Wednesday, July 11, 2018

రక్షణ కవచం ”శ్రీచక్రం”

కొన్ని అవ్యక్త తాంత్రిక సిద్ధాంతలాధారంగా గొప్ప గణిత శాస్త్రీయ విధానంలో, తనకు తానై ఆవిష్కరించుకొన్నటువంటి మహాయంత్రం శ్రీచక్రం. సృష్టి వైచిత్రినీ, రహస్యాలను ఇంత సంపూర్ణమైన అధ్యయనంతో అన్వ యించి సాధకుడి సకల మనోభీష్టములను సిద్ధింప చేయగలిగినటు వంటి యంత్ర రాజం మరొకటి లేదు.

అందుకే శ్రీ విద్యా ఉపాసనని స్వతంత్ర తంత్రమని, శ్రీ చక్రాన్ని సిద్ధి వ్రజమనీ అంటారు. ఇది కేవలం సిద్ధి ప్రదమే కాదు. ముక్తి ప్రదం కూడా. ఇహపరసాధనలు సమాంత రంగా సాగి సంపూర్ణ సిద్ధి లభించేటువంటి ఉపాసన ఇది. ఈ చక్రం అమ్మవారి మహా ప్రజ్ఞా స్వరూపాన్నే కాక, ఆమె మహా మాయా విశేష త్వాన్ని జగత్సృష్టి కారత్వాన్ని ఎంతో విపులంగా ప్రకటిస్తుంది.

ప్రతి ఉపాసనకూ యంత్రం, మంత్రం, తంత్రం అనే మూడు ప్రధాన అంగాలుంటాయి.

దేవీ ఉపాసనలో శ్రీచక్రం యంత్రం. పంచదశి మంత్రం. నవావరణ పూజ తంత్రం. లలితా సహస్ర నామాలు మంత్రం, యంత్రా లకు సంబంధించిన తంత్రం.

ఈ చక్రం యంత్రమూ, నవారణ పూజ వంటి పూజ మరొకటి లేదు. బీజాక్షరాలు లేని యంత్రం. దేవతా నామంలేని మంత్రం, ఏ రూపం లేని తంత్రం శ్రీచక్రోపానలోని విశేషం.

శ్రీచక్రంలో బీజాక్ష రాలు లిఖించి యతులు పూజిస్తారు.

ఏ విధమైన బీజాక్షరాలులేకుండానే శ్రీ చక్ర యంత్రం మహా పవిత్రమైనదీ, శక్తివంతమైనది.

ఈ యంత్రం మంత్రమైన పంచదశిలో దేవతానామమేదీ రాదు.

అధర్వుడనే వేద పురుషుడు మానవ కల్యాణార్థం కోసం తాను దర్శించుకొన్న శ్రీ చక్రాన్ని ప్రపంచా నికి ప్రసాదించాడనేది ఒక పాఠం.

బ్రహ్మాండ పురాణంలో భండాసురుని బాధలు పడలేక ఇంద్రాదిదేవతలు పరాశక్తిని ప్రార్ధించగా ఆమె చతుర్సాగరాలలో ఒక సాగరాన్ని ఎండబెట్టి మహా హోమగుండాన్ని నిర్మించి యాగం చేయమని ఆదేశిస్తుంది.

దేవతలు పరాశక్తి ఆజ్ఞను శిరసావహించి తమ దేహఖండాలను సమిథలు చేసి హోమం చేస్తారు. అప్పుడా మహా అగ్ని గుండంలో నుండి ‘చిమగ్ని’ అయిన ఆది పరాశక్తి శ్రీచక్రాకారంగా ఆవిర్భవించి దేవకారస్య సముద్యు సముద్యుతురాలై’ భండాసుర వధికావించింది.

శ్రీచక్రావిర్భావాన్ని గురించి పురాణగాథ

‘తంత్ర శాస్త్రాలలో ఒక్కొక్కతంత్రం ఒక్కొక్క విషయానికే సిద్ధహేతువవుతున్నది. ఏ తంత్రం సకల విషయాలకూ, సర్వార్ధ సాధక మైన సంపూర్ణ ఫలసిద్ధి హేతువు కావడం లేదు.

ఆ విధంగా సర్వార్ధ సిద్ధప్రధమైన, పూర్ణ తంత్రం ప్రసాదించవలసిందని పార్వతీదేవి పరమేశ్వ రుడ్ని ప్రార్ధించింది. అప్పుడు ఆమె ప్రార్థనకు కరుణించిన పరమేశ్వరుడు శ్రీ చక్ర యంత్రాన్ని, శ్రీ విద్యా తంత్రాన్ని ప్రసాదించాడు. ఆ విధంగా శ్రీ చక్రం ఉద్భవించింది.

శ్రీ చక్రం విశ్వరూపం. దేహ రూపం. అణు స్వరూపం కావటం వల్ల ఇది సృష్టికి ప్రతిరూపం.

సృష్టి వైచిత్రినీ, రహస్యాలను సంపూర్ణమైన అధ్యయనంతో అన్వయించి సాధకుడి సకల మనోభీష్టాలను సిద్ధఙంపచేసే యంత్ర రాజం మరొకటిలేదు. అందుకే శ్రీవిద్య ఉపాసనని స్వతంత్ర తంత్రమని, శ్రీ చక్రాన్ని సిద్ది వ్రజమనీ అంటారు.

ఈ చక్రం విశ్వ సృష్టిలో ఉంది. మానవ దేహంలో ఉంది. పరమా ణువులో ఉంది.

మరి ఇది సైన్సా? వేదాంతమా? సైన్సు అయితే అది స్థూలమైన పంచభూతాలస్థాయినే ఇంకా దాటిపోలేదు. మరి ఆధ్యా త్మిక మైనది.

చక్రం ఆధ్యాత్మికోన్నత శిఖరాగ్రాలకు చేరుకున్న మహనీయు లెందరో ఉన్నా, ఎవరూ ఆస్థాయి, ఆస్థానం, ఆదైవీ భావ స్వరూపం ఏమిటి ఎటువంటిది ఎట్లా ఉంటుంది అంటూనే ఇతి హాసాలు, అష్టాదశ పురాణాలూ, శాస్త్రాలు ఉపనిషత్తులు వంటి వాఙ్మయంద్వారా అన్యాప దేశంగా ఆ అనుభవాలను రూపాంతరాలతో వ్యక్తీకరించి కథలు, గాథలుగా చెప్పారు.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...