Tuesday, July 31, 2018

ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం

ఓం మహాప్రాణ దీపం శివం శివం
మహోకార రూపం శివం శివం
మహాసూర్య చంద్రాది నేత్రం పవిత్రం
మహా ఘాడ తిమిరాంతకంసౌరగాత్రం
మహా కాంతి బీజం మహా దివ్య తేజం భవాని సమేతం
భజే మంజునాథం ఓం ...
నమః శంకరాయచ మయస్కరాయచ నమశివాయచ శివతరాయచ
బవహరాయచ

ఓం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం హృదశహృధయంగమం
చతురుధది సంగమం ... పంచభూతాత్మకం శత్శత్రు నాశకం
సప్తస్వరేశ్వరం ... అష్టసిద్దీశ్వరం . నవరసమనోహరం దశదిశాసువిమలం ...
ఏకాదశోజ్వలం ఏకనాదేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రనథ జన కింకరం
దుర్జనభయంకరం సజ్జన శుభంకరం ప్రాణి భవతారకం తకధిమిత కారకం

భువన భవ్య భవదాయకం భాగ్యాత్మకం రక్షకం

ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం

మహా మధుర పంచాక్షరీ మంత్రం పాశం మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం
ఓం... నమో హరాయచ స్వర హరాయచ పుర హరాయచ బద్రాయచ నిత్యాయచ నిర్నిత్యాయచ

మహా ప్రాణ దీపం శివం శివం
భజే మంజునాదం శివం శివం

డం డం డ ... డంకా నినాద నవ తాండవాడంబరం

తద్ధిమ్మి తక దిమ్మి దిద్దిమ్మి దిమి దిమి దిమ్మి సంగీత సాహిత్య శుభ కమల భంబరం
ఓంకార ఘ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజు నాదేశ్వరం
ఋగ్వేద మాద్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అధర్వప్రభాతం

పురాణేతిహాసం ప్రసీదం విశుద్ధం. పపంచైకసూత్రం విరుద్దం సుసిద్ధం

నకారం మకారం శికారం వకారం యకారం నిరాకారసాకారసారం
మహాకాలకాలం మహా నీలకంఠం మహానందనందం మహాట్టాట్టహాసం
ఝటాఝూట రంగైక గంగా సుచిత్రం జ్వాలాద్రుద్రనేత్రం సుమిత్రం సుగోత్రం
మహాకాశ భాశం మహా భానులింగం
మహాభర్త్రు వర్ణం సువర్ణం ప్రవర్ణం
సౌరాష్ట్ర సుందరం సోమ నాదీశ్వరం
శ్రీశైల మందిరం శ్రీ మల్లిఖార్జునం
ఉజ్జయిని పుర మహాకాళేశ్వరం వైద్యనాదేశ్వరం
మహా భీమేశ్వరం
అమర లింగేశ్వరం
వామలింగేశ్వరం
కాశి విశ్వేశ్వరం

పరం గ్రీష్మేశ్వరం
త్రయంబకేశ్వరం
నాగలింగేశ్వరం
శ్రీ... కేదార లింగేశ్వరం
అగ్ని లింగాత్మకం జ్యోతి లింగాత్మకం
వాయు లింగాత్మకం ఆత్మ లింగాత్మకం
అఖిల లింగాత్మకం అగ్ని సోమాత్మకం
అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం (⓶)
ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం(⓷)

ఓం... నమః
సోమాయచ
సౌమ్యాయచ
భవ్యాయచ
భాగ్యాయచ
శాంతయచ
శౌర్యాయచ
యోగాయచ
భోగాయచ
కాలాయచ
కాంతాయచ
రమ్యాయచ
గమ్యాయచ
ఈశాయచ
శ్రీశాయచ
శర్వాయచ
సర్వాయచ

"వినదగు నెవ్వరు పలికిన..........."

ఆరోగ్య కర మైన  జీవనానికి కొన్ని  నిర్దుష్ట చర్యలు:-

1. ఉదయం  నిద్ర  లేస్తూ...
భగవంతునికి,
తల్లి  తండ్రులకు  నమస్క రించండి.

2. నిద్ర లేచిన  వెంటనే పళ్ళు  తోము...
కోకుండా నే  రెండు గ్లాసుల  గోరు వెచ్చని  నీరు త్రాగండి.

3. బరువు తగ్గాలి. అను కుంటే  అందు లో  కొంచెం  నిమ్మ రసం,  తేనె వేసు కుని  త్రాగండి.

4. మల విసర్జన సమయం లో పళ్ళను  గట్టిగా నొక్కి పెట్టడం  వలన వృద్ధాప్యం లో కూడా పళ్ళు  గట్టిగా  ఉంటాయి.

5. దంత ధావన  సమయంలో   చల్లని  నీటిని నోటి నిండా తీసుకుని  పుక్కిలిస్తూ...
చల్లని  నీటిని  రెండు  చేతులతో  కళ్ల పై చల్లు కుంటే   కళ్ళ  ఆరోగ్యం   బాగుంటుంది.

6. స్నానం  చేసే  నీటి లో  కొద్దిగా  నిమ్మరసం  కలిపితే  వంటి దుర్గంధం తగ్గు తుంది. 
తాజా దనం ఫీల్  అవుతారు.

7. ఆరోగ్యమైన  జీవితం  కోసం సాత్విక ,
ప్రాకృతిక ,
సహజ  ఆహారం  తినండి.

8. శరీర  సమ తుల్యం, శక్తి,
చర్మ  సౌదర్యం   కోసం రోజుకు  కనీసం నాలుగు  లీటర్ల  నీటిని త్రాగండి.

9. నీరు ఎప్పుడు  త్రాగినా  కూర్చుని  త్రాగండి. 
అందు వలన  మీకు  మోకాళ్ళ నొప్పి రాదు.

10. వ్యాధులకు  అత్యుత్తమ  చికిత్స -  ఉపవాసం.

11. దీర్ఘకాల  ఉపవాసం అనారోగ్య కరం.

12. ఉపవాసం  వలన శరీరం  లోని మలినాలు (  టాక్సిన్స్ )  బయటకు  గెంటి వేయ బడతాయి.

13. సామర్ధ్యం అనుసరించి, అవుసరం అయి నంత  ఆహారం తీసు కోండి.

14. అధిక మయిన  ఆహారం అజీర్ణం  కలగ చేస్తుంది .  అనారోగ్యాన్ని  కలుగ చేస్తుంది.


15. సకాలం లో  ఆహారం  తీసు కోండి.  అందు వలన  జీవన గడియారం సక్రమంగా ఉంటుంది.

(కాల భోజనం  ఆరోగ్య కారణం)

16. భోజనానికి  సరిగ్గా  ముందు , భోజనం  చేసినవెంటనే నీరు త్రాగకండి. 
నీటికి  భోజనానికి  మధ్య కనీసం  ఒక  అరగంట  వ్యవధి  ఇవ్వండి.

17. భోజనాన్ని  క్రింద  కూర్చుని తినడం ఉత్తమ  అలవాటు.  డైనింగ్ టేబుల్ వాడుతూ  ఉంటె  కుర్చీలో మఠం వేసుకుని  కూర్చుని  తినండి.

18. భోజనం  చేస్తూ మాట్లాడ కండి . 
అన్నం  భగవత్ప్రసాదంగా భావించి ఆయనకు సమర్పించి  తినండి.

19. టి  . వి. చూస్తూ భోజనం  చెయ్య కండి.

20. భోజనం చివరి లో ఐసు క్రీం వంటి  చల్లని  పదార్ధాలు తిన కండి.

21. ఇత్తడి బిందె లో  నీరు  మంచిది . 
రాగి బిందె  నీరు   వరుసగా  మూడు నెలలు త్రాగితే  ఒక  నెల  విరామం  ఇవ్వండి.

22. వెన్నె ముక  నిటారుగా  ఉండే లా  కూర్చోండి. 
అది మీకు  నడుము నొప్పి  రాకుండా  చేస్తుంది.

23. ఉదయం  అల్పాహారం లో మొలకలు ( పీచుపదార్ధాలు) ఉండేలా  చూసు కోండి .
పండ్లను తినండి.
సలాడ్లు  తినండి.

24. భోజనంలో  ఆకుకూరలు ,  కాయగూరలు ఎక్కువ  ఉండేలా  చూసు కోండి. 
నూనెలు తగ్గించి  బదులుగా ఆవునెయ్యి  వాడండి . 
అది  బరువును పెంచదు.

25.
ఉప్పు, 
నూనె, 
కారం ఆహారానికి రుచిని  మీకు  అనారోగ్యాన్నీ చేకూరుస్తాయి.
అని  మరువ వద్దు.

26. మితంగా  తినండి. 
బ్రతకడం  కోసం తినండి. 
తినడం  కోసం  బ్రతక కండి.

27. ఇవ్వడం  లో  ఉన్న  ఆనందం పొందండి.

28. రాత్రి  నిద్రకు  కనీసం  రెండు  గంటల  ముందు భోజనం పూర్తి  చెయ్యండి . 
రాత్రి  ఎనిమిది గంటల లోపులో భోజనం  ముగించండి. 

మీ  కాలేయం  రాత్రి   11 . 00 నుండి ఉదయం
4 .00 వరకూ  విశ్రాతి తీసుకునే  అవకాశం  ఇవ్వండి.

29.  నిద్రకు   మెత్తటి  పరుపులు, 
ఎత్తు  ఎక్కువ  ఉన్న  తలగడలు హాని  కలిగిస్తాయి.
అని  గుర్తించండి.

30. ఎడమ వైపుకు తిరిగి  పడు కొండి. అందు వలన...
మీ...జీర్ణ క్రియకు దోహదపడే “
కుడి స్వరం”  లో  శ్వాస  ఆడుతుంది. కుడి  ముక్కు  నుండి శ్వాసలు  జరగడం  వలన  ఉష్ణశక్తి ( సూర్యనాడి ) జనిస్తుంది.

31. వ్యాది రహిత  జీవనానికి మానసిక శాంతి అవుసరం. ఆనందం గా ఉంటూ  ఉండండి.

32. విచారాన్ని  వెంట బెట్టు కుని తిరగ కండి.

33. నిన్నటి  విచారం,  రేపటి  ఆందోళన...
మీ  నేటి...జీవిత  ప్రశాంతతకు  భంగం  కలిగించ నివ్వ కండి.

34. చింత , 
ఆందోళన  మీకు  గుండె సంబంధ వ్యాధులను కలిగిస్తాయి.

35. ఆందోళన  ,  భయము మీలో వాత  సంబంధ  వ్యాధులను  కలిగిస్తాయి.

36. ఈర్ష్య,
కోపం మీలో  పిత్తాన్ని ప్రకోపింప చేసి జీర్ణ  సంబంధ వ్యాధులను కలిగిస్తాయి.

37. దురాశ ,
అధిక  ఆందోళన , ఒత్తిడి  మీలో  కఫాన్ని  ప్రకోపింప చేసి  శ్వాస  సంబంధ వ్యాధులను  కలుగ చేస్తాయి.

38. Stress is the  main cause of all  diseases.

39. నిద్ర పోయే ముందు  “ 
నీ  ఒడిలో  నన్ను  పడుకో బెట్టుకో ! 
నాకు  చక్కని స్వల్ప కాలిక లయను ప్రసాదించు”  అని దైవాన్ని  ప్రార్ధించండి. 

40. ఆ రోజు 
మీ...జీవితం  లో  ఏమి  సాధించా రో ఒక్క సారి..పరిశీలించు కోండి . 
మరుసటిరోజు మంచి పనులు  చేసే లా... చూడ మని ఆయన్ను  ప్రార్ధించండి.

41. పెద్దలను  గౌరవించడం ఒక  అలవాటు చేసు కోండి.

42. పిల్లలను  ప్రేమగా  పిలవడం నేర్చు కోండి.

43. ఆంటీ,
అంకుల్  వంటి  ఇంగ్లీష్  పిలుపులకు  బదులు ఆప్యాయతను తెలియ చేసే  వరుసలతో   పిలవండి.

44. మీరు  సౌమ్యంగా  ఉంటె  లోకం  అంతా  సౌమ్యంగా ఉంటుంది.

చక్కని  జీవితానికి   ఈ  మార్గాలు...

సర్వే జనాస్సుఖినో భవంత్

లోకాస్సమస్తాస్సుఖినోభవంత్

Monday, July 30, 2018

హిందూ ధర్మచక్రం - నేటి చిట్టి కథ

ఒక ఊరి లో ఒక పురాణశాస్త్రులుగారు ఉండేవాడు.  ఆయన  సాయంసమయాలలో ప్రవచనాలను చెపుతూ ఉండేవాడు. ప్రక్క ఊళ్ళనుంచి పెరుగు అమ్ముకునే కొందరు స్త్రీలు ఒకరోజున ఈయన మంచి మాటలను విన్నారు వాటి సారాంశం -  'భగవంతుడిని నమ్ముకుంటే నీళ్ళమీద నడిచేయగలం' అని! ఈ మాట వాళ్ళకి బాగా పట్టింది; ఆ రోజునుండి వాళ్ళు దేవుణ్ణి తలచుకుంటూ, ఆయనమీదే భారంవేసి నీటి పై నడుస్తూ నది దాటగలిగేీవారు . ఇలా కొన్నాళ్ళు గడిచాక, వాళ్ళలో ఒకామె అంది కదా - ' ఈ పంతులుగారు మనకి పడవ ప్రయాణం ఖర్చు తగ్గించాడు కాబట్టి ఒక పంచెల జత ఇచ్చి గౌరవించుదాం' - అని; సరే అన్నారు మిగిలినవాళ్ళు. మరుసటిరోజున శాస్త్రులవారిని వాళ్ళ ఊరికి పిలిచారు. ఈయనా సరేనన్నాడు. తీరా నది దగ్గరకొచ్చాక, 'పడవేది?" - అని అడిగాడీయన. 'అదేంటయ్యవారూ! మీరే కదా అన్నారు - దేవుణ్ణి నమ్మితే పడవ అక్కర్లేకుండానే నదులను దాటేయవచ్చు- అని!' అన్నారు వాళ్ళు. అయినా, ఈయనకేమో నమ్మకం కలగలేదు అప్పటికీ! ' ఏదీ! నడిచి చూపించండి?' అనడిగాడు. వాళ్ళు నిస్సంకోచంగా నీటి పై నడిచి నది అటువైపుకి వెళ్ళిపోయారు, ఈయనేమో తటపటాయిస్తూ మొదటి అడుగు వేశాడు గానీ నీళ్ళలోకి పడిపోయాడు!

**************

భగవంతుని పై నమ్మకం తో ఎటువంటి పనినైనా సాధించగలం.

*************
 ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు
 లీనమై ;
 యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం  బెవ్వఁ;డనాదిమధ్యలయుఁ డవ్వఁడ    ;
 సర్వము* దానయైనవాఁ
 డెవ్వఁడు ; వాని నాత్మభవు *నీశ్వరునే శరణంబు వేడెదన్ .

ఈ లోకమంతా ఎవరి వల్లనైతే పుడుతుందో; ఎవరిలో కలిసి ఉంటుందో; ఎవరి లోపల లయం అయిపోతుందో; ఎవరు పరమాత్ముడో; ఎవరు సృష్టికి ప్రధానకారణమై ఉన్నాడో; ఎవరైతే పుట్టడం, గిట్టడం, వాటి మధ్య అవస్థలు లేని శాశ్వతుడో; తుది, మొదలు మధ్య లేని అనంతుడో; ఎవరైతే సమస్తమైన సృష్టి తానే అయ్యి ఉంటాడో; అటువంటి స్వయంభువు, ప్రభువు ఐన భగవంతుణ్ణి నే శరణు కోరుతున్నాను.

Sunday, July 29, 2018

ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడే🙏

శ్రీమన్నారాయుణుడు శ్వేత వరాహావతారం దాల్చిన కల్పం ఆరంభంలో విరాట్ పురుషుని కనులనుండి సూర్యుడు ఆవిర్భవించినట్లు వైవశ్వతమనే గ్రంధం తెలియజేస్తోంది.
బ్రహ్మదేవుడు సృష్టి  మొదలుపెట్టినప్పుడు ముందుగా ఓంకారనాదం జనియించిందని అందునుండే సూర్యుడు జన్మించినట్లు సూర్యపురాణం వివరిస్తోంది.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు , సూర్యచంద్రులు కూడా తానేనని చెపుతాడు.

ఈ విధంగా సూర్యభగవానుడు ఒక మహత్తర శక్తిగా సూర్యనారాయణమూర్తిగా యీ విశ్వమంతా గోచరిస్తున్నాడు. పదునాలుగు భువనాలలో ఆష్టసూర్యులుగా ప్రకాశిస్తున్నట్లు , వీరికి కాశ్యప సూర్యుడు అధిపతియనిమండూకోపనిషత్ లో వ్రాయబడింది.
ప్రతీరోజూ ఉదయాన్నే -

 "ఓం మిత్రాయ, ఓం రవేయ, ఓం భావవే , ఓం ఖగాయ, ఓం పూష్ణే, , ఓం హిరణ్యగర్భాయ, ఓం మరీచయే, ఓం ఆదిత్యాయ, ఓం పవిత్రే, ఓం అర్కాయ, ఓం భాస్కరాయ - నమో నమః

అని భక్తితో సూర్యనమస్కారాలతో అర్చిస్తే సకల ఆయురారోగ్యైశ్వర్యాలు సంప్రాప్తమవుతాయి

ద్వాదశ సూర్య మండల స్తోత్రం

1 . శ్లో|| యన్మండ లందీ పతి కరం విశాలం
రత్న ప్రభంతీవ్ర మనాది రూపమ్|
దారిద్ర్య  దుఃఖ క్షయ కారణంచ
పునాతూమాంత త్స వితుర్వరేణ్యమ్ ||

2 . యన్మండలం దేవగణై స్సు పూజితం
విప్ర్యై స్తు తం మానవ ముక్తి కో విదమ్
తందేవ దేవం ప్రణమామి సూర్యం
పునాతూమాంత త్స వితుర్వరేణ్యమ్ ||

3 . యన్మండలం జ్ఞాన ఘనత్వ గమ్యం
త్ర్యైలోక్య పూజ్యం త్రిగునాత్మ రూపం
సమస్త తేజో మయ దివ్య రూపం
పునాతూమాంత త్స వితుర్వరేణ్యమ్ ||

4 . యన్మండలం గూడ యతి ప్రభోదం
ధర్మ స్య బుద్ధం జ్ఞం కురుతే జనానాం
త్యత్సర్వ పాపోయా కారణం చ
పునాతూమాంత త్స వితుర్వరేణ్యమ్ ||

4 . యన్మండలం గూడ యతిప్రబోధం
ధర్మ స్య బుద్ధ జం కురుతే జనానాం
తత్స ర్వ పాపోయా కారణం చ
పునాతూమాంత త్స వితుర్వరేణ్యమ్ ||

5 . యన్మండలం వ్యాధి వినాశద దక్షం
యద్రుగ్య జు స్సామ సుసంప్ర గీతం
ప్రకాశితం యేన చ భూర్భు వ స్స్వః
పునాతూమాంత త్స వితుర్వరేణ్యమ్ ||

6 . యన్మండలం వేద విదో వదంతి
గాయంతి య చ్చారణ సిద్ధ సంఘాః
యద్యోగి నో యోగ జుషాంచ సంఘాః
పునాతూమాంత త్స వితుర్వరేణ్యమ్ ||

7 . యన్మండలం సర్వ జనే షు పూజితం
జ్యోతిశ్చ కుర్యాది హమర్త్య లోకే
యత్కాలకాలాది మనాది రూపం
పునాతూమాంత త్స వితుర్వరేణ్యమ్ ||

8 . యన్మండలం విష్ణు చతుర్ము ఖాస్యం
యదక్షరం పాపహరం జనానాం
యత్కాల కల్ప క్ష య కారణం చ
పునాతూమాంత త్స వితుర్వరేణ్యమ్ ||

9 . యన్మండలం విశ్వ సృజాం ప్రసిద్ధం
ఉత్పత్తి రక్షా ప్రళయ ప్రగల్భం
యస్మిన్ జగత్సం హరతే ఖిలంచ
పునాతూమాంత త్స వితుర్వరేణ్యమ్ ||

10 . యన్మండలం సర్వగత స్యవిష్ణో:
ఆత్మా పరంధామ విశుద్ధ తత్త్వం
సూక్షాంత రైర్యోగ పథా నుగమ్యం
పునాతూమాంత త్స వితుర్వరేణ్యమ్ ||

11 . యన్మండలం బ్రహ్మ విదో వదంతి
గాయంతి చ్చారణ సిద్ధ సంఘాః
యన్మండలం వేద విద స్స్మరంతి
పునాతూమాంత త్స వితుర్వరేణ్యమ్ || 
 
12 . యన్మండలం వేద వేదోపగీతం
యద్యోగినాం యోగ పథాను గమ్యం
తత్సర్య వేదం ప్రణమామి సూర్యం
పునాతూమాంత త్స వితుర్వరేణ్యమ్ ||

ఫలశ్రుతి:

శ్లో|| మండల ద్వాదశ స్తోత్రం యః పటే త్సతతం నరః
సర్వపాప విశుద్ధాత్మా సూర్యలోకే మహీయతే ||
                                                             
    హరి: ఓమ్ తత్ సత్ సమాప్తం.

⚜🚩⚜🚩⚜🚩⚜

వ్యాస పూర్ణిమ/గురు పూర్ణిమ సందర్భంగా గురువుల సంబంద 73 పుస్తకాలు, 27 ప్రవచనాలు ఒకేచోట ఉచితంగా తెలుగులో

*పుస్తకాలు*

వేదవ్యాస మహర్షి జీవిత చరిత్ర http://bit.ly/Guruvu-1

గురు విజ్ఞాన సర్వస్వము http://bit.ly/Guruvu-2

వసిష్ఠ మహర్షి http://bit.ly/Guruvu-3

గురువులు ఋషులు http://bit.ly/Guruvu-4

మన దేవతలు - ఋషులు -1 http://bit.ly/Guruvu-5

మహర్షుల చరిత్ర http://bit.ly/Guruvu-6

ఉద్దాలక మహర్షి http://bit.ly/Guruvu-7

కణ్వ మహర్షి http://bit.ly/Guruvu-8

జ్ఞానదేవుడు http://bit.ly/Guruvu-9

ఆచార్యుల చరిత్ర http://bit.ly/Guruvu-10

నవయోగులు http://bit.ly/Guruvu-11

మహా యోగులు http://bit.ly/Guruvu-12

ముగ్గురు గురువుల గురుచరిత్ర http://bit.ly/Guruvu-13

బాబాలు,స్వామీజీలు, గురుమహరాజ్ లు http://bit.ly/Guruvu-14

ద్రోణాచార్యులు http://bit.ly/Guruvu-15

ఒక యోగి ఆత్మ కథ http://bit.ly/Guruvu-16

అక్కల్కోట నివాసి శ్రీ స్వామి సమర్ధ http://bit.ly/Guruvu-17

కృష్ణాజీ జీవితం http://bit.ly/Guruvu-18

గణపతి సచ్చిదానంద-1 http://bit.ly/Guruvu-19

జగద్గురు విలాసం http://bit.ly/Guruvu-20

రామానుజ జీయరు స్వామి చరిత్ర http://bit.ly/Guruvu-21

దివ్య మాత http://bit.ly/Guruvu-22

నడిచే దేవుడు(చంద్రశేఖర పరమాచార్యులు) http://bit.ly/Guruvu-23

విద్యాప్రకాశానందగిరి స్వాముల జీవిత చరిత్ర http://bit.ly/Guruvu-24

మహా పురుషుడు http://bit.ly/Guruvu-25

భగవాన్ మహావీరుడు http://bit.ly/Guruvu-26

శ్రీరాఘవేంద్ర స్వామి చరిత్ర http://bit.ly/Guruvu-27

శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము http://bit.ly/Guruvu-28

హరనాథ భాగవతము http://bit.ly/Guruvu-29

అవతార్ మెహెర్ బాబా జీవిత చరిత్ర http://bit.ly/Guruvu-30

ఆంధ్ర యోగులు-7 http://bit.ly/Guruvu-31

సద్గురు మలయాళస్వామి http://bit.ly/Guruvu-32

చ్యవన మహర్షి http://bit.ly/Guruvu-33

మన మహోన్నత వారసత్వం http://bit.ly/Guruvu-34

గురు తత్త్వము http://bit.ly/Guruvu-35

గురు పూజా విధానం http://bit.ly/Guruvu-36

జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్య http://bit.ly/Guruvu-37

శంకరాచార్య చరిత్రము http://bit.ly/Guruvu-38

ఆదిశంకరాచార్య దివ్యచరితామృతము http://bit.ly/Guruvu-39

బాలల శ్రీరామకృష్ణ http://bit.ly/Guruvu-40

ధీర నరేంద్రుడు http://bit.ly/Guruvu-41

షిరిడి సాయిబాబా సచ్చరిత్రము http://bit.ly/Guruvu-42

హేమాడ్ పంత్ విరచిత శ్రీ సాయి సచ్చరిత్ర http://bit.ly/Guruvu-43

షిరిడి సాయిబాబా సచ్చరిత్రము http://bit.ly/Guruvu-44

షిర్డీ సాయి లీలామృతము http://bit.ly/Guruvu-45

సాయిబాబా చరిత్రము-నిత్య పారాయణ గ్రంధము http://bit.ly/Guruvu-46

షిర్డీ సాయి బాబా జీవిత సంగ్రహము http://bit.ly/Guruvu-47

సాయి లీలామృతము http://bit.ly/Guruvu-48

భగవాన్ రమణ మహర్షి http://bit.ly/Guruvu-49

గురు చరిత్ర http://bit.ly/Guruvu-50

శ్రీదత్త గురుచరిత్ర http://bit.ly/Guruvu-51

గురుమూర్తి నృసింహ సరస్వతి చరితము http://bit.ly/Guruvu-52

గురులీల http://bit.ly/Guruvu-53

నవనాధ చరిత్ర-నిత్య పారాయణ http://bit.ly/Guruvu-54

బొమ్మల యోగి వేమన http://bit.ly/Guruvu-55

వేమన http://bit.ly/Guruvu-56

బుద్ధ చరిత్రము http://bit.ly/Guruvu-57

బుద్ధ భగవానుడు http://bit.ly/Guruvu-58

బుద్ధ దర్శనం http://bit.ly/Guruvu-59

వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి సంపూర్ణ చరిత్ర http://bit.ly/Guruvu-60

పోతులూరి వీర బ్రహ్మము గారి జీవితం - రచన పరిశీలన http://bit.ly/Guruvu-61

స్వామి దయానంద http://bit.ly/Guruvu-62

సమర్ధ రామదాసు http://bit.ly/Guruvu-63

అరవిందులు http://bit.ly/Guruvu-64

కబీర్ http://bit.ly/Guruvu-65

గణపతి ముని చరిత్ర సంగ్రహము http://bit.ly/Guruvu-66

మహా తపస్వి-భగవాన్ శ్రీ వశిష్ట గణపతిముని చరిత్ర http://bit.ly/Guruvu-67

గురు గోవింద్ సింగ్ http://bit.ly/Guruvu-68

గురునానక్ http://bit.ly/Guruvu-69

స్వామి సమర్ధ అక్కల్ కోట మహారాజ్ http://bit.ly/Guruvu-70

స్వామి సిద్ధారూడ స్వామి చరిత్ర http://bit.ly/Guruvu-71

భగవాన్ శ్రీ బాల యోగీశ్వరుల చరిత్ర http://bit.ly/Guruvu-72

శ్రీనారాయణ గురు http://bit.ly/Guruvu-73

  **ప్రవచనాలు ***
శ్రీ వ్యాస వైభవం - వ్యాస పౌర్ణమి - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2013 http://bit.ly/Guruvu-VID-1

గురుపౌర్ణమి-వ్యాస పౌర్ణమి - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2013 http://bit.ly/Guruvu-VID-2

గురువు గొప్పదనం - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే  ప్రవచనం-2017 http://bit.ly/Guruvu-VID-3

గురు తత్త్వం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2017 http://bit.ly/Guruvu-VID-4

గురు వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2011 http://bit.ly/Guruvu-VID-5

గురువు - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2014 http://bit.ly/Guruvu-VID-6

గురుపరంపర - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం http://bit.ly/Guruvu-VID-7

గురు మహిమ - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2013 http://bit.ly/Guruvu-VID-8

గురు పూర్ణిమ - శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి గారిచే ప్రవచనం-2015 http://bit.ly/Guruvu-VID-9

సప్త ఋషుల చరిత్ర - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2014 http://bit.ly/Guruvu-VID-10

దక్షిణామూర్తి వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2012 http://bit.ly/Guruvu-VID-11

దక్షిణామూర్తి తత్త్వం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2017 http://bit.ly/Guruvu-VID-12

ఆదిశంకర విజయం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2016 http://bit.ly/Guruvu-VID-13

ఆదిశంకరాచార్య వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2013 http://bit.ly/Guruvu-VID-14

జగద్గురు చరిత్ర - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2017 http://bit.ly/Guruvu-VID-15

ఆదిశంకరాచార్యులు - శ్రీ ప్రేమ్ సిద్ధార్ద్  గారిచే ప్రవచనం-2015 http://bit.ly/Guruvu-VID-16

చంద్రశేఖరమహాస్వామి ప్రస్థానం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2015 http://bit.ly/Guruvu-VID-17

శృంగేరి జగద్గురువుల వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2013 http://bit.ly/Guruvu-VID-18

సాయి బాబా జీవిత చరిత్ర - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2014 http://bit.ly/Guruvu-VID-19

శ్రద్ధ - సబూరి - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2015 http://bit.ly/Guruvu-VID-20

షిర్డి సాయి బాబా తత్వము - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం http://bit.ly/Guruvu-VID-21

సాయి మహత్యం - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2014 http://bit.ly/Guruvu-VID-22

శ్రీ దత్తాత్రేయ గురుచరిత్ర - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2014 http://bit.ly/Guruvu-VID-23

దత్తాత్రేయ చరిత్ర - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-చికాగో-2015 http://bit.ly/Guruvu-VID-24

శ్రీరామకృష్ణ కధామృతం - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే  ప్రవచనం-2017 http://bit.ly/Guruvu-VID-25

వివేకానంద జీవితం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2016 http://bit.ly/Guruvu-VID-26

వివేకానంద జీవిత చరిత్ర - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015 http://bit.ly/Guruvu-VID-27

గురువుల గొప్పదనం  తెలుసుకోవటానికి కావలిసిన పుస్తకాలు,ప్రవచనాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.

మరింత సమాచారం కోసం:
Website:  www.freegurukul.org
Facebook: www.fb.com/freegurukul
Telegram: http://t.me/freegurukul
Whatsapp: 9042020123

Saturday, July 28, 2018

హిందు ధర్మం

ఒక తల్లి తన నిత్య పూజ అయిన తర్వాత విదేశాల్లో వుండే తన కుమారునికి .. జరిగిన  సంభాషణలు.

 తల్లి  .. నాయనా,  పూజా  పునస్కారాలు  ఐనాయా .. ?

కుమారుడు ..  అమ్మా !  నేను  ఒక  జీవ  శాస్త్రవేత్తని.  అది   కూడా  అమెరికాలో  మానవ  వికాసానికి  సంబంధించి  రీసెర్చ్  చేస్తున్నాను ..  డార్విన్ జీవ పరిణామ  సిద్ధాంతాన్ని  వినే వుంటారు.  అలాంటి  నేను పూజలు ..

 తల్లి .. కన్నా !  నాకు కూడా డార్విన్ గురించి కొద్దిగా తెలుసు  ..  కానీ  అతను కనిపెట్టినవి అన్ని  మన  పురాతన   ధర్మంలో ఉన్నవే  కదా  ..  ..   నీకు  అంత  ఆసక్తిగా  వుంటే  చెపుతా విను ..  ..   నీకు  దశావతరాలు .. అది మహా విష్ణువు యొక్క దశావతారాల గురించి  తెలుసు కదా ..

కొడుకు ఆసక్తిగా అవును తెలుసు .. దానికి  ఈ   జీవ పరిణామానికి  ఏమిటీ సంభంధం అని ప్రశ్నించాడు .. ?

 తల్లి  ..  హా !   సంభంధం  ఉంది.  ఇంకా  నువు  నీ  డార్విన్  తెలుసుకోలేనిది  కూడా  చెపుతాను  ..

                      🚩📚🚩
మొదటి   మత్స్య  అవతారం.  అది  నీటిలో ఉంటుంది.  అలాగే సృష్టి కూడా నీటిలోంచే కదా మొదలైంది .. ఇది  నిజమా  కాదా ..

రెండవది  కూర్మ  అవతారం.   అంటే  తాబేలు. దీనిని బట్టి సృష్టి నీటి నుండి భూమి మీదకు ప్రయాణించినట్టు.. అంటే ఉభయచర జీవులు లాగా తాబేలు సముద్రం నుండి భూమికి జీవ పరిణామం జరిగింది.

మూడవది  వరాహ అవతారం అంటే  పంది. ఇది అడవి జంతువులను అంటే బుద్ధి పెరగని జీవులు ..  డైనోసార్ల ని గుర్తుకు తెస్తుంది.

నాలుగో  నృసింహ అవతారం. అంటే సగం మనిషి సగం జంతువు.  దీన్ని బట్టి మనకు జీవ పరినామం అడవి జంతువు నుండి బుద్ధి వికసితమైన జీవులు ఏర్పడ్డాయి అని తెలుస్తుంది.

ఐదో అవతారం వామన  .  అంటే పొట్టివాడు అయిన ఎంతో ఎత్తుకు పెరిగిన వాడు .. మానవులు మొదట హోమో erectes .. హోమో సేపియన్స్ .. మనుషులుగా వికాసం చెందారు.

తల్లి చెప్పేది వింటూ స్తబ్దుగా ఉండిపోయాడు .. తల్లి  కన్నా ! 

ఆరో అవతారం పరశురాముడు. ఈ పరశురాముడు గండ్రగొడ్డలి ని పట్టుకు తిరిగేవాడు. దీని వల్ల ఎం తెలుస్తుందంటే ఆదిమ మానవుడు వేటకు వాడే ఆయుధాలు తయారు చేసుకొన్నాడు. మరియు అడవులు గుహలో నివసించే వాడు మరియు కోపిష్ఠి ఆటవిక న్యాయం కలిగినవాడు.

                       !!  ఇక  !!

!!  ఏడో   అవతారం   రామావతరం .. !! 
మర్యాద  పురుషోత్తముడైన  రాముడు  మొదటి  ఆలోచన  పరుడైన  సామాజిక  వ్యక్తి.  అతను  సమాజానికి  నీతి  నియమాలు,  సమస్త  కుటుంబ   బంధుత్వనికి  అది పురుషుడు.

!!  ఎనిమిదవది  కృష్ణ  పరమాత్మ  .. !!
రాజనీతిజ్ఞుడు  పాలకుడు  ప్రేమించే  స్వభావి.  అతడు  సమాజ   నియమాలను  ఏర్పరిచి  వాటితో  ఆనందాన్ని  ఎలా  పొందాలో   తెలిపినవాడు.  వాటితో  సమాజములో  వుంటూ సుఖ, దుఃఖ, లాభ, నష్టాలు,  అన్ని  నేర్పినవాడు.

కొడుకు ఆశ్చర్యం విస్మయంతో వింటున్నాడు.
ఆ తల్లి తన జ్ఞాన గంగా ప్రవాహాన్ని కొనసాగిస్తూ తర్వాత

తొమ్మిదో ..  బుద్ధ అవతారం. ఆయన నృసింహ అవతారం నిండి మానవుడిగా మారిన క్రమం లో మర్చిపోయిన తన  సాధు స్వభావాన్ని వెతుక్కొన్నాడు. ఇంకా అతను మనిషి తన జ్ఞానాన్ని వెతుక్కొంటు చేసే ఆవిష్కరణ లకు మూలం.

ఇక వచ్చేది కల్కిపురుషుడు. అతను నీవు   ఏ మానవునికై వేతుకోతున్నావో  అతనే ఇతను. అతను ఇప్పటివరకు వరసత్వానిగా వచ్చిన వాటికంటే ఎంతో గొప్ప   శ్రేష్ఠమైన  వ్యక్తిగా వెలుగొందుతాడు.

కొడుకు .. అవాక్కాయి .. ఆనంద భాష్పలతో అమ్మ... హిందు ధర్మం ఎంతో అర్థవంతమైన  నిజమైన ధర్మం ..
 

మన   వేదాలు , గ్రంథాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇత్యాది అన్ని ఎంతో అర్థవంతమైనవి.
కానీ మనం చూసే దృష్టి కోణం మారాలి. మీరు ఎలాగ అనుకొంటే అలా వైజ్ఞనికమైనవి కావచ్చు,  లేదా ధర్మ పరమైనవి కావచ్చు. శాస్ట్రీయత తో కూడిన ధర్మాన్ని నేడు మూఢచారాలు పేరిట మన సంస్కృతి ని మనమే అపహాస్యం చేసుకొంటున్నాం. ఇకనైనా .. రుషులు ఏర్పరచిన సనాతన ధర్మాన్ని పాటించుదాం.

!మనం మారుదాం .. యుగం మారుతుంది!

హనుమలో శివుడుని దర్శించిన సీతమ్మతల్లి

హనుమ రోజూ సరిగ్గా తిండైనా తింటున్నాడో లేదో  .... ఈ రోజు హనుమని భోజనానికి పిలుస్తున్నాను  .... నేనే స్వయంగా  వంటచేసి దగ్గర కూర్చుని తినిపిస్తాను అంది సీతమ్మ  .... పిలు పిలు .... నీకే అర్థం అవుతుంది అన్నాడు రాముడు నవ్వుతూ  .... అన్నట్టుగానే సీతమ్మ స్వయంగా వంటచేసి  .... హనుమని భోజనానికి పిలిచింది  .... తానే పక్కన కూర్చుని స్వయంగా వడ్డిస్తూ  .... కడుపునిండా తిను నాయనా  .... మొహమాటపడకు  అని చెప్పింది

సరేనమ్మా అని చెప్పి హనుమ తలవంచుకుని భోజనం చేయసాగాడు  .... సీతమ్మ కోసరి కోసరి వడ్డిస్తోంది  .... హనుమ వద్దు అనకుండా .... వంచిన తల ఎత్తకుండా పెట్టినదంతా తింటున్నాడు  .... కాసేపట్లో సీతమ్మ స్వయంగా చేసిన వంటంతా అయిపోయింది .... సీతమ్మ కంగారు పడి అంఃతపురవాసుల కోసం వండిన వంట తెప్పించింది  .... అదీ అయిపోయింది  .... తలవంచుకునే  ఆహరం కోసం నిరీక్షీస్తూన్నాడు ....  హనుమ ఆవురావురమంటూ  .... సీతమ్మకి కంగారు పుట్టి .... రోజూ ఏం తింటున్నావు నాయనా  .... అని అడిగింది వినయంగా

రామ నామం తల్లీ  .... వంచిన తలెత్తకుండా జవాబిచ్చాడు  హనుమ  .... సీతమ్మ త్రుళ్లిపడింది  .... నిరంతరం  రామనామం భుజించేవాడు  .... భజించేవాడు  .... శివుడోక్కడే గదా  .... సీతమ్మతల్లి తేరిపార జూసింది  .... అపుడు కనిపించాడు సీతమ్మకి  .... హనుమలో శంకరుడు  .... శంకరుడే హనుమ  .... నిత్యం రామనామం ఆహరంగా స్వీకరించేవాడికి  .... తాను మరే ఆహరం పెట్టగలదు

సీతమ్మ ఓక అన్నపు ముద్దను పట్టుకుని  .... రామార్పణం అని ప్రార్థించి వడ్డించింది  .... ఆ ముద్దని  భక్తితో కళ్లకు అద్దుకోని స్వీకరించి  .... అన్మదాత సుఖీభవా అన్నాడు హనుమ త్రుప్తిగా  .... హనుమలోని పరమేశ్వరుడుకి భక్తితో నమస్కరించింది సీతమ్మతల్లి

🌸..జై హనుమాన్  .... 👏

అనుశాసనిక పర్వము ప్రథమాశ్వాసము

ధర్మరాజు భీష్ముడితో " పితామహా ! మీరు నాకు ఎన్నో ఉపదేశించారు. కాని నా మనసుకు కొంచెం కూడా శాంతి కలుగ లేదు. పట్టుబట్టి ఎంతో మందిని బంధువులను యుద్ధములో వధించాను. మిమ్ము అతి దారుణంగా శరతల్పగతుడిని చేసాను. ఇంత చేసిన నాకు మనశ్శాంతి ఎలాకలుగుతుంది. పితామహా ! నేను సుయోధనుడిని రాజ్యం ఇరువురము పంచుకుని పరిపాలిద్దాము అని ప్రాధేయపడ్డాను. అతడు అందుకు సమ్మతించ లేదు. నేను మాత్రం పోతే పోనీలే అతడికే రాజ్యాన్ని వదిలి వేద్దాము అని అనుకున్నానా ! అలా ఉండక కోపంతో రగిలి పోయి పట్టుదలలకు పోయి యుద్ధం చేసాను ఫలితం సర్వనాశనం అయింది. ఈ నాడు పశ్చాత్తాపపడి ప్రయోజనమేమి ? ఇక నాకు దుఃఖం తప్ప శాంతి ఎలా కలుగుతుంది " అని బాధపడ్డాడు. భీష్ముడు ఊరడింపుగా " ధర్మనందనా ! చింతించకుము అంతా దైవనిర్ణయమే. దానిని తప్పించుట మనచేతిలో లేదు మనము కర్తలమూ కాదు.

