శ్రీ గణేశాయ నమః | శ్రీ దత్తాత్రేయాయ నమః ||
ఋషయ ఊచుః
కథం సంకల్పసిద్ధిః స్యాద్ వేదవ్యాస కలౌ యుగే | ధర్మార్థకామ మోక్షాణాం సాధనం కిముదాహృతమ్ ||
వ్యాస ఉవాచ
శృణ్వంతు ఋషయ స్సర్వే శీఘ్రం సంకల్పసాధనమ్ | సకృదుచ్చారమాత్రేణ భోగమోక్షప్రదాయకమ్ ||
గౌరీశృంగే హిమవతః కల్పవృక్షోపశోభితమ్ | దీప్తే దివ్యమహారత్న హేమమండపమధ్యగమ్ ||
రత్నసింహాసనాసీనం ప్రసన్నం పరమేశ్వరమ్ | మందస్మితముఖాంభోజం శంకరం ప్రాహ పార్వతీ ||
శ్రీ దేవి ఉవాచ
దేవదేవ మహాదేవ లోకశంకర శంకర | మంత్రజాలాని సర్వాణి యంత్రజాలాని కృత్స్నశః ||
తంత్రజాలాన్యనేకాని మయా త్వత్తః శృతాని వై | ఇదానీం ద్రష్టుమిచ్ఛామి విశేషేణ మహీతలమ్ ||
ఇత్యుదీరితమాకర్ణ్య పార్వత్యా పరమేశ్వరః | కరేణామృజ్య సంతోషాత్ పార్వతీం ప్రత్యభాషత ||
మయేదానీం త్వయా సార్ధం వృషమారుహ్య గమ్యతే | ఇత్యుక్త్వా వృషమారుహ్య పార్వత్యా సహ శంకరః ||
యయౌ భూమండలం ద్రష్టుం గౌర్యాశ్చిత్రాణి దర్శయన్ | క్వచిత్ వింధ్యాచలప్రాంతే మహారణ్యే సుదుర్గమే ||
తత్ర వ్యాహర్తుమాయాంతం భిల్లం పరశుధారిణమ్ | వధ్యమానం మహావ్యాఘ్రం నఖదంష్ట్రాభిరావృతమ్ ||
అతీవ చిత్రచారిత్ర్యం వజ్రకాయసమాయుతమ్ | అప్రయత్నమనాయాసమఖిన్నం సుఖమాస్థితమ్ ||
పలాయంతం మృగం పశ్చాద్వ్యాఘ్రో భీత్యా పలాయతః | ఏతదాశ్చర్యమాలోక్య పార్వతీ ప్రాహ శంకరమ్ ||
శ్రీ దేవి ఉవాచ
కిమాశ్చర్యం కిమాశ్చర్యమగ్రే శంభో నిరీక్ష్యతామ్ | ఇత్యుక్తః స తతః శంభుర్దృష్ట్వా ప్రాహ పురాణవిత్ ||
శ్రీ శంకర ఉవాచ
గౌరి వక్ష్యామి తే చిత్రమవాఙ్మనసగోచరమ్ | అదృష్టపూర్వమస్మాభిర్నాస్తి కించిన్న కుత్రచిత్ ||
మయా సమ్యక్ సమాసేన వక్ష్యతే శృణు పార్వతి | అయం దూరశ్రవా నామ భిల్లః పరమధార్మికః ||
సమిత్కుశప్రసూనాని కందమూలఫలాదికమ్ | ప్రత్యహం విపినం గత్వా సమాదాయ ప్రయాసతః ||
ప్రియే పూర్వం మునీంద్రేభ్యః ప్రయచ్ఛతి న వాంఛతి | తేऽపి తస్మిన్నపి దయాం కుర్వతే సర్వమౌనినః ||
దలాదనో మహాయోగీ వసన్నేవ నిజాశ్రమే | కదాచిదస్మరత్ సిద్ధం దత్తాత్రేయం దిగంబరమ్ ||
దత్తాత్రేయః స్మర్తృగామీ చేతిహాసం పరీక్షితుమ్ | తత్ క్షణాత్ సోऽపి యోగీంద్రో దత్తాత్రేయః సముత్థితః ||
తం దృష్ట్వాశ్చర్యతోషాభ్యాం దలాదనమహామునిః | సంపూజ్యాగ్రే విషీదంతం దత్తాత్రేయమువాచ తమ్ ||
మయోపహూతః సంప్రాప్తో దత్తాత్రేయ మహామునే | స్మర్తృగామీ త్వమిత్యేతత్ కింవదంతీం పరీక్షితుమ్ ||
మయాద్య సంస్మృతోऽపి త్వమపరాధం క్షమస్వ మే | దత్తాత్రేయో మునిం ప్రాహ మమ ప్రకృతిరీదృశీ ||
అభక్త్యా వా సుభక్త్యా వా యః స్మరేన్మామనన్యధీః | తదానీం తముపాగమ్య దదామి తదభీప్సితమ్ ||
దత్తాత్రేయో మునిం ప్రాహ దలాదనమునీశ్వరమ్ | యదిష్టం తద్ వృణీష్వ త్వం యత్ ప్రాప్తోऽహం త్వయాస్మృతః ||
దత్తాత్రేయం మునిం ప్రాహ మయా కిమపి నోచ్యతే | త్వచ్చిత్తే యత్ స్థితం తన్మే ప్రయచ్ఛ మునిపుంగవ ||
శ్రీ దత్తాత్రేయ ఉవాచ
మమాస్తి వజ్రకవచం గృహాణేత్యవదన్మునిమ్ | తథేత్యంగీకృతవతే దలాదమునయే మునిః ||
స్వవజ్రకవచం ప్రాహ ఋషిచ్ఛందః పురస్సరమ్ | న్యాసం ధ్యానం ఫలం తత్ర ప్రయోజనమశేషతః ||
అస్య శ్రీదత్తాత్రేయ వజ్రకవచస్తోత్ర మంత్రస్య, కిరాతరూపీ మహారుద్ర ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీదత్తాత్రేయో దేవతా, ద్రాం బీజం, ఆం శక్తిః, క్రౌం కీలకమ్,
ఓం ఆత్మనే నమః
ఓం ద్రీం మనసే నమః
ఓం ఆం ద్రీం శ్రీం సౌః
ఓం క్లాం క్లీం క్లూం క్లైం క్లౌం క్లః
శ్రీ దత్తాత్రేయ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః
కరన్యాసః
ఓం ద్రాం అంగుష్టాభ్యాం నమః
ఓం ద్రీం తర్జనీభ్యాం నమః
ఓం ద్రూం మధ్యమాభ్యాం నమః
ఓం ద్రైం అనామికాభ్యాం నమః
ఓం ద్రౌం కనిష్ఠికాభ్యాం నమః
ఓం ద్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః
హృదయాది న్యాసః
ఓం ద్రాం హృదయాయ నమః
ఓం ద్రీం శిరసే స్వాహా
ఓం ద్రూం శిఖాయై వషట్
ఓం ద్రైం కవచాయ హుం
ఓం ద్రౌం నేత్రత్రయాయ వౌషట్
ఓం ద్రః అస్త్రాయ ఫట్
ఓం భూర్భువః స్వరోమితి దిగ్బంధః
ధ్యానమ్
జగదంకురకందాయ సచ్చిదానందమూర్తయే | దత్తాత్రేయాయ యోగీంద్రచంద్రాయ పరమాత్మనే ||
కదా యోగీ కదా భోగీ కదా నగ్నః పిశాచవత్ | దత్తాత్రేయో హరిః సాక్షాద్ భుక్తిముక్తి ప్రదాయకః ||
వారాణసీపురస్నాయీ కొల్హాపుర జపాదరః | మాహురీపురభిక్షాశీ సహ్యశాయీ దిగంబరః ||
ఇంద్రనీలసమాకారశ్చంద్రకాంతిసమద్యుతిః | వైదూర్యసదృశస్ఫూర్తిశ్చలత్కించిజ్జటాధరః ||
స్నిగ్ధధావల్య యుక్తాక్షోऽత్యంతనీలకనీనికః | భ్రూవక్షఃశ్మశ్రునీలాంకః శశాంకసదృశాననః ||
హాసనిర్జితనీహారః కంఠనిర్జితకంబుకః | మాంసలాంసో దీర్ఘబాహుః పాణినిర్జితపల్లవః ||
విశాలపీనవక్షాశ్చ తామ్రపాణిర్దలోదరః | పృథులశ్రోణిలలితో విశాలజఘనస్థలః ||
రంభాస్తంభోపమానోరుర్జానుపూర్వైకజంఘకః | గూఢగుల్ఫః కూర్మపృష్ఠో లసత్వాదోపరిస్థలః ||
రక్తారవిందసదృశరమణీయపదాధరః | చర్మాంబరధరో యోగీ స్మర్తృగామీ క్షణే క్షణే ||
జ్ఞానోపదేశనిరతో విపద్ధరణదీక్షితః | సిద్ధాసనసమాసీన ఋజుకాయో హసన్ముఖః ||
వామహస్తేన వరదో దక్షిణేనాభయంకరః | బాలోన్మత్త పిశాచీభిః క్వచిద్ యుక్తః పరీక్షితః ||
త్యాగీ భోగీ మహాయోగీ నిత్యానందో నిరంజనః | సర్వరూపీ సర్వదాతా సర్వగః సర్వకామదః ||
భస్మోద్ధూలితసర్వాంగో మహాపాతకనాశనః | భుక్తిప్రదో ముక్తిదాతా జీవన్ముక్తో న సంశయః ||
ఏవం ధ్యాత్వాऽనన్యచిత్తో మద్వజ్రకవచం పఠేత్ | మామేవ పశ్యన్సర్వత్ర స మయా సహ సంచరేత్ ||
దిగంబరం భస్మసుగంధ లేపనం
చక్ర త్రిశూలం డమరుం గదాయుధమ్ |
పద్మాసనం యోగిమునీంద్రవందితం
దత్తేతినామస్మరణేన నిత్యమ్ ||
పంచోపచార పూజా
ఓం లం పృథివీతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః, గంధం పరికల్పయామి
ఓం హం ఆకాశతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః, పుష్పం పరికల్పయామి
ఓం యం వాయుతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః, ధూపం పరికల్పయామి
ఓం రం అగ్నితత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః, దీపం పరికల్పయామి
ఓం వం అమృతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః, అమృతనైవేద్యం పరికల్పయామి
ఓం సం సర్వతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః, తాంబూలాది సర్వోపచారాన్ పరికల్పయామి
అనంతరం "ఓం ద్రాం" ఇతి మూలమంత్రం 108 వారం జపేత్
ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం
అథ వజ్రకవచమ్
ఓం దత్తాత్రేయః శిరః పాతు సహస్రాబ్జేషు సంస్థితః | భాలం పాత్వానసూయేయశ్చంద్రమండలమధ్యగః ||
కూర్చం మనోమయః పాతు హం క్షం ద్విదలపద్మభూః | జ్యోతీరూపోऽక్షిణీ పాతు పాతు శబ్దాత్మకః శ్రుతీ ||
నాసికాం పాతు గంధాత్మా ముఖం పాతు రసాత్మకః | జిహ్వాం వేదాత్మకః పాతు దంతోష్ఠౌ పాతు ధార్మికః ||
కపోలావత్రిభూః పాతు పా త్వశేషం మమాత్మవిత్ | సర్వాత్మా షోడశారాబ్జస్థితః స్వాత్మాऽవతాద్ గలమ్ ||
స్కంధౌ చంద్రానుజః పాతు భుజౌ పాతు కృతాదిభూః | జతృణీ శత్రుజిత్ పాతు పాతు వక్షఃస్థలం హరిః ||
కాదిఠాంతద్వాదశారపద్మగో మరుదాత్మకః | యోగీశ్వరేశ్వరః పాతు హృదయం హృదయస్థితః ||
పార్శ్వే హరిః పార్శ్వవర్తీ పాతు పార్శ్వస్థితః స్మృతః | హఠయోగాది యోగజ్ఞః కుక్షీం పాతు కృపానిధిః ||
డకారాదిఫకారాంత దశారసరసీరుహే | నాభిస్థలే వర్తమానో నాభిం వహ్న్యాత్మకోऽవతు ||
వహ్నితత్వమయో యోగీ రక్షతాన్మణిపూరకమ్ | కటిం కటిస్థబ్రహ్మాండవాసుదేవాత్మకోऽవతు ||
బకారాదిలకారాంత షట్పత్రాంబుజబోధకః | జలత్వమయో యోగీ స్వాధిస్ఠానం మమావతు ||
సిద్ధాసన సమాసీన ఊరూ సిద్ధేశ్వరోऽవతు | వాదిసాంతచతుష్పత్రసరోరుహనిబోధకః ||
మూలాధారం మహీరూపో రక్షతాద్ వీర్యనిగ్రహీ | పృష్ఠం చ సర్వతః పాతు జానున్యస్తకరాంబుజః ||
జంఘే పాత్వవధూతేంద్రః పాత్వంఘ్రీ తీర్థపావనః | సర్వాంగం పాతు సర్వాత్మా రోమాణ్యవతు కేశవః ||
చర్మం చర్మాంబరః పాతు రక్తం భక్తిప్రియోऽవతు | మాంసం మాంసకరః పాతు మజ్జాం మజ్జాత్మకోऽవతు ||
అస్థీని స్థిరధీః పాయాన్మేధాం వేధాః ప్రపాలయేత్ | శుక్రం సుఖకరః పాతు చిత్తం పాతు దృఢాకృతిః ||
మనోబుద్ధిమహంకారం హృషీకేశాత్మకోऽవతు | కర్మేంద్రియాణి పాత్వీశః పాతు జ్ఞానేంద్రియాణ్యజః ||
బంధూన్ బంధూత్తమః పాయాచ్ఛత్రుభ్యః పాతు శత్రుజిత్ | గృహారామధనక్షేత్రపుత్రాదీన్ శంకరోऽవతు ||
భార్యాం ప్రకృతివిత్ పాతు పశ్వాదీన్ పాతు శార్‍ఙ్గభృత్ | ప్రాణాన్ పాతు ప్రధానజ్ఞో భక్ష్యాదీన్ పాతు భాస్కరః ||
సుఖం చంద్రాత్మకః పాతు దుఃఖాత్ పాతు పురాంతకః | పశూన్ పశుపతిః పాతు భూతిం భూతేశ్వరో మమ ||
ప్రాచ్యాం విషహరః పాతు పాత్వాగ్నేయ్యాం మఖాత్మకః | యామ్యాం ధర్మాత్మకః పాతు నైరృత్యాం సర్వవైరిహృత్ ||
వరాహః పాతు వారుణ్యాం వాయవ్యాం ప్రాణదోऽవతు | కౌబేర్యాం ధనదః పాతు పాత్వైశాన్యాం మహాగురుః ||
ఊర్ధ్వం పాతు మహాసిద్ధః పాత్వధస్తాజ్జటాధరః | రక్షాహీనం తు యత్ స్థానం రక్షత్వాదిమునీశ్వరః ||
హృదయాది న్యాసః
ఓం ద్రాం హృదయాయ నమః
ఓం ద్రీం శిరసే స్వాహా
ఓం ద్రూం శిఖాయై వషట్
ఓం ద్రైం కవచాయ హుం
ఓం ద్రౌం నేత్రత్రయాయ వౌషట్
ఓం ద్రః అస్త్రాయ ఫట్
ఓం భూర్భువః స్వరోమితి దిగ్బంధః
ఏతన్మే వజ్రకవచం యః పఠేత్ శృణుయాదపి | వజ్రకాయశ్చిరంజీవీ దత్తాత్రేయోऽహమబ్రువమ్ ||
త్యాగీ భోగీ మహాయోగీ సుఖదుఃఖ వివర్జితః | సర్వత్ర సిద్ధసంకల్పో జీవన్ముక్తోऽద్య వర్తతే ||
ఇత్యుక్త్వాంతర్దధే యోగీ దత్తాత్రేయో దిగంబరః | దలాదనోऽపి తజ్జప్త్వా జీవన్ముక్తః స వర్తతే ||
భిల్లో దూరశ్రవా నామ తదానీం శృతవానిదమ్ | సకృచ్ఛ్రవణమాత్రేణ వజ్రాంగోऽభవదప్యసౌ ||
ఇత్యేతద్ వజ్రకవచం దత్తాత్రేయస్య యోగినః | శృత్వా శేషం శంభు ముఖాత్ పునరప్యాహ పార్వతీ ||
శ్రీ దేవి ఉవాచ
ఏతత్ కవచమాహాత్మ్యం వద విస్తరతో మమ | కుత్ర కేన కదా జాప్యం కియజ్జాప్యం కథం కథమ్ ||
ఉవాచ శంభుస్తత్ సర్వం పార్వత్యా వినయోదితమ్ | శృణు పార్వతి వక్ష్యామి సమాహితమనావిలమ్ ||
ధర్మార్థకామమోక్షాణామిదమేవ పరాయణమ్ | హస్త్యశ్వరథపాదాతిసర్వైశ్వర్యప్రదాయకమ్ ||
పుత్రమిత్ర కలత్రాది సర్వసంతోషసాధనమ్ | వేదశాస్త్రాది విద్యానాం విధానం పరమం హి తత్ ||
సంగీత శాస్త్ర సాహిత్య సత్కవిత్వ విధాయకమ్ | బుద్ధి విద్యా స్మృతి ప్రజ్ఞా మతి ప్రౌఢిప్రదాయకమ్ ||
సర్వసంతోషకరణం సర్వదుఃఖనివారణమ్ | శత్రుసంహారకం శీఘ్రం యశః కీర్తి వివర్ధనమ్ ||
అష్టసంఖ్యా మహారోగాః సన్నిపాతాస్త్రయోదశః | షణ్ణవత్యక్షిరోగాశ్చ వింశతి ర్మేహరోగకాః ||
అష్టాదశ తు కుష్ఠాని గుల్మాన్యష్టవిధాన్యపి | అశీతిర్వాతరోగాశ్చ చత్వారింశత్తు పైత్తికాః ||
వింశతి శ్లేష్మరోగాశ్చ క్షయ చాతుర్థికాదయః | మంత్ర యంత్ర కుయోగాద్యాః కల్పతంత్రాదినిర్మితాః ||
బ్రహ్మరాక్షస వేతాల కూష్మాండాది గ్రహోద్భవాః | సంగజా దేశకాలస్థాస్తాపత్రయసముత్థితాః ||
నవగ్రహసముద్భూతా మహాపాతక సంభవాః | సర్వే రోగాః ప్రణశ్యంతి సహస్రావర్తనాద్ ధ్రువమ్ ||
అయుతావృతిమాత్రేణ వంధ్యాపుత్రవతీ భవేత్ | అయుతద్వితయావృత్త్యా హ్యపమృత్యుజయో భవేత్ ||
అయుతత్రితయాచ్చైవ ఖేచరత్వం ప్రజాయతే | సహస్రాదయుతాదర్వాక్ సర్వకార్యాణి సాధయేత్ ||
లక్షావృత్త్యా సర్వసిద్ధిర్భవత్యే న సంశయః ||
విషవృక్షస్య మూలేషు తిష్ఠన్ వై దక్షిణాముఖః | కురుతే మాసమాత్రేణ వైరిణం వికలేంద్రియమ్ ||
ఔదుంబరతరోర్మూలే వృద్ధికామేన జాప్యతే | శ్రీ వృక్షమూలే శ్రీకామీ తింత్రిణీ శాంతికర్మణి ||
ఓజస్కామోऽశ్వత్థమూలే స్త్రీకామైః సహకారకే | జ్ఞానార్థీ తులసీమూలే గర్భగేహే సుతార్థిభిః ||
ధనార్థిభి స్తు సుక్షేత్రే పశుకామైస్తు గోష్ఠకే | దేవాలయే సర్వకామైస్తత్కాలే సర్వదర్శితమ్ ||
నాభిమాత్ర జలే స్థిత్వా భానుమాలోక్య యో జపేత్ | యుద్ధే వా శాస్త్రవాదే వా సహస్రేణ జయో భవేత్ ||
కంఠమాత్రే జలే స్థిత్వా యో రాత్రౌ కవచం పఠేత్ | జ్వరాపస్మారకుష్ఠాదితాపజ్వరనివారణమ్ ||
యత్ర యత్ స్యాత్ స్థిరం యద్యత్ ప్రసక్తం తన్నివర్తతే | తేన తత్ర హి జప్తవ్యం తతః సిద్ధిర్భవేద్ధృవమ్ ||
ఇత్యుక్తవాన్ శివో గౌర్యై రహస్యం పరమం శుభమ్ | యః పఠేత్ వజ్రకవచం దత్తాత్రేయ సమో భవేత్ ||
ఏవం శివేన కథితం హిమవత్సుతాయై
ప్రోక్తం దలాదమునయేऽత్రిసుతేన పూర్వమ్ |
యః కోऽపి వజ్రకవచం పఠతీహలోకే
దత్తోపమశ్చరతి యోగివరశ్చిరాయుః ||
ఇతి శ్రీ రుద్రయామళే హిమవత్ఖండే మంత్రశాస్త్రే ఉమామహేశ్వర సంవాదే శ్రీ దత్తాత్రేయ వజ్రకవచస్తోత్రం సంపూర్ణమ్.
!!శ్రీ గురు దత్త - జయ గురు దత్త!!
*శ్రీ దత్తాత్రేయ వజ్రకవచమ్ - తాత్పర్యం*
పూర్వం వేదవ్యాస మహర్షిని సంకల్పసిద్ధి పొందే ఉపాయం చెప్పమని ఋషులు అడిగిరి. అందుకు వేదవ్యాస మహర్షి, ఒక్కసారి చదివితే చాలు సంకల్పాన్ని సిద్ధింపచేసేది, భోగమోక్షాలను ప్రసాదించేది చెపుతాను, అందరూ వినండి అంటూ ఉపక్రమించాడు.
హిమవత్పర్వత గౌరీశృంగంపై రత్నసింహాసనం మీద ఆసీనుడై ఉన్న పరమేశ్వరునితో ఒకనాడు పార్వతీ దేవి, "ఓ లోక శంకరా! నీవల్ల అనేక మంత్రాలను, యంత్రాలను, తంత్రాలను తెలుసుకున్నాను, ఇప్పుడు మహీతలాన్ని దర్శించాలని కోరుకుంటున్నాను" అని పలికింది. పార్వతి కోరికను సంతోషంతో అంగీకరించిన పరమేశ్వరుడు వృషభవాహనం పై బయలు దేరి భూలోక వింతలు చూపించసాగాడు. వారు వింధ్య పర్వత ప్రాంతంలోని ఒక దుర్గమమైన అరణ్యానికి చేరుకున్నారు. అక్కడ వారికి గొడ్డలి ధరించి సమిధలను సేకరిస్తున్న ఒక కిరాతుడు కనిపించాడు. అతని శరీరం వజ్రము వలె ధృఢముగా ఉన్నది. ఇంతలో ఒక పెద్ద పులి అతని పై దాడి చేయుటకు వేగముగా వచ్చినది. అయితే దానిని చూచిన కిరాతుడు తనను రక్షించుకొనుటకు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. పైగా సంతోషముతో నిర్భయముగా నిలబడి ఉన్నాడు. అదే సమయములో ఒక లేడి పరిగెత్తుకుంటూ అక్కడకు రాగా దానిని చూచిన పులి బెదిరి పారిపోయింది.
ఈ వింతను చూసిన పార్వతి శంకరునితో "ఏమాశ్చర్యం! ప్రభూ, ఎదురుగా చూడు" అన్నది. దానికి పరమేశ్వరుడు "దేవీ! మేము చూడనిదంటూ లోకంలో ఏ కొంచమూ లేదు. వాక్కులకు, మనస్సుకు అందని అద్భుతం నీకు చెబుతాను, విను" అంటూ చెప్పనారంభించాడు.
ఈ భిల్లుని పేరు దూరశ్రవుడు. పరమ ధార్మికుడు. ప్రతీరోజూ అడవికి వెళ్ళి కష్టపడి సమిధలూ, దర్భలూ, పుష్పాలూ, కందమూల ఫలాలూ తెచ్చి మునీంద్రులకిస్తాడు. ప్రతిఫలంగా తానేమీ కోరడు. ఆ మునులందరూ కూడా అతని పట్ల దయతో ఉంటారు.
అక్కడే దలాదనుడను మహాయోగి ఉన్నాడు. ఒకనాడు దలాదనుడు, "దత్తాత్రేయుడు స్మర్తృగామి (స్మరించినవారి వద్దకు తక్షణమే వెళతాడు)" అని విన్న కథను తలుచుకొని, దత్తుని స్మరించాడు. మరుక్షణంలో దత్త యోగీంద్రుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. దలాదన మహర్షి ఆశ్చర్యానందాలు పెల్లుబికగా ఆయనను పూజించి, "ఓ దత్తాత్రేయ మహామునీ! నా ఆహ్వానం విని నీవు విచ్చేశావు. స్మర్తృగామివని విని, కేవలం పరీక్షించడానికే నిన్ను స్మరించాను.
ఓం నమః శివాయ
నా అపరాధం మన్నించు." అన్నాడు. అందుకు దత్త భగవానుడు ఆ మునితో "నా ప్రకృతి ఇటువంటిది. భక్తితోగాని, భక్తి లేకుండా కాని అనన్యచిత్తంతో నన్ను స్మరించిన వారి వద్దకు వెళ్ళి వారి కోరికలు తీరుస్తాను" అని చెప్పాడు. "నీవు తలచుకున్నందుకు వచ్చాను గదా, నీకు ఏమి కావాలో కోరుకో" అని దత్తుడు అడుగగా, దలాదుడు, "ఓ మునిపుంగవా! నేనేమీ అడగను. నీ మనస్సులో ఉన్నది, నాకు శ్రేయస్కరమైనది నాకు ప్రసాదింపుము" అన్నాడు.
శ్రీ దత్తాత్రేయుడు, "నా వజ్రకవచం ఉన్నది, తీసుకో" అని చెప్పగా, దలాదుడు అంగీకరించాడు. దత్తుడు తన వజ్రకవచమునకు సంబంధించిన ఋషినీ, ఛందస్సునూ చెప్పి, న్యాసం, ధ్యానం, ప్రయోజనము అన్నీ వివరించి చెప్పాడు.
దత్తాత్రేయ ధ్యానమ్ :
జగత్తు అనే మొక్కకు దుంప వంటి వాడు, సచ్చిదానంద మూర్తి, యోగీంద్రచంద్రుడు, పరమాత్మ అయిన దత్తాత్రేయునికి నమస్కారము. ఒకప్పుడు యోగి, ఒకప్పుడు భోగి, ఒకప్పుడు నగ్నంగా పిశాచి వలె ఉండే దత్తాత్రేయుడు ప్రత్యక్ష హరి స్వరూపుడు. భుక్తి ముక్తి ప్రదాయకుడు. ఆయన ప్రతిదినమూ వారణాసిలో స్నానము, కొల్హాపురంలో జపము, మాహురీపురంలో భిక్ష స్వీకరించి, సహ్యాద్రిపై శయనిస్తాడు. ఆయన శరీరం ఇంద్రనీలమణి వలె, కాంతి వెన్నెల వలె, జటలు వైఢూర్యం వలే ఉంటాయి. కన్నులు తెల్లగా మైత్రితో, కనుపాపలు చాలా నీలంగా ఉంటాయి. కనుబొమలూ, గుండెలపై రోమాలూ, గెడ్డమూ, మీసాలూ నల్లగా ఉంటాయి. నవ్వు పొగమంచు కంటే చల్లగా, కంఠం శంఖం కంటే అందంగా ఉంటాయి. భుజాలు పుష్ఠిగా ఉంటాయి. బాహువులు పొడవుగా, చేతులు చిగుళ్ళ కంటే కోమలంగా ఉంటాయి. వక్షస్థలం విశాలంగా బలిసి ఉంటుంది. పలుచటి ఉదరంతో, విశాలమైన పిరుదులతో, అందంగా ఉంటాడు. కటి స్థలం విశాలంగా, తొడలు అరటిబోదెల వలె ఉంటాయి. చక్కటి మోకాళ్ళు, పిక్కలూ కలిగి ఉంటాడు. చీలమండలు గూఢంగా ఉంటాయి. పాదాల పైభాగాలు తాబేటి డిప్పల వలె ఉంటాయి. అరికాళ్ళు ఎర్ర తామర పువ్వుల వలె అందంగా ఉంటాయి.
ఆయన మృగచర్మమును వస్త్రంగా ధరిస్తాడు. ప్రతీక్షణమూ తనను తలచుకున్న వారి వద్దకు వెళుతుంటాడు. జ్ఞానోపదేశం చేయటమంటే ఇష్టం. ఆపదలు తొలగించటం ఆయన దీక్ష. సిద్ధాసనంలో నిటారుగా కూర్చుని ఉంటాడు. నవ్వు ముఖం. ఎడమచేత వరదముద్ర, కుడిచేత అభయ ముద్ర. బాలురు, ఉన్మత్తులు, పిశాచాలతో కలిసి తిరుగుతుంటాడు. త్యాగి. భోగి. మహాయోగి. నిత్యానందుడు. నిరంజనుడు, సర్వరూపి, సర్వదాత, సర్వగామి. సర్వకామదుడు. భస్మోద్ధూళిత శరీరుడు. మహాపాతకాలను నాశనం చేసేవాడు. భోగ మోక్ష ప్రదాయకుడు.
"ఇలా ధ్యానం చేసి అనన్యచిత్తంతో నా వజ్రకవచాన్ని పఠించాలి. సర్వత్రా నన్నే దర్శిస్తూ, నాతో సంచరించాలి" అని దత్తుడు తెలిపాడు.
దత్తుడు దిగంబరుడు, భస్మ సుగంధం పూసుకున్నవాడు. చక్రం, త్రిశూలం, డమ్రువు, గద అనే ఆయుధాలు ధరించినవాడు. పద్మాసనుడు. యోగీంద్రులూ, మునీంద్రులూ నిత్యమూ ఆయనను "దత్తా, దత్తా" అంటూ నమస్కరిస్తూంటారు.
దత్తాత్రేయ వజ్రకవచమ్ :
ఓం, దత్తాత్రేయుడు సహస్రార కమలంలో ఉండి, శిరస్సును రక్షించుగాక. అనసూయేయుడు చంద్రమండల మధ్యభాగంలో ఉండి ఫాలాన్ని కాపాడుగాక. మనోమయుడు హం క్షం ద్విదళ పద్మభవుడై భ్రూమధ్యమును రక్షించుగాక. జ్యోతిరూపుడు రెండు కన్నులను, శబ్ద స్వరూపుడు రెండు చెవులను, గంధ స్వరూపుడు ముక్కును, రస స్వరూపుడు నోటిని, వేద స్వరూపుడు నాలుకను, ధర్మ స్వరూపుడు దంతాలను మరియూ రెండు పెదవులను కాపాడుగాక. అత్రిభవుడు నా చెక్కిళ్ళను, ఆ తత్వవేత్త నా ముఖమంతటినీ కాపాడుగాక. సర్వస్వరూపుడు, నా ఆత్మలో ఉండేవాడు షోడశారకమలంలో ఉండి, నా కంఠాన్ని రక్షించుగాక. చంద్రానుజుడు నా భుజ శిరస్సులను, కృతాదిభవుడు నా భుజాలను, శత్రుజిత్తు కొంకులను, హరి వక్షస్థలాన్ని కాపాడుగాక. కకారాది ఠకారాంతమైన ద్వాదశారకమలంలో ఉన్న వాయు స్వరూపుడు యోగీశ్వరేశ్వరుడు నా హృదయాన్ని రక్షించుగాక. పార్శ్వస్థితుడనే హరి నా పార్శ్వాలను, హఠయోగాది యోగజ్ఞుడు మరియు కృపానిధి నా కుక్షినీ కాపాడుగాక. డకారాది ఫకారాంతం కల దశారకమలంలో ఉండే అగ్ని స్వరూపుడు నా నాభిని, వహ్నితత్వమయుడైన యోగి నా మణిపూరకాన్ని రక్షించుగాక. కటిలోని బ్రహ్మాండ వాసుదేవ స్వరూపుడు నా కటిని కాపాడుగాక. బకారాది లకారాంతమైన షట్పత్రకమలాన్ని వికసింపచేసే జలతత్వమయుడైన యోగి నా స్వాధిష్ఠాన చక్రాన్ని రక్షించుగాక. సిద్ధాసనంలో కూర్చున్న సిద్ధేశ్వరుడు నా ఊరువులను కాపాడుగాక. వకారాది సకారాంతమైన నాలుగు రేకుల కమలాన్ని వికసింపచేసే మహీరూపుడైన వీర్యనిగ్రహశాలి, మోకాళ్ళపై హస్తపద్మాలు పెట్టుకున్నవాడు నా మూలాధార చక్రాన్ని, ఇంకా అన్ని వైపులనుండీ నా పృష్ఠాన్ని రక్షించుగాక. అవధూతేంద్రుడు నా పిక్కలను, తీర్థపావనుడు నా రెండు పాదాలను, సర్వాత్ముడు నా సర్వాంగాలను కాపాడుగాక.
కేశవుడు నా రోమాలను రక్షించుగాక. చర్మాంబరుడు నా చర్మాన్ని, భక్తిప్రియుడు నా రక్తాన్ని, మాంసకరుడు నా మాంసాన్ని, మజ్జాస్వరూపుడు నా మజ్జను, స్థిరబుద్ధి గలవాడు నా అస్థులను, వేధ నా మేధను, సుఖకరుడు నా శుక్రాన్ని కాపాడుగాక. దృఢాకృతి నా చిత్తాన్ని, హృషీకేశాత్మకుడు నా మనస్సును, బుద్ధిని, అహంకారాన్ని, ఈశుడు నా కర్మేంద్రియాలను, అజుడు నా జ్ఞానేంద్ర
ఓం నమః శివాయ
ియాలను రక్షించుగాక. బంధూత్తముడు నా బంధువులను కాపాడుగాక. శత్రుజిత్తు నన్ను శత్రువులనుండి కాపాడుగాక. శంకరుడు నా ఇల్లు, తోట, ధనం, పొలం, పుత్రులు మొదలైనవి రక్షించుగాక. ప్రకృతివిదుడు నా భార్యను కాపాడుగాక. శార్ ఙ్గభృత్తు నా పశువులను రక్షించుగాక. ప్రధానజ్ఞుడు నా ప్రాణాలను, భాస్కరుడు నా భక్ష్యాదులను, చంద్రాత్మకుడు నా సుఖాన్ని పాలించుగాక. పురాంతకుడు నన్ను దుఃఖం నుండి రక్షించుగాక. పశుపతి నా పశువులను, భూతేశ్వరుడు నా ఐశ్వర్యాన్ని పాలించుగాక.
విషహరుడు తూర్పున, యజ్ఞస్వరూపుడు ఆగ్నేయాన, ధర్మాత్మకుడు దక్షిణాన, సర్వవైరిహృత్ నైరృతి మూల, వరాహుడు పడమటి దిక్కున, ప్రాణదుడు వాయువ్యపు మూల, ధనదుడు ఉత్తరాన, మహాగురుడు ఈశాన్యాన, మహాసిద్ధుడు ఊర్ధ్వదిక్కున, జటాధరుడు అధోదిశన రక్షించాలి. ఆది మునీశ్వరుడు ఏ దిక్కు రక్షణ లేకుండా ఉంటే ఆ దిక్కును కాపాడాలి.
"ఈ నా వజ్రకవచాన్ని ఎవడు చదివినా విన్నా వాడు వజ్రకాయుడు చిరంజీవి కాగలడు. అతడు త్యాగి, భోగి, మహాయోగి, సుఖ దుఃఖ రహితుడు, సర్వత్ర సిద్ధసంకల్పుడు, జీవన్ముక్తుడు అయి వర్తమానంలో ఉంటాడు." అని చెప్పి దత్తాత్రేయ యోగి అంతర్థానం చెందాడు. దలాదుడు కూడా అది జపించి జీవన్ముక్తుడైనాడు. దూరశ్రవుడు అనే భిల్లుడు అప్పుడు దీనిని విన్నాడు. ఒక్కసారి విన్నంతనే వజ్రకాయుడయ్యాడు.
దత్తాత్రేయ కవచమంతా శివుని నోట విన్న పార్వతి, "ఈ కవచం మహత్మ్యమూ, ఉపయోగించే విధానమూ తెలియచేయ"మని అన్నది. వినయంగా అడిగిన పార్వతి ప్రశ్నకు, "ఓ పార్వతీ ఏకాగ్రతతో విను. ధర్మార్థకామ మోక్షాలకు ఇదే ఆధారం"
"ఇది ఏనుగులనూ, గుర్రాలనూ, రథాలనూ, కాలిబంట్లనూ, సర్వైశ్వర్యాన్ని ఇస్తుంది. పుత్ర మిత్ర కళత్రాది సర్వసంతోష సాధనము. వేదశాస్త్రాది విద్యలకు నిధానము. సంగీత, శాస్త్ర సాహిత్య, సత్కవిత్వాలను ప్రసాదిస్తుంది. బుద్ధిని, విద్యను, తలపును, ప్రజ్ఞను, మతిని, నేర్పును ఇస్తుంది. శత్రువులను శీఘ్రమే సంహరిస్తుంది. యశస్సును, కీర్తినీ పెంచుతుంది."
"దీనిని వెయ్యి సార్లు జపిస్తే ఎనిమిది మహారోగాలూ, పదమూడు సన్నిపాతాలూ, తొంభై ఆరు కంటిజబ్బులూ, ఇరవై మేహ రోగాలూ, పద్దెనిమిది కుష్ఠు రోగాలూ, ఎనిమిది విధాల గుల్మాలూ, ఎనభై వాత రోగాలూ, నలభై పైత్య రోగాలూ, ఇరవై శ్లేష్మ రోగాలూ, క్షయ, చాతుర్థికం మొదలైనవీ, మంత్ర యంత్ర, కుత్సిత యోగాదులూ, కల్పతంత్రాదుల వల్ల కలిగించినవీ, బ్రహ్మరాక్షసులూ, భేతాళులూ, కూష్మాండాది గ్రహాలూ, వీటి వల్ల కలిగినవీ, ఆయా దేశకాలాలలో ఉన్నవీ, తాపత్రయం వల్ల కలిగినవీ, నవగ్రహాల వల్ల ఏర్పడినవీ, మహాపాతకాల వల్ల కలిగినవీ, అన్ని రోగాలూ పూర్తిగా నశిస్తాయి. ఇది నిశ్చయం."
"పది వేలసార్లు జపిస్తే గొడ్రాలు పుత్రవతి అవుతుంది. ఇరవై వేలసార్లు జపిస్తే అపమృత్యుజయం లభిస్తుంది. ముప్ఫై వేల సార్లు జపిస్తే ఆకాశ సంచారం అలవడుతుంది. కోటిమార్లు జపిస్తే సర్వకార్యాలు సాధ్యమవుతాయి. లక్ష సార్లకే కార్యసిద్ధి కలుగుతుంది. సంశయం లేదు."
"విషముష్టి చెట్టు మొదట దక్షిణాభిముఖంగా ఒక్క నెల జపిస్తే శత్రువు వికలేంద్రియుడవుతాడు. వృద్ధికి మేడి చెట్టు మొదటా, సిరి కోసం లక్ష్మీ బిల్వం మొదటా, అరిష్టాదుల శాంతికి చింతచెట్టు మొదటా, ఓజస్సు కోసం రావి చెట్టు మొదటా, భార్య కొరకై తీయ మామిడి చెట్టు మొదటా, జ్ఞానార్థం తులసి చెంతా జపించాలి. సంతతి కావాలనుకొనేవారు గర్భగృహంలో, ధనార్థులు మంచి క్షేత్రాలలో, పశువులు కోసం గోశాలలో, ఏ కోరిక గలవరైనా దేవాలయంలోనూ జపించాలి."
"బొడ్డులోతు నీటిలో నిలబడి సూర్యుని చూస్తూ వేయిసార్లు జపించినవాడు యుద్ధంలోగానీ, శాస్త్రవాదంలో గానీ జయిస్తాడు. గొంతులోతు నీటిలో రాత్రిపూట కవచం పఠిస్తే, జ్వరం, అపస్మారం, కుష్ఠు మొదలైన రోగాలూ తాపజ్వరాలూ తొలిగిపోతాయి."
"ఏది ఏది ఎక్కడ స్థిరంగా ఉంటుందో, ఏది ఏది ప్రసన్నమైతే అది నివారణమౌతుందో దాని కొరకు అక్కడ జపిస్తే సిద్ధి కలుగుతుంది. ఇది నిశ్చయం."
అని శివుడు చెప్పాడు. ఈ వజ్రకవచాన్ని పఠించినవాడు దత్తాత్రేయ సమానుడౌతాడు. ఈ విధంగా దత్తాత్రేయుడు దలాదునికి చెప్పినది, శివుడు పార్వతికి తెలియచేశాడు. ఈ కవచమును పఠించినవాడు ఈ లోకంలో దత్తుని వలె యోగి, చిరాయుష్మంతుడు అయి చరిస్తాడు.
దత్తాత్రేయ వజ్రకవచ మహత్మ్యాన్ని "శ్రీ దత్తాత్రేయ గురుచరిత్ర"లో కూడా తెలియజేశారు. లలితాదేవికి మంత్రానికి తోడుగా ఎన్నిరకాల స్తోత్రాలు ఉన్నా సహస్రనామాల మహిమ ఏవిధంగా అత్యున్నతమో, చండీ మంత్రానికి తోడుగా ఎన్ని ఉన్నా సప్తశతికి మిగిలినవేవీ ఎలా సాటిరావో, అదేవిధంగా దత్తమంత్రానికి దత్తాత్రేయ వజ్రకవచమని మనం అర్థం చేసుకోవచ్చు.
గురుచరిత్ర నుండి:
"స్మర్తృగామి అనేది స్వామికి సార్థకమైన బిరుదు. అంగన్యాస కరన్యాసాలతో స్వామిని అర్చించే విధానం ఒకటి ఉంది. దీనిని దత్తకవచమంటారు. బహిరంతశ్శుద్ధుడైన భక్తుడు దత్తనామాలను ఒక్కొక్కటిగా జపిస్తూ శిరస్సు మొదలుకొని కాలివేళ్ళకొనల వరకూ ఒక్కొక్క అంగాన్ని అంగసంధినీ స్పృశించాలి. జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలలో మనోబుద్ధి చిత్తాహంకారాలలో దత్తనామాలను నిక్షేపించాలి. హృదయస్థానంలో అయిదు నామాలను స్థిరపరచాలి (హరి, కాదిఠాంత ద్వాదశా
ఓం నమః శివాయ
రపద్మగో, మరుదాత్మకః, యోగీశ్వరేశ్వరః, హృదయస్థితః). గురువును ఆశ్రయించి ఈ కవచాన్ని ధరించాలి. దత్తకవచధారులకు ఏ రంగంలోనూ అపజయమంటూ ఉండదు. శత్రుభయాలూ దుష్టగ్రహపీడలూ భూతప్రేతపిశాచాల హింసలూ దరిదాపులకైనా రావు. భక్తరక్షణలో ఇది వజ్రకవచం."