ధన్వంతరి అన్న పేరు భారతదేశ సంప్రదాయ రచనలు, కథలలో నాలుగు విధాలుగా వినవస్తున్నది.
భాగవతంలో క్షీరసాగర మధనం సమయంలో అమృత కలశాన్ని చేబట్టుకొని అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారం.
బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం భాస్కరుని (సూర్యభగవానుని) వద్ద ఆయుర్వేదం నేర్చుకొన్న ధన్వంతరి. ఇతడు సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడు.
కాశీరాజు దేవదాసు ధన్వంతరి (అంటే "ధన్వంతరి" అన్న బిరుదు కలిగిన కాశీరాజు "దేవదాసు") - ఇతడు శుశ్రుతునికి ఆయుర్వేదం, శస్త్ర చికిత్స నేర్పాడు. ఇతడు పురాణాలలో చెప్పబడిన ధన్వంతరి అవతారమన్న విశ్వాసం ఉంది.
విక్రమాదిత్యుని ఆస్థానంలో "నవరత్నాలు"గా ప్రసిద్ధులైన పండితప్రతిభామూర్తులలో ఒకడు. ఇతడే "ధన్వంతరి నిఘంటువు" అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంథాన్ని రచించాడని ఒక అభిప్రాయం.
ఇంతే కాకుండా పూర్వకాలంలో గొప్ప గొప్ప ఆయుర్వేద వైద్యులను "ధన్వంతరి" అనే బిరుదుతో సత్కరించేవారు. కనుక వివిధ ధన్వంతరుల కథలు చరిత్రలో కలగలుపు అయి ఉండవచ్చును.
వ్యుత్పత్తి
ధన్వన్తరి శబ్దానికి "ధనుఃశల్యం, తస్య అంతం పారం ఇయర్తి, గచ్ఛతీతి, ధన్వన్తరిః" అని వ్యుత్పత్తి (Etymology) చెప్పబడింది. మనస్సు మరియు శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు, రోగాలు, శరీరంలోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించే వానిగా చెప్పవచ్చును. పురాతనకాలం నుంచి భారతదేశంలో శస్త్ర చికిత్సా కుశలులైన వారికి "ధాన్వన్తరీయులు" అని వ్యవహరించడం వాడుకలో ఉంది.
భాగవతంలో గాధ
భాగవతం అష్టమ స్కంధంలో క్షీరసాగర మధనం సమయాన ముందుగా హాలాహలం ఉద్భవించింది. దానిని మహాదేవుడు హరించాడు. కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు. తరువాత రమాదేవి అవతరించి విష్ణువు వక్షోభాగాన్ని అలంకరించింది. తరువాత ధన్వంతరి అవతరించాడు.
"అప్పుడు సాగర గర్భంనుండి ఒక పురుషుడు, పీనాయుత బాహు దండాలను, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణికుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని దాల్చినవాడు ఆవిర్భవించాడు. అతని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి "ధన్వంతరి" అని పేరు పెట్టినారు."
