Wednesday, May 23, 2018

రామకార్యం

ఆంజనేయుడు  అంటే  శ్రీ  రామ  భక్తికి  పరాకాష్ట , ప్రభు  భక్తి  పరాయణుడు  సముద్రాన్నే  లంఘించి  సీతమ్మ  జాడను  కనుగొన్నాడు  ఈ  రోజు  మంగళవారం  మనస్ఫూర్తిగా ఆయన్ను  స్మరిస్తే  సర్వ  కార్యాలు  నెరవేరినట్లే

దేవా! సీతను చూసాను. దక్షిణ దిశగా వెళ్ళి అశోక వనంలో రావణ కట్టుబాటులో ఉన్న సీతను నేను చూసాను. మేము సీతను వెదుకుచూ వెళుతుండగా మాకు ఒక పెద్ద సొరంగం కనపడింది. ఆ సొరంగంలో ప్రవేశించి కొన్నాళ్ళకు ఒక నగరం చేరుకున్నాము. అక్కడ మాకు ఒక తాపసి కనపడింది. మమ్మలిని ఆదరించింది. తరువాత మలయ పర్వతం చేరుకున్నాము. అక్కడ ఒక పెద్ద సముద్రం. ఆ సముద్రం దాటటానికి ఎవరికి శక్యం కాలేదు. సీతను వెదకకుండా వెనుకకు మరలడం కంటే చావడం మేలనుకున్నాము. అక్కడ ఒక పక్షిరాజు మాకు కనిపించాడు. మేము జరిగినదంతా చెప్పుకుని విచారిస్తుండగా ఆ పక్షిరాజు " అయ్యా! మీ మాటలలో జటాయువు అనే పేరు వినవచ్చింది. నేను నా తమ్ముడు ఒకసారి సూర్య మండలానికి ఎగిరాము నా రెక్కలు మాడి పోవడంతో నేను ఇక్కడ పడి ఉన్నాను. నా తమ్ముడు జటాయువు గురించి మీకు తెలిస్తే చెప్పండి " అని అడిగాడు. నేను సంపాతితో రావణుడు సీతను ఎత్తుకు వెళ్ళడం జటాయువును చంపడం చెప్పాను. జటాయువు మరణ వార్త విన్న సంపాతి " అయ్యా! నాకు రావణుని గురించి తెలియును. వాడు రాక్షసుడు. ఇక్కడికి నూరు యోజనముల దూరంలో ఉన్న లంకను రాజధానిగా చేసుకుని రావణుడు రాజ్యం చేస్తున్నాడు. మీకు అక్కడ సీతాదేవి కనిపించ వచ్చును " అన్నాడు. మాలో ఎవరికి సముద్రాన్ని దాటే శక్తి లేదు. నా తండ్రి వాయు దేవుని వలన నాకు సముద్రాన్ని దాటే శక్తి కలిగింది. నేను లంకకు వెళ్ళి సీతాదేవిని చూసి నన్ను రామ దూతగా నన్ను పరిచయం చేసుకుని మీ ముద్రికను ఇచ్చాను ఆమెకు మీ క్షేమం చెప్పాను . ఆమె నన్ను నమ్మ లేదు రావణుడు కామ రూపియై వచ్చాడు అనుకుంది. నేను ఆమెకు విశ్వాసం కలిగించాక ఆమె నన్ను నమ్మింది. తన ఆనవాలుగా ఈ శిరోభూషణం మీకు ఇమ్మంది. సుగ్రీవుని సాయంగా తీసుకు వచ్చి అతి త్వరలో తను తీసుకు పొమ్మని మీకు చెప్పమని చెప్పింది. ఆమెకు నేను ధర్య వచనాలు చెప్పి వచ్చాను. ఆమె నాకు చిత్రకూటం పై జరిగిన కాకాసురుని వృత్తాంతం చెప్పింది " అన్నాడు. హనుమంతుడు రామునికి శిరోభూషణం అందించాడు. రాముడు ఆ శిరోభూషణాన్ని గుండెలకు హత్తుకున్నాడు.
ఒకమారు ఆంజనేయుడు నిత్యకృత్త్యాలైన పనులు చేసుకుంటూ శ్రమపడినవాడై, మంచి ఆకలితో తన స్వామి అర్థాంగియైన సీతామాతను భోజనము వడ్డించమని అడిగాడు. అప్పుడే స్నానాధికాలు ముగించుకొన్న జానకీదేవీ 'హనుమా! కొద్దిసేపు ఆగు. మొదట పాపిటలో సిందూరము ఉంచుకుని తరువాత వడ్డిస్తాను' అని అన్నది.

అప్పుడు హనుమంతుడు 'అమ్మా ! పాపిటలో సిందూరం ఎందుకమ్మా' అని ప్రశ్నించాడు. "దీనిని నేను నీ ప్రభువు కళ్యాణ నిమిత్తమై పాపిట పెట్టుకొంటున్నాను సింధూరము సౌభాగ్య వృద్ధిని కలిగిస్తుంది. దీనిని ధరించిన వారి భర్తలు చిరాయువులై వర్థిల్లుతారు" అని సీతమ్మ జవాబు చెప్పింది. ఈ మాటవిన్న హనుమంతుడు అక్కడ నుండి వెళ్ళిపోయి కొద్దిసేపు తర్వాత తిరిగి వచ్చాడు ఆయన నఖశిఖ పర్యంతము సింధూరము పూసుకొని ఉన్నాడు.

సీతమ్మ ఆశ్చర్యపడి 'హనుమా ! శరీరమంతా సింధూరం ఎలా పూసుకొన్నావు ?' అని అడిగింది. అంత మారుతి వినమ్రుడై 'సిందూరము ధరిస్తే స్వామికి కళ్యాణ ప్రదమై ఉంటుందని నీవే అన్నావుగదా అమ్మా! నా ప్రభువు ఎల్లప్పుడు కళ్యాణప్రదంగా ఉండాలని నేను సిందూరము పూసుకొన్నానని' సమాధానం ఇచ్చాడు. హనుమంతుని సమాధానం విన్న సీత ఆనందపరవశ నేత్రాలతో, అతని ప్రభు భక్తికి సంతోషంతో హృదయ పూర్వకంగా ఆశీర్వదించింది. ఆంజనేయుని ప్రభుభక్తి పరాయణతకు ఇది నిలువెత్తు నిదర్శనము.

🙏🏻 జై శ్రీమన్నారాయణ 🙏🏻

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...