దత్తాత్రేయుడు నిరాకారుడు. హద్దులు,ఎల్లలు లేనివాడు. శూన్యంలో కుడా వ్యాపించి ఉన్నవాడు. దిక్కులనే అంబరములుగా చేసుకున్నవాడు. కేవలం భక్తునుద్ధరించేందుకే రూపాలను ధరించేవాడు. నిరాకారంగా ఉండడం కుడా ఒక ఆకారమే అని చాటి చెప్పినవాడు. బాలకుడిగా వచ్చినా, ఉన్మత్తుడిగా ఉన్నా, కల్లుగీసే గౌడకులస్తుడిగా కనిపించినా, పిశాచరూపంలో ఉన్నా అవన్నీ భక్తులను ఉద్దరించడానికే! అటువంటి దత్తాత్రేయుల వారు ‘పడుకున్నపాములాగ’ ఉన్నారన్న విషయం తెలిసి, ఆక్షేత్రాన్ని దర్శించి ఎంతో ఆనందించాను. నాకు కేవలం శ్రీపాదుల వారి ఆశీస్సులతో మాత్రమే ఈ క్షేత్ర సమాచారం లభించింది, వారి ఆశీస్సులతోనే నేనక్కడకి వెళ్ళడం జరిగింది మరియు తరువాత మన ట్రస్ట్ తరుఫున ఒక 30 మందిని కుడా వారి ఆశీస్సులతోనే అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. వరదవెల్లి దత్తాత్రేయుని విగ్రహంలో దాగున్న పెనవేసుకున్న జంట సర్పముల ఆనవాళ్ళను చూసి ఆశ్చర్యపోయాను. అబివృద్దికి ఆమడదూరంలో ఉన్న ఒక కుగ్రామంలో, ప్రపంచంలోని ఏకైక రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయుడు నిఘూఢముగా ఉండడం మరింత ఆశ్చర్యపరిచింది. అక్కడి స్థలపురాణం తెలిసి ఆశ్చర్యపోవడం నావంతైంది. వెంటనే స్థానికులను, పూజారి గారిని కలిసి మన వెబ్సైట్ భక్తులందరి కోసం ఎంతో విలువైన సమాచారాన్ని సేకరించి మీకు అందిస్తున్నాను. గురు దత్తాత్రేయుల వారి ఆశీస్సులతో ప్రపంచం లోనే అతి కొద్దిమంది దత్త భక్తులకు మాత్రమే తెలిసిన ఈ వరదవెల్లి శయన దత్తాత్రేయుడిని దర్శించి తరించండి.
వరదవెల్లి గ్రామం ఎక్కడుంది? ఆ పేరెలా వచ్చింది?…
వరదవెల్లి గ్రామం ‘తెలంగాణ’లోని కరీంనగర్ జిల్లాలోగల బోయినపల్లి మండలంలో కరీంనగర్ – వేములవాడ రోడ్ లోని కొదురుపాక స్టేజి వద్దగలదు. వరదవెల్లి గ్రామం ‘మిడ్ మానేరు’ జలాశయం క్రింద రావడం వల్ల వరదవెల్లి గ్రామం మొత్తం దాదాపుగా నిర్వాసిత గ్రామమే. మిడ్ మానేరు జలాశయం పూర్తయితే ఈ అరుదైన దత్తక్షేత్రంతో పాటు ఊరు కుడా ఉండకపోవచ్చు. పూర్వం నుండి తరచుగా ఈ గ్రామం ముంపుకు, వరదలకు గురౌతుండడం, శ్రీరాం సాగర్ వరద కాల్వ ఈ గ్రామం గుండా వెళుతుండడం వల్ల ‘వరదవెల్లి’ అని పేరు వచ్చిందని కొంత మంది గ్రామస్తుల అభిప్రాయం. అయితే గురు దత్తాత్రేయుల వారు ‘వరద హస్తములతో’ ఇక్కడ వెలియడం వల్ల ‘వరదవెల్లి’ అనే పేరొచ్చిందన్నది చారిత్రాత్మక కథనం.
వరదవెల్లి గ్రామం ను ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుండి వరదవెల్లి గ్రామానికి రూట్ (సికింద్రాబాద్ To వరదవెల్లి 175 కీ.మీ.)

సికింద్రాబాద్ ---->JBS---->ఆల్వాల్ ---->షామీర్ పేట్ ----> ప్రజ్ఞాపూర్ ----> శనిగారం ----> కరీంనగర్ ----> వేములవాడ జంక్షన్ ----> వేములవాడ రోడ్ ----> బావ్ పేట్ గ్రానైట్ క్వారీలు ----> NTR Tamil కాలనీ ----> వెంకట్రావు పేట ----> కొదురుపాక స్టేజ్ -----> వరదవెల్లి అడ్డ రోడ్ ---->వరదవెల్లి గ్రామం
వరదవెల్లి గ్రామం ను ఎప్పుడు దర్శించు కోవాలి?
వరదవెల్లి గ్రామం లోని అత్యంత అరుదైన రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయుడి గుడిని సంవత్సరంలో ఎప్పుడైనా

No comments:
Post a Comment