Friday, November 23, 2018

తులసి చెట్టు గురించి సంపూర్ణ వివరణ - ఔషధ ఉపయోగాలు

*  కృష్ణ తులసి  -
కృష్ణ తులసి వాతమును శమింపచేయును  కాసను , క్రిములను , వాంతిని , భూత వికారాలను పోగొట్టును .

 *  రామ తులసి  -
ఈ రకం తులసి కారంగా, కటువుగా ఉండును. తొందరగా జీర్ణం అగును. శరీరంలో కఫాన్ని , వాతాన్ని, రక్తవికారాన్ని , క్రిములను , విషాన్ని పోగొట్టును . సుగంధముగా ఉండును. ముఖ్యంగా నిమ్మవాసన కలిగి ఉండును . శ్వాసకాస , జ్వరాన్ని పోగొట్టును . పార్శ్వపునొప్పిని పోగొట్టును . ఇది వనముల యందు , అడవుల యందు ఎక్కువుగా పెరుగును . ఆకులు చిన్నవిగా ఉండును.

 *  లక్ష్మి తులసి  -
దీని ఆకులు సుగంధభరితంగా ఉండును. దీనిని కొన్నిచోట్ల పలావులో వాడతారు. ఆకులు ఆకుపచ్చగా ఉండును. ఇది 1.8 మీటర్ల వరకు పెరుగును . దీని జన్మస్థానం ఆఫ్రికా .దీని ఆకులను ఉడికించి ఆమవాతం నందలి నొప్పులకు కట్టు కడతారు. ఆకులను వెన్నతో నూరి గజ్జి మొదలగు చర్మవ్యాధులలో పైన లేపనంగా వాడతారు. దీని ఆకుల కషాయం జ్వరం, దగ్గుల యందు బాగుగా పనిచేయును . కంటి కలకల యందు దీని ఆకు నమిలి 1 - 2 చుక్కల రసం కంటిలో వేసిన కంటి కలక మానును .

 *  అడివి తులసి  -
ఈ రకపు తులసి చెట్టు ఆకులు కొంచం మోటుగా ఉండును. కారం కలిగి ఉండును. కఫ వాత సంబంధ సమస్యలు దూరం చేయును . క్రిమిరోగం , జ్వరం, రక్తదోషాలు , ముఖ్యంగా విషాన్ని హరించును .

*  భూ తులసి  -
ఈ రకపు తులసి కారం , వేడిచేయును  . కఫవాతాలను హరించును . దురద, విషము , క్రిమిదోషం, రక్తస్రావం పోగొట్టును . ఇంటిలోని దోమలను, ఈగలను పారదోలును. రుచిని కలిగించును. ఆకలిని ఎక్కువ చేయును . మొక్క సమూల రసం మోతాదు  20 గ్రాముల వరకు తీసుకోవచ్చు . కషాయం 50 గ్రాముల నుంచి 60 గ్రాముల వరకు తీసుకోవచ్చు .

*  కుక్క తులసి  -
దీనిని పవిత్రంగా చూడకపోయినా దీనికి మామూలు తులసిచెట్టుకు ఉండవలసిన గుణములు అన్నియు ఉన్నవి. ఇది సాధారణంగా అడవులలో మరియు పొలములలో రోడ్లకు ఇరుపక్కలా కనిపించును. దీని ఆకులను తేయాకు బదులుగా ఉపయోగించిన "టీ" వలే ఉండును. జ్వరముల యందు చమట వచ్చి చలువలు వచ్చినపుడు అరిచేతులకు , అరికాళ్లకు రుద్దిన మంచి ఫలితం కనిపించును. ఆకును ముద్దగా నూరి పూసిన ఉష్ణం కలుగును. చర్మవ్యాధులకు పైపూతగా ఉపయోగిస్తారు .

*  మరువక తులసి  -
ఈ తులసి కారపు గుణము కలిగి రక్తదోషము , జంతువిషము, దురద, కుష్ఠము, విషమజ్వరము, చర్మరోగములు , శ్వాసకాస , పైత్యం పెరగటం వలన వచ్చే భ్రమ , తాపము , దాహము , హుద్రోగములు వాటిని పోగొట్టును .

*  రుద్రజడ తులసి -
దీని సర్వాంగములు సుగంధభరితముగా ఉండును. రుచికి చేదుగా కారంగా ఉండును. సెగరోగం,  మూత్రకృచ్చం , ఎక్కిళ్లు రోగం , కండ్ల మంటలు , మూత్రబంధనం అనే సమస్యలను దూరం చేయును . మేహశాంతి , వీర్యవృద్ధి , వీర్యస్తంభన చేయును , కర్ణరోగములు , తలనొప్పి,తేలు కాటు , కడుపులో మంట మొదలగువాటిని పోగొట్టును . స్త్రీల గర్భాశయ రోగాలను హరించి సంతానవంతులను చేయును .

తులసి యందు అనేక రకముల ఉన్నను ముఖ్యముగా విష్ణుతులసి , రామతులసి , తెల్ల తులసి అనే రకం , శ్యామతులసి, కృష్ణతులసి , నల్లతులసి అని రెండొవ రకము ఇవి మాత్రమే పూజార్హకముగా ప్రతి ఇంటి యందు ఉన్నవి .

కృష్ణతులసి యందు ఔషధోప గుణములు అధికంగా ఉండును.కావున ప్రత్యేకముగా చేప్తే తప్ప ఔషధముకు తులసి అని చెప్తే  కృష్ణతులసి వాడటం మంచిది . అడివి తులసి మరింత ఘాటుగా ఉండి మంచి విషహరముగా ఉండును. దీనిని ముఖ్యముగా బొల్లి , విషము , గర్భాశయ రోగాల నివారిణిగా ఉపయోగించెదరు.

భూతులసి కి మరొక పేరు వన తులసి ఈ తులసి అగ్నిదీప్తిని ఇచ్చును. వేడిచేయును మూలవ్యాధులను పోగొట్టును . దీని ఆకుకూర కొంచం వేడిచేయును కాని క్రిమిదోషాలను పోగొట్టును . ఈ తులసి ఆకురసం పూసిన పశువుల పేను గజ్జి నివారణ అగును. దీని సమూలం దంచి రసం తీసిన రసము లేపనం చేసిన కుక్కలగజ్జి మటుమాయం అగును.

కృష్ణతులసి హిద్మ, కాసము, శ్రమ , శ్వాసము, పార్శ్వపుశూల , దుర్గంధం వీనిని హరించును . కృష్ణతులసి రసం పూటకు 20ml నుంచి 30ml వరకు , కషాయం 50ml నుంచి 60ml వరకు చూర్ణం 3 గ్రాముల వరకు ఉపయోగించవచ్చు .

తులసి చెట్ల సాంకేతిక నామములు  -

భూ తులసి -  Ocimum gratissimum or ocimum caryophyllatum
మరువక తులసి - Ocimum basiliicum or sweet basil , common basil
కుక్క తులసి - Hoary bacil , ocimum americanum
లక్ష్మి తులసి - Ocimum viride
రామతులసి - Ocimum gratissimum : shrubby basil
కృష్ణ తులసి - Ocimum sanctum sacred basil , holy basil
కర్పూర తులసి - Ocimum kilimandscharicum camphor basil


గమనిక  -
     
       వెంకటేశ్వరరావు  గారు రాసిన "ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అనేక అమూల్యమయిన వైద్యపరమైన ఆయుర్వేద మూలికల ఉపయోగాలు ఇవ్వడం జరిగింది.
         
        ప్రాచీన ఆయుర్వేదానికి సంభందించిన అనేక రహస్య యోగాలు , మా వంశపారంపర్య అనుభవ యోగాలు , మన చుట్టుపక్కల దొరికే మూలికలు మరియు ఇంట్లో ఉన్నటువంటి వంట దినుసులతోనే పెద్దపెద్ద సమస్యలను నయం చేసుకునేవిధంగా అత్యంత సులభ యోగాలు మొక్కల యొక్క రంగుల చిత్రాలతో పాటు వాటి ఉపయోగాలు , చెట్లను బట్టి భూమిలో నీటిజాడను తెలుసుకొనుట, వృక్షాయుర్వేదం , పశువులకు సంబంధించిన అనేక యోగాలు మొదలైన అమూల్యమయిన విషయాలు ఇవ్వడం జరిగింది.

          ఈ గ్రంథం యొక్క విలువ 350 రూపాయలు కావలసిన వారు ఫొన్ నందు సంప్రదించగలరు. ఫోన్ నంబర్ 9885030034 .
          
కాళహస్తి వెంకటేశ్వరరావు - అనువంశిక ఆయుర్వేదం - 9885030034
ఈ గ్రంథం కావలిసినవారు డైరెక్టుగా పైన తెలిపిన నెంబర్ కి ఫోన్ చేయగలరు.

No comments:

Post a Comment

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...