కాశీరాజ దివోదాస ధన్వంతరి
భాగవతంలోనే నవమ స్కంధంలో కాశీరాజు ధన్వంతరి గురించి పురూరవ వంశక్రమంలో ఉంది (9.17.4) - ఆ ప్రకారం పురూరవునికి క్షత్రవృద్ధుడు, అతనికి సుహోత్రుడు, సుహోత్రునకు కాశ్యుడు, అతనికి కాశి, కాశికి దీర్ఘతపుడు, దీర్ఘతపునికి ధవ్వంతరి జన్మించారు. ధన్వంతరి హరి అంశతో ప్రభవించి ఆయుర్వేద ప్రవర్తకుడయ్యాడు. విష్ణుపురాణంలో కూడా ఈ వంశక్రమం ఉంది. ధన్వంతరికి మూడవ తరంవాడు దివోదాసుడు (దివోదాస ధన్వంతరి). ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రాన్ని ఎనిమిది భాగాలుగా (ఆష్టాంగాలుగా) విభజించాడట. అవి
కాయ చికిత్స (Internal Medicine)
కౌమారభృత్య లేదా బాలచికిత్స (Paediatrics)
భూతవైద్యం లేదా గ్రహచికిత్స (Psychiatry)
శలాక్యతంత్ర (Otto-Rhino-Laryngology & Opthalmology)
శల్యతంత్ర (Surgery)
విషతంత్ర (Toxicology)
రసాయన తంత్ర (Geriatrics)
వశీకరణ తంత్ర(The therapy for male sterility, impotency and the promotion of virility)
ఈ (సీనియర్) ధన్వంతరి కాశీరాజు దివోదాస ధన్వంతరికి ముత్తాత అయి ఉండాలి. కాశీరాజు దివోదాస ధన్వంతరి ఆయుర్వేద గ్రంధాలు ఏవైనా, ముఖ్యంగా శల్య సలాక్య తంత్రాల గురించి, వ్రాశాడో లేదో తెలియడం లేదు. బహుశా "చికిత్స తత్వ విజ్ఞానము", "చికిత్సా దర్శనము" అనేవి ధన్వంతరి దివోదాస రచనలు మరియు "చికిత్సా కౌముది" అనేది కాశీరాజు రచన అయి ఉండవచ్చును. శుశ్రుతుడు రచించిన "శుశ్రుత సంహితము" అనే మనకు లభించే రచన అతని గురువైన కాశీరాజు బోధనలపై ఆధారపడి ఉన్నట్లు అనిపిస్తుంది. వాటి ద్వారా ఆ కాలంలో శాస్త్రీయ విధానాలు స్పష్టంగా నెలకొన్నట్లు తెలుస్తున్నది. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన ప్రమాణాల గురించి (scientific methodology comprising observation and inductive, deductive and analogical reasoning) చెప్పబడింది. శల్య తంత్ర, శలాక్య తంత్ర అనే రెండు శస్త్ర చికిత్సా విధానాలకు కాశీరాజ దివోదాస ధన్వంతరి ఆద్యుడు అనిపిస్తున్నది. ఇతను క్రీ.పూ.3000 కాలానికి చెందినవాడని ద్వారకానాధ్ అభిప్రాయపడుతున్నాడు కాని అది నిరూపించడం కష్టంగా ఉంది.
ఆలయాలు
ధన్వంతరి ఆలయాలు ప్రత్యేకంగా కనిపించడం అరుదు. వారాణసిలోని సంస్కృత విశ్వవిద్యాలయం మ్యూజియంలో ఒక ధన్వంతరి విగ్రహం ఉంది. ఢిల్లీలోని "ఆయుర్వేద, సిద్ధ పరిశోధన మండలి కేంద్రం" (Central council for Research in Aurveda and Siddha) లో ఒక పెద్ద, ఒక చిన్న ధన్వంతరి విగ్రహాలున్నాయి.
తమిళనాడు లోని శ్రీరంగం రంగనాధస్వామి ఆలయం ఆవరణలో ఒక ధన్వంతరి మందిరంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. మందిరం వద్దనున్న శిలాఫలకం ప్రకారం అది 12వ శతాబ్దానికి చెందినది. అప్పటి గొప్ప ఆయుర్వేద వైద్యుడు గరుడవాహన భట్టార్ ఈ మందిరంలో మూర్తిని ప్రతిష్
ఠించినట్లు తెలుస్తున్నది. ఇక్కడ తీర్ధంగా కొన్ని మూలికల రసం (కషాయం) ఇస్తారు.
కేరళలో, గురువాయూర్, త్రిస్సూర్‌లకు మధ్య 20 కి.మీ. దూరంలో "నెల్లువాయ" అనే గ్రామంలో ఒక ధన్వంతరి గుడి ఉంది. ఇది గురువాయూర్ దేవస్థానం అంత పురాతనమైనదని భావిస్తారు. తమ చికిత్సావృత్తి ప్రాంభానికి ముందు చాలా మంది ఆయుర్వేద వైద్యులు ఈ మందిరాన్ని దర్శిస్తుంటారు.
