Saturday, September 30, 2017

Dasha Hara in Sanskrit

Dasha Hara in Sanskrit means removal of ten bad qualities within us:

Ahankara (Ego)
Amanavta (Cruelty)
Anyaaya (Injustice)
Kama vasana (Lust)
Krodha (Anger)
Lobha (Greed)
Mada (Over Pride)
Matsara (Jealousy)
Moha (Attachment)
Swartha (Selfishness)

Hence, also known as 'Vijaydashami' signifying ”Vijaya” over these ten bad qualities.

Monday, September 18, 2017

🌻శరన్నవరాత్రి ఉత్సవముల వివరములు🌻

21-9-2017 : శైలపుత్రీ (స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి)- నీలం రంగు - ఉప్పు పొంగలి

22-9-2017 : బ్రహ్మ చారిణి (బాలా త్రిపుర సుందరి) - పసుపు రంగు – పులిహోర

23-9-2017 : చంద్రఘంట (గాయత్రి) – లేత ఎరుపు రంగు - కొబ్బరి అన్నం

24-9-2017 : కూష్మాండ (అన్నపూర్ణ) -ఆకాశం రంగు - అల్లం గారెలు

25-9-2017 : స్కందమాత (లలిత – పంచమి ప్రథానంగా ఉండాలి) - కనకాంబరం రంగు -పెరుగన్నం

26-9-2017 : కాత్యాయని  (మహాలక్ష్మి) -ముదురు ఎరుపు రంగు – రవ్వకేసరి

27-9-2017 : కాళరాత్రి (సరస్వతి – మూలా నక్షత్రం ప్రథానంగా ఉండాలి) - తెలుపు రంగు –కదంబం(అన్ని రకాల కూరలతో కలిపి చేసిన అన్నం)

28-9-2017 : మహాగౌరి (దుర్గాదేవి) - ఎర్రటి ఎరుపు రంగు - మినపగారెలు

29-9-2017 : సిద్ధిధాత్రి (మహిషాసుర మర్దిని)- ఆకుపచ్చ రంగు - పరమాన్నం

30-9-2017 : విజయదుర్గ - (శ్రీ రాజరాజేశ్వరి)– కాషాయం రంగు – దధ్యోదనం, లడ్డూలు

శరన్నవరాత్రులలో కుమారి పూజ విశిష్టత

వసంత రుతువులోను, శరదృతువులోని తొమ్మిది రోజులు ఆ పరదేవతను పూజించడాన్నే నవరాత్రి (శరన్నవరాత్రి)పూజలు అంటారు. ఆశ్వీయుజమాసంలో శుక్లపక్షంలోని పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు అమ్మవారిని ఆరాధించాలి. ఈ శరన్నవరాత్రి పర్వదినాలలో కొన్ని ప్రాంతాలలో కుమారిపూజను చేస్తారు. ఈ పూజ హస్తా నక్షత్రముతో కలిసిన పాడ్యమి రోజున మొదలు పెట్టడం చాలా మంచిది అని పెద్దలు అంటారు.

కుమారిపూజ శ్రీరస్తు అని ఆరంభించాలి లేదా శ్రీమంత్రంతో కానీ బీజ మంత్రంతో కానీ మొదలుపెట్టాలి. ఈ కుమారిపూజలో రెండుసంవత్సరాల నుంచి పదిసంవత్సరాల వయస్సు ఉన్న బాలికలను పూజిస్తారు. కొత్తబట్టలు, నగలు ఇచ్చి పూజ చెయ్యాలి. అవలక్షణాలు ఉన్న బాలికలు, రోగాలతో ఉన్న బాలికలు, పది సంవత్సరాలు దాటిన బాలికలు ఈ పూజకు అనర్హులు. ఈ బాలికలకు షడ్రుచులతో భోజనం పెట్టి, వస్త్రాలతో సత్కరిస్తారు. ఒక్కొక్కరోజు ఒకొక్క వయస్సు బాలికకు పూజలు చేస్తారు.

