Wednesday, May 23, 2018

వివిధ రకాల గణపతులు - పూజలు ఫలితాలు

**.... వినాయకుడు సర్వ విఘ్నాలకు అధిపతి .... గణేశుని కృపా కటాక్షం ఉంటేనే తలపెట్టిన ఏ కార్యమైన నిర్విఘ్నంగా సాగుతుంది....

వివిధ గణపతులను పూజించటం వల్ల వచ్చే ఫలితములు :

💫🌼💫🌼💫🌼💫

💠 ఎర్ర చందనం గణపతి  - అనారోగ్యం నుంచి విముక్తి !

💠ముత్యపు గణపతి  - రుణ విముక్తి !

💠 మరకత గణపతి   - వ్యాపారాభివృద్ధి !

💠 చందనం గణపతి - ఉద్యోగం , సంఘంలో గౌరవం !

💠 స్ఫటిక గణపతి - భార్యాభర్తలు సుఖజీవనం !

💠 నల్లరాతి గణపతి - అధిక శ్రమనుంచి విముక్తి !

💠 శ్వేతార్క గణపతి  - విఘ్న వినాశనం !

నవగ్రహ దోష నివారణకు వివిధ గణపతుల పూజాలు :

💫🌼💫🌼💫🌼💫

💠రవి : ఎర్ర చందనం గణపతి ఆదివారం పూజించాలి !

💠 చంద్రుడు : వెండి , ముత్యం లేదా పాలరాతి గణపతిని సోమవారం పూజించాలి !

💠 కుజుడు : రాగి లేదా పగడం గణపతిని మంగళవారం పూజించాలి !

💠 బుధ్ధుడు : మరకత గణపతిని బుధవారం పూజించాలి !

💠 గురువు : బంగారం , పసుపు లేదా చందనం గణపతిని గురువారం పూజించాలి !

💠శుక్రుడు : స్ఫటిక గణపతిని శుక్రవారం పూజించాలి !

💠 శని : నల్లరాతి గణపతిని శనివారం పూజించాలి !

 💠రాహువు : ఎర్ర చందనం గణపతిని ఆదివారం పూజించాలి !

సకల విఘ్నరాజైన పార్వతీ తనయుడి రూప విశేషాలు చాల విలక్షణమైనవి **

💫🌼💫🌼💫🌼💫

🐘  గణేశుడి పూర్ణకుంభం వంటి దేహం , బాన వంటి పొట్ట - ఇవి పరిపూర్ణ జగత్తుకి సంకేతం !

🐘గజముఖం , సన్నని కళ్ళు  - ఇవి సున్నితమైన పరిశీలనకి , గ్రహణ , మేధా శక్తులకు సంకేతాలు !

🐘వక్రతుండం - ఇది ఓంకారానికి సంకేతం !

🐘చుట్టి ఉండే నాగం - ఇది జగత్తు ఆవరించి ఉన్న మాయాశక్తికి సంకేతం !

🐘నాలుగు చేతులు - మానవాతీతశక్తి , సామర్థ్యాలకి సంకేతం !

🐘 ఒక చేతిలో పాశం , దండ - ఇది బుద్ధి , మనస్సులను సన్మార్గంలోకి నడిపించేందుకు సాధనం !

🐘 మరొక చేతిలో విరిగిన దంతం ( మహా భారత రచన కోసం ఆయన తన దంతాన్నే విరిచి కలంగా చేసుకొన్నాడు ) ఇది విజ్ఞాన సముపార్జన కొరకు చేయవలసిన కృషి , త్యాగలకు సంకేతం !

🐘 మరొక చేతిలో  మోదకం లేదా వెలగ పండు - ఇది  బాహ్యంలో గంభీరత , అంతరంగంలో సున్నితత్త్వానికి చిహ్నాలు !

🐘 చేటంత చెవులు - ఇవి భక్తుల మొర ఆలకించటానికి గుర్తు !

No comments:

Post a Comment

పరమ శివుని స్వరూపం - శ్రీ దక్షిణామూర్తి

విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషుల...