Thursday, June 27, 2019

సప్తఋషులు

అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమ, వశిష్ట, విశ్వామిత్ర మహర్షుల గురించి ఒక్కసారైనా తలచుకోవాలని చెబుతారు పెద్దలు. అరణ్యవాసంలో సీతారాములకు అభయమిచ్చినవాడు అత్రి మహర్షి. సాక్షాత్తూ శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు. సీతారాములకు చిత్రకూటానికి దారి చూపినవాడు భరద్వాజ మహర్షి. తన భార్య అహల్య ద్వారా రామునికి తన తప:ఫలాన్ని అందింపజేసిన మహారుషి గౌతముడు. రాముని గురువు విశ్వామిత్రుడు. కులగురువు వశిష్టుడు. విష్ణువు అంశావతారమైన పరశురాముని కన్న తండ్రి జమదగ్ని మహర్షి. దశావతారాల్లో ఒకటైన వామనుడి జనకుడు కశ్యపమహర్షి. ఋషిపంచమినాడు రామాయణం చదివితే ఈ మహర్షులందరినీ తలుచుకున్నట్టే.

సప్తఋషి ధ్యాన శ్లోకములు :

కశ్యప ఋషి :
 కశ్యపస్సర్వ లోకాఢ్యః సర్వ శాస్త్రార్థ కోవిదః| ఆత్మయోగ బలేనైవ సృష్టి స్థిత్యంత కారకః||
ఓం అదితి సహిత కశ్యపాయ నమః||

అత్రి ఋషి : అగ్నిహోత్రరతం శాంతం సదావ్రత పరాయణమ్| సత్కర్మనిరతం శాంత మర్చయే దత్రిమవ్యయమ్||    ఓం అనసూయా సహిత అత్రయేనమః||

భరద్వాజ ఋషి : జటిలం తపసాసిద్ధం యఙ్ఞ సూత్రాక్ష ధారిణమ్| కమండలు ధరం నిత్యం భరద్వాజం నతోస్మ్యహమ్||    ఓం సుశీలా సహిత భరద్వాజాయ నమః||

విశ్వామిత్ర ఋషి : కృష్ణాజిన ధరం దేవం సదండ పరిధానకమ్| దర్భపాణిం జటాజూటం విశ్వామిత్రం సనాతనమ్||     ఓం కుముద్వతీ సహిత విశ్వామిత్రాయనమః||

గౌతమ ఋషి : యోగాఢ్యః సర్వభూతానాం అన్నదానరతస్సదా| అహల్యాయాః పతిశ్శ్రీమాన్ గౌతమస్సర్వ పావనః||    ఓం అహల్యా సహిత గౌతమాయనమః||

జమదగ్ని ఋషి : అక్షసూత్ర ధరం దేవం ఋషీనామధిపం ప్రభుమ్| దర్భపాణిం జటాజూటం మహాతేజస్వినం భజే||     ఓం రేణుకా సహిత జమదగ్నయే నమః

వసిష్ఠ ఋషి : శివధ్యాన రతం శాంతం త్రిదశైరభి పూజితమ్| బ్రహ్మసూనుం మాహాత్మానం వసిష్ఠం పూజయేత్సదా|| 
 ఓం అరుంధతీ సహిత వసిష్ఠాయ నమః||

కశ్యపత్రి ర్భరద్వాజో విశ్వా మిత్రోథ గౌతమః| వసిష్ఠో జమదగ్నిశ్చ సప్తయతే ఋషయస్తథా||
                                       సప్తఋషిభ్యో నమః

కశ్యపుడూ, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వసిష్ఠుడు, జమదగ్ని ఈ ఏడుగురు సప్తఋషులు. మనిషి తప్పనిసరిగా తీర్చుకోవలసిన ఐదురుణాల్లో ఋషిరుణం కూడా ఒకటి. ఎందుకంటే మనం అనుసరించాల్సిన ధర్మాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మనకు నేర్పింది వీళ్లేమరి. ఇంతటి మహోపకారాన్ని మనకు చేసినందుకు కృతజ్ఞతగా వీరిని సతీసమేతంగా భక్తితో స్మరించి పూజలు ఆచరించుకోవడం మన ధర్మం కాదూ!

ఈరోజుల్లో సప్త ఋషులు మనకు కనపడతారా? అంటే ఖచ్చితంగా కనబడతారు అని చెప్పవచ్చును. ఇంకా గట్టిగా చెప్పాలంటే...అందరికీ కనపడతారు, చూడగలిగితే ప్రతీరోజూ కనపడతారు. ఇంకా చెప్పాలంటే ప్రతీ దంపతులూ సాయంత్రంపూట సప్త ఋషులకు, అరుంధతీ వశిష్ఠులకు నమస్కరించుకోవాలి కూడా.

 ఎక్కడ ఉంటారు? ఎలా ఉంటారు? అనేది మన పెళ్ళిళ్ళలో 'అరుంధతీ దర్శనం' చేయిస్తూ పురోహితులు తెలియజేస్తారు.
సాయంత్రం పూట ఆకాశంలో ఉత్తరం దిక్కున ప్రతీరోజూ వారిని మనం దర్శించుకోవచ్చు.


ఇంతకీ సప్త ఋషులు ఎవరు? వారి వివరాలు ఏమిటి? అంటే..

కశ్యప అత్రి భరద్వాజ
విశ్వామిత్రోథ గౌతమః!

వశిష్టో జమదగ్నిశ్చ
సప్తైతే ఋషయః స్మృతాః!!

భారతీయ పురాణ కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి ఓ ఋషి మూలపురుషుడిగా ఉంటారు. ప్రాచీన ఋషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్రరూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజూ స్మరణీయులే. మరికొందరికీ వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు ఋషులున్నారు.

ఎంతోమంది ఋషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది.

1. కశ్యపుడు,
2. అత్రి,
3. భరద్వాజుడు,
4. విశ్వామిత్రుడు,
5. గౌతముడు,
6. జమదగ్ని,
7. వసిష్ఠుడు...

వీరు ఏడుగురు పూజనీయులే.
రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపేణా మనకందించాడు. వ్యాసుడు నాలుగు తలలు లేని బ్రహ్మ, రెండు బాహువులు గల విష్ణువు, మూడో కన్ను లేని శివుడని అంటారు.


⭐ 1. కశ్యప మహర్షి:- సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి. మరీచి, కళల పుత్రుడు. దక్షప్రజాపతి పుత్రికల్లో 13 మందిని, వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్ష లతా త్పణ జాతులు, సింహ, మృగ, సర్పాలను, పక్షులను, గోగణాలను, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులను, పౌలోములను, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు.


⭐ 2. అత్రి మహర్షి:-
 సప్తర్షుల్లో రెండోవాడైన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. అతని భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ పతివ్రతా శిరోమణి.


⭐ 3. భరద్వాజ మహర్షి:-
భరద్వాజుడు ఉతథ్యుని పుత్రుడు. తల్లి పేరు మమత. బృహస్పతి కృప వలన జన్మించి, ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది, ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు.


⭐ 4. విశ్వామిత్ర మహర్షి:-
విశ్వామిత్రుడు రాజర్షి. త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, హరిశ్చంద్రునిచే అసత్యమాడించ కొంత ఫలాన్ని, మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతలా జననానికి మూలపురుషుడయ్యాడు. దుష్యంతుడు, శకుంతలల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు.


⭐ 5. గౌతమ మహర్షి:-
తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు ఋషులు, మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర ఋషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భతో అదిలించి, బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకొన్నాడు. ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి, తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చిందీ ఆయనే.


⭐ 6. వశిష్ఠ మహర్షి:-
ఇతని భార్య అరుంధతి. వసిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు. వైవస్వత మన్వంతరాన సప్తర్షుల్లో ఒకడు. శక్తి మొదలైన వందమంది పుత్రులు గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు.
సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు.


