Friday, August 31, 2018

మీరు ఈ పాశ్చాత్య తత్వవేత్తల నమ్మకాలను చదివారా?

*మీరు ఈ పాశ్చాత్య
తత్వవేత్తల నమ్మకాలను చదివారా?*

1. లియో టాల్స్టాయ్ (1828-1910)
హిందువులు మరియు హిందుత్వo ఒకరోజు ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. ఎందుకంటే ఇది జ్ఞానం మరియు వివేకం యొక్కకలయిక.

2. హెర్బర్ట్ వెల్స్ (1846 - 1946):
హిందూత్వ ప్రభావాన్ని పునరుద్ధరించే వరకూ ఎన్నో తరాలు దురాక్రమణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదో ఒకరోజు ప్రపంచo ఆకర్షించబడుతుంది. ఆ రోజున ప్రపంచం ప్రశాంతంగా నివసించనుంది.

3. ఆల్బర్ట్ ఐన్స్టీన్ (1879-1955):
తన మేధస్సు మరియు అవగాహన ద్వారా యూదులు ఏమి చేయలేరనేది నేను గ్రహించాను. హిందూత్వంలో శాంతికి దారితీసే శక్తి ఉంది.

4. హుస్టన్ స్మిత్ (1919):
నాకు తెలుసు.. ఒక హిందువు తన తెలివి మరియు అవగాహన బయటపెడితే, హిందూత్వం లో ఉన్న శక్తి శాంతికి దారితీస్తుంది.

5. మైఖేల్ నోస్ట్రాడమస్ (1503 - 1566):
ఐరోపాలో హిందుత్వo.. పాలించే మతం అవుతుంది. మరియూ ఐరోపా ప్రసిద్ధ నగరం "హిందూ మతం" రాజధానిగా అవుతుంది.

6. బెర్ట్రాండ్ రస్సెల్ (1872 - 1970):
నేను హిందూత్వం గురించి చదివాక గ్రహించాను..  ప్రపంచమంతటి మరియు మొత్తం మానవాళి యొక్క మతం అని తెలుసుకున్నాను. హిందూత్వo ఐరోపా అంతటా మరియు ప్రపంచమంతటా వ్యాప్తి చెందుతుంది, హిందూ మతం యొక్క గొప్ప ఆలోచనాపరులు ఆవిర్భవిస్తారు. ఒకరోజు హిందువులు ప్రపంచం యొక్క నిజమైన ఉద్దీపనకు వస్తారు. .

7. గోస్టా లోబోన్ (1841 - 1931):
హిందువులు శాంతి మరియు సయోధ్య గురించి మాట్లాడతారు. వారి సంస్కరణల విశ్వాసాన్ని అభినందించడానికి నేను క్రైస్తవులను ఆహ్వానిస్తున్నాను.

8. బెర్నార్డ్ షా (1856 - 1950):
మొత్తం ప్రపంచం అంతా ఏదో ఒకరోజు  హిందూత్వాన్ని అంగీకరిస్తుంది. అసలు పేరును కూడా అంగీకరించకపోతే అది ఏ "పేరు"తో అయినా అంగీకరించబడుతుంది. హిందూత్వాన్ని పశ్చిమ దేశాలు అంగీకరించాలి, హిందూ మతం ప్రపంచంలో "అధ్యయనం" చేసుకునే వారి మతం.

9. జోహన్ గీత్ (1749 - 1832):
మనమందరం ఇప్పుడు లేదా తరువాత అయినా సరే హిందూమతాన్ని అంగీకరించాలి మరియు ఇదే నిజమైన మతం.

భారతదేశం లో పుట్టీ, పెరిగీ, ఈ గాలి పీలుస్తూ, ఈ మట్టి నుండి వస్తున్న అన్నo తింటూ కూడా మన గొప్పదనాన్ని మనమే గ్రహించక పనికి రాని చెత్త అంతా గొప్పదనుకుంటూ తిరుగుతున్నాం !!!

.. ఇది మన "సనాతన ధర్మం" యొక్క గొప్పతనం.  ఏనాడో ఉన్న lఆంగ్లేయులు మన హైందవం గురించి ఎంత గొప్పగా చెప్పారో చూసారా! :)🚩🚩🚩🇮🇳

దేవాలయంను దర్శించుకునే పద్ధతి

దేవాలయం అంటే దైవం నెలవున్న స్థలం. పరమ పవిత్రమైన క్షేత్రం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భక్తుల అభీష్టములు తీర్చడానికి కొలువైఉన్న పరమపావన నివాసం. అలాంటి దేవాలయమునకు దర్శనమునకు వెళ్ళునపుడు కొన్ని ధర్మములను / పద్ధతులను ఆచరించాలి. అప్పుడే ఆ దైవం యొక్క అనుగ్రహమునకు పాత్రులము అవుతాము.

1) ప్రతి భక్తుడు ( స్త్రీలు , పురుషులు ) గుడికి వెళ్ళే ముందు శుచిగా స్నానం చేసి, విధిగా నుదుట విభూతి,గంధం,కుంకుమ ధరించాలి.

2) సంప్రదాయమైన వస్త్రములు ధరించాలి. స్త్రీలు చీరలు, పురుషులు ధోవతి-ఉత్తరీయం, ఆడపిల్లలు పరికిణీలు లేదా చుడీదార్ ధరించాలి. ( చాలామంది ఆడపిల్లలు జీన్స్ టీ షర్టులు- మగపిల్లలు షార్టులు ధరించి వెళుతున్నారు.ఇలా ధరించినవారిని ఆలయ ప్రవేశమునకు అనుమతిని ఇవ్వకుండా యాజమాన్యం చూసుకోవాలి. తల్లి తండ్రులు ప్రొత్సహించరాదు .

3) కనీస పూజా సామాగ్రిని తీసుకొని వెళ్ళాలి. పెద్దవారి దగ్గరికి వెళ్ళినా మహాత్ముల దగ్గరికి వెళ్ళినా ఒట్టి చేతితో వెల్లరాదు. గీతలో పరమాత్ముడు ” పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి” …ఎవరైతే నాకు భక్తితో పత్రం కాని పుష్పం కాని ఫలం కాని ఉదకం కాని సమర్పిస్తారో వాటిని ప్రీతితో నేను స్వీకరిస్తాను” అన్నాడు.

4) గుడి ముందుకు చేరుకోగానే మొదట కాళ్ళూ, చేతులు, ముఖం, నోరు, శుభ్రంగా కడుక్కోవాలి.

5) ఆలయం ప్రవేశించడానికి ముందు గోపురానికి నమస్కరించి తర్వాత మెట్లకు నమస్కరించాలి.

6) లోనికి ప్రవేశించినప్పటినుండి భగవంతుని నామం జపిస్తూ అన్యమస్కంగా కాకుండా ఏకాగ్రత అంతా దేవుడిపైనే ఉంచాలి.

7) నామ జపం చేస్తూ మధ్యమ వేగంతో గర్భాలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి పురుషులు స్వామికి కుడి వైపు, స్త్రీలు ఎడమ వైపు నిల్చోవాలి.

8) మొదట మూల విగ్రహం పాదాలను దర్శించి అందులో లీనం కావాలి.తరువాత స్వామి కళ్ళలోకి చూస్తూ లీనం కావాలి.

9) అర్చన చేసుకునేవారు తమ గోత్రము ఇంటిపేరు నక్షత్రము చెప్పుకోవాలి. తీర్థం తీసుకునే సమయంలో అరచేయిని గో కర్ణాకృతిలో ఉంచి చేయి కింద ఏదైనా వస్త్రం ఉంచుకుని ” అకాల మృత్యు హరణం …” అనే మంత్రం స్వయంగా చెప్పుకుంటూ భక్తితో తీర్థాన్ని చప్పుడురాకుండా తీసుకోవాలి, తలకు రాసుకోకూడదు.

10) దర్శనం అయిన తరువాత కాసేపు కూర్చొని దైవ నామ జపం చేస్తూ ప్రశాంత చిత్తంతో ఉండాలి.

11) ప్రసాదం భక్తులందరికీ పంచకుండా స్వీకరించరాదు.

12) తిరిగి వెళ్ళే ముందు మళ్ళీ స్వామికి నమస్కరించుకుని బయటికి వచ్చిన తరువాత మళ్ళీ గోపురానికి నమస్కరించి వెళ్ళాలి.

13) ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగం కూడదు.

14) అనవసరంగా మాట్లాడటం.. పౌరుషపదజాలం ఉపయోగించకూడదు

15) ఆవలింతలు, జుట్టు పీక్కోవడం, తల గోక్కోవడం, తమలపాకులు(కిళ్లీలు) వేయకూడదు.

16) జననం, మరణం సంబంధించిన విషయాలపై మాట్లాడకూడదు.

17) టోపీలు, తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు.

18) ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను గడపలను తొక్కకూడదు.

19) ఆకర్షణీయ (మెరుపు) దుస్తులను ధరించకూడదు.

20) పానవట్టo దాటరాదు.

21) దర్శనం పూర్తయ్యాక వెనకవైపు కాస్త దూరం నడిచి, తర్వాత తిరగాలి.

22) ఒక చేత్తో దర్శనం చేయకూడదు.

23) భుజాలపై టవల్స్ వేసుకుని దర్శనం చేయలి.

24) ఆలయ ఆస్తులను అపహరించకూడదు.

25) అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి, మాస ప్రారంభం, సోమవారం, ప్రదోషం, చతుర్థి రోజుల్లో బిల్వ దళాలను తుంచకూడదు.

26) ఆలయంలో స్నానం చేయకుండా ప్రవేశించకూడదు.

27) మూల విరాట్ వద్ద దీపం లేకుండా దర్శనం చేయకూడదు.

28) ఆలయానికి వెళ్లొచ్చిన వెంటే కాళ్లను కడగకూడదు. కాసేపు కూర్చున్న తర్వాతే ఇవన్నీ చేయాలి.

29) ఆలయంలోకి ప్రవేశించి, తిరిగి వచ్చేంతవరకు నిదానమే ప్రధానంగా ఉండాలి.

30) గోపుర దర్శనం తప్పక చేయాలి.

31) ఆలయంలోని మర్రి చెట్టుకు, రావి చెట్టుకు, సాయంత్రం 6గంటల తర్వాత ప్రదక్షిణలు చేయకూడదు, అసలు వాటి క్రింద కూర్చోరాదు, నిదుర) ఆలయంలోపల గట్టిగా మాట్లాడకూడదు.

32) మన మాటలు, చేష్ఠలు ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు.
33) ప్రధానాలయo వెనుకభాగం(అసుర భాగం) ను తాకరాదు.
34) ఘంటలు ఆడవారు మ్రోగిన్చరాదు.
35) హారతి తీసుకునేటపుడు మొదట కళ్ళకు, రెండు బ్రహ్మరన్ద్రoకు అద్ది , మూడు వాసన చూడాలి, పై విధoగా 3సార్లు హారతిని తీసుకోవాలి.
36) ప్రధాన గర్భాలయo లోకి అర్చకుడు తప్ప అవకాశం వున్నా ప్రవేశిoచరాదు.

Wednesday, August 29, 2018

శివాభిషేకాలు - వాటి ఫలితాలు

1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7 మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
8 మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9 తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10 పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11 కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12 రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13 భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14 గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15 బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16 నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
17 అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
18 ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19 ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20 నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21 కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22 నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23 మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24 పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.
" అరుణాచల శివ " అని వ్రాసి ఆ అరుణాచలేశ్వరుని అనుగ్రహం పొందుదాం ...
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది

స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు...🚶🏿‍♀
పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది📚

కానీ ఎందుచేతో ఈ పద్యం జన
బాహుళ్యం లో లేదు

కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః , క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః,
సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలు
ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)📚⚖

1. కార్యేషు యోగీ 💰:
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి🏹

2. కరణేషు దక్షః 🤺:-
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.🏌🏾

3. రూపేచ కృష్ణః 🙏:-
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా,
సంతోషంగా ఉండాలి.👌

4. క్షమయా తు రామః 🏹:-
ఓర్పులో రామునిలాగా ఉండాలి.పితృవాక్య పరి
పాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి

5. భోజ్యేషు తృప్తః 🍲🥘🍛
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.

6. సుఖ దుఃఖ మిత్రం 🤼‍♂:-
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.⛹🏼🎻

ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు 🏇🏼ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు.

హయగ్రీవ ఆవిర్భవం

శ్రావణ పూర్ణిమనాడు హయగ్రీవుడు ఆవిర్భవించాడు. మహావిష్ణువే అలా ఓ విశిష్ట అవతారాన్ని ధరించాడు. హయగ్రీవం అంటే గుర్రపు ముఖమని అర్థం. మెడ నుండి పైదాక గుర్రపు ముఖంతోనూ, మెడ కింద భాగమంతా మహావిష్ణువు పోలికలతోనూ ఉండటం ఈ అవతారం విశేషం. ఈ దేవుడిని అర్చిస్తే విద్యలు, తెలివితేటలు దైవ ప్రసాదంగా లభిస్తాయన్నది భక్తుల విశ్వాసం. తెల్లని దేహ ఛాయతో అంతకంటే తెల్లని దుస్తులతో కొలువైనట్టు ఈ స్వామిని పురాణాలు వర్ణించాయి. పురాణాల ప్రకారం హయగ్రీవ స్వామి అవతరణ గాధ ఈ విధంగా ప్రచారంలో ఉంది....

హయగ్రీవ స్వామి కాలానికి అందనివాడు, సృష్టికి ముందున్నవాడు. మహావిష్ణువు అవతారాలన్నీ ధర్మరక్షణ నేపధ్యంలోనే జరిగాయి.

పూర్వం విచిత్రంగా హయగ్రీవుడు అనే పేరున ఓ రాక్షసుడు కూడా ఉండేవాడు. ఆదిపరాశక్తిని గురించి తపస్సు చేసి తనకు మరణం లేకుండా వరం కోరుకున్నాడు.

అమ్మ అలా కుదరదు అంది. హయగ్రీవుడు కొంచెం తెలివిగా ఆలోచించి గుర్రపు మెడతో ఉన్నవాడి వల్ల మాత్రమే తనకు మరణం సంభవించేలా వరం ఇవ్వమన్నాడు. మనిషి శరీరానికి గుర్రపు మెడ ఉండే జీవి సృష్టిలో ఎక్కడ ఉండదని ఆ రాక్షసుడి నమ్మకం. ఇక అప్పటినుండి హయగ్రీవ రాక్షసుడు సర్వలోకాలను వేధించసాగాడు. దేవతలంతా విష్ణువుని శరణు వేడారు. విష్ణుమూర్తి చాలాకాలం పాటు నిర్విరామంగా రాక్షస సంహారం చేసి అలసిపోయాడు. ఓ రోజున ఎక్కుపెట్టి ఉన్న ధనుస్సు మీదనే తల ఆనించి నిద్రకు ఉపక్రమించాడు.
ఎన్నాళ్లకు నిద్ర నుండి లేవకపోయేసరికి శివుడు దేవతలకు ఓ ఉపాయం చెప్పాడు. ఎక్కుపెట్టి ఉన్న ధనుస్సుకి బిగించిన అల్లెత్రాడును తెంపగలిగితే ఆ కదలికలకు విష్ణువుకు మెలుకువ వస్తుందన్నాడు. ఆ తాడుని కొరకగల శక్తి ఒక చెద పురుగుకి మాత్రమే ఉందని బ్రహ్మాది దేవతలకు అర్థమైంది. దానికే ఆ పని అప్పగించారు. చెదపురుగు త్రాడుని కొరకడంతో ధనుస్సు కొన బలంగా విష్ణువు శిరస్సుకి తగిలింది. ఆ తల ఎగిరి ఎటో దూసుకువెళ్లింది. దానికోసం అన్ని చోట్ల వెతికారు. అయినా ఫలితం లేకపోయింది. ఇక చేసేది లేక ఆదిపరాశక్తిని స్తుతించారు.

ఆ అమ్మ ప్రత్యక్షమై ఏదైనా గుర్రపు మెడను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమంది. దేవతలు శిరసావహించారు. అలా హయగ్రీవ స్వామి అవతరణ, రాక్షస సంహారం జరిగింది. దేవతలంతా ఆ స్వామిని వేదమంత్రాలతో స్తుతించారు. ఇది జరిగింది శ్రావణపూర్ణిమ నాడు. అప్పటినుండి హయగ్రీవ జయంతిని జరుపుకోవడం ఆచారంగా వస్తుంది. అందుకే హయగ్రీవ ఉపాసన చేసినా, హయగ్రీవ జయంతి నాడు ఆ స్వామిని స్మరించినా జ్ఞానానందాలు కలిగి సంతోషంగా ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.

Tuesday, August 28, 2018

నూతన యజ్ఞోపవీత ధారణ విధానము

జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోపవీతం) దరించవలెను.
.
ప్రార్థన:
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
.
గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురు దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై: శ్రీ గురవే నమః ||
.
అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాం గతో 2పివా |
యస్మరేత్ పుండరీకాక్షం న బాహ్యాభ్యంతరశ్సుచి: ||
పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్ష!
(అంటూ తల పైకి నీళ్ళు చల్లుకొనవలెను)
.
ఆచమన విధానం:
ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని,
1. ఓం కేశవాయ స్వాహా,
2. ఓం నారాయణాయ స్వాహా,
3. ఓం మాధవాయ స్వాహా,
అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను. తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను.
4. ఓం గోవిందాయనమః,
5. ఓం విష్ణవే నమః,
6. ఓం మధుసూదనాయనమః,
7. ఓం త్రివిక్రమాయనమః,
8. ఓం వామనాయనమః,
9. ఓం శ్రీధరాయనమః,
10. ఓం హృషీకేశాయనమః,
11. ఓం పద్మనాభాయనమః,
12. ఓం దామోదరాయనమః,
13. ఓం సంకర్షణాయనమః,
14. ఓం వాసుదేవాయనమః,
15. ఓం ప్రద్యుమ్నాయనమః,
16. ఓం అనిరుద్ధాయనమః,
17. ఓం పురుషోత్తమాయనమః,
18. ఓం అధోక్షజాయనమః,
19. ఓం నారసింహాయనమః,
20. ఓం అత్యుతాయనమః,
21. ఓం జనార్దనాయనమః,
22. ఓం ఉపేంద్రాయనమః,
23. ఓం హరయేనమః,
24. ఓం శ్రీకృష్ణాయనమః.
అని నమస్కరించవలెను. అటు పిమ్మట:
.
భూతోచ్చాటన:
(చేతిలో ఉద్ధరిణి తో నీరు పోసుకుని యీ క్రింది మంత్రమును చదివిన పిమ్మట భూమిపై నీళ్ళు జల్లవలెను.)
ఉత్తిష్ఠంతు | భూత పిశాచాః | యే తే భూమిభారకాః | యే తేషామవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః | దేవీ గాయత్రీచ్చందః ప్రాణాయామే వినియోగః
.
(ప్రాణాయామం కృత్వా కుంభకే ఇమం గాయత్రీ మంత్రముచ్ఛరేత్)
.
గృహస్తులు ఐదు వ్రేళ్లతో నాసికాగ్రమును పట్టుకొని మంత్రము చెప్పవలెను. బ్రహ్మచారులు బొటన వ్రేలి తో కుడి ముక్కును, అనామిక ఉంగరం వ్రేళ్లతో ఎడమ ముక్కును పట్టుకొని ఈ క్రింది మంత్రమును చెప్ప వలెను.
ఓం భూః, ఓం భువః, ఓగ్ మ్ సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ మ్ సత్యం, ఓం తత్స వితుర్వరేణ్యం బర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ | ఓం ఆపో జ్యోతి రసో2మృతం, బ్రహ్మ భూర్భువస్సువరోమ్||
.
తదుపరి సంకల్పం:
మమ ఉపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనముహూర్తే, శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, ఆద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే, గంగా కావేరీయోర్మధ్యే, స్వగృహే (లేదా శోభన గృహే), సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, … సంవత్సరే, … అయనే, … ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల, పురుషార్ధ సిద్ధ్యర్ధం, ఆయుష్యాభివృద్ధ్యర్ధం, మమ శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన యోగ్యతా ఫల సిద్ధ్యర్ధం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే
.
(బ్రహ్మచారులు “ధర్మపత్నీ సమేతస్య" అని చెప్పనక్కర లేదు)
.
యజ్ఞోపవీతములు ఐదింటిని ఐదు ముడుల వద్దను, మరి రెండు సమానదూర స్థలముల వద్దను, కుంకుమను తడి చేసి అలంకరించి అధిష్టాన దేవత అయిన గాయత్రిని ధ్యానించి, యజ్ఞోపవీత ధారణా మంత్రము స్మరించి ఈ క్రింది విధముగా ధరించవలెను.
.
యజ్ఞోప వీతే త్తస్య మంత్రస్య పరమేష్టీ పరబ్రహ్మర్షి: పరమాత్మా,
దేవతా, దేవీ గాయత్రీచ్చందః యజ్ఞోపవీత ధారణే వినియోగః ||
.
"ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం
ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్
ఆయుష్య మగ్రియం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజః "
అని చెప్పి అని ధరించవలెను.
.
(మంత్ర పఠన సమయమున కుడి బాహువును పైకెత్తి శరీరము తగలకుండా జందెమును పట్టి యుంచి మంత్రాంతము నందు కుడిబాహువు మీదుగా ఎడమ బాహువు నందు ధరించవలెను.)
.
ద్వితీయోపవీత ధారణం:
తిరిగి ఆచమనం చేసి “మమ నిత్యకర్మానుష్టాన యోగ్యతా సిద్ధ్యర్ధం ద్వితీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని రెండవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను.
.
తృతీయ యజ్ఞోపవీత ధారణం:
తిరిగి ఆచమనం చేసి “ఉత్తరీయార్ధం తృతీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని మూడవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను.
.
చతుర్ధ పంచమ యజ్నోపవీతములు ధరించుట:
తిరిగి ఆచమనం చేసి పై మంత్రమును పఠిస్తూ "ఆపన్నివారణార్థం చతుర్థ, పంచమ యజ్ఞోపవీత ధారణం కరిష్యే" అని నాలుగు, ఐదు ముడులను ఒక దాని తరువాత మరి యొకటి దరించవలెను. మొత్తము ఐదు ముడులు వచ్చునట్లు సరిచేసుకొనవలెను.
.
తరువాత పాత, కొత్త జంధ్యములను కలిపి, కుడి చేతి బొటన వ్రేలు, చూపుడు వ్రేలు మధ్యలో పట్టుకొని పైన కండువా కప్పి, “దశ గాయత్రి” (పదిమారులు గాయత్రి మంత్రము) జపించి, “యధాశక్తి దశ గాయత్రీ మంత్రం గాయత్రీ దేవతార్పణమస్తు" అని నీటిని వదలవలెను. (బ్రహ్మచారులు ఒక్క ముడినే ధరించవలయును)
.
గాయత్రీ మంత్రము:
“ఓం భూర్భువస్సువః తత్ సవితుర్ వరేణ్యం
భర్గో దేవస్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్ "
.
తరువాత ఈ క్రింది విజర్జన మంత్రము చదువుతూ పాత జందెమును తీసి వేయవలెను.
.
జీర్ణోపవీత విసర్జనం:
తిరిగి ఆచమనం చేసి
.
శ్లో: ఉపవీతం ఛిన్నతంతుం కశ్మల దూషితం
విసృజామి యశో బ్రహ్మ వర్చో దీర్ఘాయురస్తుమే ||
.
శ్లో: పవిత్రదంతా మతి జీర్ణవంతం
వేదాంత వేద్యం పరబ్రహ్మ రూపం
ఆయుష్య మగ్ర్యం ప్రతిమంచ శుభ్రం
జీర్నోపవీతం విసృజంతు తేజః ||
.
శ్లో: ఏతా వద్దిన పర్యంతం
బ్రహ్మత్వం ధారితం మయా
జీర్ణత్వాత్తే పరిత్యాగో
గచ్ఛ సూత్ర యథా సుఖం ||
.
విసర్జన సమయములో తీసివేస్తున్న పాత జందెమును పాదములకు తాకకుండా చూసుకోవలెను.
తిరిగి ఆచమనం చేసి కొత్త యజ్ఞోపవీతముతో కనీసం పది సార్లు గాయత్రి మంత్రము జపింఛి యధాశక్తి "గాయత్రీ దేవతార్పణమస్తు" అని నీరు విడువ వలెను. ఆ తరువాత గాయత్రీ దేవికి నైవేద్యము సమర్పించి, ఆ ప్రసాదమునకు నమస్కరించి స్వీకరించవలెను.
.
తీసివేసిన పాత జందెమును ఏదైనా పచ్చని మొక్కపై వేయవలెను.
.
నూతన యజ్ఞోపవీత ధారణ సమయములు:
జాతాశౌచ శుద్ధి యందు, మృతాశౌచ శుద్ధియందు, గ్రహణానంతరము, ప్రతి నాలుగు మాసముల అనంతరము నూతన యజ్ఞోపవీతమును ధరించి, పూర్వ యజ్ఞోపవీతమును త్యజించవలెను.

నూతన యజ్ఞోపవీత ధారణ విధానము
.
జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోపవీతం) దరించవలెను.
.
ప్రార్థన:
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
.
గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురు దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై: శ్రీ గురవే నమః ||
.
అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాం గతో 2పివా |
యస్మరేత్ పుండరీకాక్షం న బాహ్యాభ్యంతరశ్సుచి: ||
పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్ష!
(అంటూ తల పైకి నీళ్ళు చల్లుకొనవలెను)
.
ఆచమన విధానం:
ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని,
1. ఓం కేశవాయ స్వాహా,
2. ఓం నారాయణాయ స్వాహా,
3. ఓం మాధవాయ స్వాహా,
అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను. తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను.
4. ఓం గోవిందాయనమః,
5. ఓం విష్ణవే నమః,
6. ఓం మధుసూదనాయనమః,
7. ఓం త్రివిక్రమాయనమః,
8. ఓం వామనాయనమః,
9. ఓం శ్రీధరాయనమః,
10. ఓం హృషీకేశాయనమః,
11. ఓం పద్మనాభాయనమః,
12. ఓం దామోదరాయనమః,
13. ఓం సంకర్షణాయనమః,
14. ఓం వాసుదేవాయనమః,
15. ఓం ప్రద్యుమ్నాయనమః,
16. ఓం అనిరుద్ధాయనమః,
17. ఓం పురుషోత్తమాయనమః,
18. ఓం అధోక్షజాయనమః,
19. ఓం నారసింహాయనమః,
20. ఓం అత్యుతాయనమః,
21. ఓం జనార్దనాయనమః,
22. ఓం ఉపేంద్రాయనమః,
23. ఓం హరయేనమః,
24. ఓం శ్రీకృష్ణాయనమః.
అని నమస్కరించవలెను. అటు పిమ్మట:
.
భూతోచ్చాటన:
(చేతిలో ఉద్ధరిణి తో నీరు పోసుకుని యీ క్రింది మంత్రమును చదివిన పిమ్మట భూమిపై నీళ్ళు జల్లవలెను.)
ఉత్తిష్ఠంతు | భూత పిశాచాః | యే తే భూమిభారకాః | యే తేషామవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః | దేవీ గాయత్రీచ్చందః ప్రాణాయామే వినియోగః
.
(ప్రాణాయామం కృత్వా కుంభకే ఇమం గాయత్రీ మంత్రముచ్ఛరేత్)
.
గృహస్తులు ఐదు వ్రేళ్లతో నాసికాగ్రమును పట్టుకొని మంత్రము చెప్పవలెను. బ్రహ్మచారులు బొటన వ్రేలి తో కుడి ముక్కును, అనామిక ఉంగరం వ్రేళ్లతో ఎడమ ముక్కును పట్టుకొని ఈ క్రింది మంత్రమును చెప్ప వలెను.
ఓం భూః, ఓం భువః, ఓగ్ మ్ సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ మ్ సత్యం, ఓం తత్స వితుర్వరేణ్యం బర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ | ఓం ఆపో జ్యోతి రసో2మృతం, బ్రహ్మ భూర్భువస్సువరోమ్||
.
తదుపరి సంకల్పం:
మమ ఉపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనముహూర్తే, శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, ఆద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే, గంగా కావేరీయోర్మధ్యే, స్వగృహే (లేదా శోభన గృహే), సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, … సంవత్సరే, … అయనే, … ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల, పురుషార్ధ సిద్ధ్యర్ధం, ఆయుష్యాభివృద్ధ్యర్ధం, మమ శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన యోగ్యతా ఫల సిద్ధ్యర్ధం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే
.
(బ్రహ్మచారులు “ధర్మపత్నీ సమేతస్య" అని చెప్పనక్కర లేదు)
.
యజ్ఞోపవీతములు ఐదింటిని ఐదు ముడుల వద్దను, మరి రెండు సమానదూర స్థలముల వద్దను, కుంకుమను తడి చేసి అలంకరించి అధిష్టాన దేవత అయిన గాయత్రిని ధ్యానించి, యజ్ఞోపవీత ధారణా మంత్రము స్మరించి ఈ క్రింది విధముగా ధరించవలెను.
.
యజ్ఞోప వీతే త్తస్య మంత్రస్య పరమేష్టీ పరబ్రహ్మర్షి: పరమాత్మా,
దేవతా, దేవీ గాయత్రీచ్చందః యజ్ఞోపవీత ధారణే వినియోగః ||
.
"ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం
ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్
ఆయుష్య మగ్రియం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజః "
అని చెప్పి అని ధరించవలెను.
.
(మంత్ర పఠన సమయమున కుడి బాహువును పైకెత్తి శరీరము తగలకుండా జందెమును పట్టి యుంచి మంత్రాంతము నందు కుడిబాహువు మీదుగా ఎడమ బాహువు నందు ధరించవలెను.)
.
ద్వితీయోపవీత ధారణం:
తిరిగి ఆచమనం చేసి “మమ నిత్యకర్మానుష్టాన యోగ్యతా సిద్ధ్యర్ధం ద్వితీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని రెండవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను.
.
తృతీయ యజ్ఞోపవీత ధారణం:
తిరిగి ఆచమనం చేసి “ఉత్తరీయార్ధం తృతీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని మూడవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను.
.
చతుర్ధ పంచమ యజ్నోపవీతములు ధరించుట:
తిరిగి ఆచమనం చేసి పై మంత్రమును పఠిస్తూ "ఆపన్నివారణార్థం చతుర్థ, పంచమ యజ్ఞోపవీత ధారణం కరిష్యే" అని నాలుగు, ఐదు ముడులను ఒక దాని తరువాత మరి యొకటి దరించవలెను. మొత్తము ఐదు ముడులు వచ్చునట్లు సరిచేసుకొనవలెను.
.
తరువాత పాత, కొత్త జంధ్యములను కలిపి, కుడి చేతి బొటన వ్రేలు, చూపుడు వ్రేలు మధ్యలో పట్టుకొని పైన కండువా కప్పి, “దశ గాయత్రి” (పదిమారులు గాయత్రి మంత్రము) జపించి, “యధాశక్తి దశ గాయత్రీ మంత్రం గాయత్రీ దేవతార్పణమస్తు" అని నీటిని వదలవలెను. (బ్రహ్మచారులు ఒక్క ముడినే ధరించవలయును)
.
గాయత్రీ మంత్రము:
“ఓం భూర్భువస్సువః తత్ సవితుర్ వరేణ్యం
భర్గో దేవస్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్ "
.
తరువాత ఈ క్రింది విజర్జన మంత్రము చదువుతూ పాత జందెమును తీసి వేయవలెను.
.
జీర్ణోపవీత విసర్జనం:
తిరిగి ఆచమనం చేసి
.
శ్లో: ఉపవీతం ఛిన్నతంతుం కశ్మల దూషితం
విసృజామి యశో బ్రహ్మ వర్చో దీర్ఘాయురస్తుమే ||
.
శ్లో: పవిత్రదంతా మతి జీర్ణవంతం
వేదాంత వేద్యం పరబ్రహ్మ రూపం
ఆయుష్య మగ్ర్యం ప్రతిమంచ శుభ్రం
జీర్నోపవీతం విసృజంతు తేజః ||
.
శ్లో: ఏతా వద్దిన పర్యంతం
బ్రహ్మత్వం ధారితం మయా
జీర్ణత్వాత్తే పరిత్యాగో
గచ్ఛ సూత్ర యథా సుఖం ||
.
విసర్జన సమయములో తీసివేస్తున్న పాత జందెమును పాదములకు తాకకుండా చూసుకోవలెను.
తిరిగి ఆచమనం చేసి కొత్త యజ్ఞోపవీతముతో కనీసం పది సార్లు గాయత్రి మంత్రము జపింఛి యధాశక్తి "గాయత్రీ దేవతార్పణమస్తు" అని నీరు విడువ వలెను. ఆ తరువాత గాయత్రీ దేవికి నైవేద్యము సమర్పించి, ఆ ప్రసాదమునకు నమస్కరించి స్వీకరించవలెను.
.
తీసివేసిన పాత జందెమును ఏదైనా పచ్చని మొక్కపై వేయవలెను.
.
నూతన యజ్ఞోపవీత ధారణ సమయములు:
జాతాశౌచ శుద్ధి యందు, మృతాశౌచ శుద్ధియందు, గ్రహణానంతరము, ప్రతి నాలుగు మాసముల అనంతరము నూతన యజ్ఞోపవీతమును ధరించి, పూర్వ యజ్ఞోపవీతమును త్యజించవలెను.......

Saturday, August 25, 2018

చెప్పుడు మాటలు

వియ్యంకుడి చెప్పుడు మాటలు విని మహామంత్రి తిమ్మరసు కళ్ళు పీకించాడు శ్రీ క్రిష్ణ దేవరాయలు.

తన సొంత ఖర్చులు కోసం టోపీ లు కుట్టుకునే  ఔరంగజేబు చెప్పుడు మాటలు విని అధికారం కోసం కన్న తల్లి తండ్రులని బంధించాడు.

తల్లి గర్భం లో చనిపోబోయే బిందుసారుడి ని తన ఉపాయం తో బతికిస్తే చివరికి చెప్పుడు మాటలు విని బిందుసారుడే చాణక్యుడి మరణానికి కారణం అయ్యాడు.

చెప్పుడు మాటలు విని కురు సామ్రాజ్యం పై పగ పెంచు కున్నాడు శకుడు. అదే శకుని చెప్పుడు మాటలు విని ధ్రుతరాష్టుడు పాండవులపై యుద్ధం చేసి సర్వం కోల్పోయారు కౌరవులు.

చెప్పుడు మాటలు విని రావణా బ్రహ్మ అంతటి మాహా జ్ఞానే సీతమ్మ తల్లి ని అపహరించి రాముడి తో యుద్ధానికి దిగి రాక్షసుడు అయ్యాడు.

చెప్పుడు మాటలు విని స్నేహాన్ని కోల్పోయిన వారు కొందరు. చెప్పుడు మాటలు విని సంసారాలని నాశనం చేసుకున్నవారు మరికొందరు. చెప్పుడు మాటలు విని అధికారాన్ని కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు.

శకుని చెప్పుడు మాటలు వినటం వలన హస్తినాపుర మహా సామ్రాజ్యమే సర్వనాశనం అయింది. మనమెంత..?

* మనతో  ఉంటూ చెప్పుడు మాటలు చెప్పే శకుని లాంటి వాళ్ళతో అప్రమత్తం గా లేకపోతే ఎంతటివారికైనా అపజయం కలుగుతుంది అని చరిత్ర మరియూ పురాణాలు చెప్తున్న నగ్న సత్యం.

శ్రావణ పౌర్ణమి - రాఖీ పౌర్ణమి - నూతన యజ్ఞోపవీత ధారణ విధానము

శ్రావణ పౌర్ణమి - రాఖీ పౌర్ణమి - ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోపవీతం) దరించవలెను.


నూతన యజ్ఞోపవీత ధారణ విధానము


ప్రార్థన:

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||


గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురు దేవో మహేశ్వరః |

గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై: శ్రీ గురవే నమః ||


అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాం గతో 2పివా |

యస్మరేత్ పుండరీకాక్షం న బాహ్యాభ్యంతరశ్సుచి: ||

పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్ష!

(అంటూ తల పైకి నీళ్ళు చల్లుకొనవలెను)


ఆచమన విధానం:


ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని,


1. ఓం కేశవాయ స్వాహా,

2. ఓం నారాయణాయ స్వాహా,

3. ఓం మాధవాయ స్వాహా,


అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను. తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను.


4. ఓం గోవిందాయనమః,

5. ఓం విష్ణవే నమః,

6. ఓం మధుసూదనాయనమః,

7. ఓం త్రివిక్రమాయనమః,

8. ఓం వామనాయనమః,

9. ఓం శ్రీధరాయనమః,

10. ఓం హృషీకేశాయనమః,

11. ఓం పద్మనాభాయనమః,

12. ఓం దామోదరాయనమః,

13. ఓం సంకర్షణాయనమః,

14. ఓం వాసుదేవాయనమః,

15. ఓం ప్రద్యుమ్నాయనమః,

16. ఓం అనిరుద్ధాయనమః,

17. ఓం పురుషోత్తమాయనమః,

18. ఓం అధోక్షజాయనమః,

19. ఓం నారసింహాయనమః,

20. ఓం అత్యుతాయనమః,

21. ఓం జనార్దనాయనమః,

22. ఓం ఉపేంద్రాయనమః,

23. ఓం హరయేనమః,

24. ఓం శ్రీకృష్ణాయనమః.

అని నమస్కరించవలెను. అటు పిమ్మట:


భూతోచ్చాటన:


(చేతిలో ఉద్ధరిణి తో నీరు పోసుకుని యీ క్రింది మంత్రమును చదివిన పిమ్మట భూమిపై నీళ్ళు జల్లవలెను.)


