Saturday, March 30, 2019

ఆవు గురించి వివరణ

🍁ఈ ప్రపంచంలో గోవు శరీరం అత్యంత ఆరోగ్యకరమైనది, పవిత్రమైనది. వేదకాలం నుండి గోవు మనకు ఆరోగ్యం, ఆహారం, వ్యవసాయ సాధనాలను సమకూరుస్తున్నది. భూలోకంలో ఆవు కామధేనువుతో సమానం. అంతటి మ¬న్నతమైన గో సంపదను సంరక్షించి, మన దేశాన్ని ఆర్థిక అభివృద్ధి దిశగా తీసుకువెళ్ళడం మనందరి కర్తవ్యం.

వైజ్ఞానికముగా ఆవు ప్రాధాన్యత

🍁– ఒక తులం ఆవు నెయ్యితో యజ్ఞం చేస్తే ఒక టన్ను ప్రాణవాయువు (ఆక్సిజన్‌) లభిస్తుంది. అంతేకాక వాతావరణం కాలుష్యరహిత మవుతుంది.

🍁– గృహాలను, వాకిళ్ళను ఆవుపేడతో అలికినట్లయితే రేడియోధార్మిక కిరణాల నుండి రక్షణ పొంద వచ్చు.

🍁– గో మూత్రంలో నైట్రోజన్‌, కార్బాలిక్‌ ఆసిడ్‌ వంటి రసాయనాలున్నాయి. పాలిచ్చే ఆవు మూత్రంలో లాక్టోజ్‌, సల్ఫర్‌, కాపర్‌, మాంగనీస్‌, పొటా షియం, అమ్మోనియా, గ్యాస్‌, యూరియాసాల్ట్‌ మరియు ఎన్నో రకాల క్షారాలు, ఆరోగ్యకరమైన ఆమ్లాలు ఉన్నాయి.

🍁– అణుధార్మిక శక్తి నుండి వచ్చే హానికర వాయువుల నుండి రక్షణ పొందగల సర్వాధిక శక్తి ఆవు పాలల్లో ఉంది.

🍁– ఆవు నెయ్యిని బియ్యంతో కలిపి, ఆవు పిడకలపై వేడిచేస్తే ఇథిలిన్‌ ఆక్సైడ్‌, ప్రొపిలిన్‌ ఆక్సైడ్‌, ఫార్మాల్డిహైడ్‌లు ఉత్పన్నమవుతాయి. కృత్రిమ వర్షం కురిపించడం కోసం ప్రొపిలిన్‌ ఆక్సైడ్‌ ఆధారమని విజ్ఞానశాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

🍁– పచ్చి ఆవు పేడ నుండి బయోగ్యాస్‌ మరియు విద్యుత్‌ లభిస్తున్నాయి. గో మూత్రంతో విద్యుత్‌ తయారవుతున్నది. గోడ గడియారాలు నడుస్తు న్నవి.

ఆరోగ్య ప్రదాయినిగా ఆవు

🍁– ఆవు పేడకు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణాన్ని సంరక్షించే గుణముంది.

🍁– గర్భిణీ స్త్రీలు ఆవును పూజించి రోజూ 11 సార్లు అవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సుఖ ప్రసవంతో పాటు తెలివైన శిశువు జన్మిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

🍁– ప్రపంచంలో మానవులకు ప్రాణ వాయువును ఇచ్చే ఒకే ఒక ప్రాణి గోవు.

🍁– ఆవు పాలలో కలరా వ్యాధికారక క్రిములను నాశనం చేయగల లక్షణాలున్నాయని మద్రాస్‌కు చెందిన డా||కింగ్‌ పేర్కొన్నారు.

🍁– దీర్ఘరోగాలున్నవారు, మానసిక రోగులు కొంత కాలం గోశాలలో నివాసముంటూ గోసేవ చేస్తే ఆవు నుండి వెలువడే వాయుతరంగాల కార ణంగా పై రోగాలు నయమవుతాయని శాస్త్రజ్ఞుల పరిశీలనలో వెల్లడయింది.

🍁– ఆవు మూపురంలో ఉండే ‘సూర్యకేతునాడి’ కారణంగా, విషపదార్థాలను తిని కూడా అవు వాటిని అమృతతుల్యంగా మారుస్తుంది.

🍁– ఆవు పాలు శరీరంలో చురుకుదనాన్ని, స్ఫూర్తిని కలిగిస్తాయి. ఆయుష్షును పెంచుతాయి. జ్ఞాపక శక్తికి ఆవుపాలు శ్రేష్ఠమైనవి.

🍁– ఆవు పాలకు క్యాన్సర్‌, క్షయ, గుండెజబ్బులు, రక్తపుపోటు, మధుమేహం, కామెర్లు, కీళ్ళ నొప్పులు, మూలశంఖ, రక్తహీనత, మల బద్ధకం, ఉదర వ్యాధులు, వాయు సంబంధ వ్యాధులు, చర్మరోగాలు, నేత్ర వ్యాధులు, వికారము తదితర వ్యాధులను నివారించే గుణముంది.

🍁– ఆవు మూత్రం సేవిస్తే సర్వరోగ నివారిణిగా, సంజీవనిగా పనిచేస్తుంది.

🍁– ఆవు పాలలో మానవ శరీర పోషణకు అవసర మయ్యే మాంసకృత్తులు, పిండిపదార్థాలు, క్రొవ్వు పదార్థాలు, విటమిన్లు మరియు కాల్షియం, ఫాస్ఫరస్‌వంటి లవణాలు సమృద్ధిగా వుంటాయి.

🍁– ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమ యం (పంచగవ్యం)తో అన్ని రకాల జబ్బులను నివారించగల ఔషధాలు తయారవుతున్నాయి. పంచగవ్యంలో విషాలన్నింటినీ తొలగించే శక్తి వున్నది.

ఆర్థికముగా ఆవు

🍁– మన జాతీయ ఆదాయంలో 6 నుండి 7 శాతం గో సంపద నుండి లభిస్తున్నది.

🍁– మన దేశ వ్యవసాయానికి, రవాణాకు 70 శాతం ఎద్దులే ఆధారం.

🍁– ఒక ఆవు నుండి సంవత్సరానికి 36 క్వింటాళ్ళ పేడ లభిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో వున్న గో సంపదతో సంవత్సరానికి 32 కోట్ల టన్నుల పేడ లభిస్తోంది.

🍁– ఒక ఆవు తన జీవితకాలంలో 5,10,440 మందికి ఒక పూట భోజనం సమకూర్చగలదని స్వామి దయానంద సరస్వతి ”గోకరుణానిధి” గ్రంథంలో పేర్కొన్నారు.

🍁– ఎండిన ఆవుపేడ ఇంధనంగా ఉపయోగ పడు తున్నది. బూడిద ఎరువుగా, క్రిమిసంహారిణిగా, వంటపాత్రలను శుభ్రపరిచేదిగా ఉపయోగించు టతో కోట్లాది రూపాయలు పొదుపు అవుతు న్నాయి.

🍁– చనిపోయిన ఆవును ఒక్క సంవత్సరముపాటు నేలలో పాతిపెట్టడం ద్వారా అత్యంత విలువైన జీవన ఎరువు లభ్యమవుతుంది.

🍁– పంచగవ్య చికిత్స మరియు గో ఆధారిత వ్యవ సాయ పద్ధతుల ద్వారా దేశంలోని గ్రామా లన్నింటికీ ఉద్యోగావకాశాలు కల్పించవచ్చును.

🍁– సాధారణమైన ప్రతి ఆవు నుండి రోజుకి 10 కిలోల పేడ, 5 లీటర్ల మూత్రం లభిస్తాయి. గోసంతతికి చెందిన చిన్న లేగ దూడ నుండి కూడా సంవత్సరంలో రూ.20,000ల విలువ కల్గిన ఎరువులు లభ్యమవుతాయి.

🍁– గో మూత్రం నేడు క్రిమిసంహారిణిగా ఉపయోగపడుతోంది.

🍁– బులంద్‌ షహర్‌, కాన్పూర్‌, ఢిల్లీ పట్టణాలలో ఎద్దులతో నడిచే ట్రాక్టర్‌ రూపొందింది. దీని ఉపయోగంతో ఖర్చు తగ్గి, పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది.

🍁– చనిపోయిన ఆవు కొమ్ములో ఆవు పేడను నింపి, స్వచ్ఛమైన నేలలో దసరా నవరాత్రులలో పాతి పెట్టి ఉగాది నవరాత్రులలో తీయటం ద్వారా ఒక్కొక్క కొమ్ము నుండి లభించే జీవన ఎరువు 4 ఎకరాలకు సరిపోతుంది.

నక్షత్రం - గాయత్రి

ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర గాయత్రి ని రోజుకు 9 సార్లు పఠించాలి
ఈ విధంగా చేయడం వల్ల శుభ ఫలితాలు చేకూరుతాయి
1.అశ్విని
ఓం శ్వేతవర్ణై విద్మహే సుధాకరాయై ధిమహి తన్నో అశ్వినేన ప్రచోదయాత్

2.భరణి
ఓం కృష్ణవర్ణై విద్మహే దండధరాయై ధిమహి తన్నో భరణి:ప్రచోదయాత్

3.కృత్తికా
ఓం వణ్ణిదేహాయై విద్మహే మహాతపాయై ధీమహి తన్నో కృత్తికా ప్రచోదయాత్

4.రోహిణి
ప్రజావిరుధ్ధై చ విద్మహే విశ్వరూపాయై ధీమహి తన్నో రోహిణి ప్రచోదయాత్

5.మృగశిరా
ఓం శశిశేఖరాయ విద్మహే మహారాజాయ ధిమహి తన్నో మృగశిర:ప్రచోదయాత్

6.ఆర్ద్రా
ఓం మహాశ్రేష్ఠాయ విద్మహే పశుం తనాయ ధిమహి తన్నో ఆర్ద్రా:ప్రచోదయాత్

7.పునర్వసు
ఓం ప్రజా వరుధ్ధై చ విద్మహే అదితి పుత్రాయ ధిమహి తన్నో పునర్వసు ప్రచోదయాత్

8.పుష్య
ఓం బ్రహ్మవర్చసాయ విద్మహే మహాదిశాయాయ ధిమహి తన్నో పుష్య:ప్రచోదయాత్

9.ఆశ్లేష
ఓం సర్పరాజాయ విద్మహే మహారోచకాయ ధిమహి తన్నో ఆశ్లేష: ప్రచోదయాత్

10.మఖ
ఓం మహా అనగాయ విద్మహే పిత్రియాదేవాయ ధిమహి తన్నో మఖ: ప్రచోదయాత్

11.పుబ్బ
ఓం అరియంనాయ విద్మహే పశుదేహాయ ధిమహి తన్నో పూర్వఫల్గుణి ప్రచోదయాత్

12.ఉత్తరా
మహాబకాయై విద్మహే మహాశ్రేష్ఠాయై ధీమహి తన్నో ఉత్తర ఫల్గుణి ప్రచోదయాత్

13.హస్త
ఓం ప్రయచ్చతాయై విద్మహే ప్రకృప్రణీతాయై ధీమహి తన్నో హస్తా ప్రచోదయాత్

14.చిత్తా
ఓం మహాదృష్టాయై విద్మహే ప్రజారపాయై ధీమహి తన్నో చైత్రా:ప్రచోదయాత్

15.స్వాతి
ఓం కామసారాయై విద్మహే మహాని ష్ఠాయై ధీమహితన్నో స్వాతి ప్రచోదయాత్

16.విశాఖ
ఓం ఇంద్రాగ్నేస్యై విద్మహే మహాశ్రేష్ఠాయై చ ధీమహీ తన్నో విశాఖ ప్రచోదయాత్

17 అనూరాధ
ఓం మిత్రదేయాయై విద్మహే మహామిత్రాయ ధీమహి తన్నో అనూరాధా ప్రచోదయాత్

18.జ్యేష్ఠా
ఓం జ్యేష్ఠాయై విద్మహే మహాజ్యేష్ఠాయై ధీమహి తన్నో జ్యేష్ఠా ప్రచోదయాత్

19.మూల
ఓం ప్రజాధిపాయై విద్మహే మహాప్రజాధిపాయై ధీమహి తన్నో మూలా ప్రచోదయాత్

20.పూర్వాషాఢ
ఓం సముద్ర కామాయై వి    ఓం ప్రజాధిపాయై విద్మహే మహాప్రజాధిపాయై ధీమహి తన్నో మూలా ప్రచోదయాత్

20.పూర్వాషాఢ
ఓం సముద్ర కామాయై విద్మహే మహాబీజితాయై ధిమహితన్నో పూర్వాషాఢా ప్రచోదయాత్

21.ఉత్తరాషాఢ
ఓం విశ్వేదేవాయ విద్మహే మహాషాఢాయ ధిమహి తన్నో ఉత్తరాషాఢా ప్రచోదయాత్

22. శ్రవణ
ఓం మహాశ్రేష్ఠాయై విద్మహే పుణ్యశ్లోకాయ ధీమహి తన్నో శ్రవణ ప్రచోదయాత్

23.ధనిష్ఠా
ఓం అగ్రనాథాయ విద్మహే వసూప్రితాయ ధీమహి తన్నో శర్విష్ఠా ప్రచోదయాత్

24.శతభిషం
ఓం భేషజాయ విద్మహే వరుణదేహాయ ధీమహి తన్నో శతభిషా ప్రచోదయాత్

25.పూర్వాభాద్ర
ఓం తేజస్కరాయ విద్మహే అజరక పాదాయ ధీమహి తన్నో పూర్వప్రోష్టపత ప్రచోదయాత్

26.ఉత్తరాభాద్ర
ఓం అహిరబుధ్నాయ విద్మహే ప్రతిష్ఠాపనాయ ధీమహి తన్నో ఉత్తరప్రోష్టపత ప్రచోదయాత్

27.రేవతి
ఓం విశ్వరూపాయ విద్మహే పూష్ణ దేహాయ ధీమహి తన్నో రేవతి ప్రచోదయాత్

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం-- శని వార మహిమ

శని వారం ఆంజనేయ స్వామి ని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగు తాయి .అన్ని వారాల్లోను మంద వారం అని పిలువ బడే శని వారం శ్రేష్టమైనది .’’సతతం మంద వారేషు భారతః క్షత్రియో త్తమః  –హనూమంతం భజం స్థాస్తౌ నిరంకుశ పరాక్రమః ‘’అంటే ప్రతి శని వారం భరతుడు హనుమ ను సేవించి పరాక్రమ వంతుడు అయినాడు అని  అర్ధం .శ్రవణా నక్షత్రం తో కూడిన శనివారం నాడు రుద్ర మంత్రాలతో తైలాభి షేకం చేయాలి .తైలం తో కూడిన గంధసిన్దూరాన్ని హనుమంతునికి పూస్స్తే, ప్రీతి చెందుతాడు .అభిషేకం చేస్తే అనుగ్రహ ప్రాప్తి కలుగు తుంది .వ్యాధి నుండి విముక్తి కలిగి బుద్ధి బలం పెరుగు తుంది .శత్రు జయం కల్గి మిత్ర సమృద్ధి హెచ్చి ,యశో వంతు లైన పుత్రులు కలుగు తారు .మాఘ ,ఫాల్గుణ ,చైత్ర ,వైశాఖ ,జ్యేష్ట మాసాలలో ఏ మాసం లో నైనా కాని ,కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కాని శని వార వ్రతం చేయాలి .

         శనివార వ్రాత విధానం –ఉదయమే లేచి స్నానాదులు పూర్తి చేసుకొని ,కొత్త పాత్రల తో బయటి నుండి నీరు తెచ్చు కొని హనుమకు అభిషేకం చేయాలి .అన్ని వర్ణాల వారు ,స్త్రీలు కూడా చేయ వచ్చు .నలభై రోజులు ఇలా అభిషేకం చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి .

        ఆంజనేయస్వామికి చెందిన అనేక మంత్రాలున్నాయి .అందులో ఒక దాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది యదా విధి గా జపించాలి .దీని వల్ల జన వశీకరణ కలుగుతుంది .ధన లాభం ,ఉద్యోగ ప్రాప్తి ,కారాగృహ విమోచనం లభిస్తాయి .