బ్రాహ్మణ వనిత

గౌతమి యొక్క ఆదర్శపూరితమైన క్షమాగుణము

దీనికి ఒక కథ చెప్తాను విను. ఒక ఊరిలో గౌతమి అను బ్రాహ్మణ వనిత ఉండేది. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. అతడు ఒక రోజు పాము కరిచి చనిపోయాడు. అది చూసి ఆమె దుఃఖించ సాగింది. అంతలో అది చూసిన బోయవాడు ఆ కుర్రాడిని కరిచిన పామును పట్టి తెచ్చి " అమ్మా ! ఇదిగో నీ కుమారుడిని కరిచిన పామును పట్టి తెచ్చాను. దీనిని ఏమి చెయ్యమటావో చెప్పు. తలపగులకొట్టి చంపమంటావా ! లేక నిలువునా చీల్చి చంపమంటావా ! నీవు ఎలా చెప్తే అలా చేస్తాను " అన్నాడు. గౌతమి " అన్నా ! ఈ పామును విడిచి పెట్టు " అన్నది. బోయవాడు " అమ్మా ! ఇది నీ కుమారుని చంపింది కదా! " అన్నాడు. గౌతమి " అన్నా! విధివశాత్తు ఈ ఆపద వచ్చింది. నాకుమారుడు చనిపోయాడు. అందుకు దుఃఖించడము సహజమే అయినా ! దానికి కారకులు అయిన వారిని చంపడం అధములు చేసే పని. ఉత్తములు, ధర్మపరులు ఆ పని చెయ్యరు. జరిగిన ఆపదను వెంటనే మరచి పోతారు. అన్నా ! నీవు ఆ పామును చంపినంత మాత్రాన నా కుమారుడు బ్రతుకుతాడా ! దానిని విడిచి పెట్టు " అన్నది. బోయవాడు " అమ్మా ! నీ మాటలు నాలాంటి వాడికి అర్ధము కాదు. చంపిన వాడిని చంపడమే నాకు తెలిసిన ధర్మము. కనుక ఈ పామును చంపుతాను " అని అన్నాడు. గౌతమి " అన్నా ! నీ పేరు అర్జునుకుడు. అంటే తెల్లని వాడివి, స్వచ్ఛమైన వాడివి, అమాయకుడివి నీవు ఇలా ప్రవర్తించ తగదు . అయినా నేను హింసకు ఎలా సహిస్తాను " అన్నది. బోయవాడు " అమ్మా ! నా మాట విను జనులను బాధించే వారిని చంపడమే ధర్మము దాని వలన పాపము రాదు " అన్నాడు. గౌతమి " తాను బంధించిన వాడు శత్రువైనా అతడిని చంపడము అధర్మము కదా ! " అన్నది. అమ్మా ! ఈ పామును చంపి ఈ పాటు వలన బాధించబడు వారిని రక్షించడం ధర్మము కాదా ! వృత్తాసురుడిని దేవేంద్రుడు చంపలేదా ! మహాశివుడు దక్షయజ్ఞం ధ్వంసం చేయ లేదా ! అవన్నీ ధర్మములు అయినప్పుడు. ఇది మాత్రము ఎందుకు ధర్మము కాదు. కనుక ఈ పామును చంపుటకు అంగీకరించు " అన్నాడు.

పామువాదన

వీళ్ళ సంభాషణ మౌనంగా విన్న పాము బోయవానితో " అన్నా ! ఇందు నాతప్పు ఏమీ లేదు మృత్యుదేవత నన్ను ఆవహించింది. నేను ఆ బాలుడిని కరిచి చంపాను. అంతే కాని నాకు ఆ బాలుడి మీద కోపము కాని ద్వేషము కాని లేదు " అని పలికింది పాము. బోయ వాడు " మరీ మంచిది మృత్యుదేవతకు ఆయుధమైన నీన్ను చంపడం తప్పు కాదు " పామును చంపబోయాడు. పాము " అయ్యా ! కుమ్మరి వాడు కుండలు చేసే సమయంలో కుండ పగిలితే తిరిగే సారెదా కుమ్మరి వాడిదా తప్పు. అయ్యా నరులు కనపడితే నన్నే చంపుతారు కదా ! అటువంటి నాకు ఇతరులను చంపే శక్తి నాకు ఏది " అన్నది. బోయవాడు " బాగా చెప్పావు సర్పమా ! ఎదుటి వాడు బాణం వేసినప్పుడు బాణము వేసిన వాడిది తప్పా బాణాది తప్పా అని ఆలోచిస్తూ ఊరుకుంటామా ! వేగంగా వస్తున్న బాణాన్ని వేరొక బాణంతో మధ్యలోనే తుంచమా ! అందులో పాపము ఏముంది. అయినా ఎవరో చెప్పారని వచ్చి బాలుని కరిచి ప్రాణములు హరించిన నిన్నే కాదు మృత్యుదేవత చేతి ఆయుధాలైన నీలాంటి పాములన్నింటినీ చంపాలి " అన్నాడు. అందుకు పాము నవ్వి " అన్నా యజ్ఞములు, యాగములు, యజమాని ఆజ్ఞ మేరకు పురోహితులు చేయించినా యజ్ఞఫలితము యజమానికి చెందుతుంది. కనుక ఈ బాలుడిని చంపిన పాపము మృత్యుదేవతే కాని నాది కాదు " అన్నది.

మృత్యుదేవతవాదన

అంతలో మృత్యుదేవత అక్కడకు వచ్చి పాముని చూసి " సర్పరాజమా ! నీవు ఏ పాపము చేయలేదు. నేను నీకు చెప్పినట్లే యముడు నాకు చెప్పాడు. నేను యముని ఆజ్ఞను పాటించినట్లే నీవు నా ఆజ్ఞను పాటించావు కనుక ఇందులో నా పాపము, నీ పాపము ఏమీ లేదు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఆకాశము, జలము, గాలి, ఈ ప్రకృతి అన్నీ యముని చేతిలో ఉన్నాయి " అని మృత్యుదేవత పలికింది. పాము " నువ్వు చెప్పినది నేను చేస్తే అది నా తప్పు అని అంటున్నారు. నీవు పంపావని నేను చెప్పాను. ఇది యముని తప్పా, నీ తప్పా అని చెప్పడానికి నేను ఎవరిని " అని " బోయవాడితో " అన్నా ! మృత్యు దేవత మాట విన్నావు కదా ! నువ్వు నా తప్పు అంటున్నావు. ఈ తప్పు నాకు అంటగట్టడం ధర్మమా ! " అన్నది. బోయవాడు నవ్వి " నువ్వూ మృత్యువు ఇద్దరూ పాపాత్ములే నాకు మీ ఇద్దరిలో ఎవరిని చూసినా భయము లేదు " అన్నాడు. ఇంతలో యమధర్మరాజు అక్కడకు వచ్చి " మీకు కలిగిన ధర్మసందేహం తీర్చడానికి నేను వచ్చాను. అసలు ఈ బాలుడి మరణానికి కారణం ఇతడి కర్మలఫలమే కాని వేరు కాదు. నేను కాని, పాము కాని, మృత్యుదేవత కాని కాదు. మనిషి చేసుకున్న కర్మలే ఫలితంగా పుట్టుకు, మరణము, సుఖము దుఃఖము కలుగుతాయి. వాటిని ఎవరూ తప్పించుకో లేరు. ఈశ్వరుడికైనా కర్మఫలం అనుభవించక తప్పదు కనుక ఈ కుర్రాడు ఎంతటి వాడు కనుక ఎవరిని నిందించ వలసిన అవసరము ఏముంది " అన్నాడు. అప్పుడు గౌతమి తాను చెప్పిన మాటలే యమధర్మరాజు చెప్పడం చూసి " అన్నా ! యమధర్మరాజు చెప్పినది విన్నావు కదా ! నాకు పుత్రశోకం కలగాలని ఉంది కనుక అనుభవిస్తున్నాను. ఇది వెనుక జన్మలో నేను చేసిన కర్మల ఫలితము. దీనికి ఎవరిని నిందించిన ఫలితమేమి ? కనుక ఆ పామును విడిచి పెట్టు " అన్నది. ఇందరి మాట విని బోయవాడ జ్ఞానోదయము పొంది ఆ పామును విడిచి పెట్టాడు. కనుక ధర్మనందనా ! యుద్ధంలో నీ బంధువులు మరణానికి కారణం నీవు కాదు. వారి వారి దుష్కర్మలకు కలిగిన ఫలితమే ! నీవు వారి మరణానికి దుఃఖించడం వృధా ! " అని చెప్పాడు.

మృత్యుభయమ

అగ్నిదేవుడికి సుదర్శనకు ఒక కుమారుడు కలిగాడు. అతడికి సుదర్శనుడు అను నామకరణం చేసాడు. అతడు సుగుణసంపన్నుడు ధర్మపరుడు. సుదర్శనుడు పెద్దవాడై తాతగారి రాజ్యభారమును వహించి రాజ్యపాలన చేయసాగాడు. సుదర్శునుడికి వివాహమై ఒక కుమారుడిని పొందాడు. అతడి పేరు ఓఘవంతుడు. ఓఘవంతుడికి ఒక కుమార్తె ఓఘవతి ఒక కుమారుడు ఓఘరధుడుకలిగారు. ఓఘవతికి వివాహ వయసురాగానే ఆమెకు తగిన వరుడి కొరకు వెతికి చివరకు తాతగారైన సుదర్శనుడితో వివాహము జరిపించారు. ఓఘవతిని చేపట్టిన సుదర్శనుడు " నేను గృహస్థధర్మమును పాటిస్తూ మృత్యువును జయిస్తాను " అని ప్రతిజ్ఞ చేసాడు. తరువాత అతడు కురుక్షేత్రముకు వెళ్ళి అక్కడ ఒక పర్ణశాల నిర్మించుకుని భార్య ఓఘవతితో గృహస్థ జీవితం కొనసాగించాడు. ఒక రోజు సుదర్శనుడు భార్యతో " ఓఘవతీ ! నాకు అతిథి పూజలంటే మక్కువ ఎక్కువ. అందు వలన నేను గృహంలో ఉన్నా లేకున్నా ! నీవు మాత్రము అతిథి మర్యాదలు చేయాలి. ఎందుకంటే ఎవరి ఇంట్లో అతిథి తన కోర్కెలు తీర్చుకుంటారో ఆ గృహస్థు కృతార్ధుడు ఔతాడు. మన ఇంటికి వచ్చిన అతిథి ఏకోరిక కోరినా నీవు ఆ కోరిక సంకోచించచక తీర్చాలి. పతి ఆజ్ఞ నెరవేర్చడమే సతికి ధర్మము కదా ! " అని అన్నాడు. భర్త మాటలకు ఓఘవతి అంగీకరించింది. సుదర్శనుడు సమిధల కొరకు అడవికి పోయిన సమయంలో వారి ఇంటికి ఒక అతిథి వచ్చాడు. ఓఘవతి అతడికి అతిథి మర్యాదలు చేసింది. అతడు ఓఘవతి వంక మోహంతో చూసి " లలనా ! నా మనసు నీ అందు లగ్నమైనది కనుక నీవు నా కోరిక తీర్చు. అతిథి మర్యాద చేయడమూ అతడి కోరిక తీర్చడము ధర్మము కదా ! నీకు తెలియనిది ఏమున్నది. అది నీధర్మమని నీభర్త నీకు చెప్ప లేదా ! " అన్నాడు. ఓఘవతి " మహానుభావా ! మీరు మరే కోరిక అడిగినా తీరుస్తాను " అన్నది. కాని అతడు " లలనా ! నాకు మరే కోరికా అవసరం లేదు " అన్నాడు. ఓఘవతి " తన భర్తమాట గుర్తుకు వచ్చి భర్తమాట నెరవేర్చిన తన శీలం పోతుంది. తీర్చక పోతే తన భర్తమాటలను ఉల్లంఘించినట్లౌతుంది అనుకుని చివరకు అతడి కోరికకు అంగీకరించింది " ఇంతలో సుదర్శనుడు తిరిగి వచ్చి ఓఘవతిని పిలిచాడు. అతిథి ఓఘవతిని మాట్లాడకుండా కట్టడి చేసాడు. ఆ బ్రాహ్మణ అతిథి శాపానికి భయపడి ఓఘవతి మాటాడక ఊరకున్నది. భార్య ఎంతకీ పలకనందున సుదర్శనుడు పర్ణశాలలోకి తొంగిచూసి ప్రేమగా ఓఘవతిని పిలిచాడు. బ్రాహ్మణుడు లోపల నుండి " ఓ యజమానీ ! నీ భార్య నాకు అతిథి సత్కారము ఇస్తుంది. నీకు గృహస్థధర్మాలు అతిథి సత్కారాలు తెలుసు కనుక కోపించకుము " అన్నాడు. అప్పుడు సుదర్శనుడు లోపల ఉన్న " అతిథితో మహాభాగా ! నీకు ఆతిథ్యము ఇచ్చినందు వలన నా జన్మధన్యము అయింది. అతిథి పూజలు నిర్వహించే గృహము ధన్యము పవిత్రము అంటారు కదా ! అతిథిపూజ అయ్యేంత వరకు నేను వెలుపల ఉంటాను " అని " అతిథీ ! నా మనసు నా వాక్కు ఒక్కటే దీనికి ఈ భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు సాక్షి " అన్నాడు. అప్పుడు ఆకాశవాణి " ఇతడు ధన్యుడు అందరూ గౌరవించ తగిన వాడు " అని పలికింది. అప్పుడు లోపల ఉన్న వ్యక్తి తేజోమంతుడై సాక్షాత్కరించి " సుదర్శనా ! నేను ధర్మదేవతను. నీ చిత్తము ఎటువంటిదో తెలుసుకోవడానికి వచ్చాను. నీవు నిశ్చలవ్రతుడవు. నీవు ధర్మము ఎప్పుడు తప్పుతావో అప్పుడు నిన్ను చంపాలని మృత్యుదేవత నీ వెంటనే పొంచి ఉన్నది. కాని నీవు మృత్యువును జయించావు. నీ భార్య కూడా మహాపతివ్రత. మీరు సశరీరంగా ఊర్ధ్వలోక ప్రవేశానికి అర్హులు. కనుక మీకు ఎప్పుడు ఊర్ధ్వలోకాలకు రావాలని అనిపిస్తుందో అప్పుడే ఊర్ధ్వలోకాలకు భార్యాసమేతంగా రావచ్చు. నీవు చేసిన సగభాగం తపః ఫలము చేత నీ భార్య ఓఘవతి పుణ్యనది అయి ఈ లోకములో ప్రవహిస్తూ జనులను పావనం చేస్తుంది. మిగిలిన సగం తపః ఫలము వలన నీకు సేవచేస్తుంది. నేను నీ ఇంటికి రావడము నీ భార్యను కోరడమూ అన్నీ నీ కీర్తి లోకాలకు తెలియజేయడానికే నేను కల్పించాను. అంతే కాని నీ భార్యశీలానికి ఎంటువంటి హానీ జరగలేదు . ఇది నిజము " అని పలికి అంతర్ధానం అయింది. ధర్మనందనా ! ఇదీ ఓఘవతీనది చరిత్ర. ఈ కథసారాంశం ఏమంటే గృహస్థుకు అతిథి పూజకు మించిన పరమధర్మము వేరొకటి లేదు " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

బ్రాహ్మణత్వము

ధర్మరాజు " పితామహా ! బ్రాహ్మణులు కాక ఇతరులు తాము చేసే గుణకర్మల వలన బ్రాహ్మణత్వము పొందవచ్చునా ! " అని తన సందేహం వెలిబుచ్చాడు. భీష్ముడు " ధర్మనందనా ! బ్రాహ్మణత్వము పొందడం చాలా దుర్లభ్యం. ఎన్నో జన్మలు ఎత్తిన తరువాత కాని బ్రాహ్మణజన్మ లభించదు. ఈ విషయము గురించి నీకు ఒక ఇతిహాసము చెప్తాను విను. పూర్వము మతంగుడు అనే విప్రకుమారుడు ఉండే వాడు. అతడు తండ్రి ఆదేశానుసారము ఒక యజ్ఞానికి వెడుతున్నాడు. దారిలో అతడు ఒక గాడిదపిల్లను కర్రతో గట్టిగా కొట్టాడు. ఆ గాడిద పిల్ల ఏడుస్తూ తనతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పింది. ఆ గాడిద తన కూతురుతో " అమ్మా ! ఇతడు చంఢాలుడు, క్రూరుడు అందుకే నిన్ను అలా కొట్టాడు " అని చెప్పింది. గాడిదమాటలను అర్ధము చేసుకున్న విప్రకుమారుడు " గాడిద ఊరికే అలా అన లేదు. గాడిద మాటలలో ఏదో అంతరార్ధము ఉంది. లేకుంటే అలా ఎందుకు అంటుంది " అనుకున్నాడు. విప్రకుమారుడు ఆ గాడిద వద్దకు వెళ్ళి తన జన్మరహస్యము చెప్పమని అడిగాడు. గాడిద " విప్రకుమారా ! నీ తల్లి కామంతో ఒక క్షురకుని వలన నిన్ను కన్నది. కనుక నీవు బ్రాహ్మణుడివి కాదు " అని చెప్పింది. ఆపై అతడికి యజ్ఞముకు వెళ్ళడానికి మనస్కరించక ఇంటికి తిరిగి వెళ్ళి తండ్రితో " తండ్రీ ! నేను బ్రాహ్మణ స్త్రీకి క్షురకుడికి పుట్టాను కనుక నేను బ్రాహ్మణుడను కాను. ఆ గార్ధభము ఏదో శాపవశాన ఇలా జన్మ ఎత్తి ఉంటుంది. లేకున్న ఈ నా జన్మరహస్యము ఎలా తెలుస్తుంది. తండ్రీ ! నేను తపస్సు చేసి బ్రాహ్మణత్వము సంపాదిస్తాను " అని చెప్పి మతంగుడు తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళాడు.

మతంగుడి తపసు

మతంగుడు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రసన్నము చేసుకున్నాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై " కుమారా ! నీవు తపస్సు ఎందుకు చేస్తున్నావు ? నీ కోరిక ఏమిటి " అని అడిగాడు. మతంగుడు " దేవా ! నాకు బ్రాహ్మణత్వము ప్రసాదించండి " అని అడిగాడు. ఇంద్రుడు " కుమారా ! బ్రాహ్మణత్వము మహత్తరమైనది. ఇతరులకు అది లభ్యము కాదు కనుక మరేదైనా వరము కోరుకో " అని అన్నాడు. మతంగుడు " అయ్యా ! నా కోరిక తీర్చడం మీకు కుదరదు కనుక మీరు వెళ్ళండి. నా తపస్సు కొనసాగిస్తాను " అన్నాడు. ఇంద్రుడు వెళ్ళగానే మతంగుడు తన తపస్సు కొనసాగించి ఒంటి కాలి మీద మరొక నూరేళ్ళు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఇంద్రుడు " కుమారా ! నీ పట్టు విడువక ఉన్నావు! శూద్రుడు ఇలాంటి తపస్సు చేస్తే చస్తాడు జాగ్రత్త అని బెదిరించి అసలు బ్రాహ్మణత్వము ఎలా సిద్ధిస్తుందో నీకు తెలుసా ! ఇంతకంటేపది రెట్లు తపస్సు చేస్తే కాని ఒక చంఢాలుడు శూద్రుడు కాలేడు. దాని కంటే నూరు రెట్లు తపస్సు చేస్తే కాని శుద్రుడు వైశ్యుడు కాలేడు. దాని కంటే వేయిరెట్లు తపస్సు చేసిన కాని వైశ్యుడు క్షత్రియుడు కాలేడు. దాని కంటే పది వేల రెట్లు తపస్సు చేసిన కాని క్షత్రియుడు దుర్మార్గుడైన బ్రాహ్మణుడు కాలేడు. దానికంటే లక్షరెట్లు తపస్సు చేస్తే కాని దుర్మార్గు డైన బ్రాహ్మణుడు ఇంద్రియములను, మనస్సును జయించి, సత్యము అహింసలను పాటించి, మాత్సర్యము విడిచి పెట్టి సద్బ్రాహ్మణుడు కాలేడు. అటువంటి సద్బ్రాహ్మణత్వము ఒక వంద సంవత్సారాల తపస్సుకు వస్తుందా ! చెప్పు " అన్నాడు. ఒక వేళ బ్రాహ్మణ జన్మ పొందినా దానిని నిలబెట్టు కొనుట కష్టము. ఒక్కొక్క జీవుడు అనేక జన్మల తర్వాత కాని బ్రాహ్మణజన్మ ఎత్త లేడు. అలా ఎత్తినా అతడు దానిని నిలబెట్టుకోలేడు. ధనవాంఛ, కామవాంఛ, విషయాసక్తితో సదాచారములను వదిలి దుర్మార్గుడు ఔతాడు. తిరిగి బ్రాహ్మణజన్మ రావడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది. అటువంటి బ్రాహ్మణజన్మ కొరకు నీవు తాపత్రయపడి నీ వినాశనము ఎందుకు కొని తెచ్చుకుంటావు. నీ కిష్టమైన మరొక వరము కోరుకో ఇస్తాను తపస్సు చాలించు " అన్నాడు. మారుమాటాడని మాతంగుడి మొండి తనము చూసి విసుగు చెంది ఇంద్రుడు వెళ్ళి పోయాడు. మాతంగుడు తిరిగి తన తపస్సు కొనసాగించాడు. కాలి బొటనవేలి మీద నిలబడి శరీరం అస్థిపంజరము అయ్యేవరకు తపస్సు చేసాడు. అతడి శరీరము శిధిలమై పడిపోతుడగా ఇంద్రుడు పట్టుకున్నాడు. ఏమిటి నాయనా ఇది పెద్ద పులిలా నిన్ను మింగగలిగిన బ్రాహ్మణత్వము నీకెందుకు చక్కగా వేరు వరములు అడిగి సుఖపడు " అన్నాడు. మాతంగుడు అంగీకరించగానే ఇంద్రుడు " నీవు చంఢదేవుడు అనే పేరుతో అందమైన స్త్రీల పూజలందుకుని వారి వలన నీ కోరికలు ఈడేర్చుకుంటావు " అని వరాలు ప్రసాదించాడు.

