Monday, June 18, 2018

తెలుసుకోవాల్సిన సదాచారాలు ..


  • ఒక్కసారి శివ నింద చేసిన శరీరం ఏ భగవంతుని సేవ కి పనికిరాదు. ఎన్నో నీచ జన్మలు ఎత్తుతారని శివ పురాణము చెబుతోంది.
  • శివ కేశవుల బేధం చూపించిన వారు ఘోర నరకాలు పాలువతారు అని శ్రీ మహావిష్ణువు గరుడ పురాణం లో చెప్పారు.
  • గుడిలో ప్రసాదం ఇస్తే కొద్దిగా అయినా తినాలి.  ఏకాదశి నియమం ఉన్నా ఒక్క మెతుకు అయినా తినాలి అని పద్మపురాణము  చెబుతోంది. ఎట్టి పరిస్తులలో ప్రసాదాన్ని తిరస్కరించరాదు.
  • శివాలయం లో ఇచ్చిన నిర్మాల్యం(పూలు, బిల్వ దళం మొ౹౹) నందీశ్వరుని దగ్గర పెట్టాలి.
  • భగవంతుని నిర్మాల్యాన్ని (పూల దండలు, తులసి మాలలు మొ౹౹)   ఇంట్లో గుమ్మానికి లేదా వాహనాలకు కట్టడం చేయకూడదు . ఒకసారి ఇంద్రుడు ఇలా దుర్వాసుడు ఇచ్చిన పూల దండను అవమానించడం వల్లనే స్వర్గ లక్ష్మీని కోల్పోయి రాక్షసుల చేతిలో ఓడిపోయాడు.
  • నందీశ్వరునికి శివునికి మధ్యలో నడవాల్సి వస్తే  నందిని తాకి వెళ్ళవచ్చు .
  • తీర్థము తీసుకొనేప్పుడు కింద పడకుండా, శబ్దం రాకుండా తాగాలి. తీసుకున్నాక చేయిని కడగాలి.తలకి రాసుకోరాదు.
  • తండ్రి శరీరం విడిస్తే ఒక ఏడాది,  తల్లి  అయితే 6 నెలలు వారి పిల్లలు సూతకం పాటించాలి 
    • 11 రోజుల  శుద్ధి తర్వాత దేవాలయం లో ఒకరోజు నిదురిస్తే చాలా మంచిదని " గరుడ పురాణం ' చెబుతోంది 
    • ఈ ఏడాది (విలంబి  నామ సంవత్సరం ) ఎక్కువగ పుణ్యక్షేత్ర దర్శనం చేయడం వల్ల చనిపోయిన వారికి  ఉత్తమ గతులు వస్తాయి. 
    • 11 రోజుల తరువాత ఇంట్లో నిత్య పూజ, దీపారాధన యధావిధి గా చేయచ్చు.
    • ప్రత్యేక పూజలు, యజ్ఞములు, దేవతా కల్యాణములు, అభిషేకాలు  చేయరాదు.  
    • యేటి సూతకం కేవలం చనిపొయిన వారి పిల్లలకి మాత్రమే వర్తిస్తుంది. వారి మనవళ్ళకి 11 రోజులతో సుద్ధి అవుతుంది.  
    • పురోహితులకి, అర్చకులకు ఏటి సూతకం ఉండదు. కేవలం మొదటి మాసం మాత్రమే ఉంటుంది
(సంగ్రహం -- శ్రీ  సంపూర్ణ హనుమద్వైభవం)
  • బదరీ వృక్షాలు ఎక్కువగా ఉండడం వల్ల బదరికా వనం అయింది. అక్కడ నర నారాయణ లు శివునికోసం తపస్సు చేశారు.
  •  రేగు ఆకులతో శివ పూజ లేదా రేగు చెట్టు దగ్గర చేసే జప తపాలు శీఘ్రము ఫలితాన్ని ఇస్తాయి.
  • ముఖ్యంగా పర్వ దినాలలో 11  రేగు ఆకులతో లింగ అర్చన చేస్తే శివ అనుగ్రహం కలిగి దారిద్ర్యం తొలుగుతుంది.
(సంగ్రహం -- శ్రీ  సంపూర్ణ హనుమద్వైభవం)

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...