                 శని వార వ్రతానికి ఇంకో కారణం కూడా ఉండి .శని గ్రహం ఎంత క్రూర స్వభావుడో అంతటి సౌమ్యమూ ఉన్నవాడు .ఒక సారి శని దేవుడు హనుమను సమీ పించి ‘’మారుతీ !నేను శనిని .అందర్ని పట్టి బాధించాను .ఇంత వరకు నిన్ను పట్టు కొ లేదు .ఇప్పుడు చిక్కావు .’’అన్నాడు .దానికి హనుమ ‘’శానీశ్వరుడా !నన్ను పట్టు కొంటావా ?లేక నాలో ఉంటావా ?నాలో ఉండ దలిస్తే ఎక్కడ ఉండాలని కోరిక గా వుంది ?’’అని ప్రశ్నించాడు .అప్పుడు శని హనుమ శిరం మీద ఉంటానని చెప్పాడు .సరే నని శిరస్సు మీద శనిని చేర్చు కొన్నాడు మారుతి .ఆయనకు శనిని బాధించాలని మనసు లో కోరిక కలిగింది .ఒక మహా పర్వతాన్ని పెకలించి నెట్టి  మీదకు ఎత్తు కొన్నాడు హనుమ .’’కుయ్యో మొర్రో అని ఆ భారం భరించ లేక శని గిల గిల తన్ను కొన్నాడు బరువు దించమని ప్రాధేయ పడ్డాడు .జాలి కలిగి పర్వతాన్ని విసిరేసి శనిని తోకకు చుట్టి సేతువు కు ప్రదక్షిణం చేయటం మొదలు పెట్టాడు .ఊపిరాడక శని వల వల ఏడ్చేశాడు .తోకలో బంధింప బడి ఉన్నందున నేల మీద పడి దొర్లుతూ ,ఏడుస్తూ ప్రార్ధించాడు .శని స్తోత్రాలకు పవన కుమారుడు సంతోషించి ‘’మందా ! నన్ను పట్టు కొని పీడిస్తానని ప్రగల్భాలు పోయావు .అప్పుడే గిజగిజ లాడి పోతున్నావె?’’అని ప్రశ్నించాడు .’’ప్రజలను బాధించ టమే  నీ ధర్మం గా ప్రవర్తిస్తున్నావు .అందు కని నిన్ను ఒక రకం గా శాశించి వదిలి పెడ తాను’’అన్నాడు .గత్యంతరం లేక శని సరే నన్నాడు .

         హనుమ ‘శనీ! నా భక్తులను బాధించ రాదు .నన్ను పూజించే వారిని ,నా మంత్రాన్ని జపించే వారిని ,నా నామ స్మరణ చేసే వారిని ,నాకు ప్రదక్షిణం చేసే వారిని ,నా దేవాలయాన్ని సందర్శించే వారిని ,నాకు అభిషేకం చేసే వారిని  ఏకాలం లో నైనా ముట్టు కొ కూడదు .నువ్వు బాధించ రాదు .మాట తప్పితే కథి నాతి కథి నం గా నిన్ను దండిస్తాను ‘’అని చెప్పి ,శని తో వాగ్దానం చేయించు కొని వదిలి పెట్టాడు .అందుకే శని వారం ఇంత ప్రాధాన్యత సంత రించు కొన్నది .శనిని తోకతో నేల మీద పడేసి లాగటం వల్ల శని శరీరమంతా గాయాలై బాధించాయి .ఆ బాధా నివృత్తి కే శని కి తైలాభిషేకం చేస్తారు .ఈ విధం గా తైలాభిషేకం చేసిన వారిని శని దేవుడు బాధించటం లేదు . .

   ‘’ మంద వారేషు సం ప్రాప్తే   హనూమంతం ప్రపూజ ఎత్ –సర్వేశ్వాపి చ వారేషు మంద వారః ప్రశాస్యతే ;

     హనూమజ్జన్మనో హేతు స్తస్య ప్రాశస్త్య ముచ్చ్యతే –తస్మాత్తస్మిన్ కృతా పూజా సర్వ కామ ఫలప్రదా ‘’

శని వారం రాగానే హనుమను పూజించాలి .ఆయన శని వారం జన్మించటం వల్ల దానికి అంత ప్రాముఖ్యత లభించింది .అందుకే శని వారం చేసే హనుమ పూజ సర్వ కామ్యార్ధ సిద్ధి కల్గిస్తుంది సకల శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం--     శని వార మహిమ

 శని వారం ఆంజనేయ స్వామి ని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగు తాయి .అన్ని వారాల్లోను మంద వారం అని పిలువ బడే శని వారం శ్రేష్టమైనది .’’సతతం మంద వారేషు భారతః క్షత్రియో త్తమః  –హనూమంతం భజం స్థాస్తౌ నిరంకుశ పరాక్రమః ‘’అంటే ప్రతి శని వారం భరతుడు హనుమ ను సేవించి పరాక్రమ వంతుడు అయినాడు అని  అర్ధం .శ్రవణా నక్షత్రం తో కూడిన శనివారం నాడు రుద్ర మంత్రాలతో తైలాభి షేకం చేయాలి .తైలం తో కూడిన గంధసిన్దూరాన్ని హనుమంతునికి పూస్స్తే, ప్రీతి చెందుతాడు .అభిషేకం చేస్తే అనుగ్రహ ప్రాప్తి కలుగు తుంది .వ్యాధి నుండి విముక్తి కలిగి బుద్ధి బలం పెరుగు తుంది .శత్రు జయం కల్గి మిత్ర సమృద్ధి హెచ్చి ,యశో వంతు లైన పుత్రులు కలుగు తారు .మాఘ ,ఫాల్గుణ ,చైత్ర ,వైశాఖ ,జ్యేష్ట మాసాలలో ఏ మాసం లో నైనా కాని ,కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కాని శని వార వ్రతం చేయాలి .

         శనివార వ్రాత విధానం –ఉదయమే లేచి స్నానాదులు పూర్తి చేసుకొని ,కొత్త పాత్రల తో బయటి నుండి నీరు తెచ్చు కొని హనుమకు అభిషేకం చేయాలి .అన్ని వర్ణాల వారు ,స్త్రీలు కూడా చేయ వచ్చు .నలభై రోజులు ఇలా అభిషేకం చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి .

        ఆంజనేయస్వామికి చెందిన అనేక మంత్రాలున్నాయి .అందులో ఒక దాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది యదా విధి గా జపించాలి .దీని వల్ల జన వశీకరణ కలుగుతుంది .ధన లాభం ,ఉద్యోగ ప్రాప్తి ,కారాగృహ విమోచనం లభిస్తాయి .

                 శని వార వ్రతానికి ఇంకో కారణం కూడా ఉండి .శని గ్రహం ఎంత క్రూర స్వభావుడో అంతటి సౌమ్యమూ ఉన్నవాడు .ఒక సారి శని దేవుడు హనుమను సమీ పించి ‘’మారుతీ !నేను శనిని .అందర్ని పట్టి బాధించాను .ఇంత వరకు నిన్ను పట్టు కొ లేదు .ఇప్పుడు చిక్కావు .’’అన్నాడు .దానికి హనుమ ‘’శానీశ్వరుడా !నన్ను పట్టు కొంటావా ?లేక నాలో ఉంటావా ?నాలో ఉండ దలిస్తే ఎక్కడ ఉండాలని కోరిక గా వుంది ?’’అని ప్రశ్నించాడు .అప్పుడు శని హనుమ శిరం మీద ఉంటానని చెప్పాడు .సరే నని శిరస్సు మీద శనిని చేర్చు కొన్నాడు మారుతి .ఆయనకు శనిని బాధించాలని మనసు లో కోరిక కలిగింది .ఒక మహా పర్వతాన్ని పెకలించి నెట్టి  మీదకు ఎత్తు కొన్నాడు హనుమ .’’కుయ్యో మొర్రో అని ఆ భారం భరించ లేక శని గిల గిల తన్ను కొన్నాడు బరువు దించమని ప్రాధేయ పడ్డాడు .జాలి కలిగి పర్వతాన్ని విసిరేసి శనిని తోకకు చుట్టి సేతువు కు ప్రదక్షిణం చేయటం మొదలు పెట్టాడు .ఊపిరాడక శని వల వల ఏడ్చేశాడు .తోకలో బంధింప బడి ఉన్నందున నేల మీద పడి దొర్లుతూ ,ఏడుస్తూ ప్రార్ధించాడు .శని స్తోత్రాలకు పవన కుమారుడు సంతోషించి ‘’మందా ! నన్ను పట్టు కొని పీడిస్తానని ప్రగల్భాలు పోయావు .అప్పుడే గిజగిజ లాడి పోతున్నావె?’’అని ప్రశ్నించాడు .’’ప్రజలను బాధించ టమే  నీ ధర్మం గా ప్రవర్తిస్తున్నావు .అందు కని నిన్ను ఒక రకం గా శాశించి వదిలి పెడ తాను’’అన్నాడు .గత్యంతరం లేక శని సరే నన్నాడు .

         హనుమ ‘శనీ! నా భక్తులను బాధించ రాదు .నన్ను పూజించే వారిని ,నా మంత్రాన్ని జపించే వారిని ,నా నామ స్మరణ చేసే వారిని ,నాకు ప్రదక్షిణం చేసే వారిని ,నా దేవాలయాన్ని సందర్శించే వారిని ,నాకు అభిషేకం చేసే వారిని  ఏకాలం లో నైనా ముట్టు కొ కూడదు .నువ్వు బాధించ రాదు .మాట తప్పితే కథి నాతి కథి నం గా నిన్ను దండిస్తాను ‘’అని చెప్పి ,శని తో వాగ్దానం చేయించు కొని వదిలి పెట్టాడు .అందుకే శని వారం ఇంత ప్రాధాన్యత సంత రించు కొన్నది .శనిని తోకతో నేల మీద పడేసి లాగటం వల్ల శని శరీరమంతా గాయాలై బాధించాయి .ఆ బాధా నివృత్తి కే శని కి తైలాభిషేకం చేస్తారు .ఈ విధం గా తైలాభిషేకం చేసిన వారిని శని దేవుడు బాధించటం లేదు . .

