Sunday, November 8, 2020

తెలుగు పద్యం

"మనమే మనమని మనమన మనుమని మనుమని మనుమనిమన నమ్మేనా?"

"మన మేనమామ మామను మునునేమిన మౌనిమౌని మనమున మౌనమే!"

భావం

"మనమే = మనం అందరమూ....,"

 "మనమని = శాశ్వతం కాదని"

"మనమన = బుద్ధీ హెచ్చరిస్తూన్నా"

"మనుమని మనుమని మనుమని" = 

"పౌత్రునకు పౌత్రునకుృ పౌత్రుని (తన తర్వాత తరాల 7 తరాలు గురించి)"

"మననమ్మేనా? = తాపత్రయ పడడమేనా? (కాదు),"

"మన మేనమామ =మన మేన మామ అయిన చంద్రుడికి,"

"మామను = మామగారైన దక్షప్రజాప్రతిని,"

"మును+నేమిన = పూర్వం శిక్షించిన,"

"మౌనిమౌని = మునీశ్వరులకి మునీశ్వరుడైన, మునులలో అగ్రగణ్యుడైన శివుని"

"మౌనమే = మౌనంగా"

 "మనమున = మనస్సు నందు ధ్యానించుట మేలు!!"

"అనగా జన్మ పరంపరను కోరడం కంటే జన్మ రాహిత్యమును పొందడానికి మోక్షప్రదాత అయిన శివుని ఆశ్రయించడం మేలు!!"

"ఎంతో లోతైన  జన్మ రాహిత్యాన్ని భావం చెడకుండా  మోక్ష పదమైన మకారంతో  మలిచారు."

" తెలుగు భాష గొప్పదనం ఎంత అని చెప్పగలం, మాధుర్యాన్ని ఆస్వాదించడం  మినహా..."

No comments:

Post a Comment

నవగ్రహ స్తోత్రములు (తాత్పర్య సహితము)

🙏 నవగ్రహస్తోత్రం 🙏 ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః!! ꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂ 🕉️ 01. రవి (ఆదిత్య): 🙏 ...