Wednesday, July 18, 2018

దక్షిణాయనము

ఖగోళ శాస్త్ర పరంగా చూస్తే సూర్యుడి గమనంలో కలిగిన మార్పులే ఉత్తరాయణ, దక్షిణాయనాలు. అయనం అంటే ప్రయాణం అని అర్థం. దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయడమనే అర్థం వస్తుంది. సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని మనకు తెలుసు. కానీ మనం సూర్యోదయాన్ని గమనిస్తే, అది సరిగ్గా తూర్పు దిశలో జరుగదు. సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేది సంవత్సరంలో రెండు రోజులు మాత్రమే. మొదటిది సెప్టెంబరు ఇరవై మూడవ తేది. రెండవది మార్చి ఇరవై ఒకటవ తేది. మిగతా రోజులలో ఆరు నెలల కాలం కాస్త ఈశాన్యానికి దగ్గరగానూ, మరో ఆరు నెలల కాలం ఆగ్నేయానికి దగ్గరగానూ సూర్యోదయం జరుగుతుంది. సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని ఉత్తరాయణం అని, ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని దక్షిణాయనం అంటారు. ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు

కాలాన్ని రాత్రింబవళ్ళుగా విభజించే సూర్యచంద్రుల గమనంపై మానవ జీవన విధానం ఆధారపడి ఉంటుంది. అంతేకాక సంవత్సరంలో సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశి లోనికి ప్రతినెల మారుతుంటాడు. ఇలా మారటాన్నే సంక్రమణం అంటారు. ప్రవేశించిన ప్రతిరాశిలోనూ సూర్యుడు ఒక మాసముంటాడు. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించింది మొదలు మకరరాశిలో ప్రవేశించే వరకు గల మధ్యకాలం దక్షిణాయనం

ఆధ్యాత్మికంగా చెప్పుకోవలసి వస్తే ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే, దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం. ఈ కాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. ఇటువంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సహాయం బాగా అవసరం. అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడానికి ఈ కాలంలో అనేక ఉపాసనలు చేస్తారు. అందువల్ల ఇది ఉపాసన కాలం కూడా అయింది. సంవత్సరంలో ఉత్తరాయణానికి ఎంత విశిష్టత ఉందో, దక్షిణాయనికి కూడా అంతే విశిష్టత ఉంది. రెండూ కాలపురుషుని అంతర్భాగాలే

No comments:

Post a Comment

పరమ శివుని స్వరూపం - శ్రీ దక్షిణామూర్తి

విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషుల...