కార్తీకమాసంలో వచ్చే ఏ సోమవారము నాడయినా సరే - స్నాన, జపాదులను ఆచరించిన వాడు వెయ్యి అశ్వమేథాల ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రతవిధి ఆరురకాలుగా ఉంది.
1. ఉపవాసము 2 ఏకభక్తము 3 నక్తము 4 అయాచితము 5.స్నానము 6.తిలదానము
1.ఉపవాసము:
శక్తిగలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనము (ఉపవాసము)తో గడిపి, సాయంకాలమున శివాభిషేకం చేసి, నక్షత్ర దర్శనానంతరమున తులసితీర్ధము మాత్రమే సేవించాలి.
2 ఏకభక్తము: సాధ్యం కాని వాళ్లు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసికొని - మధ్యాహ్నమున భోజనము చేసి, రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థమో తులసీ తీర్ధమో మాత్రమే తీసుకోవాలి.
3.నక్తము: పగలంతా ఉపవసించి, రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనమునకు గాని, ఉపాహారమును గాని స్వీకరించాలి.
4 అయాచితము: భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా - వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము"
5.స్నానము :పై వాటికి వేటికీ శక్తి లేని వాళ్లు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికిన్నీ చాలును.
6. తిలదానము : మంత్ర జపవిధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారము నాడు నువ్వులను దానము చేసినా సరిపోతుంది.
పై ఆరు పద్ధతులలో దేవిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతము చేసినట్లే అవుతుంది. ఈ వ్రతాచరణము వలన అనాథలూ, స్త్రీలు కూడా విష్ణు సాయుజ్యమును పొందుతారు.
సోమవార వ్రతాన్ని చేసే వాళ్లు నమక చమక సహితంగా శివాభిషేకమును చేయుట ప్రధానమని తెలిసికోవాలి.
సూచన: శివుడు భోళాశంకరుడు. ఆయన నాకు ఇది చేయాలి, అది చేయాలి అని భక్తుల వద్ద కోరడు. పెద్దలు సూచించినవి విధి విధానాలు మాత్రము తెలుపుటకోసం మాత్రమే తెలుపడమైనది.
వ్రతం ఎవరికి అనుకూలమైన పద్దతిలో వారు చేసుకోవాలి అంతే. ముఖ్యమైనది మీ అంతరాత్మ. దానికి ద్రోహం చేయకుండా మీరు చేయకల్గిన పద్ధతి ఆచరించండి,
1.స్నానము ప్రతిరోజు చేసేదే.
2. దైవ ధ్యానం ప్రతిరోజు చేసేదే. పూజ ఈ రోజు కొంత ఎక్కువ సమయం శివు పూజ కు కేటాయించండి చాలు.
3.మీ శరీర పరిస్థితిని బట్టి ఉపవాసం చేయండి. కొన్ని జబ్బులు కలవారు మాత్రలు వేసుకోవాలి. అందుకు అవసరమైతే ఆహారం తీసుకొనండి తప్పులేదు.
4. మీ శరీరo మీకు అవసరం. మీ ఆత్మ ప్రభోధం మేరకు, వీలైనంత వరకు ఆచారాన్ని పాటిస్తూ వ్రతమాచరించండి.
5. వ్రతం చేయాలి కనుక వ్రతం చేస్తున్నాను అనే భావన మనసులో రానియక చేసే పూజ, చేయ కల్గితే చాలు. అధిక ఫలం మీకే.
No comments:
Post a Comment