Sunday, December 15, 2019

మానవశరీరం -చక్రాలు

మానవ శరీరంలో ఆరు చక్రాలు మరియు సహస్రారం (కుండలిని) తో కలుపుకొని ఏడు.
ఇలా ఆరు చక్రాలు ఒకదానిపై మరొకటి ఆధారపడి గుండ్రంగా చలిస్తూ ఉంటాయి.ఈ ఆరు చక్రాలలో ఒక్క చక్రం చలించటం నిలిచిపోయిన మానవ శరీరం నుండి జీవుడు వెళ్లిపోతాడని శాస్త్ర వివరణ.ఆ చక్రాలు ఈ క్రింది విధంగా మానవ శరీరమందు లీనమై ఉంటాయి.
1.మూలాధారం(Root chakra)
2.స్వాధిష్ఠానం(Spleen chakra)
3.మణిపూరక(Solar chakra)
4.అనాహత(Heart chakra)
5.విశుధ్ధ(Throat chakra)
6.ఆజ్ఞా(Brow chakra)
7.సహస్రారం(Crown chakra)
ఇక ఈ చక్రాల స్థానాలు మరియు వాటి స్థానాలలో గల దేవతలను గురించి చూద్దాం.

పంచ భూతాలు అనగా 1.భూమి 2.ఆకాశం 3.నీరు 4.నిప్పు 5.గాలి ఇలా పంచ భూతాలు మానవ శరిరంలో లీనం అయి ఉంటాయి.

1.మూలాధారం: ఇది మానవ శరీరానికి నడి భాగంలో ఉంటుంది.ఇది పృద్వి భూత స్ధానం (భూమి)
ఈ చక్రానికి అధిపతి గణపతి.

2.స్వాధిష్ఠానం:ఇది మూలాధారానికి దాదాపుగా రెండు అంగులాలపైన అనగా పొత్తి కడుపులో ఉంటుంది.ఇది జల భూత స్థానం (నీరు) ఈ చక్రానికి అధిపతి బ్రహ్మ.

3.మణిపూరక: ఇది మానవ శరీరానికి బోడ్డు స్థానంలో ఉంటుంది.ఇది అగ్ని భూత స్థానం (నిప్పు) దీనికి అధిపతి విష్ణువు.

4.అనాహత:ఇది మానవ హృధయ స్థానంలో ఉంటుంది.ఇది వాయు భూత స్థానం(గాలి).దీనికి అధిపతి రుద్రుడు

5.విశుద్ధ: ఇది మానవ శరీరంలో గొంతు స్థానంలో ఉంటుంది.ఇది దివి భూత స్థానం (ఆకాశం)దీనికీ అధిపతి జీవుడు.

6.ఆజ్ఞా: ఇది మానవ శరీరంలో నీదుటి స్థానంలో ఉంటుంది. ఇది జీవాత్మ స్థానం.దీనికీ అధిపతి జీవుడు.

7.సహస్రారం:ఇది తల పై భాగాన (నడి నెత్తిన) ఉంటుంది.ఇది చక్రం కాదు రంద్రం దీనినే బ్రహ్మ రంద్రం అని కూడా చెపుతారు.దీనికి అధిపతి ఈశ్వరుడు.

మరియు మన హైందవ సాంప్రదాయ పెళ్ళిల్లలో సైతం తలపై జీలకర్ర మరియు బెల్లం మిశ్రమాన్ని తలపై పెట్టిన తరువాత వధూ వరులను ఒకరికొకరిని చూసుకొమని చెబుతారు.కారణం అలా జీల కర్రా మరియు బెల్లం మిశ్రమాన్ని తలపై పెట్టగానే బ్రహ్మ రంద్రం తెరుచుకుంటుంది.అలా తెరుచుకున్న తరువాత మొదటగా చూసిన వారే జీవిత భాగ స్వామిగా బ్రహ్మ స్థలిలో నిర్ణీతం అవుతుంది.

ఇలా అనేక అంగాల కలయికే చక్రం అని పిలవబడుతుంది. ఇలా ఒక్కో చక్రం శరీరంలో ఒక్కో స్థానంలొ లినమై ఉంటుంది.
అనాపానసతి వలన కుండలినీ జాగృతమై,షట్ చక్రాలలో శుద్ది జరుగుతుంది.
కుండలినీ ఎప్పుడైతే సహస్రాణంతో స్తితమవుతుందో అపుడు మనిషి నిర్వాణ స్తితిని పొందుతాడు.

కుండలిని అంటే ఏమిటి ?

కుండలినికి సంబంధించిన కధలు ఎన్నో విని ఉంటారు మీరు. ఇది అర్థం చేసుకోవాలంటే మీ జీవితంలో జరిగే సంఘటనలనే ఉదాహరణగా తీసుకోవడం సమంజసనం. ఉదాహరణకి మీ ఇంటి గోడకి ఒక ప్లగ్ -పాయింట్ ఉంటుంది కానీ విద్యుత్పత్తి అందులోనుండి జరగదు కదా? ఈ విద్యుత్పత్తి ఎక్కడో ఉన్న విద్యత్త్తు కేంద్రంలో జరుగుతుంది. అలాగని మనకి విద్యుత్తు ఈ కేంద్రం నుండి నేరుగా వచ్చేస్తుందా? రాదు కదా? మన ఇంటిగోడకి ఉన్న ప్లగ్ -పాయింట్ ద్వారా ఈ విద్యుత్తుని అందుకుంటాము. మనం ఏదైనా ఉపకరణాన్ని వాడేటప్పుడు ఈ ప్లగ్ -పాయింట్ని వాడుతాము , అయినా ఈ విద్యత్త్తు కేంద్రం గురించి పెద్దగా ఆలోచించము..అసలు దాని మీదకి దృష్టే వెళ్ళదు. అంత పెద్ద విద్యత్త్తు కేంద్రం ఒకటుందని, అందులోనుండి మనకి రోజూ విద్యుత్ సరఫరా జరుగుతోందని తలచుకోము. అయితే ఈ ఉపకరణాన్ని వాడాలంటే మాత్రం ప్లగ్ -పాయింట్ ఉపయోగించాలని తెలుసు. అలా చేస్తే కానీ అది పని చేయదు మరి.

మూల-ఆధార అంటే, అన్నింటికీ మూలం అని అర్థం. ఇక మిగిలిన ఆరు చక్రాలలో ఐదు చక్రాలు ప్లగ్ అన్నమాట.
అలాగే కుండలిని ఒక ప్లగ్ -పాయింట్ లాంటిది కానీ అది విద్యత్త్తు కేంద్రం మాత్రం కాదు. అందులోనూ ఇది 3 – పిన్ పాయింట్ కాదు , ఇది 5 – పిన్ పాయింట్. మనశరీరంలో ఏడు చక్రాలు ఉన్నాయని మీరు వినే ఉంటారు. ఈ చక్రాలలో మూలాధార చక్రం ఒక ప్లగ్ -పాయింట్ లాంటిది. అందుకే దానికి ఆ పేరు. మూల-ఆధార అంటే, అన్నింటికీ మూలం అని అర్థం. ఇక మిగిలిన ఆరు చక్రాలలో ఐదు చక్రాలు ప్లగ్ అన్నమాట. అయితే ఏడవది ఏంటి? అది ఒక కాంతి బల్బ్ అన్నమాట. దీన్ని గనక ప్లగ్ -పాయింట్లో పెడితే మీలోని ప్రతీ అంశం దేదీప్యమానంగా వెలుగుతుంది. మీరు సరిగ్గా గనక ప్లగ్ చేసినట్లైతే మీకు 24 గంటలూ విద్యుత్సరఫరా ఉంటుంది, ఆ వెలుతురూ అలాగే ఉంటుంది, బాటరీ అయిపోతుందన్న బెంగలేదు అలాగే వదిలేయవచ్చు . ఇలా నిర్లక్ష్యంగా రోజంతా ఉంచేసినా/ వదిలేసినా కరెంటు అయిపోతుందన్న బాధ లేదు, ఎందుకంటే మీరు నేరుగా ఆ విద్యత్త్తు కేంద్రంతోనే కనెక్ట్ అయ్యి ఉన్నారు కదా?
ప్రస్తుతం మీలో కూడా ఆ శక్తి ప్రవహిస్తోంది , నేను చెప్పే మాటలు మీరు వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారు, కానీ మీలోని ఈ జీవశక్తులు కొంత మటుకు మాత్రమే పనిచేస్తున్నాయి. మీరే గనక ఈ శక్తులని సరిగ్గా ప్లగ్ చేసినట్లయితే ఆ శక్తి అంతా మీ సొంతమౌతుంది. ఇక మీ క్రియా శక్తి అపారం, దీనితో మీరుచేయలేని పని ఉండదు, ఎందుకంటే శక్తివంతమైన ఈ కరెంటు ఇప్పుడు మీలో ప్రవహిస్తోంది కదా? మీ ఇంట్లో కూడా చూసే ఉంటారు, ఒక్క ప్లగ్ పాయింట్ తో ఎన్నో ఉపకరణాలు పని చేస్తాయి కానీ, అన్నిటికీ అదే విద్యుత్తు . ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే , మీరు ఇంక ప్లగ్ అయ్యి లేరు.

ఈ సృష్టికి మూలమే శక్తి. ఈ విషయం గ్రహిస్తే జీవన మూలం గ్రహించినట్లే. ఈ శక్తి గమ్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే , ఈ సృష్టి యంత్రరచన తెలుసుకున్నట్లే!
సరే, మీ శక్తిని మీరే ఉత్పత్తిచేయాలి అని అనుకున్నారు, రోజుకి ఐదు సార్లు ఆహారం తీసుకుంటారు, అయినా రోజంతా అలసటగానే ఉంటుంది. ఇలా అయితే బ్రతుకు జట్కా బండి ముందుకి వెళ్ళడానికి చాలా కష్టపడుతుంది. శక్తి అంటే.. అది కేవలం బాహ్య ప్రపంచానికి, మన పనులు చేసుకోవడానికి కావలసిన శక్తి కాదు. ఇది జీవితానికీ, జీవనానికీ సంబంధించినది. ఈ సృష్టి అంతా శక్తే కదా? ఈ సృష్టికి మూలమే శక్తి. ఈ విషయం గ్రహిస్తే జీవన మూలం గ్రహించినట్లే. ఈ శక్తి గమ్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే , ఈ సృష్టి యంత్రరచన తెలుసుకున్నట్లే! అందుకే చెపుతున్నాను కుండలిని అంటే, ఆ అపారమైన విద్యుత్త్ కేంద్రానికి కనెక్ట్ అయి ఉండడం అని. ఆ కుండలినికి మీరు నేరుగా కనెక్ట్ అయిఉంటే ఆ విద్యుత్తు ఎలా ఉత్పత్తి అవుతుంది అన్న అవగహన మీకు ఉండక పోవచ్చు, కానీ అది ఎంత శక్తివంతమైనదో, ఎం చేయగలదో మీకు అనుభూతిలోకి వస్తుంది, కచ్చితంగా అర్థం అవుతుంది. అనంతమైన ఈ విద్యుత్త్ కేంద్రమే కుండలిని.
ఒక ఉపకరణాన్ని మీరు వాడాలనుకున్నప్పుడు దాన్ని ప్లగ్ పాయింటులో పెట్టడానికి ప్రయత్నిస్తారు, కానీ మీ చేతులు వణుకుతూ ఉంటే, గోడంతా గీతలు పెడతారు , విఫలమౌతారు. అలాగే ఈ 5 పాయింట్లున్న పిన్నుని ప్లగ్ చేయడానికి చాలామంది ఎంతో శ్రమ పడతారు, ఎందుకంటే వారి శరీరంలో , భావోద్వేగాలలో, జీవశక్తులలో, మనసులో స్థిరత్వం లేదు కాబట్టి. మనం చేసే ఈ యోగా అంతా కూడా ఆ స్థిరత్వం కోసమే. ఆ కుండలినికి మనం సరిగ్గా ప్లగ్ అయిఉంటే అనంతమైన శక్తిని నేరుగా అందుకున్నట్లే. ఇలా జరగడానికి ఆ విద్యుత్త్ కేంద్రం గురించి మీరు తెలుసుకుని అర్ధంచేసుకునే అవసరంలేదు. ఆ కుండలినికి కనెక్ట్ అయి ఉంటే చాలు. యోగ శాస్త్రం అంతా కూడా ఈ కుండలినితో మీరు ఎలా కనెక్ట్ అవ్వాలో నేర్పుతుంది. ఎడతెగని ఈ శక్తి మీలో నిర్విరామంగా ప్రవహిస్తూ ఉంటే సహజంగానే మీరు జీవితంలో ముందుకి సాగిపోతారు. జీవితగమ్యం వైపే సూటిగా పయనిస్తారు. అనవసరమైన భ్రమల్లో, ఆలోచనలలో, భావోద్వేగాలలో , బాహ్యప్రపంచపు చిక్కుల్లో పడరు.

శ్లోకం #38

పద్మనాభోరవిందాక్ష: పద్మగర్భ: శరీరభృత్ |
మహర్దిదృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజ: ||

తాత్పర్యం :

పద్మము నాభియందు కలవాడు (పద్మనాభ), కమలరేకులవంటి కన్నులు కలవాడు (అరవిందాక్ష), పద్మమునందు నివసించువాడు (పద్మగర్భ), ప్రాణుల శరీరములను పోషించువాడు (శరీరభృత్), అంతులేని ధనము కలవాడు (మహర్ధి), ఎల్లప్పుడూ వృద్ధి చెందువాడు (ఋద్ధ), పూర్తిగా పరిణితి చెందినవాడు (వృద్ధాత్మా), ఒక వాహనమునకు బలవంతమైన ఇరుసువంటివాడు (మహాక్ష), తన పతాకమునందు గరుడ చిహ్నము కలవాడూ (గరుడధ్వజ)

వివరణ :

ఇంతకుమునుపు శ్లోకంలో పద్మం మానసిక పరిపక్వతకు చిహ్నం అని చెప్పుకున్నాం. సనాతన ధర్మంలో పద్మానికి నాభికి (నడిబొడ్డు) చాలా సంబంధం ఉంది. యోగశాస్త్రం ప్రకారం, జీవిలోని చైతన్యాన్ని అనేక శక్తులుగా విభజిస్తే, ఆ శక్తులను మొత్తం ఏడు చక్రాలుగా వర్గీకరించవచ్చు.

మూలాధార చక్రం (నాభికి పూర్తిగా క్రిందుగా)- ఆకలి, దప్పిక, భయం, పోట్లాడు-లేదా-పారిపో గుణం (ఇంగ్లీషులో ఫైట్ ఆర్ ఫ్లైట్)

స్వాధిష్టాన చక్రం (పొత్తికడుపులో) - పునరోత్పత్తికి చెందిన శక్తులు, వాటికి సంబంధించిన అవయవాలు

మణిపుర చక్రం (సౌర వలయం) - జీవ క్రియకు సంబంధించిన శక్తులు, ఉదాహరణకు, ఆహారాన్ని జీర్ణించి శక్తిగా మార్చే అవయవాలు వాటికి సంబంధించిన జ్ఞానం

అనాహత చక్రం (హృదయం) - భౌతికేతర భావనలు, ఉదాహరణకు, ప్రేమ, క్రోధం, దయా, దు:ఖం, ఈ చక్రం మన రోగనిరోధక శక్తిని నియంత్రిస్తుంది

విశుద్ధ చక్రం (గొంతు/వాక్కు) - ఈ చక్రం వాక్కుని నియంత్రిస్తుంది

ఆజ్ఞా చక్రం (కనుబొమల మధ్య ప్రదేశం, నుదురు) - జ్ఞానం, జాగృత్/స్వప్న/సుషుప్త స్థితులు

సహస్రారా చక్రం (నడి నెత్తి) - బ్రహ్మం లేదా అంతిమ జ్ఞాన స్థితి

ఈ చక్రాలను మనం జాగ్రత్తగా గమనిస్తే, బొడ్డు క్రిందుగా ఉన్న చక్రాలు కేవలం భౌతిక శక్తులను మాత్రమే నియంత్రిస్తాయి. బుద్ధి లేదా మానసిక పరిపక్వత అన్నది బొడ్డు పైనున్న చక్రాలకు సంబంధించింది. వికసించిన పద్మాన్ని మానసిక పరిపక్వతతో పోలిస్తే, ఆ పద్మ యొక్క ఆవిర్భావం నాభి నుంచే మొదలవాలి (చిహ్నాపూర్వకంగా).

పద్మం ఒక్కసారి విచ్చుకున్న తరువాత మళ్లీ ముడుచుకోదు. ఆలాగే జ్ఞానం ఒక్కసారి సంపాయించిన తరువాత మనం తిరిగి అధమ స్థితులకు జారిపోకూడదు. పద్మముల వంటి కన్నులు కలవాడు (ఆరవిందాక్ష) మరియు పద్మములో నివసించువాడు (పద్మ గర్భ) అన్న గుణాల్లోని సూక్ష్మం.

ఋద్ధ మరియు వృద్ధాత్మ అన్నవి పరస్పర భిన్న గుణాలు. ఎల్లప్పుడూ వృద్ధి చెందువాడు అన్న గుణంపూర్తిగా వృద్ధి చెందిన వాడూ అన్న గుణంతో ఎలా సరిపోతుంది? వృద్ధాత్మ అన్న గుణం గమ్యం అయితే ఋద్ధ అన్న గుణం గమనం. మానవుడిగా పూర్తి పరిణితి చెందడం అన్నది మన గమ్యం అయితే దానిని చేరడానికి మనం చేసే ప్రయత్నమే ఋద్ధ అన్న గుణం.

కుండలినీ శక్తి మరియు చక్రాల కోణంలో చెప్పలంటే, వెన్నెముక క్రిందుగా నిద్రపోతున్న కుండలినీ శక్తి నిద్రలేచి మూలాధారం నుండి సహస్రారం వరకు చేసే ప్రయాణమే ఋద్ధ అన్న గుణానికి నిర్వచనం. సహస్రారం చేరితే అప్పుడు ఆ వ్యక్తి వృద్ధాత్మ అవుతాడు.

ప్రాక్టికల్ గా చెప్పాలంటే, మనకు ఆసక్తి కలిగించే ఒక విషయాన్ని పట్టుకుని దానిగురించి పరిశోధన చేసి ఆ విషయంపై సంపూర్ణ జ్ఞానం సంపాయించాలి. ఉదాహరణకు, మీకు ఫోటోలు తీయడంలో ఆసక్తి ఉందనుకోండి, ఆ విషయంపై మీరు వీలైనంతగా పరిశొధనచేసి ఫోటోగ్రఫిలోని సూక్ష్మాలను అధ్యయనం చేసి వాటిని అమలుచేయండి. అలాగే, వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, మీరు చేసే ప్రతీ పనిలో, సంపూర్ణ జ్ఞానం సంపాయించడానికి ప్రయత్నం చేయండి. ఇదే ఈ శ్లోకంలోని సూక్ష్మం.

యోగశాస్త్రం ప్రకారం, గరుడుడు మనలోని ఐదు వాయువులకు ప్రతిరూపం (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన). ఈ ఐదు వాయువులను ప్రాణాయామం ద్వారా నియంత్రిస్తే మనలోని కుండలినీ శక్తి నిద్రలేస్తుంది. నిద్రలేచిన కుండలినీ శక్తి సహాయంతో జ్ఞాన సముపార్జన చేసి మానవ జన్మలో అత్యున్నత స్థానం చేరవచ్చు.

జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ శ్లోకంలో మతానికి సంబంధించిన విషయం ఏమైనా మీకు కనిపిస్తుందా? ఈ శ్లోకం మొత్తం మనకు మనలో నిష్క్రియాత్మకంగా నిద్రిస్తున్న చైతన్యాన్ని ఎలా జాగృతం చేయాలి అని చెబుతుంది, అది కూడా, చాలా ప్రాక్తికల్ గా.

కుండలినీ, చక్రాలు మరియు జీవ నాడుల గురించి తెలుసుకోవాలంటే లలితా సహస్రనామాలకు మించిన మూలం మనకు ఇంకొకటి ఉండదు.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...