రాత్రి            07 : 00 గం॥లు
గ్రహణ మోక్ష కాలము   — రాత్రి            08 : 42 ని॥లకు

అంటే చంద్ర గ్రహణము సాయంత్రం 05 : 18 ని॥లకు ప్రారంభమయ్యి , రాత్రి 08 : 42 ని॥లకు ముగుస్తుంది.

ఇట్టి చంద్ర గ్రహణ పుణ్య కాలము మొత్తం 03 : 24 ని॥లు కలదు.

⭕👉 గ్రహణ నియమాలు ఏ సమయం నుండి పాటించాలి ?

గ్రహణ స్పర్శ కాలమునకు 9 గంటల ముందు నుండి గ్రహణ ప్రభావము ప్రారంభమవుతుంది.గ్రహణ స్పర్శ కాలం సాయంత్రం 05 : 18 ని॥లకు ప్రారంభమవుతుంది.దీనికి 9 గంటల ముందు అంటే ఉదయం 08 : 18 ని॥ల నుండి గ్రహణ నియమాలను పాటించాలి.

వృద్ధులు , పిల్లలు , గర్భిణీ స్త్రీలు మరియు వ్యాధి గ్రస్థులు.... గ్రహణ స్పర్శ కాలానికి 6 గంటల ముందు అనగా మధ్యాహ్నం 12 : 18 ని॥ల నుండి గ్రహణ నియమాలను పాటించాలి.

వయస్సు రీత్యా , వ్యాధి తీవ్రత రీత్యా వృద్ధులు , ఆరోగ్య రీత్యా గర్భిణీ స్త్రీలు అన్ని గంటల పాటు గ్రహణ నియమాలను పాటించలేని, గత్యంతరము లేని స్థితి ఉన్నప్పుడు మాత్రము గ్రహణ స్పర్శ కాలము నుండి గ్రహణ మోక్ష కాలము వరకైనా గ్రహణ నియమాలను పాటించాలి.

⭕👉 ఇట్టి చంద్ర గ్రహణం...ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలం కలదు ?

వృషభ , కన్యా , తులా , కుంభ రాశుల వారికి          👉🏻 శుభ ఫలం
మిథున , వృశ్చిక , మకర , మీన రాశుల వారికి         👉🏻 మిశ్రమ ఫలం
మేష , కర్కాటక , సింహ , ధనుస్సు రాశుల వారికి    👉🏻 అశుభ ఫలం సూచిస్తున్నది.

⭕👉 గ్రహణాన్ని ఎవరు వీక్షించకూడదు ?

మేష , కర్కాటక , సింహ , ధనుస్సు రాశి వారు  మరియు గర్భవతులు గ్రహణాన్ని వీక్షించకూడదు.

చంద్ర గ్రహణం పుష్యమి నక్షత్రంలో ప్రారంభమై ఆశ్లేషా నక్షత్రములో ముగుస్తున్నందున పుష్యమి నక్షత్రము మరియు ఆశ్లేషా నక్షత్రములను జన్మ నక్షత్రములుగా కలిగిన వారు కూడా ఇట్టి చంద్ర గ్రహణాన్ని వీక్షించకూడదు.

⭕👉 గ్రహణ దోష నివారణకు ఎవరు , ఏ దానాలు చేయాలి ?

గ్రహణ మిశ్రమ ఫలం గలవారు అనగా మిథున , వృశ్చిక , మకర , మీన రాశుల వారు , గ్రహణ అశుభ ఫలం కలిగిన వారు అనగా మేష , కర్కాటక , సింహ , ధనుస్సు రాశుల వారు మరియు పుష్యమి , ఆశ్లేషా నక్షత్రం కలిగిన వారు ఒక నూతన కాంస్య పాత్రలో నిండుగా ఆవు నెయ్యి వేసి అందులో వెండితో తయారు చేసిన చంద్రుని ప్రతిమ మరియు నాగ విగ్రహము వేసి పూజించి గ్రహణ మోక్ష కాలం తర్వాత గ్రహణ స్నానమాచరించి సద్భ్రాహ్మణుడికి దక్షిణా సమేతంగా సంకల్పయుక్తంగా దానము ఇవ్వ వలెను.

అపాత్ర దానం శూన్య ఫలాన్నిస్తుంది.కావున మీ మీ ప్రాంతాలలో ఉన్న సదాచార సంపన్నులు , నిష్ఠా గరిష్ఠులు , నిత్య జపతప హోమ యాగ క్రతువులు , నిత్య దేవతార్చన చేయువారు, వేదాధ్యయనము చేసిన పండితులకు దానము ఈయవలెను.అప్పుడే దాన ఫలితము లభించును.

⭕👉 అందరూ క్రింది చంద్ర గాయత్రిని గ్రహణ సమయములో జపము చేసుకోవచ్చు.

ఓం క్షీర పుత్రాయ విద్మహే , అమృత తత్వాయ ధీమహి
తన్నో చంద్ర ప్రచోదయాత్ .

⭕👉  గ్రహణ సమయంలో నదీ స్నానం చేసి , నదీ తీరములో అనుష్ఠానము చేసుకోవడము సంపూర్ణ ఫల ప్రదము , పుణ్య ప్రదము.

 ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర

Wednesday, January 24, 2018

రథసప్తమి రోజున చదవాల్సిన మంత్రము ...



రథసప్తమి విశిష్టత:

రథసప్తమి:

సకల చరాచర జగత్తుకు వెలుగులు ప్రసాదిస్తాడు సూర్యభగవానుడు. మాఘశుద్ధ సప్తమి నాడు అదితి, కశ్యపులకు సూర్యుడు జన్మించాడు. ఆ రోజునే సప్తాశ్వా రథారూఢుడై ప్రపంచానికి దర్శనమివ్వడంతో రథసప్తమిగా వేడుకలను జరుపుకొంటాం. రథంలోని భాగాలు సమయాన్ని, రుతువులను పేర్కొంటాయి. ఉత్తరదిశవైపు సూర్యుడి ప్రయాణం ప్రారంభమవుతుంది. దైవారాధనలో సూర్యుని ఆరాధనకు విశిష్టమైన స్థానముంది. ప్రత్యక్షంగా సూర్యుడు దర్శనమిస్తాడు. సూర్యుని వెలుగులు లేని ప్రపంచం చీకటితో భీతావహంగా ఉంటుంది. వ్యవసాయానికి, మానవులకు, జంతువులకు, ఇతర జీవజాలానికి సూర్యుని కిరణాలే ఆధారం. సూర్యురశ్మి లేని ప్రపంచాన్ని తలచుకుంటే భయంతో వణికిపోతాం. సూర్యనమస్కారాలు చేయడం ఆరోగ్యరీత్యా కూడా మంచిదని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. శ్రీరామచంద్రుడు ఆదిత్య హృదయాన్ని అగస్త్యమహర్షి అనుగ్రహం చేత పొంది రావణ సంహారం చేసినట్టు పురాణాలు వెల్లడిస్తున్నాయి. మహాభారతంలో మహాబలుడిగా పేరొందిన కర్ణుడు సూర్యానుగ్రహం చేత కుంతికి జన్మించాడు. మణులలో విశిష్టమైన శమంతకమణిని సత్రాజిత్తు సూర్యుని ఆరాధనతో పొందాడు. వైవస్వత మన్వంతరంలో మొదటి తిథి రథసప్తమి.

నర్మదా జయంతి 

నర్మదా నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మధ్యప్రదేశ్- ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో ఉన్నఅమరకంటక్ లో  ఆవిర్భవిస్తున్నది. మాఘ శుద్ధ సప్తమి రోజున నర్మద భూతలమున కాలిడినట్లు ఐతిహ్యం. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో నర్మదా జయంతికు హెచ్చు ప్రాశస్త్యం ఉన్నది

గంగాదేవి నర్మదా స్నానం: లక్షలాది మంది భక్తులు తమ పాపాలను తొలగించుకోవడానికై గంగానదిలో మునుగుతారు. అయితే వారి పాపాలు మూటగట్టుకొన్న గంగ నర్మదానదిలో స్నానమాచరించి పునీతురాలవుతుందని ఐతిహ్యం


అరసవల్లిలోని ఉషా చాయా పద్మినీ దేవి సహిత సూర్యనారాయణస్వామి


క్రింది తెలుగు సంఖ్యలు అన్నీ మీకు తెలుసా?

సంఖ్యామానం:   

ఒకటి =1

పది =10                                   

వంద =100

వెయ్యి =1000

పదివేలు =10000.             

లక్ష =100000

పదిలక్షలు =1000000

కోటి =10000000

పది కోట్లు= 100000000

శతకోటి                    =1000000000

సహస్త్ర కోటి           =10000000000 

 అనంతకోటి       =100000000000

న్యార్భుద్ధం                 =1000000000000

ఖర్వం                      =10000000000000

మహాఖర్వం                =100000000000000

పద్మం                      =1000000000000000

మహాపద్మం                =10000000000000000

క్షోణి                         =100000000000000000

మహాక్షోణి                   =1000000000000000000

శంఖం                      =10000000000000000000

మహాశంఖం                =100000000000000000000

క్షితి                         =1000000000000000000000

మహాక్షితి                   =10000000000000000000000

క్షోబం                       =100000000000000000000000

మహా క్షోబం                =1000000000000000000000000

నిధి                         =10000000000000000000000000

మహానిధి                   =100000000000000000000000000

పరాటం                     =1000000000000000000000000000

పరార్థం                     =10000000000000000000000000000

అనంతం                    =100000000000000000000000000000

సాగరం                     =1000000000000000000000000000000

అవ్యయం                  =10000000000000000000000000000000

అమృతం                   =100000000000000000000000000000000

అచింత్యం                  =1000000000000000000000000000000000

అమేయం                  =10000000000000000000000000000000000

భూరి                       =100000000000000000000000000000000000

మహాభూరి                 =1000000000000000000000000000000000000

మన భారతీయ & హైందవ సాంప్రదాయములో మాత్రమే అంత పెద్ద సంఖ్యలకు కూడా నిర్దిష్టమైన పేర్లు గలవు
అందుకే మనం భారతీయునిగా పుట్టినందుకు గర్వించాలి, మన సాంప్రాదాయాలను కాపాడుకోవాలి 

ప్రవర యొక్క అర్ధం.....

చతుస్సాగర పర్యంతం
( మానవ పరిభ్రమణానికి నలువైపులా
కల మహాసముద్రాల అంచుల వరకూ )

గో బ్రాహ్మణేభ్య శుభం భవతు
( సర్వాబీష్ట ప్రదాయిణి అగు.. గోవూ మరియు నిత్యం సంఘహితాన్నే అభిలషించే సద్బ్రాహ్మణుడు అతడి రూపంలో ప్రకాశించే వేదధర్మం.. సర్వే సర్వత్రా దిగ్విజయంగా.. శుభప్రదంగా వర్ధిల్లాలని కోరుకుంటూ)

×××××××. ఋషేయ ప్రవరాన్విత..

( మా వంశమునకూ.. మా గోత్రమునకూ మా నిత్యానుష్ట ధర్మశీలతకు మూలపురుషులైన మా ఋషివరేణ్యులకూ.. త్యాగే నైకే అమృతత్త్వ మానశుః అన్న వారి మహోన్నతమైన త్యాగనిష్ఠకు సాక్షీభూతుడనై..

×××××× గోత్రః
(మా గోత్రమునకూ..)