ఉత్తిష్ఠంతు | భూత పిశాచాః | యే తే భూమిభారకాః | యే తేషామవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః | దేవీ గాయత్రీచ్చందః ప్రాణాయామే వినియోగః


(ప్రాణాయామం కృత్వా కుంభకే ఇమం గాయత్రీ మంత్రముచ్ఛరేత్)


గృహస్తులు ఐదు వ్రేళ్లతో నాసికాగ్రమును పట్టుకొని మంత్రము చెప్పవలెను. బ్రహ్మచారులు బొటన వ్రేలి తో కుడి ముక్కును, అనామిక ఉంగరం వ్రేళ్లతో ఎడమ ముక్కును పట్టుకొని ఈ క్రింది మంత్రమును చెప్ప వలెను.


ఓం భూః, ఓం భువః, ఓగ్ మ్ సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ మ్ సత్యం, ఓం తత్స వితుర్వరేణ్యం బర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ | ఓం ఆపో జ్యోతి రసో2మృతం, బ్రహ్మ భూర్భువస్సువరోమ్||


తదుపరి సంకల్పం:


మమ ఉపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనముహూర్తే, శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, ఆద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే, గంగా కావేరీయోర్మధ్యే, స్వగృహే (లేదా శోభన గృహే), సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, … సంవత్సరే, … అయనే, … ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల, పురుషార్ధ సిద్ధ్యర్ధం, ఆయుష్యాభివృద్ధ్యర్ధం, మమ శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన యోగ్యతా ఫల సిద్ధ్యర్ధం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే


(బ్రహ్మచారులు “ధర్మపత్నీ సమేతస్య" అని చెప్పనక్కర లేదు)


యజ్ఞోపవీతములు ఐదింటిని ఐదు ముడుల వద్దను, మరి రెండు సమానదూర స్థలముల వద్దను, కుంకుమను తడి చేసి అలంకరించి అధిష్టాన దేవత అయిన గాయత్రిని ధ్యానించి, యజ్ఞోపవీత ధారణా మంత్రము స్మరించి ఈ క్రింది విధముగా ధరించవలెను.


యజ్ఞోప వీతే త్తస్య మంత్రస్య పరమేష్టీ పరబ్రహ్మర్షి: పరమాత్మా,

దేవతా, దేవీ గాయత్రీచ్చందః యజ్ఞోపవీత ధారణే వినియోగః ||


"ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం

ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్

ఆయుష్య మగ్రియం ప్రతిముంచ శుభ్రం

యజ్ఞోపవీతం బలమస్తు తేజః "

అని చెప్పి అని ధరించవలెను.


(మంత్ర పఠన సమయమున కుడి బాహువును పైకెత్తి శరీరము తగలకుండా జందెమును పట్టి యుంచి మంత్రాంతము నందు కుడిబాహువు మీదుగా ఎడమ బాహువు నందు ధరించవలెను.)


ద్వితీయోపవీత ధారణం:


తిరిగి ఆచమనం చేసి “మమ నిత్యకర్మానుష్టాన యోగ్యతా సిద్ధ్యర్ధం ద్వితీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని రెండవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను.


తృతీయ యజ్ఞోపవీత ధారణం:


తిరిగి ఆచమనం చేసి “ఉత్తరీయార్ధం తృతీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని మూడవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను.


చతుర్ధ, పంచమ యజ్నోపవీతములు ధరించుట:


తిరిగి ఆచమనం చేసి పై మంత్రమును పఠిస్తూ


"ఆపన్నివారణార్థం చతుర్థ, పంచమ యజ్ఞోపవీత ధారణం కరిష్యే" అని నాలుగు, ఐదు ముడులను ఒక దాని తరువాత మరి యొకటి దరించవలెను. మొత్తము ఐదు ముడులు వచ్చునట్లు సరిచేసుకొనవలెను.


తరువాత పాత, కొత్త జంధ్యములను కలిపి, కుడి చేతి బొటన వ్రేలు, చూపుడు వ్రేలు మధ్యలో పట్టుకొని పైన కండువా కప్పి, “దశ గాయత్రి” (పదిమారులు గాయత్రి మంత్రము) జపించి, “యధాశక్తి దశ గాయత్రీ మంత్రం గాయత్రీ దేవతార్పణమస్తు" అని నీటిని వదలవలెను. (బ్రహ్మచారులు ఒక్క ముడినే ధరించవలయును)


గాయత్రీ మంత్రము:


“ఓం భూర్భువస్సువః తత్ సవితుర్ వరేణ్యం

భర్గో దేవస్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్ "


తరువాత ఈ క్రింది విజర్జన మంత్రము చదువుతూ పాత జందెమును తీసి వేయవలెను.


జీర్ణోపవీత విసర్జనం:

తిరిగి ఆచమనం చేసి


శ్లో: ఉపవీతం ఛిన్నతంతుం కశ్మల దూషితం

విసృజామి యశో బ్రహ్మ వర్చో దీర్ఘాయురస్తుమే ||


శ్లో: పవిత్రదంతా మతి జీర్ణవంతం

వేదాంత వేద్యం పరబ్రహ్మ రూపం

ఆయుష్య మగ్ర్యం ప్రతిమంచ శుభ్రం

జీర్నోపవీతం విసృజంతు తేజః ||


శ్లో: ఏతా వద్దిన పర్యంతం

బ్రహ్మత్వం ధారితం మయా

జీర్ణత్వాత్తే పరిత్యాగో

గచ్ఛ సూత్ర యథా సుఖం ||


విసర్జన సమయములో తీసివేస్తున్న పాత జందెమును పాదములకు తాకకుండా చూసుకోవలెను.

తిరిగి ఆచమనం చేసి కొత్త యజ్ఞోపవీతముతో కనీసం పది సార్లు గాయత్రి మంత్రము జపింఛి యధాశక్తి "గాయత్రీ దేవతార్పణమస్తు" అని నీరు విడువ వలెను. ఆ తరువాత గాయత్రీ దేవికి నైవేద్యము సమర్పించి, ఆ ప్రసాదమునకు నమస్కరించి స్వీకరించవలెను.


తీసివేసిన పాత జందెమును ఏదైనా పచ్చని మొక్కపై వేయవలెను.

పద్మశ్రీ ఘంటశాల భగవద్గీత

1. భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశము, భక్తుడైన అర్జునకు ఒనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారతయుద్దము జరుగరాదని సర్వవిధముల భగవానుడు ప్రయత్నించెను. కానీ, ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్ధములాయెను. అటుపిమ్మట శ్రీకృష్ణుడు పార్దునకు సారధియై నిలిచెను. యుద్దరంగమున అర్జునుని కోరిక మేరకు రధమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయం ద్రవించి.

2. స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్యసుఖము వలదు అని ధనుర్భాణములను క్రింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మా... (1:32)

౩. దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు, అనిత్యములైన శరీరములను గూర్చిగాని, నిత్యములు, శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చిగాని దుఃఖింపరు. (2:11)

4. జీవునకు దేహమునందు బాల్యము, యౌవనము, ముసలితనము యెట్లో మరొక దేహమును పొందుటకు కూడ అట్లే కనుక ఈ విషయమున ధీరులు మోహము నొందరు. (2:13)

5. మనుష్యుడు ఎట్లు చినిగిన వస్త్రములను వదలి నూతన వస్త్రములను ధరించునో అట్లే ఆత్మ(జీవాత్మ) జీర్ణమైన శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించుచున్నది. (2:22)

6. ఆత్మ నాశనము లేనిది, ఆత్మను శస్త్రములు చేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు అర్పివేయును సమర్ధము కాదు. ఆత్మ నాశనము లేనిది. (2:23)

7. పుట్టినవానికి మరణము తప్పదు. మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. (2:27)

8. యుద్దమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు. జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జునా! యుద్దమును చేయు కృతనిశ్చయుడవై లెమ్ము. (2:37)

9.కర్మలను ఆచరించుట యందే నీకు అధికారము కలదు కాని, వాని ఫలితముపైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదు. (2:47)

10.దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ కోల్పోనివాడును, రాగము, భయము, క్రోధము పోయిన వాడును, స్థితప్రజ్ఞుడని చెప్పబడును. (2:56)

11.విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి, వాని యందను రాగమధికమై, అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధమువలన అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపకశక్తి నశించి దాని ఫలితముముగా మనుజుడు బుద్ద్దిని కోల్పోయి చివరకు అధోగతి చెందును. (2:62)

12. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుస్టారము, బ్రహ్మప్రాప్తిసాధనము కలిగిన జీవుడు సంసారమున బడక, సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు. (2:72)

13. అర్జునా! ఈ లోకములో ఆత్మానాత్మ వివేకముగల సన్యాసుకలు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్దిగల యోగీశ్వరులకు కర్మయోగము చేతను, ముక్తి కలుగుచున్నదని సృష్టి ఆదియందు నాచే చెప్పబడియున్నది. (౩:౩)

14. అన్నము వలన జంతుజాలము పుట్టును. వర్షము వలన అన్నము సమకూరును. యజ్ఞము వలన వర్షము కలుగును. ఆ యజ్ఞము కర్మ వలననే సంభవమగును. (౩:14) 

15. పార్దా! నాచే నడుపబడు ఈ లోకము అను చక్రమును బట్టి, యెవడు అనుసరింపడో, వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడగుచున్నాడు. అట్టివాడు వ్యర్ధుడు, జ్ఞానీ కానివాడు సదా కర్మల నాచరించుచునే ఉండవలెను. (౩:16)

16. ఉత్తములైన వారు దేని నాచరింతురో, దానినే ఇతరులును ఆచరింతురు. ఉత్తములు వేనిని ప్రమాణముగా అంగీకరింతురో లోకమంతయు దానినే అనుసరించును. (౩:21)

17. అర్జునా! నీ వొనర్చు సమస్త కర్మలనూ నా యందు సమర్పించి జ్ఞానముచే నిష్కాముడవై, అహంకారము లేనివాడవై సంతాపమును వదలి యుద్దము చేయుము. (౩:౩౦)

18. చక్కగా అనుస్టింపబడిన పరధర్మము కన్న, గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది. ఆచరణకు అనుచితమైనది. (౩:35)

19. పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామముచేత జ్ఞానము కప్పబడి యున్నది. (౩:38)

20. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్దినొందునో, ఆయా సమయములయందు శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మ సంరక్షణముల కొఱకు ప్రతీయుగమునా అవతారము దాల్చుచున్నాను. (4:7,8)

21. అనురాగము, భయము, క్రోధము వదలి నా యందు మనస్సు లగ్నము చేసి, ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి. (4:10)

22. ఎవరెవరు యేయే విధముగా నన్ను తెలియకోరుచున్నారో వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను కానీ, ఏ ఒక్కనియందు అనురాగాముకాని, ద్వేషముగాని లేవు. (4:11)

23. ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావో యెవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్పబడినవో, అట్టివానిని పండితులని విద్వాంసులని పల్కుదురు. (4:19)

24. యగ్నపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి చేత పొందనగు ఫలము గూడ బ్రహ్మమనియే తలంచవలయును. (4:24)

25. శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్ధుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును. (4:39)

26. కర్మ, సన్యాసములు రెండునూ మోక్షసోపాన సాధనములు. అందు కర్మ పరిత్యాగము కన్నా, కర్మానుష్టానమే శ్రేష్ఠమైనది. (5:2)

27. ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పనముగా కర్మల నాచరించునో, అతడు తామరాకుకు నీటిబిందువులు అంటని రీతిగా పాపమున చిక్కుబడడు. (5:10)

28. ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యునివలె ప్రకాశించి పరమార్థతత్వమును జూపును. (5:16)

29. విద్యా వినయ సంపన్నుడగు బ్రాహ్మణునియందును శునకము శునక మాంసము వొండుకొని తినువాని యందును పండితులు సమదృష్టి కలిగి వుందురు. (5:18)

౩౦. దేహత్యాగమునకు ముందు యెవడు కామక్రోధాది అరిషడ్వర్గములను జయించునో, అట్టివాడు యోగి అనబడును. (5:23)

31. ఎవడు ఇంద్రియములను జయించి, దృష్టిని భ్రూమధ్యమున నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంబిమపజేసి, మనస్సును, బుద్దిని, స్వాధీన మొనర్చుకొని, మోక్షాసక్తుడై యుండునో అట్టివాడే ముక్తుడనబడును. (5:28)

32. సకల యజ్ఞ తపః ఫలములను పొందువానిగను, సకల ప్రపంచ నియామకునిగను, నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు. (5:29)

౩౩. అర్జునా! సన్యాసమని దేనినందురో, దానినే కర్మయోగ మనియు అందురు. అట్టి యెడ సంకల్పత్యాగమొనర్పనివాడు యోగికాజాలడు. (6:2)

౩4. యుక్తాహార విహారాదులు, కర్మాచరణము గలవానికి ఆత్మసంయమ యోగము లభ్యము. (6:17)

35. గాలిలేనిచోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగుననే మనోనిగ్రహము కలిగి అత్మయోగమభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా నుండును. (6:19)

౩6. సకలభూతములయందూ సమదృష్టి కలిగినవాడు, అన్ని భూతములు తనయందును, తనను అన్ని భూతములయందును చూచుచుండును. (6:29)

37. అర్జునా! ఎట్టివానికైనను, మనస్సును నిశ్చలముగా నిల్చుట దుస్సాధ్యమే. అయినను దానిని అభ్యాసవైరాగ్యములచేత నిరోధింపవచ్చును. (6:35)

38. అర్జునా! పరిపూర్ణమైన విశ్వాసముతో నన్నాశ్రయించి వినయముతో ఎవరు సేవించి, భజింతురో వారు సమస్త యోగులలో ఉత్తములు. (6:47)

39. వేలకొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ది కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమె నన్ను యదార్ధముగా తెలుసుకోన గలుగుచున్నాడు. (7:౩)

40. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా మాయాశక్తి యెనిమిది విధములైన భేదములతో ఒప్పియున్నదని గ్రహింపుము. (7:4)

41. అర్జునా! నా కన్నా గొప్పవాడుగాని, గొప్పవస్తువుగాని, మరేదియును ఈ ప్రపంచమున లేదు. సూత్రమున మణులు గ్రుచ్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమై ఉన్నది. (7:7)

42. భూమియందు సుగంధము, అగ్నియందు తేజము, యెళ్ళ భూతముల యందు ఆయువు, తపస్సుల యందు తపస్సు నేనుగా ఎరుగుము. (7:9)

43. పార్దా! త్రిగునాత్మకము, దైవసంబందమగు నా మాయ అతిక్రమింపరానిది. కాని నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ సులభసాధ్యము. (7:14)

44. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధకాములు, జ్ఞానులు అను నాలుగు విధములైన పుణ్యాత్ములు నన్నాశ్రయించుచున్నారు. (7:16)

45. జ్ఞానసంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞానియై నన్ను శరణమునొందుచున్నాడు. (7:19)

46. ఎవడు అంత్య కాలమున నన్ను స్మరించుచు శరీరమును వదలుచున్నాడో, వాడు నన్నే చెందుచున్నాడు. (8:5)

47. అర్జునా! ఎవడు అభ్యాసయోగముతో, ఏకాగ్రచిత్తమున దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించునో, అట్టివాడు ఆ పరమపురుషునే చెందుచున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణపురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువుకన్నా అణువు, అనూహ్యమైన రూపము కలవాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారమున కన్నా ఇతరుడు. (8:8,9)

48. ఇంద్రియగోచరము కాని పరబ్రహ్మపదము శాశ్వతమైనది. పునర్జన్మ రహితమైన ఆ ఉత్తమపదమే పరమపదము. (8:21)

49. జగత్తునందు శుక్ల,కృష్ణములనెడి రెండు మార్గములు నిత్యములుగా నున్నవి. అందు మొదటి మార్గము వలన జన్మ రాహిత్యము, రెండవదాని వలన పునర్జన్మము కలుగుచున్నవి. (8:26)

5౦. యోగియైనవాడు వేదాధ్యయనము వలన, యగ్నతపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మ పదవిని పొందగలడు. (8:28)

51. పార్దా! ప్రళయకాలమునందు సకల ప్రాణులును, నాయందు లీనమగుచున్నవి, మరల కల్పాదియందు సకల ప్రాణులను నేనే సృష్టించుచున్నాను. (9:7)

52. ఏ మానవుడు సర్వకాల సర్వావస్థలయందును నన్నే ధ్యానించుచుండునో, అట్టివాని యోగక్షేమములు నేనే వహించుచున్నాను. (9:22)

53. ఎవడు భక్తితో నాకు పత్రమైనాను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడో, అట్టి వానిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను. (9:26)

54. పార్దా! నాయందు మనస్సు లగ్నముచేసి యెల్లకాలము యందు భక్తీ శ్రద్దలతో స్థిరచిత్తుడవై పుజించితినేని నన్నే పొందగలవు. (9:34)

55. కశ్యాపాది మహర్షి సప్తకము, సనకసనందనాదులు, స్వయంభూవాది మనువులు నావలననే జన్మించిరి. పిమ్మట వారివలన ఎల్లలోకమందలి సమస్త భూతములు జన్మించును. (10:6)

56. పండితులు నాయందు చిత్తముగలవారై నాయందే తమ ప్రాణములుంచి నా మహిమానుభావ మెరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకొనుచు బ్రహ్మానందము ననుభవించుచున్నారు. (10:9)

57. సమస్తభూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడను నేనే. వాని ఉత్పత్తి, పెంపు నాశములకు నేనే కారకుడను. (10:20)

58. వేదములలో సామవేదము, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందరి బుద్ధి నేనే. (10:22)

59. రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు నేనే. (10:౩౦)

6౦. లోకమునందు ఐశ్వర్యయుక్తమై, పరాక్రమయుక్తమై, కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తేజోభాగము వలననే సంభవములు. (10:41)

61. పార్దా! దివ్యములై, నానావిధములై, అనేక వర్ణములై, అనేక విశేషములు గల నా స్వస్వరూపమును కనులార దర్శింపుము. (11:5)

62. ప్రభో కృష్ణా! దేవా! ఎల్లదేవతలు, ఎల్లప్రాణులు, బ్రహ్మాదులు, ఋషీశ్వరులు, వాసుకీ మొదలగుగాగల యెల్ల సర్పములు నీయందు నాకు గోచరమగుచున్నవి. ఈశ్వరా! నీ విశ్వరూపము అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో ఒప్పియున్నది. అట్లయ్యుయు నీ ఆకారమున ఆద్యంత మధ్యమములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరమై, ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుటవలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో! నా యందు దయముంచి నాకు ప్రసన్నుడవు కమ్ము కృష్ణా! ప్రసన్నుడవు కమ్ము. (11:15,16,20)

6౩. అర్జునా! ఈ ప్రపంచమునెల్ల నశింపజేయు బలిష్టమైన కాలస్వరూపుడను నేనే. ఈ యుద్దమునకు సిద్దపడినవారిని నీవు చంపకున్నను బ్రతుకగల వారిందెవ్వరును లేరు. (11:32)

64. ఇప్పటికే ద్రోణ, భీష్మ, జయద్రధ కర్ణాది యోధ వీరులు నాచే సంహరింపబడిరి. ఇక మిగిలిన శత్రువీరులను నీవు సంహరింపుము. (11:34)

65. అనేక భుజములు గల నీ విశ్వరూపమును ఉపసంహరించి, కిరీటము, గద, చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింప గోరుచున్నాను కృష్ణా... (11:46)

66. అర్జునా! నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవ్వరునూ చూడజాలరు. ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరునూ సదా కోరుచుందురు. (11:52)

67. ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి, శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారో అట్టివారు నాకు ప్రీతిపాత్రులు. వారే ఉత్తమ పురుషులు. (12:2)

68. అభ్యాసయోగము కన్న జ్ఞానము, జ్ఞానము కన్న ధ్యానము, దానికన్న కర్మఫలత్యాగము శ్రేష్టము. అట్టి త్యాగము వల్ల సంసార బంధనము తొలగి, మోక్షప్రాప్తి సంభవించుచున్నది. (12:12)

69. ఎవడు కోరికలు లేనివాడై, పవిత్రుడై, పక్షపాతరహితుడై, భయమును వీడి, కర్మఫలత్యాగియై నాకు భక్తుడగునో, అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు. (12:16)

7౦. శత్రుమిత్రులయందును, మానావమానములయందును, శీతోష్ణ సుఖ దుఃఖాదులయందును సమబుద్ది కలిగి సంగరహితుడై, నిత్యసంతుస్టుడై, చలించని మనస్సు గలవాడై, నా యందు భక్తిప్రవత్తులు చూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు. (12:18,19)

71. అర్జునా! దేహము క్షేత్రమనియు, దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞుడనియు పెద్దలు చెప్పుదురు. (13:1)

72. ఆత్మజ్ఞానమునందు మనస్సు లగ్నము చేయుట, మోక్షప్రాప్తి యందు ద్రుష్టి కలిగియుండుట జ్ఞానమార్గములనియు, వానికి ఇతరములైనవి అజ్ఞానము లనియు చెప్పబడును. (13:11)

7౩. ప్రకృతిని ‘మాయ’ యని యందురు. అది శరీర సుఖదుఃఖాదులను తెలియజేయును. క్షేత్రజ్ఞుడు, ఆ సుఖదుఃఖాదులను అనుభవించుచుండెను. (13:20)

74. శరీరము నశించినను, తాను నశింపక, ఎవడు సమస్త భూతములందున్న పరమేశ్వరుని చూచునో, వాడే యెరిగినవాడు. (13:27)

75. అర్జునా! గుణనాశరహితుడైనవాడు పరమాత్మ, అట్టి పరమాత్మ దేహాంతర్గుడయ్యెను. కర్మలనాచారించువాడు కాడు. (13:31)

76. పార్దా! సుర్యుడోక్కడే యెల్ల జగత్తులను ఏ విధముగా ప్రకాశింప జేయుచున్నాడో, ఆ విధముగానే క్షేత్రజ్ఞుడు యెళ్ళ దేహములను ప్రకాశింపజేయుచున్నాడు. (13:౩౩)

77. జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీస్వరులు మోక్షమును పొందిరి. అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశించుచున్నాను. (14:1)

78. అర్జునా! ప్రపంచమున జన్మించు ఎల్ల చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వంటిది. నేను(పరమాత్మ) తండ్రి వంటివాడను. (14:4)

79. అర్జునా! త్రిగుణములలో సత్వగుణము నిర్మలమగుటంజేసి, సుఖ జ్ఞానాభిలాషల చేత, ఆత్మను దేహమునందు బందించు చున్నది. (14:6)

8౦. ఓ కౌంతేయా! రజో గుణము కోరికలయందు అభిమానము, అనురాగము పుట్టించి, ఆత్మను బందించుచున్నది. (14:7)

81. అజ్ఞానము వలన బుట్టునది తమోగుణము, అది సర్వప్రాణులను మొహింపజేయునది. ఆ గుణం, మనుజుని ఆలస్యముతోను, అజాగ్రత్తతోను, నిద్రతోను బద్దునిజేయును. (14:8)

82. మానావమనములయందు, శత్రుమిత్రులయందు సమమైన మనస్సు గలవానిని త్రిగుణాతీతుడందురు. (14:25)

8౩. బ్రహ్మమే మూలముగా నికృష్టమైన అహంకారము కొమ్మలుగా గల అశ్వర్థవృక్షము అనాది అయినది. అట్టి సంసారవృక్షమునకు వేదములు ఆకులు వంటివి. అట్టిదాని నెరింగినవాడే వేదార్ధసార మెరింగినవాడు. (15:1)

84. పునరావృత్తి రహితమైన మోక్షపధము, సుర్యచంద్రాదుల ప్రకాశమున కతీతమై, నా ఉత్తమ పథమై యున్నది. (15:6)

85. దేహులందు జఠరాగ్నిస్వరూపుడనై, వారు భుజించు భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య పదార్థముల జీర్ణము చేయుచున్నాను. (15:14)

86. పార్దా! సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరులను వంచింపకుండుట, కావరము లేకుండుట మొదలుగు గుణములు దైవాంశ సంభూతులకుండును. అట్లే డంబము, గర్వము, అభిమానము, క్రోధము, కఠీనపు మాటలాడుట, అవివేకము, మొదలగు గుణములు రాక్షసాంశమున బుట్టిన వారికుండును. (16:౩,4)

87. కామ, క్రోధ, లోభములు ఆత్మను నాశమును చేయును. అవి నరకప్రాప్తికి హేతువులు కావున, వానిని వదలి వేయవలెను. (16:21)

88. శాస్త్రవిషయముల ననుసరింపక యిచ్చామార్గమున ప్రవర్తించువాడు సుఖసిద్దులను పొందజాలడు. పరమపదమునందజాలడు. (16:23)

89. జీవులకు గల శ్రద్ధ, పూర్వజన్మవాసనాబలము వలన లభ్యము. అది రాజసము, సాత్వికము, తామసములని మూడు విధములుగా నున్నవి. (17:2)

9౦. సత్వగుణులు దేవతలను, రాజోగుణులు యక్షరాక్షసులను, తమోగుణులు భూతప్రేతగణంబులను శ్రద్ధాభక్తులతో పూజించుచుందురు. (17:4)

91. ఇతరుల మనస్సుల నొప్పింపనిదియు, ప్రియము, హితములతో కూడిన సత్యభాషనము, వేదాద్యన మొనర్చుట, వాచకతపస్సని చెప్పబడును. (17:15)

92. జ్యోతిష్టోమాది కర్మల నాచరింపకుండుట సన్యాసమనియు, కర్మఫలము, ఈశ్వరార్పణ మొనర్చుట త్యాగమనియు పెద్దలు చెప్పుదురు. (18:2)

9౩. కర్మములు ప్రియములు, అప్రియములు, ప్రియాతి ప్రియములని మూడు విధములు. కర్మఫలము కోరినవారు జన్మాంతరములందు ఆ ఫలములను పొందుచున్నాడు. కోరని వారు ఆ ఫలములను జన్మాంతరమున పొందజాలకున్నారు. (18:12)
94. అర్జునా! కర్మమోక్షమార్గముల, కర్తవ్య భయాభయముల, బంధమోక్షముల, ఏ జ్ఞానమెరుగుచున్నదో అది సత్వగుణ సముద్భనమని ఎరుగుము. (18:౩౦)

95. ఈశ్వరుడు యెల్ల భూతములకు నియామకుడై, ప్రాణుల హృదయ ముందన్నవాడై, అంత్రగాడు బొమ్మలనాడించు రీతిగా ప్రాణుల భ్రమింపజేయుచున్నాడు. (18:61) 
 
96. సమస్త కర్మల నాకర్పించి, నన్నే శరణుబొందిన ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తుని గావింతును. నీవు చింతింపకుము. (18:66)                 
                                                                                               
97. ఎవడు పరమోత్క్రష్టమైనదియు, పరమరహస్యమైన ఈ గీతాశాస్త్రమును నా భక్తులకుపదేశము చేయుచున్నాడో వాడు మోక్షమున కర్హుడు. (18:68)

98. ధనంజయా! పరమగోప్యమైన ఈ గీతాశాస్త్రమును చక్కగా వింటివా? నీ అజ్ఞాన జనితమైన అవివేకము నశించినదా? (18:72)

99. కృష్ణా! అచ్యుతా! నా అవివేకము నీ దయవలన తొలగెను. నాకు సుజ్ఞానము లభించినది. నాకు సందేహములన్నియు తొలగినవి. నీ ఆజ్ఞను శిరసావహించెదను. (18:7౩)

100. యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్దారియగు అర్జునుడు ,ఎచట నుందురో, అచ్చట సంపద, విజయము, ఐశ్వర్యము, స్థిరమగు నీతి యుండును. (18:78)

101. గీతాశాస్త్రమును ఎవరు పటింతురో వారు భయశోకాది వర్జితులై విష్ణు సాయుజ్యమును పొందుదురు.

తపస్సు అంటే ఏమిటి ?

ఒక మంత్రాన్నో…, ఏదో ఒక
దైవాన్నో ఉపాసిస్తూ., నిరంతర ధ్యానంలో ఉండడమే
తపస్సు అనుకుంటే పొరపాటు. ‘తపనే’ తపస్సు. ఒక
కార్యసాధన కోసం అనుక్షణం తపించడమే…,
ఆరాటపడడమే ‘తపస్సు. అలా తపించినంత మాత్రాన.,
ఆరాటపడినంత మాత్రాన ప్రయోజనం ఉంటుందా అనే
సందేహం ఎవరికైనా కలుగవచ్చు. తప్పకుండా
ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే…మనస్సంకల్పానికి
ఉన్న శక్తి, బలము…. ఈ సృష్టిలో దేనికి లేదు.
ఆయుధాన్ని వాడకుండా, ఓ మూల పడేస్తే
తుప్పుపట్టి పనికిరాకుండా పోతుంది. ఆయుధాన్ని
నిరంతరం వాడుతూంటే పదునుదేలి..దాని పనితనాన్ని
చూపిస్తుంది. అలాగే మనస్సు కూడా. అయితే., ఇక్కడ
మీకో సందేహం రావచ్చు.‘అయ్యా.. మనస్సు
నిరంతరం ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూనే
ఉంటుంది కదా అని.’ నిజమే…ఆలోచించడం వేరు.
ఆరాటపడడం వేరు. ఏదో ఒక విషయం గురించి
ఆలోచించడాన్ని.., ఆరాటపడడం అనరు. చంచలమైన
మనస్సును నియంత్రించి, ఒక నిర్దిష్ఠమైన
లక్ష్యాన్ని దానికి నిర్దేశించి., ఆ దిశగా మనసును
మళ్ళించడానికి పడే ఆరాటాన్నే., తపననే., తపస్సు
అంటారు.
అది మంచి అయితే మంచి ఫలితాన్ని.., చెడు అయితే
చెడు ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది. అందుచేతనే
తపస్సు చేసే సాధకుడు మంచినే ఆశించి., విశ్వశాంతిని
కాంక్షిస్తూ తపస్సు చేయాలి. అదే నిజమైన తపస్సు.
తపస్సు గురించి ఇంత వ్యాఖ్యానం ఇచ్చారు కదా…
ఇది నిజం అని నిరూపించడానికి ఏదైనా ఆధారం ఉందా ?
అని ప్రశ్నించ వచ్చు. ఆధారం లేకుండా ఏ విషయాన్ని
మన ఋషులు ఇంతవరకు ప్రతిపాదించలేదు. దీనికి
ప్రకృతి పరమైన ఆధారం ఉంది. సృష్టిలో అందమైన
కీటకం ‘సీతాకోకచిలుక’. దీని పుట్టుక చాలా వింతగా
ఉంటుంది.
సాధారణంగా ఒక ప్రాణి నుంచి అదే విధమైన ప్రాణి
పుడుతుంది. ఉదాహరణకు కోడిగ్రుడ్డు నుంచి
కోడిపిల్ల పుడుతుంది. సీతాకోకచిలుక పెట్టే గ్రుడ్ల
నుంచి సీతాకోకచిలుకలు రావు. గొంగళిపురుగులు
వస్తాయి. ఈ గొంగళిపురుగులు చూడడానికి చాలా
అసహ్యంగా ఉంటాయి.ఆ దశలో అది రాళ్ళలో.,
రప్పల్లో.., ముళ్ళలో తిరుగుతూ., ఆకులు తింటూ
కాలం గడుపుతుది. అలా కొంత కాలం గడిచాక తన
జీవింతం మీద విరక్తి కలిగి.,ఆహార, విహారాలు
త్యజించి, ఎవ్వరికీ కనిపించని ప్రదేశనికి పోయి., తన
చుట్టూ ఓ గూడు నిర్మించుకుని, తపస్సమాధి
స్థితిలోకి వెళ్లిపోతుంది. అలా కొంతకాలం గడిచాక, దాని
తపస్సు ఫలించాక అది తన గూడు చీల్చుకుని
బయటకు వస్తుంది. అయితే అది గొంగళిపురుగులా
రాదు. అందమైన సీతాకోకచిలుకలా వస్తుంది. అప్పుడది
ఆకులు, అలములు తినదు. పూవుల్లో ఉండే
మకరందాన్నే తాగుతుంది. ప్రకృతి ధర్మానికి కట్టుబడి
గ్రుడ్లు పెట్టిన మరుక్షణం ఈ సంసార జగత్తులో
చిక్కుకోక మరణిస్తుంది. అదీ తపస్సు ఇచ్చే
ప్రతిఫలం. అలాగే తపస్సిద్ధి పొందిన మానవుడు ఈ
సంసార లంపటంలో చిక్కుకోక భగవన్నామామృత పానంతో
తరిస్తాడు.
పుట్టిన ప్రతిమనిషి ఒక గొంగళి పురుగులా జీవిస్తూ ఉంటాడు .తరువాత క్రమంలో తపస్సు ( ధ్యానం )చేత నేనే భగవత్ స్వరూపుడను అని తెలుసుకొని ఈ సంసార జగత్తులోచిక్కుకోకుండా   అందమైన సీతాకోక చిలుకలా  ఆనందమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు . ఇదే తపస్సు (ధ్యానం ) ఇచ్చే ప్రతిఫలం .

లక్ష్మి దేవి ని ప్రసన్నం చేసుకోవడం ఎలా ?


1. మీ ఇంటి ముఖ ద్వారానికి, ఒక మంచి రోజు,  బయట లోపల లక్ష్మి దేవి ఫోటో ఉంచండి, ఆ లక్ష్మి దేవి వెనుక రెండు ఏనుగులు బంగారపు  కలశాలతో లక్ష్మి దేవికి అభిషేకం చేస్తూ ఉండాలి. అలా ఉంచిన మీ ఆర్ధిక పరమైన పనులలో ఆటంకములు ఉండవు.

2. లక్ష్మి దేవికి  7 శుక్రవారాలు, 7 ముత్తైదువులకు,  ఇంటి గృహిణి ద్వారా సౌభాగ్య సామగ్రి (  కుంకం, పసుపు, చందనం, తాంబూలం, వీలు  అయితే ఎరుపురంగు జాకెట్టు గుడ్డ,దక్షిణ  ) కానుకగా ఇప్పించండి. అలా ఇస్తే మీ ఇంటి గృహానికి  మంచి ని  తప్పక లక్ష్మి దేవి  చేకూర్చుతుంది.

3. ప్రతినెలా వచ్చే అమావాస్య నాడు ఇంటి అంతటిని  సుభ్రపరచండి.

4. మీ ఇంటి లో ఉండే దేవుని మందిరం లో,ఒక మంచి రోజు,  ఒక కుంకుమ భరిణలో  "గోమతి చక్రం" అనేది కుంకుమ భరిణలో ఉంచి మూతపెట్టి,  కదిలించకుండా,  దేవుని మందిరం లో ఉంచండి , దానికి పూజాది కార్యక్రమాలు, ఏమి చేయనవసరం లేదు. అలా చేస్తే మీ గృహంలో పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటె పరిష్కారం అవటానికి అవకాసం ఉన్నది.( గోమతి చక్రం- పూజా సామగ్రి దొరికే దుకాణం లో దొరుకును ).

 గోమతి చక్రాలు 3 తీసుకోండి, వాటిని పొడి చేసి,ఒక మంచి రోజు, ఇంటి ముందర చల్లండి. మీ ఆర్ధిక బాధలు తొలగిపోవును .

5. సాయంత్రం , ఉదయం  లైటు వేసిన తరువాత ఇల్లు చిమ్మరాదు .

6. మూత లేకుండా  "డస్ట్ బిన్"  ఉండకూడదు, పగిలిన అద్దము ఉండకూడదు ఇంటిలో.

Friday, August 24, 2018

భగవద్గీతను ఎందుకు చదవాలి? చదివితే ఏమి అవ్వుతుంది ? - ఒక అందమైన కధ

ఒక పెద్దాయన రైతు..కొండలపైన ఉన్న తన పొలంలో యువకుడైన తన మనవడితో ఉంటున్నారు. రోజూ పొద్దున్నే లేచి వంటింట్లో ఉన్న బల్ల దగ్గర భగవద్గీత చదువుతూ కూర్చుంటారు…మనవడికి తాత చేసే పనులంటే చాలా ఇష్టం…తనూ అన్ని పనులూ తాతగారిలా చెయ్యాలనుకుంటాడు…

పొద్దున పూట తాత లానే తానూ భగవద్గీత
చదవటానికి ప్రయత్నిస్తున్నాడు కానీ అతని వల్ల అవ్వటం లేదు…ఒకరోజు తాతని అడిగాడు…తాతా.. నువ్వు చదివినట్టు నేనూ భగవద్గీత చదవాలని ప్రయత్నిస్తే…ఎంత చదివినా అర్ధం కావటం లేదు…కష్టం మీద కొంచెం అర్ధం చేసుకున్నా…పుస్తకం ముయ్యగానే..మర్చిపోతున్నాను..అసలు భగవద్గీత ఎందుకు చదవాలి మనం..ఏంటి ప్రయోజనం…అని తాతని అడిగాడు మనవడు…పొయ్యిలో బొగ్గు పెడుతున్న తాతగారు మనవడివైపు తిరిగి..తన చేతిలోని ఖాళీ అయిన బొగ్గు బుట్టని మనవడికి ఇచ్చి…కింద నది నుండి ఈ బుట్ట నిండా నీళ్ళు తీసుకుని రా..అని చెప్పారు…సరే తాత..అని మనవడు బుట్ట తీసుకెళ్ళి…నదిలో బుట్టను ముంచి కొండ పైకి ఇంటికి వచ్చేటప్పటికి నీళ్ళు బుట్ట నుండి కారిపొయ్యాయి…అది చూసి తాతగారు…ఓరి మనవడా..ఇంకొంచెం వేగం పెంచు..ఇంటికి రావటం లో అని సలహా చెప్పారు…సరే అని ఈ సారి ఇంకొంచెం వేగంగా బుట్టలో నీళ్ళు నింపి ఇంటికి వచ్చాడు మనవడు..బుట్ట ఖాళీ…తాతా..బుట్ట లో నీళ్ళు ఎలా నిలుస్తాయి…నేను గిన్నె తీసుకెళ్తాను అన్నాడు మనవడు..తాత చెప్పాడు…లేదు లేదు బుట్టతోనే నీళ్ళు తేవాలి..బహుశా నువ్వు ఇంకొంచెం ఎక్కువ శ్రమ పడాలి అనుకుంటా…ఇంకొంచెం శ్రద్ధగా ప్రయత్నిస్తే పని అవ్వచ్చు..అని మనవడిని ప్రోత్సహించారు…

మనవడు ఈ సారి ఇంకా వేగంగా నదిలో బుట్టను ముంచి..బుట్టలో నీళ్ళు నింపి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు…బుట్టలో నీళ్ళు నిలవలేదు…మళ్ళీ వెంటనే ఇంకోసారి కూడా ప్రయత్నించాడు…అయినా ఫలితం మాత్రం అదే…తాతగారు మనవడి కష్టం అంతా కిటికీలోంచి చూస్తూనే వున్నారు….

ఖాళీ బుట్టతో ఆయాసపడుతూ నించున్న మనవడితో నవ్వుతూ చెప్పారు..ఒకసారి బుట్ట వైపు చూడు మనవడా…అని…మనవడు బుట్టను చూసాడు…నల్లని బొగ్గుల బుట్ట ఇప్పుడు చాలా శుభ్రంగా, తెల్లగా ఉంది…

తాతగారు చెప్పారు…భగవద్గీత చదివితే మనకు జరిగేది ఇదే…మనకు అర్ధం అవ్వనీ అవకపోనీ…గుర్తు ఉండనీ ఉండకపోనీ…చదివే సమయంలో మనకు తెలియకుండానే..మన ఆలోచనల్లో..మన దృక్పధం లో మంచి మార్పు వస్తూ ఉంటుంది…ఆ మార్పు మనకి వెంటనే తెలియదు కూడా…సందర్భాన్ని బట్టీ..అవసరమైన సమయం లో..ఆ మంచి మార్పు…ఉపయోగపడుతుంది…భగవద్గీత చదవటంలో కృష్ణుడు మనకు చేసే మేలు అదే…మన మనస్సులను శుభ్రపరచటం…ఏది ఏమిటో…ఏది ఎందుకో…సరైన అవగాహన మనకి తెలియచేయటం…ఇవన్నీ అనుభవపూర్వకంగా..ఎవరికి వారే తెలుసుకోగలుగుతారు….అని చెప్పి మనవడి ప్రశ్నకు సహేతుకంగా, ఉదాహరణతో సహా వివరించారు తాతగారు.

ఖడ్గమాలా స్తోత్రం--శ్రీ చక్ర యంత్ర అనుసంధానము

శ్రీ దేవి యంత్ర రూపం శ్రీ చక్రం. శ్రీవిద్యా ఉపసకులు శ్రీ చక్రాఅర్చన చేస్తారు. ఇది చాలా విధి విధానాలతో ఉంటుంది. అయితే ఖడ్గమలా స్తోత్రం శ్రీ చక్ర అనుసంధానం చేసి చదువుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయి.
 స్తోత్రం ఈ క్రింద విధంగా ఉంది.
శ్రీ దేవీ ప్రార్థన
హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం
సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలామ్ |
వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్ ||

అస్య శ్రీ శుద్ధశక్తిమాలామహామంత్రస్య, ఉపస్థేంద్రియాధిష్ఠాయీ వరుణాదిత్య ఋషయః దేవీ గాయత్రీ ఛందః సాత్విక కకారభట్టారకపీఠస్థిత కామేశ్వరాంకనిలయా మహాకామేశ్వరీ శ్రీ లలితా భట్టారికా దేవతా, ఐం బీజం క్లీం శక్తిః, సౌః కీలకం మమ ఖడ్గసిద్ధ్యర్థే సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః, మూలమంత్రేణ షడంగన్యాసం కుర్యాత్ |

ధ్యానమ్
ఆరక్తాభాంత్రిణేత్రామరుణిమవసనాం రత్నతాటంకరమ్యామ్
హస్తాంభోజైస్సపాశాంకుశమదనధనుస్సాయకైర్విస్ఫురంతీమ్ |
ఆపీనోత్తుంగవక్షోరుహకలశలుఠత్తారహారోజ్జ్వలాంగీం
ధ్యాయేదంభోరుహస్థామరుణిమవసనామీశ్వరీమీశ్వరాణామ్ ||

లమిత్యాదిపంచ పూజామ్ కుర్యాత్, యథాశక్తి మూలమంత్రమ్ జపేత్ |

లం – పృథివీతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై గంధం పరికల్పయామి – నమః
హం – ఆకాశతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై పుష్పం పరికల్పయామి – నమః
యం – వాయుతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై ధూపం పరికల్పయామి – నమః
రం – తేజస్తత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై దీపం పరికల్పయామి – నమః
వం – అమృతతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై అమృతనైవేద్యం పరికల్పయామి – నమః
సం – సర్వతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై తాంబూలాదిసర్వోపచారాన్ పరికల్పయామి – నమః

శ్రీ దేవీ సంబోధనం (1)
ఓం ఐం హ్రీం శ్రీమ్ ఐం క్లీం సౌః ఓం నమస్త్రిపురసుందరీ,

న్యాసాంగదేవతాః (6)
హృదయదేవీ, శిరోదేవీ, శిఖాదేవీ, కవచదేవీ, నేత్రదేవీ, అస్త్రదేవీ,

తిథినిత్యాదేవతాః (16)
కామేశ్వరీ, భగమాలినీ, నిత్యక్లిన్నే, భేరుండే, వహ్నివాసినీ, మహావజ్రేశ్వరీ, శివదూతీ, త్వరితే, కులసుందరీ, నిత్యే, నీలపతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలినీ, చిత్రే, మహానిత్యే,

దివ్యౌఘగురవః (7)
పరమేశ్వర, పరమేశ్వరీ, మిత్రేశమయీ, ఉడ్డీశమయీ, చర్యానాథమయీ, లోపాముద్రమయీ, అగస్త్యమయీ,

సిద్ధౌఘగురవః (4)
కాలతాపశమయీ, ధర్మాచార్యమయీ, ముక్తకేశీశ్వరమయీ, దీపకలానాథమయీ,

మానవౌఘగురవః (8)
విష్ణుదేవమయీ, ప్రభాకరదేవమయీ, తేజోదేవమయీ, మనోజదేవమయి, కళ్యాణదేవమయీ, వాసుదేవమయీ, రత్నదేవమయీ, శ్రీరామానందమయీ,

శ్రీచక్ర ప్రథమావరణదేవతాః
అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, భుక్తిసిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే, సర్వకామసిద్ధే, బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారి, వైష్ణవీ, వారాహీ, మాహేంద్రీ, చాముండే, మహాలక్ష్మీ, సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణీ, సర్వాకర్షిణీ, సర్వవశంకరీ, సర్వోన్మాదినీ, సర్వమహాంకుశే, సర్వఖేచరీ, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే, త్రైలోక్యమోహన చక్రస్వామినీ, ప్రకటయోగినీ,

శ్రీచక్ర ద్వితీయావరణదేవతాః
కామాకర్షిణీ, బుద్ధ్యాకర్షిణీ, అహంకారాకర్షిణీ, శబ్దాకర్షిణీ, స్పర్శాకర్షిణీ, రూపాకర్షిణీ, రసాకర్షిణీ, గంధాకర్షిణీ, చిత్తాకర్షిణీ, ధైర్యాకర్షిణీ, స్మృత్యాకర్షిణీ, నామాకర్షిణీ, బీజాకర్షిణీ, ఆత్మాకర్షిణీ, అమృతాకర్షిణీ, శరీరాకర్షిణీ, సర్వాశాపరిపూరక చక్రస్వామినీ, గుప్తయోగినీ,

శ్రీచక్ర తృతీయావరణదేవతాః
అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగమదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగినీ, అనంగాంకుశే, అనంగమాలినీ, సర్వసంక్షోభణచక్రస్వామినీ, గుప్తతరయోగినీ,

శ్రీచక్ర చతుర్థావరణదేవతాః
సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావినీ, సర్వాకర్షిణీ, సర్వహ్లాదినీ, సర్వసమ్మోహినీ, సర్వస్తంభినీ, సర్వజృంభిణీ, సర్వవశంకరీ, సర్వరంజనీ, సర్వోన్మాదినీ, సర్వార్థసాధికే, సర్వసంపత్తిపూరిణీ, సర్వమంత్రమయీ, సర్వద్వంద్వక్షయంకరీ, సర్వసౌభాగ్యదాయక చక్రస్వామినీ, సంప్రదాయయోగినీ,

శ్రీచక్ర పంచమావరణదేవతాః
సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరీ, సర్వమంగళకారిణీ, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచనీ, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణీ, సర్వాంగసుందరీ, సర్వసౌభాగ్యదాయినీ, సర్వార్థసాధక చక్రస్వామినీ, కులోత్తీర్ణయోగినీ,

శ్రీచక్ర షష్టావరణదేవతాః
సర్వఙ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయినీ, సర్వఙ్ఞానమయీ, సర్వవ్యాధివినాశినీ, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణీ, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకరచక్రస్వామినీ, నిగర్భయోగినీ,

శ్రీచక్ర సప్తమావరణదేవతాః
వశినీ, కామేశ్వరీ, మోదినీ, విమలే, అరుణే, జయినీ, సర్వేశ్వరీ, కౌళిని, సర్వరోగహరచక్రస్వామినీ, రహస్యయోగినీ,

*శ్ర

ీచక్ర అష్టమావరణదేవతాః*
బాణినీ, చాపినీ, పాశినీ, అంకుశినీ, మహాకామేశ్వరీ, మహావజ్రేశ్వరీ, మహాభగమాలినీ, సర్వసిద్ధిప్రదచక్రస్వామినీ, అతిరహస్యయోగినీ,

శ్రీచక్ర నవమావరణదేవతాః
శ్రీ శ్రీ మహాభట్టారికే, సర్వానందమయచక్రస్వామినీ, పరాపరరహస్యయోగినీ,

నవచక్రేశ్వరీ నామాని
త్రిపురే, త్రిపురేశీ, త్రిపురసుందరీ, త్రిపురవాసినీ, త్రిపురాశ్రీః, త్రిపురమాలినీ, త్రిపురసిద్ధే, త్రిపురాంబా, మహాత్రిపురసుందరీ,

శ్రీదేవీ విశేషణాని – నమస్కారనవాక్షరీచ
మహామహేశ్వరీ, మహామహారాఙ్ఞీ, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాఙ్ఞప్తే, మహామహానందే, మహామహాస్కంధే, మహామహాశయే, మహామహా శ్రీచక్రనగరసామ్రాఙ్ఞీ, నమస్తే నమస్తే నమస్తే నమః |

ఫలశ్రుతిః
ఏషా విద్యా మహాసిద్ధిదాయినీ స్మృతిమాత్రతః |
అగ్నివాతమహాక్షోభే రాజారాష్ట్రస్యవిప్లవే ||

లుంఠనే తస్కరభయే సంగ్రామే సలిలప్లవే |
సముద్రయానవిక్షోభే భూతప్రేతాదికే భయే ||

అపస్మారజ్వరవ్యాధిమృత్యుక్షామాదిజేభయే |
శాకినీ పూతనాయక్షరక్షఃకూష్మాండజే భయే ||

మిత్రభేదే గ్రహభయే వ్యసనేష్వాభిచారికే |
అన్యేష్వపి చ దోషేషు మాలామంత్రం స్మరేన్నరః ||

తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్తస్థితేనవై |
అష్టాదశమహాద్వీపసమ్రాడ్భోక్తాభవిష్యతి ||

సర్వోపద్రవనిర్ముక్తస్సాక్షాచ్ఛివమయోభవేత్ |
ఆపత్కాలే నిత్యపూజాం విస్తారాత్కర్తుమారభేత్ ||

ఏకవారం జపధ్యానమ్ సర్వపూజాఫలం లభేత్
నవావరణదేవీనాం లలితాయా మహౌజనః ||

ఏకత్ర గణనారూపో వేదవేదాంగగోచరః |
సర్వాగమరహస్యార్థః స్మరణాత్పాపనాశినీ ||

లలితాయామహేశాన్యా మాలా విద్యా మహీయసీ |
నరవశ్యం నరేంద్రాణాం వశ్యం నారీవశంకరమ్ ||
అణిమాదిగుణైశ్వర్యం రంజనం పాపభంజనమ్
తత్తదావరణస్థాయి దేవతాబృందమంత్రకమ్ ||

మాలామంత్రం పరం గుహ్యం పరం ధామ ప్రకీర్తితమ్ |
శక్తిమాలా పంచధాస్యాచ్ఛివమాలా చ తాదృశీ ||

తస్మాద్గోప్యతరాద్గోప్యం రహస్యం భుక్తిముక్తిదమ్ ||

|| ఇతి శ్రీ వామకేశ్వరతంత్రే ఉమామహేశ్వరసంవాదే దేవీఖడ్గమాలాస్తోత్రరత్నం సమాప్తమ్ ||

ఇప్పుడు శ్రీ చక్రాన్ని ఖడ్గమలా స్తోత్రం తో అనుసంధానం చేద్దాం.

(1) శ్రీ దేవీ ప్రార్థన--

హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీంసౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలామ్ | వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్ ||

(2) సంకల్పం --

అస్య శ్రీ శుద్ధశక్తిమాలామహామంత్రస్య, ఉపస్థేంద్రియాధిష్ఠాయీ వరుణాదిత్య ఋషయః దేవీ గాయత్రీ ఛందః సాత్విక కకారభట్టారకపీఠస్థిత కామేశ్వరాంకనిలయా మహాకామేశ్వరీ శ్రీ లలితా భట్టారికా దేవతా, ఐం బీజం క్లీం శక్తిః, సౌః కీలకం మమ ఖడ్గసిద్ధ్యర్థే సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః, మూలమంత్రేణ షడంగన్యాసం కుర్యాత్

(3) ధ్యానమ్--

ఆరక్తాభాంత్రిణేత్రామరుణిమవసనాం రత్నతాటంకరమ్యామ్
హస్తాంభోజైస్సపాశాంకుశమదనధనుస్సాయకైర్విస్ఫురంతీమ్ ఆపీనోత్తుంగవక్షోరుహకలశలుఠత్తారహారోజ్జ్వలాంగీం
ధ్యాయేదంభోరుహస్థామరుణిమవసనామీశ్వరీమీశ్వరాణామ్ ||

(4) లంభిత్వాది పంచపూజలు

లమిత్యాదిపంచ పూజామ్ కుర్యాత్, యథాశక్తి మూలమంత్రమ్ జపేత్ |

లం – పృథివీతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై గంధం పరికల్పయామి – నమః
హం – ఆకాశతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై పుష్పం పరికల్పయామి – నమః
యం – వాయుతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై ధూపం పరికల్పయామి – నమః
రం – తేజస్తత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై దీపం పరికల్పయామి – నమః
వం – అమృతతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై అమృతనైవేద్యం పరికల్పయామి – నమః
సం – సర్వతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై తాంబూలాదిసర్వోపచారాన్ పరికల్పయామి – నమః

(5) ములమంత్రం

శ్రీ దేవీ సంబోధనం (1)
ఓం ఐం హ్రీం శ్రీమ్ ఐం క్లీం సౌః ఓం నమస్త్రిపురసుందరీ

(6) అంగన్యాసము

న్యాసాంగదేవతాః (6)
హృదయదేవీ, శిరోదేవీ, శిఖాదేవీ, కవచదేవీ, నేత్రదేవీ, అస్త్రదేవీ,

(7) తిథి దేవతలు

తిథినిత్యాదేవతాః (16)
కామేశ్వరీ, భగమాలినీ, నిత్యక్లిన్నే, భేరుండే, వహ్నివాసినీ, మహావజ్రేశ్వరీ, శివదూతీ, త్వరితే, కులసుందరీ, నిత్యే, నీలపతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలినీ, చిత్రే, మహానిత్యే,

(8) గురుపరంపర

దివ్యౌఘగురవః (7)
పరమేశ్వర, పరమేశ్వరీ, మిత్రేశమయీ, ఉడ్డీశమయీ, చర్యానాథమయీ, లోపాముద్రమయీ, అగస్త్యమయీ,

సిద్ధౌఘగురవః (4)
కాలతాపశమయీ, ధర్మాచార్యమయీ, ముక్తకేశీశ్వరమయీ, దీపకలానాథమయీ,

మానవౌఘగురవః (8)
విష్ణుదేవమయీ, ప్రభాకరదేవమయీ, తేజోదేవమయీ, మనోజదేవమయి, కళ్యాణదేవమయీ, వాసుదేవమయీ, రత్నదేవమయీ, శ్రీరామానందమయీ, ఇక్కడ మన ఉపదేశ గురు, (స్వగురు) ఆయన గురువుగారి పేరు (పరమ గురు) పరమ గురువు గారి గురువుగారి పేరు (పరమేష్ఠి గురువు).

(9) ప్రథమ ఆవరణ -- భూపుర త్రయం

శ్రీచక్ర ప్రథమావరణదేవతా

ముందు అష్ట సిద్ధులు.

అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వశిత్వసిద్ధే, ప్రాకామ్యస

ిద్ధే, భుక్తిసిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే, సర్వకామసిద్ధే,

దేవతలు

బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారి, వైష్ణవీ, వారాహీ, మాహేంద్రీ, చాముండే, మహాలక్ష్మీ,

దశ ముద్రలు

 సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణీ, సర్వాకర్షిణీ, సర్వవశంకరీ, సర్వోన్మాదినీ, సర్వమహాంకుశే, సర్వఖేచరీ, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే, త్రైలోక్యమోహన చక్రస్వామినీ, ప్రకటయోగినీ,

(10) ద్వితియావరణ -- షోడశ (16) దళ పద్మమములు.

శ్రీచక్ర ద్వితీయావరణదేవతాః
కామాకర్షిణీ, బుద్ధ్యాకర్షిణీ, అహంకారాకర్షిణీ, శబ్దాకర్షిణీ, స్పర్శాకర్షిణీ, రూపాకర్షిణీ, రసాకర్షిణీ, గంధాకర్షిణీ, చిత్తాకర్షిణీ, ధైర్యాకర్షిణీ, స్మృత్యాకర్షిణీ, నామాకర్షిణీ, బీజాకర్షిణీ, ఆత్మాకర్షిణీ, అమృతాకర్షిణీ, శరీరాకర్షిణీ, సర్వాశాపరిపూరక చక్రస్వామినీ, గుప్తయోగినీ,

(11) త్రితీయ ఆవరణ -- అష్ట దళ పద్మము

శ్రీచక్ర తృతీయావరణదేవతాః
అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగమదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగినీ, అనంగాంకుశే, అనంగమాలినీ, సర్వసంక్షోభణచక్రస్వామినీ, గుప్తతరయోగినీ,

(12) చతుర్ద ఆవరణ -- చతుర్దశ కోణాలు

శ్రీచక్ర చతుర్థావరణదేవతాః
సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావినీ, సర్వాకర్షిణీ, సర్వహ్లాదినీ, సర్వసమ్మోహినీ, సర్వస్తంభినీ, సర్వజృంభిణీ, సర్వవశంకరీ, సర్వరంజనీ, సర్వోన్మాదినీ, సర్వార్థసాధికే, సర్వసంపత్తిపూరిణీ, సర్వమంత్రమయీ, సర్వద్వంద్వక్షయంకరీ, సర్వసౌభాగ్యదాయక చక్రస్వామినీ, సంప్రదాయయోగినీ,

(13) పంచమ ఆవరణ -- భహిర్ దశారం

శ్రీచక్ర పంచమావరణదేవతాః
సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరీ, సర్వమంగళకారిణీ, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచనీ, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణీ, సర్వాంగసుందరీ, సర్వసౌభాగ్యదాయినీ, సర్వార్థసాధక చక్రస్వామినీ, కులోత్తీర్ణయోగినీ,

(14) షష్టావరణ -- అంతర్ దశారం

శ్రీచక్ర షష్టావరణదేవతాః
సర్వఙ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయినీ, సర్వఙ్ఞానమయీ, సర్వవ్యాధివినాశినీ, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణీ, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకరచక్రస్వామినీ, నిగర్భయోగినీ,

(15) సప్తమావరణ -- అష్టదళ  కోణం.

శ్రీచక్ర సప్తమావరణదేవతాః
వశినీ, కామేశ్వరీ, మోదినీ, విమలే, అరుణే, జయినీ, సర్వేశ్వరీ, కౌళిని, సర్వరోగహరచక్రస్వామినీ, రహస్యయోగినీ,

(16) అష్టమ ఆవరణ -- త్రికోణం

శ్రీచక్ర అష్టమావరణదేవతాః
బాణినీ, చాపినీ, పాశినీ, అంకుశినీ, మహాకామేశ్వరీ, మహావజ్రేశ్వరీ, మహాభగమాలినీ, సర్వసిద్ధిప్రదచక్రస్వామినీ, అతిరహస్యయోగినీ,

(17) నవమ ఆవరణము -- బిందు

శ్రీచక్ర నవమావరణదేవతాః
శ్రీ శ్రీ మహాభట్టారికే, సర్వానందమయచక్రస్వామినీ, పరాపరరహస్యయోగినీ,

(18) నవావరణ దేవి నామాలు

నవచక్రేశ్వరీ నామాని
త్రిపురే, త్రిపురేశీ, త్రిపురసుందరీ, త్రిపురవాసినీ, త్రిపురాశ్రీః, త్రిపురమాలినీ, త్రిపురసిద్ధే, త్రిపురాంబా, మహాత్రిపురసుందరీ,

(19) నవావరణ దేవి నామ నమస్కారాలు

శ్రీదేవీ విశేషణాని – నమస్కారనవాక్షరీచ
మహామహేశ్వరీ, మహామహారాఙ్ఞీ, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాఙ్ఞప్తే, మహామహానందే, మహామహాస్కంధే, మహామహాశయే, మహామహా శ్రీచక్రనగరసామ్రాఙ్ఞీ, నమస్తే నమస్తే నమస్తే నమః |

(20) ఫలశ్రుతిః
ఏషా విద్యా మహాసిద్ధిదాయినీ స్మృతిమాత్రతః
అగ్నివాతమహాక్షోభే రాజారాష్ట్రస్యవిప్లవే ||
లుంఠనే తస్కరభయే సంగ్రామే సలిలప్లవే |
సముద్రయానవిక్షోభే భూతప్రేతాదికే భయే ||
అపస్మారజ్వరవ్యాధిమృత్యుక్షామాదిజేభయే |
శాకినీ పూతనాయక్షరక్షఃకూష్మాండజే భయే ||
మిత్రభేదే గ్రహభయే వ్యసనేష్వాభిచారికే |
అన్యేష్వపి చ దోషేషు మాలామంత్రం స్మరేన్నరః
తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్తస్థితేనవై |
అష్టాదశమహాద్వీపసమ్రాడ్భోక్తాభవిష్యతి ||
సర్వోపద్రవనిర్ముక్తస్సాక్షాచ్ఛివమయోభవేత్ |
ఆపత్కాలే నిత్యపూజాం విస్తారాత్కర్తుమారభేత్ ||
ఏకవారం జపధ్యానమ్ సర్వపూజాఫలం లభేత్
నవావరణదేవీనాం లలితాయా మహౌజనః ||
ఏకత్ర గణనారూపో వేదవేదాంగగోచరః |
సర్వాగమరహస్యార్థః స్మరణాత్పాపనాశినీ ||
లలితాయామహేశాన్యా మాలా విద్యా మహీయసీ |
నరవశ్యం నరేంద్రాణాం వశ్యం నారీవశంకరమ్ ||
అణిమాదిగుణైశ్వర్యం రంజనం పాపభంజనమ్
తత్తదావరణస్థాయి దేవతాబృందమంత్రకమ్ ||
మాలామంత్రం పరం గుహ్యం పరం ధామ ప్రకీర్తితమ్ |
శక్తిమాలా పంచధాస్యాచ్ఛివమాలా చ తాదృశీ
తస్మాద్గోప్యతరాద్గోప్యం రహస్యం భుక్తిముక్తిదమ్ ||

 ఇతి శ్రీ వామకేశ్వరతంత్రే ఉమామహేశ్వరసంవాదే దేవీఖడ్గమాలాస్తోత్రరత్నం సమాప్తమ్ ||

Thursday, August 23, 2018

రాఖీ పౌర్ణమి  విశిష్టత మరియు చరిత్ర 

హిందు సాంప్రదాయం ప్రకారం, శ్రావణమాసంలో రాఖీ-పౌర్ణమి జరుపుకుంటారు.ఉత్తర భారదేశంలో రాఖీ-పౌర్ణమిని రక్షాబంధన్ గా పేర్కొంటారు.సోదరి తన సోదరుడికి పూర్తి సంవత్సరం విజయం చేకూరాలని రాఖీ కడుతుంది.రాఖీ కట్టిన సోదరికి జీవితాంతం రక్షగా ఉంటానని సోదరుడు భావించే పండుగ.

శ్రావణమాసంలో వచ్చే పూర్ణిమను "శ్రావణ పూర్ణిమ లేక జంధ్యాల పూర్ణిమ" అంటారు. దీన్నే రాఖీ లేఖ రక్షాబంధన్ పండుగగా కూడా పిలుస్తూ ఉంటారు. అన్నాచెలెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో వైభవంగా జరుపుకునే ఈ పండుగను ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.


ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే ఈ పండుగ రోజున జంధ్యాలు ధరించే వారు నూతన జంధ్యాలు ధరిస్తారు. ఇదే రోజున బ్రాహ్మణులు నూతన యజ్ఞోపవీతధారణలు చేసి విద్యార్థులకు వేద పఠనం ప్రారంభిస్తారు. వేదపండితులు వేదాలను వల్లెవేయడం అంటే.. ఆ వృత్తిని ప్రారంభించడం, ప్రారంభఋక్కును - చివరిఋక్కును ఇదే రోజున పఠించడం చేస్తారు.


ఈ విధంగా కాలక్రమంలో "రక్షాబంధన్ లేక రాఖీ" పండుగగా ప్రాచుర్యం పొందిన శ్రావణ పూర్ణిమ నాడు ఈ దిగువ మంత్రాన్ని పఠిస్తూ సోదరి - సోదరునకు, భార్య - భర్తకు ఈ రక్షాబంధన కడుతువుంటారు. పూర్వం యుద్ధానికి వెళ్ళే వీరునికి విజయం ప్రాప్తించాలని ఆశిస్తూ ఈ రక్షాబంధనను కట్టే వారని పురాణాలు చెబుతున్నాయి.


"యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః|

తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల||"


రాఖీ వెనుక ఎంత చరిత్రో..


దేవేంద్రుడి - వృత్తాసురుడనే రాక్షసునితో యుద్ధం:

పూర్వం దేవతలకు, రాక్షసుల కు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై, తన పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరుల ను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షాను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం.. నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి.


ద్రౌపది -శ్రీకృష్ణుని బంధం:

ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది, శ్రీకృష్ణుడికి అన్నా చెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు.


మహావిష్ణువు - బలిచక్రవర్తి:

ఓసారి రాక్షస రాజైన బలి చక్రవర్తి భూమిని ఆక్రమిస్తాడు. దానవుల నుంచి మనుషులను కాపాడటానికి విష్ణుమూర్తి వైకుంఠాన్ని, లక్ష్మీదేవిని వదిలి భూమి మీదకి వస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షస రాజైన బలి చక్రవర్తి దగ్గరికి వెళుతుంది. శ్రావణపౌర్ణమి రోజు బలి చక్రవర్తికి పవిత్రదారాన్ని చేతికి కట్టి, తానెవరో చెపుతుంది. తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుంది. అప్పుడు బలి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి, మనుషులకు విముక్తి కలిగిస్తాడు. విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్లమని కోరతాడు.


అలెగ్జాండర్‌ భార్య – పురుషోత్తముడి కథ:

చరిత్రపుటల్లో అలెగ్జాండర్‌ భార్య ‘రోక్సానా’ తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. జగజ్జేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్‌ క్రీస్తు పూర్వం 326లో భారత దేశంపై దండెత్తుతాడు. ఆ క్రమంలో బాక్ట్రియా (నేటి ఆఫగానిస్థాన్)కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆమె వివాహసంబంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశాలను, ముఖ్యంగా జీలం, చినాబ్‌ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్‌ ఆలోచన. అలెగ్జాండర్‌ యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి శత్రు రాజు అంబి, అలెగ్జాండర్‌ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే అలెగ్జాండర్‌ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన సోదరుడిని చంపవద్దని తన భర్త అయిన అలెగ్జాండర్‌ను కోరుతుంది. దీంతో అలెగ్జాండర్‌ యుద్ధం విరమించుకుంటాడు



ఇలా ఎన్నో కధలు గాధలు ఈ రాఖీ పండుగ గుంరించి చెప్పుకుంటారు . ఇది ఒక నమ్మకము తోనూ , ప్రేమతోనూ , అనుబంధముతోనూ కూడుకున్న ఆచారము .

దత్తాత్రేయ స్వామి చరిత్ర :.....

 ॐ ఓం నమః శివాయ ॐ

హిందువులు త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరు ల అవతారమైన దైవ స్వరూపుడిగా గుర్తిస్తున్నారు. దత్తా అనే పదానికి "సమర్పించిన" అనే అర్థముంది, త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము "సమర్పించుకున్నారు" కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు "ఆత్రేయ" అయింది.

ఉత్తరాది సాంప్రదాయంలో, దత్తాత్రేయను ఒక అవతారంగా లేదా శివుడి అవతారంగా, మరియు నాథ యొక్క అధినాథ్ సంప్రదాయానికి సంబంధించిన ఆది-గురు (ఆది గురువు)గా గుర్తిస్తున్నారు. దత్తాత్రేయ మొట్టమొదటిలో యోగదేవుడుగా తాంత్రిక లక్షణాలను ప్రదర్శిస్తూ వచ్చినప్పటికీ, తర్వాత అతడు మరింత భక్తి (సంస్కృతం: భక్తి) కి సంబంధించిన వైష్ణవ పూజావిధానాలను పుణికి పుచ్చుకుని, సంలీనమయ్యాడు; ఇతడు ఇప్పటికీ కోట్లాది హిందువుల చేత పూజింపబడుతూనే, భారతీయ చింతనలో అత్యున్నత సారాంశమైన గురువు కంటే ఎక్కువగా కృపాస్వభావం కలిగిన దేవుడిగా గుర్తించబడుతున్నాడు. దత్తాత్రేయుడు త్రిపుర రహస్య గ్రంథకర్తగా పేరు పొందాడు, అద్వైత వేదాంతాన్ని విశదీకరించిన ఈ గ్రంథాన్ని పరశురాముడికి అంకితం చేశాడు.

మసక చీకటిలో త్రాడును చూచి పామని భ్రమించి భయపడతాము. కాని తర్వాత దీపం సహాయంతో అది తాడని తెలియగానే ఆ భ్రాంతి, భయము తోలుగుతాయి. అలానే వాస్తవానికి బ్రహ్మమనబడు పరమాత్మా ఒక్కడే ఉన్నాడు. అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము, ఆశ, దుఃఖము కల్గుతాయి. ఆత్మజ్ఞానమనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము, ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవమవుతుంది. అపుడు భయానికి, దుఃఖానికి కారణమైన జగత్తున్నదనే భ్రాంతి తొలుగుతుంది. అంటే ఈ జగత్తు మిధ్యయని తేలిపోతుంది. సర్వత్రా నిండియున్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్త్వం. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయ పూర్వక నమస్కారము. ఆ పరబ్రహ్మమే సత్యమైనది. అజ్ఞానం వలన దుఃఖంలో మ్రగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్త్వాన్ని బోధించడానికి అత్రైమహాముని పుత్రుడై జన్మించి, శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందాడు. భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు, యదువు మొ||న వారిని ఈ సంసారమనే దుఃఖసాగరం నుండి ఉద్దరించాడు. ఆయననే మరల శ్రీ పాదవల్లభుడుగాను, తరువాత శ్రీ నృసింహసరస్వతియనే పేరుతోనూ అవతరించి, తన శిష్యులైన సిద్దాదులనుద్దరించాడు.

పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడు అనేరాజు నిరంతరము హరి చింతన, అతిథి సేవలతోపాటు నిష్టతో ఏకాదశి వ్రతము ఆచరించేవాడు. ఒకరోజు ద్వాదశీ తిథి ఒక్క ఘడియ మాత్రమె ఉండగా. దుర్వాస మహర్షి, శిష్యప్రశిష్యులతో కలిసి అతని వద్దకొచ్చారు. అంబరీషుడు ఆయనను పూజించి, త్వరగా అనుష్టానం పూర్తి చేసుకొని భోజనానికి రమ్మని ప్రార్ధించాడు. అపుడా మహర్షి, స్నానానికి నదికి వెళ్లి పారణ సమయం మీరిపోతున్నాగాని రాకుండా ఆలస్యం చేయసాగారు. తిథిమించి పొతే అంబరీషునికి వ్రతభంగమవుతుంది. అలాగని అతడు భోజనం చేస్తే, అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుంది. అందుకని అతడు ఆ రెండింటిని పరిరక్షించుకోదలచి ,కొదద్ది తీర్థం మాత్రం త్రాగాడు. ఇంతలో దుర్వాసుడోచ్చి కోపించి, ‘రాజా, నీవు నానాయోనులలో జన్మింతువు గాక!’ అని శపించాడు. అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణువేడాడు. అపుడాయన సాక్షాత్కరించి దుర్వాసునితో,’మహర్షీ, నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు. అతనిని రక్షించడం నా ధర్మం. అయినా మహర్షులైన మీ శాపం వ్యర్దం కాకూడదు కనుక, ఆ శాపాన్ని నాకు వర్తిమ్పాజేయి’ అన్నారు. అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలచి సంతోషించి దుర్వాషుడుసరే అన్నాడు. స్వామీ అంతా మీ అభీష్టం ప్రకారమే కానీ అన్నాడు. ఆ విధంగా శ్రీహరి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు.

దత్తాత్రేయుని జననం : ....
దేవహుతి మరియు కర్ధముని కుమార్తె అనసూయ . అనసూయాదేవి అత్రిమహర్షికి భార్యయై, మహా పతివ్రతగా ప్రసిద్దికెక్కింది. ఒకసారి త్రిలోక సంచారియైన నారదమహర్షి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నివాసాలకు వెళ్లి, అక్కడ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని గురించి యెంతగానో ప్రశంశించాడు. అప్పుడు త్రిమూర్తుల భార్యలు అసూయచెంది, ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్భందించారు. అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అతిమహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. అనసూయదేవి వారికి యెదురేగి స్వాగతం చెప్పి, ఆర్ఘ్య – పాదాదులు సమర్పించి, మీకు నేనేమి చేయాలో సెలవియ్యండి. అత్రి మహర్షి తపస్సుకోసం అరణ్యంలోకి వెళ్లారు. అపుడు అతిథులు ‘అమ్మా! మాకెంతో ఆకలిగా ఉంది, నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేము గదా? మాకు వెంటనే భోజనం పెట్టు’ అన్నారు. ఆమె లోపలకు వెళ్లి విస్తర్లు వేసి, అయ్యలారా! భోజనానికి దయజేయండి. అని ప్రార్ధించింది. అపుడు వారు ‘సాధ్వీ, మాదొక షరతు ఉన్నది. నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాము. లేకుంటే యిలా ఆకలితోనే వెళ్లిపోతాము’ అన్నారు.

వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రిమహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది. అంతేగాక, ఆకలితో తిరిగిపోయిన అతిథి, గృహస్థుల పుణ్యాన్ని, తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం. కాని పరపురుషుల యెదుటకు నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగమవుతుంది! పరస్పర విరుద్దమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకోజూచిన అతిథులు సామాన్యులు కారని ఆమె వెంటనే గ్రహించింది. వారి విచిత్రమిన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకుంది. అయ్యలారా అలానే చేస్తాను, భోజనానికి లేవండి! అని చెప్పి ఆశ్రమం లోపలకు వెళ్లి, అత్రిమహర్షి పాదుకలతో, స్వామి, ‘నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను.’ అని చెప్పుకొన్నది. ఆమెయొక్క పాతివ్రత్య మహిమాన్వితమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి వెళ్లేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు. ఆమె భావాన్ననుసరించి ఆమెకు బాలింతరాలకు వలె స్తన్యమొచ్చింది.ఆమె ఆ వెంటనే వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు పాలిచ్చింది. ఆ మహా పతివ్రత తన దివ్యద్రుష్టివలన వారు త్రిమూర్తులు అని తెలుసుకొని ఊయాలలో పెట్టి, ఆ జరిగిన కథనే జోలగా పాడుచున్నది.

ఇంతలో అత్రి మహర్షి వచ్చి,ఆమె నుండి సర్వము తెలిసికొని ఊయలలొని త్రిమూర్తులను దర్శించి, ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను యిలా స్తుతించాడు. ‘ఓ మహావిష్ణు! ఈవు సృష్టి-స్థితి-లయ కారణుడవు. జగత్సాక్షివి, విశ్వమయుడవు. విశ్వాధరుడవు. ఓ పరమేశ్వర! నీవు సహజంగా ఒక్కడవే అయినా నీ లీలచేత త్రిమూర్తులుగా మారి క్రేడిస్తున్నావు. వాస్తవానికి ఈ జగత్తు నీ కంటే వేరుగాకపోయిన, మసక చీకటిలోని త్రాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్లు , ‘నేను-నాది’ అనే మాయతో గూడిన భావన వలన నీకంటె వేరైనట్లు జీవులకు గోచరిస్తున్నది.

ఊయలలొని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు. త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తిచెంది, తమ నిజరూపాలతో ప్రత్యక్షమై. వరం కోరుకోమన్నారు. అప్పుడు అత్రి మహర్షి భార్యవైపు చూస్తూ ‘సాధ్వీ, వీరు మనస్సు చేతగూడ పొందడానికి వీలుగానివారు. అయినా నీ భక్తీ వలన ఇలా వచ్చారు. నీ అభీస్టమేమిటో నివేదించుకో అన్నాడు.’ అప్పుడు అనసూయాదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడడ్డారు. కనుక ఈ మూడు మూర్తులగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది, మీ అవతారకార్యం నేరవేర్చుకోవడమే నా అభీష్టము అన్నది. అత్రిమహర్షి సంతోషించి , మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్ముద్దరించండి.అని కోరాడు. అపుడు వారు మహర్షీ మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము. ఆ తర్వాత అత్రి అనసూయలకు దత్తాత్రేయుడు జన్మిస్తాడు. ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడే; శ్రుతులకు గూడ అందని సచ్చిదానంద స్వరూపుడు; మానవుల అభీష్టాలు నెరవేర్చి యోగము, జ్ఞానము ప్రసాదించేవాడు.స్మరించిన తక్షనంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూఉంటాడు.

అలనాటి! దుర్వాశ శాపం వల్లనే పరమాత్మాయైన శ్రీదత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంటాడు.అసలు ఆయన అవతరించిందే అందుకు. సర్వజనోద్దరణమనే దత్తావతార కార్యం సృష్టిఉన్నంత వరకు కొనసాగాల్సిందే. కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యము భూమిపై సంచరిస్తుంటాడు. శ్రీ దత్తాత్రేయుడే ఆది గురువు.

భరద్వాజ మహర్షి

వేదాలను అర్ధం చేసుకోవడానికి తన జీవితకాలాన్ని వెచ్చించినవాడు భరద్వాజమహర్షి. ఆయన దేవతల గురువైన బృహస్పతి కుమారుడు.  బృహస్పతి,  ఆంగీరస మహర్షి కుమారుడు. భరద్వాజుని కుమారుడే కురుపాండవులకు గురువు అయిన ద్రోణాచార్యుడు.   భరద్వాజునికి ఘృతాచి అనే అప్సరస వలన జన్మించినవాడు ద్రోణాచార్యుడు.  భరద్వాజుడు  సుశీల అనే భార్య ద్వారా గర్గ మహామునికి  జన్మనిచ్చాడు.   భరద్వాజునికి దేవవర్ణిని,  అనే కుమార్తె  కూడా  వున్నది.   

 భరద్వాజుడు తండ్రి నుండి అపారమైన పాండిత్యం సంపాదించినవాడు.  ఏకాగ్రతతో తనకు కావలసిన విద్యను నేర్చుకోవడంలో ఆయన దిట్ట.  ఆయుర్వేదాన్ని లోకానికి పరిచయం చేసినవాడు భరద్వాజుడు.  వాల్మీకి, బోయవాడు క్రొంచ పక్షిని బాణంతో కొట్టినప్పుడు, చెప్పిన , రామాయణ ప్రారంభ శ్లోకం సమయంలో, భరద్వాజుడు అక్కడ ప్రత్యక్ష సాక్షి.

మహర్షి  కఠోర వేదపాండిత్య గ్రహణాభిలాష  ఒకప్పుడు ఇంద్రుడిని యిబ్బంది పెటింది.   భరద్వాజునికి వేదాలన్నీ తన జీవితకాలంలో అవపోశన పట్టాలని తీరనికోర్కె యేర్పడింది.  తన జీవితకాలం నూరు సంవత్సరాలని తెలుసు.  ఆలోపు వేదాలను అభ్యసించలేనని తెలిసి, ఇంద్రుని  ప్రార్ధించి, తనకు మూడువేదాలూ అభ్యసించడానికి,  మరియొక  నూరు సంవత్సరాలు ఆయువు ప్రసాదించమని కోరాడు.

మహర్షిలో వున్న జ్ఞానతృష్టకు ఇంద్రుడు సంతోషించి ' తధాస్తు '   అని దీవించి, మరి యొక్క నూరు సంవత్సరాలు ఆయుర్దాయం పెంచాడు.    రెండవశతాబ్ది పూర్తి అవుతున్నా, తన వేద అభ్యాసానికి అంతు కనబడలేదు.  యెంతో వ్యాకుల పడుతూ, భరద్వాజమహర్షి, ఇంద్రుని మరలా యెంతో నిష్ఠతో ప్రార్ధించి, యింకొక వంద సంవత్సరాలు ఆయుర్దాయం అడిగాడు.  ' సరే ' అన్నాడు ఇంద్రుడు.  ఆవిధంగా, భరద్వాజ మహర్షి అయిదుసార్లు తన ఆయు: ప్రమాణం, ఇంద్రుని కటాక్షం వలన పెంచుకుని,  వేదాలనన్నిటినీ చదివి, వానిలో విషయాన్నీ తెలుసుకునే  ప్రయత్నంలో పడ్డాడు.   

ఆవిధంగా అయిదువందల సంవత్సరాలు వుండి కూడా  భరద్వాజుడు వేదాల సారాన్ని గ్రహించలేకపోయాడు.  మళ్ళీ ఇంద్రుని ప్రార్ధించగా,  ఇంద్రునికి అర్ధమైంది, భరద్వాజునికి తాను దిశానిర్దేశం చెయ్యవలసిన సమయం ఆసన్నమైందని. 

భరద్వాజుడు మళ్ళీ ఆయుర్దాయం పెంచమని అడిగేలోపే,  ఇంద్రుడు భూ:  భువ: సువః     అనే మూడు శబ్దాలు వుచ్చరించి  మూడు పెద్ద పర్వతాలను భరద్వాజుని కనులముందు సృష్టించాడు.    భరద్వాజుడు తాను నేర్చుకున్న వేదాల పరిజ్ఞానం యీ విధంగా తన కనులముందు ఇంద్రుడు చూపిస్తున్నాడు అనుకుని  ఆసక్తిగా చూడసాగాడు. 

అప్పుడు ఇంద్రుడు భరద్వాజుని వైపు జాలిగా చూస్తూ,   ఆమూడు పర్వతాలనుండి, పిడికెడు  మట్టిని తీసుకువచ్చి,  ' ఓ మహర్షీ !  యీ అయిదు శతాబ్దాలుగా నీవు నేర్చుకున్న వేద విజ్ఞానం యిదిగో, యీ మట్టి పరిమాణమంతా.  నీవు నేర్చుకోవలసినది, ఆ మూడు పర్వతములంత "  అని చెప్పి, భరద్వాజుని దిగ్భ్రాంతికి గురిచేసాడు.

భరద్వాజ మహర్షికి అర్ధమయింది.  ' నేను అయిదు శతాబ్దాల నుండి వేదాలకై సాధన చేశాను కానీ, దానిని పొందడం అంత కష్టమని తెలుసుకోలేక పోయాను. ' అని పరితపించి, ఇంద్రుని శరణుకోరాడు, దారి చూపమని.  అప్పుడు ఇంద్రుడు, '   మహర్షీ !  వేద విజ్ఞానం అపరిమితం.  ఒక్క మహావిష్ణువుకే  వేదసారమంతా తెలుసు.    మనం తెలుసుకోవలసింది, వేదముల  ఉపయోగము, మానవ జీవితంలో యెంత వరకు అని. అది తెలుసుకుని ఆచరించడమే.  అన్నివేదాల పరమార్ధము ఆ శ్రీ మహావిష్ణువే.   అయన గురించి తపస్సు చెయ్యి.  ఆయనే నీకు కావలసిన లక్ష్యం నెరవేరుస్తాడు. '  అని చెప్పాడు.  అప్పుడు భరద్వాజుడు తెలుసుకున్నాడు, '  వేదాలను పూర్తిగా గ్రహించడమంటే, శ్రీహరి కైవల్యం పొందడమేనని. '

ఇంద్రుడు చెప్పిన విధంగా,  భరద్వాజుడు, శ్రీహరిని ప్రార్ధించడానికి అనువైన ప్రదేశం వెదికి, చివరకు, మట్టపల్లి అనే గ్రామం (  తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లా ) వెళ్లి, అక్కడ నిత్యమూ, కృష్ణా నదిలో స్నానం ఆచరిస్తూ,  నరసింహ స్వామిని గురించి తపస్సు చేసాడు.   భరద్వాజుని తపస్సుకు మెచ్చి, నారసింహుడు,  మహర్షికి వైకుంఠ ప్రాప్తి కలుగజేసాడు.  ఓం నమో శ్రీ లక్ష్మీ నారసింహాయ.
   
భరద్వాజ మహర్షి గురించి తెలుసుకోవలసిన విషయాలు అపారం.   ఇది విహంగ వీక్షణమే.
🙏🏻శ్రీమతే రామానుజాయనమః🙏🏻

Monday, August 20, 2018

వారణాసి కాశి వైభవం

కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం

కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ బుభాగం ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు. విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని ప్రపంచ సాంస్కృతిక నగరం
స్వయంగా శివుడు నివాసముండె నగరం

ప్రళయ కాలంలో మునుగని అతి  ప్రాచిన పట్టణం శివుడు ప్రళయ కాలంలో తన తన త్రిశూలంతో కాశీిని పైకెత్తి కాపాడతాడు.

కాశీ భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశీ పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది పద్నాలుగు భువన బాండాలలో విశేషమైన స్థలం.

కాశీలో గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యం....

ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని  కాశి లోనికి అనుమతించడు.
కాశీలో మరణించిన వారికీ యమ బాధ పునర్ జన్మ ఉండదు.

కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రాగుప్తుని నుండి మాయం అయి కాలభైరవుని వద్దకు చేరుతుంది....డిండి గణపతి కాల బైరవుడు పరిశీలించి యమ యాతన కంటే 32 రేట్లు అధిక శిక్షలు విధించి మరు జన్మ లేకుండా చేస్తాడు ...
కాబట్టే కాశీలో  కాల భైరవ దర్శనం తరవాత పూజారులు వీపు పై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్లి పోయినా పాపాలు అంటకుండా రక్ష నల్లని కాశి దారం కడతారు.

కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు తపస్సులు చేసిన పుణ్యం తో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి.

కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు.

అందుకే కాశ్యాన్తు మరణాన్ ముక్తి అని శాస్త్ర వచనం కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీపూరిలో గడుపుతారు.

మరణించిన వారి ఆస్తికలు కాశి గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా  విశ్వనాథునిచే ఉద్దరింప బడతారు.

గోముకం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశి పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశి ఘాట్లను వదిలి దూరం జరగలేదు.

శివుని కాశిలోని కొన్ని వింతలు...

కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.

కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తొవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ  జాడ దొరకకుండా ఉంటుంది.

కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు పూలచెట్లు మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు.

అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్య పోయ్యారు. అస్సలు ఇ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి 
అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు అంత పరిజ్ఞ్యానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.

కాశి విషవేశ్వరునికి శవ భస్మ లేపనం తో పూజ ప్రారంభిస్తారు .

కాశిలోని పరాన్న బుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లబిస్తుంది.

కాశి క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రేట్లు ఫలితం ఉంటుంది, పాపం చేసినా కోటి రేట్ల పాపం అంటుతుంది.

విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.

ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు
జగత్అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి.

ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశిలోనే వున్నది.

కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి..

 ఇందులో దేవతలు,ఋషులు,రాజులూ, తో పాటు ఎందరో తమ తపశక్తితో నిర్మించిన వి ఎన్నో వున్నాయి. అందులో కొన్ని:

1) దశాశ్వమేధఘాట్ బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే రోజు సాయకాలం విశేషమైన గంగామా హారతి జరుగుతున్నది.

2) ప్రయాగ్ ఘాట్ ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి.

3) సోమేశ్వర్ ఘాట్ చంద్రుడు చేత నిర్మితమైనది.

4) మీర్ ఘాట్ సతి దేవీ కన్ను పడిన స్థలం విశాలాక్షి దేవి శక్తి పీఠం.
ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.

5) నేపాలీ ఘాట్ పశుపతి నాథ్ మందిరం బంగారు కళశంతో నేపాల్ రాజులూ కట్టినాడు.

6) మణి కర్ణికా ఘాట్ ఇది కాశీలో మొట్ట మొదటిది దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రం తో  తవ్వి నిర్మించాడు ఇక్కడ సకల దేవతలు స్నానమ్ చేస్తారు ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపలు తొలిగి పోతాయి జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో 

తాంబూల సమర్పణం

తాంబూల సమర్పణం, సేవనం అనేది ప్రాచీన కాలం నుంచీ భారతీయుల జీవన విధానంలో భాగమైన సంప్రదాయం. పురాణాలు, రామాయణ, భారతాలతో పాటు ‘చరక సంహిత’, శ్రీనాథ మహాకవి రచనల్లోనూ తాంబూల ప్రస్తావన ఉంది. అసలు తాంబూలం ఎందుకివ్వాలి? ఎవరికివ్వాలి? ఎలా ఇవ్వాలి?

* తాంబూలంలో ప్రధానమైనది ‘తమలపాకు’. దీనికి సంస్కృతంలో ‘నాగవల్లి’ అని పేరు. క్షీరసాగర సమయంలో జనించి, స్వర్గానికి చేరి అక్కడి నుంచి భూమిపైకి వచ్చినట్లుగా కథనం. స్వర్గానికి ‘నాకం’ అని పేరు. నాకం నుంచి పుట్టింది కనుక ‘నాకవల్లీ’ అయి తర్వాత ‘నాగవల్లీ’గా మార్పు చెందింది అంటారు.
దేవుడికి చేసే షోడశోపచార పూజల్లో తాంబూల సమర్పణ ఒకటి.

* ‘‘ఫూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతామ్‌’’ అని భగవంతుడికి తాంబూలం సమర్పించాలి. భగవంతుడికి  నివేదన తర్వాత తాంబూలం సమర్పించాలి.

* భగవంతుడికి తాంబూలంలో కనీసం మూడు ఆకులు, రెండు వక్కలు, పచ్చ కర్పూరం, ముత్యపుపొడి లేదా సున్నం ఉంచి సమర్పించాలి. తమలపాకులు, వక్కలు, సున్నంతో పాటు యాలకులు, జాజికాయ, జాపత్రి, కస్తూరి, కుంకుమపువ్వు, పుదీనా, కొబ్బరి తురుము కూడా కలుపుతున్నారు. ఇవన్నీ తర్వాత్తర్వాత వచ్చిన సంప్రదాయాలు. అతిథులను దైవస్వరూపులుగా చూసే సంప్రదాయం మనది కాబట్టి వారికి కూడా ఇదే విధంగా తాంబూలం ఇవ్వాలి.

* పూర్వం ఒప్పందాలు కుదిరిన సమయంలో ఇరుపక్షాలు తాంబూలాలు మార్చుకునేవారు. యుద్ధానికి వెళ్లే ముందు సైనికాధికారులకు తాంబూలం ఇచ్చి పంపేవారు. ఇప్పటికీ వివాహాలు కుదిరిన సమయంలో నిశ్చయ తాంబూలాలు మార్చుకోవడం చూస్తుంటాం.

* వస్త్రాలు ఎవరికైనా పెట్టే సమయంలో తప్పనిసరిగా తాంబూలం ఉంచాలి.
* తాంబూలం వేసుకున్న సమయంలో మొదటగా వచ్చే రసం విషతుల్యం అనీ, రెండోది విరేచనకారి అనీ, మూడోది అమృత తుల్యమని ఆయుర్వేదం వెల్లడిస్తోంది. కనుక మొదటి రెండు మింగరాదు. మూడోది మింగాలంటారు.
* తాంబూల సేవనం జీర్ణక్రియను మెరుగుపర్చడంతో పాటు నోరు, దంతాలు, నాసిక, కంఠం, నేత్ర సంబంధ వ్యాధులు రాకుండా చూడడంతో పాటు ఎముకలు, గట్టిపడేందుకు దోహదం చేస్తుంది.
* వివిధ దేవుళ్లకు ఆకులతో పూజలు చేసినా.. శ్రీఆంజనేయుడికి తమలపాకులతో పూజ అత్యంత ప్రీతికరమైనది.

Friday, August 17, 2018

Rudram and Chamakam - Science of human DNA

"If Rudram and Chamakam are properly understood, one would know that they are not merely some sounds, syllables and meaningless intonations.

They have everything to do with the Science of human DNA, reproduction and prosperity and a prayer for the well being of all.

The following small clarifications would unfold it:

DNA and Mathematics in Sri Rudram.
In the Chamakam, in anuvakas or sections 1 to10, the devotee prays for almost everything needed for human happiness and specifies each item. But in the 11th anuvaka or 11th section of Chamakam, the devotee prays for the desired things not specifically but in terms of numbers, first in terms of odd numbers from 1 to 33 and later in multiples of 4 from 4 to 48, as follows:
“Eka cha me, thisrascha may, pancha cha may, sapta cha may, Ekadasa cha may, trayodasa cha may, panchadasa cha may, saptadasa cha may, Navadasa cha may, ek trimshatis cha may, trayovimshatis cha may, Panchavimshatis cha may, saptavimshatis cha may, navavimshatis cha may, Ekatrimshatis cha may, trayatrimshatis cha may, panchatrimshatis cha may, Chatasras cha may, ashtou cha may, dwadasa cha may, shodasa cha may, Vimsatis cha may, chaturvimshatis cha may, ashtavimshatis cha may, Dwathrimashatis cha may, shatstrimshas cha may, chatvarimshas cha may, Chatuschatvarimshas cha may, ashtachatvarimshas cha may”
which means:
“Let these be granted to me. One, three, five, seven, nine, eleven, thirteen, seventeen, nineteen, twenty one, twenty three, twenty five, twenty seven, twenty nine, thirty one and thirty three as also four, eight, twelve, sixteen, twenty, twenty four, twenty eight, thirty two, thirty six, forty, forty four and forty eight”.
Traditional scholars and pandits explain the significance of these numbers as follows:
ODD NUMBERS:
1 = Nature or Prakriti
3 = The three gunas, namely sattwa, rajas and tamas
5 = The five mahabhutas, or the five basic elements, that is, prithvi, ap, tejas, vayu and akasha, (earth, water, energy or agni or fire, wind and space).
7 = The five sensory organs and the mind and intellect
9 = The nine openings in the human body, called the navadwaras.
11 = The ten pranas and the Sushumna nadi
13 = Thirteen Devas
15 = The nadis or nerve centres in the human body
17 = The limbs of the human body
19 = Medicinal herbs
21 = Important vulnerable parts of the body
23 = Devas controlling serious diseases
25 = Apsaras in heaven
27 = Gandharvas
29 = Vidyut Devas
31 = Worlds
33 = Devas
MULTIPLES OF FOUR:
4 = The four ideals of human life, namely dharma, artha, kama and moksha,
(righteous way of life, wealth, desire, and salvation)
8 = The four Vedas and the four upavedas
12 = Six vedangas and six shastras.
16 = Knowledge to be obtained from God
20 = The Mahabhutas
24 = The number of letters in the Gayatri mantra.
28 = The number of letters in the Ushnik mantra.
32 = The number of letters in the Anushtup mantra.
36 = The number of letters in the Brihati mantra.
40 = The number of letters in the Pankti mantra.
44 = The number of letters in the Trushtup mantra
48 = The number of letters in the Jagati mantra
According to Dr Sasidharan, these numbers represent a polymer chain of molecules that form apa or water that enables evolution of life and intelligence, and apa is nothing but the nitrogenous base pairs of the DNA. The numbers 1 to 33 represent the 33000 base pairs of mitochondrial base pairs of DNA. The numbers 4 to 48 represent the 48 million nuclear bases of DNA. The two sets of DNA bases combine to provide sustenance of human wellbeing and onward evolution of human life. When the devotee prays for the blessing of these numbers, actually he is praying for bestowing on him all these DNA bases which conduce to sustenance of human wellbeing and happiness."

Wednesday, August 15, 2018

నాగపంచమి పండుగ విశిష్టత - పూజావిధానం

శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం హిందువుల ఆచారం. ఈ రోజున పాలు, మిరియాలు, పూలతో నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి, చెక్క మొదలైన చేసిన నాగ పడిగెలకు భక్తులు ఆరాధిస్తుంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడే "నాగపంచమి"నాడు భక్తులు ఆచరించాల్సిన విధులను పార్వతీ దేవికి వివరించినట్లుగా స్కాందపురాణం చెబుతోంది.

పూజావిధానం

పంచమి రోజున నాగప్రతిమకు పంచామృతము, జాజి, సంపెంగ, గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి, పాయసము నివేదించాలని ముక్కంటి. పార్వతికి వివరించినట్లు ఆ పురాణం పేర్కొంటుంది.అందుచేత నాగపంచమి రోజున సూర్యోదయమునకు ముందే ఐదు గంటలకే లేవాలి. శుచిగా తలస్నానము చేసి, ఎరుపురంగు బట్టలు ధరించాలి. పూజామందిరమును, ఇల్లును శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమ, గుమ్మాన్ని తోరణాలతో అలంకరించుకోవాలి. పూజామందిరము, ఇంటిముందు ముగ్గులు పెట్టాలి.పూజ కొరకు గంధము, కుంకుమ, ఎరుపు వస్త్రము, నాగేంద్ర స్వామి, పాముపడగ, తెల్లని అక్షింతలు, ఎర్రటి పువ్వులు (కనకాంబరాలు), మందారమాలతో పాటు నైవేద్యం కోసం చలిమిడి, చిన్న చిన్న ఉండ్రాళ్లు, వడపప్పు, అరటిపండ్లను సిద్ధం చేసుకోవాలి. అంతేగాకుండా రెండు ఎర్రటి మట్టి ప్రమిదలను తీసుకుని దూదితో 7 వత్తులలో నేతితో దీపం వెలిగించాలి.నాగపంచమి రోజున ఉదయం 9 గంటల లోపు పూజను పూర్తి చేయాలి. పూజ చేసే సమయంలో నుదుట కుంకుమను ధరించి, పడమర దిక్కున తిరిగి పూజించాలి. "ఓం నాగరాజాయనమః" అనే మంత్రమును 108 మార్లు జపించి, పూజకు సిద్ధం చేసుకున్న నాగప్రతిమ లేదా నాగేంద్ర స్వామి చిత్రపటమునకు కర్పూర హారతులిచ్చి, నైవేద్యం సమర్పించుకోవాలి.కర్పూర హారతులిచ్చేందుకు ముందు నాగ అష్టోత్తరము, నాగ స్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామములలో ఏదైనా ఒక దానితో నాగేంద్ర స్వామిని ప్రార్థించవచ్చు. ఇంకా నాగపంచమి రోజున ఇంటికి వచ్చే ముత్తైదువులకు నాగేంద్ర నిత్యపూజ, నాగదోష-పరిహారము వంటి పుస్తకములను తాంబూలము, పసుపు, కుంకుమలతో కలిపి ఇస్తే పుణ్య ఫలం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.

శ్రావణ శుక్ల పంచమి ఉదయమే తలస్నానము చేసి, ద్వారమునకిరువైపులా ఆవుపేడతో అలికి, పసుపు, బియ్యం పిండితో, ముగ్గులు వేసి, పసుపుతోకాని, అవుపేడతో కాని, బియ్యం పిండితో కాని నాగ చిత్రములు వేసి, ఆవుపాలు, వడపప్పు నైవేద్యము పెట్టవలెను. ఇలా చేసిన యింటిలోని వారు నాగదోషములు, అకాల మృత్యువు నుండి కాపాడబడి, పిల్లలకి, కళ్ళు, చెవులు, మూగ దోషములు పోవును. ఆయిల్లు పసిపాపలతో కళ కళ లాడుతుండును. చతుర్ధి నాడు ఉపవాసము ఉండి, పంచమినాడు ఐదు తలల పాము చిత్రములువేసి అనంతాది నాగ రాజులను లాజలు, పంచామృతము, గన్నేరు, సంపెంగ, జాజి పూలతో పూజించి ఏమి తరగకుండా, వండకుండా ఉన్న సాత్విక ఆహారము, పెసలు, చిమ్మిరి, చలిమిడి, పాలు నైవేద్యము చేసి, అవి సేవించి, ఉపవాసము చేయవలెనని నియమము. ఆడువారు, పిల్లలు, కన్నెలు, పుట్ట వద్దకు వెళ్లి అలంకరించి, యగ్నోపవీతములు, వస్త్రములు సమర్పించి పాలు పోసి, పూజలు చేయుదురు. పిల్లలు లేనివారు పుట్టకి, రావి చెట్టు మొదలు ప్రతిష్ఠించబడిన ప్రతిమలకి ప్రదక్షిణములు చేయవలెను. ఆమట్టిని పోత్తి కడుపుకి రాసుకొందురు. కొన్ని ప్రదేశాలలో కొబ్బరి చిప్పలకి రంగులు వేసి దారాలు కట్టి త్రిప్పుట ఆచారము. దీనిని గురించి కొన్ని కథలు కూడా ప్రచారములో ఉన్నాయి.

విశ్వాసం

అలాగే నాగపంచమి నాడు పుట్టలకు పూజ చేయించడం, పాలు పోయడం వంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు అంటున్నారు. దేవాలయములో నాగా అష్టోత్తరములు, పంచామృతములతో అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు చేయిస్తే సకల భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం.

చలి చీమ నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు, రాయి - రప్ప, చెట్టు -చేమ, వాగు-వరద, నీరు -నిప్పు, అన్నిటా అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కుతి హిందువులది . హిడువుల దృష్టిలో పాము కుడా పరమాత్మ స్వరూపమే . వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పానువు . వాసుకి పమేస్వరుడి కంఠాభరణం. వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడు . ఈ విధంగా బ్రాహ్మణులూ, ఋషులు, మునులు ... మానవజాతిని నమ్మించి సన్మార్గములో పయనించేటట్లు చేసారు .

నాగ జాతికి బ్రహ్మదేవుని శాపం

కశ్యప ప్రజాపతికి, కద్రువ దంపతులకు అనంతుడు, తక్షకుడు, వాసుకి, ననినాగుడు, శంఖుడు, కర్కోటకుడు, ఉగ్రకుడు పిందారకుడు, హహుషుడు, ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా కాటువేస్తూ భయభ్రాంతులను చేయసాగారు . దేవతలు అందరూ బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు . అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై " మమ్మల్ని మీరే సృష్టించి మాకీ విధంగా శాపమివ్వడం న్యాయమా " అని వేడుకున్నారు . "విషయుక్తం గా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణికోటిని నశింప జేయడం తప్పు కదా ! నిష్కారణం గా ఏ ప్రాణినీ హింసించరాదు . గరుడ మంత్రం చదివే వారిని , ఔషధ మని సమేతులను తప్పించుకు తిరగండి .దేవతా విహంగ గణాలకు , జ్ఞాతులైన మీరు మీమీ స్థాన గౌరవాలను నిలిపుకోండి . వాయుభాక్షకులై సాదుజీవులు గా మారండి . మీ నాగులంతా అతల వితల పాతాళలలో నివాసం చేయండి" అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు .తరువాత దేవవగణమంతా నాగులను ప్రశంసించారు . భూలోక వాసులంతా ప్రార్థనలు చేశారు నాగులకు . దివ్య ప్రభావ సంపన్నమయిన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకంగా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజచేయడం ఆరంభించారు .వైదిక కాలం నుండి కార్తీక మాసం ఐదవ రోజు పంచమి ఉత్సవాలు జరుపుకునే సంప్రదాయం దేశమంతా ఉంది . పుట్టలో ఆవుపాలు, వడపప్పు, చలిమిడి, అరటిపండ్లు, కోడి గ్రుడ్లు జారవిడిచి నైవేద్యంగా సమర్పిస్తారు .

నాగపంచమి

పార్వతీ దేవికి పరమేశ్వరుడు చెప్పినట్లుగా పురాణాలులో వివరించబడింది .ఓ పార్వతీ దేవి శ్రావణ మాస శుక్ల పంచమినాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగపంచమినాడు ద్వారానికి ఇరువైపులా సర్వ చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం. చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి, కర్రతోగానీ, లేదా మట్టితోగానీ వారి వారి తాహతుని అనుసరించి ఐదు పడగల పామును చేయించాలి. లేదంటే పసుపు, చందనంతోగానీ ఏడు తలల పాము చిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాజి, సంపెంగ, గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి. పాయసము, పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణమాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం. ఇదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్లపంచమినాడు జరుపుకునే నాగ పంచమి కూడా ఈ సంప్రదాయానికి చెందినదేనని పండితులు అంటున్నారు.అందుచేత శ్రావణమాసం న వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి. నాగచతుర్థి రోజున (నాగపంచమికి ముందురోజు) ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి. గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందేలేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి.

ఇంటి గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ, పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం, సర్ప భయం తొలగిపోవడం వంటివి జరుగుతాయి.

నాగ పంచమి వ్రత కథ

పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి వుడేది ప్రతిరోజూ సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లుగా ఆమెకు కలలు వస్తుదేవి, దానితో ఆమె భయకంపితురాలైంది . ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీన గాథను విన్నారు . విని "అమ్మా " నువ్వు గతజన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు, అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణకోసం నాగపంచమి నోము నోయమని, పాముల భయం తొలగి పోతుందని చెప్పెను . ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది . నాగపంచమి వ్రత కథల్లో ఇది ఒకటి . ఈ కథ వెనుక ఒక సామాజిక మైన హితవు ఉన్నది ఇతరులకు ఎవ్వరికీ ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని తానూ పాతిస్తున్నట్లయితే వారిని పరిహసించకూడదు .. ఎవరి విశ్వాశము వారిది . ఈ నాగపూజా వెనుక యోగాపరమైన అంతరార్ధము కుడా ఉన్నది .. మన వెన్నెముకకు అడుగుభాగములో మూలాధార చక్రమున్నది . ఆ చక్రంలో కుండలినీ శక్తి ఇమిదివున్నది .. అదే నాగదేవత, ధ్యానం to ఆ కూడలిని కదిలించి సహస్రారం దాకా తీసుకొని వెళ్లి నట్లయితే మానవుడు మహానీయుదవుతాడు .. అదీ నాగశక్తి .

నాగపంచమి నోము పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక శ్రీమంతురాలు వుండేది. ధనగర్వం గాని అహంకారం గాని లేని సుగుణవతి, విద్యావినయంగల సౌజన్యురాలు. పెద్దలపట్ల వినయవిదేయతలతోను పనివారి పట్ల కరుణ, దయ సానుబూతిగల సద్గుణ సంపన్నురాలు . ఈ సుగునవతికి ఒక తీరని బాధ వుండేది. చెవిలో చీము కారుతుండేది. రాత్రులందు సర్పం కలలో కనబడి కాటు వేయబోతుండేది. ఇందువల్ల ఆమె మనస్సులో ఎంతో కలవరపడుతుండేది. ఎన్ని పూజలు చేయించినా ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడడం కాటు వేయడం తగ్గలేదు.

ఇందుపై ఆమె తనకు కనబడిన వారందరికీ తన బాధలు చెప్పుకుని తరుణోపాయం చెప్పమని వేడుకునేది. ఒకనాడు ఒక సన్యాసి వాళ్ళ ఊరుకు వచ్చాడు. ఆ సాధువు త్రికాలజ్ఞానుదని విని అతనివద్దకు వెళ్ళిన తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది. అతిథి మర్యాదలు పాదపూజలు సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణమేమై ఉంటుందని, ఇవి తొలగే మార్గామేమితని వినయపూర్వకముగా వేడుకున్నది. అందుకా సాధు పుంగవుడు తీవ్రంగా ఆలోచించి ఇది నీకు సర్పదోశంవల్ల సంభవించింది. ఏమిచేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్దించడం లేదంటే, దానికి గల కారణం నీ వ్యాధి, భయాందోళనలు తోలగాలన్నదే నీ లక్షంగానే సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్ధని చూపనందువల్ల నీకీ దుస్థితి నిన్నింకా వేధిస్తుంది. నీవు గత జన్మలో నాగపూజా చేసే వారిని ఆక్షేపణ చేయడం నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం, చులకన చేయడం నీవు చేసిన మహాపరాధం. నాగేంద్రుడు దయామయుడు, తనను నమ్మినవారిని ఉద్దరించే కరుణా సముద్రుడు కనుక నీ విషయం పట్ల విశ్వాసముంచి నాగ పంచమి నోము నోచినట్లయితే నీ కలతలు తొలగుతాయి. చెవి చక్కబడుతుందని చెప్పి ఆ వ్రత విధానము దాని నియమాల గురించి వివరించి వెళ్ళిపోయెను. ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధాన క్రమమున ఎంతో భక్తి శ్రద్ధలతో నాగపంచమి నోము నోచి ఆ వ్రత ప్రబావం వల్ల తన భయాందోళనలు తొలగి సంతోషముగా ఉంది.

ఉద్యాపన: శ్రావణ మాసంలో శుక్ల పంచమినాడు చేయవలసిన నోము ఇది. అభ్యంగన స్నానం చేసి మాదిగా శుచిగా ఏకాగ్రతతో ఉంది నాగేంద్రుడిని ఆరాధించాలి. నాగేంద్రుడి వెండి విగ్రహం చేయించి పాలు పానకం వడపప్పు నివేదించి తాంబూల పహ్ల పుష్పాదులు నారికేళం సమర్పించాలి. నాడు ఉపవాసం వుండాలి. నిరాహారం జాగరణ మరింత శ్రేయస్కరం.

శ్రావణ మాసంలో శుక్ల పంచమినాడు చేయవలసిన నోము ఇది. అభ్యంగన స్నానం చేసి శుచిగా ఏకాగ్రతతో ఉంది నాగేంద్రుడిని ఆరాధించాలి. నాగేంద్రుడి వెండి విగ్రహం చేయించి పాలు పానకం వడపప్పు నివేదించి తాంబూల పహ్ల పుష్పాదులు నారికేళం సమర్పించాలి. నాడు ఉపవాసం వుండాలి. నిరాహారం జాగరణ మరింత శ్రేయస్కరం.

విమర్శలు

అసలు పుట్టలో పాలు పోస్తే పిల్లలు ఎలా కలుగుతారనే పెద్ద సంశయము.పాము పుట్టలని పాములు ఎర్పరచవు, చెదలు ఏర్పరుస్తాయి. వాటిలో ఈ పాములు చేరి వానాకాలములో పిల్లలను పెట్టి, వేరే చోటికి వెళ్తాయి.చెదపురుగు పుట్ట పెట్టేటప్పుడు దాని నోటి నుంచి ఒక ద్రవము వచ్చును. ఆ ద్రవము మెత్తటి మట్టినందు కలిసి అది గట్టి పడును. ఎంత గట్టి పడుతుంది అంటే వానలు వచ్చినా ఆ మట్టి కరుగదు. ఈ మెత్తటి మట్టిలో రాయి రప్పలు ఉండవు. ఇదే దీని విశిష్టము. వానాకాలములో ఈ పుట్టలందు సంచరించు పాముల నుండి విడుదల అగు రేతస్సు, రజస్సు ఈ మట్టిలో కలియును. పాము గుడ్లు పెట్టి అది పిల్లలను చేయదు. ఎండ వేడికి అవి పిల్లలగును. ఇది ప్రకృతి నియమము. ఈ మట్టిలో కలిసిన ఈ పదార్దములు మనము పోయు పాలు, తేనే కలిసి సువాసనల వెదజల్లును. ఆ వాసనలు వలన మన శరీరమునందు తగు హార్మోనులు ఉత్పత్తి అయి పిల్లలు పుట్టుటకు దోహద పడును. ఇది పరిశీలించి చూడవలసిన విషయమే కదా.. ఆయుర్వేద శాస్త్రములో నాగు పాము కుబుసములో అరటిపండు కలిపి మందుగా వాడుట ఉంది. ఇది ప్రయోగశాలలో పరిశీలించవలసిన విషయము. చర్మ రోగాలు నయము చేయుటలో ఈ మట్టి ఎంతో ఉపయోగ పడును. ప్రత్యేకముగా నాగరు అనే చర్మ వ్యాధికి. ఇది ప్రకృతి చికిత్సలో ఒప్పుకున్న విషయమే.

రావి చెట్టుకింద ప్రతిష్ఠించబడిన విగ్రాహాలకి కూడా పూజచేస్తుంటారు. ఆయుర్వేద శాస్త్రములో గర్భము నిలువకున్న ఈ చెట్టు వేరుతో తయారు చేసిన మందులు వాడుతారు. అంతే కాక ఈ వృక్షము అరుణోదయ కాలములో దాని వేళ్ళ నుండి ఘనీభుతమైన అమ్ల జనకములు విడుదల చేస్తాయి. దీనిని ఒజోన్స్ అంటారు. ఈ ఒజోన్స్ మనోహరమైన వాసనలు మానవుడి ఆరోగ్యం మరియు స్త్రీలమీద మంచి ప్రభావము చూపిస్తాయి.

నాగప్రతిష్ఠ

అందువలన రావిచెట్టుకి ప్రదక్షిణాలు చేయడం మొదలైన నియమాలు చేసారు. 40 రోజుల పాటు ఉదయమునే రావి చెట్టు ఆలింగనము, ప్రదక్షిణాలు చేసిన జననేంద్రియ దోషములు తొలగి, గర్భము ధరించుటకు సహాయకారిగా ఉంటుందని విశ్వసిస్తారు. నాగుపాము మనిషి వెన్ను పాము ఆకారములో ఉంటుంది. నాగ ప్రతిమను శాస్త్రోక్తముగా రావి చెట్టు మొదలులో ప్రతిష్ఠిస్తారు. ప్రతిష్ఠించేసమయంలో పంచరత్నాలు, పంచాపల్లవములు, నవధాన్యములు, గో పంచాకాలతో ప్రతిష్ఠించుతారు. నాగ ప్రతిమ చేసిన రాయి పురుష జాతిథి అయి ఉండాలి. రత్నముల ద్వారా చెట్టునుండి విసర్జించబడిన ఒజోన్స్ శిలా ముఖంతరముగా మానవుని శరీరమీద ప్రభావము చూపును. అందువలన నాగ పంచమి నాడు ఈ నియమాలు చేసారు. మన పెద్దలు.వీనిని తెలిసి ఆచరించినా, తెలియక ఆచరించినా మంచి ఫలితములు తప్పక పొందవచ్చును.

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...