Monday, June 18, 2018

శివ నామ మహిమ

శివ నామ మహిమ
మంత్రో హృదయ గోచర: అని అన్నారు. , ఎవరి హృదయంలో నిరంతరం

★★★★★★★★★★★
 ఓం నమ: శివాయ
★★★★★★★★★★★

అనే మంత్రం జపించబడుతుంటుందో, వారికి ఇతర మంత్రాలతో, తీర్థయాత్రలతో, యజ్ఞయాగాదులతో పని లేదని భావం.

ఓం నమ: శివాయ (షడక్షరీ)

నమ: శివాయ (పంచాక్షరీ)

మంత్రాలలో
ఏ ఒక్క మంత్రాన్ని అయినా శ్రద్ధతో జపించే వ్యక్తి సమస్త శుభాలను పొందగలుగుతాడు.

అలాగే మనకు ఆయురారోగ్యాన్ని, సౌభాగ్యాన్ని, దీర్ఘాయువును, శాంతిని, తృప్తిని ఇచ్చేది మహామృత్యుంజయ మంత్రం. ఇది శుక్లయజుర్వేద మంత్రం. శైవులు దీనిని రుద్రాభిషేకంలో, వైష్ణవులు పాచరాత్రదీక్షలో హోమభస్మధారన మంత్రంగా చెప్పుకుంటారు.
ఇది అందరికీ, అంటే శైవులకు, వైష్ణవులకు, మాధ్వులకు ప్రామాణికమయిన మంత్రం
సాధారణంగా మనం ఆరాధించే  శివ, కేశవుల  మధ్య తీవ్ర విభేద బుద్ధిని చాలామంది ప్రదర్శిస్తారు. ఎన్ని శాస్త్రాలు చదివినా ఇలాంటి విషయాల్లో జ్ఞానం శూన్యంగానే తోస్తోంది.  అలాంటివాళ్లకు శివకేశవుల మధ్య భేదం లేదని చెప్పడమే ఉద్ధేశ్యం.
శివ, విష్ణువుల మధ్య భేదం అజ్ఞానమనీ, పరమేశ్వర తత్త్వమే వివిధ ధర్మములతో వివిధ దేవుళ్ళుగా పూజించాబడు తున్నారని, వీరిలో ఎవరిని పూజించినా ఆ పూజ ఇరువురికి  చెందుతుంది .

సర్వ దేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే,


శివస్యహృదయంవిష్ణుఃవిష్ణోశ్చహృదయంశివః


యధాశివమయో విష్ణు
రేవ్వంవిష్ణుమయశ్శివః

యధాంతరంనపశ్యామితధామే స్వస్తిరాయుషి*

శివుడు విష్ణురూపము విష్ణువు శివరూపము

 శివుని హృదయం విష్ణువు.
 విష్ణు హృదయం శివుడు.

శివుడు విష్ణుమయము. విష్ణువు శివమయము.

వీరిమధ్య భేదము చూడని నా ఆయుస్సునకు భద్రముండుగాక. భేదమును చూచానో నా ఆయుస్సునకు ముప్పే" అని అర్థము.
శివ సహస్ర నామస్తోత్రం పంచమవేదంగా ప్రసిద్ధి చెందింది.

మహాభారత యుద్ధానంతరం ధర్మరాజుని శ్రీకృష్ణుడు భీష్మాచార్యు ని వద్దకు తీసుకుని వెళ్ళగా, కురువంశ పితామహుడు సకల ధర్మాలను, ధర్మ సూక్ష్మా లనూ ధర్మరాజుకు భోదించాడు.అంతా నేర్చుకున్న తరువాత ధర్మరాజు తన మనసులోని మాటను బయట పెట్టాడు. పంచమ వేదంగా పరిగణిస్తున్న శివ సహస్ర నామ స్తోత్రం గురించి చెప్పమని తాతగారిని కోరతాడు.
అప్పుడు బీష్మాచార్యుడు ఏ మాత్రం భేషజం లేకుండా ఇలా అంటాడు." ధర్మజా! శివుని గురించి సమగ్రంగా చెప్పగలిగినవాడు శ్రీకృష్ణుడు ఒక్కడే. వారిద్దరూ ఒకటే కనుక ,శ్రీకృష్ణుడు మాత్రమే శివ సహస్ర నామ స్తోత్రాన్ని గురించి చెప్పగలడు." అని అంటాడు.అదే సందర్భంలో భీష్మాచార్యుడు శ్రీకృష్ణుడి వైపు చూస్తూ ధర్మరాజు మనోభిష్టాన్ని గ్రహించావు కదా! శివ సహస్ర నామ స్తోత్రం గురించి వివరించు ' అని అంటాడు.

దాంతో శ్రీకృష్ణుడు కాసేపు ఆలోచన చేసి శివుని వెయ్యి నామాలను ధారాళంగా చెబుతాడు.అంత వేగంగా , తడుముకోకుండా చెప్పగలిగిన వాడు శ్రీకృష్ణుడు మాత్రమేనన్న తన మాట నిజమైనందుకు భీష్మాచార్యుడు సంతోషిస్తాడు. అప్పుడు ధర్మరాజుతో ఇలా అంటాడు." ధర్మజా ! తెలియని వారు ,సగం తెలిసినవారు శివ, కేశవులకు మధ్య భేదాన్ని సృష్టిస్తు ఉంటారు.సృష్టి స్థితి లయ కారకులైన త్రిమూర్తులు ముగ్గురూ ఒకటే ,వారిని వేరు చేసి చూడటం తగదు.

శివుని ఉపాసించు వారు ధన్యులు. కృత కృత్యులు. వారి జన్మ సఫలమగును. వారి కులము ఉద్ధరింపబడును.
ఓం ‘నమశ్శివాయ’ మంత్రాన్ని వేదాలకు, తంత్రాలకు హృదయభాగంగా చెప్తారు. ‘రుద్రం’లో వేదాల మధ్యభాగంలో ‘నమశ్శివాయ’ అనే మంత్రం లిఖితపూరకంగా లభించింది.

ఆగమాలలో దీని అర్థాన్ని విస్తృతంగా వివరించారు. పంచాక్షరీ మంత్రం... మన ఆత్మ, శరీరం, ఉనికి అనీ, ఇది అందరినీ రక్షించే రక్షణ మంత్రమని పండితుల విశ్వాసం. దీనికి సరైన అర్థం ఇవ్వడం చాలా కష్టం. ఓం అనే దానికి ‘నేను నమస్కరిస్తున్నాను’ అని అర్థం. కాని ఈ మాత్రం వివరణతో ఆ మంత్రానికి సరైన నిర్వచనం ఇచ్చినట్టు కాదు. ‘శివ’ అంటే పవిత్రుడు అని అర్థం. అందుకే ‘పవిత్రతకు తల వంచి నమస్కరించడం’ అనే అర్థం చెప్పవచ్చు.

 పుస్తకాలలో ‘శివుడు’
అనే పదానికి చెప్పే ‘వినాశకారుడు’ అనే అర్థాన్ని మాత్రమే తీసుకుంటే సరిపోదు. శివుడు అంటే నాశనం లేనివాడు అని మంత్రానికి ఉన్న అర్థం కన్నా, ఆ శబ్దం నుంచి వచ్చే ధ్వనితతరంగాలకు ప్రాధాన్యత ఎక్కువ. కాబట్టి మిగిలిన మంత్రాలలాగే ఈ మంత్రానికీ అర్థం కన్నా శబ్దమే ప్రధానం. అందువల్ల ఈ పదాన్ని పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవాలి.

శివుడు అంటే ‘నిరాకారుడు’ అనే అర్థాన్ని చెబుతారు. అలాగే ఆయనను ‘పరమశివుడు’ అని కూడా అంటుంటారు. అంటే ‘భగవంతుని అంశ’ అని అర్థం. ఈ అంశ అందరిలోనూ అంతర్భాగంగా ఉంటుందని, ఇది విడదీయలేనిదని శైవుల విశ్వాసం. అయితే ఇది మనిషిలో నుంచి విడిపోవడానికి బయటకు కనిపించే పదార్థం వంటిది కాదు. హృదయానికే హృదయంలాంటిది. ఇది అయిదు అక్షరాల సమాహారం. ఓం నుంచే అన్నీ ఆవిర్భవించాయి .

న, మ, శి, వ, య. మంత్రం ఓం కారంతో ప్రారంభం అవుతుంది. ఓం... మహాబీజాక్షరం. దీని నుంచే మిగిలిన అక్షరాలన్నీ ఆవిర్భవించాయని పెద్దలు చెబుతారు. ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు
 ‘అర్థం, పరమార్థం’
రెండూ ఉన్నాయి.
 ‘న’ అనేది భగవంతునిలోని కాంతిని తెలియచేస్తుందన్నప్పటికీ,

 ఈ పంచాక్షరాలను పంచభూతాలు అని
 కూడా అన్నారు.

"న" అంటే భూమి,
 "మ" అంటే నీరు,
   "శి "అంటే నిప్పు,
     "వ" అంటే గాలి,
       "య"అంటేఆకాశం


అని ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు కొందరు పెద్దలు నిర్వచనం చెప్పారు. ఈ మంత్రం ఆధ్యాత్మికతకు ఉపయోగపడుతుందని, ఈ మంత్రోచ్చారణ వల్ల నాడులు పరిశుభ్రపడి, మనసు ప్రశాంతం అవుతుందని పండితులు చెబుతారు. దీనిని పదేపదే ఉచ్చరించడం వల్ల మనిషిలో ఉండే తమోగుణం, రజోగుణం పోయి ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని కూడా ఆధ్యాత్మికవేత్తలు బోధిస్తున్నారు.

 అనంతమైన అర్థం పరమార్థం ఈ మంత్రం వెనుక ఎంతో పరమార్థం ఉంది. మానవ శరీరం పంచభూతాత్మకం.

నమశ్శివాయ అనే అయిదు అక్షరాలను పలికినప్పుడు పంచ భూతాల (పృథివ్యాపస్తేజోవాయు
రాకాశః) తో నిండిన శరీరం శుభ్రపడుతుంది. ఒక్కో అక్షరం ఒక్కో భూతాన్ని శుభ్రం చేస్తుంది.

న- భూమి కి సంబంధించిన భాగాలను,

మ - నీటి కి సంబంధించిన భాగాలను,

శి - అగ్ని కి సంబంధించిన భాగాలను,

వ - గాలి కి సంబంధించిన భాగాలను,

 య - ఆకాశాని కి సంబంధించిన భాగాలను పరిశుభ్రం చేస్తాయి.

 మనసు, శరీరం పరిశుభ్రంగా లేనంతవరకు మనిషిలో ఆధ్యాత్మిక భావన స్వచ్ఛంగా నిలబడదు. అందువల్లే ఓం నమశ్శివాయ అనే పదాన్ని పదేపదే ఉచ్చరిస్తే, మానసిక ప్రశాంతత ,
ఉన్నతమైన ఆధ్యాత్మికత శక్తి ,ఏర్పడుతుందనడంలో
ఏ మాత్రం సందేహం అక్కర్లేదని పౌరాణికులు చెబుతారు.పవిత్రమైన మనసుతో మంత్రజపం చేస్తే ఆత్మజ్ఞానం తప్పక కలుగుతుంది,దైవానికి దగ్గరగా వెళ్ళడానికి మార్గం సుగమం అయ్యి మోక్షమార్గం దొరుకుతుంది.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...