Monday, November 5, 2018

తిరుమల ఆలయంలో తరుచూ వాడుకలో ఉన్న వ్యవహారాలు


• సవాల్ జవాబు పట్టి = తిరుమల ఆలయం కి సంబంధించిన ప్రశ్న జవాబులు గల పత్రం

• కైంకర్యపట్టి = వంశపారంపర్యంగా సేవలందించ వారి పేర్లు కల చిట్టా

• దిట్టం = జియ్యంగార్లు, ఆచార్యులు,అర్చకులు, ఉద్యోగులు ఎవరు, ఏమి చెయ్యాలో వివరించు పట్టిక

• నక్షత్ర దిట్టం = ఏ ఏ నక్షత్రాలు లో ఏ ఏ సరుకులు, మర్యాదలు చెయ్యాలో వివరించే పట్టిక

• నిత్య కట్ల = నిత్యారాధనం

• వారకట్ల = వారానికి ఒక్కసారే చేసే ఆరాధన

• పక్షకట్ల = పక్షం రోజులకు వచ్చే ఆరాధన

• మాసకట్ల= నెలకు ఒకసారి చేసే ఆరాధన

• సాలకట్ల = సంవత్సరం కు ఒక్కసారి. బ్రహ్మోత్సవాలు మొదలగు

• పేష్కార్ = Asst. Director or Asst.Secretary

• పారుపత్యదార్ = ఆభరణాలు Records చూసే ఉద్యోగి.
ఉదా. డాలర్ శేషాద్రి గారు.

• ఆర్జితం = నగదు చెల్లించి చేయించుకునే శ్రీవారి సేవలు

• దోవ భాష్యకారులు = శ్రీ భగవత్ రామానుజాచార్యులు.
అలిపిరి కాలిబాట లో ఈయన సన్నిధి కలదు.(మోకాలి పర్వతం దగ్గర)

• పోటు= స్వామి వారికి నైవేద్యాలు చేసే వంటశాల

• పడిపోటు = లడ్డు, ఫలహారాలు తయారుచేసే వంటశాల

• ఉగ్రాణం = వంట సామాన్లు ఉంచు గోదాము. Store Room

• పడికావలి = తిరుమల శ్రీవారి ఆలయం మొదటి గోపురం

• సబెరా= దేవుని నిత్య పూజ కు సంబంధించినవస్త్రాలు,సుగంధ ద్రవ్యాలను, వస్తువులు వుంచు గది

• బొక్కసం = ఖజానా. శ్రీవారి విలువైన వస్తువులు, ఆభరణాలు ఉంచు ప్రదేశం

• యమునోతరై = స్వామి వారి సేవకై పూలమాలలు, తులసిదళాలు ఉంచు గది

• సన్నిధి గొల్ల = తిరుమల శ్రీవారిని మొదట దర్శించ అర్హత కలిగిన వ్యక్తి

• కొప్పెర= శ్రీవారి హుండీ

• శఠారి =వైష్ణవఆలయంలో భక్తులకు ఆశీర్వదించ వాడే రాగి పాత్ర.
దీనిపై విష్ణు పాదాలు ఉంటాయ్.

• ఇస్తికఫాల్ = ఆలయ సిబ్బందిచే , ఆలయము ద్వారం మెట్ల వరకు వచ్చి చేయు మర్యాదపూర్వక ఆహ్వానం

• కులశేఖర పడి = శ్రీవారి గర్భ గుడిలో చివరి గడప.

• ఏకాంగి = జియ్యంగార్లు కు Assistant.
కొన్ని శాస్త్రాలు తెలిసివుండాలి. పూజా విధానం తెలిసి ఉండాలి

ఓం నమో వెంకటేశాయ 🙏🏻

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...