⭐ 7. జమదగ్ని మహర్షి:-
జమదగ్ని ఋషి- రుచికముని, సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన, ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు. ఆ తరవాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశాడు

Tuesday, June 25, 2019

దశ మహా విద్యలు - వాటి ఫలితాలు.



1. తొలి మహా విద్య శ్రీకాళీదేవి


కృష్ణ వర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్రేయసంప్రదాయం చెబుతోంది. తంత్రోక్త మార్గంలో శ్రీకాళీ మహా విద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రు నాశనం, దీర్షాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది.

2వ మహావిద్య శ్రీతారాదేవి

దశ మహావిద్యలలో రెండవ మహా విద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈ దేవిని నీలసరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధనవల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది.

3వ మహా విద్య శ్రీషోడశీదేవి

అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీషోడశీదేవి దశమహావిద్యలలో 3వ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది. పరమ శాంతి స్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిరమాస పూర్ణిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపురసుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆసాధకుడికి అన్నిరకాల కష్టనష్టాలనుంచి విముక్తి మానసికశాంతి, భోగం, మోక్షం కలుగుతాయి.

4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి

దశ మహావిద్యలలో 4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమీ తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యధికారాన్ని సమస్త సిద్దుల్ని సకల సుఖభోగాల్ని ఈదేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు.

5వ మహావిద్య శ్రీ త్రిపుర భైరవీ దేవి

దశమహావిద్యలలో 5వ మహా విద్య వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవీ దేవి. ఈ దివ్యశక్తి స్వరూపిణికి మాఘమాసం పూర్జిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఆర్తత్రాణ పారాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సకల సుఖభోగాలను పొందే శక్తి, సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్షప్రాప్తి సాధకుడికి కలుగుతుంది.

6వ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి


దశ మహావిద్యలలో 6వ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి. ఈ దేవినే వజ్ర వైరోచినీ, ప్రచండ చండీ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. శాక్తేయ సంప్రదాయంలో భిన్నమస్తాదేవికీ ఎంతో ప్రశస్తివుంది. ఈ దేవిని నిష్టతో ఉపాసిస్తే సరస్వతీసిద్ధి, శత్రువిజయం, రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాలనుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, ఎటువంటి కార్యాలనైనా ఆవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది.

7వ మహావిద్య శ్రీ ధూమవతీ దేవి

దశ మహావిద్యలలో 7వ మహావిద్య.. ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతి దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధనవల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది.

8వ మహావిద్య శ్రీ జగళాముఖీ దేవి

దశమహావిద్యలలో 8వ మహావిద్య.. పసుపు వర్ణంతో ప్రకాశించే

శ్రీ జగళాముఖీ దేవికి చెందింది. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ మహాదేవికి వైశాఖమాస శుక్లపక్ష అష్టమీతిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.

9వ మహావిద్య శ్రీ మాతంగీదేవి

దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య.. మరకతమ వర్ణంతో ప్రకాశించే

శ్రీ మాతంగీదేవి కి చెందింది. వశీకరణ దేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖమాసం శుక్లపక్ష తృతీయాతిథి ప్రీతిపాత్రమైనది. రాజమాతంగీ, లఘుశ్యామలా, ఉచ్చిష్టచండాలి, అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తుంటారు. ఈ దివ్య స్వరూపిణి ఉసాసనవల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణాశక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి.

10వ మహావిద్య శ్రీ కమలాత్మికాదేవి

పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశ మహావిద్యలలో 10వ మహావిద్యగా ప్రశస్తిపొందింది. సకల ఐశ్వర్య ప్రదాయిని అయిన ఈదేవికి మార్గశిరే అమావాస్యతిథి ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక లక్ష్మీస్వరూపిణి అని అర్థం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది. 
    శ్రీ కాళీ రాఘవేంద్రాచార్యులు

శ్రీ హనుమాన్ కవచం



శ్రీ రామచన్ద్ర ఉవాచ:-

హనుమాన్ పూర్వతః పాతు దక్షిణే పవనాత్మజః |
అధస్తు విష్ణు భక్తస్తు పాతు మధ్యం చ పావనిః ||


లంకా విదాహకః పాతు సర్వాపద్భ్యో నిరంతరం |
సుగ్రీవ సచివః పాతు మస్తకం వాయునన్దనః ||


భాలం పాతు మహావీరో భృవోర్మధ్యే నిరంతరం |
నేత్రే ఛాయాపహారీ చ పాతు నః ప్లవగేశ్వరః ||


కపోలే కర్ణమూలే చ పాతు శ్రీరామకింకరః |
నాసాగ్రం అంజనీసూనుః పాతు వక్త్రం హరీశ్వరః ||


వాచం రుద్రప్రియః పాతు జిహ్వాం పిఙ్గల లోచనః |
పాతు దేవః ఫాల్గునేష్టః చిబుకం దైత్యదర్పహా ||


పాతు కణ్ఠం చ దైత్యారిః స్కంధౌ పాతు సురార్చితః |
భుజౌ పాతు మహాతేజాః కరౌ చ చరణాయుధః ||


నగరన్ నఖాయుధః పాతు కుక్షౌ పాతు కపీశ్వరః |
వక్షో ముద్రాపహారీ చ పాతు పార్శ్వే భుజాయుధః ||


లంకా నిభంజన: పాతు పృష్ఠదేశే నిరంతరం |
నాభిం చ రామదూతస్తు కటిం పాత్వనిలాత్మజః ||


గుహ్యం పాతు మహాప్రాఙ్యో లింగం పాతు శివప్రియః |
ఊరూ చ జానునీ పాతు లంకాప్రసాద భంజనః ||


జంఘె పాతు కపిశ్రేష్ఠోః గుల్ఫౌ పాతు మహాబలః |
అచలోద్ధారకః పాతు పాదౌ భాస్కర సన్నిభః ||


అఙ్గాన్యమిత సత్వాఢ్యః పాతు పాదరఙ్గులీస్తథా |
సర్వాంగాని మహాశూరః పాతు రోమాణి చాక్మవిత్ ||


హనుమత్ కవచం యస్తు పఠేద్ విద్వాన్ విచక్షణః |
స ఏవ పురుషశ్రేష్ఠో భుక్తిం ముక్తిం చ విన్దతి ||


త్రికాలమేకకాలం వా పఠేన్ మాసత్రయం నరః |
సర్వాన్ రిపూన్ క్షణాన్ జిత్వా స పుమాన్ శ్రియమాప్నుయాత్ ||


ఇతి శ్రీ శతకోటిరామచరితాంతర్గత శ్రీమదానన్దరామాయణే వాల్మికీయే మనోహరకాణ్డే

శ్రీ హనుమత్కవచం సంపూర్ణం ||

Friday, June 21, 2019

షోడశ గణపతి స్తోత్రం


విఘ్నేశవిధి మార్తాండ చండేంద్రోపేంద్ర వందితః!
నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే!!

1. ప్రథమం బాల విఘ్నేశం, ద్వితీయం తరుణం భవేత్!
తృతీయం భక్త విఘ్నేశం, చతుర్థం వీరవిఘ్నకమ్!!

2. పంచమం శక్తి విఘ్నేశం, షష్ఠం ధ్వజ గణాధిపమ్!
సప్తమం పింగళదేవ మష్ట మోచ్చిష్టనాయకమ్!!

3. నవమం విఘ్నరాజం చ దశమం క్షిప్ర నాయకమ్!
ఏకాదశం తు హేరంబం, ద్వాదశం లక్ష్మీ నాయకమ్!!

4. త్రయోదశం మహావిఘ్నం భువనేశం చతుర్దశమ్!
నృత్తాఖ్యం పంచదశకం, షోడశోర్ధ్వ గణాధిపమ్!!

గణేశ షోడశం నామ ప్రయతః ప్రాతరుత్థతః!
సంస్మరేత్ సర్వకుశలం స ప్రయాతిన సంశయః!!

శ్లోకములు:
కార్యారంభే గణేశశ్చ పూజనీయః ప్రయత్నతః!
సర్వే విఘ్నాశ్శమం యాంతి గణేశస్తవ పాఠతః!!

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం!
పుత్రార్థీ లభతే పుత్రం మోక్షార్థీ పరమం పరమ్!!

ఓం నమో గణపతీయే నమః

30 రకాల శివలింగములు మరియు వాటి ప్రతిఫలం !


సాధారణంగా మనకు తెలిసినవి శిలా నిర్మితమైన లింగాలు మాత్రమే..అందులో కూడా నల్ల రాతి శివలింగాలే అధికం.

కానీ మనకు తెలియని శివలింగాలు ఇంకా అనేకం ఉన్నాయి.

అందులో 30 రకాల శివలింగాలు మరీ ముఖ్యమైనవి. అపూరూపమైనవి..

ఆయా లింగాలు ఇచ్చే ఫలితాలు అనంతం..

రకరకాల పదార్ధాలతో రూపొందించిన శివలింగాలు గురించి పురాణాలు వివిధ సందర్భాలల్లో వర్ణించాయి....

ఏయే శివలింగాలను పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయంటే.....

1) గంధపు లింగం.
రెండు భాగాలు కస్తూరి , నాలుగు భాగాలు గంధం , మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని చేస్తారు .....దీనిని పూజిస్తే శివ సాయిజ్యం లభిస్తుంది.

2) నవనీత లింగం.
వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి.

3) పుష్పలింగం.
నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు....దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది.

4) రజోమయ లింగం.
పుప్పొడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాథరత్వం సిద్ధిస్తుంది..... శివ సాయిజ్యాన్ని పొందగలరు

5) ధ్యాన లింగం.
యవలు , గోధుమలు , వరిపిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు....దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి , సంతానం కలుగుతుంది.

6 ) తిలిపిస్టోత్థ లింగం.
నూగు పిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ది కలుగుతుంది.

7) లవణ లింగం..
హరిదళం , త్రికటుకము , ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి .

8 ) కర్పూరాజ లింగం .
ముక్తి ప్రదమైనది.

9) భస్మమయ లింగం.
భస్మముతో తయారు చేస్తారు ...... సర్వసిద్ధులను కలుగచేస్తుంది

10) శర్కరామయ లింగం..
సుఖప్రదం..

11) సద్భోత్థ లింగం..
ప్రీతికరని కలిగిస్తుంది.

12) పాలరాతి లింగం..
ఆరోగ్యదాయకం.

13) వంకాకురమయ లింగం.
వంశవృద్దిని కలిగిస్తుంది ...... దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు .

14) కేశాస్థి లింగం .
వెంట్రుకలు , ఎముకలతో తయారు చేస్తారు .....ఇది శత్రునాశనం చేస్తుంది.

15) పిష్టమయ లింగం..
ఇది పిండితో తయారు చేయబడుతుంది...ఇది విద్యలను ప్రసాదిస్తుంది.

16) దధిదుగ్థ లింగం .
కీర్తి ప్రతిష్టలను కలిగిస్తుంది.

17) ఫలోత్థ లింగం..
ఫలప్రదమైనది.

18) రాత్రి ఘజాత లింగం.
ముక్తి ప్రదం

19) గోమయ లింగం..
కపిల గోవు పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు ..... దీనిని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది..... భూమిపై పడి మట్టి కలిసిన పేడ పనికిరాదు

20) దూర్వాకాండజ లింగం.
గరికతో తయారు చేయబడు ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది

21) వైడూర్య లింగం..
శత్రునాశనం , దృష్టి దోషహరం

22) ముక్త లింగం .
ముత్యంతో తయారు చేయబడిన ఈ లింగం ఇష్ట సిద్దిని కలిగిస్తుంది

23) సువర్ణ నిర్మిత లింగం.
బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది

24) ఇత్తడి - కంచు లింగం..
ముక్తిని ప్రసాదిస్తుంది

25) రజత లింగం..
సంపదలను కలిగిస్తుంది

26) ఇనుము - సీసపు లింగం.
శత్రునాశనం చేస్తుంది

27) అష్టధాతు లింగం.
చర్మరోగాలను నివారిస్తుంది.....సర్వసిద్ధి ప్రదం

28) స్ఫటీక లింగం.
సర్వసిద్ధికరం , అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది

29) తుష్టోత్థ లింగం..
మారణ క్రియకు పూజిస్తారు

30) సీతాఖండ లింగం.
ఫటిక బెల్లంతో తయారు చేసింది..... ఆరోగ్యసిద్ధి కలుగుతుంది

పరమేశ్వర పూజా పుష్పఫలము ..

శివున్ని దర్భలతో పూజిస్తే - దీర్ఘాయుస్సు!
ఉమ్మెత్తలతో పూజిస్తే - సుతప్రాప్తి!

జిల్లేడు పూలతో పూజిస్తే - శౌర్యము !
కలువ పూలతో పూజిస్తే - విక్రమ వృద్ధి !

బంధూక సుమములతో పూజిస్తే - భూషణ ప్రాప్తి !
జాజి పూలతో అర్చిస్తే - వాహన ప్రాప్తి !

మల్లెపూలతో పూజిస్తే - భోగము ప్రాప్తిస్తాయి !
అవిసె పూలతో పూజిస్తే - పరమేశ్వర ప్రాప్తి !

కొండ గోగుపూలతో ఆరాధిస్తే - వస్త్ర లాభం !
నువ్వుల పువ్వులతో ఉమామహేశ్వరుణ్ణి పూజిస్తే - యౌవన ప్రాప్తి కలుగుతుంది !

తుమ్మి పువ్వులతో అర్చిస్తే - మోక్ష లాభం !
నందివర్థన పూజ - సౌందర్యాన్ని చేకూర్చుతుంది !

లోకహితం కోసం శివుడు ఎత్తిన అవతారాలు..
ఓంకార స్వరూపుడైన శివుడు లోకహితం కోసం ఎన్ని రూపాలు ధరించాడు. ఈ విషయంపై శివపురణం ఓసారి తిరగేస్తే అందులో ఎనిమిది రూపాలు ధరించినట్లు పెర్కొంటోంది.
అవేంటంటే....

* రుద్రుడు !
* భవుడు !
* శర్వుడు !
* ఉగ్రుడు !
* భీముడు !
* పశుపతి !
* ఈశానుడు !
* మహాదేవుడు !

1) రుద్రుడు : దుఃఖ నివారకుడైన అగ్నిని అదిష్టించి ఉంటాడు !!

2) శర్వుడు : జీవుల మనుగడ కోసం భూమిని అధిష్టించి ఉంటాడు !!

3) భవుడు : ఈ జగానికి అత్యంతావశ్యకమైన జలాన్ని ఆశ్రయించి ఉంటాడు !!

4) ఉగ్రుడు : జగత్తు కదలికలకు కారకుడై వాయువును అధిష్టించి ఉంటాడు !!

5) భీముడు : ఆకాశాన్ని ఆశ్రయించి ఉంటాడు !!

6) పశుపతి : సంసార బద్ధులైన జీవులను పాప విముక్తులను చేసేందుకై జీవాత్మను అధిష్టించి ఉంటాడు !!

7) ఈశానుడు : ఈ చరాచర జీవులను శాసించే సూర్యునలో ప్రకాశిస్తుంటాడు !!

8) మహాదేవుడు : తన చల్లని కిరణాలతో జీవులను పాలించు చంద్రునిలో ప్రకాశిస్తుంటాడు !!

