నాలుగు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు "రుద్రరూపాయై నమః " అని చెప్పాలి.
"రుద్రరూపా = రుద్రుని యొక్క, రూపా = రూపుదాల్చినది."
రుద్రులు పదకొండు మంది ఉంటారు. వీళ్ళనే ఏకాదశ రుద్రులు అని అంటారు:
1) అజుడు
2) ఏకపాదుడు
3) అహిర్బుద్యుముడు
4)త్వష్ట
5) రుద్రుడు
6)హరుడు
7)శంభుడు
8)త్రయంబకుడు
9)అపరాజితుడు
10) ఈశానుడు
11)తిరభువనుడు
వీళ్ళు రోదసిలోని స్పందనాత్మక (Plane a Vibration) లోకానికి అధిపతులు. ఆకాశం శబ్ద గుణకం కాబట్టి ' నాదము' కూడా వీరికి సంబంధించిన లక్షణమే , సృష్టిని మూలం శబ్దం ఈ శబ్దమే ఓం కారం అన్ని శబ్దాలూ అందులో నుండి వచ్చిన బీజాలు ఒక్కో బీజం ఒక్కో శక్తి ఈ ఓంకార స్వరూపం అమ్మవారు అయితే అందునుండి వచ్చిన శబ్ద బీజాలు ఆమె శక్తిని కలిగి ఉండి సృష్టికి కారణం అవుతుంది, తిరిగి ఓంకార నాదంలోకి లీనమవుతుంది, అలా ఈ రుద్ర స్వరూపానికి ప్రళయంలో సమస్త వస్తు జీవజాలాన్ని తమ లోనికి లీనం చేసుకునే లక్షణం వీరికుంటుంది. ఈ లక్షణం తోనే అమ్మవారు ఈ రుద్రరూపం దాల్చి లయ కారకత్వాన్ని నిర్వహిస్తుంది. ఒక్కో కార్య నిర్వాహణ కోసం ఒక్కో అవతార రూపంగా తనను తాను విభజించుకుని పాలిస్తున్న అమ్మవారు.
ఆదిశంకరులు సౌందర్యలహరిలో - 'క్వణత్కాంచీదామా.... ఆహోపురుషికా.. అనే శ్లోకంలో అమ్మవారిని పురమధితుః ఆహోపురుషికా' అన్నారు. అంటే, అమ్మవారు.పురరిపుడైన శివుని అహంకారస్వరూపిణీ' అని ఒక అర్థం. శివునికి గర్వకారణమైన రూపం అని ఇంకో అర్థం. శివుని 'స్వ- రూపం' లేదా సాక్షాత్తు తన రూపం' అని మరో అర్థం.
మొత్తం మీద ఈ నామానికి ఈ క్రింది అర్ధాలు చెప్పుకోవచ్చును:
1) రుద్రునిగా రూపు దాల్చినది.
2) నాదరూపిణి
3) రుద్రుని స్వరూపము."
ఫలస్తుతి:
"ఈ నామ మంత్రం పాప పరిహార మంత్రం తెలిసి తెలియక చేసిన తప్పులు నుండి పరిహారం లభిస్తుంది, సమస్యలతో సతమతమవుతున్న వారు, ఏ జబ్బు లేకున్నా మానసిక ఆందోళన ఉన్నవారు, శత్రు భయం ఉన్నవారు, ఏదైనా చేతబడి జరిగింది అన్న అనుమానంతో మానసిక బాధను అనుభవిస్తున్న వారు..ఈ నామ మంత్రం ధ్యానం చేస్తూ ఉంటే త్వరగా పరిస్కారం లభిస్తుంది.. ఏదైనా మంత్రం త్వరగా సిద్దించాలి అంటే ముందుగా ఈ నామ మంత్రాన్ని లలితా సహస్త్రనామం తో సంపుటితం మండలం రోజులు చేసి శక్తి ఉపాసన చేస్తే వారికి ఆ మంత్ర సిద్ది త్వరగా లభిస్తుంది."
"ఓం ఐం హ్రీం శ్రీo రుద్రరూపాయై నమః"
"శ్రీ మాత్రే నమః"
No comments:
Post a Comment