🌹తత్...సత్...ఓం🌹
💫వేదాలు మనుషులచే సృజింప బడలేనంత విస్త్రుతమయినవి.
⚜ఈ సందర్భంగా భరద్వాజ మహర్షి కధ చెప్పుకోవాలి. మూడు కొండల నడుమ ఉన్న చిన్న కుటీరంలో, నిరంతరం వేదాధ్యయనంలో ఉండేవారట భరద్వాజ మహర్షి. ఆయన మూడొంతుల జీవితం గడిచిపోయింది. అయినా వేద పఠనం పూర్తవలేదు.
⚡ఆయనకు పండు ముదుసలి వయసులో, ఇంద్రుడు సాక్షాత్కరించి, 'మీ యవ్వనాన్ని నేను వెనక్కి ఇస్తే, మీరు ఏమి చేస్తారు మహర్షి?' అని అడిగాడు. 'ఈ వేదాలను పూర్తిగా అధ్యయనం చెయ్యాలన్న కోరిక తప్ప, నాకు మరే ఇతర కోరికలూ లేవు. నా యవ్వనం తిరిగి వస్తే, నేను వేదాలను పూర్తిగా అవగాహన చేసుకుంటాను,' అన్నారు.
✨అప్పుడు ఇంద్రుడు, ఆ మూడు కొండల నుంచి పిడికెడు మట్టి తీసి, మహర్షి ముందు ఉంచి, "ఇంతవరకూ మీరు చదివిన వేదాల ప్రమాణం ఇంత. చదవాల్సినది ఆ మూడు కొండలంత, దీనిని బట్టి, మీ సంకల్పం యెంత అసాధ్యమయినదో తెలుసుకోండి," అన్నాడట.
💫 వేద రాశి ఆకాశమంత వ్యాప్తి కలిగి ఉంది. సుమారు, రెండు వేల సంవత్సరాలకు పూర్వం 'పాణిని వ్యాకరణం' వ్రాసిన పతంజలి ఆ కాలానికే, వేదాలలో చాలా భాగాలు కోల్పోయామని చెప్పారు. ఆయన కాలానికి ఉన్న వేదాల శాఖలు : ఋగ్వేదం --21 , యజుర్వేదం- 101 , సామవేదం- 1000 , అథర్వణ వేదం- 9 . మొత్తం 1131 శాఖల్లో,
💫ఇప్పుడు మనకు తెలిసినవి , ఋగ్వేదం- రెండు శాఖలు -- శాకల మరియు భాస్కల, ఇందులో భాస్కల లభ్యం కావటంలేదు. యజుర్వేదంలో రెండు శాఖలు-- కృష్ణ యజుర్ వేదం, శుక్ల యజుర్ వేదం. సామవేదం లో మనకు దొరికినవి, రెండు-- కుతమేయ మరియు రణయనీయ, అథర్వణ వేదంలో ఉన్నవి పైప్పలాది, శౌనక, అంటే ప్రస్తుతం, మొత్తం ఎనిమిది శాఖలు మాత్రమే ఉన్నవి.
⚜వీటిని ఒక సారి చదవడానికి సుమారు నూటయాభై నాలుగు గంటలు పడుతుంది. పతంజలి కాలంలో ఉన్న 1131 శాఖల్ని చదవడానికి ఇరవై రెండు వేల గంటలు -- అంతే సుమారు రెండున్నర ఏళ్ళు పడుతుంది. ఇక పతంజలి కాలానికి ముందు ఉన్న వాటిని చదవడానికి పట్టే కాలం మనం ఊహించ గలమా? ఇక చదవడానికే ఇంత సమయం పడుతుంటే, రాసేందుకు ఒక మనిషికి సాధ్యమా? హిందువుల వేద సంపద చాలా అమూల్యమైనది .
💫ఈ యుగ ప్రారంభంలో వ్యాసుడు వేదరాశిని నాలుగు గావిభజించి నలుగురు శిష్యులకు వాటి సంరక్షణకై ఈ నాలుగు భాగాలు ఇచ్చాడు. వ్యాసుడు పైలుడికి ఋగ్వేదము, వైశంపాయనుడికి యజుర్వేదం, జైమినికి సామవేదం, సుమంతునికి అథర్వ వేదం ఇచ్చాడు.రోమహర్షణునికి పురాణాలు ఇచ్చాడు. ఈయన సూతుడనే పేరుతో తరువాత కాలంలో నైమిశారణ్యంలోశౌనకాది మహర్షులకు పురాణ ప్రవచనాలు ఇచ్చారు.
✨వేదంలోని భాగాలు సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు. ఉపనిషత్తులను వేదం చివరచేర్చడం వలన అవి వేదాంతము అనిపిలువబడతాయి.
⚡వేదాలు అర్థంచేసుకోవడానికి అవసరమైన విజ్ఞానాన్ని వేదాంగాలు అంటారు. ఇవి వ్యాకరణం, జ్యోతిషం, నిరుక్తం, కల్పం,శిక్ష,ఛందస్సు. వేదంలోని విషయాలను కథలలో చెప్పేవి పురాణాలు.ముఖ్యమైనవి 18. ఇవీ వ్యాసుడే సామాన్యులకై చెప్పాడు.
⚜ఇక దర్శనాలు,శాస్త్రాలు. ఈదర్శనాలలొ మనకు తెలిసినవి న్యాయ వైశేషికాలు. ఇవి ఆనాటి (నేటికీ పనికి వచ్చే) విజ్ఞాన శాస్త్రాలు. సాంఖ్యం, యోగం. మీమాంస, వేదాంతం - ఈ ఆరూ ఆస్తిక దర్శనాలు. వేదాలు అపౌరుషేయాలు,కాబట్టి అవి శ్రుతులు.వేదాంగాలు మానవ జనితాలు కాబట్టి అవి స్మృతులు. పారం పర్యంగా ఒకరి నుంచి ఒకరికి ఒక తరాన్నుంచి మరొక తరానికి ఈ స్మృతులను అందచేయవచ్చు. వేదాలలో చెప్పబడిన విషయాలనే స్మ్రుతులు, ఇతిహాసాలు, పురాణాలు మున్నగునవి పలు విధాలుగా విశదీకరిస్తున్నాయి. ఉపనిషత్తులను వేదాంతమంటారు.
💫హిందూ మతములోని మహోన్నత సిద్ధాంతములన్నీ ఉపనిషత్తులలోనే ఉన్నాయి. ఋషులు భవిష్యత్తులో వేదాలలోని లోపాలు వెతికేవారు ఎక్కువ అవుతారనే, వేదాధ్యయనానికి కొన్ని నియమాలు ఏర్పరిచారు. మొదటి 'కర్మ' అధ్యయన భాగం 'జామిని మీమాంస శాస్త్రం' గాను, రెండవ 'జ్ఞాన అధ్యయన' భాగం 'బాదరాయణుడి వేదాంత శాస్త్రం' గాను చెప్పారు. వేదాధ్యయనం ఈ రెండు శాస్త్రాల సహాయం తోనే చెయ్యాలి.
⚡ఈ వేదాల కూర్పులో నాలుగు స్వరాలు ఉన్నాయి. ఉదాత్త, అనుదాత్త, స్వరిత, ప్రచ్యయ అనేవి , కొన్ని చోట్ల ఏడు స్వరాలు- కృష్ణ, ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్ధ, మంద్ర, అతిస్వర్య, అనే స్వరాలు ఉన్నాయి. ఇవన్ని పాటిస్తూ వేద వ్యాసుల వారు వేదాలను రచించారు. అందుకే వేద పఠనానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి.
⚡శాస్త్ర ప్రకారం చిన్న పదాన్ని తప్పుగా ఉచ్చరించడం అపరాధంగా భావించబడి, అలా ఉచ్చరించిన వాళ్ళు ప్రాయశ్చితం చేసుకోవలసి ఉంటుంది. అనాదిగా వేదాల స్వరాల అల్లికలో పెద్దగా మార్పులు రాకపోవడానికి ఇదే కారణమేమో!
⚜ఉదాహరణకు, త్వాస్త్రుడనే వాడు ఇంద్రుడి ని జయించడానికి ఒక యజ్ఞం మొదలుపెట్టాడు. మంత్రోచరణ లోని చిన్న లోపం వల్ల యజ్ఞ కర్త అయిన అతనే నాశనం అయ్యాడు.

No comments:
Post a Comment