Sunday, June 16, 2019

జేష్ఠ పౌర్ణమి

మనకు ప్రతి మాసంలో పౌర్ణమి వస్తుంది.. భగవంతుడు ని ప్రసన్నం చేసుకోవడానికి అనుగ్రహం కోసం పౌర్ణమి పూజలు విశేషంగా  జరుపుకుంటారు.. అయితే ఈ జేష్ఠ పౌర్ణమి అనేది ప్రత్యేకించి కష్టాలు తీరదనికే చేసుకోవాలి..ఈ మాసంలో  సోమవారం వచ్చిన అమావాస్య ని సోమవతి అమావాస్యగా జరుపుకున్నారు ఆ రోజు రావి చెట్టు ప్రదర్శనలు చేసే ప్రత్యక్షంగా నారాయణుడికి రావి చెట్టు రూపంలో పూజించారు , అలాగే ఈ మాసంలో వచ్చిన పౌర్ణమి కూడా చాలా విశేషమైన రోజు...

చాలా అరుదుగా జేష్ఠ పౌర్ణమి సోమవారం రోజు కలిసి వచ్చింది.. ఇది ఎన్నో సమస్యలకు పరిహారం చేసుకునే అవకాశం ఉంటుంది... అవి ఏంటో తెలుసుకుందాము..

1. సహజంగా జేష్ఠ నక్షత్రం బలి నక్షత్రం వీళ్ళు నిత్యం శివుడికి సోమవారం ఆవు నైయి తో దీపము పెట్టడం వల్ల ఎన్నో ఆటంకాలనుండి ఉపశమనం లభిస్తుంది, అయితే ఈ సోమవారం పౌర్ణమి రోజున ఇంట్లో మొదటి సంతానం కొడుకు కావచ్చు  కూతురు కావచ్చు ఏ వయసు వారు అయినా కావచ్చు ఇంట్లో ,(గుడిలో అయితే ఇంకా మంచిది ) ఆవు నైయి తో దీపారాధన చేసి శివుని అష్టోత్తరం చేయాలి... ఇలా చేస్తే వారి తో పాటు వారి కుటుంబం అంతా మంచి జరుగుతుంది.. ఒక్కరే సంతానం ఉన్న ఇంట్లో పిల్లవాడు తండ్రి ఈ దీపారాధన సంతానం పెరు తో చేసుకోవాలి...

2. తరచుగా గొడవ పడుతున్న భార్య భర్తల, విడిపోయే పరిస్థితిలో ఉన్నవారు ఈ పౌర్ణమి రోజు తల స్నానం చేసి ఇంట్లో శివుడికి , చింబిలి (బియ్యం,నువ్వులు, బెల్లం, నైయి mixcy లో వేసి పొడి చేసి ముద్దగా చేసి ఆ ముద్దలో దీపంలాగా చేసి అందులో నైయి పోసి దీపం పెట్టాలి రెండు చింబిలి ఉండలు దీపం పెట్టాలి) కొద్దిగా చింబిలి కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టి సంకల్పం చెప్పుకోవాలి మీరు మీ భర్త అన్యోన్యంగా ఉండాలి అని కోరుకొని అర్ధనారీశ్వర స్త్రోత్రం 11 సార్లు పారాయణం చేసి హారతి ఇవ్వాలి... చింబలి లోని దీపం కొండెక్కాక అది కూడా ప్రసాదంగా తినవచ్చు... ఆ రోజు ఒక్కపూట అల్పాహారం తీసుకుని సాయంత్రం 6.గ దాటాక శివాలయంలో దీపారాధన చేసి చంద్రుడికి నమస్కరించు కుని రాత్రికి బోజనం చేయాలి.. (ఇది కూతురు కాపురం కోసం అని సంకల్పం చెప్పుకుని తల్లి కూడా చేయవచ్చు...)

3.. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నవారు లేక వారి పేరుతో ఎవరైనా చేయవచ్చు... మట్టితో శివలింగం అది పుట్ట మన్ను అయితే చాలా విశేషం లేదా శుభ్రంగా ఉన్న మట్టితో స్వయంగా శివలింగాన్ని చేసి ఒక ఆసనం ఏర్పాటు చేసి వైద్యనాద్ స్త్రోత్రం తో 11 సార్లు విభూదితో అర్చన  చేయాలి, మ్రుతున్జయ మంత్రం (త్రయంబకం) 108 సార్లు చదవాలి, కొబ్బరి బెల్లం నైవేద్యంగా పెట్టాలి... పూజ తర్వాత ఆ శివలింగాన్ని నీటిలో కలిపి చెట్లకు పోయావచ్చు....

4. అప్పులు ఎక్కువ గా ఉంది వడ్డీ లు కట్టుకుంటూ ఎంత కి అప్పులు తీరని వాళ్ళు, ఉద్యోగం లేని వారు, ఉద్యోగం ఉన్న తగిన జీతం రాని వాళ్ళు, వ్యాపారంలో లాభాలు లేని వారు...ఇలాగే మట్టితో శివలింగాన్ని చేసుకుని బాగా అలంకరించి.. చలిబిండి నైవేద్యం పెట్టి 16 సార్లు దారిద్ర్య దహన స్త్రోత్రం పారాయనఁ చేస్తూ శివుడికి బియ్యం పిండి తో అర్చన చేయాలి... ఆ రోజు శివాలయంలో దీపారాధన ప్రదోష కాలంలో పెట్టి ప్రదోష అష్టకమ్(సత్యం బ్రవీమి) ఒకసారి చదువుకోండి... శివదర్శనం చేసుకోండి...

5. విహహం ఆలస్యం, జాతక దోషం, బుద్ధి మాంద్యం ఉన్నవాళ్లు.. బియ్యం పిండిలో గంధం కలిపి శివలింగం చేసుకుని...విభూదితో.. శివ పంచాక్షరీ స్త్రోత్రం 11 సార్లు అర్చన చేసి, పానకమ్, కొబ్బరికాయ, సుండలు నైవేద్యం పెట్టి పూజ అయ్యాక ఆ ప్రసాదం కొద్దిగా తిని పంచి పెట్టాలి. సంకల్పం లో వివాహం మంచి సంబంధం కుదరాలి అని చెప్పుకోవాలి... ఆ శివలింగాన్ని నీటిలో కలిపి తులసి మొక్కకు కానీ రావి చెట్టుకు కానీ పోయాలి...

6. కుజదోషం తో ఇబ్బందులు పడుతున్న వారు.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపాద లేని వారు ఆ రోజు సుబ్రమణ్య స్వామి కి బెల్లం నువ్వులు కలిపిన చింబిలి నివేదన చేసి అష్టోత్రం తో పూజ చేసి ఏకభుక్తం చేయాలి ఒక్కపూట బోజనమ్ చేసి సాయంత్రం శివాలయంలో దీపం పెట్టాలి...

7. జేష్ఠ నక్షత్రం వారు ఐదు వేపచెట్లకు నీరు పోయాలి...

8. దూరంగా ఉన్న పిల్లలు అంటే హాస్టల్ లో  విదేశాల్లో ఉన్నవారి కోసం వారి కుటుంబ సభ్యులు ఈ సోమవారం అమావాస్య రోజు  శివాలయంలో అబీషేకం చేయించు కోవడం మంచి, వారే కాదు శివనుగ్రహం కోసం ఎవరు అబీషేకం  చేయించు కున్నా చేసినా  మంచిది..

9. ఇంక చివరిగా మన శివ భక్తుల కోసం ఈ సోమవారం పౌర్ణమి రోజున బిల్వదలాలతో అర్చన చేసిన , అభేషేకం, శివ నామ స్మరణం మరింతగా శివాను గ్రహము కలిగిస్తుంది..

(ఇవన్నీ పెద్దగా సమయము ఖర్చు లేకుండా దైవానుగ్రహం పొందే మార్గాలు.. మీకు తెలిసిన వారికి కూడా చెప్పండి ఏ ఒక్కరికి ఉపయోగ పడినా ఆ పుణ్యం మీకే)

ఏది చదివితే ఏమి ఫలితం వస్తుంది ?

నిత్యము భగవాన్ నామస్మరణ వలన ఎన్నో పాపాలు నశించి , మరణ అనంతరం పుణ్య లోకాలు పొందుతాము ...

💠 గణనాయకాష్టకం - అన్ని విజయాలకు !!
💠 శివాష్టకం - శివ అనుగ్రహం !!
💠 ఆదిత్యహృదయం - ఆరోగ్యం , ఉద్యోగం !!
💠శ్రీరాజరాజేశ్వరి అష్టకం - సర్వ వాంచసిద్ది !!
💠 అన్నపూర్ణ అష్టకం - ఆకలి దప్పులకి !!
💠 కాలభైరవ అష్టకం - ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం !!
💠 దుర్గష్టోత్తర శతనామం - భయహరం !!
💠 విశ్వనాథ అష్టకం - విద్య విజయం !!
💠 సుబ్రహ్మణ్యం అష్టకం - సర్పదోష నాశనం , పాప నాశనం !!
💠 హనుమాన్ చాలీసా - శని బాధలు , పిశాచపీడ !!
💠 విష్ణు శతనామ స్తోత్రం - పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి !!
💠 శివ అష్టకం - సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి !!
💠 భ్రమరాంబిక అష్టకం - సర్వ శుభప్రాప్తి !!
💠 శివషడక్షరి స్తోత్రం - చేయకూడని పాప నాశనం !!
💠 లక్ష్మీనరసింహ స్తోత్రం - ఆపదలో సహాయం , పీడ నాశనం !!
💠 కృష్ణ అష్టకం - కోటి జన్మపాప నాశనం !!
💠 ఉమామహేశ్వర స్తోత్రం - భార్యాభర్తల అన్యోన్యత !!
💠 శ్రీ రామరక్ష స్తోత్రం - హనుమాన్ కటాక్షం !!
💠 లలిత పంచరత్నం - స్త్రీ కీర్తి !!
💠 శ్యామాల దండకం - వాక్శుద్ధి !!
💠 త్రిపుర సుందరి స్తోత్రం - సర్వజ్ఞాన ప్రాప్తి !!
💠 శివ తాండవ స్తోత్రం - రథ గజ తురంగ ప్రాప్తి !!
💠 శని స్తోత్రం - శని పీడ నివారణ !!
💠 మహిషాసుర మర్ధిని స్తోత్రం - శత్రు నాశనం !!
💠 అంగారక ఋణ విమోచన స్తోత్రం - ఋణ బాధకి !!
💠 కార్యవీర్యార్జున స్తోత్రం - నష్ట ద్రవ్యలాభం !!
💠 కనకధార స్తోత్రం - కనకధారయే !!
💠 శ్రీ సూక్తం - ధన లాభం !!
💠 సూర్య కవచం - సామ్రాజ్యంపు సిద్ది !!
💠 సుదర్శన మంత్రం - శత్రు నాశనం !!
💠 విష్ణు సహస్ర నామ స్తోత్రం - ఆశ్వమేధయాగ ఫలం !!
💠 రుద్రకవచం - అఖండ ఐశ్వర్య ప్రాప్తి !!
💠 దక్షిణ కాళీ - శని బాధలు , ఈతిబాధలు !!
💠 భువనేశ్వరి కవచం - మనశ్శాంతి , మానసిక బాధలకు !!
💠 వారాహి స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!
💠 దత్త స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!
💠 లాలిత సహస్రనామం - సర్వార్థ సిద్దికి !!

⭐⭐⭐ పంచరత్నం - 5 శ్లోకాలతో కూడినది !!
⭐⭐⭐ అష్టకం - 8 శ్లోకాలతో కూడినది !!
⭐⭐⭐ నవకం - 9 శ్లోకాలతో కూడినది !!
⭐⭐⭐ స్తోత్రం - బహు శ్లోకాలతో కూడినది !!
⭐⭐⭐ శత నామ స్తోత్రం - 100 నామాలతో స్తోత్రం !!
⭐⭐⭐ సహస్రనామ స్తోత్రం - 1000 నామాలతో స్తోత్రం !!

పంచపునీతాలు
⭐ వాక్ శుద్ధి
⭐ దేహ శుద్ధి
⭐ భాండ శుద్ధి
⭐ కర్మ శుద్ధి
⭐ మనశ్శుద్ధి

💠 వాక్ శుద్ధి :
వేలకోట్ల ప్రాణాలను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక మనిషికే ఇచ్చాడు .... కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు .... పగ , కసి , ద్వేషంతో సాటి వారిని ప్రత్యక్షంగా కానీ , పరోక్షంగా కానీ నిందించకూడదు .... మంచిగా , నెమ్మదిగా , ఆదరణతో పలకరించాలి .... అమంగళాలు మాట్లాడే వారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి ....

💠 దేహ శుద్ధి :
మన శరీరం దేవుని ఆలయం వంటిది .... దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ , రెండు పూటలా స్నానం చెయ్యాలి .... చిరిగిన , అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు ....

💠 భాండ శుద్ధి :
శరీరానికి కావలసిన శక్తి ఇచ్చేది ఆహారం .... అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి .... స్నానం చేసి , పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారం అమృతతుల్యమైనది ....

💠 కర్మ శుద్ధి :
అనుకున్న పనిని మధ్యలో ఆపిన వాడు అధముడు .... అసలు పనినే ప్రారంభించని వాడు అధమాధముడు .... తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడు ....

💠 మనశ్శుద్ధి :
మనస్సును ఎల్లప్పుడు ధర్మ , న్యాయాల వైపు మళ్ళించాలి .... మనస్సు చంచలమైనది .... ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది .... దాని వల్ల అనేక సమస్యలు వస్తాయి .... దీని వల్ల దుఃఖం చేకూరుతుంది .... కాబట్టి ఎవ్వరికి హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండటమే మనఃశుద్ధి ...

⏩ ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదమౌతుంది !!
⏩ ఆకలికి భక్తి తోడైతే ఉపవాసమౌతుంది !!
⏩ నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థమౌతుంది !!
⏩ యాత్రకి భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది !!
⏩ సంగీతానికి భక్తి కలిస్తే కీర్తనమౌతుంది !!
⏩ గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయమౌతుంది !!
⏩ సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది !!
⏩ పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది !!
⏩ భక్తి ప్రవేశిస్తే మనిషి మనీషి అవుతాడు !!

Saturday, June 15, 2019

శని త్రయోదశి !!

శని త్రయోదశి అంటే చాలామందికి తెలియదు. ఆ రోజు అభిషేకం చేస్తే ఎంతోమంచిదని పెద్దలు చెబుతుంటారు. అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి.. ఎలా చేయాలి.. తెలుసుకుందామా...?

త్రయోదశి వ్రతం

త్రయోదశి వ్రతం శనివారంతో కుడిన ఒక శుక్ల / కృష్ణ త్రయోదశితో ప్రారంభించి, ఏడాది పొడుగునా శనివారాలు మాత్రమే పడే త్రయోదశిగానీ లేదా 24 శుక్ల / కృష్ణ పక్ష త్రయోదశులు గానీ ఎన్నుకొని నియమబద్ధంగా చేయవచ్చు.

ప్రదోషకాలంలో శివపూజ, భక్త భోజనం చేయాలి. సూర్యాస్తమయం తర్వాత ఆరు ఘడియలకాలం వరకు త్రయోదశి ఉండాలి. శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపన గోత్రం.

నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకంలేని కరుణామూర్తి శనీశ్వరుడు . ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడట.

శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. మూడు దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనీశ్వరుడు.

1. ఉదయానే తలస్నానం చేయాలి. ఆరోగ్యం సహకరించేవారు ఆరోజు పగలు ఉపవాసం ఉండి సాయంత్రం 8గంటల తరువాత భోజనం చేయాలి.

2. ఆ రోజు మద్యమాంసాలు ముట్టరాదు.

3. వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది.

4. శనిగ్రహదోషాల వల్ల బాధపడేవారు
నీలాంజన సమభాసం, రవిపుత్రం యమాగ్రజం,
ఛాయా మార్తాండ సంభూతం,తం నమామి శనైశ్చరం

అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠిస్తే మంచిది.

5. వీలైనంతసేపు ఏపని చేస్తున్నా "ఓం నమ: శివాయ" అనే శివపంచాక్షరీ మంత్రాన్ని జపించాలి.

6. ఆరోజు ఆకలి గొన్న జీవులకు భోజనం పెడితే మంచిది.

7. ఉదయం సూర్యోదయం కాగనే శరీరానికి నువ్వుల నూనె రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శివుని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.

శనిదేవుడు అంటే చాలా మంది బయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు.అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు.శని భగవానుడు అంటే నీతి,న్యాయం,ధర్మబద్దతకు కట్టుబడి ఉంటాడు.గోచారరిత్య శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్దంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు.

ఏయే రాశులవారికి ఈ సంవత్సరం శని అనుకూలంగా లేడు ?

వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మకరం రాశులవారికి ఈ ఏడాది శనివలన అనుకూలంగా  లేదు. కనుక ఈ రాశుల వారు అందరూ శని త్రయోదశికి పూజ చేసుకొని శని బాధలు దూరం చేసుకోవడం మంచిది. 

Thursday, June 6, 2019

మనిషి దేహము నందలి నాడులు ....


ఈ ప్రపంచం నందు ఎన్ని విచిత్రాలు ఉన్నాయో అంతకు మించి మనిషి దేహం నందు కలవు.

భగవంతుడు తన శక్తి నంతటిని మనిషి శరీరం నందు వెన్నెముక క్రింద బాగంలో వెంట్రుక వలె ఉండు కుండలినిలో దాచాడు. మీరు మీ రెండు చూపుడు వేళ్ళని రెండు చెవులలో పెట్టుకుని ప్రశాంతంగా లోపలి శబ్దాన్ని వినండి. అదే శబ్దం మీకు ప్రవాహంలా వినిపిస్తుంది. అదే నాడీ స్పందన. అందలి రక్త ప్రసరణ, శక్తి ఆ శబ్దం చేయును. ఒక మనిషి ఒక మంత్రమును తీసుకుని శ్రద్ధగా అదే పనిగా ఉపాసిస్తే 41 రొజులలో శక్తివంతుడు కావొచ్చు.

శరీరం నందలి మూలాధారంనకు మీదగా నాభి స్థానమునకు మధ్యంబున కంద స్థానం నందు సుషుమ్న అను నాడియోకటి కలదు. ఇళా , పింగళ నాడులు ఈ సుషుమ్న నాడిని చుట్టుకొని ఉంటాయి. మనుషుల దేహంబున సుక్ష్మ, స్థూల నాడులు 3 కోట్ల 50 లక్షలు ఉన్నవి.

ఈ నాడులు ములాదారమును ఆశ్రయించి కొన్ని ఊర్ధ్వ (పైకి ) భాగము, కొన్ని అధొ (క్రిన్ధ ) భాగము , మరికొన్ని తిర్యక్ భాగముగా వ్యాపించి ఉన్నాయి. మరియు పై నాడులను ఆశ్రయించి 3 కొట్ల 50 లక్షల రోమములు ఉన్నవి.ఈ రోమములే నాడులకు ముఖములుగా చెప్పబడును. వీటినుండే చెమట స్రవించ బడును.

ఒక సుక్ష్మ వాయువు కలదు. అది ప్రాణాది వాయువుల ద్వారా దేహమంతటికి వ్యాపించు చుండెను. ఈ నాడులలో 72 వేల నాడులు వాయు సంచార యోగ్యమై ఉండును. నదులు తమ జలములతో సముద్రాన్ని ఏ విదంగా సమృద్ది పరుచునో అదే విదంగా నాడులు మనిషి తీసుకున్న అన్నపానాదుల రసము చేత దేహమును వృద్ది చేయు చున్నది.

అందు 1072 నాడులు స్థూల నాడులు గా ఉన్నవి. ఈ నాడులలో శబ్ద, స్పర్శ, రూప, రస, గందాత్మక , పంచేంద్రియ , గుణ గ్రాహకంబులు అగు నాడులే మిగుల శ్రేష్టముగా ఉండును. ఈ అయిదు నాడులు ములాదారమును ఆశ్రయించి నాభి చక్రమున ప్రవేశించి ఉన్నవి. పైన చెప్పిన స్థూల నాడులను ఆశ్రయించి నిర్మలమైన 700 ప్రదాన నాడులు సుక్ష్మ చిద్రములతో కూడి యుండును . ఇవి ప్రతి దినం మనిషి భక్షించే వివిద అన్నపానదుల రసం గ్రహించుతూ శరీరాన్ని వృద్ది చేయును.

పైన చెప్పిన నాడులలో ఇళా , పింగళ , సుషుమ్న , సరస్వతి, వారుణి, పుషా , హస్తి జిహ్వ , యశస్విని , విశ్వోదరి, కుహు, శంకిని, పయస్విని, అలమ్బుస , గాంధారి అను ఈ 14 నాడులు ముఖ్యమైనవి.

ఈ పదునాలుగు నాడులలో ఇడా నాడి మొదలు చారాణ నాడి వరకు గల పది నాడులు ప్రాణాధి వాయు వాహినులు అయి ఉండును. అందువలన ఇవి ప్రదాన నాడులుగా గుర్తిన్చబడుతున్నవి . ఇడా , పింగళ , సుషుమ్న అను ఈ 3 నాడులు శరీరం లొ పైబాగమునకు పోవును.

గాంధారి, హస్తిజిహ్వ, అను రెండు నాడులు చేతులు మొదలయినవి చాచుటకు , ముడుచుటకు ఉపయుక్తములు అయి ఉండును.

ఆలంబుస, యశస్విని అను రెండు నాడులు దక్షినాంగమున ఉండును. కుహు, శంకిని, అను ఈ రెండు నాడులు వామబాగంబున వ్యాపించి ఉండును. మద్య బాగం నందు ఉండే ఒక నాడి నాడి సమస్త కార్యంబులను చేయును.

వామ నాసిక యందు ఇడా , దక్షిణ నాశిక యందు పింగళ , బ్రహ్మ రంద్రంబు యందు సుషుమ్న , వామ నేత్రము యందు గాంధారి, దక్షిణ నేత్రంబు యందు హస్తిజిహ్వ, దక్షిణ కర్ణంబు పూషా , వామ కర్ణంబు యందు యశస్విని, జిహ్వయందు ఆలంబుసం , శిశ్న ములంబున కుహువు, శిరము మీద బాగమున శంఖిని . ఇలా పది నాడులు ద్వారంబులును ఆశ్రయించి ఉండును.

ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము, నాగము, కూర్మము, క్రుకరము , దేహ దత్తము, దనుంజయము అను ఈ పది వాయువులు దేహమంధలి సర్వ నాడులలో సంచరించును. ఇందు ధనంజయ వాయువు అనునది మనిషి మరణించాక శరీరం ఉబ్బుటకు కారణం అగును.

కర్ణముల యందు వ్యాపించు ఉండు నాడులు శబ్ద గ్రాహకములు, నేత్రముల యందు ఉండేవి రూప గ్రాహకములు, నాశిక యందు ఉండేవి కంద గ్రాహకములు, జిహ్వ యందు ఉండేవి రస గ్రాహకములు, చర్మం యందు ఉండేవి స్పర్శ గ్రాహకములు, హృదయం , ముఖము నందు ఉండునవి శబ్దోచ్చారనముకు ఉపయుక్తమై ఉండును.

పురీతతి అను నాడి యందు మనస్సు లీనం అయినపుడు నరునికి నిద్రకలుగును

అవధూత అంటే ఎవరు ? సన్యాసి అంటే ఎవరు ?

ఆధ్యాత్మిక ప్రయాణం లో తప్పక తెలుసుకోవలసిన స్దితులు :

అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎక్కడో ఎప్పుడో ఏమరుపాటు గా వచ్చి వెళ్లి పోతూ ఉంటారు.
అవధూతల గురించి తెలుసుకోబోయే ముందు సన్యాసం గురించి తెలుసుకుందాము.
సన్యాసం నాలుగు రకాలు .

౧. వైరాగ్య సన్యాసం :
వ్యర్ధమైన విషయం వినడం చూడటం పై ఆశక్తి తగ్గిపోతుంది .
   ప్రత్యేకించి ఇది ఇష్టం అది ఇష్టం లేదు అనే భావన  ఉండదు .
   అన్ని విషయాలపై మెల్లగా అనాసక్తి మొదలౌతుంది.

౨. జ్ఞాన సన్యాసం :
సత్ సాంగత్యం ద్వారా , లౌకిక వాంచలు తగ్గిపోయి
   సత్యా అసత్యా విచక్షణతో జ్ఞానంతో నిత్యం కర్మలు ఆచరిస్తూ ,
   ఏది తనకు అంట కుండా వసిస్తూ ఉంటాడు .

౩. జ్ఞాన వైరాగ్య సన్యాసం :
సాధన ద్వారా , ధ్యానం ద్వారా
    అభ్యసించి తనకు తానూ అన్వయించుకుని
    నిత్య ఆనంద స్దితిలో జీవిస్తాడు .

౪. కర్మ సన్యాసం :
బ్రహ్మ చర్యము , గృహస్త , వానప్రస్త ఆశ్రమ ధర్మాలు నిర్వహిస్తూ ,
  ఫలితాన్ని ఆశించక కర్మలు చేస్తూ వెళ్ళిపోతూ ఉండటం .

ఈ సన్యాసులు ఆరు రకాలు :

౧. కుటిచకుడు :
శిఖ, యజ్నోపవితము దండ, కమండలాలు ధరించి సంచారం చేయకుండా భక్తీ మార్గంలో వసిస్తూ  అల్పాహారం తీసుకుంటూ ఉంటారు.

౨. బహుదకుడు :
ఇతను రోజుకు ఎనిమిది ముద్దలు ఆహారం తీసుకుంటూ నిత్యం సాదాన చేస్తూ ఉంటారు

౩. హంస :
ఇతను జడధారియై కౌపినం ధరించి ఉంటాడు.

౪. పరమహంస :
వెదుర దండాన్ని కలిగి , ఐదు గృహాల నుండి భిక్ష తెచ్చుకుని కోపినం మాత్రం ధరించి
 నిరంతర సాధన లో ఉంటారు .

౫. తురియాతితుడు :
దేహాన్ని ఓ శవంలా చూస్తాడు .

౬. అవధూత :
ఇతనికి ఏవిధమైన నిష్ఠ నియమాలు లేవు .జగత్ మిధ్య నేను సత్యం అంటూ ,
నాశనమయ్యే ఈ శరీరం నేను కాదు. చూసే వాడికి కనిపించే ఈ రూపం నాది కాదు.
నాకు పాప పుణ్యాలు, సుఖ దుఖాలు లేవు, గర్వము మాత్సర్యము, దంభము, దర్పము, ద్వేషము,
అన్నింటిని త్యజించి ప్రాణాలు నిలుపుకోవడానికి
అగ్ని దేవుడికి కాస్త దొరికిన ఆహరం అర్పణ చేస్తూ, 
దొరకని రోజు ఏకాదశి  దొరికిన రోజు ద్వాదశి అంటూ
రాత్రి పగలు నిత్య ఎరుకతో సంచారం చేస్తూ పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటాడు.
కర్మలు అన్ని క్షయం అయిపోయి వరించిన మోక్షం అనే కంబళి కప్పుకుని ఉంటాడు ... ( నిర్వాణ షట్కానికి ప్రతి రూపం అవధూతల మరో రూపం )
ఆత్మసాత్కాక్షారం నుండి ....

⚜🚩⚜🚩⚜

హిందు ధర్మం లో సమయాన్ని విభజించారు

హిందు ధర్మం లో..పూర్వం సమయాన్ని ఎంత లోతుగా విభజించారు గణించారు అనడానికి ఇది ఓ ఉదాహరణ
ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన విషయం,
ఇంక చదవండి మనసు పెట్టండి.కొంచం ఓపికగా చదవండి
దీన్ని సేకరించడానికి నాకు చాల సమయం వెచ్చించాను మిత్రులారా


తృటి =సెకండ్ లో 1000 వంతు
100 తృటులు =1 వేద
3 వేదలు=1 లవం
3 లవాలు=1 నిమేశం.రెప్ప పాటుకాలం
3 నిమేశాలు=1 క్షణం,
5 క్షణాలు=1 కష్ట
15 కష్టాలు=1 లఘువు
15 లఘువులు=1 దండం
2దండాలు=1 ముహూర్తం
2 ముహూర్తాలు=1 నాలిక
7 నాలికలు=1 యామము,ప్రహారం
4 ప్రహరాలు=ఒక పూట
2 పూటలు=1 రోజు
15 రోజులు=ఒక పక్షం
2 పక్షాలు=ఒక నెల.
2 నెలలు=ఒక ఋతువు
6 ఋతువులు=ఒక సంవత్సరం.
10 సంవత్సరలు=ఒక దశాబ్దం
10 దశాబ్దాలు=ఒక శతాబ్దం.
10 శతాబ్దాల=ఒక సహస్రాబ్ది
100 సహస్రాబ్ది=ఒక ఖర్వ..లక్ష సంవత్సరాలు

4లక్షల 32 వెల సంవత్సరాలు= కలియుగం
8లక్షల 64 వేల సంవత్సరాలు=త్రేతాయుగం
12లక్షల 96 వేల సంవత్సరాలు=ద్వాపర యుగం
17లక్షల28 వేల సంవత్సరాలు=కృత యుగం
పై 4 యుగాలు కలిపి=చక్రభ్రమణం.(చతుర్ యుగం)
71 చక్రభ్రమాణాలు=ఒక మన్వంతరం
14 మన్వంతరాలు=ఒక కల్పం
200 కల్పాలు ఐతే=బ్రహ్మరోజు
365 బ్రహ్మరోజులు =బ్రహ్మ సంవత్సర
100 బ్రహ్మ సంవత్సరాలు=బ్రహ్మసమాప్తి
ఒక బ్రహ్మసమాప్తి=విష్ణుపూట
మరో బ్రహ్మఉద్బవం=విష్ణువు కు మరో పూట

భాగవతాదారితం
ఇది చదవడానికి ,సేకరించడాని కి చాలా సంతోషపడుతున్నాను.

దీనిలో సవరణలు ఉంటే చెప్పగలరు

Sunday, June 2, 2019

కాలభైరవ స్వామి చరిత్ర !

ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో అస్సలు బ్రహ్మము ఎవరో అని సందేహం వచ్చింది. ఆ సందేహమును తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు.

శంకరుడికి సద్యోజాత, అఘోర ,తత్పురుష ఈశాన, వామదేవ అను అయిదు ముఖములు ఉంటాయి.
ఈ అయిదు ముఖములతో ఋషుల వంక చూస్తూ అన్నాడు ‘అదేమిటయ్యా బ్రహ్మము ఎవరని అడుగుతారేమిటి? నేనే బ్రహ్మమును’ అన్నాడు.

అపుడు బ్రహ్మగారు ‘నేనే ఈ లోకముల అన్నిటిని సృష్టించాను, నేనే ని పుట్టుక కు కర్తను. నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింపచేశాను ,నేనే వీటిని సంహారం చేస్తాను. నేనెప్పుడూ బతికే ఉంటాను. కాబట్టి నాకన్నా బ్రహ్మము ఎవరు? నేనే బ్రహ్మమును’ అన్నాడు.