రెండుసంవత్సరాలు ఉన్న బాలికను కుమారి అంటారు. కుమారిగా భావించి పూజించడం వల్ల దారిద్ర్యదుఃఖాలు నశిస్తాయి. మూడుసంవత్సరాలు ఉన్నబాలికను త్రిమూర్తి అని అంటారు. ఈ త్రిమూర్తిని పూజించడం వల్ల ధనధాన్య, పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. నాలుగుసంవత్సరాలు ఉన్న బాలికను కల్యాణి అని అంటారు. కల్యాణిని పూజించడం వల్ల రాజ్యాభివృద్ధి, విద్యాభివృద్ధి చేకూరుతుంది. ఐదుసంవత్సరాలు ఉన్న బాలికను రోహిణి అని అంటారు. రోహిణిని పూజించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. ఆరుసంవత్సరాలు ఉన్న బాలికను కాళిక అని అంటారు, కాళికను పూజించడం వల్ల శత్రునాశనం జరుగుతుంది.

ఏడుసంవత్సరాల బాలికను చండిక అని అంటారు. చండికను పూజించడం వల్ల ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. ఎనిమిదిసంవత్సరాల బాలికను శాంభవి అని అంటారు. శాంభవిని పూజను నృపసమ్మోహకం అని అంటారు. ఈ పూజ వల్ల అధికారులు మనకు అనుగుణంగా ఉంటారు. తొమ్మిదిసంవత్సరాల బాలికను దుర్గ అని అంటారు. దుర్గను పూజించడం వల్ల సర్వసుఖాలూ లభిస్తాయి.
ఈ పద్ధతిలో శ్రద్ధాభక్తులతో, శాస్త్రోక్తకంగా నవరాత్రులు పూజ చేయడం సర్వశ్రేయస్కారం, శుభదాయకం.

కన్యా పూజా లేదా కుమారి పూజ నవరాత్రి వేడుకలలో ఒక ముఖ్యమైన సంప్రదాయం. ఇది నవరాత్రి అంటే అష్టమి మరియు నవమి అతిముఖ్యమైన రోజుల సమయంలో జరుగుతుంది.

మనం ఎంతమందిని అయిన ఈ కన్యా పూజాకి ఆహ్వానించవచ్చు. సాధారణంగా 1,3,5,7,9 మంది కన్యలను ఆహ్వానించవచ్చు.
ఒక అమ్మాయికి పూజలు చేస్తే ఐశ్వర్యము అందిస్తుంది.
ఇద్దరు బాలికలుకి పూజలు చేస్తే భోగము మరియు మోక్షం అందిస్తుంది.
ముగ్గురు అమ్మాయిలకి పూజలు చేస్తే ధర్మము, అర్థము మరియు కామము అందిస్తుంది.
నలుగురు అమ్మాయిలకి పూజలు చేస్తే అధికారం అందిస్తుంది.
ఐదుగురు అమ్మాయిలకి పూజలు చేస్తే విధ్య అంటే నాలెడ్జ్ పెరుగుతుంది.
ఆరుగురు అమ్మాయిలకి పూజలు చేస్తే , 6 రకాల సిద్ధి అందిస్తుంది.
ఏడుగురు అమ్మాయిలకి పూజలు చేస్తే రాజ్యసభ అంటే శక్తి మరియు రాజ్యం సాధించడంలో సహాయపడుతుంది.
ఎనిమిది మంది అమ్మాయిలకి పూజలు చేస్తే సంపద పెంచుతుంది.
తొమ్మిది మందిఅమ్మాయిలకి పూజలు చేస్తే పృథ్వీ. యాజమాన్యం ఇస్తుంది.

Friday, September 8, 2017

చాగంటి కోటేశ్వరరావు గారి ముత్యాల "మాటలు"....

జీవితం లో నేర్చుకోవాల్సినవి కొన్ని...

 👉1. కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు, కానీ నిజాయితీపరులు కావడం ప్రతి ఒక్కరికీ సాధ్యమే. 👉2. సుత్తితో ఒక్క దెబ్బ వెయ్యగానే బండరాయి ముక్కలవదు. దెబ్బ వెనుక దెబ్బ వెయ్యాలి. ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్థించదు. ఎడతెగని ప్రయత్నం కావాలి. 👉3. ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోడాన్కిఅయినా సిద్దపడతాడు. అలాగే ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనులుచేయడానికైనా సందేహించడు మనిషి. 👉4. మనం మన ఆలోచనలకు బందీలం. ఆలోచనలను మార్చుకోనిదే దేన్ని మార్చలేం. 👉5. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు. కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మ విశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టలేకపోవచ్చు. కానీ విజయపథలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తిని ఇస్తుంది. 👉6. బలవంతుడికీ బలహీనుడికీ మధ్య జరిగే ఘర్షణలో ప్రేక్షకపాత్ర వహించడమంటే.. తటస్థంగా ఉన్నట్లు కాదు. బలవంతుడి పక్షం వహించినట్లు. 👉7. అతి నిద్ర, బద్దకం, భయం, కోపం, నిరాశావాదం- ఈ ఐదు అతి చెడ్డ గుణాలు. వీటిని పొరపాటున దగ్గరకు రానిచ్చినా జీవితంలో పైకి రావడం, సుఖపడడం జరగదు. 👉8. అహంకారము ప్రతి ఒక్కరినుంచీ – అఖరికి భగవంతుడి నుంచి కూడా దూరం చేస్తుంది. 👉9. ఉపాయాన్నిఅలోచించేటప్పుడే రాగల అపాయాన్ని కూడా అంచనా వేయాలి. 👉10. నీ తప్పును ఈరోజు కప్పిపుచ్చకలిగినా రేపటి దాని పర్యవసానాన్ని మాత్రం తప్పించుకోలేవు. 👉11. మంచివారు దూరం కావడం, చెడ్డవారు దగ్గర కావడమే దుఃఖాని కి నిదర్శనం. 👉12. బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడు. 👉13. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలవు. కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేవు. 👉14. పక్షులకు కొంత ధాన్యం, పశువులకి కొంత గ్రాసం, మనిషికి కొంత సాయం… ఇదే జీవితం. 👉15. ఉత్తమ గుణాల వల్ల మవిషి ఉన్నతుడవుతాడు కానీ ఉన్నత పదవి వల్ల కాదు… - శిఖరం మీద కూర్చొన్నంత మాత్రాన కాకి గరుడ పక్షి కాలేదు. 👉16. తలపై మోసే భారాన్ని ఇతరులు కొంత పంచుకుంటే బాధ తగ్గుతుంది. కానీ ఆకలి బాధనూ, అజ్ఞాన బాధనూ ఎవరికి వారే తగ్గించుకోవాలి. 👉17. మంచివారు దూరంకావడం, చెడ్డవారు దగ్గరకావడమే దుఃఖానికి నిదర్శనం. 👉18. మెరుగు పెట్టకుండా రత్నానికి, - కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు. 👉19. కేవలం డబ్బుంటే సరిపోదు. మంచి వ్యక్తిత్వం ఉంటనే సమాజం గౌరవిస్తుంది. 👉20. ఎవరి వయస్సుకు తగ్గంటు వారి ఆలోచనలు, ప్రవర్తన ఉంటనే ఆ వ్యక్తికి గౌరవం ఉంటుంది.

Friday, September 1, 2017

మనసు ఆందోళన మనశ్శాంతి

ఒకసారి బుధ్ధుడు తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు.
ఇంతలో ఒక శిష్యుడిని పిలిచి,
 "నాయనా, దాహంగా ఉంది, ఆ కనబడే చెరువునుంచి కొన్ని నీళ్ళు తీసుకురా" అని చెప్పాడు. అప్పుడే ఒక ఎద్దులబండి ఆ చెరువులోంచి వెళ్ళడం మూలంగా నీరు అంతా మురికిగా తయారయింది.
శిష్యుడు ఆ నీరు తేరుకొనేంతవరకు అలాగే కూర్చున్నాడు.
అరగంట సమయం గడిచింది.
 చూస్తే నీరు ఇంకా మురికిగానే ఉంది.
మరో అరగంట సమయం వేచి చూసాడు.
నీరు తేరుకున్నాయి.
ఆ పైన ఉన్న నీరు తీసుకెళ్ళి బుధ్ధుడికి ఇచ్చాడు శిష్యుడు.

అప్పుడు శిష్యుని అనుమానం
" ఈ నీరు అంత మురికిగా ఉన్నా, ఎలా తేరుకుంది? నువ్వు కాసేపు దాని మానాన దాన్ని కదపకుండా ఉంచావు. అది నెమ్మదిగా మురికి కిందకుపోయి, స్వచ్చమైన నీరు పైకి తేరుకుంది.

మన మనసు కూడా అంతే.

ఒకసారి మనసులో ఆందోళన కలిగినపుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా కొంతసేపు వదిలేయాలి.
కొంతసేపు గడిచేటప్పటికి చింత అనే మురికి అంతా అడుగుకు వెళ్ళిపోయి, మనసు స్వచ్చంగా మారుతుంది.
నీ మనసు తేలిక అవ్వడానికి నువ్వు ఏ ప్రయత్నమూ చేయవలసిన పనిలేదు.
కొంతసేపు అలా వదిలేస్తే, దానంతట అదే సద్దుమణుగుతుంది.
చక్కబడుతుంది.
మనశ్శాంతి పొందడం పెద్ద కష్టమైన పనేమీ కాదు.
మన ప్రయత్నం లేకుండానే జరిగిపోతుంది."

మీకు ఇష్టమైన వాళ్లను ఎప్పుడూ వదులుకోకండి.

వారు తప్పులు చేసారు అనుకుంటే, ఒక్క క్షణం వారితో మీరు గడిపిన అద్భుతమైన, ఆనందకరమైన క్షణాల గురించి ఒక్కసారి తలుచుకోండి.

ఎందుకంటే, పరిపక్వత కన్నా, అభిమానం ముఖ్యం.

మిమ్మల్ని మీరు కౌగలించుకోలేరు.
మిమ్మల్ని మీరు ఓదార్చుకోలేరు.
అందుకోసం ఖచ్చితంగా ఒకరి సహాయం ఉండాలి.

జీవితం అంటే ఒకరి కోసం ఒకరు బ్రతకటమే.

మీకు ఇష్టమైన వారి కోసం, మిమ్మల్ని ప్రేమించేవారికోసం బ్రతకండి. స్నేహం, ప్రేమ,
బంధుత్వాలు అనేవి డబ్బు భాష మాట్లాడేవారికి అర్థం కావు.
ఎందుకంటే కొన్ని పెట్టుబడులు మనకు కనిపించే లాభాలను ఇవ్వలేకపోవచ్చు, కాని మనలను సంపన్నుల్ని చేస్తాయి.

కుటుంబం, స్నేహితులు అలాంటి గొప్ప పెట్టుబడులు.....

గాయత్రి గురించి మహాత్ములు చెప్పినవి !!

🚩🚩🚩
వేదవ్యాస మహర్షి - గాయత్రి మంత్రమును జపించకుండా ఇతర మంత్రములను జపించుట భోజనానికి సిద్ధంగా ఉన్న భోజనాన్ని వదిలి ఆడుక్కుని తినటం లాంటిది.శతపథ బ్రాహ్మణం ఐతరేయబ్రాహ్మణం లో
' బ్రహ్మయే గాయత్రి గాయత్రియే బ్రహ్మ ' అని చెప్పబడింది.
🚩🚩🚩
విశ్వామిత్రుడు - " బంగారపు రంగులో ఉన్న సూర్యబింబము మధ్యలో గాయత్రీ మాతను ధ్యానిస్తూ మంత్రజపం చేసిన యడల శీఘ్రముగా జనన మరణాల నుండి ముక్తుడవుతాడు.
🚩🚩🚩
దేవీభాగవతము - గాయత్రీ మోక్ష విద్య తెలుపు రంగు తేజస్సుతో ప్రకాశించి బుద్ధిని పవిత్రంచేస్తుంది.' తత్ సవితుర్వరేణ్యం భర్గః '
🚩🚩🚩
కూర్మపురాణము - ముల్లోకాలకు జ్ఞానమును ప్రసాదించేసి గాయత్రీ దేవతయే ఆమెయే వేదమాత గాయత్రిని మించిన మంత్రము లేదు
🚩🚩🚩
యాజ్ఞవల్క్యుడు - ఓక త్రాసులో ఇటు వేదాలు ఆటు గాయత్రి మంత్రమును ఉంచి తూచినచో గాయత్రి మంత్రము వైపే త్రాసు మొగ్గును.
🚩🚩🚩
ఆర్షసూక్తి - 'న గాయత్ర్యాః పరం మంత్రం న మాతుః పర దైవతం'
🚩🚩🚩
భీష్మాచార్యులు - ఓ ధర్మరాజా గాయత్రీ మంత్రమును విడిచి పెట్టకుండా ఏవరు జపిస్తారో వారు దుఃఖం పోందరు
🚩🚩🚩
అత్రి మహర్షి భవిష్య పురాణం - సూర్యుని ఏదుట ఏనిమిది వేలు గాయత్రీ జపం చేసిన యడల సర్వ పాపములనుండి విముక్తుడవుతాడు
🚩🚩🚩
లఘు అత్రి సంహితా - గాయత్రీ ని జపించే వారిని మాత్రమే పితృకార్యాలకి ఆహ్వానించాలి
🚩🚩🚩
పద్మపురాణం పరాశర మహర్షి - గాయత్రిని జపించు వారి మహాపాపాలు పాపాలు ఉపపాపాలు కూడా నశిస్తాయి
🚩🚩🚩
అగ్నిపురాణం - ఏ బ్రాహ్మడు నిత్యం ఉదయం సాయం సంధ్యలలో గాయత్రీ ఉపాసన చేస్తాడో ఆతడు ఏలాంటి దానము స్వీకరించినా దోషములు కలుగవు
🚩🚩🚩
శంఖ స్మృతి - నరక నివారణకి వేదముల ఉపనిషత్తుల సారమైన గాయత్రిని మించిన మంత్రము లేదు
🚩🚩🚩
సూత సంహితా యజ్ఞవైభవ ఖండం - అన్నముతో జలముతో సమానమైన దానము అహింసతో సమానమైన తపస్సు గాయత్రిని మించిన మంత్రము లేదు
🚩🚩🚩
నారద మహర్షి - గాయత్రీ సమస్త దేవతా స్వరూపము ఆమె ఉన్న చోట శ్రీమన్నారాయణుడు నివసిస్తాడు ఇందు సందేహము లేదు
🚩🚩🚩
వశిష్ట మహర్షి - మూర్కుడు కూడా గాయత్రిని జపించిన ఉన్నత స్తితికి వెళ్ళును.వాడు దేవతలలాగా భూమిమీద ప్రకాశిస్తాడు.

🚩🚩🚩
ఆదిశంకరులు - గాయత్రి మహిమ వర్ణించ మానవ సామర్థ్యం సరిపోదు ఇదియే ఆది మంత్రంము.
👏👏👏👏
అందుకే నిత్యం ఉదయం సాయంత్రం గాయత్రీ ఉపాసన చేయటం చాలా మంచిది...
హ్రీం తత్సత్...

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...