మంత్రసాధకుడు పాటించవలసిన నియమాలు -
* సాధకుడు మంత్రజపమునకు ఏకాంత ప్రదేశమును ఎంచుకొనవలెను. అతడు మంత్రమును జపించుచున్నప్పుడు మిగతావారి రాకపోకలు ఉండరాదు. పూజామందిరమున జపించుట అత్యంత శ్రేష్టకరం.
* సాధకుడు ఏకాగ్రతతో మంత్రజపం చేయవలెను . వేకువజామునే జపం చేయుట మంచిది .
* జపం , ధ్యానం చేయు సమయములో కదలకూడదు.
* జపం ఆచరించు కాలములో ఖచ్చితముగా బ్రహ్మచర్యం పాటించవలెను. కోపం , ఆగ్రహం దరిదాపుల్లోకి కూడా రాకూడదు.
* అసత్యము పలుకరాదు . చేయగూడని పనులు చేయరాదు . మద్యం , మాంసం వంటి వాటిని సేవించరాదు. ధూమపానం నిషిద్దం. శరీరమును , మనస్సును అన్నివేళలా శుభ్రముగా ఉంచుకొనవలెను.
* మంత్రజపం మొదలుపెట్టిన తరువాత మధ్యలో ఆపరాదు. అలా ఆపినచో అప్పటివరకు చేసిన జపము అంతా వృధా అగును. ఫలితం ఉండదు.
* సాధకుడు మంత్రజపము , ధ్యానసాధన మొదలుపెట్టిన తరువాత ఎటువంటి అనారోగ్యములు అయినను అతని కుటుంబసభ్యులకు కనిపించుచున్నను ధైర్యముతో జపము ఆపకూడదు. రోజులు గడుస్తున్నకొలది సమస్యలు అన్నియు తీరిపోవును.
* జపము చేయు సమయములో ఎటువంటి విచారకరమైన వార్తలు వినినను , ఇతర సమస్యలు ఎదురైనను జపాన్ని ఆపరాదు . గురువుని సంప్రదించ వలెను.
* మంత్రానుష్టానం చేయు రోజుల యందు సాధకుడు ఎక్కువుగా పండ్లు , తేలికగా జీర్ణం అయ్యే ఆహారపదార్థాలు తీసికొనవలెను . ఇలా చేయుట వలన శరీరం బద్ధకం , అనారోగ్యం వంటి సమస్యల పాలబడకుండా అత్యంత చురుకుదనంతో ప్రవర్తించగలరు.
* మంత్రానుష్టానం చేయు సమయంలో ఎదురయ్యే విచిత్ర సంఘటనలు కనిపించిన యెడల అధైర్యపడకూడదు.
* మంత్రజపం చేయు విషయము భార్య , ఇతర కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియపరచవలెను.
* మనస్సు నందు ఏదో ఒక కోరికతో మంత్రసాధన చేయుచున్నప్పుడు ఆ కోరిక నెరవేరుట కొంచం ఆలస్యం అయినను సాధకుడు నిరుత్సహ పడకుండా దైర్యముతో తన మంత్రసాధన కొనసాగించవలెను.
* మనస్సు నందు కోరిక లేకుండా ఏ మంత్రజపం అయినను చేస్తూ ఉన్నచో అన్ని కార్యముల యందు అడ్డంకులు తొలగి ప్రశాంతమైన జీవితం గడపగలరు.
* మంత్రజపం గాని , ధ్యానసాధన , స్తోత్రపఠనం వంటివి ఏవైనా గాని ఒక పర్యాయము దీక్షలో నెరవేరని ఎడల తాను నిర్వహించిన అనుష్టానములో ఏదో ఒక లోపం ఉందని గ్రహించి తిరిగి మరలా ఆ దీక్షనుబూని ఆ లోపం తెలుసుకొని మరలా ఆతప్పు జరగకుండా జాగ్రత్తపడవలెను. లేనిచో దీక్షని శక్త్యానుసారం నిర్వహించవలెను.
* పుస్తకములు చదివి లేదా వేరే వ్యక్తి ద్వారా మంత్రజపమును తెలుసుకుని గాని సాధకుడు దీక్షని మొదలుపెట్టక సరైన గురువు పర్యవేక్షణలోనే దీక్ష చేపట్టవలెను . సద్గురువు ఆశీర్వాదముతో దీక్ష మొదలుపెట్టిన ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్యసిద్ధి పొందగలరు.
* అన్నింటికన్నా ముఖ్యమైనది సాధకుడికి తాను చేయబోయే మంత్రాధిష్టాన దేవత యందు , మంత్రము యందు , స్తోత్రము యందు నమ్మకం , సంపూర్ణ విశ్వాసం , భక్తిశ్రద్ధలు కలిగి ఉండవలెను అప్పుడే ఆ మంత్రజపం సిద్ధిస్తుంది.
సంపూర్ణం
గమనిక -
నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.
మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 50 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.

No comments:
Post a Comment