Thursday, July 5, 2018

ప్రశ్న: ధ్యానమంటే ఏమిటి ?

ఙ: ఆత్మరూపంలో ఉండుటయే ధ్యానం. తన వాస్తవిక స్వరూపం నుంచి రవ్వంతయిన కదలకూడదు. మరియు  ' నేను ధ్యానం చేస్తున్నాను' అన్న భావన నుంచి ముక్తులవ్వాలి.

ప్రశ్న : ధ్యానము మరియు సమాధికి భేదమేమిటి?

ఙ: ఉద్దేశపూర్వకంగా మానసిక ప్రయత్నంతో ధ్యానం జరుగును. సమాధిలో అలాంటి ప్రయత్నం అవసరం లేదు.

ప్రశ్న: ధ్యాన విషయంలో   యే యే విషయములపట్ల జాగ్రత్తలు తీసుకోవాలి ?

ఙ: ఆత్మనిష్ఠులైన పురుషులకు గుర్తుంచు వలసిందేమంటే సదా ఆత్మ లో లీనమై ఉండాలి.కొంచెం కూడా తప్పకూడదు. తన సత్య స్వరూపము నుంచి కదలకుంటే  తనముందే తేజోమండలము,అసామాన్యధ్వనులు మరియు లోపల బయట కనిపించే దేవస్వరూపాలను సత్యమని భావించాలన్న కోరిక ఉత్పన్నమవుతుంది .వారికి ఈ విషయాలన్నింటి గూర్చి భ్రమ ఉండరాదు. మరియు ఆత్మ విస్మరణ కాకుండా చూడాలి.

~ 'నీ సహజ స్థితి' పుస్తకం నుంచి.

No comments:

Post a Comment

నవగ్రహ స్తోత్రములు (తాత్పర్య సహితము)

🙏 నవగ్రహస్తోత్రం 🙏 ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః!! ꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂ 🕉️ 01. రవి (ఆదిత్య): 🙏 ...