మన హిందూ సనాతన ధర్మమును నందు.. ప్రతీ యొక్క విషయం లోను కూడా ఒక ప్రత్యేకత, ఒక విశిష్టత వుంటుంది. వాటిలో ఒకటైన భోజనం చేయటానికి వుపయోగించే ఆకులు గురించి చూడండి.....
భోజనం చేయుటకు ఉపయోగపడే ఆకులు, వాటిలోని ఔషధ గుణాలు...
అదేవిధముగా మనం ఆహారాన్ని భుజించుటకు విస్తరాకులు వాడటం ఎంతో మంచిది . ఇప్పుడు మీకు ఎటువంటి ఆకులతో చేసిన విస్తరాకులలో తింటే ఎటువంటి ఫలితాలు వస్తాయో వివరిస్తాను.
అరటి ఆకు...
ఇందు భుజించటం మిక్కిలి శ్రేష్టం. కఫవాతములను హరించును . బలమును , ఆరోగ్యమును పెంచును. శరీరకాంతిని , సంభోగ శక్తిని పెంచును. ఆకలిని , దంతకాంతిని కలిగించును. పైత్యశాంతిని కలుగచేయును . శ్లేష్మ సంబంధ దోషాలు పోవును . శరీరం నొప్పులు తగ్గించును . ఉదరము నందలి పుండ్లు అనగా పెప్టిక్ అల్సర్ ను నయం చేయును .
మోదుగ విస్తరి...
ఇందులో భుజించుటచే గుల్మరోగం , మహోదరం , క్రిమిరోగం , రక్తసంబంధ రోగాలు , పిత్తరోగములు నశించును. బుద్దిని పెంచును.
మర్రి ఆకు విస్తరి...
దీని యందు భుజించిన క్రిమి రోగ నివారణ , జఠరాగ్ని వృద్ది , కుష్ఠు వ్యాధి నివారణ అగును. నేత్రదోష నివారణ అగును. వీర్యవృద్ధి కలుగును.
పనస ఆకు...
దీని విస్తరి యందు భుజించిన అగ్నివృద్ధి, పిత్తహర గుణములు ఉండును.
రావి ఆకు...
ఇది పిత్తశ్లేష్మ నివారణ, అగ్నివృద్ది కలిగించును. వీర్యవృద్ధి కలుగచేయును. విద్యార్జనకు మనసు కలుగచేయును.
వక్క వట్ట ఆకు...
ఇది అగ్నివృద్ధిని కలుగచేయును. వాత, పిత్త రోగాలని హరించును.
పైన చెప్పిన ఆకులలో భోజనం చేయడం వలన ఆయా ఆకులలో ఉండు ఔషధ గుణాలు అన్నియు మన శరీరం నందు చేరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చును...
|| ఓం జ్ఞాన యోగము.....
శో || త్యక్త్వా కర్మఫలాసఙ్గం
నిత్యతృప్తో నిరాశ్రయః |
కర్మణ్యభిప్రవృత్తోఽపి
నైవ కించిత్కరోతి సః ||
తా : ఎవడు కర్మఫలములందాసక్తిని విడనాడి నిరంతరము సంతృప్తి గలవాడై దేనిని ఆశ్రయించక నుండునో, అట్టి వాడు కర్మలందు ప్రవర్తించినను ఒకింతైనను చేయనివాడే యగును.
వ్యాఖ్య...
1) కర్మఫలము నందు ఆసక్తి లేనివాడు.
2) నిరంతరము తృప్తి గలవాడు.
3) దృశ్య వస్తువులను ఆశ్రయింపని వాడు (ఆత్మయే ఆశ్రయముగ గలవాడు)..
ఇట్టి లక్షణములు గల మనుజుడు ఎన్ని కర్మలనాచరించినను ఏమియు నాచరింపనివాడే యగునని యిట చెప్పబడినది. జీవన్ముక్తులగు మహనీయులు ఇట్టి స్థితిని సంపాదించియే లోకసంగ్రహార్థము పెక్కు కార్యముల నాచరించుదురు.
1) వారు కర్మలను జేయుదురుగాని కర్మఫలమునందు వారికి ఆసక్తియుండదు. ఫలాభిసంధిరహితముగ ఈశ్వరార్పణ బుద్ధితో వారు కార్యముల నాచరించుచుందురు.
2) మరియు వారు నిత్యతృప్తులై యుందురు. పొందవలసినది యంతయు వారు ఆత్మయందే పొందియున్నారు. కావున మహా సంతృప్తులై యుందురు. ‘నిత్య’ అను పదముచే వారి తృప్తి యేదియో ఒక సమయమునకు పరిమితమై యుండునదికాదనియు , సర్వకాలము లందును వారు తృప్తులై యుందురనియు తెలియుచున్నది.
3) ఇక మూడవది నిరాశ్రయత్వము... మహాత్ములు నశ్వరములగు దృశ్య పదార్థముల నెన్నడును ఆశ్రయించి యుండరు, శాశ్వతమగు ఆత్మనే సదా ఆశ్రయించుకొని యుందురు. ఈ ప్రకారముగ కర్మఫలాసక్తిరాహిత్యము, నిత్య తృప్తి, నిరాశ్రయత్వమను మూడు సుగుణములు గల మహనీయుడు కర్మలను విరివిగ ఆచరించినను, ఏ మాత్రము నాచరించనివాడే యగును. ఇదియే కర్మయందలి అకర్మత్వము. ‘ప్రవృత్తోఽపి’ అని చెప్పక ‘అభిప్రవృత్తోఽపి’ అని చెప్పినందు వలన జ్ఞాని పెక్కు కార్యములను గూడ చక్కగ నాచరింపగల్గునని స్పష్టమగుచున్నది...
|| ఓం నమః శివాయ ||

No comments:
Post a Comment