Tuesday, June 29, 2021

మన సమస్యలకి సుందరకాండ చూపుతున్న పరిష్కారాలు

సుందరకాండ అద్భుతమైన పారాయణం, ఎన్నో సమస్యలకు సుందరకాండ లోని వివిధ సర్గలు పారాయణ చేసి ఎంతో మంది పరిష్కారం పొందారు.. 

ఈ రోజుల్లో అందరికి వివిధ కారణాల వల్ల నిత్యం కాండం మొత్తం పారాయణ చేయలేరు, అయితే అందులో ఏ సమస్యకు ఏది పరిహారామో వివరంగా ఉంది. పారాయణ నియమాలతో ఉంటుంది. 

ఇక్కడ ఇచ్చిన వివరాలు ఒకసారి పరిశీలించండి.


1. ఆపదలు తొలగటానికి , సంపదలు కలగటానికి..

శ్లోకం.ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదామ్

 లోకాభిరామం శ్రీరామం, భూయో భూయో నమామ్యహమ్ ||

21 దినములు, 108 సార్లు, శక్తి  కొలది తమలపాకులు, అరటిపళ్ళు నివేదన చేయాలి.


2. విద్యాప్రాప్తికి.

ఒకసారి పరిపూర్ణంగా పారాయణ చేయవలెను . 

3 రోజులు ద్రాక్ష , అరటిపళ్ళు నివేదన


3. భూతబాధ  నివారణకు.

3 వ సర్గ వచనము రోజుకు 108 సార్లు 30 దినములు పారాయణ చేయవలెను . 

1 కొబ్బరికాయ , అరటిపళ్ళు నివేదన


4. సర్వ కార్య సిద్దికి.

64 వ సర్గ నిష్ఠతో 11 సార్లు 40 దినములు పారాయణ చేయవలెను

శక్తి  కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను


5. శత్రు నాశనముకు.

51 వ సర్గ అతినిష్ఠతో 2 సార్లు 21 దినములు పారాయణ చేయవలెను. 

శక్తి  కొలది ద్రాక్ష , బెల్లము నివేదన చేయవలెను.


6. వాహనప్రాప్తికి.

8 మరియి 9 వ సర్గలు ఏకాగ్రతతో 3 సార్లు 27 దినములు పారాయణ చేయవలెను. 

శక్తి  కొలది అరటి ,దానిమ్మ నివేదన చేయవలెను.


7. మనశాంతికి.

11 వ సర్గ నిష్ఠతో 3 సార్లు 21 దినములు పారాయణ చేయవలెను. 

అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.


8. స్వగృహం కోరువారికి.

7వ సర్గ ఏకాగ్రతతో 1 సారి 40 దినములు పారాయణ చేయవలెను.  

అరటిపళ్ళు చక్కెరతో నివేదన చేయవలెను.


9. యోగక్షేమాలకు.

13 వ సర్గ నిష్ఠతో 3 సార్లు 27 దినములు పారాయణ చేయవలెను. 

శక్తి కొలది అరటి , దానిమ్మ నివేదన చేయవలెను.


10. ఉద్యోగప్రాప్తికి.

63 వ సర్గ నిష్ఠతో 5 సార్లు 21 దినములు పారాయణ చేయవలెను . 

శక్తి కొలది అరటి ,దానిమ్మ నివేదన చేయవలెను.


11. రోగ నివారణకు.

34వ సర్గ ఏకాగ్రతతో 5 సార్లు ప్రతిదినము, 21 దినములు పఠించవలెను. 

శక్తి  కొలది బెల్లపు ముక్క అరటిపళ్ళు నివేదన చేయవలెను.


12. దుఃఖనివృత్తికి.

67 వ సర్గ నిష్ఠతో ప్రయత్నం మానకుండా 3 సార్లు 21 దినములు పారాయణ చేయవలెను. 

శక్తి కొలది అరటిపళ్ళు,ఖర్జూరము నివేదన చేయవలెను.


13. దుస్వప్న నాశనానికి

27వ సర్గ ఏకాగ్రతతో 1 సారి ప్రతిదినము పఠించవలెను

శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.


14. దూరముగా ఉన్న ఆప్తులు క్షేమమునకు.

33 నుండి 40 వ సర్గ వరకు 1 సారి , 21 దినములు నిష్ఠతో పఠించవలెను . 

శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.


15. ధనప్రాప్తికి.

15వ సర్గ ఏకాగ్రతతో 1 సారి  40 దినములు పఠించవలెను. 

అరటిపళ్ళు, పటిక బెల్లం , మరియు  రామాయణం లో అయోధ్యకాండలో యాత్రాదానము 32 వ సర్గ 1 సారి, 40 దినములు పఠించవలెను. 

శక్తి  కొలది అరటిపళ్ళు, ద్రాక్షనివేదన చేయవలెను . ( అగస్త్య , పరాశర , ఉమా సంహిత ప్రకారం చెప్పబడినది ).


16. దైవాపచారా ప్రాయశ్చిత్తం.

38 వ సర్గ ఏకాగ్రతతో 3 సార్లు 27 దినములు పఠించవలెను. 

శక్తి కొలది అరటిపళ్ళు వీలైతే పనస నివేదన చేయవలెను.


17. బ్రహ్మజ్ఞానము కలుగుటకు.

19 వ సర్గ అతినిష్ఠతో రోజుకు ఒకసారి 1 సంవత్సరము పఠించవలెను. 

శక్తి  కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.


18. ఏలిననాటి శనీ దోష పరిహారమునకు.

సకల రోగ నివృత్తికి - సర్వ పాప నివృత్తికి మొత్తం సుందరకాండ నిష్ఠతో 9 దినాలలో 1సారి 

68 రోజులు చదువవలెను. 

నివేదన రోజూ కొబ్బరికాయ సత్ఫాలితమునిచ్చును.


19. కన్యా వివాహమునకు.

9 దినములలో ఒకసారి పూర్తిగా 68 దినాలలో పఠించవలెను. సీతారామ కళ్యాణం నిష్ఠతో 7 సార్లు 

ప్రతిరోజు పఠించవలెను.  

అప్పాలు , పాలు , పంచదార నివేదన చేయవలెను.


20. విదేశీ యానమునకు.

1 వ సర్గ ఏకాగ్రతతో రోజుకు 5  సార్లు 30 దినములు పఠించవలెను. 

శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.


21. ధననష్ట నివృత్తికి.

55వ సర్గ నిష్ఠతో 3  సార్లు 30 దినములు పఠించవలెను . 

శక్తి  కొలది అరటిపళ్ళు,పనస నివేదన చేయవలెను.


22. వ్యాజ్యములో విజయమునకు.

42 సర్గ అతి ఏకాగ్రతతో 3 సార్లు, 21 దినములు పఠించవలెను. 

శక్తి  కొలది అరటిపళ్ళు, ద్రాక్ష , దానిమ్మ నివేదన చేయవలెను.


23. వ్యాపారాభివృద్ధికి.

15వ సర్గ నిష్ఠతో నియమంతో 5 సార్లు 21 దినములు పఠించవలెను. 

శక్తి  కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.


24. పుత్ర సంతానానికి.

ప్రతిదినం 7 వ సర్గ నిష్ఠతో 68 రోజులు పారాయణ చేయవలెను . 

శక్తి  కొలది అరటిపళ్ళు , కొబ్బరికాయ ,నివేదన చేయవలెను. 

శక్తి  కొలది తమలపాకులతో అర్చన చేయవలెను . సుందరకాండ 16 రోజులు పారాయణ చేయవచ్చును.


25. ఋణ విముక్తికి.

28 వ సర్గ చాలా నిష్ఠగా రోజుకి 1 సారి 41 రోజులు పఠించవలెను. 

శక్తి  కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.

Saturday, June 26, 2021

అసలు పుట్టలో పాలు పోస్తే పిల్లలు పుడతారు అనే దాని వెనక సైన్స్

అసలు పుట్టలో పాలు పోస్తే పిల్లలు ఎలా కలుగుతారనే పెద్ద సంశయము*.

పంచమి/నాగుల చవితి నాడు పుట్టలకు పూజ చేయించడం, పాలు పోయడం వంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు అంటున్నారు.

పాము పుట్టలని పాములు ఎర్పరచవు, చెదలు ఏర్పరుస్తాయి.

వాటిలో ఈ పాములు చేరి వానాకాలములో పిల్లలను పెట్టి, వేరే చోటికి వెళ్తాయి.

చెదపురుగు పుట్ట పెట్టేటప్పుడు దాని నోటి నుంచి ఒక ద్రవము వస్తుంది.

ఆ ద్రవము మెత్తటి మట్టినందు కలిసి అది గట్టి పడుతుంది.

ఎంత గట్టి పడుతుంది అంటే వానలు వచ్చినా ఆ మట్టి కరుగదు.

ఈ మెత్తటి మట్టిలో రాయి రప్పలు ఉండవు. ఇదే దీని విశిష్టము.

వానాకాలములో ఈ పుట్టలందు సంచరించు పాముల నుండి విడుదల అగు రేతస్సు, రజస్సు ఈ మట్టిలో కలిసి ఉంటుంది.

పాము గుడ్లు పెట్టి అది పిల్లలను చేయదు.

ఎండ వేడికి అవి పిల్లలగును. ఇది ప్రకృతి నియమము.

ఈ మట్టిలో కలిసిన ఈ పదార్దములు మనము పోయు పాలు, తేనే, వివిధ రకాల ఫలములు కలిసి సువాసనల వెదజల్లును.

ఆ వాసనలు వలన మన శరీరమునందు తగు హార్మోనులు ఉత్పత్తి అయి పిల్లలు పుట్టుటకు దోహద పడుతుంది 

ఆయుర్వేద శాస్త్రములో నాగు పాము కుబుసములో అరటిపండు కలిపి మందుగా వాడుట ఉంది.

ఇది ప్రయోగశాలలో పరిశీలించడం జరిగింది అదులో తెలిసిన విషయమే  ఏమితంటే చర్మ రోగాలు నయము చేయుటలో ఈ మట్టి ఎంతో ఉపయోగ పడును.

ప్రత్యేకముగా నాగరు అనే చర్మ వ్యాధికి. ఇది ప్రకృతి సిద్ధమైన వైద్య.

రావి చెట్టుకింద ప్రతిష్ఠించబడిన నాగవిగ్రాహాలకి కూడా పూజచేస్తుంటారు.

 ఆయుర్వేద శాస్త్రములో గర్భము నిలువకున్న ఈ చెట్టు వేరుతో తయారు చేసిన మందులు వాడుతారు.

అంతే కాక ఈ వృక్షము అరుణోదయ కాలములో దాని వేళ్ళ నుండి ఘనీభుతమైన అమ్ల జనకములు విడుదల చేస్తాయి.

దీనిని ఒజోన్స్ అంటారు. ఈ ఒజోన్స్ మనోహరమైన వాసనలు మానవుడి ఆరోగ్యం మరియు స్త్రీలమీద మంచి ప్రభావము చూపిస్తాయి.

అందువలన రావిచెట్టుకి ప్రదక్షిణాలు చేయడం మొదలైన నియమాలు చేసారు.

40 రోజుల పాటు ఉదయమునే రావి చెట్టు ఆలింగనము, ప్రదక్షిణాలు చేసిన జననేంద్రియ దోషములు తొలగి, గర్భము ధరించుటకు సహాయకారిగా ఉంటుందని విశ్వసిస్తారు.

నాగుపాము మనిషి వెన్ను పాము ఆకారములో ఉంటుంది.

నాగ ప్రతిమను శాస్త్రోక్తముగా రావి చెట్టు మొదలులో ప్రతిష్ఠిస్తారు.

ప్రతిష్ఠించేసమయంలో పంచరత్నాలు, పంచాపల్లవములు, నవధాన్యములు, గో పంచాకాలతో ప్రతిష్ఠించుతారు.

నాగ ప్రతిమ చేసిన రాయి పురుష జాతిథి అయి ఉండాలి.

రత్నముల ద్వారా చెట్టునుండి విసర్జించబడిన ఒజోన్స్ శిలా ముఖంతరముగా మానవుని శరీరమీద ప్రభావము చూపుతుది.

అందువలన పంచమి/నాగుల చవితి  నాడు నాగంద్రుని పూజించడం మన హిందు సంప్రదాయం.

వీనిని తెలిసి ఆచరించినా, తెలియక ఆచరించినా మంచి ఫలితములు తప్పక పొందవచ్చును.

దేవాలయములో నాగా అష్టోత్తరములు, పంచామృతములతో అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు చేయిస్తే సకల భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం.

చలి చీమ నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు, రాయి - రప్ప, చెట్టు -చేమ, వాగు-వరద, నీరు -నిప్పు, అన్నిటా అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కుతి హిందువులది .

మానవ దృష్టిలో పాము కుడా పరమాత్మ స్వరూపమే.

వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పానువు.

వాసుకి పమేస్వరుడి కంఠాభరణం.

వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడు.

ఈ విధంగా బ్రాహ్మణులూ, ఋషులు, మునులు ... మానవజాతిని సన్మార్గములో పయనించేటట్లు చేసారు.

Thursday, June 24, 2021

పితృదేవతలు ముగ్గుదాటుకుని రాలేరట

ఏ ఇంటిముందు ఉదయాన్నే కళ్లాపిచల్లి ముగ్గుపెట్టి వుంటుందో ఆ ఇంటికి రావడానికే లక్ష్మీదేవి ఇష్టపడుతుంది. ఈ కారణంగానే ఉదయాన్నే వాకిలి శుభ్రంగా ఊడ్చి ఆవుపేడతో కళ్లాపిచల్లి బియ్యపు పిండితో ముగ్గు పెడుతుంటారు. 

ఇక పండుగ రోజుల్లో ఈ ముగ్గు మరింత అందంగా ఉండేలా శ్రద్ధ తీసుకుంటూ వుంటారు. పూర్వకాలం నుంచి కూడా ఇది మన ఆచారవ్యవహారాల్లో ఒక భాగమైపోయింది. 

అయితే ఇంట్లో పితృ కార్యాలు నిర్వహించవలసి వచ్చినప్పుడు, ఇంటిముందు ముగ్గు పెట్టాలా వద్దా అనే సందేహం చాలా మందిలో కలుగుతుంటుంది. శాస్త్రం మాత్రం పితృ కార్యం నిర్వహించే రోజున ఉదయాన్నే వాకిట్లో ముగ్గు పెట్టకూడదని చెబుతోంది. ముగ్గులేని వాకిట్లోకి రాకుండా లక్ష్మీదేవి ఎలా వెనుదిరిగి పోతుందో, ముగ్గువేసిన వాకిట్లోకి రాకుండా పితృదేవతలు కూడా అలానే వెనుదిరిగిపోతారని అంటోంది

పితృదేవతలు ముగ్గుదాటుకుని రాలేరట. అందువల్లనే పితృకార్యం నిర్వహించే రోజున ముగ్గు పెట్టకూడదని పండితులు అంటున్నారు. వాకిట్లో ముగ్గులేని ఇళ్లలోకి ప్రవేశించడానికి దుష్టశక్తులు సిద్ధంగా ఉంటాయని అంటారు.

అందువలన పితృకార్యం నిర్వహణ పూర్తి అయిన తరువాత, వెంటనే వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గుపెట్టాలని చెబుతుంటారు. దీనిని బట్టి ముగ్గు అనేది ఇంటికి అందాన్ని తీసుకురావడమే కాదు, ఇంటికి రక్షణని కూడా ఇస్తుందని గ్రహించాలి.

Tuesday, June 22, 2021

షష్టిపూర్తి అంటే ఏంటీ ? ఎందుకు చేస్తారు ?

మానవుని సంపూర్ణ ఆయుర్దాయం 120 సంవత్సరాలు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నది. 60 సంవత్సరాలు నిండినప్పుడు చేసుకునేది షష్టిపూర్తి. ప్రతివారికీ మృత్యువు 60 వ యేట ఉగ్రరథుడు అను పేరుతో , 70 వ యేట భీమరథుడు అను పేరుతో , 78 వ యేట విజయరథుడు అనుపేరుతో ఎదురుచూస్తుంటాడు. ఆరోగ్య సమస్యలకు తట్టుకోవటానికి చేసే శాంతి ప్రక్రియ షష్టిపూర్తి.

బృహస్పతి , శని 30 సంవత్సరాలకు మానవుని జన్మకాలంలో ఉన్నరాశికి చేరటానికి 60 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళిద్దరూ తాము బయలుదేరిన రాశికి చేరుకోవటంతో మానవుని జీవితం మరలా ప్రారంభమవుతుంది. తిరిగి జీవితం ప్రారంభం ఐనట్లు సంకేతం.

మానవుడు పుట్టిన తెలుగు సంవత్సరాలు (60) నిండుతాయి కనుక షష్టిపూర్తి.

షష్టిపూర్తి సందర్భంగా ఆయుష్కామన యజ్ఞము చేస్తారు. ఆయువును కోరి చేయు యజ్ఞము ఆయుష్కామనయజ్ఞము

పెద్దలు ఈ ఆయుష్కామన యజ్ఞాన్ని చేసే పధ్ధతిని ఇలా చెప్పారు.

'' తెల్లని నూతన వస్త్రముపై తూర్పు దిక్కుగా 12 గీతలు గీచి వాటిమీద అయిదు గీతలు గీసి మొత్తము 60 గదులు వచ్చే విధంగా చేస్తారు. వరుసకు 12 అయిదు వరుసలు తూర్పు దిక్కున బియ్యం పోసి కలశం ఉంచుతారు. ప్రభవ నుంచి క్షయ వరకు 60 సం " అధిదేవతలతో ఆవాహన చేస్తారు. దక్షిణాయన ఉత్తరాయణ దేవతలను , 6 ఋతువులను 12 మాసములను ఆవాహన చేస్తారు.

పక్షములను , తిదులను వారములను - వారదేవతలు అయిన - సూర్యుడు , చంద్రుడు , అంగారకుడు, బుధుడు , గురువు , శుక్రుడు , శనిని ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు - అగ్ని , జలము , భూమి , విష్ణువు ఇంద్రుడు , ప్రజాపతి లని ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు శివుడు , దుర్గ , కుమారస్వామి , బ్రహ్మ - ఇంకా ఏకాదశ రుద్రులు , నక్షత్ర దేవతలు 27 యోగములు 11 కరణములు ఇలా అందరి దేవి దేవతా స్వరూపాలని మృత్యుంజయుని ఆవాహన చేసి బ్రాహ్మణోత్తములు మంగళాచరనములతో వేదయుక్తంగా ఈ కార్యక్రమం జరిపిస్తారు.

అపమృత్యు నివారణార్థం హోమాల్ని , జపాలని కుడా చేస్తారు. తదుపరి బ్రహ్మణులను సత్కరించి బంధుమిత్రులతో విందు ఆరగిస్తారు. పూర్వకాలంలో పురుషుడు ఏ వేడుక చేసుకున్నా భార్యకు కూడా జరగినట్టే భావించేవారు కనుక స్త్రీలకు మళ్ళీ విడిగా షష్టిపూర్తి చేసే ఆచారంలేదు.

పెళ్లి సాధారణంగా జరగాలి. షష్టిపూర్తి ఘనంగా జరగాలని పెద్దల మాట. ఎందుకంటే షష్టిపూర్తి దృఢమైన ఆత్మీయతల సుగంధం పరిమళించే సందర్భం కనుక. బిడ్డలు తమ కృతజ్ఞతను తమ తల్లిదండ్రులకు అర్పించుకొనే అపురూప సందర్భం షష్టిపూర్తి. 

Friday, June 18, 2021

భగవద్గీత 101 శ్లోకాల అర్ధాలు

1. భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారంశము, భక్తుడైన అర్జునకు ఒనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారతయుద్దము జరుగరాదని సర్వవిధముల భగవానుడు ప్రయత్నించెను. కానీ, ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్ధములాయెను. అటుపిమ్మట శ్రీకృష్ణుడు పార్దునకు సారధియై నిలిచెను.

యుద్దరంగమున అర్జునుని కోరిక మేరకు రధమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయం ద్రవించి.

2. స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయాము వలదు, రాజ్యసుఖము వలదు అని ధనుర్భాణము లను క్రింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మా...

౩. దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చిగాని, నిత్యములు, శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చిగాని దుఃఖింపరు.

4. జీవునకు దేహమునందు బాల్యము, యౌవనము, ముసలితనము యేట్లో మరొక దేహమును పొందుటకు కూడా అట్లే కనుక ఈ విషయమున ధీరులు మోహము నొందరు.

5. మనుష్యుడు ఎట్లు చినిగిన వస్త్రములను వదలి నూతన వస్త్రములను ధరించునో అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించుచున్నది.


6. ఆత్మ నాశనము లేనిది, ఆత్మను శస్త్రములు చేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు అర్పివేయును సమర్ధము కాదు. ఆత్మ నాశనము లేనిది.


7. పుట్టినవానికి మరణము తప్పదు. మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు.


8. యుద్దమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు. జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జునా! యుద్దమును చేయు కృతనిశ్చయుడవై లెమ్ము.


9.కర్మలను ఆచరించుట యందే నీకు అధికారము కలదు కాని, వాని ఫలితముపైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదు.


10.దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ కోల్పోనివాడును, రాగము, భయము, క్రోధము పాయిన వాడును, స్థితప్రజ్ఞుడని చెప్పబడును.


11.విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి, వాణి యందను రాగమధికమై, అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధమువలన అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపకశక్తి నశించి దాని ఫలితముముగా మనుజుడు బుద్ద్దిని కోల్పోయి చివరకు అధోగతి చెందును. 


  

12. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుస్టారము, బ్రహ్మప్రాప్తిసాధనము కలిగిన జీవుడు సంసారమున బడక, సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు.


13. అర్జునా! ఈ లోకములో ఆత్మానాత్మ వివేకముగల సన్యాసుకలు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్దిగల యోగీశ్వరులకు కర్మయోగము చేతను, ముక్తి కలుగు చున్నదని సృష్టి ఆదియందు నాచే చెప్పబడియున్నది.


14. అన్నము వలన జంతుజాలము పుట్టును. వర్షము వలన అన్నము సమకూరును. యజ్ఞము వలన వర్షము కలుగును. ఆ యజ్ఞము కర్మ వలననే సంభవమగును.  


   

15. పార్దా! నాచే నడుపబడు ఈ లోకము అను చక్రమును బట్టి, యెవడు అనుసరింపడో, వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడగుచున్నాడు. అట్టివాడు వ్యర్ధుడు, జ్ఞానీ కానివాడు సదా కర్మల నాచరించుచునే ఉండవలెను.


16. ఉత్తములైన వారు దేని నాచరింతురో, దానినే ఇతరులును ఆచరింతురు. ఉత్తములు వేనిని ప్రమాణముగా అంగీకరింతురో లోకమంతయు దానినే అనుసరించును.


17. అర్జునా! నీ వోనర్చు సమస్త కర్మలనూ నా యందు సమర్పించి జ్ఞానముచే నిష్కాముడవై, అహంకారము లేనివాడవై సంతాపమును వదలి యుద్దము చేయుము.


18. చక్కగా అనుస్టింపబడిన పరధర్మము కన్న, గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది. ఆచరణకు అనుచితమైనది.


19. పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామముచేత జ్ఞానము కప్పబడి యున్నది.


20. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్దినొందునో, ఆయా సమయములయందు శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మ సంరక్షణముల కొఱకు ప్రతీయుగమునా అవతారము దాల్చుచున్నాను.


21. అనురాగము, భయము, క్రోధము వదలి నా యందు మనస్సు లగ్నము చేసి, ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి.


22. ఎవరెవరు యేయే విధముగా నన్ను తెలియ కోరుచున్నారో వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించు చున్నాను కానీ, ఏ ఒక్కనియందు అనురాగాముకాని, ద్వేషముగాని లేవు.


23. ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావో యెవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్పబడినవో, అట్టివానిని పండితులని విద్వాంసులని పల్కుదురు.


24. యగ్నపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి చేత పొందనగు ఫలము గూడ బ్రహ్మమనియే తలంచవలయును.


25. శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్ధుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును.


26. కర్మ సన్యాసములు రెండునూ మోక్షసోపాన


సాధనములు. అందు కర్మ పరిత్యాగము కన్నా, కర్మానుష్టానమే శ్రేష్ఠమైనది.


27. ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పనముగా కర్మల నాచరించునో, అతడు తామరాకుకు నీటిబిందువులు

అంటని రీతిగా పాపమున చిక్కుబడదు.


28. ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యునివలె ప్రకాశించి పరమార్థతత్వమును జూపును.


29. విద్యా వినయ సంపన్నుడగు బ్రాహ్మణునియందును శునకము శునక మాంసము వొండుకొని తినువాని యందును పండితులు సమదృష్టి కలిగి వుందురు.


౩౦. దేహత్యాగము నకు ముందు యెవడు కామక్రోధాది అరిషడ్వర్గములను జయించునో, అట్టివాడు యోగి అనబడును.


31. ఎవడు ఇంద్రియములను జయించి, దృష్టిని భ్రూమధ్యమున నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంబిమపజేసి, మనస్సును, బుద్దిని, స్వాధీన మొనర్చుకొని, మోక్షాసక్తుడై యుండునో అట్టివాడే ముక్తుడనబడును.


32. సకల యజ్ఞ తపః ఫలములను పొందువానిగాను, సకల ప్రపంచ నియామకునిగను, నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు.


౩౩. అర్జునా! సన్యాసమని దేనినందురో, దానినే కర్మయోగ మనియు అందురు. అట్టి యెడ సంకల్పత్యాగమొనర్పనివాడు యోగి కాజాలడు.


౩4. యుక్తాహార విహారాదులు, కర్మాచరణము గలవానికి ఆత్మసంయమ యోగము లభ్యము.


35. గాలిలేనిచోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగుననే మనోనిగ్రహము కలిగి అత్మయోగమభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా నుండును.


౩6. సకలభూతము లయందూ సమదృష్టి కలిగినవాడు, అన్ని భూతములు తనయందును, అన్ని భూతములయందును చూచుచుండును.


37. అర్జునా! ఎట్టివానికైనను, మనస్సును నిశ్చలముగా నిల్చుట దుస్సాధ్యమే. అయినను దానిని అభ్యాసవైరాగ్యములచేత నిరోధింప వచ్చును.


38. అర్జునా! పరిపూర్ణమైన విశ్వాసముతో నన్నాశ్రయించి వినయముతో ఎవరు సేవించి, భజింతురో వారు సమస్త యోగులలో ఉత్తములు.


39. వేలకొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ది కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యదార్ధముగా తెలుసుకోన గలుగుచున్నాడు.


40. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా మాయాశక్తి యెనిమిది విధములైన భేదములతో ఒప్పియున్నదని గ్రహింపుము.


41. అర్జునా! నా కన్నా గొప్పవాడుగాని, గొప్పవస్తువుగాని, మరేదియు ప్రపంచమున లేదు. సూత్రమున మణులు గ్రుచ్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమై ఉన్నది.


42. భూమియందు సుగంధము, అగ్నియందు తేజము, ఏళ్ళ భూతముల యందు ఆయువు, తపస్సుల యందు తపస్సు నేనుగా ఎరుగుము.


43. పార్దా! త్రిగునాత్మకము, దైవసంబందమగు నా మాయ అతిక్రమింపరానిది. కాని నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ సులభసాధ్యము.


44. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధకాములు, జ్ఞానులు అను నాలుగు విధములైన పుణ్యాత్ములు నన్నా శ్రయించుచున్నారు.


45. జ్ఞాన సంపంనుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞానియై నన్ను శరణము నొందుచున్నాడు.


46. ఎవడు అంత్య కాలమున నన్ను స్మరించుచు శరీరమును వదలుచున్నాడో, వాడు నన్నే చెందుచున్నాడు.


47. అర్జునా! ఎవడు అభ్యాసయోగాముతో, ఏకాగ్రచిత్తమున దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించునో, అట్టివాడు ఆ పరమపురుషునే చెందుచున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణపురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువుకన్నా అణువు, అనూహ్యమైన రూపము కలవాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారమున కన్నా ఇతరుడు.


48. ఇంద్రియగోచరము కాని పరబ్రహ్మపదము శాశ్వతమైనది. పునర్జన్మ రహితమైన ఆ ఉత్తమపదమే పరమపదము.


49. జగత్తునందు శుక్లకృష్ణములనెడి రెండు మార్గములు నిత్యములుగా నున్నవి. అందు మొదటి మార్గము వలన జన్మ రాహిత్యము, రెండవదాని వలన పునర్జన్మము కలుగుచున్నవి.


5౦. యోగియైనవాడు వేదాధ్యయనము వలన, యగ్నతపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మ పదవిని పొందగలడు.


51. పార్దా! ప్రళయకాలమునందు సకల ప్రాణులును, నాయందు లీనమగుచున్నవి, మరల కల్పాదియందు సకల ప్రాణులను నేనే సృష్టించుచున్నాను.


52. ఏ మానవుడు సర్వకాల సర్వావస్థలయందును నన్నే ధ్యానించుచుండునో, అట్టివాని యోగ క్షేమములు నేనే వహించుచున్నాను.


53. ఎవడు భక్తితో నాకు పత్రమైనాను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడో, అట్టి వానిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను.


54. పార్దా! నాయందు మనస్సు లగ్నముచేసి యెల్లకాలము యందు భక్తీ శ్రద్దలతో స్థిరచిత్తుడవై పుజించితినేని నన్నే పొందగలవు.


55. కశ్యాపాది మహర్షి సప్తకము, సనకసనందనాదులు, స్వయంభూవాది మనువులు నావలననే జన్మించిరి. పిమ్మట వారివలన ఎల్లలోకమందలి సమస్త భూతములు జన్మించును.


56. పండితులు నాయందు చిత్తముగలవారై నాయందే తమ ప్రాణములుంచి నా మహిమానుభావ మెరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకొనుచు బ్రహ్మానందము ననుభవించు చున్నారు.


57. సమస్త భూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడను నేనే. వాని ఉత్పత్తి, పెంపు నాశములకు నేనే కారకుడను.


58. వేదములలో సామవేదము, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందరి బుద్ధి నేనే.


59. రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు నేనే.


6౦. లోకమునందు ఐశ్వర్యయుక్తమై, పరాక్రమయుక్తమై, కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తెజోభాగము వలననే సంభవములు.


