తీర్థము ఎలా పుచ్చుకోవాలి? తీర్థం అంటే ఏమిటి? మిగిలిన తీర్థం ఏమి చేయాలి?
1) తీర్థం అనేది నేల మీద పడకూడదు, అటు లో పడిన ప్రతి చుక్క కోటి బ్రహ్మరాక్షసులు పుట్ట గలరుట, అందుకే కింద పెద్ద పళ్ళెం కింద ఉంచుతారు, గమనించారా?
2) "కొంతమంది పెద్దలు తలకు రాసుకోకూడదు అని చెబుతారు, ఎందుకంటే ఆ ఎంగిలి తీర్థపు నీళ్లు పక్కనున్న వాళ్ల మీద పడతాయి అని జాగ్రత్త కొరకు మాత్రమే అని గమనించగలరు. తలకు రాసుకుంటే "బ్రహ్మహత్య" దోషము పోతుంది. (సూక్తిముక్తావళి గ్రంథము).
3) "విష్ణు తీర్థము "కాళ్ళమీద పడరాదు.
4) ఆలయములో గాని, మీ ఇంటిలో గాని "తీర్థం" మిగిలిపోయిన తులసి కోట లో కానీ, ఎవరూ తొక్కని ప్రాంతమందు, లేదా ప్రవాహం మందు, విసర్జించవలెను.
5) దైవ ప్రసాదముగా నివేదించు ట కు ఈ తీర్థమును ప్రోక్షణ చేసి, తులసిదళం వేయవలెను, కొద్దిగా ఆవునెయ్యి ప్రోక్షణ చేయవలెను,
6) ఒక ఏకాదశి నుండి మరియొక ఏకాదశి వరకు (15 రోజులు) తీర్థమును నిలువ ఉంచవచ్చు. ఇంటిలో దేవతార్చన చేయువారు లేనప్పుడు,. మాత్రమే,.
7)"తీర్థమును మూడుసార్లు విడివిడిగా తీసుకోవలెను, ఒకేసారి తీసుకొనరాదు.
8) తీర్థమును పుచ్చుకునేవారు తమ కుడి చేతి ని, ఆవు చెవి దొప్పలా, (gokarna కృతి) శబ్దమూ లేకుండా పుచ్చుకో వలెను (తీర్థ గోష్టి గ్రంథము).
9)"తీర్థము పుచ్చుకున్న తరువాత చెయ్యి ని కడుక్కో వలసిన పనిలేదు. తల మీద రాసుకున్న వచ్చు కానీ పక్క వాళ్ళకి ఇబ్బంది కలుగ రాదు.
10)"శంఖము లోని నీటిని తల మీద ప్రోక్షణ చేసుకోవలెను.
11) "ఏకాదశి దినము వలననే శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున కూడా తీర్థమును ఒక్కసారి పుచ్చు కొనవలెను. (పంచరాత్ర గ్రంథము).
12)"ఏకాదశి "నాడు ఒక మారును, "కృష్ణ జయంతి" నాడు మూడు మారులు తీర్థమును గ్రహించవలెను అని తెలుపుచున్నది.(విష్ణు పురాణం) సర్వపాపములు నశించును.
13)" ఒక్క "ఏకాదశి "దినమున తప్ప మిగతా ఏ ఉపవాసము ఉండి న రోజు అయియైననూ గంధము కలిపిన తీర్థమును విష్ణు వ్రత అభిమానము వలనగాని, వ్రత బంధము నేమో అను భయము వలన కాని, మూడు మార్లు తీసుకొనడం అతడు నాకు ద్రోహం చేసిన పాతకము నందును, ఎందుకు సందేహము పడనక్కరలేదు. (విష్ణు రహస్యం గ్రంథము నుండి సేకరణ).
14) మనకు అత్యంత ప్రియమైన దంతా (అనగా మనము సంపదగా భావించే గృహం, ధనం, ధాన్యం, భార్య బిడ్డలు మొదలైనవన్నీ) భగవంతునికి సమర్పించి, మనం వండుకునే భోజన పదార్థములను శ్రీహరి కృపా కటాక్ష లబ్ధ మైనదిగా భావించి, శ్రీహరి రూప, గుణ చింత నా ఆనందమున, కుటుంబ సభ్యులు, అతిథులతో కూడి భుజించుట ఎంత యోగ్యమని శ్రీ ఆచార్యుల వారి సందేశం. (సదాచార స్మృతి 15 శ్లోకం).
15) " భోజనానంతరం సాలిగ్రామ తీర్థమును తప్పక ఒకసారి స్వీకరించవలెను. తినే ఆహారము సత్వరంగా జీర్ణం అయ్యేందుకు, సాత్విక బుద్ధి ఉద్దీపన మునకు, కుడి చేతితో కడుపును నిమురుతూ" ఓం నమో నారాయణాయ" అనే మంత్రాన్ని కొద్దిసేపు జపం చేయాలని చెప్పబడింది.
No comments:
Post a Comment