తరువాత పక్కనున్న విష్ణువు ‘బ్రహ్మా అసలు నీవు పుట్టింది నా నాభి కమలంలోంచి కదా,కావున నేనే బ్రహ్మమును అన్నాడు. ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది.

మనకి శృతి ప్రమాణం కదా అందుకని వేదాలని పిలుద్దాం అని వేదాలని పిలిచారు.

ఋగ్వేదం:>>

అపుడు ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త ,ఏ మహానుభావుడు సంకల్పం వలన మొట్టమొదట నారాయణుడు జన్మించాడో, ఎవడు చిట్టచివర ఈ లోకములని తనలోకి తీసుకుంటున్నాడో ,అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది.

యజుర్వేదము:>>

తరువాత యజుర్వేదమును పిలిచారు. అసురీశక్తులు పోయి ఈశ్వరీ శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు. కాబట్టి జ్ఞాన యజ్ఞమునందు ఆరాధింప బడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది.

సామవేదము:>>

తరువాత సామవేదమును పిలిచి అడిగారు మూడు కన్నులున్న వాడెవడు ఉన్నాడో, ఎవరు ఈ లోకమునంతటినీ తిప్పుతున్నాడో, ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో ,ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నాడో ,ఎవడు తనలో తాను రమిస్తూ ఉంటాడో ,అటువంటి శివుడు పరబ్రహ్మము’ అని చెప్పింది.

అధర్వణవేదము:>>

పిమ్మట అధర్వణ వేదము ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకుని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో ,అటువంటి పరమశివుడు పరబ్రహ్మము’ అని చెప్పింది.

అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకడున్నాడు. తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం. నాలుగు వేదములు అదే చెప్తున్నాయి.

ప్రణవం:>>

ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు. అపుడు ప్రణవం ఎవడు నిరంతరమూ శక్తి స్వరూపముతో క్రీడిస్తూ ఉంటాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరులై వారున్నారో, అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో ,అటువంటి పార్వతీ పరమేశ్వరులు, పార్వతి వామార్థ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము’ అని చెప్పింది.

ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు. ఈమాటలు రుచించక పోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారాడు.

జ్యోతి సాకారం అయింది. సాకారమును చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు. కానీ బ్రహ్మ నీవు ఎవరు? నువ్వు నా రెండు కనుబొమల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు. నన్ను స్తోత్రం చెయ్యి’ అన్నాడు.

బ్రహ్మలో మార్పు రాలేదు. ఆయన దండింపబడాలి. కాబట్టి ఇపుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది. ‘శంకర ఏమి నీ ఆజ్ఞ అని అడిగాడు. బ్రమ్మ అహంకారంతో మాట్లాడుతున్నాడు. అయిదవ తలను గిల్లెయ్యి’ అన్నాడు.

ఇప్పుడు ఈ స్వరూపం ప్రచండ రూపమును పొందింది. దిగంబరమై రూపం తొ ,బ్రమ్మ అయిదవ తలను గోటితో గిల్లేసింది. ఆ రూపమే కాలభైరవ స్వరూపం.

ఇలా జరిగే సరికి బ్రహ్మ భయపడి పోయి నాలుగు తలకాయలు అమ్మవారి చేతుల క్రింద పెట్టేసి ఈశ్వరా, నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అన్నాడు.

అపుడు శంకరుడు కాల భైరవునితో నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు. కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది. కాబట్టి నిన్ను ఇవాళ్టి నుంచి కాలభైరవ అని పిలుస్తారు.

కాలభైరవ నీవు ఎంత గొప్ప వాడవయినా బ్రహ్మ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది. ఈ అయిదవ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండు సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను. అపుడు నీ బ్రహ్మ హత్యా పాతకం పోతుంది. అని చెప్పాడు.

బ్రహ్మహత్యాపాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించినా తనకు సోకిన బ్రహ్మహత్యాపాతకము తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు.

కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు  ‘‘కాలభైరవా! నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు. బ్రహ్మ దేవుడి గర్వమును అణుచుటకు జనించినవాడవు. నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు. కనుక నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు... కాశీ క్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మ హత్యాపాతకం భస్మమైపోతుంది’’ అని సలహా యిచ్చాడు.

దీనితో- కాలభైరవుడు కాశీ నగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్యాపాతకం తొలగిపోగా, బ్రహ్మకపాలాన్నీ కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మకపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే - నేటి కాశీ క్షేత్రంలోని ‘‘కపాల మోక్షతీర్థం’’.

కాశి లొ కాలభైరవుడు విశ్వనాథ లింగాన్నిభక్తి తొ పూజించి తరించాండు.విశ్వనాధుడు భక్తి కి మెచ్చి కొన్ని వరాలు ఇచ్ఛాడు.

కాలభైరవ ఎవడు ఈశ్వరుని ధిక్కరించి బ్రతుకుతాడో వాడి ప్రాణోత్క్రమణము అవగానే నువ్వే కనపడతావు. దీనిని ‘భైరవ యాతన’ అంటారు. అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు.

కానీ ఎవరు నీ గురించి వింటారో, శివాలయమునకు వచ్చినపుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నీవు తీసెయ్యి. అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను ‘అమర్దకుడు’ అని పిలుస్తారు.

ఇకనుంచి నీవు నా దేవాలయ ములలో క్షేత్ర పాలకుడవయి ఉంటావు. భక్తుల పాపములను నీవు తీసిన వాటిని నువ్వు తినేయ్యి. నువ్వు పాపములను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు ‘పాప భక్షకుడు’ అనే పేరును ఇస్తున్నాను.

నిన్ను కాశీ క్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్ళే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు’ అని చెప్పాడు.

అందుకే మనను కాశీక్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్రప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక అయ్యా నాకు లోపలికి ప్రవేశింపచేసి నా పాపములను దగ్ధం చేశావు కాలభైరవా’ అని

ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతా పూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి ఇకనుంచి మంచి పనులు చేస్తాను, అని అన్న సంతర్పణ చేస్తాడు. భైరవ మూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మేడలో ఒక గారెల దండ వేస్తారు. కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్లి ఆ ప్రసాదమును తీసుకోవాలి.

ఇహలోకమునందు ఇప్పటివరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితము ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింప చేస్తాడు.

అందుకే హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసా దేవి ఆలయమునకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ‘ఒకసారి ఒంగోండి’ అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు. అది భైరవ యాతన అని ఆ కర్ర ఠప్ అంటుంది. అక్కడితో పాపాలు పోతాయి.

ఈ విధంగా ఆనాడు పరమేశ్వరుడు కాల భైరవుడికి ఇన్ని వరములను గుప్పించాడు. ఆ మూర్తే ఇప్పటికీ మనకి ప్రతి శివాలయంలో ఆయన ఈశ్వర ఆజ్ఞను ఔదలదాల్చి వచ్చినవాడు కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు.

ఆయన భక్తుల పాలిట కొంగుబంగారం. ఎవరు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వారి పాలిట భైరవ దర్శనంగా భయంకరంగా కనపడతాడు.

కాబట్టి ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది. ‘మేము కాశీ వెళ్ళాము – మాకు ఇంట ఏ భయమూ లేదు’ అని చెప్పడానికి ఒక నల్లతాడును రక్షగా కూడా కట్టుకుంటారు. కాబట్టి ఇన్ని రూపములుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడింది.

ఎవరు ఈ కాలభైరవ స్వరూపమును గురించి వింటున్నారో భక్తితో ప్రణమిల్లుతున్నారో ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు. కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు. వాళ్ళు ఎప్పుడూ ఎంతో సంతోషంగా, సుఖంగా ఉంటారు.

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...