Thursday, June 21, 2018

ప్రశ్నలకు సమాధానాలు

1 తొలిసారి సృష్టించబడిన మానవునికి కర్మ లేనిదే జన్మ ఎలా వచ్చింది?
2 సృష్టికర్త పరమాత్మ అయితే కర్మఫలితం మనకు ఎలా సంక్రమిస్తుంది?
3 అసలు సృష్టి ఎందుకు జరిగింది?
4 విశ్వంలో నక్షత్రాలు ఏ ఉపయోగం కొరకు సృష్టించబడ్డాయి?
5 నిర్జీవంగా ఉండే గ్రహాలు , అతిదూరంగా ఉండి , మానవుల పైన శుభాశుభ ఫలితాలు ఎలా ఇవ్వగలవు?
6 పదార్థమందుగల శక్తి ఏ కారణం చేత ఏర్పడింది?
7 మనం చేసిన పనులే , శుభాశుభ ఫలితాలకు కారణం అయితే , మధ్యలో నవగ్రహాల అవసరం ఏముంది?
8 భూకంపం, సునామీ, అంటువ్యాధులు, మొ .... వాటి వల్ల లక్షల ప్రజల మరణానికి వారి వారి కర్మ ఫలితం , ఏకకాలంలో మరణానికి కారణమా? లేదా ప్రకృతి కారణమా?
9 space vortex theory కి , ముందు శూన్యం ఎలా ఏర్పడింది?
10 సృష్టికర్త ఉంటే , ఆ సృష్టికర్తను ఎవరు సృష్టించారు?
11 కారణం లేని కార్యం ఒక్కటైనా ఉందా?
*****************************************************
1. జ్ఞానము వలన
2. సృష్టిగా ... సృష్టికి సాక్షిగా ఉన్నది బ్రహ్మము ... పరమాత్మ కాదు
3. కారణము లేదు
4. జడ సృష్టి కి ఉపయోగ , అనుపయోగ అనే ద్వంద్వములు వర్తించవు
5. శుభాశుభములు దృష్టిననుసరించి ... వివేకముననుసరించి దృష్టి ... గ్రహములన్నీ ఈశ్వర నియతికి లోబడి ఉన్నవి ... ఈశ్వరత్వమును అన్నిటా చూచి ఆరాధించి శరణాగతిని, నిష్కామ కర్మను అభ్యసింపచేయుటకే జ్యోతిష విజ్ఞానము
6. చలన శీలత కల పరమాణువులను త్రిప్పుచున్న చైతన్యము వ్యాపకముగా దేశము, కాలము, కలన అను కారణములచే ఏర్పడుచున్నది
7. కర్మ ఫలప్రదాత ఈశ్వరుడు. అనగా అష్టమూర్తి తత్వము. పంచభూతములు, మనసు, బుద్ధి, అహంకారము అను 8 రీతుల మాయాశక్తి అనుపేర వ్యవహారము జరుగుచున్నది పిండాండమందు. బ్రహ్మాండమందు నవగ్రహములు, అధిష్ఠానములు, పంచ తన్మాత్రలు సమిష్టి సూక్ష్మ, కారణములుగా వ్యవహారము జరుపబడుచున్నది. రజోగుణధర్మముచే ఈ రెండు వ్యవహారములు కామ్యకకర్మయందు సమన్వయమై ఉచితఫలమగును.
8. రజోగుణధర్మము కర్మబంధమునకు కారణము. వ్యష్టి, సమిష్టి భేదములు తాపత్రయములు. రజోగుణ తీవ్రతచే తమోగుణము తీవ్రమై ఆధిదైవిక తాపమును సమిష్టి సూక్ష్మమున ప్రేరితమై ప్రకృతి శక్తుల విజృంభణమై వైపరీత్యాలుగా కనబడును . అందు సృష్టి ఎంత సహజమో లయము అంతే సహజము.
9. ద్విశూన్యముల మధ్య విశ్వ వ్యాపనమగుచున్నదని విశ్వాంతరాళ పరిశోధన worm holes theory ప్రతిపాదన చేయుచున్నది.
10. సృష్టి స్వకీయము , పరకీయము అని ద్వివిధంబులు. అనంత విశ్వ సృష్టి స్వకీయము. స్థావర జంగమ సృష్టి పరకీయము.
11. అనాది అయినవన్నీ కారణము లేనివే

No comments:

Post a Comment

పరమ శివుని స్వరూపం - శ్రీ దక్షిణామూర్తి

విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషుల...