Monday, May 29, 2017

ఈ రెండూ ఉండి తీరాలి

ఒకానొకప్పుడు చిదంబర క్షేత్రంలో ‘యచ్చదత్తనుడు’ అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు.

ఆయనకు ‘విచారశర్మ’ అనబడే కొడుకు ఉన్నాడు.

ఆ కొడుకు వేదం నేర్చు కున్నాడు.

ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు.

ఎప్పుడూ స్వరంతప్పేవాడు కాదు.

గోవులు దేవతలని నమ్మిన పిల్లవాడు.

ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తున్నాడు.

అది చూసిన ఆ పిల్లవాడి మనసు బాధపడి ‘నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను.
నీవు ఈ ఆవులను కొట్టవద్దు.
తీసుకుని వెళ్ళవద్దు’ అని చెప్పాడు.

బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు.

ఈ పిల్లవాడు వేదమంత్రము లను చదువు కుంటూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడు తుండేవాడు.

వేదంలో కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి.

ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు.

ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్ళు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచి పెట్టేస్తుండేవి.

రోజూ ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి.

ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలువిడిచి పెడుతున్నాయి కదా వట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులు విడిచిపెటన పాలతో శివాభిషేకము చేయదలచాడు.

రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదు.

అందుకే లోకమునందు సన్యసించినవారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం.

రుద్రాధ్యాయం అంత గొప్పది.

అది చదివితే పాపములు పటాపంచలు అయిపోతాయి.

అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు.

ఒకరోజున అటునుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు.

‘అయ్యో, ఈ పిల్లవాడు ఈ పాలనన్నిటిని ఇసుకలో పోసేస్తున్నాడు.

ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చునో అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు.

చెప్తే యచ్చదత్తనుడికి కోపం వచ్చింది. ‘రేపు నేను చూస్తాను’ అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసేచోట చేట్టిక్కి కూర్చున్నాడు.

పూర్వకాలం క్రూర మృగములు ఎక్కువ.
అందుకని కర్ర గొడ్డలికూడా తనతో తెచ్చుకుని చెట్టెక్కి కూర్చున్నాడు.

కాసేపయింది.

కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు.

ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి.

ఈయన సైకత లింగమును తయారు చేసి సైకత ప్రాకారము లతో శివాలయ నిర్మాణం చేశాడు.

తరువాత చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు.

ఆయన మనస్సు ఈశ్వరుని యందు లయం అయిపోయింది.

అతను పరవశించిపోతూ సైకత లింగమునకు అభిషేకం చేస్తున్నాడు.

అవును అతడు చెప్పింది నిజమే.

వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరుగెత్తు కుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లాడిని భుజముల మీద కొట్టాడు.

ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి లేదు.

అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు.

కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడి సైకత లింగమును తన్నాడు.

అది ఛిన్నాభిన్నమయింది.

అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి వచ్చింది.

తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు.

ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరొకడా అని చూడలేదు.

ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండడానికి వీలులేదని గొడ్డలి తీసి రెండు కాళ్ళు నరుక్కుపోయేటట్లు విసిరాడు.

తండ్రి రెండు కాళ్ళు తొడలవరకు తెగిపోయాయి.

క్రిందపడిపోయాడు.

నెత్తుటి ధారలు కారిపోతున్నాయి.

కొడుకు చూశాడు.

‘శివలింగమును తన్నినందుకు నీవీ ఫలితం అనుభవించ వలసిందే’ అన్నాడు.

నెత్తురు కారి తండ్రి మరణించాడు.

ఆశ్చర్యంగా అక్కడ ఛిన్నా భిన్నమయిన సైకత లింగం లోంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు.

నాయనా, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు.

అపచారం జరిగిందని తండ్రి అనికూడా చూడకుండా కాళ్ళు రెండూ నరికేశావు.

మనుష్యుడవైపుట్టి తపస్సు చేయకపోయినా వరం అడగకపోయినా నీకు వరం ఇస్తున్నాను.

ఇవాల్టి నుండి నీవు మా కుటుంబం లో అయిదవ వాడవు.

నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు.

అయిదవ స్థానం చండీశ్వరుడి దే.
నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు.

ఇకనుంచి లోకంలో వివాహం అయితే భర్త భోజనం చేసి విడిచి పెట్టిన దానిని పత్నీ భాగం అని పిలుస్తారు.

భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది.

దానిని ఎవరు బడితే వారు తినెయ్యకూడదు.

భార్య కొక్కదానికే ఆ అధికారం ఉంటుంది.

అది పత్నీభాగం.

కానీ శంకరుడు ఎంత అనుగ్రహం చేశాడో చూడండి.

పార్వతీ నేను ఈవేళ చండీ శ్వరుడికి ఒక వరం ఇచ్చే స్తున్నాను.

నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా. నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటూంటాడు. వేరొకరు తినరాదు’ అన్నాడు.

ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చుని ఉంటాడు.

చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు.

ఎప్పుడూ కళ్ళు మూసుకుని ఉంటాడు.

ఎప్పుడూ శివ ధ్యాన తత్పరుడై ఉంటాడు.

ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది.

అందుకని ఆయనకు ‘ధ్వనిశ్చండుడు’ అని పేరు.

మనలో చాలామంది తెలిసీ తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరి కాయ ఇంటికి తీసుకు వెళ్ళకూడదని గోడల మీదపెట్టి వెళ్లిపోతుంటారు.

ప్రసాద తిరస్కారం మహాదోషం.

అలా వదిలి పెట్టి వెళ్ళకూడదు.

శాస్త్ర ప్రకారం ఆయన దగ్గరకు వెళ్ళినపుడు చిన్న చిటిక మాత్రం వెయ్యాలి.

అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడు అని పేరు.

చిటిక వేస్తే ధ్యానమునందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు.

ఓహో మా స్వామిని ఆరాధించావా? ప్రసాదం తీసుకున్నావా? సరి అయితే తీసుకు వెళ్ళు’ అంటాడు.

ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణా ధికారం ఉంటుంది.

దానిని మీరు ఇంటికి తీసుకు వెళ్ళవచ్చు.

లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోయింది.

అది చండీశ్వరునికి వెళ్ళి పోతుంది.

మీకు ఇచ్చినది ప్రసాద రూపము.

దానిని మీరు గుడియందు విడిచి పెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు.

అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు గాని, ప్రసాదం కానీ అక్కడ వదిలి పెట్టేయ్యకూడదు.

నంది మీద పెట్టడం కాదు.

చండీశ్వర స్థానమునందు తప్పట్లు కొట్టకూడదు.

చిటిక చిన్నగా మాత్రమే వేయాలి.

అంత పరమ పావనమయిన స్థితికి చేరిన వాడు చండీశ్వరుడు.

ద్రవిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకు వెళ్ళరు.

చండీశ్వరుడు ఉంటాడు ఉత్సవ మూర్తులలో.

పార్వతీ పరమేశ్వరులు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుడు ఈ అయిదింటిని ఊరేగింపుగా తీసుకువెడతారు.

పరమేశ్వరుడు చండీశ్వరునికి అయిదవ స్థానం ఇచ్చారు.

ఒక్కసారి శివాలయంలోకి మనం గడపదాటి అడుగుపెడితే అటువంటి మూర్తులను దర్శనం చేసి శివలింగ దర్శనం చేసి అమ్మవారిని చూస్తాము.

మన భాగ్యమే భాగ్యం.

అందుకే శివాలయం విష్ణ్వాలయం ఈ రెండూ లేని ఊరు పూర్వం ఉండేది కాదు.

*ఈ రెండూ ఉండి తీరాలి.

Sunday, May 28, 2017

కలియుగం ఎలా ఉంటుంది ...

కలియుగం ఎలా ఉంటుంది అన్న పాండవుల ప్రశ్నకు .... కృష్ణ భగవానుని సమాధానం.

ఒకసారి ధర్మరాజు లేని సమయంలో  మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు.

శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అన్నాడు.  నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్లి ఆ బాణాలను తెమ్మన్నాడు.  నలుగురు పాండవులు తలో దిక్కుగా ఆ బాణాలను వెదుక్కుంటూ వెళ్లారు.

అర్జునుడికి బాణం దొరికింది.   ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు.  ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతికున్న ఒక కుందేలును పొడచుకు తింటోంది. అర్జునుడు నివ్వెర పోయాడు. తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలు దేరాడు.

భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లున్న  నాలుగు బావుల మధ్య ఒక ఎండి పోయిన బావి కనిపించింది. ఆశ్చర్య పోయాడు.  కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు.

నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగ దూడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది. చుట్టూ వున్న జనం అతి కష్టమ్మీద ఆవు దూడలను విడదీశారు.  నకులుడికి ఆశ్చర్యమేసింది.  వెనుదిరిగాడు.

ఇక సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక పర్వతం పైనుండి ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది.  సహదేవుడికి అర్థం కాలేదు.

నలుగురూ కలిసి శ్రీకృష్ణుని తమ సందేహాలు అడిగారు.  

ఆయన చెప్పనారంభించాడు.

కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకు తిన్న రీతిగా భక్తులను దోచుకుంటారు.

కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా సాయం చేయరు.

కలియుగంలో ఎలాగైతే ఆవు దూడకు గాయాలయ్యేంతగా నాకిందో తలిదండ్రులు తమ పిల్లలను గారం చేసి వాళ్ల జీవితాల్ని నాశనం
చేస్తారు.

కలియుగంలో జనులు మంచి నడవడి కోల్పోయి కొండ మీద నుంచి గుండు దొర్లినట్లుగా పతనం అవుతారు. భగవన్నామమనే చిన్న మొక్క తప్ప ఎవరూ కాపాడ లేరు.

....ఉద్ధవ గీత
శ్రీమద్భాగవతం

Sunday, May 21, 2017

హనుమత్ జయంతి

హనుమత్ జయంతిని వైశాఖ బహుళ దశమినాడు జరుపుకుంటాము. ఉత్తర భారతదేశములో మాత్రం చైత్ర పౌర్ణమినాడు హనుమత్ జయంతిగా జరుపుకోగా మనకు ఇక్కడ ఆరోజు హనుమత్ దీక్ష ప్రారంభమౌతుంది. 41రోజులు కొనసాగే ఆ దీక్ష యొక్క ముగింపు దినంనాడు మనం హనుమత్ జయంతిని జరుపుకుంటాము.

హనుమత్ జయంతినాడు భక్తులు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తారు. కొందరు రామాయణంలో భాగమైన సుందరకాండ పారాయణ చేస్తారు. అలాగే హనుమత్ దీక్ష చేసినవారు ప్రముఖ హనుమంతుని ఆలయాలను సందర్శించి అక్కడ తమలపాకులతో పూజ, సహస్ర నామ స్తోత్రాలను జరిపిస్తారు. అప్పాలను నైవేద్యముగా సమర్పిస్తారు.

హనుమంతుడు కేసరి, అంజనాదేవిల కుమారుడు. అలాగే వాయు వరప్రసాది. ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలనుకొనేవారికి హనుమ జీవితం ఒక సందేశాత్మక గ్రంథం. ఒక గొప్ప కార్యాన్ని మాత్రమే కాదు, నిత్యజీవితంలో మనకి ఎదురయ్యే అనేకానేక సంఘర్షణలలోను, క్లిష్ట పరిస్థితులలోను హనుమ జీవితం మనకు అనుసరణీయం, ఆచరణీయం. ఆయన జీవితం నుండి మనం తెలుసుకోవలసిన విషయాలను ఒకసారి అవలోకనం చేసుకుందాం. ముఖ్యముగా విద్యార్థులకు, జీవితంలో ఎదగాలనుకొనే ప్రతివారికీ హనుమ గుణగణాలు నిత్య పారాయణ గ్రంథం.

ఈనాడు ఉద్యోగాలకు, పోటీపరీక్షలకు వెళ్లేవారికి కమ్యూనికేషన్ స్కిల్స్ పేరిట ప్రత్యేక కోచింగులు ఇస్తున్నారు. కానీ చిన్నప్పటినుండి రామాయణాన్ని, విశేషించి అందులో హనుమ పాత్రని, విశ్లేషించి అధ్యయనం చేయిస్తే ఈనాడు వ్యక్తిత్వ వికాస కోర్సుల అవసరమే ఉండదు.

రామాయణంలోని కిష్కిందకాండ నుండి చివరి వరకూ అడుగడుగునా హనుమంతుని వ్యక్తిత్వం మనకు తేటతెల్లమవుతూనే ఉంటుంది. హనుమంతుని యొక్క పట్టుదల, కార్యదీక్ష, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత, కృత్యములయందు నేర్పు, సంభాషణా చాతుర్యం ఇత్యాదులెన్నో మనకు హనుమంతుని వ్యక్తిత్వము నందు మనకు ప్రస్ఫుటమవుతూనే ఉంటాయి.

