Thursday, November 29, 2018

ఈశ్వరుడంటే పరమ దయాళుడు !

ఈశ్వరుడంటే పరమ దయాళుడు, కాలికి అందేగా చుటుకున్న పతంజలి నుండి శిరస్సు పై ఉన్న  తదియనాటి చంద్రరేఖ వరకు అన్ని ఆవిన ఏవరినో ఒకరిని ఉద్ధరించటానికి స్వీకరించినవే తప్ప ఆవినంతట ఆవిన దిగంబరుడు, అన్ని ఆవిన్ని పొందాలి తప్ప ఆవిన ఎవరిని పొందాల్సి పనిలేదు, అందుకే ఒక మహా భక్తుడు అంటాడు శంకర మీకు నేను పంచ కట్టాలి అంటే నన్ను శ్రీమహావిష్ణువు నన్న చెయ్యి లేదా సూర్యుడిగా అన్నా చెయ్యి అని (అంటే సూర్యుడి కిరణాలే సూర్యుడికి బహువులు, సహస్ర బహువులు అని అంటాం కదా), అందుకే వేదం లో కూడా అన్ని ఈశ్వర స్వరూపాలు అని చెప్పి ఒక్క శివుడి దెగ్గరకు వచ్చే సరికి సదా శివోం (శివ + ఓం) అని ఈవినే పరబ్రహ్మము అని నిర్ధారించి చెపుతుంది . సదా విష్ణు, సదా బ్రహ్మ అనదు, అంటే అన్నిటా శుభములు చెయ్యువాడు శివుడొక్కడే, ఇంత స్తోత్రం చేసిన వేదం కూడా త్రిపురాసుర సంహారంలో శంకరుడు ఒక రూపాన్ని తీసుకొని వస్తే గుర్రాలుగా ఆవిన్ని వహించలేక చతికిల బడ్డాయి, అప్పుడు నారాయణుడు ఎద్దుగా వచ్చి రదాన్ని పైకి ఎత్తాడు, అందుకే నారాయుణుడంతటి వారు కూడా ఒకసారి మోహినిగా, ఒకసారి నేత్రాలు అర్పించే పరమ భక్తుడిగా, ఇంకొన్ని సందర్భాల్లో మృదంగం వాయించే వాయిద్యకారుడిగా మరిపోతారు.
అంతటి శంకరులు మళ్లి ఎంత దాయాలువు అంటే కాసిన్ని నీళ్లు జల్లి, ఒక బిల్వం వేస్తే చాలు మురిసిపోతాడు, ఎందుకు? ఆవిన అన్ని ప్రాణులకు తండ్రి, మూల స్థానం, ఎన్ని తప్పులు చేసిన వాడైనా సరే వచ్చి తప్పేపోయింది తండ్రి క్షమించు అని త్రికరణ శుద్దిగా అడిగితే వాడిని చంద్రుడిలా తలమీద పెట్టుకుంటాడు, గజాసురుడిని అనుగ్రహించినట్టు గా వంటికి గజ చర్మం ఉత్తరీయం చుట్టుకుంటాడు, అందకాసురుడి గర్వాన్ని త్రిశూలంతో తీసినట్టు తీసి శివగణాల్లో చేర్చుకుంటాడు, కాదు కాదు శ్రీకాలహస్తిశ్వరం లో ఐతే ఏకంగా కొండమీద తిన్నడు, కొండ క్రింద శంకరుడు, శివుడి ప్రేమ ఇంత అంత అని చెప్పలేము అందుకే నాయనార్ల కథలు వింటే రాక్షసులు కూడా పరమ భక్తులైపోతారు.

తెలిసి కూడా తప్పు చేస్తే... 

ధర్మం కాదు అని తెలుస్తున్నప్పటికీ తాత్కాలిక సుఖం కోసం అధర్మాన్ని ఆచరిస్తున్నారు.
అధర్మం ఆచరిస్తున్న చాలామంది చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు గనుక మనం కూడా ఆచరించవచ్చు అనుకుంటారు. ఇది చాలా తప్పు.

అధర్మాచరణ కష్ట ఫలితం వెంటనే చూపించదు. కొంతకాలం తర్వాత వస్తుంది. అది ఎలాంటిది అంటే ఇవాళ ఆవుకి దాణా, కుడితి పెట్టి వెంటనే పాలు పిండుదాం అంటే రావు. ఆహారం జీర్ణమై క్షీరంగా మారిన తర్వాత పొందుతున్నాం. దానికి కొంత సమయం పడుతుంది.

అధర్మాచరణ ఫలితం వచ్చే లోపే వివేకం మేల్కొని, పశ్చాత్తాప పడి, దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తే ఆ అధర్మ ఫలం రాకుండా ఉండే అవకాశం ఉంటుంది.

 వ్యాధిః విత్తవినాశః దుర్భగత్వముద్వేగతా  తృష్ణాలౌల్యమనిర్వృతిః కుశయనం, కుస్త్రీ కుభోజ్యం వ్రజః ఇత్యేతాని పాపమహీరుహస్య ఫలాని’

 – పాపం అనే చెట్టుకు పళ్ళు వ్యాధి, ధనహాని, దురదృష్టము, ఉద్వేగం(అనవసర కోపాలు), మితిమీరిన ఆశ, చపలత్వము, సుఖం లేకపోవడం, సరియైన నిద్ర లేకపోవడం, సరియైన స్త్రీ దొరకకపోవడం(దొరికిన భార్య దుర్మార్గురాలై బాధించడం), సరియైన భోజనం దొరకకపోవడం. కనుక పాపం చెట్టు నాటుకుంటే ఈ పళ్ళు అనుభవించక తప్పదు.

ఫలితాలు అనుభవ దశకు వచ్చిన తర్వాత సవరించుకునే అవకాశం ఉండదు.
శరీరంలో బలము, ఆరోగ్యము ఉన్నప్పుడే సత్కర్మలు ఆచరించగలరు. దుష్కర్మలు చేయకుండా నిగ్రహించుకోగలరు.
పాప ఫలాల అనుభవం పేరే నరకం.

 ధార్మిక బుద్ధి, చిత్త నిర్మలత – ఈ రెండూ ఉన్నట్లయితే దుష్ఫలితాలు అని చెప్పబడుతున్న వాటి నుండి విడువబడి చక్కని జీవితాన్ని పొందగలడు.
కొందరికి మొదటి దశలోనే కనబడతాయి. వెంటనే గత జన్మలోని పాపాలు అని తెలుసుకొని వాటిని నివృత్తి చేసుకోగలం.

పెద్దలను, సత్కర్మలను ఆశ్రయించి, విశేషంగా మంత్రాదులు, భగవదారాధనలు చేస్తూ వీలైనంత మంచి పనులు చేస్తూ ఉన్న ధనాన్ని సత్కర్మలకి, దానాలకి, యోగ్యులైన వారి క్షేమానికి వినియోగించినట్లయితే పాపక్షయం నెమ్మది నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది.
ఈ విషయాలను ముందు నుంచీ గ్రహించినట్లయితే పాపాచరణకు వెనుకాడతాం, ధర్మాచరణకు వెనుదీయం.

No comments:

Post a Comment

పరమ శివుని స్వరూపం - శ్రీ దక్షిణామూర్తి

విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషుల...