2019 సంవత్సరం - డిసెంబర్ సూర్య గ్రహణం: తేదీ 26-12-2019 ,ఉ: గం,, 8.08 ని,, నుండి ఉ,, గం,,11.10 ని,, వరకు
కేతుగ్రస్తమైన సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం. ఆధ్యాత్మిక పురోగతిలో గ్రహణాలు అద్భుతమైన పర్వదినాలుగా పరిగణించబడుతాయి. అందులో కంకణాకార సంపూర్ణ సూర్య గ్రహణానికి ప్రాముఖ్యత ఎక్కువ .
ఈ గ్రహణం ధనుస్సు రాశి లో మూలా నక్షత్రం లో ఏర్పడును.
గ్రహణం సమయం సుమారు 3 గంటల 2 నిమిషాలు .
ధనుస్సు రాశి వారు ఈ గ్రహణం చూచుట మంచి కాదు .
ముఖ్యముగా మూలా నక్షత్రం వారు ఈ గ్రహణం చూచుట పనికి రాదు. అనారోగ్య హేతువు.
గ్రహణం ఏ రాశి లో సంభవిస్తుందో ఆ రాశి వారికి దోషం అని ధర్మ శాస్త్రం, అనారోగ్యము వస్తుంది అని జ్యోతిష శాస్త్రం చెప్తున్నాయి. కనుక శాంతిప్రదమైన పరిహారములు చేసుకొనుట ఉత్తమం..
పరిహారములు 3 విధములుగా చేయవచ్చును.
ఉత్తమం,మధ్యమం,అధమం.
ప్రధమం:(ఉత్తమం):-
1). రాగి పాత్ర గాని , కంచు పాత్ర గాని, తీసుకుని బంగారంతో చేయించిన సూర్య బింబాన్ని , వెండితో చేయించిన నాగ సర్పాన్ని ఆ పాత్రలో పెట్టి ఆ పాత్రలో నిండుగా ఆవు నెయ్యి పోసి తెల్లని పంచెల చాపును 1¼ కేజీ నల్లని నువ్వులు సమంత్రకంగా వేదవిదులైన బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి..
గమనిక:- ఈ దానం గ్రహణం విడిచిన తరువాతే చెయ్యాలి.. గ్రహణ సమయంలో చేయరాదు.
దాన సమయం లో చెప్ప వలసిన సంకల్పమ్:-
ధనుస్సు రాశి వారు :-మమ జన్మజాతక ధనుః రాశ్యాత్ తత్రాపి మూలా నక్షత్రే స్వజన్మ నక్షత్రే కెేతు గ్రస్త సంపూర్ణ సూర్య గ్రహణ సమయే సంప్రాప్త సర్వారిష్ట శాంత్యర్ధం.
వృషభ రాశివారు:-మమ జన్మజాతక వృషభ రాశ్యాత్ అష్టమ స్థానే ధనుః రాశ్యాం మూలా నక్షత్రే కెేతు గ్రస్త సంపూర్ణ సూర్య గ్రహణ సమయే సంప్రాప్త సర్వారిష్ట శాంత్యర్ధం.
కన్యా రాశి వారు:- మమ జన్మజాతక కన్యా రాశ్యాత్ అర్థాష్టమ స్థానే ధనుః రాశ్యాం మూలా నక్షత్రే కెేతు గ్రస్త సంపూర్ణ సూర్య గ్రహణ సమయే సంప్రాప్త సర్వారిష్ట శాంత్యర్ధం.
మకర రాశి వారు:- మమ జన్మజాతక మకర రాశ్యాత్ ద్వాదశ స్థానే ధనుః రాశ్యాం మూలా నక్షత్రే కెేతు గ్రస్త సంపూర్ణ సూర్య గ్రహణ సమయే సంప్రాప్త సర్వారిష్ట శాంత్యర్ధం.
ఆజ్య పూరిత కాంశ్య పాత్రే రజత సర్ప యుత ప్రత్యక్ష సువర్న జ్యోతి సహిత సౌర బింబదానం కరిష్యే
పై పరిహారం అవకాశం లేని వారు 2 వ పద్దతి :
2)మహాన్యాస పూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకం చేయవలెను ..
మరియు 1¼ కేజీ ఉలవలు ,1¼ కేజీ గోధుమలు, తెల్లని పంచెల చాపు దానం చేయవలెను..
ఈ పరిహారం కూడా అవకాశం లేని వారు 3 వ పద్దతి:
3:- శివ కవచ స్తోత్రం ప్రతి రోజు పారాయణ 3 నెలల పాటు చేయవలెను ..
గ్రహణ గోచారం:-
ఉత్తమ ఫలితాలు : కర్కాటక , తుల,కుంభ, మీన రాశి వారికి శుభ ఫలితం ఉండును ...
మధ్యమ ఫలితాలు: మేషం, మిధునం, సింహం,వృశ్చికం రాశుల వారికి కొంచెం దోషం తో కూడిన మధ్యమ ఫలితం ఉండును ..
అధమ ఫలితం: వృషభ, కన్యా, ధనుస్సు, మకరం రాశి వారికి సంపూర్ణ దోష పూరిత అధమ ఫలితం సంభవించును .
ముఖ్యముగా ధనుస్సు రాశి వారికి దోషం అధికంగా ఉన్నది కావున పై పరిహారములు తప్పని సరిగా ఆచరించాలి...
సింహారాశి వారు కూడా పరిహారం చేయుట మంచిది ఎందుకంటే రాశ్యాధిపతి కి గ్రహణం పట్టింది కనుక ..
సూర్య గ్రహణం రోజున అందరూ పాటించ వలసిన నియమములు ..
గ్రహణం స్పర్శ కలిగిన వెంటనే పట్టు స్నానం( ప్రారంభసమయం లో స్నానం)
గ్రహణం మధ్య కాలంలో జపాలు చేయుట మంచిది..
గ్రహణం విడిచిన తరవాత స్నానమాచరించి హోములు దానాలు చేయడం మంచిది..
స్నానం చేయు విధానం: సచేల స్నానం ( కట్టుకున్న బట్టలతో స్నానం ఆచరించడం )
స్నానం లో నీటి కి ఉన్న ప్రాధాన్యత:
గోరువెచ్చని నీరు చేయవచ్చును ,
దాని కంటే చల్లని నీరు ఉత్తమం .
దానికంటే బావి లో నీరు ద్విగుణీకృతం ..
దాని కంటే చెరువులో నీరు శత గుణితం ,
దాని కంటే పర్వతాల నుంచి జాలువారే సెలయేటి నీరు సహస్ర గుణితం ,
దానికంటే జీవనది నీరు అనంత గుణితం,
దాని కంటే సముద్ర స్నానం అక్షయం గుణితం ,
ఈ గ్రహణ సమయంలో ఏ వస్తువును స్పర్శ (ముట్టుకోరాదు)చేయరాదు .
ఎందుకంటే సర్వేషాం ఏకవర్ణానాం శూతకం గ్రహణదర్శనేకాబట్టి అందరికి మైల ఏర్పడును ..
గ్రహణం సమయం లో జపం చేయుట మంచిది. వైదిక వృత్తిలో ఉన్నవారు వారికి ఉపదేశించిన మంత్రమును అనుష్టానం చేయుట మంచిది.
సాధారణమైన వాళ్ళు విష్ణు , లలితా సహస్ర నామ పారాయణం , శ్రీరామ రక్షా స్త్రోత్రం , లేదా మీకు ఇష్టమైన దేవతా స్తోత్రం లేదా నామ జపం చేయవచ్చును..
మంత్రకారకో రాహు: తత్సిద్ది కారకో: కేతు: కనుక గ్రహణ సమయంలో మంత్రం బాగా చైతన్యమగును కనుక గ్రహణ సమయాలలో గోరంత జపం లేదా దానం కొండంత ఫలితం ఇచ్చును.
గ్రహణ సమయాల్లో దోష పరిహారార్ధం చేయు దానాలు క్షేత్రాల్లో చేయుట మంచిది.
క్షేత్రాలలో అన్ని క్షేత్రాలలో కంటే కురుక్షేత్రం దానం కు పెట్టింది పేరు. కనుక కురుక్షేత్రములో దానం చేసిన అక్షయం అగును.
గ్రహణ సమయాలలో గర్భిణి స్త్రీలు పాటించవలసిన నియమములు :
గ్రహణ సమయంలో గర్భస్థ శిశువుకు ఇబ్బంది అని ఆచారం లో ఉంది కాని ధర్మ శాస్త్రాలలో ఎక్కడ చెప్పలేదు ..
ప్రత్యక్షంగా (గ్రహణ మొర్రి ముఖ్యంగా కన్ను, ముక్కు, చెవి, నోరు, పెదవి భాగాలకు చూస్తున్నాం )ఆచారం కూడా ప్రధానమైనది..
ఆచార ప్రభవో ధర్మః , ధర్మస్యప్రభురచ్యుతః , కాబట్టి ఆచారమే ధర్మానికి మూలం కనుక ఉదయం 8 గంటల నుండి ఉదయం 11 గంటల 30 నిమిషాల వరకు విశ్రాంతి తీసుకునుట దైవ నామ స్మరణ చేయుట మంచిది ..
గ్రహణం మరుసటి రోజు కూడా గ్రహణ శూల కాబట్టి ఈ రెండు రోజులు విశ్రాంతి తీసుకొనుట దైవ నామస్మరణ చేయుట మంచిది..
గ్రహణ సమయంలో వండుకుని నిల్వ ఉంచిన పదార్ధములు ఏవీ పనికి రావు..
గ్రహణ సమయంలో ఉన్న నీరు కూడా పనికిరాదు.
26-12-2019 గ్రహణం కనుక 25-12-2019 రాత్రి భోజనం చేయరాదు. ఎందుకంటే గ్రహణ సమయాలలో మల మూత్ర విసర్జన కూడా దోషమే ..
గర్భవతులు, వయోవృద్ధులు, పసిపిల్లలు, అనారోగ్యంతో బాధ పడుతున్నవారు పళ్ళు, పాలు స్వీకరించవచ్చును..
ఇంట్లో నిలువ ఉన్న పదార్దాలమీద ధర్బను ఉంచవలెను ..
ఒక వేళ దర్భ లభించని పక్షంలో గరిక ను వాడవచ్చు కానీ దర్భయే ప్రధానం ..
గ్రహణ సమయంలో నాస్తికులు వంటను వండించుట గర్భిణి స్త్రీలతో తినిపించుట వగైరా పనులు చేస్తున్నారు.
ఇది ధర్మ శాస్త్రము నకు పూర్తిగా విరుద్ధము. ఇలా చేసిన వారికి అక్షయ నరకం వస్తుందని ధర్మశాస్త్రం తెలియచెప్తోంది..

No comments:
Post a Comment