ఒక ఊరి లో ఒక పురాణశాస్త్రులుగారు ఉండేవాడు. ఆయన సాయంసమయాలలో ప్రవచనాలను చెపుతూ ఉండేవాడు. ప్రక్క ఊళ్ళనుంచి పెరుగు అమ్ముకునే కొందరు స్త్రీలు ఒకరోజున ఈయన మంచి మాటలను విన్నారు వాటి సారాంశం - 'భగవంతుడిని నమ్ముకుంటే నీళ్ళమీద నడిచేయగలం' అని! ఈ మాట వాళ్ళకి బాగా పట్టింది; ఆ రోజునుండి వాళ్ళు దేవుణ్ణి తలచుకుంటూ, ఆయనమీదే భారంవేసి నీటి పై నడుస్తూ నది దాటగలిగేీవారు . ఇలా కొన్నాళ్ళు గడిచాక, వాళ్ళలో ఒకామె అంది కదా - ' ఈ పంతులుగారు మనకి పడవ ప్రయాణం ఖర్చు తగ్గించాడు కాబట్టి ఒక పంచెల జత ఇచ్చి గౌరవించుదాం' - అని; సరే అన్నారు మిగిలినవాళ్ళు. మరుసటిరోజున శాస్త్రులవారిని వాళ్ళ ఊరికి పిలిచారు. ఈయనా సరేనన్నాడు. తీరా నది దగ్గరకొచ్చాక, 'పడవేది?" - అని అడిగాడీయన. 'అదేంటయ్యవారూ! మీరే కదా అన్నారు - దేవుణ్ణి నమ్మితే పడవ అక్కర్లేకుండానే నదులను దాటేయవచ్చు- అని!' అన్నారు వాళ్ళు. అయినా, ఈయనకేమో నమ్మకం కలగలేదు అప్పటికీ! ' ఏదీ! నడిచి చూపించండి?' అనడిగాడు. వాళ్ళు నిస్సంకోచంగా నీటి పై నడిచి నది అటువైపుకి వెళ్ళిపోయారు, ఈయనేమో తటపటాయిస్తూ మొదటి అడుగు వేశాడు గానీ నీళ్ళలోకి పడిపోయాడు!
**************
భగవంతుని పై నమ్మకం తో ఎటువంటి పనినైనా సాధించగలం.
*************
ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు
లీనమై ;
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం బెవ్వఁ;డనాదిమధ్యలయుఁ డవ్వఁడ ;
సర్వము* దానయైనవాఁ
డెవ్వఁడు ; వాని నాత్మభవు *నీశ్వరునే శరణంబు వేడెదన్ .
ఈ లోకమంతా ఎవరి వల్లనైతే పుడుతుందో; ఎవరిలో కలిసి ఉంటుందో; ఎవరి లోపల లయం అయిపోతుందో; ఎవరు పరమాత్ముడో; ఎవరు సృష్టికి ప్రధానకారణమై ఉన్నాడో; ఎవరైతే పుట్టడం, గిట్టడం, వాటి మధ్య అవస్థలు లేని శాశ్వతుడో; తుది, మొదలు మధ్య లేని అనంతుడో; ఎవరైతే సమస్తమైన సృష్టి తానే అయ్యి ఉంటాడో; అటువంటి స్వయంభువు, ప్రభువు ఐన భగవంతుణ్ణి నే శరణు కోరుతున్నాను.

No comments:
Post a Comment