శివ.. శివ అంటే చాలు మంగళం, శుభం, సర్వకార్యజయం, సర్వపాపహరం అని వేదార్థాలు....
మహాదేవున్ని శివుడని పరమశివుడని పలు పేర్లతో పిలుస్తారు. పండితుడు నుంచి పామరుడు వరకు, మహా చక్రవర్తి నుంచి కటిక పేదవాడి వరకు మనఃపూర్వకంగా ఒక్కసారి శివ అంటే చాలు కోరిన కోర్కిలు తీర్చే భోళాశంకరుడు ఆయన. శివున్ని అభిషేక ప్రియుడు అంటారు. శివునికి నిత్యం అభిషేకం చేస్తే చాలు అన్ని ఉన్నట్లే. శివలింగం చల్లగా ఉంటే ఊరు చల్లగా ఉంటుంది. దేశం శాంతిగా ఉంటుందని వేదోక్తి. అయితే శివుడికి అభిషేకాలు చేస్తుంటాం.. అయితే అభిషేకాలు ఎన్నిరకాలు ఏ విధంగా శివాభిషేకాలు చేస్తారో తెలుసుకుందాం…
శివాభిషేకాలు మంత్రపూర్వకంగా అంటే రుద్రభిషేకాలుగా వర్ణిస్తారు. అదేవిధంగా చేసే ద్రవ్యాలను బట్టి అభిషేకాలకు పేర్లు ఉన్నాయి. కానీ శాస్త్రం ప్రకారం రుద్రాభిషేకాలు రకాలనే పరిగణనలోకి తీసుకుంటాం. పదార్థాలు మన కామ్యాలు అంటే కోరికలు తీరడానికి ఆయా పదర్థాలతో, పుష్పాలతో చేస్తాం.
రుద్రాభిషేకాలు 8 విధములు అవి..
రుద్రం అంటే నమకాలు -11, చమకాలు-11 అనువాకాలుగా (సింపుల్‌గా చెప్పాలంటే 11 స్టాన్జాలు అని ఇంగ్లిష్ మీడియం వారికి) సాధారణంగా రుద్రాభిషేకం అంటే 11 నమకాలను, 11/1 చమకాన్ని చెప్పితే ఒక అభిషేకంగా ఇంట్లో నిత్యం చేసుకునేవారు చేసే పద్ధతి. ఇక అసలు అభిషేక సంప్రదాయ పరిశీలిస్తే…
1. వారాభిషేకం- నమకం 11 అనువాకాలను చెప్పి చమకంలో ఒక్కొక్క అనువాకం చొప్పున చెప్పవలెను. ఆ విధంగా నమకం 11 సార్లు (11X11) చెప్పిన, చమకం 11 అనువాకాలకు పూర్తగును. (నమకం 11సార్లు, చమకం 1 సారి) దీన్ని వారాభిషేకం అంటారు.
2. ఆవృత్తి – నమకం 121 సార్లు, చమకం 11 సార్లు చెప్పితే ఆవృత్తి అంటారు.
3. రుద్రం- నమకం 121 సార్లు, చమకం – 11 సార్లు
4. ఏకాదశ రుద్రం- నమకం 14,641 సార్లు, చమకం-1331 సార్లు
5. శతరుద్రం- నమకం 1,61,051 సార్లు,చమకం 14,641 సార్లు
6. లఘురుద్రం- నమకం 17,71,561 సార్లు, చమకం- 1,61,051 సార్లు
7. మహారుద్రం- నమకం 1,94,87,171 సార్లు, చమకం- 17,71,561 సార్లు
8. అతిరుద్రం- నమకం 21,43,58,881 సార్లు, చమకం -1,94,87,171 సార్లు
9.ఇలా 8 రకాలుగా రుద్రాభిషేకాలను చేస్తారు
No comments:
Post a Comment