Tuesday, November 24, 2020

హిందూ పురాణాల ప్రకారం స్నానం ఎలా చెయ్యాలి

పురాణాల ప్రకారం స్నానం ఎలా చెయ్యాలి ?

స్నానం చేసే విధానం:

హిందూ పురాణాల ప్రకారం స్నానం ఎలా చెయ్యాలి..ఉదయం లేచిన వెంటనే కాలకృత్యాలు చేసుకున్న తర్వాత మనం స్నానం చేస్తాం. కొందరు సూర్యుడు రాకముందు స్నానం చేస్తారు. ఇంకొందరు సూర్యుడు వచ్చాక మిట్ట మధ్యాహ్నం స్నానం చేస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం స్నానం ఎప్పుడు చేయాలి. ఏ సమయంలో చేస్తే మంచిది. ఇష్టం వచ్చినప్పుడు స్నానం చేస్తే కలిగే అనర్ధాలు ఏమిటి. ఇలాంటి వాటికి సంబంధించిన వాటి గురించి కూడా తెలుసుకుందాం.

మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి జలము, అగ్ని. అగ్నితో శుద్ధి చేసుకోవడం వీలు బడదు. అగ్ని యందలి దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి చెప్పబడింది.

 

“మంత్ర స్నానం”

మంత్ర స్నానం వేదమందు చెప్పబడిన నమక, చమక, పురుష సూక్తములను, మార్జన మంత్రములను ఉచ్ఛరిస్తూ చేయునది.

“భౌమ స్నానం”

భౌమ స్నానం పుణ్య నదులలో దొరుకు మన్ను లేక పుట్ట మన్ను మొదలగు పవిత్ర మృత్తికను ఒంటి నిండా అలముకొని మృత్తికా మంత్రములతో చేనునది.

“ఆగ్నేయ స్నానం”

ఆగ్నేయ స్నానం సమస్త పాపములను దగ్ధం చేసే పుణ్య రాశిని చేకూర్చే భస్మమును మంత్ర సహితముగా లేదా శివ నామమును ఉచ్ఛరిస్తూ ధరించి చేయునది.

“వాయువ్య స్నానం”

వాయువ్య స్నానం ముప్పది మూడు కోట్ల దేవతులు నివసించు గోమాత పాద ధూళి చేత చేయునది.

“దివ్య స్నానం”

దివ్య స్నానం లోక భాంధవుడు, జగత్ చక్షువు, కర్మ సాక్షి అగు సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వానలో స్నానం చేయడం.

“వారుణ స్నానం”

ఇది అరుదైనది. దీనికి వాతావరణం అనుకూలించాలి. వారుణ స్నానం పుణ్య నదులలో స్నానం ఆచరించడం.

“మానస స్నానం”

మానస స్నానం నిత్యం నారాయణ నామ స్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మత్సర అహంకార ఢంభ దర్పదైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీక పోవడం. ఇది మహత్తర స్నానం. మహా ఋషులచేత ఆచరింప బడుతుంది. ఈ స్నానం కోసం అందరూ ప్రయత్నం చేయాలి. దైవాన్ని స్మరిస్తూ, మనసును నిలిపి చేయు స్నానం.

క్రియాంగ స్నానం:

జపం, మంత్రతర్పణ చేయుటకు చేసే స్నానం.

దైవ స్నానం:

ఉదయం 4-5 గంటల మధ్య చేయు స్నానం.

మంత్ర స్నానం:

వైదిక మంత్రాలను చదువుతూ చేసే స్నానం.

రుషి స్నానం:

ఉదయం 5-6 గంటల మధ్య చేయు స్నానం.

మానవ స్నానం:

ఉదయం 6-7 గంటల మధ్య చేయు స్నానం.

రాక్షస స్నానం:

ఉదయం 7 గంటల తరవాత చేసే స్నానం.

ఆతప స్నానం:

ఎండలో నిలబడి శరీరాన్ని శుద్ధి చేసుకునే స్నానం.

మలాపకర్షణ స్నానం:

మాలిన్యం పోవుటకు చేయు స్నానం.

ఇప్పుడు తెలుసుకున్నారు కదా స్నానం ఎలా చేయాలో. మన సంస్కృతి సంప్రదాయాలను పాటించే ఆరోగ్యంగా ఉండండి. మన సంస్కృతి సంప్రదాయాల వెనుక శాస్త్రీయ కారణాలు దాగి ఉన్నాయి వాటిని తెలుసుకోవడమే ఆలస్యం అంతే. మన పద్ధతులను ఆచారాలను పాటిస్తే ఎటువంటి రోగాలు దరికి రావు. ఈ విషయాలు తెలియని వారికి తెలియజేయండి.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...