   ‘’ మంద వారేషు సం ప్రాప్తే   హనూమంతం ప్రపూజ ఎత్ –సర్వేశ్వాపి చ వారేషు మంద వారః ప్రశాస్యతే ;

     హనూమజ్జన్మనో హేతు స్తస్య ప్రాశస్త్య ముచ్చ్యతే –తస్మాత్తస్మిన్ కృతా పూజా సర్వ కామ ఫలప్రదా ‘’

శని వారం రాగానే హనుమను పూజించాలి .ఆయన శని వారం జన్మించటం వల్ల దానికి అంత ప్రాముఖ్యత లభించింది .అందుకే శని వారం చేసే హనుమ పూజ సర్వ కామ్యార్ధ సిద్ధి కల్గిస్తుంది సకల శ్రేయస్సును ఇస్తుంది . ఇస్తుంది .

కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు

హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.

1. విద్యా ప్రాప్తికి:-

పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశాయ!
సకల విద్యాంకురుమే దేవ రామదూత నమోస్తుతే!!

2. ఉద్యోగ ప్రాప్తికి :-

హనుమాన్ సర్వధర్మజ్ఞ
సర్వా పీడా వినాశినే!
ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం
శివరూపా నమోస్తుతే!!

3. కార్య సాధనకు :-

అసాధ్య సాధక స్వామిన్
అసాధ్యం తమకిమ్ వద!
రామదూత కృపా సింధో మమకార్యమ్ సాధయప్రభో!!

త్వమస్మిన్ కార్యనిర్యోగే
ప్రమాణం హరిసత్తమా!
హనుమాన్యత్నమాస్తాయ
దుఃఖక్షయ కరోభవ !!

4. గ్రహదోష నివారణకు :-

మర్కటేశ మహోత్సాహా
సర్వ గ్రహ నివారణాయ!
శత్రూన్ సంహార మాం రక్ష
శ్రియం దాపయామ్ ప్రభో!!

5. ఆరోగ్యమునకు :-

ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ
 శ్రద్ధా పుత్రాస్సుశీలతా!
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ
కపినాథ నమోస్తుతే!!

6. సంతాన ప్రాప్తికి :-

పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహరాయ!
సంతానం కురుమే దేవ
రామదూత నమోస్తుతే!!

7. వ్యాపారాభివృద్ధికి :-

సర్వ కళ్యాణ దాతరమ్
 సర్వాపత్ నివారకమ్!
అపార కరుణామూర్తిం
ఆంజనేయం నమామ్యహమ్!!

8. వివాహ ప్రాప్తికి :-

యోగి ధ్యేయాంఘ్రి పద్మాయ జగతాం పతయేనమః!
వివాహం కురుమేదేవ
రామదూత నమోస్తుతే!!

9,   సర్వ శుభాలకు

బుద్దిర్బలం యశోధైర్యం
నిర్భయత్వం ఆరోగతాం
అజాడ్యం వాక్పటుత్వం
హనుమత్స్మరణాత్ భవేత్


ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 48 దినాలు నిష్ఠతో స్మరిస్తూ,ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శక్తికొద్దీ ప్రదక్షణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు.

* జై శ్రీరామ్* జై హనుమాన్*

ఆచమనం విశిష్టత

మనం చేసే ఆచమనంలో వైదికాంశాలతోపాటు వైజ్ఞానిక రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయి.

మన గొంతులో 'స్వరపేటిక' అనే శరీర అంతర్భాగం వుంటుంది. మనం చేసే ధ్వనులు అంటే మన మాటలు స్వరపేటిక నుండే పుడతాయి. మన ధ్వని గాంభీర్యానికి, స్పష్టతకు ఈ స్వరపేటికే ఆ ధారం. స్వరపేటికలోకి గాలి జొరబడినప్పుడు అంటే మన శ్వాసకోశాల నుండి వెలువడే ఉచ్ఛ్వాస వాయువు ధ్వని తంతులమీదుగా పయనించినప్పుడు, ఈ ధ్వని తంతువులలో ఏర్పడిన శబ్దాలు బయటకు రావడానికి నోరు, ముక్కు రంధ్రాలు సహాయపడతాయి.

 అదేవిధంగా నాలుక పెదవులు శబ్దాల ఉచ్ఛారణకు, స్పష్టతకు దోహదం చేస్తాయి. ప్రతి అక్షరానికి తనదైన ధ్వని ఉంటుంది. నోటిలోని అవయవాలు కదులుతూ ఈ ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి. ఈ ధ్వని (అక్షరం) ఏ భాగం నుండి ఉత్పత్తి అవుతుందో దాని ఆధారంగా అక్షరాలను కాంఠ్యాలు, తాలవ్యాలు మొదలైనవిగా విభజించారు. ఇక మనం వైదిక కర్మలను ఆచరించేటప్పుడు చేసే ఆచమనం వలన మన నాలుకకు, గొంతుకు ఒకరకమైన ఉత్తేజం కలుగుతుంది.

అంతేకాకుండా మన గొంతునుండి మాట బయటకు వచ్చేటప్పుడు, ధ్వనితోపాటు గొంతు నుండి వాయువు కూడా బయటకు వస్తుంది. ఈ విధంగా లోపలి నుండి వాయువు బయటకు వచ్చేటప్పుడు ఎలాంటి అడ్డంకి లేకుండా ఉండేందుకు ఆచమనం ద్వారా మనం త్రాగే నీరు ఉపయోగపడుతుంది.

 నిర్దిష్ట పరమాణంలో మనం తీసుకున్న నీరు గొంతు నుండి వెలుపలివైపు మార్గాన్ని నునుపుగా చేసి మన మాట సులభంగా, స్పష్టంగా వచ్చేందుకు దోహదం చేస్తుంది. పూజాది వైదిక కార్యాలను ఆచరించేటప్పుడు మంత్రోచ్చారణ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆయా మంత్రాలన్నీ గొంతునుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేందుకే మన మహర్షులు ఈ ఆచమన సంప్రదయాన్ని ఏర్పరచారు.

ఇక ఆచమనంలో కేశవాది నామాలను ఉచ్చరించడంలో కూడా ఎంతో వైజ్ఞానిక అంశం ఇమిడి ఉంది. ఆచమనంలో ముందుగా "కేశవాయస్వాహా: అని చెప్పుకుంటారు. ‘కే’  శబ్దము గొంతునుండి పుడుతుంది. తర్వాత పలికే "నారయణస్వాహా" అనే నామము నాలుక నుండి వస్తుంది. ఇక మూడవసారి చెప్పుకునే "మాధవాయస్వాహా" అనే పదము పెదవుల సహాయంతో పలుక బడుతుంది. కాబట్టి కేశవాది నామాలను పలకడం వలన గొంతుకు, నాలుకకు, పెదవులకు ఒకేసారి వ్యాయామం కలుగుతుంది మరియు ఆ తరువాత వచ్చే శబ్దాలకు ఉచ్చారణ కూడా స్పష్టంగా ఉంతుంది.

మన శరీరము ఒక విద్యుత్ కేంద్రములాంటిది, మన శరీరమంతా విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. ఆచమన సమయంలో మనం అరచేతిలో తక్కువ ప్రమాణంలో నీటిని వేసుకున్నప్పుడు ఎలక్ట్రో మాగ్నిటిజమ్ పద్ధతిలో అరచేతిలో ఉన్న నీరు పీల్చుకొంటుంది. ఈ నీటిని త్రాగినప్పుడు, నీరు జీర్ణకోశమును చేరి, అక్కడి గోడలలో ప్రవహించే విద్యుత్తుతో కలిసి, శరీరమంతా ఒకే క్రమపద్ధతిలో విద్యుత్తు ప్రవహించేలాగా చేస్తుంది.

ఇలా విద్యుత్తీకరణము చెందిన నీరువల్ల గొంతు, నాలుక, స్వరపేటిక మొ|| భాగాలు కూడా ఉత్తేజము పొందుతాయి.

ఇంతటి వైజ్ఞానికాంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టే, మన మహర్షులు ఆచమనాన్ని ఒక తప్పనిసరి వైదిక నియమంగా ఏర్పరిచారు💐

లోకాసమస్తా సుఖినోభవంతు.

Wednesday, March 27, 2019

సంకట నాశక గణేశ స్తోత్రము... అర్ధ సహితముగా

 నారద ఉవాచ:--
@@@@@@@@@

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ |
భక్తావాసం స్మరేనిత్యం ఆయుష్కామార్థసిద్ధయే || 1 ||

తాత్పర్యము:--దేవతలందరికంటే  ముందుగా పూజిపబడే వాడు, గౌరీ తనయుడు, విఘ్నాధిపతీ ఐన గణపతిని సకల సుఖ సౌభాగ్య ధన ధాన్య ఐశ్వర్య ఆరోగ్య వృద్ధి కొరకు సదా  నమస్కరిస్తూ భక్తి శ్రద్ధలతో ఆరాధించెదను.



ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ |
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ || 2 ||

తాత్పర్యము:--ప్రధమ నామం: వక్రతుండ (ఒంపు తిరిగిన తొండము కలవాడు), ద్వితీయ నామం: ఏకదంత (ఒకే దంతము కలవాడు), తృతీయ నామం: కృష్ణపింగాక్ష (ముదురు గోధుమ రంగు కన్నులవాడు),చతుర్థ నామం: గజవక్త్ర (ఏనుగు ముఖము వంటి ముఖము కలవాడు).



లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |
సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమమ్ || 3 ||

తాత్పర్యము:--పంచమ నామం: లంబోదరం (పెద్ద పొట్ట కలవాడు), షష్టమ నామం: వికట (భారీ కాయము కలవాడు), సప్తమ నామం: విఘ్నరాజా (విఘ్నాలను తొలగించేవాడు), అష్టమ నామం: ధూమ్రవర్ణ (ముదురు గచ్చకాయ రంగు కలవాడు).



నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకమ్ |
ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ || 4 ||

తాత్పర్యము:-- నవమ నామం: బాలచంద్ర (చంద్రుని శిరస్సుపై ధరించేవాడు), దశమం: వినాయక (విఘ్నములకు నాయకుడు) ఏకాదశ నామం: గణపతి (దేవగణములకు అధిపతి) ద్వాదశ నామం: గజానన (ఏనుగు ముఖము కలవాడు).



ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరః ప్రభుః || 5 ||

తాత్పర్యము:--నవమ నామం: బాలచంద్ర (చంద్రుని శిరస్సుపై ధరించేవాడు), దశమం: వినాయక (విఘ్నములకు నాయకుడు) ఏకాదశ నామం: గణపతి (దేవగణములకు అధిపతి) ద్వాదశ నామం: గజానన (ఏనుగు ముఖము కలవాడు).



విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ |
పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ || 6 ||

తాత్పర్యము:--   ఈ ద్వాదశ (పన్నెండు) నామముల శ్లోకం భక్తి శ్రద్ధలతో ధ్యానించడం వలన జ్ఞానము కోరుకున్నవారికి జ్ఞానము, ధనధాన్యములు కోరుకున్నవారికి ధనధాన్య వృద్ధి, పుత్ర సంతాన ప్రాప్తి కోరుకునేవారికి పుత్ర సంతానము మరియు మోక్ష సిద్ధి కోరుకునేవారికి మోక్షము సిద్ధించును.



జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ |
సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః || 7 ||

తాత్పర్యము:--   ఈ సంకట నాశన గణపతి స్తోత్రం ఆరు మాసాలపాటు జపించినవారికి కోరిన ఫలములు లభించును. ఒక సంవత్సరం పాటు జపించిన వారికి అనుకున్న పనులలో తప్పక విజయం సాధించగలరు అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు.



అష్టానాం బ్రాహ్మణానాం చ లిఖిత్వా యః సమర్పయేత్ |
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః || 8 ||

తాత్పర్యము:--   ఈ సంకట నాశన గణేశ స్తోత్రం భక్తి శ్రద్ధలతో రాసి ఎనమండుగురు బ్రాహ్మలకు దానం చేసినయెడల ఆ వినాయకుని కృపకు పాత్రులై సకల జ్ఞానములు సిద్ధించును.

Tuesday, March 19, 2019

వారణాసి (కాశీి) వైభవం

కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు. సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం:

# కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది. కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు.

# విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి, సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం.

# ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. ప్రపంచ సాంస్కృతిక నగరం.
# స్వయంగా శివుడు నివాసముండె నగరం.

# ప్రళయ కాలంలో మునుగని అతి  ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు.

# కాశీ భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశీ పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది.

# పద్నాలుగు భువన భాండాలలో విశేషమైన స్థలం.

# కాశీలో గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యం....

# ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని  కాశీ లోనికి అనుమతించడు.

# కాశీలో మరణించిన వారికీ యమ బాధ పునర్ జన్మ ఉండదు.

# కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రాగుప్తుని నుండి మాయం అయి కాలభైరవుని వద్దకు చేరుతుంది....

# డిండి గణపతి, కాల భైరవుడు పరిశీలించి యమ యాతన కంటే 32 రేట్లు అధిక శిక్షలు విధించి మరు జన్మ లేకుండా చేస్తాడు ...

# కాబట్టే కాశీలో  కాల భైరవ దర్శనం తరవాత పూజారులు వీపు పై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్లి పోయినా పాపాలు అంటకుండా రక్ష నల్లని కాశి దారం కడతారు.

# కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యం తో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి.

# కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు.

# అందుకే కాశ్యాన్తు మరణాన్ ముక్తి అని శాస్త్ర వచనం కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీలో గడుపుతారు.

# మరణించిన వారి ఆస్తికలు కాశి గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా  విశ్వనాథునిచే ఉద్దరింప బడతారు.

# గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశీి పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది

# ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు.

@ శివుని కాశీలోని కొన్ని వింతలు...

# కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.

# కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ  జాడ దొరకకుండా ఉంటుంది.

# కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు.

# అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్య పోయ్యారు.

# అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి?

# అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు

# అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.

# కాశీి విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనం తో పూజ ప్రారంభిస్తారు .

# కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.

# కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది; పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.

# విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.

# ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి.

# ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీిలోనే వున్నది.

కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి..

ఇందులో దేవతలు, ఋషులు, రాజుల తో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో వున్నాయి. అందులో కొన్ని :

1) దశాశ్వమేధ ఘాట్:
బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజూ సాయకాలం విశేషమైన గంగా హారతి జరుగుతున్నది.

2) ప్రయాగ్ ఘాట్:
ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి.

3) సోమేశ్వర్ ఘాట్:
చంద్రుని చేత నిర్మితమైనది.

4) మీర్ ఘాట్:
సతీదేవీ కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తి పీఠం.
ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.

5) నేపాలీ ఘాట్:
పశుపతి నాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు.

6) మణి కర్ణికా ఘాట్:
ఇది కాశీలో మొట్ట మొదటిది. దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో  తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలిగి పోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట.

7) విష్వేవర్ ఘాట్:
ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు.

8) పంచ గంగా ఘాట్:
ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి.

9) గాయ్ ఘాట్:
గోపూజ జరుగుతున్నది.

10) తులసి ఘాట్:
తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం  పొందినది.

11) హనుమాన్  ఘాట్:
ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నది
ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు.

12) అస్సి ఘాట్:
పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది.

13) హరిశ్చంద్ర ఘాట్:
సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహన కూలీగా పని చేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు. నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది...

14) మానస సరోవర్ ఘాట్:
ఇక్కడ కైలాసపర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది.
ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తున్నది.

15) నారద ఘాట్:
నారదుడు లింగం స్థాపించాడు.

16)చౌతస్సి ఘాట్:
ఇక్కడే స్కంధపురాణం ప్రకారం ఇక్కడ 64 యోగినిలు తపస్సు చేసినారు.
ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం... ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలిగి 64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి.

17) రానా మహల్  ఘాట్:
ఇక్కడే పూర్వం బ్రహ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు.

18)అహిల్యా బాయి ఘాట్

ఈమె కారణంగానే మనం ఈరోజు కాశీ
విశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము.

కాశీలోని గంగా నది ప్రవాహంలో                     అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి.

పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది.

కానీ  మహమ్మదీయ దండ యాత్రికులు కాశీని లక్ష్యంగా  చేసుకొని దాడులు చేసి  ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము.

విశ్వనాథ, బిందు మాధవ తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు.

నేటికీ విశ్వనాథ మందిరంలో నంది, మసీదు వైపు గల కూల్చ బడ్డ మందిరం వైపు చూస్తోంది.

అక్కడే శివుడు త్రిశూలం తో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది.

ఈరోజు మనం దర్శించే విశ్వనాథ మందిర అసలు మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యా బాయి హోల్కర్ గారు కట్టించారు

కాశీ స్మరణం మోక్షకారకం!

దానాలు - శుభ ఫలితాలు

ప్రస్తుత జన్మలో మనం చేసిన దానమే వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగ పడుతుంది.. అనే మాటలు మనం వింటూ ఉంటాము. పురాణాలు కూడా దానం చేయడం వలన సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని చెబుతున్నాయి. ఈ కారణంగానే దైవ దర్శనం పూర్తి చేసుకున్న తరువాత చాలా మంది, నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని మాత్రమే అర్హులుగా భావించి తమకి తోచిన విధంగా దానధర్మాలు చేస్తుంటారు. 