ఆపస్తంభ సూత్రః కృష్ణ యజుశ్శాఖాధ్యాయీ
( మా శాఖకూ.. అందలి శాస్త్ర మర్మంబులకు.. )

శ్రీ *** శర్మ నామధేయస్య

( కేవలం జన్మతహానే కాక.. ఉపనయనాది సంస్కారాలతో.. శాస్త్రపఠనంతో.. వేదాధ్యయనాది వైదిక క్రతువులతో.. 1. స్నానము 2. సంధ్య 3. జపము 4. హోమము 5. స్వాధ్యాయము 6. దేవ పూజ 7. ఆతిధ్యము 8. వైశ్యదేవము అనబడే అష్టకర్మలనూ క్రమంతప్పక నిర్వహిస్తూ.. త్రివిధాగ్నులు 1. కామాగ్ని 2. క్రోధాగ్ని 3. క్షుద్రాగ్ని.. అనే త్రివిధాగ్నులను అదుపులో (సమస్థితిలో) ఉంచుకొన్న వాడినై.. పేరుకు ముందు శ్రీ అనబడే.. ప్రకృతి స్వరూపమైన శక్తిస్వరూపాన్ని.. శుభప్రదమైన శ్రీకారాన్ని ధరించిన.. శ్రీ ** శర్మా అనబడే సుశ్రోత్రియుడనైన నేను.. జన్మప్రధాతలైన జననీజనకులముందు..  జ్ఞానప్రధాతలైన ఆచార్యులముందు.. జ్ఞానస్వరూపమైన వేదముముందు.. యావత్ ప్రపంచానికే మార్గదర్శకమైన వేదధర్మము ముందు.. నిరాకార నిర్గుణ అవ్యాజ పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్మ ముందు..

అహంభో అభివాదయే..
( కేవలం నేనూ అన్నదిలేక.. సర్వం ఆ పరమాత్మ యొక్క అనుగ్రహ భాగ్యమేయన్న అహంకారభావ రహితుడనై.. నిగర్వినై.. త్రికరణ శుద్ధిగా ( మనసా, వాచా, కర్మణా) సాష్టాంగ పూర్వక (మానవశరీరంలోని అత్యంత ప్రాధాన్యమైన ఎనిమిది శరీరాంగములనూ శరణాగత హృదయంచే నేలపై వాల్చి సమర్పిస్తున్న) దండ ప్రణామమిదే.. అన్న పరిపూర్ణమైన ఆత్మపూర్వక వేదపూర్వక హృదయపూర్వక నమస్కార భావమే.. సశాస్త్రీయమైన ఈ ప్రవరలోని.. అర్ధం అంతరార్ధం పరమార్ధం కూడా..

సర్వేజనా సుఖినో భవంతు..
లోకా సమస్తా సుఖినో భవంతు
స్వస్తి..

చాలా అరుదుగా దొరికే సూర్య మండల స్త్రోత్రం !

చాలా అరుదుగా దొరికే స్తోత్రం,మరియు మోస్ట్ పవర్ ఫుల్.

సూర్యమండల స్తోత్రం

నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే సహస్రశాఖాన్విత సంభవాత్మనే |
సహస్రయోగోద్భవ భావభాగినే సహస్రసంఖ్యాయుధధారిణే నమః || ౧ ||

యన్మండలం దీప్తికరం విశాలం | రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ |
దారిద్ర్య దుఃఖక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౨ ||

యన్మండలం దేవగణైః సుపూజితం | విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ |
తం దేవదేవం ప్రణమామి సూర్యం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౩ ||

యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం | త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్ |
సమస్త తేజోమయ దివ్యరూపం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౪ ||

యన్మండలం గూఢమతి ప్రబోధం | ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్ |
యత్సర్వ పాపక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౫ ||

యన్మండలం వ్యాధివినాశదక్షం | యదృగ్యజుః సామసు సంప్రగీతమ్ |
ప్రకాశితం యేన చ భూర్భువః స్వః | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౬ ||

యన్మండలం వేదవిదో వదంతి | గాయంతి యచ్చారణసిద్ధసంఘాః |
యద్యోగినో యోగజుషాం చ సంఘాః | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౭ ||

యన్మండలం సర్వజనైశ్చ పూజితం | జ్యోతిశ్చకుర్యాదిహ మర్త్యలోకే |
యత్కాల కాలాద్యమరాది రూపం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౮ ||

యన్మండలం విష్ణుచతుర్ముఖాఖ్యం | యదక్షరం పాపహరం జనానామ్ |
యత్కాలకల్పక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౯ ||

యన్మండలం విశ్వసృజం ప్రసిద్ధం | ఉత్పత్తి రక్ష ప్రలయ ప్రగల్భమ్ |
యస్మిన్ జగత్సంహరతేఽఖిలం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౦ ||

యన్మండలం సర్వగతస్య విష్ణోః | ఆత్మా పరం ధామ విశుద్ధతత్త్వమ్ |
సూక్ష్మాంతరైర్యోగపథానుగమ్యం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౧ ||

యన్మండలం వేదవిదోపగీతం | యద్యోగినాం యోగ పథానుగమ్యమ్ |
తత్సర్వ వేద్యం ప్రణమామి సూర్యం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౨ ||

సూర్యమండలసు స్తోత్రం యః పఠేత్సతతం నరః |
సర్వపాపవిశుద్ధాత్మా సూర్యలోకే మహీయతే ||

ఇతి శ్రీ భవిష్యోత్తరపురాణే శ్రీ కృష్ణార్జున సంవాదే సూర్యమండల స్తోత్రం ||

Sunday, January 21, 2018

సూర్యుడి జన్మదినాన్ని - రథ సప్తమి

ఈ నెల 24 రథసప్తమి  మహా తేజం

మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం 12 మంది సూర్యులు.

🌹ఏడాదిలోని ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు.

1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు ‘ధాత’,
2. వైశాఖంలో అర్యముడు,
3. జ్యేష్టం-మిత్రుడు,
4. ఆషాఢం-వరుణుడు,
5. శ్రావణంలో ఇంద్రుడు,
6. భాద్రపదం-వివస్వంతుడు,
7. ఆశ్వయుజం-త్వష్ణ,
8. కార్తీకం-విష్ణువు,
9. మార్గశిరం- అంశుమంతుడు,
10. పుష్యం-భగుడు,
11. మాఘం-పూషుడు,
12. ఫాల్గుణం-పర్జజన్యుడు.

🌹ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు.

🌹భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు. 

🌹బాల్యంలో హనుమంతుడు సూర్యుణ్ణి పండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట. అందుకోసం హనుమ వెళ్లిన దూరాన్ని ‘యుగ సహస్ర యోజన పరాభాను’ అని తులసీదాస్‌ హనుమాన్‌ చాలీసాలో చెబుతారు.

🌹దీన్ని లెక్క కడితే... ‘యుగం.. 12000 ఏళ్లు, సహస్రం.. 1000, యోజనం.. 8 మైళ్లు, మైలు... 1.6 కిలోమీటర్లు వెరసి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది.

🌹సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే,
ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది.

ఆ ఏడు గుర్రాల పేర్లు
1. గాయత్రి,
2. త్రిష్ణుప్పు,
3. అనుష్టుప్పు,
4. జగతి,
5. పంక్తి,
6. బృహతి,
7. ఉష్ణిక్కు...

వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోలుతాయి.

🌹రామరావణ యుద్ధం సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని ‘ఆదిత్య హృదయం’ ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది.

🌹ఇందులో 30 శ్లోకాలున్నాయి. వీటి స్మరణ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు.

🌹సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు, రాత్రికి ప్రతీక అని, చక్రాలకున్న ఆరు ఆకులు రుతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది.

🌹అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథ సప్తమి అని పిలుస్తారు.

Friday, January 19, 2018

లక్ష్మీకటాక్షం

🌹🙏🌹

సకల శుభాలు ఇచ్చే .....
సర్వ సంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహా లక్ష్మి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూడని వాళ్ళు ఎవరు ఉండరు. ఆమె దృష్టి మన మిద పడడం కోసం మనం ఎన్నో పూజలు, వ్రతాలూ చేస్తూ ఉంటాము. కానీ, శ్రీ లక్ష్మి దేవి యొక్క నివాస స్థానాలు, ఆమె ప్రీతి కొరకు ఏమి చేయాలి అనేది మనం సూక్ష్మం గ తెలుసుకొందాము. పూజలు, వ్రతాలూ చేయలేని వాళ్ళు జీవన విధానంలో కొద్ది మార్పులు చేసుకోవడం ద్వార లక్ష్మి అనుగ్రహాన్ని పొందవచ్చు.

1. సింహ ద్వారం గడప దగ్గర చెప్పులు చిందర వందరగా పదేయకూడదు. గడప లక్ష్మి స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావడం, గడప మిద కాలు వేయడం, గడపకు అటు ఇటు చెరో కాలు వేసి నుంచోవడం వంటి పనులు చేయరాదు. పసుపు, కుంకుమ ఉన్న గడపలు లక్ష్మి దేవికి ఆహ్వానం పలుకుతాయి. అందువల్ల ప్రతి శుక్రవారం గడపకు పసుపు, కుంకుమ తో అలంకరించాలి.

2. ప్రధాన ద్వారం తలుపు మిద ఎర్రని కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసిన మంచిదే.

3. శుచి, శుభ్రత ఉన్న ఇళ్లు లక్ష్మి దేవికి ఆలవాలం. కనుక, ఇంట్లోని పనికిరాని వస్తువులు, విరిగి పోయిన, చెడిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు బయట పారేయాలి.

4. చెడిపోయిన గడియారాలు, విరిగిపోయిన అద్దాలు, చిరిగి, వాడని వస్త్రాలు ఇంట్లో అస్సలు ఉండకూడదు.

5. ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మి దేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారే వాకిలి ఉడ్చి ముగ్గులు వేసుకోవాలి.

6. ఇంటి ఇల్లాలు గట్టిగ గొంతు పెట్టి మాట్లాడడం, నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు.

7. ఎక్కడైతే భార్య భర్తలు నిరంతరం కోట్లడుకుంటారో, ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ అసంతృప్తి గా ఉంటుందో, ఆ ఇంట్లో లక్ష్మి దేవి ప్రవెశించదు.

8. అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇరు సంధ్యలలో భుజించేవారు, నిద్రించే వారు, బద్దకస్తులు ఎక్కడ ఉంటారో, అక్కడ లక్ష్మి దేవి ఉండదు.

9. ఇరు సంధ్యలలో దీపారాధన చేసే ఇంట్లో లక్ష్మి దేవి కొలువై ఉంటుంది.

10. సాయం సంధ్య వేళల్లో సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసిన మంచిదే.

11. సత్యవాదులు, ధార్మిక , నైతిక ప్రవర్తన ఉన్న వారి పట్ల లక్ష్మి దేవి ప్రసన్నురాలై ఉంటుంది.

12. వెండి, బంగారు వంటి లోహల్లో, రత్నాలు, ముత్యాలు లో లక్ష్మి దేవి కొలువై ఉంటుంది.

13. అతిగా మాట్లాడే వారు, గురువులను, పెద్దలను అగౌరవ పరిచేవారు, జుదరులు, అతి నిద్రాలోలురు, అపరిశుభ్రంగా ఉండే వారు ఉన్న చోట లక్ష్మి దేవి ఉండలేదు.

14. ప్రతి శుక్రవారం తలస్నానం చేసి, ఎర్రని వస్త్రాలు, పువ్వులు ధరించి, లక్ష్మి పూజ చేసేవారు ఆమె అనుగ్రహం పొందుతారు.

15. చిల్లర పైసలను, పువ్వులను, అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసేవారు ఆమె అనుగ్రహం పొందలేరు.

🌹🙏🌹

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...