విశ్వామిత్రుడి బ్రాహ్మణత్వము

మతంగుడి మాట కథ విన్న ధర్మరాజు " పితామహా ! ఇంద్రుడు చెప్పినట్లు బ్రాహ్మణత్వము పొందడం దుర్లభము అయిన క్షత్రియుడైన విశ్వామిత్రుడికి బ్రాహ్మణత్వము ఎలా సిద్దిస్తుంది " వివరించండి అని అడిగాడు. ధర్మనందనా ! జాహ్నవీదేవికి తండ్రి అయిన జహ్నుడు అనే వాడి వంశములోగాధి జన్మించాడు. గాధి కూతురు సత్యవతి. సత్యవతిని తనకిచ్చి వివాహము చేయమని రుచీకుడు అడగగా గాధి అంగీకరించక బదులుగా చెవి తెల్లగా ఉన్న వేయి గుర్రములను కట్నంగా ఇస్తే సత్యవతిని ఋచీకుడి కిచ్చి వివాహము జరిపిస్తానని షరతు పెట్టాడు. ఋచీకుడు అందుకు రోషంతో అంగీకరించి గుర్రములను వెతికి తెస్తానని చెప్పాడు. ఋచీకుడు వరుణుడి వద్దకు వెళ్ళి " నాకు తెల్లని చెవులు కలిగిన వేయిగుర్రాలను ఇవ్వు " అని అడిగాడు. వరుణుడు " ఈ మాత్రానికి ఇంత దూరము రావాలా ! నీవు కోరిన వెంటనే నీ ఎదుట నిలబడతాయి " అని చెప్పాడు. వెంటనే ఋచీకుడు గంగానది ఒడ్డుకు వెళ్ళి పద్మాసనము వేసుకుని కూర్చుని కళ్ళు మూసుకుని " నాకు తెల్లని చెవులు కలిగిన వేయి గుర్రాలు కావాలి " అని కోరుకోగానే అతడి ఎదుట తెల్లని చెవులు కలిగిన వేయిగుర్రాలు నిలబడ్డాయి. అప్పటి నుండి ఆ ప్రదేశము అశ్వతీర్ధముగా ప్రసిద్ధి చెందింది. ఋచీకుడు ఆ గుర్రాలను గాధికి ఇచ్చాడు. గాధి చేసేది లేక సత్యవతిని ఋచీకుడికి ఇచ్చి వివాహము చేసాడు.

గాధి రుచీకులకు పుత్ర భాగ్యము

ఋచీకుడు కొన్ని సంవత్సరాలు సత్యవతితో కాపురము చేసిన పిదప సంతానం కావాలని కోరిక కలిగి " సత్యవతీ ! సంతానము కొరకు నేను యజ్ఞములో ఇచ్చే చరువు సంపాదిస్తాను " అన్నాడు. సత్యవతి తల్లి కూడా తనకూ సంతానం కావాలని అందు కొరకు తనకు కూడా చరువు కావాలని కోరింది. ఋచీకుడు అందుకు అంగీకరించి రెండు చరువులు సంపాదించి దానిని తన తపశక్తితో నింపాడు. వాటిలో ఒక చరువులో ఉన్న యజ్ఞశేషాన్ని భుజించిన వారికి ఉజ్వలంగా ప్రకాశించే బ్రాహ్మణుడు పుడతాడు అని రెండవ చరువులోని యజ్ఞ శేషాన్ని భుజించిన రాజసభావం కలిగిన పుత్రుడు పుడతాడు. ఋచీకుడు సత్యవతిని చూసి " సత్యవతీ ! ఇది ఒకటి క్షాత్ర శక్తి ప్రధాన పుత్రుడిని ఇస్తుంది నీవు దానిని నీ తల్లికి ఇవ్వు. రెండవది సాత్వికత, బ్రాహ్మణత్వము ప్రధానుడైన పుత్రుడిని ఇస్తుంది దానిని నువ్వు స్వీకరించు. తరువాత ఋతు సమయంలో నీవు మేడి చెట్టును నీ తల్లి రావి చెట్టును కౌగలించుకున్న మీకు సంతానము కలుగుతుంది " అని చెప్పాడు. కాని విధివిలాసంగా చరువును తీసుకునే సమయంలో చరువులు, కౌగలించుకున్న వృక్షములు తారుమారై ఫలితంగా వారు ధరించిన గర్భాలు తారుమారయ్యాయి. ఇదంతా దివ్యదృష్టితో తెలుసుకున్న ఋచీకుడు సత్యవతితో " సత్యవతీ ! మీ చరువులు వృక్షములు తారుమారయ్యాయి. ఫలితంగా నీ గర్భంలో దుర్మార్గుడైన క్షత్రియుడు పెరుగుతున్నాడు అని చెప్పాడు. ఆ మాటకు తల్లడిల్లిన సత్యవతి " సద్బ్రాహ్మణుడివైన, తపశ్శాలివైన మీకు దుర్మార్గుడైన క్షత్రియుడు కలిగిన మీకు అపకీర్తి కదా ! నీ మహిమ చేత ఈ అవాంతరము నివారించు " అని వేడుకుంది. అందుకు ఋచీకుడు అంగీకరించి " ఈ ప్రభావము ఒక జన్మకాలము పొడిగించి నీకు సద్బ్రాహ్మణుడు నీకుమారుడికి క్షత్రియాంశ కలిగిన కుమారుడు జన్మిస్తాడు " అని వరం ఇచ్చాడు. అలా సత్యవతికి జమదగ్ని జన్మించాడు. జమదగ్ని కుమారుడు పరశురాముడు క్షత్రియాంశతో జన్మించి క్షత్రియ కుల వినాశకుడయ్యాడు. సత్యవతి తల్లికి విశ్వామిత్రుడు జన్మించినా అతడికి బ్రాహ్మణధర్మమునందు ఆసక్తి కలిగింది. ఈ కారణంగా పరశురాముడికి క్షత్రియత్వము, విశ్వామిత్రుడికి బ్రాహ్మణత్వము వచ్చాయి " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

వీతహవ్యుడు బ్రాహ్మణత్వము

ధర్మరాజు " పితామహా నాకు ఈ సందర్భంలో నాకు మరొక కథ గుర్తుకు వస్తుంది. పూర్వము వీతహవ్యుడు అనే క్షత్రియుడు బ్రాహ్మణత్వము పొందాడు అని విన్నాము అది ఎలా జరిగిందో వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! మనువు పరంపరలో శర్యాతి వంశం ఒకటి. ఆ వంశలో జన్మించిన హైహయుడు వత్సదేశాన్ని పాలించాడు. అతడికి వీతహవ్యుడు అని కూడా పేరు ఉండేది. అతడికి పది మంది భార్యలు ఉండేవారు. వారి ద్వారా అతడు యోధులు, బలాఢ్యులు అయిన నూరుగురు పుత్రులను పొందాడు. హైహయుడి కుమారులు కాశీరాజైన హర్యశ్వుడి మీదకు దండేత్తి అతడిని ఓడించారు. అతడి తర్వాత అతడి కుమారుడు సుదేవుడు రాజయ్యాడు. హైహయుడి కుమారులు తిరిగి సుదేవుడి మీదకు దండెత్తి అతడిని కూడా ఓడించారు. ఆ తరువాత సుదేవుడి కుమారుడు దివోదాసు రాజయ్యాడు. హైహయుడి కుమారులు దివోదాసును యుద్ధానికి పిలిచి అతడిని ఓడించారు. అతడు భయంతో పారిపోయి భరద్వాజుడిని శరణుజొచ్చి హైహయకుమారులు తన తండ్రని చంపి తనను కూడా ఓడించారని చెప్పాడు. భరద్వాజుడు దివోదాసు భయమును పోగొట్టి " నీకు ఒక హైహయకుమారులను హతమార్చగలిగిన ఒక కుమారుడిని ప్రసాదిస్తాను " అని చెప్పి దివోదాసు చేత పుత్రకామేష్టి యాగము చేయించాడు. ఆ యాగఫలంగా అతడికి ఒక కుమారుడు కలిగాడు. అతడు 13 సంవత్సరాల ప్రాయానికి వచ్చాడు. వాడి పేరు ప్రత్యర్ధనుడు. భరధ్వాజముని అనుగ్రహంతో ప్రత్యర్ధనుడు వేదములు, ధనుర్వేదము అభ్యసించాడు. దివోదాసు అతడిని యువరాజుగా అభిషేకించాడు. ప్రత్యర్ధనుడు హైహయుల మీదకు దండేత్తి హహయకుమారులను అందరినీ హతమార్చడమే కాక హైహయుడి మీదకు లంఘించాడు. హైహయుడు పారి పోయి భృగుమహర్షి శరణుజొచ్చాడు. భృగుమహర్షి అతడిని తన ఆశ్రమంలో దాచాడు. అతడిని తరుముకుంటూ అక్కడకు వచ్చిన ప్రత్యర్ధనుడు భృగుమహర్షిని చూసి నమస్కరించాడు. భృగుమహర్షి అతడితో " నీవు ఇక్కడకు వచ్చిన పని ఏమిటి ? " అని అడిగాడు. ప్రత్యర్ధనుడు జరిగినది యావత్తు భృగుమహర్షికి వివరించి తాను హైహయుడిని తరుముకుంటూ వచ్చిన విషయము చెప్పాడు. భృగుమహర్షి " ఇక్కడ ఎవరూ రాజవంశీయులు లేరు ఇక్కడ ఉన్న వారంతా బ్రాహ్మణులైన నా శిష్యులే " అన్నాడు. ప్రత్యర్ధనుడు నవ్వి " మహర్షీ ! మీరు అసత్యము పలుకరు కదా ! హైహయుడు క్షత్రియుడు కాదు అని చెప్పి అతడిని క్షత్రియకులము నుండి వెలివేసారు కనుక నేను వచ్చిన పని పూర్తి అయింది. నాకు కావలసినది కూడా అదే. మహర్షీ నా మీద కూడా కొంత కరుణ చూపండి " అని పలికి వెనుతిరిగాడు. అప్పటి నుండి హైహయుడు బ్రాహ్మణత్వము స్వీకరించి గొప్ప తపస్సు చేసాడు. కృత్సమదుడు అనే కుమారుడిని పొందాడు. అతడి వంశంలో సుతేజసుడు, వర్చసుడు, నిహవ్యుడు, సత్యుడు, సంతుడు, శ్రవసుడు, దమసుడు, ప్రకాశుడు, వాగీంద్రుడు, ప్రమతి, రురుడు, సముదుడు, శునకుడు, శౌనకుడు అనే బ్రాహ్మణులు జన్మించారు. ఇలా హైహయుడు అనే వీతహవ్యుడు ఒక బ్రాహ్మణ వంశ కర్త అయ్యాడు అని " చెప్పాడు.

దైవము పురుషప్రయత్నను

వశిష్టునితో బ్రహ్మ ప్రశ్నోత్తరాలు

ధర్మరాజు " పితామహా ! దైవబలము పురుషప్రయత్నము ఏది గొప్పది ? వివరించండి " అన్నాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఇదే ప్రశ్నను పూర్వము వశిష్ఠుడు బ్రహ్మను అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన విషయాన్ని నీకు చెప్తాను. క్షేత్రము, మానవప్రయత్నము, విత్తనము మూడు వేరు వేరు. మూడు కలిస్తే కాని విత్తనము మొలకెత్తదు. భూమిలో విత్తనము వేస్తే విత్తనములు మొలకెత్తుతాయి. విత్తనము భూమిలో వేయడానికి పురుషప్రయత్నము కావాలి. కేవలము భూమి విత్తనము ఉన్నంత మాత్రాన విత్తనము మొలకెత్తదు. కనుక పురుషప్రయత్నము కావాలి. అన్నీ దైవమే చూస్తాడు అనుకుంటే ఫలితము రాదు కనుక పురుషప్రయత్నము అవసరము. పురుషప్రయత్నము ఉంటేనే దైవబలము కూడా తోడౌతుంది. ఉదాహరణగా నిప్పురవ్వ చిన్నదే అయినా బాగా గాలి వీస్తేనే అది పెద్దమంట ఔతుంది. మనము చేసే పని చిన్నది అయినా దైవబలము తోడైతే అతి బలపడుతుంది. నేతితో దీపము పెట్టినప్పుడు నెయ్యి తగ్గిన తరువాత దీపము కొడిగట్టి పోతుంది. అలాగే మనము చేసే పనులకు దైవబలము లోపిస్తే ఆ పని విజయవంతము కాలేదు. పరశురాముడు, భృగువు, బలిచక్రవర్తి గొప్ప వాళ్ళే అయినా వారికి వారు చేసే పనిలో పవిత్రత లోపించింది కనుక దైవబలము లోపించింది కనుక వారు అపజయం పాలయ్యారు. కనుక ఏపనికైనా దైవానుకూలము ముఖ్యము. ఏ పనికైనా పురుష ప్రయత్నము దైబలము సమానంగా కావాలి కనుక రెండూ ముఖ్యమైనవే " అన్నాడు.

మంచి పనులు ఫలితము

ధర్మరాజు " పితామహా ! మంచి పనులకు మంచి ఫలితాలు ఉంటాయి అంటారు కదా ! ఏ మంచి పనికి ఎలాంటి ఫలితము ఉంటుంది " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఒక్కో పనికి ఒక్కో ప్రత్యేక ఫలితం ఉంటుంది. ఆకలితో ఉన్న బాటసారికి అన్నం పెడితే వచ్చే ఫలితం అంతా ఇంత కాదు. రోజూ చేసే అగ్ని ఉపాసన మనపనులను విజయవంతం చేయడానికి తోడ్పడుతుంది. మనం మంచి వస్తువులు ఇతరులకు దానం చేస్తే మనకు అవసరమైన సమయాలలో ఆ వస్తువులు అయాచితంగా లభిస్తాయి. మౌనం పాటిస్తే మన జ్ఞానం వృద్ధి చెందుతుంది. తపస్సు చేస్తే అధిక భోగములు చేకూరుతాయి. ఉపవాసం చేస్తే మనస్సు నిర్మలంగా ఉంటుంది. అహింసావ్రతము ఆచరిస్తే రూపము, బలము, ఐశ్వర్యము చేకూరుతాయి. ఉపవాసం చేస్తే మనస్సు నిర్మలంగా ఉంటుంది. కేవలం ఫలములు, నీరు త్రాగి జీవించిన వాడికి రాజ్యప్రాప్తి కలుగుతుంది. వేదములు చదివితే సుఖాలు ప్రాప్తిస్తాయి. వేదార్ధము గ్రహిస్తే పరలోకసుఖము ప్రాప్తిస్తుంది. సత్యవ్రతము పాటిస్తే మోక్షప్రాప్తి కలుగు తుంది. ధర్మనందనా మంచి పనులకు మంచి ఫలితము కలిగినట్లే చెడుపనులకు చెడు ఫలితాలు కలుగుతాయి. ఏ విత్తు వేస్తే ఆ చెట్టు మొలుస్తుంది కదా ! మానవుడికి ముసలితనము వచ్చి పళ్ళు ఊడిపోయి, వెంట్రులకు రాలిపోయి, చెవులు వినపడక, కళ్ళు కనపడక పోయినా అతడిలో కోరికలు మాత్రము చావవు. ప్రాణములు పోయినా కోరికలు విడువవు. ఇది మామూలు మనుషులకే కాదు పండితులకు కూడా ఈ బానిసత్వము తప్పదు. ఆఖరిదశ వరకు ఈ కోరికల మీద మోహము విడిచి పెడదాము అన్న ఆలోచన కూడా రానివ్వరు. వెలుపలి ప్రపంచంలో విహరించే వారికి పుణ్యకర్మలు సుఖాన్ని పాపకర్మలు దుఃఖాన్ని కలుగచేస్తాయి " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

యజమానుడు సేవకుడు

ధర్మమూర్తియైన చిలుక మరియు ఇంద్రుల సంభాషణ

ధర్మరాజు భీష్ముడిని " పితామహా ! నాకు ఒక సందేహము తమ యజమానుల ఎడల అతడి దయా దాక్షిణ్యాల మీద బ్రతికే సేవకుడు ఎలా నడచుకోవాలి వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! కాశీపట్టణంలో ఒక బోయవాడు ఉండే వాడు. అతడు ఒక రోజు వేటకొరకు అడవికి వెళ్ళి ఒక లేడిమీద విషముపూసిన బాణమును వేసాడు. కాని ఆ బాణము గురితప్పి ఒక చెట్టును తాకింది. ఆ చెట్టు పూలుపండ్లతో నిండి ఉన్నది. ఆ విషపూరిత బాణము ఆ చెట్టును నిలువునా పూలు విరుగకాసిన పండ్లలతోసహా దహించివేసింది. ఆ చెట్టు మీద నివసిస్తున్న చిలుక ఆ చెట్టు దహించ బడినా ఇన్ని రోజుల నుండి కాపాడిందన్న విశ్వాసంతో దానిని విడువక అక్కడే నివసించసాగింది. ఎండ వచ్చినా గాలి వచ్చినా వర్షము వచ్చినా అది ఆ చెట్టును విడువ లేదు. ఆ చిలుక గురించి విన్న ఇంద్రుడు మామూలు మనిషి రూపంలో దాని వద్దకు వచ్చి " ఓ చిలుకా ! ఈ చెట్టు మాడిపోయింది కదా ! ఈ అడవిలో ఫల పుష్పాలతో నిండిన ఇన్ని వృక్షాలు ఉండగా ఈ చెట్టును పట్టుకుని ఎందుకు వేలాడుతున్నావు " అని అడిగాడు. చిలికు " మహేంద్రా ! ఈ చెట్టు ఫలపుష్పాలతో నిన్ను నిండుగా ఉన్నప్పుడు ఆ చెట్టును అంటిపెట్టుకుని ఉండి ఆ చెట్టు ఎండి పోయినప్పుడు వదిలి వెళ్ళడము కృతగఘ్నత కాదా ! " అన్నది. మారువేషములో వచ్చిన నన్ను మహేంద్రా ! అని సంభోదించడం చూసి ఇంద్రుడు ఖంగుతిన్నాడు . ఈ చిలుక పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్యఫలము వలన తనను గుర్తించిందని తెలుసుకుని " చిలుకా ! నా దర్శనం వ్యర్ధము కాదు కనుక ఏదైనా వరము కోరుకో " అన్నాడు. ఆ చిలుక " ఈ చెట్టును పూర్వము ఉన్నట్లు ఫలపుష్పాలతో అలరారే విధముగా చెయ్యి " అని కోరుకుంది. ఇంద్రుడు వెంటనే ఆ చెట్టు మీద అమృతమును చల్లాడు. ఆ చెట్టు పూర్వములా ఫలపుష్పాలతో శోభిల్లింది. ధర్మనందనా ! చూసావా ఇంద్రుడు వరమిచ్చినా తన కొరకు కోరుకొనక తనకు ఆశ్రయమిచ్చిన చెట్టు శ్రేయస్సును కోరుకున్న చిలుకలా భృత్యులు సదా యజమాని శ్రేయస్సు కోరుకుంటాడు " అని చెప్పాడు.

యజమానులు భ్రుత్యులు

ధర్మరాజు భీష్ముడితో " పితామహా ! యజమానులు భృత్యులను ఎలా ఆదరించాలి ? వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! వేదములు చదువుతూ, తపస్సు చేస్తూ , జనులకు ధర్మబోధ చేస్తూ ఇహపరలోకములలో సుఖమును కలిగించే బ్రాహ్మణుడు సదా పూజనీయులు. భార్యకు భర్త ఎలా పూజనీయుడో అలాగే రాజుకు బ్రాహ్మణుడు పూజనీయుడు. బ్రాహ్మణుడు పలికే ప్రతి పలుకు పవిత్రమైనదే ! సద్బ్రాహ్మణుడు తనను కష్టమును సుఖమును కలిగించిన ఇంద్రుడికైనా దుఃఖమును సుఖమును ఫలితములను ఇవ్వ కలిగిన సమర్ధుడు. రాజు బ్రాహ్మణుడిని తన పుత్రుడివలె ఆదరించాలి. గురువు వలె గౌరవించాలి. అగ్నివలె పూజించాలి. వేదములలో ఈ ప్రస్తావన వివరిస్తాను విను. బ్రాహ్మణ జాతిని పరాభవించిన వాడి పుణ్యములు సమస్తము నశిస్తాయి అని ఋగ్వేదము చెప్తింది. జపము, హోమము, యాగము, యజ్ఞములు బ్రాహ్మణుడి ఆధ్వర్యంలోనే జరగాలి అనే యజుర్వేదము చెప్తుంది. ఒక నెలపాటు బ్రాహ్మణులను అర్చించిన సకల పాపములు హరిస్తాయని సామవేదము చెప్తుంది. బ్రాహ్మణులను ఆదరించక పోవడము తప్ప వేరేకీడు ప్రపంచంలోనే లేదు అని యజుర్వేదము చెప్తుంది.

సశేషం

Sunday, July 22, 2018

శనీశ్వరుడు

హిందూ జ్యోతీష్య శాస్త్రం ప్రకారం 'శనీశ్వరుడు' ,నవగ్రహాలలో ఒక గ్రహం. సూర్యుడు, చంద్రుడు, ఛాయాగ్రహాలైన రాహువు మరియు కేతువులతో కలిపి గ్రహాలు తొమ్మిది. గగనమండలంలో ఉన్నగ్రహాలకుభూమితో సంబంధం ఉంది. కాబట్టి తొమ్మిది గ్రహాల ప్రభావం భూమిమీద, భూమిపై ఉన్న ప్రతి చరాచర జీవుల పైన, నిర్జీవ, ఝడ, నిర్లిప్త వస్తువుల మీద వుంటుంది. నవగ్రహాలలో ఒకటైన శని గ్రహం ఇందుకు బిన్నం కాదు. శని, శనిగ్రహం, శనేశ్వరుడు, శనీశ్వరుడు, అని పలు నామములతో పిలువబడి, గ్రహరూపలో పూజింపబడే 'శని' ఒక గ్రహదేవుడు. వారంలో ఏడవవారం శనివారం. శనివవారానికి అధిపతి శనేశ్వరుడు. సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా 'ఏడు' శనికి ప్రీతికరమయిన సంఖ్య.

శనీశ్వరుడి జననం

శనీశ్వరుని తల్లిదండ్రులు:

సకల జీవులకు ప్రత్యక్షదైవం అయినట్టి సూర్యుడుభగవానుడికి, అతని రెండవ భార్య ఛాయదేవికి పుట్టిన సంతానం శని. ఆయనకు ఛాయాపుత్రుడు అనే పేరు కూడా ఉంది. జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఎలా చూపబోతున్నాడో అని నిరూపించడానికి, ఆయన జననం సూర్య గ్రహణములోజరిగింది.

ఇతర నామాలు: ఇతనికి మందగమనుడు అని కూడా పేరు. శనయే క్రమతి స: (शनये क्रमति सः) అనగా అతినెమ్మదిగా కదిలేవాడు అని అర్థం. ఒకసారి సూర్యుని చుట్టిరావడానికి శనికి 30 సంవత్సరాలు పడుతుంది. శానైస్కర్య, అసిత, సప్తర్చి, క్రూరదృష్ట, క్రూరలోచనుడు, పంగు పాదుడు, గృద్రవాహనుడు మొదలైన పేర్లుకూడా ఉన్నాయి.

శనీస్వరునికి అత్యంత ప్రీతికరమైన వస్తువులు:

నువ్వులు, నువ్వుల నూనె, నల్లటి వస్త్రం, నీలం, ఇనుము, అశుభ్రత, మందకొడిగా ఉండటం.

ధర్మ రక్షకుడు

ఎద్దు వాహనముపై శని దేవుడు

సమస్త ప్రాణకోటి యొక్క పాపకర్మల ఫలాన్ని వెను వెంటనే కలిగించే దేవుడు శనేశ్వరుడు. జీవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి, శిక్షించి, ధర్మాన్ని నిలిపే శనిభగవానుడు యమధర్మరాజుకు మరియు యమునకు అగ్రజుడు. వీరి ముగ్గురి శరీర ఛాయ నలుపే. సూర్యుని కుమారులైన శని మరియి యముడు, ఇరువురూ న్యాయాధిపతులే. యముడు మరణానంతరం దండనలు విదిస్తే, శని, జీవులు బ్రతికి ఉండగానే హింసించి, యాతనలకు గురిచేసి శిక్షిస్తాడు.

గుణపాఠం నేర్పించే విషయంలో శనీశ్వరునికి ఎవరూ సాటి లేరు. ద్రోహం, వెన్నుపోటు, హింస, పాపమార్గాలు మరియు అన్యాయ మార్గాలను అనుసరించేవారికి శనిదేవుడు మిక్కిలి అపాయకారి అని శాస్త్రాలు చెబుతున్నాయి.(మరి అదే నిజమయితే మన మధ్య నిత్యం జరుగుతున్న అరాచకాలు, అవినీతి, మోసాలు నిరాటకంగా ఎలా సాగి పోతున్నాయి? అని సందేహం కలగవచ్చు. శని దేవుడి ప్రణాళికలేమిటో సామాన్యులమైన మనకు తెలుస్తుందా!). తన దృష్టి పడ్డవారిని హింసించి, నానాయాతనలకు గురిచేసి, అత్యంత కౄరంగా అమిత బాధలకు గురిచేసే శనిదేవుడు, తను కరుణించిన వారిని అందలం ఎక్కించే శ్రేయోభిలాషి అని శాస్త్రాలు వర్ణించాయి.

నల్లని ఛాయ అతని మేని వర్ణం. నల్లని వస్త్రములు అతని ఉడుపులు. ఖడ్గము, బాణములు మరియు రెండు బాకులు అతని ఆయుధాలు. నల్లని కాకి అతని వాహనం.

శనిభగవానుడు సహజంగా నల్లటి ఛాయ కలవాడని, ఛాయా మార్తాండ సంభూతుడని, అందమైన ముఖం కలవాడుగాను, క్రూరుడిగాను, మందగమనుడిగాను, గానుగుల కులానికి చెందినవాడుగాను, కాల-భైరవుడికి మహాభక్తుడిగాను హిందూ పురాణాలు జ్యోతిష శాస్త్రాలలో వర్ణింపబడ్డాడు .

శని మహత్యం

శనీశ్వర జపం

శనీశ్వరుడి జప మంత్రాలు

నీలాంజన సమాభాసం
రవి పుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం
తమ్ నమామి శనైశ్చరం

|| ఓం శం శనయేనమ:||

|| ఓం నీలాంబరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ ||

|| ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః ||

శని గాయత్రీ మంత్రం:
ఓం కాకథ్వజాయ విద్మహే
ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్.

|| ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ ||

బ్రహ్మాండ పురాణంలో తెలుపబడిన "నవగ్రహ పీడహర స్తోత్రం":
||సుర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః మందచారః ప్రసన్నాత్మా పీడం హరతు మే శని: ||

||ఓం శం శనైస్కర్యయే నమః||
||ఓం శం శనైశ్వరాయ నమః||
||ఓం ప్రాంగ్ ప్రీంగ్ ప్రౌంగ్ శ: శనయే నమః ||

||కోణస్ధః పింగళో బబ్రుః కృష్ణో రౌద్రంతకో యమః సౌరిః శనైశ్చరో మందహ పిప్పలాదేన సంస్తుత:||

ఓం నమో శనైశ్వరా పాహిమాం, ఓం నమో మందగమనా పాహిమాం, ఓం నమో సూర్య పుత్రా పాహిమాం, ఓం నమో చాయాసుతా పాహిమాం, ఓం నమో జేష్టపత్ని సమేత పాహిమాం, ఓం నమో యమ ప్రత్యది దేవా పాహిమాం, ఓం నమో గృధ్రవాహాయ పాహిమాం

శనిగ్రహ జపం

ఆవాహము

అస్యశ్రీ శనిగ్రహ మహా మంత్రస్య హిళింభి ఋషిః శనైశ్చర

గ్రహోదేవతా! ఉష్టిక్ చంధః! శనైశ్చర గ్రహ ప్రసాద సిద్దర్ధ్యే

శనిపీడా నివారణార్ధే శనిమంత్ర జపే వినియోగః

కరన్యాసం

ఓం శమగ్ని - అంగుష్టాభ్యాసం నమః

ఓం అగ్నిభిస్కరత్ - తర్జనీభ్యాం నమః

ఓం విష్ణుశంనస్తపతుసూర్యః - మధ్యమాభ్యాం నమః

ఓం శంవాతః - అనామికాభ్యాం నమః

ఓం వాత్వరపాః - కనిష్ఠికాభ్యాసం నమః

ఓం అపశ్రిధః - కరతల కరపృష్టాభ్యాసం నమః అంగన్యాసము:

ఓం శమగ్ని: - హృదయాయ నమః

ఓం అగ్నిభిస్కరత్ - శివసేస్వాహ

ఓం శంనస్తపతుసూర్యః - శిఖాయైవషట్

ఓం శంవాతః - కవచాయహు

ఓం వాత్వరపాః - నేత్రత్రయాయ వౌషట్

ఓం అపశ్రిధ్ర - అస్త్రాయఫట్

ఓం భూర్భువస్సువరోమితి దిగ్భంధం

ఆదిదేవతాః

ఇమం యమ ప్రస్తరమాహి సీదాంగి రోభి: పితృభిప్సం విధానః!

అత్వా మంత్రాః కవిసహస్త్వా వహ న్వైనారాజన్ హవిషామదయస్వ!!

ప్రత్యథి దేవతా: ప్రజాపతే సత్వ దేవతాన్యోన్యో విశ్వాజాతాని పరితాబభూవ!

యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తువయగ్గౌ శ్యామ పతయోరయీణాం!!

వేదమంత్రం

ఓం శమగ్ని రాజ్ఞి భిస్క రచ్చన్న స్తపతు సూర్యః శం వాతో వాత్వరపా అపశ్రిధః

శని కవచ స్తోత్రము శనైశ్చరశ్శిరో రక్షేత్! ముఖం భక్తార్తి నాశనః కర్ణౌకృష్ణాంబరః పాతు!

నేత్రే సర్వ భయంకరః!! కృష్ణాంగో నాసికాం రక్షేత్! కర్ణౌ మేచ శిఖండిజ:! భుజౌమే సుభుజః పాతు!

హస్తా నీలోత్పల ప్రభః! పాతుమే హృదయం కృష్ణ:! కృక్షిం శుష్కోధర స్తధాః! కటిం మే వికటః పాతు!

ఊరూ మే ఘోర రూపవాన్! జానునీ పాతు దీర్ఘోమే! జంఘేమే మంగళ ప్రభః! గల్పౌ గణాకరః పాతు!

పాదౌ మే మంగుపాదకః! సర్వాణిచ మామాచంగాని! పాతు భాస్కరనందనః!

ఫలశ్రుతి

య ఇదం కవచం దివ్యం సర్వ పీదాహరం ణాం పఠతి శ్రద్ధయా యుక్తః! సర్వాన్ కామానవాప్నుయాత్!

శని మంగళాష్టకమ్ మందః కృష్ణవిభస్తు పశ్చిమ ముఖః సౌరాష్టవో కాస్యవః!

నక్రేశో ఘటన సుహృద్భుధ భ్రుగుర్వైరీంద్వ వక్ష్యాసుతః!! స్థానం పశ్చిమ దిక్ర్పజాపతిర్యమౌదేవౌ ధనస్త్వాసనం!

షట్రష్ట స్శుభకృచ్ఛమీ రవిసుతః కూర్యాత్సదా మంగళం!!

శన్యష్టోత్తర శతమామావళి ఓం శనైశ్చరాయ నమః ఓం శాంతాయ నమః

ఓం శరణ్యాయ నమః ఓం వరేణ్యాయ నమః ఓం సర్వేశాయ నమః

ఓం సౌమ్యాయ నమః ఓం సురవంద్యాయ నమః ఓం సురలోక విహారిణే నమః

ఓం సుఖాననోవిష్టాయ నమః ఓం సుందరాయ నమః ఓం ఘనాయ నమః

ఓం ఘనరూపాయ నమః ఓం ఘనాభరణధారిణే నమః ఓం ఘనసారవిలేపాయ నమః

ఓం ఖద్యోతాయ నమః ఓం మందాయ నమః ఓం మందచేష్టాయ నమః

ఓం మహనీయగుణాత్మనే నమః ఓం మర్త్యపావనపాదాయ నమః

ఓం మహేశాయ నమః ఓం ఛాయాపుత్త్రాయ నమః ఓం శర్వాయ నమః

ఓం శ్రతూణీరధారిణే నమః ఓం చరస్థిరస్వభావాయ నమః ఓం చంచలాయ నమః

ఓం నీలవర్ణాయ నమః ఓం నిత్యాయ నమః ఓం నీలాంబసనిభాయ నమః

ఓం నీలాంబరవిభూషాయ నమః ఓం నిశ్చలాయ నమః ఓం వేద్యాయ నమః

ఓం విధిరూపాయ నమః ఓం విరోధాధార భూమయే నమః

ఓం వేదాస్పదస్వాభావాయ నమః ఓం వజ్రదేహాయ నమః ఓం వైరాగ్యదాయ నమః

ఓం వీరాయ నమః ఓం వీతరోగభయాయ నమః ఓం విపత్పరంపరేశాయ నమః

ఓం విశ్వనంద్యాయ నమః ఓం గృద్రహహాయ నమః ఓం గుధాయ నమః

ఓం కూర్మాంగాయ నమః ఓం కురూపిణే నమః ఓం కుత్సితాయ నమః

ఓం గుణాధ్యాయ నమః ఓం గోచరాయ నమః ఓం అవిద్యామూలనాశాయ నమః

ఓం విద్యావిద్యాస్వరూపిణే నమః ఓం ఆయుష్యకారణాయ నమః ఓం ఆపదుద్దర్త్రే నమః

ఓం విష్ణుభక్తాయ నమః ఓం వశినే నమః ఓం వివిధాగమనేదినే నమః

ఓం విధిస్తుత్యాయ నమః ఓం వంద్యాయ నమః ఓం విరూపాక్షాయ నమః

ఓం వరిష్టాయ నమః ఓం వజ్రాంకుశధరాయ నమః ఓం వరదాయ నమః

ఓం అభయహస్తాయ నమః ఓం వామనాయ నమః ఓం జేష్టాపత్నీసమేతాయ నమః

ఓం శ్రేష్టాయ నమః ఓం అమితభాషిణే నమః ఓం కస్టౌఘనాశకాయ నమః

ఓం ఆర్యపుష్టిదాయ నమః ఓం స్తుత్యాయ నమః ఓం స్తోత్రగమ్యాయ నమః

ఓం భక్తివశ్యాయ నమః ఓం భానవే నమః ఓం భానుపుత్త్రాయ నమః

ఓం భావ్యాయ నమః ఓం పావనాయ నమః ఓం ధనుర్మందల సంస్థాయ నమః

ఓం ధనదాయ నమః ఓం ధనుష్మతే నమః ఓం తనుప్రకాశ దేహాయ నమః

ఓం తామసాయ నమః ఓం అశేషజనవంద్యాయ నమః ఓం విశేషఫలదాయినే నమః

ఓం వశీకృతజనిశాయ నమః ఓం పశూనాంపతయే నమః ఓం ఖేచరాయ నమః

ఓం ఖగేశాయ నమః ఓం ఘననీలాంబరాయ నమః ఓం కాఠిన్యమానసాయ నమః

ఓం అరణ్యగణస్తుత్యాయ నమః ఓం నీలచ్చత్రాయ నమః ఓం నిత్యాయ నమః

ఓం నిర్గుణాయ నమః ఓం గుణాత్మనే నమః ఓం నిరామయాయ నమః ఓం నింద్యాయ నమః

ఓం వందనీయాయ నమః ఓం ధీరాయ నమః ఓం దివ్యదేహాయ నమః ఓం దీనార్తి హరణాయ నమః

ఓం దైన్య నాశకరాయ నమః ఓం ఆర్యజనగణణ్యాయ నమః ఓం క్రూరాయ నమః

ఓం క్రూరచేష్టాయ నమః ఓం కామక్రోధకరాయ నమః ఓం కళత్రపుత్త్రశత్రుత్వ కారణాయ నమః

ఓం పరిపోషితభక్తాయ నమః ఓం భక్త సంఘమనోభీష్ట ఫలదాయ నమః ఓం శ్రీమచ్ఛనైశ్చరాయ నమః

శనీశ్వరుడు ప్రసన్నుడవాలంటే

కంటక శని : (చాంద్రయానాన్ని అనుసరించి జన్మరాశి నుండి ఎనిమిదవ ఇంటిలోనికి శని ప్రవేశించినప్పుడు) లేదా, ఏలినాటి శని: (చాంద్రయనాన్ని అనుసరించి జన్మరాశి నుండి పన్నెండు, మొదటి మరియు రెండవ ఇంటిలోనికి శని యొక్క గమన సమయంలో) ఉన్నా శని ప్రస్సనుడవాలంటే:

అమావాస్య రోజున కాళీ మాత పూజ చేయాలి.విష్ణువును, కృష్ణుని రూపంలో ధ్యాన్నిస్తూ 'ఓం నమో నారాయణాయ', 'హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే..' అని జపించాలి.హనుమంతుడిని సర్వోత్కృష్టమైన (అనంతమైన) రూపంలో ధ్యానించాలి. శని, హనుమంతుని వీపుపై, చేరి అతన్ని పట్టి పీడించాలని ప్రయత్నించినప్పుడు, తన బలంఅంతా ఉపయోగించి, ఒక్క విదిలింపుతో శనిని, విసిరి పారేసినప్పుడు సూర్య భగవానుడు, హనుమంతుడిని మెచ్చుకుని, "న్నిన్ను పూజించిన వారికి శని బాధలుండవు" అని దీవించాడట.శనిత్రయోదశి, శనిజయంతి (పుష్యమాసం, బహుళ అష్టమి) మరియు శనిఅమావస్య రోజులలో తిలాభిషేకం చేయాలి.బ్రాహ్మణునికి నల్ల నువ్వులు దానం చేయాలి.నల్ల గోవు (కపిల గోవు) కు బెల్లం మరియు నువ్వుల మిశ్రమాన్ని తినిపించాలి.శనివారాలలో (శ్రావణ మాసంలో తప్పనిసరిగా) ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉపవాసం ఉందాలి.కాకులకు ఉదయం, మధ్యాహ్న వేళాలలో అన్నం పెట్టాలి.వికలాంగులైన వారికి ఆహారం అందివ్వాలి.నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి.శని క్షేత్రాలు సందర్శించాలి.ప్రతిరోజూ సూర్యాస్తమయం తరువాత ఇంటి ముఖద్వారం వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.దశరథ మహారాజ కృత శని స్తోత్రమును పఠించాలి.శ్రావణ పూర్ణిమ నాడు, జ్యేష్టాదేవికి, శనీశ్వరుడికి కళ్యాణం జరిపించాలి.మూలమంత్రం, పునర్చరణ, హవనం, దానములతో పాటుగా 19000 సార్లు శనిజపం చేయటం మంచిది.శ్రావణమాసలో, శనివారాలలో శనైశ్వరవ్రతం, హోమం చేయటం చాలా మంచిది.శనైశ్వర దీక్ష, శ్రావణ శుద్ధ విదియ నుండి శ్రావణ బహుళ షష్ఠి వరకు పూనాలి.'రామ నామం', హనుమాన్ చాలీసా, దుర్గా స్తుతులను జపించటం.హనుమంతుడు, శ్రీ దుర్గా దేవి, వినాయకులను ప్రార్థించటం ఎంతో మంచిది.పెరుగన్నం, దేవునికి నైవేద్యంగా పెట్టిన ఆతరువాత కాకులకు పెట్టాలి.అనాథ బాలలకు అన్నదానం చేయాలి.

పై వాటిలో ఏది పాటించినా శని ప్రసన్నుడవుతాడు.

శని క్షేత్రాలు

శని శింగణాపూర్

దస్త్రం:పుజవిధి.

శని శింగణాపూర్: అహమద్ నగర్ జిల్లాలో, షిరిడి మరియు ఔరంగాబాద్ మహారాష్ట్ర మధ్యలో శని శింగణాపూర్ అనే శనిక్షేత్రం ఉంది. ఇక్కడ శని "స్వయంభు" (సంస్కృతంలో స్వయముగా ఆవిర్భవించిన అని అర్థం). భూమి నుండి స్వయంగా ఉద్భవించిన నల్లని, గంభీరమైన రాతి విగ్రహం. కచ్చితంగా ఏ కాలానికి చెందినదో ఎవరికీ తెలియనప్పటికీ, స్తలపురాణం ప్రకారం స్వయంభు శనీశ్వరుడు అనాదిగా ఇక్కడ కొలువైయున్నాడు. కనీసం కలియుగం ప్రారంభం నుండి దీని ఉనికి ఉన్నట్టుగా భక్తులు నమ్ముతారు. నోటిమాట ద్వారా తరతరాలకు అందించబడిన ఈ స్వయంభు, గురించి స్తలపురాణం ప్రకారం:

పూర్వం, ఒక గొర్రెల కాపరి పదునైన చువ్వతో ఒక చోట మట్టిని తవ్వుతుండగా అది ఒక రాతికి కొట్టుకుని, ఆ రాయి నుండి రక్తం స్రవించడం ప్రారంభమైంది. దీనితో గొర్రెల కాపరులు దిగ్బ్ర్హాంతి చెంది, భయంతో వూరిలోకి పరుగున వెళ్ళి అందరికి తెలిపాడు. వెంటనే పల్లె మొత్తం ఆ అద్భుతం చూచేందుకు గుమికూడి చర్చించుకున్నారు. కానీ ఎవ్వరికీ ఏమీ పాలుపోలేదు. ఆ రాత్రి, ఆ గొర్రెల కాపరి స్వప్నంలో శనీశ్వర స్వామి ప్రత్యక్షమైనాడు. తాను "శనీశ్వరుడి"నని, అద్వితీయముగా కనిపించుచున్న ఆ నల్లరాయి తన స్వయంభు రూపమని తెలిపినాడు. అంతట, ఆ గొర్రెలకాపరి స్వామిని ప్రార్థించి తాను స్వామికి ఆలయం ఎక్కడ, ఎలా నిర్మించాలో తెలుపమని ప్రార్తించాడట. దీనికి సమాధానముగా శని మహాత్ముడు ఆకాశం మొత్తం తనకు నీడ అని, తనకు ఎటువంటి నీడ అవసరం లేదని, తాను బాహాటముగా ఉండుటకు ఇష్టపడతానని, కాబట్టి ఏ ఆలయనిర్మాణమూ అక్కరలేదని, ప్రతినిత్యం పూజ చేస్తూ శనివారాలలో తప్పకుండా 'తైలాభిషేకం' చేయమని చెప్పాడట. తను స్వయంభుగా వెలసిన ఆపల్లెకు ఇకమీదట బందిపోటుల, దోంగల, దోపిడిదారుల, కన్నము వేసే దొంగల భయం ఎప్పటికీ ఉండజాలదని మాట ఇచ్చి అదృశ్యం అయ్యాడట. ఇక్కడ శనీశ్వర స్వామిని, గుడిలో కాకుండా ఎటువంటి కప్పు లేని ఆరు బయట చూడవచ్చును.ఆంతేకాదు ఈ వూరిలో నేటికీ, (ఈ కలియుగంలో కూడా) ఏ ఇంటికి తలుపు లుండవు! దుకాణాలకు, ఇళ్ళకు, ఆలయాలకు, చివరికి ప్రభుత్వకార్యాలయాలకు కూడా తలుపులు ఉండవు!!!. ఈ వూళ్ళో ఉన్న తపాలా కార్యాలయానికి కూడా తలుపులు, తాళాల లేకపోవడం మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. శనీశ్వరుడి నిభగవానుని యందు భయముచే, శనిభగవానుని ఆలయము వద్ద ఒక కిలోమీటరు వ్యాసార్థం లోపల ఉన్న నివాస స్థలములు, గుడిసెలు, దుకాణములు మొదలైనవాటి వేటికి తలుపులు కాని తాళాలు కాని ఉండవు. శింగణాపూర్ అనబడే ఈ ఊరిలో ఎప్పుడూ కూడా దొంగతనము లేదా దోపిడి జరగలేదు. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయుటకు ప్రయత్నించినా వారు అక్కడికక్కడే ఊరి పొలిమేర దాటేలోగా రక్తం కక్కుకుని చనిపోయారు. ఇతరులు చాలామంది దీర్ఘకాల అనారోగ్యం, మానసిక సమతుల్యత లేకపోవడం వంటి వివిధరకాల శిక్షలు అనుభవించారు.

శనీశ్వరుని కృపకు పాత్రులు కావాలనుకునే వేలమంది భక్తులు ప్రతిరోజూ ఈ శని శింగణాపూర్ లోని శనీశ్వరుడి దర్శనం చేసుకుంటారు. శనివారములలో ఈ స్థలం చాల రద్దీగా ఉంటింది. శని త్రయోదశి స్వామికి ఇష్టమైన రోజుగా పరిగణించబడుతుంది. అదే విధంగా 'అమావాస్య రోజున వచ్చే శనివారం శనీశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా పరిగణింపబడుతుంది. ఆయన దీవెనల కోసం వేలమంది భక్తులు ఈ ఆలయం వద్ద గుమికూడతారు.

దేవనార్

దేవనారు లోని శని దేవాలయం: ముంబైలోని దేవనారు ప్రాంతంలో ఒక శనీశ్వరాలయం ఉంది. ఈ ఆలయం (ముంబై-పూణే-బెంగుళూరు) ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్హైవే మీద గోవండి, దేవనార్-చెంబూరు కూడలి వద్ద శివాజి విగ్రహానికి తూర్పున నెలకొని ఉంది. ఈ ప్రామంతానికి అసలు పేరు "దేవనవరు" అంటే దేవుడు గారు అని అర్థం. కాలాంతరంలో తమిళ బాషా ప్రభావం వల్ల దేవనార్ గా మార్పు చెందింది. ఈ ఆలయంలోకొలువున్న దేవుడు శనీశ్వర స్వామి: అందమైన, శక్తివంతమైన, గుబురు మీసాలతో కొట్టొచ్చినట్టున్న గంభీరమైన ఏడడుగుల నల్లని విగ్రహం రూపం. అనేకమంది శని దోషం గల భక్తులు, లేదా శని మహర్దశ, ఏలినన్నాటి శని దోషం ఉన్నవారు ఈ ఆలయంలో తైలాభిషేకం చేసుంటారు. ముఖ్యంగా శనివారల్లో నువ్వుల నూనెను అత్యంత భక్తిశ్రద్ధలతో శిరస్సునుంచి పాదాలవరకు విగ్రహం నూనెతో కప్పబడే విధంగా తైలాభిషేకం చేస్తారు. ఈ నూనెతో పూజ చేసినట్లయితే శనీశ్వరుడు ప్రసన్నుడు అవుతాడని నమ్మకం. అలాగే జిళ్ళేడు ఆకుల మాలలను ఆంజనేయస్వామికిసమర్పించుకుని, శివునికి జలాభిషేకం చేయడం ఇక్కడి వారి ఆనవాయతి.

ప్రతి శనివారం సుమారు ఉదయం 10:30 గంటల సమయంలో, పూజారి మహా హారతి ఇచ్చిన వెంటనే, పెద్ద పూజారిలో ('స్వామి' అని ప్రియంగా పిలుస్తారు అందరు) ఓ విధమయిన తన్మయత్వంలో వూగిసలాడాడం ప్రారంభం అవుతుంది. అకస్మాత్తుగా, ఆలయంలో వాతావరణం మారుతుంది. పూనకం అంటే మామూలుగా వుండే అరుపులు, ఆర్భాటలు వుండవు. ఆయన కళ్ళు మూసుకుని తన్మయత్వం లోకి (ట్త్రాన్స్) లోకి వెళ్ళిపోతాడు. ఆ ఉత్కంటభరిత భరిత వాతావరణాన్ని అక్కడ వున్న ప్రతి ఒక్కరు చూడవచ్చు. అనుభవించవచ్చు. ఆ అలయంలోని మిగతా వారు మెల్లగా 'స్వామి ని నడిపించుకుంటూ ' 'మొనలు తేలిన, పదునైన, పొడవాటి మేకులతో చేయబడిన కుర్చీపై కూర్చో పెడతారు . కాళ్ళు మరియు చేతులు ఆనించే స్తలంలో కూడా ఆ కుర్చీకి పదునైన మేకులు బిగించి ఉంటాయి.

స్వామి శరీరంపైకి శనీశ్వరుడు వచ్చినపుడు, ఆయన ఎక్కువ సమయం కళ్ళు మూసుకుని దాదాపు ఆరోజు మొత్తం ఆ కుర్చీ పైనే కుర్చుని ఉంటాడు. కొన్ని శనివారాలలో ఆయన 12 నుండి 13 గంటల పాటు ఏకథాటిగా ఆ కుర్చిపైన కూర్చున్నా ఎటువంటి బాధ కాని, అసౌకర్యము గాని ఆయన ముఖంలో కనిపించదు.

అటు తరువాత భక్తులు 'స్వామి' ముందు నిశ్శబ్దముగా కూర్చుంటారు. వారు ఒక జత నిమ్మకాయలు చేతిలో ఉంచుకుని, క్యూలో వారి వంతు వచ్చే వరకు నిరీక్షిస్తూ వుంటారు. స్వామి ఒకరి తరువాత ఒకరిని వంతుల వారిగా తన వద్దకు రమ్మని సైగ చేయుగానే, జనం తమ వద్ద ఉన్న పసుపుపచ్చ నిమ్మకాయల జతను ఆయన ముందు ఉంచుతారు. ఆయన వారి సమస్యలు, వేదనలు లేదా క్షోభ లేదా మరేదైనా సరే వారు చెప్పేది ఓర్పుతో వింటారు. ఆ తరువాత ఆయన వారి వేదన/సమస్య/క్షోభలకు గల కారణాలను విసిదీకరించి వివరిస్తారు.. అది వారి 'ప్రారబ్ధం' కావచ్చు, గతంలో చేసిన కర్మలు (పనులు) ప్రస్తుత జన్మలోనకి మోసుకు రాబడి వుండవచ్చు లేదా స్వామి వివరించినట్టుగా, వారి సమస్యలు ఈ జన్మలోనే అతను (లేదా ఆమె) చేసిన పనులు లేదా కర్మల యొక్క ఫలితం కావచ్చు. కొన్ని సందర్భాలలో అది వారి శత్రువులు లేదా చెడు కోరుకునేవారిచే చేయబడిన వామాచార ప్రయోగం కూడా కారణం కావచ్చు.

ఈ శని దేవాలయ ప్రాంగణములో హనుమంతుడు, జగదీశ్వరుడు, సాయిబాబా, మరియు మాతవిగ్రహాలేకాక నవగ్రహ మండపం కూడా ఉంది. గర్భగుడిలో జేష్టాదేవి సమేతుదైన శనీశ్వరస్వామి యొక్క విగ్రహానికి ఎడమవైపున హనుమంతుడు కుడివైపున జగదీశ్వరస్వామి విరాజిల్లుతున్నారు.

వేదాలలో శని

వేదము ఋక్కులలో శుక్ర బృహస్పతి లున్నారు.అందులోనే శుక్ర-మంధిక్- పదములు గ్రహార్ధకములుగా కనిపించును.తత్తిరీయ సంహిత అందు గ్రహశబ్దమునకు యజ్ఞపాత్ర అని అర్ధము. ఐతిరేయ, శతపధబ్రాహ్మణములందలి గ్రహ శబ్దమునకు సోమరసము గ్రహించు పాత్ర అని అర్ధము.అయితిరేయ బ్రాహ్మణమున సోమపాత్రలు తొమ్మిది, గ్రహములను తొమ్మిది.సోమరసమును గ్రహించును కావున గ్రహ మనగా సోమ-పానపాత్ర.

సూర్యాదులయెడల గ్రహ శబ్దము ప్రసిద్ధము.గ్రహశబ్దమునకు గ్రహణ' మనియు అర్ధము ఉంది. భానోర్ గ్రహే, సకలగ్రహే అని సూర్యసిద్ధాంతము. సూర్యగ్రహణమునకు సూర్యుని గ్రహించుట. రాహువు ఆక్రమితును కావున రాహువు గ్రహము.

అన్ని మన్వంతరములందును అందరు దేవతలను సుర్యనక్షత్రములను ఆశ్రయించుకొని యుందురని పురాణములు చెప్పును. చంద్రసూర్యాదులు గ్రహములు. పుణ్యపురుషులకు నక్షత్రములవలెనే దేవతలకీ సూర్యచంద్రాదులు గృహములు.

చంద్రుడు, సూర్యుడు మొదలగు తేజ పిండములనుద్దేశించి యజ్ఞములందు వేరువేరు పాత్రలకు వాడుక ఉంది. కాలక్రముమున ఆపేరులే తేజ్ఃపిండములకు వాడుక ఆయెను.

గ్రహముల పరస్పర సామీప్యముగాని, గ్రహనక్షత్రముల సామీప్యముగాని కలిగినప్పుడు సంగ్రామము కలుగును. క్రాంతివృత్తమున ఉత్తరార్ధమున దేవగణమును, దక్షిణార్ధమున అసురగణమును ఉండునని ప్రసిద్ధము. ఇవియే గ్రహముల సంధానము.

శని

తొలిసృష్టిలో వేడికి సకలచరాచరముల మలమల మాడిపోవుచున్నప్పుడు బ్రహ్మ సూర్యుని జూచి దేవతలే నీవేడిమి కాగలేకున్నారు; ఇక మానవుల లెక్కయేమి అని అనగా సుర్యునకు కోపము వచ్చెనట అందులకె శని పుట్టెనట అని పరాశరడు చెప్పెను.పురాణములలో చాయా సూర్యుల కుమారుడు శని. ఇతడు నల్లనివాడు.ఇతనికి చాయాసుతుడు, అసితుడు, అసితాంబరుడు అని పేర్లు.

ముంబైలోని శ్రీ శనీశ్వరాలయాలు

 నెరళ్ (నవిముంబై) సెక్టార్-11లో శ్రీ శనీశ్వరాలయం

ముంబైలో శ్రీ శనీశ్వర స్వామికి అనేక ఆలయాలు ఉన్నాయి.

దేవనార్ లో ఒక శనీశ్వరాలయం ఉందిమన్పాడ మార్గంలో దోంబివిలిలో ఒక చక్కని శని దేవాలయం ఉంది. ఇక్కడ ప్రతి శనివారం సాయంత్రం 8 గంటలకు శనికి హారతి ఇచ్చి స్తోత్త్రాలు పటిస్తారు.గాట్కోపర్ (తూర్పు) లో, నాగేశ్వర్ పశర్వంతి జైనమందిరం పక్కన, ఒక శని ఆలయం ఉంది.కళ్యాణ్ (తూర్పు) లోని కటేమనేవ్లిలో శని మందిరం ఉంది.కార్ వద్ద సర్వీసు మార్గంలో ఒక శని మందిరం ఉంది.బోరివలి (తూర్పు) లో గల జాతీయ ఉద్యానవనం దగ్గర శని మందిరం ఉంది.జోగేశ్వరి (తూర్పు) లో ఉండే ఆలయంలో, ప్రతి శనివారం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు శని మహాత్మ్యం కథ చదువుతారు.నెరళ్ (నవిముంబై) సెక్టార్-11లో ఒక శనీశ్వరాలయం ఉంది.బాందూప్ లో శని మందిరం ఉంది.

ఇతర శని క్షేత్రాలు

శ్రీ శనైశ్చర దేవాలయం మంగళూరు (0824- 2252573) శని దోషం చూచిన లేదా శని మహా దశను అనుభవిస్తున్న వారు ప్రతి శనివారం మిక్కిలి భక్తితో ఎళ్ళేణ్ణే సేవె (కన్నడ భాషలో ఎళ్ళు అంటే నువ్వులు; ఎణ్ణె అంటే నూనె; సేవె అంటే సేవ) చేయటానికి ఈ ఆలయానికి విచ్చేస్తుంటారు. ఎళ్ళెణ్ణెసేవె (నువ్వుల నూనెతో సేవ) శనైశ్చరుడిని ప్రసన్నం చేసుకోవడానికి సోపానం అని ఇక్కడి వారి నమ్మకం. శ్రీ శనైశ్చర దేవాలయంలోని గర్భ గుడిలో గణేశ, దుర్గామాత మరియు శనైశ్చర స్వామి మూర్తులు ప్రతిష్ఠించ బడివున్నాయి.

శనిగ్రహం దీర్ఘాయువు, దుర్భాగ్యము, దుఃఖము, వృద్ధాప్యం మరియు చావు, క్రమశిక్షణ, నియమం, బాధ్యత, కాలయాపనలు, గాఢమైన వాంఛ, నాయకత్వము, అధికారం, నిరాడంబరత, చిత్తశుద్ధి, అనుభవముచే వచ్చు జ్ఞానానికి కారకం లేదా సూచిక. శనిగ్రహం వైరాగ్యం, కాదనుట, అనురాగం లేకపోవుట, ఆత్మ స్వరూపత్వం, కష్టించి పనిచేయుట, సంవిధానం, వాస్తవికత మరియు సమయాలను కూడా సూచిస్తుంది. అసమానమైన లక్షణాలు: అపారమైన శక్తి, చెడు దృష్టి నుండి ఉపశమనం ఇవ్వమని కోరుతూ శనివారాలు ఈ శనిదేవుని దర్శనం చేసుకుంటారు..

శ్రీ శనీశ్వర కోవెల తిరునల్లార్: పాండిచ్చేరి సమీపంలో ఉన్న తిరునల్లార్ శనీశ్వరునికి అసమానమైన ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ నవగ్రహాల తొమ్మిది దేవాలయాల సమూహం ఉంది. శివుని అవతారమైన దర్బరన్యేశ్వర స్వామి ఉన్న ఈ కోవెలలో, శనీశ్వరుడు, ఒక గోడ గూటిలో కొలు ఉన్నాడు. ఏల్నాటి శనిదశతో బాధింపబడుతున్న వారు, శనిగ్రహ దుష్ప్రభావం నుండి బయట పడటానికి భక్తులు ఈ గుడిని దర్శించి, ఇక్కడి నలతీర్థంలో స్నానంచేసి, ఆ తడివస్త్రాలతో స్వామి దర్శనం చేసుకున్నట్లయితే, శని ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. నల మహారాజు, తవ్వించిన కొలను ఈ గుడిలో భాగం. నల మహారాజు, ఇక్కడి కొలనులో స్నాం చేసి, గుడిలో పూజ చేసిన తరువాత, శని ప్రభావముచే అతను అనుభవిస్తున్న బాధలనుండి విముక్తి పొందినట్లుగా చెప్పబడింది.

శని ధామ్: శనిధామ్, అని పిలువబడే ఈ ఆలయం చత్తర్ పూర్ కు సమీపమంలో, కుతుబ్ మినార్ నుండి 16 కిలోమీటర్ల దూరాన ఉంది. ఇక్కడ, 21 అడుగుల ఎత్తుగల అష్టధాతు మరియు ప్రకృతి సిద్ధమైన రాతితో చేయబడిన శననీస్వరుడి నిలువెత్తు విగ్రహం ఉంది. శనీస్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు, శనివారాలు ముఖ్యంగా అమావాస్య శనివారం అయితే, కాలసర్పం, సాడేసాతి మరియు దయాళిడికి (శివుడికి) ముఖ్య పూజలు చేస్తారు.

వడ తిరునల్లార్ శనీశ్వర కోవెల: చెన్నైలో, మాంబళంలో ఉంది.ఇక్కడ శనీశ్వరుడు, సతీ (జేష్టాదేవిని ఇక్కడ నీలాంబికగా పిలవ బడుతూంది) సమేతుడై వెలిశాడు. విగ్నేశ్వరుడు, దుర్గ మరియు పంచముఖ హనుమాను ఉన్నారు.

'కుచనూరు: మదురై దగ్గరలో, కుచనూరులో శనీశ్వరుడు, స్వయంభు సిందూరం రంగు విగ్రహం. కుబ్జుడు అన్నది, శనీశ్వరుడి నామల్లో ఒకటి. తమిళబాషానుసారంగా కుబ్జన్ ఉన్న ఊరు కుబ్జనూర్, కాలాంతరంలో కుచ్చానూర్ అయింది. తూర్పు ముఖంగా గురుభగవానుడి ఆలయంతో బాటు క్రొత్తగా నిర్మింపబడిన ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ప్రసాదం ముందుగా కాకులకు సమర్పించి ఆతరువాత భక్తులకు పంచుతారు. ఒకవేళ కాకులు ప్రసాదమున తిరస్కరిస్తే, మళ్ళీ కొత్తగా ప్రసాదం చేసి, శనికి నివేదించి, కాకులకు మళ్ళీసమర్పిస్తారు.

మందపల్లి: తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేటమండలానికి చెందిన గ్రామము. మందపల్లి గ్రామం రాజమండ్రికి 38 కి.మి., కాకినాడకు 60 కి.మి., అమలాపురంకు30 కి.మి., రావులపాలెంకు 9 కి.మి. దూరంలో ఉంది.ఈ గ్రామంలోనే ప్రసిద్ధి పొందిన శనీశ్వరాలయం ఉంది.ఈ దేవాలయం మందేశ్వరాలయంగా కూడా ప్రశస్తి పొందినది.మందపల్లి శనీశ్వర స్వామి ఇతర ఆలయాలకు కాస్తంత భిన్నం. వాస్తవానికి సోమేశ్వర స్వామి ఆలయం అయినా, శనీశ్వరుడు ప్రతిష్ఠించడంతో శనీశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి విముక్తి కోసం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. జాతక చక్రంలో శనితో సమస్యలున్నవారు కూడా వస్తుంటారు. ఏటా శ్రావణ మాసం లోనూ, శనిత్రయోదశి వచ్చే రోజుల్లోనూ మందేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు

మందపల్లి లో శని పూజకు కావలసిన వస్తువులు

పురాణాలలో శనీశ్వరుడు

శని భగవానుడి జీవిత కథ శ్రీ శనిమహాత్మ్యం ॥श्री शनिमहात्म्यं॥ అనే అతి ప్రాచీన గ్రంథంలో తెలుపబడింది. ఈ గ్రంథంలో శని దేవుడిని ప్రార్తించి, మెప్పించి ఆయనకృపను, ఆశీస్సులు పొందుటకు ఎంత కష్టమో,ఎంతటి భక్తి శ్రద్ధలు అవసరమో వివరించబడింది. శ్రీ శని మహాత్మ్యం ఇతర గ్రహాల యొక్క ప్రాముఖ్యత, వాటి బలాబలాలను గూర్చి వివరిస్తూ ప్రారంభమవుతుంది. మొట్ట మొదటగా ఈ విషయాలను విశ్లేషించిన ఘనత ఉజ్జయినిని పరిపాలించిన విక్రమాదిత్యుని ఆస్థాన పండితులకు దక్కుతుంది.

హనుమంతుడు

హనుమంతుడుని పూజించుట వలన శని భగవానుడి యొక్క ఉనికిచే ఏర్పడే 'ప్రతికూల' ప్రభావాల నుండి ఉపశమనాన్ని పొందవచ్చని విశ్వసిస్తారు. రామాయణంలో, హనుమంతుడు రావణుడి బారి నుండి తనను రక్షించినందుకు కృతజ్ఞతగా, ఎవరైతే హనుమంతుని, ముఖ్యంగా శనివారాలలో, పూజ చేసి ప్రార్థిస్తారో, వారు శనిగ్రహం యొక్క "దుష్ప్రభావాల" నుండి విముక్తులగుదురు, లేదా కనీసం వాటి ప్రభావము తగ్గుతుందని శని హనుమంతునికి ప్రమాణం చేశాడు.

శని భగవానుడు మరియు హనుమంతునడి మధ్య జరిగిన ఇంకొక సంఘర్షణను గూర్చిన కథనం ప్రకారం శని ప్రభావము హనుమంతుడిపై మొదలవుతున్న సూచికగా, ఒకసారి శని హనుమంతుడి భుజాలపై ఎక్కాడు. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని భారీగా పెంచి, శనిని, తన భుజాలు, పైకప్పు మధ్య పెట్టి బంధించి, నొక్కడం మొదెలెట్టాడట. నొప్పిని భరించలేక శననీశ్వరుడు, తనను విడిచిపెట్టమని పతరి విధాల వేడుకుంటూ, హనుమంతుడిని ప్రార్థించాడట. తనను విడిచి పెట్టినట్టయితే, ఎవరు హనుమంతుడిని ప్రార్థిస్తారో, వారిపై తన (శని) యొక్క దుష్ప్రభావాలు లేకుండ చేసెదనని శనీశ్వరుడు, హనుమంతుడికి మాట ఇచ్చిన తరువాత శనిని విడిచిపెట్టాడట.

దశరథ మహారాజు

తన రాజ్యములో నెలకొన్న కరువు మరియు పేదరికానికి శని భగవానుడే కారణమని గుర్తించి ఆయనతో ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడ్డ ఏకైక వ్యక్తి దశరథ మహారాజు. దశరథ మహారాజు యొక్క సుగుణాలను మెచ్చుకుంటూ శనీశ్వరుడు "నేను నా బాధ్యతలనుండి తప్పించుకోలేను, కాని నీ ధైర్యానికి ముగ్ధుడనయ్యాను. ఈ విషయంలో నీకు ఋష్యశృంగ మహర్షి సాయం చేయగలడు. ఎక్కడైతే ఋష్యశృంగుడు నివసిస్తాడో ఆ దేశములో కరువుకాటకాలు ఉండవు" అని శని దీవీంచాడట. ఆతరువాత దశరథ మహారాజు, ఋష్యశృంగుని తన అల్లునిగా చేసుకొని తన సమస్యను తెలివిగా పరిష్కరించుకున్నాడు. ఋష్యశృంగుడు ఎల్లప్పుడూ అయోధ్యలో ఉండేవిధంగా, దశరథుడు కుమార్తె 'శాంత'దేవిని ఆయనకు ఇచ్చి వివాహం జరిపించారు. (ఇది తప్పు- ఋష్యశృంగుని తన అల్లునిగా చేసుకున్నది అంగ రాజ్యాధిపతి రోమపాదుడు. ఆరోజులల్లో ఆ దేశములో కరువుకాటకాలు గురయిన రాజ్యం అంగదేశం. కరువుకాటకాల నివారణకు గాను రోమపాదుడు తన కూతురైన శాంతను విభండక మహర్షి కుమారుడయిన ఋష్యశృంగుడికి కిచ్చి వివాహం జరిపిస్తాడు)

జ్యోతిష్యశాస్త్రంలో శని స్తానము

వేదసంబంధమైన జ్యోతిష శాస్త్ర ప్రకారం, శని భగవానుడు నవగ్రహాలు లేదా తొమ్మిది గ్రహాలలో ఒకడు. శని అత్యంత శక్తివంతమైన ప్రతికూల ప్రభావములు కలుగచేయువానిగా, మరియు సహనము, కృషి, ప్రయత్నం, ఓర్పులకు ప్రతీక అయిన దృఢమైన గురువుగా; మరియు ఆంక్షలను, నియమాలను విధించేవాడుగా పరిగణింపబడ్డాడు. ఏమైనప్పటికీ, ఒక వ్యక్తి యొక్క జాతకచక్రంలో శని అనుకూల స్థానంలో ఉన్నచో ఆ వ్యక్తికి శక్తివంతమైన వృత్తి జీవితం, ఆరోగ్యకరమైన జీవితం మరియు అన్ని విషయములు సానుకూలముగా ఉండును. నిజానికి, జ్యోతిష్యశాస్త్రాన్ని నమ్మే ప్రతి హిందూ మతస్థుడు తన జాతకచక్రంలో శని అనుకూల స్థానంలో ఉండాలని కోరుకుంటాడు, ఎందుకనగా మరి ఏ ఇతర 'గ్రహం' అనుకూలమైన స్థానంలో ఉన్నా కుడా శని ఇచ్చే మంచి ఫలితాలను ఇవ్వలేదు. మరోవైపు "ప్రతికూల" స్థానంలో ఉన్న శని, పై విషయములన్నింటిలో సమస్యలు సృష్టించును.

శని ప్రతికూల స్థానములో ఉన్నచో కలిగే "దుష్ఫలితాలు" చాలా తీవ్రముగా ఉండుటచే, జ్యోతిష్యశాస్త్రాన్ని నమ్మే హిందువులు శని అనగా మిక్కిలి భయపడతారు. ఏమైనప్పటికీ, శని ఒక వ్యక్తి అనుభవించే సుఖాలు లేదా కష్టాలకు కారణభూతుడుగా భావించబడుతున్నాడు, శని "ఉనికి"ని అనుసరించి ఆ వ్యక్తి యొక్క కర్మఫలితాలుగా గుర్తించబడినవి. కావున "ప్రతికూల స్థానం"లో ఉన్న శని ఒక వ్యక్తి యొక్క చెడు కర్మలఫలితాలకు కారణభూతుడుకాగా, అనుకూల స్థానంలో ఉన్న శని మంచి కర్మల ఫలితాలు కారణభూతుడు ఔతాడు. ఆరోగ్యపరంగా చూస్తే క్షీణత, బిగుసుకుపోవడం, క్షీణించిన రక్త ప్రసరణ, కృశించిపోవడం, మొదలైన అనారోగ్యాలు, మరియు సరిగా ఆలోచించలేకపోవుట, అసమత్వ బుద్ధి కలిగుండటం వంటి మానసిక సమస్యలు శని భగవానుని ప్రభావముచే కలుగును. ఈ రొగములన్నీ జాతకచక్రంలో శని ఉపస్థిత

Saturday, July 21, 2018

మరణం తర్వాత? ఏం జరుగుతుంది? DR RAMESH POTENT

ప్రతి మానవునికి ఇది ప్రశ్న మాత్రమే ....దీనికి సమాదానంగా.... ఒక పండితుడు పురాణాల ననుసరించి చర్చించిన ఒక Post పంపినారు ఇది చదివి .... మన  మిత్రులకు కూడా తెలుపుదాం

  *భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది*

భూమితో ఇక సంబంధం తెగిపోయింది అనడానికి సూచనగా, మొదట, మరణానికి సుమారు 4-5 గంటల ముందు భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది. అందువలనే మీరు మరణానికి కొద్ది గంటలలో, చేరువలో ఉన్న వ్యక్తిని  యొక్క అరికాలు పాదాలు గమనించారంటే.. అవి చల్లబడుతున్నాయి అని తెలుసుకుంటారు.

సూక్ష వెండి తీగ
*****
అసలు ఏం జరుగుతుందంటే, ఆత్మకి అనుసంధానింపబడి ఉన్న వెండితీగ తెగిపోతుంది. ఎప్పుడైతే ఈ వెండితీగ తెగుతుందో, శరీరంలో అంతవరకు        ఉన్న ఆత్మకి స్వేచ్చ లభించి శరీరం నుండి బయటకి వచ్చేస్తుంది. కానీ ఇంతకాలం ప్రేమించిన శరీరాన్ని వదిలి వెళ్లలేక, మళ్ళీ మళ్ళీ శరీరంలోకి ప్రవేశించి శరీర అంగాలను కదిలించడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ మరణించిన వ్యక్తిని, మరణించిన వెంటనే సూక్షమంగా పరిశీలిస్తే, ముఖంలోనో లేక శరీర ఇతర అవయవలాలలోనో సూక్షమైన కదలికలు గమనించగలగుతారు. అలా ఎందుకు జరుగుతుందంటే, ఆత్మ తన శరీరాన్ని కదలించడానికి ప్రయత్నించడం వల్లనే. మరణించిన కాసేపటికి శరీరం నూతనంగానే ఉంటుంది అయినా కూడా, వెండి తీగ తెగిపోవడం వలన, శరీరంలో దూరగలిగినా అక్కడ ఉండలేక పోవడం వలన, ఆత్మ ఇక శరీరం నుండి బయటకి వచ్చేస్తుంది. ఏదో ఒక శక్తి వలన ఆత్మ, అలా శరీరం నుండి పైకి, ఇంకా పైకి ఆకర్షింపబడుతుంది.

భౌతికశరీరానికి ముగింపు
*********
శరీరంలో ఉన్నప్పటిలాగే ఆత్మా తన ప్రియమైన వాళ్లతో మాట్లాడుతుంది, నేను మరణించలేదు అని చెబుతుంది. కానీ, ఆత్మ మాట్లాడిన మాటలు వారికి వినబడవు. నెమ్మదిగా ఆత్మకి అర్థమవడం మొదలవుతుంది తాను  ఇక తన శరీరంలో జేరలేనని. శరీరానికి సుమారు 12 అడుగుల ఎత్తులో ఆత్మ ఉండి, ఆ గదిలో జరుగుతున్న అన్ని విషయాలు వినడము మరియు చూడడము జరుగుతుంది. సాధారణంగా అంత్యక్రియలు జరిగేంతవరకూ ఆత్మ అలా సుమారు 12 అడుగులు శరీరానికి పైన వుంటుంది. మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి, ఇకపై ఎక్కడైనా అంత్యక్రియలు కార్యక్రమం జరుగుతోంది అంటే, అక్కడ ఆ శరీరానికి సంబంధించిన ఆత్మ ఉండి, అక్కడ జరుగుతున్న అన్ని విషయాలు చూస్తూ, వింటూ ఒక సాక్షిభూతంగా వుందని.

భౌతికదేహంతో విడివడుట
*********
ఇక అంత్యక్రియలు కూడా జరిగాక, తన దేహానికి అంత్యక్రియలు చూసుకున్నాక, ఆత్మకి ఇక భూమిపై తన జీవనం లేదని మరియు పార్థీవ దేహం పంచభూతాలలో కలసిపోయిందని నిర్ణయించుకుంటుంది. అప్పటిదాకా తను దేహంలో ఉండడం వలన ఉన్న బంధాలన్నీ పూర్తిగా విడివడిపోవడం వలన, ఇక ఆత్మకి పూర్తి స్వేచ్చ అనుభవంలోకి వస్తుంది. ఆత్మ తలచుకున్న మాత్రానా ఎక్కడికైనా పోగల శక్తి వస్తుంది. తర్వాతి 7 రోజులు తాను దేహంలో ఉండగా తిరిగిన ప్రదేశాలు, తనకిష్టమైన అన్ని ప్రదేశాలను తిరిగి చూసుకుంటూ ఉంటుంది. 7 రోజులు ముగిసాకా, తన కుటుంబానికి, ప్రియమైన వారికి వీడుకోలు చెప్పుకొని, భూమిని దాటి గగనంలోకి వెళ్ళిపోతుంది.

ఆత్మప్రయాణం
*****
ఆత్మలలోకానికి వెళ్ళ్దడానికి ముందు ఒక పెద్ద మార్గం గుండా ఆత్మ ప్రయాణం చేయవలసివుంటుంది. అందువలన తర్వాతి 12 రోజులు అత్యంత ముఖ్యమైనవి. ఈ 12 రోజులలో మనం జరుపవలసిన కార్యక్రమాలు చక్కగ నెరవేర్చవలసి వుంటుంది. మరియు మనం చేసిన తప్పులను క్షమించమని ఆత్మని అడగడము మరియు ప్రార్ధించడము జరుపవలెను. అంత్యక్రియల తరువాత జరుపబడే కార్యక్రమాలు, ప్రార్థనలు, ఆత్మకి తన ప్రయాణంలో ఒక ఆహారంలాగా సహకరిస్తాయి. ఆత్మలలోకానికి అడుగుపెడుతున్నాను అన్న సూచనగా, మార్గం యొక్క ముగింపులో ఆత్మకి ఒక అతి పెద్ద వెలుగు కనపడుతుంది.

పూర్వీకులను కలసుకొనుట
**********
హిందువులు 11వ మరియు 12వ రోజున జరుపబడే ఇతర కార్యక్రమాలవలన, ఆత్మ తన పూర్వీకులను, ఆప్త మిత్రులను, బంధువులను మరియు తనకు మార్గనిర్దేశనం చేసిన వారిని కలసుకోవడం జరుగుతుంది మనం భౌతికంగా ఎలాగైతే, మన దూరపుబంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు ఆనందంగా కౌగిలించుకుంటామో, అదేవిధంగా ఆత్మలలోకంలో కూడా 12వ రోజున మరణించిన పూర్వీకులు ఆ ఆత్మని అహ్వానించి మనస్పూర్తిగా కౌగిలించుకుంటారు. ఆ తర్వాత ఆత్మ యొక్క మార్గనిర్దేశకులు, ఆత్మని తను భూలోకంలో, భాద్యతవహించిన సంఘటనలను సమీక్షించుకోవడానికి, ఒక పెద్ద వెలుగువంటి బోర్డ్ ఉన్న ప్రదేశానికి తీసుకునివెళ్తారు. దీనినే కార్మిక్ బోర్డ్ అంటారు. ఈ బోర్డ్ లో గత జన్మలో జరిగినదంతా చూపించబడుతుంది.

జీవితాన్ని పరిశీలించుకొనుట
*********
ఇచ్చట అంక్షపెట్టే వారు, నిర్ణయించేవారు ఎవరూ ఉండరు. ఎలాగైతే ఆత్మ భూమిపైన తన జన్మలో ఇతరులని నిర్ణయించిందో అంటే జడ్జ్ చేసిందో అలాగ ఇక్కడ తనని తానే జడ్జ్ చేసుకుంటుంది. భూమిపై ఎవరికైతే కష్టాలను కలిగించిందో అవన్నీ చూసుకొని తాను తప్పుచేసానని ఫీల్ అవుతుంది. *తాను చేసిన తప్పుల నుండి జ్ఞానం పొందటానికి శిక్ష కావాలని కోరుకుంటుంది. ఈ విధమైన తన గత జీవితాన్ని పరిశీలించుకోవడం ద్వారా, రాబోయే తన జీవితానికి ఒక బ్లూప్రింట్ అంటే నఖలు లేదా ఒక ప్లాను వేసుకుంటుంది. ఏలాంటి సంఘటనలని ఎదుర్కొనాలి, ఎలాంటి ఛాలంజ్ లను ఎదుర్కొనాలి, ఎలాంటి కష్టాలను అధిగమించాలి, ఇలాంటి ఎన్నో నిర్ణయాత్మక రచనలతో నఖలు తయారుచేసుకుంటుంది. ఇంకా చెప్పాలంటే, నిమిషాలతో సహా, వయస్సు, వ్యక్తులు, పరిసరాలు, సంభవాలు లేక సంఘటనలు అన్నీ, తాను ఎదుర్కొనవలసినవి రచించుకుంటుంది. 

నఖలు లేదా నమూనా
*******
ఈ విధంగా మన తప్పిదాలకి మనమే బాధపడతాము మరియు శిక్షలు విధించుకుంటాము. ఒక ముఖ్యవిషయం చెప్పాలి అదే ఏమిటంటే, మీరు ఒక తప్పు చేసే దానికి 10 రెట్లు లేదా 20 రెట్లు అధికంగా భాదపడవలసి వస్తుంది అంటారు. అది నిజం కాదు. కానీ ఆత్మా తన గత జన్మ పరిశీలన చేసుకున్నాక ఎంత ఎక్కువగా బాధపడుతుందో అంత ఎక్కువగా శిక్షని విధించుకుంటుంది. ఒకోసారి 5 నెలలు ఒక వ్యక్తి తాను బాధపెట్టి వుంటే 2 సంవత్సరాలు తన రాబోయే జన్మలో బాధపడాలి అని కూడా నిర్ణయంతీసుకుంటుంది. అందువలనే, మీ భావోద్వేగాలని సరిచేసుకుంటూ ఉండాలి అని అంటూ వుంటారు ఎందుకంటే, అవే తర్వాత కూడా మోసుకునిపోబడతాయి కాబట్టి. ఒకసారి ఈ నమూనా పూర్తిగా తయారుచేసుకున్నాక ఒక ప్రశాంతతో కూడిన కాలం ఆత్మకి అప్పుడు ప్రారంభమవుతుంది.

మరుజన్మ
*****
మన మరుజన్మ ఆత్మలలోకంలో తయారు చేసుకున్న నఖలు పై ఆధారపడి ఉంటుంది. జన్మకి మరుజన్మకి మధ్య 20 నుంచి 30 ఏళ్ళు పట్టవచ్చు లేదా ఇంకా ఎక్కువ కాలం కూడా పట్టవచ్చు. మన తల్లిదండ్రులను మనమే నిర్ణయించుకుంటాము ఒకోసారి తల్లిగర్భంలో పిండం  రూపుదిద్దుకుంటున్న సమయంలోనో లేక గర్భం దాల్చిన 4, 5 నెలకో, లేక పుట్టడానికి కొంత సమయం ముందో ఆత్మ ప్రవేశించడం జరుగుతుంది. ఈ సృష్టి ఎంత అద్భుతమైనదంటే పుట్టే తేదీ, సమయము మరియు స్థలమునకు తగినట్ట్లు గ్రహముల అమర్చబడినాయి. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను దురదృష్ట జాతకుడను, నాకు అదృష్టం లేదని కానీ అసలు విషయం ఏమిటంటే, నీ జీవితం మొత్తం కూడా, నువ్వు ఆత్మలలోకంలో తయారుచేసుకున్న నఖలు లేదా బ్లూప్రింట్ మాత్రమే. ఒకసారి మరుజన్మ తీసుకున్నాక, 40 రోజులదాకా బిడ్డ తన గత జన్మకి సంబందించిన జ్ఞాపకాలు అన్నీ కలిగివుంటుంది. అందువలనే ఒకోసారి సంబంధం లేకుండా నవ్వడమూ లేక ఏడ్వడమూ జరుగుతూ ఉంటుంది. 40 రోజుల తర్వాత, గత జన్మకి సంబందించిన అన్ని జ్ఞాపకాలు ఆటోమెటీక్ గా తుడిచివేయబడి, అసలు నాకు గతజన్మ అంటూ ఒకటి ఉందా అన్నంతగా మారిపోతాము.

నఖలు అమలుపరచబడుట
**********
ఇక అప్పటినుండి నఖలు లో లిఖించుకున్నది పూర్తిగా అమలులోకి రావడం ప్రారంభమవుతుంది. ఇక అప్పటి నుండి, మన సంఘటనలు తలచుకుని, ఇతరులను మరియు భగవంతుని దూషించడము ప్రారంభమవుతుంది. అందువలన మీరు ఇంకొకరిని వ్రేలెత్తి చూపే ముందర గుర్తుంచుకోండి, ఇతరులందరూ మీ నఖలు లో మీరు పూర్తిగా మీ స్వంత ఇష్టంతో లిఖించుకున్న ప్రకారమే మీకు సహాయం చేస్తున్నారని. మనము ఏదైతే ముందరే జరగాలని నిర్ణయించుకున్నామో అదే జరుగుతోంది. తలిదండ్రులు, బంధువులు, మిత్రులు, శత్రువులు, భాగస్వామీ అందరూ కూడా మన జీవితంలోకి ఎందుకువస్తున్నారంటే, వారు అలా రావాలని మీరే నిర్ణయించుకున్నారు కాబట్టి.

మరణించిన తర్వాత ఆత్మలు భూమిపైనే తిరుగుతూ ఉండడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి వాటిలో కొన్ని, చేయవలసిన పని మధ్యలో ఆగిపోవడం, అత్యంత దుఃఖం, గాయాల వలన మరణించడం, అనుకోని సమయంలో అంటే ఉన్నపలంగా మరణం సంభవించడము.   ఏది ఏమైనప్పటికి ఆత్మకి 12 రోజుల గడువు మాత్రమే ఉంది, ఈ గడువులోపే తను చేయాలనుకున్నవన్నీ చేయగలగాలి. 12 రోజుల తర్వాత కొంతకాలం ఆగి, ఆత్మల లోకాల ద్వారం కూడా మూసివేయబడుతుంది.
అలా జరిగితే, ఆత్మల పరిస్థితి మరీ దయానీయకమై పోతుంది. ఎందువలన అంటే, అవి ఆత్మలలోకానికీ వెళ్లలేవు, భూలోకంలో శరీరంతో వ్యవహరించడానికి మళ్ళీ జన్మ తీసుకోలేవు.   అందువలననే మన ప్రార్థనలు మరియు మరణించినవారికి జరుపబడే కార్యక్రమాలు అతి ముఖ్యమైనవి. అలా చేయడం వలన, ఆత్మలు తమ ప్రయాణాన్ని ప్రశాంతంగా సాగించి ఆత్మలలోకానికి వెళ్ళి చేరుతాయి. హిందూ సాంప్రదాయంలో ఆ 12 రోజులు దేవాలయానికి వెళ్ళడం నిషిద్దం అని వుంది.   *మనము మరణించిన వారికి కాపాడుటకు వారు తమ గమ్యాన్ని చేరుటకు మన వంతు సహాయం చేయడం కూడా ఎంతో  ప్రాధాన్యమైనదే.*

*మనకి మరణం లేదు, మరణం అనేది అంతం కాదు, అది ఒక విడిది సమయం మాత్రమే మళ్ళీ మనం కలుసుకోవడానికి.*           

DR K HARI HARA NADHA RAJU 

Wednesday, July 18, 2018

దక్షిణాయనము

ఖగోళ శాస్త్ర పరంగా చూస్తే సూర్యుడి గమనంలో కలిగిన మార్పులే ఉత్తరాయణ, దక్షిణాయనాలు. అయనం అంటే ప్రయాణం అని అర్థం. దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయడమనే అర్థం వస్తుంది. సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని మనకు తెలుసు. కానీ మనం సూర్యోదయాన్ని గమనిస్తే, అది సరిగ్గా తూర్పు దిశలో జరుగదు. సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేది సంవత్సరంలో రెండు రోజులు మాత్రమే. మొదటిది సెప్టెంబరు ఇరవై మూడవ తేది. రెండవది మార్చి ఇరవై ఒకటవ తేది. మిగతా రోజులలో ఆరు నెలల కాలం కాస్త ఈశాన్యానికి దగ్గరగానూ, మరో ఆరు నెలల కాలం ఆగ్నేయానికి దగ్గరగానూ సూర్యోదయం జరుగుతుంది. సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని ఉత్తరాయణం అని, ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని దక్షిణాయనం అంటారు. ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు

కాలాన్ని రాత్రింబవళ్ళుగా విభజించే సూర్యచంద్రుల గమనంపై మానవ జీవన విధానం ఆధారపడి ఉంటుంది. అంతేకాక సంవత్సరంలో సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశి లోనికి ప్రతినెల మారుతుంటాడు. ఇలా మారటాన్నే సంక్రమణం అంటారు. ప్రవేశించిన ప్రతిరాశిలోనూ సూర్యుడు ఒక మాసముంటాడు. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించింది మొదలు మకరరాశిలో ప్రవేశించే వరకు గల మధ్యకాలం దక్షిణాయనం

ఆధ్యాత్మికంగా చెప్పుకోవలసి వస్తే ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే, దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం. ఈ కాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. ఇటువంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సహాయం బాగా అవసరం. అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడానికి ఈ కాలంలో అనేక ఉపాసనలు చేస్తారు. అందువల్ల ఇది ఉపాసన కాలం కూడా అయింది. సంవత్సరంలో ఉత్తరాయణానికి ఎంత విశిష్టత ఉందో, దక్షిణాయనికి కూడా అంతే విశిష్టత ఉంది. రెండూ కాలపురుషుని అంతర్భాగాలే

Tuesday, July 17, 2018

తులసి దేవి మంత్రము

తులసి కోటకు నమస్కరించు కునేటప్పుడు ఈ మంత్రం అనుకోవాలి.
 రెండు మంత్రాలో ఏది అయిన జపించవచ్చు.

1. ఓం యన్మూలే సర్వ తీర్థాని
యన్మధ్యే సర్వదేవతాః
యదగ్రే సర్వ వేదాశ్చ
తులసి!త్వాం నమామ్యహమ్

భావం🌷
తులసి దేవీ !నీమొదలు లో పుణ్యతీర్థాలన్నీనివసిస్తూ ఉంటాయి.అందుకే తులసి మొదలు నీరుపోసి నెత్తి మీదజల్లుకొంటారు.
అమ్మా! నీమధ్యభాగం లో దేవతలంతా నివసిస్తూ ఉంటారు.అందుకే ఆదళాలు కలశంలో వేసి ఆనీటిని ప్రసాదంగా ఇస్తూ ఉంటారు.
తులసి! నీ పైభాగంలో నాల్గు వేదాలుఘోషిస్తూ ఉంటాయి.
అందుకే ఉద్ధరిణితో అగ్రభాగం నుండి చేతిలోకి పోసుకొని "అకాలమృత్యు హరణం..."మున్నగు మంత్రాన్ని చదివి నీరు స్వీకరిస్తారు.
అటువంటి ఓతులసీ !నిన్ను నమస్కరిస్తున్నాను .అని ఈశ్లోకానికి అర్థం

 2. ఓం శ్రీం హ్రీం శ్రీం ఐం బృంధాన్యై స్వాహ.

లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ ఎలా వాహనమయ్యింది?

ఒకప్పుడు కౌశికుడు అనే ఒక గొప్ప విష్ణుభక్తుడు ఉండేవాడు. అతడు గొప్ప సంగీత విద్వాంసుడు. సుమధురమైన తన గానమాధుర్యంతో మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు. స్థూలశరీరాన్ని విడిన తరువాత విష్ణులోకాన్ని చేరుకున్నాడు. శ్రీహరి తన ప్రియభక్తుని స్వాగతించి అతని గౌరవార్థం ఆంతరంగిక సంగీతసభ ఒకటి ఏర్పాటుచేసాడు. ఆ సభలో దేవర్షి నారదునికి ప్రవేశం లభించలేదు. తుంబరునికి సకల మర్యాదలతో స్వాగతం చెప్పారు. తనకు ప్రవేశం లేకపోవడం అటుంచి తన ప్రత్యర్థి అయిన తుంబరునకు స్వాగత సత్కారాలు లభించడం చూచిన నారదుడు మండిపడ్డాడు. అయినా, తమాయించుకుని లక్ష్మీదేవి మందిరంలో నుంచి లోనికి పోవడానికి ప్రయత్నించాడు. అక్కడ కూడా ఆ దేవి చెలికత్తెలు అడ్డుపెట్టారు. దానితో నారదుడు ఆ మహాలక్ష్మిని శపించాడు. అదితెలిసిన వెంటనే లక్ష్మీనారాయణులు నారదుని ముందు ప్రత్యక్షమైయ్యారు. తమను మన్నించమని వేడుకున్నారు. అప్పటికి నారదుని కోపం శాంతించింది. తన తొందరపాటుకు పశ్చాత్తాపం మొదలైంది. శరీరమంతా చెమటలు పట్టాయి.

కీలెరిగి వాత పెట్టడం బాగా తెలిసిన నారాయణుడు చేసిన దానికి సిగ్గు పడుతున్న నారదుని చూచి అన్నాడు - 'నారదా! నీ కోపకారణం నాకు తెలియును. నిజానికి భక్తి జ్ఞానములందు, శీల వర్తనములందు తుంబరుడు నీకన్న కపటి కాడు, గర్విష్టి కాడు. కపట భక్తిని ప్రదర్శించు వారెన్ని తీర్థాలు సేవించినప్పటికి వ్యర్థం. భక్తిశ్రద్ధలతో నన్నుకొలుచువారలకు అవశ్యం వశ్యుడనే. సంగీతం చేత ననుజేరవచ్చునని చాటి చెప్పుటకే కౌశిక తుంబరులను నేను సత్కరించాను. నీ శాపానికేమీ బాధ పడటం లేదు. లోకహితమే జరుగుతుంది. చింతించ వద్దు.'

నారదునికి అప్పటికి జ్ఞానోదయమైంది. "ఓ దేవదేవా! నా తప్పులను క్షమించుము. అవివేకివలె ప్రవర్తించాను. నన్ను కాపాడుము. తుంబర కౌశికులవలె సంగీతంలో మేటినైతే ఇంతటి విపరీతం జరిగి ఉండేది కాదు కదా!' అంటూ కట్టెలు తెంచుకుని ప్రవహిస్తున్న కన్నీటి వరద మధ్య నారదుడు నారాయణుని పాదాలమీద పడ్డాడు.

భక్తుని పశ్చాత్తాపం భగవంతుని హృదయాన్ని కరిగించింది. తన దివ్యహస్తాలతో నారదుని పైకి లేపాడు. ధైర్యం చెప్పాడు. సంగీతం నేర్చుకోవాలన్న కుతూహలం నిజంగా ఉంటే తాను చెప్పినట్లు చేయమన్నాడు. ఉత్తరాన మానససరోవరానికి అవతల ఒక పర్వత శిఖరం ఉంది. దాని మీద ఒక దివాంధం ఉంది. ఆ ఉలూకపతికి శుశ్రూష చేసి సంగీతంలో మేటివి కమ్మని దీవించాడు.

శ్రీమన్నారాయణునికి కృతజ్ఞతలు ప్రకటిస్తూ చెతులు జోడించిన నారదుడు సెలవుపుచ్చుకున్నాడు. వెంటనే మనోవేగంతో మానససరోవరం చేరుకున్నాడు. కమ్మని సంగీతం అస్పష్టంగా వినిపిస్తోంది. తెరలు తెరలుగా వస్తున్న ఆ గానమాధుర్యాన్ని పట్టుకుని ఆవలిగిరి శిఖరం చేరాడు. గంధర్వ, కిన్నెర, కింపురుష, అప్సరాసాదులెందరో అక్కడ సంగీతాభ్యాసం చేస్తున్నారు. వారి మధ్య గురుపీఠం మీద దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న 'గానబంధు' నారదుని చూడగానే వినయంతో ఆశనం దిగి ఎదురేగాడు. ఆనందంగా ఆసనం చూపి కుశలప్రశ్నలు వేసాడు. ఏతెంచిన కారణం చెప్పమని ప్రార్థించాడు.

నారదుడు గానబంధు వినయానికి, సంగీత పాటవానికి ఆశ్చర్యపోయాడు. తనకు తెలియని ఈ సంగీత వేత్త ఎవరని ఆలోచనలో పడ్డాడు. అతడెవరైతేనేం! తనకు కావలసింది సంగీతవిద్య. ఉలూకపతికి నమస్కరించి జపతపాదులకు సాధ్యంకాని శ్రీహరిని తుంబుర కౌశికులు గానమాధుర్యంతో వశం చేసికొన్నారని, తనకూ అలాంటీ దివ్యగాన విద్యను ప్రసాదించమని వేడుకున్నాడు. గానబంధు, నారదుని ఆంతర్యం గ్రహించి ముందు తానెవరో వివరింప సాగాడు -

పూర్వం భువనేశుడనే రాజు ఉండేవాడు. అతడు చాలా జాలి గుండెగలవాడు. ధర్మవర్తనుడు. సంప్రదాయానుసారం ధర్మకార్యాలన్నీ క్రమం తప్పకుండా నిర్వహించాడు. అటువంటి ఉత్తమ పాలకుడు సంగీతాన్ని మాత్రం నిషేధించాడు. ఎవరైనా గానాలాపన చేస్తే మరణశిక్ష విధించమని మంత్రులకు చెప్పాడు. భగవంతుని కూడా భక్తిగీతాలతో స్తుతించకూడదని చాటించాడు. ఒకరోజు హరిమిత్రుడు అనే భక్తుడు రాజాజ్ఞను మరచిపోయి భగవంతుని కీర్తిస్తూ గానం చేసాడు. ఆ గానమాధుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడకూడదన్న విషయాన్ని మరచిపోయారు. వెంటనే రాజబటులు వచ్చారు. హరిమిత్రుని రాజు ముందు నిలబెట్టారు. రాజు ఆలోచించాడు. పాడినవాడు బ్రాహ్మణుడు. బ్రహ్మహత్య మహాపాపం. మరణశిక్షతో సమానమైనది రాజ్యబషిష్కరణ. ఇలా ఆలోచించి హరిమిత్రుని సంపదనంతా స్వాధీనం చేసికొని రాజ్యం నుండి వెళ్లగొట్టాడు. కాలచక్రం తిరగడం మానదుకదా! కొంతకాలానికి రాజు మరణించాడు. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు. అలాగే గిట్టినప్రాణి కూడ పుట్టక తప్పదు. నరుడుగా మరణించిన రాజు గుడ్లగూబగా జన్మించాడు. దివాంధజన్మ కాబట్టి రాత్రులందే ఆహారం సంపాదించుకోవాలి. తిండి ఒక సమస్యగా తయారయింది. పురాకృత దోషఫలితం కాబోలు; ఒకసారి నాలుగు రోజులైనా ఆహారం దొరగలేదు. ఆకలి దుర్లభమైపోయింది. చివరికి మరణాన్ని ఆహ్వానించాడు. అతడు పూర్వజన్మలో చేసికొన్న సుకృతం వల్ల మరణ దేవత యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. ప్రాణం తీయకుండా ఎదురుగా నిలబడ్డ యముని చూచి 'ధర్మరాజా! ఎందుకు ఈవిధంగా నన్ను బాధ పెడుతున్నావు? నేను గతజన్మలో రాజుగా ప్రజలపై ఎంతవరకు దయాదక్షిణ్యాలు చూపించాలో అంతవరకు చూపించాను. నీవెందుకు నాపై దయ చూపవు?' అన్నాడు భువనేశుడు.

దివాంధ స్థితికి యమధర్మరాజు జాలి పడ్డాడు. తాను చేసిన తప్పేమిటో తెలియకుండా ఎవరైనా శిక్ష అనుభవించడం ధర్మం కాదు కదా! తెలిసినప్పుడే కదా పశ్చాత్తాపం కలిగేది! అలా ఆలోచించి అసలు విషయం చెప్పాడు.

"దివాంధమా! నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కార్యాలు చేసినమాట నిజమే. కాని పరమాత్ముని వేద మంత్రాలతో మాత్రమే స్తుతించాలని శాసించడం నీ మూర్ఖత్వం. పరమపావనమైన సంగీతంతో హరికీర్తన చేసిన హరిమిత్రుని శిక్షించిన పాపం తక్కువైనదియా! ఆ పాప ఫలితం కొండంతయై నీకు లభించిన పుణ్యఫలానికి మించిపోయింది. అదే నేడు నిన్ను పట్టిపీడిస్తోంది. విష్ణుభక్తులకు చేసిన కీడు నీకీ అవస్థ తెచ్చిపెట్టింది. దీనినుండి బయట పడటం ఎవరికీ సాధ్యం కాదు". సమవర్తి చెప్పింది విన్నాక గాని, దివాంధానికి తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ఏ మార్గంలోనైనా భగవంతుని స్తుతించ వచ్చన్న జ్ఞానం కలిగింది. చేసిన తప్పుకు క్షమించి ఎలాగైనా బయటపడే మార్గం చూపించమని ధర్మదేవత పాదాలమీద పడ్డాడు.

యముని హృదయం కూడా ద్రవించింది. "ఉలూకరాజా! చేసిన తప్పుకు శిక్ష అనుభవింపక తప్పదు. దీనికి మించిన శిక్ష అనుభవించినచో శిక్షాకాలం తగ్గుతుంది. అంగీకరిస్తే ఆ గుహలోని కేగుము. అందులో నీ గత జన్మ దేహముంది. అందుండి రోజుకు కొంత మాంసాన్ని చీల్చుకుని భక్షించు. అది పూర్తి అయిన తదనంతరం నీకు శుభం కలుగుతుంది" అని దీవించి వెళ్ళాడు.

"ఓ మహర్షీ! ఆ దురదృష్టవంతుడను నేనే! ఆ తరువాత నేనొక రోజున నా శవం వద్ద కూర్చొని ఉండగా, దివ్య తేజస్వియైన ఒక బ్రాహ్మణుడు రథంలో పోతూ నా ముందున్న శవమును చూచి రథాన్ని నిలిపాడు. దగ్గరకొచ్చి చూసి, 'ఇది భువనేశుని కాయము వలెనున్నది. ఇందేల పడియున్నది? దీనిని యీ పక్షి భక్షించుటేమి?" అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. అప్పటికి నేను ఆ విప్రుని గుర్తించాను. అతడు నా చేత బహిష్కరింపబడిన హరిమిత్రుడు. వెంటనే అతని పాదములపైబడి ప్రార్థించాను. తప్పుకు క్షమించమని అడిగాను. దుఃఖాశ్రువులు నేల రాలుతుండగా యమధర్మరాజు తెలియజెప్పిన విషయమంతా వివరించాను. హరిమిత్రుడది విని చలించిపోయాడు. తన అంతరంగ భావమునకనుగుణంగా ఇలా పలికాడు. 'నీ బాధలు చూస్తుంటే నాకెంతో విచారం కలిగింది. నీవు నాయెడల చూపిన కాఠిన్యం నేను ఆరోజునే మరచాను. నీవనుభవించిన బాధలిక చాలు. ఈ క్షణం నుండి నీకు బాధ అన్నది లేకుండునుగాక! గొప్ప సంగీత విద్వాంసుడవై లోకంలో ఉత్తమ సంగీత విద్యను బోధింతువు గాక!' అంటూ అతడు నా కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికేగాడు. వాని దీవనలు ఫలించి నేనిట్లున్నాను" అంటూ గానబంధు తన కథనంతా వివరించాడు.

ఆ తరువాత నారదుడు గానబంధు విద్వాంసుని శిష్యుడయ్యాడు. తొలిరోజునే సంగీతం ఎలా నేర్చుకోవాలో అనే విషయం మీద పాఠం చెప్పాడు. సంగీతం ఒక దివ్యకళ అన్నాడు. తపంతో గాని, తామసంతో కాని అది పట్టుబడదన్నాడు. కళ కోసం జీవితాన్ని అర్పించాలి అన్నాడు. కష్టపడి నిరంతరం సాధనచేస్తే ఎవరైనా అపురూపమయిన ఈ కళలో ఆధిక్యం సాధించవచ్చన్నాడు. గౌరవ భావం మొహంలో ఉట్టిపడుతుండగా వినయంగా తలవంచుకొని ఆలకించాడు నారదుడు. ఆ సాధన అలా వేయేళ్లు గడిచాయి. కఠోరమైనదీక్షతో నారదుడు 3,60.006 రాగాలలో మంచి ప్రావీణ్యం గడించాడు. సహపాఠులంతా పొగిడేస్తుంటే సంగీతంలో ఇక తనకు తిరుగులేదనే గర్వంతో ఉబ్బిపోయాడు. అమితానందంతో గురువును జేరి కృతజ్ఞతలు చెల్లించాడు. గురుదక్షిణ చెల్లిస్తాను. ఏమికావాలో సెలవిమ్మన్నాడు. ఎంతటి కోరికైనా సంశయింప వద్దన్నాడు.

శిష్యుని పలుకులు విన్న ఆ గురువు ఎంతగానో సంతోషించాడు. 'ఓ మహర్షీ! దేవర్షులైన మిమ్ము నేనేమి కోరగలను! దివాంధమునకు వలసిన అవసరములేమి ఉంటాయి? శిష్యుడవైనందున ఏదో ఒకటి కోరుకొనక తప్పదు. ఈ ధరాతలం నిలిచి ఉండునంత వరకు సంగీతకళతోపాటు నేను సహితం లోకంలో గుర్తుండేలా వరము ప్రసాదింపుము' అని మనసులోని మాట బయట పెట్టాడు.

నారదుడు విశాలంగా నవ్వాడు. 'గురువర్యా! ఇది మరీ చిన్న కోరిక. ఈ చిరుకోరిక మీకున్న సంగీత పాండిత్యం తీర్చగలదు. శిష్య ప్రశిష్య కోటి వలన భూతలమున సంగీతకళ నిలిచియున్నంత వరకు మీ కీర్తికి చ్యుతి లేదు. మీరు చేసిన ఈ మహోపకారమునకు గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షము, వారి సేవాభాగ్యమును, శాశ్వత సన్నిధానమును ప్రసాధిస్తున్నాను. ప్రళయం సంభవించినవేళ శ్రీ మహావిష్ణువునకు గరుత్మంతునివలె శ్రీమహాలక్ష్మికి నీవు వాహనమై తరియింతువు గాక!' అంటూ శిష్యునిగా కానుకను, దేవర్షిగా వరమును సమర్పించి సెలవు తీసుకొన్నాడు. ఆ విధంగా గానబంధు అనే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనమైంది.
శుభ సాయంత్రం ఫ్రెండ్స్

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...