61. పార్దా! దివ్యములై, నానావిధములై, అనేక వర్ణములై, అనేక విశేషములు గల నా స్వస్వరూపమును కనులార దర్శింపుము.


62. ప్రభో కృష్ణా! దేవా! ఎల్లదేవతలు, ఎల్లప్రాణులు, బ్రహ్మాదులు, ఋషీశ్వరులు, వాసుకీ మొదలగుగాగల యెల్ల సర్పములు నీయందు నాకు గోచరమగుచున్నవి. ఈశ్వరా! నీ విశ్వరూపము అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో ఒప్పియున్నది. అట్లయ్యుయు నీ ఆకారమున ఆద్యంత మధ్యమములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరమై, ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుటవలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో! నా యందు దయముంచి నాకు ప్రసన్నుడవు కమ్ము కృష్ణా! ప్రసన్నుడవు కమ్ము.


6౩. అర్జునా! ఈ ప్రపంచమునెల్ల నశింపజేయు బలిష్టమైన కాలస్వరూపుడను నేనే. ఈ యుద్దము నకు సిద్దపడినవారిని నీవు చంపకున్ననూ బ్రతుకగల వారిందెవ్వరును లేరు.


64. ఇప్పటికే ద్రోణ, భీష్మ, జయద్రధ కర్ణాది యోధ వీరులు నాచే సంహరింప బడిరి. ఇక మిగిలిన శత్రువీరులను నీవు సంహరింపుము.


65. అనేక భుజములు గల నీ విశ్వరూపమును ఉపసంహరించి, కిరీటము, గద, చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింప గోరుచున్నాను కృష్ణా.


66. అర్జునా! నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవ్వరునూ చూడజాలరు. ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరునూ సదా కోరుచుందురు.


67. ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి, శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారో అట్టివారు నాకు ప్రీతిపాత్రులు. వారే ఉత్తమ పురుషులు.


68. అభ్యాస యోగము కన్న జ్ఞానము, జ్ఞానము కన్న ధ్యానము, దానికన్న కర్మఫలత్యాగము శ్రేష్టము. అట్టి త్యాగము వల్ల సంసార బంధనము తొలగి, మోక్షప్రాప్తి సంభవించుచున్నది.


69. ఎవడు కోరికలు లేనివాడై, పవిత్రుడై, పక్షపాతరహితుడై, భయమును వీడి, కర్మఫలత్యాగియై నాకు భక్తుడగునో, అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు.


7౦. శత్రుమిత్రుల యందును, మానావ మానములయందును, శీతోష్ణ సుఖ దుఃఖాదులయందును సమబుద్ది కలిగి సంగరహితుడై, నిత్యసంతుస్టుడై, చలించని మనస్సు గలవాడై, నా యందు భక్తిప్రవత్తులు చూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు.


71. అర్జునా! దేహము క్షేత్రమనియు, దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞుడనియు పెద్దలు చెప్పుదురు.


72. ఆత్మజ్ఞానము నందు మనస్సు లగ్నము చేయుట, మోక్షప్రాప్తి యందు ద్రుష్టి కలిగియుండుట జ్ఞానమార్గాములనియు, వానికి ఇతరములైనవి అజ్ఞానము లనియు చెప్పబడును.


7౩. ప్రకృతిని ‘మాయ’ యని యందురు. 

అది శరీర సుఖ దుఃఖాదులను తెలియజేయును. క్షేత్రజ్ఞుడు, ఆ సుఖదుఃఖాదులను అనుభవించు చుండెను.


75. అర్జునా! గుణనాశరహితుడైనవాడు పరమాత్మ, అట్టి పరమాత్మ దేహాంతర్గుడయ్యును. కర్మలనాచారించువాడు కాడు.


76. పార్దా! సుర్యుడోక్కడే యెల్ల జగత్తులను ఏ విధముగా ప్రకాశింప జేయుచున్నాడో, ఆ విధముగానే క్షేత్రజ్ఞుడు ఏళ్ళ దేహములను ప్రకాశింపజేయుచున్నాడు.


77. జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీస్వరులు మోక్షమును పొందిరి. అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశించు చున్నాను.


78. అర్జునా! ప్రపంచమున జన్మించు ఎల్లా చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వంటిది. నేను తండ్రి వంటివాడను.


79. అర్జునా! త్రిగుణములలో సత్వగుణము నిర్మలమగుటంజేసి, సుఖ జ్ఞానాభిలాషల చేత, ఆత్మను దేహమునందు బందించు చున్నది.


8౦. ఓ కౌంతేయా! రజో గుణము కోరికలయందు అభిమానము, అనురాగము పుట్టించి, ఆత్మను బందించుచున్నది.


81. అజ్ఞానము వలన బుట్టునది తమోగుణము, అది సర్వప్రాణులను మొహింపజేయునది. ఆ గుణం, మనుజుని ఆలస్యముతోను, అజాగ్రత్తతోను, నిద్రతోను బద్దునిజేయును.


82. మానావ మానములయందు, శత్రుమిత్రులయందు సమమైన మనస్సు గలవానిని త్రిగుణాతీతు డందురు.


8౩. బ్రహ్మమే మూలముగా నికృష్టమైన అహంకారము కొమ్మలుగా గల అశ్వర్థవృక్షము అనాది అయినది. అట్టి సంసార వృక్షమునకు వేదములు ఆకులు వంటివి. అట్టిదాని నెరింగినవాడే వేదార్ధసార మెరింగినవాడు.


84. పునరావృత్తి రహితమైన మోక్షపధము, సుర్యచంద్రాద్నుల ప్రకాశమున కతీతమై, నా ఉత్తమ పథమై యున్నది.


85. దేహులందు జటరాగ్నిస్వరూపుడనై, వారు భుజించు భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య పదార్థముల జీర్ణము చేయు చున్నాను.


86. పార్దా! సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరులను వంచింపకుండుట, కావరము లేకుండుట మొదలుగు గుణములు దైవాంశ సంభూతులకుండును. అట్లే డంబము, గర్వము, అభిమానము, క్రోధము, కఠీనపు మాటలాడుట, అవివేకము, మొదలగు గుణములు రాక్షసాంశమున బుట్టిన వారికుండును.


87. కామ, క్రోధ, లోభములు ఆత్మను నాశామును చేయును. అవి నరకప్రాప్తికి హేతువులు కావున, వానిని వదలి వేయవలెను.


88. శాస్త్రవిషయముల ననుసరింపక యిచ్చామార్గమున ప్రవర్తించువాడు సుఖసిద్దులను పొందజాలడు. పరమపదమునందజాలడు.


89. జీవులకు గల శ్రద్ధ, పూర్వజన్మ వాసనాబలము వలన లభ్యము. అది రాజసము, సాత్వికము, తామసములని మూడు విధములుగా నున్నవి.


9౦. సత్వగుణులు దేవతలను, రాజోగుణులు యక్షరాక్షసులను, తమోగుణులు భూతప్రేతగణంబులను శ్రద్ధాభక్తులతో పూజించుచుందురు.


91. ఇతరుల మనస్సుల నొప్పింపనిదియు, ప్రియము, హితములతో కూడిన సత్యభాషనము, వేదాద్యన మొనర్చుట, వాచకతపస్సని చెప్పబడును.


92. జ్యోతిష్టోమాది కర్మల నాచరింప కుండుట సన్యాసమనియు, కర్మఫలము, ఈశ్వరార్పణ మొనర్చుట త్యాగమనియు పెద్దలు చెప్పుదురు.


9౩. కర్మములు- ప్రియములు, అప్రియములు, ప్రియాతి ప్రియములని మూడు విధములు. కర్మఫలము కోరినవారు జన్మాంతరములందు ఆ ఫలములను పొందుచున్నాడు. కోరని వారు ఆ ఫలములను జన్మాంతరమున పొందజాలకున్నారు.


94. అర్జునా! కర్మమోక్షమార్గముల, కర్తవ్య భయాభయముల, బంధమోక్షముల, ఏ జ్ఞానమెరుగుచున్నదో అది సత్వగుణ సముద్భనమని ఎరుగుము.

95. ఈశ్వరుడు యెల్ల భూతములకు నియామకుడై, ప్రాణుల హృదయ ముందన్నవాడై, అంత్రగాడు బొమ్మలనాడించు రీతిగా ప్రాణుల భ్రమింపజేయు చున్నాడు.    

96. సమస్త కర్మల నాకర్పించి, నన్నే శరణుబొందిన ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తుని గావింతును. నీవు చింతింపకుము. 

97. ఎవడు పరమొత్క్రష్టమైనదియు, పరమ రహస్యమైన ఈ గీతాశాస్త్రమును నా భక్తులకుపదేశము చేయుచున్నాడో వాడు మోక్షమున కర్హుడు.

98. ధనంజయా! పరమగోప్యమైన ఈ గీతాశాస్త్రమును చక్కగా వింటివా? నీ అజ్ఞాన జనితమైన అవివేకము నశించినదా?

99. కృష్ణా! అచ్యుతా! నా అవివేకము నీ దయవలన తొలగెను. నాకు సుజ్ఞానము లభించినది. నాకు సందేహములన్నియు తొలగినవి. నీ ఆజ్ఞను శిరసావహించెదను.  

100. యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్దారియగు అర్జునుడు ,ఎచట నుందురో, అచ్చట సంపద, విజయము, ఐశ్వర్యము, స్థిరమగు నీతి యుండును.

101. గీతాశాస్త్రమును ఎవరు పటింతురో వారు భయశోకాది వర్జితులై విష్ణు సాయుజ్యమును పొందుదురు.

ఆదిత్య హృదయం స్తోత్ర ఫలితం

 రామాయణం యుద్ధకాండలో శ్రీ రాముడు అలసట పొందినప్పుడు, అగస్త్య మహర్షి యుద్ధ స్థలానికి వచ్చి ఆదిత్య హృదయం అనే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు.ఈ ఉపదేశము అయిన తరువాత శ్రీరాముడు రావణాసురుడిని నిహతుడిని చేస్తాడు. వాల్మీకి రామాయణం లోని యుద్ధకాండమునందు 107 సర్గలో ఈ అదిత్య హృదయ శ్లోకాలు వస్తాయి.


ఆదిత్య హృదయంలో మెత్తం 30 శ్లోకాలు ఉన్నాయి.


మొదటి రెండు శ్లోకాలు అగస్త్యుడు , శ్రీ రాముడి వద్దకు వచ్చుట

3 నుండి 5 శ్లోకాలు : ఆదిత్య హృదయ పారాయణ వైశిష్టత చెప్పబడింది.

6 నుండి 15 శ్లోకాలు : సూర్యుడంటే బయటకు వ్యక్తమవుతున్న లోపలి ఆత్మ స్వరూపమని, బాహ్యరూపము అంత స్వరూపము ఒక్కటే

16 నుండి 20 శ్లోకాలు : మంత్ర జపం

21 నుండి 24 శ్లోకాలు : సూర్యుడు గురించి శ్లోక మంత్రాలు

25 నుండి 30 శ్లోకాలు : పారాయణ వల్ల కలిగే ఫలం, పారాయణ చేయ వలసిన విధానం, సూర్యభగవనుడు శ్రీ రాముడు విజయాన్ని పొందేటట్లు అశీర్వదించడం


ఆదిత్య హృదయం


తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం

రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం 1


దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం

ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః 2


అగస్త్య ఉవాచ:


రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం

యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి 3


ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం

జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం 4


సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం

చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం 5


రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం

పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం 6


సర్వ దేవాత్మకో హ్యేశ తేజస్వీ రశ్మిభావనః

ఏశ దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః 7


ఏశ బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః

మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః 8


పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః

వాయుః వహ్నిః ప్రజాప్రాణా ఋతు కర్తా ప్రభాకరః 9


ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్

సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః 10


హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్

తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండక అంషుమాన్ 11


హిరణ్యగర్భహ్ శిశిరస్తపనో భాస్కరో రవిః

అగ్నిగర్భోఅదితేః పుత్రః శంఖః శిశిరనాశనహ్ 12


వ్యోమనాథ స్తమోభెదీ ఋగ్ యజుస్సామ పారగః

ఘన వృష్టిరపాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః 13


ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః

కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వ భవోధ్భవః 14


నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః

తెజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే 15


నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయె నమః

జ్యోతిర్గణాణాం పతయే దినధిపతయే నమః 16


జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః

నమో నమస్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః 17


నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః

నమః పద్మ ప్రబోధాయ ప్రచండాయ నమో నమః 18


బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే

భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషె నమః 19


తమొఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనె

కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః 20


తప్త చామీక రాభాయ హరయే విష్వకర్మణే

నమస్తమోభినిఘ్నాయ రుచయే లొకసాక్షిణే 21


నాశయత్యేష వై భూతం తదైవ సృజతి ప్రభుః

పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః 22


ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః

ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం 23


వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ

యాని కృత్యాని లోకేషు సర్వేషు పరమ ప్రభుః 24


ఏనమాపత్సు కృత్ శ్రేషు కాంతారేషు భయేషు చ

కీర్తయన్ పురుషః కశ్చిన్ నావసీదతి రాఘవః 25


పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం

ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి 26


అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి

ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం 27


ఏతత్ శృత్వా మహాతెజా నష్టశొకొభవత్తదా

ధారయామాస సుప్రీతొ రాఘవహ్ ప్రయతాత్మవాన్ 28


ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్

త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ 29


రావణం ప్రేక్ష్య హ్రుష్టాత్మా యుద్ధాయ సముపాగమత్

సర్వ యత్నేన మహతా వధె తస్య ధృతోభవత్ 30


అథ రవి రవదన్నిరీక్ష్య రామం

ముదితమనాః పరమం ప్రహృష్యమానః

నిశిచరపతి సంక్షయం విదిత్వా

సురగణమధ్యగతో వచస్త్వరేతి.ఓం శనైశ్చరాయనమః

తెలుగు భాష యొక్క ఆసక్తికరమైన వాస్తవాలు

 ఎవరి మాతృభాష తెలుగో, ఎవరు తెలుగును ప్రేమిస్తారో, మరియు తెలుగు గురించి కొంత తెలుసుకోవాలనుకుంటున్నారో, వారి కోసం తెలుగు భాష యొక్క ఆసక్తికరమైన వాస్తవాలు

1) క్రీస్తుపూర్వం 400 నుండి తెలుగు భాష ఉనికిలో ఉంది. 

2. 2012 లో తెలుగును అంతర్జాతీయ ఆల్ఫాబెట్ అసోసియేషన్ ప్రపంచంలోని 2 వ ఉత్తమ స్క్రిప్ట్‌గా ఎన్నుకుంది, కొరియన్ ర్యాంక్ నంబర్ 1.

3. తెలుగు భాష మాట్లాడటం మీ శరీరంలో సుమారు 72000 న్యూరాన్‌లను సక్రియం చేస్తుంది, సైన్స్ నిరూపించిన ప్రపంచంలోని ఏ భాషకైనా ఇది అత్యధికం.

4. శ్రీలంకకు చెందిన ఒక జాతి శ్రీలంక జిప్సీ ప్రజలు ఎక్కువగా తెలుగు మాట్లాడతారు.

5. మయన్మార్‌లో చాలా తెలుగు కమ్యూనిటీలు ఉన్నాయి గూగుల్ శోధన చేయండి.