సుగ్రీవునకు మంత్రిగా అండదండలు అందిస్తూ, సకల గుణాభిరాముడైన శ్రీరామచంద్రునకు దాసానుదాసుడై, జగన్మాత సీతమ్మతల్లి ఔదార్యానికి పాత్రుడై ‘రామాయణ మహామాలారత్నం’గా విలసిల్లాడు. మన లక్ష్యాన్ని సాధించటానికి పట్టుదల, కార్యదీక్ష మాత్రమే కాదు, ఎక్కడ ఒదిగి ఉండాలో, ఎక్కడ యుక్తిని ప్రయోగించాలో, ఎక్కడ శక్తిని ప్రదర్శించాలో హనుమ ద్వారా వాల్మీకి మహర్షి మనకు తెలియజెప్పారు.

ఒక్కోసారి మనలో దాగియున్న ప్రతిభను, శక్తిని మనం గుర్తించలేము. తగిన సమయం వచ్చినప్పుడు, డీలా పడిపోకుండా లక్ష్యం మీదే దృష్టిని ఉంచితే, మన సంకల్పమే మనలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తుంది. సముద్ర లంఘనానికి ముందు హనుమలోని సంకల్పబలమే, జాంబవంతుడు హనుమ జన్మ వృత్తాంతాన్ని తెలిపి బలపరాక్రమాలని గుర్తు చేయటానికి కారణమయింది.

క్రొత్తవారు లేదా క్రొత్త పరిస్థితులు ఎదురైనప్పుడు నేర్పుగా అవి మనకు ప్రతికూలమా, అనుకూలమా అనేది ఎలా గ్రహించాలో, హనుమ ఋష్యమూక పర్వతమును సమీపించిన రామలక్ష్మణులతో జరిపిన సంభాషణ ద్వారా గ్రహించవచ్చు. వాలి మరణానికి దుఃఖిస్తున్న తారను ఓదార్చి ఆమెను కర్తవ్యోన్ముఖురాలను చేస్తా,డు హనుమ. విషయ తత్వాలను ఎరిగి, కాలధర్మ విశేషములను గుర్తించగలిగినవాడు అయిన హనుమ, హితము, లాభకరము, నీతులతో ఒప్పునది అయిన వాక్యములను పలికి  సుగ్రీవుని రామకార్యమునకై సంసిధ్ధం చేసాడు.

శ్రీరాముడు, వానరులందరిలోను శ్రేష్ఠుడైన హనుమ యొక్క కార్యసాధకత్వం విశ్వసించి, తన అంగుళీయకాన్ని సీతకు ఇవ్వమని హనుమకే ఇచ్చాడు. స్వామికార్యమునే స్వకార్యముగా భావించి సీతాన్వేషణకై బయలుదేరాడు. తన బలపరాక్రమాలు ఎరిగి, సముద్రలంఘనం చేసి, లంకా దహనం చేసి అద్వితీయమైన కార్యాన్ని సాధించినప్పటికీ, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమనే తత్వముతో రాముడు విడిచిన బాణమే తాను అని తనను తాను అభివర్ణించుకున్నాడు.

హనుమ సీతాన్వేషణ ప్రయాణములో అనేక ప్రమాదాలు, ప్రలోభాలు ఎదురవుతాయి. వాటిని హనుమ ఎదుర్కొన్న తీరు ఈనాటికీ ఆచరణీయం, అనుసరణీయం. మన కార్యసాధనలో మనకి అనేకరకాలైన పరీక్షలు ఎదురవుతాయి. కొన్నిసార్లు మనకి సహాయసహకారాలని అందించేవాళ్లే మన కార్యసాధనకు అవరోధాలవుతారు. సముద్రలంఘనం సమయములో మైనాకుని వృత్తాంతం ఇదే విషయాన్ని తెలుపుతోంది. అప్పుడు హనుమ సున్నితముగానే తన కార్యాన్ని గూర్చి తెలిపి, రామకార్యములో విరామం కూడదని ముందుకు సాగిపోతాడు. కొన్నిసార్లు మన శక్తియుక్తులని, కార్యసాధనలోని అంతిమలక్ష్యానికే తప్ప స్వల్పవిషయాలకు వృథా చేయకూడదని సురస వృత్తాంతం చెప్తుంది. ఇక సింహిక వృత్తాంతం తనను తన లక్ష్యమునుండి దూరముగా పంపివేసే ప్రతికూలశక్తులను ప్రయత్నపూర్వకంగా తొలగించుకోవాలి అని తెలుపుతుంది.

ప్రమాదాల తరువాత ఎదురైనవి ప్రలోభాలు. సీతాన్వేషణలో ఉన్న హనుమకు రాక్షసస్త్రీలు, అప్సరాంగనల రూపములో అనేక ప్రలోభాలు, భ్రమలు ఈమె సీతేనేమో అన్నట్లుగా కలిగాయి. వాటన్నింటినీ ఆయన తార్కిక జ్ఞానముతో తొలగించుకొని స్థిరచిత్తముతో ఉన్నాడు. ఒకానొక దశలో సీతను కనుగొనలేనేమో, రామకార్యాన్ని సాధించలేనేమో అన్న నిరాశానిస్పృహలకు లోనయి, ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ మనోబలంతో తనకు తానే ధైర్యం తెచ్చుకొని, తిరిగి పట్టుదలతో ప్రయత్నించాడు. ఈనాడు చిన్న పరీక్ష తప్పితేనే జీవితాన్ని అంతం చేసేసుకుందామనే ఆలోచన చేసే విద్యార్థులందరూ హనుమ నుండి నేర్చుకోవాల్సింది ఇదే. శత్రుస్థావరములో అత్యంత దయనీయమైన స్థితిలో ఏది చూసినా రావణుని మాయే అనే అనుమానంతో ఉన్న సీతకు, రామలక్ష్మణులు వస్తారనే ధైర్యాన్ని తిరిగి కల్పించడానికి ఏమిచేస్తే ఆమె తనను రామబంటు అని నమ్ముతుందో, ఆ రామకథాగానమే చేస్తూ ఆమెకు సంతోషాన్ని కలిగించాడు. ఇదే హనుమ నుండి మనం నేర్చుకోవాల్సిన కమ్యూనికేషన్ స్కిల్. మనం ఏదైనా కార్యాన్ని సాధించడానికి కేవలం పట్టుదల, కార్యదీక్ష మాత్రమే కాదు, సరియైన కమ్యూనికేషన్ కూడా అవసరం.

లంకాదహనం కూడా రావణాసురునికి తనవర్గం వారి శక్తియుక్తులు తెలపడానికి, శత్రువర్గం వారి బలాబలాలు తెలుసుకోవడానికే హనుమ చేసాడు. ఇదే ఈనాడు మేనేజ్మెంట్ పాఠాలలో చెప్పే SWOT (Strength, Weakness, Opportunities, Threat) analysis.
స్వశక్తిని నమ్ముకుంటే ఎంతటి అసాధ్యాన్నైనా  సుసాధ్యం చేయవచ్చని సంజీవినీ పర్వతం తేవడం ద్వారా నిరూపించాడు. ఇలా ప్రతి దశ లోనూ హనుమ జీవితం మనకి ఆదర్శమే. మనం ఇకనుండీ హనుమ గుణగణాలని చిన్నారులకి చెప్పి, వారిని బలమైన వ్యక్తిత్వం గలవారిగా తీర్చిదిద్దుదాం.

జై హనుమాన్!!

Thursday, May 18, 2017

ప్రవర యొక్క అర్ధం..


చతుస్సాగర పర్యంతం
( మానవ పరిభ్రమణానికి నలువైపులా
కల మహాసముద్రాల అంచుల వరకూ )

గో బ్రాహ్మణేభ్య శుభం భవతు
( సర్వాబీష్ట ప్రదాయిణి అగు.. గోవూ మరియు నిత్యం సంఘహితాన్నే అభిలషించే సద్బ్రాహ్మణుడు అతడి రూపంలో ప్రకాశించే వేదధర్మం.. సర్వే సర్వత్రా దిగ్విజయంగా.. శుభప్రదంగా వర్ధిల్లాలని కోరుకుంటూ)

భార్గవ చ్యవన ఆప్నోవాన ఔర్వ వైదల పఞ్చర్షేయా  ప్రవరాన్విత..

( మా వంశమునకూ.. మా గోత్రమునకూ మా నిత్యానుష్ట ధర్మశీలతకు మూలపురుషులైన మా ఋషివరేణ్యులకూ.. త్యాగే నైకే అమృతత్త్వ మానశుః అన్న వారి మహోన్నతమైన త్యాగనిష్ఠకు సాక్షీభూతుడనై..

శ్రీ వత్స స గోత్రోద్బవాయ

(మా గోత్రమునకూ..)

ఆపస్తంభ సూత్రః కృష్ణ యజుశ్శాఖాధ్యాయీ
( మా శాఖకూ.. అందలి శాస్త్ర మర్మంబులకు.. )

శ్రీ బ్రహ్మాండం గురునాథ్ శర్మన్

( కేవలం జన్మతహానే కాక.. ఉపనయనాది సంస్కారాలతో.. శాస్త్రపఠనంతో.. వేదాధ్యయనాది వైదిక క్రతువులతో.. 1. స్నానము 2. సంధ్య 3. జపము 4. హోమము 5. స్వాధ్యాయము 6. దేవ పూజ 7. ఆతిధ్యము 8. వైశ్యదేవము అనబడే అష్టకర్మలనూ క్రమంతప్పక నిర్వహిస్తూ.. త్రివిధాగ్నులు 1. కామాగ్ని 2. క్రోధాగ్ని 3. క్షుద్రాగ్ని.. అనే త్రివిధాగ్నులను అదుపులో (సమస్థితిలో) ఉంచుకొన్న వాడినై.. పేరుకు ముందు శ్రీ అనబడే.. ప్రకృతి స్వరూపమైన శక్తిస్వరూపాన్ని.. శుభప్రదమైన శ్రీకారాన్ని ధరించిన.. గురునాథ్  శర్మా అనబడే సుశ్రోత్రియుడనైన నేను.. జన్మప్రధాతలైన జననీజనకులముందు..  జ్ఞానప్రధాతలైన ఆచార్యులముందు.. జ్ఞానస్వరూపమైన వేదముముందు.. యావత్ ప్రపంచానికే మార్గదర్శకమైన వేదధర్మము ముందు.. నిరాకార నిర్గుణ అవ్యాజ పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్మ ముందు..

అహంభో అభివాదయే..

( కేవలం నేనూ అన్నదిలేక.. సర్వం ఆ పరమాత్మ యొక్క అనుగ్రహ భాగ్యమేయన్న అహంకారభావ రహితుడనై.. నిగర్వినై.. త్రికరణ శుద్ధిగా ( మనసా, వాచా, కర్మణా) సాష్టాంగ పూర్వక (మానవశరీరంలోని అత్యంత ప్రాధాన్యమైన ఎనిమిది శరీరాంగములనూ శరణాగత హృదయంచే నేలపై వాల్చి సమర్పిస్తున్న) దండ ప్రణామమిదే.. అన్న పరిపూర్ణమైన ఆత్మపూర్వక వేదపూర్వక హృదయపూర్వక నమస్కార భావమే.. సశాస్త్రీయమైన ఈ ప్రవరలోని.. అర్ధం అంతరార్ధం పరమార్ధం కూడా.
********

Tuesday, May 9, 2017

అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన భారతీయులు

                        ✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨
అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన "వేదాలని పోగొట్టుకున్న వెర్రి సన్నాసులు భారతీయులు" అని ప్రపంచం ఇప్పటికే ఉమ్మేసింది.
☄☄☄☄☄☄☄☄☄☄☄☄
జీవన ధర్మాన్ని బోదించిన గొప్ప శక్తి ఐన బగవద్గీత ని చనిపోయినపుడు
మాత్రమే వినే తెలివి తక్కువ మూర్ఖులు భారతీయులు అని హేళన చేస్తోంది.
☄☄☄☄☄☄☄☄☄☄☄☄
ఆయుర్వేదంలో ఉన్న గొప్ప ఆరోగ్యాన్ని వొదులుకుని ఇంగ్లీష్ మందుల వెంట పడుతున్న అజ్ఞానులు భారతీయులు అని ఈ ప్రపంచం నవ్వుకుంటోంది.
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
నిత్య యవ్వనం గా ఉంచే యోగ శాస్త్రాన్ని కాపాడుకో లేకపోయిన రోగులు భారతీయులు అని ఈ ప్రపంచం మనని చూసి పరిహాసం ఆడుతోంది.
🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂
"నీ జీవిత పరమార్ధాన్ని వివరించే నీ దేశం లోనే పుట్టిన గొప్ప శక్తి ఐన ధ్యానం వొదిలేసి ఎందుకురా మా పిచ్చి సంస్కృతి ని ఫాలో అవుతున్నారు రా తెలివి లేని భారతీయు లారా" అని ఈ ప్రపంచం మనల్ని వెక్కిరిస్తోంది.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
అణువణువునా శక్తి ని నింపుకుని అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చే ఆవుని కాపాడు కోలేక పోయిన మీకెందుకు రా ఆవేశం" అని హేళన చేస్తోంది.
🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱
ప్రపంచానికే శాంతిని బోదించిన మీ దేశంలో పుట్టిన బౌద్దాన్ని తరిమి కొట్టిన
పిచ్చి ఎదవలు భారతీయులు అని ఈ ప్రపంచం మన పైన ఉమ్మేస్తోంది.
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
అమెరికన్స్ ఐన మేము మీ వేప చెట్టుని పసుపు ని కొన్ని కోట్లు పోసి కొంటుంటే మీ ఇంటి ముందే ఉన్న ఆ చెట్లని కొట్టేస్తున్న తెలివి తక్కువ దద్దమ్మల్లారా మీ దేశ గొప్ప తనం మీకే తెలియకుంటే ఎలా రా అని నిలదీసి మరీ ఈ ప్రపంచం మన మీద జాలి పడుతోంది.
😭😭😭😭😭😭😭😭😭😭😭😭
వేదాలు తగుల బెట్టుకున్నాము,
ఉపనిషత్తులు చెత్తలో వేసుకున్నాము,
ఆయుర్వేదాన్ని సమాధి చేసాము,
ధ్యానాన్ని మరిచిపోయాము,
బౌద్దాన్ని చంపేసాము,

ఇప్పుడు ఆవుని కూడా చంపు కుంటున్నాము.

నాన్నా ఇంత గొప్ప దేశం లో పుట్టి ఇంత గొప్ప సంస్కృతి ని జీవన ధర్మాన్ని ఎందుకు కాపాడ లేకపోయావు నాన్నా అని రేపు మన బిడ్డలు మన మీద ఉమ్మేయక ముందే జాగ్రత్త పడుదాం.
🤓🤓🤓🤓🤓🤓🤓🤓🤓🤓🤓🤓
భారత దేశాన్ని చేజేతులా చంపుకుంటూ
మల్లీ సిగ్గు లేకుండా మా దేశం గొప్పది మా సంస్కృతి గొప్పది అని ఎదవ సొల్లు చెప్తూ ఉంటాము.
🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗
వేదం లేదు యోగం లేదు ధ్యానం లేదు ఆనందం లేదు ఆరోగ్యం లేదు
ఆవు లేదు ఆయుర్వేదం లేదు బౌద్ధం లేదు శాంతి లేదు ప్రేమ లేదు
ధర్మం లేదు అర్ధం లేదు కామం లేదు మోక్షం లేదు
సత్యం లేదు సనాతన ధర్మం లేదు  జీవన ధర్మం లేదు.

భారత దేశం అంటేనే ఇవన్ని, వీటి వల్లే భారత దేశం గొప్ప దేశం అయింది.

ఇవన్ని చంపేసి మల్లీ భారత దేశం బతికే ఉంది అంటూ సోది మాట్లాడుతాం.

గోవులున్న ఇల్లు, గ్రామం, రాష్ట్రం, దేశం సకల సౌభాగ్యాలతో విలసిల్లుతూ ఉంటుంది.

సమస్త సృష్టిలోకి పవిత్రమైన గోమాతను రక్షిద్దాము, పూజిద్దాము సకల శుభాలను పొందుదాము.
🐃🐃🐃🐃🐃🐃🐃🐃🐃🐃🐃🐃
|| ఓం నమో భగవతే గోమాత్రే నమః ||
🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂
గోవు ను జాతీయ జంతువు గా ప్రకటించాలి.
🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄
గోవు లేకుంటే నాగరికత లేదు, గోమాత ను పూజిద్దాం, రక్షిద్దాం. ఆవు ను కూడా ఆమ్మలా ప్రేమిద్దాం

ఐశ్వర్యం అంటే



 1.తల్లిదండ్రులను రోజూ చూడగలగటం
2. అనుకూలవతి అయిన భార్య/భర్త ఉండటం
3.చెప్పినమాట వినే సంతానం ఉండడం
4.ఋణాలు లేకపోవటం
5.మన అవసరానికి తగ్గ ధనము ఉండటం.
6.ఏదీ తిన్న అరిగించుకొనే శక్తి ఉండటం.
7.మనకోసం కన్నీరు కార్చే మిత్రులు ఉండటం.
8.పది మందిలో గౌరవించబడటం.

ఇవీ అష్టైశ్వర్యాలు...

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...