కేరళలోనే కాలికట్ పట్టణం పరిసరాలలో ఒక "ధన్వంతరి క్షేత్రం" ఉంది. ఈ మందిరం ఇప్పుడు అధికంగా జనాదరణ పొందుతున్నది. వ్యాధి నివారణకు, ఆరోగ్యానికి ఇక్కడి దేవుడిని దర్శించి ప్రార్థనలు చేస్తుంటారు.
ఆంధ్రప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లాలోని చింతలూరులో ప్రసిద్ధమైన ధన్వంతరి భగవానుని దేవాలయం ఉంది.
కేరళ అష్టవైద్యం
ప్రధాన వ్యాసము: ధన్వంతరి - అష్టవిభాగ ఆయుర్వేదం
కేరళలో సిద్ధ, ఆయుర్వేద వైద్య విధానంలో "అష్టవైద్యం" అనే ఒక విధానం ప్రసిద్ధి చెందింది. ఇది శతాబ్దాల తరబడి అవిచ్ఛిన్నంగా, పెద్దగా మార్పులు లేకుండా సాగుతున్నది. ఇలాంటి వైద్యం చేసే కుటుంబాలు ధన్వంతరిని పూజిస్తుంటారు. తమ ఆశ్రమాలలో ధన్వంతరి ఆలయాలను, విగ్రహాలను ప్రతిష్ఠించారు. కొట్టక్కల్ పులమంటల్ గ్రామంలోను, వడక్కంచేరి వద్ద, త్రిసూర్ పెరుంగ్వా వద్ద అలాంటి ఆలయాలున్నాయి. అలయిత్తూర్, కుట్టంచేరి, తైక్కాడ్, వయస్కార, వెల్లోడ్, చిరత్తమన్‌లలో అష్టవైద్య విధానాన్ని అనుసరించే కుటుంబాలున్నాయి.
ధన్వంతరి వ్రతం
ప్రధాన వ్యాసము: ధన త్రయోదశి
ఆయుర్వేద వైద్యులు ప్రతియేటా "ధన త్రయోదశి" (దీపావళికి రెండు రోజుల ముందు) నాడు భక్తితో జరుపుకొంటారు.
----------------------------------------------------------------------------
అది ఒక వనము, వనమనేకన్న అరణ్యము అంటే భావుంటుంది . . ఎందుకంటే అనేక రకాల ఫలవృక్షాల చేత సారవంతమైన భూమి పై మొలకెత్తిన మూలికలచేత శ్రావ్యమై, స్వరభరితమై ప్రకృతినే పరవశింపచేస్తున్న వేదఘోష చేత, పశుపక్ష్యాదుల సయ్యాటలచేత శోభిల్లుతున్నఅరణ్యమట . . . సృస్టి అంతములో జలావధిలో మునిగి పోకుండా ఉన్న ఏకైక ధరాతలమట .. అది. దాని పేరే "నైమిశారణ్యము". విధాత రాబోయే సృష్టి రచన కోసము మేధావులైన సప్తఋషివర్గాన్ని ఉంచడానికి నిలిపి ఉంచిన భూమి కనుక దానిని "నైమిశారణ్యము" అన్నారు. ఎన్నో వేద సంహితలకి, పురాణ ఇతిహాసాలకి, విజ్ఞానచర్చలకి ... అది అలవాలము. గంభీర వాతావరణములో కూర్చొనివున్నారు అందు ' అగస్త్యమహర్షి, గౌతమమహర్షి, భరద్వాజమహర్షి మొదలగు నిష్ణాతులైన, శాత్రజ్ఞులైన మహర్షులు. అందరు ఒకానొక రోజున మానవలోకములో మనుజులు కనిపించని రోగాలు కొన్నింటికి, కనిపించి బాధపెట్టే మరెన్నో రోగాలకు గురి అవుతున్నారు. తెలియకుండా కబళిస్తున్న వృద్ధాప్యము, ప్రకృతి పరివర్తనలో విపరీతాల వలన వచ్చేటటువంటి సాంక్రమిక జనపద విధ్వంసక వ్యాధులు ... అంటే సమాజాన్నంతటినీ ఒకేసారి కబలించే కలరా, ప్లేగు, వైరల్ జ్వరాదులు - ప్రతీక్షణము మనిషి రోగ భయము తోనూ, మరణ భయముతోను బ్రతుకుతున్నాడని ఆలోచింప సాగారు. నివారణకోసము మార్గాన్ని అన్వేసించే దిశలో సమాదానము చర్చించుకుంటూ తమలో ఒకరైన భరద్వాజమహర్షిని ... ఆయుష్షును పోషించి రక్షించే వైద్యశాస్త్రాన్ని ఏదైనా తెలుసుకొని రమ్మని దేవేంద్రుని వద్దకు పంపారు.