నవగ్రహ పూజ - దానాలు, ఫలితాలు

నవగ్రహ శాంతికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చేసేవారు గ్రహ శాంతికి దోష నివారణకు దానాలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన వారకి దోష నివారణ జరిగి జీవితాన సకల శుభాలు కలుగుతాయి. కోరిన కోర్కెలు నెరవేరుతాయి. సూర్య గ్రహ పూజ చేసేవారు గోధుమలను దానము చేయాలి. చేతికి కెంపు ఉంగరాన్ని ధరించటం వల్ల రోగాదులు, మానసిక బాధలు తొలగి మనశ్శాంతి కలుగుతుంది.

గురుగ్రహ పూజను నిర్వహించేవారు శనగలను దానము చేయాలి. చంద్రుని పూజకు బియ్యాన్ని దానం చేస్తే సరిపోతుంది. ఇక కుజ గ్రహ పూజలో కందులను దానం చేయాలి. పగడపు ఉంగరాన్ని ధరించటం వల్ల రుణ విముక్తి కలిగి శత్రు సమస్య నశిస్తుంది. బుధ గ్రహ పూజలో పెసలను దానం చేయాలి. శుక్రుని పూజలో అలచందల దానము చేయాలి. రాహు పూజకు మినుములను దానం చేయాలి. కేతువు పూజలో ఉలవల దానం చేయాలి. శని పూజలో నువ్వులను దానం చేయాలి.

దానాల్లో పలు రకాలు:

చతుర్విద దానాలు
చతుర్విద దానాలు చేసిన వారికి పూర్వ జన్మ పాపాలు నశించి, ఈ జన్మలోనే సుఖిస్తారు.
చతుర్విద దానాలు నాలుగు. అవి..
1. మరణ భయంతో భీతిల్లే వారికి ప్రాణ అభయం ఇవ్వడం
2. వివిధ వ్యాధులతో నరక యాతన పడే రోగులకు వైద్యం చేయడం
3. పేదవారికి ఉచిత విద్యను అందించడం
4. క్షుద్భాదతో అల్లాడే వానికి అన్నదానం చేయడం

దశ దానాలు
పేదవానికి మీ శక్తి కొలది చేసే ద్రవ్యసహాయము కానీ, వస్తు సహాయమును కానీ..‘ధర్మం’ అంటారు. ఇలా ‘ధర్మం’ చేయడం వల్ల వచ్చినపుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది.
మంత్రపూర్వకంగా ఓసద్బ్రాహ్మణునకు చేసినదానఫలం, పరలోక సుఖాలను అందించడమే కాకుండా, ఉత్తమ జన్మ సంప్రాప్తించడానికి ఉపయోగపడుతుంది. ‘ధర్మం’ చేయడానికి పరిధులు లేవు. నీకు తోచినది ఏదైనా ధర్మం చేయవచ్చు. కానీ, ‘దానం’ చేయడానికి కొన్ని పరిధులు ఉన్నాయి. ఏదిపడితే అది దానం చేయడానికి వీలులేదు. శాస్త్రనియమానుసారం దాన యోగ్యమైనవి కొన్నే ఉన్నాయి. వాటిని మాత్రమే దానం చేయాలి. వాటినే ‘దశ దానాలు’ అంటారు.

ఇవి మొత్తం 10 దానాలు
దూడతో కూడుకున్న ఆవు, భూమి, నువ్వులు, బంగారము, ఆవు నెయ్యి, వస్త్రములు, ధాన్యము, బెల్లము, వెండి, ఉప్పు...ఈ పదింటిని దశ దానములుగా శాస్త్రం నిర్ణయించింది. వీటినే మంత్రపూర్వకంగా దానం చేయాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. ఏయే దానం వల్ల ఏయే ఫలం సిద్ధిస్తుందో తెలుసుకుందాం.

గోదానం
గోవు అంగములందు పదునాలుగులోకాలు ఉన్నాయి. బాగా పాలు ఇచ్చేది, మంచి వయసులో ఉన్నది, దూడతో కూడుకున్నది అయిన ఆవును బంగారు కొమ్ములు, వెండి డెక్కలు, కంచు మూపురము, రాగి తోక, నూతన వస్త్రములతో అలంకరించి, ఆ ఆవుతో పాటు పాలు పితుక్కునే పాత్రను ఇస్తూ, ఫల, దక్షిణ, తాంబూలములతో యథావథిగి దానం చేయాలి. గోవుకు కనీసం 6 నెలల గ్రాసాన్ని కూడా ఇవ్వాలి. ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంప్రీతుడై, దాతకు స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తాడు.

భూదానం
కృతయుగంలో హిరణ్యాక్షుని కారణంగా శూన్యంలోకి దొర్లిపోతుంటే.. శ్రీహరి వరాహావతారం ధరించి, ఆ భూమిని తన దంష్ట్రాగ్రంపై నిలిపి ఉద్ధరించాడు. సుక్షేత్రం, సమస్త సస్యసమృద్ధం అయిన భూమిని దానం చేయడం వల్ల అనంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ దానంతో శంకరుడు సంప్రీతుడై, దాతకు శివలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

తిలదానం
తిలలు అంటే నువ్వులు.శ్రీమహావిష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం చేయడం వల్ల సమస్త పాపములు నశిస్తాయి. ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంప్రీతుడై, దాతకు విష్ణులోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

హిరణ్య (బంగారం) దానం
హిరణ్యం అంటే బంగారం. బ్రహ్మదేవుని గర్భం నుంచి పుట్టిన బంగారాన్ని దానం చేయడం వల్ల, దాత సమస్త కర్మల నుంచి విముక్తుడు అవుతాడు. ఈ దానంతో అగ్నిదేవుడు సంప్రీతుడై, దాతకు అగ్నిలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

ఆజ్య(నెయ్యి) దానం
ఆజ్యము అంటే ఆవు నెయ్యి. ఈ నెయ్యి కామధేనువు పాల నుంచి ఉద్భవించింది. ఈ నెయ్యినే యఙ్ఞ, యాగాదులందు సకల దేవతలకు ఆహారంగా హవిస్సు రూపంలో సమర్పిస్తారు. అలాంటి ఆజ్యాన్ని దానం చేయడం వల్ల సకల యఙ్ఞఫలం లభిస్తుంది. ఈ దానంతో మహేంద్రుడు సంప్రీతుడై, దాతకు ఇంద్రలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

వస్త్రదానం
చలి నుంచి శరీరానికి రక్షణ కలిగించే వస్త్రం.. కేవలం అలంకారినికే కాకుండా, మాననాన్ని కూడా కాపాడుతుంది. అట్టి వస్త్రాలను దానం చేయడం వలన, సర్వ దేవతలు సంతోషించి, సకల శుభాలు కలుగాలని దాతను దీవిస్తారు.

ధాన్యదానం
జీవి ఆకలిని తీర్చేది ఈ ధాన్యం. జీవి ఉత్పత్తికి ఈ ధాన్యమే కారణం. అట్టి ధాన్యాన్ని ఓ బండెడు దానం చేయుట వల్ల, సకల దిక్పాలకులు సంతృప్తి చెంది, దాతకు ఇహలోకమందు సకలసౌఖ్యం అనుగ్రహించి, పరమందు దిక్పాలక

లోక ప్రాప్తిని అనుగ్రహిస్తారు.

గుడ(బెల్లం)దానం
రుచులలో మధురమైనది బెల్లం. ఈ బెల్లం చెరుకురసం నుంచి పుట్టింది. ఈ బెల్లం అంటే వినాయకునకు, శ్రీమహాలక్ష్మీదేవికి ఇష్టం. ఈ దానంతో లక్ష్మీ, గణపతులు సంప్రీతులై, దాతకు అఖండ విజయాలను, అనంత సంపదలను అనుగ్రహిస్తారు.

రజత(వెండి)దానం
అగ్నిదేవుని కన్నీటి నుంచి ఉత్పన్నమైనది ఈ వెండి. ఈ దానంతో శివ, కేశవులు, పితృదేవతలు సంప్రీతులై, దాతకు సర్వ సంపదలను, వంశాభివృద్ధిని అనుగ్రహిస్తారు.

లవణ(ఉప్పు)దానం
రుచులలో ఉత్తమమైనది ఉప్పు. ఈ దానంతో మృత్యుదేవత సంప్రీతుడై, దాతకు ఆయుర్దాయమును, బలాన్ని,ఆనందాన్ని అనుగ్రహిస్తాడు.