6. 16 వ శతాబ్దంలో ఇటాలియన్ ఎక్స్‌ప్లోరర్ నికోలో డి కాంటి, తెలుగు భాషలోని పదాలు ఇటాలియన్‌లోని మాదిరిగానే అచ్చులతో ముగుస్తుందని కనుగొన్నారు, అందుకే దీనిని “ది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్” అని పిలుస్తారు.

7. భారతదేశంలో స్థానికంగా మాట్లాడేవారి సంఖ్య (75 మిలియన్ల మంది) తో తెలుగు 3 వ స్థానంలో ఉంది మరియు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా మాట్లాడే భాషల ఎథ్నోలాగ్ జాబితాలో 15 వ స్థానంలో ఉంది.

8. "మూడు లింగాల దేశం", త్రిలింగ దేశం అని పిలువబడే ప్రాంతంలో పలికే భాషే తెలుగు అని నానుడిలో ఉంది. ఒక హిందూ పురాణం ప్రకారం, శివుడు మూడు పర్వతాలపై తన లింగస్వరూపాన్ని నిలిపాడని అంటారు. అవియే నిజాం లోని కాళేశ్వరం, రాయలసీమలోని శ్రీశైలం మరియు కోస్త ప్రదేశములో లోని భీమేశ్వరం;

9. తెలుగు భాషలో మాత్రమే, ప్రతి పదం అచ్చు శబ్దంతో ముగుస్తుంది. తూర్పున ఉన్న దేశాలు, రాష్ట్రాలలో ఏ భాషకు ఈ ప్రాముఖ్యత లేదు

10. తెలుగు భాషలో మాత్రమే అత్యధిక సంఖ్యలో జాతీయాలు, సామెతలు ఉన్నాయి.

11. తెలుగు భాషను తెనుగు లేదా తెలుంగు లేదా తెనుంగు అని కూడా పిలుస్తారు.

12. రవీంద్రనాథ్ ఠాగూర్ అన్ని భారతీయ భాషలలో తెలుగు మధురమైనదని పేర్కొన్నారు.

13. సుమారు 200 సంవత్సరాల క్రితం తెలుగు మాట్లాడే ప్రజలను సుమారు 400 మందిని మారిషస్ ప్లాంటేషన్ వర్కర్లుగా తీసుకువెళ్లారు, ఇప్పుడు ఆ దేశపు ప్రధానమంత్రి వారి వారసులతో ఒకరు.

14. మొదటి నుండి చివరి వరకు చదివినప్పుడు రామాయణం, మరియు చివరి నుండి మొదటికి చదివినప్పుడు మహాభారతపు అర్ధం వచ్చే కచికలతో (పాలిండ్రోమ్) ఉన్న 40 శ్లోకాలు తెలుగులో తప్ప ఏ భాషలోనూ లేవు 

15. శ్రీ కృష్ణదేవరాయ శ్రీకాకుళంలోని, శ్రీకాకుళాంధ్ర మహా విష్ణుదేవుని సందర్శించి తన గ్రంధం ఆముక్త మాల్యదను అచటనే రచించి, శ్రీవారికి అంకితం ఇచ్చి నివాళులర్పించారు. ఆంద్ర మహా విష్ణువు రాయల వారికి స్వప్నంలో కనబడి, దేశ భాష లందు తెలుగు లెస్స అని తెలిపి , రాయల వారిని సామ్రాజ్యంలో తెలుగుని అధికార భాషగా ప్రకటించమని ఆదేశించారని చరిత్రలో తెలుపబడినది 

16. ఒకే ఒక అక్షరంతో వ్రాయబడు పద్యములు ఏకాక్షర పద్యములు తెలుగు భాషలో తప్ప మరియు ఏ భాషలోనూ లేవు 

17. ప్రపంచంలో ఉన్న అన్ని మతాల పెద్దలందరూ, మన ఋషులూ తెలుగు భాష సృష్టికర్తల నుండి గొప్ప వరం అని ఉద్ఘాటించారు

కాబట్టి , ప్రపంచంలోనున్న తెలుగు వారందరూ, తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత గ్రహించి, తెలుగును ప్రోత్సహించి, తెలుగు వ్యక్తిగా పుట్టినందుకు గర్వపడండి

బ్రాహ్మణ శాఖలు

వామ్మో ఇన్ని శాఖలా..... ద్రావిడ బ్రాహ్మణ శాఖలు, వైదీక బ్రాహ్మణ శాఖలు, నియోగి బ్రాహ్మణ శాఖలు, వైష్ణవ బ్రాహ్మణ శాఖలు, శివార్చక బ్రాహ్మణ శాఖలు ఉన్నాయి..

వాటి గురుంచి విపులంగా తెలుసుకుందాం......

ద్రావిడ బ్రాహ్మణ శాఖలు..

1) ప్రధమ శాఖ ద్రావిడ

2) ద్రావిడ

3) పేరూరు ద్రావిడ

4) పెద్ద ద్రావిడ

5) దిమిలి ద్రావిడ

6) ఆరామ ద్రావిడ

7) పుదూరు ద్రావిడ

8) కోనసీమ ద్రావిడ

9) ద్రావిడ వైష్ణవులు

10) తుమ్మగంటి ద్రావిడ

11) తుమ్మ ద్రావిడ

వైదీక బ్రాహ్మణ శాఖలు..

1) వెలనాటి వైదీక

2) వెలనాట్లు

3) వెలనాటి పూజారులు

4) వెలనాటి అర్చకులు

5) కాసలనాటి వైదీక

6) కాసలనాట్లు

7) ములకినాట్లు

8) ములకినాటి వైదీక

9) తెలగాణ్యులు

10) వేగనాట్లు

11) వేగనాటి వైదీక

12) ప్రధమ శాఖ వైదీక

13) కరణకమ్మ వైదీక

నియోగి బ్రాహ్మణ శాఖలు..

1) ప్రధమ శాఖ నియోగి

2) ఆరువేల నియోగి

3) నందవరీక నియోగి

4) లింగధారి నియోగి

5) ఉంత్కఖ గౌడ నియోగి

6) ఆరాధ్య నియోగి

7) అద్వైత నియోగి

8) నియోగి వైష్ణవులు

9) పాకనాటి నియోగి

10) ప్రాజ్ఞాటి నియోగి

11) పొంగినాడు నియోగి

12) నియోగి ఆది శైవులు

13) యజ్ఞవల్క్య నియోగి

14) ఆరాధ్యులు

15) వేమనారాధ్యులు

16) తెలగాణ్యు నియోగి

17) కరణకమ్మ నియోగి

18) బడగల కరణకమ్మ నియోగి

19) కరణాలు

20) శిష్ట కరణాలు

వైష్ణవ బ్రాహ్మణ శాఖలు..

1) శ్రీవైష్ణవులు

2) నంబులు

3) గోల్కొండ వ్యాపారులు

4) ఆచార్యులు 

5) మర్ధ్యులు

6) వ్యాపారులు

7) కరణకమ్మ వ్యాపారులు

8) బడగల కరణకమ్మ

9) మెలిజేటి కరణకమ్మ

10) దారుకులు

11) యజ్ఞవల్క్యులు

12) యజుశ్యాఖీయులు

13) బడగ కన్నడలు

14) నంబూద్రి బ్రాహ్మలు

15) వైఖానసులు

16) మధ్వలు

17) కాణ్వులు

18) కాణ్వేయులు

శివార్చక బ్రాహ్మణ శాఖలు.....

1) మహారాష్ట్ర చిత్సవనులు

2) లింగార్చకులు

3) ఆది శైవులు

4) శివార్చకులు

5) వీర శైవులు

6) మోనభార్గవ శైవులు

7) కాశ్యప శైవులు

8) శైవులు

9) ప్రధమ శాఖ శైవులు

10) రుద్ర శైవులు

11) పరమ శైవులు

12) శివ పూజారులు

13) శైవ స్మార్తులు

మొత్తం బ్రాహ్మణ ఉప శాఖలు 75 ఉన్నాయి.....

Wednesday, June 16, 2021

ఏ స్తోత్రం చదివితే ఏ ఫలితం వస్తుంది

దక్షిణా మూర్తి స్తోత్రం - ఏ స్తోత్రం పఠించాలో తెలియనప్పుడు, విద్యా సిద్ధికి

గణనాయకాష్టకం - అన్ని విజయాలకు

శివాష్టకం - సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి !!శివ అనుగ్రహం

ఆదిత్యహృదయం - ఆరోగ్యం , ఉద్యోగం

శ్రీరాజరాజేశ్వరి అష్టకం - సర్వ వాంచసిద్ది !!

అన్నపూర్ణ అష్టకం - ఆకలి దప్పులకి !!

కాలభైరవ అష్టకం - ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం !!

దుర్గష్టోత్తర శతనామం - భయహరం !!

విశ్వనాథ అష్టకం - విద్య విజయం !!

సుబ్రహ్మణ్యం అష్టకం - సర్పదోష నాశనం , పాప నాశనం !!

హనుమాన్ చాలీసా - శని బాధలు , పిశాచపీడ !!

యంత్రోధారక హనుమత్ స్తోత్రం - ఆరోగ్య సమస్యల నివారణ, పిశాచపీడ.. 

విష్ణు శతనామ స్తోత్రం - పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి !!

భ్రమరాంబిక అష్టకం - సర్వ శుభప్రాప్తి !!

శివషడక్షరి స్తోత్రం - చేయకూడని పాప నాశనం !!

లక్ష్మీనరసింహ స్తోత్రం - ఆపదలో సహాయం , పీడ నాశనం !! https://bit.ly/3sVXsEw

కృష్ణ అష్టకం - కోటి జన్మపాప నాశనం !!

ఉమామహేశ్వర స్తోత్రం - భార్యాభర్తల అన్యోన్యత !! https://bit.ly/3mD0mwg

శ్రీ రామరక్ష స్తోత్రం - హనుమాన్ కటాక్షం !!

లలిత పంచరత్నం - స్త్రీ కీర్తి !!

శ్యామాల దండకం - వాక్శుద్ధి !!

త్రిపుర సుందరి స్తోత్రం - సర్వజ్ఞాన ప్రాప్తి !!

శివ తాండవ స్తోత్రం - రథ గజ తురంగ ప్రాప్తి !!

శని స్తోత్రం - శని పీడ నివారణ !!

మహిషాసుర మర్ధిని స్తోత్రం - శత్రు నాశనం !!

అంగారక ఋణ విమోచన స్తోత్రం - ఋణ బాధకి !!

కార్యవీర్యార్జున స్తోత్రం - నష్ట ద్రవ్యలాభం !!

కనకధార స్తోత్రం - కనకధారయే !!

శ్రీ సూక్తం - ధన లాభం !!

సూర్య కవచం - సామ్రాజ్యంపు సిద్ది !!

సుదర్శన మంత్రం - శత్రు నాశనం !!

విష్ణు సహస్ర నామ స్తోత్రం - ఆశ్వమేధయాగ ఫలం !!

రుద్రకవచం - అఖండ ఐశ్వర్య ప్రాప్తి !!

దక్షిణ కాళీ - శని బాధలు , ఈతిబాధలు !!

భువనేశ్వరి కవచం - మనశ్శాంతి , మానసిక బాధలకు !!

వారాహి స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!

దత్త స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!

లాలిత సహస్రనామం - సర్వార్థ సిద్దికి !!

రుక్మిణీ కల్యాణం- పెళ్లి కావడం కష్టంగా ఉన్నవారికి.. కోరిన వారిని పెళ్లి చేసుకోవడానికి 

మహా మృత్యుంజయ మంత్రము - అపమృత్యు దోషాలను నివారించడానికి

మణిద్వీప వర్ణన

దశావతార నృసింహ మంత్రము

ఇది దశావతార నృసింహ మంత్రము, ఈ మంత్రము ఒకసారి చదివి షేర్ చేయండి,

మీరు ఈరోజు తప్పకుండా ఒక శుభవార్త వింటారు, ప్రతిరోజు చదివితే మనసులోని కోరికలు అన్నీ ఒక్కోక్కటిగా నేరవేరుతాయి.

"ఓం క్ష్రౌం నమోభగవతే నరసింహాయ |

ఓం క్ష్రౌం మత్స్యరూపాయ నమః |

ఓం క్ష్రౌం కూర్మరూపాయ నమః |

ఓం క్ష్రౌం వరాహరూపాయ నమః |

ఓం క్ష్రౌం నృసింహరూపాయ నమః |

ఓం క్ష్రౌం వామనరూపాయ నమః |

ఓం క్ష్రౌం పరశురామాయ నమః |

ఓం క్ష్రౌం రామాయ నమః |

ఓం క్ష్రౌం బలరామాయ నమః |

ఓం క్ష్రౌం కృష్ణాయ నమః |

ఓం క్ష్రౌం కల్కినే నమః జయజయజయ సాలగ్రామ నివాసినే నమః |

దివ్యసింహాయ నమః |

స్వయంభువే పురుషాయ నమః |

ఓం క్ష్రౌం ||"

ఇతరులకు చెప్పకూడదని మీరు మాత్రమే చదివి ఊరుకుంటే ఫలితం ఉండదు, మంచిని నలుగురికి పంచితేనే రెట్టింపు అవుతుంది, కావున కనీసం పదిమందికైనా వి చేసి వారి మంచికి దోహదపడండి, అప్పుడే మీ కోరికలు కూడా నెరవేరుతాయి.

Sunday, June 13, 2021

ఎంత సేపు పూజ?

పూజ గదిలో - 30 నిమిషాలు

బయట - 23 గంటల 30 నిమిషాలు

1) ఏది పూజ? ఎంత సేపు పూజ?

2) ఎక్కడ చూస్తావు ఈశ్వరుణ్ణి?

3) నిద్ర లేవగానే - 

    i) శ్రీహరి గుర్తుకు రావాలి

   ii) భూమికి నమస్కరించాలి

  iii) అరచేతిలో లక్ష్మీదేవిని చూడాలి

4) స్నానం చేస్తుంటే గంగా/యమునా నదులు గుర్తుకు రావాలి

5) దేవుడి దీపం వెలిగించేటప్పుడు - జ్యోతి స్వరూపుడైన అయ్యప్ప స్వామి గుర్తుకు రావాలి

6) కూరగాయలు/పండ్లు చూసినప్పుడు వరుణ దేవుడు గుర్తుకు రావాలి

7) వంట చేస్తుంటే అగ్ని దేవుడు గుర్తుకు రావాలి

8) అన్నం తింటుంటే ,కడుపులో ఉన్న వైశ్వానరుడు గుర్తుకు రావాలి

9) మంచి నీళ్ళు త్రాగెటప్పుడు,జల రూపంలో ఉన్న శివుడు గుర్తుకు రావాలి

10) ఊపిరి తీస్తుంటే,గాలిలో వాయు రూపమైన శ్రీకాళహస్తీశ్వరుడు గుర్తుకు రావాలి

11) పసి పిల్లలను చూసినప్పుడు ఈశ్వర మాయ గుర్తుకు రావాలి

12) వృద్ధులను చూసినప్పుడు జీవితం యొక్క పరమార్థం గుర్తుకు రావాలి

13) కనిపించే ప్రతీ స్త్రీలో అమ్మవారు గుర్తుకు రావాలి

14) విశ్వాన్ని చూసినప్పుడల్లా విశ్వనాథుడు గుర్తుకు రావాలి

15) నిద్ర పోయేటప్పుడు,స్వల్ప కాలిక లయం చేసే పరమ శివుడు గుర్తుకు రావాలి

అంతటా శివుడు కనిపిస్తున్నప్పుడు - నువ్వు నిజమైన పూజ చేశావు అని గుర్తు.

Friday, June 11, 2021

కలలు వాటి ఫలితాలు

పగటి కలలకు ఫలితం ఉండదు. పైత్య, అజీర్ణ, వాతముల వలన వచ్చే స్వప్నాలకు ఫలితం ఉండదు. రాత్రి వేళల్లో మొదటి ఝాములో వచ్చే కలలకు ఫలితం ఒక సంవత్సరం లో జరుగుతుంది. రాత్రి రెండవ ఝాములో వచ్చే స్వప్నాలకు ఫలితం మూడు నెలల్లో కనిపిస్తుంది. రాత్రి మూడవ ఝాములో వచ్చే కలలకు ఫలితం ఒక నెలలో , సూర్యోదయానికి ముందు వచ్చే కలలు ఫలితాలు పది రోజుల్లో, వేకువజామున వచ్చే కలల ఫలితం అదేరోజున జరుగుతుంది అని అంటారు. మంచి స్వప్నం వచ్చిన తర్వాత మళ్లీ నిద్ర పోకూడదు. చెడు కల వస్తే చేతులు, కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. ఇష్ట దైవాన్ని ధ్యానం చేసి నిద్రించాలి.

స్వప్నాలు 7 రకాలు :-

దృష్ట :- పగలు చూసిన విషయములను రాత్రి వేళల్లో కలలో కనిపించడం.

శృత :- పగలు విన్న , చదివిన మాటలు రాత్రి కలలో కూడా వినేవి.

అనుభూత:- పగలు అనుభవాన్ని రాత్రి కలలో కూడా అనుభవించడం.

ప్రార్థిత :- అధికంగా ఆలోచించిన ఏదైనా కోరిక రాత్రి వేళల్లో కలలో తీరడం.

కల్పిత :- తనకు తెలియని విషయం పై రాత్రి కల రావడం.

భావిక :- అత్యంత సూక్ష్మమైన విషయం పై వచ్చే కలలు.

దోష :- అనారోగ్యం కారణంగా రాత్రి కలలో అప్రయత్నంగా అరవడం, మూలగటం మొదలైనవి.. సాధారణంగా అజీర్ణం వలన వాత పిత్త దోషాల వలన వస్తాయి

శ్రీ గంగా దశహరా స్తోత్రమ్

 త్రికరణములతో చేసిన పదిరకముల పాపములను నశింపజేసే 'శ్రీ గంగా దశహరా స్తోత్రమ్'

1. అపాత్రులకు దానం చేయుట, హింసించుట, పరస్త్రీయందు కామనాబుద్ధి అనబడే శారీరక పాపములు

2. కఠినంగా మాట్లాడుట, అసత్యము, చాడీలు చెప్పుట, అనవసరపు మాటలాడుట, అనే వాక్కుకి సంబంధించిన పాపములు

3. పరుల ధనాదుల యందు ఆసక్తి, ఇతరులకు కీడు తలపెట్టుట, పాపకార్యములయందు ఆసక్తి కలిగియుండుట

అనబడే మానసిక పాపములు, పశ్చాత్తాపముతో ఈ స్తోత్రమును చదివిన వానియొక్క ఈ పదిరకముల పాపములను (ఏ జన్మలో చేసినవైనప్పటికీ) ఈ స్తోత్ర పఠనము నశింపజేయును.

బ్రహ్మోవాచ-

ఓం నమః శివాయై గంగాయై శివదాయై నమో నమః!

నమస్తే రుద్రరూపిణ్యై శాంకర్యై తే నమోనమః!

నమస్తే విశ్వరూపిణ్యై బ్రహ్మమూర్త్యై నమోనమః!!

సర్వదేవస్వరూపిణ్యై నమో భేషజమూర్తయే!!

సర్వస్య సర్వవ్యాధీనాం భిషక్ శ్రేష్ఠ్యై నమోస్తుతే!

స్థాణుజంగమ సంభూత విషహంత్ర్యై  నమోనమః!!

భోగోపభోగ్యదాయినై భగవత్త్యై నమోనమః!!

మందాకిన్యై నమస్తేస్తు స్వర్గదాయై నమో నమః!

నమస్త్రైలోక్యభూషాయై జగద్ధాత్ర్యై నమో నమః!!

నమస్త్రిశుక్ల సంస్థాయై తేజోవత్యై నమో నమః!

నందాయై లింగధారిణ్యై నారాయణ్యై నమో నమః!

నమస్తే విశ్వముఖ్యాయై రేవత్యై తే నమో నమః!!

బృహత్యైతే నమస్తేస్తు లోకధాత్ర్యై నమోనమః!

నమస్తే విశ్వమిత్రాయై నందిన్యై తే నమో నమః!!

పృథ్వ్యై శివామృతాయైచ సువృషాయై నమో నమః!

శాంతాయైచ వరిష్ఠాయై వరదాయై నమో నమః!!

ఉగ్రాయై సుఖదోగ్ద్యైచ సంజీవిన్యై నమోనమః!

బ్రహ్మిష్ఠాయై బ్రహ్మదాయై దురితఘ్న్యై నమోనమః!!

ప్రణతార్తి ప్రభంజిన్యై జగన్మాత్రే నమోస్తుతే!

సర్వాపత్ప్రతిపక్షాయై మంగళాయై నమో నమః!!

శరణాగతదీనార్త పరిత్రాణ పరాయణే!

సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే!!

నిర్లేపాయై దుర్గహంత్ర్యై దక్షాయై తే నమో నమః!

పరాత్పరపరతరే తుభ్యం నమస్తే మోక్షదే సదా!

గంగే మమాగ్రతో భూయాత్ గంగే మే దేవి పృష్ఠతః!

గంగే మే పార్శ్వయోరేహి త్వయి గంగేస్తుమే స్థితిః!!

ఆదౌ త్వమంతే మధ్యే చ సర్వం త్వం గాంగ తే శివే!

త్వమేవ మూలప్రకృతిస్త్వం హి నారాయణః పరః!!

గంగేత్వం పరమాత్మా చ శివస్తుభ్యం నమః శివే!

య ఇదం పఠతి స్తోత్రం భక్త్యా నిత్యం నరోపి యః!!

శృణుయాత్ శ్రధ్ధయా యుక్తః కాయవాక్చిత్తసంభవై:!

దశధా సంస్థితైర్దోషై: సర్వైరేవ ప్రముచ్యతే!!

సర్వాన్ కామానవాప్నోతి ప్రేత్య బ్రహ్మణి లీయతే!

జ్యేష్టేమాసి సితే పక్షే దశమీ హస్త సంయుతా!!

తస్యాం దశమ్యామేతచ్చ స్తోత్రం గంగాజలే స్థితః!

యః పఠేత్ దశకృత్వస్తు దరిద్రో వాపి చాక్షమః!!

సోపి తత్ ఫలమవాప్నోతి గంగాం సంపూజ్య యత్నతః!

అదత్తానాముపాదానం హింసా చైవావిధానతః!!

పరదారోపసేవా చ కాయికం త్రివిధం స్మృతమ్!

పారుష్యమనృతం చైవ పైశున్యం చాపి సర్వశ:!!

అసంబద్ధ ప్రలాపశ్చ వాఙ్మయం స్యాచ్చతుర్విధమ్! 

పరద్రవ్యేష్వభిధ్యానం మనసానిష్టచిన్తనమ్!!

వితథాభినివేశశ్చ మానసం త్రివిధం స్మృతమ్!

ఏతాని దశపాపాని హర త్వం మమ జాహ్నవి!!

ధశపాపహరా యస్మాత్తస్మాద్దశహరా స్మృతా!

త్రయస్త్రింశచ్ఛతం పూర్వాన్ పితౄనథ పితామహాన్!!

ఉద్ధరత్యేవ సంసారాన్మంత్రేణానేన పూజితా!

నమోభగవత్యై దశపాపహరాయై గఙ్గాయై నారాయణ్యై రేవత్యై శివాయై దక్షాయై అమృతాయై విశ్వరూపిణ్యై నన్దిన్యై తే నమోనమః!!

Wednesday, June 9, 2021

శని త్రయోదశి ఎలా వాడుకలోనికి వచ్చినది

సృష్టి స్థితి లయ కారకుడైన ఈశ్వరుడునే ఆ శని ప్రభావమునకు లోనయ్యాను. సామాన్యులైన మానవులు శని ప్రభావం వల్ల ఎంత ఇక్కట్లు పడుతున్నారో కదా అని ఆలోచించి ఈశ్వరుడు , శని... " నేను ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీవు నా పేరు కలుపుకుని శనేశ్వరుడని పేరు పొందగలవు. ఈ రోజు శని త్రయోదశి కావున ఈ శని త్రయోదశి నాడు నీ వల్ల ఇబ్బందులు పడుతున్నవారు నీ కిష్టమైన నువ్వుల నూనె , నల్ల నువ్వులు , నీలపు శంఖు పుష్పములు , నల్లని వస్త్రంతో నిన్ను ఎవరైతే అర్పించి ఆరాధిస్తారో .. వారికి నీ వల్ల ఏర్పడిన అనారోగ్యం మృత్యుభయం పోయి ఆరోగ్యం చేకూరగలదు అని వరము ఇస్తునానని తెలిపాడు.

శనీశ్వరుడి జయంతి

 రేపు (10-June-2021) శనీశ్వరుడి  జయంతి  శనీశ్వరుడి అనుగ్రహం పొందితే అదృష్టం మీ వెంటే..!

శనీశ్వరుడి  జయంతిని ఏటా వైశాఖ అమవాస్య తిథినాడు శనీశ్వరుడి జయంతి నిర్వహిస్తారు.  ఈ రోజు శనీశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కొలిచి ఆయన అనుగ్రహం పొందితే కష్టాలు దూరమై.. అదృష్టం కలిసి వస్తుంది.

శనీశ్వరుడి జయంతి

దేవతల్లో శని దేవుడికి విశిష్టమైన స్థానముంది. ఎందుకంటే శని చెడు ప్రభావం మనమీద పడితే వృత్తి , వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అందుకే శని దేవుడిని నిర్లక్ష్యం చేయరాదు.  హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ చతుర్దశి అనంతరం వచ్చే అమవాస్య రోజు శని జయంతి జరుపుకుంటారు. వారంలో ఒకరోజు అంటే శనివారం నాడు శనీశ్వరుడు శని గ్రహాన్ని పాలిస్తుంటాడు. సూర్యదేవుడు కుమారుడైన శని.. శనిగ్రహం స్వరూపం.

ఈయనను ఆరాధించడం వల్ల జీవితంలో వచ్చే అట్టంకులు , సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా శని దేవుడి ఆశీర్వాదం వల్ల అనుకున్న కోరికలు తీరుతాయి.

చేయవలసిన పూజలు

శని జయంతి రోజు భక్తులందరూ గంగాజలం , నూనే , నీరు పరిశుభ్రంగా స్నానమాచరించాలి.

అనంతరం శని విగ్రహానికి 9 రాళ్లుతో చేసిన గొలుసును సమర్పించాలి.

దుష్టశక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి శని దేవుడును ప్రసన్నం చేసుకోవాలి. అంటే తేలాభిషేకం చేసి శాంతి పూజలు నిర్వహించాలి.

తాంత్రిక విద్యల ప్రభావం నుంచి రక్షణ కోసం హోమం లేదా యజ్ఞాన్ని జరిపించాలి.

ప్రజలు తమ వేలికి గుర్రపు ఉంగరాన్ని ధరించడం లేదా ఇంటి వెలుపల దాన్ని వేలాడదీయడమో చేయాలి.

అంతేకాకుండా ఈ రోజు చీమలకు బెల్లాన్ని ఆహారంగా ఇవ్వాలి.

శని స్త్రోత్రాన్ని నిత్యం పఠిస్తే భగవంతుడి ఆశీర్వాదాలు పొందుతారు.

నలుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది. అంటే నలుపు వస్త్రాలు , ఆవ నూనే లాంటివి దానం చేయాలి.

శని దేవుడి ప్రాముఖ్యత

సూర్య దేవుడి కుమారుడైన శని పుట్టిన రోజు సందర్భంగా శని జయంతిని ఏటా నిర్వహిస్తారు.  వైశాఖ మాసంలోని అమావాస్య తిథినాడు ఈ జయంతి వస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మానవుల జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తాడు శని. అంతేకాకుండా ఈయన శని గ్రహానికి రాజు. జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటోన్న సమయంలో శని దేవుడికి పూజ చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఈ రోజు ఉపవాసం ఉండి శనీశ్వరుడి అనుగ్రహం పొందితే అదృష్టం కలిసి వస్తుంది. ఆ విధంగా శనిని ప్రార్థించడం వల్ల భక్తులను కష్టాలు , బాధల నుండి విముక్తులవుతారు. అంతేకాకుండా దుష్ట , చెడు ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుంది.

శని శాంతి మంత్ర స్తుతి

ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది. నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది.

క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్

ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్

నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార

వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ

ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ

కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ

శుద్ధబుద్ధి ప్రదాయనే

య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్

మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి

నవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది. శని దోషం నుండి బయటపడేందుకు పైన ఉదహరించిన ''క్రోడం నీలాంజన ప్రఖ్యం..'' అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి, తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.

శన్యారిష్టే తు సంప్రాప్తే

శనిపూజాంచ కారయేత్

శనిధ్యానం ప్రవక్ష్యామి

ప్రాణి పీడోపశాంతయే

ఈ రెండు శ్లోకాలను స్మరించడంతో బాటు, నవగ్రహాలకు తైలాభిషేకం చేయాలి.

ఇలా చేయడంవల్ల శని దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది.

సాష్టాంగ నమస్కారం యొక్క విశిష్టత

అష్టాంగ నమస్కారమునే సాష్టాంగ నమస్కారము అని అంటారు.._

సాష్టాంగ నమస్కారము అంటే మానవునికి వున్న ఎనిమిది అంగాలతో నమస్కారము చేయుట అని అర్ధము..._

ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాబ్యామ్ ప్రణామో ష్టాంగ ఈరితః...

అష్టాంగాలు అంటే...

"ఉరసా" అంటే తొడలు,

"శిరసా" అంటే తల,

"దృష్ట్యా" అనగా కళ్ళు,

"మనసా" అనగా హృదయం,

"వచసా" అనగా నోరు,

"పద్భ్యాం" అనగా పాదములు,

"కరాభ్యాం" అనగా చేతులు,

"కర్ణాభ్యాం" అంటే చెవులు.

ఇలా "8 అంగములతో కూడిన నమస్కారం" చేయాలి.

మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలించాలి..

ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజ స్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజ స్తంభం వెనుక వుండి చేయాలి._

1) ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి._

2) శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి._

3) దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి._

4) మనస్సుతో నమస్కారం అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మన:స్పూర్తిగా చేయాలి._

5) వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం.. అంటే.. నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్ట దైవాన్ని మాటతో స్మరించాలి._

*అంటే "ఓం నమః శివాయ" అని అంటూ నమస్కారం చేయాలి.*

6) పద్భ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి._

7) కరాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి.

8) జానుభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి...

స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఆడవాళ్లు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. 

అంటే కాళ్లు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని శాస్త్రం చెబుతుంది.

పూజ పూర్తయిన తరువాత మంత్ర పుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్బంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చెయ్యాలి. 

దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి

నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టాంగ నమస్కారం చేసేవాళ్లు పొందుతారని శాస్త్రవచనం.

శనీశ్వరుని చరిత్ర

జ్యోతీష్య శాస్త్రం ప్రకారం 'శని' నవగ్రహాలలో ఒక గ్రహం. సూర్యుడు , చంద్రుడు , ఛాయాగ్రహాలైన రాహువు మరియు కేతువులతో కలిపి గ్రహాలు తొమ్మిది. గగనమండలంలో ఉన్నగ్రహాలకుభూమితో సంబంధం ఉంది. కాబట్టి తొమ్మిది గ్రహాల ప్రభావం భూమిమీద , భూమిపై ఉన్న ప్రతి చరాచర జీవుల పైన , నిర్జీవ , ఝడ , నిర్లిప్త వస్తువుల మీద వుంటుంది. నవగ్రహాలలో ఒకటైన శని గ్రహం ఇందుకు భిన్నం కాదు. శని , శనిగ్రహం , శనైశ్ఛరుడు , అని పలు నామములతో పిలువబడి , గ్రహరూపలో పూజింపబడే 'శని' ఒక గ్రహదేవుడు. వారంలో ఏడవవారం శనివారం. శనివారానికి అధిపతి శనిభగవానుడు.

సంఖ్యాశాస్త్రం ప్రకారం '8' శనికి ప్రీతికరమయిన సంఖ్య. శని జననం శని తల్లిదండ్రులు: సకల జీవులకు ప్రత్యక్షదైవం అయినట్టి సూర్యుడుభగవానుడికి , అతని రెండవ భార్య ఛాయదేవికి పుట్టిన సంతానం శని. ఆయనకు ఛాయాపుత్రుడు అనే పేరు కూడా ఉంది. జీవుల జాతకాలపై తన ప్రభావాన్ని ఎలా చూపబోతున్నాడో తెలియజేయడానికి సూచనగా , ఆయన జననం సూర్య గ్రహణములోజరిగింది.

ఇతర నామాలు: ఇతనికి మందగమనుడు అని కూడా పేరు. శనయే క్రమతి స:  అనగా అతినెమ్మదిగా కదిలేవాడు అని అర్థం. ఒకసారి సూర్యుని చుట్టిరావడానికి శనికి 30 సంవత్సరాలు పడుతుంది. శానైస్కర్య , అసిత , సప్తర్చి , క్రూరదృష్ట , క్రూరలోచనుడు , పంగు పాదుడు , గృద్రవాహనుడు మొదలైన పేర్లుకూడా ఉన్నాయి. శనీస్వరునికి అత్యంత ప్రీతికరమైన వస్తువులు: నువ్వులు , నువ్వుల నూనె , నల్లటి వస్త్రం , నీలం , ఇనుము , అశుభ్రత, మందకొడిగా ఉండటం. ధర్మ రక్షకుడు కాకి వాహనముపై శని దేవుడు సమస్త ప్రాణకోటి యొక్క పాపకర్మల ఫలాన్ని వెను వెంటనే నెరవేర్చే దేవుడు . జీవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి , శిక్షించి , ధర్మాన్ని నిలిపే శనిభగవానుడు యమధర్మరాజుకు మరియు యమునకు అగ్రజుడు. వీరి ముగ్గురి శరీర ఛాయ నలుపే. సూర్యుని కుమారులైన శని మరియు యముడు , ఇరువురూ న్యాయాధిపతులే. యముడు మరణానంతరం దండనలు విధిస్తే , శని , జీవులు బ్రతికి ఉండగానే హింసించి , యాతనలకు గురిచేసి శిక్షిస్తాడు. గుణపాఠం నేర్పించే విషయంలో శనికి ఎవరూ సాటి లేరు. ద్రోహం , వెన్నుపోటు , హింస , పాపమార్గాలు మరియు అన్యాయ మార్గాలను అనుసరించేవారికి శనిదేవుడు మిక్కిలి అపాయకారి అని శాస్త్రాలు చెబుతున్నాయి. తన దృష్టి పడ్డవారిని హింసించి , నానాయాతనలకు గురిచేసి , అత్యంత కౄరంగా అమిత బాధలకు గురిచేసే శనిదేవుడు , తను కరుణించిన వారిని అందలం ఎక్కించే శ్రేయోభిలాషి అని శాస్త్రాలు వర్ణించాయి. నల్లని ఛాయ అతని మేని వర్ణం. నల్లని వస్త్రములు అతని ఉడుపులు. ఖడ్గము , బాణములు మరియు రెండు బాకులు అతని ఆయుధాలు. నల్లని కాకి అతని వాహనం. శనిభగవానుడు సహజంగా నల్లటి ఛాయ కలవాడని , ఛాయా , మార్తాండ సంభూతుడని , అందమైన ముఖం కలవాడుగాను, క్రూరుడిగాను , మందగమనుడిగాను , గానుగుల కులానికి చెందినవాడుగాను , కాల - భైరవుడికి మహాభక్తుడిగాను హిందూ పురాణాలు జ్యోతిష శాస్త్రాలలో వర్ణింపబడ్డాడు .

శని మహత్యం , శనీశ్వర జపం , శనీశ్వరుడి జప మంత్రాలు 

నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం ||

 || ఓం శం శనయేనమ:|| 

|| ఓం నీలాంబరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ || 

|| ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్చరాయ నమః || 

శని గాయత్రీ మంత్రం:

ఓం కాకథ్వజాయ విద్మహే ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్. || ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ || బ్రహ్మాండ పురాణంలో తెలుపబడిన 

"నవగ్రహ పీడహర స్తోత్రం": 

||సుర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః మందచారః ప్రసన్నాత్మా పీడం హరతు మే శని: || ||ఓం శం శనైస్కర్యయే నమః|| ||ఓం శం శనైశ్వరాయ నమః|| ||ఓం ప్రాంగ్ ప్రీంగ్ ప్రౌంగ్ శ: శనయే నమః || ||కోణస్ధః పింగళో బబ్రుః కృష్ణో రౌద్రంతకో యమః సౌరిః శనైశ్చరో మందహ పిప్పలాదేన సంస్తుత:|| ఓం నమో శనైశ్వరా పాహిమాం , ఓం నమో మందగమనా పాహిమాం , ఓం నమో సూర్య పుత్రా పాహిమాం , 

ఓం నమో చాయాసుతా పాహిమాం , 

ఓం నమో జేష్టపత్ని సమేత పాహిమాం , 

ఓం నమో యమ ప్రత్యది దేవా పాహిమాం , 

ఓం నమో గృధ్రవాహాయ పాహిమాం శనిగ్రహ జపం ఆవాహము అస్యశ్రీ శనిగ్రహ మహా మంత్రస్య హిళింభి ఋషిః శనైశ్చర గ్రహోదేవతా! ఉష్టిక్ చంధః! శనైశ్చర గ్రహ ప్రసాద సిద్దర్ధ్యే శనిపీడా నివారణార్ధే శనిమంత్ర జపే వినియోగః కరన్యాసం ఓం శమగ్ని - అంగుష్టాభ్యాసం నమః ఓం అగ్నిభిస్కరత్ - తర్జనీభ్యాం నమః ఓం విష్ణుశంనస్తపతుసూర్యః - మధ్యమాభ్యాం నమః ఓం శంవాతః - అనామికాభ్యాం నమః ఓం వాత్వరపాః - కనిష్ఠికాభ్యాసం నమః ఓం అపశ్రిధః - కరతల కరపృష్టాభ్యాసం నమః 

అంగన్యాసము: ఓం శమగ్ని: - హృదయాయ నమః ఓం అగ్నిభిస్కరత్ - శివసేస్వాహ ఓం శంనస్తపతుసూర్యః - శిఖాయైవషట్ ఓం శంవాతః - కవచాయహు ఓం వాత్వరపాః - నేత్రత్రయాయ వౌషట్ ఓం అపశ్రిధ్ర - అస్త్రాయఫట్ ఓం భూర్భువస్సువరోమితి దిగ్భంధం ఆదిదేవతాః ఇమం యమ ప్రస్తరమాహి సీదాంగి రోభి: పితృభిప్సం విధానః! అత్వా మంత్రాః కవిసహస్త్వా వహ న్వైనారాజన్ హవిషామదయస్వ!!

ప్రత్యథి దేవతా: ప్రజాపతే సత్వ దేవతాన్యోన్యో విశ్వాజాతాని పరితాబభూవ! యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తువయగ్గౌ శ్యామ పతయోరయీణాం!!

వేదమంత్రం ఓం శమగ్ని రాజ్ఞి భిస్క రచ్చన్న స్తపతు సూర్యః శం వాతో వాత్వరపా అపశ్రిధః శని కవచ స్తోత్రము శనైశ్చరశ్శిరో రక్షేత్! ముఖం భక్తార్తి నాశనః కర్ణౌకృష్ణాంబరః పాతు! నేత్రే సర్వ భయంకరః!! కృష్ణాంగో నాసికాం రక్షేత్! కర్ణౌ మేచ శిఖండిజ:! భుజౌమే సుభుజః పాతు! హస్తా నీలోత్పల ప్రభః! పాతుమే హృదయం కృష్ణ:! కృక్షిం శుష్కోధర స్తధాః! కటిం మే వికటః పాతు! ఊరూ మే ఘోర రూపవాన్! జానునీ పాతు దీర్ఘోమే! జంఘేమే మంగళ ప్రభః! గల్పౌ గణాకరః పాతు! పాదౌ మే మంగుపాదకః! సర్వాణిచ మామాచంగాని! పాతు భాస్కరనందనః! 

ఫలశ్రుతి య ఇదం కవచం దివ్యం సర్వ పీదాహరం ణాం పఠతి శ్రద్ధయా యుక్తః! సర్వాన్ కామానవాప్నుయాత్! శని మంగళాష్టకమ్ మందః కృష్ణవిభస్తు పశ్చిమ ముఖః సౌరాష్టవో కాస్యవః! నక్రేశో ఘటన సుహృద్భుధ భ్రుగుర్వైరీంద్వ వక్ష్యాసుతః!! స్థానం పశ్చిమ దిక్ర్పజాపతిర్యమౌదేవౌ ధనస్త్వాసనం! షట్రష్ట స్శుభకృచ్ఛమీ రవిసుతః కూర్యాత్సదా మంగళం!!

శన్యష్టోత్తర శతమామావళి

ఓం శనైశ్చరాయ నమః 

ఓం శాంతాయ నమః 

ఓం శరణ్యాయ నమః 

ఓం వరేణ్యాయ నమః 

ఓం సర్వేశాయ నమః 

ఓం సౌమ్యాయ నమః 

ఓం సురవంద్యాయ నమః 

ఓం సురలోక విహారిణే నమః 

ఓం సుఖాననోవిష్టాయ నమః 

ఓం సుందరాయ నమః 

ఓం ఘనాయ నమః 

ఓం ఘనరూపాయ నమః 

ఓం ఘనాభరణధారిణే నమః 

ఓం ఘనసారవిలేపాయ నమః 

ఓం ఖద్యోతాయ నమః 

ఓం మందాయ నమః 

ఓం మందచేష్టాయ నమః 

ఓం మహనీయగుణాత్మనే నమః 

ఓం మర్త్యపావనపాదాయ నమః 

ఓం మహేశాయ నమః 

ఓం ఛాయాపుత్త్రాయ నమః 

ఓం శర్వాయ నమః 

ఓం శ్రతూణీరధారిణే నమః 

ఓం చరస్థిరస్వభావాయ నమః 

ఓం చంచలాయ నమః 

ఓం నీలవర్ణాయ నమః 

ఓం నిత్యాయ నమః 

ఓం నీలాంబసనిభాయ నమః 

ఓం నీలాంబరవిభూషాయ నమః 

ఓం నిశ్చలాయ నమః

 ఓం వేద్యాయ నమః 

ఓం విధిరూపాయ నమః 

ఓం విరోధాధార భూమయే నమః 

ఓం వేదాస్పదస్వాభావాయ నమః 

ఓం వజ్రదేహాయ నమః 

ఓం వైరాగ్యదాయ నమః

 ఓం వీరాయ నమః 

ఓం వీతరోగభయాయ నమః 

ఓం విపత్పరంపరేశాయ నమః 

ఓం విశ్వనంద్యాయ నమః 

ఓం గృద్రహహాయ నమః 

ఓం గుధాయ నమః 

ఓం కూర్మాంగాయ నమః 

ఓం కురూపిణే నమః 

ఓం కుత్సితాయ నమః 

ఓం గుణాధ్యాయ నమః 

ఓం గోచరాయ నమః 

ఓం అవిద్యామూలనాశాయ నమః 

ఓం విద్యావిద్యాస్వరూపిణే నమః 

ఓం ఆయుష్యకారణాయ నమః 

ఓం ఆపదుద్దర్త్రే నమః 

ఓం విష్ణుభక్తాయ నమః 

ఓం వశినే నమః 

ఓం వివిధాగమనేదినే నమః 

ఓం విధిస్తుత్యాయ నమః 

ఓం వంద్యాయ నమః 

ఓం విరూపాక్షాయ నమః 

ఓం వరిష్టాయ నమః 

ఓం వజ్రాంకుశధరాయ నమః 

ఓం వరదాయ నమః 

ఓం అభయహస్తాయ నమః 

ఓం వామనాయ నమః 

ఓం జేష్టాపత్నీసమేతాయ నమః

ఓం శ్రేష్టాయ నమః 

ఓం అమితభాషిణే నమః 

ఓం కస్టౌఘనాశకాయ నమః 

ఓం ఆర్యపుష్టిదాయ నమః 

ఓం స్తుత్యాయ నమః 

ఓం స్తోత్రగమ్యాయ నమః 

ఓం భక్తివశ్యాయ నమః 

ఓం భానవే నమః 

ఓం భానుపుత్త్రాయ నమః

ఓం భావ్యాయ నమః 

ఓం పావనాయ నమః 

ఓం ధనుర్మందల సంస్థాయ నమః 

ఓం ధనదాయ నమః 

ఓం ధనుష్మతే నమః 

ఓం తనుప్రకాశ దేహాయ నమః 

ఓం తామసాయ నమః 

ఓం అశేషజనవంద్యాయ నమః 

ఓం విశేషఫలదాయినే నమః 

ఓం వశీకృతజనిశాయ నమః 

ఓం పశూనాంపతయే నమః 

ఓం ఖేచరాయ నమః 

ఓం ఖగేశాయ నమః 

ఓం ఘననీలాంబరాయ నమః 

ఓం కాఠిన్యమానసాయ నమః 

ఓం అరణ్యగణస్తుత్యాయ నమః 

ఓం నీలచ్చత్రాయ నమః 

ఓం నిత్యాయ నమః 

ఓం నిర్గుణాయ నమః 

ఓం గుణాత్మనే నమః 

ఓం నిరామయాయ నమః 

ఓం నింద్యాయ నమః 

ఓం వందనీయాయ నమః 

ఓం ధీరాయ నమః 

ఓం దివ్యదేహాయ నమః 

ఓం దీనార్తి హరణాయ నమః 

ఓం దైన్య నాశకరాయ నమః 

ఓం ఆర్యజనగణణ్యాయ నమః 

ఓం క్రూరాయ నమః 

ఓం క్రూరచేష్టాయ నమః 

ఓం కామక్రోధకరాయ నమః 

ఓం కళత్రపుత్త్రశత్రుత్వ కారణాయ నమః 

ఓం పరిపోషితభక్తాయ నమః 

ఓం భక్త సంఘమనోభీష్ట ఫలదాయ నమః 

ఓం శ్రీమచ్ఛనైశ్చరాయ నమః 


శనీశ్వరుడు ప్రసన్నుడవాలంటే

కంటక శని : (చాంద్రయానాన్ని అనుసరించి జన్మరాశి నుండి ఎనిమిదవ ఇంటిలోనికి శని ప్రవేశించినప్పుడు) లేదా , ఏలినాటి శని: (చాంద్రయనాన్ని అనుసరించి జన్మరాశి నుండి పన్నెండు , మొదటి మరియు రెండవ ఇంటిలోనికి శని యొక్క గమన సమయంలో) ఉన్నా శని ప్రస్సనుడవాలంటే:

అమావాస్య రోజున కాళీ మాత పూజ చేయాలి. విష్ణువును , కృష్ణుని రూపంలో ధ్యాన్నిస్తూ 'ఓం నమో నారాయణాయ', 'హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే..' అని జపించాలి.హనుమంతుడిని సర్వోత్కృష్టమైన (అనంతమైన) రూపంలో ధ్యానించాలి. శని, హనుమంతుని వీపుపై , చేరి అతన్ని పట్టి పీడించాలని ప్రయత్నించినప్పుడు , తన బలంఅంతా ఉపయోగించి , ఒక్క విదిలింపుతో శనిని , విసిరి పారేసినప్పుడు సూర్య భగవానుడు , హనుమంతుడిని మెచ్చుకుని, "నిన్ను పూజించిన వారికి శని బాధలుండవు" అని దీవించాడట. శనిత్రయోదశి , శనిజయంతి (పుష్యమాసం, బహుళ అష్టమి) మరియు శనిఅమావస్య రోజులలో తిలాభిషేకం చేయాలి. బ్రాహ్మణునికి నల్ల నువ్వులు దానం చేయాలి.నల్ల గోవు (కపిల గోవు) కు బెల్లం మరియు నువ్వుల మిశ్రమాన్ని తినిపించాలి. శనివారాలలో (శ్రావణ మాసంలో తప్పనిసరిగా) ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉపవాసం ఉండాలి. కాకులకు ఉదయం , మధ్యాహ్న వేళాలలో అన్నం పెట్టాలి. వికలాంగులైన వారికి ఆహారం అందివ్వాలి. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి. శని క్షేత్రాలు సందర్శించాలి. ప్రతిరోజూ సూర్యాస్తమయం తరువాత ఇంటి ముఖద్వారం వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి. దశరథ మహారాజ కృత శని స్తోత్రమును పఠించాలి.శ్రావణ పూర్ణిమ నాడు, జ్యేష్టాదేవికి, శనీశ్వరుడికి కళ్యాణం జరిపించాలి. మూలమంత్రం, పునర్చరణ , హవనం , దానములతో పాటుగా 19000 సార్లు శనిజపం చేయటం మంచిది. శ్రావణమాసలో , శనివారాలలో శనైశ్చరవ్రతం , హోమం చేయటం చాలా మంచిది. శనైశ్చర దీక్ష , శ్రావణ శుద్ధ విదియ నుండి శ్రావణ బహుళ షష్ఠి వరకు పూనాలి. 'రామ నామం' , హనుమాన్ చాలీసా , దుర్గా స్తుతులను జపించటం. హనుమంతుడు , శ్రీ దుర్గా దేవి , వినాయకులను ప్రార్థించటం ఎంతో మంచిది. పెరుగన్నం , దేవునికి నైవేద్యంగా పెట్టిన ఆతరువాత కాకులకు పెట్టాలి. అనాథ బాలలకు అన్నదానం చేయాలి. పై వాటిలో ఏది పాటించినా శని ప్రసన్నుడవుతాడు.  శని క్షేత్రాలు  శని శింగణాపూర్

దస్త్రం:పుజవిధి

శని శింగణాపూర్: అహమద్ నగర్ జిల్లాలో , షిరిడి మరియు ఔరంగాబాద్ మహారాష్ట్ర మధ్యలో శని శింగణాపూర్ అనే శనిక్షేత్రం ఉంది. ఇక్కడ శని "స్వయంభు" (సంస్కృతంలో స్వయముగా ఆవిర్భవించిన అని అర్థం). భూమి నుండి స్వయంగా ఉద్భవించిన నల్లని , గంభీరమైన రాతి విగ్రహం. కచ్చితంగా ఏ కాలానికి చెందినదో ఎవరికీ తెలియనప్పటికీ, స్తలపురాణం ప్రకారం స్వయంభు శనీశ్వరుడు అనాదిగా ఇక్కడ కొలువైయున్నాడు. కనీసం కలియుగం ప్రారంభం నుండి దీని ఉనికి ఉన్నట్టుగా భక్తులు నమ్ముతారు. నోటిమాట ద్వారా తరతరాలకు అందించబడిన ఈ స్వయంభు , గురించి 🌹స్తలపురాణం ప్రకారం:🌹 పూర్వం , ఒక గొర్రెల కాపరి పదునైన చువ్వతో ఒక చోట మట్టిని తవ్వుతుండగా అది ఒక రాతికి కొట్టుకుని , ఆ రాయి నుండి రక్తం స్రవించడం ప్రారంభమైంది. దీనితో గొర్రెల కాపరులు దిబ్రాంతి చెంది , భయంతో వూరిలోకి పరుగున వెళ్ళి అందరికి తెలిపాడు. వెంటనే పల్లె మొత్తం ఆ అద్భుతం చూచేందుకు గుమికూడి చర్చించుకున్నారు. కానీ ఎవ్వరికీ ఏమీ పాలుపోలేదు. ఆ రాత్రి, ఆ గొర్రెల కాపరి స్వప్నంలో శనీశ్వర స్వామి ప్రత్యక్షమైనాడు. తాను "శనీశ్చరుడి"నని, అద్వితీయముగా కనిపించుచున్న ఆ నల్లరాయి తన స్వయంభు రూపమని తెలిపినాడు. అంతట , ఆ గొర్రెలకాపరి స్వామిని ప్రార్థించి తాను స్వామికి ఆలయం ఎక్కడ , ఎలా నిర్మించాలో తెలుపమని ప్రార్తించాడట. దీనికి సమాధానముగా శని మహాత్ముడు ఆకాశం మొత్తం తనకు నీడ అని, తనకు ఎటువంటి నీడ అవసరం లేదని, తాను బాహాటముగా ఉండుటకు ఇష్టపడతానని , కాబట్టి ఏ ఆలయనిర్మాణమూ అక్కరలేదని , ప్రతినిత్యం పూజ చేస్తూ శనివారాలలో తప్పకుండా 'తైలాభిషేకం' చేయమని చెప్పాడట. తను స్వయంభుగా వెలసిన ఆపల్లెకు ఇకమీదట బందిపోటుల , దోంగల , దోపిడిదారుల , కన్నము వేసే దొంగల భయం ఎప్పటికీ ఉండజాలదని మాట ఇచ్చి అదృశ్యం అయ్యాడట. ఇక్కడ శనీశ్చర స్వామిని , గుడిలో కాకుండా ఎటువంటి కప్పు లేని ఆరు బయట చూడవచ్చును. ఆంతేకాదు ఈ వూరిలో నేటికీ , (ఈ కలియుగంలో కూడా) ఏ ఇంటికి తలుపు లుండవు! దుకాణాలకు , ఇళ్ళకు , ఆలయాలకు , చివరికి ప్రభుత్వకార్యాలయాలకు కూడా తలుపులు ఉండవు!.  ఈ వూళ్ళో ఉన్న తపాలా కార్యాలయానికి కూడా తలుపులు , తాళాల లేకపోవడం మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. శనీశ్వరుడిని భగవానుని యందు భయముచే , శనిభగవానుని ఆలయము వద్ద ఒక కిలోమీటరు వ్యాసార్థం లోపల ఉన్న నివాస స్థలములు , గుడిసెలు , దుకాణములు మొదలైనవాటి వేటికి తలుపులు కాని తాళాలు కాని ఉండవు. శింగణాపూర్ అనబడే ఈ ఊరిలో ఎప్పుడూ కూడా దొంగతనము లేదా దోపిడి జరగలేదు. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయుటకు ప్రయత్నించినా వారు అక్కడికక్కడే ఊరి పొలిమేర దాటేలోగా రక్తం కక్కుకుని చనిపోయారు. ఇతరులు చాలామంది దీర్ఘకాల అనారోగ్యం , మానసిక సమతుల్యత లేకపోవడం వంటి వివిధ రకాల శిక్షలు అనుభవించారు. శనీశ్వరుని కృపకు పాత్రులు కావాలనుకునే వేలమంది భక్తులు ప్రతిరోజూ ఈ శని శింగణాపూర్ లోని శనీశ్వరుడి దర్శనం చేసుకుంటారు. శనివారములలో ఈ స్థలం చాల రద్దీగా ఉంటుంది. శని త్రయోదశి స్వామికి ఇష్టమైన రోజుగా పరిగణించబడుతుంది. అదే విధంగా 'అమావాస్య రోజున వచ్చే శనివారం శనీశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా పరిగణింపబడుతుంది. ఆయన దీవెనల కోసం వేలమంది భక్తులు ఈ ఆలయం వద్ద గుమికూడతారు.

దేవనార్ దేవనారు లోని శని దేవాలయం:

ముంబైలోని దేవనారు ప్రాంతంలో ఒక శనీశ్వరాలయం ఉంది. ఈ ఆలయం (ముంబై - పూణే - బెంగుళూరు)   ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్హైవే మీద గోవండి , దేవనార్ - చెంబూరు కూడలి వద్ద శివాజి విగ్రహానికి తూర్పున నెలకొని ఉంది. ఈ ప్రామంతానికి అసలు పేరు "దేవనవరు" అంటే దేవుడు గారు అని అర్థం. కాలాంతరంలో తమిళ బాషా ప్రభావం వల్ల దేవనార్ గా మార్పు చెందింది. ఈ ఆలయంలో కొలువున్న దేవుడు శనీశ్వర స్వామి: అందమైన , శక్తివంతమైన , గుబురు మీసాలతో కొట్టొచ్చినట్టున్న గంభీరమైన ఏడడుగుల నల్లని విగ్రహం రూపం. అనేకమంది శని దోషం గల భక్తులు , లేదా శని మహర్దశ , ఏలినన్నాటి శని దోషం ఉన్నవారు ఈ ఆలయంలో తైలాభిషేకం చేసుంటారు. ముఖ్యంగా శనివారల్లో నువ్వుల నూనెను అత్యంత భక్తిశ్రద్ధలతో శిరస్సునుంచి పాదాలవరకు విగ్రహం నూనెతో కప్పబడే విధంగా తైలాభిషేకం చేస్తారు. ఈ నూనెతో పూజ చేసినట్లయితే శనీశ్వరుడు ప్రసన్నుడు అవుతాడని నమ్మకం. అలాగే జిళ్ళేడు ఆకుల మాలలను ఆంజనేయస్వామికి సమర్పించుకుని , శివునికి జలాభిషేకం చేయడం ఇక్కడి వారి ఆనవాయతి.

ప్రతి శనివారం సుమారు ఉదయం 10:30 గంటల సమయంలో , పూజారి మహా హారతి ఇచ్చిన వెంటనే , పెద్ద పూజారిలో ('స్వామి' అని ప్రియంగా పిలుస్తారు అందరు) ఓ విధమయిన తన్మయత్వంలో వూగిసలాడాడం ప్రారంభం అవుతుంది. అకస్మాత్తుగా , ఆలయంలో వాతావరణం మారుతుంది. పూనకం అంటే మామూలుగా వుండే అరుపులు , ఆర్భాటాలు వుండవు. ఆయన కళ్ళు మూసుకుని తన్మయత్వం లోకి (ట్త్రాన్స్) లోకి వెళ్ళిపోతాడు. ఆ ఉత్కంట భరిత వాతావరణాన్ని అక్కడ వున్న ప్రతి ఒక్కరు చూడవచ్చు. అనుభవించవచ్చు. ఆ అలయంలోని మిగతా వారు మెల్లగా 'స్వామి ని నడిపించుకుంటూ ' *'మొనలు తేలిన, పదునైన , పొడవాటి మేకులతో చేయబడిన కుర్చీపై కూర్చో పెడతారు . కాళ్ళు మరియు చేతులు ఆనించే స్తలంలో కూడా ఆ కుర్చీకి పదునైన మేకులు బిగించి ఉంటాయి. స్వామి శరీరంపైకి శనీశ్వరుడు వచ్చినపుడు , ఆయన ఎక్కువ సమయం కళ్ళు మూసుకుని దాదాపు ఆరోజు మొత్తం ఆ కుర్చీ పైనే కుర్చుని ఉంటాడు. కొన్ని శనివారాలలో ఆయన 12 నుండి 13 గంటల పాటు ఏకథాటిగా ఆ కుర్చిపైన కూర్చున్నా ఎటువంటి బాధ కాని , అసౌకర్యము గాని ఆయన ముఖంలో కనిపించదు. అటు తరువాత భక్తులు 'స్వామి' ముందు నిశ్శబ్దముగా కూర్చుంటారు. వారు ఒక జత నిమ్మకాయలు చేతిలో ఉంచుకుని , క్యూలో వారి వంతు వచ్చే వరకు నిరీక్షిస్తూ వుంటారు. స్వామి ఒకరి తరువాత ఒకరిని వంతుల వారిగా తన వద్దకు రమ్మని సైగ చేయుగానే , జనం తమ వద్ద ఉన్న పసుపుపచ్చ నిమ్మకాయల జతను ఆయన ముందు ఉంచుతారు. ఆయన వారి సమస్యలు, వేదనలు లేదా క్షోభ లేదా మరేదైనా సరే వారు చెప్పేది ఓర్పుతో వింటారు. ఆ తరువాత ఆయన వారి వేదన /సమస్య / క్షోభలకు గల కారణాలను విసిదీకరించి వివరిస్తారు.. అది వారి 'ప్రారబ్ధం' కావచ్చు, గతంలో చేసిన కర్మలు (పనులు) ప్రస్తుత జన్మలోనకి మోసుకు రాబడి వుండవచ్చు లేదా స్వామి వివరించినట్టుగా , వారి సమస్యలు ఈ జన్మలోనే అతను (లేదా ఆమె) చేసిన పనులు లేదా కర్మల యొక్క ఫలితం కావచ్చు. కొన్ని సందర్భాలలో అది వారి శత్రువులు లేదా చెడు కోరుకునేవారిచే చేయబడిన వామాచార ప్రయోగం కూడా కారణం కావచ్చు. ఈ శని దేవాలయ ప్రాంగణములో హనుమంతుడు , జగదీశ్వరుడు , సాయిబాబా , మరియు మాత విగ్రహాలేకాక నవగ్రహ మండపం కూడా ఉంది. గర్భగుడిలో జేష్టాదేవి సమేతుదైన శనీశ్వరస్వామి యొక్క విగ్రహానికి ఎడమవైపున హనుమంతుడు కుడివైపున జగదీశ్వరస్వామి విరాజిల్లుతున్నారు.

వేదాలలో శని 

వేదము ఋక్కులలో శుక్ర బృహస్పతి ఉన్నారు. అందులోనే శుక్ర - మంధిక్ - పదములు గ్రహార్ధకములుగా కనిపించును. తత్తిరీయ సంహిత అందు గ్రహశబ్దమునకు యజ్ఞపాత్ర అని అర్ధము. ఐతిరేయ , శతపధబ్రాహ్మణము నందలి గ్రహ శబ్దమునకు సోమరసము గ్రహించు పాత్ర అని అర్ధము. అయితిరేయ బ్రాహ్మణమున సోమపాత్రలు తొమ్మిది , గ్రహములను తొమ్మిది. సోమరసమును గ్రహించును కావున గ్రహ మనగా సోమ - పానపాత్ర.

సూర్యాదులయెడల గ్రహ శబ్దము ప్రసిద్ధము. గ్రహశబ్దమునకు గ్రహణ మనియు అర్ధము ఉంది. భానోర్ గ్రహే, సకలగ్రహే అని సూర్యసిద్ధాంతము. సూర్యగ్రహణమునకు సూర్యుని గ్రహించుట. రాహువు ఆక్రమితును కావున రాహువు గ్రహము. అన్ని మన్వంతరములందును అందరు దేవతలను సుర్యనక్షత్రములను ఆశ్రయించుకొని యుందురని పురాణములు చెప్పును. చంద్రసూర్యాదులు గ్రహములు. పుణ్యపురుషులకు నక్షత్రములవలెనే దేవతలకీ సూర్యచంద్రాదులు గృహములు. చంద్రుడు, సూర్యుడు మొదలగు తేజ పిండములనుద్దేశించి యజ్ఞములందు వేరువేరు పాత్రలకు వాడుక ఉంది. కాలక్రముమున ఆపేరులే తేజ్ఃపిండములకు వాడుక ఆయెను. గ్రహముల పరస్పర సామీప్యముగాని , గ్రహనక్షత్రముల సామీప్యముగాని కలిగినప్పుడు సంగ్రామము కలుగును. క్రాంతివృత్తమున ఉత్తరార్ధమున దేవగణమును , దక్షిణార్ధమున అసురగణమును ఉండునని ప్రసిద్ధము. ఇవియే గ్రహముల సంధానము. శని తొలిసృష్టిలో వేడికి సకలచరాచరముల మలమల మాడిపోవుచున్నప్పుడు బ్రహ్మ సూర్యుని జూచి దేవతలే నీవేడిమి కాగలేకున్నారు;  ఇక మానవుల లెక్కయేమి అని అనగా సుర్యునకు కోపము వచ్చెనట అందులకె శని పుట్టెనట అని పరాశరడు చెప్పెను. 

పురాణములలో చాయా సూర్యుల కుమారుడు శని. ఇతడు నల్లనివాడు. ఇతనికి చాయాసుతుడు , అసితుడు , అసితాంబరుడు అని పేర్లు. ముంబైలోని శ్రీ శనీశ్వరాలయాలు నెరళ్ (నవిముంబై) సెక్టార్-11లో శ్రీ శనీశ్వరాలయం ముంబైలో శ్రీ శనీశ్వర స్వామికి అనేక ఆలయాలు ఉన్నాయి. దేవనార్ లో ఒక శనీశ్వరాలయం ఉంది. మన్పాడ మార్గంలో దోంబివిలిలో ఒక చక్కని శని దేవాలయం ఉంది. ఇక్కడ ప్రతి శనివారం సాయంత్రం 8 గంటలకు శనికి హారతి ఇచ్చి స్తోత్త్రాలు పటిస్తారు. గాట్కోపర్ (తూర్పు) లో , నాగేశ్వర్ పశర్వంతి జైనమందిరం పక్కన , ఒక శని ఆలయం ఉంది. కళ్యాణ్ (తూర్పు) లోని కటేమనేవ్లిలో శని మందిరం ఉంది. కార్ వద్ద సర్వీసు మార్గంలో ఒక శని మందిరం ఉంది. బోరివలి (తూర్పు) లో గల జాతీయ ఉద్యానవనం దగ్గర శని మందిరం ఉంది. జోగేశ్వరి (తూర్పు) లో ఉండే ఆలయంలో , ప్రతి శనివారం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు శని మహాత్మ్యం కథ చదువుతారు.  నెరళ్ (నవిముంబై) సెక్టార్-11లో ఒక శనీశ్వరాలయం ఉంది. బాందూప్ లో శని మందిరం ఉంది. ఇతర శని క్షేత్రాలు శ్రీ శనైశ్చర దేవాలయం మంగళూరు (0824- 2252573) శని దోషం చూచిన లేదా శని మహా దశను అనుభవిస్తున్న వారు ప్రతి శనివారం మిక్కిలి భక్తితో ఎళ్ళేణ్ణే సేవె (కన్నడ భాషలో ఎళ్ళు అంటే నువ్వులు; ఎణ్ణె అంటే నూనె; సేవె అంటే సేవ) చేయటానికి ఈ ఆలయానికి విచ్చేస్తుంటారు. ఎళ్ళెణ్ణెసేవె (నువ్వుల నూనెతో సేవ) శనైశ్చరుడిని ప్రసన్నం చేసుకోవడానికి సోపానం అని ఇక్కడి వారి నమ్మకం. శ్రీ శనైశ్చర దేవాలయంలోని గర్భ గుడిలో గణేశ , దుర్గామాత మరియు శనైశ్చర స్వామి మూర్తులు ప్రతిష్ఠించ బడివున్నాయి. శనిగ్రహం దీర్ఘాయువు , దుర్భాగ్యము , దుఃఖము , వృద్ధాప్యం మరియు చావు , క్రమశిక్షణ , నియమం , బాధ్యత , కాలయాపనలు , గాఢమైన వాంఛ , నాయకత్వము , అధికారం , నిరాడంబరత , చిత్తశుద్ధి , అనుభవముచే వచ్చు జ్ఞానానికి కారకం లేదా సూచిక. శనిగ్రహం వైరాగ్యం , కాదనుట , అనురాగం లేకపోవుట , ఆత్మ స్వరూపత్వం , కష్టించి పనిచేయుట , సంవిధానం , వాస్తవికత మరియు సమయాలను కూడా సూచిస్తుంది.


అసమానమైన లక్షణాలు:

అపారమైన శక్తి , చెడు దృష్టి నుండి ఉపశమనం ఇవ్వమని కోరుతూ శనివారాలు ఈ శనిదేవుని దర్శనం చేసుకుంటారు.  

శ్రీ శనీశ్వర కోవెల తిరునల్లార్:

పాండిచ్చేరి సమీపంలో ఉన్న తిరునల్లార్ శనీశ్వరునికి అసమానమైన ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ నవగ్రహాల తొమ్మిది దేవాలయాల సమూహం ఉంది. శివుని అవతారమైన దర్బరన్యేశ్వర స్వామి ఉన్న ఈ కోవెలలో , శనీశ్వరుడు , ఒక గోడ గూటిలో కొలుఉన్నాడు. ఏల్నాటి శనిదశతో బాధింపబడుతున్న వారు , శనిగ్రహ దుష్ప్రభావం నుండి బయట పడటానికి భక్తులు ఈ గుడిని దర్శించి , ఇక్కడి నలతీర్థంలో స్నానంచేసి , ఆ తడివస్త్రాలతో స్వామి దర్శనం చేసుకున్నట్లయితే , శని ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. నల మహారాజు , తవ్వించిన కొలను ఈ గుడిలో భాగం. నల మహారాజు , ఇక్కడి కొలనులో స్నానం చేసి , గుడిలో పూజ చేసిన తరువాత , శని ప్రభావముచే అతను అనుభవిస్తున్న బాధలనుండి విముక్తి పొందినట్లుగా చెప్పబడింది. 

శని ధామ్:

శనిధామ్ , అని పిలువబడే ఈ ఆలయం చత్తర్ పూర్ కు సమీపమంలో , కుతుబ్ మినార్ నుండి 16 కిలోమీటర్ల దూరాన ఉంది. ఇక్కడ , 21 అడుగుల ఎత్తుగల అష్టధాతు మరియు ప్రకృతి సిద్ధమైన రాతితో చేయబడిన శననీస్వరుడి నిలువెత్తు విగ్రహం ఉంది. శనీస్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు , శనివారాలు ముఖ్యంగా అమావాస్య శనివారం అయితే , కాలసర్పం , సాడేసాతి మరియు దయాళిడికి (శివుడికి) ముఖ్య పూజలు చేస్తారు.

వడ తిరునల్లార్ శనీశ్వర కోవెల:

చెన్నైలో , మాంబళంలో ఉంది. ఇక్కడ శనీశ్వరుడు , సతీ (జేష్టాదేవిని ఇక్కడ నీలాంబికగా పిలవ బడుతూంది) సమేతుడై వెలిశాడు. విగ్నేశ్వరుడు , దుర్గ మరియు పంచముఖ హనుమాను ఉన్నారు.

 కుచనూరు: మదురై దగ్గరలో , కుచనూరులో శనీశ్వరుడు , స్వయంభు సిందూరం రంగు విగ్రహం. కుబ్జుడు అన్నది , శనీశ్వరుడి నామల్లో ఒకటి. తమిళబాషానుసారంగా కుబ్జన్ ఉన్న ఊరు కుబ్జనూర్ , కాలాంతరంలో కుచ్చానూర్ అయింది. తూర్పు ముఖంగా గురుభగవానుడి ఆలయంతో బాటు క్రొత్తగా నిర్మింపబడిన ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ప్రసాదం ముందుగా కాకులకు సమర్పించి ఆతరువాత భక్తులకు పంచుతారు. ఒకవేళ కాకులు ప్రసాదమున తిరస్కరిస్తే , మళ్ళీ కొత్తగా ప్రసాదం చేసి , శనికి నివేదించి , కాకులకు మళ్ళీసమర్పిస్తారు.

మందపల్లి: తూర్పు గోదావరి జిల్లా , కొత్తపేటమండలానికి చెందిన గ్రామము. మందపల్లి గ్రామం రాజమండ్రికి 38 కి.మి., కాకినాడకు 60 కి.మి., అమలాపురంకు30 కి.మి., రావులపాలెంకు 9 కి.మి. దూరంలో ఉంది. ఈ గ్రామంలోనే ప్రసిద్ధి పొందిన శనీశ్వరాలయం ఉంది. ఈ దేవాలయం మందేశ్వరాలయంగా కూడా ప్రశస్తి పొందినది. మందపల్లి శనీశ్వర స్వామి ఇతర ఆలయాలకు కాస్తంత భిన్నం. వాస్తవానికి సోమేశ్వర స్వామి ఆలయం అయినా , శనీశ్వరుడు ప్రతిష్ఠించడంతో శనీశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. శత్రు , రోగ , రుణ బాధల నుంచి విముక్తి కోసం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. జాతక చక్రంలో శనితో సమస్యలున్నవారు కూడా వస్తుంటారు. ఏటా శ్రావణ మాసం లోనూ , శనిత్రయోదశి వచ్చే రోజుల్లోనూ మందేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Monday, June 7, 2021

శఠగోపం అంటే ఏమిటి ? గుడిలో శఠగోపం పెట్టడానికి గల కారణం తెలుసా ?

శఠగోప్యం అంటే అత్యంత గోప్యమైనది అని అర్థం. శఠగోపం గుడిలోని దేవుడు లేదా దేవత విగ్రహానికి ప్రతీక అంటారు పండితులు. గుడికి వెళ్లిన ప్రతి భక్తునికి ఆలయంలో ఉండే దేవతా విగ్రహాలను తాకే వీలుండదు. అందుకే ఆలయ పూజారి భక్తులకు తీర్థప్రసాదాలిచ్చిన తర్వాత శఠారిని తీసుకొచ్చి భక్తుల తలపై పెట్టి ఆశీర్వచనం ఇస్తాడు. ఆలయ పూజారి శఠారిని తీసుకు వచ్చి భక్తుల తలపై పెట్టడం వలన వారిలో ఉండే చెడు ఆలోచనలు, ద్రోహబుద్ధులు నశిస్తాయని చెబుతారు. అంతే కాదు శఠగోపం అత్యంత గోప్యమైనది కనుక అది పెట్టే పూజారికి కూడా విన్పించనంతగా కోరకను తలుచుకోవాలంటారు పండితులు. శఠగోపాన్ని కొన్ని ప్రాంతాల వారు శఠగోపం, శడగోప్యం అని అంటారు. భక్తులు దేవాలయంలో దర్శనం అయ్యాక ప్రదక్షిణలు చేసి, తీర్థం, శఠగోపనం తీసుకుంటారు.

శఠగోపాన్ని పంచలోహాలైన వెండి, రాగి, కంచు మొదలైన వాటితో తయారు చేస్తారు. శఠగోపం వలయాకారంలో ఉంటుంది. వాటిపై భగవంతుని పాదాల గుర్తులు ఉంటాయి. శఠగోపం తలపై పెట్టినప్పుడు పాదాలు మన తలను తాకుతాయి. అలాకాక నేరుగా పాదాలనే తలపై ఉంచితే అవి మొత్తం తలని తాకడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి శఠగోపాన్ని వలయాకారంలో తయారుచేసి పైన పాదుకలు ఉంచుతారు. అంటే మనము కోరికలను శఠగోపం పెట్టినప్పుడు తలుచుకుంటే భగవంతుడి పాదాల వద్ద చెప్పుకున్నట్లే. శఠత్వం అంటే మూర్ఖత్వం అని, గోపం అంటే దాచిపెట్టడం అని కూడా అర్ధం. భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడనేది ఆధ్యాత్మికుల భావన. నేను, నాది అనే భ్రమను తొలగించడానికి శఠగోపం పెడతారు.

శఠగోపం తలమీద పెట్టించుకోవడం వలన ఆధ్యాత్మికంగా మాత్రమే కాక సైన్స్ పరంగా కూడా ఎన్నో ఫలితాలు కలుగుతాయి. శఠగోప్యమును తలమీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్‌, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్‌ బైటికెళుతుంది. తద్వారా శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి.

శఠగోపం మీద విష్ణువు పాదాలుంటాయి. అంటే మనము కోరికలను భగవంతుడికి ఇక్కడే తెలపాలన్నమాట. పూజారికి కూడా వినిపించకుండా మన కోర్కెలను భగవంతునికి విన్నవించుకోవాలి. అంటే మన కోరికే శఠగోప్యము. అది మన నెత్తిన పెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలిగి మానసిక ఉల్లాసం కలుగుతుంది. దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, శఠగోప్యం తప్పక తీసుకోవాలి. చాలమంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక వచ్చిన పనైపోయిందని చక, చకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు.

కొద్దిమంది మాత్రమే ఆగి, శఠగోప్యం పెట్టించుకుంటారు. మానవునికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలూస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం.సహజంగా చిల్లర లేకపోవటం వల్ల, శఠగోప్యమును ఒక్కోసారి వదిలేస్తుంటాము. పక్కకు వచ్చేస్తాము. అలా చెయ్యొద్దు. పూజారి చేత శఠగోప్యము పెట్టించుకోండి. మనసులోని కోరికను స్మరించుకోండి.

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...