దేవేంద్రుడు ఇంద్రలోక భోగలాలసుడే కాదు తన అర్హతవల్ల ఈ సృస్టి చక్కగా జరిపే ప్రతీశక్తికీ సంచాలకుడు. తనని దర్శించుకున్న బరద్వాజమహర్షిని ఉద్దేశించి " విధాత ముఖమునుండి వెలువడిన వేదాలలోని అధర్వణవేదానికి ఉపవేదముగా ఉన్న ఆయుర్వేదాన్ని తెలియజేసాడు .
ఈ ఆయుర్వేదము క్షీరసాగగ మధనము లో చివరిగా అమృతభాండము తో పుట్టిన ధన్వంతరి భగవానుల సృష్టి అనియు, మృత్యువునుంచి, రోగాలనుండి రక్షించే ఓషదులతో నిక్షిప్తము చేయబడిందనియు చెప్పెను. విధాతనుండి నేను (ఇంద్రుడు), నానుండి సూర్యభగవానుడు, సూర్యును నుండి నకుల, సహదేవులు, అశ్వనీదేవతలు గ్రహించారని చెప్పి " అయుర్వేదాన్ని ఉపదేశించారు .. భరద్వాజమహర్షికి.
అలా వైద్యశాస్త్రానికి మూలపురుషుడు ధన్వంతరి. Father of Ayurveda - ఆయుర్వేద వైద్యపెతామహుడుగా ఖ్యాతి గాంచినవారు ఈ ధన్వంతరి.
ధన్వంతరీస్తోత్రం .
ఈ క్రింది
శ్లోకమును రోజూ సూర్యునకెదురుగా నిలబడి చదివిన ఆరోగ్యసిద్ధి.
హేమాద్రి కృత చతుర్వర్గ చింతామణౌ
॥ధన్వంతరీ స్తోత్రం॥
ఓం శంఖం చక్రం జలౌకాం దధదమృతఘటం చారుదోర్భిశ్చతుర్భిః
సూక్ష్మస్వచ్ఛాతిహృద్యాంశుక పరివిలసన్మౌలిమంభోజనేత్రం౹
కాలాంభోదోజ్జ్వలాంగం కటితటవిలసచ్చారుపీతాంబరాఢ్యం
వందే ధన్వంతరిం తం నిఖిలగదవనప్రౌఢవాగ్నిలీలం॥
ఇతి ధన్వంతరీస్తోత్రం సంపూర్ణం.
🌿సర్వేజనా సుఖినోభవంతు సన్మంగళానిభవంతు🌿

ఆరోగ్య పరిస్థితులు బాగుపడడం గురించి ప్రతీ రోజు పూజ చేసే సమయం లో చదువుకోవాలిసిన ధన్వంతరి మంత్రం
ధన్వంతరి మంత్రం
ఓం నమో భగవతే మహా సుధర్శనాయ
వాసుదేవాయ ధన్వంతరయే ,
అమృత కలశ హస్తాయ, సర్వ భయ వినాశనాయ,
సర్వ రోగ నివారనాయ, త్రి లోకయ పతయే,
త్రి లోకయ నిధయే, శ్రీ మహా విష్ణు స్వరూపాయ,
శ్రీ ధన్వంతరీ స్వరూపాయ,
శ్రీ శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణాయ నమః

No comments:
Post a Comment