ఇవి దశ దానాలు. ఈ దానాలను గ్రహణ సమయాల్లో, పర్వదినాల్లో, సంక్రమణాల్లో చేస్తే దాని ఫలం పదింతలు అవుతుంది. ఈ దానాలనుభక్తి, శ్రద్ధలతో చేయాలిగాని, దానగ్రహీతకు ఏదో ఉపకారం చేస్తున్నామనే భావనతో చేయరాదు.

షోడశ దానాలు  - ఫలితాలు

1. కన్యా దానం - దీనివల్ల బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది.
2. సువర్ణ దానం - దీనివల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.
3. దాసీజనం దానం - దీనివల్ల ఇంద్రలోక ప్రాప్తి కలుగుతుంది.
4. వాహన దానం - దీనివల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.
5. అశ్వ దానం - దీనివల్ల గంధర్వలోక ప్రాప్తి కలుగుతుంది.
6. గజ (ఏనుగు) దానం - దీనివల్ల శివలోక ప్రాప్తి కలుగుతుంది.
7. గ్రుహ దానం - దీనివల్ల విష్ణులోకం ప్రాప్తి కలుగుతుంది.
8. నాగలి దానం - దీనివల్ల క్రుష్ణ ప్రీతి కలుగుతుంది.
9. కాలపురుష దానం - దీనివల్ల కోరికల సిద్ధి కలుగుతుంది.
10. కాలచక్ర ప్రతిమ - దీనివల్ల ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది.
11. భూ దానం - దీనివల్ల శివలోకం నివాసం కలుగుతుంది.
12. మేక దానం - దీనివల్ల శివ ప్రీతి కలుగుతుంది.
13. వృషభ దానం - దీనివల్ల మృత్యుంజయం కలుగుతుంది.
14. పాన్పు దానం - దీనివల్ల గోలోక ప్రాప్తి కలుగుతుంది.
15. గో దానం - దీనివల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.
16. నువ్వురాశి దానం - దీనివల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.

Friday, March 8, 2019

వివేకచూడామణి

1. వివేకచూడామణి
(శంకరాచార్యులవారి) 
పరిచయము

శ్రీ శంకరాచార్యులవారు వివేకచూడామణి అనే అత్యంత ప్రాచుర్యము పొందిన ఆధ్యాత్మిక గ్రంధ రాజము, అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదిస్తూ 580 సంస్కృత శ్లోకాలతో వ్రాయగా దానిని స్వామి మాధవానందుల వారు ఆంగ్లములోకి అనువాదము చేసియున్నారు.
దానిని పరిశీలించి అందులోని అద్వైత తత్వాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని పొందే విధానమును తెలుగు భాషలోకి నా యొక్క స్వేచ్ఛానువాదము ద్వారా తెలియజేయు నా ప్రయత్నము సాహసమే అవుతుంది. అయినను వ్రాయాలనిపించి నాదైన సులభ శైలిలో వ్రాసినాను. నా యొక్క ఇతర పుస్తకములవలె దీనిని కూడా ఆదరిస్తారని తలచెదను.
వివేకచూడామణి అనగా సత్యాసత్యములను, మంచి చెడులను విడదీసి తెలుసుకొనుటలో ఈ గ్రంధము మణిశిఖ వంటిదని అర్థము.

2. మానవ జన్మ

1. మొదటి శ్లోకములో శ్రీ శంకరాచార్యులవారు ''గురువే ప్రత్యక్ష దైవ'' మన్నట్లు తన గురువైన గోవిందా చార్యుల వారిని దైవముగా స్తుతించినారు.

2. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమమైనది. మానవులలో పురుషజన్మ ఉన్నతమైనది. అందులోనూ వైదిక మతములో బ్రహ్మ జ్ఞానము గొప్పది. బ్రహ్మ జ్ఞానము ద్వారా ఆత్మ అనాత్మల భేదమును గ్రహించుట, బ్రహ్మమును తెలుసుకొనుట అరుదైన విషయము. అట్లాంటి మానవుడు ముక్తిని పొందాలంటే 100 కోట్ల జన్మలు ఎత్తవలసి ఉంటుంది.

3. భగవంతుని కృపతో మానవునిగా జన్మించుట, జన్మ పరంపర నుండి విముక్తికై కృషి చేయుట మరియు అందుకు సద్గురువు యొక్క రక్షణ అను మూడు ముఖ్య విషయములు అవసరము.

4. పురుషునిగా లభించిన మానవ జన్మ ద్వారా వేదవిజ్ఞానమును పొందిన మనిషి జన్మ రాహిత్యానికి కృషి చేయకుండా, ఆత్మహత్య సదృశమైన లౌకికానందములో చిక్కుకొనుట అనుచితము.

5. మనిషి తనకు లభించిన పురుష మానవ జన్మను జన్మ పరంపర నుండి విముక్తికై కృషి చేయకుండుట ఎంత తెలివి తక్కువ తనము.

6. జీవాత్మ పరమాత్మ ఒక్కటే అను సత్యాన్ని గ్రహించకుండా ప్రపంచమున్నంత కాలము 432 మిలియన్ల సంవత్సరములు యగ్నయాగాదులు చేసి, దేవతలను తృప్తి పరచినను జన్మ రాహిత్య స్థితి లభించదు.

 7. సంపదలు, వేదాల పఠనము, యగ్నయాగాదులు మొదలగు వాటి వలన పరమాత్మను పొందలేము. జన్మ రాహిత్యము లభించదు.

8. అందువలన మానవుడు జన్మ రాహిత్య స్థితికై కృషి చేయవలెను. జ్ఞానియై మనిషి భౌతిక వస్తు సముదాయము వలన పొందే లౌకిక సుఖాలకై ప్రాకులాడకుండా తన మనస్సును సత్యమువైపు మరల్చవలెను.

9. వ్యక్తి జ్ఞానేంద్రియాలపై అదుపును పొంది భౌతిక వస్తు సుఖాలకు అతీతుడై యోగారూఢ స్థితిని పొందినపుడు పుట్టుక, చావు; మంచి, చెడు అను స్థితులను అధిగమించి విచక్షణతో కూడిన జీవితాన్ని పొందగలడు.

10. జ్ఞాని అయిన విద్యావంతుడు ఆత్మను పొందే మార్గమును ఎన్నుకొని మంచి, చెడులకు అతీతుడై భౌతిక బంధనాలైన పుట్టుక, చావుల నుండి విముక్తిని పొందుటకై సాధన చేయవలెను.

11. యజ్ఞ, యాగాల వలన మనస్సు స్వచ్ఛమవుతుంది. కాని సత్యాన్ని తెలుసుకొనలేము. కేవలము నిత్యానిత్య వివేకము ద్వారానే పరమాత్మను పొందగలము. కర్మలు 10 లక్షలు చేసినను సత్యాన్ని గ్రహించలేము.

12. తాడును చూసి పామని భ్రమించి భయభీతులు చెందువాడు మనస్సులో తగినట్లు విచారణ చేసిన అది పాము కాదు తాడని గ్రహించగలడు.

13. సత్యాసత్య జ్ఞానాన్ని పొందిన జ్ఞానులతో సంభాషణ ద్వారా మాత్రమే సత్యము అవగతమగును. ఇతరత్రా నదీ జలాలలో స్నానాలు, దేవతలకు పూజలు, సమర్పణలు మరియు ప్రాణాయామము ద్వారా ప్రాణ శక్తిని అదుపుచేసినను సత్యము అవగతము కాదు.

14. శాస్త్ర పరిజ్ఞానముతో సత్యాసత్య వివేకము పొంది, శాస్త్ర చర్చలలో ప్రశ్నించుట, వాదనలలో ప్రావీణ్యం పొందిన వాడే విజయాన్ని పొందగలడు. సమయము, ప్రదేశము మరియు ఇతరత్రా ఏవైన, కేవలము అందుకు సహాయకారులు మాత్రమే.

🍃 3. సాధకుడు🍃

15. సాధకుడు ఆత్మ జ్ఞానము పొంది, వివేకముతో దయాసముద్రుడు, బ్రహ్మజ్ఞానమును పొందిన సద్గురువును ఆశ్రయించవలెను.

16. ఆత్మ జ్ఞానము పొందాలంటే సాధకుడు 14వ శ్లోకములో చెప్పినట్లు శాస్త్ర పరిజ్ఞానము పొంది, శాస్త్ర చర్చలలో విస్తారముగా పాల్గొనగల్గి ఉండవలెను.

17. ఏ వ్యక్తి సత్యాసత్య జ్ఞానమును పొంది అనిత్య స్థితులకు అతీతముగా మనస్సును మళ్ళించి ప్రశాంతతను పొంది, సత్వగుణ ప్రధానుడై జన్మ రాహిత్య స్థితికై ఆపేక్ష గల్గినవాడే బ్రహ్మన్ని గూర్చి తెలుసుకొనగలడు.

