Wednesday, May 2, 2018

!!!!! శ్రీ చక్రం - విశిష్టత !!!!!

                  సకల చరాచర విశ్వం లో ఉన్నది "బ్రహ్మము" ఒక్కటే . ఈ బ్రహ్మము సత్ చిత్ ఆనంద స్వరూపము ల తో కూడుకున్నది . బ్రహ్మము చలనము లేనిది అయినప్పటికీ ... ' చేతనం ' అనే విశేష బీజం కలిగి ఉంటుంది .
పరాశక్తి కి శ్రీ చక్రము కు భేదముండదు .శ్రీ దేవియే శ్రీ చక్రం .  శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర సారం కూడా .............   శ్రీ మాతా,శ్రీ విద్య్హ , శ్రీ చక్రం వేరు కాదని , ఈ మూడు ఒకే పరబ్రహ్మ స్వరూపమని ....తెలియజేస్తుంది . శ్రీ చక్రం నందు లలితాదేవి ఎల్లప్పుడూ నివసిస్తుంది ... ఇటువంటి శ్రీ విద్యను , శ్రీ చక్రోపాసనను ... మనువు ,చంద్రుడు ,కుభేరుడు ,అగస్త్యుడు , లోపాముద్ర ,అగ్ని ,మన్మధుడు ,సూర్యుడు ,ఇంద్రుడు ,శివుడు ,స్కంధుడు, దూర్వాసుడు అను పన్నెండుగురు , పన్నెండు శాస్త్ర విధానాలుగా ప్రవేశపెట్టినట్టు ... జ్ఞానార్ణవ తంత్రం తెలుపుతుంది .
               శ్రీ చక్రం -- బిందువు , త్రికోణం ,అష్టకోణ చక్రం ,అంతర్దశారం , బహిర్దశారం అను దశ త్రికోణ చక్రము , చతుర్దశారం , అష్టదళ పద్మము , భూపురము అను తొమ్మిది ఆవరణము ల తో కూడి ఉన్నది . శ్రీ చక్రం లో త్రిభుజాల సంఖ్యా 43 , మొత్తం పద్మముల సంఖ్యా 24 , మొత్తము వృత్తములు సంఖ్యా 7 ( బిందువు తో కలిపి ).
శ్రీ చక్రము లోని తొమ్మిది చక్రములను ( శివ చక్ర , శక్తి చక్రములు అంటారు ) నాయోనులని వ్యవహరిస్తారు ....... 
        త్రికోణ , అష్టకోణ , దశకోణ ద్వయము , చతుర్దశ కోణం లు శక్తి కోణములు ... బిందువు , అష్టదళ పద్మము , షోడశ దళము , చతురస్రము లు శివ చక్రములు .... బహిర్దశార , అంతర్దశారము ల ను కలిపితే శ్రీ చక్రము అష్టాచక్రము అవుతుంది ... 
      ** నవద్వార అంటే తొమ్మిది త్రికోణములు ... శివ శక్త్యాత్మకం ........**
                  భూపుర త్రయం అంటే త్రైలోక్య మోహన చక్రం , షోడశదళ పద్మము అంటే సర్వాశా పరిపూర చక్రం , అష్టదళ పద్మము అంటే సర్వ సంక్షోభిణీ చక్రము , చతుర్దశారము అంటే సర్వ సౌభాగ్య చక్రము , బహిర్దశారం అంటే సర్వార్థ సాధక చక్రము , అంతర్దశారము అంటే సర్వ రక్షాకర చక్రము , అష్టకోణము అంటే సర్వ రోగహర చక్రము , త్రికోణము అంటే సర్వ సిద్ధి ప్రధా చక్రము , బిందువు అంటే సర్వ ఆనందమయ చక్రము .....ఒక్కొక్క ఆవరణము లో ఉండే దేవతలను సాక్షాత్కరించుట కొరకు కొన్ని బీజాక్షర మంత్రము లు ప్రత్యేకం గా కలవు .....
                 ఇక మనము గమనించవలిసిన విషయమేమిటంటే .... ఈ జగత్తు లో ని సకల తత్వాలు , సకల భువనాలు ,పరమశివుడు , పరాశక్తి మానవునియందు కలవు .. మానవుని శరీరాను రెండు భాగాలుగా చూస్తే .... నాభి నుండి పైకి ఊర్థ్వ లోకమని , క్రిందకి అధోలోకమని ..... ఈ రెంటిని కలిపే వెన్నెముక ను మేరు దండమని అంటారు .. శ్రీ చక్రమును "మేరువు" అంటారు ... మేరు పర్వతము కూడా భూమి కి ఇరుసు వంటిది . ఏ రకం గా పరాశక్తి దివ్య స్వరూప కాంతులచే ... ఈ జగత్తంతా ప్రకాశవంతమై ఉందొ , మన మేరుదండం లో గల " కుండలినీ శక్తి " చేత శరీరము చైతన్యవంతము గా అవుతుంది ... మనలో ఆత్మా ఉన్నదని అంగీకరించినట్లే .. మన శరీర నిర్మాణం యొక్క ప్రాధాన్యత ను గుర్తించాలి .. నవావరణాత్మకమైన శ్రీ చక్రానికి , మానవ శరీరానికి తేడా లేదని శాస్త్రాలు చెబుతున్నాయి ... శ్రీ చక్రమును ఆరాదిస్తే సకల దేవతా మూర్తులను ఆరాదించినట్లే ... అని తంత్ర శాస్త్రం తెలియజేస్తుంది ...
                        శ్రీ చక్రమును మన శరీరము తో పోల్చి చూస్తే ... మనము ఆ జగన్మాతను దర్శించుట యెంత దుర్లభమో అవగతమవుతుంది ... మనలోని కర్మ , జ్ఞానేంద్రియాల వెంటపడి పరుగెత్తే మనస్సు , బుద్ధి , అహంకారం , మమకారములు , కామోద్రేకాలు , శృంగారాది నవరసాలు , జాగ్రద స్వప్న సుషుప్తాది అవస్థలు .. వీటిని నడిపే సత్వ రజ తమో గుణాలు .. వీటన్నింటిని ఆ "శ్రీదేవి" విభూతులుగా గ్రహించి , వీటన్నింటిని దాటి 'బిందు' స్థానమునకు చేరుకోగానే అచట అద్వితీయమైన , సచ్చిదానంద రూపమైన , సత్స్వరూపానుభవము కలుగుతుంది అనేది సత్యము ... కానీ ... ఎన్ని జన్మలకు సాధ్యమో ....
      మనలోని ప్రాపంచికమైన ముప్పది ఆరు తత్వములు , త్రిపుటలు , నవావరణములను ... నిర్లిప్తతో , నిష్కామంగా , నిస్వార్థంగా అనుభవిస్తూ ..... గమ్యాన్ని చేరుకోవటానికి నిరంతర సాధన చెయ్యాలె తప్ప  వేరొక మార్గం ఉండదు ... లేదు కూడాను ... 

No comments:

Post a Comment

పరమ శివుని స్వరూపం - శ్రీ దక్షిణామూర్తి

విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషుల...