Tuesday, May 22, 2018

అభి షేకం ...... మన్యుసూక్తం

పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం ఇష్టం. అందులోనూ మన్యు సూక్త అభిషేకస్తే పరమానంద భరితుడు అవుతాడు, కోరికల్ని తీరుస్తాడు.

స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర రోజు తప్పకుండా చేయాలి. వారం వారం, నిత్యమూ చేయగలగటం మరీ మంచిది. ఆచరణ : మన్యుసూక్తం నేర్చుకొని భక్తులకు దాని విలువ తెలిపి ప్రతి పర్వదినానా దాతల ద్వారా అభిషేకం జరిపింపజేయాలి *

మంగళ వార సేవ మంగళవారంనాడు హనుమంతునకు శరీరంపై సింధూరం పూయటం చాల ఇష్టం. అంతా కుదురనివారు మూతికయినా తప్పక పూయాలి. సింధూరార్చన చేయటం, అరటి పండ్లు నివెదించటం చేయాలి. అందుకు కారణమైన విశేషగాధ ఉంది.

* శనివార సేవ హనుమంతుడు శనివారం జన్మించాడు. కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది. నాడు యథాశక్తి విశేషార్చన, సహస్రనామాదికం చేయాలి. భక్తులచే అప్పాలు, వడ మాల వంటి విప్రోత్సహించి చే యించి స్వామికి సంతృప్తి కలిగించాలి. * పంచ సంఖ్య హనుమంతుడు పంచ (ఐదు) సంఖ్య ఇష్టం కాబట్టి చెస్వ ప్రదక్షిణాలు, నమస్కారాలు ఐదు చేయాలి. అరటి పండ్లు వంటి వేవ యినా ఐదు సంఖ్యలలో సమర్పించుట స్వామికి ప్రీతికరం.

* హనుమజ్జయంతి హనుమంతుడు వైశాఖ మాసంలో, కృష్ణ పక్షంలో, దశమితిథి పూర్వభాద్రా నక్షత్రం, శనివారం, కర్కాటక లగ్నంలో, వైదృతి యోగంలో జన్మిచాడు. ఇవి ఖగోళాది సకల ప్రమాణాలతో ఏ, కల్పంతర గాధలను బట్టి ఎవరో చేప్పారని భిన్న భిన్న తిథులలో హనుమజ్జయంతి కొందరు జరుపుతున్నారు. సాధారణంగా మే నెలలో వచ్చే వైశాఖ బహుళ దశమినాడు తప్పక జయంతి జరపాలి. వీటిని పంచాహ్మికంగా ఐదు రోజులు ఇలా శక్తి కొలది జరుపవచ్చు. విశేషార్చనలు సామూహిక కార్యక్రమాలు నిర్వహించాలి.

ఆచరణ : సంవత్సరంలో ఈ ఒక్క జయంతినాడ యినా భక్తులను మారేడుదళం, సింధూరం మల్లెపూలు లేదా త ములపాకులు, తులసిదళం, ప్రత్సహించి లక్షార్చన వంటి వాటితో జరిపించాలి. శాస్త్రమునందు హనుమకు వివాహం అయింది. ఆయనను సువర్చలా సహిత హనుమ అని పిలుస్తారు. సువర్చలా సహిత హనుమకు కళ్యాణం చేయడం శాస్త్రంలో అంగీకరించారు. ఎందుకంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళకుంటే పెద్దలైనటువంటివారు తరించరు. శాస్త్రంలో హనుమకు ప్రవర ఉన్నది. తండ్రిగారు కేసరి, తాతగారి పేరు, ముత్తాతగారిపేరు కళ్యాణంలో చెప్తారు. హేమగర్భుడు అని వారి ముత్తాతగారి పేరు. ఒకతండ్రి కడుపున పుట్టిన పిల్లవాడు వివాహం చేసుకోకుండా ఉండిపోతే తల్లిదండ్రులు దేహములు చాలించిన తరువాత వారి శరీరాలను చెట్లకి త్రిప్పి కట్టేస్తారు. ఎందుకంటే నువ్వు వివాహం చేసుకోనటువంటి సంసార భ్రష్టుడిని కన్నావు కనుక అని. అందుకని పిల్లలు వివాహం చేసుకోకుండా ఉండకూడదు. అలా చేయడం తల్లిదండ్రులయొక్క ప్రధానమైన బాధ్యత. నవ వ్యాకరణపండితులు, మహా బుద్ధిమంతుడైన హనుమ వివాహం చేసుకోకుండా అటు సన్యాసం తీసుకోకుండా ఉండరు కదా! మీకు అందుకే భారతీయ సంప్రదాయంలో ఋషులందరూ వివాహం చేసుకొని ఉంటారు. అలాగే హనుమ కూడా శాస్త్రమునకు సంబంధించినంతవరకు గృహస్థాశ్రమంలో ఉంటారు. కాపురం చేసినట్లు, పిల్లల్ని కన్నట్లు లేదు. ఎందుకంటే ఆయన బ్రహ్మజ్ఞాని. అందుచేత సువర్చలను వివాహం చేసుకున్నారు. ఇద్దరూ యోగమును అనుసంధానం చేశారు.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...