18. ఈ బ్రహ్మ జ్ఞానాన్ని పొందుటకు యోగులు నాల్గు విధములైన మార్గములను ప్రతిపాదించిరి. అలా కానిచో విజయమును సాధించలేరు.

19. మొదటిది సత్యాసత్యాలకు మధ్య తేడాను తెలుసుకొనుట. రెండవది తన కర్మల ద్వారా తాను పొందు ప్రతి ఫలముల ఎడ తిరస్కార భావము. మూడవది ప్రశాంతత, విశ్రాంతి. నాల్గవది విముక్తి ఎడల తీవ్ర ఆకాంక్ష.

20. మానసికంగా దృఢ నిశ్చయంతో బ్రహ్మము యొక్క సత్యాన్ని, ప్రపంచము యొక్క అసత్యాన్ని గూర్చిన నిర్ణయము. అందుకు సత్యాసత్యములను గ్రహించుటలో విచక్షణా శక్తి కల్గి యుండవలెను.

21. ప్రతి క్షణానికి మార్పు చెందే ప్రాపంచిక సుఖ దుఃఖాలకు దూరంగా వైరాగ్య భావముతో కోరికలను త్యజించి బ్రహ్మ జ్ఞానాన్ని పొందుటకు తగిన సాధన కొనసాగించాలి.

22. విశ్రాంతితో కూడిన మనస్సు తన లక్ష్యమైన బ్రహ్మమును పొందుటకు, ప్రాపంచిక విషయ సంబందముల నుండి విడివడుటకు, వాటిలోని తప్పులను గమనించుటకు సమత్వ స్థితితో కూడిన నిశ్చలత్వమును పొందును.

23. రెండు విధములైన జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియమును వస్తు సముదాయముల నుండి మరల్చుట దమ మనియూ లేక ఆత్మ నిగ్రహమనియు చెప్పబడినది. అలానే ఉపరతి ద్వారా మనస్సును బాహ్య వస్తువుల ఎడ ఆకర్షణ నుండి ఉపసంహరించు కొనవలెను.

24. తితిక్ష లేక విముక్తి ద్వారా అన్ని విధములైన ప్రేమలు, ఆపేక్షలు తొలగించుకొని దుఃఖము, ఆదుర్దాల నుండి విముక్తి పొందాలి.

25. యోగులచే చెప్పబడిన నమ్మకము లేక శ్రద్ద అను విధానము ద్వారా, గురుదేవుల నిర్ణయములు, శాస్త్రములు యదార్ధములని దృఢమైన నమ్మకము కలిగి ఉండాలి.

26. సత్యము ఎడల కేవలము కుతూహలము, ఆలోచన మాత్రమే కాక స్థిరమైన ఆధ్యాత్మిక దృష్టితో బ్రహ్మ జ్ఞానము ఎడల ఏకాగ్రత కల్గియుండుటను సమాధానము లేక స్వయం స్థిరత్వమని చెప్పుట జరిగింది.

27. అజ్ఞానముతో కూడిన బంధనాల నుండి విముక్తిని పొందుట, కోరికల నుండి విడివడుట ద్వారా అహంకారమును తొలగించు కొనుటనే ముముక్షుత్వమని చెప్పబడింది.

28. బద్దకము, పాలుమాలికను వదలి గురువు యొక్క దయతో స్వేచ్ఛను పొంది వైరాగ్యముతో సమత్వ స్థితిని, శాంతిని పొందుట చేయాలి.

29. ఈ విషయములలో ముఖ్యముగా లౌకిక విషయాలకు అతీతముగా ఉంటూ స్వేచ్ఛ కొరకు ప్రాకులాడుచూ, ఉన్నతమైన శాంతిని పొందుతూ ఇతర సాధనలు చేయుట నిజమైన ఫలితాలను ఇస్తుంది.

30. ఎడారిలోని నీటిలాగ కేవలము ప్రాపంచిక విషయాలకు దూరముగా ఉంటూ స్వేచ్ఛ కొరకు ప్రశాంతత కొరకు చేయు సామాన్య ఫలితములన్నియూ నిష్ఫలము.

31. జన్మ రాహిత్యానికి, భక్తికి చేయు ప్రయత్నాలు అత్యున్నత స్థానమును ఆక్రమిస్తాయి. భక్తి అనేది ద్వైత సిద్దాంతము ప్రకారము ఒక దివ్యాత్మ మీద ప్రేమను వ్యక్తము చేస్తున్నప్పటికి, అద్వైత సిద్ధాంతము ప్రకారము పరమాత్మ ఒక్కడే. పూజింపదగినవాడు. ఈ రెండు వేరుగా చెప్పబడినప్పటికి, పరమాత్మ అంశయైన దివ్యాత్మకు, పరమాత్మకు ఎక్కువ భేదము లేదని, అవి దాదాపు సమానమని చెప్పవచ్చు.

32. కొన్ని ఇతర సిద్ధాంతముల వారు స్వయం ఆత్మయే నిజమైన సత్యమని చెప్పు చుండిరి. నిజానికి మనమే స్వయం ఆత్మలమైనప్పటికి ఆజ్ఞానము వలన మన ఆత్మను మనము తెలుసుకొనలేకున్నాము. అందువలన మనము నిజమైన ఆత్మ తత్వమును గ్రహించుటకు బంధనాల నుండి, అజ్ఞానము నుండి విముక్తి పొందుటకు ఆత్మ జ్ఞానము పొందిన గురువును ఆశ్రయించాలి.

33. మనం ఎంచుకొనే గురువు వేద జ్ఞానము కలిగి, తనకు తాను బ్రహ్మములో సదా చరించువాడై, కోరికలను త్యజించినవాడై, పరిశుద్దుడై, భౌతిక ప్రపంచము యొక్క కర్మల నుండి విడివడినవాడై ఉండవలెను. మరియు ప్రశాంత చిత్తుడై కోరికలను దగ్దము చేసినవాడై, దయా సముద్రుడై ఉండవలెను. అందరిని ప్రేమించువాడై ఉండవలెను.

34. అట్టి గురువును భక్తితో పూజింపవలెను, సేవించవలెను. వినయ విధేయతలతో తన సందేహములకు సమాధానము పొందవలెను.

35. హే ప్రభూ! దయాసాగరా! నిన్ను నమ్మినవారిని బ్రోచే నీకివే నా వందనములు. నన్ను రక్షింపుము చావు పుట్టుకలతో కూడిన సంసార బంధనముల నుండి విముక్తి కలిగించుము. మీ దయా దృష్టిని నాపై ప్రసరింపజేసి నీ యొక్క కరుణామృతమును నాపై కురిపించుము.

36. ప్రపంచములోని సంసారమనే మహారణ్యములో, దావాలనములో చిక్కుకొని మరణించే చావు నుండి మమ్ములను రక్షించుము ప్రభూ! మేము గత జన్మలలో చేసిన పాపకర్మల వలన, ఇప్పుడు మేము అనుభవించుచున్న భయంకరమైన తుఫాను గాలులవంటి సంసార బాధల నుండి విముక్తి పొందుటకై మాకు మీరే దిక్కు ప్రభూ!

37. కొన్ని ఉన్నతమైన ఆత్మలు ప్రశాంత స్థితిలో ఔన్నత్యము సాధించి తాము ఇతరుల ఉన్నతికి, వసంత ఋతువులో ప్రకృతి ప్రతిస్పందించినట్లు, వారు తాము భయంకరమైన పుట్టుక, చావుల నుండి విముక్తి చెంది, ఇతరుల ఉద్దరణ కొరకు నిస్వార్ధముగా తోడ్పడుచుండురు.

38. ఉన్నత స్థితిని పొందిన జ్ఞానులు తమ స్వభావాన్ని అనుసరించి స్వార్ధ రహితులై ఇతరుల కష్టాలను తొలగించుటకు కృషిని చేయుచుందురు. ఉదాహరణకు చంద్రుడు ఎవరు కోరకుండానే భూమి యొక్క ఉన్నతికి సూర్యకిరణాలను మళ్ళించి తన చల్లని కిరణాలతో ప్రకృతికి తోడ్పడుట జరుగుచున్నది.

39. ఓ ప్రభూ! మీ యొక్క అమృత వాక్కుల ద్వారా మాలో బ్రహ్మ జ్ఞానము యొక్క మాధుర్యమును నింపి, చల్లని మీ యొక్క వాక్కు అనే అమృత భాండము నుండి అమృతమును కురిపించి, మా చెవులకు వీనులవిందును కలిగించిన, మా యొక్క ప్రాపంచిక విషయ వాంఛలు అడవిలోని దావాలనమువలె దగ్దమవుతాయి. చల్లని నీ దయా దృష్టిని మాపై ప్రసరింప జేయవలసినదిగా కోరుచున్నాము.

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...